Skip to content
Transcript తెలుగు
త-మనసు తర్వాత బుద్ధి. బుద్ధి అంటే wisdom అనుకుంటాం intellect అనుకుంటాం. ఇవన్నీ బుద్ధికి English పదాలకి పొంతనే లేదు. బుద్ధి అంటే బద్ధము కానిదంతా బుద్ధి అని అర్థం. Which is bound is called బద్ధ which is unbound is బుద్ధ. అంటే దేనికి లోబడి, దేనికి కట్టుబడి, దేనిని అనుకొని ఇదే కావాలి అనుకొని ఒకచోట ఆగిపోతే దాని పేరు బద్ధత్వం. అసలు నాకేమీ అక్కర్లేదు, ఈశ్వరుడు నా ఏం సంకల్పించాడో దాని ప్రకారం జీవితం గడిచిపోతుంది. నేను చేయవలసిందల్లా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడమే, దాని ఫలితా ఫలితాలు నేను ఈశ్వరుడికి వదిలి పెడుతున్నా అనటం బుద్ధత్వం. అంతేతప్ప మనకున్నటువంటి intellect తో మనకున్నటువంటి limited wisdom limited knowledge తో మూడింటితో మనం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. కేవలం కొంత అర్థమవుతుంది మిగతాది అర్థం కాకుండానే మనం కళ్ళు మూస్తాం. కాబట్టి బుద్ధి అనేటువంటిది intellect అని అనుకుంటే academic discussion కోసం లోకంలో మనకున్న ఒక మేధాశక్తి బుద్ధి అనుకుందాం. అది కాకపోయినా బుద్ధి కర్మను బట్టి బుద్ధి నడుస్తుంది అని ఒక మాట ఉంది కర్మానుసారిణి అంటాం. బుద్ధిని బట్టి కర్మ కర్మను బట్టి బుద్ధి ఇదే తర్కం. దాన్ని వదిలిపెడితే బుద్ధిని మనం positive గా వాడుతున్నామా negative గా వాడుతున్నామా? మనకి చాలా తెలివితేటలున్నాయ్, అద్భుతమైన తెలివితేటలు. దేన్నైనా ఐదు నిమిషాల్లో పట్టుకోగలిగిన తెలివితేటలున్నాయ్. దాన్ని దేనిని పట్టుకోవటంలో బుద్ధిని నేను ప్రవేశపెట్టానో important. ప్రపంచంలో మోసం చేయటమా? ప్రపంచాన్ని మోసం చేయటమా? లేదు జగత్తుని నిరంతరము వంచిస్తూ ఉండటమా? ఆశాపాశాలకు లోబడి జీవించటమా? దీనికైనా బుద్ధిని గనక వినియోగించినట్లయితే నాకు శాంతి లేదు. నాకు కావలసిన బుద్ధి అది కాదు. దేనినైనా ఐదు నిమిషాలలో పట్టుకోగలిగిన బుద్ధిని పరమేశ్వర తత్వాన్ని పట్టుకునే విధంగా గనక దాన్ని తీర్చిదిద్దుకోగలిగితే అది నాకు అద్భుతమైన లోపల ఉన్న ఒక మరో శరీరం. అది ఐదవ శరీరం. మనసు, బుద్ధి ఆపై చిత్తము ఉంది. చిత్తము అంటే ఎక్కడిది చిత్తము? మనసు వేరు, బుద్ధి వేరు, చిత్తము వేరు. మనస్సు ఎప్పుడూ ఉంటుంది. మనస్సు అనేది ఆలోచనల యొక్క సంఘటిత స్వరూపమే మనసైతే, మన సంకల్పాల, వికల్పాల, సంస్కృతుల, సంస్కారధారల సమన్వయ రూపమే బుద్ధి అయితే, చిత్తము ఎప్పటిది కాదు. మనం హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం, పురాణ వాంగ్మయం ప్రకారం, వేదం ప్రకారం మనందరికీ గతించి జన్మలున్నాయ్. దీని తర్వాత కూడా జన్మలు ఉంటాయి. అంటే అనేక జన్మలలో అనేక పనులు చేశాం. అన్ని పనులు చేశామా? అంతా refine అయి redefine అయి వచ్చామా? వచ్చి ఉండకపోవచ్చు. వచ్చి ఉంటే చిత్తం అనేది ఉండేది కాదు. చిత్తం ఎలాంటిదంటే గగన విహారం చేసే ఒక గరుడ పక్షి పచ్చ గచ్చ పొదలలో పారాడేటువంటి ఒక పసరిక పాముని పైనుంచి వచ్చి ఒక్కసారి వాలి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకొని గోళ్లతో పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒక కొండ ఎత్తుకుంటుంది అది. కొండ చిట్ట చివర ఎవరూ నరసంచారము ఎవరూ లేనటువంటి ఒక చోట పాము పిల్లను పట్టుకొని అక్కడ ప్రాణం ఉండగా తినటం మొదలు పెడుతుంది. అది చిత్తం. అంటే గరుడ పక్షి మనమైనట్లయితే పసరిక పాము మనం గోళ్లతో పట్టుకొని మనం తీసుకొని వెళ్లి మనము ఆస్వాదించి, అనుభవించినటువంటి అనుభవాలు గనకైతే remnants అంటాం. పాత జ్ఞాపకాల సంపుటి, సంచికలు ఏవైతే ఉన్నాయో అదంతా కలిపితే దానికి చిత్తము అని పేరు. మనందరికీ చిత్తము అంటే ఇష్టము అని తెలుగులో మనంటాం. నీ చిత్తమొచ్చినట్లు చెయ్యంటాం. [కాష్] ఇక్కడ చిత్తము కాదు. చిత్తం గడచిపోయిన కాలం నాటి అనేక జన్మల నాటి అనుభవాల యొక్క మిగులు అది. It's just a residual product. component ఎప్పుడైతే మన యందు ఉంటుందో చిత్తం కూడా ఒక శరీరం అవుతుంది. బుద్ధిని దాటిన తర్వాత చిత్తం మనకేం చేస్తుంది, మనలో ఎలా ఉంటుంది అంటే ఒక మంచి పని చేయాలి అని మనం అనుకున్నాం. గత జన్మలో ఏమి చేయాలని అనుకుంటూ కన్నుమూశామో మాట, విషయం ఏదైతే మిగిలి ఉన్నదో అది జన్మలో మనకు తెలియకుండానే గుర్తొస్తుంది. గుర్తు తీసుకొని వచ్చి మనల్ని ఇక్కడిదాకా నడిపించే దాని పేరు చిత్తం, అంతే. అంటే మనసు ఇప్పటిది చిత్తము ఎప్పటిదో ఇప్పటిది ఎప్పటిదో ఇక్కడే ఉన్నాయి. రెండింటి మధ్యలో ఉన్నటువంటి బుద్ధి చేత, కుశలత చేత, దానిలో ఉన్న ప్రజ్ఞ చేత, దాని మీద ఉన్నటువంటి ఒక అధికార ముద్ర చేత మన దారి మనం ఎంచుకోవాలి. మనంటాం అరవై ఏళ్లు వచ్చాక భాగవతం చదువుతాం అంటాం. ప్రయోజనం ఉంటుందేమో కొందరికి కానీ అందరికీ ప్రయోజనం ఉండదు. ముందే మొదలు పెట్టినట్లయితే భాగవతం చివరి దశలో చాలా ఉపయోగపడుతుంది. భగవద్గీత చాలా ఉపశమనం కలిగిస్తుంది. ప్రత్యక్షంగా శారీరకమైన గురువు అవసరం మనకుండదు. మనం ఏం చదువుకున్నామో, ఏది అనుభవించామో, ఏది assimilate అయిందో, దేనిని మనం గ్రహించి లోపల దాచుకోగలిగామో అదే మనకు అంతర్గురువై మనల్ని న-నడిపిస్తుంది. అందుకనే అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరస్వామి విగ్రహం మీద ముప్పై మూడు వేల సంకీర్తనలు రాశాడాయన. శివుడన్నాడు, భవుడన్నాడు, మాధవుడన్నాడు, కేశవుడన్నాడు, అమ్మవారన్నాడు అన్నీ ఆయనేనన్నాడు అన్నీ-అన్నీ పరంగా ఆయనే రాశాడు. కానీ రాయటంలో time అయిపోయింది...స్వామిని కనుక్కోవటంలో time దొరకలేదు వృద్ధాప్యం వచ్చేసింది ఇక కనుక్కోవడానికి ఏం మిగలలేదు శక్తి చాలలేదు అప్పుడు తన బుద్ధిని వినియోగించాడు మనస్సు ద్వారా సంకీర్తనలు రాశాడు చిత్తము ద్వారా దానికి స్వరకల్పన చేశాడు కానీ ఇది కాదు దీనివలన కూడా నాకు దర్శనం లభించలేదు కాబట్టి అసలు ఈయన ఎక్కడ ఉన్నాడు అని ఒక ప్రశ్న వేసుకుని చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం అన్నాడు అది చిత్తజ గురుడు గురువు బయట లేడు బయట వెతికాను రాళ్ళల్లో రప్పల్లో కోనల్లో కొండల్లో ఎవరో కనిపించారు ఎవరో చెప్పారు ఎవరో వింటున్నారు ఇవన్నీ అవుతున్నాయి కానీ గురువు ఎక్కడ ఉన్నాడని నేను గ్రహించాను అంటే నా చిత్తములోనే అంటే పుట్టిన చిత్తజ గురుడా నా హృదయంలోనే నాతోనే అనేక జన్మలుగా నాతో నువ్వు కూడా వస్తూ వస్తూ నా యందు ఉన్నటువంటి గురువా! నీకు శ్రీమంగళం అంటే గురువు ఎక్కడ ఉన్నాడు అనేకమంది గురువుల సంగతి చెప్పుకున్నాం భాష్య గురువులంతా కొంత సహాయం చేస్తారు మనం మన మార్గం చక్కగా సుగమం చేస్తారు అంతర్గతమైన గురువు నిజం ఎప్పుడూ కూడా నీవు ఇది చెయ్యమని చెప్తాడు అట్లాగే ఇది చేయటం మంచిది కాదని కూడా చెప్తాడు కాకపోతే మన అహం చేత మనకున్న ప్రాపంచిక మమకారాల చేత మనకున్న limited knowledge చేత మనకి స్పష్టత లేని కారణంగా మనం మన మనస్సు ఏం చెప్పినా చెప్పకపోయినా హృదయంలో ఏమున్నా లేకపోయినా మనకు తోచిన రీతి వెళతాం తోచిన రీతి వెళ్ళటమే బుద్ధి బుద్ధత్వంలోకి వెళ్ళాలి బద్ధత్వంలో ఉన్నవాళ్ళం మనం అంటే we are bound we must become unbound simple కాబట్టి ఇక్కడ బుద్ధి ఒక శరీరం అయితే చిత్తం ఒక శరీరం అయితే ఇక ఏడవ శరీరం ఉంది మనో బుద్ధి చిత్ అహంకారములు అహంకారం అహంకారం అంటే ఏం లేదు నేను చేయగలను తప్పేం లేదు అనుకోవచ్చు నేనే చేయగలను అహం నేను మాత్రమే చేయగలను అహం యొక్క మరొక స్థితి ఇంకెవ్వరూ చేయలేరు అది అహంకారం చూశారా ఒకే point ఇలా దాటుతూ దాటుతూ అహం లో నుంచి అహంకారం వైపు వెళ్ళినప్పుడు అహంకారం కూడా మన యందు ఒక శరీరమై ఉంటుంది అహంకారము సాత్వికాహంకారం అని కూడా ఒక పేరు ఉంది సాత్వికాహంకారం అంటే వాడు మంచివాడే సత్వగుణం ఉన్నవాడే భగవంతుని యందు విశ్వాసం ఉన్నవాడే భగవద్భక్తుడే knowledge ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ కోపము దం-దంభము గర్వము ప్రగల్భము అవి మాత్రం పోవటంలా మరి ఏమి పోగొట్టుకోవాలి అంటే ఆయన రాబట్టుకున్నదేదో రాబట్టుకొని దగ్గర పెట్టుకున్నాడు పోగొట్టుకోవలసినది దంభము ప్రగల్భము గర్వము అహంకారము నేను మాత్రమే చేయగలను అంటే ఏడవ శరీరం మనల్ని చాలా యాతన పెడుతుంది అందరూ జ్ఞానం దాకా ఎందుకు వెళ్ళరు అంటే మీకు చెప్తాను మూలాధారము అని మనకొక చక్రం ఉంది మూలాధారంలో ఒక ఆలోచన పుడుతుంది లేదా ఒక కవిగారు ఉన్నారు పండితుడున్నాడు మూలాధారంలో ప్రయాణం చేస్తాడు అక్కడ జ్ఞానము గం అనేటువంటి బీజాక్షరాన్ని పట్టుకొని స్వాధిష్ఠానానికి వస్తాడు స్వాధిష్ఠానానికి వచ్చి అవును ఒక్కడినే ఎంతకాలం ఇట్లా నాకు ఎవరన్నా తోడుంటే బాగుండు కదా అని రెండో వాణ్ణి పిలుస్తాడు ఇద్దరూ కలిసి కొంత ప్రయాణం చేసిన తర్వాత మణిపూరక చక్రానికి వస్తాడు మణిపూరక చక్రంలో కాదు కాదు మీ ఇద్దరం కాదు మా చుట్టూ ఒక ఇరవై నలభై మంది ఉంటే చాలా బాగుంటుంది అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అని మణిపూరకం దాకా వస్తాడు మణిపూరకం దాటిన తర్వాత పండితుడు అనాహతం దాకా వస్తాడు అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి ప్రపంచం జేజేలు కొడుతుంది నీ అంతటి పండితుడు లేడు అసలు నీ అంతటి వాడు మళ్ళీ పుట్టడు అని చెప్తూ ఉంటుంది ఇది y junction చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఎంతటి మేధావి అయినా flattery కి లొంగిపోయినాడా పతనమైపోతాడు ఎంతటి మేధావి అయినా నాకంటే మించిన వాడు లేడు అనుకున్నాడా పతనం ప్రారంభమవుతుంది కనుక అనాహత చక్రం దగ్గరికి వచ్చేప్పటికీ స్థిమితం కావాలి ప్రపంచం ఎన్ని రకాల జయజయ ధ్వానాలు చేయనివ్వండి ఎన్ని బిరుదులు ఇవ్వనివ్వండి ఎన్ని రకాల సన్మానాలు చేయనివ్వండి అవేవీ నావి కాదన్నట్టుగా ఉండగలిగినట్లయితే అనాహత చక్రం నుంచి నెమ్మదిగా విశుద్ధ చక్రం దాకా వస్తాడు విశుద్ధ చక్రం అంటే దానిలోనే విశిష్టమైన శుద్ధమైన పవిత్రమైన అమలినమైన విమలమైన అచలమైన అన్వయమైనటువంటి ఒక మహా స్థితి కంఠ స్థానంలో ఉంటుంది పండితుడు ఇక్కడికి అనాహతం దాకా వచ్చి-వస్తే కుడివైపు గనక వెళ్ళిపోతే భగవాన్ రమణులు చెప్పినట్లుగా కుడి రొమ్ముకు గనక వెళ్ళిపోతే ఆయనకి ప్రమాదం లేదు ఇక మాటల్లేవు పాటల్లేవు మరి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత విశుద్ధ చక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది సరస్వతీ స్థానం కంఠ స్థానం కంఠ స్థానంలోనే మూలాధారంలో పుట్టిన ఒక చిన్న అగ్ని రవ్వ నిప్పురవ్వ అనేక చక్రాలు దాటి దాటి ఇక్కడికి వచ్చినప్పుడు అదే ఒక భాషగా మారి అభివ్యక్తిగా మారి manifest అయి expression చేస్తూ అది మాటగా పాటగా సాగుతూ ఉంటుంది మహా కవులు మహా పండితులు అందరినీ చూడండి అనాహత చక్రం దాకా వస్తారు అధ్యాత్మ వైపు వెళ్ళరు అధ్యాత్మ మాకు అక్కర్లేదండి వాళ్ళంతా రోజూ పిలిచి మాకు శాలువాలు కప్పుతుంటే అధ్యాత్మలో అవి ఉండవు కదా మాకు అవి మాకు అవి కావాలి అంటాడు పతనమైపోతాడు మరి మొక్కిన జాతి మొక్కిన మనుషులు ఎప్పుడైతే ఇతనికి అహంకారం ఏర్పడుతుందో మొక్కిన వాళ్ళే తొక్కడం మొదలు పెడతారు చూశారా కాబట్టి అక్కడ పతనం అతని పతనాన్ని అతను కోరి తెచ్చుకుంటాడు కాబట్టి మనసులో చాలా ప్రధానమైనటువంటి అనాహత చక్రం దగ్గర కూడా అహంకారం అనేటువంటి దాన్ని control చేసుకోగలిగితే విశుద్ధ చక్రం దాకా వెళ్ళినట్లయితే సరస్వతీ స్థానంనీకో ప్రజ్ఞ ఇచ్చాడు భగవంతుడు, నీకు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడో విజ్ఞానాన్ని ఇచ్చాడో ఇచ్చాడు. మరి విజ్ఞానాన్ని నువ్వేం చేస్తావ్? ఒక మంచి పాట పాడి భగవత్ కైంకర్యం చెయ్. ఒక మంచి మాట చెప్పి భగవంతుడికి నివేదన చెయ్. అంతే తప్ప మాట ఇచ్చాడు కదా, పాట ఇచ్చాడు కదా అని ఏదైనా పాటమో, ఏదైనా మాట్లాడటం చేస్తే అనాహత చక్రం నుంచి వచ్చిన వాడు విశుద్ధం దగ్గర కూడా పతనమైపోతాడు. విశుద్ధం నుంచి ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఇదిగో రోజూ మాట్లాడుకునే ఈ-ఈ వేళ ప్రచారంలో ఉన్న ధ్యానం కాదు, అసలు ధ్యానం గనక అయినట్లయితే అక్కడికి వచ్చినప్పుడు త్రికూటనాముని స్థిమితే అంతరంగే అంటారు. [దగ్గిన శబ్దం] అక్కడ దృశ్యాలు కనిపిస్తాయి. చాలా దృశ్యాలు కనిపిస్తాయి. రంగురంగుల వలయాలు కనిపిస్తాయి. చిత్రచిత్ర వర్ణాలు కనిపిస్తాయి. అనేక అనుభవాలు కనిపిస్తాయి. కానీ కనిపిస్తున్నవన్నీ ఎందుకు వచ్చాయంటే పోవటానికే వచ్చాయి. ఏవి పోవాలో అవి వస్తాయి, ఏవి వచ్చాయో అవి పోతాయి. ఇదే సత్యం. మనమందరం వచ్చాం, ఎందుకు వచ్చామంటే ఏదో ఒకరోజు వెళ్ళటానికి వచ్చాం. వెళ్తాం. వెళ్లి మళ్ళీ ఏం చేస్తామంటే పునఃపునః ఇటువంటి జన్మ ఎత్తుతూ వస్తాం. ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చిన వాడు కలలని, వర్ణాలని, రంగురంగులని, దృశ్యాలని, అక్కడ కనిపించేటువంటి అనేకమంది [దగ్గిన శబ్దం] పురుషులనీ, వీళ్లందరినీ దాటి గనక వెళ్లగలిగినట్లయితే సహస్రారం దాకా వెళ్తాడు. అక్కడ మనం యోగశాస్త్రాన్ని ఆపినట్లయితే, చిత్తము, అహంకారము దాటిన ఏడు గదులు అవి. ఏడు స్థితులు hurdles అంటాం పోనీ. ఏడు చక్రాలు ఇవన్నీ దాటేశాం. మరి చివర ఏమున్నదయ్యా? ఏడు గదులు సింహద్వారమని స్థూల శరీరం తీసుకుని స్థూల, సూక్ష్మ, కారణ మూడు శరీరాలు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు దాటితే అక్కడ పెద్ద vacuum కనిపిస్తుంది. అక్కడ ఏవి దృశ్యాలు లేవు, మాటలు లేవు, ప్రజ్ఞలు లేవు, ప్రపంచం లేదు, అసలు నువ్వే లేవు. మరి ఏమున్నది అక్కడ? అదే నీవై ఉన్నావు. దాని పేరే ఆత్మ. కాబట్టి ఏడు శరీరాలు దాటిన తర్వాత ఉన్నదే ఆత్మ కాబట్టి మనకివ్వబడిన స్థూల శరీరాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని భద్రంగా పొద్దున్న దాని విషయం చాలా చెప్పుకున్నాం. [దగ్గిన శబ్దం] అలాగే కలలు ఎందుకు వస్తాయి అంటే మన మనసులో ఏదో చేయాలి అని అనుకొని ఏమీ చేయలేక దాన్ని వదిలిపెట్టిన కారణంగా అదే ఆలోచనే రూపుదిద్దుకొని మళ్ళీ ఒక కలగా వస్తుంది. ఇలా చేస్తే బాగుండు, ఇలా చూస్తే బాగుండు అన్నప్పుడు అవే కలలై వస్తాయి. వాటిని decode చేసుకోగలిగితే అక్కడ మనస్సుని కూడా, శరీరాన్ని కూడా మనం చక్కగా control చేయగలుగుతాం. ఇక ఇందాక చెప్పిన సుషుప్తి అవస్థ. నిద్ర లేవగానే మనకు చెప్పబడ్డాయి కదా. నిద్ర లేస్తూనే భూమికి నమస్కరించు. అరచేతిలో కరాగ్రే వసతే లక్ష్మీ. లక్ష్మీ అరచేతిలో ఉన్నదంటే లక్ష్మీదేవి ఇక్కడ కూర్చున్నదనే. నీ చేత్తో నువ్వు పనిచేసి నీ రూపాయి సంపాదించుకో. నీ చేతిని దానికే వినియోగించు, కష్టపడు అని చెప్తున్నదది. అప్పుడు లక్ష్మీ దానంతట అది వస్తుంది. చేతిని బలంగా ఉంచు, పిడికిలి బ-బలంగా ఉంచమని అడుగుతూ చెయ్యి చాపి లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని మనం గనక అర్థం చేసుకున్నట్లయితే యాదేవీ సర్వభూతేషు మళ్ళీ పాదం పెడుతూనే భూమాతకు నమస్కరించమన్నది. ఎంత గొప్ప సంస్కృతి ఇది! దీని వెనుక ఎంత science ఉన్నదీ! భూమాత అంటే మనం కట్టించిన building, దాని మీద వేసిన tiles ఏనా? వీటన్నింటికీ ఆధారభూతమైన భూమి ఉన్నదో భూమికి వసుధ అని పేరు. వసువులు జీవులన్నింటినీ ధరిస్తున్నది గనుక ఆమె వసుధ అయింది. లేదా వసుంధర అయినది. ఇద్దరు వ్యక్తులు ఒక పొలంలో కూర్చున్నారట. నుంచున్నారిద్దరు. ఒకడు కొన్నవాడు, రెండోవాడు అమ్మినవాడు. అక్కడే ఉన్నారు. ఇంత ఖాయం ఎకరం ఏదో కొని లక్షలో, వేలో, కోట్లో, వేళ ఏదో చెప్పుకున్నాడు. ఎవరు? కొంటున్నవాడు. మనం అనుకున్న ప్రకారం నీకు డబ్బు ఇచ్చేస్తున్నాను. ఇకపై భూమి నాది అన్నాడు. అవును, నువ్వు నాకిచ్చావు గనుక భూమి నీదే అన్నాడు వీడు. ఇద్దరూ పాపం మర్యాదగానే మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరినీ చూసి నవ్వుకున్నది ఒకరున్నారు. ఆమె ఎవరంటే అమ్మవారు, భూమి. ఆమె అన్నదంట, ఇట్లా ఎంతమంది అన్నారో, ఎంతమందిని విన్నానో. కొనేవాడొకడు, అమ్మేవాడొకడు. రోజూ రోజూ మారిపోతున్నాడు. నాయనా గుర్తుపెట్టుకోండి, అమ్మిన వాడిది కాదు ఇది, కొన్న వాడిది కాదు. It is all temporary. చాలా తాత్కాలికం. వసుంధరా బ్రహ్మ దత్త. ఇది వేదాల్లో మాట. వసుంధరా బ్రహ్మ దత్త. బ్రహ్మ అనేటువంటి మూలకారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చాడు ఇది. దానిమీద మీకు కావలసినంత పండించుకోండి, తినండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీది నాది నాది అని అనుకోకండి. నాది అనుకోవటం, నాకు అనుకోవటం, నాకు మాత్రమే అనుకోవటం, ఇవన్నీ కూడా అహంకారపు గుర్తులు కాబట్టి ఇవన్నీ దాటమని చెప్తూ ప్రాపంచికమైన లౌకిక భౌతికమైనటువంటి విషయాలలో మనస్సును తత్వగా ప్రవేశపెట్టి ఏడు శరీరాల అవస్థలని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే ఆత్మానుభవం కలగటం పెద్ద కష్టం కాదు. మరి ఇంత తెలియకుండా నేనేదో గురువుగారి దగ్గరికి వెళ్ళాను, ఆయనకేదో కొంత డబ్బు ఇచ్చాను. నాకాయన ఆత్మానుభవం నేను ఇచ్చేస్తున్నాను, నీకేదో శక్తిపాత నేను transfer చేస్తున్నాను అన్నాడా? అన్నవాడు, పుచ్చుకున్నవాళ్ళు ఇద్దరూ మోసగాళ్లే, మోసపోతున్న వాళ్లే. ఒకడు మోసగించేవాడు, రెండోవాడు మోసపోయేవాడు. వాడివలన ఇద్దరికీ లాభం లేదు. ఇక్కడ జరగవలసింది ఏమిటంటే ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. ఎవరికి వాళ్ళు స్వాధ్యాయం చేయాలి. బాగా చదవాలి. పురాణ వాఙ్మయాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈవేళ మనకి భాగవత వచన ప్రవాహంలో మనకి ఈశ్వరుడు అనుగ్రహించాడు.దీనికి కొనసాగింపుగా ఇవే మనం పొద్దున మాట్లాడుకున్నది తరువాత ఈశ్వర సంకల్పం మనకి ఎలా లభిస్తుంది? ఈశ్వరానుగ్రహం మనం ఎలా పొందాలి? కర్మయోగము, భక్తి యోగము, యోగము, జ్ఞాన యోగము అన్నీ మాట్లాడుకున్నాం. వాటి జోలికి వెళ్ళకుండా శివానందలహరిలో శంకర భగవత్పాదులు మార్గం చెప్పారు. మార్గం చెప్తే తర్వాత కాలం అంటే ఏమిటో చెప్తాడు. తృతీయ అధ్యాయంలో, ఇవాళ ఇది two sessions కావాలి దీనికి. రేప్ అక్కర్లేదు, పూట అయిపోతుంది. శంభు జ్ఞాన వసంత సంగిని హృతారామే అఘజీర్ణచ్ఛదా శ్రస్తా భక్తిలతాచ్ఛదా విలసతా పుణ్యప్రవాళస్సృతాః దీశ్యంతే గుణకోరక జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతి. శంకర భగవత్పాదులు సంగీతాత్మకంగా, కవితాత్మకంగా, భావస్ఫోరకంగా ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో రచించినటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం శివానందలహరిలో ఇది. ఏం చేయక్కర్లేదట. ఏం చేస్తున్నామని? శంభు, ఈశ్వరా, రామా, కృష్ణ, దైవమా, సాయిరామా అని గనక అన్నట్లయితే, దాన్ని ధ్యానించినట్లయితే, శంభు అనేటువంటి నామం వినపడగానే వసంతము ఆగమిస్తుందట. అది కాలం అన్నా కానివ్వండి, రుతువు అన్నా కానివ్వండి. శంభు జ్ఞాన వసంత సంగిని హృత ఆరామీ హృదయం అనేటువంటి చోట తోటలో అఘజీర్ణచ్ఛదా పాపాలు అనేటువంటి పండు టాకులన్నీ టప టపా రాలిపోతాయట. శంభు అనగానే పాపపు పాపాన్ని చూపిస్తున్నటువంటి సంకేతాత్మకంగా ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆకులన్నీ రాలిపోతే ఎక్కడ అవి రాలిపోయినయో అక్కడ శ్రస్తా భక్తిలతాచ్ఛదా విలసతా. ఒక చిన్న తీగ పాకుతుందట. తీగ పేరు భక్తి. ముందు ధ్యానం, ఆలోచన, చేయాలన్న సంకల్పం, కావాలన్న కోరిక, కామన, దానికై ఆరాటం, పోరాటం, కామాటం వీటన్నింటినీ భక్తిలో గనక అర్థం చేసుకున్నట్లయితే సన్నగా భక్తి అనేటువంటి ఒక తీగ వస్తే తీగ మీద దీశ్యంతే గుణకోరకా. చిన్న మొగ్గలు పుడతాయట. తీగ భక్తి అనే తీగ మీద. మొగ్గలు ఏమిటంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు గుణాలు కనిపిస్తాయి. దీశ్యంతే గుణకోరక వచ్చాక గుణాలు ఎలా వాడుకోవాలి చెప్తున్నారాయన. జప వచః పుష్పాశ్చ సద్వాసనా. అవే మొగ్గలన్నీ పూలై వికసిస్తాయట. పరిమళభరితమవుతాయట. ఎట్లా అవుతాయి? జపమై, తపమై, ధ్యానమై, యోగమై, అనంత విచారమై అయి ఎల్లెడలా మొగ్గగా ఒక పసరుతో కూడినటువంటి ఒక మొగ్గ వికసించినప్పుడు ప్రకృతి అంతా కూడా దివ్యమైన పరిమళంతో, సౌరభంతో దివ్యమైనటువంటి కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత అక్కడ పాత ఆకులు రాలిపోయినాయ్, చిగురాకులు మొసులెత్తినాయ్, చిగురాకుల పక్కన చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయ్, మొగ్గలన్నీ పూలైనాయ్, పూలన్నీ కాయలైనాయ్, కాయలన్నీ పండైనాయ్. పండైనప్పుడు జ్ఞానానందసుధామరందలహరీ. జ్ఞానము అనేటువంటి ఆనందము సుధామరందం అమృతం అనేటువంటి తేనె వాక ప్రవహిస్తూ ఉన్నదట. ప్రవహిస్తుంటే, ఏమిటి ప్రవహిస్తున్నది? ఇంత ఆనందం, ఇంత అమృతంగా ప్రవహిస్తున్నదే అని అనుకుంటే సంవిత్ఫలాభ్యున్నతి. సంవిత్ఫలం. దేనిని కోరి ఇంత చేశానో, దేనిని కోరి ధ్యానించానో, దేనికోసమై జపము, తపస్సు ఇవన్నీ వాంగ్మయ తపస్సు చేశానో, దేనికై అక్షరార్చన చేశానో, ఇవన్నీ జరిగిన కారణంగా దేనిని పొందవలసి దేనిని కోరి ఇవన్నీ చేశానో అది నాకు సంవిత్ఫలమై దక్కింది అంటారు. ఎక్కడ మొదలు పెట్టారాయన? ఎక్కడ తెరిచాడు దాన్ని? కాబట్టి శివానందలహరిలో శంకర భగవత్పాదుల యొక్క భక్తి, వారి భక్తి ఏమిటి? సంగీత సాహిత్య సమలంకృతమై పరిపూర్ణమైనటువంటి ఆనంద ప్రవాహాన్ని అనుభవించాలంటే శివానందలహరి వినాలి. శివానందలహరి చెప్పుకోవాలి. అమ్మవారి శక్తిని, అమ్మవారి యుక్తిని, అమ్మవారి మేనేజ్మెంట్ స్కిల్స్ అంటామే, వాటన్నింటినీ తెలుసుకోవాలి అనంటే సౌందర్యలహరి చదవాలి. సౌందర్యలహరి చదవాలి అంటే ముందు లలితా సహస్ర నామం అంతా వచ్చి ఉండాలి. బాగా తెలిసి ఉండాలి. ఏదో నామం పారాయణం టక టక టక చదువుకోవటం కాకుండా ఒక్కొక్క నామము ఒక్కొక్క రోజు సమయం పడుతుంది. సుమారు రోజు ఒక్కొక్క నామం మీద మూడు గంటలు మాట్లాడొచ్చు. వెయ్యి నామాలు, మూడు వేల గంటలు సమయం ఉంటే లలితా సహస్రం మీద కొంత అర్థమైనట్టు లెక్క. కాబట్టి ఇటువంటి మనస్సుని మనం నిర్మాణం చేసుకోగలిగినట్లయితే, కాలం అనేటువంటి దాని విచారణ చేస్తున్నాడు. అడిగాడు విదురుడు, కాలం ఎంత విచిత్రమైనటువంటిది. పరీక్షిత్ మహారాజు ఏమిటి? అభిమన్యుడు ఏమిటి? అభిమన్యుడి తండ్రి ఎవరు? అర్జునుడు. తరువాత పెద్ద తండ్రులు ఎవరు? ధర్మరాజు. భీముడు. తల్లి? శక్తివంతమైనటువంటి కుటుంబం.యుద్ధంలో రణరంగంలో వాళ్ళు ధీరులు కానీ పద్మవ్యూహం లో చిక్కుకుపోయినాడేమి కృష్ణుడు ఉండి కూడా వెనక్కి రాలేకపోయినాడే కంసాది విమతుల కసి మసంగినవాడు అమేయ ప్రభావం ఉండు మేనమామ కృష్ణుడు కాబట్టి ఇన్ని ఉన్నా కాలం ప్రభావం చేత అభిమన్యుడు చిక్కుబడిపోయినాడా ఎందుకిలా జరిగింది అని విదురుడు అడుగుతున్నాడు విదురుడు అంటే యమధర్మరాజు యొక్క స్వరూపం అది అంశ ధర్మం తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు అంటే మన బోటి వాళ్ళకి ధర్మం యొక్క రహస్యం చెప్పడానికి ఆయన అడుగుతున్నాడు అడిగితే ఆయన చెప్తున్నాడు ఉద్ధవుడు చెప్పలే ఉద్ధవుడు భక్తి చెప్పాడు మైత్రేయ మహర్షి చెప్తున్నాడు ఏమన్నాడంటే కాలము దయామయి కాలమంత దయ వలిగిన వస్తువు ఇంకొటి లేదు అట్లాగే కాలము కఠినాత్మకమైనది కాలమే దానికి ఎవరి యందు అపేక్ష లేదు ఎవరి యందు ఉపేక్ష లేదు ఎవరి యందు ఒక ప్రత్యేకమైన భావం లేదు ఒకడిని రాజుని చేస్తుంది ఒకడిని బంటుని చేస్తుంది బంటైన వాడు నేను ఎప్పుడూ ఇంతేనా అనుకునేలోగా వాడు రాజు అవుతాడు రాజు ఎప్పటికీ నేనే రాజునన్న వాడిని కాలగర్భంలో కలిపేసుకుంటుంది ఇది బహు విచిత్రమైనటువంటి కాలమిది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సాక్షాత్తు నారాయణమూర్తి దశరథ రాజు కుమారుడు ప్రధాన జ్యేష్ఠ కుమారుడు తెల్లవారితే పట్టాభిషేకం అనంగా అడవులకు వెళ్ళవలసి వచ్చింది ఇది కాల మహిమ కాదా పోనీ వెళ్ళాడనుకో భార్యతో తమ్ముడితో కలిసి వెళ్ళాడు ముగ్గురుగా వెళ్లారు కడగా ఇద్దరే మిగిలారు అన్నదమ్ములు మాత్రమే మిగిలారు నారాయణమూర్తి యొక్క భార్యను ఒక రాక్షసుడు అపహరిం అపహరించాడు అంటే కాల మహిమ కాక ఏమున్నది హరిశ్చంద్రుడి కథ మనుష్యుడి కథ ఇట్లా పురాణంలో మనం గనక అనేక కథలన్నీ గనక గుర్తు చేసుకున్నట్లయితే కాలము వైపరీత్యంతో కూడింది అతి బలీయమైనటువంటిది కాలం ఎవరో బాగా సంపాదించుకున్నారు ఎవరో ఒక వ్యక్తి A మనం అంటాం కాలం కలిసి వచ్చింది అంటాడు ఎవరో డబ్బు పోగొట్టుకున్నాడు పాపం రోడ్డు మీద నిలబడ్డాడు కాలం కలిసి రాలేదు అంటాం కాలము కలిసి రాదు కాలం కలిసి దూరంగా కడగా నెట్టి వేయదు కానీ ఏం చేస్తుందంటే భగవంతుడు ఇచ్చినటువంటి కాలాన్ని మనం గనక సద్వినియోగం చేసుకోత పోయినట్లయితే కాలానికి మనకు ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది అందుకనే నిరంతరము కాలాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి కాలం అనే దాన్ని గణన చేసుకుంటూ వస్తే నిన్న నిన్న సత్సంగంలో చెప్పుకున్నాం ఒక అనంత మహా కాలచక్రంలో ఒక సంవత్సరం ఒక ఘడియ ఒక విఘడియ ఇవన్నీ కూడా ఎంత చిన్నవో ఆలోచన చేసినట్లయితే మనం ఇవాళ ఒక డెభై ఏళ్ళో ఎనభై ఏళ్ళో వచ్చాయనుకుందాం ఎనభై ఏళ్ళు వచ్చినాయి చాలా రోజులు ఉన్నాం అని అనుకుంటాం దేవతలకి అది ఎనభై రోజులు మాత్రమే చూశారా మన ప్రమాణం వేరు వాళ్ళ ప్రమాణం వేరు త్రేతాయుగంలో కాల ప్రమాణం వేరు ద్వాపర యుగంలో కాల ప్రమాణం వేరు ద్వాపర త్రేతలను దాటి కలియుగంలో కాల ప్రమాణం వేరు దీనిలో కూడా సుమారుగా ఇక్కడ అందరూ ఒక అరవై ఏళ్ల వరకు జీవితాన్ని చూసి ఉంటే నలభై ఏళ్ల క్రితం ఒక కొత్త డైరీ జనవరి నాడు వస్తే మళ్ళీ కొత్త డైరీ రావాలంటే నిజంగా ఒక సంవత్సరం టైం పట్టేది ఇప్పుడు అదేం లేదు కొత్త డైరీ ఓపెన్ చేసి నాలుగు పేజీలు చదివామో లేదో కాలం తరుముకొని వస్తోంది అంటే కాలం మనల్ని నిలువనివ్వదు కాలం మనల్ని నిలకడగా కూర్చోనివ్వదు కాలము ఆశాపాశాన్ని పెంచుతుంది ఆకర్షణని అలవాటు చేస్తుంది దానివలన అనేకమైనటువంటి మోహ వ్యామోహ వ్యసనాలన్నీ ఏర్పడి కాలమే మనల్ని కబళిస్తుంది కబళించేటువంటి కాలాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఎప్పుడూ మనం ప్రతిరోజూ అనుకోవాల్సింది ఏమిటంటే నిద్ర లేవగానే అనుకోవాల్సిన మొదటి మాట భగవంతుడు ఇంకో ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండటానికి నాకు అవకాశం ఇచ్చాడు అంతే తప్ప ఇరవై నాలుగు ఏళ్ళు రెండు వందల నలభై ఏళ్ళు మనం చేయలేం ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై నాలుగు గంటలు నాకు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో నాకోసం నేను పదిహేను నిమిషాలు గడుపుతా అది అయిపోయిన తర్వాత దైనందిన కార్యక్రమాలన్నీ చేస్తా కానీ భగవంతుడి పట్ల మాత్రం నేను కొంత కాలాన్ని వెచ్చిస్తా మాట్లాడలేకపోవచ్చు చదువుకోవచ్చు చదువుకోవచ్చు మాట్లాడాలి అట్లాగే కాలంలోనే సత్కర్మలు సదాచారము సమ్యక్ సంకీర్తన ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే దానిలోనే ఒక ధ్యాసతో ఒక చిత్తైకాగ్ర స్థితిలో తపస్సు చేస్తే ఏమవుతుంది తపస్సు అంటే అది ప్రత్యేకం ఏం లేదు చీకటి పోతే వచ్చే దాని పేరు వెలుగు అలాగే లోపల ఉన్న తమస్సు పోతే దాని పేరు తపస్సు అంతే తపస్సు ప్రత్యేక ప్రక్రియలు ఏం లేవు దానిలో ధ్యానం ఉందో యోగం ఉందో ఏకాగ్రత ఉందో ఏముందో అన్నీ ఉన్నప్పటికీ చీకటి తొలగితే వెలుగు ఎలా వచ్చిందో తమస్సు పోతే పుట్టేది తపస్సు కాబట్టి తపస్సు నిరంతరమైన తపస్సుగా అధ్యయనము స్వాధ్యాయంగా మనంతట మనంగా చదువుకుంటూ నేర్చుకుంటూ అనుకుంటూ నలుగురు పంచుకుంటూ ఎప్పుడైతే చేస్తామో అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆనందానుభూతిని మనకు కలిగిస్తుంది మనంతట మనం చదవాలి మనంతట మనం నేర్వాలి మనకి ఎక్కడైనా ఏదైనా చిన్న సందేహం ఉన్నట్లయితే అందుకనే పోతన అంటాడు అసలు నాకు భాగవతం గురించి రాయాలి అంటే అసాధ్యము శూలికైనా తమ్మి శూలికైనా అన్నాడు పరమేశ్వరుడికి కూడా తెలియదు భాగవతం గురించి నిజంగా చెప్పాలంటే అందువలన నేనేం చేస్తానంటే విబుధ జనుల వలన విన్నంత కన్నంతపెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వాళ్ళ నుంచి నేను ఏవో కొన్ని విన్నా, భాగవత కథ. విన్నంత రాస్తా, కన్నంత రాస్తా. కనటానికి ఏముంది? చూట్టానికి ఏముంది? అంటే చూట్టం కాదు, చూట్టానికి ఆయన ఏన్న భాగవత కాలంలోకి వెళ్తాడా? Travel చేస్తాడా? Time Journey చేస్తాడా అంటే అది కాదు. కన్నంత అంటే, నా తపస్సు వలన, నా స్వాధ్యాయం వలన, నా జపము వలన నేను కనిపించేటువంటి చరాచర ప్రకృతిని దాటినటువంటి ఒక అనుభూతిమయమైన ప్రపంచాన్ని నేను లోపల దర్శించడమే కనటం. విన్నంత కన్నంత విభూతి యజ్ఞముల వలన విన్నంత కన్నంత. అది మనం కూడా విన్నంత పర్వాలేదు ఎవరో చెప్తారు మనం వింటాం. కన్నంత అది ఎవరి పని వాళ్ళది. కదా, ఎవరిదే వాళ్లే చూడాలి. ఎవరి కంటితో వాళ్లే వస్తువును చూడాలి. చూడాలి, మనసుతో విశ్లేషించాలి, హృదయంతో అనుభవించాలి, ఆనందించాలి, అదేమిటో చెప్పాలి. అది మంచిదైతే ఇంకా నలుగురికి చెప్పాలి. ఇదంతా ఉన్నది గనుక మనం ఇవ్వేళ చేయవలసింది ఏమిటంటే కాలమే మనకు ఆయుష్షు, కాలమే వాయువు, కాలమే ఆయువు, కాలమే స్పృహ, కాలమే జ్ఞాపకం, కాలమే స్మృతి, కాలమే శాస్త్రం. ఇదంతా భాగవతంలో మనకి చెప్తారు. కాలం ఎంత మారిపోయింది! నూరుగురు కొడుకులతో ధృతరాష్ట్రుడు అంతఃపురంలో ఆనందాన్ని అనుభవించవలసిన వాడు, అందరు కన్నబిడ్డలు అందరినీ పోగొట్టుకుని, గంగానది తీరంలో కూర్చుని, ఒక్కడు వృద్ధాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటే, ఆతన్ని రక్షించిన వాడు ఎవరంటే ధర్మరాజు. ప్రతిరోజు వెళ్లి తన పెద్ద తండ్రికి, గాంధారికి సేవ చేశాడు. కానీ ధృతరాష్ట్రుడే మహాభారత యుద్ధం జరగబోయే సమయంలో సంజయుడు పక్కన ఉంటే "పాండవాశ్చైవ మామకాః" ఎలా ఉన్నారు? అని అడిగాడు. అడగటంలోనే ఎంత స్వార్థం ఉన్నదో చూడండి. పాండు కుమారులు ఎలా ఉన్నారు? నా కుమారులు, నా బిడ్డలు ఎలా ఉన్నారు? అన్నాడు. తమ్ముడి బిడ్డల్నే తన బిడ్డలని అనుకోలే. "పాండవాశ్చైవ మామకాః" ఎలా ఉన్నారు చెప్పు? ఎవరు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? ఎందుకంటే వాడు చూడలేడు, వినలేడు, కనలేడు. కానీ చెప్పేటువంటి దూర దర్శన, దూర శ్రవణ సిద్ధులు ఉన్నటువంటి సంజయుడు మాత్రం చెప్పగలుగుతున్నాడు. ఇదిగో ఇలా ఉన్నారు, ఇలా అర్జునుడి రథం ఇలా వచ్చింది, కృష్ణుడు ఇలా తెచ్చాడు, అక్కడ ఏం జరుగుతున్నదో చెప్తున్నాడు. ఓహో! నా కొడుకులు ఎట్లా ఉన్నారు? అని అడుగుతున్నాడు. ఇతని దృష్టి ఏమిటంటే పాండవులు అనబడేటువంటి ఐదుగురు మరణిస్తే మిగిలింది మళ్ళీ మా అబ్బాయ్లే. ఇంకా ఐదు ఊళ్ళు కూడా అడక్కుండా మొత్తం మాదే. అనేటువంటి దురాశ, పేరాశ దాని నుంచి final గా ఏర్పడేది దుర్దశ. ఆశ ఉండాలి, పేరాశ ఉండకూడదు, నిరాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. అని ఇటు భారతము ఇటు భాగవతం చెప్తూ...
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 33:22

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

    Now playing
  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22