⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
బ్రహ్మ జిజ్ఞాస అంటే మనకు ఇంకా కనపడని, మనం ఇంకా అనుభవించని, మన అనుభవం పరిధిలోకి రాని ఒక పరమాత్మ గురించినటువంటి ఒక భావనే బ్రహ్మ జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఐదు వందల యాభై ఐదు బ్రహ్మ సూత్రాలలో మొట్టమొదటి సూత్రం ఇదే. వ్యాసుల వారు దానికి వ్యాఖ్యానం రాయలా. వ్యాసుల వారు ఎందుకు రాయలేదు అంటే, ఈ ఐదు వందల యాభై ఐదు బ్రహ్మ సూత్రాల నిరూపణ అయిన తర్వాత వారన్నారు "మీరు ఇన్ని రాశారు ఇది కూడా మీరే రాయండి" అంటే, "ఇది రాయటం నా పని కాదు, ఇన్ని ఉన్నాయి అని చెప్పడం వరకే నా పని, అది రాయటానికి మరొకరు వస్తారు" అన్నారు. అట్లా వచ్చినటువంటి వారు ఎవరంటే బ్రహ్మసూత్ర భాష్యం రాసినటువంటి ఒకే ఒక ఆ శివావతారం అనండి, అద్వైత మూర్తి అనండి, వారు శంకర భగవత్పాదులు. వారు బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. రాసి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయిపోయింది. ఆ బ్రహ్మసూత్ర భాష్యమే ప్రామాణికం. ఇవాళ ఎవరు రాసినా ప్రమాణం కాదు అది. అయితే బ్రహ్మసూత్ర భాష్యాన్ని శంకర భగవత్పాదులు, దాంట్లో అంతర్ముఖత్వంపై చాలా విషయాలు ఉంటాయి. అయితే ఆ భాష గాని, ఆ లోతులు గాని, దానికున్న dynamics గాని మనకి అంత తేలికగా పట్టుపడవు. ఎందుకంటే దానికి వేదాంత జ్ఞానం కావాలి, గురు శుశ్రూష కావాలి, ఎవరో సద్గురువు లాంటి వాడు ఒకడి దగ్గర ఉండి నడిపించి చెప్పాలి. మరి అది అర్థం కాదు అన్నప్పుడు మరి మాకెట్లా అని అన్నప్పుడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు సూత్ర వాహిని అని రాశారు, చిన్న book గా రాశారు. ఎక్కడన్నా ఎప్పుడన్నా చదువుకోండి. శంకరుల బ్రహ్మసూత్ర భాష్యం కంటే అది తక్కువది కాదు. నిజానికి ఒక తీవ్రమైనటువంటి, విస్తృతమైనటువంటి చర్చని స్వామి సంక్షిప్త స్వరూపం చేశారు. ఎప్పుడైతే మనం ఆ సూత్ర వాహిని చదువుతామో అంతర్ముఖానికి దారి ఏటో మనకు తెలుస్తుంది. అది చదివినప్పుడు ఆ రకంగా ఆలోచన చేద్దాం. మరి ఇవాళ మనిషి ఒక జన్మ ఎత్తాడు, మనందరం ఒక జన్మ ఎత్తి ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం. కష్టము, సుఖము, ప్రమోదము, ప్రమాదము, సుఖము, దుఃఖము, జయము, అపజయము, ఎత్తు, పల్లము అలాగే జననము, మరణము ఇవన్నీ మిగతావైనటువంటి ఎనభై నాలుగు లక్షల, ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు ఆలోచిస్తున్నాయా? వాటికి కూడా కష్టాలున్నాయా? ఈ ప్రశ్నతో ప్రారంభం కావాలి, అంతర్ముఖత్వం. నిజానికి ఈ మానవుడు తప్ప మిగిలిన సమస్త జీవరాశులకి కూడా బాధ ఉన్నదేమో కానీ అనుభవం లేదు. మరి అనుభవం లేకుండా బాధ ఎలా కలుగుతుంది? అనుభవంలో నుంచి బాధ రాలేదు దానికి. ఒక సంఘటనలో నుంచి ఒక పశువుని ఒక దెబ్బ కొట్టినప్పుడు దానికి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. కానీ దాని మనస్సు ఇది, ఇది నాకు నొప్పి అని చెప్పదు అది. వీడు కొడుతున్న కొద్ది అది పడుతూ ఉంటుంది. పడుతూ ఉన్నది కాబట్టి వీడు కొడుతూ ఉంటాడు. అదే ఒక మనిషిని గనక ఒక చిన్న చెంపదెబ్బ వేస్తే react అన్నా అవుతాడు respond అన్నా అవుతాడు. ఎందుకని? అంటే జంతువులకు లేనిది, జంతు జాలానికి లేనిది, కేవలం మానవునికి మాత్రమే ఉన్నది, దాని పేరు మనస్సు. ఆ మనస్సు యొక్క మర్మాన్ని తెలిపేటువంటిది యోగవాశిష్టము. దాన్ని విజా ప్రకాశానంద గిరి వారు యోగవ--యోగవాశిష్ట రత్నాకరము అని చెప్పారు. సరే యోగవాశిష్ట రత్నాకర్, రత్నాకర్ అంటే సముద్రం. మళ్ళీ అదొక ముప్పై మూడు వేల శ్లోకాలు. మరి ఇది ఇవాళ మనకి ఆ పుస్తకం అంతా చదివేది లేదు గనుక మరి ఏం చేయాలి? ఈ మనస్సుని ఎలా నిగ్రహించుకోవాలి? అసలు మనస్సు యొక్క స్వరూపం ఏమిటి? అసలు మనస్సు లేకపోతే ఏమైపోతుంది? మనసు ఉంటే ఏమవుతున్నది? ఇవన్నీ విచారణ చేసినప్పుడు మనకి ఒక ఏడాది క్రితం సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వస్తే టీవీలు అండ్ మీడియా అంతా కూడా పొద్దున ఎనిమిదిన్నర నుంచి సాయంకాలం ఐదున్నర వరకు సుదీర్ఘమైనటువంటి సూర్యగ్రహణం ఉన్నది. ఆ time లో మీరు భోంచేయద్దు. మీరు ముందు పట్టు స్నానం, విడుపు స్నానం మామూలే. ప్రతిసారి చెప్పినట్టే చెప్పారు. కానీ ఏమైందంటే ఆ రోజున సుమారుగా ఎనిమిది గంటల ప్రాంతంలో చటాలున ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలిగింది అంటే మనసు పుట్టింది అని అర్థం. ఏ మనసు పుట్టింది? ఈ యోగవాశిష్టం అనే పేరు చెప్తేనే మనుషులు భయపడిపోతున్నారే. రెండు వేల పేజీలు, పద్దెనిమిది వందల పేజీల్లో ఆ పుస్తకం ఉంది. దీన్ని మనసు ప్రధానంగా చేసుకొని వశిష్టుల వారు మనసులో యాతన పడుతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఏమి బోధ చేశాడు? దాన్ని సంక్షిప్తంగా రాస్తే బాగుండు కదా అని అనిపించింది. రాయాలి అంటే ఆ reference books ఉండాలి, పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు వారు ఏం చెప్పారో చదవాలి. అవకాశం లేదు, మన ఇంట్లో అవేం లేవు. స్వామి సంకల్పించుకున్నా, అంటే పెద్ద ప్రార్థనలు ఏం చేయలా. స్వామిని అనుకున్నాను. నా దగ్గర పెద్ద తెల్ల కాగితాలు లేవు. చిన్న ఏదో conference కి పిలిస్తే ఒక scribbling pad ఉంటే, వాళ్ళిచ్చిన పెన్, పెన్ను ఆ పుస్తకం అక్కడ ఉన్నాయి, ఆ notebook. రాయటం మొదలు పెట్టాను. ఆశ్చర్యం ఏమిటంటే ఏ శ్లోకాలు దానికి అవసరమో, వేటిని గురించి మనం మాట్లాడితే అంతర్ముఖత్వం అనేది తెలుస్తుందో, అసలు అంతర్ముఖత్వం కాదు బహిర్ముఖత్వంలో కూడా ఈ ప్రపంచంలో మనం ఎలా ఉండాలో వశిష్టుల వారు రాముడికి చెప్పారు. దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే లోకే విహర రాఘవ.రాఘవ రామచంద్ర! నువ్ ఇలా ఉండాలయ్యా ఈ లోకంలో కారణం ఏంటంటే నువ్వు రాజువి కాబోతున్నావు ఎందుకంటే యోగవాసిష్టం చెప్పినప్పుడు కేవలం ఎనిమిదేళ్ళ వయస్సు రాముడిది తర్వాత తర్వాత నువ్వు రాజువు అవుతావు నువ్వు ఎలా ఉండాలి అంటే అనేకమైన ఆఘాతాలు అనేకమైన అడ్డంకులు జీవితంలో ఏర్పడినప్పుడు ప్రతి దాన్ని కూడా సక్రమంగా అర్థం చేసుకుని దానిని అధిగమించే ప్రయత్నం ఏ మనసు నీకు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నదో అదే మనసు ద్వారా దానిని దాటేటువంటి ప్రయత్నం చేయాలి రాఘవ అంటాడు ఒకటి అలాగే నువ్వు రాజువి అయినావు గనుక ప్రజలందరికీ నిరంతరము ఏవో కోరికలు ఉంటూనే ఉంటాయి నీ చుట్టూ వాళ్ళే చేరుతారు కోరిక లేని వాడు ఎవడు నీ దగ్గరికి రాడు కోరికలు కావలసిన వాళ్ళందరూ ఉన్నవాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చినా నీవు కోరికలు లేని వాడవై ఉండు చూడండి మీ దగ్గరికి పది మంది వస్తారు నీకు తోచిన రీతి వాళ్ళ కోరిక తీర్చి పంపు కానీ నాకు కూడా ఇలాంటిది ఏదో కావాలని మాత్రం నువ్వు అనుకోకు ఈ ప్రపంచం అంతా కూడా మాయామేయమై ఒక ఎండమావి వలే ఉంటున్నది మిధ్యగా కనిపిస్తున్నది నువ్వు నీ రాజరికము రాబోయే రాజ్యము ఇవన్నీ కూడా ఒక illusion గా ఉంటుంది దానిలో నుంచి తామరాకు మీద నీటి బొట్టు వలే ఉండటం నేర్చుకోవాలి అని సుమారు ఒక పదిహేను శ్లోకాలు అదే పుస్తకం సాయంకాలం ఐదున్నర అయ్యేపటికి అది అయిపోయింది నేను నాకు ఈ తెచ్చి ఉండవలసింది కానీ ఒకటి నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం ప్రతి ఒక్కళ్ళకి నేను ఆ book బహుమతిగా పంపిస్తా [చప్పట్లు] మీరు చదువుకోండి మామూలు భాషలో అది చదివితే యోగవాసిష్టం అంటే ఏమిటి మనసు అంటే ఏమిటి మరి శ్రీరామచంద్రుడి జీవితం మన జీవితం లాంటిదేనా అవును ఎందుకని ఎనిమిదేళ్ళ కల్లా విరక్తి కలిగింది ఆయనకి వైరాగ్యం కలిగింది ప్రపంచం దుఃఖారామం అన్నాడు ఎనిమిదేళ్ళు అయిపోయింది రేపు పట్టాభిషేక మనంగా అరణ్యాలకి వెళ్ళమన్నారు అరణ్యం నుంచి ఆ అరణ్యవాసం పూర్తి చేసుకొని ఆ వెనక్కి వచ్చేప్పటికీ సీతాదేవి నుంచి వియోగం పొందాడు ఆ పిల్లలు ఎక్కడ పుట్టారో సీత ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలియదు ఒకవైపు రాజ్యం చేయాలి ఒకరోజు తన భార్య ఏ ఆశ్రమంలో ఉన్నదో తెలియదు అసలు ఉన్నదో లేదో తెలియదు ఇటువంటి పరిస్థితులలో ఈ ఆఘాత రామాయణం అంటాం దాన్ని ప్రతి చోట ఆయన ఎదుర్కొన్నన్ని కష్టాలు ఆయన పడినన్ని ఇబ్బందులు మనబోటి వాళ్ళం ఇంతవరకు పడలా మనం దాన్ని చాలా అదృష్టంగా భావించాలి ఏది అని జరగాలని ఆయన కోరుకున్నాడో విధి జరగకుండా చేసింది విధి ఎప్పుడైతే జరగకుండా చేసిందో దానిలో ఆయన రాముడై ఏకవీరుడై నిలబడ్డాడు కనుక ఈవేళ మనం కూడా రాముడి ఆదర్శం అంటే రాముడు గుణవంతుడు ఆ సద్గుణవంతుడు రాముడు మంచి బాలుడు ఇది కాదు జీవితాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అట్లాగే రాజ్యం ఎలా చేశాడు సుమారుగా పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం ఏలాడని ఉత్తర భారతదేశం నుంచి కన్యాకుమారి వరకు మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు పదకొండు వేల సంవత్సరాల ఆ కాల ప్రమాణాన్ని ఈ కాలంతో చేసినట్లయితే శ్రీరాముడు డెభై ఎనిమిది సంవత్సరాలే జీవించాడు ఎందుకని వాల్మీకింలో అది ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్తాడు ఆయన ముప్పై ఎనిమిదవ ఏట వెనక్కి వచ్చాడు పన్నెండేళ్ళకి పెళ్లి అయిపోయింది పధ్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం పన్నెండు పధ్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఏళ్ళకి వెనక్కి వచ్చాడు యాభై ఏళ్ళు పాలించాడు అంతే యాభై ఏళ్ళు ఇవాళ మన ఈ లెక్క ప్రకారం ఆ లెక్క ప్రకారం పదకొండు వేలు అవచ్చు పధ్నెనిమిది వేలు అవచ్చు అది కాదు కానీ ఎంతకాలం పాలించాడు కాదు ఎట్లా పాలించాడు మనిషి జన్మ ఎత్తడం కాదు ఎత్తిన జన్మను ఎలా సార్థకం చేసుకున్నాడు ఇక్కడ మరి ఇవన్నీ మనసులో కలిగే ప్రశ్నలు కాబట్టి వీటి జవాబులు కూడా మనం మనసులోనే వెతుక్కోవాలి కాబట్టి కష్టమూ నిష్ఠూరమూ వీటన్నింటికీ మూలమైన వస్తువు మనసే కాబట్టి మనం ఈవేళ సారించవలసినటువంటిది శోధించవలసినది వెతికి పట్టుకోవలసినది పట్టుకున్న దానిని బాగు చేసుకోవలసినది మన మనసు మాత్రమే మనసే లేకపోతే ఏమీ లేదు ఉన్నదంతా మనసే అందుకనే మానవుడికి మరో పేరు ఏమిటంటే మనోమయుడు మానవుడు అని ఆ మనోమయత్వం ఎంత అంటే అది ఫైవ్ పర్సెంట్ మనస్సా కేవలం హండ్రెడ్ పర్సెంట్ మనసే ఉన్నదా అంటే సైకాలజీ లో కూడా ఒక మాట ఉంది ముగ్గురిని తీసుకుందాం అప్పుడే అధ్యాత్మలో ప్రవేశించిన వాడు వాడి మనసు పూర్ణంగా ఉంటుంది అధ్యాత్మలో కొంత ప్రయాణం చేశాడు అది ఖాళీ glass సగము నింపిన సగము రెండుగా ఉంటుంది అధ్యాత్మలో పండిపోయినాడు అంటే ఏమైనాడు శాస్త్రాలు వచ్చినాయా ఇగో ఈ భారత భాగవతాలన్నీ నోటికి వచ్చేసినాయా జ్ఞాని అవుతాడా జ్ఞాని కాడు జ్ఞాని ఎవరంటే నిరంతరమూ ఒక ఆనంద తారకమైన స్థితిలో మనసును నిలబెట్టుకొని ఇందాక యోగవాసిష్టంలో చెప్పినట్లుగా ఏ కోరికలు లేనివాడై తన చేతికి తన pocket లోకి తన దగ్గరకు వచ్చినటువంటిది ఏది ఉన్నదో అది చాలు అనుకొని ಅದಾನಿ పరిమాణం ఏం లేదు అది ఎంత కావచ్చు అది ఏది కావచ్చు ఇది నాకు భగవంతుడిచ్చిన ఈశ్వర ప్రసాదం అని ఎవరు భావిస్తారో వాడు అధ్యాత్మలో ఒక స్థాయికి వెళ్ళినవాడు అవుతాడు ఈ మొదటి నుంచి అధ్యాత్మలో మొదలు పెట్టిన వాడు అన్నీ చదవాలి మధ్యలో ఉన్నటువంటి వాడు చదివిన వాటిని ఆచరించాలి ఈ ఆచరణ పూర్తయిపోయిన తర్వాత జీవితాన్ని ఒక సమగ్రమైన సుందర భూమికగా తాను భావన చేసినప్పుడు ఆ భావనలో నుంచి ఒక ఉదాత్తమైనటువంటి స్థితిని తాను కల్పించుకోగలిగినప్పుడుఈ ప్రపంచం ఆయనకు అప్పుడు మిధ్యగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మనలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలు ఇంకా జీవితం ఇంకా చాలు కాదు జీవామృతం శరదం అమ్మ మన వందేళ్లు ఉండాలని కోరుకోవాలి కాకపోతే దాని కింద tag line ఏమిటంటే ఉండి ఏం చేయబోతున్నావనే ప్రశ్న. ఏం చేయబోతున్నాం hundred years భగవంతుడు ఆశీర్వదించాడు అనుకుందాం. What is that we are going to do with hundred years long life? ఈ ప్రశ్న వేసుకుంటే కనీసం ఇంతవరకు చేయని దానిని ఇప్పుడైనా మొదలు పెట్టి గనుక చేసినట్లయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానులై పోనక్కర్లా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సన్యాసులై పోనక్కర్లా. ఆ balancing act ఏదైతే ఉందో ఇది భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు planes ని కూడా చక్కగా సమన్వయం చేసుకోవటమే నిజమైనటువంటి అధ్యాత్మ సాధన. ఏదో జపం చేశాం దేవుడు కనిపించాడు, తపస్సు చేశాం దేవుడు ప్రత్యక్షమైనాడు, నా కోరికలు తీర్చాడు. ఆ నువ్వు అడిగావు నీ కోరికలు తీర్చాడు ఆయన వెళ్ళాడు. మళ్ళీ నీ కోరికలే లేని స్థితి వచ్చిందా అంటే ఆ పాత కోరికలు అయిపోయినాయి మళ్ళీ కొత్త కోరికలు మొలకెత్తుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అధ్యాత్మ సాధనలో అంతర్ముఖత్వానికి ముందు మనస్సును ఎలా పట్టుకోవాలో, ఆ మనస్సుని మనం చాలా జాగ్రత్తగా handle చేయాలి. మన మనస్సు ఓ ఇది కారణము అని తెలిసిన తర్వాత మనం ఓ మంచి పని చేద్దాము అని మనం అనుకుంటాం. అనుకున్నాం అనుకోండి ఇక్కడే ఈ క్షణమే సంకల్పించుకున్నాం మంచి పని చేద్దాం. చేసెయ్యాలి. ఈ మంచి పని వలన నాకు గుర్తింపు, నాకొక కీర్తి లేదు అందరికంటే నేను అధికుడిని అనేటువంటి భావన ఏర్పడితే ఈ మూడు దాని వలన ఏర్పడేటువంటి ఈ మూడు కూడా అవి ఉండవ్. మరి ఏం చేయాలి అంటే ఆలోచన వచ్చింది మంచి ఆలోచన వచ్చింది మంచి ఆలోచనను అమలుపరిచాం actualize చేశాం దానికి మనకేం సంబంధం లేదు. ఇది. ఈ భావన చాలా ప్రధానమైనటువంటిది. అధ్యాత్మలో ముందుకు వెళ్ళకపోవటానికి కారణం ఏమిటంటే ఆ మనసునే ఆధారం చేసుకొని ప్రపంచాన్ని జయించే ప్రయత్నం చేయటమే అధ్యాత్మలో వైఫల్యం. మనం చేయవలసింది అది కాదు. ఈ మనస్సుని తెలిసే-టెలిసింది దానిని నిగ్రహించటం ఎట్లా? అది మనల్ని మన మీద యాజమాన్యం వహిస్తోంది control ఎలా చేయాలి? ఈ మనసును ఎవరు control చేస్తున్నారు? అంటే మనసుని control ఎవరు చేస్తున్నారు అంటే ఆత్మ control చేస్తున్నది. మరి ఆత్మను పట్టుకోవాలంటే మనసును పట్టుకోవడానికే కొన్నేళ్ళు పట్టింది ఆత్మను పట్టుకోవాలంటే ఇంకా అసలు అది final. అంటే ఈ మనస్సు కిందకి దిగి వస్తే మన ఇంద్రియాలు మన ఐదు కర్మే-కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మనలో ఎలా పని చేస్తున్నాయో, వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో, దేని పట్ల మోహ వ్యామోహాలు పెంచుతున్నాయో, దేని పట్ల వైముఖ్యాన్ని కలిగిస్తున్నాయో, దేని వలన మనకి దుఃఖం కలుగుతున్నదో, దేనికై మనం ఆరాటించి పడుతున్నామో, దేనికై మనం పోరాటం చేస్తున్నామో ప్రతిదానికి మూలాన్వేషణ గనక చేసుకున్నట్లయితే ఆ మనస్సు అనేటువంటి దాన్ని మనం control చేయగలుగుతాం. ఉదాహరణకి మనకి భోజనశాలలో భోజనం వడ్డించారు. బాగుంది. అన్నీ బాగున్నాయి. చాలా బాగున్నాయి. మనసు ఏమంటుంది అంటే చాలా బాగున్నాయి తిను అంటుంది. అప్పుడు మనం మన మనసుకు లోపలే ఏం చెప్పాలంటే నాకిది చాలు. అవి బాగుండొచ్చు గాక, బాగా లేకపోవచ్చు గాక, నేను కేవలము నా దేహాన్ని నిలబెట్టుకోవటం కోసం ఈ కాస్త తింటున్నాను. నాకది చాలు. నన్ను ఉద్రేక పరచవలసిన పని లేదు, నన్ను tempt చేయవలసిన పని లేదు, నువ్వు అక్కడ ఉండు అనగలగాలి. అది ఒక భోజనం చిన్న ఉదాహరణ. అలాగే సంపద సమ డబ్బు. ఆ డబ్బు ఎంత వస్తే మనకి తృప్తి ఉంటుంది అని. ఎవరైనా ఎంత ఇస్తే, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. వ్యాపారరంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళను అడగండి, మీ turnover last year ఎంత అంటే two hundred crores నేను లక్షలు మాట్లాడటం లేదు ఇవాళ ఎవరు మాట్లాడటం లేదుగా. two hundred crores. మరి next year ఏమిటి? My target is five hundred crores. తర్వాత thousand crores. అంటే మనసు వీటిలో ప్రేరేపణ కలిగిస్తున్నది మనసు పరిగెత్తించిన ట్లుగా ఎండమావు వెనక పరిగెత్తుకెళ్తున్నాడు. వెళ్లి, వెళ్లి, వెళ్లి ఆ thousand ఓ twelve hundred ఓ two thousand crores ఓ అక్కడికి వెళతాడు. వెళ్ళిన తర్వాత అలా వెనక్కి తిరిగి చూస్తాడు. ఏం పోగొట్టుకున్నాను ఈ ప్రయాణంలో? నేను ఏమైనా పొందానా? చాలా పోగొట్టుకున్నా. అసలు నేను-నేనేంటో పరామర్శ చేసుకోలే. నా జీవితం ఎట్లా సాగిపోతున్నదో తెలియటంలే. నా భార్యాపిల్లలు ఎలా పెరుగుతున్నారో కూడా చూడలే. డబ్బు, డబ్బు, డబ్బు అంటూ నేను వెళ్లి-వెళ్ళిపోతున్నాను సంపద వెనక. ఇప్పుడు లాభం లేదు దీన్ని ఏం చేయాలి? నా భార్యా బిడ్డలని వాళ్ళు బతికున్నంత కాలం చాలా సక్రమంగా హాయిగా ఉండేటట్టుగా చూసి అది ధర్మం గనుక మిగతాదంతా ప్రపంచానికి నేను ఇవ్వాలి అని ఆ మనసు చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? Tax exemption ఇస్తే మనం దానం చేద్దాం అంటే ఆ పని చేయకూడదు. వ్యాపారంలో సంపద సంపాదించాలి అది actual గా ఉండేటువంటిది. అక్కడ మన మనస్సే మన యొక్క జయాపజయాలను నిర్ణయిస్తుంది. మన తృప్తిని, అసంతృప్తిని నిర్ణయించేది మన మనస్సే. ఇక చాలు అని చెప్పేది మనస్సే, ఇంకా బాగా సంపాదించు అని చెప్పేది కూడా మనస్సే. కాబట్టి అటువంటి మనస్సు మనది మన-మన మనస్సు మన యందే ఉన్నది.పైగా ఎవరి మనస్సు వాళ్ళ దగ్గరే ఉన్నది. మీ మనస్సుని control చేయగలిగిన శక్తి బయట వాడికి ఎవరికీ లేదు. ఒక psychiatrist దగ్గరికి వెళితే కాసేపు ఉజ్జగించడానికి మందులిస్తాడు. కానీ మందుల పని అయిపోగానే మళ్ళీ మనసు విజృంభిస్తుందా లేదా? మళ్ళీ దాని దారి మీద పడిపోతుందా లేదా? మరి ఈ భౌతికమైనటువంటి స్థాయిని దాటి ఈ మనస్సుని control చేసుకోవటానికి, ఇవాళ మనం చెప్పుకునే ఈ భాగవతం కానీ, ఈ అధ్యాత్మ కానీ, ఈ సంపదల పట్ల ఆశాపాశాలు కానీ, సంపదని వితరణ చేయటంలో ఉన్నటువంటి మెలకువలు కానీ, దాని పట్ల మనకున్నటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా సమగ్రంగా ఆలోచించుకోవాలి అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్లి మన మనస్సుని ప్రతిరోజూ ప్రతిక్షణము దాన్ని అది దారి తప్పకుండా చూడాలి. అది దారి తప్పడము అంటే మనసు-- మనము దారి తప్పినట్లే. అది-అది పరిగెత్తుతుంది మనల్ని పరిగెత్తిస్తుంది. పరిగెత్తే వాడిని ఆగమంటుంది, మనం ఆగిపోద్దాం. పడుకున్నటువంటి వాడిని నిద్ర లేపుతుంది, నిద్ర లేచిన వాడిని పడుకోబెడుతుంది. ఇది ఎవరు బయట వాళ్ళు ఎవరు చేయటం లేదు. అందుకని అధ్యాత్మలో అందరూ వాడే పదం ఏంటంటే మీరు అంతర్ముఖులు కండి. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళితే ఒక doctor ఏం చెప్తారు ఆయన? Anatomy గురించి చెప్తారు, ఆత్మ గురించి ఆయనకు తెలియదు, ఆయనకు సంబంధం లేదు ఆ subject తో. మరి జ్ఞాని anatomy గురించి ఆయన చెప్పడు ఎందుకంటే ఆయనకు దాంతో అవసరం లేదు. ఆయన ఆత్మ గురించే చెప్తాడు. అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, దాని శక్తి ఏమిటో, అది ఎక్కడి నుంచి form అవుతుందో, మన శరీరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో, ఇవన్నీ ఆయన చెప్తాడు. కాబట్టి మనకు కావలసినది మనస్సు. మనస్సుని control చేయగలిగినటువంటి విజ్ఞానం కాదు knowledge కాదు. దాన్ని control చేయగలిగినటువంటి absolute knowledge called జ్ఞాన. మనకి జ్ఞానం కావాలి. మరి జ్ఞానాన్ని మీరు చదువు విజ్ఞానం అంతా జ్ఞానం కాదంటున్నారే, మరి జ్ఞానం అంటే ఏంటంటే వివేకము, విచక్షణ దాని పేరే జ్ఞానం. వివేకం ఏమిటంటే వివేకి అయినటువంటి వాడు తనకి తాను జయించలేని, దాటలేని, అధిగమించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు కాస్త తలవంచు ఉంటాడు. వి-వివేకం, విచక్షణ ఏది కావాలి, ఎంత కావాలి, దేనికై కావాలి, ఏది మంచి, ఏది చెడు వీటిని బేరీజు వేసుకుంటూ తన కార్యకలాపాలని, తన జీవితాన్ని గడుపుతే దాని పేరు విచక్షణ. వివేకము plus విచక్షణ is equal to జ్ఞాన అంతే. Intellectual interpretation వల్ల వచ్చేది జ్ఞానం కాదు. అది ఊరికే వివరణ మాత్రమే. ఓ శ్లోకం ఉంది, శ్లోకం చదువుతాం, దానికి శబ్దార్థం చెప్తాం, ప్రతిపదార్థం చెప్తాం, తాత్పర్యం చెప్తాం, విశేషార్థం చెప్తాం, యదార్థం మనకు తెలియదు. చూసారా! యదార్థాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఎవరికి ఏర్పడుతుందో, తాను-తాను అనుభవించినటువంటి ఆ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలి అనేటువంటి అపేక్ష ఎవరికి ఉంటుందో ఆతడు జ్ఞాని. ఏది రాని, ఏది పోని, ప్రపంచమే తల్లకిందులై పోని, ప్రపంచమే తల్లకిందులైపోయిన తర్వాత ఇంకా నాదేముంది, నేను పొందేదేముంది, ఇది నాది అనుకోవటానికి ఏముంది, అంతా సున్నా అయిపోయింది కదా అని నిర్మిమేషుడై, నిమిత్త మాత్రుడై, నిర్వికల్పుడై, నిరోమయుడై, నిర్లిప్తుడై, నిస్తబ్ధుడై సుఖంగా ఉంటాడు. మరి సుఖంగా ఉంటే ఈ ప్రపంచం నడుస్తుందా అంటే, ఈ ప్రపంచం నడపటానికి ఇవన్నీ గనక ఉన్నట్లయితే అద్భుతం. జనక మహారాజు ఒక గొప్ప ఉదాహరణ. మిధిలా నగరపు రాజు, రాజుగా ఉన్నటువంటి జనకుడు రాజర్షిగా ఉన్నాడు. ఆయన ఒకసారి సభలో ఏదో వాదం జరుగుతున్నది. ఆధ్యాత్మిక పరమైనటువంటి గోష్ఠి, వాదన అంటే గోష్ఠి జరుగుతున్నది. ఇంతలోకే ఎవడో వార్తాహరుడు వచ్చాడు. వచ్చి, "అయ్యా! మిధిలా నగరం అక్కడ నిప్పంటుకుంది, కాలిపోతున్నది" అన్నాడు. మరి రాజు ఏం చేయాలి? ఆయన ధర్మం ప్రకారం అది ఆ నిప్పు ఆర్పాలి, మంటలు ఆర్పాలి, మీరు వెళ్ళండి అని చెప్పాలి. నిర్లిప్తంగా ఉన్నాడు. "ఏమిటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడు మిధిలా నగరం కాలిపోతుంటే" అని అన్న వాళ్ళకి జనక మహారాజు తర్వాత జవాబిస్తాడు రామాయణంలో, కాలిపోతున్నది అనేటువంటి భావన వస్తువే పోతున్నది గాని మూలమైనటువంటి ఆత్మ అక్కడే ఉన్నది. కాలితే మళ్ళీ కట్టబడుతుంది, కట్టబడితే మళ్ళీ అది కూలబడుతుంది. కూలబడిన దాన్ని మళ్ళీ మరల మరల చేస్తూనే ఉన్నాం. మన ప్రపంచంలో మనం ఆ పనులే చేస్తున్నాం. కాబట్టి ఏది ఎప్పుడు ఎట్లా జరగవలసి ఉన్నదో దాన్ని అట్లా జరగనివ్వండి. దానికే భగవాన్ రమణ మహర్షిని ఆయన తల్లి వెతుక్కుంటూ వచ్చింది అరుణాచలానికి. వస్తే ఆయన ఎవరితో ఆ రోజుల్లో మాట్లాడేవారు కాదు. అప్పటి వరకు మాట్లాడలేదు, ఒక్క కావ్యకంఠ గణపతి మునితోనే మాట్లాడారు. అది కూడా కొన్ని క్షణాలు. తల్లి ఏడుస్తున్నది. "నా కడుపున పుట్టావు నాయనా, నలుగురికి అన్నం పెట్టాను, నీవు ఒక్కడికి అన్నం పెట్టలేనా? నువ్వు వెనక్కి వచ్చేసేయ్. ఈ అరుణాచలం ఏంటి? కొండలు ఏమిటి? అరణ్యాలు ఏమిటి? నువ్వు అలా కౌపీనం కట్టుకొని బ్రతకడం ఏమిటి? అసలు ఇక్కడ ఎట్లా ఉంటావు? మన ఇంటికి వెళ్లిపోదాం" అన్నది. ఏం మాట్లాడలే. నిమిత్త మాత్రంగా కూర్చున్నారు. కానీ ఆవిడ ఏడుస్తున్నది incessantly గా ఏడుస్తుంటే పక్క వాళ్ళు "భగవాన్! మీ తల్లి వేదనను చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. ఏదైనా ఒక మాట చెప్పి సమాధానం చెప్పండి. ఆమెకి శాంతిని ఇవ్వండి" అని అడిగారు చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు ఆయన ఒక పలక మీద రాశారు. ఏం రాశారంటే, "కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. ఇది జరిగి తీరాలి అని నీవు ఎంత ప్రయత్నించినా అది జరగదు. ఇది జరగకూడదు అని నీవు ఎంత నిరోధించినా అది జరగక మానదు."కనుక మనం మౌనం వహించటమే ఉత్తమము అని తల్లి చేతిలో పెట్టారాయన. అది ఆయన ప్రపంచానికి ఇచ్చిన మొట్టమొదటి సందేశం. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఏదో అది రమణ మహర్షి విషయంలో వాళ్ళ అమ్మ విషయంలో జరిగింది గానీ, ఏమీ చేయకుండా మౌనంగా అలా ఉండిపోతే ఏం జరగని మనం జరిగేవి జరుగుతుంటాయి అని ఉండగలమా అనేది ప్రశ్న. ఉండేట్లుగా మనస్సును నిర్మాణం చేసుకోవాలన్నదే జవాబు. అట్లా ఉండమని కాదు. దానిని అర్థం చేసుకోవాలి, దాని వెనుక స్ఫూర్తిని తెలుసుకోవాలి. సరే, దీనికి మార్గం ఏదైనా ఉన్నదా? మనస్సును identify చేశాం. ఆ మనస్సు మనల్ని బాధ పడుతున్నదో, ఆనంద పడు-- పెరుస్తున్నదో తెలుస్తున్నది. అంతర్ముఖం అంటే లోపలికి వెళ్ళటం అనేది ఎట్లా? మనం మొన్న మాట్లాడుకున్నాం. అయితే అది ఆ సందర్భం వేరు. స్థూలంగా మనకి దేహం ఉంది. ఇదిగో కనబడుతున్నది. పంచభౌతిక దేహం. రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ దాంతో అన్నీ ఉన్నాయి. అవి అందరికీ సమానంగా ఉన్నాయి, ఎవరికీ భిన్నంగా ఏం లేవు. సరే, దీన్ని దాటి మనం స్వప్నావస్థలో మనదైన ప్రపంచంలో మనం ఉన్నాం. అంటే ఈ విశాలమైనటువంటి దృశ్యమాన ప్రపంచం నుంచి మనం ఒక్కసారి వైదొలిగాం. నిద్ర పడుతున్నది. నిద్ర పడుతున్న దాంట్లో నుంచి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో మన మనస్సు operate అవుతున్నది. అది అయిన తర్వాత సుషుప్తి వచ్చింది. ఆ తర్వాత మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది, చిత్తం ఉంది, అహంకారం అన్నీ ఏర్పడ్డాయి. వీటన్నింటి మూలాలు మనం గమనిస్తూ గనక వెళ్లినట్లయితే ఒక్కొక్క దేహం ఒక్కొక్క శరీరం ఒక్కో రకంగా react అవుతున్నది. స్థూల శరీరం ఏమంటున్నది అంటే, నాకు సుఖం కావాలి అంటది. సుఖం అంటే ఏమిటి? అయ్యా ఇక్కడ ఏం లేదు, అనుకూలాలు ఏం లేవు, మీరు ఆ నేల మీద పడుకోవాలి అని వాళ్ళు చెప్పారు అనుకోండి, పడుకుంటాం. అంతే. పడుకోనే-- పడుకోగలిగిన స్థాయికి మనస్సును మనం తీసుకుని వెళ్ళాలి. అదేంటి ఇక్కడ అవన్నీ ఉంటాయి అని వచ్చాము, ఇక్కడ ఏం లేవా అంటే ఉన్నదాంట్లో మనం ఉండగలగాలి. అది ప్రధానం. జీవితంలో చాలా సుఖం ఏంటంటే మనకి ఏమి ఉన్నదో దాంట్లో ఉండటమే. దానికి స్వామి చాలా రెండు ఉదాహరణలు చెప్పారు. ఒక ఉదాహరణ ఏంటంటే, నువ్వు చాలా పొడుగు మనిషివి. కానీ కప్పుకోవటానికి నీకు ఉన్నటువంటి దుప్పటి చిన్నది దొరికింది. ఏం చేయాలి? చేయగలిగింది నీ చేతిలో ఉంది, కాళ్ళు ముడుచుకొని ఆ దుప్పట్లో ఒదిగి పోవాలి. ఏం బాధే లేదు. రెండవది, దుప్పటి చాలా పెద్దది. నీ శరీరం చిన్నది, ఆకృతి చిన్నది. అప్పుడు బాధ ఉన్నదా అంటే నాలుగు వైపులా సుఖమే ఉన్నది. ఎందుకని? ఆ నాలుగింటి మధ్యలో నువ్వు ఒదిగిపోయినావు గనుక. నువ్వు adjust అయినావా, సుఖంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, చాలా high గా comfortable గా ఉన్నానా అంటున్నది ఎవరు? నువ్వా? కాదే. నీ మనస్సు అంటున్నది. అట్లాంటి మనస్సును మనం నిర్మాణం చేసుకోవాలి. ఇక రెండవ ఉదాహరణ స్వామి చెప్పింది. నీ కాలి చెప్పు number, number seven అనుకుందాం. market కి వెళ్ళావ్, ఒక shop కి వెళ్ళావ్, చెప్పులు కొనుక్కుందాం అని వెళ్ళావు. number seven నీకు కావాలి. కానీ ఈ number seven లో ఉన్నది ఏదీ నీకు నచ్చలా. చాలా బాగున్నవి దేంట్లో ఉన్నాయంటే, either number eight లో ఉంది లేదా number six లో ఉంది. ఏం చేస్తాం? number eight కొనుక్కున్నావా? నేను నడక సాగదు. పెద్ద size అది. number six కొనుక్కున్నావా? అసలు సాగదు. మడమలు నొప్పు పుడతాయి. అంటే నీకు కావలసినంత మాత్రమే నీ దగ్గర ఉన్నప్పుడు సుఖం ఉంటుంది. ఇది principle. మనకి తక్కువైందనుకోండి, దుఃఖమే. ఎక్కువైందనుకోండి, అది దుఃఖమే. ఎక్కువైనప్పుడు ఆలోచనలు వేరువేరుగా వెళతాయి. తక్కువైనప్పుడు అసలు ఎప్పటికైనా మనకి ఆ ఎక్కువో ఏదో ఒక కావలసినదన్నా వస్తుందా రాదా అనే ఆలోచన ఉంటుంది. వీటన్నింటికీ మూలమైనటువంటి ఆ మనస్సు యొక్క స్థితిని కనుక్కోవటమే అంతర్ముఖత్వం. అంతేతప్ప ఈ మనిషి లోపలికి వెళ్ళిపోవటం, అక్కడ ఏదో వెతుక్కొని కనుక్కోవటం అది కాదు. మరి ఈ వెళ్ళటానికి ముందు కావలసింది మనస్సు యొక్క స్థితిని అర్థం చేసుకోవటం ఒకటైతే, రెండవది ఏమిటంటే, ఈ mind ని ఎలా control చేయాలంటే ప్రక్రియలున్నాయి. మనం రోజూ చెప్పుకునే ఈ ధ్యానం. ధ్యానంలో-- ధ్యానంలో చేస్తే ధ్యానంలో ఉన్నంత సేపు మనస్సు సాగి ఉంటుంది. ధ్యానంలో నుంచి బయటకు రాగానే మళ్ళీ మామూలుగా ఉంటుంది. అంతే కాదు, ఇంకో విచిత్రం ఉంది. ధ్యానంలో ఉండాలి అని మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో లేనప్పటికంటే విపరీతమైన ఆలోచనలు పుడతాయి. ఎక్కడెక్కడివో గుర్తుకొస్తాయి. ఏవేవో గుర్తుకొస్తాయి. అసలు సాగదు. సాగకపోగా యాతనకి గురి చేస్తుంది. అనేక స్మృతులు తెరమీద బొమ్మవలె కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని అంటే ఆ సమయంలో నీ మనస్సుని నువ్వు open చేసి పెట్టుకున్నావు. అందువల్ల అన్నీ కనిపిస్తున్నాయి. ఇక నీకు ధ్యానం-- ఏదీ కనిపించకపోవటం ధ్యానం కదా. అంతా శూన్యం కావటం ధ్యానం కదా. మరి ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే ఆ శూన్య స్థితిని పొందగలిగేంత మనోనిగ్రహాన్ని మనం పాటించగలగాలి. ఇక్కడ మామూలుగా మామూలు ఈ commercial ఈ ధ్యానాలు నడిపే వాళ్ళు ఏమంటారంటే three four hours గనక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒళ్ళు శక్తివంతం అవుతుంది, ఇవన్నీ చెప్తారు. స్వామి ఆ లెక్క మీకు చెప్పాను. ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు. అది చెప్పి యాభై ఏళ్ళు అయింది. దాన్ని తర్వాత తర్వాత తర్వాత స్వామి దాన్ని మార్చారు. మార్చి ఏమన్నారంటే అరగంటకి నీకు ఇంకా time ఉంది, ఏదన్నా చేసుకోవటానికి. కానీ నిజంగా నీ మనస్సుని control గనక నువ్వు పదకొండు నిమిషాలలో చేయగలిగితే లేదా పదకొండు సెకన్లలో ఆ మనస్సును నువ్వు నిలపగలిగితేనీలో ఉన్న ఈశ్వరుడు నీలో ఉన్న ఆత్మ నీకు కనిపిస్తుంది దానికి ఎవ్వరీ అప్రమేయం అక్కర్లేదు ఎన్ని పుస్తకాలు చదవక్కర్లేదు గంటల తరబడి ధ్యానంలో కూర్చో అక్కర్లేదు అనంటే నాలుగు గంటలు ధ్యానం చేయటం చాలా తేలిక ఆ ధ్యానంలో ఏముంది కళ్ళు మూసుకుని గోడకు అనుకుని కూర్చుంటే నాలుగు గంటలు గడిచిపోతుంది కానీ పదకొండు నిమిషాలు కూర్చోటం పదకొండు నిమిషాలలో ఆ స్థితిని పొందటం చాలా దుర్లభం చాలా కష్టం ఎప్పుడు తేలిక అవుతుంది అంటే మన మనస్సు యొక్క పరిస్థితి మనకు తెలిసినప్పుడు. ఈ మనసు ఎందుకు ఇట్లా ఉంటుంది ధ్యానంలో కూర్చోగానే అనేక ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి పోనీ ధ్యానం చక్కగా కుదిరింది బాగుంది బాగున్న తర్వాత మనం బయటికి వస్తాం బయటికి రాగానే మళ్ళీ మామూలుగా ప్రవర్తిస్తున్నాం మనం ధ్యానంలో ఆనందం పొందాం మరి బయట ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా దానికి మనమే ఉదాహరణ చూడండి ఓ రోజు నిద్ర లేస్తాం ప్రపంచంలోకి వెళతాం ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేస్తాం ఏవో కొన్ని పనులు చేస్తాం. ఆ పనులు చేసి చేసి చేసి నేను చాలా అలసిపోయినాను అంటాం అంతే కదా పనులు చేశావ్ లాభం పొందావ్ కానీ ఏమంటున్నావ్ అంటే నేను అలసిపోయినాను అంటున్నావ్ కానీ రాత్రి పూట పడుకున్నావ్ నిద్ర పోయావ్ మంచి నిద్ర పట్టింది చాలా చక్కని నిద్ర పట్టింది ఏ రకమైన ఆటంకం లేని నిద్ర పట్టింది ఆలోచన లేని నిద్ర పట్టింది తెల్లవారు లేస్తూనే ఏమంటాం అంటే ఎంత హాయిగా ఉందో అంటాం. అంటే ఎన్నో చేయటం వల్ల అలసట వచ్చింది ఏమీ చేయకపోవడం వల్ల ఆనందం కలిగింది. ఈ ఏమీ చేయకపోవడం అంటే స్వార్థము, అసంతృప్తి, అనాదరణ ఇవన్నీ వీటితో కూడినటువంటి దాని వలన అలసట ఏర్పడుతుంది అదేమీ లేని నిద్రలో మనం ఏం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నామా? నిద్రలో మనం ఏమైనా పుస్తకాలు చదువుతున్నామా? నిద్రలో ఏమైనా జిమ్నాస్టిక్స్ ఏమైనా జిమ్ కి వెళ్లి పనులు చేస్తున్నామా? కాయ కష్టాలు ఉన్నాయా? ఏమీ చేయకపోవటమే హాయి ఆ ఏమీ చేయకపోవటమే దాని పేరే ధ్యానం మన మనసుని అట్లా దాన్ని తీసుకుని వెళ్ళాలి. చాలామందికి కలిగేటువంటి ధ్యానానుభవం ఏమిటంటే.