⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఇది అన్నింటికీ మూలం అదే. ఈ క్రోధానికి మూలం ఏమిటంటే కోరికే ప్రధానం. కోరికలని అదుపులో పెట్టుకో, వదిలిపెట్టమని ఎక్కడ చెప్పలా అదుపులో పెట్టుకో. దాన్ని స్వామి English లో "ceiling on desires" అని చెప్పారు. అది వేరే, ఆ విషయం వేరే. కోరికలు, ఏమి కోరికలు? మనం స్వామి Dress ల సంగతి చెప్పాను నేను అట్లాగే. కోరికలు పుడుతూనే ఉంటాయి, అవి demand చేస్తూనే ఉంటాయి. ఇది అయిపోతే అది, అది అయిపోతే ఇంకోటి, ఇంకోటి అయిన తర్వాత ఇంకోటి. మనల్ని పరిగెత్తిస్తాయి, నిలబడనివ్వవు. వాటిని కాసేపు ఆగమని చెప్పగలిగినటువంటి మనో నియంత్రణ కావాలి. మనస్సును నియంత్రించుకోవాలి. మనస్సుని నిగ్రహించుకున్నప్పుడు కోపం తగ్గుతుంది. మనస్సును నియంత్రించుకున్న, ఆ..నియంత్రించుకున్నప్పుడు మన కోరికలు అదుపులోకి automatic గా వచ్చేస్తాయి. ఎప్పుడూ ఒకటే అనుకోవాలి, మనకున్నటువంటి సంపదని యథేచ్ఛగా పంచిపెట్టాలి. ఆ సంపద ఏమిటంటే జ్ఞాన సంపద. కానీ భౌతిక సంపదని ఆచితూచి ఖర్చు పెట్టాలి. స్వామి అంటారు "మీరు ఇస్తూ ఉండండి అది వస్తూ ఉంటుంది మీకేం భయం లేదు" అంటారు స్వామి. అదే స్వామి మళ్ళీ ఏం అంటారంటే "ఇస్తే-- వస్తే ఇస్తాను అన్నవాడు నాకు ఇంతవరకు కనపడలేదు. ఇస్తే వస్తుందనేదే నైతిక సూత్రం, అది ప్రమాణమైన సూత్రం కాబట్టి మీకున్న దాంట్లో కొంత రోజు ఏదో మంచి పని చేస్తూ ఉండండి" అంటే మనకి ధర్మమును ఆచరించాలి అంటే దానము ఒక మార్గం. ధర్మాన్ని ఈ ప్రపంచానికి మేము కూడా ధర్మాచరణ చేశాము అంటే అన్నింటికంటే స్వామిని అత్యంత ప్రభావితం చేసింది అదే. స్వామి ద్వారా మనం ప్రభావితం పొందవలసింది ఒకటే, that's called time management. ఆయన చేసినట్టు ఎవ్వరూ చేయలేరు. చాలా మంది కోసం మనం ఎదురుచూస్తూ కూర్చోవాలి. But స్వామి ఋతువును బట్టి పొద్దున, సాయంకాలం వచ్చే దర్శనాలనే perfect మీరు watch అలా చూసుకుంటే on dot ఉంటారు స్వామి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఏ సందర్భంలో ఏం చెప్పాలో అదే చెప్తారు. ఎవరెవరికి ఎట్లా చెప్పాలో అట్లాగే చెప్తారు. ఏమి చెబితే అవతల వాడు ఆ ఆనందం వైపు నడుస్తాడో, ఇదంతా కూడా భగవంతుడి నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఒక భాగవత లక్షణం. ఇవి మనకి మొదటి ఈ స్కంధాలలో ఎక్కడా కనపడవు. పగ, యుద్ధం, దాన్లో దేవుడు రావటం, వాణ్ని భక్తుణ్ణి కాపాడటం దాన్ని మించి లేదు. అందుకనే దీనిలో ఇంకొకటి తమ-- మనకి పిల్లలు, మనం కంటాం, పిల్లల్ని కంటాం. పిల్లలు మన వాళ్ళే. వాళ్ళని అత్యంత ప్రేమతో, గారాబంతోనే పెంచాలి. కానీ క్రమశిక్షణతో పెంచాలి. Discipline, pampering ఉం-- అది అతిక్రమించకూడదు, దాటకూడదు. ఒక level దాటకూడదు. ఆ pampering ఏమిటంటే మనలో కలిగేటువంటి భావాలే మన పిల్లలు గనక అనుకున్నట్లయితే, Don't pamper them. దాన్ని క్రమశిక్షణతో నిన్న చెప్పుకున్న ఆ Humanize, divinize and spiritualize అనే భావంతో గనక మన ఆలోచనలని క్రమబద్దీకరణము చేసుకోగలిగినట్లయితే regulate and regularize రెండూ చేయగలిగినట్లయితే మనకి ఆవేశము లేదు, కావేశము లేదు, ఆరాటము లేదు, పోరాటము లేదు, అసలు కామాటమే లేదు. కామాటం అంటే ఇది కావాలి, అది కావాలి. ఆరాటం అంటే వస్తుందో రాదో. పోరాటం అంటే పోరాడైనా తెచ్చుకోవాలనే పట్టుదల. వీటన్నింట్లో ఇవి భాగవతుడి లక్షణం కాదు. ఇక మితాహారం అనేటువంటి దానికి మనం చాలా వయస్సును బట్టి అనండి, శరీర తత్వాన్ని బట్టి అనండి, ఆ-ఆరోజు ఉన్న ఆ దేహ పరిస్థితిని బట్టి లోపల ఉన్న వైశ్వానరుడికి మనం అటువంటి భోజనాన్ని అందించాలి. మనం ఏది పడితే, ఎంత పడితే అంత తినకూడదు. తిన్నందువలన వయస్సు మళ్ళిన వాడికి అది చాలా యాతన. A pleasure turns into a pressure. మనం దాన్ని వదిలిపెట్టాలి. మరి శరీరం నిలబెట్టడానికి మన వాళ్ళు calories చెప్తారు కదా, అంటే diabetes ఉన్న వాళ్ళకి ఎన్ని calories తిను, ఎన్ని ఆకులు తిను, ఆ.. ఎన్ని నీళ్ళు దాగు, ఎంత గాలి పీల్చు అని చెప్తారు. అవన్నీ వైద్యపరంగా hundred percent correct. కానీ diabetes రాకుండానే గనక మనం ఈ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నట్లయితే, మీ ముందు పది లడ్డూలు, పది స్వీట్లు రకరకాలు పెట్టారు. పది తినగలరా? తినలేరు. పదింట్లో ఏదో ఒకటి. తినాలి గనక తినాలి. ఆ తింటున్నప్పుడు ఆనందంగా తినాలి. తింటున్నప్పుడు ఇదేమిటి నాకిష్టం లేనిది పెట్టారు అంటే అదే పదార్థం విషం అయిపోతుంది. అందుకనే పదార్థం తయారైన తర్వాత భగవంతుడికి నివేదించటానికి గల కారణం ఏమిటంటే భావదోషం ఉంటుంది. దానిలో చేసే వాడి మనస్సును బట్టి అనేకమైన పదార్థాలు దోషాన్ని సంతరించుకుంటాయి గనుక, అవి ఏమున్నాయో మనకు తెలియదు గనుక, అది మొత్తం ఈశ్వరుడికి ఇచ్చేస్తే పదార్థ మాలిన్యం పోయి ఒక పవిత్రమైనటువంటి భోజనం ఏర్పడుతుంది గనుక మనం నైవేద్యం చే-- ఇస్తాం. ఒక అడవిలో ఆ రోజుల్లో పూట కుళ్ళమ్మలు ఉండేవారు కదా. ఒక రా-- ఒక సాధువు, ఒక దొంగ ఇద్దరూ అడవిలో వెళ్తున్నారు. సాధువుకి తెలియదు వాడు దొంగ అని. దొంగకి తెలుసు ఈయన సాధువు అని. ఎందుకైనా వేషభాషలను బట్టి ఈయన సాధువు, మంచివాడు, పవిత్రుడు అన్నాడు. కనుక వాడు ఏం harm చేయలా. హాని చేయకుండా ఇద్దరూ నడుస్తూ వెళ్లారు. రాత్రి ఒక సమయం దాటిపోయింది. ఆ దాటిపోయినటువంటి ఒకానొక సమయంలో వాళ్ళకి ఆకలి వేసింది. పైగా అంతా ఖాళీ నడకే కదా. ఆకలి వేసినప్పుడు ఎవరు అన్నం పెడతారు అని ఎవరో పూట కుళ్ళమ్మ వీళ్ళు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలిసేది. వెళ్లి తలుపు కొడితే ఒక పెద్దావిడ, ఒక తొంభై ఏళ్ళు ఆమె. తలుపు తీసింది. తలుపు తీసి "ఏం నాయనా ఇట్లా వచ్చావ్?" అంది.అమ్మా నాకు ఆకలిగా ఉంది నాకు అన్నం పెట్టు అని అడిగాడు సరే అంతా అయిపోయింది గాని నేను ప్రయత్నం చేస్తాను నువ్వు కూర్చో కొద్దిసేపట్లోనే నీకు అన్నం పెడతాను ఇక్కడ ఉండు. దొంగ ఇంకో ఇంటికి వెళ్ళాడు ఇక్కడికి రాలే తలుపు కొట్టాడు తలుపు కొడితే అక్కడ ఒక నవ యవ్వనవతి అయినటువంటి స్త్రీ మూర్తి తలుపు తీసింది. ఈ దొంగ అడిగాడు ఈయన అడిగినట్లే అడిగాడు కానీ ఈ సాధువుకి ఓ మనసు ఉంది వాడు అనుకున్నాడు ఈ తొంభై ఏళ్ల ఆమె ఈ వయసులో నాకు అన్నం ఉండి పెట్టడం ఎందుకు ఆమెని కష్టపెట్టి ఆ తిండిని తినకపోతే ఏమవుతుంది ఆ బయట ఉన్న చెట్టు మీద ఉన్న కాయ రాత్రి అయిన తర్వాత కొయ్యకూడదు అది శాస్త్రం కాబట్టి తెల్లవారక తప్పదు తెల్లవారిన తర్వాత చెట్టు నుంచి ఒక పండు ఒకటి కాకపోతే రెండు తింటాను అని అమ్మా నువ్వేమి ప్రయత్నం చేయకు నేను వెళ్ళిపోతున్నాను అని. ఈ దొంగ ఆ నవ యవ్వనవతి దగ్గర ఆ ఇంట్లోకి వెళ్ళాడు కదా వాడు ఏమనుకున్నాడు అంటే పాపం ఇంకా చిన్నపిల్ల ఈ అమ్మాయి నేను దొంగ అని తెలియక ఎంత పవిత్రంగా తలుపు తీసింది అసలు భయమే లేదేమిటి ఈమెని మళ్ళీ నా ప్రవృత్తితో భయపెట్టకూడదు అని వాడు అమ్మా నువ్వు నాకు కూడా ఏమి చేయొద్దు అని అతను బయటికి వెళ్ళాడు. అంటే సాధువు ఎక్కడ వృద్ధ స్త్రీ దగ్గరికి ఏ సాధువు వెళ్ళాడో ఆ సాధువు ఈ పిల్ల దగ్గరికి వచ్చాడు ఏ దొంగ అయితే పిల్ల దగ్గరికి వెళ్ళాడో అతడు పెద్దామె దగ్గరికి వెళ్ళాడు పెద్దామె దగ్గర వాడికి దోచుకోవడానికి ఏం ఉండదు ఆమెకు వయసే లేదు అంత ఆ కథ అంతా అయిపోయిన దశ ఆమెది కాబట్టి వాళ్ళిద్దరూ ఉన్నారు. సరే భోజనం పెట్టారు వాళ్ళిద్దరూ భోజనం తిన్నారు చేశారు చేసిన తర్వాత ఈ సాధువు ఈ ఆడపిల్ల నవ యవ్వనవతి అంటున్నామే ఆమె దగ్గర భోజనం తిన్నాడు కదా చేసిన తర్వాత ఆయనకు ఆలోచన కలిగింది ఆ సాధువుకి అసలు ఈ ప్రపంచం అంతా ఇంత సుందరాత్మకమైనది శరీరాన్ని నేను సృష్టింపజేసుకుని జీవితం అంతా పాడుచేసుకుని అది ఇది అంటూ వెనక్కి తిరిగి అసలు సంసారమే లేకుండా చేసుకున్నాను అసలు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది చేసుకోగలిగితే ఈ అమ్మాయినే చేసుకుంటే ఎలా ఉంటుంది అని సాధువుకి ఆలోచన పుట్టింది. ఆ దొంగ పెద్దామె దగ్గరికి వెళ్ళాడు కదా అప్పుడు వాడికి ఒక ఆలోచన కలిగింది ఏం జీవితం నాది ఎవరి సొమ్మునో వాళ్ళని కొట్టి చంపి దొంగతనంగా ఒక పిల్లివేల వాళ్ళ ఇళ్ళల్లో దూరి ఆ సంపాదనతో ఇంతకాలం నేను బతికాను ఎంతమందిని హింస పెట్టానో గాయపరిచానో ఆ ముసలమ్మ ప్రాణం పోతుంది ఇక ఎన్నో రోజులు ఇక్కడ ఉండకపోవచ్చు కానీ సాటి మనిషి యందున్న దయచేత ఎంత చక్కటి భోజనం పెట్టింది ఇకపై నా చేతిలో ఉన్నటువంటి దొంగతనం చేయటానికి కావలసిన అన్ని పరికరాలు ఇక్కడే అరణ్యంలో వదిలేసి నేను వెళ్ళిపోతాను సంఘ జీవనంలోకి వెళ్లి కాయకష్టం చేస్తా బతుకుతా సంపాదిస్తా ఇలా ఎప్పుడైనా ఎవరైనా ఒక అర్ధరాత్రి వేళ నా అతనికి భార్య పిల్లలు ఉన్నారు నా ఇంటికి గనక వస్తే నా భార్యకు కూడా ఈ విషయాలన్నీ చెప్పి నేను దొంగతనం మానేశాను కట్టెలు కొడతానో బస్తాలు మోస్తాను సంపాదిస్తా దానిలోనే మన జీవితం మనం గడుపుదాం ఆ ఉన్నదాంట్లోనే ఎవరైనా గనక వస్తే వాడికి అన్నం పెడదాం ఇది అరణ్యంలో నేను నేర్చుకున్న భావన అన్నాడు. ఇది ఎక్కడ కలిగింది దొంగ సాధువు ఎట్లా అయినాడు సాధువు దొంగ ఎట్లా-- దొంగ అంటే మనసును పోగొట్టుకున్నాడు మళ్ళీ వివాహం చేసుకోవాలని ఒక చాలా ముందుకు వెళ్ళినటువంటి వాడికి ఈ మానసిక జాడ్యం ఎలా ఏర్పడింది అంటే పదార్థ దోషం వలన ఎందుకని పదార్థ దోషం అంటే వాళ్ళు నిజాయితీగా వండలేదా మన వాకిట్లోకి వచ్చారు ఇది మన వృత్తి మనం కొన్ని వేల మందికి పెట్టాం వీళ్ళలో ఒకళ్ళు అని అనుకో లేదా అంటే ముసలమ్మ ఏమనుకున్నది అంటే ఏమిటి భగవంతుడు నాకు ఇటువంటి పిచ్చి పని పెట్టాడు ఈ అడవిలో బతుకో బతుక వాడు ఎవడో రావటం ఏంటి వాడికి అన్నం పెట్టడం ఏంటి ఆ విస్తరి ఇవ్వటం ఏంటి ఆ మళ్ళీ నా మళ్ళీ తెల్లవారిగానే నాకు ఇదే పనే అని విసుక్కుంటూ ఆవిడ అన్నం వండింది అందువలన ఆ పదార్థ దోషం అంటింది. ఈ అమ్మాయి సాధువు ఎంత పవిత్రంగా ఉన్నాడు ఇటువంటి జీవితం కూడా నాకు కూడా లభిస్తే ఎలా ఉంటుంది హాయిగా ఉన్నాడు ఆయనకి ఏం బాధర బందీలు లేవు ఎంత సుఖంగా ఉండాలో అట్లా చూపిస్తున్నాడు ఈయన పెద్దవాడు ఎంత మర్యాదస్తుడు అనుకున్నది. దీనిలో ఈ పదార్థ దోషం అంటే ఇక్కడ దోషం అని కాదు పదార్థ ప్రదోషం అంటే దోషం లేని దాన్ని ప్రదోషం అంటారు దానివలన గనుక మనసులు మారితే ప్రదోషం అవుతుంది ఆ పదార్థంలో నుంచి మనకు ఏదన్నా లేని వికార భావాలు గనక కలిగినట్లయితే అది దోషం అవుతుంది సాధువు విషయంలో ప్రదోషం కాలేదు దొంగ విషయంలో దోషం కాలేదు కాబట్టి మనం రోజు భోజనం చేసేటప్పుడు మితంగా తినాలనుకున్నాం అదే సరే అది ప్రాక్టీస్ వల్ల స్ఫూర్తి వల్ల విచక్షణ వల్ల మనం ఎంత తినాలో అంత తినాలనే నిర్ణయం వల్ల అంత తింటే ఏం జరుగుతుందో ఇంత తిన్నా జరిగేది అదే ఆ ఇంతే తిని ప్రాణాన్ని సుఖంగా ఉంచుకుని మిగతాదంతా కూడా మనం భగవద్ ధ్యానంలో భగవత్ కార్యక్రమంలో గనక మనం వాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది గనుక ఈ వితరణ అనేటువంటి దానిని భావ శుద్ధితో చేయాలి ముందు అంతఃశుద్ధి ఏర్పడింది తర్వాత భావశుద్ధి కలగాలి ఇది అయిపోయిన తర్వాత ఇక ప్రపంచము దాని అవసరాలు దానికి కావలసిన పోషణ ఇవన్నీ మనం చేయటానికి మనం సంపాదించాలి. We have to generate money. సంపద సృష్టించవలసిందే ఎంతగా అంటే అది ఎట్లా సంపాదించాలి అంటేసంపాదించిన దానిలో ఒక భాగం మాత్రమే నాది. ఒక భాగం మాత్రమే నా కన్నబిడ్డలది. మిగతా భాగమంతా ప్రపంచానిది, దైవతానిది. దేవుడంటే ఆయన తీసుకోడుగా. డబ్బు తీసుకోడు ఆయన. ఆ మన currency ఆయన దగ్గరికి చెల్లదు. అది వేరే. కాబట్టి ఏమి చేయాలి అంటే సమాజమే భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి, ఈ సంఘానికి ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులను మనమే గమనించి గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం అది ఒక ఎత్తు, అది వేరే. చేయవలసింది ఏమిటంటే మనతో పాటు మనం పన్నెండున్నరకి భోజనానికి రండి అని మనల్ని మర్యాదగా లోపలికి తీసుకెళతారు. అది మనకి కలిగిన, భగవంతుడు మనకిచ్చిన ఒక యోగం, ఒక అదృష్టం. పన్నెండు, ఇవాళ పన్నెండు అయింది, రాత్రి పన్నెండు అయింది, రేపు పన్నెండు అయింది, ఇట్టా ఏడు రోజులు పన్నెండు అవుతూనే ఉంది ముద్ద దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. మరి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కాపాడుకుంటూ, వాళ్ళకి వాళ్ళ కడుపు నింపుతూ, మంచి మంచి ఆలోచనలు వాళ్ళకి నేర్పుతూ, వాళ్ళకి విద్యని, విద్యాలోకి వాళ్ళని ప్రవేశపెడుతూ, వాళ్ళని విద్యాధికుల్ని చేస్తూ, వాళ్ళని నెమ్మదిగా సమాజానికి పనికొచ్చేటువంటి ఒక సాధన సంపత్తిగా తయారు చేయాలి. అంటే సంపాదించిన డబ్బులో సగభాగం మనది, మన పిల్లలది కాగా మిగిలిన సగం అంతా కూడా ఎవరో కన్న పిల్లలది, ఎవరికో అవసరం ఉన్నది, వాళ్ళ కోసం గనక చేయగలిగితే అది నిజమైనటువంటి సంపద వితరణ, అంతే. రేపు రాబోయే మూడు, నాలుగు తరాలకి అనంటే, ఆ మూడు, నాలుగు తరాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. వాళ్ళకి అసలు ఈ డబ్బుతో పని ఉంటుందో ఆ లేదో తెలియదు. ఉదాహరణకి ఆ మా వయసు వాళ్ళకి, అరవై, అరవై ఐదు దాటిన వాళ్ళకి ఎట్లా ఉండేది అంటే పాతకాలంలో పాపం తల్లి తండ్రి వాళ్ళ దగ్గర ఇంత cash ఉండేది కాదు. ఇది ఇచ్చి అది కొనుక్కునే వాళ్ళు. బియ్యం పోసి పండు కొనుక్కునే వాళ్ళు. ఆ ధాన్యం ఇచ్చి ఇంకేదో కొనుక్కునే వాళ్ళు. There was no money in this country ఆ రోజుల్లో. అయితే వాళ్ళు జీవితాన్ని చాలా హాయిగా గడిపేశారు. మాకు ఇదే కావాలి, ఇట్లాగే కావాలి అనుకోలా. కానీ ఆ generation లో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటంటే వాళ్ళు పొట్ట కట్టుకొని తినవలసిన తిండి కూడా తినకుండా, రోగం వస్తే ఆ బతికి ఏం చేయాలి? నే దీనికి ఆ doctor గారు డబ్బు పట్టుకుపోతారు. లేకపోతే ఇంకెవరో పట్టుకుపోతారు. మా పిల్లలకి ఏమవుతుంది? మేము వెళ్ళిపోయినా మా పిల్లలు బాగా బతకాలని ఆ డబ్బు దాచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ generation. కానీ కాలం మారింది చూడండి. అది మన జీవిత కాలంలోనే చూస్తున్నాం. ఇవాళ మన పిల్లల్ని, అమ్మా ఇదిగో నీకు ఇది కట్టాను, నీకు ఇది ఇస్తున్నాను, నీకు అది చూశాను, ఇదిగో ఇది నా అది నీదే ఇంకా ఉంచుకో అని మీరంటే వాళ్ళు ఏమంటున్నారంటే, నాన్నగారు మీరేం కష్టపడకండి We have enough money with us. మీరిద్దరూ సుఖంగా ఉండేటట్టుగా చూసుకోండి. మాకు మీ డబ్బుతో పనిలేదంటున్నారు. ఇది విచిత్రం. ఇది కలిధర్మమా ఇది? వాళ్ళు ఏమనాలి? ఏమివ్వాలో ముందు ఇచ్చేసేయ్ అనాలి. వాళ్ళు అనటంలా. కాబట్టి ఇక్కడ కూడా మనం విచక్షణని, వివేకాన్ని జ్ఞాన రూపంగా అర్థం చేసుకొని fifty percent, అయితే మనం fifty percent అన్నాం. స్వామి చాలా liberal గా ఏం చెప్పారంటే, నీకు వంద రూపాయలు వచ్చినాయి అనుకో, నీ కష్టార్జితం. దానిలో నువ్వు save చేసుకోగలిగిన spare money అని ఒకటి ఉంటుంది. ఇంత ఉంటే చాలు నాకు. మిగతా అంతా ఖర్చులకు అయిపోతుంది. ఆ spare money లో two percent ఖర్చు పెట్టు. అంతే చాలు. అది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందన్నారు. ఇది గొప్ప economic principle. దాని జోలికి ఇప్పుడు నేను ఈ podium మీద వెళ్ళను. అంటే ఏమిటి? మనకి ఎవరైనా పది రూపాయలు ఇచ్చారు. ఒక్క రూపాయి నీ దగ్గర పెట్టుకో. వారు ఇచ్చారు కదా! వారు ఎంతో ప్రేమగా, ఆ ఒక్క రూపాయి నువ్వు దగ్గర ఉంచుకో, నీ కోసం పోనీ. కానీ మిగిలిన తొంభై తొమ్మిది రూపాయలున్నాయే, దాన్ని ప్రపంచానికి ఇవ్వటం నువ్వు మొదలు పెట్టు. నువ్వు వంద ఇచ్చేస్తే, నీకు మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. నీకు జీవితం వెళ్ళాలి, రోజు వెళ్ళాలి, రేపు, ఎల్లుండి ఆ తర్వాత ఎన్ని ఏళ్ళు ఇక్కడ ఉంటామో మనకు తెలియదు. కాబట్టి డబ్బుని చాలా భద్రంగా, జాగ్రత్తగా, meticulous గా plan చేసి వాడుకోవటం ఒక ఎత్తయితే, రెండవది డబ్బు కోసమే జీవించడం మాత్రం అది పెద్ద గొప్ప జన్మ కాదు. డబ్బుని ఎంత సంపాదిస్తాం, ఎన్ని సంపాదించినా వాడంటాడు, ఆ ఎంత ధనవంతుడైనా, ఎంత భాగ్యశాలి అయినా వాడు కూడా లవణము, అన్నము, ఉప్పును, అన్నమునే తింటాడు. వెండి, బంగారాలు వాడి నోట్లో పోసుకుంటాడా అంటాడు. అది వేదాంతం కావచ్చు కానీ నిజం. మనం కూడా అంతే. మనకు మించిన, మనకు అక్కరలేనంత సంపద మనకున్నప్పుడు చేయటానికి ప్రపంచంలో ఎన్ని కార్యక్రమాలో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. నిన్న ఇక్కడ మనకి భూదానం, గోదానం చేసిన దాన్ని, నేను పొద్దున మొట్టమొదట అక్కడికే వెళ్ళాను. అదేమిటో చూద్దాం, రోజుకి ఆ time కి ప్రకారంగా పంపుతున్నారు. సాత్వికమైన food పంపిస్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్లి వాళ్ళని అభినందించి వద్దాం అని నేను వెళ్ళాను. ఆ రోజున ఆ ఆశ్రమాన్ని, ఆ వ్యవస్థని ఎవరో గనక చేసి ఉండకపోతే, ఇవాళ కుంపట్లు మనమే వెలిగించుకోవాల్సి వచ్చేది. మనం వచ్చిన ఈ time లో సుమారు సగభాగం మీరంతా మాకు అన్నం వండి పెట్టాల్సి వచ్చేది. అంటే ఎంత దూరదృష్టితో, ఎంత త్యాగబుద్ధితో, అందుకే "నా కర్మణాన ప్రజయాన ధనేన త్యాగేనైకే అమృతత్వమాన్షుహు". డబ్బు వలన శాశ్వతత్వం రాదు, అమృతత్వం రాదు. అనేకమంది జన బాహుళ్యంలో if you are popular, they made you popular. నువ్వు ఆ popularity కి నీకు ఆ crest of popularity, ఆ తరంగాల మీద నువ్వు నడవకూడదు. తరంగాలు ఒదిగిపోతాయి. ఒక్కసారి విదిలించి బయట పడేస్తాయి.అట్లాగే నా ప్రజయ, నా కర్మణ, నా ధనియన ఈ మూడు లేవు. నేను సత్కర్మలు చేశాను, బావి కట్టించాను, చెరువులు తవ్వించాను. ఎక్కడున్నాయి ఆ చెరువులు ఉన్నాయా? ఆ చెట్లు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయా? కట్టించినవి పోయినాయి, పెట్టించినవి పోయినాయి, కొత్తవి వస్తూనే ఉన్నాయి. ఇది ఒక అనాహతమైనటువంటి నిరంతరమైనటువంటి కార్యక్రమం. కాబట్టి సంపదను వినియోగించటంలోనే మన వివేకము, విచక్షణ ఉన్నాయి. ఇక చివరికి వస్తున్నాం, అదేమిటంటే ప్రపంచంతో మనకున్నటువంటి సంబంధం ఎంతవరకు ఉండాలి? బాగా ఉండాలా? సెల్ ఫోన్ రానంతవరకు సెల్ న-- మన Telephone numbers అన్నీ మనకు గుర్తుండేవి. పేరు చెప్పగానే టక్కున మనం మాట్లాడేవాళ్ళం. Cell phone రాకముందు మనకు Connectivity లేదు ప్రపంచంతో. ఇప్పుడు Cell phone గనుక మీ అంతట మీరే ఎవరికి వాళ్ళే. ఆ Under A, Under B, Under C ఒకసారి అలా చూసుకుంటే ఎనిమి-- A లో ఒక పధ్నాలుగు Numbers Connectivity ఉందనుకోండి, కొద్దిగా Judicious గా ఆలోచిస్తే అందులో మీకు పనికొచ్చేవి ఒకటో రెండో ఉంటాయి. B లో వస్తే-- అంటే మనకు వచ్చినదల్లా మనం Save చేయటంతో వాళ్ళందరితో మనం Connect అయి ఉన్నాం, వాళ్ళందరూ మన Connection కోరుకుంటున్నారని మనం ఒక భ్రాంతిలో, భ్రమలో ఉంటాం. భ్రమని దాటి ప్రమలోకి రావాలి. భ్రమ అంటే లేనిదానిని ఉన్నట్టు ఊహించుకోవటం, ప్రమ అంటే ఉన్నదానితో జీవించటం. ఈ రెండు పదాలు సంస్కృత పదాలు, చాలా గొప్ప పదాలు ఇవి. ప్రమ, ఆ ప్రమ మనకి ఆధారం కావాలి. కాబట్టి ప్రపంచంతో మనకున్న సంబంధాలు ఎంత తక్కువ ఉంటే మన మనసు మీద అంత భారం అంత తక్కువ ఉంటుంది. ఆ Administration లో వాళ్ళకి కావాలి, దాంట్లో కూడా వాళ్ళకి కూడా అన్నీ అక్కర్లేదు. ఏ ఏ Departments కావాలో అవన్నీ గనుక ఒక List రాసి పెట్టుకుంటే అది సరిపోతుంది. అంటే ఇవాళ నువ్వు Connect అవటానికి ఇదిగో నీకు ఆయుధం ఇచ్చాను అన్నప్పుడు దాన్ని మనం ఎలా వాడుతున్నామో చూట్టానికి భగవంతుడు ఉన్నాడు మళ్ళీ. మనం దాన్ని సరిగ్గా వాడుతున్నామా, వాడటం లేదా? ఉదాహరణ, మళ్ళీ చిన్నతనానికి వెళితే, ఒక SSLC పరీక్షకు వెళ్ళి వాడు ఒక Photo అడుగుతాడు, Photo దానిమీద Hall ticket మీద అంటించాలి. Photo ఆయనకు అందించాలి అంటే మూడు నెలల ముందు Photo తీయించుకునే వాళ్ళం. కారణం ఏంటంటే మూడు నెలలు అయితే గాని ఆ Photo చేతికి రాదు. Technology, వాడు ఎక్కడో ఇంకో ఊరు తీసుకెళ్లి దాన్ని కడిగి వచ్చిందనో, రాలేదనో, బాగుందనో లేదు. ఇవాళ తర్వాత తర్వాత Technological advancement or breakthrough దాని వల్ల ఏమైందంటే Reel వచ్చేసింది. ఆ పన్నెండు, ఎనిమిది, పన్నెండు, ముప్పై ఆరు ఇట్లా లెక్కబెట్టి మనం అక్కడికి కూడా పరిమితం కాగలిగాం. కానీ ఇవాళ Digital వచ్చేసింది. చూస్తే ఆశ్చర్యపోతాం. మనం వెళ్ళేది ఒక చోటికి వెళ్తాం, డెభై Photos ఉంటాయి, భయమేస్తుంది. ఇన్ని ఎవరు తీశారు, ఏం తీశారు అని అలా నొక్కి పట్టిస్తే అదే తీస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనల్ని మన మనస్సుని చాలా Disturb చేసేటువంటి ఒక అలవాటు ఇది. దీన్నుంచి కూడా మనం నెమ్మదిగా బయటపడగలగాలి. మనస్సుని హాయిగా ఉంచుకునే మార్గం ఎంచుకోవాలి. మనస్సు హాయిగా ఉండాలంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళు, నువ్వు తపస్సు చెయ్ ఇది కాదు, అది నీ వ్యక్తిగతం. సమాజపరమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే స్వీయ నియంత్రణ అత్యంత ప్రధానమైనటువంటిది. చాలా మంది Numbers నా దగ్గర ఉండవు, లేవు. అస్సలు లేవు. కానీ వాళ్ళు ఎప్పుడైనా Phone చేస్తే మేము ఫలానా అన్నప్పుడు నేను మాట్లాడతా, అది వేరే సంగతి. కానీ ఎందుకని ఉండవు అంటే అది ఉన్నప్పటినుంచి ఆయన మనకు ఎలా ఉపయో-ఉపయోగిస్తారు, మనకు ఆ ఊళ్ళో ఆయన తెలుసు కదా, మనం వెళ్తే ఆయన్ని ఎలా వాడుకోవాలి, మనకు ఎలా సుఖంగా ఉంటుంది, చూడండి. ఆ నెంబరే లేదనుకోండి, ప్రాణం హాయి కదా! కాబట్టి ఇవన్నీ నియంత్రించుకోండి, ఇవన్నీ అధ్యాత్మలో భాగాలే. లోకమును వీడి రసము లేదు, జీవితాన్ని దాటి అధ్యాత్మ లేదు. మనం ఎలా జీవిస్తున్నామో అదే ఆధ్యాత్మిక జీవితం. మామూలుగా పిల్లలకి మన Organization లో కూడా ఒక్కోసారి ఒక Topic ఇస్తారు. నిత్య జీవితంలో ఆధ్యాత్మికత, దీని మీద ఒక వ్యాసం రాయండి అంటారు. వాడు ఆరు పేజీలో, ఏడు పేజీలో రాస్తాడు. దాన్లో అసలు మనం ఇవ్వటమే తప్పు. ఏమని ఇవ్వాలంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక జీవనం అంటే ఎట్లా? దాన్ని ఎలా పొందాలి? ఇలా అడగాలి తప్ప నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అంటే ఒక పెద్ద Project లో చిన్న Product, ఒక చిన్న Product లో ఒక చిన్న ఆ Part, ఆ Part కి మూలమైంది. అంటే దాన్ని మనం దిగజారుస్తూ ఉన్నాం కాబట్టి ఒక విస్తృతమైనటువంటి వేద విద్యను మనం గనక నేర్చుకోగలిగినట్లయితే, వేదం ఎంత స్పష్టంగా చెబుతుంది, వేదమే భాగవతం. ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం భాగవతం అయితే, ఆ ఉపనిషత్తులు-- వేదాలకు ఉపనిషత్తులు భాష్యం అయితే, బ్రహ్మ సూత్రాలకు భాష్యం ఏది అంటే ఇదిగో ఈ భాగవతం. కాబట్టి ఈ భాగవతంలోకి వచ్చేప్పటికి మనం ఏం నేర్చుకుంటున్నామే, ఇవన్నీ సూక్తులు, ఇవన్నీ మాకు తెలియవా అంటే తెలుసు కానీ ఆచరిస్తున్నవి అన్నీ. మనం అలా ఉండగలుగుతున్నామా అని ప్రశ్న వేసుకోవటానికి ఇది వేదిక, ప్రశ్న సందించటానికి ఇది వేదిక. దీన్ని జీవితంలో చక్కగా ఆచరించడానికి రేపటి నుంచో, ఎల్లుండి నుంచో లేదు ఈ క్షణం నుంచో మనకిది ఒక అవకాశం. ఇవన్నీ కూడా మనం ఇవాళ మాట్లాడుతున్న ఈ ఏకాదశ స్కంధం అంతా కూడా బ్రహ్మసూత్ర భాష్యమే. ఇది ఎవరైనా చెప్తారా? అది వేరండి, అది మీకు అర్థం కాదు. ఇది-ఇది వేరు, ఇది వేరే ఇది. పైగా రుక్మిణీ కళ్యాణం అయిపోయిందంటే, అయిపోయింది భాగవతం అంటాం. కాలే, The quintessence of entire భాగవత is nothing but that eleventh chapter. పదకొండవ స్క-- ఇవాళ మాట్లాడుకున్నవి దేవుని గురించి తక్కువ, లోకాన్ని గురించి, మన గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. తర్వాత ఆధ్యాత్మిక జీవితానికి ఏం కావాలి అంటే స్వాధ్యాయం కావాలి. స్వాధ్యాయానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మన Shelf లో ఉన్నటువంటి పుస్తకాన్ని దేన్నో ఒకదాన్ని పట్టుకొని Open చేసిఆ పుస్తకాన్ని అశాంతము చివరి వరకు చదువుకొని ఒక చిన్న paper పెట్టుకొని ఆ paper మీద మనకు ఏం నచ్చినయో ఏం కావలసి వస్తుందో, దేన్ని వాడుకుంటే మనకు ఆనందం కలుగుతుందో అవి note చేసుకొని మళ్ళీ యధాస్థానంలో పెట్టి మళ్ళీ ఆ తర్వాత రెండవ subject కి వెళ్ళాలి. ఇది స్వాధ్యాయంలో ఉన్నటువంటి ఒక నియంత్రణ. ఇక అసలు స్వాధ్యాయం ఏమిటంటే పుస్తకం చదవటం పుస్తకంలో కథలు లేదా ఇవన్నీ కూడా పక్కన పెడితే మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. మనం అది ఒక్కటి చేయం. మనం చాలా పవిత్రులమని మనలో లోపాలు అసలు ఏవీ లేవని అని అనుకున్నట్లయితే ఇక స్వాధ్యాయ-పుస్తకాలే చదవక్కర్లా. మనకన్నీ తెలుసు కదా మళ్ళీ చదవటం ఎందుకు? భాగవతం మనకి అంతా కథలు తెలుసు కదా మళ్ళీ వినటం ఎందుకు? ఈ భాగవతం నేను మూడు సార్లు చెప్పా కదా మళ్ళీ ఐదోసారి ఎందుకు చెప్పటం? చెప్పాలి. పునః పునః చెప్పాలి. పునః పునః చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ battery ఎంత వరకు ఉంటుందో, ఈ భావాలు ఎన్ని క్షణాలు నెలకడ చెంది ఉంటాయో మనకు తెలియదు. మందిరంలో నుంచి బయటకు వెళ్ళగానే మన మనస్సులు మారిపోతాయి. లోక దృష్టితో ఈ మనసు నెలకడ చెంది ఉంటుంది. కాబట్టి స్వాధ్యాయం చాలా ప్రధానమైనది. దానికి మనకి నాలుగు చక్కగా చెప్పారు. భారతం, భాగవతం, రామాయణం తర్వాత భగవద్గీత. ఇవాళ చాలామంది భగవద్గీత చదవమని చెప్పారు గాని మన తాతలు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు వాళ్ళకొచ్చినన్ని భాగవత పద్యాలు మనకు రావు. నిద్ర లేవగానే ఆ దైవాన్ని సంకీర్తన చేస్తూ ఆ దైవ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుకుంటూ ఎంత చాకిరీ ఎంత పనిచేసి మనకి కంచంలో ముద్దలు పెట్టారో ఆ జాతిని మనం స్మరించాలి. ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. విష్ణు స్మరణము నిత్య స్మరణమే జీవితం. దాని విస్మరణమే మరణం. దాన్ని వదిలిపెడితే మనం బతికి ఉండి లేనట్టే లెక్క. ఏదో వాళ్ళకి ఆ రోజుల్లో చదువు లేదు. వాళ్ళకున్న చదువు గాని అంటే చదువు లేదు అని మనం పక్కకి నెడతామే దానికి ఒక సమాధానం ఏమిటంటే వాళ్ళు spirituality గురించి lectures ఇవ్వలా. spirituality లో నుంచి నేను ఇది ఇది చేస్తాను అది చేస్తాను అని వాళ్ళు చెప్పలా. spirituality కి అర్థం తెలియకుండానే వాళ్ళ జీవితంలో they translated into action. వాళ్ళందరికీ అన్నం పెట్టారు. ఏడుగురు బిడ్డలను కన్న తల్లి ఎనిమిదో వారాల అబ్బాయికి కూడా అన్నం పెట్టింది. వీళ్ళ ఏడుగురిని ఎలా చూసుకున్నదో అంతకంటే అధికంగా ఆ-ఆ ఎవరూ లేని ఆ వారాల అబ్బాయికి ఆవిడ అన్నం పెట్టింది. ఊళ్ళో పండగ జరుగుతుంది, పండగ వచ్చింది, ఏదో పెళ్లి జరుగుతున్నది మన వస్తువులన్నీ తీసుకెళ్లి ఆ యజమానికి ఇచ్చి బయట పన్న సందర్భమే లేదు. ఇవాళ ప్రపంచం మారింది. ఎందుకు మారింది? మళ్ళీ ఇటువంటి రోజులు వస్తాయా అంటే మనమంతా సంకల్పిస్తే వస్తాయి. అది అప్పుడు జరిగింది, ఇది ఇలాగే ఉంటుందంటే ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఏ గ్రామంలోనైనా మనమందరం గ్రామ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. ఏ గ్రామంలోనైనా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఎవరన్నా అమ్మారా? ఉన్నదంతా ఎవరికి కావాలంటే వాళ్ళకి-కావలసినది ఉంచుకునేవారు మిగతాదంతా అక్కడుండేది ఎవరికి కావాలో వాళ్ళు పట్టుకెళ్ళేవారు. దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి ఆ పూజారి, వాడికి డబ్బు, ఆయనకు డబ్బు ఇవ్వటం, ఆయన్ని కాపాడుకోవటం, ఆయన కడుపునిండా చక్కగా అన్నం తిన్నట్టుగా కుటుంబాన్ని రక్షించటం, వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేయటం, ఇదంతా సేవ కాక ఏమైంది? ఇవాళ మనం దాన్ని spirituality in action దానికి ఒక పెద్ద subject గా పెట్టి ఆధ్యాత్మిక జీవితానికి మనమంతా రథసారథులమైనట్లు మనమే వీళ్ళందరికీ మన తాత అమ్మమ్మలు వాళ్ళని గనక గుర్తు చేసుకుంటే వాళ్ళు చేసిన త్యాగం ముందు, వాళ్ళు చేసిన సేవ ముందు, వాళ్ళు చేసిన చాకిరీ యందు, వాళ్ళు బంధువులయందు వాళ్ళు చూపించిన ప్రేమ ముందు ఇవాళ మనకి అవేం లేవు. మనకి ఏదో వచ్చారు, పలకరించారు, మర్యాదగా కాసేపు మాట్లాడం, పంపించేసాం. ఆ రోజుల్లో ఎవరైనా వస్తే వాళ్ళు ఉండటానికి వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళని వెళ్ళిపొమ్మని ఒక్కరోజు అన్న దిక్కు లేదు. వాళ్ళు నెలలు తరబడి ఉండేవాళ్ళు. ఆ ఉన్నదాంట్లోనే కల్లో, గంజో అంటామే దాంతో వాళ్ళు గడుపుతారు. మరి దీన్ని మించిన అధ్యాత్మ ఎక్కడున్నది? భాగవతం ఇంతకంటే మనకు ఏం చెప్పాలి? త్యాగం అంటే ఏమిటో ఎలా define చేయాలి? విద్య అంటే ఏమిటో ఎలా చెప్పాలి? అజామీలుడు వంటి కొన్ని క్షణాల్లో మోక్షం పొందే మార్గాన్ని భాగవతం చెప్పి ఏడు రోజులు వింటేనే తప్ప రాజైనటువంటి పరీక్షిత్ మహారాజుకి మోక్ష ప్రాప్తి కలగలేదే. మరి ఇన్ని వైవిధ్య సుందరమైనటువంటి, వివిధమైనటువంటి, అనేకమైనటువంటి ఈ భావాలన్నింటినీ కూడా భాగవతం మనకిచ్చి ఏకాదశం వరకు వచ్చి ఈ స్వాధ్యాయము, శుచి, విద్య, పరస్పర ఆదరాభిమానాలు, పరస్పర గౌరవం, సమాజం పట్ల బాధ్యత అలాగే కడుపున పుట్టిన బిడ్డల పట్ల ఉండవలసిన నియంత్రించబడిన బాధ్యత. అపరిమితమైనటువంటి మమకార వాత్సల్యాలు కాకుండా అది ఎంతవరకు మనం చేయాలో అంతవరకు చేయాలి. ఆ వాళ్ళని వాళ్ళ దారిన వాళ్ళని మనం వెళ్ళనివ్వాలి.