Skip to content
Transcript తెలుగు
విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడు "కాలాన్ని గమనించు, చూడు నీ కళ్ళ ముందే ధృతరాష్ట్రుడు ఏమైపోయినాడు, గాంధారి ఏమైపోయింది, అంతఃపురాలు ఏమైపోయినాయి, ఉన్న సంపదలన్నీ హరించుకుపోయినాయి, కన్న బిడ్డలందరూ వెళ్లిపోయినారు. ఇక రాజ్యానికే రారు. వీళ్ళు ఇంకా ధర్మానికి దూరంగా ఉన్నారు. వీళ్ళు మనం అడ్డు తొలగించుకుంటే చాలు అని ఐదుగురు వచ్చి రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టారు. వీటి అన్నింట్లో ఉన్నటువంటి కుంతి అస్త కష్టాలు పడింది బిడ్డల కోసం. ఆమె కైవల్యం పొందింది. ద్రౌపది అక్కడే ఉన్నది, రాజా అనుభవాలన్నీ పొందుతూ అక్కడ ఉన్నది. కాబట్టి కాలాన్ని నువ్వు తక్కువగా వేయద్దు విదురా. కాలం మనం శాసించలేము. చూడు రఘువంశపు రాజులలో సత్య హరిశ్చంద్రుడు ఏమైనాడు, ఎటువంటి వాడు ఆయన? ఒక నిజం, ఒక మాట ఇచ్చినందుకు సర్వము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకునేట్లుగా మాట ఎందుకిచ్చాడంటే అది కాల మహిమ. రాముడు అరణ్యవాసానికి వెళ్ళటం కాల మహిమ. మహా శక్తివంతమైనటువంటి రావణ బ్రహ్మ పది తలలు తెగి నేల మీద పడటానికి కాలమే, శివుడు రక్షించాడా? అతని శాస్త్ర జ్ఞానం రక్షించిందా? అతని భక్తి రక్షించిందా? కాలము అన్నింటినీ హరిస్తుంది. కనుకనే కాలానికి కాల సర్పము అని పేరు. కాలము సర్పమై హరిస్తుంది. అది లోపలికి లాక్కుంటుంది. అది ఎప్పుడు ఎలా లాక్కుంటుందో మనకు తెలియదు. కనుక పరీక్షిత్ మహారాజు అనబడేటువంటి వాడు తక్షకుడు అనేటువంటి కాల సర్పము యొక్క శక్తికి లోబడకుండా అట్లా మరణించకుండా ఉండటానికి మార్గం ఏమిటి? ఒకవేళ మరణించానేది ఎలా మరణించాలి? తెలుసుకునే తెలుసుకోకుండానా, తెలుసుకొని ఆనందంతో ఒక నిష్ఠతో సంసిద్ధతతో మృత్యువుని ఎదుర్కోవటమా, లేదు కాలానికి విషమై పోవడం అంటే. నిజమే మరి పరీక్షిత్ మహారాజుకు కూడా చిన్న తప్పు, ఆయన ఆవేశంలో చేసిన చిన్న తప్పు పెను ముప్పయింది. ఆయన జీవితాన్ని కబళించి వేసింది. దీనికంతా కాలమే మహిమ కాదా, కాలం కాదా అన్నాడు." కాబట్టి అధ్యాత్మలో ఇవాళ మనం గురువుగారు అయిపోవడం పెద్ద కష్టం కాదు. అసలది గురువుగారు కాకూడదు నా దృష్టిలో. అసలు ఎవరు ఎవరికి గురువు? ఎవరు? మన అంతఃచేతనను మించిన గురువున్నాడా? మన లోపల ఉన్న సంస్కారాన్ని మించిన గురువు మరొకడు బయట ఉన్నాడా? అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమగురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. సత్యసాయి బాబా చెప్పారు "కాలాన్ని మించిన గురువు నీకు ఎవ్వడూ లేడు." చూడండి, మొన్న మనం లక్నో నుంచి నమిషారణ్యానికి వస్తూ ఉన్నాం. కేవలం ఒక ముప్పై ముప్పై ఐదు నిమిషాలు మనం అనుకున్న టైంకి రాలేక అక్కడ ఎంతో కారణం వల్ల కాసేపు ఆగిపోయినాం. ఆగిపోయినప్పుడు మనం కాల బద్ధులమై ఆగిపోయాం. కారణమే లేదక్కడ. ఎలా ఎందుకు ఆగామో తెలీదు, మళ్ళీ ఎందుకు బయల్దేరామో కూడా తెలీదు. కానీ మధ్యలోనే మన దగ్గర అందరి దగ్గర డబ్బులున్నాయి. డబ్బులు లేకుండా ఎవరూ బండి ఎక్కలేరు. కానీ తినటానికి మన దగ్గర ఏమీ లేదు. చూశారా? తినటానికి ఏమీ లేకపోతే ఒక సాధకుడు రాడు. తన కోసం తెచ్చుకున్నటువంటిది ఉన్న వాళ్ళందరికీ తలా కాస్త పంచిపెట్టింది. కాల బద్ధమై మనం ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉన్నామో పరమేశ్వరుడు ఆహారాన్ని అందించాడు. అప్పుడు చిన్న బిస్కెట్ ఒక్కటే కొన్ని ఒక గంటా రెండు గంటలు మనం నిలబెట్టగలిగింది. అంటే ఇది ఎందుకు జరగాలి ఇలాగ? అక్కడి నుంచే చక్కగా వచ్చాం కదా, ఇక్కడిదాకా వచ్చి వాకిట్లో ఆగిపోవడం ఏంటి? అది నడిచే దూరం కాదు, అక్కడ ఉండిపోయే పరిస్థితి కాదే. అంటే కాల బద్ధంగానే అన్నీ జరుగుతాయి. కాల ప్రకారమే జరుగుతాయి. మీకిక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కాలం ఎంత గొప్పది అంటే స్వామి కాలానికి ఇచ్చినంత విలువ దేనికీ ఇవ్వలేదు. గోగినేని రామబ్రహ్మం గారని ఒకాయన ఉండేవారు. ఎక్కడ? బెంగళూరులో, వైట్ ఫీల్డ్ లో. ఆయన చాలా ఉదాత్తమైన భక్తుడు. చాలా గొప్పవాడు, పెద్దవాడు కూడా. స్వామి కంటే కూడా వయసులో పెద్దవాడు. కానీ సద్భక్తుడుగా ఆయన సేవ చేస్తూ He was the caretaker of Whitefield ఆశ్రమం రోజుల్లో. ఒకరోజున స్వామి పిలిచారు, పేరు పెట్టి పిలిచారు. రమణ అని పిలిచారు. ఈయన response ఇవ్వలేదు. అక్కడే ఉన్నాడు, ఏదో పనిలో ఉన్నాడాయన. స్వామి ఎవరినో కబురు పెట్టారు. కబురు పెడితే స్వామి పిలుస్తున్నారంటే పని అయిపోగానే వస్తానని చెప్పు, ఇప్పుడే వస్తాను అన్నాడాయన. చాలా మర్యాదగానే. సరే, ఈయన పని చేస్తూ ఉన్నాడు. పక్కన ఒక పెద్ద చెట్టు ఆయన పక్కన కూలి పడిపోయింది. ఈయన ఒక్కసారి పక్కకు తప్పుకొని చెట్టు పోతే పోయింది, ముందు స్వామి ఎందుకు పిలిచారని పాపం భక్తితో పరిగెత్తుకొని వెళ్ళాడు. వెళ్తే స్వామి పిలిచారట అన్నాడు. ఈయనేం మాట్లాడటంలా. స్వామికి ఏదన్నా కోపం వచ్చిందేమో అనుకున్నాడు. "స్వామి నేను వచ్చాను, పనిలో ఉండి అందుకని రాలేకపోయాను" అంటే "చూడు, కాలం అనేటువంటిది ఎవరికోసమూ ఆగదు. నీ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడనుకో, అతడు మరణ శయ్య మీద ఉన్నాడనుకో, ఇంకో రెండు ఒక అరగంటలో పోతాడు అన్నప్పుడు డాక్టర్ గారు life saving drug అయ్యా మీ తాతో నాయనో బతకాలంటే నువ్వెళ్లి పట్టుకురా అంటే మనవడు జేబులో పెట్టుకొని గనక ఎటో తిరిగి తాత ఎప్పుడు పోతాడో అప్పుడే పోడ్లే అనుకొని గనక వెళితే బతుకుతాడా మీ తాత? అలాగే కాలానికి లోబడి నువ్వు life saving drug గనక తెస్తే మళ్ళీ మీ నాయనో తాతో బతుకుతారు కదా. అలాగే రామబ్రహ్మం, నిన్ను ఎందుకు పిలిచాను అంటే చెట్టు పడిపోతుందని నాకు తెలుసు. నీ మీద పడకుండా చూట్టానికి నేను శ్రమ పడవలసి వచ్చింది. నేను పిలవగానే వస్తే నువ్వు ఆశ్చర్యపోయేవాడివి ఇంత చెట్టు ఎందుకు పడిపోయింది అని. కనుక మీరెప్పుడూ కాలాన్ని నిర్లక్ష్యం చేయకండి. time ప్రకారం రండి. పంక్చువల్ గా ఉండండి. రావటం చాలా ప్రధానం."అలాగే నియమిత కాలంలో నీకు ఇవ్వబడిన కాలాన్ని ఇంకొకళ్ళ కాలాన్ని ఒక్క నిమిషం కూడా హరించవద్దన్నారు స్వామి. మనకా హక్కు లేదన్నారు. ఎందుకంటే you can rob anything but not time. మన టైం తీసుకున్నామంటే టైం ప్రకారమే పని చేయాలి. అంటే కాలము ఎంత మహా మహిమాన్వితమైనదో, ఎందరి జీవితాలను తల్లకిందులు చేయగలదో, ఎందరిని సముదీర్ణమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్ళగలదో, దాన్నంతా కూడా తృతీయ స్కంధంలో చాలా తీవ్రమైనటువంటి విచారణ చేస్తూ ముందుకు తీసుకు వెళ్తూ ఉంటే హిరణ్యాక్షుడి కథ మనకు వస్తుంది దీంట్లో. చిన్న కథ, అది ఎంత చిన్న కథ అంటే అది కూడా కాలానికి లోబడినదే. శ్రీ మహావిష్ణువు, కథని కథగానే చూడం-చూద్దాం. శ్రీ మహావిష్ణువు దర్శనానికి ఎవరో మునులు వెళ్లారు. మునులు వెళ్ళగానే మునులు కూడా వెళ్ళగానే దర్శనమివ్వాలని కోరుకోవటం కూడా వీళ్ళ అహంకారమే. వీళ్ళు వెళ్ళినప్పుడు, కబురు పెట్టినప్పుడు ఆయన వచ్చినప్పుడు చూడాలి. కాదు మేము వచ్చాం గనుక ఆయన రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు. కానీ డ్యూటీలో ఉన్నటువంటి జయవిజయులు ఇద్దరు ద్వారపాలకులు ఏమన్నారంటే, "స్వామి ఇప్పుడు బయటకు రారు, మీరు కాసేపు ఉండండి" అన్నారు. "మా అంతటి వాళ్ళు వచ్చి స్వామి దర్శనానికి వస్తే మమ్మల్ని లోపలికి పోనివ్వరా? మీరు భూలోకంలో రాక్షసులై పుట్టండి" అన్నారు. రావణ కుంభకర్ణులు ఒక జంట. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు ఒక జంట. శిశుపాలుడు, దంతవక్త్రుడుగా మూడవ జంటగా వాళ్ళు పాపం మూడు జన్మలు ఎత్తాల్సి వచ్చింది. త్రేతాయుగం నుంచి ఇదిగో ఇక్కడ యుగం దాకా, కృతయుగం నుంచి ప్రారంభమై ద్వాపర యుగంలో శిశుపాలుడి దంతవక్త్రుల వధతో వాళ్ళ శాపవిమోచనం కలిగింది. మళ్ళీ వెనక్కి వెళ్లారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు రానే వచ్చాడు. పోనీ ఆయనకి అన్నీ తెలుసు కదా, ముందే రావచ్చు కదా. ద్వారపాలకులు ఇద్దరూ ఇలా అయిపోతారని తెలియదా ఆయనకి అని మనం ప్రశ్నిస్తాం. అదిగో హేతువాదులు ప్రశ్నిస్తారు. కాలానికి లోబడి భగవంతుడు కూడా ఉండవలసిందే. భగవంతుడు కాలాన్ని అధక్కరించడు. కాలాన్ని నేను ఆపేస్తానని అనడు. ఎందుకని అంటే కాలమే బలీయమైనది. కాలమే శ్వాస. కాలమే సంపద. కాలమే ఐశ్వర్యము. కాలమే విద్య. కాలమే అవిద్య. కాలమే అస్పష్టత. అన్నీ ఏర్పడటానికి చాలా తెలివిగలవాడండి ఇలా అయిపోయాడు అంటాం. కాల మహిమ. అట్లా అని కాలం మీద నిట్టూర్చేయమని కాదు. అలా జరగటానికి కాలం ఒక కారణం అనేది మనకి భాగవతం చాలా, భాగవత పురాణం నిజానికి స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనం పని చేసినా కాలబద్ధులమై చేయాలి. ఆశాబద్ధులమై చేయకూడదు, కాలబద్ధమై చేయాలి. కాలానికి అనుగుణంగా జీవించాలి. We have to travel with the time. time ఒక్కొక్కసారి ముందుకు తీసుకుని వెళ్తుంది, దాంతో వెళ్ళాలి. కాలం ఏం నిర్ణయిస్తుందో దానిలో తల ఉంచుకోవాలి. స్వామి చెప్తారు, "నువ్వు బాగా పొడుగు మనిషివి అయితే, ద్వారం చిన్నది అయితే కాస్త తల ఉంచుకో, బయటికి వెళ్ళొచ్చు. నీవు height తక్కువ వాడివి అనుకో, ద్వారం చాలా పెద్దది అనుకో, తల వంచే పని లేదు, ఢీవిగా వెళ్లిపోవచ్చు." కానీ ఎక్కడ వంచాలో, ఎక్కడ తల దించాలో, ఎక్కడ అహాన్ని అణచుకోవాలో, ఎక్కడ నేను నాది అన్నటువంటి అహంకారముని, శరీరాన్ని control చెయ్యాలో, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే, కాలము అనంత మహా ప్రవాహము ఇది. కాలంలో ఎవరు ఏమవుతారో తెలియదు. ఒడ్డుకి ఏది చేరుతుందో తెలియదు. రెండు దుంగలు ఒక నదిలో పడితే కట్టెలు, కట్టె దుంగలు అంటారు. రెండు కలిసే ప్రయాణం చేస్తూ ఉంటాయి. చక్కగా వెళుతూ ఉంటాయి. ఎక్కడో pressure పెరుగుతుంది నదికి. రెండు కట్టెల మధ్య నీటి ప్రవాహ వేగం వస్తుంది. రెండు కట్టెలు అటూ ఇటూ జరిగిపోతాయి. ఏది ఎటు వెళుతుందో, ఏది కొట్టుకుపోతుందో, ఏది ఎక్కడ ఆగిపోతుందో, ఏది ఎక్కడ మునిగిపోతుందో మనకు తెలియదు. కాబట్టి మనం దేనిని, అందుకనే కాళాయ నమః, కాలత్రయాయ నమః, కాలాతీతాయ నమః అని మనం చదువుతాం. అది, అది పరమేశ్వరుడికి కాలము పరబ్రహ్మ స్వరూపం. కాలాన్ని స్థిమితం తప్పకుండా అన్ని శ్రమలకి ఓర్చి తాను చేయవలసిన కర్తవ్యానికి తాను లోబడి ఎవరైతే ఉంటారో ఆతని పేరే యముడు, కాలబద్ధుడు. ఆయన చేతిలో ఉన్నదే కాలపాశం. కదా. కాలపాశం ఏమిటంటే క్షణాన ఎవరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలో ఆయనకి మనోఫలకం మీద బొమ్మ కనిపిస్తుంది. బొమ్మను పట్టుకుపోతాడు. కాబట్టి కాలానుబంది మనుష్యులకే, కర్మానుబంది కాదు. మనందరం కాలబద్ధులమై ఉండాలి. అందుకనే పరీక్షిత్ మహారాజు పేరు మీద భాగవత పురాణాన్ని వ్యాసులవారు రాసినప్పుడు దీన్ని ఇతిహాసంగా, కథగా అనుకున్నట్లయితే ఏడు రోజులలో భగవద్గీత పారాయణం, భగవద్గీత విచారణ ముగించమన్నారు. లేకపోతే ఇక్కడే నైమిశారణ్యంలో ఏడు నెలలు చెప్పుకోవచ్చు కథంతా. కానీ ప్రయోజనం లేదు. ఏడు రోజులలోనే చెప్పుకోవాలి. ఏడు రోజులంటే నిజానికి ఏడు ఇంటు ఇరవై నాలుగు చెప్పుకోవాలి. చెప్పగలిగిన వాడున్నా వినగలిగిన వాడు ఉండాలి కదా. కాబట్టి ఆధునికమైన neurology ప్రకారం మనిషైనా ఎంత ఉత్తమమైన ఉపన్యాసమైన, ప్రవచనమైన, గోష్ఠి అయినా కేవలం నలభై మూడు నిమిషాలు మాత్రమే వినగలడు. అనగలిగిన వాళ్ళ సంగతి పక్కన పెడదాం. వినగలగటానికి నలభై మూడు నిమిషాల తర్వాత మనస్సు తర్వాత ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, మళ్ళీ మనం ఇంటికి ఎలా వెళ్ళాలి, మనస్సు వెళ్ళిపోతూ ఉంటది, ఇక్కడేం ఉండదది. తెలుసు. Neurologyలో దాని శక్తి అంతే. forty five minutes లోగా గనక మనం చెప్పుకోగలిగితే, రోజు నలభై ఐదు నిమిషాలు ఒక classroom, time ఎందుకు పెట్టారు class time? అక్కడి వరకు చెప్తే చిన్న పిల్లవాడికి అది అర్థమవుతుంది. వాడి మనసులో register అవుతుంది. చెప్పుకుంటూ వెళ్ళిపోతే దీన్ని పూర్తి చేయటం కోసం చెప్పుకోకూడదు. కానీ పూర్తి చేయాలి గనక అనేకమైనటువంటి విషయాలను చెప్పుకుంటూ, ఇదిగో హిరణ్యాక్షుడి కథ కాసేపు మాట్లాడుదాం. ఉరికే, relief కోసం. కానీ దాంట్లో కూడా ఒక అధ్యాత్మ ఉన్నది. ఒక తత్వం ఉన్నది.ఈ హిరణ్యాక్షుడు మళ్ళీ జయవిజయులలో ఒకడు. ఒకసారి వాడి కథ వదిలిపెడితే వాడు వచ్చాడు. హిరణ్యము వైపు వాడి కన్ను పడుతుంది. హిరణ్యము అంటే బంగారం. వాడి కన్నంతా బంగారమే. బంగారానికి రెండు విధాల పేర్లున్నాయి. ఒకటి గోవు, అది బంగారం. రెండవది భూమి, అది బంగారం. భూమి బంగారం పోయింది ఇప్పుడు. చూర ఇంత పెద్ద భూమి One third of the whole creation is the land. మిగతా అంతా water'e. ఒక వంతు ఏదైతే ఉన్నదో భూమి ఎంత కలిపితే ఒక్క గోవు అవుతుంది. గోవుకి ప్రదక్షిణం చేయాలి అని ఎందుకు పెట్టారంటే మామూలుగా ఏదో దేవతల చుట్టూ తిరిగినట్లు అవుతుందని ఎవడో చెప్తాడు. కానే కాదు సమస్త భూమండలాన్ని మీరు ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది. అందువల్ల గోప్రదక్షిణం చేయాలి. గోప్రదక్షిణం రోజూ చేయాలంటే రోజూ అక్కర్లా, ఎవరు చెప్పారు? ఒకసారి చేస్తే చాలు. భూమండలం రోజూ తిరిగి వస్తామా? వరల్డ్ టూర్ ప్రతి నెలా వెళ్లి వస్తామా? ఎప్పుడో జీవితంలో ఒకసారి రెండు సార్లు వెళ్తాం. అంతే కదా! కాబట్టి హిరణ్యాక్షుడి కన్ను ఎక్కడ పడిందంటే, భూమి ఎక్కడ ఉన్నదీ, భూమి లోపల ఏమున్నదీ వాడికి కనిపిస్తున్నదంతా బంగారంగా కనిపించింది. కాబట్టి అసలు భూమిని తూపోతే అని వాడు దాన్ని ఏం చేశాడంటే ఒక చాపలాగా చుట్టేశాడు. ఇది fantasy ఇది కథగా కనిపిస్తుంది మనకి. కానీ వాడు చుట్టాడు. తీసుకొని వెళ్లిపోయినాడు. వెళ్లి ఎక్కడికి వెళ్ళాడు? భూమి మీద నీరు ఉండాలి, భూమి మీద సముద్రం ఉండాలి, భూమి మీద నది పారాలి. కానీ భూమిని నదీ జలాల లోపలికి సముద్రం లోపలికి తీసుకెళ్లిపోయి అక్కడ ఉంచుకున్నాడు. అంటే He owned the entire land. భూమి అనేది ఎక్కడ ఉందో మొత్తం ఆయన లోపలికి తీసుకొని వెళ్లిపోయినాడు అతను. వెళ్లి కూర్చున్నాడు. మరి భూమి లేకపోతే పంటలు లేవు, బంగారం లేదు, mines లేదు, చెట్లు లేవు, చామలు లేవు, పర్యావరణం లేదు. భూమి లేకపోతే ఏమీ లేదు. ఆమె మామూలుగా స్త్రీలు వాళ్ళ జీవిత కాలంలో గర్భవతులవుతారు. గర్భవతి ఎవరు అంటే భూమి, భూమాత. ఎన్ని సార్లు కంటుందో, ఎందరిని కంటుందో, ఎన్నెన్ని విషయాలను దాంట్లో నుంచి బయటకు తెస్తుందో. చదును చేసి అదును చేసినప్పుడు దానిలో నుంచి అద్భుతమైనటువంటి వాటిని సృష్టించగలిగినటువంటి మాత. అందుకనే మనం దేశంలో mother land అంటాం. భూమాత. మాతని వాడు పట్టుకుపోయినాడు. ఎప్పుడైతే తల్లి దూరమైందో, నిజానికి ఇబ్బందులు పడ్డ వాళ్ళంతా ఎవరంటే దేవీదేవతలు. అగ్ని లేదు, అగ్ని కార్యం లేదు, చెట్లు లేవు, చామలు లేవు, దానిలో ఔషధీ వృక్షాలు లేవు, దానిలో నుంచి పాలు లేవు, గోసంపద లేదు, ఏమీ లేదు. అన్నీ పోయినాయి. అప్పుడు ఆయన వరాహ అవతారమెత్తాడు. వరాహ అవతారం ఎత్తి తన ముట్టెతో అంటే వరాహం అంటే పంది. అవతారం ఎత్తాడు చూడండి భగవంతుడు మానవుడికి సేవ చేయడం కోసం ఎంత దిగి వస్తాడో ఆలోచించండి. ఆయన ఎత్తవలసిన అవతారం ఏనా అది. మరి ఎంతో ఒక చిన్న మామూలుగా ప్రమాణంలో ఆయన వచ్చాడు. వచ్చి నీళ్ళల్లోకి దూసుకుని వెళ్ళాడు. వెళ్లి మొత్తం విస్తరించడం మొదలు పెట్టాడు. It's beyond proportion. వెళుతూ వెళుతూ హిరణ్యక, హిరణ్యాక్షుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా ఒక చాప చుట్టు, చుట్టినట్టుగా చుట్టి తన రెండు కోరల మీద నిలబెట్టి భూమిని నీళ్ళల్లో నుంచి బయటకు విసిరేశాడు. అప్పుడు మళ్ళీ ఈవేళ వరాహ అవతారంలో వచ్చిన భూమి ఇది నాది, boundaries నావి, గట్లు నావి, తొట్లు నావి, చెట్లు నావి అని మనం కలహించుకుంటున్నాం. ఎక్కడైనా వరాహ అవతారానికి సంబంధించిన విషయాన్ని ఎక్కడైనా ఎవరైనా స్పృశిస్తున్నారా? లేదు. పైగా దేవుడు ఏమిటండీ, పంది అయి రావటం ఏమిటండీ అంటాడు వాడు. తెలుసుకోగలిగినట్లయితే పంది అవతారం ఆయన ఎందుకు ఎత్తాడంటే ఆయన జోలికి ఎవరూ వెళ్ళరు. ఆయన పని మీద వెళ్ళినప్పుడు ఆయన్ని ఎవరూ తాకరు. లోపలికి వెళ్ళాడు భూమిది, భూమిని బయటకు నీటికి పైకి విసిరేశాడు. తను లోపల ఉండిపోయినాడు. ఇక మిగిలి, దిక్కు లేక మిగిలిన వాడు ఎవరంటే హిరణ్యాక్షుడు గనుక. తనకున్నటువంటి రెండు కోరలతో వాడిని చంపేశాడు. link మళ్ళీ మనకు దశమ స్కంధంలో కనిపిస్తుంది. మధ్యలో కథ రాదు. ఇక్కడ హిరణ్యాక్షుడు ఇలా కావడానికి కారణం ఏమిటని విచారణ చేస్తే కాలమే విచారణ. కాలమే కారణం. కాలం గనుక వాడికి బుద్ధిని ప్రేరేపించకపోతే వాడు పని చేసేవాడా? వాడు ఏలుకోవటానికి, వాడు ఒంటిమీద పెట్టుకోవటానికి ఎంత బంగారం వాడు మోయగలడు? వాడు ఒక వంద కిలోలు వాడు ఉన్నట్లయితే కనీసం వంద కిలోల బంగారం మోయగలడా? మోయలేడు. కానీ భూమి మొత్తాన్ని ఎందుకు తీసుకెళ్ళాడంటే బంగారం అంటూ ఉంటే అది నాకు మాత్రమే ఉండాలి ఎవరికీ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. వాడి కన్ను హిరణ్య అక్షుడు. హిరణ్య గర్భుడు ఎవరు? పరమాత్మ. హిరణ్య అక్షుడు ఎవరు? ఇదిగో రాక్షసుడు. సాక్షర స్వరూపము, అక్షర is పరమాత్మ. రాక్షస దాన్ని తిప్పి చదివితే రాక్షసుడు ఎవరంటే ఇటువంటి అసుర జాతి. వీళ్ళంతా కూడా బుద్ధి చోదితమై, ప్రజోదితమైనటువంటి వాళ్ళంతా కూడా కాలబద్ధులై పనులన్నీ చేస్తారు. కాలం ఎప్పుడూ మన వైపే ఉంటుంది, కాలాన్ని మనం జయించేశాం, మనం మనకి ఇంకా తిరుగులేదు అన్నవాడు రేపు పొద్దున He has to bite the dust. నేల మీద పడి పొర్లుతున్నప్పుడు లోకం వాడిని పట్టించుకోదు. కారణం ఏమిటి? తన అహంకారమే, తన దంభమే, తన గర్వమే, తన దురాశే, తనకున్నటువంటి తీవ్రమైనటువంటి కాంక్షే, వాడిలో ఉన్న తామస, రాజస గుణాలు రెండు పూర్ణంగా విజృంభించినప్పుడు జరిగేది ఇదే. మరి భగవంతుడు రూపంలో వస్తాడు, ఎలా వస్తాడు మనకి తెలియదు. అందుకనే భగవంతుడు ఎట్లా ఉన్నాడు అని కాకుండా, ఎక్కడ ఉన్నాడు అని కాకుండా, ఎప్పుడు వస్తాడని కాకుండా వేదం చెప్పిన మాట అసలు పరా ప్రకృతి అంతా కూడా దీనికి అనాత్మ అని పేరు పెట్టారు.ఈ అనాత్మకి ఏమిటి అంటే రూపాయికి నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా పరమేశ్వరుడు గనుక బొమ్మ అయినట్లయితే లేదా బొరుసు అయినట్లయితే రెండోవైపు ఉన్నది అనాత్మ. ప్రకృతి అంతా కూడా నిజానికి పరమాత్మ యొక్క స్వరూపమే. అందువలనే పరమాత్మ మనకు కావలసినవన్నీ అందిస్తూ భూమిని, భూధర్మాన్ని, కాలుష్యాన్ని అన్ని భారత్రోలి అన్ని ధర్మాలను రక్షిస్తాడు గనుక కాలబద్ధమైనటువంటి స్థితిలో హిరణ్యాక్షుడు గనుక ఉంటే వాడు కొంత రాజ్యాన్ని కొంతకాలం ఏలుకొని వెళ్ళిపోయి ఉండేవాడు. చివరికి ఏమైంది? సర్వమూ నాశనమైపోయింది. హిరణ్యాక్షుడు ఒక అసురుడుగా ఉండిపోయినాడు. అయితే దాన్ని positive గా మనం ఏం చెప్తాం అంటే శాపవిముక్తుడై వైకుంఠానికి వాళ్ళ అన్నగారితో పాటు వెళ్ళాడో ముందు వెళ్ళాడో అని మనం చెప్తాం. అది ఉపశమన వాక్యం. కానీ చేసిన కార్యకలాపం మంచిది కాదు. కాబట్టి ఇవ్వబడినటువంటి కాలంలో మనకివ్వబడినటువంటి మనకు వంద ఏళ్ళు ఇచ్చాడు. మనం కూడా చదువుతాం. నిన్న కూడా మన వేదపండితులు అక్కడ కూర్చొని "జీవామ శరదమ్మమ" అని చదివారు. మనం అనుకోవాలట. ఏమనుకోవాలి అంటే నేను ఇక్కడ నూరు వసంతాలని శరత్కాలాలను చూడాలి. నేను hundred years ఇక్కడ ఉండాలి అని కోరుకోవాలి. కోరుకుంటూ ఉంటామా? ఉంటామో ఉండమో కోరుకోవాలి. ఏదో అన్ని పనులైపోయాయి retire అయిపోయాను పిల్ల పెళ్లయింది పిల్లవాడు పైకి వచ్చాడు. నాకేం లేదు హాయిగా నేను వెళ్లిపోతా. ఎక్కడికి వెళ్లిపోవు? నీ time అయ్యేదాకా నిన్ను తీసుకెళ్లేవాడు లేడే. వాడికి పని లేదా? కాబట్టి "జీవామ శరదమ్మమ" అరవై ఏళ్ళు నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, నా సమాజం కోసం అంత పని చేశా. మిగిలిన కాలమంతా భగవద్ధ్యానంలోనే గడపాలి. పరీక్షిత్ మహారాజు అంతటి వాడికి ఏడు రోజులు కూడా మిగల్లా. కేవలం ఏడు రోజులు మిగిలింది. మనకు అరవై ఏళ్ళ నుంచి వందేళ్ళు నలభై ఏళ్ళ నిడుపాటి జీవితం భగవంతుడు ఇస్తే ఇంకా సంపాదన ఇంకా ఏదో కావాలి. ఒకానొకప్పుడు retire అయిపోతే హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. ఇవ్వేళ retire అయిన తర్వాత post retirement appointments వచ్చినాయ్. retire అవుతున్న ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇరవై ఏళ్ళు. ఇది అంతు లేదు. కనుకనే భారతీయమైనటువంటి అధ్యాత్మ, భారతీయమైన సంస్కృతి, భారతీయమైనటువంటి కుటుంబ విలువలు అన్నీ కూడా డబ్బు అనే ఒక్క దానికి లొంగిపోయినాయ్. అక్కడ అవి బానిసలైపోయినాయ్. ఇది కూడా కలియుగ కాల మహిమగా మనం భావించాలి. ఎప్పుడైనా అనుకున్నామా దేశంలో మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు దేశ మన్నులో పెరిగి ఇక్కడ గాలి పీల్చి దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళిపోతారని. వెళితే వెళ్లారేమో మళ్ళీ వస్తారో రారో తెలియని పరిస్థితి. అట్లాగే అక్కడ వాళ్ళంతా రాత్రిపూట వాళ్ళకైతే మనకిది పగలై మనకిది పగలైతే వాళ్ళకి రాత్రై మనం ఉండవలసిన రీతిలో ఉండకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? అంటే అమితమైన సంపదల పట్ల అపేక్షే కారణం. కారణం కోరికలు కారణం. కోరికలకి కారణం మన వాసనలు కారణం. వాసనలకు మళ్ళీ మూల వాసనలు కారణం కాబట్టి ఇవన్నీ కూడా కాల మహిమ ప్రకారమే. కలికాల ప్రభావం చేత ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. లేకపోతే ద్రోణాచార్యుడు వంటి వాడు కొడుకైన అశ్వత్థామ పడుకున్న పసికందుర్ని తలలు నరికి తీసుకెళ్లటం ఏమిటి? కలి ప్రవేశించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథి అయిన కృష్ణ పరమాత్మ అక్కడ ఉండగా అధర్మ యుద్ధాలు ఎన్ని జరిగినాయ్? కాల మహిమ. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరి రాజ్యాన్ని వాళ్ళకి అప్పజెప్పి ధర్మాన్ని స్థాపించాను నా వచ్చిన పని అయిపోయింది అని ద్వారకకు వెళ్ళిన తర్వాత యదువంశం ఆయన కళ్ళ ముందే నాశనమైపోవడం ఏమిటి? యదువంశంలో ముసలం పుట్టడం ఏమిటి? ఆయన అరణ్యంలో ఏకాంతంగా ఎవరూ లేకుండా దేహం వదిలిపెట్టడం ఏమిటి? కాల ప్రభావం. కాబట్టి కలికాల ప్రభావం. కలి మహాభారత సంగ్రామానికి శ్రీకారం చుట్టిన మరుక్షణమే యుద్ధరంగంలోకి సేనావాహీనులు ప్రవేశించిన మరుక్షణమే అర్జునుడి రథం కింద కలిపురుషుడు కూర్చొని ఉన్నాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడికి కోరిక పుట్టింది. "బావా రథం మీద నుంచి నేను యుద్ధం చేసి గెలిచాను గనుక రథాన్ని మనం ఇంటికి తీసుకెళ్దాం" అన్నాడు. "నువ్వు ముందు వెంటనే కిందకి దిగు" అన్నాడు. "కాదు కాదు చాలా బాగుంది రథం నాకు అచ్చొచ్చింది" అన్నాడు. అంటే కలిసొచ్చింది అన్నాడు. "నువ్వు ముందు దిగు" అన్నాడు. ఇహ రెండు సార్లు అనేప్పటికి దిగాడు. ఒక్కసారి భస్మం అయిపోయింది. ఎందుకని? ఎలా భస్మం అయిపోయింది? కలిపురుషుడు అక్కడ ఉన్నాడు కింద. దానిని వాడు భస్మం చేయటానికి వస్తాడు. ఇక రెండవది అప్పటివరకే రథం మీద వైరి సైన్యాలన్నీ కూడా అనేకమైన అస్త్రాలు శస్త్రాలు మంత్రతంత్రాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసిన కారణంగా రథం అనేక విధాల pollute అయిపోయి ఉన్నది. దాని యందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వేడి ఏర్పడింది. దాని కారణంగా అది భస్మం అయిపోయింది. దిగి ఉండకపోతే అర్జునుడు మిగిలేవాడు కాదు. మిగలకుండా ఉండటం మిగిలేట్టు చేయటానికి ఒక ఆపద్ధర్మంలో రక్షణ చేయటానికి పెద్దగా పోయేదాన్ని కొద్దిలో పోయేట్టుగా చేయటానికి వచ్చిన వాడే పరమాత్మ అవుతాడు. అందుకనే శ్రీకృష్ణుణ్ణి కృష్ణ పరమాత్మ అంటాం. అందుకే "కృష్ణం వందే సనాతనం" అని మనం వేదవాక్యం. "రామో విగ్రహవాన్ ధర్మః" రాముణ్ణి గురించి ధర్మం ఎట్లా చెప్తామో "కృష్ణం వందే సనాతనం" ఎన్నేళ్లుగా ఎన్ని యుగాలుగా కృష్ణుడు కృషిగా ఆనందంగా ఆకర్షణగా ఉన్నాడో చెప్తూ హిరణ్యాక్ష వధ నుంచి మనం నేర్చుకోవాల్సింది కాలాన్ని గురించి కాల ప్రభావాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నాకు ఏమీ దిగులు లేదు నన్ను జయించగలిగిన వీరుడే పుట్టలేదన్న ప్రతి వాడు నశించిపోయినాడు. నేను ఏం చేయగలను? నేను నిస్సహాయుడిని భగవంతుడి దయ నా మీద లేదు అనుకున్న ప్రతి వాడు సర్వోత్తమమైన స్థాయికి వెళ్ళాడు. దీనికే వేద ప్రామాణికమైనటువంటి ఒక adage ఒక మాట ఏమిటంటే "దురాత్ దురాత్ అంతికేచ".ప్రశాంతి నిలయంలో స్వామి సింహాసనంలో వారు కూర్చొని ఉండగా మనమందరం కూర్చున్నాం. సరే front row లో మనం ఉన్నాం last row లో ఎవరో ఉన్నారు ఎవరో మనకు తెలియని ఒక మనిషి ఉన్నాడు. దూరంగా ఉన్న మనిషి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఎప్పటికైనా నేను స్వామి దగ్గరకు వెళ్లగలుగుతాన? అక్కడి దాకా వెళ్లి దగ్గరగా ఆయన్ని చూడగలుగుతాన? ఎప్పటికైనా మాట్లాడగలుగుతాన? దూరంగా ఉన్నవాడు అనుకుంటున్నాడు. దగ్గరగా ఎదురుగా కూర్చున్న వాడు రోజూ వచ్చినట్టే స్వామి వచ్చారు, స్వామి రాక ఏం చేస్తారు? "He will come by seven forty five evening by four thirty he will come" అని వీడు చెప్తున్నాడు. దూరాత్ దూరాత్ అంతికేచ మరి భగవంతుడు ఏమనుకుంటున్నాడని ముందు కూర్చున్న వాడిని వదిలేద్దాం last లో కూర్చున్న వానిని వదిలేద్దాం. భగవంతుడు ఎవరి కోసం ఉన్నాడో తెలుసునా? చివర కూర్చున్న వాడి కోసం ఉంటాడు. అందుకని గబగబా ఆయన మెట్లు దిగి అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్లి అతనికి దర్శనం ఇచ్చి పాపం మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటారు. ముందు కూర్చున్న వాళ్ళ గురించి ఆయన పట్టించుకోరు. ఎందుకని నేను ఇప్పటికే దగ్గర అయిపోయాను, నేను చాలా సన్నిహితుడిని, నన్ను ఎంత అదృష్టం లేకపోతే నాకు front row వచ్చింది ఇవన్నీ ఉంటాయి. కాబట్టి భగవంతుడు కాల నిర్ణయం చేసినప్పుడు కాల ప్రభావం చేత తపస్సు అనండి, ఎదురు చూపు అనండి, వ్రత దీక్ష అనండి, లేదు భగవంతుడు నాకు దూరం అయిపోయాడేమో, దూరంగా ఉన్నానేమో, చేరుకోలేనేమో అన్న భావన కలిగినప్పుడు భగవంతుడే మన దగ్గరికి వస్తాడు. మధ్య ఒక interview లో కూడా చెప్పాను interview లు తీసుకున్న వాళ్ళందరూ మహితాత్ములని వాళ్ళంతా పుణ్యాత్ములని వాళ్ళు చాలా ప్రత్యేకంగా పుట్టారని మనం అనుకోనక్కర్లేదు. ఎందుకంటే నేను ఇచ్చిన జవాబు ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్ళని room వరకు తీసుకెళ్లి మళ్ళీ room బయట స్వామి వదిలిపెట్టారు. అనుభవం లేని వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంటి దాకా స్వామి వెళ్ళి వదిలిపెట్టి వచ్చారు. అది. వాళ్ళ ఇంటి దాకా అక్కడికి చేరేదాకా బాధ్యత తీసుకున్నారు. అంటే భగవంతుడు కాలము రెండూ భిన్నం కావు. భగవంతుడే కాలం. మనసే భగవంతుడు. భాను, కృష్ణుడు, సాయి వీళ్ళే కనిపిస్తారే మరి కాలం కనిపించదేమంటే కాలానికి పూజ చేయాలి మనం. అందుకని త్రికాల సంధ్యా వందనం పెట్టారు. త్రికాల మూడు కాలాల్లో వందనం చేయాలి, నమస్కరించుకో. దానికి కులం లేదు, జాతి లేదు, మతం లేదు. Gayatri is a universal prayer. అది అందరూ అందరూ చేయవలసినటువంటిది. తొలి సంధ్యలో రాత్రంతా పడుకొని నిద్రావస్థ లో నుంచి జాగ్రవస్థ లోకి తెచ్చినందుకు తొలి ఉషస్సంధ్యకి నమస్కరించాలి. మధ్యాహ్నం దిన మార్తాండుడు గగనవీధి లో central point కి వచ్చినప్పుడు కనీసం ముందు ఉదయకాలం అంతా అంటే forenoon అంతా కూడా అనేక కార్యకలాపాలు చాలా వేగంగా స్పష్టంగా చేస్తాం. పనులన్నీ చేయటానికి అవకాశం ఇచ్చినందువల్ల మాధ్యాహ్నిక సంధ్యాకాలం చేయాలి. మాధ్యాహ్నిక సంధ్యలో పూజ చేయాలి, వందనం చేయాలి. మధ్యాహ్నం దాటిన తర్వాత ఇక సూర్యుడు అస్తమించబోతున్నాడు. మధ్యాహ్న కాలంలో మనం ఎక్కువ బలంగా పని చేయలేం. స్పష్టత తగ్గిపోతుంది. ముందున్నంత వేగం ఉండదు. ఎందుకనంటే కాలం వలన. కానీ ఇదిగో పగలంతా మంచి కార్యకలాపాలలో మనసు నిలబడేటట్టుగా చేసిన పరమాత్మ అంటే కాలమా! నీకు మళ్ళీ నేను వందనం చేస్తున్నాను. అదే సంధ్యావందనం. సంధ్యావందనం అంటే అది క్రతువు కాదు. సంధ్యకి, కాలానికి, త్రికాలాలకి ప్రతిరోజూ నమస్కరించాలి. కాలమే లేకపోతే, సూర్యుడే రాకపోతే, సూర్యుడే పుట్టని దేశంలో పుడితే ఎప్పటికైనా సూర్యుడిని చూడగలరా? ప్రతిరోజూ ప్రతిక్షణము సూర్యుడిని సుమారు పన్నెండు గంటలు చూడగలిగినటువంటి మనం దేశంలో పుట్టి సూర్యుడి కంటే ఐదు నిమిషాల ముందు లేచి తూర్పు ఎటు ప్రతి ఊరికి తూర్పు ఉంటుంది. తూర్పు వైపు తిరిగితే కర్మ సాక్షి కనిపిస్తాడే, కాల స్వరూపమై నడిపిస్తాడే. ఇవాళ చేతి గడియారాలు వచ్చినాయి. రోజుల్లో చేతి గడియారాలు లేవు. సూర్య గమనాన్ని బట్టి కర్ర పాతితే నీడను బట్టి పదయింది, పదకొండయింది, మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయిందని వాళ్ళు కాల నిర్ణయం చేసేవారు. ఎవరు? మన అవ్వలు, తాతలు, ముత్తాతలు. వాళ్ళకి గడియారాలు లేవు. cell phones లేవు. time లో ఏది జరుగుతుందో వాళ్ళకి తెలుసు. మహా జ్యోతిష్య శాస్త్ర పండితులంతా కేవలం కట్టే కట్ట విడిచిన నీడ దాన్ని బట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని ఖగోళ, భూగోళాలను రెండింటిని కూడా సమన్వయించేసి మహా శాస్త్రాన్ని లోకానికి అందించారు. ఇదంతా మనకు భాగవత పురాణంలో ప్రథమ స్కంధంలో కాలాన్ని గురించిన విభజన గురించి సృష్టి ఎలా పుట్టిందో చెప్పడం మనకి ఇక్కడ ప్రస్తుతం అవసరం లేదు గనుక దాన్ని చెప్పలేదు. కానీ ఇదిగో ఇన్ని విధాల అనేకమంది మహాత్ములు, ఋషులు తపస్సు స్వాధ్యాయం చేసిన వారు వాళ్ళ దర్శనంలో నుంచి ఇక్కడ కూర్చొని ఖగోళాన్ని దర్శనం చేశారు. గ్రహాలలో ఏం జరుగుతున్నదో మనకు చెప్పారు. ఇప్పటికీ కాలాన్ని కూడా గ్రహంలోకి వెళ్తున్నాం తప్ప గ్రహాల relevance ఏమిటో మనం ఆలోచించటం లేదు. అందుకే స్వామి అన్నారు మీకు ఒంట్లో బాగాలేదు లేదా ఇంట్లో బాగాలేదు, కుటుంబాలు సరిగ్గా నడవటం లేదు అనగానే మీ జన్మ పత్రిక తీసుకుని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అతడు ఏదో చెప్తాడు, మీరు ఏదో చేస్తారు. కానీ ఏం ఫలితం ఉండదే. మరి ఎట్లా ఫలితం రావాలంటే గ్రహాల పనిని వాటిని చేయనివ్వండి. వాటి నీడ ప్రపంచం మీద నీవు ఒక్కడి మీద పడదు, అందరిమీద పడుతుంది. గ్రహాలన్నింటినీ కూడా శాంతింపజేయటానికి వీటన్నింటికంటే పరమేశ్వరుడి యొక్క ఒక అనుగ్రహం ఉంటే గ్రహాలు మిమ్మల్ని ఏమీ చేయవు అని స్వామి చెప్పారు.పరమాత్మ యొక్క అనుగ్రహం మనకుంటే గ్రహాలు ఏం చేస్తాయి? అవి కూడా పరమాత్మకి లొంగి ఉండేవే కదా! కాబట్టి ఇటువంటి ఒక వైజ్ఞానిక భూమిక లో మన పురాణ వాంగ్మయాన్ని చదువుకుంటే, భాగవతాన్ని కథా కథనం గా చదువుకుంటే పెద్ద విషయం ఏం లేదు దాంట్లో. ఇవాళ మనకి గ్రాఫిక్స్ లో చూపిస్తే బాగుంటుంది చూడటానికి. కానీ అదేమీ అర్థం చెప్పదు, అంతరార్థం చెప్పదు, బోధ చేయదు, ఏం చేయాలో చెప్పదు. ఏం జరిగిందో చూపిస్తుంది, ఎలా ఉండాలో చెప్పలేదు. కాబట్టి తృతీయ అధ్యాయం ప్రధా-ప్రధానంగా, అంటే అధ్యాయం అంటే స్కంధం. మూడవ కొమ్మ, మూడవ కొమ్మ మనందరికీ కూడా అధ్యాత్మ మార్గాన్ని సూచించేటువంటి దివ్యమైనటువంటిది గనుక మనం ఏదో పైకి కనబడుతున్న యొక్క శరీరం మాత్రమే కాదని, ఏడు శరీరాలు మన యందున్నాయని, ఏడు శరీరాలు దాటితేనే ఆత్మ కనబడుతుందని లేదా ఆత్మానుభవం కలుగుతుందని, ఆత్మానుభవం కలగటం అంటే ఆత్మే నేనన్న భావనలో త్వమేవాహం సంశయః నీకు నాకు తేడా ఏమీ లేదన్న భావన కలిగించేటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితి వస్తుందని, మనమందరం కూడా కాల బద్ధులమై ఉండాలని, ఆశ ఉండాలి గాని దురాశ ఉండకూడదని, బంగారం పట్ల ఆశ ఉండొచ్చు గాని తీరని వ్యామోహాలు, వ్యసనాలు ఉండకూడదని ఎన్నెన్ని విధాల మానవ జాతికి మనకి చెప్తూ వచ్చిందో ఆలోచిస్తే ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఏది మనం సనాతనం అనుకుంటున్నామో, సనూతనం అనుకుంటున్నామో దాని మూలమంతా సనాతనంలో ఉన్నది. మోడర్నిటీ, దాని mother of modernity ఏదంటే antiquity, antiquity is the mother of modernity. Antiquity లేకుండా modern ఆధునిక శాస్త్రం లేదు. Modern కాకుండా ఆధునికం కాకుండా సమాజం నుంచి దూరంగా లేము. కాబట్టి సమాజము, కాలము, జీవుడు, ఆ-సమూహాలు, నగరాలు ఇవన్నీ కూడా సృష్టిలో అనంత కాల మహిమ చేత మార్పులు చెందుతూ ఉంటాయి. మార్పులు చెంది చెంది ఎక్కడో ఒకచోట మార్పు ఆగిపోతుంది. అది ఎప్పుడు అంటే maybe యుగాంతం కావచ్చు, అంతకు ముందే కావచ్చు. కాలం త్రివిక్రమ స్వరూపం. తనను తాను expand చేసుకోగలదు, తనను తాను contract చేసుకోగలదు. చూడండి ఒక్కొక్క ఋతువులో కాలం ఒక్కో రకంగా ఉంటుంది. చలికాలంలో సూర్యాస్తమయం తొందరగా అయినట్టు అవుతుంది. వేసంకాలంలో ఎక్కువ సేపు ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎట్లా అంటే కాలబద్ధమై ప్రకృతి ఋతువులు కూడా అలాగే ఉంటాయి గనుక అటువంటి ప్రకృతిలో భాగమైన మనం, మనోమయమైనటువంటి మానవుడు ఇంతటి విచక్షణా జ్ఞానాన్ని, బుద్ధికుశలతని, ఒక ప్రామాణ్యతని, తాను దేనిని పొందగోరి ఉన్నాడో దాన్ని పొందగోరేటువంటి స్థితిని, తనదైనటువంటి శరీరం ద్వారా, తనదైనటువంటి ఒక జన్మ ద్వారా, తనదైనటువంటి ఒక బుద్ధి ద్వారా, తాను తెచ్చుకున్న చిత్తము ద్వారా, తాను పోగొట్టుకుంటున్న అహంకారం ద్వారా ప్రకృతినంతా కూడా ఆత్మ స్వరూపంగా గనుక భావన చేయగలిగినట్లయితే అది నిజమైనటువంటి అధ్యాత్మగా మనం భావన చేయాలి. [గొంతు సవరించుకున్నాడు] ప్రథమ, ద్వితీయ, తృతీయ స్కంధాలు మనకి నేర్పేటువంటిది ఇదే. హిరణ్యాక్ష వధతో ప్రారంభమైనటువంటి భాగవత కథ ఇక్కడ నుంచి ఊపందుకుంటుంది. చతుర్థ, పంచమ దానిలో విశేషాలని మనం రేపు చక్కగా, సాకల్యంగా, సంపూర్ణంగా, అర్థవంతంగా, దీప్తిమంతంగా దానిని విచారణ చేసేటువంటి స్థితిని సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామి అనంత కోటి గురు స్వరూపాలు మనందరికీ అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ, ఏడు రోజులు ఒక నియమం పెట్టుకోండి. సత్సంగం అయిపోయిన తర్వాత ఏడు నిమిషాల పాటు హాయిగా, ప్రశాంతంగా ఉండండి. బయటకు వెళితే మళ్ళీ అలజడి తప్ప ఏం ఉండదు అక్కడ. ఉండగలిగిన time ఇదే గనుక ఏడు నిమిషాలు దానికి ధ్యానం పెట్టుకుంటారో లేకపోతే హాయిగా ఉంటారో, సుఖంగా ఉంటారో ఉండండి. కానీ ఉండండి. ఏడు నిమిషాలు మనకి మనంతట మనం తెచ్చుకోవలసిన time కాబట్టి కాల బద్ధులమై ప్రమాణాన్ని మీరు పాటిస్తూనే ఉండాలి. అయిపోయేదాకా అలా ఉండాలి. ఎక్కడైనా, ప్రవచనం గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఇంట్లో కూడా పని అయిపోయిన తర్వాత పని అయిపోయిందని టీవీ పెట్టద్దు. పని అయిపోగానే హాయిగా ఉండండి. ఒక ten minutes మిమ్మల్ని ఎవరు disturb చేసేవాళ్ళు లేరు. పది నిమిషాల తర్వాత మళ్ళీ ప్రపంచం అంతా ఉంటుంది. కాబట్టి ప్రసంగాన్ని, క్షణాన, పూటకి మనం స్వస్తి చెప్పుకుంటూ ధ్యాన ముద్రాంకితమైన స్థితిలో ఏడు నిమిషాలు హాయిగా గడపబెట్టు స్వామి మనల్ని అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిస్తూ సా
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 35:13

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

    Now playing
  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22