⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
సింగేరి లో వారు అక్కడికి ఉన్నప్పుడు సాయంకాల ప్రవచనం చేస్తూ ఉన్నారు ఓ ఇరవై ముప్పై మంది శిష్యులు ఉన్- ఉంటారు. ప్రతిరోజూ ప్రవచనం ఉండేది నిత్య ప్రవచనం అందులో ఒకడుండేవాడు అతడికి ఈ శాస్త్రాలు ఏమీ అర్థం అయ్యేవి కాదు ఒక్క శ్లోకం నోటికొచ్చేది కాదు కానీ ఏం చేసాడంటే ఒక సేవ తీసుకున్నాడు శంకర భగవత్పాదులు అలా బయటకు పొద్దున్న వెళ్ళగానే ఆరోజు ఆయన వాడినటువంటి బట్టలు తీసుకుని నదీ తీరానికి వెళ్ళి బట్టలు శుభ్రపరచి ఎండలో ఆరేసి మడతపెట్టి మళ్ళీ గురువుగారు ప్రవచనానికి వెళ్ళిన తర్వాత ఆ కుటీరంలో ఆ స్థానంలో పెట్టి తప్పుకునేవాడు ఇంతే. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్నది ఈ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ అతడు మందుడని అంటే చదువుకోలేని వాడని మనకు వచ్చినన్ని శాస్త్రాలు వాడికి జన్మలో రావని వీళ్ళు నిర్ణయించుకున్నారు చూడండి గురువు ఎప్పుడూ దయామయుడు. ఓ రోజున వచ్చారాయన కుర్చీలో కూర్చుని కుర్చీ కాదు కింద కూర్చున్నారు భగవత్పాదులు అసలు మాట్లాడటం లేదు మౌనం వహించారు అందులో ఈ students లో కూడా కాస్త మాట్లాడే స్రవ ఉన్న ఒక student లేచి నుంచొని "ఆచార్య! మేము చాలా సేపైంది వచ్చి కూర్చొని మీరు వచ్చి చాలా సేపైంది మాకు పాఠ్యం చెప్పండి భాష్యం చెప్పండి మేం ఎదురుచూస్తున్నాము" అని అడిగాడు భగవత్పాదులు "చెప్తాను చెప్పను" అని అనలేదు "ఆనందగిరి ఎక్కడ" అన్నారు ఆనందగిరి ఎవరు ఈ ఆనందగిరి అంటే ఈ చదువు పట్ల అపేక్ష లేనివాడు చదువురాని వాడు మందుడైన వాడు కేవలం గురుసేవ చేసుకునేటువంటి వాడు ఆనందగిరి. ఆనందగిరి ఎక్కడున్నాడు ఇంకా నది దగ్గర ఉన్నాడు "ఆనందగిరి ఎక్కడ" అని ఈయన అడిగిన మరుక్షణం ఆ శబ్దం అక్కడ ఆనందగిరికి వినిపించింది. అయ్యో నా గురువుగారు నా పేరు పెట్టి పిలుస్తున్నారే నేను ఇక్కడ మందమత్తినే ఇక్కడ కూర్చున్నానని ఆ బట్టలు తీసుకుని ఆ కుటీరంలో పెట్టి వచ్చి ఆయన ఎదురుగా నుంచున్నాడు చేతులు కట్టుకొని. ఏదో late అయిందని నన్ను క్షమించమని ఏమంటాల మౌనంగా నుంచున్నారు అప్పుడు శంకర భగవత్పాదులు ఆనందగిరి వైపు చూస్తూ "చదువు" అన్నారు చదువురాని వాడిని "నువ్వు చదువు" అన్నారు అతను ఒక వృత్తంలో అంటే ఒక meter లో ఒక అద్భుతమైన శైలిలో శ్లోకాలు చదవటం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఇప్పటిదాకా మేము మాత్రమే చదువుకున్నాం మాకు మాత్రమే మీరు చదువు చెప్పాలి ఆ చదువురాని వాని గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు అన్న ఈ మిగతా విద్యార్థులందరికీ కనువిప్పు అయిపోయింది ఏమిటి వీడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు వీడికి ఒక్క శ్లోకం రాదే అప్పుడు శంకర భగవత్పాదులు ఒక కరుణాపూర్ణ సుధాబ్ధి అందుకే ఆయన్ని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అంటారు కరుణాలయం ఆనందగిరి నీవు చెప్పినటువంటి ఈ వృత్తానికి తోటక వృత్తము అని పేరు పరమాద్భుతమైనటువంటి రీతిలో గురు సంకీర్తనం చేశావు ఇకపై నీవు ఆనందగిరివి కాదు నీవు తోటకాచార్యుల వలె మాకు ప్రథమ శిష్యులుగా ఉండమని ఆశీర్వచనం ఇచ్చారు. తే మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద దాయకం అంటే ఒక మూగవాడు పలికినా కుంటివాడు కొండ ఎక్కినా పరిగెత్తగలిగినా ఇదంతా గురుకృపా విశేషం చేత కలుగుతుంది. ఈ గురుకృప భగవంతుని దయ ఈ రెండూ ఒక వ్యక్తిలో గనక వాడికి కలిగినట్లయితే వాడికి ప్రపంచంలో ఉంటాడు మనలానే ఉంటాడు మనలానే తింటాడు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు కానీ అతని ఆంతరంగిక అంతస్సు ఇక్కడ ఉండదు. లోక లోకాంతరాలు దాటి తాను ఎక్కడ ఉండాలో ఆ నిత్యానంద ధామంలో రమిస్తూ ఉంటాడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ ఆనందమైనటువంటి ఆ స్థితిని కల్పించుకోవటానికి జీవుడు నిరంతర ప్రయత్నం చేయాలి దానికి జగత్తే ఆధారమవుతున్నది ఎందుకంటే జగత్తు లేకపోతే ఇవేమీ జరగవు ఇవన్నీ ఉన్నాయి కానీ మనం ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటంటే మన దేహం గనక అయినట్లయితే ఎట్లా మన దేహము శాశ్వతం కాదో ఈ జగత్తు కూడా శాశ్వతం కాదు. ఈ వైరాగ్యము ఈ నిర్ణయము మనం నేర్చుకోవాలి. అందుకని [గొంతు సవరించుకుంటున్నారు] విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం ఆ అద్దంలో బొమ్మలాగా నగరం లాగా కనిపిస్తున్నది ఈ ప్రపంచం అంటే కనిపిస్తున్న ఈ ప్రపంచం మాయ. ఆ మాయ ఏర్పడుతున్నది మాయ వలన అది నాది ఇది నాది ఈ building నాది అది కట్టాను ఇది కట్టాను ఇది అమ్మాను ఇది కొన్నాను ఇవన్నీ లోక వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఈ దృశ్యం అదృశ్యమాన నగరీ తుల్యం కానీ ఆ నగరం ఎక్కడ ఉన్నది అంటే నిజాంతర్గతం నీ లోపల ఉన్నది అసలు ప్రపంచం. పశ్యన్ ఆత్మని మాయయా బహిరివో భూతం యధా నిద్రయా ఎట్లా ఉందటంటే అది మనం పడుకున్నాం [గొంతు సవరించుకున్నారు] రాత్రి room కి వెళ్తాం పడుకున్నాం పడుకుంటే ఓ కల వచ్చింది ఆ కల ఓ పెద్ద ఏనుగు ఐరావతం వంటి ఒక ఏనుగు మన గదిలోకి వచ్చింది వచ్చి మన దగ్గర పక్కనే ఇట్లాగే ఓ చిన్న pack table ఉంది చిన్న table ఈ ఏనుగు వచ్చి ఆ pack table మీద కూర్చుంది పక్కనున్న pen ఆ scribbling pad తీసుకుంది ఏదో రాస్తుంది మనం చెబుతున్నవన్నీ రాస్తుంది చెబుతున్నవానికి సమాధానం చెబుతోంది అలా కల సాగిపోతూ ఉన్నది. ఇంతలోకే కల కరిగిపోయింది మెలకువ వచ్చింది మెలకువ రాగానే అక్కడ ఏ-ఏనుగు లేదు [గొంతు సవరించుకున్నారు] రాస్తున్న ఏనుగు లేదు వింటున్న ఏనుగు లేదు అసలు గదిలోకి ఏనుగు ఎలా వస్తుంది అనే స్పృహ కూడా లేకుండా కల అనుభవించేస్తాం.ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద కల ఆ పెద్ద కలలో ఇవన్నీ వీరు నా వారు వారు నా వారు ఈ బంధాలు నావి ఈ స్నేహితులు నారు నేను లేకపోతే వాడుండలేడు వాడు లేకపోతే నేనుండలేను అసలు ఈ ఆస్తులన్నీ నా పిల్లలకే [గొంతు సవరించుకుంటూ] సంపాదించాను నేను ఎలాగు పోతాను నా పిల్లలన్నా సుఖంగా ఉండాలి ఇవన్నీ పాతకాలపు ఆలోచనలు కదా ఆ పాతకాలపు ఆలోచనల వల్ల పుట్టిన వాడికి పుట్టిన వాడి రాబోయే పుట్టబోయే వాడికి ఆస్తులు వనగూర్చడంతోనే మానవుడు అలసిపోతాడు మరి తన గురించి తాను ఆలోచించుకునేది ఎప్పుడు? ఈ ప్రపంచం కరిగిపోయే కలవంటి ఈ ప్రపంచాన్ని ఎట్లా నమ్మేది ఎట్లా ఇది ఉంటుంది అనుకుంటే తెల్లవారేప్పటికి ఇది ఉండటం లేదు ఇది ఉండదు అనుకుంటే వందేళ్లు శిలాశాసనంగా ఉంటూ ఉన్నది. ఈ సముద్రం ఎండిపోతుందా అంటే సముద్రం ఎండటలా ఎందుకు ఎండటలా అంటే నిరంతరము నదులన్నీ కూడా దాంట్లో సంగమిస్తూనే ఉన్నాయి అది నిలకడ చెంది ఉంటున్నది. మరి ఇటువంటి దానికి కూడా ఎప్పుడైనా దాహం వేస్తే సముద్రానికి దాహం వేస్తే ఏం చేయాలి? నదికి దాహం వేస్తుందా అంటే వేస్తే దాంట్లోనే మధుర జలాలు ఉన్నాయి కాస్త నీళ్లు తాగిందనుకుందాం కానీ సముద్రానికే గనక దాహం వేస్తే తీర్చే వాడెవరు? అవి ఉప్పు నీళ్లతో ఉన్నాయి ఇంకా దాహం పెరుగుతుంది. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వము నందున వేరు చోట లేవు అలగుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెల్గుల నిధికిన్ గురు ఉత్తములకున్ జగదక్షునకున్ నమస్కరించెదన్. ఎంత అందమైన భావం చూడండి సత్యము చూడండి. సీతాన్వేషణకు వెళ్ళాలి అనుకున్నటువంటి ఆంజనేయస్వామి అందరూ కూడా నువ్వే వెళ్ళాలి అని నిర్ణయం చేసినప్పుడు మహేంద్రాచలం మీదికి వెళ్ళాడాయన మహేంద్రాచలం మీదికి ఇట్లాగే సాయం సంధ్యా సమయంలో ఆయన లంకా ప్రయాణం ప్రారంభమైంది. మరి ఎవరిని ప్రార్థించాలి? లంక ఎక్కడుంది ఆయనకు తెలీదు దక్షిణం దిక్కుగా ఉందని తెలుసు అంతే. ఆ దక్షిణం దిక్కుగా ఎంత దూరం వెళ్ళాలి అది ఎక్కడ ఉన్నది ఆయనకు తెలియదు. సరే గురువుని ప్రార్థించాడు ఆయన గురువు ఎవరు? సూర్యుడు. మనం ఆంజనేయస్వామి గురువు ఎవరు అనంగానే శ్రీరాముడు అని రాసేస్తాం. కానీ కాదు సూర్యుడు. సూర్యుడి దగ్గరనే ఆయన నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు తూర్పు కొండ మీద ఒక కాలు పడమటి కొండమీద రెండో కాలు పెట్టి నేత్రావధానం చేస్తూ సూర్య గమనంలో సూర్యుడితో మాట్లాడుతూ సూర్యుడి నుంచి direct గా తొమ్మిది వ్యాకరణాలు నేర్చుకున్నటువంటి వాడు హనుమా. కాబట్టి ఆయనకు గురువు ఎవరు అంటే ఆయనే. సూర్యాస్తమయం కాబోతున్నది అప్పుడు అనుకున్నాడు. ఈ వెలుగులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థ భూతమై. The end of education is illumination అన్నారు స్వామి. The end of education is illumination జ్ఞానమే. విద్య నేర్చుకున్నాం అంటే degree ఎలాగూ ఎవడో ఒకడు ఇస్తాడు ఏదో degree ఇస్తాడు PhD ఇస్తాడు how does it matter? కానీ కావలసిన అస్తిత్వాన్ని తన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా నిర్మూలనం చేసుకొని ఒక blank white శుద్ధమైన paper లాగా నేను నేనుగా ఆ గురువు దగ్గరకు వెళ్లగలిగినట్లయితే ఆయన ఏది రాసినా మనకు కనిపిస్తుంది. ఏది రాసినా కనిపిస్తుంది. ఏది రాయాలి? మనకు ఏది కావాలో అది ఆయన రాయాలి. కాబట్టి శిష్యవత్సలుడు అంబుధి శోషణ ద అలగుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్. ఈ వెలుగులు ఈ illumination అంతా ఒక నిధిలా ఒక treasure లా ఉంది. జగదక్షునకున్ జగత్తుని ఒక్క కంటితో చూసేవాడు ఒరి. ఒక కంట కనిపెట్టి అంటాం ఒక కం-- రెండు కంట్లతో కనిపెట్టని ఎక్కడా లేదు. ఒక కంట కనిపెట్టి అంటే జాగ్రత్తగా attentive గా తితీక్షతో జిజ్ఞాసతో శ్రద్ధతో ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం కచ్చితంగా వస్తుంది. ఏదో ఓ program పెట్టారు దాన్లో మనం కూడా ఉన్నాం కాసేపు ఏదో వాళ్ళేదో మంత్రం చదువుతున్నారు వీరేమో ఏదో చెప్తున్నారు అక్కడ ఏదో జరుగుతోంది ఈ ఏడు రోజులు అయిపోయాక మన దారిన మనం పోతాం అంటే వాడు శిష్యుడు ఎలా అవుతాడు? ఇది ఒక అద్భుతమైనటువంటి తపోభూమిగా మనం మార్చుకోవాలి. జగదక్షునకున్ నమస్కరించేదన్ అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అంటాడు. కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రపంచాన్ని మనం చాలా analyze చేయాలి తెలుసుకోవాలి. ప్రపంచం అనేక ఆకర్షణలు మన మీదికి విసురుతుంది అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావచ్చు. ఏదో నిన్ను ఇంతటి వాడిని చేస్తాం అంతటి వాడిని చేస్తాం నువ్వు ధ్యానంలోకి రా నా దగ్గర కొంత డబ్బు కట్టు నేను నిన్ను తీసుకెళ్లి పైన కూర్చోబెడతాను ఇవన్నీ వింటూ ఉన్నాం కదా ఇది మాయ మాయ మోసమే కదా. అందుకనే అవిద్య వలన కలిగేటువంటిదే మోహము. విద్య ఉన్నవాడు ఎటువంటిది? వేదవిద్య, ఆత్మవిద్య, బ్రహ్మవిద్య ఇవన్నీ పర్యాయపదాలు అన్నీ కలిపి ఒకటే. ఆత్మవిద్య ఉన్నటువంటి వాడికి ప్రలోభము ఉండదు. ఆత్మవిద్య ఉన్నటువంటి వాడికి ఏ రకమైనటువంటి తొట్రుపాటు ఉండదు. మానసికమైన ఆందోళన గాని ఆర్ధ-- ఆ ఏ రకమైనటువంటి ఆగ్రహ నిగ్రహాలు గాని అవేమీ ఉండవు నిర్లిప్తంగా ఉంటాడు తటస్థంగా ఉంటాడు హాయిగా ఉంటాడు. ఆ హాయితనంలో నుంచి తనదైనటువంటి ఒక దివ్యత్వాన్ని తాను అనుభవిస్తూ ఆ దివ్యత్వాన్ని ఆధారం చేసుకుని దాన్ని English లో Vitai Lampada అంటారు తెలుగులో దారిదీపం. ఆ దారిదీపాన్ని తనలో ఉన్న వెలుగే తనకు దారిదీపమై జ్ఞాన మార్గం వైపు నడిపిస్తుంది గనుక సత్కర్మల వలన సద్భక్తి వలన సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది కనుకనే మనకి ఆ కర్మయోగము భక్తి యోగము చెప్పారు. ఆ కర్మయోగం కూడా సత్కర్మలు చేయాలి.భగవంతుడితో కూడి చేయాలి భగవత్ శక్తిని ఆధారం చేసుకొని చేయాలి పరమేశ్వరా నేను ఇలా అనుకున్నాను ఇవన్నీ నువ్వే నువ్వే చేయాలి నేను చేస్తున్నాను అని వదిలేస్తాం మనం ఎంతవరకు చేస్తాం అంటే చేద్దాం అని అనుకోవటం వరకు మనం మరి చేయించేది ఎవరు జరిపించేది ఎవరు ఇది ఇట్లా ఇంత చక్కగా ఎలా జరుగుతుంది అంట ఈశ్వర కృప అది సత్కర్మ యోగం అని పెట్టుకోవాలి మనం కేవలం కర్మ యోగం కాదు సద్భక్తి యోగం సత్ భక్తి ఈ భక్తి వలన నేను ఆత్మ విచారణలోకి వెళ్లాలనేటువంటి ఒక భావన మనకు కలిగినట్లయితే అది మనల్ని నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపు తీసుకుని వెళుతుంది దీనికి రెండు మార్గాలున్నాయి శ్రద్ధావన్ లభతే జ్ఞానం శ్రద్ధ గల వాడికి జ్ఞానం వస్తుంది న శ్రేయో నియమం వినా రెండో మాట న శ్రేయో నియమం వినా నియమం అంటే self imposed conduct and character ప్రతి జీవి తాను ఏ పని చేయాలనుకున్నా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు ఆ నిర్ణయాల ప్రకారమే ఆ సిద్ధాంతం ప్రకారమే జీవితాన్ని గడుపుతాడు ఆ జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆ సిద్ధాంతాలు అతనికి అక్కరకు వస్తాయి అది లేదనుకోండి శ్రేయస్సు లభించదు ఏం లభిస్తుంది ప్రేయస్సు లభిస్తుంది శ్రేయస్సుకి opposite ప్రేయస్సు నువ్వు ఎప్పుడైతే శ్రేయోభూతమైనటువంటి ఆలోచనలతో నీకు ఉన్నటువంటి పరిమితమైన శక్తితో అపరిమితమైన భగవద్ భక్తితో ప్రపంచంలో కూడి ఉండేటువంటి యుక్తితో ఆనంద అనురక్తితో ముక్తి వైపు నువ్వు నడవాలి అనేటువంటిది వేదం మనకు చెప్తున్న క్రమపాఠం ఇంతే అంటే ఒక క్రమ పరిణామం జరగాలి అన్నీ ఒక్కరోజులో ఒక్క క్షణంలో కావు దీనికి చాలా ప్రయత్నం చేయాలి న శ్రేయో నియమం వినా మనం ఒక dairy జనవరి రాగానే మనకు ఒక యాభై dairies వచ్చేస్తాయి అందరూ తలవట్టు పంపిస్తారు మనం వాడేది ఒక్క dairy కదా ఆ dairy లో మొట్ట మొదటి page లో రాసేస్తాం అది రాగానే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఆ సంవత్సరం ఏం చేయబోతున్నాడో ఏదన్నా దురలవాట్లు ఉంటే అవన్నీ నేను వదిలిపెట్టబోతున్నాను ఈ సంవత్సర కాలంలో నన్ను నేను పవిత్రీకరించబోతున్నాను అని రాసుకొని సంతకం కూడా పెడతాడు అది జనవరి first పొద్దున తొమ్మిది గంటలకి చేస్తాడు ఆ పని. మరనాడు తన పనిలో తాను పడిపోతాడు తర్వాత ఇల్లాలు దాన్ని చాకలి పొద్దుకు వాడుతుంది ఆ dairy అంతే జరిగేది అంటే మనం దేన్నీ కూడా serious గా చెయ్యం దేన్నీ కూడా ఒక గంభీరమైనటువంటి మనం రాసుకున్న మాటే మనం ఇచ్చిన మాటే మనం చెప్పిన మాటే మనం నిర్ణయించుకున్న మాటే మన సంకల్పంలో నుంచి వచ్చిన మాటే మనమే నిలబెట్టుకోలేకపోతే మనం ఇంకొకడికి ఏం చేయగలుగుతాం ఇది నియమం అంటే ఇది నాకిది నియమం అండి అంటాం నేను కింద కూర్చుని భోంచేస్తాను అది నా నియమం అన్నాడనుకోండి తప్పు పెట్టొద్దు ఆయనకు అది అలవాటు కాబోలు నేను ఎలాగైనా ఉంటాను నాకేమి ఇబ్బంది లేదు అది నియమం గౌరవించాలి మరి నియమం లేకపోతే ఈ ప్రవృత్తులన్నీ కూడా ఈ ప్రపంచంలో ఎలా ఉంటాయి భగవంతుడికో నియమం ఉంది మనకు ఎలా ఉందో ఆయనకు కూడా ఉంది మనకి నియమాలున్నాయి మనకు ఏదో పండగ వస్తే కొత్త పట్టుకో-- బట్ట కట్టుకోవాలి ఏదో మంచి కార్యక్రమం ఉంటే పది మందికి అన్నం పెట్టాలి పది మందిని చేరదీయాలి పది మందిని చదివించాలి పది మందికి విద్యాబుద్ధులు చెప్పాలి చెప్పగలిగిన విద్య నేర్పగలగాలి ఇవన్నీ నియమాలు పెట్టుకుంటాం ఈ నియమాల వలన మనకు తెలియకుండా మనకు అద్భుతమైన character మనం కానీ మరొక వ్యక్తి మనలో నిర్మాణం జరిగిపోతుంది ఆ నిర్మాణంలో నుంచి వినూత్నమైనటువంటి ఒక ఆ బ్రహ్మ తేజస్సుగా ఒక వ్యక్తి బయటికి వస్తాడు అతడు నిజమైనటువంటి వ్యక్తి ఏదో పుట్టాం గనుక పెరిగాం గనుక అని కాకుండా ఇటువంటి ఒక తార్కికమైన భావన భక్తి భావన శ్రేయోభావన శ్రేయస్సు కోరాలి అందరి శ్రేయస్సు కోరేవాడే ఉత్తమ మానవుడు అందరికీ అన్నీ ఇచ్చేవాడు కాదు శ్రేయస్సు కోరాలి అందుకనే స్వామి ఏక వాక్యంలో మనందరికీ ఒక ప్రార్థన మంత్రం ఇచ్చేశారు సమస్త లోకా: సుఖినో భవంతు అంతే అందరూ బాగా ఉండాలి అందరితో నేను కూడా బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి నా ఆనందం అందరికీ చెందాలి ఎంత గొప్ప భావం ఉంది దీనికి ఎటువంటి గురువు మనకు మార్గదర్శనం చేస్తాడు ఆ గురువు లక్షణాలు ఏమిటి ప్రచక్ష కళ్యాణ భువే సునామ్నే ప్రత్యర్థ పియూష దుహే స్వధామ్నే ప్రత్యక్షర స్వాదుర సైకసీమ్నే భూమ్నే నమస్తే నిగమాగ్రధామ్నే భూమ్నే నమస్తే నిగమాగ్రధామ్నే ప్రత్యక్ష కళ్యాణ భువే ఈ ప్రత్యక్షమైనటువంటి ఈ లోకంలో దీనిని కళ్యాణమంతం చేసేట్టుగా నా గురువుండు గాక ఉంటాడు నా గురువు ప్రతి వాడి జీవితాన్ని నిత్య కళ్యాణము పచ్చతోరణము చేసే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉంటాడు ఆయన భావాలన్నీ కూడా ఈ ప్రపంచం అంతా హాయిగా ఉండాలని కోరుకుంటాడు కళ్యాణమంతంగా ఉండాలి కళ్యాణము అంటే అనుబంధము అని అర్థం కళ్యాణము అంటే రెండు జీవులు కలిసేటువంటి ఒక సంగమ స్థితి అది పరస్పరము సంఘము సంగము రెండు ఏర్పడాలి ఈ సంఘ సంగమ స్థితిలో అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావనకి ఉంటే ఆయన ఎలా ఉంటాడు ఒక గొప్ప గురువు అంటే ఎలా ఉండాలి అంటే సునామ్నే మంచి పేరు కలిగి ఉంటాడు మంచి పేరు అంటే popular person అని కాదు ఒక అందమైన పేరు శ్రీరామ ఒక అందమైన పేరు శ్రీకృష్ణ అందమైన పేరు సాయిరామ్ అందమైన పేరు అది ఎందుకు సునామ్నే మంచి పేరు ఎందుకైంది అంటే పేర్లన్నీ మంచివి కాదా అని కాదు ఈ పేర్లతో ప్రఖ్యాతమైనటువంటి వారందరూ కూడా జనకల్యాణం కోసం వాళ్ళు శ్రమించారు.జనులను జాగృతం చేశారు నిద్రపోతున్న వారిని వాళ్ళు మేల్కొల్పారు నువ్వు చేయవలసిన పని ఇది ఉత్తిష్ఠ జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత అని ఎట్లాగైతే ఉపనిషత్తు చెప్పిందో దాన్ని మనం ఇవ్వాల వివేకానందుడు చెప్పాడని మనం అంటున్నాం ఏం చేస్తాం వివేకానంద వాణి అంటూ లేదు ఉపనిషద్ వాణి వివేకానంద వాణి ఆయన ఉపనిషత్తులని ఆధారం చేసుకొని పరమాద్భుతంగా చెప్తే దాన్ని వివేకానంద వాణిగా మనం మార్చుకున్నాం సరే ఏం మార్చుకున్నా ఆయన చెప్పింది అది ఎప్పుడూ జాగ్రత్త జాగ్రత్త అవస్థలో అటెంటువుగా ఉండు నీ లక్ష్య గమ్యాలు చేరే వరకు నువ్వు పరిగెత్తుతూ ప్రయత్నిస్తూనే ఉండు అటువంటి ఆ నామం కలిగినటువంటి ఒక వివేకానందుడు వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ దత్త కదా ఈ నరేంద్రనాథ దత్త ఏథిస్ట్ ఆయన దేవుడి మీద పెద్ద నమ్మకం ఉన్నవాడు కాదు ఎందరినో కలిసాడు కలిసి ఆయన ఏమన్నాడంటే మీరందరూ రోజు దేవుడి గురించి చెబుతున్నారు కదా దేవుడి గురించి పాటలు రాస్తున్నారు నాట్యం చేస్తున్నారు మాట్లాడుతున్నారు దేవుడు దేవుడు దేవుడు అని చెప్తున్నారే మీలో ఏ ఒక్కడైనా దేవుణ్ణి చూశారా అని అడిగాడు ఎవరు దానికి జవాబు ఇవ్వలేకపోయినారు ఇదే ప్రశ్నని రామకృష్ణ పరమహంస ని కలిసినప్పుడు నరేంద్రనాథ దత్త అడిగినటువంటి ప్రశ్న ఇదే నాకు మిగతావి ఏవి అక్కర్లేదు మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాడు నిన్ను చూసినంత స్పష్టంగా దేవుణ్ణి నేను చూశాను అన్నారు ఆయన ఇచ్చిన జవాబు అది ఓ అయితే ఆ దేవుణ్ణి నాకు చూపించగలరా అని అడిగాడు నేను ఎలా చూశానో నీకు అట్లాగే చూపిస్తా కూర్చో అన్నారు కూర్చొని ఏకాగ్రంగా చూశారు ఆ మిగతా కథలన్నీ నమ్మకం లేదు శక్తి ప్రాతం చేశారవని చాలా క్షుద్రం అవి చాలా అల్పమైనవి ఆయన గురువు అనుగ్రహాన్ని ఇచ్చారు ఇవ్వగానే ఈ నరేంద్రనాథ దత్త కి ఒక తెలియని ఆనందం కలిగింది తాను దేనిని దర్శించాలని అనుకుంటున్నాడో అక్కడ రాముడో కృష్ణుడు కాళీమాత కనపడలా దేవుడు కనిపించాడు లేదు దైవం కనిపించింది ఆ దైవం ఎలా ఉన్నదంటే ఒక సంపూర్ణమైనటువంటి కాంతిగా ఏర్పడింది అంటే నామ రూప భావ తత్వాతీతమై మూలమై ఉన్నటువంటి ఆ వెలుగు మూలమై ఉన్నది ఆ వెలుగు మూలమైనటువంటి అఖండ జ్యోతిని ఆయన దర్శనం చేశాడు గురువు యొక్క అనుగ్రహంతో ఆనందాన్ని పొందాడు ఆనందంలో ఊగిపోతున్నాడు ఆయన ఆ సమయంలో కొద్దిగా ఒక ఆల్టిట్యూడ్ అంటాం అది దిగి వచ్చి గురుదేవా నాకు ఈ ప్రపంచం వద్దు నన్ను ఇక్కడే ఉంచకూడదా ఇంత ఆనందాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు బ్రహ్మానందాన్ని గురించి చదివాను పరమానందాన్ని గురించి చదివాను అది ఏమిటో ఇప్పుడు మీ దయవల్ల నేను పొందగలిగాను నన్ను ఇక్కడే ఉంచండి అన్నాడు గురువు చూడండి వెంటనే రామకృష్ణ పరమహంస నరేన్ నీకు ఇలా అడగాలి ఇలా బిచ్చం ఎత్తుకోవాలి అంటే సిగ్గు అనిపించటం లేదా ఇంత బ్రహ్మానంద స్థితిని నీవు పొందింది నీకోసమా లే జగత్తులోకి వెళ్లి పరమాత్మ అంటే ఏమిటో నామ రూప భావాతీతమైన శక్తి అంటే ఏమిటో నువ్వు వెళ్లి ఈ లోకంలోకి వెళ్లి చెప్పు ఈ క్షణం నుంచి నీ పని అది అని చెప్పారు అప్పుడు వివేకం కలిగింది నరేంద్రనాథ దత్త కి వివేకం కలిగింది ఆ వివేకంలో నుంచి ఒక ఆనందం కలిగింది ఆ ఆనందము వివేకము ఆనందము కలిసిన కారణంగా ఆయన స్వామి అయినాడు స్వామి అంటే యజమాని కాదు స్వామి అంటే మనపై అధికారి కాదు స్వామి అంటే మనల్ని మించిన వాడో మరొకడో కాదు స్వామి అంటే జ్ఞాని అని అర్థం కాబట్టి వివేక ఆనంద స్వామి అయినాడు కేవలం గురుకృపా విశేషం చేత ఇవాళ నరేంద్రనాథ దత్త అనే ఫోటో ఎవరైనా వేస్తారా వివేకానందుడి ఫోటో ఉంటుంది వివేకానంద స్వామి పేరు మీద అనేక కార్యక్రమాలు జరుగుతాయి అది సునామ్ని ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే గురువు ఇచ్చిన పేరు గురువు సంకల్పించినటువంటి పేరు అలాగే మనందరం కూడా ఆ సునామ్ని గా ఉండాలి మనకు పేరు రాముడి పేరు పెట్టారు రాముడి లా అన్నా కనీసం ఉండాలి కృష్ణ పరమాత్మ పేరు పెట్టారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా ఎంత లౌక్యంగా కర్మ యోగాన్ని ఎంత భక్తి యోగాన్ని చివరగా కడగా ఎంత జ్ఞాన యోగాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడో మనం కూడా ఆ పాయలో జీవితాన్ని గడపాలి ప్రత్యక్ష కళ్యాణ భువే సునామ్ని ప్రత్యర్థ పీయూష దుహే స్వధామ్ని నిరంతరము ఒక బ్రహ్మాందాన్ని పొందుతూ ఉంటాడట ఆయన దగ్గర ఏమి ఉండవు బిల్డింగులు ఉండవ్ కార్లు ఉండవ్ డబ్బులు ఉండవ్ పరివారం ఉండదు పరిచారకులు ఉండరు ఆ కానీ మహానందాన్ని పొందుతూ ఉంటాడు మహానందాన్ని పొందటం కాదు తాగుతూ ఉంటాడు దుహే అంటే తాగటం ఆ తాగుతూ ఉంటాడు ఎక్కడి నుంచి తాగుతాడు అంటే స్వధామ్ని తనదైనటువంటి హృదాకాశం నుంచి ఆ హృత్పిండంలో నుంచి తనలో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తులలో నుంచి నిరంతరమైనటువంటి ఆనందాన్ని తాగుతూ ఉంటాడు ప్రత్యర్థ పీయూష దుహే స్వధామ్ని ప్రత్యక్షర స్వాదురసైకసీమ్ని ప్రతి అక్షరం వెనుక ప్రతి పలుకు వెనుక ప్రతి తలపు వెనుక ప్రతి భావన వెనుక ఏముంటుందంటే స్వాదురసైకసీమ్ని స్వాదువుగా ఉంటుంది సరళంగా ఉంటాడు హాయిగా ఉంటాడు ఏమి అక్కర్లేనట్టు ఉంటాడు ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి గనుక ఇది కావాలి అనే కోరికే పుట్టదు ఎందుకంటే ఆశ లేదు గనుక ఇది ఇంకా ఉ-ఉంటే బాగుండును అని అనుకోడు ఎందుకంటే దురాశ లేదు గనుక ప్రత్యక్షర స్వాదురసైకసీమ్ని భూమ్ని అది ఈ భూమ్ని చాలా కీలకమైనటువంటి పదం భూమ్న అనేటువంటి శబ్దం ఏమిటంటే గురువు ఎలా ఉండాలంటే స్వామి ఎలా ఉండాలంటేఅందవలసిన వాడు, అందుకోవలసిన వాడు, ఎప్పటికైనా అందితే మన దగ్గర నిలకడ చెందగలిగిన వాడు, చెందిన వాడు ఎప్పటికైనా అందుకొని తీరవలసిన వాడు ఎవరంటే ఆతడు భూమ్నా. భూమ్నా శబ్దానికి అదే అర్థం. [పాట] భూమ్నీ నమస్తే. నమస్తే అంటే నమస్కారం కాదు. నమస్తే! నాదంటూ ఏం లేదు. చూశారా శరణాగతి. [పాట] నమః అస్తే. నీకు నమస్కరిస్తున్నాను అది నాకు జయమగు గాక అని రెండో అర్థం. సంస్కృతంలో ఇలా పదవిభజనలో అనం-- అర్థాలు చక్కగా మారిపోతాయి. ఇంతటి ఈ గురువు ఎక్కడ ఉన్నాడు? లోకంలో కనిపిస్తూ మంచి పేరు తెచ్చుకొని ఆ పేరే ఆ నామమే మనకు జపమైపోతే తర్వాత ప్రతి సారి ఒక ఆనందాన్ని ప్రతి క్షణము ఆనందామృతాన్ని తాగుతూ ఉంటే, ప్రతి అక్షరంలోనూ ఒక అద్భుతమైనటువంటి స్వాదురసాన్ని, అవధులు లేని స్వాదురసాన్ని అనుభవిస్తుంటే, భూమ్నా స్థితిలో ఉంటే అటువంటి ఈన-- నేను నమస్కరిస్తుంటే ఈ గురువు ఇంకా ఎక్కడ ఉన్నాడు? [పాట] నిగమాగ్రధామ్మీ. వేదాల చిట్టచివర ఉన్నాడాయన. చిట్టచివర ఉన్నాడు అంటే నలభై మూడవ అంతస్తులో మన friend ఎవడో ఉన్నాడు. మనల్ని వాడు పిలిచాడు, భోజనానికి పిలిచాడు. నలభై మూడవ అంతస్తుకు వెళితేనే వాడు కనపడతాడు. అంతేగా? నలభై మూడవ అంతస్తుకు వెళ్లాలంటే ఒక car ఏసుకువెళ్ళాలి. నలభై మూడు అంతస్తుల building కి ఆటోలో, రిక్షాలో వెళ్తే వాళ్ళు లోపలికి రానివ్వడు. తగిన car ఏసుకుని వెళ్ళాలి. తగిన lift ఉండాలి. ఇవి ఉంటే అక్కడికి వెళితే వాడు తలుపు తీస్తే అప్పుడు లోపలికి వెళ్తాం. భగవంతుడు కూడా, ఏదో రెండు వ్రతాలు చేసేస్తే భగవంతుడు కనపడడు. భగవంతుణ్ణి నిరంతరము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దీనికి నిత్య ప్రార్థన అని పేరు. ఈ నిత్య ప్రార్థన మనం రోజూ గనక చేసుకున్నట్లయితే, అదృష్టం బాగుంటే, ఆయన అనుగ్రహిస్తే, ఇందాక చెప్పిన చిటారు కొమ్మన మిఠాయి పట్ల పొద్దున్న అనుకున్నాం కదా. ఎక్కలేని వాడు, ఎగబాకలేని వాడు, పొందే అవకాశం లేనివాడు, పొందగలనా అనే నిస్సత్తువ కలిగిన వాడికి గాలి రూపంలో ఆ కొమ్మని ఇలా వంచుతాడు కిందకి. మన చేతికి ఆ మిఠాయి దొరుకుతుంది మళ్ళీ కొమ్మ గాలిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిందా లేదా? ఎన్ని సందర్భాలలో మనం అటువంటి అనుభవాలు పొందాం. ఇది మనకు లభిస్తుందా? ఇంత అర్హత మనకున్నదా? అనుకునేలోగా ఆ అనుభవం మనకు రససిద్ధమవుతూ ఉన్నది. కాబట్టి ఈ జగత్తులో ఎటువంటి గురువు దగ్గరికి గనక వెళ్ళినట్లయితే మనకు ఆయన ఏం పంచిపెడతాడో, ఆయన దగ్గర ఏదుందో అది ఇస్తాడు. ఆయన దగ్గర ఏమున్నది? ఆనందమే ఉన్నది. ఆయన దగ్గర ఇంకేమున్నది? ఒక స్వచ్ఛమైనటువంటి పేరు ఉన్నది. విమలమైన, అమలమైనటువంటి ఒక కీర్తి ఉన్నది. ఈ కీర్తి ఆయనకెలా వచ్చింది? జీవన విధానంలో నుంచి వచ్చింది. జీవన దృక్పథంలో నుంచి వచ్చింది. సహజీవన సౌందర్యంలో నుంచి వచ్చింది. మానవతా పరిమళంలో నుంచి వచ్చింది. మానవీయ ధర్మంలో నుంచి వచ్చింది. మాధవ తత్వంలో నుంచి వచ్చింది. మాధవుడనగా వేరు లేడనేటువంటి భావన ఎప్పుడైతే నిశ్చితమైందో అప్పుడు ఇవన్నీ లభించినాయి గనుక ఈ జగత్తు మిధ్య అనేటువంటి ఒక పదానికి ఇంకొక రెండు గంటలు దీని గురించి చెప్పొచ్చు. కానీ, రెండోదానికి వెళ్దాం. బ్రహ్మ సత్యం అది రెండోది. జగత్తు సరే, జగత్తు ఉంటుంది, పోతుంది, పుడుతుంది, రాలిపోతుంది, జారిపోతుంది అన్నీ చెప్పుకున్నాం. మరి దైవము సత్యం అనలేదు ఆయన. బ్రహ్మ సత్యం. బ్రహ్మ అనంగానే మనకు సినిమాల కారణంగానండి అనేక కళా రూపాల కారణంగా నాలుగు అట్ట తలలతో ఉన్నటువంటి ఓ బొమ్మ చూపించి వీడు బ్రహ్మ అంటాడు. వాడు చతుర్ముఖ బ్రహ్మ అంతే. ఆ చతుర్ముఖ బ్రహ్మకు ఓ పని ఉంది. సృష్టి రచన చేయటం. ఏదో బొమ్మ గీయటం, వాడికి కాస్త ప్రాణం పోయటం, ఓ address ప్రకారం వాణ్ని ఈ జగత్తులోకి వదిలిపెట్టటం. ఏ ఆయన పని అయిపోయింది. వాణ్ని పోషించటం, వాణ్ని రక్షించటం, వాణ్ని కాపాడుకుంటూ నిలబెట్టటం విష్ణువు పనయింది. వీడి పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ జగత్తులో వీడు ఉండవలసిన ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు సంహార క్రీడ చేసి లీలగా తనలో కలుపుకోగలిగినటువంటి వాడు శివుడు. కాబట్టి ఈ మూడు తత్వాలు ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి. అందుకనే త్రిమూర్తులు అని మనం పేరు పెట్టాం వాళ్ళకి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అంతే కదా. సరే, ఈ జగత్తు మిధ్య కాదని, అవునని ఏదో తెలుసుకున్న తర్వాత మరి బ్రహ్మము ఏది? సత్యము ఏది? అని. శివుడి యొక్క అనేక అంశాలలో కొన్ని aspects ఉన్నాయి. అవి ముప్పై రెండు aspects ఉన్నాయి శివుడికి. ఆ ముప్పై రెండులో ఒక aspect పేరు సత్య. ఇంకోటి మహేశ్వర. రుద్రుడు అంటాం. ఆ రుద్రుడు గణంలో ఒకడు, జనంలో ఒకడు అంతే. మనం శివుడు అనంగానే calendar లో ఉన్న శివుడు కాదు. సదాశివుడున్నాడు. ఆ సదాశివుణ్ణి గురించి ఇప్పుడు మనం ప్రస్తావన చేస్తే తప్ప ఈ విషయం పూర్తి కాదు. ఎవరు ఈ సదాశివుడు? మనం అనుకునే ఈ ముప్పై రెండు మంది శివుళ్ళు కారా? calendar లో కనిపించే శివుడు కాదా? గణ నాయకుడి తండ్రి అయిన శివుడు కాదా? అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నటువంటి పార్వతీ దేవితో కూడిన ఆ ఉమా మహేశ్వరుడు కాదా? అంటే కాదు ఇది జవాబు. మరి ఎవరు ప్రశ్నిస్తే, మీరంతా లలితా సహస్ర నామం చదువుతారు. లలితా సహస్ర నామంలో అమ్మవారి మొదటి ఐదు పేర్లలో ఒక పేరు అంటే ఒక గుణం ఏమిటంటే ఒక స్థితి. శ్రీమత్ సింహాసనేశ్వరి. మీ అందరికీ తెలుసు కదా. శ్రీమత్ సింహాసనేశ్వరి. మరి సింహాసనేశ్వరి అనొచ్చు కదా. శ్రీమత్ ఎందుకు వాడారు?తెలియదు తెలుసుకోవాలి శ్రీమత్ సింహాసనేశ్వర అంటే ఇపుడు ఇగ కుర్చీ ఉంది నేను కూర్చున్న కుర్చీ లేదు మీరు కూర్చున్న కుర్చీలు దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి ముక్కాలు గనక ఉంటే అది కుర్చీ కాదు సింహాసనం కాదు అది పీట అంతే కదా ముక్కాలి పీట నాలుగు ఉంటేనే అది కుర్చీ సింహాసనం మీరు ఏ పేరన్నా పెట్టండి మరి ఆమె సింహాసనేశ్వర అయితే ఒక సింహాసనంలో కూర్చున్నది ఈశ్వరి సింహాసనంలో ఉన్న ఈశ్వరి అని దాని అర్థం మరి శ్రీమత్ సింహాసనేశ్వరి ఎందుకైంది అని శ్రీమత్ సింహాసనేశ్వరి ఎందుకైంది అంటే ఈ ముప్పై రెండు శివ తత్వాలు శివ రూపాలు శివ భావాలు దాటి వీటి అన్నింటికి ఈ శివుడికి ఈ విష్ణువుకి ఈ బ్రహ్మ కి ఈ త్రిము--త్రిమాతలకి మూలమైనటువంటి ఒకాయన ఉన్నాడు ఆయన పేరు సదాశివుడు సదా ఎల్లప్పుడూ ఉండే శివుడు ఈ మిగతా రుద్రాలన్నీ గణాలు మారిపోతూ ఉంటాయి రుద్రులు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు మనం రుద్ర అభిషేకం చేస్తాం రుద్రం చదువుతాం ఆ రుద్రమంతా రుద్ర గణాలకు సంబంధించింది మనం ఇది కావాలి అని అడుగుతాం ఇట్లా అని నమస్కారం చేసి నమకం చెప్తాం కావాలి అని చమకం చెప్తాం అదంతా కూడా మన కోరికలు తీర్చేటువంటి రుద్రుడు గురించి అసలు రుద్రుడు ఎవరు అసలు శివుడు ఎవరు ఈ సమస్త రుద్రగణానికి ఆధిపత్యం వహించినటువంటి ఆ మూలమైన ఆ వ్యక్తి ఎవరు ఆ శక్తి ఎవరంటే ఆయన సదాశివుడు మరి ఆ సదాశివుడు ఎక్కడ ఉండాలి లలితా దేవి పక్కన కూర్చొని ఉండాలి కానీ ఆయన ఏం చేశాడో తెలుసా మూలాధారంలో ఉన్నటువంటి అమ్మవారికి సహస్రారం వరకు తీసుకు వెళ్లగలిగిన ఈ అమ్మవారికి సహస్ర నామములు ఉన్నటువంటి అమ్మ-అమ్మవారికి ఆమె ఏ సింహాసనంలో కూర్చొని ఉన్నదో దానికి central point లో ఆయన కూర్చొని ఉన్నాడు అమ్మవారి సింహాసనానికి ఐదు కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు మామూలే అందరికీ అంద-- అన్ని కుర్చీల్లానే ఆవిడది కూడా కానీ ఐదవది ఆధారభూతమైనది ఏది మాతృమూర్తికి ఆధారభూతమైనటువంటి సదాశివుడు అక్కడ ఉన్నాడు ఆ సదాశివుడే అసలైనటువంటి శివుడు సదాశివుడు శివము అంటే మంగళము శివము అంటే శుభము శివము అంటే ఆనందము శివము అంటే బ్రహ్మానందము ఈ లలితా దేవి యొక్క పీఠానికి ఆమె కూర్చున్నటువంటి స్థితికి ఈ జగత్తులో ఆవిష్కృతమైనటువంటి విధానానికి ఆ దేవీ తత్వానికి ఆధారభూతమైనది ఏది అంటే సదాశివుడు అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి లలితా సహస్ర నామంలో ఈ పేరు మీరు విన్నారు కదా చిదగ్ని కుండ సంభూత అంటాం కదా కుండ సంభూత అని ఒకరు అంటారు చిదగ్ని సంభూత అంటారు కుండ అంటే పరిమితమైనది కుండ లేకపోతే అపరిమితమైన అనంతమైనటువంటి మహా శక్తి ఆ శక్తే దేవిగా ఇవాళ పది రోజులు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు రేపు విజయదశమితో కూడా ఇవాళ అందుకే అక్కడ అద్భుతమైన యాగం జరుగుతున్నది నిన్న రుద్ర యాగం