Skip to content
Transcript తెలుగు
అంతటి దానవేంద్రుడు నా అంతటి మహాదాత ప్రపంచంలో నన్ను మించిన దాతే లేడే దానవీరుడిని నేను దానవుడిని దానవీరుడిని కూడా నేనే అడగవలసింది అడుగు వడ వరాలడుగు మాడలడుగు గుర్రాలడుగు గోవులు ఎన్ని ఒక లక్ష గోవులు ఇవ్వనా అడుగు భూమి అడుగు అంతే తప్ప ఏమి అడ అడిగినంటే కుదరదు ఏదైనా అడగవలసిందే అన్నాడు. అన్నీ పోయేవన్నీ నన్ను అడుగుతున్నావు నాకు వాటి అవసరం లేదు రెండడుగులు నేల ఒకటి రెండు అడుగుల నేల ఇచ్చేసేయ్ అంటే ఇది నా దానవ్రతానికి చాలా చిన్న చూపు నీ స్థాయికో నా స్థాయిని బట్టి నువ్వు అడగాలి నీకు స్థాయి లేకపోవచ్చు గాక కానీ ఇదిగో ఏం అడగాలో కూడా నేనే చెప్తున్నాను అడగమ్మా అన్నాడు. ఒకటి రెండు అడుగుల నేల దానికి ఆయన stick అయినాడు. అప్పుడు శుక్రాచార్యుడు చెప్పాడు చూడు ఆలోచించు ఎవరైనా ఒక అడుగుతో రెండు అడుగులతో వాడు ఏం చేసుకుంటాడు అడగటంలోనే ఏదో మోసం ఉంది నువ్వు జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బంది పడతావ్ చాలా చాలా జాగ్రత్తగా ఉండు మన్నాడు. లేదు లేదు కారీ రాజులు రాజ్యమున్ కలుగవే ఇవన్నీ ఎంతమంది రాజులు రాలేదు అంతము లేని భువనమంతా పురాతన పాంధశాల అందిరు సంజలు రంగుల వాకిలు బహరాం జమిషీడులు పాదుషాలు వేనకు వేలుగా కొంత సుఖించి పోయిరి ఎటకో పెర వారికి చోటు సంగుచున్. ఎంతమంది రాజులు రాలేదు ఇక్కడంతా జహరాం బహిషీళ్లు జమీందారులు వచ్చారు పోయినారు అనంతమైనటువంటి మహా సృష్టికి రెండే రెండు ద్వారాలున్నాయి ఒకటి జననము అనేటువంటి తూర్పు దారి తూర్పు ద్వారము మరణము అనేటువంటి వెనక వాణి ద్వారం అంటాం వెనక దొడ్డి దారి అంటాం వెనకది పశ్చిమం వైపు ఉందది. వాటన్నింట్లలో ఇరు సంజలు రంగుల వాకిలు బహరాం జమిషీడులు పాదుషాలు వేనకు వేలుగా కొంత సుఖించి పోయిరి ఎటకో వాళ్ళు ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలియదు వచ్చారు ఉన్నారు పోయినారు ఎందుకు పోయినారు అంటే పెర వారికి చోటు సంగుచున్ రాబోయే వాడికి కాని వాడికో అయిన వాడికో కాస్త చోటు ఇవ్వటానికి వస్తున్నారు పోతున్నారు అని అట్లాగే బలి చక్రవర్తి కూడా చెప్తూ ఎంతమంది రాలేదు ఎన్ని రాజ్యాలు పోలేదు ఎన్ని పదవులు పోలేదు తుచ్ఛమైన వాటి కోసం నన్ను నేను వంచించుకోనా నా వాకిట్లోకి వచ్చి ఒక వటువు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఖచ్చితంగా అడిగిన ఒకటి రెండు అడుగుల నేల నేను ఇవ్వవలసిందే అన్నాడు. అని తన భార్య గురువుగారు చెప్పింది వినటం లేదు ఆత్మోన్నతికి ఇక్కడ విశేషం ఏమిటంటే ఆత్మోన్నతికి మన ఆత్మోన్నతికి గనక అప్పటిదాకా ఉన్న గురువుగారే గనక అడ్డం వచ్చినా ఆత్మ యొక్క స్పురణ కలుగుతున్నటువంటి వేళ గురువుని కూడా పక్కకు నెట్టమని శాస్త్రం చెప్తున్నది అదే పని చేశాడు బలి చక్రవర్తి. గురువుగారు మీరు కంగారు పడకండి మీరు ఉండండి నేను చూసుకుంటాను అన్నాడు. వచ్చాడు భార్యని పిలిచాడు పిలిచి బంగారు పాత్ర తీసుకురా బంగారు పళ్ళెం తీసుకురా వటువు ఎట్లా ఉన్నాడు ఇటువంటి వాడికి రెండడుగులు నేల ఇచ్చి మనం మన యజ్ఞం మనం complete చేద్దాం continue చేద్దాం ఇలా తీసుకురమ్మన్నాడు వాడు హేమ పాత్రలు పాత్ర అంటే plate ఒక చెంబు నిండా మంచి నీళ్లు దివిజ గంగా భాగీరథి నుంచి తీసుకున్నటువంటి నీళ్లు మరి యజ్ఞం చేసేటప్పుడు నీళ్లే వాడతారు కదా తెచ్చి వటువుని పళ్ళెంలో పా కాళ్లు పెట్టమన్నాడు. భార్య భర్త ఇద్దరూ కలిసి చక్కగా పాదాలకి సేవనం చేసుకున్నారు చేసి ఆనంద పడుతున్నాడు ఇలా తీసుకుని నెత్తిన జల్లుకోబోతున్నాడు చెయ్యి పట్టుకున్నాడు గురువు వద్దు ఆఖరికి ఇది కూడా నెత్తిన జల్లుకోవద్దు దాన్ని వదిలేసెయ్ అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో అడిగాడుగా రెండడుగులు ఇచ్చి పంపించు అప్పుడు అన్నాడు. బలి దైత్యేంద్ర కరద్వయీ కృత జల ప్రక్షాళన వ్యాప్తి కిన్ జలజాతాక్షుడు సాచి యోగిస్సు మనస్ సం ప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నళినా మోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. పాదం ఎటువంటిది అంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కూర్చుంటుంది అని మనం విన్నాము బొమ్మలు చూశాం అంతే కదా ఎప్పుడూ పాదసేవనే చేస్తూ అక్కడ ఉంటుంది అని. ఆయన మధ్యలో కాళ్లు అటూ ఇటూ జరిపినప్పుడు ఆవిడ నుదురు మీద చందనం కాదు కస్తూరి అంతా ఉన్నది అట శ్రీ మహావిష్ణువు యొక్క పాదం అమ్మవారి పాలభాగాన్ని తాకిందట. రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ కస్తూరి ఒక బురద అంత రాసుకోరిందట అమ్మవారు దానిని అంటుకున్నటువంటి పాదమే ఇది పాదం ఘనం చెప్తున్నాడు ఆయన. నళినా మోదము నళినా మోదము అంటే తామర పూలన్నీ కూడా ఏమిటి ఇంత లలితంగా పాదాలున్నాయి ఇంత చక్కగా గులాబీ రేకుల వలే ఉన్నాయి మా అందము దాని ముందు ఓడిపోయినట్లే అని అనుకుంటూ ఉన్నాయట. నళినా మోదము రత్ననూపుర నానావేదమున్ పాదమున్. ఆయన పాదానికి ఏదో రత్నాలతో మణులతో చూసినటువంటి ఒక పట్టా లాంటిది ఆయనకి ఒక కడియం లాంటిది కనిపిస్తుందట కడియంలో ఉన్నటువంటి రత్నాలు ఏమిటంటే నానా వేదాలు శ్రీ మహావిష్ణువు అనేది అతనికి స్పురణకు వస్తున్నది నానా వేదములతో కూడినటువంటి పాదము లక్ష్మీదేవి యొక్క పాలభాగాన్ని నిరంతరము తాకుతూ ఉండేటువంటి ఒక పాదము.అటువంటిది ఇక్కడ దొరికిందని బలి దైత్యేంద్రుడు బలి అనేటువంటి రాక్షసరాజు రాక్షస భావము కలిగినటువంటి రాజు మహావిష్ణువు యొక్క దర్శన స్పర్శన సంభాషణల కారణంగా మూడు ఏర్పడిన కారణంగా ఆయన మనసంతా పల్లవించి ఒక ఆనందతాండవం చేస్తూ అక్కడ దానం ఇచ్చాడట. దానం ఇస్తే అక్కడ బలి చక్రవర్తి కూతురు ఇంకా ఆమెకు పెళ్లి కాలే ఆమె పేరు రత్నావళి ఆవిడ ఓరగా పక్కన నుంచొని బాలుడిని చూస్తున్నది అంతవరకు ఇంత దివ్య తేజస్సుతో ఉన్న మానవ శరీరాన్ని ఆవిడ చూడలా. ఎంతసేపు గురువుగారు కనపడుతున్నారు బలి చక్రవర్తి కనపడుతున్నాడు ఆమెకి ఇంకెవరూ లేరు పై అక్కడుండే పరివారం తప్ప. ఆవిడ మనసులో ఏం కోరుకున్నది అంటే నేనంటూ ఏదో రోజు నాకు వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత నేను తల్లిని అవుతాను నేను తల్లి కావలసిన సమయం వచ్చినప్పుడు నేనంటూ కంటే ఇటువంటి ఇంతటి ఉత్తముడైన బిడ్డను నేను కలాలి కనాలి ఇంత అందమైన వాడిని కనాలి అని కోరుకుంది రత్నావళి. అది జరుగుతుండగా దాన కార్యక్రమం జరుగుతూ ఉండగా దాన కార్యక్రమం అయిపోయింది. నెత్తిన నీళ్ళు చల్లుకొని అయ్యా ను నీకు ఎక్కడ కావాలో నా భూమిలో రెండడుగులో మూడడుగులో నువ్వేం అడిగావో అవి నువ్వు చెప్తే ఇప్పుడే అది కూడా ధారపోసేశాను ఇక నీ ఇష్టం అన్నాడు. అప్పుడు మన కథా ప్రకారంగా భూమండలమంతా ఒక పాదం నభోమండలమంతా రెండవ పాదం అయిన తర్వాత ఒకటి రెండు కానీ మూడవ పాదం third dimension అంటాం అది ఎక్కడ ఉన్నది అని అడిగినప్పుడు బలికి అన్నీ హరించు పోయినాయి. ఆకాశం ఆయన ఆక్రమించాడు భూమండలమంతా ఆక్రమించేశాడు ఆక్రమించడం అంటే ఆయనకి ఇతను ఇచ్చేశాడు ఏదో రెండడుగులు అనుకుంటే ఉన్నదంతా ఆయన తీసేసుకున్నాడు కాబట్టి ఇంకా ఏం చేయాలి అని ఒక ఆలోచన కలిగి మనసుకు ఆలోచనా తట్టక నా శిరస్సు మీద నీ పాదం ఉంచు అంతకంటే నేను ఏమి ఇవ్వలేను అన్నాడు. ఒక రాజు యొక్క శిరస్సు మీద పాదం పెట్టడం అంటే సమస్త రాజ్యము శక్తులు ఇంద్ర పదవి కోశాగారము అంటే సంపద అంతా అవతల వాడి పరం అయిపోతాయి. శిరస్సు వంచకూడదు రాజు శిరస్సు వంచవలసి వచ్చింది అప్పుడు మామూలుగా మీరు టీవీల్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏమంటారంటే బలిని పాతాళానికి అణగదొక్కాడు అని చెప్తారు కదా అదే మనకు కూడా అలవాటు అయిపోయింది అణగదొక్కలేదు. నిన్నో మొన్నో చెప్పుకున్నాం గురువు యొక్క పాదాల అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి అని. శ్రీ మహావిష్ణువు యొక్క పాదం ఎప్పుడైతే బలి చక్రవర్తి యొక్క బ్రహ్మ రంధ్రం మీద ఆనిందో బలి చక్రవర్తి లో ఉన్నటువంటి అనేకమైన ఆశలన్నీ తెగిపోయినాయి. ఇక ఇది నాకు కావాలన్న భావనే లేదు అసలు ఇదంతా నాది కాదు ఇంద్ర పదవి కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి భావంతో ఉన్న సమయంలో శుక్రాచార్యుడు ఏం చేశాడు దానం ఇవ్వబోయే సమయంలో దాన పాత్ర ఎక్కడైతే మనం అర్ఘ్యం ఇవ్వటానికి తీస్తాము దానిలోకి తొంగి చూస్తున్నాడు అడ్డం పెట్టాడు. విష్ణువు సర్వజ్ఞ్ జగదక్షుడు అంటాం ఆయన దర్భతో ఒక్క పోటు పొడిచాడు వాడి కన్ను పోయింది. కన్ను పోవడం అంటే లౌకిక దృష్టిని అజ్ఞానాన్ని నశింపజేశాడు. ఒక్క జ్ఞాన దృష్టి గురువుకి జ్ఞాన దృష్టే ఉండాలి కనుక ఒక్క జ్ఞాన దృష్టిని మాత్రమే మిగిల్చాడు మహావిష్ణువు శుక్రాచార్యుడికి ఏమి అపకారం చేయలేదు. అలాగే బలి చక్రవర్తి తల మీద పాదం పెట్టినప్పుడు ఆయన అన్నాడు శిరోధార్యమైన స్థితిలో వటువా నన్నేం చేయమంటావ్ అన్నాడు. వటువు మాట్లాడటంలా సమాధానం లేదు వటువు ఏమైనాడాని అలా కన్ను తిరిగి చూశాడు. వటువు చిన్నవాడిగా లేడు [కొట్టు] భూమండలం దాటాడు వాయువుని దాటాడు ఇంద్రలోకాన్ని దాటాడు గగన గగనాంతరాలు దాటాడు పరబ్రహ్మ మూర్తి అయినటువంటి తన మూల స్థావరం వరకు తన శరీరాన్ని పెంచాడు. పెంచితే సూర్యుడు కంఠాభరణం అయినాడు అట్లాగే గ్రహ తారకలన్నీ ఆయన చుట్టూ ఆక్రమించి ఉన్నాయి. విశ్వరూప దర్శనాన్ని అది త్రివిక్రమ స్వరూపము మూడు కోరికలు కోరి మూడడుగుల నేల అడిగి త్రి విక్రమ మూడు మూడు విక్రమాలు చూపించాడు. భూగోళము ఖగోళము ఖగోళాన్ని దాటిన లోకము అన్నిటినీ కూడా జయించి త్రివిక్రమ స్వరూపాన్ని చూట్టానికి బలి చక్రవర్తి తల ఎత్తలేకపోయినాడు. ఎంత వెనక్కి వెళ్లి చూద్దామన్నా అది కనపడనంత నభోమండలాన్ని దాటింది అది. తారక గ్రహాలన్నీ కూడా ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఆనందిస్తున్నాయి మహావిష్ణువు యొక్క శిరస్సు తమకు దగ్గరగా వచ్చింది అని ఆనందంలో సమస్త ప్రకృతి భూమండలం మొత్తము ఉంటే బలి చక్రవర్తి ఆనంద సౌభాగ్యంలో నుంచి ఒక్కసారి అలా చూపు నిలబెట్టాడు. మళ్ళీ కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా contraction నుంచి expansion నుంచి contraction మళ్ళీ వామనుడై మళ్ళీ మా సహజ రూపాన్ని చూపిస్తూ అడిగాడు నీకేం కావాలి అని అడిగాడు చూశారా అంతకు ముందు దాన అహంకారం ఉన్నటువంటి బలి వామనుడిని అడిగాడు నీకేం కావాలో అడిగి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వటానికి ఏం లేదు తీసుకోవటం తప్ప అప్పుడు వామనుడు అడిగాడు నీకేం కావాలి అని అడిగాడు. నాకేమీ వద్దు అన్నాడు శుక్రాచార్యుడు వింటున్నాడు ఇంద్ర పదవి అడుగు ఇంద్ర పదవి అడుగు ఇచ్చేస్తాడు ఇప్పుడు నీకు నీకు అది తప్ప ఇంకోటి లేదు అడుగు ఇదే సమయం అంటున్నాడు. గురువుని ధిక్కరించాడు బలి చక్రవర్తి ఏమన్నాడో తెలుసా నాకు ఏది యోగ్యం అని అనిపిస్తే అది నువ్వు నాకు ఇవ్వమని అడిగాడు. నాకు ఏది ప్రాప్తే అది ఇవ్వమన్నాడు ఒక పని చెయ్.అని అనేలోగా మన రత్నావళి అక్కడ నుంచొని ఉంది. ఏమనుకుంది కంటే ఇటువంటి అందమైన బిడ్డను నేను తల్లిని అయినప్పుడు కనాలి అనుకున్న రత్నావళి తన తండ్రిని మోసం చేసి జయించి సమస్తము హరించినటువంటి హరికి నేను తల్లినై పాలిచ్చి వాడిని హింస పెడతాను చంపుతానంది. అటువంటి రత్నావళి భాగవతంలో రేపో ఎల్లుండో రేపు పొద్దున పుట్టబోయే కృష్ణుడికి పూచిన తనువై పూతనై వచ్చి పాలిచ్చింది. పునర్జన్మలు ఉన్నాయా లేవా? అవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినయా రాలేదా? రత్నావళి మనసు హాయిగా ఉన్నప్పుడు వీడే బిడ్డ కావాలనుకుంది. తన తండ్రిని మోసం చేశాడు అన్నప్పుడు నేనొక జన్మ ఎత్తి వాడిని ఎలాగైనా పాలిచ్చి చంపుతానంది. అది అదే సమయంలో బలి చక్రవర్తి అన్నాడు "నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. ఇవాళ అన్ని లోకాలు నీవే కదా స్వామి" అని అంటే ఆయన అన్నాడు "నువ్వొక పని చెయ్ పాతాళ లోకంలో ఉండు. నేను చెప్పేదాకా ఇంద్ర పదవి నీకు రాదు. నేను ఇచ్చేదాకా నువ్వు అక్కడే ఉండు. అక్కడ భయపడకు అక్కడ నాగులన్నీ ఉంటాయి పాములన్నీ ఉంటాయి. నాగులు అంటే ప్రాణము ప్రాణము అంటే చైతన్యం. ఒక విశుద్ధమైనటువంటి చైతన్యం మధ్యలో కూర్చొని నువ్వు నారాయణ నామస్మరణం చేసుకుంటూ నీ జీవితాన్ని గడుపుతూ ఉండు. నీకు తోడుగా మరొకడిని పంపిస్తా. అతడెవరో కాదు నీ తాత ప్రహ్లాదుడు. అతడికి ఇంకా పదవి ఇంద్ర పదవి రాలా. ఉరికే నన్ను చూశాడు అప్పుడు. హిరణ్యకశిపుడి కుమారుడిగా ఉండగా నన్ను దర్శనం చేసుకున్నాడు. అప్పటికి రాజ్యం ఏలాడు కానీ ఇంద్ర పదవి చైతన్యము రాలేదు గనుక వాడు నీకు తాత గనుక నీ తాతతో నీ తాత మనవడు మీరిద్దరూ పాతాళ లోకంలో ఉండండి. పాములు ప్రాపంచికమైనటువంటి వాసనలు ఏవీ లేకుండా నేనే సుదర్శన చక్రమై సుదర్శన చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అద్భుత కాంతి వలయమై మీకు రక్షకగా ఉండి జగత్తులో మిమ్మల్ని ఇద్దరినీ నేను రక్షించుకుంటాను. ఇద్దరూ నాకు భక్తులే" అన్నాడు. ఎక్కడ ప్రహ్లాదుడు ఎక్కడ రత్నావళి ఎక్కడ బలి చక్రవర్తి ఇది కథకి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదమా? కాదే. అందుకని మనం కూడా భగవంతుణ్ణి కోరవలసినదే కోరాలి. ఏది అడిగితే మనకు ఆనందం కలుగుతుందో అసలు ముందు అడగకూడదు. అడగకూడదు అనేది చివరిస్తాయి. ముందైతే అన్నీ కావాలి కదా ఆరోగ్యం కావాలి ఆయుష్షు కావాలి ఐశ్వర్యం కావాలి అన్నీ కావాలి అడగండి పొందండి. కానీ జీవితంలో కలవక కొన్ని వేళలు నికామ క్షణ అంటే నికామమైన క్షణాలు ఏర్పడతాయి. అవి కొన్ని వేళల్లోనే వస్తాయి నికామం అంటే ఏమీ అక్కర్లేని స్థితి రావాలి. భవత్పద చింతనాలో జ్వలిత సింహాసనాధముల్ స్వామి! నీ పాద స్పర్శ నీ పాదముల యందు నా మనస్సు ఉండేట్టుగా అది సింహాసనాధమై నా యందు ఉండాలి. అన్నివేళలా గురోరంగి పద్మం అని ఉంది కదా మనకి తతః కిం తతః కిం తతః కిం అంటాడు గురు పాదుకా స్తవంలో. అది ఇచ్చావు ఇది ఇచ్చావు సుందరమైన భార్య ఐశ్వర్యం ఇచ్చావు అన్నీ ఇచ్చినప్పటికీ నీ గురు పాద పద్మముల యందు నా మనస్సు లగ్నమే కాకపోతే తతః కిం ఏం చేసుకొను? తతః కిం దాన్నేం చేయును? ప్రయోజనం ఏమిటి? కావలసింది నా మనస్సు నీ పాదముల యందు లగ్నమైతే సుందరమో కురూపో భార్య ఐశ్వర్యమో ఐశ్వర్యానికి తగ్గట్టుగా జీవితమో జీవితానికి తగ్గట్టుగా ఆయుష్షో ఆయుష్షుకి తగ్గట్టుగా అవకాశమో అవకాశానికి తగినట్టుగా ధ్యానమో తపస్సో యాగమో యోగమో అన్నీ ఏర్పడనీయ్ కానీ ముందు నా మనస్సు నీ పాదపద్మంలో నిలకడ చెందాలి కదా అని అన్నప్పుడు శ్రీ మహా విష్ణువు బలి చక్రవర్తిని ఆయన్ని ప్రహ్లాదుడ్ని బలి చక్రవర్తి అక్కడ ఉంచారు ఇవాళ మనం చేసుకునే ఓణం పండగ కదా. ఓణం పండగ తన సామ్రాజ్యం ఎలా ఉన్నదో తాను భగవంతుడికి ఇచ్చిన సామ్రాజ్యం తనది కాదు శ్రీ మహావిష్ణువుకి ధారాదత్తం చేసిన భూమి ఎట్లా ఉన్నదో చూద్దామని ఓణం పండగనాడు బలి చక్రవర్తి కేరళ ప్రదేశంలో కేరళ భారతదేశంలో అంతర్భాగమే. ఆయన అక్కడికి వస్తాడు. ఇదంతా బానే ఉందనో ఇదేం బాగా లేదనో మొత్తాన్ని చూసుకుని వెళతాడు అని ఐతిహ్యం అది కథ. దాన్ని పక్కన పెట్టినట్లయితే ఇవాళ బలి చక్రవర్తి కథలో నుంచి నేర్వవలసింది ఏమిటంటే యజ్ఞం చేసినా యాగం చేసినా అది స్వీయ క్షేమం కోసం కాక సకల జన రక్ష కోసం సకల జగత్తు యొక్క సౌభాగ్యం కోసం మనం రోజూ చదివే మంత్రాలవే చివరి స్వస్తి వాక్యాలవే వారు చెప్పే సామవేద ఋగ్వేద యజుర్వేదాలవే వారు చదివేటువంటి స్వస్తి వచనాలు అన్నింటి నిండా ఏమున్నదంటే యజ్ఞము ద్వారా నైమిశారణ్యంలో జరుగుతున్న యజ్ఞం ద్వారా దీనిని సంకల్పించిన వారి ద్వారా దీనిని చేయిస్తున్న వారి ద్వారా దీనిలో పాత్ర వహించిన వారి ద్వారా దీనిని చూస్తున్న వారి ద్వారా ప్రపంచానికి శాంతి ఆనందము ధర్మము క్షమము అన్నీ ఏర్పడు గాక అది మంగళాశాసనం. అంటే ఎవరో ఒకరు సంకల్పిస్తారు అది చేయబడుతుంది చేయబడుతున్న దానికి మనందరం ఉంటాము మనందరికీ సౌభాగ్యం ఎవరు కల్పించారు? ఈశ్వర కృప. సత్య సాయి భగవానుడి యొక్క దయ. అందుకనే నిరాటంకంగా అనుకున్నదానికంటే అత్యుత్తమంగా ఎలా సాగుతున్నది అంటే దాని అంచే ఈశ్వర కృప. మనం అన్నీ ఏర్పాట్లు చేస్తాం పెనుగాలులు వీచొచ్చు.కావలసిన ఆవు దొరకకపోవచ్చు. యాభై మందికి అన్నం పెడతాం అంటే పట్టుమని పది మంది కూడా దొరకకపోవచ్చు. ఇక్కడ వంద మందికి పెడదాం అంటే నూట యాభై మంది వస్తున్నారు. డెబ్బై మందికి బట్టలు పెడదాం అంటే తొంభై మంది వచ్చి నిల్చుంటున్నారు. అంటే ఏమిటి? సంకల్పము, క్షేమము, యోగము దీనన్నింటిని వహిస్తున్నటువంటి పరాత్పరుడు అయినటువంటి ఈశ్వరుడు యజ్ఞాన్ని నడిపిస్తున్నాడు. ఋత్విక్కులు యజ్ఞ పురుషులు అవుతారు. సంకల్పించిన వారు యజ్ఞ భోక్త అవుతారు. చూస్తున్నటువంటి వారు యాజ్ఞిక స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా నైమిశారణ్యంలో యజ్ఞం చేస్తే, ఏ-ఎవరు చేస్తారు అక్కడ? చేస్తున్న పురోహితుడా? చేయిస్తున్న మనవా? చూస్తున్న మనవా? అంటే అక్కడ మంత్రమే ఋత్విక్కు, మంత్రమే పురోహితుడు. మం-- పురోహితుడు మంత్రంగా ఉండడు. మంత్రమే పురోహితుడై ఉంటాడు. అలాగే చూస్తున్న మనమంతా కూడా యాజ్ఞకులం అయిపోతాం. యజ్ఞం చేసినట్టే. మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. హవిస్సులు వెయ్యనక్కర్లేదు. కానీ మనం చివరిగా తీసుకునేటువంటి ఒక తీర్థము, ఒక ప్రసాదము ఏమిటంటే, పరమేశ్వరుడు అంతిమంగా మనకిస్తున్న అష్ట ఐశ్వర్య సౌభాగ్యవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దీవెన. అది నోట్లో వేసుకునేది కాదు. దానిని తినేది కాదు. దానిని స్వీకరించాలి. అది ఎంత తక్కువ ప్రసాదం మనకు దొరికితే మనమంత అదృష్టవంతులం. ఇంత దొరికితే చాలా గొప్పవాడని, ఆయన పెద్దవాడనుకుంటాం. చాలా ఇచ్చారనుకుంటాం. చాలా మనకివ్వలే. స్వామి అన్నారు ఒకసారి, "When something is given to you, it is not to you alone. It is through you to the world." చూశారా? మన ద్వారా ఇక్కడిదాకా రాలేని వారు, రానివారు, ఒకవేళ వచ్చిన బయటికి వెళ్ళినవారు, ప్రసాద సమయంలో ఎక్కడో ఇరుక్కుపోయిన వారు, వారి కోసమని మనకు కొన్ని పళ్ళు ఇస్తారు. వాళ్ళ కోసమని మనం వాటిని నిలబెట్టి ఉంచాలి. వాళ్ళకి అది అందించాలి. That is our duty. కాబట్టి, ఇవన్నీ కూడా ఒక తాత్విక విచారధారలో భాగవతాన్ని అర్థం చేసుకోకపోతే, సినిమా చూస్తే కథ అంతా తెలుస్తుంది కదా. కానీ అది కుదరదు. అది కేవలం దృశ్యం మాత్రమే. దృశ్యానికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, భావన ఉన్నదో అదంతా మనం గ్రహించాలి. మరి ఇంత పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి పరమపదం ఎందుకివ్వలేదు? ఇవ్వాలి కదా! పాపాయనంది. నారాయణుడు తప్ప ఏమీ లేకుండా, రాజు కొడుకై ఉండి కూడా, భోగం లేకుండా, అతి పిన్న వయస్సులో మూడు నాలుగేళ్ళ వయసుకే వైరాగ్యాన్ని అనుభవించాడే. మరి అటువంటి వాడికి పదవి ఎందుకివ్వలేదు పరమ పదము అని ప్రశ్న వేస్తే, ప్రహ్లాదుడు పరమ పదాన్ని కూడా కోరుకోలా. దయా శతకము అని ఒకటి ఉంది. దయా శతకం. శ్రీవైష్ణవులకు తెలుస్తుంది అది. దయా శతకంలో రచయిత కవి, భక్తుడు, భక్త కవి శ్రీ వేంకటేశ్వర స్వామిల గురించి మాట్లాడుతూ, "శ్రీ వేంకటేశ్వరా! నీవు దయగలవాడవు" అంటాడు. ఏముంది మనం కూడా అంటాం కదా, దయగలవాడివి, కరుణ గలవాడివి అంటాం. "నీవు దయగలవాడివే గానీ, నీవు దయ కాదు" అంటాడు రెండో మా-మాట. డబ్బు ఉన్నవాడు వేరు, డబ్బు వేరు. అంతే కదా. కాబట్టి వేంకటేశ్వర స్వామి దయగలవాడు. దయను దగ్గర పెట్టుకున్నటువంటి వేంకటేశ్వరస్వామి కంటే గొప్పది ఏదంటే, ఆయనతో కూడి ఉన్న దయ గొప్పది. అది దయా శతకంలో. అది అద్భుతమైన చమత్కారంతో కూడిన ఒక expression అంటాం, అభివ్యక్తి. కాబట్టి ఇంద్ర పదవిని కూడా, ఇంద్ర పదవిని, పరమ పదాన్ని ఏం కోరుకోలా. తాను చూడని, తాను అనుభవించని ఒక మహావిష్ణు తత్వాన్ని కంటితో చూడాలి అనుకున్నాడు. కానీ చూసినప్పుడు మాత్రం అది భయ రూపంగా చూశాడు. భయం కలుపు--గా చూశాడు. అయినా భయపడ్డాడు. భయపడ్డ తర్వాత, భయం ఏర్పడిన తర్వాత మళ్ళీ మాయలో పడ్డట్టే. భగవద్దర్శనం అయిన తర్వాత ప్రహ్లాదుని యొక్క మనస్సు నరసింహ స్వామిని పూర్ణ దైవంగా అంగీకరించని కారణంగా ఆయనకు పరమపదం రాలే. వచ్చిన వాడు విష్ణువే నన్ను మళ్ళీ వైకుంఠానికి తీసుకొని వెళతాడు. నా ప్రాణం పోలేదు. నేను సాయుజ్యాన్ని పొందాను అన్నటువంటి హిరణ్యకశిపుడ్ని తనలో లీనం చేసుకున్నాడు. తనలో లీనమైపోయిన తర్వాత, లయమైన తర్వాత ఇంకా హిరణ్యకశిపుడు లేడు. మళ్ళీ వాడు డ్యూటీకి వాడు వెళ్తాడు. అది వేరే సంగతి. కానీ దేనిలో చేరవలసి ఉన్నదో దాని యందు చేరాడు. మూడు కథలు ఒకదానితో ఒకటి ఉన్న భిన్నమైన పారిశ్రాలలో భగవత్ తత్వాన్ని, భాగవతుని యొక్క లక్షణాన్ని అపురూపంగా వర్ణించినటువంటి ఇవి. ఇందులో వామనావతార కథకి వ్యాసులవారికి credit ఏమీ లేదు. చాలా, రెండు మూడు శ్లోకాలు ఉంటాయి. కానీ వామనావతార ఘట్టాన్ని తాను అక్కడ ఉన్నట్టుగా, తాను యజ్ఞంలో, బలి యజ్ఞంలో ఉన్నట్టుగా అన్నీ కూడా గ్రహించి మనకు బోధించి మనకు దృశ్యమానంగా picturesque అంటాం. దృశ్యమానంగా, దృశ్య సాక్షాత్కార భాజకంగా, దృశ్యమే కంటి ముందు కనిపించినట్లుగా చెప్పిన పోతనామాత్యుడికి వేళ మనం నమస్కరించాలి. ఆయన లేకపోతే మనకు వామనావతారం ఘట్టం దొరికేది కాదు. ఏదో వామనుడు వచ్చాడు. కొన్నాళ్ళు ఉన్నాడు. ఏదో రాజుగారి ద్వారా ఆయన వెళ్ళిపోయాడని ఏదో అనుకునే వాళ్ళం. దాన్ని నుంచి తర్వాత భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇంకా పుట్టలేదు. పుట్టకుండానే పుట్టబోయే వాడికి తల్లిని కావాలని కోరుకున్నది. వాడు ఎప్పుడన్నా మహావిష్ణువు రూపం తీసుకొని రానీ, వాడికే నేను తల్లినై పాలిస్తానంది. నే కంటానని అనుకోలే. ఎవరన్నా కనని వాడు పుట్టాడు అంటే వాడికి పాలిచ్చి వాణ్ని నేను దండిస్తానంది. కాబట్టి జీవుడి యొక్క లక్షణాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్పరం ఎవరం ఇద్దరం కలుసుకున్నా, పది మందిం కలుసుకున్నా మన భావాలు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఇది గుర్తు పెట్టుకోవాలి. పవిత్రత లేని భావానికి విలువ లేదు.ఈ కలయికలో ఎవరికీ అవసరమని కాకుండా మనందరం కలిసి భగవత్ భక్తులుగా ఒక చక్కని తీర్థ ప్రజగా మనం గనక ఇక్కడ ఉండగలిగితే మన మనసును అలా మనం నిర్మాణం చేసుకోగలిగినట్లయితే ఈశ్వరుడి యొక్క అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మన యందు సంపూర్ణంగా పరితృప్తంగా complete గా మనకు లభిస్తుంది అని ఒక మంగళాశాసనం మనం చేసుకోవాలి అది నిజమైనటువంటి భావన అదే నిజాణికీ భాగవతం యొక్క తత్వార్థం ఇదే.కథ అందరూ చెప్పుకోవచ్చు ఏముంది కథలో వాడు వచ్చాడు వీడు ఇచ్చాడు వాడిని లోపలికి పంపాడు ఈయన పైకి వెళ్ళాడు ఇది కాదు కదా అందులో బలి చక్రవర్తి మనం కావాలి శ్రీ మహావిష్ణువు మనం కావాలి ఆయన ఎందుకు చేశారు దానికీ స్వామి ఒక అందమైన మాట చెప్పారు ఇది చెప్పి ముగిస్తాను. మరి ఎవరినీ ఏమీ అడగొద్దు ఎవరినీ ఏమీ చేయి చాపి తీసుకోవద్దు అని కదా మనకు కొన్ని నియమాలు ఉన్నాయి అలా అడగొద్దు అని స్వామి ఏం చెప్పారంటే అందరికీ అన్ని ఇవ్వగలిగి ఇవ్వగలిగిన సంపదే తన అర్ధాంగిగా లక్ష్మిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ప్రపంచం కోసం ఇంద్రాది దేవతల కోసం భువన భూరాంతరాల కోసం తాను అంతటి త్రివిక్రముడు మరుగుజ్జై ఒక కడుపున పుట్టి దానాహంకారంతో విర్రవీగుతున్న వాడి దగ్గరికి వెళ్లి చేయి చాపి దానాన్ని తీసుకుని దాన గ్రహీత అయి మరి ఆయనకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇటువంటి లోకాలు సృష్టించలేడా అంటే నీవు గనక ఎవరి దగ్గరకైనా వెళ్లి అయ్యా నాకొక పది రూపాయలు ఇవ్వండి అని అడిగితే నువ్వు త్రివిక్రముడివి అయినా సరే వామనుడివి అయిపోతావు. అయ్యా మీ దగ్గర నాకొక పది రూపాయలు ఇవ్వండి పది మందికి నేను అన్నం పెడతా అంటే నువ్వు చిన్నవాడివి అయినా త్రివిక్రముడు అవుతావ్ అన్నారు స్వామి వామనావతారం అంటే మన కోసం మనం అడగకూడదు మన పేరు మీదకు వచ్చింది మనం వాడుకోకూడదు జగత్తు కోసం వాడాలి ఇది నియమం ఇది నియతి ఇటువంటివన్నీ కథా కథన విశేషంలో ఇవన్నీ ఆధ్యాత్మికగా చెప్తే రోజుల్లో ఎవరు వినే వాళ్ళు లేరు గనుక ముందు కథగా చెప్పారు కథగా చెప్తే బాగుండదు గనుక దాన్ని పాటగా చెప్పారు పద్యంగా చెప్పారు పద్యం ఊరికే చదివితే బాగుండదు గనుక దానికి సంగీతం కూర్చారు పాడారు తద్వారా భగవంతుడి యొక్క తత్వాన్ని అనేకమైన స్థాయిలలో మనం అనుభవించటానికి అనువైనటువంటి శ్రీమద్భాగవతాన్ని పొందిన, చెందించిన మనకు అందించిన మన-మన చెంత చిందించిన మహాకవి పోతనామాత్యుడికి మరొక్కసారి నమస్కరిస్తూ శ్రీమద్భాగవత మహాయజ్ఞ గుండానికి నమస్కరిస్తూ ఇవాళ జరుగుతున్నటువంటి ఇదంతా కూడా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం మనసంతా దాని యందే లగ్నమై దాని యందే పరిభ్రమిస్తూ దాని యందే లీనమై లయిస్తూ ఉన్నటువంటి అభిజిత్ లగ్నంలో మనం ఒక గొప్ప కథ చెప్పుకున్నాం అభిజిత్ లగ్నం అంటే పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దోషము లేనిది ముహూర్తం లేదు అక్కడ వామనావతార ఘట్టం చెప్పబడింది చూడండి time ఎవరు నిర్ణయించారు ఈశ్వరుడు నిర్ణయించారు. అభిజిత్ లగ్నానికి వెళ్లే సమయానికి ముందే రెండు గంటల ముందే ఒక భాగవతుడి కథ చెప్పుకున్నాం భయభ్రాంతమైన ఒక జీవుడి కథ గజేంద్రుడిది చెప్పుకున్నాం చివరికి సాక్షాత్ పరబ్రహ్మ మూర్తి అయినటువంటి నారాయణుడి యొక్క వామన చరిత్ర చెప్పుకున్నాం మూడింటితో మనం సుమారుగా అష్టమ స్కందాన్ని దాటి వెళ్ళబోతున్నాం రేపు పొద్దున నుంచి భాగవతంలోకి వెళ్తాం మధ్యలో చిన్న ఐదు నిమిషాల అంబరీషుడి కథ ఒకటి చెప్పుకుంటాం ఇవాళ మధ్యాహ్నం ఇవాళ చెప్పుకున్న వాటిని కొంత అంబరీషుడు కూడా చెప్పుకొని వాటిని పద్యాలలో ఆయన ఎలా చెప్పాడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇప్పుడు చెప్పినంతా వచనం దాంట్లోదే కానీ దానిని కూడా మనం కొంత సౌభాగ్యవంతంగా చేసుకొని ఇంకా కొన్ని విశేషాలు అవి స్వామి పరంగా కూడా భాగవతం అంటే భాగవతం అనుకుంటే అది చివరికి సాయి భాగవతంగా రూపాంతరీకరణం చెందుతుంది అది ఈశ్వర సంకల్పంగా భావన చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ఒక మహత్తర అవకాశం జీవితంలో మీరు ఎక్కడ మాట్లాడండి ఎక్కడెక్కడ మాట్లాడండి ఎక్కడెక్కడ ఇది బాగుందని అనిపించుకోండి ఇక్కడ అనిపించుకునేది కాదు ఇక్కడ భావం మనదై పోవాలి భావమూ మనమూ భిన్నంగా లేము అటువంటి స్థితిని కల్పించినటువంటి స్వామికి మరొక్కసారి ప్రణతులు అర్పిస్తూ అలాగే డాక్టర్
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 29:03

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

    Now playing
  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22