⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఇప్పుడున్న ప్రపంచాన్ని చూస్తే మనకే భయమేస్తుంది భయపెట్టే వాళ్ళు ఎక్కువైనారు భయపడే వాళ్ళు తక్కువ అయిపోయారు భయపడేవాడు కూడా మౌనం వహిస్తున్నాడు కనుక ఇదేదో అలా జరుగుతుంటుందిలే అని దాన్ని వదిలేస్తూ ఉన్నాం ఇటువంటి ఈ సమయంలో. భాగవతం లాంటి ఒక మహా యజ్ఞాన్ని ఈ సత్సంగము వీటన్నింటినీ గనక చేసుకోగలిగితే ఏమవుతుంది అని మంచి జరుగుతుంది ఆలోచనలు మంచిగా పుడతాయి ఇదంతా మనం నెమ్మదిగా అది విచారణ చేద్దాం మరి కలియుగన్నాటి సత్యం త్రేతాయుగన్నాటి ధర్మం ద్వాపరయుగన్నాటి శాంతి ప్రేమలు కలియుగన్నాటి అహింస సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు ఈ ఐదింటినీ ఏకంగా నడిపించగలిగినటువంటి ఒక నాయకుడు జగన్నాయకుడు కావాలి ఆ జగన్నాయకుడే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు కనుకనే ఆయన తానున్న ప్రదేశం నుంచి కదలకుండా భారతీయమైనటువంటి ఒక సనాతన ధర్మాన్ని ఏ వేదం వసుధైక కుటుంబకం అని నిర్ణయం చేసిందో అసలు ఈ ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని చెప్పిందో దానిని వారి జీవిత కాలంలోనే వారి కంటితో చూడగలిగారు ఇంకా చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తాను. 1976, 1976 డిసెంబరు ఇరవై మూడవ తారీఖున బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో స్వామి ఒక విషయం చెప్పారు. స్వామికి. పన్నెండేళ్ళ వయసున్నప్పుడు అంటే Nineteen Twenty Six Plus Twelve, Nineteen Thirty Eight ఆ ప్రాంతంలో స్వామి అరుణాచలానికి వెళ్లారు ఇది సాయి భక్తులు ఒప్పుకోరు మా స్వామి అరుణాచలం వెళ్ళడం ఏంటని ఆయన వెళ్లారు రమణ మహర్షి స్వామి ఇద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు అందరి భోజనాలు అయిపోయిన తర్వాత స్వామి పసిబాలుడు పన్నెండేళ్ళు ఆయన అప్పుడే ఇక దేహం వదిలి ఇంకా Nineteen Fifty ఏప్రిల్ రాత్రి ఆ ఏప్రిల్ పద్నాలుగు Nineteen Fifty రాత్రి Eight Forty Seven కి వారి బాడీ వదిలేశారు అంటే కేవలం రెండు మూడు సంవత్సరాల ముందే స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు అంటే అద్వైత జ్ఞానాన్ని గురించి ఈ ప్రపంచాన్ని గురించి సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్న ఆలోచనలు గురించి బహుశా మాట్లాడుకుని ఉంటారు అప్పుడు ఆ అరుణాచలం నుంచి వెనక్కి తిరిగి స్వామి పాత మందిరంలోకి ప్రవేశించినప్పుడు ఈ జాతిని చైతన్య మహాప్రభువు ఎట్లాగైతే ఒక సంకీర్తన భక్తి మధుర భక్తి మార్గంలో గనక తీసుకుని వెళ్లగలిగితే కలియుగ జాడ్యాలు నశించిపోతాయి గనక భజన సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం అంటూ ఆ వయసులో స్వామి స్వయంగా రాసినటువంటి మొట్టమొదటి భజన అది ఎందుకని అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం. ఓం కారంభవ ఓం కారంభవ ఓం కారంభవ ఓం నమో బాబా అంటే తన మూలం శబ్దాన్ని చీల్చుకుని వచ్చిన ఒక శబ్ద బ్రహ్మమే ఈ జగత్తులోకి ఈ రూపంలోకి వచ్చిందని అన్యాపదేశంగా ఒక పరమ గుహ్యమైన ఒక యోగాన్ని ప్రపంచానికి చెప్పారు అంటే మన దృష్టిలో రూపం ద్వారా రమణులు వేరు సత్యసాయి వేరు కానీ భావము తత్వము ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అంతా ఏకమే చిన్న ఉదాహరణ హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతాం లక్నోకి రావాలి అని టేక్ ఆఫ్ అయ్యేదాకా మనకు గ్రౌండ్ కనిపిస్తూనే ఉంటుంది మనకు కనిపిస్తున్నంత మేర తిరుగుతూ ఉంటుంది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ముప్పై మూడు వేల అడుగులకి అది ఆ పై ఎత్తుకి ఆ ఆల్టిట్యూడ్ కి వెళ్ళినప్పుడు మన నగరం మీదుగా వెళుతున్నప్పటికీ మన ఇల్లు ఎక్కడో మనకు కనపడదు అంతా ఒక్కటై కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నేల మీద ఉన్నప్పుడు ఇది నా ఇల్లు ఇది నా వీధి అది నా పేట అది మా ఊరు గాని చెప్తాం అంటే మనం మానసికంగా ఒక హయ్యర్ ప్లేన్ లోకి హయ్యర్ లెవెల్ లోకి గనక మనం వెళుతూ ఉంటే ఈ రూప భేదము నామ భేదము భాషా భేదము ప్రాంత భేదము ఇవన్నీ నశించిపోయి ఉన్నదంతా ఒక్కటే అది వసుధ వసువులను ధరించింది జీవులను ధరిస్తుంది గనుక వసుధ వసుంధర ఈ పేర్లన్నీ ఉన్నాయి కాబట్టి ఈవేళ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని ఎందుకు విన్నాడు ఏ నేపథ్యంలో వినాలని ఆయనకు అనిపించింది అనిపించింది అంటే ఈ భాగవతంలో ఇంకో ప్రత్యేకమైన సూక్ష్మమైన విషయం ఇవన్నీ కీ పాయింట్స్ మనకు నెమ్మదిగా unfold అవుతాయి ఏడు రోజుల భాగవతం విన్న పరీక్షిత్తు కనిపిస్తాడు ముక్తి మార్గాన్ని తెలుసుకున్న పరీక్షిత్తు ఏడు నిమిషాల కంటే తక్కువ సమయంలో ముక్తి మార్గం గాని ముక్తి పదాన్ని పొందిన అజామీలుడు కనిపిస్తాడు ఇక్కడ అంటే ఇక్కడ కాలం ప్రధానం కాదు నేను ఆయన సీనియర్ devotee ఆయన జూనియర్ devotee ఇవేమీ లేవు ఉన్నది ఒకటే devotion ఉందా లేదా కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు ఎటువంటి వాడు ఉత్తరా గర్భంలో పుట్టాడు అసలు పుడుతూనే నిజానికి మరణించి పుట్టవలసిన వాడు కృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషం చేత మళ్ళీ ఊసుపోసుకుని బయట పడ్డాడు బయటపడి అనేకమైనటువంటివన్నీ కూడా తెలుసుకున్నాడు ఎవరు అభిమన్యుడు అటువంటి అభిమన్యుడు అటువంటి అటువంటి పంచ పాండవులు ఉన్నటువంటి ఒక వంశంలో పుట్టిన పరీక్షిత్ మహారాజు కాలగమనంలో రాజైతే ఆనాడు రాజు వేటకి వెళ్ళవచ్చు గనుక నిషేధం లేదు గనుక వెళ్ళాలి గనుక ఆయన వెళ్ళాడు.వెళితే మనలాగే ఆయనకు కూడా దాహం వేసింది. దేహం ఉంటే దాహము, తాపము రెండూ తప్పవు కదా! ఆ దాహం వేసినప్పుడు అక్కడ ఏవో-- ఏముంటాయి? ముని కుటీరాలు ఉంటాయి. ఒక ముని కుటీరంలోకి ఆయన ప్రవేశించాడు. ఆయన మంచి తపస్సులో ఉన్నాడు. యోగంలో ఉన్నాడు. బాహ్య ప్రపంచంలో ఏ రకమైన స్పర్శ లేకుండా ఉన్నాడు. రాజై ఉండి ఆయన దీనంగా అడిగాడు, "నాకు దాహం వేస్తున్నది కొద్దిగా మంచి నీళ్ళు ఇవ్వమని" అడిగాడు. ఆయన వినిపించుకోలేదు. ఎందుకంటే ఆయనకి ఈయన వచ్చినట్టు స్పృహ కూడా లేదు. ఈయన పరీక్షిత్ మహారాజు అడిగి అడిగి అడిగి లోపల ఉన్నటువంటి తామసం ఏదైతే ఉన్నదో అది విజృంభించి అక్కడ చచ్చిపోయినటువంటి ఒక పాము ఉంటే ఆయన మెళ్ళో వేశాడు. వెళ్ళి-వెళ్ళిపోయినాడు. ఇంతలోకే ఈ ముని కుమారుడు వచ్చాడు. తండ్రి మెడలో చచ్చిపోయిన పామును చూసి చాలా బాధపడ్డాడు. "నా తండ్రి ఎటువంటి వాడు? కొన్ని వేల రాజుల కిరీటాల కంటే సమున్నతమైన శిరస్సు కలిగిన వాడు. ఆయన సహస్రారం దగ్గర బ్రహ్మ రంధ్రం దగ్గర నిలబడి నిలకడ చెంది ధ్యాననిష్ఠాగరిష్టుడై, యోగ మార్గ అవశిష్టుడై, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానందానుభూతిలో ఉంటే ఎవరో వేశారు. వాడు ఎవడు కానివ్వండి ఏడు రోజులలోగా వాడు మరణించు గాక." అన్నాడు. ఈయన బయటికి వచ్చాడు. ఎవరు? తండ్రి. "నాయనా! ఆయన ఎవరో కాదు పరీక్షిత్ మహారాజు. మనకి రాజు. రాజు అంటే దైవం. రాజు అంటే మనకు తండ్రి, మనకు పోషకుడు. ఇంత చిన్న తప్పిదానికి అంత భయంకరమైన శిక్ష వేస్తావా?" అని అడిగాడు. "నా తండ్రిని అవమానించిన వాడికి నేను ఇది చేయవలసిందే." అన్నాడు. ఇది భారత భాగవతాలలో కూడినటువంటి ఒక మానసిక విశ్లేషణ. ఒక అవమానంలో నుంచి, ఒక అపజయంలో నుంచి ఇవన్నీ పుడతాయి. సరే మరి దీనికి ఉపశమనం ఏమిటి? అంటే ఏం లేదు. ఆ రాజు అనేటువంటి వాడు అంత ఓపిక లేనివాడు, దాహం తీర్చుకోలేని వాడు. కనీసం నీ-- నువ్వు బయటకు వచ్చి ధ్యానంలో నుంచి బయటకు వచ్చి "ఇదిగో నీళ్లు" అని ఇచ్చేదాకా ఎదురు చూడలేనటువంటి వాడు భాగవత కథ గనక వింటే, వినగలిగే ఓపిక ఉంటే ఆతడికి కొంత ఉపశమనం కలుగుతుందని ఒక relief ఇచ్చాడు. అక్కడతో అక్కడ నిజానికి కథ ప్రారంభమవుతుంది. ఆ కథా ప్రారంభంలో ఆయన అనుకున్నాడు, నిజం పరీక్షిత్ మహారాజుకి తెలిసిపోయింది. ఏడు రోజులు తక్ష శాపం ఉంది. మరి ఏం చేయాలి? నేను ఖచ్చితంగా ఏడు రోజుల్లోపు మరణించబోతున్నాను. ఈ మరణించబోయే లోగా ఎవరైనా నాకు బ్రహ్మజ్ఞానం చెప్తారా? మరణించిన తర్వాత నాకు ఏమవుతుంది? ఈ అయి-అయిన కారణానికి ఇంకేం విరుగుడు లేదా? సరే ఇంతటి శాపం ఎవరు వెనక్కి తీసుకోలేరు గనుక మరి ఏం చేద్దాం అన్నటువంటి నిర్ణయం తీసుకునే లోగా ఎవరెవరు వచ్చారు? బ్రహ్మర్షులు వచ్చారు, మహాత్ములు వచ్చారు, మహామునులు వచ్చారు. వారందరూ వచ్చిన ఆయన అడిగారు, "నాకు మార్గం-- ముక్తి పొందే మార్గం చెప్పండి. విముక్తమయ్యే మార్గం చెప్పండి. దేని నుంచి? మరణం నుంచి కాదు అసలు జన్మ చక్రం నుంచే నాకు ముక్తి కలిగించమని" అడిగాడు. మరణ భయం వల్ల అడి-అడగలేదు ఆయన. మరణం వస్తుందని నిశ్చితమైనటువంటి ఒక మనీషా అంటే conviction వల్ల ఆయన అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, "చూడు ఏడు రోజులలో ఇటువంటి రాజుగా ఉన్నటువంటి నీ మనస్సుని బ్రహ్మము వైపు తిప్పటానికి మా వల్ల కాదు. ఒక్కడే చేయగలరు. ఆయన ఎవరంటే వ్యాసులవారు. ఆయన్ను అడగమన్నారు." వెళ్లారు. వ్యాసుల వారిని అడిగారు. వ్యాసులవారు ఏమన్నారంటే, "లేదు లేదు నేను ఈ సంతానాన్ని కన్నవాడిని, ఇదిగో ఇవన్నీ రాసిన వాడిని, అనేక మాటలు చెప్పిన వాడిని. నాకు ఎన్ని లంపటాలు, ఎన్నెన్ని అనుభవాలన్నీ ఉన్న నా మనస్సు అటువంటి బ్రహ్మతత్వాన్ని చెప్పగలిగే శక్తి నాకు లేదు. ఏదో రాశా, పురాణాలు రాశా, వేదాలు ఉభజించా, technically గా అన్ని పనులు చేశా. కానీ బ్రహ్మత్వాన్ని గురించి నాకు తెలియదు గనుక ఒక పని చేయండి, మా అబ్బాయి శుకుడు ఉన్నాడు వాడిని తీసుకుని వెళ్ళండి." అన్నారు. వీళ్ళంతా ఆశ్చర్యపోయినారు. వయసు నిండిన వాళ్ళు, మనసు పండిన వాళ్ళు, హృదయం తెలిసిన వారు, బ్రహ్మతత్వాన్ని గురించి తీవ్రంగా అధ్యయనం చేసిన వారు, స్వాధ్యాయంలో తపస్సంపన్నులు, ముముక్షు మార్గాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళు చెప్పలేనిది శుకుడు ఎలా చెప్తాడు అని. అప్పుడు ఆయన చెప్పాడు. ఎవరు? వ్యాసులవారు. "శుకుడు కేవలము బాలకుడు కాదు. శరీర స్పృహ లేని అవధూత. శరీరము తనది కాదన్నట్లుగా ఉండగలిగినటువంటి తామరాకు మీద నిలుచుకుంటూ, స్త్రీ పురుష లింగ భేదం లేని పరిపూర్ణమైనటువంటి పవిత్రమైన మనస్సు కలవాడు. కేవలం బ్రహ్మము నందు మాత్రమే తన మనస్సును నెలబెట్టుకుని, ఆ యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా పరమానంద భూమికలో నిలకడ చెందినటువంటి నా కుమారుడు తప్ప ఎవరూ ఈ భాగవతాన్ని చెప్పలేరు." అప్పుడు ఆలోచన చేశారు. అవధూత అంటే ఏమిటి? అన్నీ వదిలిపెట్టిన వాడా? మామూలు కవులు సాధారణ కవులు వర్ణించినట్టుగా అసాధారణ ప్రవృత్తితో, ప్రవర్తనతో, జీవితం-- సంఘ జీవనంలో ఉండేవాళ్ళా? సంఘ మర్యాదలు పాటించని వాళ్ళా? అంటే, అమదానందము విమల ధామమై వర్తమాన వర్తిత అవ్యధాకారకమై ధూమకామరహిత ధ్యాన ధారణాతీత చారణమై తమోరహిత తపోతత్వతారకమై నిలచు నీ జగతి అవధూత నిర్మల నిశ్చల సచ్చరిత. అమదానంద విమల ధామమైఅమందానందం దానికి మదం లేదు దమం తప్ప. మదం పోతేనే గాని దమం రాదు. దమం ఉంటే మదం ఉండదు. కాబట్టి అటువంటి మదము లేని ఒక ఆనందం బ్రహ్మానందము ఆయన విమల ధామం అక్కడ ఉంటాడాయన అవధూత స్థితి. వా వర్తమాన వర్తిత మన మధ్యనే తిరుగుతుంటాడు. అవ్యధాకారకమై ఎవరికీ వ్యధ లేకుండా జీవిస్తాడాయన. ఆయన వలన ఎవ్వరికీ హాని లేదు, ఎవరి వలన ఇబ్బంది లేదు, ఎవరి వలన దుఃఖం లేదు. తమోరహితమై ఉంటాడు. తమస్సు లేదు, అజ్ఞానం లేదు, అవిద్య లేదు, అనాచారం లేదు, అస్పష్టత లేదు, అవివేకం లేదు, ఏమీ లేదు. తమోరహితమై తపోతారకమై తపస్సులో తరించి ఉంటాడాయన. నిలచు నీ జగతి అవధూత. ఇక్కడ మనందరి మధ్యలో ఉంటాడు. నిర్మల నిశ్చల సచ్చరిత. అందుకనే శిరిడి బాబాని అవధూతగా పిలుస్తాం. స్వామిని మనం అవధూత అనం. నాగుడు అనం. కారణం అది నాథ సంప్రదాయం. సంప్రదాయాతీతమైనటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో అటువంటి దానికి చెందినవారు స్వామి గనుక ఇది బాలేదండి feedback విరిపోదు చాలా కష్టం అవుతుంది. Some problem with the battery I think సరే. అటువంటి శుకదేవుడు మాత్రమే చెప్పగలడు అని అందరూ నిర్వహించిన తర్వాత పరీక్షిత్ మహారాజు కూడా అనుకున్నాడు ఇంతమంది పెద్దలు చెప్పలేనిది ఈ పిల్లవాడు నాకెలా చెప్తాడు? అంటే నాకిక మార్గం లేదన్నమాట అని అనుకున్నాడు. ఆ సమయంలోనే శుకదేవుడు ప్రవేశించాడు. ఎలా జరుగుతుంది? మహిమలా? కాదు. కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై cause and effect అంటాం. కాలము, కారణము ఉంటే తప్ప కార్యం జరగదు. కార్యం జరగాలి అంటే దాని వెనుక ఒక కర్తవ్యం ఉండాలి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని శుకదేవుడు రావటం జరిగింది. ఇక కథా ప్రారంభం కావాలి. పరీక్షిత్ మహారాజు శుకదేవుడిని అడుగుతున్నాడు తన యాత్ర చెప్తూ, "శుకదేవా! ప్రాణ నిర్గమన వేళ మరణం తప్పదు అని తెలుసుకున్న తర్వాత ఒక సాధకుడు, ఒక జీవుడు ఏం వినాలి? ఎవరి ద్వారా వినాలి? ఎందుకు వినాలి? దేనికోసమై వినాలి? ఎంత వినాలి?" అని ప్రశ్నల పరంపర సాగిస్తూ వచ్చాడు. ఆ ప్రశ్నల అన్నింటికి కూడా శుకదేవుడు సమాధానం ఇచ్చిన ఆ వైనమే భగవద్గీత. ఆ వైనమే భాగవతం. ఇక కూర్చున్నారు. ఏడు రోజులే ఉన్నది సమయం. ఏడు రోజుల్లో ముక్తి మార్గం చెప్పాలి. ఇదేమన్నా విజయానికి ఐదు మెట్లు అలాంటి ఒక నవలോ నాటకమో కాదు కదా. ముక్తి మార్గం. అతనికేం తెలీదు రాజు రాజై ఉన్నాడు. ముక్తి మార్గం అంటే వైరాగ్యం రావాలి. వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం ఎందుకొచ్చింది? ఇక నేను బతకను. ఏడు రోజులే నాకు సమయం ఉంది. కాబట్టి వైరాగ్యం రాక ఏమవుతుంది? ఆ వైరాగ్యాన్ని ఆనందంగా స్వీకరించాడు పరీక్షిత్ మహారాజు. మరణం అంటే వెరపు లేని, మరణం అంటే మనసులో యాతన లేని ఒక నిర్మలమైన నిశ్చిత అభిప్రాయంతో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఆ ప్రశ్న వేసినప్పుడు ఆ భాగవతం ను విను, వింటూ ఉంటే ఈ ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచం యొక్క అవసరాలేమిటి? అసలు ఈ ప్రపంచం ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? ఒకే శక్తి అనేక అవతారాలు తీసుకుని ఎందుకొస్తుంది? ఇవన్నీ చెప్తూ చెప్తూ మొట్ట మొదటి ఇక్కడ కూడా భాగవతం కూడా పరీక్షిత్ మహారాజుది ఒక విశేషమైన దుఃఖం అయితే, దుఃఖంగా భావిస్తే అసలు దుఃఖం ఇంకొకటుంది. యుద్ధం అయిపోయింది అనుకున్నాం కదా. అయిపోయింది. పగతో ఉన్నాడు ఒక్కడు. పగ ఎవరికీ ఉండకూడదో వాడు పగతో ఉన్నాడు. ఎవరు? కౌరవ సైన్యం అంతా నశించిపోయింది. పాండవులు యుద్ధం అయిపోయింది కాస్త విశ్రాంతంగా ఉన్నారు. అందరూ నిద్ర పోతున్నటువంటి వేళ ఇతను కురు వంశాన్ని పాండవులు ఎలా నిర్మూలనం చేశారో పాండవ వంశాన్ని కూడా నేను నిర్మూలనం చేస్తానని పట్టుబట్టి, పగబట్టి అందరూ నిద్రపోతున్నటువంటి వేళ రాత్రి అర్ధరాత్రి వేళ గుడారంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవులందరి తలలు నరికి తీసుకుని వెళ్ళిపోయినాడు. గర్భశోకాన్ని అనుభవిస్తున్నది ఎవరు? ద్రౌపది. ద్రౌపది ఆ గర్భశోకాన్ని ఎవరికి చెప్పింది? అర్జునుడికి చెప్పింది. "ఓ పని చెయ్, ఎవరు నా బిడ్డలని, వంశాంకురాలని నిర్మూలనం చేశాడో వాణ్ణి నా దగ్గరికి తీసుకురమ్మను" అంది. "నా ఎదురుగానే వాణ్ణి చంపాలి, వాణ్ణి తీసుకురమ్మను" అంది. అర్జునుడికి సవ్యసాచి మహావీరుడు, గాండీవధారి కాబట్టి ఆయన వెళ్లి అశ్వత్థామను బంధించి పట్టుకొచ్చాడు. ఇక్కడ ఉన్నది అసలు విషయం. వ్యాసులవారు మనకేం చెప్తారంటే ఇదంతా ఒక ఎత్తు అసలు విషయం తెలుసుకోండి, ఇది కథగా సాగుతూ తత్వాన్ని తెలుసుకోండి అని. బంధించటం అంటే తాళ్ళతో కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు నుంచోబెట్టాడు. నుంచోబెట్టగానే అశ్వత్థామతో ద్రౌపది అన్న మాటలు ఒక సహజ సహనానికి స్త్రీమూర్తికి ఉండే క్షమకి గుర్తులుగా మిగిలిపోతాయి చరిత్రలో. ఏమన్నదో తెలుసా? "అశ్వత్థామా! నిన్ను చూస్తూ ఉంటే మా మగవారందరూ అంటే నా పెనిమిట్లందరూ కూడా, నా భర్తలందరూ కూడా విద్యాభ్యాసం చేసినటువంటి గురువు, కులగురువైనటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క ప్రతిరూపంగా ఉన్నావు. వీళ్ళందరికీ అస్త్రశస్త్ర విజ్నాానమంతా నేర్పినవాడు నీ తండ్రి. అట్లాగే ఉన్నావు. అచ్చు నీ తండ్రి ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నది నాకు. ఇప్పటికే నీ తండ్రిని పోగొట్టుకొని మీ తల్లి కుమిలిపోతున్నదే. ఇప్పుడు గనక నా పెనిమిటి నిన్ను చంపినట్లయితేఆ తల్లి శోకాన్ని గర్భ శోకాన్ని తట్టుకోగలదా? ఎందుకు ఈ పని చేశావు అనటం మొదలు పెట్టింది. భీముడికి కోపం వచ్చింది. అర్జునుడికి కోపం వచ్చింది. ఏం ద్రౌపది ఏం మాట్లాడుతున్నావ్? నువ్వేం చెప్పావ్? వాడ్ని తీసుకురా, వాడి తల నేను నరుకుతాను అని కదా నువ్వు అన్నావ్. మరి ఇట్లా మాట్లాడుతున్నావ్ అంటే. అప్పుడు చెప్పింది ఆవిడ. అంటే, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఈ నరహంతకమైనటువంటి కార్యక్రమం ద్వారా అనేక వంశాలు, ఈ జాతి ఒక మహా దుఃఖంలో మునిగి పోబోతున్నది. ఆ దుఃఖానికి మనం కారణం కాకూడదు. గురు రూపంలో ఉన్నటువంటి గురుపుత్రుణ్ణి వదిలిపెట్టడమే క్షేమం అన్నది. వదిలిపెట్టమంది. భీముడు ఒక్క పిడికిలితో వాడ్ని సంహరిస్తా అన్నాడు. నీ పిడికిలి అవసరం లేదన్నది. దుఃఖం నాది, గర్భ శోకం నాది. మీరు యుద్ధ వీరులు, మీకు మనసు ఉండదు, కారుణ్యం ఉండదు. కాపట్యం తప్ప, వగ, పగ తప్ప మీకు ఎక్కడ ప్రేమలు ఉండవు. తల్లిని బిడ్డలను కన్న తల్లిగా నేను చెప్తున్నాను, అశ్వత్థామను వదిలిపెట్టండని. అని, ఆ అతనికి ఒక హితబోధ చేసింది. అంటే ఈ పాత్రల ద్వారా మనం ఏం చేయాలో చెప్తాడు వ్యాసులవారు, ఏం చేయకూడదో కూడా చెప్తారు. మద్యం తాగి ఉన్నవాణ్ణి, నిద్రపోతున్నటువంటి వాణ్ణి, బలహీనుడైనటువంటి వాణ్ణి, వృద్ధుణ్ణి, అస్-నిస్సహాయుణ్ణి, నిరాయుధుణ్ణి చంపకూడదన్న ధర్మ శాస్త్రంను గుర్తు తెచ్చుకోమన్నది అర్జునుణ్ణి. అంటే అక్కడ నుంచి ప్రారంభమైనప్పుడు పరీక్షిత్ మహారాజు, ఆయన, ఆయనకి అనుభవం లేదు. అభిమన్యుడి దగ్గర కథ అయిపోయింది. కాబట్టి ఓ ఇటువంటి వాళ్ళా నా తల్లిదండ్రులు, నా మూలాలు ఇంత గొప్పవా, నా వంశం ఇంత ధర్మాత్ముకమైనదా అన్నటువంటి ఆలోచన రావటం. కాబట్టి మహాభాగవతం మూడు పాత్రలతో రంగప్రవేశం చేసి ముగ్గురు విషాద భూమికను అనుభవించినటువంటి తొలి మహిళ కుంతి. తర్వాత కురువృద్ధులైన భీష్మాచార్యుల వారు. మూడు ఇదిగో ద్రౌపది. అయిపోయింది. ఇది చెప్పాడు. నువ్వు అటువంటి వంశానికి చెందిన వాడివి గనుక, మరణ భయాన్ని నివారించడం కోసం నేను నీకు భాగవతం చెప్పను. ఎందుకు చెప్తానంటే, భాగవతం అంటూ నువ్వు నెమ్మదిగా వెళుతూ ఉంటే, ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్య తత్వాలన్నీ దాటుతూ ముక్తికి మార్గం నీకు దొరుకుతుంది. ముక్తిని నేను ఇవ్వలేను. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అంతే కదా, భగవద్గీతలో. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధారణ ఇవ్వరు. చాలామంది అంటారు, నీకు ముక్తిని ఇచ్చేస్తాను, నీకు మోక్షం ఇచ్చేస్తాను అని ఇటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. కానీ అది జగద్వంచన, పైగా ఆత్మవంచన. కాబట్టి అవి చేయకూడదు. ముక్తి మార్గం చెప్పగలమే తప్ప ఎవరైనా. ముక్తిని ఎవరూ ఇవ్వలేరు. కాళ్ళకి, చేతులకి సంకెళ్ళు వేసుకుని మనం వచ్చాం. మన ముళ్ళు మనమే విప్పుకోవాలి. అవి కాళ్ళతో వేసుకున్నామా, వెండి గొలుసులతో వేసుకున్నామా, బంగారు గొలుసులతో వేసుకున్నామా, అది గనక ఆ స్ఫురణ గనక ఉన్నట్లయితే, మన సంకెళ్ళు మనమే తెంచుకోవాలి అన్న భావన గనక కలిగినట్లయితే, అప్పుడు ఏర్పడే దానికి ఇంగ్లీష్ పదం, అదేమిటంటే detachment. అప్పుడు గాని అసలు ఈ వైరాగ్యము, నిబంధన, నిర్బంధనం ఇవన్నీ కూడా నశించవు గనుక అక్కడ నుంచి పరీక్షిత్ మహారాజు ఈ కథలన్నీ చెప్తూ ఉంటే, ఆ త్రిజగన్మోహనమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని విష్ణు రూపంలో దర్శనం చేసుకున్నటువంటి భీష్మాచార్యుల వారు తాను జీవితంలో ఆచరించలేని చాలా విషయాలు పాండవులకు చెప్పాడు. అప్పుడు ఆచార్యులైనాడు ఆయన. భీష్ముడు ఆచార్యుడు ఎలా అయినాడు? పెద్దవాడు, వయసు వలన అంటే. జ్ఞానము పటమరించిన తర్వాత, అజ్ఞానం నశించిన తర్వాత, యుద్ధరంగంలో ఇక తన శరీరాన్ని తాను వదిలిపెట్టాలి, తప్పదు అనుకున్నటువంటి వేళ ధర్మ ప్రబోధం చేశాడు పాండవులకి. వాళ్ళు ధర్మ ప్రబోధం వినలా ధర్మాన్ని ఆచరించారు. ఎవరి వలన ఆచరించారు? ధర్మ స్వరూపుణి అయిన తల్లి కుంతి, ధర్మమూర్తి అయినటువంటి భార్య ద్రౌపది, ధర్మమే ఆకారమైనటువంటి కృష్ణ పరమాత్మ ముగ్గురు ఈ ఐదుగురిని రక్షించారు. ఈ ఐదుగురు ధర్మం యొక్క ఐదు స్వరూపాలు కాబట్టి వీటిని ముగ్గురు తలపెట్టి ధర్మాన్ని నిలబెట్టారు. అలా ఏర్పడినటువంటి కలియుగం, అట్లా కలి ప్రవేశం జరిగినప్పుడు, ఆ కలి ప్రవేశం ఎలా జరిగింది? అది మూడు కాళ్ళ నుంచి ఒంటి కాలు మీదికి ఎలా వచ్చింది అంటే, ఏ యుగము కూడా మనం అంటాం సత్య యుగం వచ్చేస్తోంది, వచ్చేస్తోంది అంటాం. దానంతట అది రాదు. మనం సత్య మార్గంలో వెళ్ళాలి. ధర్మం ఏమిటో తెలుసుకోవాలి. ధర్మ మార్గం నుంచి నెమ్మదిగా, ఆ, మనసు నిండా శాంతిని పొందాలి. ప్రపంచాన్నంతా కూడా ప్రేమించగలిగిన స్థాయికి వెళ్ళాలి. అహింసా ప్రవృత్తితో ఉండాలి. అందుకని చాలామంది ఈ వేళ vegetarian, non vegetarian విషయాల మీద కాన్ఫరెన్సులు జరుగుతూ ఉంటాయి. అంత అవసరం లేదు. ఏమిటంటే, ఎప్పుడైతే నువ్వు సాత్వికమైన శాకాహారాన్ని తింటావో అటువంటి మనస్సే నీకు నిర్మాణం జరుగుతుంది. ఎవరినీ వాళ్ళు హింసించలేరు. హింసను తలపెట్టలేరు. మనసులో ఆలోచన కూడా పటమరించదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇప్పుడు నేను అంటున్న ఈ మాటలన్నీ అనేక పద్యాలలో ఉన్నవి మళ్ళీ మీకు మామూలు భాషలో పరీక్షిత్ మహారాజుకి శుకదేవుడు చెప్పినటువంటి ఈ మాటలు ఇవన్నీ. ఇవన్నీ చెప్పాడు. ఆహారము, విహారము, వ్యవహారము. దానినే భగవద్గీతలో, నిజానికి యోగవాసిష్టం నుంచి భగవద్గీతలో యుక్తాహార విహారస్య అన్నారు కృష్ణుడు. యుక్తమైన ఆహారం తినండి. వయసుకు తగిన ఆహారం తినండి. శరీరం యొక్క తత్వానికి తగినటువంటి ఆహారం తినండి. విహారస్య, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళండి. ఎక్కడికి వెళితే నీకు ఆనందం కలిగిస్తుందో లేదా నీవు మరొకరికి ఆనందం కలిగించగలవో అటువంటి చోటికి నువ్వు వెళ్ళు. అదే యుక్తాహార విహారస్య అనే పదానికి అర్థం. యుక్త అంటే కూడి ఉన్నా అని ఒక అర్థం.ఎవరితో కూడి ఉండాలి ఆహారంగా మనం భోజనం చేస్తాం బ్రహ్మార్పణం చెప్పుకుంటాం అహం వైశ్వానరో భూత్వా చదువుకుంటాం అప్పుడు మనం ఆ పద-పదార్థానికి నమస్కరిస్తాం. విస్తట్లో వేసినప్పుడు అది అందరికీ సాదమే. పరమేశ్వరుడికి నివేదన చేసిన తర్వాత అదే సాదము ప్రసాదం అవుతున్నది. మనం అన్నం తిన్నాం భోజనం చేశాం అంటాం ఒక్కనాడు కూడా ప్రసాదం తిని బయటికి వచ్చామని మనం అనం. ఎందుకంటే మనకు ఆ స్పృహ లేదు గనుక. దాన్ని పదార్థంగా చూసినంత కాలం అది అట్లాగే ఉంటుంది. ఇవన్నీ పరీక్షిత్ మహారాజుకి ఈ సూక్ష్మమైనటువంటి విషయాలు చెప్తూ, కృష్ణుడి సంగతి చెప్పి కృష్ణుడు ఎలా యుద్ధం నడిపించాడు, ఎట్లాగైతే కృష్ణ పరమాత్మ మళ్ళీ ద్వారకా నగరానికి తిరిగి వెళ్ళాడో, వెళ్ళబోతున్నప్పుడు ఏం జరిగిందో ఇది మీ అందరికీ తెలియచెప్పాలి. అదేమిటంటే యుద్ధం అయిపోయింది కుంతి వెళ్ళిపోయింది ఇక మిగిలిన వాళ్ళు ఎవరు లేరు పాండవులు రాజ్యం వెళ్తున్నారు మరి దేన్ని ఏలారో మనకు తెలియదు చరిత్ర లేదు. ఆ సమయంలో ఇక నేను మా ద్వారకకు బయలుదేరి వెళ్తున్నాను ఆయన అవతార పరిసమాప్తి కావాలి ఆయనకు తెలుసు. యదువంశ వినాశనం జరగాలి. ఎందుకని? యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ప్రకటించిన వాడు కృష్ణుడు. కాబట్టి అధర్మం ప్రబలింది అక్కడ కూడా. అది కూడా [కట్] నేను. Destruction జరిగితే తప్ప Construction జరగదు. పాత building పడగొడితే తప్ప కొత్త building కి పునాదులు లేవు. కాబట్టి ఆ సూత్రాన్ని అనుసరించి ద్వారకకు వెళ్తున్నానని తనకు మిత్రుడైనటువంటి భావమరిదైనటువంటి అర్జునుడికి చెబుదామని వెళ్తున్నాడు ఆయన. అది సంధ్యా సమయం మునిమాపు వేళ వెలుగులు పోలేదు అక్కడ సూర్యకాంతి వెలుతూ ఉన్నది ఈ ఇటువంటి సంధ్యా సమయంలో అర్జునుడు ఎదురుగా కూర్చొని కృష్ణుడిని పట్టుకున్నాడు. పట్టుకొని మహాభారత యుద్ధం ప్రారంభించే సమయంలో ఆ తర్వాత ఈ అనేక విషయాలు నాకు చెప్పావు కదా చెప్తూ చెప్తూ బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మము అని పదం చాలాసార్లు వాడావు అప్పుడు నాకెంతో అర్థమైనట్టుగా తల ఊపాను కానీ నాకు అర్థం కాలేదు. కాస్త చెప్తావా? అన్నాడు. ఒక గురువుకి గాని ఒక ఆచార్యుడికి గాని ఉండే సద్గురువుకి గాని సదాచార్యుడికి గాని సత్యాచార్యుడికి గాని ఉండే ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే ఎవరైనా తన దగ్గరకు ఒక పరి ప్రశ్న వేయటానికి వస్తే నిజమైన సందేహం అయితే దానిని తొలగించినందువలన ఈ ప్రపంచం మొత్తానికి లాభం కలుగుతుందని అనుకుంటే ఆయన ఆగిపోతాడు. ఆగిపోయి సందేహ నివృత్తి చేసి తన దారిన తాను వెళతాడు. కృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళటం ఆపేసుకున్నాడు ఈ మునిమాపు వేళ. రెండు వందల యాభై ఏడు శ్లోకాలలో ఉత్తర గీత చెప్పాడు. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? బ్రహ్మతత్వం ఏమిటి? బ్రహ్మ గ్యురుడు ఎలా అవుతాడు? ఇవన్నీ కూడా చెప్తూ చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్లిపోయినాడు. వెళ్లిపోయిన తర్వాత కృష్ణుడు ఎలా ఉన్నాడో చూద్దాం అని అర్జునుడు వెళ్ళాడు. వెళితే యాదవ కులమంతా పోయింది అక్కడ ఏమి లేవు మానవాళ్ళు లేవు. కృష్ణుడు దేహం వదిలిపెట్టిన తర్వాత సుమారు పద్దెనిమిది రోజుల వరకు కృష్ణ దేహం ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. శ్రీరామచంద్రుడు అందరూ చూస్తూ ఉండగా యోగ శరీరాన్ని భౌతిక శరీరాన్ని యోగ శరీరంగా మార్చుకొని సరయు నదిలోకి తనంతట తాను ప్రవేశించి మళ్ళీ మూల స్థానంలోకి వెళ్ళటం అందరికీ తెలుసు. అది అయోధ్యలో జరిగిన అద్భుతం అది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ విషయంలో అలా జరగలేదు. ఎలా జరిగిందంటే పద్దెనిమిది రోజులు వెతికారా మిగిలిన వాళ్ళు నలుగురో ఐదుగురో మిగిలారు. ఎక్కడ మా కృష్ణుడు ఎక్కడ? వంశం పోయింది రాజ్యం పోయింది మొత్తం మునిగిపోయింది సముద్రం అంతా వెనక్కి వెళ్ళిపోతున్నది ఏమిటిది? అని అనుకున్నప్పుడు ఆ కృష్ణుడు ఎక్కడో ఒక బండరాయి మీద తల పెట్టుకొని శరీరం అంతా కూడా ఆ నీల వర్ణంలో అలా ధగధగాయమానంగా వెలిగిపోతూ ఒక కృష్ణ దేహం కనిపించింది అంతే. ఆ కృష్ణ దేహాన్ని కనిపెట్టడానికి పద్దెనిమిది రోజులు పట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన వాడు ఎవరంటే అర్జునుడు. అర్జునుడు తల వంచుకొని వచ్చాడు. ధర్మరాజు అడిగాడు. ఏమడిగాడంటే, "ఎందుకు నువ్వు తల వంచుకొని వచ్చావు? మన కృష్ణుడు ఎలా ఉన్నాడు? కృష్ణుడిని చూశావా? లేదు నువ్వు ఎవరికన్నా ఎవరితోన్నా తలపడ్డావా? యుద్ధం చేశావా? ఇంత యుద్ధం చేసి అక్కడ ఓడిపోయినావా? ఎవరినైనా బాధించావా? లేదు నిన్ను ఎవరైనా బాధించారా? ఎందుకు తల వంచుకొని నుంచున్నావు అర్జునా?" అని అడిగాడు ధర్మరాజు. అడిగితే మాట పెగలక గుండెంతా కూడా దుఃఖంతో గూడు కట్టుకున్నటువంటి స్థితిలో మన సచివుడు మన బాంధవుడు మన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఇక లేడు అని. అంటే దే-- తనువుతో ఏర్పడినటువంటి బాంధవ్యాలన్నీ తనువుతోనే తెల్లవారిపోతాయి. ఏ అవతార మూర్తైనా పంచభౌతిక దేహాన్ని తీసుకుని వస్తే ఆ కాలంలో ఆ ప్రదేశంలో ఆ conjunction లో అంటే ఆ సంధి కాలంలో ఆ సంఘర్షణలో ఆ జీవన ప్రవాహంలో వారు ఏయే కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ వారు సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినప్పటికీ దేహాన్ని ఎలా వదిలిపెట్టాలో వారు నిర్ణయించుకుంటారు.