⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
మందస్మిత మనోహరం వందారు జనవందానం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శీల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ వ్యాస విరచిత పోతన కృత మహాభాగవతాన్ని పరమ పవిత్ర క్షేత్రం అయినటువంటి నైమిశారణ్యంలో ఒక తీర్థంగా ఒక బృందంగా ఒక సమూహంగా చేరి దాని శబ్దార్థం మాత్రమే గాక కథా కథనం మాత్రమే కాక ఒక విశేషమైనటువంటి జ్ఞాన పార్శ్వాన్ని తడువుతూ మనం భాగవతాన్ని చెప్పుకోవాలి పోతనామాత్యుడు తెలుగు వారికి ఇచ్చినటువంటి ఒక పుణ్య ప్రేతిక అది భాగవతం శ్రీ మంజు శిఖ భక్త రక్షణ కళ శ్రీ చుంచు ఆనందవల్లి మంజు ప్రసవం చిత్ గగన ప్రాలేయాంశున్ మోక్ష లక్ష్మి మాణిక్య వినూత్న మేఖల కటాక్షి భూత నిహార శ్రీమంతం బై పుల్చు వెలుగు నొకడే సేవింతు విశ్వేశ్వరా పరమేశ్వరుడు శబ్ద స్వరూపుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వోపాసన సర్వ శ్రేయోదాయకమని భాగవతం చెప్తుంది ప్రథమ ద్వితీయ స్కంధాలను సూచి ప్రాయంగా చెప్పినటువంటి వాటిని వేళ తృతీయ స్కంధంలో చాలా విస్తృతంగా చాలా గంభీరంగా కానీ చాలా ఉదాత్తంగా భారతీయ ఆధ్యాత్మికని అనేకమైనటువంటి పారిశ్రాలో తడిమి మనకు అందించినటువంటి ఋషులందరికీ ప్రధానంగా వ్యాస భగవానుడికి మహాకవి భక్త కవి పోతన గారికి మనం ఇవాళ నమస్కరించుకోవాలి విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తూ ఆ తెలుగు వారి అదృష్టం ఆయన రాయటం ఆయన ఒక మాట అంటారు "ఈ సంసారం మీద ఎన్ని జన్మలకు నేను ఈ మౌని భాషా సంక్రాంతరణము తీర్పగలదా?" వాల్మీకి గనుక రామాయణం సంస్కృతంలో రాసి ఉండకపోతే తెలుగులోనే నా రాముడి కథ ఎక్కడి నుంచి దాన్ని ఎలా రాయ-రాయగలనా? అని చాలా వినమ్రంగా పూర్వ కవిని మహాకవిని వాల్మీకిని ఆది కవిని సంస్తుతించి ఆయన శిరస్సు వంచి నమస్కరించుకుంటూ రామాయణ కల్పవృక్ష రచన చేశారు అలాగే ఇవాళ మనకు జీవితంలో దొరికినటువంటి ఒక అపురూప అవకాశమిది ఇది మీ అందరికీ బహుశా అలాగే నాకు ప్రధానంగా ఇది సత్యసాయి భగవానుడి యొక్క ఆదేశంగా నేను భావిస్తున్నా మీతో మాట్లాడుతూనే నేను నా ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి భావ స్పందనలు కలిగి భాగవతాన్ని ఆ చెప్పుకుంటున్న ఆ వైనం ఆ చెప్పబడుతున్నటువంటి విధానం వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే దీని వెనుక స్వామి యొక్క అనుగ్రహం మాత్రం సంపూర్ణంగా ఉంది కారణం ఏంటంటే భాగవతం అనంగానే కథలు చెప్పాలి కదా కథలు చెప్తే శ్రోతకి శ్రవణానందంగా హాయిగా ఎవరో కథ చెప్తున్నారు హాయిగా ఉండొచ్చు అని కానీ అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ్యా నారాయణాన్వేషితం మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే నారాయణుడిని అన్వేషించమని వచ్చింది ఇదొక అవకాశం ఇంతకుముందు ఎన్ని జన్మలు మనం ఎత్తామో ఇకపై ఎన్ని ఎత్తవలసి ఉన్నదో మనకు రెండూ తెలియవు కానీ ఇవాళ మనం ఎత్తినటువంటి ఈ జన్మకి సార్ధకత రావాలి అంటే ఏం చేయాలి ముందు కథలు వినాలి తప్పకుండా వినాలి ఆగిపోకూడదు ఆ కథల్లో సారాంశాన్ని తెలుసుకోవాలి ఆగిపోకూడదు నీతి తెలుసుకోవాలి ఆగిపోకూడదు అనేకమైన పాత్రల ద్వారా అభివ్యక్తి ద్వారా ఇటు సాహిత్య సాంస్కృతిక సంస్కార జీవ విధానంలో ఒక జీవుడు సర్వోత్తమమైనటువంటి స్థాయికి ఎలా వెళ్ళాలి అని చెప్పేదే నిజమైనటువంటి భాగవతం భాగవతం అనంగానే కేవలం ప్రహ్లాద గజేంద్ర మోక్షాలు మాత్రమే కాదు తృతీయ స్కంధం ప్రధానంగా ఆత్మ విచార మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది మరి ఈ ఆత్మ విచార మార్గాన్ని గురించి యోగాల గురించి భాగవతం నిండా ఎవరు మాట్లాడుకున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ మహా పరినిర్వాణం తర్వాత కృష్ణుడు తన దేహం వదిలిపెట్టిన తర్వాత విదురుడు ఉద్ధవుడిని కలుస్తాడు ఉద్ధవుడు కృష్ణ పరమాత్మకి ఆ బాల్య స్నేహితుడు బాల్య స్నేహితుడు అంటే ఏదో బాల్యం గడుపుతూ ఉండగా ఎవరో మధ్యలో కలుస్తారు ఆ బాల్య స్నేహితులు అంటే కృష్ణుడు ఉద్ధవుడు ఒకే సమయంలో బాల్యంలో స్నేహితులై కడదాకా ఉన్నారు ఇంకా ఉద్ధవుడు కృష్ణ పరమాత్మ నుంచి కలిగిన ఆ వియోగం నుంచి బయట పడని మనసు ఉద్ధవుడిది.సరే విదురుల వారు తెలుసుకున్నారు పాండవులు గెలిచారని తెలుసుకున్నాడు. ఆ విదురుడు ఎవరు అంటే యమధర్మరాజు యొక్క అంశతో వచ్చినవాడు. ధర్మ స్వరూపుడు ఆయన. అటువంటి ఆ విదురుడు ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి, కృష్ణుడు ఉద్ధవుడికి ప్రత్యేకంగా ఏమన్నా చెప్పాడా అని ఒక ఆలోచన కలిగి ఉద్ధవుడిని కలిసి ఈ మాట అడిగినప్పుడు "ఏం చెప్పను, చెప్పినవన్నీ విని, విని, విని ఆచరించి, ఆచరించి చివరికి నేను మిగిలిపోయినాను పరమాత్మ నా మధ్యలో లేడు. నా నుంచి దూరం అయిపోయినాడు" అని ఒక్కసారి ఒక దుఃఖ ఆవేశానికి లోనైన సమయంలో విదురుల వారు ఉద్ధవుడు మాట్లాడుకున్న కొన్ని విషయాలు. అలాగే ఆ ఉద్ధవుడు విదురుడికి చెప్తాడు "నాకు తెలిసినంతవరకు నా స్నేహితుడు నా పరమాత్మ, నా దైవం. నాకు అన్నీ అంతా అయినటువంటి కృష్ణుడు ఏం చెప్పాడో నేను చెప్పాను. కానీ ఇంకా నీకు ఆత్మజ్ఞానాన్ని గురించిన విచారణ కావాలి అంటే మైత్రేయి దగ్గరికి వెళ్ళు" అని చెప్పాడు. మైత్రేయి ఒక మహాఋషి, మహర్షి. విదురుడు అక్కడికి వెళ్ళాడు. విదురుడు మైత్రేయి మాట్లాడుకున్నారు. ముందు విదురుడు ఉద్ధవుడు, తర్వాత విదురుడు ఇదిగో మైత్రేయి, తర్వాత ఇక మూడవది కపిలుడు దేవహూతి. కపిలుడు దేవహూతికి కుమారుడు. ఈ నేపథ్యం, ఈ small brief మీకెందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ కపిలుడు ఎవరు అంటే సాక్షాత్తు నారాయణ మూర్తి యొక్క ఇరవై నాలుగు అవతారాల్లో ఒక అవతారమే కపిలుడు. కపిలుడు ఈ జగత్తుకి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏమిటంటే సాంఖ్య యోగం. ఆ సాంఖ్య యోగమే భగవద్గీత లో మనకి ప్రస్పుటంగా కనిపిస్తుంది. కపిలుడు చెప్పాడు. కపిలుడు ఎవరికి చెప్పాడంటే తన తల్లికి చెప్పాడు. ఆ దేవహూతి తన కొడుకు యొక్క శక్తిని, అతని ప్రజ్ఞని, ఆ బాలమేధావితనాన్ని గమనించి ఏమడిగిందంటే "నాయనా! నాకు దైవాన్ని గురించి నేను చాలా విన్నాను. అసలు నువ్వే నా దైవానివి. నా కడుపున పుట్టావు. కానీ మరి నా జన్మ సార్థకం చేసుకునే లాగా నాకు ఆత్మవిచార మార్గం చూపిస్తావా? చెప్తావా?" అని అడిగింది. అప్పుడు కపిలుడు ఇచ్చినటువంటి సందేశము, ఆయన చేసినటువంటి ఉపదేశమే తృతీయ స్కంధం నిండా పరచుకొని ఉంటుంది. కాబట్టి ఈవేళ చాలా గంభీరమైనటువంటి విషయం. మామూలుగా ఈవేళ పొద్దున ఒకాయన నా దగ్గరికి వచ్చి "నేను నాస్తికుడిని, నాకు ఈ ఆస్తిక భావాలే లేవు. కానీ ఒకసారి మీకు నమస్కరించుకుంటున్నాను" అన్నారు. నేనేమన్నానంటే "నేను నాస్తికుడిని అన్న స్పృహ వదిలిపెట్టే అస్తివాదులు కనుకనే, మీరు ఆస్తికులు కనుకనే ఇంత దూరం రాగలిగారు" అని చెప్పాను. ఇవాళ పొద్దునే. ఇక్కడ ఆస్తిక నాస్తికాలు లేవు. నాస్తికుడు హేతువాది. హేతువాది ప్రశ్నించి, ప్రశ్నించి, ప్రశ్నించి, పరిశోధించి, పరిశీలించి అనుభవాన్ని పొంది "ఈయన దైవమే, దైవం ఉన్నాడు" అని నిర్ణయించుకుంటాడు. ఆయన కాస్త ఆ path చాలా critical path. కానీ ఒక హేతువాది భక్తుడైతే కడదాకా భక్తుడిగా ఉండిపోతాడు. హేతువాది కానీ మాములు భక్తుడు గనక అయినట్లయితే ఆలోచన లేదు, ఏం విచారణ లేదు. దైవం అంటే ఏమిటి ప్రశ్నే లేదు. ఆయన దైవమే నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకొని జీవితాంతము సాగుతూ ఉండగా ఎక్కడో తనకు కావలసినట్లుగా కాలం కలిసిరానప్పుడు ఆ దైవం యొక్క పటాన్ని మార్చేస్తాడు. కాబట్టి ఇందులో నా దృష్టిలో ఎవరు గొప్పవారు అంటే హేతువుని ఆధారం చేసుకొని, సత్యాన్ని ఆధారం చేసుకొని, తీవ్రమైన జిజ్ఞాసతో పరిశోధించి, తీవ్రమైనటువంటి పరిశీలన చేసి భగవంతుడంటూ ఒకడు ఉన్నాడు. వాడు ఎవరైనా కానివ్వండి మనకంటే మహోన్నతమైన ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అదే దైవము, పరదైవతము అనేటువంటి ఒక భావనలో నెలకొని చెందుతాడు. కనుక ఇక్కడ నాస్తిక ఆస్తిక వాదాలు లేవు. ఉన్నదంతా ఒకటే. నిన్న మనం చెప్పుకున్నాం. అసలు ఉన్నదంతా బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ కదా! కాబట్టి దేవహూతికి కపిలుడు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా, ఇవాళ మనం మాట్లాడుకోబోయేదంతా వాళ్ళు మాట్లాడుకున్నదే. దాన్ని పునః మళ్ళీ మరొక్కసారి తెలుసుకుందాం. సాధారణంగా యోగాలు మూడు అని మనం చెప్తాం. ఒకటి కర్మ యోగం, రెండవది భక్తి యోగం, మూడవది జ్ఞాన యోగం. ఈ మూడు కాక అరుణాచల రమణులు ఒక కొత్త ప్రతిపాదన వారి అనుభవంలో నుంచి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి ఇచ్చారు. అదేమిటంటే కర్మ, భక్తి యోగాలు పూర్ణమయ్యేటువంటి వేళ మధ్యలో ఒక యోగము ఏర్పడుతుంది. అది కర్మ కాదు, అది భక్తి కాదు. మరి ఏమిటి అంటే జ్ఞాన యోగంలోకి అడుగు పెట్టడానికి ఏర్పడిన గడప వంటిది అన్నారాయన. ఆ యోగంలో గనక మనం మనతో మనం ఉండకపోతే, మన లోపలికి మనం తొంగి చూడటం గనక అలవాటు లేకపోయినట్లయితే జ్ఞాన యోగము అంటే శాస్త్ర పరిజ్ఞానం అనుకుంటాం. బాగా పురాణాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, ఆయన జ్ఞాని అంటున్నాం. కానీ అది నిజానికి సమంజసం కాదు. ఎందుకంటే Intellectual interpretation is not జ్ఞాన, it is only విజ్ఞాన. ఒక intellect ఉంది, ఓ ప్రజ్ఞ ఉంది. దాన్ని చక్కగా విడమరచి అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నది.ఆ శక్తి మన యందు లేదు గనుక వాణ్ని జ్ఞాని అంటున్నాం. కానీ జ్ఞాని అంటే ఎవరంటే ఎవరు నిలకడ చెంది ఉంటారో, ఎవరు నిర్మల మనస్కులై ఉంటారో, ఎవరు ప్రాపంచికమైన బంధనాలలో ఉన్నప్పటికీ కూడా తమను తాముగా నిలబెట్టుకోగలుగుతారో అటువంటి వారు జ్ఞానులు అవుతారు. వారు నిరాశక్తులై ఉంటారు, నిరాశలో ఉంటారు. నిరాశ అంటే depression and delusion కాదు నిర్-ఆశ, ఆశ లేనివారై ఉంటారు. దేనియందు అపేక్ష ఉండదు, రుచి ఉండదు. ఇది కావాలి అని ఉండదు, ఇది వద్దు అని ఉండదు. ఉందా? ఉందేమో. లేదా? లేదు కాబోలు. అంతే. ఇది జ్ఞాని యొక్క లక్షణం. శాంతిం నితాంత మహితా పరమాశ శక్తిహి వైరాగ్యమద్భుతతమం కరుణా తుసాంద్రా జ్ఞానం నిరంస్త కుహనం మధురంచ వృత్తం నృణాం నిదర్శనమయం రమణో మహర్షిహి. ఈ చెప్పుకున్నవన్నీ ఉన్నవాడు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నాడా? ఉరికే ఎక్కడ మీగ్గా ఇవన్నీ ఉంటే బాగుండు అనుకున్నాం అంటే ఎవరి సన్నిధిలో మనస్సు అణగి ఉంటుందో, ఎవరి సన్నిధిలో మనస్సు అటూ ఇటూ పోకుండా ఉంటుందో, ఎవరి సన్నిధిలో తెలియకుండానే ఒక పరమ ప్రశాంత స్థితి లోపల ఏర్పడుతుందో అటువంటి వాడు ఒక వైరాగ్యమే అద్భుతమైన శక్తిగా కలిగినటువంటి వాడు, ముఖమండలంలో బ్రహ్మ తేజస్సుతో వెలుగొందే అటువంటి వాడు, మధురమైన ఒక conduct and character అంటాం శీలము ఎవరికైతే ఉందో వాడు, ఇవన్నీ గనక ఉంటే అతడు సర్వోత్తముడైన గురువు అతడే నిజానికి మహర్షి వంటి వాడు అని కావ్యకంఠ గాణపతి ముని భగవాన్ రమణ మహర్షి గురించి చెప్తారు. అంటే ఇవాళ లోకంలో బోధ గురువులు, బాధ గురువులు, లోక గురువులు, శోక గురువులు, నిషిద్ధ గురువులు, దీక్షా గురువులు, మంత్ర గురువులు, హిత గురువులు, సన్నిహిత గురువులు ఆ పైన అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గురువులుగా ఉన్నారు. వాళ్ళంతా గురువులేనా అంటే కాదు. మరి ఎవరు? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మంత్రాన్ని అమ్ముకోని వాడు మంత్ర గురువు. దీక్షనిచ్చి తాను నిర్లిప్తంగా ఉండి దీక్ష పొందిన వాడి యొక్క యోగక్షేమాల గురించి నిరంతరము విచారణ చేసేటువంటి వాడు దీక్షా గురువు. నిషిద్ధ గురువు do's and don'ts ఇది చేయాలి, ఇది చేయొద్దు అని స్పష్టంగా చెప్పి తద్వారా తన నుంచి ఆ మంత్రం పొందినటువంటి వాడికి లేదా మాట తీసుకున్నటువంటి వాడికి చివరి వరకు ఒక guidance ఇచ్చేవాడు, మార్గదర్శనం చేయించేవాడు. కాబట్టి వీళ్ళంతా కూడా గురువులు. ఇక బోధ గురువులు అంటారా? బోధ చేస్తారు కాస్త. ఉన్న విషయాన్ని కాసేపు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళకి మన పురోగతితో వాళ్ళకేం పని ఉండదు. ఏదో మన schools లో అక్కడ textbook లో ఉన్నది చదివి చెప్పి వెళ్ళిపోయే master ఒకరుంటారు. అక్కడ ఉన్నదే కాసేపు చదివి వెళ్తారు. రెండో ఆయన చదివిన దానికి కొద్దిగా అర్థం చెప్తాడు. మూడో గురువు మనతో చదివిస్తూ, చెప్పిస్తూ విశేషమైనటువంటి లోతైన అర్థాలన్నీ కూడా చెప్తాడు. కాబట్టి ఈ లోకంలోనే ఒక భౌతిక స్థాయిలోనే ఇంతమంది గురువులు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గురువులకి లెక్కే ఉండదు. కాబట్టి ఈ గురువులందరినీ గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఎటువంటి గురువు కావాలి? వీళ్ళు కాక కారుణ గురువు అని ఒకాయన ఉన్నాడు. ఆ కారుణ గురువు ఎవరంటే మనం ఈ జన్మ ఎత్తి ఎందుకు వచ్చామో, వచ్చిన తర్వాత ఏం చేయాలో, ఏం చేస్తే ముందు మనకి ఆనందం కలుగుతుందో, ఏ ఆనందం వలన తన చుట్టూ ఉన్న వారందరికీ ఆనందం కలుగుతుందో, కలిగించగలడో, ఇవన్నీ గనక గమనించినట్లయితే ఆతడు ఒక నిజమైన బోధ గురువు, మంచి గురువు. ఇక రెండవ ఆయన ఉన్నాడు జగద్గురువు. జగద్గురువు ఒక బిరుదు కాదది. కంచి పరమాచార్య మహాస్వామివారు ఓ మాట చెప్పారు. జగద్గురువు అంటే జగత్తుని గురువుగా భావించిన వాడు. దత్తాత్రేయుడు కూడా అంతే. దత్తాత్రేయుడు జగద్గురువు. ఎందుకంటే నాకు ఈ లోకంలో ఇరవై నాలుగు మంది గురువులున్నారని ప్రకటించాడాయన. మళ్ళీ దత్తాత్రేయుడు ఎవరు? నారాయణాంశంలో వచ్చినవాడే. కలియుగంలో వచ్చినటువంటి నారాయణ అవతారం అది. కాబట్టి ఈ జగత్తును గురువుగా భావించి తమ కార్యకలాపాలన్నీ జగత్తు అంటే environment, పర్యావరణము, ఇక్కడ ఉండే సంస్కృతి, సంస్కారము, ఇక్కడ ఉండేటువంటి భాష, ఇక్కడ భావము, ఆహ్ కాలుష్యము వీటన్నింటినీ కూడా గమనిస్తూ మనందరికీ moral philosophyని నైతిక విద్యను నేర్పుతూ మనం ఎలా ఉండాలో మన dress, మన address, మన దేహ శుచి, అంతరంగ శుచి ఎలా సమన్వయం చేసుకోవాలో చెప్పేటువంటి వాడు జగద్గురువు అవుతున్నాడు. ఆ తర్వాత సద్గురువు ఉంటున్నాడు. గురువైనాడు, జగద్గురువు అయినాడు. ఈ సద్గురువు ఎవరంటే కేవలము ఆత్మబోధ చేసేవాడు. అన్నీ ఆత్మ యొక్క ప్రతిస్పందనలే, అన్నీ ఆత్మ యొక్క సంచలనాలే, అన్నీ ఆత్మ యొక్క వృత్తులే అని చెప్పి మనల్ని అంతర్ముఖుల్ని చేయగలిగిన వాడు సద్గురువు అవుతున్నాడు. సద్గురువు doesn't speak much. సద్గురువు doesn't interpret so much. మరి ఏం చేస్తాడయ్యా అంటే మనల్ని ఆలోచించుకోమని వదిలిపెడతాడు.ఇగో ఇలా ఉంది, ఇగో జగత్తు యొక్క లక్షణం ఇది మీ అంతట మీరు ఆలోచించండి అంటాడు తప్ప సద్గురువు అయిన వాడు quotation లో అమ్ముకోడు. అర్థమైంది కదా. అది సద్గురు ఎవరికీ వాళ్ళు self styled కాకూడదు. ఆత్మ విచార మార్గంలో ఆత్మను గురించి చెప్పగలిగిన వాడు సద్గురువు కా- అవుతాడు. అట్లా వచ్చిన జగద్గురువు, సద్గురువు, నిజమైనటువంటి కారణ గురువు మనకి ఎవరైనా వచ్చారా? ఈ కలియుగంలో అంటే "సంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా" ఆదిశంకరుల వారు అటువంటి గురువు అయి వచ్చారాయన. వాఙ్మయం రాశారు, భాష్యం రాశారు, ప్రకరణాలు రాశారు, అన్నింటి మీద వ్యాఖ్యానం రేసా- రాశారు. ముఖ్యంగా భగవద్గీతా వ్యాఖ్యానం ఆయనది భాష్యం ఎవరికైనా ప్రామాణికమే. ఇప్పటికి కూడా. రెండువేల ఐదువందల ఏళ్ళు అయిపోయింది, కాలం గడిచిపోయింది. అయినా గీతా భాష్యం శంకరుల వారిదే ప్రమాణం. ఎవరైనా నిజంగా గీత గురించి వ్యాఖ్యానం చేయాలంటే అది చదవాలి. చదివితే మనకు విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా సమన్వయం చేసి సంఘర్షణ లేకుండా సమన్వయంలో సర్వమతాల అన్నింటినీ కూడా ఆరు మతాలుగా విభజించి షణ్ముఖ షణ్మత స్థాపనాచార్యుడు అయినారు. కేవలము ఆరు మతాలు మాత్రమే ఈ దేశంలో ఉంటాయి, అవి చాలు మనకి. చీలికలు పీలికలైపోయినటువంటి మతాలన్నీ కూడా వ్యక్తులలో నుంచి పుట్టినయి అని ఆధునిక కాలంలో మనకి సత్యబోధ చేసిన సత్యాచార్యులు ఎవరు అంటే ఆదిశంకరులు అయినటువంటి శంకర భగవత్పాదులు. మరి శంకర భగవత్పాదులు ఎవరు అంటే "శంభోర్మూర్తిహి" పరమశివుడే ఒక శరీరాన్ని తీసుకుని జగత్తులోకి వచ్చి "చరతి భువనే" ఈ-ఈ భువనంలో నడుస్తూ ఉన్నారాయన. ఎట్లా? ఏ రూపంలో? శంకరాచార్య రూపా. మనం చెప్పుకున్నాం, నిన్న చెప్పుకున్నాం. శం అంటే శుభం, కర అంటే చేసేవాడు. లోక కల్యాణం చేసేవాడు, ఆనందాన్నిచ్చేవాడు, సన్మంగళమైన భావనాస్థితిని కల్పించేవాడు, భావశుద్ధిని, భావ సంపదని అపారంగా అనుగ్రహించగలిగినటువంటి వాడు గనుక మనందరికీ కూడా శంకర భగవత్పాదులు పూర్ణ, సంపూర్ణ అద్వైత మూర్తి. వారికి మనం ఇవాళ నమస్కరించుకోవాలి. ఎందుకంటే తృతీయ స్కంధమంతా శంకర భగవత్పాదుల హృదయమే. లేదా తృతీయ స్కంధంలో ఉన్నదంతా శంకరుల హృదయమే. అభిన్న, అద్వయ, అద్వితీయ, రమణీయ, మనోజ్ఞ భావనా భూమికలో శంకర భగవత్పాదులు ఆవిష్కరించినటువంటి దానిని ఆ పరంగా అద్వైత పరంగా మాత్రమే కాకుండా యోగాల గురించి మనం ఇవాళ విచారణ చేద్దాం. ప్రధానంగా కర్మయోగం. అసలు కర్మ, భక్తి, జ్ఞానం. వాటికి మళ్లీ యోగ తగిలించారు. మరి కర్మ, కర్మ యోగం ఎప్పుడవుతుంది అని. మనం ఎవరి సహాయము లేకుండా, అంటే దైవ సహాయం అనేది లేకుండా, భగవంతుడు అనేటువంటి ఆయన పాత్రే లేకుండా, నేను స్వయంకృషితో నా అంతట నేనే ఈ మొత్తము చదువుకున్నాను, ఈ మొత్తము సంపాదించాను, అంతా నేనే, నాకు భక్త అక్కరలేదు, జ్ఞానం నాకు దూరం, నాకు దానికి సంబంధం లేదు, అది కూడు పెట్టదు, గుడ్డ ఇవ్వదు, నాకు దాంతో పని లేదనే- అనేవాడు ఒకడు. భక్తి అంటారా? భక్తి అంటే దేవాలయాలకు వెళ్ళటం, ప్రదక్షిణ చేయటం, ఏదో పూజాది కార్యాలు చేయటం ఇదేనా? అయితే నేను అక్కడే ఉంటాను అన్నవాడు భక్తి యోగంలో- భక్తిలో ఉంటాడు. ఈ కర్మయోగంలోకి వచ్చేప్పటికీ వీటన్నింటినీ దాటి యోగించి చేయాలి. ఎవరితో యోగించి అంటే అచ్చ తెలుగులో కూడి అని. ఎవరితో కూడి చేయాలి? నీ ఉనికికి, నీ వ్యక్తిత్వానికి, నీ అస్తిత్వానికి కారణభూతమైనటువంటి, నీవు ఇంకా కంటితో చూడని, మనసుతో ఆలోచించని, హృదయంతో దర్శించని, ఏదో ఒక సద్వస్తువు ఏదైతే ఉన్నదో ఆ సద్వస్తువే సర్వాధిష్టాత. అన్నింటికంటే సర్వోత్కృష్టమైనటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నది. దాని ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేమీ చేయటం లేదు. ఈ జరుగుతున్న వాటిలో నన్ను కూడా భగవంతుడు ఉంచాడు. అంటే దాని పేరు కర్మయోగం. అంతే. కర్మయోగం అంటే effective గా పనిచేయటం కాదు, precision తో పనిచేయటం కాదు, perfection కోసం ప్రయత్నించడము కాదు. కర్మ సుఖౌషధం. అది ఒక tool. మరి కర్మ, ఇవాళ మనం ఈ సప్తాహ కార్యక్రమంలో, ఈ మహాయజ్ఞంలో నిన్న, నిన్న పొద్దున, నిన్న మధ్యాహ్నం, ఇవాళ పొద్దున కూడా చక్కగా రుద్ర అభిషేకం మనం చూశాం. అది పైకి కర్మకాండగా కనిపిస్తుంది. దాని పేరే కర్మకాండ. ఆ కర్మకాండలో నుంచి, ఆ కూర్చున్న ఆ ప్రదేశంలో నుంచి, ఆ మంత్రోచ్ఛాటనంలో నుంచి, ఆ రుద్ర నమక చమకాలలో నుంచి మనం ఏమి గ్రహించాలి, గ్రహించిన దాన్ని మనం చేసే పనులతో ఎలా అనుసంధానం చేయాలి అని గనుక తెలుసుకోగలిగితే దాని పేరు కర్మయోగం. అంటే దానితో కూడి మనం చేస్తూ ఉన్నాం. ఇందాక నమకము చమకము అనుకోండి. నమకము చమకము అంటే ఏదో సంస్కృతంలో ఆ పదాలు పెట్టారు, నిజానికి అవి ఏమిటి? మాకు నోరు తెరవదండి, మా వల్ల కాదండి అని కాదు. నమకము అంటే నమస్కరిస్తున్నాను, ప్రార్థన. చమకము అంటే అభ్యర్థన. అంతే. అచ్చ తెలుగులో నమక చమకాలకు అర్థం ఏంటంటే ప్రార్థించాలి, అభ్యర్థించాలి. ఎవరిని? నీ తోటి వాడిని కాదు. లేదు నీకంటే కాస్త పైన ఉన్నవాడిని కాదు. అసలైనటువంటి పరమాత్మకి నువ్వు ప్రార్థన చేయాలి. ఇదిగో నాకు ఇది కావాలి, అది కావాలి, నువ్వన్నీ ఇవ్వగలవు, అసలు అన్నీ నీవే, అంతా నీవే, నీ నుంచి నాకిది కావాలి అని ప్రార్థించటం పేరే నమకము.ప్రార్థించేస్తాం ఏదో మన దగ్గరికి ఎవరో పది రూపాయల కోసం వస్తారు అయ్యా నాకు కష్టంగా ఉంది ఒక పది రూపాయలు ఇవ్వండి అంటాడు. అతడు చేసేది నమకం అది ప్రార్థన. మనము ప్రార్థన చేసి ఏం కావాలో అడుగుతూ ఉన్నాడు. ఆ అడగటం నమకం కాబట్టి ఈ రెండు జమిలిగా జంటగా సాగేటువంటి ఒక అద్భుతమైనదే రుద్రం. ఆ రుద్రం పరమేశ్వరుడిని అడగాలి ఎవరినీ ఆ అడిగి తీసుకోకూడదు ఈ ప్రపంచంలో. ఎందుకంటే అపరిగ్రహము అస్తేయము అని కొన్ని మాటలున్నాయి. అంటే దానంతట అది వారంతట వారు మనకి ఏదైనా పండో ఫలమో తృణమో పణమో ఏదో ఇస్తే అది తీసుకోవచ్చునే గానీ ఇంత నాకు ఇవ్వమని మనం అడగకూడదు చేయి చాపకూడదు చూసారా? కాబట్టి ఇవన్నీ మనం గ్రహించినట్లయితే కర్మ యోగం ఒక పని అందరం చేయగలమా? ఈ మహాయజ్ఞం జరుగుతున్నది మనమే చూస్తూ ఉన్నాం. ఇక్కడ శ్రోతలుగా ఉన్నవారే అక్కడ volunteering చేస్తున్నారు. అక్కడ volunteering గా ఉన్నవారే స్వామి దండ కడుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఉన్నవారే ఇంకో పని చేస్తున్నారు. అంటే ఒక సమష్టిగా నాలుగు చేతులు కలిసి ఎప్పుడైతే ఒక లక్ష్యం వైపు మనం పని చేస్తామో అప్పుడది కర్మ యోగం అవుతుంది. మన కోసం మాత్రమే మనం చేసే పని కేవలం కర్మ అవుతుంది. కర్మ వేరు కర్మ యోగం వేరు ఇదే చెప్తున్నాడు. ఎవరికి? విదురుడికి. ఎవరు? ఉద్ధవుడు. కర్మ యోగం శ్రీకృష్ణ పరమాత్మ చేసినంత కర్మ యోగం ఎవ్వరూ చేయలేదు. ఈ ప్రపంచంలో ఇప్పటికొచ్చిన అవతారాలన్నీ కూడా మనం గమనించినట్లయితే కృష్ణ పరమాత్మ యొక్క కర్మ యోగం అంతా ఎక్కడ ఉన్నది అంటే భారత నిండా ఉన్నది కర్మ యోగమే. మరి ఆయన నిన్న చెప్పుకున్నాం గుర్రాలకి మాలిష్ చేశాడని, గిట్టలన్ని వాటిని clean చేశాడని, రథం చక్రాలకి నేమి ఆ rim ఏదైతే ఉందో దానికి అంటిన రక్తపు మరకలన్నీ కూడా కడిగాడు. ఇది ప్రమాణం భాగవత ప్రమాణం మనమేం కవిత్వం చెప్పడం లేదు. మనం ఊహించి చెప్పడంలా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముని మించిన కర్మ యోగి ఎవరన్నా ఉన్నారా? లేరు. ఎక్కడ ఉంది ఆ కర్మయోగం అంటే భారత నిండా ఉన్నది. పాండవులకి ఆయనకి దగ్గర బంధుత్వం ఉన్న కారణంగా పాండవుల దగ్గరికి కృష్ణుడు వెళ్ళలా. ధర్మం ఎటువైపు మొగ్గాలో అధర్మాన్ని ఎట్లా తుంచాలో ఈ ధర్మ సంస్థాపనార్థాయా అని ప్రమాణం చేసుకున్నాడు గనుక ఆయన పాండవుల వైపే మొగ్గు చూపాడు. ఆయన నిజానికి అడవుల పాలు వాళ్ళతో పాటు కావలసిన పని లేదు. ప్రార్థించినప్పుడాయనలా వచ్చి మాట్లాడవలసిన పని లేదు. దుఃఖం ఆర్తి తీర్చవలసిన పని లేదు. కానీ అన్నీ చేశాడు. అన్నీ చేసి కూడా రాయబారానికి వెళ్ళినప్పుడు చెప్పవలసిన అన్ని మాటలు చెప్పాడు. విదురుడున్నాడు, ద్రోణుడున్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడున్నాడు. ఈ విదురుడే అక్కడా ఉన్నాడు కానీ ఒక్కడు నోరు మెదపలేకపోయినాడు. ఈ జరుగుతున్నది అధర్మము అని చెప్పటానికి కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు. ఇది కర్మయోగంలో ఒక పతాక స్థాయి. ఒక్క అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని దుర్యోధనుడు దుర్వినియోగం చేసుకున్నాడు. కడగా ఆయనకర్థమైపోయింది. ఇట్లా వీడు లొంగ-- దీన్ని మూలంగా సమూలంగా పెకిలించి వేయాలన్నాడు కనుక అక్కడి నుంచి రణరంగం వైపు తన కథా కథనాన్ని సాగించి కర్మయోగంలో సర్వోత్కృష్టమైన స్థాయికి ఆయన తీసుకుని వెళ్ళి ఎందరెందరో చేసినా ఆయనేమి యాగం చేయలేదు రాజసూయ యాగం కృష్ణుడు చేయలా. ధర్మరాజు చేశాడు. అగ్రతాంబూలం మాత్రం కృష్ణుడు అందుకున్నాడు. కారణం ఏంటంటే అర్హత కలిగిన వాడు అందుకోవాలి అర్హత లేనివాడు అర్హత కోసమై పాటుపడాలి. ఆ అర్హత వచ్చే వరకు మనం అడగటానికి మనకి హక్కే లేదు. వారట్లగదా వీరిట్లగదా అంటే కర్మయోగంలో ఇవాళ సంపదను సృష్టించే వాళ్ళని మీరు ఒక పది మందిని తెలుగునాట మన-మన ప్రాంతం కాబట్టి లేదు భారతదేశంలో ఓ యాభై మంది ఈ కర్మ యోగంలో కర్మలో ఉన్నవాళ్ళను అడగండి. వాళ్ళ దగ్గర కర్మ ఉన్నది గాని యోగం లేదు. దానం చేస్తారు, చందా ఇస్తారు, ఇగో ఇటువంటి సత్కర్మలు మాత్రం చేయరు. ఇటువంటి సత్కర్మలు గనక చేస్తేనే అది కర్మ యోగం అవుతుంది. లేదు మేము ఇలా చేస్తున్నాము అంటే ఆ సరే ఇగో ఈ కొంత డబ్బు తీసుకెళ్ళి మీ దాంట్లో ఖర్చు పెట్టండి అంటే అది కర్మ యోగం కాదు అది వినియోగం మాత్రమే. You are just a part of it. కానీ నీకున్న సంపదని, నీకున్న సమయాన్ని, నీకున్నటువంటి ఆ మానసికమైన ప్రశాంతిని, నీలో ఉన్నటువంటి బుద్ధి చాతుర్యాన్ని, నీలో ఉన్నటువంటి జన్మ సంస్కారాన్ని రంగరించుకొని ఎప్పుడైతే నువ్వు చేయాలి అనుకున్న పనిని నలుగురితో కలిసి చేస్తావో అప్పుడది కర్మ యోగం అవుతుంది. కర్మ ఒంటి చేత్తో చేస్తాడు మనిషి. కర్మ యోగం రెండు చేతులతో చేయాలి. రెండు చేతులా చేయాలి. ఆ రెండు చేతులు మాత్రమే చాలనప్పుడు సమాజ శక్తిని తీసుకోవాలి. సమాజ శక్తి కూడా చాలనప్పుడు దైవ శక్తిని తీసుకోవాలి. అయితే అధ్యాత్మ ప్రపంచంలో చేయవలసింది ఏమిటంటే కర్మని వ్యక్తుల నుండి, సమూహం నుంచి, సమాజం నుంచి పొందటానికి ముందే దైవ శక్తి ఒకటి ఉన్నదని గనక మనం చిన్నప్పుడే నమ్మినట్లయితే మిగతావన్నీ automatically they fall in place. ఆయా ప్రదేశాల్లో అవన్నీ వచ్చి కూర్చుంటాయి. కూర్చుని ఆ పనులు జరిగిపోతాయి. ఇంత అద్భుతమైన పని ఇలా ఇంత తేలిగ్గా అయిపోయిందా అనుకుంటాం. కాదే, అది నీ నిష్ఠ, నీ శరణాగతి, నీ సమర్పణ. వీటన్నింటి కారణంగా నీకు భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క ప్రజ్ఞ, భగవంతుడి అనుగ్రహం ఇవన్నీ కూడా నీ యందు ప్రవేశించి ఈ సత్కర్మలు చేసేటువంటి యోగాన్ని నువ్వు పొందుతావు గనుక నీవు కర్మయోగివి అవుతావు. అది.