Skip to content
Transcript తెలుగు
గత నాలుగు దశాబ్దాల పైగా సాగుతున్నటువంటి దాంట్లో దీని అర్థం ఇది. అయితే స్వామి పరమమహేశ్వర స్వరూపుడు తర్వాత సచ్చిదానంద గురుమూర్తి అటువంటి స్వామి కి నేను నమస్కరిస్తున్నాను అని అన్నప్పుడు జరగబోయే సత్సంగం అంతా మనం చేయం ఆయన చేస్తారు, ఆయన చేస్తారు మనం వింటాం ఇంతే. శ-శరణాగతి భావంతో గనుక మనం ఉండగలిగినట్లయితే మనకు తెలియని అనేకానేక రహస్యాలు అనేకానేకమైన విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి, అవగతమవుతాయి. మనకు కూడా లోపల ఎక్కడన్నా సందేహాలు పొరలలో దాగి ఉన్నట్లయితే అవన్నీ నశించిపోతాయి, సమసిపోతాయి. కాబట్టి మనం ఎవరిని ఆహ్వానం చేసుకోవాలి అంటే గురువు అంటే మనం చెప్పుకున్నాం "ఈశ్వరో గురురాత్మీతి మూర్తి భేద విభాగిణి" ఈశ్వరుడు, గురువు, ఆత్మ మూడు భిన్నంగా కనిపించినా వాళ్ళు ముగ్గురూ ఒక్కటే. ఎప్పటికైనా కంటితో చూడవలసినటువంటి పరమాత్మని ఎప్పటికైనా తపస్స్వాధ్యాయ సంపన్న స్థితిలో పట్టుకోవటానికి పట్టుకొని అదేమిటో కనుగొనటానికి ఒకటి కనటానికి రెండవది కనుగొనటానికి మధ్య రెండు కలిసిన స్వరూపం ఏదన్నా ఉంటే అది నిజమైనటువంటి గురు స్వరూపం. గురువేషం కాదు గురువుగా ఉండాలి, గురువుగా జీవించాలి, గురువుగా పది మందికి సత్యం చెప్పాలి, అన్వర్ధం చెప్పకూడదు. దాంట్లో మన వేదంలో కూడా వేదం చదవాలి ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు సాయంకాలం మనకి వేద స్వస్తి అని చదువుతారు. వాళ్ళు ఎలా చదువుతున్నారు అని గనక ఆలకించినట్లయితే అద్భుతంగా చదువుతున్నారు. మరి ఏమిటా అద్భుతం? అంటే నా శీఘ్రి తొందర తొందరగా చదవరు నా శిరఃకంపి తలకాయ అటు ఇటు ఊపుతూ బాడీ అటు ఇటు ఊపుతూ కదలరు, అన్వర్ధం చెప్పరు. వారికి తెలిసినంత వరకు పర్ఫెక్ట్ గా చెప్తారు ఇంకా ఏదన్నా తెలియవలసి ఉంటే నెమ్మదిగా తెలుసుకుంటారు. కానీ చెప్తున్న దానిలో అన్వర్ధం లేదు, అపార్థం లేదు ఉన్నదంతా సత్యమే చెప్తున్నారు గనుక, ఇవన్నీ కూడా వేదం చదవటానికి గల ప్రమాణాలు. వాటిని మనం భావన చేసినట్లయితే భాగవతం కూడా ఒక ప్రమాణం చేసింది, రామాయణం ఒక ప్రమాణం చేసింది. ఇక్కడ భాగవత ప్రమాణం ఏమిటయ్యా అంటే నిజమైనటువంటి ఒక భక్తుడు ఎవరైనా నాకు నిజంగా హరి దయ కావాలి, నాకు ప్రపంచం అక్కర్లేదు, సంపదలు నాకు అక్కర్లేదు అసలు ఏమి వద్దు నాకు ఒక్క హరి కావాలి అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అటువంటి వాడు గనక నా దగ్గరికి వచ్చి అడిగితే నేను మొట్టమొదట చేసే పని ఏంటంటే వాడి సిరిని హరిస్తా అన్నాడు. ఎందుకని? హరితో కూడిన సిరి మనకు కావాలి హరి కావాలి సిరి కావాలి రెండు పార్శ్వాలు కావాలి. కానీ భాగవత ప్రమాణం ఏంటంటే సిరి వెళితే తప్ప నీకు హరి అర్థం కాదు. డబ్బు సిరి అంటే అర్థము, సంపద, ఐశ్వర్యం వీటన్నింటినీ నువ్వు నెమ్మదిగా వదులుచుక పోయినట్లయితే ఈశ్వరాత్మను నీవు ఎలా పట్టుకోగలవు? ఈశ్వరానుభవాన్ని నువ్వు ఎలా పొందగలవు? ఈశ్వర తత్వాన్ని నీదిగా ఎలా చేసుకోగలవు? అనేటువంటి ఒక భావన కోసం మనకి భాగవత ప్రమాణం ఉంది. అయితే ఇక్కడ చమత్కారం ఏంటంటే అయ్యా మాకు భాగవతం చదివితే ఉన్న సిరి పోతుందా? అని ఎవడన్నా అన్వర్ధం చెప్పే వాడు ఉంటాడు ఎవడో ఒక చోట మూల కూర్చుని ఉంటాడు. వాడికి సమాధానం ఏంటంటే, "నీకున్న సిరి పోతుంది నిత్య సత్య శాశ్వతమైన జ్ఞానలక్ష్మి నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఏది కావాలో నిర్ణయించుకో" మరి అందరూ నిర్ణయించుకోలేరు గనుక, అందరికీ జ్ఞానలక్ష్మి అబ్బదు గనుక, అందరికీ జ్ఞానలక్ష్మి తోనే జీవితం గడవద్దు గనుక ఇటు హరిని అటు సిరిని రెండింటినీ కూడా తలచుకుంటూ కొలుచుకుంటూ వారు చెప్పినటువంటి అనేక మార్గాలలో గనక మనం వెళ్లగలిగినట్లయితే భాగవతం మనకి అర్థమవుతుంది. పొద్దున మనం కుబ్జ దాకా వెళ్ళాం కదా, సరే ఇది ఎలా జరుగుతున్నది భాగవతం? ఎన్నేళ్లుగా జరుగుతున్నది? ఇది ఎందరి కంఠాలలో పలికిందో మనకు లెక్కలేదు. ఎందరి కలాలలో ఇది రాయబడిందో తెలియదు. అసంఖ్యాకంగా, అనూచానంగా, సాంప్రదాయకంగా భారతదేశంలో ప్రధానంగా ఉత్తర భారతంలో మనకు దక్షిణ భారతంలో మన ప్రాంతంలో మనం రామాయణం ఎక్కువ చెప్పుకుంటాం, భాగవతం తక్కువ చెప్పుకుంటాం. మళ్ళీ భారతం తక్కువ ఎక్కువ చెప్పుకుంటాం ఎందుకంటే దాంట్లో కావలసినంత కొట్లాటలు ఉన్నాయి. మన నైజానికి అనుగుణంగా ఉండేది భారతం కాబట్టి భారతము రామాయణంలో కూడా యుద్ధాలున్నాయి భాగవతంలో యుద్ధం లేదు, స్పర్ధ లేదు. వాడి పాపం పండి ఇక వాడు పాపం కూడా చేయటానికి వీలులేని స్థితి వచ్చినప్పుడు మాత్రమే శ్రీ మహావిష్ణువు అక్కడికి దాంట్లో నిన్నటి వరకు ప్రవేశించి సమస్యను పరిష్కారం చేసి ధర్మసంస్థాపన చేశాడు. అదంతా మనం చెప్పుకున్నాం. ఒకసారి ఒక పండితుడు చాలా కాలం క్రితం ఒక ప్రదేశం నుంచి ఇంకో ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఆయన. మంచి ఎండాకాలం. ఆయనకి మట్ట మధ్యాహ్నం వేళ మిట్ట మధ్యాహ్నం అనేది మట్ట మధ్యాహ్నం వేళ దాహం వేసింది, బడలిక కలిగింది. కనుక అక్కడ రోజుల్లో దారి పొడుగునా అటు ఇటు చెట్లు ఉండేవి. మంచి చెట్టు తీసుకొని చెట్టు కింద ఆయన పడుకున్నాడు. పడుకుంటే ఆయనకు మాగన్నుగా నిద్రపట్టింది. ఇంకా నిద్ర లోపలికి వెళ్ళలా కానీ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు విపరీతంగా అల్లరి చేస్తున్నాయి కిచకిచలు. చూశాడు ఆయన, ఇంత గందరగోళంలో నాకు నిద్ర ఎక్కడ పడుతుంది? ఇక్కడ చెట్టు చూసినా అట్లాగే ఉన్నదే అని అనుకొని ఆయన మహా పండితుడు, జ్ఞాని గనుక పక్షి భాషలోకి తన మనస్సును ప్రవేశపెట్టి అవి ఏం మాట్లాడుకుంటున్నాయి అని గ్రహించాడు.ఏం గ్రహించాడు? ఎలా గ్రహించాడు? ఏమున్నది దాంట్లో అంటే, వృక్షే వృక్షే వీక్షిత పక్షిసంఘ, సంఘే సంఘే మంజులా లాప వాక్యం. వాక్యే వాక్యే మంజులా మోద వాక్యం. వాక్యే వాక్యే మంజులా లాప గోష్ఠి. గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్ర. చూడండి ఈయన నీడలో పడుకున్నాడు. ఇంకా తామసం ఉంది, అరసట ప-పడ్డాను నిద్రిస్తున్నది. ఆకలి ఉంది, దప్పిక ఉందని ఈయన పడుకుని విశ్రాంతి చెందితే, చెట్టు పైన ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఎండకి expose అయి ఉన్నాయి. అవి తత్-- చిన్న ప్రాణాలు అవి తట్టుకోలేవు మన లాగా. కానీ, సమయంలో ఎవరూ అక్కడికి పాదచారులు రారు కాబట్టి వాళ్లలో అవి ఒకటొకటి మాట్లాడుకుంటున్నాయట. ఒక పెద్ద పక్షి అందులో ఉన్నటువంటి ఒక పెద్దది మే-- ఒక కథ చెప్తూ ఉన్నది. దానిలో ఒక మంజులా లాప వాక్యం. మంజులమైన, లలితమైన, స్వచ్ఛమైన, అచ్చమైన లాలిత్యంతో కూడిన మాటలు చెప్తూ ఉన్నది. ఆమె చెప్తున్నప్పుడల్లా ఆమోద వాక్యం రెండవది. నువ్వు చెప్తున్నది సరిగ్గా లేదనటం లేదు, బాగా చెప్తున్నావ్ ఇంకా చెప్పు అంటున్నాయట. ఒకటి ఆలాప వాక్యం రెండవది ఆమోద వాక్యం. [సినిమా] అయిన తర్వాత వాక్యంలో ఏముందంటే వాక్యే వాక్యే మంజులా లాప గోష్ఠి. అవి గోష్ఠి చేస్తున్నాయ్, discussion చేస్తున్నాయ్. పెద్ద పక్షి ఏం చెప్తున్నదో వాటిని ఇంకా ఇంకొద్దిగా చెప్పు మాకు అర్థం కావటం లేదని అడుగుతున్నాయ్. ఏమిటి గోష్ఠి ఇంత ఎండలో నోరు పిడచకొట్టుకు పోతుంటే పిట్టలన్నీ ఏం చదువుకుంటున్నాయంటే, గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్ర. అవి రామాయణం చెప్పుకుంటున్నాయ్. సిగ్గుపడ్డాడు పండితుడు. సిగ్గుపడి, ఏమి జ్ఞానము? పుస్తక జ్ఞానమే జ్ఞానమా? పిట్టలకి జ్ఞానం ఉంది? అవి ఏం చదువుకున్నాయ్? కాబట్టి నేను ఇక్కడి నుంచి లేచి నా కర్తవ్య నిర్వహణకి నడిచి వెళ్లిపోతాను అని ఒక బలాన్ని తెచ్చుకుని అడుగులు వేసుకుంటూ దారిలో వెళుతున్నాడు. అందరిదీ కాలిబాటేగా రోజుల్లో. కాలిబాటను పట్టుకొని ఇంకో ఊరికి వెళుతున్నాడు. మధ్యాహ్నం బయల్దేరిన ఆయన ఊరుకు వెళ్ళేప్పటికీ ఇంకా సంధ్యా సమయం దగ్గర పడుతోంది. ఊళ్లో ఒక రథ బండ ఉంది. రథ బిండ మీద అనేక మంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మార్గే మార్గే శాఖీనాం రత్నవేది. వేద్యాం వేద్యాం కిన్నరీ బృంద గీతం. గీతే గీతే మంజులా లాప వాక్యం. వాక్యే వాక్యే మంజులా మోద గోష్ఠి. గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్ర. వాళ్ళు కూడా రామాయణం చెప్పుకుంటున్నారట. ఎవరు వాళ్ళు? కిన్నెర స్త్రీలు, చదువులేని వాళ్ళు. వాళ్ళకేం చదువు లేదు. వాళ్ళంతా రాత్రికి రేపటికి కావలసినటువంటి ఆహారం తయారు చేసుకోవటానికి కావలసిన దినుసులన్నీ బాగుచేసుకుంటున్నారు. రాళ్ళు ఏరుతున్నారో ఇంకేదో చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఇలా దరలు మండిపోయినాయ్, వాడు బాగా లేడు, ఇట్లా మాటలు-- రాముడి కథ చెప్తుంటే కిన్నెర స్త్రీలలో ఒక పెద్ద ఆవిడ, వీళ్ళందరికంటే సీనియర్. ఆవిడ రాముడికి, దశరథ మహారాజ్ అని ఒకడుండేవాడు అనగానే, "అవునా! ఎక్కడుండేవాడు? ఎట్లా ఉండేవాడు? ఉండేవాడు అంటే కాదు, ఎక్కడుండేవాడు?" ఇట్లా తరచి-తరచి రామాయణాన్ని చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాక్యే వాక్యే మంజులా లాప గోష్ఠి. గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్ర. అట్లాగే భాగవతం కూడా పోతనామాత్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన ఏమన్నాడంటే, "నన్నయ, తిక్కనాదులు అంతా కూడా మరి భారతం రాశారు, అనువదించారు. కానీ వ్యాస భాగవతాన్ని ముట్టుకోకుండా బహుశా నాకోసం వదిలిపెట్టారేమో, ముందు వారికి నమస్కరించుకొని భాగవతాన్ని నేను అనువాదం చేస్తానన్నాడు." అనువాదం కంటే అనుసృజన చేశాడాయన. అంటే అనువాదం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా భాషలో నుంచి భాషలో చెప్పడం. అనుసృజన అంటే దానిలో ఎక్కడెక్కడైతే కొద్దిగా gaps అంటామే, అవి ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆయన సరిదిద్ది, నిన్న మనం చెప్పుకున్న వామతా-- వామనావతార ఘట్టం, ప్రధానమైనటువంటి ఘట్టం. చాలా చిన్న ఐదారు శ్లోకాలతో ముగిసిపోయిన దాన్ని చాలా విస్తృతం చేసి బలి చక్రవర్తికి, ప్రహ్లాదుడికి శాశ్వతత్వాన్ని కల్పించడం, రత్నావళి పూతనై రావటం, ఎంత అద్భుత సృష్టి చేశాడో ఆలోచించినప్పుడు కవి తన ప్రజ్ఞ ద్వారా, ఉపజ్ఞ ద్వారా, ప్రతిభ ద్వారా, వ్యుత్పత్తి ద్వారా భగవంతుడి కథను ఎన్ని విధాల రమణీయంగా చెప్పవచ్చునో చెప్పుకుంటూ వెళతాడు. ఇక భాగవతానికి శ్రీజయం మొట్టమొదట ఆయన పెట్టిన పేరది. భారతానికి కూడా జయం అనే పేరు పెట్టారు. భారతం కేవలం ఎనిమిది వేల శ్లోకాలతో రాశాడాయన. తర్వాత తర్వాత మహామునులందరూ జైమిని వంటి మహామునులు వచ్చి కథ బాగుందని ఇంకా పరిపుష్టం చేసి అనేకమైన ఉపకథలు దాని యందు చొప్పించి అది పద్దెనిమిది పర్వాలుగా మార్చారు దాన్ని. అంటే ఏమవుతుంది? కాలగమనంలో భాగవతం కూడా రూపాంతరీకరణం జరగాలి. కానీ అలా జరగని వస్తువు ఏదన్నా ఉంటే అది భాగవతం. వ్యాస భాగవతం తర్వాత తెలుగులో పోతనామాత్యుడు ఏం రాశాడో మళ్ళీ ఈవేళ ఏదో అభినవ పోతన, అభినవ, అభినయ బిరుదులతో చాలామంది రాస్తారు. ఏమి రాసినా పోతనామాత్యుడు అనుభవించి రాశాడు.ఆ అనుభవించి తెలుగులో తెలుగు వాళ్ళకి ఆయన గొప్ప బహుమతిగా ఇచ్చాడు. తెలుగు వాళ్ళకి కవిత్రయం ముగ్గురు భారతాన్ని ఇచ్చారు. విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షాన్ని ఇచ్చారు. భాగవతాన్ని పోతనామాత్యుడు ఇచ్చాడు. సో ఇందువలన వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేయాలి. మనం చేయకపోతే శాస్త్రం నిలబడదు. గ్రంథం నిలబడదు. దాన్ని చదువుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి. మరి ఇది సాప్తాహికంగా సప్తాహంగా ఏడు రోజులే అని ఎందుకు నిర్ణయించారంటే పరీక్షిత్ మహారాజు జీవితం కూడా కేవలం ఏడు రోజుల్లో ముగిసిపోబోతున్నది గనుక చెప్పుకోగలిగితే ఏడు రోజుల్లో దీన్ని ముగించుకోమన్నారు తప్ప అదేమి వ్రతమూ కాదు నియమమూ కాదు ముందు వెనకలు అవుతాయి. కానీ మనం ఏడు రోజులు చెప్పుకుందాం. ఇవాళ ఐదో రోజు. ఆరో రోజు రేపు. ఏడో రోజుకి రుక్మిణీ కల్యాణం అయిపోతుంది. ఆహా భాగవతం అయిపోయింది కాదు తర్వాత ఉన్నది ఇందాక ఆయన చెప్పారు ద్వాదశ అధ్యాయం పన్నెండు పదకొండు ఏకాదశ ద్వాదశ భాగవతం తెలిసి చెప్పుట అసాధ్యం ఎవరికీ శూలికైనా తమ్మి శూలికైనా అన్నాడు. శివుడు చెప్పలేడు బ్రహ్మ చెప్పలేడు భాగవతం చెప్పాలంటే సాక్షాత్తు మళ్ళీ నారాయణ మూర్తే ఒక వ్యాస రూపంలో వచ్చి చెప్పాలి తప్ప మామూలు వాళ్ళు ఇది చెప్పలేరు అన్నాడు. ఆయన రాసుకున్నాడు పద్యం. సరే శ్రీకృష్ణ లీలలలో చాలా ప్రధానమైనటువంటి లీలలని మనం పొద్దున చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని లీలలున్నాయి. అందులో ఒకటి బకాసుర వధ. బకాసురుడు అంటే బకము అంటే కొంగ అంతే కదా. బకాసురుడు చాలా పెద్ద కొంగ. అది ఎలాగైనా బలరామకృష్ణులు ఇద్దరినీ కూడా తినాలి అని దానికి నిర్ణయం చేసుకుంది. వీళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు బకము కొంగ జపం చేస్తున్నది. బకము అంటే కొంగ. కొంగ జపం చేస్తున్నది. సరే వీళ్ళు చాలా ముచ్చటపడి చాలా పెద్ద కొంగని వాళ్ళు ఎప్పుడూ చూడలా. దగ్గరకు వెళ్లారు. వెళ్ళగానే ఇది నోరు తెరిచింది. నోరు తెరిచి మింగ పోయింది. కానీ కృష్ణుడు ఏం చేసాడంటే దాని ముక్కు ఏదైతే ఉందో రెండుగా చించి దాన్ని సంహారం చేశాడు. ఎందుకు చేశాడు? చిన్న కథ కదా చాలా చిన్నదే వన్ మినిట్ లో అయిపోయింది. ఏమిటి అంటే నువ్వు జపము చేసినా తపము చేసినా ధ్యానం చేసినా ఇతరులను హింసించటానికి కానీ పరమాత్మకి వ్యతిరేకంగా కానీ పరమాత్మ భావాన్ని పక్కదారి పట్టించేదిగా నువ్వు కొంగ జపం చేయకూడదు. కొంగ ఎందుకని అంటే చెరువులో కొంగ రాయి మీద నుంచుని ఉంటుంది. పల్లెటూరు వాళ్ళందరికీ తెలుస్తుంది. అదేదో కళ్ళు మూసుకుని జపం చేస్తుందని మనం అనుకుంటాం. కానీ పాపం దాని దగ్గరికి ఈత్తో ఏదో చేప పిల్ల వస్తుంది. అది టక్కున ముక్కుతో తీసుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. ఇది కొంగ జపం. కాబట్టి జపం కొంగ జపం చేయకూడదు. జపం అంటే జపమే. జపం చేయగా చేయగా చేయగా నెమ్మదిగా అజపం కావాలి. ఇక కౌంట్ లెస్ కి వెళ్ళాలి మనం. అటువంటి ఒక సూచన చేయడానికి బకాసురుడిని వధించాడు కృష్ణ పరమాత్మ. అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఏమిటిని అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎవరిని చంపినా అది పక్షి కావచ్చు ఎద్దు కావచ్చు ఇంకోటి కావచ్చు బండి కావచ్చు గాలి కావచ్చు పూతన లాంటి స్త్రీమూర్తి కావచ్చు వీళ్ళందరూ రాక్షసులే బయటికి వస్తున్నారు. ఈయనకి వీళ్ళు రాక్షసులు అని ఎలా తెలుసు? చూశారా ఎంత మాయతో కూడిన ప్రశ్న ఇది. ఎలా తెలుసు అంటే ఆయన పరమాత్మ. మనకిప్పుడు బాలుడిగా కనిపిస్తున్నాడు అంతే. కానీ లోపల ఉన్నటువంటి వస్తువు అంతా కూడా ప్రపంచాన్ని స్కాన్ చేయగలదు, చూడగలదు. ఎవరి మనసులో ఏమున్నదో ఎవరు ఎటువంటి వారో కానీ వారు ఏమీ అనరు. చేయవలసింది చేస్తారు. అటువంటి స్థితిలో బాలకాండ అంతా కూడా విధ్వంసం గా సాగింది. అందుకే కృష్ణ పరమాత్మ జీవితాన్ని మొట్ట మొదటి రోజే మనం అనుకున్నాం ఆయనది మధుర విషాద గాథ. అందరినీ చంపుకుంటూ వెళ్లటమే ఆయన పని అయిపోయింది. కాబట్టి బకాసుర వధ అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా మిగిలినాయా చుట్టుపక్కల ఎవరిని చంపాలి అని చూస్తున్నాడు కృష్ణుడు. ఒకడు వచ్చాడు. వాడు ఎవరంటే అఘాసురుడు వాడి పేరు. అఘాసురుడు అనేటువంటి వాడు పెద్ద కొండ చిలువలా ఉన్నాడు. దాని నోరు విప్పితే ఒక పెద్ద గుహ లాగా ఉంది. లోపల కాంతులు వస్తూ ఉన్నాయి. పిల్లలు కాబట్టి వాళ్ళ దాని నోట్లోకి వెళ్ళిపోయినారు. కృష్ణుడు బలరాముడే లోపలికి వెళ్లారు గనుక గోప బాలికలందరూ బాలురు అందరూ కూడా లోపలికి వెళ్లిపోయారు. కృష్ణుడికి అర్థమైంది ఇది మనల్ని హింసించడానికి ఎవరో ఒక రాక్షసుడు మనల్ని లోపలికి తీసుకున్నాడు అని ఆయన ఏం చేసాడంటే వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పి అది గాలి పీల్చుకునేటువంటి స్థావరం దగ్గర తాను నుంచున్నాడు అడ్డంగా. దానికి అది గాలే పీలుస్తుంది. తినేది ఎట్లా ఉన్నా దాని ప్రాణమంతా గాలిలో ఉంది. గాలిని ఎప్పుడైతే ఆయన అడ్డుకున్నాడో అది ఉకిరిబికిరి అయిపోయింది పోయింది. దానివల్ల లోపల దాని శరీరం ఉబ్బిపోయింది. ఉబ్బి దాని పొట్టంతా పగిలిపోయింది. దాంట్లో నుంచి గోపబాలురంతా బలరాముడితో సహా బయటకు వచ్చారు. ఎవరు అఘాసురుడు అంటే బకాసురుడి తమ్ముడే అఘాసురుడు. అది. తమ్ముడిని ఇలా సంహరించాడు. అంటే తాను ఉన్న ప్రదేశంలో తన చుట్టూ ఉన్నటువంటి చెడ్డ వారందరినీ కూడా సంహారం చేసి ఒక శాంతిని సంస్థాపన చేసి తర్వాత ధర్మ సంస్థాపనకు వెళ్ళాడు. ముందు ధర్మం వైపు వెళ్ళలేదు ఆయన. అన్నీ అందరినీ చంపటం అధర్మం కదా అని మనకు అనిపిస్తుంది.శాంతి స్థాపన కోసం ఉంది అని భాగవతం మనకు కచ్చితంగా అధర్మం అంటే ఎవరినో హింసించడం కాదు మనల్ని హింసిస్తున్న వాడి నుంచి మనం రక్షించుకోవాలి మనం కనీసం అది కూడా చేయలేకపోతే వాళ్ళు విజృంభిస్తారు జరిగేదది కాబట్టి ఇక్కడ జీవుడికి ఒక ప్రత్యేకమైన పాఠం ఏమిటంటే మనల్ని మనం రక్షించుకుంటూ ప్రపంచంలో మనం ఎవరినీ మోసం చేయకుండా మన దారిన మనం చక్కగా వెళుతూ ఉంటే అది సన్మార్గం గనక అయినట్లయితే అది తత్వం మాట్లాడుతూ గనక మనం వెళ్ళినట్లయితే మన వెనక అనేక మంది మనకు తెలియకుండా అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు కృష్ణుడికి కావలసింది అదే. అక్కడి నుంచి కుబ్జ దగ్గరికి వెళ్ళాం మనం కుబ్జ వాళ్ళ ఇంటికి రమ్మనమంది, నేను తర్వాత వస్తాను అన్నాడు. వెళ్ళాడా లేదా? వైజయంతి మాల వేసుకున్నాడు అక్కడికే కృష్ణ కథ ఆగితే ఇక మరి ఆయనకి మిగిలింది ఏమిటి? మధురా నగరం ఎందుకు వచ్చాడు? కంసుడిని చంపడానికి వచ్చాడు. తెచ్చిన వాడు ఎవరు? అక్రూరుడు. అంటే నమ్మించి తెచ్చాడు. అక్రూరుడు నమ్మించలా, కంసుడు నమ్మించాడు. ఇద్దరు కూడా ఆయన వెంట ఆయన ఎవరో తెలుసు గనక ఆయన జోలికి పోకుండా వాళ్ళు వెళ్లారు. వెళితే కంసుడు వాడికి అర్థమైపోయింది ఇద్దరి తేజస్సు సమానంగా ఉంది కృష్ణుడిది బలరాముడిది. ఎప్పుడైతే మహా తేజస్సుతో పిల్లలిద్దరూ ఉన్నారో ఒక విషయం అర్థమైంది. వీళ్ళు అసాధారణమైన బాలురు కాబట్టి వీళ్ళని మనం మామూలుగా ఏదో చెరసాలలో పెట్టడం అలా చేయకూడదు. వీలైతే చంపేసేయాలి. మా దగ్గర ఇద్దరు మల్లులు ఉన్నారు. మల్లులు అంటే మల్లయుద్ధం చేసే వాళ్ళున్నారు. వాళ్ళిద్దరినీ కూడా చిన్న పిల్లల మీదికి, వాళ్ళేమో ఆజానుబాహులు ఏడు అడుగులు, ఎనిమిది అడుగులు పొడుగున్న వాళ్ళు రోజుల్లో. వాళ్ళ ఇద్దరినీ కూడా చాణూర ముష్టికులు వాళ్ళు. వాళ్ళిద్దరినీ కూడా కృష్ణుడి పైనా, బలరాముడి పైనా ప్రయోగించాడు కంసుడు. ఎక్కడ? సభామంటపంలో, ఎక్కడో బయట కాదు. వీళ్ళు సభలో ప్రవేశించటం, మల్లులు ఇద్దరూ రావటం, పిల్లల్ని ఒడిసి పట్టుకోవటం, చంపే ప్రయత్నం చేయటం కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనం కోసం నిర్ణయం తీసుకున్నాడో, బలరాముడు కూడా తోడయినాడో ఇద్దరూ కలిసి చాణూర ముష్టికుల ఇద్దరినీ కూడా చంపేశాడు. అయిపోయింది. అప్పుడు కంసుడికి ఇంకొక option ఉంది, అవకాశం. కువలయాపీడము అనేటువంటి ఒక ఏనుగు ఉంది ఆయన దగ్గర. అది దాని పేరే ఏం చెప్తుంది అంటే, అది గనక పగబడితే, దానికి మదం ఎక్కితే అది ఎంతటి వారినైనా తన తొండంతో నలిపి పిప్పిపిండి చేసి బయట పడేయగలదు. అటువంటి కువలయాపీడనం అనేటువంటి దాన్ని కృష్ణుడి మీద, బలరాముడి మీద నువ్వు ఏకకాలంలో ఇద్దరినీ చిన్నపిల్లలు వాళ్ళు చుట్టచుట్ట బయటకు విసిరేయమన్నాడు. కృష్ణుడు తన ఎడమ చేత్తో కువలయాపీడం యొక్క తొండాన్ని పట్టుకున్నాడు. తోకను పట్టుకున్నాడు బలరాముడు. ఇద్దరూ కలిసి గిరగిర తిప్పి దాన్ని బయటకు వదిలిపె-- విసిరేశారు. అది రాజభవన ప్రాంగణంలో బయట అది మరణించింది. ఇక తాను వచ్చినటువంటి పని సానుకూలమై పోతున్నటువంటి వేళ కృష్ణ పరమాత్మ రోజుకి సభ అయిపోయింది. కంసుడు ఇంకా ప్రయత్నం చేయాలో వాడికి ఆలోచన తోచడం లేదు. ఇంటికి వెళ్ళాడు. ఎటు చూసినా కృష్ణుడి స్వరూపం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా అవలీలగా అందరినీ చంపేటువంటి భీశక్తి వాడికి ఆశ్చర్యం కలిగిస్తూ వీడు మృత్యువు కాదు కదా అని ఒక ఆలోచనలో పడ్డాడు. మృత్యువు అవునో కాదో కానీ వీడు ఇంత చిన్న పిల్లవాడు ఎలా చేయగలుగుతున్నాడు ఇవి? వీడు ఎక్కడో వ్రజభూమిలో పుట్టాడంటున్నారు, బృందావనంలో పెరుగుతున్నాడన్నారు. వీడికి ఇన్ని తెలివి. మల్లయుద్ధంలో చేస్తే మల్లయుద్ధం అయిపోతున్నది. ఏనుగుతో యుద్ధం అంటే ఏనుగుతో యుద్ధం అయిపోతున్నది. ఇవన్నీ కూడా గమనించి రాత్రంతా కంసుడు నిద్రపోలేదు. నిద్రలో వాడికి కలిగిన ఆలోచనలు ఇప్పుడు మనం పంచుకోవాలి. అవి ఏమిటంటే, ఎవరియందు మనం పగభావంతో గనక ఉన్నట్లయితే, పగబట్టినట్లయితే, అవతల వాడు హాయిగా నిద్రపోతున్నాడు పగ ఉన్నవాడికి నిద్ర ఉండదు. అది కృష్ణుడు హాయిగా నిద్రపోయి ఉంటాడు. కంసుడు నిద్రపోలే. ఎందుకు? కృష్ణుడికి పగ లేదు. కంసుడికి పగ మాత్రమే ఉన్నది. బలరాముడు కూడా రకమైన పగ లేదు. కృష్ణుడు కృష్ణుడితో పాటు తోడుగా ఉంటాడంతే. అన్నగారుగా ఉంటాడు. అటువంటి సమయంలో జీవితం అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి? బతికుండగానే తండ్రిని చెరసాలలో పెట్టాను నేను. కేవలం రాజ్యం కోసం. ఆయన ఎన్నాళ్ళో ఉండడు. ముసలివాడైపోతున్నాడు. అయినా సరే రాజ్య కాంక్ష కారణంగా ఆయన్ని నేను చెరసాలలో పెట్టాను. అలాగే నా చెల్లెలు, నా బావ వాళ్ళ ఇద్దరినీ కూడా చెరసాలలో పెట్టాను. వాళ్ళ కడుపున పుట్టినటువంటి ఏడుగురు బిడ్డలను కూడా సంహరించేశాను. ఇది ధర్మం కాదనే నాకు అనిపిస్తున్నది. మరణమా? రాక తప్పదు. అది ఎట్లా వస్తుందో తెలియదు. నిన్నామొన్న పుట్టినటువంటి యోగమాయ ఆడపిల్ల నాకు చెప్పే-చెప్పక చెప్పింది ఒక మాట. "నిన్ను చంపేవాడు ఒకచోట పెరుగుతున్నాడు. వాడు పురుషుడు. నీకు మరణం దగ్గరగా ఉన్నది." అని ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి నేను ఒక పని చేస్తానని వాడు మంత్రాంగం చేయబోయినాడు. ఎవరితో? దేవకి వసుదేవులతో. తన చెల్లెలు దగ్గరికి వెళ్ళి చెల్లెలు కాళ్ళ మీద పడ్డాడు. ప్రాణం తక్కుంచుకోవటానికి. "నిన్ను చాలా కష్టపెట్టాను దేవకి. మీ ఇద్దరినీ చాలా హింసలు పెట్టాను. నీ కడుపు పండినప్పుడల్లా దానిని పిండి చేసి బయటకు పడేశాను. మరి నాకు మృత్యువు దగ్గరకు వస్తున్నదని రోజు యోగమాయ చెప్పింది. కాబట్టి నేను ఏం చేయాలి? మీ ఇద్దరినీ వదిలి పెట్టేస్తా."నన్ను కాపాడండి. మరణం నుంచి కృష్ణుడు బలరాముడు అని ఇద్దరు పిల్లలు వచ్చారు. నాకెందుకో వాళ్ళ చేతుల్లోనే నా మరణం తధ్యం అని అనిపిస్తున్నది. వాళ్ళు అవునో కాదో వాళ్ళు మీ పిల్లలు అవునో కాదో నాకు తెలియదు వాళ్ళు పిల్లలు. కాబట్టి మీరు పిల్లలను ఒకసారి చూసి కంసుడ్ని, కంసుడు నా అన్న చంపద్దు అని చెప్పమని అడిగాడు కంసుడు. దేవకి, దేవకికి తెలుసు పెరుగుతున్న వాడు కృష్ణుడని, కృష్ణుడే తన బిడ్డ అని, యోగమాయని ఇక్కడ వదిలిపెట్టాడని, లోకమాయని తీసుకుని వ్రజ భూమికి వెళ్ళాడని, ఆతడే బృందావనంలో పెరుగుతున్నాడని దేవకికి వసుదేవుడికి తెలుసు. ఎలా తెలుసు? అంటే నందుడు చాలా తరచుగా వాళ్ళ ఇద్దరినీ కూడా కలుసుకుని కృష్ణుడు పెరుగుతున్న విధానం, ఆయన చేస్తున్నటువంటి బాల్య క్రీడలు, లీలా వైభవాన్ని వాళ్ళకి తెలియజెప్తూ వచ్చాడు. కాబట్టి దేవకికి ఇంకా పరమానందంగా ఉన్నది. అప్పుడు ఆమె ఏమన్నదంటే, చూడు విధి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అనుల్లంఘనీయమైనటువంటి ఎవరూ దాటలేనటువంటి ఒక విధి మనందరికీ ఉన్నది. నువ్వు చేయగలిగింది చేయవలసిందో చేయకూడనిదో చేసేసావు. మేము నిస్సహాయులం మా జీవితమంతా చెరసాలలో మగ్గిపోయింది. ఏడుగురు పిల్లలు, ఎనిమిది మంది పిల్లలు అంటే సుమారు ఎనిమిదేళ్ళు జైల్లో ఉండి ఉంటారు. ఇవాళ కాలమానం ప్రకారం. ఇక మాకు జీవితం మీద రకమైన ఇచ్ఛ లేదు. ఏది ఎలా జరగాలో దాన్ని అలాగే జరగని అని ఆమె సైలెంట్ అయిపోయింది. అప్పుడు వసుదేవుడ్ని పట్టుకున్నాడు కంసుడు. ఇదే మాటలు చెప్పాడు. ఆయనన్నాడు, పిల్లలు ఎవరో మాకు తెలియదు. మాకు తెలియవలసిన పని లేదు. ఎందరో పుడుతుంటారు, ఎక్కడో పెరుగుతుంటారు. వాళ్ళందరూ నిన్ను చంపడానికి, పిల్లలు నిన్ను ఎలా చంపుతారు? నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రపో. వాళ్ళు నిన్ను చంపడానికి రాలే, వచ్చుండర్లే అని అన్యాపదేశంగా నీ మరణం వాళ్ళ చేతిలోనే ఉండవచ్చు అని చెప్పాడు. నిరాశ, అశోపహతుడైనటువంటి కంసుడు తన గదికి వచ్చాడు. మర్నాడంతా సభ. సభలోకి మామూలుగా రాలేదు. దీనత్వంతో వచ్చాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా మెళ్ళో పూలమాలలు వేసుకుని, పిల్లలు కదా, మా మరి కుబ్జ వాళ్ళిద్దరికీ చెరొక మాల ఇచ్చింది ప్రతిరోజూ. ఇస్తానని కూడా చెప్పింది. కుబ్జ మాల కట్టింది. మాల తీసుకొచ్చి ఇద్దరికీ ఎట్లా కృష్ణుడికి ఇచ్చిందో అలాగే బలరాముడికి కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరినీ చూస్తే ఎవరు కృష్ణుడు ఎవరు బలరాముడు తెలియదు. అంత అందమైనటువంటి పూలు మాలిక అల్లింది కుబ్జ. తర్వాత తన సౌందర్యాన్ని, సౌందర్య శరీరం ఆవిడకు వచ్చింది కాబట్టి ఆవిడ ఇంకా బాగా కట్టింది. అది సరే. అయిన తర్వాత వీళ్ళిద్దరూ సభలోకి వచ్చారు. సభలోకి రాగానే కంసుడు అడిగింది ఏమిటంటే, మిమ్మల్ని నేను మథురకి ఎందుకు రప్పించానో తెలుసునా? నా మల్ల యోధులను చంపటానికి, మాకు రక్షణగా ఉండేటువంటి మా ఏనుగును చంపటానికి, మీ ఇద్దరినీ అక్రూరుని రథమిచ్చి పంపించాను నేను. దానికోసం నేను పంపలేదు. ఇక్కడ నేను చిన్న యాగం చేయాలని అనుకుంటున్నాను. యాగానికి చిన్నపిల్లలు మీరు కూడా ఉంటే బాగుండు. అంటే వీళ్ళిద్దరినీ యాగంలో చంపడానికన్నమాట. మిమ్మల్ని పిలుచుకున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిమ్మల్ని ఎవరు ఏం చేయర్లే అని బలరామకృష్ణులకు చెప్తున్న సందర్భంలో కృష్ణుడు అన్నాడు, చూడు మామ అంటేనే మాయ అన్నాడు. మాయ, మామ అంటే మామ అంటే పిల్లనిచ్చిన మామ కాదు. మేనమామ. మేనమామ మాయ ఎందుకంటే, సర్వం నాశాయ మాతులః అంటుంది భారతం. దుర్యోధనుడి పట్ల శకుని ప్రవర్తించినటువంటి తీరుని చూసి మాయ, మేనమామలు మాయలు అని మానుడి రోజుల్లో తీసుకొచ్చారు. కాబట్టి కృష్ణుడు రోజుల్లో కాలంలో ఉన్నాడు గనుక అదే మాట వాడాడు. అది ఇప్పుడున్న మేనమామలు తండ్రుల వలే ఉండొచ్చు ఉండి ఉండవచ్చు. నిజానికి మేనమామ తండ్రికంటే గొప్పవాడు. తండ్రితో సమానమైన వాడు మాత్రమే కాదు. ఒకవేళ గనుక తండ్రి ముందే గనుక గతించినట్లయితే మేనమామల చేతిలో అద్భుతంగా జీవితాల్ని చదువుకొని పైకి తెచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి ఇది మేనమామలను గురించిన నింద కాదిది. అంటే ఎవరైతే నిందాస్తుతి కాకుండా నిందగా ఉన్నదో దాన్ని నువ్వేం చేస్తావో మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావో మాయలన్నీ నా దగ్గర ప్రదర్శించమని కృష్ణుడు ఒక ఛాలెంజ్ విసిరాడు. కృష్ణుడు మాయలన్నీ భయంతో కూడికున్నాయి ఇప్పుడు. ధైర్యంతో లేవు. సరే, నువ్వు మాయలో గనుక మమ్మల్ని పెట్టలేకపోతే మా మాయలేమిటో నువ్వు చూడమన్నాడు. వీడేం మాయ చేస్తాడు పిల్లవాడు. వీడికి ఇంకా పూర్తిగా చదువే అవ్వలేదు అనుకున్నాడు కంసుడు. కానీ అప్పటికే కృష్ణబలరాములిద్దరూ కూడా ఎనిమిదేళ్ళ వయస్సు రాకముందు ఆరు సంవత్సరాల వయస్సులో సాందీపుడు అనేటువంటి ఒక మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నారు. కొంత విద్య నేర్చుకున్నారు. బలరాముడు తొందర తొందరగా నేర్చుకుంటున్నాడు. కృష్ణుడు ఆయన నోటి నుంచి మాట రాకుండానే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సాందీప మహర్షి ఏమన్నాడంటే, మీ ఇద్దరికీ లోకవిద్య అవసరం లేదు. మీరు కారుణ జన్ములై జగత్తులోకి వచ్చారు. ఇక మీరు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అయిపోయిందని అనుకుని మీరు ఇంకేం చేయదలుచుకున్నారో పనిలోకి వెళ్ళండి అన్నారు. అన్నప్పుడు కృష్ణుడు అడిగాడు, మరి మీ దగ్గర మేము పాఠం నేర్చుకున్నాం కదా, కొంతకాలం అభ్యాసం చేశాం. మీకు గురుదక్షిణ ఏం కావాలి అని అడిగాడు. సాందీపుడు ఏం మాట్లాడలా. కానీ సాందీపుడు గురువుగారు. గురువుగారి భార్య తల్లితో సమానం.ఆవిడ మాత్రం ముందుకొచ్చి "కృష్ణా! మాకు లేక లేక ఒక బిడ్డ పుట్టాడు. వాడు నదిలో వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నాడు. చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ మా బిడ్డను మాకు నువ్వు తెచ్చి ఇవ్వగలవా?" అని అడిగింది. ఇది ఒక fantasyగా కనిపిస్తుంది మనకి. ఘటనా ఘటన సమర్ధుడు అయినటువంటి పరమేశ్వరుడికి ఏది అసాధ్యం కాదు. ఆయనన్నాడు "నేను తెస్తాను" అనలా. "నేను ప్రయత్నిస్తాను" అన్నాడు. వెళ్లి ఎక్కడ నదిలో దూకాడో అక్కడ కృష్ణుడు దూకాడు. దూకి లోపలికి వెళ్ళాడు. వెళ్ళటం వెళ్ళటం ఎక్కడి దాకా వెళ్ళాడంటే యమద్వారం దాకా వెళ్ళాడాయన. యమద్వారంలో యముడితో ఆయన సంభాషించాడు. "నాకు గురు దక్షిణ ఇవ్వ నేను ఇవ్వాలి. నాకు నా గురువుకి ఆస్తిపాస్తులు ఏం అక్కర్లేదు. అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు అకాల మరణం చెందాడు. వాడు మరణించటం అయిపోయింది గనుక, నీకు శక్తి గనుక ఉన్నట్లయితే మళ్ళీ బిడ్డని నాకు అప్పజెప్పమని" అడిగాడు. ఆయనేమన్నాడండి, ఇదంతా ధర్మానికి సంబంధించింది. ఆయనన్నాడు "శరీరం వదిలిపెట్టిన తర్వాత బాంధవ్యాలు ఎట్లా తెగిపోతాయో, శరీరంతో కూడా మాకు అధికారం ఉండదు. వాడి ఆత్మని మేమిక్కడికి తెస్తాం. కానీ వాడి శరీరం అక్కడే ఉంటుంది. వాళ్ళు అక్కడే ఉంచుకొని ఉంటారు. ఎక్కడో వెతుక్కోమను" అన్నాడు కాస్త కొద్దిగా నిర్లక్ష్యంగా. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు "గురు దక్షిణ గనుక చెందించకపోతే, నేను ఇక్కడే యమలోకం దగ్గరే ఉండిపోతాను. నా గురువు కోరుకున్నది నేను ఇవ్వాలి నాకు. పాఠం చెప్పాడు, పద్యం చెప్పాడు" అన్నాడు. అప్పుడు యముడు ఒక మాట ఏమన్నాడంటే, పిల్లవాడి పేరేమిటి అని అడిగాడు. పేరు చెప్పాడు. ఆయన ఆత్మలన్నీ కూడా ఆయన దగ్గరే-- ఇది కథగా ఉంటుంది. ఆత్మలు అక్కడున్నాయా? చెట్టుకు వేలాడ వేశారా? showcaseలో పెట్టారా? ప్రశ్నలు మనసులో తెచ్చుకోకండి. ఒక ఆత్మ, ఆత్మని మళ్ళీ అటువంటి శరీరం ఇవ్వటానికి ఆయనకి యమధర్మరాజుకి ఒక అవకాశం ఉంది గనుక ఒక్క సాందీప మహర్షి యొక్క కుమారుడి విషయంలోనే యమధర్మరాజు ప్రకృతిని, ధర్మాన్ని తప్పించాడు. పక్కకు వెళ్ళాడాయన. కృష్ణుడు "నువ్వు ఆగ్రహించకు. నువ్వు ఇంత దూరం నా దగ్గరికి సశరీరంగా వచ్చావు అంటే, మీ గురువుగారి అబ్బాయిని నీతో పంపిస్తాను" అని పిల్లవాడిని పంపటం, పిల్లవాడిని తీసుకొని నీటితో సా నీళ్ళల్లో నుంచి పిల్లవాడు, కృష్ణుడు రావటం, సాందీప మహర్షికి ఆయన భార్యకి సాందీపుడి కుమారుడు సాందీప కుమారుడిని అప్పజెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఏది? కంసవధ వైపు వచ్చారు.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 33:00

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

    Now playing
  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22