⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
కాబట్టి భక్తి యోగంలో సమర్పణ ప్రధానం అది వైష్ణవులు వాళ్ళు దాన్ని సంగతి అంటారు. అసలు వైష్ణవుడు అనేటువంటి పదానికి అర్థం ఏమంటే ఇప్పుడు మన జాగ్రత్త అవస్థలో మనం మాట్లాడుతున్నాం వింటున్నాం ఈ వింటున్న టైంలో కూడా తురీయ అవస్థ ఏ సన్యాసి ఆశ్రమానికి అతీతమైన అవస్థ ఏదైతే ఉన్నదో ఎక్కడ మనసు నిలకడ చెందిందో అణగి ఉన్నదో ఎక్కడ మనసు తన మూలంలో లీనమై ఉన్నదో లయమై ఉన్నదో అటువంటి ఆ భావనలో గనక ఉండగలిగితే అది నిజమైనటువంటి భక్తి యోగమని నారద భక్తి సూత్రాలు కూడా మొట్టమొదటి సూత్రం ఏముంది భక్తిరేవ గరీయసీ భక్తిహేవా గరీయసీ గరీయసీ అంటే సర్వోత్కృష్టమైనది ఏది అని అంటే అది భక్తి మాత్రమే కాబట్టి భక్తి యోగంలో భక్తి అంటే ఇంత ఉన్నది కాబట్టి ఈ రెండు కర్మ యోగము భక్తి యోగము దాటిన తర్వాత యోగము అని ఒకటున్నదన్నాం అది మహర్షి మాత్రమే చెప్పారు ఇంకెవరూ చెప్పలేరు. మరి వారు ఎలా చెప్పగలిగారు ఇంతకు ముందు లేనిదంటే ముందు లేదు గాని ఎవరో ఒకళ్ళు ఉన్నదని చెప్పగలిగిన వాళ్ళు వచ్చారుగా వచ్చి ఆయన ఏం చెప్పారంటే కర్మ యోగము అనేటువంటిది ఇది కాస్త ఉదాత్తమైన పండిత భాష మా కాస్త స్వామి దగ్గరికి వస్తే ఆయన చాలా simple గా అది ఎంత simple అంటే అది నేను ఎంత సేపు చెప్పక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది కర్మ యోగము ఖాళీ నడక భక్తి యోగము బండి ప్రయాణము రెండెడ్ల బండి ముందు కర్మ యోగం ఖాళీ నడక శ్రమ పడాలి perspire కావాలి కష్టపడాలి అయితే తప్ప మనం ఆ destination కి చేరలేం కర్మ యోగంలో ఉంటే నువ్వు అట్లా చాలా ఇబ్బందులు పడాలి పడతావ్ దాని పేరే కర్మయోగం భక్తి యోగం బండి నడక మనం బండి నడుస్తుంటుంది మనం కూర్చొని ఉంటాం ఆ బండే తీసుకొని వెళ్తూ ఉంటుంది కానీ బండి కూడా speed ఏం ఉండదు మనకంటే కొద్దిగా ఆ సౌఖ్యంగా తీసుకొని వెళుతుంది జ్ఞాన యోగము విమాన ప్రయాణము అన్నారు స్వామి ఇక్కడ ఎక్కుతా అక్కడ దిగుతా అయిపోయింది. ఆ ఎక్కటమే దిగటమే రెండే పనులు మధ్యలో చేసేది కూడా ఏం లేదు కాబట్టి మనం కర్మ యోగము భక్తి యోగము ఈ రెండింటి మధ్య ఆ యోగాన్ని గనక విచారణ చేసినట్లయితే భగవాన్ రమణ మహర్షి దానికి ఒక వ్యాఖ్యానం ఇది భాగవతంలో లేదు కపిలుడు చెప్పలే రమణులు చెప్పారు అది ఏం చెప్పారంటే కర్మ యోగంలో మంచి పనులు చేస్తున్నావ్ చాలా చక్కగా భగవంతుడు ఉన్నాడని నమ్మావ్ చేస్తూ ఉన్నావ్ అలాగే భక్తి యోగంలో సమర్పణ చేసుకున్నావ్ నేను కూడా చేసుకున్నా కదా మధురై నుంచి వచ్చినప్పుడు అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకొని తండ్రీ నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను ఇకపై అంతా నీ ఇష్టమని నేను శరణాగతి పొందానుగా అరుణాచలానికి వచ్చిన తొలినాళ్లలో అరుణాచలమే పరమశివుడని అక్షర మణమాల రాశా కదా అరుణాచల స్తుతి పంచకం రాశాక ఇవన్నీ చేశా రాతిని కూడా నేను గురువుగా భావించా రాయిలోనే గురువును చూసుకోగలిగాను తర్వాత అరుణాచలానికి నాకు అభేదమే నాకు ఏర్పడిందని చివర్లో చెప్పారు కాబట్టి ఆ యోగము అంటే ఏంటంటే ఒక సత్పురుషుడితో ఒక మహాత్ముడితో ఒక భగవత్ స్వరూపంతో మనం గనక నడుస్తూ నడుస్తూ నడుస్తూ వెళ్లగలిగినట్లయితే కొద్ది రోజుల తర్వాత భ్రమర కీటక న్యాయం అని ఒకటి ఉంది భ్రమర కీ ఒకటే పురుగు అది ఆ పురుగు ఎక్కడో చిన్న గూడు చిన్న గూడు కట్టుకొని పురుగు ఉంది దాని చుట్టూ ఒక భ్రమరము జంకారము చేస్తున్నది జుమ్ అని ఆ నాదం వినిపిస్తూ వినిపిస్తూ ఉన్నది విని విని విని ఒకరోజున ఆ పురుగు metamorphosis అంటాం ఆ zoology లో ఆ metamorphosis వల్ల పరిణామ దశలో ఈ పురుగు భ్రమరమై పోతున్నది అలాగే భక్తుడు కూడా చేయగా చేయగా యోగించగా కూడి ఉండగా అన్ని వేళలా అన్ని అవస్థలలో అవస్థా ప్రయాతీతంగా ఎప్పుడైతే భగవత్ భావనలో కూరుకుని పోయి ఉంటాడో ఆ భగవంతుడు తానైపోతాడు భిన్నం భిన్నమైనటువంటి ఆ రేఖలన్నీ వాడికి వస్తాయి ఏ దేవతని మనం ఉపాసిస్తామో ఆ దేవీదేవతల లక్షణాలు జీవుడి యందు నిక్షిప్తమై ఉంటాయి ఆ అవటానికి కారణం ఏమిటంటే ఇతడి ఉపాసనా బలం ఇతని భక్తి భావం ఈ ఆ యోగాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగినట్లయితే ఆ తర్వాత కలిగేసేది జ్ఞాన మార్గము జ్ఞాన మార్గంలో మన ప్రమేయం ఏమీ లేదు. టికెట్టు కొనుక్కుంటాం విమానం ఎక్కుతాం విమానం వాడు దింపాడు దిగాడు ఇంటికి వచ్చేసాం దానికి మనకు సంబంధం లేదు కావల మధ్యలో కావలసింది విజ్ఞానం మాత్రమే విజ్ఞానం ఒక interpret చేయటానికి ఉపయోగిస్తుంది మరి జ్ఞాని పరిస్థితి ఏమిటి జ్ఞాని ఏం చెప్పడా అంటే చెప్పవలసింది చెప్తాడు ఎంత చెప్పాలో ఎవరికీ ఏం చెప్పాలో చెప్తాడు చెప్పి తాను స్థమితంగా కూర్చుని ఉంటాడు ఇది కావాలి అది కావాలన్న భావనే లేకుండా ఉంటాడు ఏమీ లేని ఏమీ అక్కరలేని ఒకానొక మానసిక స్థితిలోకి జ్ఞాని వెళ్ళినప్పుడు ఆ జ్ఞాని మాట్లాడవలసిన పనే లేదు అట్లాగే మహర్షిని కూడా అడిగారు జ్ఞానికి కూడా ఈ కర్మ యోగంలోనో భక్తి యోగంలోనో ఉన్నవాడిలాగా ప్రారబ్ధాలు ఉంటాయా అని అడిగారు ఆ ఎందుకుండవు తనకు అక్కరలేని ఒక దేహాన్ని తానే తీసుకుని వచ్చి ఇన్నేళ్లు ఇక్కడ మోస్తూ ఉండటం అనేది ప్రారబ్ధం కాక ఏముంది అంతకుమించి జ్ఞానికి ఇంకేం ఉండవు అని అన్నారు అంటే ఎంత అద్భుతమైన స్థాయి చూడండి కనుక ఈ కర్మ భక్తి యోగ జ్ఞాన యోగాలలోకి వెళ్ళినప్పుడు జ్ఞాని సర్వ సమభావం కలిగి ఉంటాడు ఈమె స్త్రీ ఆయన పురుషుడు అన్న భావన ఉండదు నిజమైనటువంటి ఆ జ్ఞాని జ్ఞానం యొక్క లక్షణమే అది ఒక పిల్లవాడు సంబంధం లేదు వృద్ధుడు సంబంధం లేదు పామరుడు పండితుడు సంబంధం లేదు తన చుట్టూ ఉన్న అందరి యందు ఒక ఆత్మను మాత్రమే చూడగలడు చూస్తాడు కనుక ఆ relation దేంతో పెట్టుకుంటాడంటే ఆత్మతో పెట్టుకుంటాడు కనుకనే సత్యసాయిబాబా వారు స్వామి.కొన్నేళ్లు డెబ్బై రెండేళ్లు మనందరినీ సంబోధన చేసినప్పుడు దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా అని మాత్రమే పిలిచారు. నా భక్తులారా నా బిడ్డలారా అని ఏమి పిలవలేదు ఆయన. అంటే మీలో ఉన్న దివ్యాత్మని నేను చూస్తున్నాను అని. మనమేమో స్వామిలో ఈశ్వరమ్మ కొడుకుని చూశాం, పుట్టపర్తి సాయిబాబా గారిని చూశాం, లేకపోతే మిరాకిల్ మ్యాన్ ని చూశాం, గాడ్ మ్యాన్ ని చూశాం, అసలు దాన్ని చూడలా. చూశారా? ఆయన మాత్రం మన బోటి వాళ్లలో కూడా దివ్యాత్మని ప్రేమాత్మని ఆయన దర్శనం చేశారు. దివ్యమైన ఏ ఆత్మ లోపల ఉన్నదో అది బయట ప్రేమగా ప్రసారింపబడుతున్నది గనుక మీరందరూ నా దృష్టిలో, నా చూపులో, నా ఊహలో, నా భావనలో, నా సంకల్ప శక్తిలో మీరందరూ ది డివైన్ ఫోర్సెస్. దివ్యాత్మ స్వరూపులు మీరు. ప్రేమాత్మ స్వరూపులు. అన్నప్పుడు ఒక్కసారి ఒళ్ళు జలదరిస్తుంది. ఓ పరమాత్మ మన గురించి ఇంత గొప్పగా చెప్తున్నారే, మనం అలా బతకలేకపోతే అవమానం కదా మనకి. మనం కూడా ఆత్మ స్వరూపులుగా చే-- వెలుగొందుతూ ఉండాలి కదా. అందరి పట్ల రాగ-- అనురాగాలు దాటి ప్రేమను చూపించాలి కదా. ఆయన-- ఆయనతో మనకి రాగ బంధమే లేదే, మరి ఇంత ప్రేమ ఎలా ఆయన పొందగలిగారు అంటే, భగవాన్ ప్రపంచాన్ని ప్రేమించారు గనుక ప్రపంచం అంతా ఆయన్ని ప్రేమించింది. దీన్ని మించిన ఈక్వేషన్ ఇంకొకటి లేనే లేదు. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి. మనం అందరినీ ప్రేమించాలి. ఆ దివ్యమైనటువంటి ప్రేమ unconditional గా మీలో ఉన్నటువంటి ఆత్మను నేను చూడగలగాలి, నాలో ఉన్నటువంటి ఆత్మను మీరు కూడా చూడగలిగితే అది పరస్పరమైనటువంటి దివ్యానుభవం, దివ్య ప్రేమకి అది సంకేతం అవుతుంది తప్ప మిగతావన్నీ చాలా పెరిఫెరల్ గా సాగిపోతాయి. ఇవన్నీ కపిలుడు దేవహుతికి తన తల్లికి చెప్తూ, "నువ్వు ఎందుకమ్మా ఇంత కష్టపడ్డావు? శరీరం సృష్టించి పోయింది నీకు, శరీరమే పోగొట్టుకుంటే నువ్వు ఏం పొందగలవు చెప్పు? ఈ ఉపవాసం ఏమిటి? ఈ దీక్ష ఏమిటి? ఈ తపస్సు ఏమిటి? నీకేం కావాలి? సాక్షాత్తు నేనే నీ కొడుకునై పుట్టాను కదా, ఇంకా నీకేం కావాలి?" అంటే అప్పుడు ఆమె ఇవన్నీ విన్న తర్వాత ఆవిడ దానినే ఈ, ఈ తృతీయ స్కంధాన్నే స్వామి చాలా అద్భుతంగా ఏక వాక్యంలో చెప్పారు. స్వామి దగ్గర ఎవరికీ fasting లు లేవు, ఉండేదంతా feasting ఏ. శరీరం గనక చల్లబడిపోయినా, శరీరం మెత్తబడిపోయినా, బలహీనమైపోయినా మీరు ఎవరికీ పనికిరారు, మీకు మీరే పనికిరారు గనుక శివరాత్రి నాడు కూడా మీరు హాయిగా ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండండి. అంతే తప్ప డొక్క ఎండబెట్టుకొని నేను మంచి నీళ్లు కూడా తాగను అంటే కాష్ఠ ఉపవాసం అంటాం. కాష్ఠం అంటే దేహం. దాన్ని కష్టపెట్టి మనం పొందేదంటూ ఏం లేదు. కాబట్టి దాన్ని నిలబెట్టి పోవాలి. శరీరం ఆజ్యం ఖలు కర్మ సాధనం. శరీరం ఆజ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మబద్ధమైన కర్మలు చేయాలంటే ఇదిగో ఈ ఆరోగ్యవంతమైన శరీరం మనకు కావాలి. ఆరోగ్యం మన చేతిలో ఉంది, ఆయుష్షు మన చేతిలో లేదు. చూశారా? అది ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి ఆరోగ్యం కూడా మనం ఆయన చేతిలోనే పెడితే, అయ్యా మనకి రెండూ దక్కవు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, ఉపవసించాలి, పరమాత్మ భావనకు దగ్గరగా ఉండాలి. ఇవన్నీ చెప్పేదే జ్ఞానం. అందుకనే భగవాన్ రమణ మహర్షి ఆ- పదకొండు గంటలు ఎవరో ఇట్లాగే ప్రశ్నలు అవి ఆయన అడుగుతూ ఉంటే, ఆయన deep గా involve అయిపోయి జవాబు చెప్తూ ఉంటే, పదకొండు గంటలు కాగానే అక్కడ గంట కొట్టేవారు ఆశ్రమంలో, వారున్న time లోనే. పది యాభై తొమ్మిది అవగానే ఆయన ఆపేశారు. అక్కడ గంట కొట్టగానే ఈయన లేచేవారు. ఈయన పదకొండు బదులు పన్నెండుకి అన్నం పెడతారు. కానీ ఆయన ఏమనేవారు అంటే, వారందరూ ఎప్పుడో లేచి మనందరికీ ముద్ద అందించటానికి ఇంత కష్టపడి, సిద్ధపడి, గంట కొట్టి, రారమ్మని పిలిచినా నిర్లక్ష్యంగా మనం వెళ్లటం ధర్మం కాదు కదా. వారి ధర్మం వారు పాటించారు, మన ధర్మం మనం పాటించాలి. ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇక్కడ చిన్న సంఘటన. ఇవాళ కాస్త గంభీరమైన subject ఇంకా రెండో దాంట్లోకి వెళ్ళబోతున్నాం. శాంతమ్మ అని ఒక వంట ఆవిడ ఉంది అరుణాచలంలో, రమణాశ్రమంలో. ముప్పై మూడేళ్లు వంట చేసిందట. ఆమెకి ఓ రోజు విసుగు వచ్చింది. ఎంత విసుగు వచ్చిందంటే, ఈవేళ భగవాన్ నాకు గనక ఒంటరిగా దొరికితే ఆయన్ని రెండు ప్రశ్నలు వేయాలని అనుకుంటున్నాను, కనీసం ఒక ప్రశ్న. దొరికితే బాగుండును అనుకుంది. ఆయన దొరికేవారు కాదు. చెయ్యి కడుక్కుని వెళ్లిపోయేవారు. ఎక్కడా అందకుండా తన దారిన తాను వెళ్లిపోతూ ఉండేవారు. సరే, ఆ రోజు ఏమైనా నిశ్చయించుకుంది. భగవాన్ వచ్చారు. వడ్డన చేసింది, ఆమె స్వయంగా వడ్డన చేసింది to draw attention of మహర్షి. ఆయన తన వైపు చూడాలని, తను చేసినవన్నీ బాగున్నాయని చెప్పాలని ఏదో చిన్న కోరిక. భగవాన్ ఇదిగో ఇది ఇలా చేశాను, అది అలా చేశానని విస్తట్లో వడ్డిస్తూ చెప్తూ ఉంటే వారు అన్నీ విన్నట్టే విన్నారు. అంతా అయిపోయింది. వడ్డన అయిపోయింది. భోజనం మొదలు పెట్టారు. అన్నీ కలిపేశారు. శాంతమ్మకి చాలా కోపం వచ్చింది. ఒక్కొక్క వస్తువునీ ఎన్ని గంటలు కష్టపడి చేస్తే అన్నీ కలిపి ముద్ద చేశారే అని ఆ మొదటి ప్రశ్న ఆయన చేతులు కడుక్కుంటుంటే వెళ్లి, "భగవాన్! నేను ఎంత శ్రమ పడ్డానో తెలుసునా? మీరు ఏదీ అడగరు, ఇది కావాలని అడగరు. కానీ నేను ఇంత శ్రద్ధగా చేసి ఇలా చేశానని చెప్పినా అన్నీ కలిపి ఒక ముద్ద చేశారేం" అంటే, "ఏం చేయను శాంతమ్మ? నాకేమో అంతా ఒకటే అనుకోవటం ఇష్టం, మీకేమో అన్నీ వేరు వేరు అనుకోవటం మీకిష్టం. అలాగే కానీ" అన్నారు. అంటే ఆ జ్ఞాని యొక్క స్థితి అలా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో దొరికారు రెండో ప్రశ్న కూడా వేసేద్దామని అసలు ప్రశ్న వేసింది ఇప్పుడు. ఆ ప్రశ్న ఏంటంటే, "భగవాన్ ఏమిటి? మా ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ముప్పై మూడు ఏళ్లు అయిపోయింది.నేను నా జీవితమంతా ఈ వంట చేయటం వడ్డించటం మళ్ళీ వంట చేయటం మళ్ళీ వడ్డించటం ఇదేనా ఇంతకంటే ఏం లేదా నాకు ముక్తి జ్ఞానము ఏమీ అక్కర్లేదా వాళ్ళంతా వచ్చి ఇవాళ భగవాన్ ఇది చెప్పారు భగవాన్ అది చెప్పారు అని చెప్తే నేను సిగ్గుతో తల వంచుకుంటున్నాను నేను వంట చేయటం తప్ప నాకేమి యోగమే లేదా అని అడిగింది అప్పుడు ఆయన అన్నారు శాంతమ్మ నిబ్బరంగా ఉండు నువ్వేమో వంట చేస్తున్నావ్ చేస్తూ ఇవాళ భగవాన్ ఏం చెప్పారు ఎవరితో ఏ పరిష్కారం చేశారు అని నీ మనసంతా మహర్షి మీద ఉంది నా మీద ఉందని అనరు మహర్షి మీద ఉంది వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళేమో ఇవాళ శాంతమ్మ ఏ వంట చేసిందో ఏ స్పెషల్ చేసిందో అని వాళ్ళ మనసు మహర్షి మీద లేనేలేదు ఉన్నదంతా నువ్వు చేయబోయే వంట మీద ఉన్నది ఇంతకంటే నీకు సాధన ముక్తి ఏం కావాలి జ్ఞాని యొక్క లక్షణం అది లేదు నువ్వు రేపు పొద్దున్నే రా నీకేదో రమణ మంత్రమో మరణ మంత్రమో ఏ ఇస్తాను అది చదువుకుంటూ ఉండు నువ్వు డైరెక్ట్ గా బొందిలో కైలాసం వెళ్ళిపోతావ్ అని చెప్పలే మభ్యపెట్టడు గురువు నిజమైనటువంటి గురువు సత్యార్థం చెప్తాడు మనం కూడా అంతే ఎక్కడ ఏ పనిలో ఉన్నామో ఆ పనిలో చిత్తైకాగ్ర స్థితిలో ఉండాలి ఉండి ఆ పని అయిన తర్వాత రెండో పనిలోకి వెళ్ళాలి రెండో పని కాచుకొని ఉంటుంది అది దానివైపు వెళ్ళాలి వెళ్ళవలసినప్పుడు వెళ్దాం అప్పటి వరకు ఏం చేయాలంటే ఇక్కడే ఉండాలి ఇవన్నీ చక్కగా గ్రహిస్తూ ఉండాలి అని చెప్పి భగవాన్ రమణ మహర్షి అంటే వాళ్ళంతా కర్మని సుఖౌషలం చేశారు జ్ఞాన స్వరూపంగా వెలుగొందారు స్వామి కూడా క్యాంటీన్ పెట్టిన తొలినాళ్లలో స్వయంగా క్యాంటీన్ కి వచ్చేవారు చేసిన పదార్థాలను బ్లెస్స్ చేసేవారు ఎంతమంది వస్తారో estimation ఉండేది కాదు అన్నింటినీ సక్రమంగా చేయమని అనేవారు మీరు ఏం పెట్టండి perfect గా పెట్టండి జాగ్రత్తగా పెట్టండి వాళ్ళు వచ్చేది సాధన కోసం వస్తున్నారు కడుపు నిండకపోతే ఆధ్యాత్మిక పని చేయదు వాడికి చెప్పొద్దు అసలు వాడు criminal గా తయారవుతాడు లోపల ఆకలి మండిపోతుంటే ఎవరికి కావాలి ఈ వేదాంతం అంటాడు కడుపు నింపండి ఉపకారం చేయండి ఆపై ఉపదేశం చేయండి అప్పుడు వాడు శ్రద్ధగా వింటాడు మళ్ళీ ఎంతవరకు వింటాడంటే మళ్ళీ వాడికి ఆకలి అయ్యేవరకు వాడి మనసంతా మాటల మీదే ఉంటుంది మీరు మాట ఆకలి తీర్చకుండా మాటలు గనక చెప్పినట్లయితే ఇదే అని స్వామి కూడా వీటన్నింటినీ చెప్తూ స్వామి పాత సనాతన సారథులు సనాతన సారథి ప్రారంభమైన తర్వాత 1968, 70 వరకు కూడా సనాతన సారథులు గనక మీరు చదివితే స్వామి ఏం చెప్పారో అర్థమవుతుంది డెబ్బై తర్వాత మన బోటి వాళ్ళం అందరం చాలా ఎక్కువ మందివి అయిపోయాం అందువల్ల స్వామి ఆ రోజుల్లో ఆ ఉపన్యాసం చాలా తొందరగా ముగించేవారు ఇరవై ఐదు నిమిషాల కంటే చెప్పేవారు కాదు తర్వాత తర్వాత ఏదో ఒక translator వాడిని పెట్టుకొని మళ్ళీ ఇంగ్లీష్ ఇంకో ఇరవై నిమిషాలు మొత్తం కలిపి ఒక నలభై నిమిషాలు ఆ తర్వాత one hour కి కూడా వెళ్ళిపోయింది కానీ ఆ రోజులలో ఏం చెప్పారంటే ఆత్మ విచార మార్గం మాత్రమే చెప్పారు స్వామి రాసినటువంటి పుస్తకాలలో ఇంకా మీరు చదివి ఉండకపోతే ఆత్మారామం అని ఒక book ఉంది ఆ book మీరు కొని చదువుకోండి చదువుకుంటే ఆత్మవిద్య ఎంత సులభమో ఆత్మ ఆధ్యాత్మిక శాస్త్రం ఎంత బలీయమైనదో దానికి ఎన్ని కోణాలున్నాయో అవి మన జీవితంలో మన profession లో మన వృత్తిలో ప్రవృత్తిలో ఎంతగా సాధనకు ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి దాని పేరు ఆత్మారామం అవన్నీ పాత సనాతన సారథి లో వచ్చినవే ఇప్పుడు దొరకకపోవచ్చు కానీ ఈ book దొరుకుతుంది భగవద్ భాగవతం లాగా సరే కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము యోగము అన్నీ అయిపోయిన తర్వాత మనం మొట్టమొదటి పద్యంలో చెప్పుకున్నాం అరయ నారాయణాన్వేషితము నారాయణుడిని అన్వేషించడానికి మనం ఈ జన్మ ఎత్తామని అనుకున్నాం నారాయణుడు ఎక్కడున్నాడు ఆయన address ఏమిటి ఇందు గలడందు లేడని సందేహము వలదు అన్ అన్ని చోట్లా ఉన్నాడు అంతటా ఉన్నాడు అసలు ఉన్నదే ఆయన నిజానికి స్వామి ఇంకొక అడుగు ముందుకు వేశారు వ్యాస వాల్మీకులను దాటి ఒక మాట ఏం చెప్పారో తెలుసా మీరందరూ ఎవరు నేనే అన్నారు ఆదిత్య కిరణాలన్నీ కిందకు వస్తున్నాయి అవి సూర్యుడి కంటే భిన్నంగా ఉన్నాయా లేవు కదా దాన్ని అనటమే సూర్యకిరణము అంటున్నాం అలాగే చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెల కాంతులన్నీ కూడా సుషుమ్నా కిరణాలు అవేమన్నా చంద్రుడి కంటే భిన్నంగా ఉన్నాయా సముద్రంలో ఉన్నటువంటి నీరు నీటి బిందువు అలలు కెరటాలు తుంపరలు అవన్నీ సముద్రం కంటే భిన్నంగా ఉన్నాయా లేవే అట్లాగే పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు లేడు కనుక మీకు నాకు ఉన్న బా-బాంధవ్యము అవినాభావమైనటువంటి ఒక సంబంధం ఇది నిత్య సత్య శాశ్వతమైనటువంటిది మీరు ఆ స్థాయిలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అని ఆయన చాలా స్వామికి నలభై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు చెప్పారు but జరిగింది ఏమిటంటే స్వామి ఒకసారి చెప్పారు స్వామి మీ ఆ ఉపన్యాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని ఎవరో అంటుంటారు పాపం తోచి తోచక అది అద్భుతంగా ఉండకుండా ఎలా ఉంటాయి అది భగవంతుడి వాక్కు అది సరే మనకి ఏకాగ్రత లేనప్పుడు జరిగే ప్రమాదం ఏమిటి అని చెప్తూ ఓ ఇంటి ఇల్లాలు వంట చేస్తూ ఉన్నదట ఈ మగవాడు బయటకు వెళ్తున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి ఏం కావాలి అని అడగడు సహజంగా స్వామి కూడా చెప్పారు నీకేం కావాలి బజారు వెళ్తున్నాను అని మాత్రం అనడు ఎక్కడికి వెళ్తాడంటే వాకిలి దాకా వెళ్లి ఒక ఏక పెడతాడు పెట్టి నేను బయటికి వెళ్తున్నాను ఏమన్నా తెమ్మంటావా అంటాడు పాపం ఆవిడ పనిలో ఉంటుంది ఉండికాకరకాయలు తప్ప మీరు ఏదన్నా పట్టుకురండి అందట ఓ రోజున కాకరకాయలు వద్దు అని. ఆయన సరే అన్నాడు సంచి తీసుకుని వెళ్ళాడు అండి. తిరిగి వస్తూ ఏం చేశాడంటే ఆయన ఒక కిలో కాకరకాయలు తెచ్చాడు. ఆయనకు ఏమి అనిపించిందంటే ఇది తెమ్మన్నది అని అనుకున్నాడు. కనుక ప్రతి విషయంలోనూ కూడా ఒక ఏకాగ్రత ఉండాలి అది కలగాలి అంటే ఈ కర్మ భక్తి జ్ఞాన యోగాలు దాటి ఆత్మవిద్యలోకి మనం వెళ్ళాలి. ఆత్మను గురించిన విద్య ఒకటి ఆత్మవిద్య ఒకటి ఆత్మవిద్య యొక్క విలాసం ఒకటి ఆత్మవిద్య వలన కలిగే సంస్కారం ఒకటి ఇవన్నీ తెలుసుకోవాలి అనేటువంటిది చెప్తూ, ఇవాళ ఈ కపిలుడు తన తల్లికి లోకాల గురించి మాట్లాడాడు. ఆ లోకాలు మనందరికీ తెలుసు మనం రాస్తూ ఉంటాయి కదా పధ్నాలుగు లోకాలు పధ్నాలుగు లోకాలు చతుర్దశ భువనాలు అదే పధ్నాలుగు లోకాలు అంటే అతలవితలసుతల ఇవన్నీ కూడా చదువుతారు. అవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఇవన్నీ? స్వర్గం అనంగానే పైకి చూపిస్తాం నరకం అనంగానే ఇటువైపు చూపిస్తాం అక్కడ ఏం లేదు అక్కడంతా ఖాళీ. మరి ఏమిటి ఎక్కడ ఉన్నాయి పధ్నాలుగు లోకాలు అంటే నీ దేహంలోనే పధ్నాలుగు లోకాలున్నాయి. నీ దేహాన్ని మించి పధ్నాలుగు లోకాలు బయట లేవు. ఇది అచల బోధ అరుణ బోధ ఆత్మ బోధ శంకరుల బోధ మిగతా వారు చెప్పినవన్నీ దానిలోనే చెప్పినవే. ఇక్కడ భాగవతంలో కూడా వ్యాసులవారు వ్యాసభాగవతంలో వారు పారాయణం చేస్తున్న దాంట్లో ఇవన్నీ ఉంటాయి సంస్కృతంలో ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి మన శరీరాన్ని ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఉదాహరణే కాదు అది నిశ్చితం. మొట్టమొదట ఒక్క లోకం ఉంది అది మొట్టమొదటి దానినే బ్రహ్మ లోకము అన్నాం. బ్రహ్మ లోకం అంటే బ్రహ్మ రంధ్రము ఇది ఒకటి. కాస్త కిందికి రావాలి రెండు కళ్ళు ఒక లోకం రెండు చెవులు ఒక లోకం రెండు పెదవుల మధ్య ఉన్న నోరు ఒక లోకం రెండు చేతులు రెండు కాళ్ళు నాలుగు లోకాలు ఉదరమంతా ఒక లోకం. ఇవన్నీ కలిపితే పదమూడు లోకాలు అవుతాయి మరి పధ్నాలుగవ లోకం ఏమిటి? అని పధ్నాలుగవ లోకానికి స్పర్శా లోకము అని పేరు. ఆ స్పర్శ దేని వలన కలుగుతుంది అంటే కవచం అనేటువంటి చర్మం వలన కలుగుతుంది. మనం ఓ పసిపాప ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు మనకి ముద్ద వచ్చి దాన్ని బుగ్గ తాకాం అనుకోండి హాయిగా నిద్రపోతున్నది కెవ్వున కేకేసి ఏడుస్తుంది. అంటే తనది కాని ఏదో స్పర్శ తనను తాకింది ఏడుస్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మ నా పిల్లవాడికో పిల్లక్కో ఏమైందని పరిగెత్తుకొచ్చి ఆమె ఇలా ఎత్తుకోగానే ఠక్కున ఆపుతుంది. ఎందుకనంటే ఆ స్పర్శా లోకంతో ఈ లోకం ముడిపడి ఉంది. తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం. మనం కూడా ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఏదో ఆసుపత్రిలో ఉన్నారు వెళ్ళేటప్పుడు వ్యాధిగ్రస్తుల దగ్గరికి పండితుడి దగ్గరికి జ్ఞాని దగ్గరికి గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదో తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. కనుక వీళ్ళకి కూడా ఏదో తీసుకెళ్దామని వాడికి స్వీట్ పాకెట్లు లేకపోతే ఇంకేవో బిస్కెట్లు అవి తీసుకెళ్ళం మనం పండు తీసుకొని వెళ్తాం. మన సత్య సాయి సేవా ఆర్గనైజేషన్స్ లో సేవ చాలా అందంగా చేస్తారు కారణం స్వామి ఈ విషయం స్పష్టంగా చెప్పారు మీరు ఎవరికైనా ఆహారం ఇచ్చేటప్పుడు అలా మంచం మీద విసిరి రాకండి వాళ్ళ చేతిలో పెట్టి రండి. వాళ్ళకు ఇంట్లో బాగా లేకపోతే ఒక్కసారి వాళ్ళని తాకండి ఆ స్పర్శలో నుంచి వాళ్ళకి ఓ నమ్మకం ఒక బలం. ఈ సమాజం ఈ రోగం నన్ను పీడించవచ్చు గాక ఈ రోగం వల్లనే రేపు మా పొ-- పోవచ్చు గాక కానీ నా గురించి నా పట్ల ఉన్నటువంటి ఆ వాత్సల్యము ప్రేమ అభిమానము వీటన్నింటి కారణంగా నన్ను తాకారే దానివలన నాకు బలం వచ్చిందని వాడు తొందరగా కోలుకుంటాడు. స్పర్శా లోకం. మీరు డాక్టర్స్ ని కూడా చూడండి వాళ్ళు rounds కి వచ్చినప్పుడు ఏదో దూరంగా నుంచొని ఆ ఎలా ఉన్నావ్ అని వెళ్ళిపోరు వాళ్ళు తాకుతారు భుజం తడతారు కళ్ళు తెరువుంటారు కొడతారు భుజం మీద తట్టి గట్టిగా కొట్టి లేపుతారు. ఇగో నేను వచ్చానని గుర్తు పట్టావా ఇవన్నీ దేనికంటే స్పర్శా లోకాన్ని అనుభవంలోకి తేవాలి. దానికి సంస్కృత భాషలో పేరు కింపురుష లోకము అన్నారు. మన బ్రహ్మ రంధ్రం నుంచి ఇందాక చెప్పుకున్న పదమూడు పురుష లోకాలు మనకు కనిపించేవి. స్పర్శా లోకం అధ్యాత్మలో చాలా అత్యుత్తమమైనటువంటిది. ఆ స్పర్శా లోకం మన యందే ఉన్నది కాబట్టి మనం వీటిని మోస్తున్నాం అంటే పధ్నాలుగు భువనాలు మనం మోస్తున్నాం. ఆ పధ్నాలుగు భువనాలు పధ్నాలుగు లోకాలు మన యందు ఉన్నాయి. అందుకనే మనం నిద్ర లేచినప్పుడు మళ్ళీ పడుకోబోయే ముందు స్వామి ఈ మంత్రం చదువుకోమని చెప్పారు. ఏమిటా మంత్రం? ఒకే ఒక మంత్రం ఒకే ఒక ప్రార్ధన "समस्त लोका: सुखिनो भवन्तु" మరి ఇదే స్వామి తొలినాళ్లలో ఏం చెప్పారు? "लोका: समस्ता: सुखिनो भवन्तु" లోకములు అయిన అన్నీ కూడా సుఖంగా ఉండుగాక. దాన్ని స్వామి మార్చారు లోకా: సమస్త: కాదు "समस्त लोका: सुखिनो भवन्तु" నా శరీరంలో ఉన్న ఈ పధ్నాలుగు లోకాలు హాయిగా ఉండాలి అన్నీ చక్కగా పనిచేయాలి. నోరిచ్చినదెందుకు అది చేయటానికి వాణ్ణి వీణ్ణి దూషించడానికా? కళ్ళిచ్చినదెందుకు సందులు గొందులు తిరుగుటకా? అని తొలినాళ్ళలో పద్యాలు రాశారు పాటలు రాశారు స్వామి. అంటే ఈవేళ మనం భగవంతుడు మనకి ఒక అద్భుతమైన ఆయుధాన్ని చేతిలో ఇచ్చాడు ఒక గొప్ప సంపదని ఇచ్చాడు. ఆ ఐశ్వర్యం ఏమిటంటే మన దేహమే ఐశ్వర్యం. దానికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే మనం చేయవలసినటువంటి ఉపాసన. అది ఎవరికోసమో దీర్ఘాయువుగా రెండు వందల ఏళ్ళు ఉండటానికి కాదు ఉన్నన్నాళ్ళు బలంగా ఉన్నన్నాళ్ళు ధైర్యంగా ఉన్నన్నాళ్ళు హాయిగా ప్రశాంతంగా ప్రసన్నంగా జీవితం సాగించటానికి ఈ పధ్నాలుగు లోకాలు.అమ్మా నీ యందు ఉన్నావే! నువ్వెందుకు వాటిని ఇంత కష్ట పెట్టావు అంటే నాకు ఆత్మవిచార మార్గం చెప్పవని అన్నప్పుడు ఈ కపిలుడు తన తల్లికి చెప్పాడు. అంటే భారతీయ అధ్యాత్మలో తండ్రి గురువు కావటం చూస్తాం. శంకర భగవత్పాదులకు తండ్రి తల్లి గురువు కావటం విన్నాం. ఇక్కడ కుమారుడే తల్లికి గురువు కావటం చూస్తాం. కాబట్టి ఇక్కడ వయస్సు ప్రధానం కాదు. వాడు వయస్సు పదేళ్లే కావచ్చు పక్కనున్న వాడికి తొంబై ఏళ్ళు ఉండవచ్చు. వయోభేదం చేత గౌరవాలు పొందరు ఎవరు? జ్ఞానం చేత, పవిత్రత చేత, సౌశీల్యం చేత, సుగుణం చేత అనేకమైన qualities వల్ల ఏ వయస్సు చిన్న వాడైనా మనం నమస్కరిస్తాం. ద్రో మార్కండేయ అది వాళ్ళందరికీ ఈవేళ మనం తలుచుకోబోతున్నాం. ఎందుకని తలుచుకుంటున్నాం అంటే వాళ్ళంతా జీవితాన్ని మధించి, సాధించి, శోధించి, పరిశోధించి సర్వోత్తమమైనటువంటి స్థాయికి వాళ్ళందరూ వారు వెళ్లారు గనుక. కాబట్టి ఇదంతా ఒక ఎత్తైతే మైత్రేయ మహర్షి దాటి, విదురుడ్ని దాటి, ఉద్ధవుడ్ని దాటి, కపిలుడ్ని దాటి, దేవహూతిని దాటి ఆత్మవిద్యను గురించినటువంటి విచారణకు వెళ్ళినప్పుడు అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి? ఇది గంభీరమైన subject. ఆత్మ, ఆత్మ విచారము, ఆత్మబలము, ఆత్మశోధన, ఆత్మబోధ ఇవన్నీ మనం మాటలు వింటాం. ఒక పక్కనేమో ఆత్మ కంటికి కనపడదు, నీట నానదు, నిప్పున కాలదు, కుంగదు, పొంగదు, లొంగదు, ఒంగదు అన్నీ చెప్తాం. మళ్ళీ ఇదంతా అయినప్పుడు ఈ ఆత్మను గురించి ఎందుకు ఇంత ఆలోచన చేయాలి అంటే భగవత్పాదులు ఆత్మవిద్య మీద అనేకమైన విషయాలు ప్రస్తావన చేసి కూడా చివరికి వారు ఆత్మకి ఇచ్చిన నిర్వచనం ముఖ్యంగా సాధకులు గమనించాలి. ప్రతి దాని వెనుక ఒక సూక్ష్మమైన స్థి-- మనం సూక్ష్మం వదిలిపెడతాం gross పట్టుకుంటాం. మనక్కూడా విశ్వరూపము అనగానే seventy mm మీద కనిపించే బొమ్మ విశ్వరూపం అనుకుంటాం. కాదు కాదు అణువులో, పరమాణువులో, లక్షావృంతలో ఏది ఈ కంటికి కనపడదో అది విశ్వరూపం. విశ్వం యొక్క సంక్షిప్త రూపం అది. దాన్ని పట్టుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. మన విజ్ఞాన, ప్రజ్ఞాన, సుజ్ఞానములన్నీ కూడా పదును ఎక్కించుకోవాలి. తీవ్ర విచార ధారుల్లో ఉండాలి. నిరంతర స్వాధ్యాయం చేయాలి. అనేకమైనవి మహాత్ములను వినాలి, మహాత్ములను కలవాలి, వాళ్ళని దర్శించాలి, వాళ్ళతో కొంత సేపు గడపాలి. ఇవన్నీ చేయాలి అండ్ వీటన్నిటితో పాటి కర్మ భక్తి యోగాలు సమన్వయం చేసుకోవాలి. మరి ఈ ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉన్నది? వేదాలలోకి వెళదాం. వేదాలలో ఆత్మను గురించిన ప్రస్తావన లేదు. అది ఏ ఒక్క మాట మాట్లాడలేదు. ఉన్నదంతా వేద మంత్రాలన్నీ కూడా మనిషికి నైతిక, ధార్మిక, భౌతిక, ఆధ్యాత్మిక విషయాలు చెప్తాయి. నిన్న సాయంకాలం మీరంతా ఇక్కడ ఉండి ఉంటే వాళ్ళు చివరలో వేద స్వస్తి చెప్పారు. రామాయణ, భారత, భాగవత స్వస్తి చెప్పారు. ఎందుకు చెప్పారంటే, అవన్నీ ఉన్నందువలన ఇవన్నీ చేయగలుగుతున్నాం అని చెప్పినందువలన. మీ-- అవన్నీ ఉన్నాయి గనుక ఈ మాత్రం మేము చేయగలిగాం అని చెప్పుకోవటానికి స్వస్తి అంటే విజయోస్తు అని. నీ వలన, మీ వలన మాకు విజయం లభించింది అని గౌరవ పురస్కరంగా చెప్పుకోవటం. ఇక్కడ కూడా ఈ ఆత్మను గురించి విచారణ చేసిన శంకర భగవత్పాదులు చివరగా ఒక్క మాటన్నారు. ఆత్మ అంటే మీరనుకునేవి కాదు, ఈ వేదాలలో ఉన్నవి కాదు, ఇం-- వేదాలలో లేకుండా ఉన్నదది. తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. ఉపనిషత్తులు వచ్చినప్పుడు ఈశావస్యోపనిషత్తు దగ్గరకు వచ్చి, ఈ జగత్తంతా బ్రహ్మమయమే, ఇది ఈశ్వర స్పర్శే అని చెప్పినాయి. తర్వాత కేనా క-కఠ యోగం వచ్చేప్పటికీ నచికేతసుడు అనేటువంటి ఆయన యమధర్మరాజు యొక్క లోకానికి వెళ్ళి ఆత్మవిద్యని యమధర్మరాజు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ధర్మము వేరే. యమధర్మము ఏమిటి అని. యమధర్మం అంటే మనల్ని చంపటం కాదు, నరకానికి పట్టుకుపోవటం కాదు. యమధర్మము అంటే the complete righteousness, holistic righteousness. సంపూర్ణ ధర్మ స్వరూపం. ఏది అంటే అపేక్ష లేని. సమవర్తియై, సహవర్తియై ప్రాణ దానం చేయడాయన. ప్రాణం నిలబెట్టడు. అది ఆ శరీరం నుంచి విడిపోవలసిన time లో ఒక్క క్షణంలో తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. అటువంటి యమధర్మము ఏదంటే అది ఆత్మ ధర్మం. యమధర్మం అంటే యముడు మనకు చెడ్డవాడు కాదు. వీడు యముడల్లే వెంబడి పడుతున్నాడంటారు. యముడు వెంబడి పడనే పడడు. ఒకేసారి వస్తాడు పట్టుకుపోతాడు అంతే. రోజొస్తాడా యముడు? ఆయనకేం పని లేదా? మనలాంటి వాళ్ళని ఎంతమందినో పట్టుకుపోవాలి. కాబట్టి యముడి వలె ఎవ్వడూ అంటబడడు. యముడు ఒక్కసారే వస్తాడు. జీవుణ్ణి ముక్తం చేస్తాడు. ఈ body లో నుంచి పంజరంలో ఉన్నటువంటి చిలక్కకి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి అంటే పంజరం తలుపు తెరవాలి. యమధర్మరాజు తలుపు తెరిచే పని చేస్తాడు. పిట్ట దానంతట అది ఎగరగలిగితే ఎగురుతుంది లేకపోతే ఎవరన్నా తీసుకుని వెళ్తారు. కాబట్టి ఈ ఆత్మను గురించి మాట్లాడుతూ భగవత్పాదుల conclusion కి రాబోయే ముందు ఉపనిషత్తులలో ఆత్మను గురించిన విచారణ కొద్దిగా ఉంది.