Skip to content
Transcript తెలుగు
పరమశివ ప్రాప్తం సద్గురుం సత్య సాయి శ్వర ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, కేవలం సత్య సాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత నైమిశారణ్య క్షేత్రంలో పుణ్యక్షేత్రం ఇది. మనం ఇన్ని రోజులు భాగవతులం అయిపోయి భగవంతుని యొక్క ఆరాధన భావన స్ఫూర్తిగా మన కాలాన్ని ఎంత పవిత్రీకరించుకున్నామో తలుచుకున్నప్పుడు ఒళ్లంతా పులకరించి పోతూ ఉన్నది. ఇక్కడ ప్రపంచంలో ఏది కావాలో దాని కోసం మనం ఇక్కడికి రాలేదు. కేవలం భగవంతుడి కోసం వచ్చాం. భగవంతుడి పైనే మనసు నిలిపి ఉంచాలి. భగవదారాధనలో మన స్వసుఖాలు వదిలిపెట్టాలి. సుఖం, దేహం ఎప్పుడూ సుఖాన్ని కోరుతూనే ఉంటుంది. దానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది చాలదు, ఇది ఇట్లా ఉండాలి. నిన్న మనం మనసును గురించి చెప్పుకున్నప్పుడు మనస్సుని మనం నియంత్రించుకోలేకపోయినప్పుడు, మనకున్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే శక్తి మన యందు లేనప్పుడు, పుటపర్తిలో సత్యసాయి భగవానుడు విరాజమానం చెందారో అటువంటి స్వామి ఇక్కడ అణువణువునా ఉన్నారు అన్నటువంటి భావన మన యందు గనక లేకపోతే మనం ఇంత క్షేత్రానికి వచ్చి ఇన్నాళ్ళు ఉండి మనం సాధించింది అంటూ ఏమీ మిగలదు కాబట్టి ఇక్కడ కేవల భక్తుల వలె ఉండాలి. భగవంతుడి కంటే వినయమూర్తి మానవుడు కాదు ఆయనే వినయమూర్తి. మనం ఎప్పుడు ఏది కావాలంటే, ఇబ్బంది కలిగినా ఆయనకి ఒక్కసారి refer చేస్తే, refer అనే మాట ఎందుకు జరిగిందో నేను చెప్తాను. భగవంతుడు చేసే పని మనమే అన్నిటికీ చేయలేం. అది మన వల్ల కాదు. మనం ఒకళ్ళిద్దరికో, నలుగురికో, పది మందికో, వంద మందికో సాయం చేయగలుగుతాం. భగవంతుడు ఏమంటాడంటే, నేను అసలు మీకు సాయం చేయటం ఏమిటి? నేను మీకు సేవ చేయటానికి నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. మన సేవ అర్థం వేరు. మనం మనం చేసేది చాకిరీ. అది కాదు. సేవ అంటే సమర్పణతో, చూడండి ఇన్ని కోటానుకోట్ల మంది జీవరాశులు, కేవలం మన నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా కాదు, ఎనభై నాలుగు లక్షల జీవరాశుల అవసరాన్ని సృష్టించి, స్థితిని ఉంచించి, లయం చేసేటువంటి కార్యక్రమం మామూలు పనా? ఎవరినైనా మనం మనంతట మనం మన కారణంగా ఒక ఆకును పుట్టించగలమా? ఒక వర్షపు బిందువును సృష్టించగలమా? కానీ దేనినీ సృష్టించలేని మనం అన్నీ మనకే కావాలి అనుకుంటున్నాం. అలాగే జీవితాన్ని మనకు కావలసినట్లుగా జరగాలి అనేటువంటి భావనలన్నీ కూడా వదిలిపెట్టవలసిన ప్రదేశం ఏది అంటే ఇటువంటి పుణ్యక్షేత్రాలు, ఇటువంటి యాగ యజ్ఞాలు జరుగుతున్నప్పుడు, యాగము వేరు, యజ్ఞము వేరు. యాగము అంటే తెలిసో తెలియకో చేసేది యా-యాగం. యజ్ఞము అంటే తెలిసి చేసేది యజ్ఞం. ఇక్కడ జరుగుతున్నది యాగం కాదు, యజ్ఞం. బయట జరిగే హోమం గాని, ఇక్కడ జరిగేటువంటి దేవతా స్తుతులు గాని, మనం మాట్లాడుకునే భాగవతంతో స్వామి సంగతులు గాని, ఇవన్నీ కూడా ఈశ్వర సంకల్పం చేతనే మనకి లభిస్తాయి. కాబట్టి ఇటువంటి ఒక మహత్పూర్ణమైనటువంటి అవకాశాన్ని స్వామి ఎలా కల్పించారో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆనందము కలుగుతుంది. కానీ ఇందులో మనం మనల్ని పోగొట్టుకోకపోతే, మన మానసిక జాడ్యాలు మనం గనక ఇక్కడ వదిలిపెట్టలేకపోయినట్లయితే, మనం ఇక్కడ మనకు కావలసినట్లుగా ప్రదేశం ఉండాలి అంటే ఇది ఉండదు. ప్రదేశం ఎట్లా ఉందో దానిలోకి మనం ప్రవేశించాలి. మనిషి అహాన్ని వదిలిపెట్టకపోతే, మమకారాన్ని వదిలిపెట్టకపోతే, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను దిద్దుకోలేకపోయినట్లయితే, స్వామి చాలాసార్లు ఆహ్ వారు పిలిచినప్పుడు, మాట్లాడినప్పుడు మన బోటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఎవరైనా లేదా ఆయన దగ్గరికి వచ్చి, ఆయనకి సంబంధం ఉండకపోవచ్చు, బహుశా ఆయన్ని చూడటం కూడా అది మొదటిసారే కావచ్చు, తన దుఃఖాన్ని, తన ఇబ్బందిని స్వామి ముందు చెప్పినప్పుడు "నీకు వచ్చిన కష్టం తీరుతుందిలే" అని మామూలు వాళ్ళలాగా అనేవారు కాదు. రెండవది, కష్టం వచ్చింది ఏం చేస్తాం అనుభవించిన వేదాంతం చెప్పేవారు కాదు. కష్టం వచ్చింది అంటే దాన్ని కర్మనిష్ఠగా మార్చుకో, మార్చుకోవటానికి మనకి ఏర్పడతాయి అనే పదం వాడేవారు ఆయన. తనని కూడా include చేసుకునేవారు. కష్టాలు మనకి వస్తాయి. వాటిలలో మనమందరం కలిసి దాన్ని దాటుదాం, ప్రయత్నం చేద్దాం అనేవారు. ఇలా మనం ఎంతమంది అనగలుగుతున్నాం? ఎవరైనా జీవితంలో ఒక చిన్న ఇబ్బంది గనక కలిగినట్లయితే ఏం పాపం చేశాడో అనుభవిస్తున్నాడు అని ఇంకా మనం శపిస్తాం. వాడి పట్ల జాలి చూపించం. లేదు అష్ట ఐశ్వర్యాలు వచ్చినాయి, పుణ్యం చేసుకున్నాడో, ఎక్కడ పెట్టి పుట్టాడో, వ్రతం చేసుకున్నాడో, నోము నోచుకున్నాడో లేదా నోచుకున్నారో ఇటువంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు అని మనమే అంటాం, కృతజ్ఞతాపూర్వకంగా. నిజానికి భగవంతుని-- ఉన్నటువంటి కృతజ్ఞతలో మనబోటి జీవులకి కృతజ్ఞత ఉండదు. తప్పులు ఎన్నటం, మనకు కావలసినట్లుగా ప్రదేశం ఉండాలని కోరుకోవటం ఉండవ్. నేను నిన్న చెప్పాను అక్కడికి వెళ్లి వచ్చినప్పుడు, భగవత్ సృష్టితో ఏర్పడినటువంటిదే చక్రతీర్థం. అక్కడ engineering principles లేవు. అక్కడ ఎవరూ పంపు పెట్టి నీళ్ళను centrifugal forceలో దాన్ని cyclicగా తిప్పుతున్నది కాదది. మరి ఎలా ఏర్పడింది అంటే అఖండ భారతావని కూడా ఇది దైవం సంచరించిన...దైవం పుట్టిన ప్రదేశం మీరు ప్రపంచం సృష్టి అంతా పెద్ద map తీసుకుని దేవుడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు అని ఎక్కడ పుట్టా-- దూతలు పుట్టారు messengers పుట్టారు కానీ దైవం ఎప్పుడైనా ఒక మానవ దేహం తీసుకుని రావాలి అంటే ఆయన ఎన్నుకున్నటువంటి ప్రదేశం భారతదేశం. దీనిలో వేద ప్రమాణమైనటువంటి వ్యాసభాగవతంలో ఒక విషయం చెప్పబడి ఉంది అది పోతనామాత్యుల వారు చెప్పల కానీ అది కూడా మనం చెప్పుకోవాలి. ఆయన వ్యాసులవారు ఏం నిర్ణయం చేశారంటే "ఆసేతు సీతాచలం" అంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పుణ్య ప్రదేశంలో ఎవరు జన్మ ఎత్తుతారో వాళ్ళు పూర్ణ ముక్తులై వస్తారు. అంటే మనం మన బోటి వాళ్ళందరం కూడా ఎలా వచ్చాం అంటే ముక్తులవైయే వచ్చాం ఇక్కడికి జపము, తపము, ధ్యానము, యోగము, కర్మ నిష్ఠ, బాగా పనిచేయటం, నిజాయితీగా ఉండటం, కష్టపడి సంపాదించటం, సంపాదించిన సొమ్ముతో మాత్రమే జీవించగలగటం ఇవన్నీ కూడా ప్రపంచంలో అనుభవించడానికి మళ్ళీ మనకు జన్మ లేకపోయినా ఒక జన్మ ఎత్తి వచ్చాం. అంటే మన తపస్సు, మన ధ్యానము, మన యోగము ఇవన్నీ కూడా దానికి ఏదో ఫలితం ఉండాలి. ఏమిటి ఫలితం అంటే మనం మనంగా బతకగలగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని [గొంతు సవరించిన శబ్దం] నిన్న ఏకాదశ స్కంధంలో కొన్ని విశేషాలు ఉన్నాయి అవి నిన్న మనం సాయంత్రం session అంతా కూడా మనస్సు మీద అంతర్ముఖత్వం మీద మనం మాట్లాడుకున్నాం అది చాలా అత్యవసరమైనటువంటి పని. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం భాగవతులమే వెళ్తామా? జ్ఞానం కావాలనుకుంటూ జీవితాన్ని మళ్ళీ redefine చేసుకుంటామా? దానికి కావలసిన inputs ఏమిటి? అవన్నీ కూడా నిన్న స్వామి అనుగ్రహంతో మనం చక్కగా కాసేపు మాట్లాడుకోగలిగాం. మరి ఇవాళ ఏకా-- ఏకాదశ స్కంధంలో ఏమున్నది దాంట్లో ఎందుకని చెప్పాలని అనిపిస్తుంది. ఏకాదశ స్కందమా నా నాలుగేళ్ళప్పుడు మా గురువుగారు [గొంతు సవరించిన శబ్దం] రఘువరదాస్ గారు ఆయన తొట్టతొలి గురువు జన్మకి. నాలుగేళ్ళప్పుడే గురు స్వరూపం నా-- నన్ను దగ్గర తీసుకుంది. హనుమాన్ చాలీసా ఇవాళ ఆంధ్రదేశం అంతా ప్రతి రామాలయంలో, హనుమానలయంలో అలాగే ఇవాళ చేయబోయేటువంటి హనుమ దర్శనం అంతా కూడా దానికి మూలమైన-- అందరూ రాముని గురించి చెప్పారు ఆంధ్రదేశంలో. కానీ ఆంధ్రదేశంలో హనుమంతుని గురించి చెప్పినటువంటి వారు రఘువరదాస్ గారు. ముందు ముందుగా కృష్ణుడి మీద, గోపాలుడి మీద, గోవిందుడి మీద ఆయన భజనలు చేయలేదు సంకీర్తన చేశారు. అటువంటి ఆయన [గొంతు సవరించిన శబ్దం] ఒకసారి దశమ స్కంధంతోనే భాగవతం అయిపోయినప్పుడు ఏకాదశ ద్వాదశ స్కంధాలు అంటే పదకొండు పన్నెండు ఎందుకున్నాయి స్వామి అని అడిగారు. స్వామీజీ అని అడిగారు రోజుల్లో. ఒక యాభై అరవై ఏళ్ల నాటి మాట ఇది. వారు ఒక మాట చెప్పారు, దశమ స్కంధం వరకు భాగవతుడి కథ. భక్తుడి-- భాగవతుడి కథ, భక్తుడి వ్యథ. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము జమిలిగా సాగేటువంటి కథా కథన విధానం అది. ఏకాదశ స్కంధము, దశమ స్కంధము రెండింటికీ ఉన్నటువంటి సంధి ఏమిటంటే దానిని గడప దాటించేది ఏకాదశ స్కంధం పదకొండు. దానిలో భగవంతుడు శక్తిని గురించి విన్నాం. భగవంతుడు ఎలా కారుణ్యమూర్తో విన్నాం. భగవంతుడు మనందరినీ, ప్రపంచాన్ని, ప్రకృతిని ఎలా కాపాడుకుంటాడో విన్నాం. అనేక పాత్రలు వచ్చినాయి, అవన్నీ కాగా భగవంతుడు ఇలా ఉంటాడు అనేక పద్యాలు ఉన్నాయి దాని నిండా. మనం పద్యాల జోలికి వెళితే చాలా time పడుతుంది అక్కర్లే. గుణగాన సంకీర్తనా వైభవంలో ఈశ్వరుణ్ణి మనం ఉపాసన చేసుకున్నాం పది స్కంధాలు వచ్చేటప్పటికి. అప్పుడు ఎవరు మిగిలారు? చెప్తున్నది ఎవరు? శుకదేవుడు చెప్తున్నాడు. వింటున్నది ఎవరు? ఇక రెండు రోజులు మాత్రమే జీవితం మిగిలిన పరీక్షిత్ మహారాజు వింటున్నాడు. ఆయన ద్వారా అంటే రాజుగారికి గురువుగారు వెళ్లి ఒక శుకదేవుడు వెళ్లి చెప్పటం ఏం అబ్బరా రాజుగారే అడిగినప్పుడు ఆయన రాడా ఎవరు అడిగినా చెప్తాడాయన. కానీ చెప్పించుకోవటానికి కొన్ని qualities ఉండాలి. పరీక్షిత్ మహారాజు తన ప్రాణాన్ని, తన దేహాన్ని వదిలిపెట్టే సమయానికి భగవంతుడి గురించి విన్నాడు, భగవంతుడి గురించి తెలుసుకున్నాడు. చాలా ఆనంద స్వరూపంగా మనసంతా కూడా మరణం అనే ఆలోచన అసలు ఆయనకి దగ్గర లేనే లేదు. మనం ఏదో ఏడో రోజు, ఎనిమిదో రోజు మనల్ని లెక్కపెడుతున్నాం. లెక్క పెట్టుకోవలసిన వాడు దాన్ని మర్చిపోయాడు చూశారా అది, అది మాయ కాదు లీలా మాయ ప్రభావం చేత పరీక్షిత్ మహారాజు తన మనస్సుని శ్రీ మహావిష్ణువు యొక్క-- తర్వాత దశమ స్కంధం వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు కృష్ణుడై వచ్చిన కథని విని శ్రీకృష్ణ పదపద్మాధీన చేతస్కుడై ఆయన పాదపద్మముల యందు మనస్సును లగ్నం చేసి వినటం మొదలు పెట్టినప్పుడు శుకదేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమిటంటే ఇవన్నీ తెలుసుకున్నాడు కానీ ప్రపంచంలో భక్తుడు ఎలా ఉండాలి? ఇది అందుకనే ఏకాదశ స్కంధ స్వా-- స్వామీజీ చెప్పిన మాట ఏమిటంటే దశమ స్కంధము, కృష్ణమూలము అవన్నీ హ్యాపీగా కథలు వినండి మీరు. కానీ వినటానికి, అనటానికి కొన్ని అర్హతలు కావాలి. మీరు భక్తులు కావాలి భక్తుడు కానివాడు భగవంతుణ్ణి చేరుకోలేడు. medicine చేయకపోతే doctor కాలేడు, engineering చదవకపోతే engineer కాలేడు. లేదా ఇంకేదో చేయకపోతే ఇంక చేయలేడు. అంటే దానికి ఒక pre qualification, education దానికి కావలసినటువంటి ఒక characteristics అన్నీ ఉండాలి. అవి ఏకాదశ స్కంధంలో పుష్కలంగాఆ వ్యాసుల వారు చాలా బాగా చెప్పారు. వీరు చెప్పారు కానీ క్లుప్తంగా చెప్పారు ఒక one, one and half page లో ముగించేశారు. ఎందుకని అంటే ఆయన స్థితికి వెళ్ళాడు గోత్ర మార్చుడు. అసలు నేను భాగవతం రాయటమే శ్రీ కైవల్య పదం కోరుకొని భాగవతం రాస్తున్నాను దీని వల్ల నాకు పేరు copyright డబ్బు రావాలనుకో-- అని అనుకోలా. అయితే copyright కావాలని అనుకోలేదు but right to copy మనందరికీ ఇచ్చి వెళ్ళాడు ఆయన. కనుకనే ఇవాళ ఇవన్నీ చెప్పుకోగలిగాం. The right to copy is nothing but offering giving unconditionally giving. కాబట్టి ఇక్కడ ఇవాళ ప్రధానమైనటువంటి సత్సంగంలో మనం చెప్పుకోవాల్సింది భక్తుడు ఎలా ఉండాలి? వాడి qualifications ముందు ఏమిటి? భక్తుడు అంటే కేవలం బాహ్యాడంబరంతో ఉండేటువంటి భక్తుడు కాదు. చాలా బిగ్గరగా చాలా అందరికీ వినపడేటట్టుగా తాను చాలా జపం చేసుకుంటున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను, తాను భగవంతుడి యందే లగ్నమై ఉన్నాను అని అభినయించేవాడు శిష్యుడు కాదు, భక్తుడు కాదు. మరి ఎవరు? మొట్టమొదటిది, ఆయన చెప్పిన మొదటి లక్షణం ఏమిటంటే శౌచము ఉండాలి అన్నాడు. శౌచము ఉండాలి అన్న దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే మడి దడి. నేను మడి కట్టుకున్నా నన్ను తాకద్దు. నేను దడి కట్టుకున్నా నన్ను చూడద్దు. నేను తపస్సు-- ఏదో ధ్యానంలో ఉన్నా నన్ను disturb చేయద్దు. లేకపోతే నేను ఆకలి గొని మన వాకిట్లోకి ఒక భిక్షగాడు వచ్చినట్లయితే అతడు ఆకలితో అలమటిస్తూ "భవతి భిక్షాందేహి" అంటే నా పూజ అయితే తప్ప నేను బయటికి రాను అనేటువంటి ఇంత అహంకార పూరితమైనటువంటి అంతరంగ ఉన్నట్లయితే వాడు భక్తుడు ఎలా అవుతాడు? కాబట్టి శౌచము ప్రధానం. నువ్వు ఎటువంటి ఆ-- స్థితిలో ఉన్నావు బాహ్య శౌచం కావాలి అది మనందరం చేస్తాం automatic గా చేస్తాం. శరీరానికి ఒక పోషణ కావాలి గనుక శరీరానికి ఒక అలంకారం చేసుకోవాలి గనుక శరీరం జాగ్రదవస్థని దాటి నిద్రావస్థ లోకి వెళ్ళి మనం మళ్ళీ జాగ్రదవస్థ లోకి వచ్చేటువంటి సందర్భంలో శుచిని మనం తప్పకుండా పాటించాలి. రోజుల్లో ప్రశాంతి నిలయంలో గోడల మీద రాతలు ఉండేవి కాదు. మన మైలురాళ్ళ వలే చెక్కించి దానిమీద కొన్ని సూక్తులు ఉండి అవి నేలలో పాతి౦చారు స్వామి. అంటే భక్తుడు అనేటువంటి వాడు ప్రాంగణంలోకి రాగానే అవి చదువుతూ అలా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అందుకనే వారు పని చేశారు. తర్వాత తర్వాత ఏవో పుస్తకాలు వచ్చినయ్, వీడియోలు వచ్చినయ్ అదంతా వేరే కథ. సరే దానిలో ఏమున్నదంటే ముందు బాహ్య శుచి కంటే అంతస్సు-- లోపల అంతరంగ శుద్ధి చాలా అవసరం. ఇగో ఇవాళ పది రోజులుగా వీళ్ళంతా వంటలు వండుతున్నారు కదా. పది రోజులు వాళ్ళు గనక రాత్రశుద్ధి అనంగానే బయట కూడా తోమటం మొదలు పెట్టారనుకోండి మనకి టైం కి భోజనం చేతికి అందదు. వాళ్ళు ఏం చేస్తారు లోపల clean చేస్తారు బయట తర్వాత ఎప్పుడో చేసుకుంటారు. అలాగే మనం ఎక్కడ ప్రారంభించాలి అంటే అంతరంగ శుద్ధి చాలా ప్రధానమైనటువంటిది. అంతరంగ శుద్ధి మనం జపము, తపము, ధ్యానము వాటి వల్ల మనకు ఏర్పడుతుంది. అన్నింటికంటే జగన్నాయకుడు అక్కడ ఉన్నాడు. జగన్నాయకుడి వలన జగత్తు, జీవుడు చక్కగా నడుస్తూ ఉన్నాయి. జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. ఏదో ఒకరోజున మళ్ళీ మరణించి ఎక్కడికో వాడు ఎగిరి వెళ్ళటం లేదు. మళ్ళీ ఇక్కడే పాంచభౌతికమైనటువంటి దేహం నీరు, నిప్పు, గాలి ఉన్నది అదే కదా శూన్యము. మళ్ళీ అది పంచభూతాత్మకమైనది పంచభూతాలలో కలుస్తున్నది గనుకనే balancing of five elements ఇక్కడ జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ ticket తీసుకుని విమానం ఎక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఎక్కడికి వెళ్ళటం లేదు. వేదం చెప్పింది "ఇహ మీవా" ఇక్కడే, ఇప్పుడే now and here. స్వర్గ నరకాలు రెండూ మన మనస్సులో ఉన్నాయి గనుక మన మనస్సుని మనం స్వర్గం చేసుకోగలిగితే బతికి ఉండగానే స్వర్గసుఖాన్ని అనుభవించవచ్చు. మనకి సుఖము అనగానే పట్టు పరుపులు లేకపోతే ACలు మనకు కావలసినట్లు-- అది సుఖం కాదు. మనకు ఏది ఇవ్వబడిందో భాగవతంలో కృష్ణుడి మీద ఒక పద్యం ఉంది. కృష్ణుణ్ణి పరమాత్మగా జగత్తు భావించిందో, భాగవతులంతా ఆయన దర్శన, స్పర్శన, సంభాషణ కోసం ఎదురు చూసిందో, పదహారు వేల మంది గోపికలు తమ తనూభావాన్ని వదిలిపెట్టారో, స్నానం చేస్తున్నటువంటి వేళ శ్రీకృష్ణ పరమాత్మ పసిబాలుడై వాళ్ళ వస్త్రాలన్నీ తీసుకున్నట్లయితే దేహాభిమానం వదిలిపెట్టండి అని చెప్పడానికి బాల్యంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడే. మరి ఎప్పుడూ గోపికా వస్త్రాపహరణం గురించి చెప్తాం గాని అదే కృష్ణుడు భారతంలోకి తన పాత్ర వచ్చినప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మరి వస్త్రాలు ఇచ్చిన వాడు ఎవరు అని మళ్ళీ కృష్ణుడే. కాబట్టి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎక్కడ లేడో చూపించండి అప్పుడు ఆలోచిద్దాం అని మనం అనగలగాలి. అనటానికి ఆంతరంగికమైన ఒక శుద్ధి కావాలి. అది పాత్ర శుద్ధి ఎప్పుడైతే లోపల clean అయిపోతుందో మళ్ళీ అది రెండవ సారి అదే రోజు అదే క్షణంలో వాడుకోవటానికి వీలు ఉంటుంది గనుక ఒక భజన గాని, ఒక సంకీర్తన గాని, ఒక సేవ కానీ ఇవన్నీ ఉండాలి అంటే మనకి ఉండవలసినది అంతరంగ శుద్ధి. ఎవరి పట్ల ద్వేష భావం లేకుండా ఉండాలి. ఎవరి పట్ల కట్టుతప్పిన మమకారం ఉంచుకోకుండా ఉండాలి. కానీ ప్రపంచాన్ని మమకారం కంటే కూడా ప్రేమతో మనం అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ప్రేమలో స్పర్ధలు లేవు. ప్రేమలో ఇంకో dynamics లేవు. కానీ మమకారంలో చాలా ఉన్నాయి. ఇది నాదే, ఇది నాదే, ఇది నాకోసమే అనేటువంటి భావనని మనం ఆంతరంగికమైనటువంటి శుద్ధి ద్వారా శుచి ద్వారా ఎప్పుడైతే మన మనస్సు లోపల హాయిగా ఉంటుందోమా శుచి లోపల ఏర్పడిందో బాహ్యమైనటువంటి శుచి అప్రధానం అయిపోతుంది. అది ఉండ-ఉండద్దని కాదు, అలాగే ఉండాలి అని. దానికి ఒకసారి నేపాల్ నుంచి భగవాన్ రమణ మహర్షి దగ్గరకి ఆయన్ని చూద్దామని ఒకాయన బయలుదేరి వచ్చాడు. రోజుల్లో passenger train తప్ప లేవు. అది భగవాన్ ఉన్నదానికంటే ఐదేళ్ల ముందు nineteen forty five ప్రాంతంలో. నేపాల్ నుంచి తిరువణ్ణామలై చేరుకోవటానికి ఆరు రోజుల ప్రయాణం పట్టింది, ఆరు రోజులు, ఆరో ఏడో. ఆయన station లో దిగి రమణాశ్రమానికి వెళ్ళేప్పటికీ భక్తులందరూ ఉన్నారు, అప్పటికే భగవాన్ స్థిమితంగా కూర్చుని ఉన్నారు. ఇతను సిగ్గుపడుతున్నాడు. దేనికి సిగ్గుపడుతున్నాడు అంటే, భగవాన్ని చూడాలని నేను వచ్చానో ఆయన చక్కగా ఉంటే నా బట్టలన్నీ మాసిపోయినాయి, నా ఒంటి నిండా మట్టి ఉంది, తల చెదిరిపోయింది, రెండు రోజులు-- ఏడు రోజులుగా స్నానమేమీ చేయలేదు. ఎట్లా ఆయనని దర్శనం చేయాలి? తర్వాత room కి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు స్వామి దర్శనానికి వద్దాము అని అనుకుంటుండంగా భగవాన్ చూపులు ఆయన మీదికి వెళ్ళినయ్, చూడండి. అతని మీదికే, ఎవరినీ చూడటం లేదు చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేశారు ఆయన. అతని మీదికే వెళ్ళగానే అతడు ఇంకా సిగ్గుపడ్డాడు. తల వంచుకొని లోపల ఉంటే భగవాన్ కళ్ళతో ఇలా పిలిచారు. ఆయన వెళ్ళాడు. వెళితే శాస్త్రంలో ఒకటి ఉంది అతనికి చెప్పారు భగవాన్. మనందరికీ చెప్పడానికి అతని ద్వారా చెప్పారు. శాస్త్రంలో ఒకటి ఉంది, అదేమిటి అంటే ఒక జ్ఞానిని లేదు ఒక మహాత్ముణ్ణి లేదు మరొకరిని నువ్వు చూడాలి అనేవాడు జ్ఞాని కాకపోవచ్చు గాక, చూడాలి అని గనక వెళ్తుంటే వెళ్ళిన తర్వాత కదా తెలిసేది వాడు మంచివాడో చెడ్డవాడో. విన్నాడు ఆయన మంచివాడని వీళ్ళంతా వెళ్లారు. దర్శనం ఎలా చేయాలి అంటే ధూళిపాద దర్శనము అని ఒకటి ఉంది. ధూళిపాద అంటే మనసంతా-- శరీరమంతా ధూళి, పాదమంతా కూడా ధూళితో నిండిపోయింది, బట్టలు మాసిపోయినాయ్, చెదిరిన జుట్టుతో, అలసిన కళ్ళతో రాకూడదేమో అని మనం నిర్ణయించుకున్నాం. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే మహాత్ముల దర్శనంలో ధూళిపాద దర్శనమే అత్యున్నతమైనది. చూడండి, అంటే మనం చాలా prepared గా scheduled గా మనం వెళ్తాం, తయారవుతాం, కూర్చుంటాం. అక్కడ unprepared గా unscheduled గా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుకి ఇవి పడతాయా? ఆయన రమణ మహర్షి స్థాయి వంటి గురువు గనక అయితే అవతల వ్యక్తి ఎట్లా ఉన్నా వాళ్ళిద్దరినీ కలుసుకోవటం, మాట్లాడటం జరిగిపోతుంది. దర్శనం అయిపోయింది. అనుకోకుండా భగవాన్ ఎవరితో మాట్లాడని భగవాన్ ఆరోజు అతనితో కూడా మాట్లాడారు. మాట్లాడితే అక్కడ ఉంటారు కాస్త కొద్దిగా చుట్టూ ఉండే వాళ్ళల్లో అనేక ఆలోచనలు, ప్రశ్నలు పుడుతుంటాయి. "భగవాన్ మీతో మాట్లాడాలి అని మేము చాలా ప్రయత్నం చేశాం. అతను ఏమీ కోరుకోలేదు, మీరు ఇంతసేపు మాట్లాడారు. మరి మేము ఎలా ఉండాలి?" అని అడిగితే "శరీరానికి ఉన్న ధూళిని మరచిపోండి. కారణం శరీరమే ఒక ధూళి, శరీరమే గాలికి కొట్టుకుపోయే ధూళి. దానికి అంటుకున్నటువంటివి మీవి కావు. మీరు ఆత్మ స్వరూపులుగా గనక మీరు ఉండగలిగినట్లయితే ఇది జరుగుతుంది." ఇక రెండవది సంభాషణ. సంభాషణ వ్యక్తిన-- వ్యక్తి ఎవరో భగవాన్ కి తెలియదా తెలుసో తెలియదు మనకి. కానీ ఆయనకు కూడా భగవాన్ ఎవరో ఇంకా తెలియదు, అప్పుడే వచ్చారు. ధూళిపాద దర్శనము సర్వోత్కృష్టమైన దర్శనం. మనకు కూడా చూడండి ద-దైవతానికి అలంకారం చేసి అప్పుడు మనల్ని లోపలికి పిలుస్తారు. కానీ శాస్త్రం మాట చెప్పలే. కానీ అది గనక చెప్పకపోతే "చక్కగా శుచిగా రండి, మంచి బట్టలు కట్టుకొని రండి, ప్రసన్నంగా ఉండండి, పని మీద వచ్చారో పని మీదనే ఉండండి" అని చెప్పకపోతే అంతా-- అందరూ ధూళిపాద దర్శనానికే వెళ్తారు. ఇదే గొప్పది అంటే. ఎట్లా అంటే పుష్కరాల్లో ఇక్కడ స్నానం చేస్తేనే నీకు మోక్షం అంటే ముప్పై మంది పాపం జీవితాన్ని-- ప్రాణాలు పోయినాయి. శాస్త్రం ఎప్పుడూ కూడా-- దానిలో మూర్ఖత్వం లేదు. పట్టు విడుపులున్నాయి. చేయగలిగిన వాడికి శాస్త్రం ఆధారం అవుతుంది, చేయలేని వాడికి శాస్త్రం ప్రమాణం అవుతుంది, తెలిసి తెలియని వాడికి శాస్త్రం అట్లా అనేక అపోహలు కల్పిస్తుంది. కనిపిస్తున్నది, కల్పిస్తున్నది అంతా కూడా అంతరంగమే కాబట్టి మనం అంతఃశుద్ధితో ఉండాలి. ఇది మొట్టమొదటి లక్షణం. రెండవది ప్రసన్నమైనటువంటి వదనంతో ఉండాలి. చాలా happy గా ఉండాలి. మనం happy గా ఉండలేము. ఒక్కోసారి happy-- happiness ఎక్కువైనా ప్రమాదం అవుతుంది, happiness తక్కువైనా ప్రమాదం అవుతుంది. కానీ మనం happiness అనేదానికి అర్థం తెలియదు గనుక. ఎవరి యందు తృప్తి ఉంటుందో, ఎవరు తమ పనిని నిష్కర్షగా, స్పష్టంగా చేస్తారో వారికి ఖచ్చితంగా భావం ఏర్పడుతుంది. కాబట్టి మనం కూడా అటువంటివన్నీ నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఇక మూడవది, ఎవరైనా మనం కలుసుకుంటాం. కలుసుకున్నప్పుడు మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, మనం కలిసిన మహాత్ములు, వాళ్ళ గొప్పతనాలు అవి మనం చెప్పుకోవాలి. మన గొప్పతనం అంటూ ఏం లేదు ఇక్కడ. వాళ్ళని కలవటమే మన గొప్పతనం, వాళ్ళని చూడటమే మన గొప్పతనం, వాళ్ళని తరచు తరచు తరచి తరచి చూస్తూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి. దానిలో నుంచి ఒక భావ సంస్కారాన్ని మనం పొందాలి. ఇది కీర్తించటం అందరూ చేస్తారు ఎంతసేపు, స్వామిని గురించి ఎంత సేపైనా కవిత్వం చెప్పొచ్చు. కానీ కవిత్వం స్వామికి సంబంధం లేదు. ఉన్నది ఏమిటంటే ఒక యదార్థ స్థితి ఏదైతే ఉన్నదో దానిని actual గా మనం అనుభవించగలిగితే అప్పుడు మనకి ప్రసన్నతా స్ఫూర్తి కలుగుతుంది. ఇక రెండవది, సంభాషణలో ఎక్కడా కూడా పరుష వాక్యాలు మనం ప్రయోగించకూడదు.ఎవరినైనా సరే "ఆతడు వచ్చాడు ఆమె వచ్చింది" అనచ్చు అది. "వాడు వచ్చాడు అది వచ్చింది" అనకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరిని అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నావు? అందరి యందు ఆత్మ ఉన్నది నేమో ఉపన్యాసం చెప్తున్నావ్ కానీ ఎదురుగా కనపడగానే "అది" అంటున్నావ్ "వాడు" అంటున్నావ్ భయంకరమైన పరిస్థితి ఇది. అది కి వాడికి అది లో స్త్రీ ఉంది పురుషుడు ఉన్నాడు వాడు లో ఇట్లాగే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉన్నారు కానీ రెండు కాని ఒక ఆత్మ మన యందున్నది గనుక మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరితో మాట్లాడినా వాడు చిన్న పిల్లవాడు కానివ్వండి పసిపిల్ల పాప కానివ్వండి వయోవృద్ధుడు కానివ్వండి తొంబై ఏళ్ల వృద్ధుడు కానివ్వండి మనం మర్యాదనిస్తూనే ప్రసన్నమైన లలితమైనటువంటి భాషను మనం వాడాలి. భాష మనకు వచ్చు కదా? భాషనే మనం వాడాలి. కథా కథనంలోనూ ఒక loose words and loose talk రెండు దాంట్లో రాకూడదు. మీరు ఎంత ఉద్వేగంగా చెప్పండి, తర్వాత శాస్త్రంలో లేని విషయాలని అది శాస్త్రం చెప్పింది అని చెప్పకూడదు. మొన్న మనం అనుకున్నాం వేదో నిత్యమధీయతాం శినః కంపి శరీరం శిరస్సు అటు ఇటు ఊపకూడదని అన్వర్ధం చెప్పకూడదని నిజానికి అవన్నీ చేయగలిగితే నువ్వు వేదం చదవమని ప్రమాణం చేసింది. అంటే మనం మనము అంటే మన body language అంతే. అది ఎట్లా ఉండాలంటే మళ్లీ నాకు స్వామి ఇంకో దిక్కు లేదు మనం చూసింది ఆయన్ని. చూడండి స్వామి ఉపన్యాసం ఇస్తారు ఉపన్యాసం ఇచ్చినప్పుడు లేచినప్పుడు ఎలా ఉంటారో ఉపన్యాసం అయిపోయి దిగే వరకు అలాగే ఉంటారు. అలాగే దర్శనం ఇవ్వటానికి వచ్చినప్పుడు మనం గబగబా నడవగలుగుతాం slow గా నడవటం చాలా కష్టం pace చేయాలి అంటే లోపల నిగ్రహం ఉండాలి. ఎంతమంది రానివ్వండి ఆయనకి ఉద్వేగం లేదు ఎవరు రాకపో లేరనుకుందాం ఏమి ఉద్వేగం లేదు. అలా నెమ్మదిగా స్వామిని ఇక్కడ కూర్చొని పుటపర్తి లో వారు ఎలా దర్శనం ఇచ్చారో మీరు మనసులో గనక గుర్తు తెచ్చుకున్నట్లయితే the slowest pace లో నడిచేవారు. నెమ్మదిగా మాట్లాడేవారు. ఎంత నెమ్మదిగా అంటే రెండో మనిషి పక్కన ఉన్నా వాడికి వినపడేది కాదు ఎవరితో మాట్లాడుతున్నారో వాడికి స్పష్టంగా వినిపించేది. ఇక్కడ చెవి దగ్గర నుంచుని చెప్పినట్లు గా ఉండేది. దానిలో పరుష వాక్యం నేను ఇన్ని సమ-- ఐదు దశాబ్దం ఐదున్నర దశాబ్దాల నా జీవితంలో స్వామితో ఒకరిని నిందించిన అటువంటి సందర్భం నేను చూడలేదు. ఏకాదశ స్కంధంలో ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు భగవద్ రూపమైనటువంటి స్వామి లక్షణాలన్నీ తాను ప్రదర్శించి భక్తులైన మీరందరూ ఇలా ఉండండి అని చెప్పారు పట్టుకోలేకపోయినాం. బుంగరము, బొంగరము, గొలుసు మనకు ఆయన ఏమిచ్చారు? వాడికి ఏమిచ్చాడు? వాడికే ఎందుకు ఇచ్చారు? ఇట్లా మన జీవితం అంతా పాడు చేసుకున్నాం అలా చేయకూడదు. ఇవాళ
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 27:45

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

    Now playing
  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22