Skip to content
Transcript తెలుగు
వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం అలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం నమే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీమద్భాగవత మహాయజ్ఞంలో ఒక భాగవత ప్రవచన మహా ప్రవాహంలో మనం అనేక స్కంధాలు దాటి, ఇవ్వాళ మీరందరూ సత్యనారాయణ వ్రతం చేసుకోవటానికి సంకల్పం చేసిన క్షణంలో భాగవతానికి కర్త, కారణము అయినటువంటి వ్యాస సన్నిధికి వెళ్లి నేను వచ్చాను. వ్యాసుల వారి యొక్క ప్రదేశాన్ని చూసినప్పుడు ఒక తెలియని ఆనందం కలిగింది. వ్యాసుల వారే గనుక ఇవన్నీ రాయస్తూ ఉండకపోతే జాతి ఏమైపోయేది అనిపించింది. అష్టాదశ పురాణాలు, భగవద్గీత, విష్ణు సహస్ర నామం, వేదాలు ఇదిగో భాగవతం. ఆయన రాయనటంటూ లేదు. శ్రీ జయం అనే పేరుతో భాగవతాన్ని సుమారు తొమ్మిది అధ్యాయాల వరకు కూడా నిజానికి ఎనిమిది అధ్యాయాల వరకు ఆధ్యాత్మిక విచారణ గురించి మాత్రమే రాశాడు ఆయన. కాస్త అక్కడక్కడ సృష్టిని గురించి, సృష్టి ఎలా ఏర్పడింది, అట్లాగే కాలం అంటే ఏమిటి, కాల విభజన ఎట్లా చేసుకుంటూ వచ్చారు, కాలాన్ని గణించటము, గుణించటము ఎట్లా అని అంటూ తొమ్మిది స్కంధాల వరకు వచ్చేప్పటికి ఆయన చెప్పదలచుకున్న కథలు అయిపోయాయి. మూడు ప్రధానమైనటువంటి కథలు నిన్న మనం చెప్పుకున్నాం. ఒకటి ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షణం తర్వాత వామన చరిత్ర. మూడు మూడు పారిశ్రావాలుగా సాగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథా కథనంలో జీవుడికి ఎన్నెన్నో మహత్తర సందేశాలు, ఎన్నెన్నో రహస్యాలతో పాటు మనం తెలుసుకోవలసినది, జీవితంలో ఆచరించవలసింది. ఇవాళ గోదాన భూదానాలు జరిగినప్పుడు ఎంత నిరాడంబరంగా, ఎంత నిష్చంద్ర మంద్రంగా, ఎంత హాయిగా, ఎంత మనస్ఫూర్తిగా, ఎంత శరణాగతితో దాన కార్యక్రమాలు రెండు పూర్తయినాయో చూసినప్పుడు వ్యాసుల వారు బహుశా చాలా సంతోషించి ఉంటారు. ఆయన సంగతి ఏమోగానీ నా హృదయం మాత్రం ఆనంద తరంగితమైంది. ఒక దాత ఒక దానాన్ని అందులో అసలు గోవు అంటేనే భూమి. గోవుని దానం చేసి, భూమి స్వరూపమైన గోవుని చేసి, కంటికి కనిపిస్తున్న భూమిని దానం చేసి ఒక దాత యొక్క హృదయము, దాత యొక్క జీవితము ఎంత ఫలప్రదం అవుతుందో దాన్ని కంటితో చూసినప్పుడు చాలా చాలా చాలా ఆనందం కలిగింది. సత్య సాయి భక్తులమైనటువంటి మనందరికీ ఇవ్వటంలో ఆనందం ఉన్నది అని స్వామి బోధించిన కారణంగా ఇస్తున్న వాళ్ళని చూస్తున్నప్పుడు కూడా అంతే ఆనందం కలిగింది. ఇది విశేషం. ఇవ్వాలి. ఎవరికి తోచిన రీతి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళాలి ప్రపంచంలోకి. ఇక్కడ అనేక జన్మలు మనం ఎత్తు వచ్చినప్పటికీ కూడా జన్మల అన్నింట్లలో మనం ఏదో కొంత ఇంతకుముందు జరిగిన జన్మల్లో కొంత పుణ్యం, కొంత మంచి, కొంత మంచి ఆలోచన చేసిన కారణంగా ఇటువంటి బృహత్తరమైనటువంటి మానవ జన్మ మనం ఎత్తాం. మనం తొలి రోజులలో ప్రవచనాలు ప్రారంభమైన తొలి రోజుల్లో ఒక పద్యం చెప్పారు. పద్యంలో ఏమున్నది అంటే, అరే నారాయణాంవేషితం. నారాయణుడిని అన్వేషించటానికి మనం జగత్తులోకి వచ్చాం. జన్మ తీసుకుని వచ్చాం. మరి ఎవరు నారాయణుడు? నారాయణుడు ప్రత్యేకంగా చతుర్భుజుడై, లక్ష్మీ సమేతుడై, క్షీరసాగరంలో ఉన్నటువంటి మహావిష్ణువై, ఆపై రాముడై, కృష్ణుడై, అనంతుడై, అచ్యుతుడై, అవ్యయుడై, అప్రమేయుడై, ఆనంద ధాముడై ఉన్నటువంటి ఒక కల్పనాత్మకమైన, ఊహాత్మకమైన దైవతమా, కాదా? అంటే మనందరం కూడా గుర్తుంచుకోవలసింది ఒక విషయం ఉన్నది. ఇది వేదాలు చాలా స్పష్టంగా చెప్పినాయి. వేదాలతో పాటు భాగవతంలో వ్యాసులవారు చెప్పారు. అలాగే శ్రీమద్ రామాయణంలో కూడా మానవుడే దేవుడు, జీవుడే దేవుడు. ఇది సనాతనమైనటువంటి ఒక ధర్మంగా, సనాతనమైన విషయంగా మన దేహంలోనే ఆత్మ జీవుడుగా కనిపిస్తున్న జీవుడి దేహంలోనే దేహిగా పరమాత్మ ఉన్నాడు. దీన్ని స్వామి తమ దేహానికి ముప్పై ఏళ్ళు రాకుండా ఒక పద్యం చెప్పారు. దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహి నిరామైయుండు గణుతింపగా దేహియే దేవదేవుడవు. ఎక్కడ వెతుకుతావ్ బయట ఎక్కడున్నాడు ఆయన? నీ లోపల ఉన్న దేహంలో ఉన్న వాడికి దేహి అని పేరు ఉంటే దేహియే దేవదేవుడు. ప్రత్యేకంగా లేడు. కానీ మన విషయాలన్నీ కూడా బయట వెతుకులాట ఉంటుంది.ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడు చెట్టులో ఉన్నాడు పుట్టలో ఉన్నాడని జీవుడు వెతుక్కుంటూ ఉంటాడు. వెతుకులాటలో అనేక పుణ్య కార్యాలు కూడా చేస్తాడు. ధర్మ కార్యాలు చేస్తాడు. త్యాగపరమైన భావనలు మనసునుండా నింపుకుంటాడు. కానీ జరిగేదేమిటి అంటే తడగా సాధనాంతంలో జీవుడి లోపల ఉన్నటువంటి ఆత్మని జీవుడు గ్రహించటమే నిజమైనటువంటి అధ్యాత్మ సాధన. అధ్యాత్మ సాధన అంటే ధ్యానము, తపస్సు, యాగము, యోగము ఏదో ప్రాణాయామము. ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటాం. అవి ఉపకరణాలు మాత్రమే తప్ప అవి నిజానికి అవి కావు. They are mere aids. కొద్దిగా ఉపయోగిస్తాయి చాలా కొద్దిగా చాలా స్వల్పంగా. మరి మానవుడు మాధవుడుగా ఉండాలి. మానవుడిలో ఉన్న మాధవుడిని ఎలా పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని నిజానికి భాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కంధాలలో చక్కగా వ్యాసులవారు చెప్పారు. దాన్నే మనం కథా కథనంలో కాకుండా విషయాన్నే ఇంకొక రీతిలో మనం చెప్పుకున్నట్లయితే మనకు కొంత సాధనా మార్గం తేలిక అవుతుంది. తేలిక కావాలి అంటే శుద్ధ వాక్కు కావాలి, శుద్ధ మనస్సు కావాలి. ఆత్మ ఎప్పుడూ శుద్ధమైనది, శుద్ధాత్మ అంటూ లేదు. బౌద్ధికమైన అంటే బుద్ధిపరమైనటువంటి ఒక openness మనకు ఉండాలి. దేనినైనా అర్థం చేసుకుని ఆచరించగలిగినటువంటి అవకాశాన్ని కోసమై మనం ఎదురు చూస్తూ ఉండాలి. అటువంటి భావనల నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ గమనించినప్పుడు ఒక మహానందం కలిగింది అని మీ అందరికీ చెప్తూ, అలాగే వ్యాసులవారి స్థానానికి వెళ్ళినప్పుడు నైమిశారణ్యము అనేది ఒక ఊహాత్మకమైన, భావనాత్మకమైనటువంటిదిగా మన స్థానం నుంచి బయలుదేరినప్పుడు ఇది ఒక పెద్ద అరణ్యం అని, అరణ్యంలో అన్నీ కుటీరాల వెంట ఉంటాయని, మామూలుగా లేడి పిల్లలు గెంతులు వేస్తూ ఉంటాయని అటువంటి అరణ్యాన్ని ఊహించుకుని మనం వస్తాం. అరణ్యం కూడా నైమిశారణ్యం కూడా ఆధునిక కాలంలో జనారణ్యంగా మారిపోయింది. ఇది పురాణాలలో చెప్పినటువంటి నైమిశారణ్యానికి కాస్త మిగిలిన ముక్క లాగా కనిపించింది. కానీ మీరు తర్వాత వెళ్ళినప్పుడు వ్యాస, వ్యాసులవారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు నిజమైనటువంటి నైమిశారణ్యాన్ని అక్కడ చూస్తారు. జన ప్రవాహం ఉండదు, తొక్కిసలాటలు ఉండవు, గందరగోళం ఉండదు. అంతా కలిపి ఒక ఐదు ఆరుగురు మనుషులు అటూ ఇటూ తారట్లాడుతూ ఉన్నారు. కానీ పరమాద్భుతంగా ఉన్నది. అక్కడ వచ్చినటువంటి తరంగాలు vibrations అంటాం, అవన్నీ కూడా చాలాచాలా ఉధృతమైనటువంటివి. వాటిని contain చేయాలి, వాటిని చూడగలిగిన శక్తి కావాలి. లేకపోతే ఇక్కడ మనుషులే లేరే ఎవరు రారేమో అనుకుంటాం. అవును జ్ఞానం ఎవరికి కావాలి? కథలు కావాలి, పాటలు కావాలి, పద్యాలు కావాలి. అసలైన శిశలైనటువంటి జ్ఞానం ఎందరు కోరుకుంటారు? భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట అంటాడు. "నన్ను చూడటానికి వచ్చిన కోటి మందిలో ఒక్కడో నాకోసం వస్తాడు. వాడు జ్ఞానం తెలుసుకుందామని నా వైపు వస్తాడు తప్ప నాతో వాడికి రకమైన లౌకిక బంధనాలు లేవు." కోటి మందిలో ఒక్కడే పరమాత్మ నుంచి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటాడు. నిజానికి అది ఇవాళ అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది. ఎవ్వరూ లేరు. ప్రాపంచికమైనటువంటి దుకాణాలు లేవు. అలాగే భిక్షగాళ్ళు లేరు. పరమ ప్రశాంతంగా నిజమైన నైమిశారణ్యాన్ని మీరు అనుభవించబోతున్నారు నేను కాస్త అనుభవించి చెప్పాను. అందుకే చూడాలి, స్వామి అంటారు "కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడు" ఇవన్నీ మరిచిపోకూడదు మనం. కాబట్టి నేపథ్యంలో ఇవాళ ఏకాదశ ద్వాదశ స్కంధాలలో ఉన్నటువంటి వాటిని, మరి దశమ స్కంధం అయిపోయిందా అనుకోకండి. రేపంతా దశమ స్కంధంలో ఇంకా కొన్ని కథలున్నాయి. అవి మనం అది ఎలా చెప్పాలో అలా చెప్పుకుంటేనే దాని అందం కాబట్టి "దశమ స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామము" ఒక చిలుక పాడినట్లుగా, శుకదేవుడు చెప్పినట్లుగా, పరమ మాధుర్యంతో, ఆపాత మాధుర్యంతో, ఆలోచనా అమృతాన్ని దాటినటువంటి స్థాయిలో భాగవతాన్ని దశమ స్కంధంలో పోతనామాత్యులవారు అద్భుతంగా రాశారు. దానిలో పాత్రలేమిటి? అవేమిటి? దాని వెనక ఉన్న రహస్యాలేమిటి? అవన్నీ రేపు మనం సంపూర్ణంగా పొద్దున్న, సాయంత్రం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయువీచి, సంౙక పిశమ్ములైన జడలల్లిన జీవులలోన, తాండవ శ్రీ కమనీయ జాంగవి ధరించిన, దేవుని గేహరూప మాలాకృతి, మందహాస కలితా నన, మాకు ప్రసన్నమయ్యెను. శారదా దేవిని ప్రార్థన చేస్తూ, వేదాంతుల దగ్గరికి, కాస్త popularity ఉన్న గురువుల దగ్గరికి, ప్రపంచంలో చలామణి అవుతున్నటువంటి గురువుల దగ్గరికి, జ్ఞానార్ధి అయి వెళ్ళినటువంటి వాడు, "అయ్యా! అందరూ అంతర్ముఖులు కావాలి. ఇట్లా కాదు మీరంతా అంతర్ముఖులైపోవాలి. మీ లోపలికి మీరు వెళ్ళాలి. మీరు ఎంత సేపు బయట దేవులాడుతూ ఉంటారు? ఇది అయ్యేది కాదు, జీవితాలు ముగిసిపోయినా మీకు అర్థం కాదు. మీ లోపలికి మీరు వెళ్ళండి." అని చేతిలో పండు పెట్టి పంపిస్తాడాయన.ప్రశ్న మిగిలిపోయి ఉంటుంది జవాబు రాదు మరి ఏం చేయాలి? ఇట్లా జీవితకాలమంతా గురువులను వెతుక్కుంటూ ప్రశ్నకు జవాబు పొందాలనుకుంటూ అంతర్ముఖం అంటే ఏమిటి? బహిర్ముఖం అంటే ఏమిటి? ఇది ఇవాళ మనం చేయవలసినటువంటి తీవ్రమైనటువంటి విచారధార. అంతర్ముఖం కావాలి మనం అంటే looking within అంటాడు అరవింద యోగి We should look within We have a habit of looking outside or without ఎందుకని అంటే బాహ్య ప్రపంచం అంతా కూడా అనేక వస్తువులతో నిండిపోయి ఉన్నది మూడు రోజుల క్రితం ఒక ఉపనిషత్తు తైత్తరీయ ఉపనిషత్తును గురించి మాట్లాడుతూ దాని ప్రస్తావన తెస్తూ ఒకే కొమ్మ మీద రెండు పక్షులున్నాయని ఒక పక్షి తన రె-- కన్ను పూర్తిగా విప్పారి జగత్తును చూసి ఆనందిస్తున్నదని రెండవది మాత్రం సగం మూసిన కనులతో సగం తెరిచిన కనులతో జగత్తును చూస్తున్నదని కళ్ళు పూర్తిగా తెరిచి ప్రపంచాన్ని చూస్తున్న [గొంతు సవరించుకున్న శబ్దం] పక్షి ఏమంటున్నది అంటే "ఏం ఆలోచిస్తున్నావ్? ఏం దొరుకుతుంది ఆలోచిస్తూ ఉంటే? ఏమో ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటామో తెలియదు మనకి జీవితం ఒకటే కదా! కనిపిస్తున్నటువంటి బాహ్య ప్రపంచాన్ని పైగా వర్తమాన ప్రపంచాన్ని అంతకుమించి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని దానిని మించి నువ్వు చూడగలిగినంత ప్రపంచాన్ని నువ్వు చూడకుండా కళ్ళు మూసుకునో కళ్ళు సగం తెరుచుకొనో ఉన్నట్లయితే నీకు ఏమి లాభం?" అని పక్షి అడిగింది. అర-అరమోడ్పుగా ఉన్నటువంటి అరమోడ్పుతో కన్నులతో ప్రపంచాన్ని చూస్తున్న పక్షి జ్ఞానార్ధి. జ్ఞానం-జ్ఞానం కావాలి అది అంటున్నది "నువ్వు నదిని చూశావు, కొండను చూశావు, అందమైన ఆకాశాన్ని చూశావు, అద్భుతమైన మహాత్ముల్ని చూశావు కానీ నేను వాటిని చూడ్-చూట్టం లేదు. వీటన్నింటికీ మూలమైనటువంటి కర్త ఎవడో నేను చూస్తున్నాను. ఎట్లా సృష్టి జరిగింది? ఇంత వర్ణవర్ణాంచితమైనటువంటి సృష్టి మహా సృష్టి అనంత కాలంలో ఒదిగిపోయి రచన చేసిన వాడు ఎవరు? సృష్టి రచన ఇదిగో నువ్వు నేను ఒకే కొమ్మ మీద ఉన్నాం రెండు మనస్తత్వాలతో ఉన్నాం. ఒకటేమో బాహ్య ప్రపంచంతో నీకు మమేకమైనటువంటి భావన ఉన్నది. నాకేమో లోపలికి వెళ్లాలన్నటువంటి ఒక తపన ఉన్నది. నాకు ఇంకా దారి దొరకటం లేదు కానీ నేనే ఎప్పటికైనా అంతర్ముఖత్వాన్ని పొందాలి." I must get myself in-- unto myself not into myself వేరు. I must get unto myself. నా లోపలికి నేను ఎలా వెళ్లాలో ప్రయత్నం చేస్తున్నాను, సాధన చేసుకుంటున్నాను అనేటువంటి నేపథ్యాన్ని గనక గమనించినట్లయితే కేవలం మానవుడు మాత్రమే కాదు పక్ష్యాదులు కూడా ఎక్కడో ఒకచోట ఇటువంటి భావానికి లోనవుతాయి. ఎందుకంటే ప్రపంచాన్ని దృశ్యమాన ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దృశ్యం మారుతూ ఉన్నది ప్రపంచం అట్లాగే ఉన్నది. ఒక వసంత ఋతువులో ఒకలాగా ఉన్నది, హేమంతంలో ఒకలాగా ఉంది, శిశిర ఋతువులో మరొకలాగా ఉంది. మారుతున్నవి ఋతువులే గాని ప్రకృతి కాదు, ప్రపంచం కాదు. అలాగే ప్రపంచంలో ధర్మం ఏర్పడింది. ధర్మం అనేక యుగాలుగా మార్పు చెందుతూ వచ్చి మార్పు చెందుతున్నటువంటి విలువలకు అనుగుణంగా ధర్మం అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నది. మరి ధర్మమే గనక వెనక్కి వెళ్లిపోయినట్లయితే విలువలన్నీ మనం సంపాదించుకున్నవి. అందుకనే Morals, Values, ఇథోస్ అని మూడు మాటలున్నాయి. Values కాస్త మన తాతలు తండ్రులు మనకిచ్చినవి. ఇథోస్ ఎప్పటివి అంటే మన తాతల తాతల తాతల నుంచి ఇత్-ఇథోస్ లో నుంచి వచ్చిన పదమే ఇతిహాసం. అప్పుడు అలా జరిగింది రామాయణం అప్పుడు అలా జరిగింది, భాగవతంలో కృష్ణుడు అలా ఉన్నాడు అని ఎన్నడో జరిగిన దాన్ని మళ్ళీ చెప్పుకోవటం ఇతిహాసం అయినటువంటి ఇతిహాసము అంటే ఇది జరిగింది దాని అర్థం అదే. దాన్ని మనం History అని పేరు పెట్టాం History వేరు ఇతిహాసం వేరు. History చరిత్ర జరుగుతున్న కాలానికి ఏర్పడినటువంటి ఒక record పేరు History. ఇతిహాసం అంటే ఇంత మంచి జరిగింది, అట్లే ఇంత చెడు జరిగింది. రెండింటి మధ్య ఒక వైరం సంభవించింది. దానిలో నుంచి ధర్మమే జయించింది. యతో ధర్మస్తతో జయః అని మాట పుట్టింది. అలాగే శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు తన తల్లి కౌసल्या దేవి దగ్గరికి వెళ్ళి "అమ్మా నేను పధ్నాలుగు ఏళ్ల వరకు నీకు మళ్ళీ కనపడను. తండ్రిగారు నన్ను అరణ్యానికి వెళ్ళమని చెప్పారు నేను వెళ్తున్నాను. నీ ఆశీర్వచనం కావాలి నాకు" అని అడిగింది-- అడిగాడు. అడిగితే ఆమె ఏమన్నది అంటే "నీవు ధర్మవర్తనుడివై ఉన్నంత కాలము ధర్మము ఒక్కటే నిన్ను రక్షిస్తుంది." అక్కడ పుట్టిందే ధర్మో రక్షతి రక్షితః అది. అంటే మనందరికీ కూడా అంతర్ముఖత్వంలోకి వెళ్ళటానికి మనకు కావలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే ధర్మం. మరి ధర్మానికి స్వరూపం ఏమిటి? ఆలోచిస్తే మనకి వ్యక్తి ధర్మం ఉంది. ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, వ్యక్తమైనటువంటి జీవుడిగా మనకి మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను కూడా మనం వృధా గనక చేసుకుంటే మళ్ళీ జన్మ వస్తుందో తెలియదు గనుక జన్తూనాం నరజన్మ దుర్లభం అనే మాట ఒకటి వినపడుతూ ఉంటుంది గాక దాని అర్థం వేరే అది చెప్తా. ఏది వస్తుందో తెలియదు.ఏది వచ్చి వెళ్ళిపోయిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మానవ జన్మ మనం ఎత్తాం. మానవ జన్మ ఎత్తిన కారణంగా మన మనస్సు అనేక కష్టాలని, సుఖాలని, ఆనందాలని, అనుభూతులని పొందుతూ ఇష్టానిష్టాలను ఏర్పరచుకుంటూ జీవితాన్ని సమగ్రం చేసుకోదు. దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టుకుంటుంది. దీనికి కారణం ఏమిటి? అంటే ధర్మానికి మనం దూరం కావటం కారణం. వ్యక్తి ధర్మంగా మనం ఏం చేయాలి అంటే కాలానికి నమస్కరించాలి. ప్రపంచంలో మనం చక్కగా మెసలాలి. మనందరి మధ్య ఒక సామరస్య పూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి. పరస్పర ప్రేమాభిమానాలు ఉండాలి. మర్యాద రేఖ దాటనంత వరకు ఉండవలసిన మానవీయ సంబంధాలు ఉండాలి. అవి ఎక్కడా అతిక్రమించకూడదు, వికటించే దాకా దాన్ని తీసుకుని వెళ్ళకూడదు. ఇదంతా చెప్తుంటే ధర్మం అంతా moral philosophyలా కనిపిస్తుంది మనకి. ఇది ఎవరు ఆచరించాలి? వ్యక్తి మాత్రమే ఆలో-- ఆచరించగలడు. వ్యక్తి ఒక ప్రశ్న వేసుకుని, ఇందాక అన్నట్లుగా నేను వచ్చాను, ఉన్నాను, ఏం చేశాను, ఏం చేస్తున్నాను, నేను ప్రపంచానికి ఏమి మిగిల్చి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాను. ఇవి గనక ప్రతి వాడు ఒక స్పృహ తొదికి చదువు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కావాల్సింది ఏమిటంటే ఒక ఆలోచనా విధానంలో మనకు ఉండవలసినటువంటి ఒక చిన్న భావన. అని గనక ఆలోచించుకున్నట్లయితే మనం అతి చిన్నప్పుడే మన మార్గాన్ని మనం ఎంచుకోగలుగుతాం. మళ్ళీ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎంచుకోగలమా, ఎవరన్నా ఏర్పరిచిన దాంట్లో మనం ఉంటామా, లేదు మన అదృష్ట వశాత్తు, పూర్వ పుణ్య వశాత్తు ఎప్పుడో మహా పుణ్యం చేశాం గనుక ఇవన్నీ చేయగలుగుతున్నాం అని అనుకుంటున్నామా? అంటే, అన్ని శబ్దాలు పుట్టె నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితంను. వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఒక విహిత ధర్మం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకో. దీన్ని మించి ఇంకొకటి లేదు. మనం ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల గురించి మనకు తెలుసు. అన్ని విషయాల మీద మనం వ్యాఖ్యానం చేయగలం. మనల్ని కాక అందరినీ మనం పరామర్శ చేయగలం, విమర్శ చేయగలం, తూకం వేయగలం, ఒక judgement ఇవ్వగలం. మనం చేయవలసిన పని అది కాదు. మరి ఏం చేయాలి? మనల్ని మనం evaluate చేసుకోవాలి. మనల్ని మనం తూకం వేసుకోవాలి. మనల్ని మనం self audit చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మనిషి ఆలోచనా విధానం అంతా కూడా చిన్నప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. మరి చిన్నప్పుడు ఎప్పుడు అని? దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి యున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతుండు కానప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్ బలెనీ పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వరా. అంటే అతి పిన్న వయస్సులో గనక, దానికి అధ్యాత్మ అని పేరు ఉంటుందని కూడా తెలియదు. కానీ చక్కగా మనకంటే మించిన ఒక శక్తి ఏదో ఉన్నది. శక్తిని-- శక్తికి దేవుడు అని పేరు పెట్టు, primordial sound ఆది ప్రణవం అని పేరు పెట్టు, ఏది పెట్టినా సమస్త ప్రపంచాన్ని ఇంత అందంగా సృష్టించినటువంటి వాడు, పోషిస్తున్నటువంటి వాడు, సమయం వచ్చినప్పుడు లయం చేయగలిగిన వాడు, వాడు ఎవరు? ఆ-ఆ వాడి కోసం మనం గనక ప్రయత్నించినట్లయితే, లేదా వాడంటూ ఒకడు ఉన్నాడు గనుక ఇవన్నీ ఏర్పడ్డాయి అని గనక అనుకున్నట్లయితే అది అధ్యాత్మ సాధనలో తొట్ట తొలి మెట్టు. మెట్టు ఎక్కాలి మనం. ఎప్పుడు ఎక్కాలి? బాల్యంలోనే ఎక్కాలి. మరి బాల్యంలో ఎక్కకపోతే ఏమవుతుంది? ఎప్పుడన్నా చి-చిట్టచివరి దశలో ఎక్కామనుకుందాం, నష్టం ఏం లేదు. Better late than never కదా. వయస్సు చిన్నప్పుడు గనక మనం అధ్యాత్మ వైపు గనక వెళ్లినట్లయితే మనకు తెలియకుండానే మనకు ఒక తృప్తి ఏర్పడుతుంది జీవితంలో. ఇక చాలు అన్న భావన కలుగుతుంది. ఇక చాలు అన్న భావన కలక్కపోవటానికి ఆశా దురాశా కారణం కాదు, అవిద్య కారణం. అవిద్య అంటే చదువు లేకపోవటం కాదు. ఏదీ తెలిసి ఉండకపోవటమే కారణం. ఎందుకంటే మహాత్ములు అనబడేటువంటి వారు, ప్రపంచంలో చాలా గొప్పవారు అనబడినటువంటి వాళ్ళు, వాళ్ళకి పెద్దగా విద్యలేం లేవు, ప్రాథమిక విద్యలేం లేవు. రమణ మహర్షి పదహారేళ్ళకు ముగించేశారు. సత్యసాయి భగవానుడు పద్నాలుగు ఏళ్ళకు ముందే చదువు ముగించేశారు. ఇట్లా మనకు కొన్ని వందల కథలు, గాథలు, నిరూపణలు మనకు దొరుకుతాయి. అంటే లౌకిక విద్యకి, అధ్యాత్మ విద్యకి నిజానికి రకమైన సంబంధము లేదు. లౌకిక విద్య ఎందుకుండాలి అంటే పొట్ట నింపుకోవటానికి, కుటుంబాన్ని, సంసారాన్ని కాపాడుకోవటానికి, సంఘంలో ఒక మర్యాదని నిలబెట్టుకోవటానికి, లౌకిక విద్య ద్వారా వచ్చేటువంటి ఒక ఉద్యోగం అనండి, పదవి అనండి, దాని ద్వారా వచ్చే సంపద అనండి, వాటి వల్ల సమాజంలో ఒక స్థితి ఏర్పడుతుంది. సమాజంలో స్థితి ఏర్పడినప్పుడు ఆతనికి ఒక స్పృహ కలుగుతుంది. అవును ఇంత సంపాదించుకోవటానికి లేదు ఇన్ని నేర్చుకోవటానికి ప్రపంచం నాకు అవకాశం ఇచ్చింది, మళ్ళీ నేను ప్రపంచానికి ఏం చేయగలను అన్న ఆలోచన నాలుగో ఏట రాదు. నలభో ఏట రావచ్చు, అరవయ్యో ఏట రావచ్చు కానీ ఎప్పుడో అప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు ఆతడు కూడా గనక ఇట్లా ఆలోచించినా, అవును నేను ఎందుకు వచ్చాను, ఏదో చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది, సంసారం ఏర్పడింది, పిల్లలు వచ్చారు, తర్వాత తరం కూడా ఏర్పడింది, ఇక నేనేం చేయాలి? కిం కరూ? నేనేం చేయాలి? అథాతో? తర్వాత ఏమిటి? అథాతో తర్వాత ఉన్నది ఒక్కటే, బ్రహ్మ జిజ్ఞాసే.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 24:52

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

    Now playing
  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22