⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఓం శ్రీ సాయిరామ్! సౌందర్య సార సర్వ Sri form మందస్మిత మనోహర వందాను చానందకారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత తదస్తతం సకరుణం జ్ఞానాగ్ని శిరస్తతాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం అలం వేన విహీనం యో మాపుం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్వరతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భాగవత ప్రవచన మహా ప్రవాహంలో మరొక మలుపు ఈ రోజు. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ప్రశాంతి నిలయమే నైమిశారణ్యం కి వచ్చిందా అని అనిపించింది. అంటే స్వామితో సహా కదలి వచ్చినట్లుగా ఒక దివ్య భావన కలిగింది. ఇదంతా భక్తుల హృదయాలలో నుంచి భక్తుల జీవ సంస్కార ధారలలో నుంచి కలిగేటువంటి ఒక అమృత భావన. అందుకు స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ. ఇది ఒక అపురూప సన్నివేశం. ప్రథమ ద్వితీయ తృతీయ స్కంధాలలో అత్యున్నతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ముఖ్యంగా కపిలుడు తన తల్లి దేవహూతికి చెప్పింది. చెప్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు అర్థం అవుతూ ఉన్నప్పుడు ఆ అర్థం ఏమిటో తెలుసుకుంటూ ఉన్నప్పుడు మానవుడికి ఒక వైరాగ్య విభూతి కలుగుతుంది. జీవితం యొక్క పరిమితి పరమావధి ఇంతే కదా! మరి ఈ ఇంత చిన్న పరిధిలో మనం ఎంత పెద్ద పని చేసుకోగలం, ఎంత చేయాలి? ఆ చేయటానికి మన తతీక్ష, మన పట్టుదల, మన సంకల్ప శక్తి, మన సమర్పణ, మన శరణాగతి, మన వినయం, ఇవన్నీ గనుక ఉన్నట్లయితే భగవంతుడు కచ్చితంగా మన జీవితాలను భద్రతమంగా నడిపిస్తాడు. ప్రపంచ చరిత్రలో ఒక తల్లి మాతృ స్థానంలో ఉన్నటువంటి మాతృమూర్తి అయినటువంటి ఒక తల్లి తన బిడ్డకి బ్రహ్మోపదేశం చేసిన సంఘటన ఒకే ఒకటి జరిగింది. ఆనాడు కేవలం తండ్రులకు మాత్రమే ఉండే అర్హత బ్రహ్మోపదేశం తల్లి ఆ బాధ్యతను స్వీకరించింది. ఎవరి పట్ల స్వీకరించింది అంటే శంకర భగవత్పాదుల పట్ల. స్వామి తల్లి ఆర్యంబ ఆయనకు బ్రహ్మోపదేశం చేసింది. అంటే ఒకనాటి స్త్రీ శక్తి ఎంత వేద సంభరితమైనదో, ఎంత విజ్ఞాన పరిపూతమో, ఎంత ఆధ్యాత్మిక సంపదతో కూడి ఉన్నదో నాకు అర్థమవుతూ ఉంటుంది. అదే తల్లి సన్యాసించిన శంకర భగవత్పాదులని ఓ కోరిక కోరింది. "నాయనా శంకరా! ఇదిగో ఈ దేహం నేను ఏ రోజున వదిలి పెడతాను. నువు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. ఆనాడే చెప్పావు. నేను అడిగాను. నీకు ఆకలి ఏస్తే అన్నం ఎవరు పెడతారు అని. అమ్మా! నీ దగ్గర ఉంటే ఒక తల్లిగా నువ్వు నాకు ముద్ద అన్నం పెడతావు. ప్రపంచంలోకి నేను వెళ్ళిన- కనిపించే ప్రతి స్త్రీమూర్తి నాకు తల్లే, నన్ను ఆదుకుంటుంది, నువ్వేం భయపడద్దు అని చెప్పావు. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటంటే దేహం వదిలిపెట్టినప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా నా దగ్గరికి రావాలి. ఆ అంత్యేష్టి చిట్టచివరి కార్యక్రమం నువ్వే చేయాలి" అని తల్లి కోరినప్పుడు, సంప్రదాయ విచ్ఛిన్నం చేయకుండా పరిపురాజకులు సత్యాచారులు శంభోర్ మూర్తి శరతి భువన శంకరాచార్య రూపాన్ని పుంజుకున్నటువంటి అద్వైత మూర్తి పూర్ణాద్వైత మూర్తి ఆయన తల్లి కోరికను తీర్చడానికి వెనక్కి వచ్చాడు. అంటే ఒక తల్లి ఒక కుమారుడిని లేదా కుమార్తెని ఎంతగా ప్రభావితం చేస్తుంది అనటానికి ఒక అది ఒక ఉదాహరణ అయితే. నిన్న ఒక తల్లికి ఓ కుమారుడు హితోపదేశం చేయడం బ్రహ్మోపదేశం చేయటం అన్నింటిని మించి ఆధ్యాత్మిక రహస్యాలను నిప్పి చెప్పటం ఇది అపురూప సన్నివేశం. భాగవతంలో కపిలుడు దేవహూతి ఒక కథ. శంకర భగవత్పాదులు ఆర్యంబ ఒక చరిత్ర. "నువ్వు పుట్టిన చోటనే ఉండాలి. ఈ ఊరు నుంచి ఎక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. పిల్లకాయలంతా చెడిపోతున్నారు. చిన్న School పెట్టు. గర్భిణీ స్త్రీలంతా బుక్కపట్నం దాకా వెళ్ళకుండా అందరూ మా-దారి మధ్యలోనే ప్రథమ ప్రసవంలోనే స్త్రీలు మరణిస్తున్నారు. వీళ్ళందరికీ చదువు వచ్చేట్టుగా ఏదైనా చెప్పు. నువ్వు ఇక్కడే ఉండు. ఈ-ఈ ఊళ్లో ఒక చుక్క నీళ్లు లేవు. ఎప్పటికైనా నీళ్లు వచ్చేట్టుగా చూడు" అని అడిగిన ఈశ్వరమ్మ కి స్వామి ఆ మూడు ప్రమాణాలు పాటించారు. చూడండి School పెట్టు అని తల్లి అడిగితే University పెట్టాడు. నీళ్లు కుడపర్తికి ఇవ్వమని అడిగింది ఆమె. ఎక్కడ అవసరమో అక్కడ ఇస్తూ వెళ్లిపోయినాయను. ఒక గర్భిణీ స్త్రీ మరణాన్ని ఆపటానికి ఆమె ఒక Primary Health Center ప్రాథమిక వైద్యశాల పెట్టమని అడిగితే, ప్రపంచమంతా అబ్బురపడేటువంటి, ఆశ్చర్యపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి Hospital ని స్వామి సృష్టించారు.ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ భారతీయమైన అనూచాన సాంప్రదాయక దివ్య జీవన విధానంలో తల్లి పాత్ర చాలా గొప్పది. తల్లి ఏం కోరుకోవాలి? "నువ్వు పైకి రావాలి, బాగా చదువుకోవాలి, మీ నాన్న సంపాదించలేకపోయినాడు కనీసం నువ్వన్నా సంపాదించి నన్ను సుఖపెట్టు" అని తల్లులున్నారు ఈ లోకంలో, లేకుండా ఏం లేరు. కానీ జనహితంగా, సమాజహితంగా, జనసేవలో, జనార్ధన సేవలో జీవితాలను ధన్యవంతం చేసుకోవాలి నాయనా. ఈ సేవను మించినటువంటిది మరొకటి లేదు అని చెప్పినటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఈవేళ మనం వందనం చేయాలి. ఈ మాతృమూర్తుల యొక్క శక్తి అంతా ఎక్కడ ఉన్నదంటే చండీ, శతచండీలో ఉన్నది. అందువల్లనే ఈవేళ చండీయాగ ప్రారంభంలో మనం అక్కడ కూర్చొని ఆ మంత్రాలన్నీ నేను వింటున్నప్పుడు చండీమాత అక్కడికి వస్తుందా? అక్కడికి వచ్చిందా? అన్నటువంటి ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. అందుకనే మనం అన్నీ పాల్గొనాలి, అన్నీ వినాలి, అన్నీ తెలుసుకోవాలి. ఇక ఈవేళ మూడు స్కంధాలు అయిపోయినయి. నాలుగవ కొమ్మ, స్కంధం అంటే కొమ్మ. ఆ కొమ్మని పట్టుకోవాలి. ఆ కొమ్మలో ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కథా కథనం విశేషం ఉంది. అసలు ఇంతకీ ఈ భాగవతం అంటే అసలు ఏమిటి? మనం కథలోకి వెళ్ళిపోతున్నాం, మాట్లాడుకుంటున్నాం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః ముహురహో రసికా భువి భావుకాః ఇది భాగవతం. అంటే కల్పతరువు అనేటువంటి ఒక కల్పవృక్షం నుంచి జారిపడిన ఫలమిది అంటే అది భాగవతం. ఎలా పడిందట అంటే సుఖముఖాదమృతద్రవసంయుతం ఆ పండు రాలబోయే ముందు ఒక చిలుక దాన్ని కొట్టిందట. ఆ లోపల ఉన్నటువంటి రసమంతా చిప్పిలి బయటకు వచ్చి ఆ చిలుక ముఖమంతా కూడా నిండిపోయింది, తడిసిపోయిందట. అక్కడ ఆ శుకము ఏదంటే చిలుక కాదు. చిలుక పలుకుల వలె, రామచిలుక పలుకుల వలె మధుర మధుర నిస్తంద్ర మంద్ర భాషలో ప్రవచించినటువంటి శుకమహాదేవుడు. శుకము అంటే శుకమహాదేవుడు. ఆ శుకావధూత, ఆయన ముఖమంతా కూడా ఈ భాగవతంలో ఉన్నటువంటి ఆ రసమంతా ఆయన ముఖం మీద పడిందట, ఆయన చెప్తూ ఉన్నప్పుడు. శుఖముఖాదమృతద్రవసంయుతం అటువంటి ఆ రసాన్ని పిబతా, నేను తాగుతా. ఏం తాగుతావు నువ్వు? పిబత భాగవతం రసమాలయం కేవలం ఆ రసాన్నే నేను తీసుకోవట్లేదు, అమృతమే తాగటం లేదు. అమృతానికి మూలమైన ఈశ్వర తత్వాన్ని నేను అనుభవించబోతున్నాను. రసో వై సః. పరమేశ్వరుడికి రూపమేమున్నది? రూపమే లేదే. నామం మనం కల్పించాం, రూపం మనం కల్పించాం, భావం మన తలపులలో నుంచి పుట్టింది. తత్వము అది అయి ఉన్నాడు గనుక ఈ భాగవతమంతా తత్వ విచార ధారలో సాగుగాక. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః ఈ ప్రపంచంలో జన్మ ఎత్తిన ప్రతి వాడు రాసిక్యాన్ని పొందాలి. భగవంతుని యొక్క కథామృతాన్ని తాగాలి. ఆ కథామృతాన్ని మనం తాగుతూ ఉన్నప్పుడు మనకు తెలియని ఒక ఆనందము, ఒక అమృతత్వము, అనంతత్వము, అనంత మహా ఐశ్వర్య సంపదలన్నీ మనకు కలుగుతాయి గనుక అటువంటి భాగవతాన్ని నేను తాగుతాను రాసిక్యంతో, ఇష్టంతో, భగవంతుని యందు ప్రేమతో, భక్తితో, గౌరవంతో, వాత్సల్యంతో, అభిమానంతో, అధికారంతో నేను ఆ కథను అంటా, కథను వింటా. భువి భావుకాః దానికో భావుకత కావాలి. ఏదో కథ అక్కడ మొదలుపెట్టి ఇక్కడ ముగించి వెళ్ళటం కాదు. దానిలో మన హృదయాలు, స్వామి అంటారు గుండె గుండె కలిసి పాడితే అది భజన. గుండెలు విడిపోయేట్లు పాడేది భజన కాదు. గుండె గుండె రాపిడి కలగాలి. దానిలో రాగ భావ తాళ లయాత్మకమైనటువంటి భావనా స్థితిలో ఈశ్వరుడిని గనుక మనం ఉపాసన చేసినట్లయితే, సంకీర్తన చేసినట్లయితే, భజన చేసినట్లయితే దేవుడికి దిగి రాక తప్పదు. ఆయన వస్తాడు. ఆయన వచ్చేట్టుగా పాడాలి మనం. అట్లా అరుక్కోవాలి. అది పాట గాని, మాట గాని. పాటకి ఎట్లాగైతే శృతి లయ ఉన్నాయో మాటకి కూడా శృతి లయలున్నాయి. శృతి తప్పిన, గతి తప్పిన, లయ తప్పిన, ధృతి తప్పిన, ఆధృతి తప్పిన, వేగం తప్పిన, ఆవేగం తప్పిన ఏ వచనమైనా అమృతం కాదు. చెవులకి ఇంపు కాదు. కనుక పాట ఎంత కర్ణాటమో మాట కూడా అంతే కర్ణాటం. కర్ణాటకము కాదు. కర్ణాటక సంగీతం అంటాం, కాదు. కన్న అట. చెవికి ఇంపైనటువంటి మాట. చెవికి ఇంపైనటువంటి పాట. కంటికి ఇంపైన ఆట. ఈ మూడు ఎవరి పట్ల ఉంటాయి, ఎక్కడుంటాయి అంటే ఏది భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటుందో, ఏ భగవత్కథా కాలక్షేపం జరుగుతుందో, ఏ భగవంతుని యొక్క కథని సంకీర్తనం చేస్తామో.ఏ భగవంతుని యొక్క దివ్య భావాన్ని మనమందరం పంచుకుంటూ ఉంటామో అది నిజమైనటువంటి సత్రయాగం. ఇవాళ ఈ భాగవత మహాయజ్ఞంలో, ఈ ప్రవాహంలో, ఈ సత్రయాగంలో, ఈ ప్రవచనం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే, భగవత్ తత్వాన్ని సామవేదము పాటై, ఋగ్వేదము మాటై, యజుర్వేదము ఆటయై సాగేటువంటి ఈ ముప్పేటగా సాగేటువంటి దివ్య జీవనమైనటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి ఈ ఆనంద కథామృతాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. తెలుసుకుంటూ ఉండాలి. దాన్ని మన జీవితంతో, మన ప్రవృత్తితో, మన ఆలోచనలతో సమన్వయం చేసుకోవాలి. అప్పుడే భాగవతుడు భగవంతుడు ఒక్కడు కాగలుగుతాడు. భగవంతుడు భాగవతుడు వేరు కాదు నిజానికి ఇద్దరూ ఒకటే. ఇతడు జీవుడుగా ఉన్నాడు అతడు దేవుడుగా ఉన్నాడు. ఈ జీవుడిలో దేవుడు సనాతనమై ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు. ఆ దేవాలయం ఏది? మన శరీరమే దేవాలయం. ఇవన్నీ నిన్న మాట్లాడుకున్నాం. కాబట్టి ఓంకార స్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షా దక్షమై తాండవాహంకార స్థిరచంద్రయః సకల శైత్యప్రాప్త శాంతత్వమై శంఖా సంకులమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించు తన్. పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ పద్యంలో మనం ఇక్కడ ఈ ఆవరణలో అంటే ఎక్కడ ఏ ఆవరణలో భగవన్నామ సంకీర్తన జరుగుతుందో, భగవత్ కథా విశేషాలు చెప్పబడతయో ఆ గాలి నిండా ఓంకార స్వరలీనమై ఓంకారం నివిడీకృతమై ఉంటుంది. ఓంకా-- it will be impregnated with ఓంకారం. కాబట్టి ఓంకారం మన ప్రత్యేకంగా ఇటువంటి ప్రదేశంలో నిజానికి చెయ్యనక్కర్లేదు. అసలు ఉన్నదే ఇది ఓంకారం. మరి ఈ ఓంకారం ఏమిటి? అకారూకారం అకారయుక్తమగు ఓంకారాభిధానం. అకారము అగ్నిబీజమై, ఉకారము ఉమాబీజమై, రకారము రమాబీజమై, ఈ మకారము చంద్రబీజమై ఉన్నది గనుక అకారం ఉకారం మకారములు మూడు కలిపితే అది ఓంకారం అవుతున్నది. ఆ ఓంకారం ఏమిటి అంటే అన్ని అక్షరాలకి ప్రథమాక్షరం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. ఈ బ్రహ్మమును మనం పట్టుకోవాలి అంటే ఎక్కడ పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి అంటే మీరు శాస్త్రాలు, పాఠాలు, పద్యాలు అవన్నీ తర్వాత పుట్టినయి. అక్షరాలు తర్వాత పుట్టినయి. అసలు మొట్టమొదటి అక్షరం ఏది అంటే ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటిది గనుక మనం చక్కగా ఉచ్చరించగలిగితే, అనగలిగితే, దాని అర్థం తెలుసుకోగలిగితే ఓంకార ధ్యానమే కలియుగంలో సర్వోత్తమమైనటువంటి ధ్యాన ప్రక్రియ. ఓంకారాన్ని ఇరవై ఒక్క సార్లు ఎలుగెత్తి పాడకూడదు. ఓంకారాన్ని చాలా మంద్ర స్థాయిలో చెప్పాలి. ఓంకారం అందరికీ వినపడేది కాదది. మనమందరము నిశ్శబ్దంగా ఉంటే మనం ఎంత నెమ్మదిగా చదివినా ఆ ఓంకారం అన్న పలుకుతుంది, వినపడుతుంది గనుక. ఆ అకారంతో అకార సాధన అంటారు. అకారంతో ప్రారంభమై ఉకారము కంఠగతమై మకారము పెదవుల బయట నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది ఓంకారం అవుతుంది. కాబట్టి ఓంకారం అంటే పెద్ద కేక, పెనుకేక పెట్టడం కాదు. ఒక గాలిని మనం అకారంతో ప్రారంభం చేసి కుంభించి పైకి తీసుకుని విశుద్ధ చక్రం దాకా తీసుకువచ్చి కాసేపు నిలబెట్టి మళ్ళీ దానిని ప్రపంచంలోకి నెమ్మదిగా మనం నెమ్మదిగా taper down చేస్తాం. ఆ taper down ఎవరికీ వినపడి, వినపడనట్లుగా చేయాలి. అది ఓంకార ధ్యానం. అటువంటి ఈ ఓంకార ధ్యానము కలియుగంలో ప్రధానం. అందుకనే నామానికి, జపానికి, తపానికి అన్నింటికీ కూడా మానసికమైన ఓంకార ధ్యానం చేసుకోవాలి. మానసికంగా మన పూజారూంలో ఉంటాం. మనం ఓంకారం చదువుతున్నాం అంటే నేను మొదలు పెట్టాను మీరెవరూ మాట్లాడొద్దని కాదు. ఆ ఓంకారము మీకే వినపడనంత నెమ్మదిగా చదవాలి. అప్పుడే దాని effect చాలా ఉంటుంది. బాగా ఉదృతంగా పైకి చదివినట్లయితే ఫలితం ఉండదా అంటే రావలసిన ఫలితం రాదు. మరి ఏం ఫలితం రావాలి ఓంకారం చేస్తే అంటే breath దానంతటదే control అయిపోతుంది. ఆ శృతి ఏర్పడిపోతుంది. జపం చేసినా, భజన చేసినా, నామం చదివినా, మాట్లాడినా దానికొక స్థాయి, ఒక equalizer అంటాం. ఈ systems లో equalizers ఉంటాయి. ఆ equalizers అంతా శబ్దాన్ని నిలబెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పూర్వరంగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇవాళ మనం చతుర్థ స్కంధంలోకి వెళితే ఒక కథ మనం చెప్పుకుందాం. కథ చిన్నది. చాలా చిన్న కథ. ఉత్తానపాదుడు అనేటువంటి ఒక రాజు. ఆయనకి ఇద్దరు భార్యలు. సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు. వాళ్ళకిద్దరు పిల్లలు. ఉంటే ఓ రోజు ఈ సునీతి కొడుకు పేరు ధ్రువుడు. తండ్రి అంకం మీద రెండవ భార్య కుమారుడు వచ్చి కూర్చొని ఉండగా ఈ ధ్రువుడు కిందకు నుంచున్నటువంటి ధ్రువుడికి నిరాదరణ మనసుకు తోచి నేను నాకు తండ్రే కదా, నన్ను కూడా పిలిచి ఈ రెండవ అంకం మీద కూర్చోబెట్టుకోవచ్చు కదా, నన్నెందుకు ఈ నిరాదరణ చేస్తున్నారు అని కుమిలిపోతున్నటువంటి ఒక ధ్రువుడికి ఆలోచన కలిగింది. ఎవరో పిలిచేదేమిటి నా తండ్రి దగ్గరకు నేనే వెళ్ళాలి అనుకున్నాడు. అడుగు ముందుకు వేస్తున్నాడు.పెన్న తల్లి ఆపేసింది. నీకు అక్కడ కూర్చునే అర్హత లేదు అన్నది. ఉంటే నిన్నే పిలిచేవాడిని, నిన్ను పిలిచి ఉండేవాడిని. నువ్వు వెళ్ళిపో వెనక్కి అంది. ఎక్కడన్నా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకో గాని మీ తండ్రి ఇది అంకం మీద కూర్చోటానికి వీలు లేదు అన్నది. ధ్రువుడు కించపడ్డాడు. ఆత్మ న్యూనత కలిగింది. అవమాన భారం కలిగింది. మనస్సు గాయమైంది. గుండె బద్దలయ్యింది. ఇది జరిగింది. కానీ పిల్లవాడు ఏం చేస్తాడు? తండ్రి పెద్దవాడు, ఎదిరించలేడు, పైగా రాజు. రాజుకి చాలా ఇష్టమైనటువంటి పినతల్లి ఆ స్థానంలో ఉంది. పినతల్లి కొడుకు అప్పటికే తండ్రి అంకం దగ్గరికి చేరుకున్నాడు. తనకి దారి ఏది? దిక్కు ఏది? అని ఆ చాలా క్షేదపడుతున్న సమయంలో ఆ మాతృమూర్తి తల్లి కొడుకుని దగ్గర తీసుకుని, నాయనా! ఒక్కొక్కసారి శాపాలు వరాలు అవుతాయి. తిట్లే మనకి పొగడ్తలు అవుతాయి. నువ్వు దేనికి కించపడకు. మంచి పనే చేసింది. ఏముంది? వాడు ఆ తొర మీద కూర్చుంటాడు, కిందకి దిగుతాడు, ఆటపాటల్లో జీవితం గడుపుతాడు. నీకు ఒక సూచన చేసింది. విధి ఇట్లా మార్గోపదేశనం చేసింది. వీటిని దైవ రహస్యాలని, దైవ సంకేతాలు అని చెప్తారు. అవి తర్వాత గాని మనకి అది unfold కావు. బయటకు తెలియవు. ముందు ఏమిటి ఇట్లా జరుగుతుంది? ఏముంది ఆ కొడుకు అక్కడ కూర్చుంటే ఏమవుతుంది? అని అనుకుంటాం. కానీ తల్లి ఏం చెప్పిందంటే, అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పిందే అది, అది మాత్రమే పట్టుకో. ఎవరు చెప్తారు? నేనైతే నిన్ను అడవులకు వెళ్ళమని అనలేను కదా! నీ పినతల్లి కోపంతో అన్నదో, ఆవేశంతో అన్నదో, నీ పట్ల అయిష్టంతో అన్నదో, మన ఇద్దరినీ అవమానించాలని అన్నదో, అన్నదేమో అన్నది. అడవులకు వెళ్లి హాయిగా తపస్సు చేసుకో అన్నది. ధ్రువుడు నిశ్చయించుకున్నాడు. ఆ పేర్లు కూడా ఎంత చక్కటి పేర్లు భాగవతంలో పెట్టారో చూడండి. ధ్రువుడు అంటే ధ్రువత్వము అని అర్థం. పట్టుదల అని అర్థం. ఆ పట్టుదల ఏమిటంటే మళ్ళీ గౌరవాన్ని పొంది, ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు అని కాక ధ్రువుడి తండ్రి ఉత్తానపాదుడు అనిపించేలాగా నేను బయటకు వెళ్తాను అన్నాడు. అడ- అరణ్యాలకు వెళ్ళాడు. అఖండమైనటువంటి తపస్సు చేశాడు. అది మామూలు ఘోర తపస్సు అంటారు. ఘోర వాడకూడదు. అఖండ తపస్సు, ఆగని తపస్సు చేశాడు. ఆ తపస్సు అంతా కూడా ఏకోపాసన చేశాడు. ఏకదైవోపాసన చేశాడు. దానివలన ఎప్పుడైతే మనస్సు ఏకదైవోపాసన మీద నిలకడ చెందిందో, ఇంద్రాది దేవతలు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర ఇటువంటి వాళ్ళందరూ భయభ్రాంతులైనారు. అష్టదిక్కులు కూడా ఒక్కసారి అతలాకుతలమైపోయాయి. అంటే ఈ తపస్సు వలన పుట్టినటువంటి ఒక అగ్ని. దానిని త్రేతాగ్ని, తపోగ్ని, దావాగ్ని అని అనేక పేర్లున్నాయి. అందులో ఈ తపో అగ్ని చేత ఇక్కడ కనిపిస్తున్న ఈ లోకాలు మాత్రమే కాక, సూక్ష్మ శరీరంలో నిలకడ చెంది సంచారం చేసి భ్రమించి పరిభ్రమించేటువంటి అనేక లోకాలు తల్లడిల్లిపోయాయి. ఏమిటి? దేనిని గురించి తపస్సు చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. ఇంద్రుడు దేనికి భయపడ్డాడంటే, మళ్ళీ నా రాజ్యం మీదకి దండెత్తి నన్ను ఇంద్ర పదవి నుంచి తొలగిస్తాడేమో అందుకు ఏమో అని వాడు భయపడ్డాడు. కుబేరుడేమో నా సంపదలన్నీ హరించడానికేమో అని వాడు భయపడ్డాడు. మిగతా వాళ్ళంతా మా తపశ్శక్తి అంతా కూడా చిన్నది అయిపోతుంది వీడి ముందని అనుకున్నప్పుడు ధ్రువుడి వయస్సు అత్యంత పిన్న వయస్సు. అందుకనే భారతీయ అధ్యాత్మ అతి పిన్న వయస్సులో ప్రారంభం కావాలి. ఒక అపజయంలో నుంచి, ఒక అననుకూలతలో నుంచి, ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నుంచి అధ్యాత్మలోకి రాకూడదు. అది escape route కాదు, అది రాజమార్గం. అందుకనే అది రాజవిద్య. రాజవిద్య, రాజగుహ్య యోగం అంటే అదంతా అధ్యాత్మ. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు మనం కాస్త పెద్దవాళ్ళమైన మన తర్వాత తరాన్ని కూడా ఆ మార్గంలో చిన్నప్పుడే గనుక ప్రవేశపెట్టినట్లయితే వాళ్ళ జీవితానికి ఢోకా ఉండదు. వాడు పుట్టగానే engineer అవ్వాలి, doctor అవ్వాలి, IT అవ్వాలి, అమెరికా పోవాలి, రష్యా పోవాలి అని మనం నూరిపోస్తుంటే వాడికి వీటి పట్ల ఒక ప్రేమ ఎలా కలుగుతుంది? కలగదు. ఇది విజ్ఞాన సర్వస్వం ఇది. Encyclopedia భాగవతం. అర్థం చేసుకోగలిగితే. లేకపోతే అది కథా సంపుటి. నాలుగు కథలు, నాలుగు వ్యాధలు, ఏదో కష్టం రావటం, దేవుడు రావటం, దానిని తీర్చేయటం అయిపోయింది. కదా? కాదు. సరే తపస్సు మరి ఫలించాలిగా. తపస్సు, ఆయనకు స్వాధ్యాయం లేదు. తపస్సే స్వాధ్యాయం అయింది. తపస్సే ధ్యానం అయింది. తపస్సే యోగం అయింది. ఆ సమయంలో భగవంతుడు ప్రత్యక్షమై, నీకేం కావాలి? అని అడగలేదు. విచిత్రం! మిగతా అన్ని కథల్లో దేవుడు వస్తాడు. వచ్చి మళ్ళీ అక్కడ మాయా వల విసురుతాడు. ఆ మాయా వలలో ఇన్నేళ్లు తపస్సు చేసిన వాడు చిక్కుకుపోతాడు. ఏమిటంటే, ఏదో కోరుకుంటాడు. ఇది జరగాలి అని కోరుకుంటాడు. ఓ రాజ్యాన్ని జయించాలి, ఓ ఇంద్ర పదవి కావాలి, ఓ తపస్సు చేశాడు. దేవుడు వస్తాడు. ఎన్నేళ్లు చేశాడు? ఓ ఇడ పధ్నాలుగు ఏళ్ళు తపస్సు చేశాడు. పధ్నాలుగు ఏళ్ళ తర్వాత ఆయన పెద్దాయన వచ్చాడు, భగవంతుడు. ఏం కావాలి? అని అడుగుతాడు. వీడు నిజంగా పధ్నాలుగు ఏళ్ళు తపస్సు చేసి ఉంటే, ఏమడగాలంటే పధ్నాలుగు ఏళ్ళు అయిపోయింది నాకు గుర్తు లేదు అనాలి. కానీ వాడు ఏమంటాడంటే, నాకు ఇంద్ర పదవి కోసమే తపస్సు చేశాను, అది ఇచ్చేయి అంటాడు. అంటే వీడు పధ్నాలుగు ఏళ్ళు తపస్సు చేసినట్లా? చెయ్యనిట్లా? చెయ్యనట్లే. భగవంతుడికి అది తెలుసు గనుక వాడికి ఆ ఇంద్ర పదవి ఇచ్చి ఆయనే వెళ్ళిపోతాడు. ఇక ఇంద్ర పదవి రావటం ఒక ఎత్తైతే, దాన్ని నిలబెట్టుకోవటం ఒక ఎత్తు.సంపద రావటం ఒక ఎత్తైతే దానిని నిలబెట్టుకోవటం ఒక ఎత్తు. ఏదైనా అంతే విద్య జ్ఞానము విజ్ఞానము అన్నీ ప్రపంచంలో మన చేతికి వస్తువు రావటం వరకు ఆరాటం ఉంటుంది. పొందిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే భయం ఉంటుంది. ఆ తర్వాత ఇది నాది మాత్రమే అనే అహంకారం ఉంటుంది. నాకు తప్ప ఇది ఎవరికీ చెందకూడదు అన్న మమకారం ఉంటుంది. వస్తువును పొందటంలో ఇన్ని ఇబ్బందులున్నాయి. ఇవన్నీ ధ్రువుడికి లేవు. పసి మనసు అది కానీ గాయపడిన మనసు. ఒక అవమాన భారంతో తపస్సులో కూర్చున్నాడు ఆయన. ఈ తపస్సు అయిపోయిన క్షణానికి అతని మనసులో అవమాన భారం లేదు. తండ్రి ఉత్తానపాదుడు లేడు. తన తల్లి మాతృమూర్తి యొక్క రూపం మాత్రం లీలగా మెదులుతున్నది. ఆ తల్లి బోధ అరణ్యాలకు వెళ్ళు నాయనా ఈ వరాన్ని నువ్వు శాపాన్ని వరంగా మార్చుకో అని చెప్తున్న తల్లి మాట మాత్రమే గుర్తున్నది. తనను అవమానించిన పెనతల్లి కూడా గుర్తు లేదు. కనుకనే భగవంతుడు ఇతడు అడగకుండానే ఏం చెప్పాడంటే, నీకై ప్రత్యేకంగా ఒక గ్రహ తారక మండల నిర్మాణం చేస్తా. ఆ మండ-ఆ మండలము నీది. తారక మండలం నీ చుట్టూ అన్నీ గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. అక్కడికి ఎవ్వరూ రాలేరు. ఎవ్వరూ అందుకోలేరు. అది ఎటువంటి మండలం అంటే ఒక ప్రళయం సంభవిస్తే మిగతావన్నీ కుప్పకూలి పోవచ్చు గాక కానీ ధ్రువ మండలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రళయ కాలంలో కూడా సృష్టి అంతా సున్నా అయిపోవచ్చు. మనం అనుకునేటువంటి పధ్నాలుగు లోకాలు ఏమీ కాకుండా పోవచ్చు. కానీ నిశ్చలమై, నిశ్చితమై, కచ్చితంగా ఉండేటువంటిది ఏది అంటే ధ్రువ మండలం. అందుకనే యోగేశ్వర కృష్ణుడు కూడా నీతి ధ్రువంగా ఉండాలి అంటాడు. ధ్రువము అంటే పట్టుదల అంతే. [దైవ వాక్యం చదువుతున్నాడు] దృఢమైన నీతి ఉండాలి. దృఢమైన సంకల్పం ఉండాలి. దృఢమైన పటుత్వంతో కూడినటువంటి మాట ఉండాలి. దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. దృఢమైనటువంటి ఆలోచన ఉండాలి. దృఢమైన దర్శనం ఉండాలి. ఏది చేసినా దృఢత్వంతో నిశ్చయమైనటువంటి భావనతో ఉండాలి. కనుక ధ్రువ చరిత్ర మనకు ఏం చెప్తుందంటే, మూడు విషయాలు బోధిస్తుంది. నీకంటే పెద్దవాడుగా కనిపిస్తున్న వాడితో నువ్వు ఎప్పుడూ పోల్చుకోవద్దు. వాడు ఎప్పుడూ వాడు పెద్దవాడే. ఆ పెద్దవాడు పెద్దవాడిగా ఉంటుంటాడు. నువ్వు పెద్దవాడివయ్యే ప్రయత్నం మాత్రం వదిలిపెట్టొద్దు. ఒకటి. ఇది జీవన సూత్రం. ధ్రువ-ధ్రువ ఉపాఖ్యానం చాలా చిన్నది. ఆ అంతా కలిపినా మూడు నిమిషాల్లో అయిపోతుంది. కానీ నీతి చాలా ప్రధానమైనది. మనకంటే చాలా పెద్దవాడు ఒకాయన, చాలా గొప్పవారు ఒకాయన ఉన్నారు. నువ్వు ఎంత ప్రయత్నించినా గొప్పవాణ్ణి దాటి వెళ్ళలేవు. అది పెద్ద గీత. మరి నువ్వేం చేయాలి? అక్కడి దాకా అన్న వెళ్లే ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి? మర్యాద ద్వారా, గౌరవం ద్వారా, ఆ సత్ప్రవర్తన ద్వారా, మంచి సంకల్పాల ద్వారా, ప్రేమ ద్వారా, సేవ ద్వారా నువ్వు ఆ స్థాయికి వెళ్లగలుగుతావు. ఎప్పుడు? అది దృఢమైన సంకల్పం అయితే. సరే, కారణం ఏంటంటే కృష్ణుడి కథలో కృష్ణుడి సమయంలో ఒకడున్నాడు. వాడు అచ్చంగా కృష్ణుడు వేషం వేసుకుని తిరిగేవాడు లోకంలో. వాడి పేరు పౌండ్రక వాసుదేవుడు. అసలు ఆయనకీ నాకూ పెద్ద తేడా ఏముంది? ఆయన నేను ఒకటే. ఆయన చేతిలో ఉన్నట్టే నా దగ్గర పిల్లను గ్రోవి ఉంది. ఆయన పెట్టుకున్నట్టే నేను కిరీటము, పించము పెట్టుకున్నాను. నేను కూడా ఆయన లాగానే ఉన్నాను అని అనుకుని అసలు నేనే కృష్ణుడు అన్నాడు. నేనే వాసుదేవుడిని అన్నాడు. పౌండ్రక వాసుదేవుడు. వాడు నకిలీ. కాబట్టి ప్రపంచంలో అకల్ ఒకటే ఉంటుంది. నకళ్ళు బోలెడుంటాయి. కాబట్టి ఈ రెండవ విషయానికి వచ్చినప్పుడు నీదైనటువంటి నీ సామ్రాజ్యాన్ని, నీదైనటువంటి స్పేస్ ను నువ్వు క్రియేట్ చేసుకోవాలి ప్రపంచంలో. ఎవరూ నీకు క్రియేట్ చేసి ఇవ్వరు. ఆ క్రియేట్ చేయటానికి చాలా ఇబ్బంది పడాలి. అంటే త్యాగం చేయాలి. కాల త్యాగం చేయాలి. అనేకమైన అభిమానాలు వదిలిపెట్టాలి. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఇది నేను చేయొచ్చునా, చేయకూడదా ఇది ఉండకూడదు. నీ సంకల్ప శుద్ధి ప్రకారం నువ్వు నిరంతరము శ్రమించి వెళ్ళాలి. దీనికి ఒక ఉదాహరణ ప్రాయంగా మన సత్యసాయి భగవానుడి జీవిత చరిత్రను మీరంతా చదవని వారు ఎవరూ లేరు. చదివి ఉంటారు. మరి ఆయన పుట్టుక ఎక్కడ? పుట్టపర్తిలో. ఆ పుట్టపర్తిలో ఇల్లు తక్కువ, పుట్టలు ఎక్కువ. మనుషులు చాలా తక్కువ, పాములు ఎక్కువ. నీటి చుక్క లేదు. తినటానికి గింజ మెతుకు లేదు. అటువంటి ప్రదేశంలో స్వామి అవతారం కాలిచి ఇవాళ రాజాధిరాజులందరూ, ప్రపంచంలో నెంబర్ వన్ అనిపించుకున్న వాడు కూడా స్వామి పాదపీఠం దగ్గరికి వచ్చారు. ఏమిటి కారణం ఏమిటి? స్వామిది అవమానంలో నుంచి వచ్చినటువంటి పరిణామం కాదు. ఒక అవతార వైభవంలో నుంచి కాంతులీనినటువంటి ఒక దివ్య ప్రభాసంపన్నమైనటువంటి భావన. అందుకని గాంధీ గారి దగ్గర నుంచి ఇప్పటివరకు గ్రామ సేవ చేయండి, గ్రామ సేవ చేయండి, గ్రామ పట్టుగొమ్మలు మన మాటలు వింటూ వింటూ చెవులు మూసుకుపోయినాయి. అసలు గ్రామాన్ని ఎలా నిర్మాణం చేయాలో, ఒక సమగ్రమైన గ్రామాన్ని ఎలా చేసి-చేస్తే ప్రపంచానికి ఆదర్శవంతం చేయగలమో దానిని భౌతిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక మూడు స్థాయిల్లో పుట్టపర్తి అనే చిన్న గ్రామం కూడా కాదది. కుగ్రామం. ఆ కుగ్రామాన్ని ప్రపంచ పటం మీద నిలబెట్టారు. ఎలా నిలబెట్టారు? ఆయన దగ్గర డబ్బుందా? లేదు. రాముడికి డబ్బుంది. కోశాగారం ఉంది. మంత్రులున్నారు. రాజులున్నారు. తొంభై తొమ్మిది మంది ఇక్ష్వాకు రాజుల్లో రాముడు అరవైనాలుగో రాజు. అరవై మూడు దశరథుడు, అరవైనాలుగు మన రామచంద్రుడు. రామచంద్రుడు వచ్చేపటికే కోశాగారం ఉంది, మంత్రాంగం ఉంది, వశిష్టుల వారి వెంట పురోహితులున్నారు, రాజ్యం ఏర్పడింది, ప్రజలంతా ఉన్నారు, వ్యవస్థ ఉన్నది, డబ్బు ఉన్నది, చేయవలసిన పనులు అరవై మూడు మంది రాజులు చేస్తూనే ఉన్నారు. అయితే సత్యసాయి భగవానుడు రాజు కానీ రాజు. రాజులను చేయగలిగిన రాజు. కనుక ఆయనకి డబ్బుతో పని లేదు. ఆయన సంకల్పమే ఆయన ఐశ్వర్యం. ఆయన శక్తే ఆయన అస్త్రం.