Skip to content
Transcript తెలుగు
అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం రెండు aspects లో ప్రారంభమైంది ఒకటి మొట్టమొదట విశ్వరూప దర్శనం ఎవరికి ఇచ్చాడు అంటే తన తల్లి అయినటువంటి దేవకీ దేవికి విశ్వరూపం ఇచ్చాడు విశ్వరూపం అంటే సినిమాల్లో విశ్వరూపం మర్చిపోండి అది వేరు కథ వేరు విశ్వరూపం అంటే అసాధారణమైన రూపంతో వచ్చాడు నగలు పుట్టరే పుట్టిన వాడికి నగలు చేయిస్తాం వేస్తాం అది వేరే కానీ అలా వచ్చిన వాడు మళ్లీ నగలు వద్దు నువ్వు మామూలుగా ఉండు అంటే వాటిని ఉపసంహరించాడు అంటే సంకల్ప వికల్పాలు రెండు చేతిలో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ దేవి దగ్గర ఉన్న సమయంలోనే మొట్టమొదటి విశ్వరూప దర్శనం చేయించాడు కానీ ఆమె ఏమైంది కథ ఒక్క నిమిషం ఆపితే మహావిష్ణువు యొక్క స్వరూపం ఒక miniature ఒక చిన్న బొమ్మగా అయితే ఇదా ఇట్లాగే ఉంటే బాగుండు అని ఆమె అనుకోలా మామూలు పిల్లవాడిగా ఉండు అని అడిగింది చూశారా మనం ఒక లీలను కూడా ఎక్కువ సేపు తట్టుకోలేం లీల మీద లీల జరుగుతున్నది అనుకోండి మనం అనుభవించలేం ఎక్కడో అది ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది దేవకికి కూడా అట్లాగే అనిపించింది. ఇక రెండవది మన కథా గమనంలో ఇది ఒక విశ్వరూపంలో ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉయ్యాలలో పడుకోబెట్టారు కృష్ణుడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఒక బండి లాంటిది తయారుచేసి ఉయ్యాలకి దగ్గరగా పెట్టారు దానికి ఇవాళ మనం ఏం చేస్తున్నాం కదా ఇవన్నీ balloons పెట్టి అవి పెట్టి అలంకారం చేశారు వాళ్లకు తోచిన రీతిలో కృష్ణ పరమాత్మకి ఆకలి వేసి పాలు కావాలన్నట్టుగా కేకలు పెడుతున్నాడు రోదిస్తున్నాడు ఎవరి పనిలో వాళ్ళున్నారు ఈయన సంగతి మర్చిపోయినారు గుక్క పట్టి ఏడుస్తున్నాడు గుక్క పట్టి ఏడుస్తూ ఆకలిని తట్టుకోలేక అని కబుర్లు రాస్తారు ఆయనకు ఒక mission కావాలి తన mission పూర్తి కావాలంటే ఒక చిన్న కారణం కావాలి ఉయ్యాలలోనే కిందకి దిగాలని ప్రయత్నం చేస్తూ జరుగుతూ జరుగుతూ వచ్చి దగ్గరలో ఉన్న ఒక బండిని తన్నాడు బొటనవేలుతో తన్నాడు అది ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయి ముక్కలు ముక్కలై దానిలో నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు వాడు ఎవరంటే శకటాసురుడు శకటం రూపంలో అసురుడు వచ్చాడు శకటము అంటే మనం మామూలుగా గనుకైతే శకటాసురుడిని బొటనవేలుతో చంపి ఆకాశంలోకి ఎగరేసి కాదు అంటే కీడు శం అంటే శుభం కట వేంకటేశ్వర స్వామి అంటాం కదా వేం అంటే పాపములను కట నిర్మూలించేటువంటి ఈశ్వర స్వరూపం గనుక ఆయనకి వేంకటేశ్వర స్వామి అని పేరు అది నిజానికి వెంకటేశ్వర అనకూడదు వేంకటేశ్వర వే కి దీర్ఘం ఉంది వేం అంటే పాపం ఇక్కడ శకటాసురుడు ఎవరంటే ప్రపంచానికి హాని చేసేవాడు కాబట్టి వాడి వాడు చేసే పాపకృత్యాలను అన్నింటినీ కూడా వాడు పైగా బండి రూపంలో వచ్చాడు కాబట్టి బండిని తన్ని శకట అసుర సంహారం చేశాడు ఇది రెండవ లీల ఇది మామూలుగా అర్థమయ్యే విషయం కాదు అంటే చెడుని శం అంటే శుభం అని మనం దా దాని దాకా వెళ్ళం శంకరాచార్యులవారు అంటే మనలాగా ఆయనకి కూడా ఒక పేరు ఉంది అనుకుంటాం శం అంటే శుభం చేయటానికి కర అంటే చేసేవాడు ఆచార్య రూపంలో ఆయన శుభం చేస్తాడు అది కనుక శంభోర్ మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా ఇది అయిపోయిన తర్వాత కంసుడు ఒకడిని పంపాడు లీలల్లో ఇవన్నీ కూడా ప్రాథమికంగా కనిపిస్తాయి అట్లా వాడు ఏం చేశాడు ఒక గాలి రూపంలో వచ్చాడు గాలి రూపంలో వచ్చి సుడిగాలిలాగా వచ్చి కృష్ణుడిని ఎత్తుకొని ఆకాశంలోకి వెళ్లిపోయినాడు వాడు కిందంతా సుడిగాలి ఎప్పుడైతే వచ్చిందో మరి వ్రజ భూమి అంతా మట్టే ఉంటుంది మనలాగే సిమెంట్ ఉండదు కదా దుమ్మంతా కూడా ఆకాశంలోకి లేచిపోయింది బాలుడు ఎక్కడ ఉన్నాడో కనపడటంలా యశోద బయటికి వచ్చి చూస్తే బాలుడు కనపడలా ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు ఉన్నాడేమో అసలు ఏమిటి ఇంత గాలి ఎప్పుడూ రాలేదే సుడులు విరులుతూ ఉన్నది ఇక్కడి నుంచి పట్టుకెళ్లిపోయింది అని అనుకొని భయభ్రాంతురాలైపోయి అట్లా నుంచుంటే గాలి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వచ్చి దానిలో నుంచి తృణావర్తుడు అనబడేటువంటి ఒక రాక్షసుడు కింద పడ్డాడు అంటే కంసుడు పంపినటువంటి వాడు తృణ ఆవర్తుడు తృణ అంటే గడ్డి గడ్డిని గాలి ఎట్లాగైతే ఎండిన గడ్డిని ఎలా పైకి లేపుకొని తీసుకు వెళ్లగలదో అట్లాగే తృణావర్తుడి యొక్క సంహారం కూడా జరిగిపోయింది ఇట్లా బాల్య చేష్టలు ఇంకా రెండు మూడు ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడు ఇక అందరికీ ముద్దుల కుమారుడు అయిపోయినాడు ముద్దుల బాలుడు అయిపోయినాడు అందులో గోపకాంతలు అందరికీ కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఏర్పడింది ఆయన మధుర సౌందర్యం వలన ఒకటి చిలిపి చేష్టల వల్ల ఒకటి దివ్య తేజస్సు వల్ల ఒకటి అప్పటికే ఆయన తన శక్తిని నిరూపించుకున్నాడు ఇతను మామూలు బాలుడు కాదు అసాధారణ బాలుడు అని అందరికీ అర్థమైపోయింది కాబట్టి అసాధారణమైన బాలుడితో మనం కూడా ఉంటే మనకు ఆనందం కలుగుతుంది మనకు అతడే రక్ష మాకు మా భర్తలకి మా కుటుంబానికి మాకున్న పశుసంపదకి వాళ్ళకి ఇంకో సంపద లేదు పశుసంపద మాత్రమే ఉంది వీటన్నింటినీ రక్షించగలిగినటువంటి వాడు చిన్నప్పుడే ఇది చేస్తున్నాడు పెరుగుతూ ఉంటే ఇంకా ఉంటుందని వాళ్ళందరూ కృష్ణుడిని అల్లారుముద్దుగా తీసుకుని పెంచుకోవడం మొదలు పెట్టారు అంటే ఒకళ్ళు వచ్చి యశోదమ్మ నీ కొడుక్కి నువ్వు రోజూ స్నానం చేయిస్తావు కాసేపు మాకివ్వు ఇవాళ మా ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి వాడికి ఒక అలంకారం చేసి మాలో ఉన్నటువంటి ఆనందాన్ని మేము అనుభవిస్తాం అని ఇట్లా రకరకాలుగా కృష్ణుడి యొక్క బాల్యం అంతా కూడా గడిచిపోతున్నది ఇక్కడ మనం ఆగితే దీనిలో ఏదైనా ఒక అధ్యాత్మ ఉన్నదా విచారణ చేయాలి అసలు దీంట్లో ఉన్నదే అధ్యాత్మ దేనికి తన కడుపున పుట్టినటువంటి బిడ్డనికాసేపు మేము ఆడుకొని ఇస్తాము మా ఇంటికి తీసుకెళ్లి ఇస్తాము అంటే తల్లి ఒప్పుకోదు ఎవరినన్నా వెంబడి ఇచ్చి పంపిస్తుంది. అభద్రత వల్ల కానీ యశోదకు భయం లేదు ఎందుకు కృష్ణుడు దేన్నైనా చేయొచ్చు రాక్షసున్నే చంపాడు పూతననే చంపాడు నా పిల్లవాడికి ఢోకా లేదనుకుంది ఇచ్చింది. మరి వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉన్నారు గోపకాంతలు వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కాదు పిల్లలు ఉన్నా కృష్ణుడు ప్రత్యేకం కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంటుంది వెన్న పాలు రెండే ప్రధానం. వెన్న పెట్టడం మొదలు పెట్టారు అట్లాగే పాలు పివ్వటం మొదలు పెట్టారు వెన్న పాలతో కృష్ణుడు ఇంకా చక్కగా బొద్దుగా పెరగటం మొదలు పెట్టాడు ఇంకా ముద్దొస్తున్నాడు. వాళ్ళు ఇంకా అలంకారం ఏం చేయాలో చేస్తున్నారు నెమలి పించం పెట్టిన వాళ్ళు కూడా గోపికలే. కథ వేరు అది అధ్యాత్మలో చివరికి చెప్పుకుందాం చివరి రోజున చెప్పుకునే విషే-విశేషాలు అవి. సరే ఇలా ఇలా జరుగుతూ ఉంటే ఈయనకి స్నేహితులు ఏర్పడ్డారు బాలుడికి. ఈన ఒక్కడు వెళ్ళటంలా ఎవరన్నా ఇంటికి వెళ్లాలంటే పది మంది friends ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంత పాలు అంత పెరుగు అక్కడ ఉండవు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే మీరు వెన్న తినాలి అంటే నా ఒక్కడితో వస్తే మీకు కావలసినంత దొరకదు మీరు ఆయా ఇళ్లలోకి వెళ్లి పొండి. నాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నన్ను భుజాన ఎక్కించుకోవాలి నేను వెన్న తెచ్చి నీకిస్తా కాబట్టి నన్ను ఎత్తుకోగలిగిన వాళ్ళంతా నాతో ఉండండి. మామూలుగా ఎవరన్నా పిడితే తినేవాళ్ళు మీరు వెళ్ళిపోండి అని అంటే అక్కడ ఒక భావార్థం ఏమిటంటే పరమాత్మని ఎవరన్నా ఎత్తుకోగలుగుతారా? పద్నాలుగు భునాలు తన పొట్టలో పెట్టుకున్నటువంటి ఒక మహావిష్ణువుని కృష్ణ రూపంలో ఉన్న మహావిష్ణువుని ఎవరూ మొయ్యగలరు? కానీ ఆయన ఒక అనుగ్రహం ఇచ్చాడు మనము మనకి ఇంకో ప్రశ్న కూడా ఉంది అదేంటంటే స్వామి ninety six years ఉంటారు కదా ఎనభై ఇంకా అడగలేదే అని చూస్తున్నా ఎనభై ఆరు ఏళ్ళకే దేహం ఎందుకు వదిలేశారు అని. సంకల్ప ప్రకారమే వస్తారు ఉండాలి అనుకుంటే నూట ఆరు ఏళ్ళు కూడా ఆయన ఉండొచ్చు కాదనే వాళ్ళు లేరు. ఎనభై ఆరు ఇక చాలు అనుకున్నారు పైగా మిగతావన్నీ మామూలుగా జ్యోతిషశాస్త్రం ప్రకారం లెక్కలు గనక కడితే తొంభై ఆరు పూర్తయిన మరుక్షణమే స్వామి దేహం వదిలిపెట్టారు. అది కూడా మీరు మనసు నుంచి తీసేయండి జరిగింది ఏంటి జరిగిపోయింది అది అట్లా ఎందుకయింది దేవుడైతే ఇట్లా కాకూడదు కదా ఇంకా తొంభై ఆరు ఎనభై ఆరు ఏళ్ళు ఉంటే మనం ఆయన నుంచి ఏం పొందాం ఏం బాగుపడ్డాం ఇంకో పదేళ్ళు ఉంటే ఏం జరగబోతుంది ఇదే జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఒక భద్రత మనం తయారు చేసినటువంటి వ్యవస్థను నడపగలిగిన సమర్ధులైన భక్తులు ఏర్పడ్డారు గనుక ఆయన విత్తడ్రాయినారు. సో దాన్ని అక్కడ పెడదాం. ఎత్తుకున్నటువంటి వాడు మరి కృష్ణుడిని ఎలా ఎత్తుకోగలడు అనంటే ఎత్తుకునే శక్తిని భగవంతుడు ఇస్తాడు చూడండి ఒక్కోసారి మనం చేయలేని పని మన చేత చేయిస్తాడు ఇదేమిటి పని నేను ఎలా చేయగలిగాను అని మనం వెనక్కి వస్తాం నువ్వు చేయలే నీ చేత ఆయన చేయించాడు. ఎప్పుడైతే మనకి స్పృహ ఉంటుందో కర్తృత్వం ఉండదు do-doership ఉండదు కాబట్టి వెన్న దొంగిలించటం ఇదంతా అవుతుంటే కృష్ణుడు యశోదతో చాలా దాగుడుమూతలాడాడు చాలా. తల్లి ఎలా ఆడుకోవాలని కోరుకున్నదో కృష్ణుడు కూడా యశోదతో అంతే ఆడుకున్నాడు ఆయన. ఎలా ఆడుకున్నాడంటే రోజూ ఆ-ఆమె తయారుచేసిన వెన్న ఆయనకి పెట్టాలి వెన్న తినేవాడు పోయి ఆడుకునేవాడు మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ వెన్న అడుగుతూ ఉండేవాడు. రోజు ఆమెకు కూడా మాములు తల్లులకు వచ్చినట్టు ఆమెకు కూడా కోపం వచ్చి "అడిగినప్పుడల్లా పెట్టడానికి వెన్న ఇక్కడ ఉండదు కృష్ణ మళ్ళీ సాయంకాలం తయారవుతుంది చీకటి పడాలి చీకటి పడ్డ తర్వాత నీకు వెన్న ఇస్తాలే" అన్నది. కృష్ణుడు అన్నాడు "అమ్మ చీకటి పడాలా" అన్నాడు "అవునురా చీకటి పడాలి చీకటి పడితే కదా మళ్ళీ వెన్న వచ్చేది నాకిస్తాలే నాన్న" అంది. కృష్ణుడు అన్నాడు కళ్ళు మూసుకుని "అమ్మ నాకు అంతా చీకటిగా ఉంది వెన్న పెట్టు" అన్నాడు చూశారా అది కృష్ణుడి చిలిపితనం అంటే అది చమత్కారం అది. అంటే నువ్వు కన్ను మూస్తే చీకటి కన్ను తెరిస్తే వెలుగు కన్ను మూసిన దాంట్లో మనం ఏం చేయలేం కన్ను మూసిన తర్వాత ఏం చేయలేం. వెన్న ఏమిటి అంటే అది ఎంత చేతిలో గనక పెట్టుకుంటే కాసేపు దాన్ని అలా వదిలిపెడితే దానంతట అది కరిగి ప్రవహించి వెళ్ళిపోతుంది. మన భక్తి కూడా నవనీతం కూడా పరమేశ్వరుడి పట్ల అరచేతి వెన్న ముద్ద వలే ఉండాలి. యశోదకి చెప్తున్నాడు "నువ్వు నాకు పెట్టటం లేదమ్మా నువ్వు కాసేపు నీ చేతిలో పెట్టుకుని ఉంచు ఏమవుతుందో కనీసం నువ్వు విడితే నేను మింగేస్తా నా నేను మింగేస్తే నా లోపల ఉంటుంది" అన్నాడు. మింగితే లోపలే ఉంటుంది బయట ఏం రాదు కదా అని అనుకుంది ఈమె. సరే మాములు కథ కంటే కూడా కథ భాగవతంలో ప్రమాణం ఏమిటంటే రోజు కృష్ణుడు కావలసిన దానికంటే ఎక్కువ వెన్న తిన్నాడు. తిని తల్లి పక్కలో పడుకున్నాడు. నోరంతా వెన్న వాసన వస్తోంది ఆమెకి చాలా చికాకు కలిగింది చికాకు కలిగి "నీకీ వెన్న పిచ్చి ఏమిటి నువ్వు పోయి శుభ్రం చేసుకొని రా" అంది. "శుభ్రం చేయకపోతే" అని అడిగాడు. "వాసన వస్తోంది" అన్నది. "వాసన అంటే" అన్నాడు. "వాసన అంటే వాసనే అండి" ఆమెకు చదువు లేదు కదా "వాసన అంటే వాసనే అండి వాసన వల్లే నువ్వు వచ్చావు వాసన వలననే నేను కూడా వచ్చా ఇక్కడికి వాసన ఇద్దరికీ సమానమే" అని మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆమెకి అది అర్థం కాలా అర్థం కాక "పడుకో పడుకో ఎక్కువ మాట్లాడుతున్నావ్" అని జో కొట్టడం మొదలు పెట్టింది. నెమ్మదిగా వాడు నిద్ర పోయాడనుకొని ఆవిడ అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి "నాకు నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది" అన్నాడు. కొడుకు బిడ్డ అడిగితే తల్లికి ఆనందమే అది ఒళ్ళో పడుకోబెట్టుకోవటం "సరే రా కాసేపు పడుకో మిగతా పనులన్నీ తర్వాత చూస్తా" అన్నది. పడుకుంటేఓ ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది కిలోలు ఉండేటువంటి పిల్లవాడు నెమ్మది నెమ్మదిగా ఒక పర్వతమంత బరువు ఎక్కిపోతున్నాడు. మొయ్యలేకపోతున్నది, యాతన పడిపోతున్నది. నెమ్మదిగా వాడిని దొర్లించింది. ఒంట్లో నుంచి, ఆహ్ ఒడిలో నుంచి. దొర్లించగనగానే "ఆ" అని నోరు తెరిచాడు. అసలు కథ ఇది. కథ కూడా జరిగింది అంటారు. కథ మాత్రం వ్యాసభాగవతంలో కూడా ఉంది. ఎప్పుడైతే ఆయన నోరు తెరిచాడో, శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది అన్నప్పుడు శుభ్రాశుభ్రములకు అతీతమైన, శుచికి, మడికి, దడికి అన్నింటికీ అతీతమైనటువంటి పద్నాలుగు భువనాలు కూడా యశోద మొట్టమొదటిసారి చూసింది. ఇది రెండవ విశ్వరూప దర్శనం. చూడగానే ఆమెకు భయమేసింది. "ఏమిటి ఇందాక బరువు ఎక్కాడు, ఇప్పుడేమో ఇదన్నాడు, ఇవాళ పొద్దున్న నుంచి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు, వాడి వయస్సు ఎంత? వాడి మాటలు ఎంత?" అని అనుకుంటోంది. అనుకొని ఆవిడ వెంటనే ఏమన్నదంటే, "నువ్వు నోరు లోపల ముందు మూసేసి మామూలుగా ఉండు. కడుపుంటే కడుక్కుంటావు లేకపోతే లేదన్నాయి." ఇవన్నీ జరిగేప్పటికీ చీకటి ఎలాగూ పడింది, మళ్ళీ కృష్ణుడు వెన్న ఎక్కడ అని అడిగాడు. చూసారా? అంటే వెన్న దొంగ కాదు. దొంగిలించటం [పాస్] ఇతరులకు కావాల్సింది ఇవ్వటము. అది దొంగిలించటం. ఎవరి వస్తువునో మనం తేవటం దొంగిలింత అనే మాట ఇక్కడికి వచ్చింది. తెలుగునాట కూడా వ్యాకరణం ఉంది కదా, చిన్నయసూరి వ్యాకరణం. మా చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడు అది ఉండి ఉండదు బహుశా. ఎత్తేసి ఉంటారు. సరే చిన్నయసూరి వ్యాకరణం కనుకులో ఎక్కడో ఏడు రోజుల పెద్ద పెట్టారు. దానిమీద discussions. మహాపండితులంతా వచ్చారు. అందులో last కి వచ్చినవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన మాట్లాడారు. ఆయన మొదలు పెడుతూనే ఏమన్నాడంటే, "చిన్నయసూరి దొంగ" అన్నాడు. అనగానే వీళ్ళు "అదేంటి ఆయన మహాత్ముడు, వ్యాకరణం రాశాడు, చిన్నయసూరి దొంగ అంటారేంటి? ఎంత అహంకారం!" అంటే అని గగ్గోలు పెడుతున్నారు audience. అప్పుడు ఆయన అన్నారు "కూర్చోండి. ఆయన ఇంటిపేరు పరవస్తు కదా. 'పరా' ఇతరుల యొక్క, 'వస్తు' వస్తువులను, 'చిన్నయ' దొంగిలించుట యందు 'సూరి' శ్రేష్టుడు. కనుక మీ చిన్నయసూరి గారు దొంగ అనని, పాణిని వ్యాకరణాన్ని తెలుగులో రా-రాశాడు తప్ప తెలుగులో ఆయన వ్యాకరణం ఎప్పుడు రాశాడు?" అని నిరూపించాడు. కాబట్టి ఒక చిన్మయ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఒక చిన్నయ్యగా అంటే ఒక దొంగగా, వెన్న దొంగిలించే వాడిగా, మరి కథా గమనంలో వాళ్ళను అడిగితే ఇస్తారు కదా, అతడు అంటే అందరికీ ఇష్టమే కదా అంటే, ఇతను మాత్రం ఎంత తింటాడని పెట్టడం మనకిష్టమే కానీ మన పిల్లవాడి వయస్సు, వాడి శక్తి అవన్నీ చూసి ఇది కాదు, ఇది కాదు కాస్త control చేద్దాం అని అనుకుంటాం మనం. కానీ పద్నాలుగు భువనాలకి వెన్న అందించాలి ఆయన. లోపలికి చేర్చాలి. అంతే కాదు, తను కనిపిస్తున్న ప్రమాణం కంటే, స్థాయి కంటే తనదైనటువంటి స్థాయిని వీళ్ళందరూ అందుకోవాలి, పట్టుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ వెన్న దొంగగా మారాడు. సరే ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి మరి గోకులం అక్కడ ఏముంది? వాళ్ళకి ఆటపాటలు ఏం లేవు. ఉన్నది గోసంపద. ఇంకా విద్యకి పంపించలేదు, ఎవరో విద్యకు పంపించాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. సరే ఏమన్నారంటే ఆవుల్ని కాయటానికి బలరాముడిని, కృష్ణుడిని పంపారు. అక్కడ కంసుడు పంపిన వాడే ఒకడు వృషభ రూపంలో వచ్చాడు. ఎద్దు రూపంలో వచ్చాడు. వచ్చి ఆవుల మందలో జొరబడ్డాడు. జొరబడి కృష్-- దానిలో కలిసిపోతుంది కదా తెల్ల చర్మం అని అనుకున్నాడు వృషభాసురుడు వాడు. చెట్టు కింద కూర్చున్నటువంటి కృష్ణుడు అప్పటికే గమనించాడు. వాడు ఆవుల మందలో జొరబడ్డాడని తాను పిల్లనగ్రోవి ఊదటం మొదలుపెట్టాడు. పిల్లనగ్రోవి ఊదటం మొదలు పెట్టగానే అది ఆవులకు పరిచయమైన భాష. పిలుపు అందుకొని అటు వెళుతున్న ఆవులన్నీ ఇట్లా మరలి కృష్ణుడి దగ్గరికి వచ్చినాయి. వృషభాసురుడు ఒక్కడు మిగిలిపోయినాడు. అంటే he segregated, separate చేశాడు. చేసి వాడిని వధించాడు. వృషభాసురుడిని చంపాడనేది మళ్ళీ వార్త అయింది. ఏంటి పిల్లవాడు ఇంతమందిని చంపుతున్నాడు, ఈయన అసలు ఎవరు ఇతను? దేవుడా? రాక్షసుడా? రాక్షసుడే రాక్షసులను చంపుతున్నాడా? అని ఇటువంటి బాల్య క్రీడలన్నీ కూడా సాగుతున్నటువంటి ఒకానొక సందర్భంలో వీళ్ళు అనుకున్నారు, ఇక్కడేదో వీడికి మామూలుగా అంటామే దిష్టి తగిలింది. అలాంటి దృష్టి, దృష్టే దిష్టిగా మారింది. చెడు దృష్టి మా పిల్లవాడి మీద పడింది కాబట్టి వీడిని బృందావనం తీసుకొని వెళ్ళిపోదాం అని గోపగోపికలంతా కూడా వ్రజభూమిని ఖాళీ చేశారు. అందరూ వెళ్ళిపోయినారు. నందుడు కూడా. నందుడు, యశోద, రోహిణి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి అక్కడ ఆడుకు-- ఆటపాటల్లో మునిగిపోయినారు. ఆటపాటల్లో మునిగిపోయినప్పుడు అక్కడ ఒక హ్రదము అంటే సరస్సు ఒకటి కనిపించింది. సరస్సు భుగభుగలతో ఉంది. వేడినీళ్ల సరస్సులాగా ఉందది. అక్కడికి ఆకర్షణ వల్ల ఎవరైనా వెళితే వాడు మరణించి వెనక్కి వస్తున్నాడు. నీరంతా విషమైపోయింది. విషమైపోయినటువంటి చోట బలరామ కృష్ణులు ఇద్దరూ ఆడుకుంటున్నారు. బలరాముడు వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు, అది ఆయన పని కాదు. కృష్ణుడు ఎందుకు వీళ్ళందరినీ, వీళ్ళందరూ ఎందుకు మరణిస్తున్నారు అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి మడుగులోకి ఆయన దూకాడు. దూకటం దూకటంతోనే లోపల ఉన్నటువంటి పాము పైకి లేచింది. ఆయన ఎక్కడ దూకాడంటే పాము తల మీద దూకాడు. ఇలా, ఇలా విసిరేద్దామనుకుంది కానీ కృష్ణుడు నిలబడ్డాడు. అణచివేయటం ప్రారంభించాడు. దానిమీద నర్తనం చేయటం ప్రారంభించాడు. పాము తల మీద ఎప్పుడైతే కృష్ణుడు చిందులు వేస్తున్నాడో పాము కోరలలో ఉన్నటువంటి విషమంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నది.అది నెమ్మదిగా శక్తిహీనం అయిపోతున్నది. తన బలమంతా విషంలోనే, తన బలమంతా కోరల్లోనే. కోరలు కోరలలో దాగిన విషాన్ని బలహీన పరుస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ పైన నుంచున్నాడు. చాలా హాయిగా నాట్యం చేసుకుంటున్నాడు వీళ్ళకి అర్థం కావటం లేదు. అది మింగేస్తుందేమో కృష్ణుడు ఇంకా మనకి దెక్కడని ఏడుస్తున్నారు అందరు కూడా. ఊరు ఊరు వచ్చేసింది. అది నెమ్మదిగా పడగ వాల్చడం మొదలు పెట్టింది. అప్పుడు మడుగులోనే ఉన్నటువంటి కాళీయుడు, కాళీయుడి యొక్క భార్యలు అనబడేటువంటి మిగతా పాములు కూడా వచ్చి మా ఒక భర్త గనక పోయినట్లయితే మా జీవితం సాగదు వాడిని చంపద్దు అని అడిగారు. అడిగితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే "ఈ సరస్సు వదిలేసి, మడుగు వదిలేసి, నువ్వు ఇంకో చోటికి వెళ్ళిపో కానీ ఇకపై నీలో శరీరంలో విషం పుట్టదు. నీ కోరలు కరిచినా ఎవరు చచ్చిపోరు. నువ్వు మామూలుగా చచ్చిన పాము వలె అంటామే చచ్చిన పాము వలె నువ్వుండు." తలకెక్కిన విషం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు తన పిన్న వయస్సులో కాళీ యొక్క కాళింది యొక్క ఫణి ఫణాగ్రం మీద నుంచొని పడగల మీద నుంచొని చిరు కాళ్ళతో నృత్యం చేసి మదము అణచి దమాన్ని ఇచ్చి ఇంద్రియాలను చంపి క్షమాన్ని అనుగ్రహించి మళ్ళీ దేహం అది వదిలిపెట్టే దాకా కృష్ణ నామస్మరణ చేస్తూ బతకమని ఆదేశించాడు, బాలకృష్ణుడే. మరి నీళ్ళు ఏమైపోవాలి? అప్పుడు శ్రీకృష్ణుడు, ఇది ఒక లీల. నీరైతే మొత్తం విషంగా ఉండిపోయిందో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే విషాన్నంతా కూడా బయటకు తీసి బయటకు నెట్టాడో అది మంచి నీటి సరస్సు అయిపోయింది. దాన్లో పాములు లేవు ఇంకా. అందరికీ ఉపయుక్తమైనటువంటి ఉపయోగపడేటువంటి నీటి సరస్సు అయిపోయింది. ఇది భాగవత కథలో శ్రీకృష్ణుడి యొక్క లీలా అమృతం ఇది. కథలన్నీ మనకు మామూలుగా పై పైకి తెలుస్తాయి గాని అరిషడ్వర్గాలని మనలో ఉన్నటువంటి విషాన్ని విషం పట్ల విషయం పట్ల మనకున్న వాంఛలని మనకి పరమాత్మే అని చెప్పడానికి రాబోయే ఉత్తర కాలంలో జరగబోయేటువంటి అనేకానేకమైన శ్రీకృష్ణుడి యొక్క శక్తి బీజ ప్రాయంగా అక్కడే ఏర్పడింది అని చెప్పడానికి ప్రథమ స్కంధం దానిలో ప్రథమ అధ్యాయం అంటాం. ఒక స్కంధంలో ఒక అధ్యాయంలో గోప గోపికా బృందాలతో ఉంటే మరి వాళ్ళంతా వాళ్ళ ఊరు వదిలిపెట్టి వచ్చారు. మళ్ళీ వాళ్ళ ఆవులను తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఏమున్నాయి అంటే మంచి గచ్చ పొదలు ఉన్నాయి. దాక్కోటానికి వీలుగా. పసి పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళెప్పుడూ మరుగు కావాలి వాళ్ళకి. ఎక్కడో దాక్కున్నట్టు వాళ్ళను ఎవరో పట్టుకున్నట్టు తాము ఇంకా పట్టుబడనట్టు. వాళ్ళకి అదొక ఉత్సాహం. అటువంటి ఆటలు సాగటానికి వీలైనటువంటి పొదరీళ్ళు అవన్నీ ఉన్నటువంటి చోట గచ్చ పొదల వెనక బలరామ కృష్ణులు ఇద్దరూ కూడా పరమాద్భుతమైనటువంటి బాల్య లీలా వినోదంతో వ్రజ భూమిని అంతా కూడా ఆనందమయం చేసేశారు.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 21:30

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

    Now playing
  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22