⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఐశ్వర్యం కాబట్టి స్వామి ఇవాళ పుట్టపర్తిలో ధ్రువుడి కథ చెప్పుకొని, ఆ ధ్రువుడు ఎవరో మనం చూడలే, నేనైతే చూడలేదు. చూసినట్టుగా మనం చెప్ప, కథని చెప్పగలం గానీ ధ్రువుడ్ని చూసాం అని చెప్పడానికి లేదు. కానీ అటువంటి ధ్రువత్వాన్ని, ధృడత్వాన్ని ఈ ప్రపంచానికి సనాతన ధర్మం అనే ఆ frame లో దాన్ని నిలబెట్టి, ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్నంతా కూడా ప్రపంచానికి చాటించి, దీనిలో ఇది ఉన్నదీ, దీనిలో రెండే aspects ఉన్నాయి. ఒకటి సేవ, రెండవది ప్రేమ. దీనిని మించి సనాతనమైన ధర్మం ఇదే బోధించిందని స్వామి అనేక ఇతిహాసాల సారాన్ని, వేద సారాన్ని సంక్షిప్తం చేశారు. ఇది ఎవరైనా ఆశ్చర్యపోవలసిన విషయమే. పిల్లలతో స్వామి అనేవారు "మీరు రాష్ట్రపతి భవన్ కి వెళ్ళాలి అంటే మీ మీ రంగాలలో ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుని ఉండాలి. మీరు చాలా సమర్ధులై ఉండాలి. ప్రపంచమూ, ప్రభుత్వమూ మిమ్మల్ని గుర్తించాలి. అప్పుడు మీ, అప్పుడు రాష్ట్రపతి భవన్ కి నువ్వు వెళ్లగలుగుతావు. కానీ సత్యసాయి దగ్గర చదువుకునే పిల్లలు ఎవరి దగ్గరకైనా రాష్ట్రపతే కదలి వస్తాడు ఇంతే తేడా" అన్నారు స్వామి. వచ్చారా? రాలేదా? ఇది ధ్రువత్వం. ఇది ధ్రువుడి యొక్క ఆ నిశ్చితమైన భావన. ఇవన్నీ మనం compare చేసుకోవాలి. స్వామి ఊరికే దేవుడు దేవుడు అంటే ఆయన ఎలాగూ దేవుడే కాసేపు ఆపుదాం. ఎలా దేవుడు? ఎందుకు దేవుడు? ఎప్పుడు దేవుడు? ఎట్లా దేవుడు? ఎవరికి దేవుడు? ఇది ప్రశ్న కదా. కాబట్టి ధ్రువుడు తన మండలాన్ని తాను నిర్మించుకున్నాడు. తల్లి దగ్గరకు వెళ్దామని అనుకున్నాడు. అమ్మా! తపస్సు పూర్తయింది. ధ్రువ మండలం అనేదో ఏర్పాటు చేస్తున్నారట. ఇక నేను అక్కడ ఉండబోతున్నాను. ఋణం తీరిపోయింది. చూడండి వైరాగ్యం "వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర" తల్-తల్లి దగ్గరకు వచ్చాడు. తల్లి ఇలా వస్తున్నాడు ధ్రువుడు, తపస్సు అయింది, భగవత్ సాక్షాత్కారం అయింది అని తెలుసుకున్నటువంటి ఉత్తానపాదుడు తన తండ్రి ఎదురేగి కుమారుడికి స్వాగతం పలికాడు. రాజ సత్కారం చేశాడు. తన చిటికెన వేలు పట్టుకుని సింహాసనం దాకా తీసుకుని వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తాను పక్కన నుంచున్నాడు. తండ్రి నుంచున్నాడు, కొడుకు కూర్చున్నాడు. ఇది ఎక్కడి నుంచి లభించింది? ఈ గౌరవాలు ఎలా వస్తాయి? అంటే సచ్ఛీలత, సగుణము, సుగుణము, సంకల్పము, సంవిధానము, సమన్వయము, సంఘర్షణారాహిత్యము, ఇవన్నీ గనక ఉంటే ధ్రువుని వలె చిరస్థాయిగా ధ్రువతారయై నిలుచుగాక అంటాం. నీ పేరు ధ్రువతారగా విరుగొదులుతూ ఉంటుంది అంటాం. ఏదైనా శాశ్వతమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదన్నా ఉన్నదా అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఆత్మ శాశ్వతమైనది అయితే ఆదిభౌతిక స్థాయిలో, ఆదిదైవిక స్థాయిలో, ఖగోళ స్థాయిలో, సృష్టి స్థాయిలో ఏది శాశ్వతమైనది అంటే ధ్రువ మండలమే శాశ్వతమైనది. ఇది మన పిల్లలకు మనం చెప్పాలి. ఇవాళ భాగవతం ఊరికే కథలు చెప్పటం, animated భాగవతం చూపించటం, అవి కాదు చేయవలసింది. ఇది ఉన్నదంతా ఇక్కడ ఉన్నదీ. దీన్ని మన భాషలో చెప్పాలి. చెప్తే పిల్లలకు అర్థమవుతుంది. వాడికి కూడా పట్టుదల వస్తుంది. ఆ పట్టుదలలో నుంచి వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి. ఎన్ని అవరోధాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని జరిగినయ్. అట్లాగే రెండవ నీతి ఏమిటంటే ధ్రువుడు తన పినతల్లి కుమారుడికి దక్కిన ఆ సౌభాగ్యాన్ని చూసి బాధపడలే. నాకు దక్కలేదే అనుకున్నాడు, తప్పేం లేదు. వాడికి వచ్చిందే అని అనుకోలేదు. కనుక మనం జీవితంలో రెండు నేర్చుకోవాలి. మనకంటే సమున్నత స్థాయిలో ఉన్నవాణ్ణి చూసి లక్ష్యం పెట్టుకోవాలి. ఎప్పటికైనా నేను కూడా అలా కావాలి. అట్లా తయారు కావాలి, తప్పేమీ లేదు. కానీ అతన్ని దాటి వెళ్లాలనో, అతనికి ఏం రాదనో అట్లా కాదు. ఇక రెండవది మనకంటే ఇంకా కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటే వాణ్ని అవమానం, అవమానించకూడదు. వాడి పట్ల ఆదరంగా ఉండాలి. ఒకప్పుడు మన విద్యా విధానంలో ఒక bright student ఉంటాడు, పక్కనే పాపం బాగా చదువు ఎక్కువ రాని student ఉంటాడు. ఆ రోజుల్లో teacher ఏం చేశాడంటే, ఈ బాగా చదివేటువంటి విద్యార్థిని పిలిచి "వాడికి మార్కులు రావటం లేదు, నీతో పాటు కూర్చోబెట్టి చదివించు, ఇద్దరికీ మంచి మార్కులు రావాలి" అని అన్నాడు. ఈ marks వచ్చేవాడు వాణ్ని తీసుకునేవాడు ఒక స్నేహితుడిగా. ఇవాళ అది లేదు. స్పర్ధలు కదా. స్పర్ధ నాకే number one rank రావాలి, ఇంకోటి రావాలి. కాబట్టి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాణ్ని మనం ఎప్పుడూ కూడా నిరాదరించకూడదు, అవమానించకూడదు. ఎక్కడ తిరస్కారం మనకు లభిస్తుందో, దొరుకుతుందో ఆ తిరస్కారం నుంచి మనం పురస్కారం వైపు వెళ్ళాలి. బహుమతిని అందుకోవాలి, గౌరవాన్ని అందుకోవాలి, ఆదరాన్ని అందుకోవాలి. అందరి పట్ల సమభావంతో ఉండాలి. నేను అధికుణ్ణి అన్న భావన ఒకడికి ఉన్నట్లయితే వాడు ఎప్పుడూ అధికుడు కాదు, అధముడిగానే ఉండిపోతాడు. నేను అందరితో పాటే ఉన్నాను, వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏం లేదు, భిన్నంగా ఏం లేము, అంతా ఒక పని మీద వచ్చాం అని గనక మనం అనుకోగలిగినట్లయితే అది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ అనుకుంటున్న వాడికి సర్వోత్తమమైనటువంటి మనోనిర్మాణం జరుగుతుంది గనుక అది నిజమైనటువంటి ఆధ్యాత్మికం. What is real spirituality? అని ఎవరైనా ప్రశ్న వేస్తే, ఎందుకు స్వామినే వేశారు. స్వామికి ఓ సుమారు ముప్పై ఏళ్ళు వయసు వచ్చినప్పుడు "స్వామీ, అసలు అధ్యాత్మ అంటే ఏమిటో చెప్పండి" అని అడిగారు. మరి ఆ రోజుల్లో స్వామికి ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా మంచి దిగ్గంతములైన పండితులు వెళ్లారు. మామూలు వాళ్ళేం వెళ్ళలా. వాళ్ళంతా వెతుక్కుంటూ వెళ్లారు. వాళ్ళే ఆ ప్రశ్న వేశారు. ఏం లేదు, ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళటమే అధ్యాత్మ.వాళ్లకు అర్థమైంది. ప్రవృత్తి ఏమిటి? నివృత్తి ఏమిటి? అనుకోల వాళ్లకు ఆ మాత్రం కొంత సాధన చేశారు కాబట్టి ప్రవృత్తి అంటే మనస్సు ద్వారా, ఆలోచన ద్వారా, సంకల్పం ద్వారా, సంస్కారం ద్వారా ఎప్పుడైతే మనం ఒక ప్రవృత్తికి లోబడి, మానవ ప్రవృత్తికి లోబడి లేదా ఇంకా వదరని జంతు ప్రవృత్తికి లోబడి జీవించినట్టయితే అది ప్రవృత్తి మార్గం అవుతుంది. దాని నుంచి వదిలిపెట్టి, దూరమై అవన్నీ వదిలిపెట్టి అచ్ఛమైన, స్వచ్ఛమైన అటువంటి ఆత్మైక స్థితిలోకి ప్రయాణం చేయడమే అది నివృత్తి మార్గము. నిర్వృత్తి కాదు, నిర్వృత్తి అంటే పని లేకపోవడం. నివృత్తి, ఈ వృత్తి ప్రవృత్తి నుంచి నివృత్తికి వెళ్ళాలి. ప్ర అంటే ప్రముఖమైన, అద్భుతమైన, దగ్గరైన ప్ర అంటే దగ్గర, ప్ర అంటే ప్రాంతమైన అని అర్థం. సరే. కాబట్టి ఈ ప్ర-ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి వెళితే అది అధ్యాత్మ అన్నారు. ఓ పదహారు ఏళ్ళు గడిచిపోయింది. పదహారు ఏళ్ళు గడిచేప్పటికి స్వామికి ఒక నలభై ఆరు, నలభై ఎనిమిది ఏళ్ళు ఆ వచ్చింది ఆ దేహానికి. మళ్ళీ ఇదే ప్రశ్న వేశారు. "స్వామి మాకు అధ్యాత్మ మీరు ఉపన్యాసం ఇస్తున్నారు గానీ మాకు అధ్యాత్మ అంటే ఏమిటో తెలియటం లేదు, చెప్పండి" అన్నారు. "ఆ ఏం లేదు ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావటమే అధ్యాత్మ" అన్నారు. మళ్ళీ ప్రభావం అంటే ఏమిటి? ప్రభావం అంటే మనమంతా ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచాన్ని మనం ప్రభావితం చేయగలమో లేదో తెలియదు గానీ, ప్రపంచం చూపించే ప్రభావం మాత్రం మన మీద పడుతుంది. అంతే కదా. చెట్టు ప్రయాణం చేస్తుంటాం రహదారిలో ఓ చెట్లు ఉన్నాయి. చెట్టు నీ-నీడ మన మీద పడుతుంది తప్ప నీడను మనం తెచ్చుకోలేం. అలాగే ఈ ప్రభావాలు మన చుట్టూ ఈవేళ వేటిని మనం రోజూ వద్దనుకుంటున్నామో అవి లేకుండా జీవించలేని పరిస్థితి వచ్చింది. ఒక cell phone, ఒక TV లేకపోతే ఇది home theater, ఇవన్నీ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అవి మంచివి కాదు అని మనకు తెలుసు. కానీ లేకపోతే ఎట్లా అనేటట్టుగా జీవన ప్రమాణం మారిపోయింది. ఆ ప్రభావం నుంచి, ఈ ప్రాకృతమైన, భౌతికమైన, లౌకికమైన దాని నుంచి నీ స్వభావంలోకి రా. నీ స్వీయ స్వభావం ఏమిటి? స్వభావం అంటే temperament కాదు. దురదృష్టవశాత్తు చాలా తెలుగు పదాలకు English లో సమానార్థకాలు లేవు. Equivalent words లేవు. కాబట్టి ఇక్కడ ఏమిటి స్వభావం అంటే స్వీయ భావం. మనం ఉన్నాం నిన్నటి నుంచి, మొన్నటి నుంచి ఆత్మను గురించి మనందరం ఆత్మలమని అలాగే డెభై రెండేళ్ళు స్వామిని దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా అనటం, వినటమే గానీ అది ఏమిటి? మనం ఎందుకని ఆ స్థాయికి వెళ్ళాలి? మనం ఎప్పుడూ పెద్ద ప్రయత్నం చేసినట్టు అనిపించదు. ఏదో స్వామికి పాపం అట్లా పిలవటం ఇష్టం కాబోలు అనుకున్నాం అంతే, కాదు. ఆ స్వభావం అంటే స్వధర్మమే స్వభావం కావాలి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. మనం చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే దానికి ఆనందం కలుగుతుంది. దాని వలన ఆనందమే లభిస్తుంది. మనం చేయరాని పని, చేయకూడని పని, చేయలేని పని ఈ మూడు మనం మొదలు పెట్టాం అనుకోండి మనకు భయం కలుగుతుంది. ఏం లేదు అక్కడికి వెళ్ళి అక్కడ రెండు బండరాళ్ళు ఉన్నాయి కొద్దిగా ఎత్తి పక్కన పెట్టండి అని ఎవరన్నా మనతో అంటే మనం ఎత్తలేం. ఇంకా భయమేస్తుంది. కదా. లేదంటే అక్కడికి వచ్చి ఏదో మంచి భజన చేయండి అంటే హాయిగా వచ్చి పాడుతాం. ఇది స్వధర్మం. ఇది స్వీయ ధర్మం. అంటే మనం ఏమి చేయగలమో అది చేయగలిగితే అది స్వభావం అవుతుంది. అది physical level లో. ఆధ్యాత్మిక స్థాయిలో స్వధర్మం అంటే ఆత్మ ధర్మమే స్వధర్మం. ఆత్మను మించి మరొకటి లేదు అని మనం నిశ్చితమైన ధృవత్వంతో ఉండాలి. దృఢత్వంతో ఉండాలి. ఉన్నట్లయితే ఈ ప్రభావం నుంచి మనం నెమ్మదిగా స్వభావంలోకి రాగలుగుతాం. ఎలా ప్రభావం కలుగుతుంది అంటే మనం ఏదో రంగంలో మంచి సంగీత విద్వాంసులం అనుకోండి. మనకేదో పద్మవిభూషణ్ వచ్చింది అనుకుందాం లేదు భారతరత్న వచ్చింది అనుకుందాం. మనం ఆ ప్రభావంలో ఉన్నట్లయితే అది ఆనందాన్ని కలిగించదు. అసలు ఇదేముంది త్యాగరాజ స్వామి వారికి భారతరత్న ఎవరిచ్చారు? ఇచ్చారా? స్వామి దగ్గరికి నోబుల్ ప్రైజ్ గ్రూప్ వచ్చింది. మీకు తెలియని వారి కోసం చెప్తున్నా. వచ్చి ఏడు రోజులు ప్రశాంత నిలయంలో camp చేశారు వాళ్ళు. ఏడవ రోజు స్వామితో interaction ప్రారంభమైంది. స్వామి అడిగారు, "ఏమి ఇట్లా? ఎందుకు వచ్చారు? ఏం పని మీద?" అని అడిగారు. "స్వామి మీకు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని వచ్చాము" అన్నారు స్వామికి. స్వామి అన్నారు, "నోబుల్ ప్రైజ్ అంటే ఏమిటి? ప్రతి prize నోబులే కదా మళ్ళీ నోబుల్ ప్రైజ్ ఏమిటి?" అని తెలియనట్టుగా ఓ lead question వేశారు. వాళ్ళ దగ్గర జవాబు లేదేదో వారి పేరు మీద పెట్టాం. "సరే, ఇది ఎవరికి ఇస్తారు?" అని అడిగారు. "అదే ఎవరైతే ఒక్కొక్క రంగంలో సమున్నత స్థాయికి వెళతారో, ప్రపంచానికి కొత్తగా ఏదైనా విషయాన్ని కనిపెట్టి చెప్తారో వారికిది ఇస్తాం" అన్నారు. "మరి ఇక్కడ స్వామికి ఇవ్వాలని మీకెందుకు అనిపించింది? ఇక్కడేం కనిపెట్టబడలేదే, ఇక్కడేం కొత్తగా చెప్పలేదే, ఇదేదో కొత్తగా ఉంది మీరు ఈ మార్గంలోకి రండి అని చెప్పలేదే, పాతవన్నీ దండగ ఇదే మ-మణిపూస అని చెప్పలేదే. అసలు ఈ prize పేరు ఏమిటి?" అంటే "ఆ బా-బాబా నోబుల్ పీస్ ప్రైజ్" అన్నారు. "అసలు ఇక్కడ ఉన్నదే పీస్. దానికి ఇంకా మళ్ళీ prize ఎందుకు పొంచేసేయడం?" అన్నారు. అది. అంటే ఏదీ అంటకుండా ఉండగలగాలి. ఆయన స్వధర్మం, స్వామి స్వధర్మం ఏమిటంటే అధ్యాత్మ బోధ ఒకటి. సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించడం. దానిని సనూతనంగా ఆవిష్కరించడం. అలాగే రామాయణ, భారత, భాగవతాలన్నింటినీ, ఉపనిషత్తులన్నింటినీ, భగవద్గీతని అన్నింటినీ కూడా ఉపన్యాస పూర్వకంగా ప్రజలకు అందించటం. దానితో పాటుగా శంకర భగవత్పాదులు రాసిన భజగోవిందాన్నిసంస్కృతంలో ఉన్న దాన్ని తానే తెలుగులో రాసి, తానే స్వరకల్పన చేసి, తానే పాడి, ఈ ప్రపంచానికి తెలుగు భజగోవిందాన్ని అందించిన తొట్ట తొలి వ్యక్తి ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. వారే కూర్చున్నారు. సరే, అది వారి స్వభావం. అటువంటి స్వామిని, "స్వామి ఈ జిల్లాకు మీరు President అవ్వండి." "మా State కి ఆ Chief Minister అవ్వండి." అని అంటే అది ఒదిగే విషయమా? అయ్యే విషయమా? Vice Chancellor's meeting ప్రశాంతి నిలయంలో జరిగినప్పుడు Vice Chancellor అందరూ వచ్చారు. స్వామి చక్కగా అందరితో మాట్లాడించారు, విద్యా విషయాలన్నీ కూడా. కానీ స్వామి University ని చూసిన తర్వాత, స్వామి చెప్పినటువంటి కొన్ని మాటలు విన్న తర్వాత, ముక్తకంఠంతో University కి చెందిన అందరు Vice Chancellor India లో స్వామిని ఒకటి అడిగారు. "మా అన్ని Universities కి మీరు Chancellor గా ఉండాలి" అని అడిగారు. అప్పుడు స్వామి చెప్పారు "కర్తృత్వము లేని కార్యక్రమమే భగవంతుడి పని." Chancellor అననేది ఒక పదవి కదా, అదొక post. అటువంటివి ఇక్కడ అవసరం లేదు. మీరందరూ ఒక్కొక్కళ్ళు Chancellors అయ్యి స్వామికి ఆనందాన్ని కలిగించండి. అదే నాకు మీరిచ్చే కానుక, వెళ్ళమన్నారు. ఆ-అది స్వీయ స్వభావం అంటే అది. మళ్ళీ స్వామికి షష్టిపూర్తి అంటే అరవై ఏళ్ళు వచ్చినాయి. పూర్ణచంద్ర Auditorium లో మాట్లాడటానికి ముందు ఒక ప్రముఖులైనటువంటి వాళ్ళతో, పండితులతో Learned people తో వాళ్ళంతా మన గోకాక్ గారు వీళ్ళంతా వారు మాట్లాడుతున్నారు. అందులో ఒకాయన sudden గా "స్వామి మీ దేహానికి కూడా అరవై ఏళ్ళు వచ్చాయి కదా, అధ్యాత్మ అంటే మాకు అర్థం కావటం లేదు. అదేమిటో చెప్పండి." అని అడిగారు. మొదటిసారి ఏమన్నారు? "ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి రావటమే అధ్యాత్మ." రెండవ సారి ఏమన్నారు? "ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావటమే అధ్యాత్మ." ఆ రోజున ఆ క్షణాన స్వామి ఏమన్నారంటే, "మానవుడు మానవుడిగా జీవించగలిగితే అదే అధ్యాత్మ." అంటే స్వామి దేహానికి అరవై ఏళ్ళు వచ్చేసరికి స్వామికి అర్థమైపోయింది. మానవుడు మానవుడిగా లేడు, ఉండవలసిన రీతిలో లేడు. అలా ఉండగలిగితే దాని పేరు అధ్యాత్మ అని మీరు పేరు పెట్టుకోండి అని ముందుకు వెళ్ళిపోయినారు. అంటే మనం కూడా ఈ అధ్యాత్మని స్వానుభవంగా తీసుకోవాలి, స్వభావంగా మార్చుకోవాలి. ఎవరో చెప్పారని సేవ చేయొద్దు. ఎవరో చేయమన్నారు, చూపించమన్నారని ప్రేమ చూపించొద్దు. సహజాతమైనటువంటి భావనతో మన మనసులో నుంచి, హృదయ స్పందనలో నుంచి ఇవన్నీ పుట్టాలి. స్వామిని ఎవరు వెళ్ళి అడిగారు? నీళ్ళు ఇవ్వండి, colleges కట్టండి లేకపోతే మన ఊరంతా roads వేయించండి. ఆయన సంకల్పం. ఆ సంకల్ప శక్తి లో నుంచి ఇవన్నీ ఏర్పడతాయి గనుక, సంకల్పము సంస్కారంలో నుంచి మన జీవితాన్ని మనం చూసేటువంటి దృష్టిలో నుంచి మనం సంపాదించే సంపదకి మార్గాలు ఏమిటి? కొన్ని మార్గాలు ఉంటాయి. సన్మార్గాలు ఉంటాయి, కొన్ని దుర్మార్గాలు ఉంటాయి. అంటే ఆ-ఆచరించకూడని ఉంటాయి. అందులో ప్రధానంగా ఈ దేశంలో మనిషి సంపాదన రెండు విధాలుగానే సాగాలి. ఒకటి వృత్తిని ఆశ్రయించి సంపాదన సంపాదించాలి. సంపాదించకపోతే ఆ వృత్తికి గౌరవం లేదు. ఆ వృత్తి అంటే ఓ doctor గారు ఉన్నారు మన ఎదురుగానే ఉన్నారు. ఆయన ఏం చేయాలి? తన వృత్తి ధర్మం ప్రకారం మాత్రమే ఆ వృత్తిని నడిపించాలి. దాని వల్ల ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. ఆ వృత్తిలో నుంచి అనేక by pass మార్గాలు ఉంటాయి. దాని జోలికి ఆయన వెళ్ళిపోతే ఆయన వ్యక్తిత్వం ఆ దానికి విఘాతం కలుగుతుంది. అలాగే కష్టపడి చెమటోర్చి రూపాయిన పది రూపాయలు చేయాలి. అది ఒక రూపాయి పది రూపాయలు కావాలంటే చాలా కష్టం. రూపాయిలో ఎంతో కొంత మిగులుస్తూ మిగులుస్తూ వెళితే తప్ప అది పది రూపాయలు కాదు. ప్రపంచంలో ధర్మవడ్డీ అని ఒకటి ఉండేది. ఆ ధర్మవడ్డీ ఇప్పుడు పోయింది. అధర్మవడ్డీ మాత్రమే ఉంది. దాని మీద ఆ తీసుకున్నవాడు వడ్డీ కట్టలేక యాతన పడి కుటుంబము, ప్రాణము పోగొట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి వడ్డీ వ్యాపారం మంచిది కాదు. అది ఎవరన్నా చేస్తే దాన్ని తగ్గించుకోండి. మంచిది కాదు. చక్కగా ఎన్నో పనులు, ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు. దానిలో నుంచి మీ లాభాన్ని స్వామి చెప్పారు. MBA students తో మాట్లాడుతూ ఆ మీరు ఈ University నుంచి బయటకు వెళ్ళిపోతారు, ఎక్కడక్కడో ఉద్యోగాలు చేసుకుంటారు లేదా వ్యాపారరంగంలోకి దిగుతారు. మీరంతా వృద్ధిలోకి రావాలి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. Ten percent profit దాటకుండా మీరు వ్యాపారం చేయండి అని చెప్పారు. అది benchmark. ఇది వేళ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ధృవత్వంలో నుంచి వచ్చే మాటలు ఇలా ఉంటాయి. ఎవరైనా చెప్తారు నువ్వు హాయిగా వడ్డీ వ్యాపారానికి ఓ పురోహితుడు వస్తాడు. వాడే కొబ్బరికాయ కొట్టిస్తాడు. ఏ నుంచి విజ్జురం నుంచి నువ్వు ఇష్టం unlimited గా సంపాదించు అంటాడు. ధర్మం కాదు అది. ధర్మం కాదు. అసలు ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమమైనా భగవంతుడికి నివేదన చేసినట్లుగా చేయాలి. సరే ఉత్తానపాదునిది రెండవ point. మూడవ point ఇంకొక్కటుంది. ఏది? ధ్రువుడి చరిత్రలో నుంచి మనం తెలుసుకోవాల్సిన point ఏంటంటే తల్లికి సంతోషం కలిగించండి. తల్లికి గనక అవమానం గనక కలిగితే ఆ అవమానాన్ని తల్లి తన కళ్ళలో, తన body language లో, నా కొడుక్కి ఇలా జరిగిందే అన్న భావన గనక కలిగినట్లయితే తల్లి ఊహించనంత ఎత్తుకు నువ్వు స్వయంకృషితో ఎదిగి తల్లికి ఆనందం కలిగించు. తన తండ్రి అయిన ఉత్తానపాదుడు సునీతి దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకొని మహారాజు అయి ఉండి, "నీ పట్ల చాలా నిరాదరణగా నేను బతికాను."చాలా అధర్మం చేశాను నేను, ఇవాళ మన బిడ్డ మన ధ్రువుడు ఒక మండలం సృష్టింపబడింది వాడికి ధ్రువ మండలం. నాకు చాలా ఆనందంగా ఎట్లా ఉన్నదో, నిన్ను కష్ట పెట్టినందుకు ఎంత దుఃఖం ఉన్నది. నన్ను మన్నించమని అడిగాడు ఉత్తానపాదుని. ఇది పురాణంలో పురుషులు స్త్రీలను మన్నించమని అడగటం ఎక్కడా చూడం. స్త్రీలు పురుషుల్ని అడుగుతారు మన్నించండి, క్షమించండి, ప్రాధేయ పట్టాలి అవన్నీ అట్లా రాశారు. కానీ ఈ ఒక్క కథలో మాత్రం ఉత్తానపాదుడు తన భార్య అయినటువంటి సునీతిని నన్ను మన్నించమని అడుగుతాడు. ఇది ఒక మానవ మనస్తత్వానికి దర్పణంగా మనం దీన్ని భావించాలి. మనస్సు, ఇవాళ మనం ఉన్నాం అంటే మనము అంటే ఏమిటి? ఆకారమా? కాళ్లు, చేతులు, పొట్ట, తల ఇదా? కాదే. మన మనస్సే మనం. ఆ మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? సంస్కారమే. అదే మనం అవుతున్నాం కాబట్టి ధ్రువుడి యొక్క చరిత్ర మనకి ధ్రువత్వాన్ని, దృఢత్వాన్ని, పూర్ణత్వాన్ని, సంపూర్ణత్వాన్ని, ఆత్మన్యూనత నుంచి ఆత్మగౌరవం వైపు నడిపిస్తుంది. అలాగే ఒక అవమాన భారం నుంచి అభిమాన భారం వైపు మనల్ని నడిపిస్తుంది. అలాగే ఒక తిరస్కారం నుంచి పురస్కారం వైపు వెళుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో ఎవరైనా మనల్ని అవమానిస్తే దానికి దుఃఖపడి ప్రయోజనం లేదు. ఏం చేయాలి? మనం ఇతనిని అవమానించటం మనం చేసిన తప్పని అవతల వాడు వచ్చినట్టుగా మనం ప్రవర్తించాలి. ఇది ధ్రువుడి కథని రెండు నిమిషాల్లో ముగించేయగా చాలా మానసిక విశ్లేషణ. మనకు మామూలుగా ఒక సైన్స్ ఉంది. దాని పేరు Behavioural Science అంటాం. మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక మనిషి ఇంకో మనిషితో ఎట్లా ఉండాలి? ఒక పురుషుడు ఒక స్త్రీతో ఓ మర్యాద రేఖను దాటకుండా ఎలా ప్రవర్తించాలి? ఇద్దరు స్త్రీలు ఎలా ఆలోచనలు చేయాలి? ఇవన్నీ కూడా ధ్రువత్వంలో నుంచి మనకు పుడతాయి కాబట్టి ఈ చతుర్థమైనటువంటి స్కంధంలో ధ్రువుడి కథ, దానిలో ఒదిగిపోయినటువంటి స్వామి కథ కూడా ఇదేమో అనుకోము అలా వస్తాయి అంతే. ఆ స్వామి ఇవాళ మన, నా దృష్టిలో ఎక్కడైనా ధ్రువుడు ఉన్నాడా అంటే అవమానంలో నుంచి రాలే, ఆయన వచ్చిన అవతారమే అది. వారు ఎందుకు వచ్చారో కూడా చెప్పారు స్వామి. వేదోద్ధరణ, దీనజనోద్ధరణ అవన్నీ చెప్పారు, ధర్మోద్ధరణ. అనేకమైన అంశాలు తీసుకొని స్వామి వచ్చి ఎనిమిదేళ్ళు చిన్నతనంలోనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని కడిగేటువంటి పని పెట్టుకొని, పదహారు ఏళ్ళు వచ్చేప్పటికి నీకూ నాకూ సంబంధం లేదని, కుటుంబ బాంధవ్యాలను తెంచుకొని, ఈ, ఈ గది నుంచి రోడ్డు దాటి ఆ గదికి వెళ్ళినప్పుడు 1950 నాటికే ప్రశాంతి నిలయం నిర్మాణం ఎలా చేయగలిగారు? ఆయన వయస్సు ఇరవై నాలుగు ఏళ్ళు అప్పుడు. ఇరవై నాలుగు ఏళ్ళకి ఇప్పటికి Education పూర్తి కావటంలా. మరి వాళ్ళు ప్రశాంతి నిలయం కట్టినప్పుడు అందరూ స్వామిని అడిగారు, "ఎందుకు స్వామి ఇంత పెద్ద building కట్టించావు? ఎవరు వస్తారు నీ దగ్గరికి?" పది మందికి అంటే, ఆరు వందల మంది, పోనీ రెండు వందల మంది అంటే, "చూస్తూ ఉండండి" అని చెప్పారు స్వామి. ఇవాళ దేవిత మనకు తెలుసు. మనం దాన్ని పెద్ద expand చేసుకొనక్కర్లా. అంటే భవిష్యత్తును దర్శనం చేయాలి. ధ్రువుడు ఈ ప్రపంచానికి తాను నిరాదరణ పొందాను అన్నటువంటి ఆత్మన్యూనతలో నుంచి తనను తాను బయట పడేసుకున్నాడు. This is really unfoldment, Personality unfoldment అంటాం. ఆ unfoldment వికాసమానం జరగాలి. ఇక్కడ ఒక చిన్న సాహిత్య పరమైన విషయం, జీవితానికి సంబంధించింది చెప్తాను. ధూర్జటి అని ఒక కవి ఉన్నాడు. అష్టదిగ్గజాల్లో కృష్ణరాయల ఆస్థానంలో ఒకడున్నాడు. అతను ఆస్థానానికి వెళ్ళేవాడు రోజూ. రాజు గారి మీద ఒక పద్యం రాసేవాడు. రాజుగారు మెడలో ఉన్న రత్నాల హారం ఆయనకిచ్చేసేవాడు. మరనాడు రాణిగారి మీద పాడేవాడు, పద్యం రాసేవాడు. ఆ రాణిగారు ఆ కట్టుకున్న వడ్డాణాన్ని తీసి ఇచ్చేసేది. రాజనర్తకి మీద ఒక పద్యం రాసేవాడు. ఆయనకి ఆస్థానం, ఆయనకి డబ్బు ఇచ్చేది. ఇలా పద్యాలు రాస్తున్నాడు. రాజు మీద, రాణి మీద, రాజనర్తకి మీద పద్యాలు నడుస్తూ ఉన్నాయి. సంపద అపారమైపోయింది. భరించలేనంత సంపద ఏర్పడింది. అప్పుడు ఒక రోజు ఆలోచన చేశాడు. ఎంతకాలం ఇది? పద్యం రాయగలిగిన శక్తి నాకు ఉండి కూడా, ఓ రాజు వీడు ఎంతకాలం రాజుగా ఉంటాడో తెలీదు. ఆ రాణిగారు ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఈ రాజనర్తకి ఈ ఉద్యోగం ఎంత, ఎంతకాలం చేస్తుందో తెలీదు. అశాశ్వతమైన ఈ వస్తువుల మీద పద్యం రాశానే, శాశ్వతమైనటువంటి భగవంతుడి మీద ఒక్క పద్యం రాయలేదు అని అనుకున్నాడు. అనుకుంటే రాయగలడా? భగవంతుడి అనుగ్రహం ఉంటే మాట పెగలగలుగుతుంది. సరే, ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడు. "రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు, వారిచ్చు అంభోజాక్షి చతురంఠయాన తురగీ భూషాదుల్" చతురంఠయాన అంటే పల్లకి. పల్లకి, ఆభరణాలు, చీని చీనాంబరాలు, పొలాలు, అగ్రహారాలు, ఇవన్నీ కూడా ఆత్మవ్యధా బీజములు. ఆత్మకి, నా లోపల ఎక్కడో ఒక ఆత్మ ఉన్నది. దానికి వ్యధ కలిగించటానివి బీజం, కారణమవుతున్నాయి. తదపేక్ష చాలు. ఇహ వద్దు అవి. మరి ఏం కావాలి? "జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా". నేను బతికుండగానే, ఇంద్రియాలు పనిచేస్తుండంగానే, నేను చైతన్యవంతంగా ఉండగానే ఆ జ్ఞానలక్ష్మిని, నాకు ఈ లక్ష్మిని ఇచ్చావు. నాకింక అక్కర్లేదవి. జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము. జాగ్రదవస్థలోనే నేను పరిణామం చెందాలి. మేలుకొని ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్లగలమో, ఏగా, ఏ రకంగా మారగలమో, ఏ రకంగా చేయగలమో, మనల్ని మనం ఎలా అద్దుకోగలమో, దిద్దుకోగలమో, సరిదిద్దుకోగలమో, తీర్చిదిద్దుకోగలమో, అన్నీ బాగున్నప్పుడే జరగాలి తప్ప అన్నీ ఉడిగిపోయిన తర్వాత చిట్టచివరికి నిస్సహాయ స్థితిలో భగవత్ కీర్తన చేయకూడదు. అన్నీ బాగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి గురించి ఆలోచన చేయాలి అని అనుకున్నాడు. అనుకుంటేఇక పద్యం రాయటమే మిగిలింది పద్యం రాస్తే ఎన్ని కొన్ని వేల పద్యాలు రాసాడు అప్పటికే. కాళహస్తి దగ్గర ఉన్నటువంటి సువర్ణ నది సువర్ణ ముఖి నది తీరంలోకి వెళ్లి కూర్చున్నాడు ఆయన. పద్యం పెగలదే ఏం రాయాలో తెలియదే దేవుడిని ఇంకా చూడలేదు రాజే దేవుడు అనుకున్నాడు ఈయన. దేవుడే మనకు రాజు అని ఇంకా అనుభవంలోకి రాలా. కానీ ఒకరోజున వస్తుంది ప్రతి వాడికి నిరాదరణ ఉండదు భగవంతుడు నిరాదరణ చెయ్యడు ఏదో రోజున కల్పిస్తాడు. కూర్చుంటే ఆ నది నీళ్లు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి. ఆ నెమ్మదిగా ప్రవహిస్తుంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు దానిలో పూలుగా తేలి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. కన్నెత్తి చూశాడు తూర్పు కొండ కనిపించింది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహం మువార్ధి ధరీధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది తారా నివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగంబు పె ప్రాచీ దిశన్. ఆ తూర్పు కొండ ఆయనకి శివ లింగంలా కనిపించింది. ఆ పైనుంచి పడుతున్న మంచు బిందువులు కదా మంచు బిందువులు నెమ్మదిగా నీళ్లై వస్తుంటే అది అభిషేక జలంలా అనిపించింది. ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత వలన ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు పూలలే పూలై నెమ్మదిగా వెళ్తున్న పూజా పుష్పాలై వెళ్ళిపోతున్నాయి. చీకటి పోలేదు వెలుగు రాలేదు ఆ చీకటి చిమ్మ చీకటి చిరు చీకటి తన చుట్టూ ఆవరించి ఉంటే అదే ధూపం అనిపించింది. అంతేకాదు ప్రభా రాజి కౌముది ఇంకా తలవారితే చంద్రుడు కనపడ్డు. ఆ మిణుకు మిణుకుమంటున్న స్వల్పమైనటువంటి ఆ చంద్రకాంతి శివుడికి ఇస్తున్నటువంటి నీరాజనం వలే కనిపించింది కర్పూర కళికా కళ వలే కనిపించింది. అద్భుతం అనుకున్నాడు. ఓహో ఈ ప్రకృతి అంతా శివాయతనంగా ఉన్నది నేను దేవుడో ఎక్కడో నుంచో వస్తాడు నా ముందు సాక్షాత్కరిస్తాడు సాక్షాత్కరిస్తే అప్పుడు పద్యాలు రాద్దాం ఆయన్ని చూసి అనుకున్నాను. అసలు కనిపిస్తున్న ప్రకృతే ఇంత గొప్పది శివుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు అనేటువంటి ఒక పూర్ణ అద్వైత నిర్గుణ పరబ్రహ్మ తత్వోపాసనా భావన లోకి ఒక్క క్షణంలో వెళ్లిపోయినాడు. ఆ క్షణంలో పుట్టిన పద్యమే ఇది. గ్రావము అంటే కొండ ఉదయ గ్రామం అంటే తూర్పు కొండ అది శివ లింగంగా కనిపించింది. తర్వాత కావ్యం రాయాలి. ఇంకా అనుకున్నాడు ఎవరిదో ఆ కథ ఈ కథ తర్వాత చూద్దాం ముందు నన్ను నేను ఆవిష్కరించుకొని తర్వాత కథలోకి వెళ్దామనుకొని. ఒక పద్యం మొదలు పెట్టాడు ఆ పద్యం ఏంటి ఇంకా ఆయనకి ఆ వ్యథ పోలే. వాడు నాకు డబ్బు ఇచ్చాడే, వాడు నాకు గోవులిచ్చాడే, అగ్రహారాలు ఇచ్చాడే, ఆ చీని చినాంబరాలు ఇచ్చాడే, ఇవన్నీ ఎట్లా? వీటన్నింటి నుండి నేను ఎలా బయటపడాలని ఆయన అనుకున్నాడు. నువ్వు నాకు మనస్సు అనేటువంటి హృదయం అనేటువంటి ఒక మొగ్గని నువ్వు నాకు ఇచ్చావు. ఆ మొగ్గ పాపము అనేటువంటి అనేక పాపాలు చేసిన కారణంగా పాపాంబుధారా వేగంబు నన్మన్ మనోజ్య సముదీర్ణత్వంబు కొల్పోయితిన్ దేవా! నువ్వు నాకు జీవించటానికి అవకాశం ఇచ్చావు గాని సంపాదించటానికి దాన్ని అవకాశంగా నేను అనుకున్నాను. అనేక పాపకార్యాలు చేశాను స్తుతించని వారిని గురించి స్తుతించాను ఎవరిని గురించి పొగడకూడదో వారిని గురించి పొగిడాను మహాపాపం చేశాను. అది కాల మేఘమై కాల మేఘమై అది వర్షిస్తూ ఉన్నప్పుడు వాకిట్లో ఉన్నటువంటి నా గుండె అనేటువంటి ఆ మొగ్గ నీళ్లు పడి పడి పడి వికాసమానం చెందలేదు. దానికి చూడండి మన వాకిట్లో కుండీలో మొగ్గ ఉంటే దానికి కాస్త వేడి కావాలి కాస్త వెలుగు వెలుతురు కావాలి ఉన్నప్పుడే అది పుష్పంగా వికసిస్తుంది. కానీ దాని మీద కంటిన్యుయస్ గా వర్షం గనక పడుతూ ఉంటే ఆ మొగ్గ అక్కడే మాడిపోతుంది. అదే జరిగింది నాకు అయితే నేను బాధపడటం లేదు. మన్ మనోజ్య సముదీర్ణత్వంబు కొల్పోయితిన్ దేవా! ఈ కరుణా శరత్ సమయమింతే చాలు తద్భావనా సేవన్ తామరతం పరై మనియదన్ శ్రీ కాళహస్తీశ్వరా! అయిందేదో అయిపోయింది ఎంతకాలం రాజు గారిని తిట్టను తిట్టడం అంటే ఆయన్ని నేను పాడాను నేను మాట్లాడాను ఆయనకిష్టమై నాకు ఇచ్చాడు ఆయన్ని నేనెందుకు తప్పు పట్టాలి నేను తీసుకోకుండా ఉంటే బాగుండేది కదా అని అంటూ ఈ క్షణానికి ఏం పోగొట్టుకున్నానో తెలుసుకున్నానే అది చాలా ఇంపార్టెంట్. ఇక రావలసింది ఏమిటంటే నీయందు సద్భక్తి కావాలి ధృడమైన ధృవమైనటువంటి ఒక నీతివంతమైన జీవితం నాకు కావాలి. ఈ కరుణా శరత్ సమయం ఇంతే చాలు ఇది ఏ రుతువో నాకు తెలియదు కానీ నీ కరుణ అనేది నా మీద ప్రసారం జరిగింది కాబట్టి ఇది నాకు శరత్కాలం గా భావిస్తున్నాను. ఇక్కడి నుంచి నేను నీ చింతనలో, నీ భావనలో, నీ సేవలో, సేవ అంటే భావన అని అర్థం. నీ సేవనా భావనలో నా జీవితాన్ని తామర తంపర చేస్తానన్నాడు. చూడండి మన చెరువులో ఒక తామర విత్తనం గనక వేస్తే ఒకటి ఒకటి అల్లుకుంటూ ఎట్లాగైతే మొత్తం పాండంతా కూడా పూలతో నిండిపోతుందో ఆకులతో నిండిపోతుందో నా జీవితాన్ని భగవద్భక్తితో ఇలా నింపుకుంటాను అన్నాడు. ఆ పట్టుదల ఉండాలి శ్రీవిద్య.