Skip to content
Transcript తెలుగు
భాగంలో తోవల పాకు అని చెప్తున్నారు. పత్రము అంటే దేహం, ఫలము అంటే హృదయం, హృదయం అంటే పుష్పం, ఫలం అంటే మన మనస్సు, తోయం అంటే ఆనంద భాష్పాలు, అవి ఇస్తే చాలు. భక్తి పారమ్యంలో నుంచి ఆనందం గనక కలిగినట్లయితే, పరమేశ్వరుడి యొక్క నామ వైభవ సంకీర్తనం చేసినట్లయితే, భక్తుడికి ఎట్లా ఒక భక్తి పారమ్యంలో, పరవశత్వంలో, తన్మయత్వంలో, దాదాత్మ్యంలో ఒక ఆనందం పుట్టి దాని ద్వారా అశ్రుధారలు కారినట్టయితే అది తోయం అంటే నీరు. నీరు కావాలి. ఎవరికి భగవంతుడికి. కన్నీరు కాదు మనం కన్నీటి పడటమే మనకు అలవాటైంది. మన కన్నీళ్లతో కాళ్లు కడుగుతారని ఆయన పద్యం రాస్తాడు. మన కన్నీళ్లతో ఆయన కాళ్లు కడుగటం అన్యాయం కదా. మన ఆనంద భాష్పాలతో ఆయన కాళ్లు కడగగలగాలి. కాబట్టి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావంతో శ్రీరామచంద్రుడి కథని ఆయన రాశాడు. పెద్ద ఇలాబరేట్ కాకుండా, ఎంత సంక్షిప్తంగా రాశాడంటే, ఆయన ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, పుట్టినప్పుడు ప్రపంచం అంతా ఎట్లా ఉన్నదీ క్షణాన అని వర్ణిస్తూ "అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దిగతుండైనట్లు నారాయణాంశమున పుట్టె మదాంధ రావణ శిరస్సంఘాత సంక్షేధన క్రమణోద్దాముడు రాముడు గరిట కున్ కౌసల్యకున్" అంటాడు. రావణ బ్రహ్మ యొక్క పది తలలు నరికి ధర్మసంస్థాపన చేసి, మత సమన్వయం చేసి, శైవ-వైష్ణవ సంవాదానికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేసి, మళ్ళీ రెండు మతాలు, రెండు మార్గాలు చక్కగా పరిఢవిల్లే దిశగా రావణ సంహారం పూర్తి చేయటానికై వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? "అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దిగుతుండైనట్లు" తూర్పు దిక్కున చంద్రుడు పుట్టినట్టుగా వచ్చాడు ఆయన రామచంద్రుడు అది. "మదాంధ రావణ శిరస్సంఘాత సంక్షేధన క్రమణోద్దాముడు" రాముడు. ఎవరికి? "ఆ గరిట కున్" గరిట అంటే స్త్రీ. "ఆ గరిట కున్ కౌసల్యకున్" కౌసଲ్యానందనుడై జగత్తులోకి శ్రీ మహావిష్ణువు రామచంద్ర ప్రభు నామంతో వచ్చాడు. అటువంటి రాముని నేను తలస్తూ రాముడి యొక్క గుణగణాలని, రాముడి యొక్క శక్తి సామర్థ్యాలని వీటన్నింటినీ కూడా నేను ఇక్కడ అక్షర బద్ధం చేస్తున్నాను అంటాడు పోతనామాత్యుడు. "జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం జానాతి దొర్బల పరాక్రమమీశ చాపో జానాత్యమోఘ పటు బాణ గతి పయోధిః" శంకర భగవత్పాదులు రామతత్వాన్ని, రామమహిమని వర్ణిస్తూ కేవలం నాలుగు పదాలలో రాముడి యొక్క గుణగణాలు చెప్పేశాడు. శక్తిని చెప్పాడు. ఎట్లా అంటుంటే, "జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో" రామా! నీ రామనామ మహిమ తెలియాలి అంటే ఎవడ్నో పిలిచి మాట్లాడమని అడగ ఎవరూ చెప్పలేరది. అది ఎవరికి తెలుసు అంటే ఒక్క మహా మహేశ్వరుడు అయినటువంటి సదాశివుడికి మాత్రమే తెలుసు. మహేశ్వరుడికి తెలుసు. ఎందుకంటే ఆయన నారాయణ మంత్రం చదువుకుంటాడు. శ్రీ మహావిష్ణువేమో పంచాక్షరి చదువుకుంటాడు. అందుకని నారాయణలో ఉన్నటువంటి 'ర', నమశ్శివాయలో ఉన్న 'మ' కలిస్తే 'రామ' అయిందట. "జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో" ఆయన ఒక్కడికే తెలుసు ఆ, నామము యొక్క రుచి. "జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం" శ్రీరామ పాదాల యొక్క ప్రతిభ, దాని శక్తి ఏమిటి అంటే ఎవ్వరూ చెప్పలేరు, ఒక్కరే చెప్పగలరు. ఆమె పేరు గౌతమీ సతి అయినటువంటి అహల్య దేవి. పాదము సోకుతుండగానే, గాలి సోకుతుండగానే శాప విముక్తమై మళ్ళీ అహల్యగా మారింది. కాబట్టి ఆవిడని అడగండి. "జానాతి దొర్బల పరాక్రమమీశ చాపో" శ్రీరామచంద్రుడి యొక్క భుజబలం తెలియాలంటే శివధనుస్సుని అడ-అడగండి, అది చెప్తుంది అంటాడు శంకర భగవత్పాదులు. చూడండి ఎంత అందంగా కథంతా నాలుగు లైన్లలో చెప్పారు ఆయన. అలాగే, "జానాతి దొర్బల పరాక్రమమీశ చాపో జానాత్యమోఘ పటు బాణ గతి పయోధిః" రామ బాణము యొక్క శక్తి తెలియాలంటే మీరు అడగవలసింది వాలినే కాదు, రావణ బ్రహ్మనే కాదు, అడగవలసింది సముద్రన్నే అడగండి. వాడు చెప్తాడు. వారధి కట్టాలి అని వాళ్ళు రాళ్ళు వేస్తుంటే అవన్నీ మునిగిపోతున్నప్పుడు వానరులంతా నిస్సహాయులై శ్రీరామచంద్ర ప్రభువు దగ్గరికి వచ్చి, ఇలా అయితే వారధి కట్టలేము సముద్రుడు అడ్డం వస్తున్నాడు అన్నప్పుడు, శ్రీరామచంద్రుడి బాణం ఎగ్గుపెట్టినప్పుడు, "నీ దర్శనం కోరే నేను ఇదంతా చేశాను. సేతువే గనుక కట్టు వెళ్లినట్లయితే నువ్వు నాకెప్పుడు కనపడతావు? నీ దర్శనం కోరే చేశాను రామా! ఇకపై రాయి ముణగదు" అన్నాడు. అంటే బాణం తీయకుండానే, అంబులపదిలో నుంచి తీయకుండానే, ధనుస్సులో పెట్టకుండానే, బాణ ప్రయోగం చేయకుండానే, బాణ ప్రయోగం తెలిసిన వాడు ఎవరంటే సముద్రుడు. చూశారా, ఇది శ్రీరామచంద్ర ప్రభువు యొక్క, ఆయన కేవలం మానవుడిగా ఉండటానికే ఇష్టపడ్డాడు. ఇన్ని శక్తులు ఉండి కూడా "నన్ను దశరథ రాజకుమారుడిగా నన్ను ఉండనివ్వండి" అన్నాడు. అటువంటి శ్రీరామ చరితాన్ని మన పోతనగారు భాగవతంలో చక్కగా, అందంగా కానీ చాలా క్లుప్తంగాఇంత ఇప్పుడు చెప్పినంత కూడా లేనంత క్లుప్తంగా ఆయన చెప్పారు. అక్కడ రామ లక్ష్మణ వర్ణనలు సీతా వర్ణన ఏమీ ఉండదు. అయితే శంకర భగవత్పాదులు శ్లోకంలో శ్లోకాన్ని దాటిన తర్వాత ఆయన అద్వైతమూర్తి కదా శంకరులు. ఆయన అంటారు "శ్రీరాముని గురించి ఆలోచించినప్పుడల్లా నాకు లలితా దేవి గుర్తొస్తుంది. లలితా దేవిని గురించి నేను సౌందర్యలహరి రాసినప్పుడల్లా నాకు రాముడి దర్శనం అయింది" అని అంటూ "శ్రీరామో లలితాంబికే" అంటారాయన. శ్రీరాముడే లలితా లేక లలితాదేవే రాముడై వచ్చిందా? అని అంటే అభేద అద్వితీయ అద్వయ రమణీయ మనోజ్ఞ భావనా భూమికలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విషయం కూడా జాతిని అద్వైతంలో నిలబెట్టింది. ద్వైతంలో అన్నీ స్పర్ధలుంటాయి. నువ్వు వేరు నేను వేరు, నేను వేరు అతడు వేరు, నేను వేరు ఆమె వేరు. ఇదంతా కూడా comparative lines అంటాం. పోలికలతో మనమంతా విడిపోతూ ఉంటాం. అవన్నీ కాకుండా ఉన్నదంతా ఒక్కటే, ఏకమైన, అద్వితీయమైన అంటే రెండవది లేనటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే అనేక విధాలుగా అనేక రూపాలలో అనేక తత్వాలతో ముఖ్యంగా ఇరవై నాలుగు తత్వాలతో జగత్తంతా నిండి నడుస్తూ ఉంటుంది అని తాత్విక విధానాన్ని బోధిస్తూ శ్రీరామచంద్రుడి గురించి శంకర భగవత్పాదులు వర్ణిస్తారు. అలాగే శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ మనకి ఇక్కడ భాగవతంలో పోతనామాత్యుడు కూడా అంతే నిష్ఠతో అంతే భక్తితో శ్రీ రామ చరితాన్ని రాస్తాడు. [గొంతు సవరించుకుంటున్నారు] అయితే ఇది మరి భాగవతంలో ఉన్నదానికి కథకు పొంతన లేదే! దీన్ని ఎందుకు ఇరికించాడు మధ్యలో? అది ఇంకేదో పుస్తకం రాస్తే పోయేది కదా అంటే కుదరదు. ఎందుకంటే తాను చెప్పబోయే కథ భిన్నమైనటువంటి కథ. తాను రాయబోయేటువంటి శ్రీకృష్ణ గాథ అతి విస్తృతమైనటువంటిది. ఒక పురాణ పురుషోత్తముడు సంపూర్ణమైనటువంటి అవతారంగా రాబోతున్నటువంటి శ్రీకృష్ణ అవతారాన్ని గురించి చెప్పాలి అంటే కృష్ణావతారం కంటే ముందు వచ్చినటువంటి శ్రీరామ అవతారాన్ని సూచనప్రాయంగా రేఖామాత్రంగా దాన్ని స్మరించుకోవలసిన బాధ్యత కవిగా ఆయన మీద ఉన్నది గనుక కవితా భావనని వెల్లడిస్తూ శ్రీ రామ చరితాన్ని చెప్తారు. అంతే కాదు శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు ఏమైంది? ఇందాక పద్యం చెప్పుకున్నాం అమరేంద్రాశకు. రాముడు వస్తున్నాడు, రాముడు జన్మ తీసుకోబోతున్నాడు లేదు శ్రీ మహావిష్ణువు రాముడై రాబోతున్నాడు అన్నప్పుడు ఏం జరిగింది అంటే ఆకాశంలో పౌర్ణమి విపరీత పిండారబోసినట్టుగా వెన్నెల వచ్చింది. అదే సమయంలో ఒక మహాత్ముడి రాకకి పుడమి మీదికి రావటానికి కొన్ని వేలాది మహామునులు వాళ్ళందరూ కూడా తర్పణ ఇచ్చారు. ఆయన తర్పణ ఇచ్చారు, రాబోతున్న స్వామికి అర్ఘ్యం ఇచ్చారు. "ఆపాద్యం సమర్పయామి" అని రోజూ చదువుతుంటారు. పాద్యం వారు సమర్పించుకున్నారు. అప్పటిదాకా ఎండిపోయి ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వికాసమానం చెందినియి. ఆకులు పుట్టినయి, పుష్పాలు మొగ్గలన్నీ పుష్పాలైపోయినయి. అవన్నీ త్వరితగతిన తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిమళభరితం చేస్తూ ఉన్నాయి. అక్కడ వేదపఠనాలు జరుగుతూ ఉన్నాయి. వేదో-- వేదోద్ఘాటన జరుగుతూ ఉన్నది. శంఖనాదాలు వినిపిస్తున్నాయి. మంగళ ధ్వనులు వినిపిస్తున్నాయి. నానానేక నానానాద సందోహాలన్నీ కూడా పుడమిని పులకరింపజేస్తున్నాయి. అది శ్రీరామచంద్రుని కథ. ఆయన రావటం అంటే ఇక్కడికి ధర్మం రావటం అని అర్థం. ధర్మము అంటే వ్యక్తి ధర్మము, సమష్టి ధర్మము, యష్టి ధర్మము, రాజధర్మము, ఆర్థిక ధర్మము అన్నింటినీ మించి ధర్మం జాతిని రక్షించగలిగినటువంటి ఒక ధర్మమే సాకారమై రామచంద్రుడై రాబోతున్నది. కాబట్టి భూమి, ప్రపంచం, మహా సృష్టి అటువంటి అవతారమూర్తి కోసం ఇంతటి ఆనందాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రకృతి అంతా కూడా ఆనందమయం అయిపోయింది. అంతే కాదు శ్రీరామచంద్రుడు ఇక పుట్టబోతున్నాడు లగ్నం సమీపిస్తున్నది అన్న టమ-- సమయంలో గోవుల పొదుగులన్నీ కూడా చేపి సిద్ధంగా పాలు అందించటానికి రెడీగా ఉన్నాయి. అది మళ్ళీ యజ్ఞం చేస్తాడో రాముడు.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 10:36

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

    Now playing
  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22