⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
సౌందర్య సం సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన వందానం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శిలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవసప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాపుం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్వరూపతా పరమమహేశ్వర స్వరూపుడు సత్యనంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ జీవితం పరిమితికి లోబడింది అనంత పరమార్ధాన్ని గ్రహించటానికి మాత్రమే మానవ జన్మ ఎత్తి మనం వచ్చాము అందునా మహాత్ములతో సాక్షాత్ సర్వదేవతల యొక్క నిక్కమైన ఒక రూపం ఉంటే అది భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి వారి దర్శన స్పర్శన సంభాషణ అనేకమైన స్థాయిలలో అరవై సంవత్సరాలు సాగుతున్నటువంటి ఈవేళ సద్భక్తులు ఉదార స్వభావులు గృహలక్ష్మి ఇంటికి దిక్సూచి అయినటువంటి ఒక సహధర్మచారిణితో ఉన్నటువంటి వేణుగోపాల రావు దంపతులకి స్వామి యొక్క అనుగ్రహం వారికి మాత్రమే కాదు వారికి వారికి వారి వారికిని అందరికీ ఆయనతో కలువేసుకున్న వారందరికీ స్వామి అనుగ్రహం ఈ ఒక్క తరానికి మాత్రమే కాకుండా రాబోయే ఇరవై ఒక్క తరాల వరకు ఆరక్ష కావాలి అని స్వామిని ప్రార్థిస్తూ మనం భాగవతాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పుకునే ముందు వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశయే జంగలికాయమానే సంసారహావాహల మోహజాతే సద్గురువుని గనుక నమస్కరించిన సద్గురువుని దర్శనం చేసిన సద్గురు పాదస్పర్శ మనకు తగిలిన ఆ క్షణం వరకు జరిగినటువంటి అనేక లౌకిక భౌతిక కార్యకలాపాల వలన ఏర్పడిన దుష్ఫలితాలు ఏవన్నా ఉంటే అవన్నీ కూడా క్షమిం చుతాయి తగ్గిపోతాయి. మళ్ళీ పునః మంచి పనులు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అటువంటి నేపథ్యంలో ఎప్పుడో చిన్నప్పుడు భాగవతం చదువుకున్నప్పుడు భాగవతం కథనిగా చదువుకున్నప్పుడు ఆహా! ఎంత బాగుంది అనుకున్నప్పుడు నైమిశారణ్యము శౌనకాది మహర్షులు ఆపై సూత మహాముని పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ కూడా మన కళ్ళముందు నడయాడుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని ఇవాళ గుర్తుచేసుకుంటే సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వ్యాసుల వారి కుమారుడు ఏ శుకదేవుడి వలన ఈ భాగవతం ఈ లోకంలోకి వచ్చిందో ఆ భాగవతాన్ని ఇవాళ ప్రారంభించి సాప్తాహికంగా ఏడు రోజులు సప్తజ్ఞాన భూమికను దాటుతూ ఉండగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి సమున్నతమైన ఉత్కృష్టమైన మహా స్థితికి కడగా యదార్థ స్థితికి చేరుకోవటానికి ఈ ఏడు రోజుల సమయం చాలు. ఇదే భాగవతం మనకిచ్చినటువంటి ఒక ప్రమాణం. మనస్సుని శరీరాన్ని బుద్ధిని చిత్తాన్ని అన్నింటినీ అంతటినీ పరమేశ్వర పాదపద్మానికి లగ్నం చేసి గనుక మనం వినగలిగితే అనగలిగితే కనగలిగితే అది సంపూర్ణమైన ఈశ్వరూపాసన ఇది శాస్త్ర ప్రమాణం. అయితే ఈ భాగవతం రావటానికి ముందు త్రేతాయుగంలో శ్రీమద్రామాయణం రాయాలి అని వాల్మీకి మహర్షి సంకల్పించుకున్నప్పుడు ఆయన ఓ ప్రదేశం వెతుక్కుంటున్నాడు. ఆరోజు నగరాలు లేవు పట్టణాలు లేవు ఇటువంటి నాగరికత భౌతిక నాగరికత లేదు ఉన్నదంతా ఆధ్యాత్మికమే. కానీ అనువైన ప్రదేశం కావాలి అనువైన ఆసనం కావాలి అనువైన మనస్సు కావాలి అనువైన తీర్థం కావాలి అనువైన భావ సామ్రాజ్య సంపద మన పరం కావాలి. ఇవన్నీ ఆలోచించి వాల్మీకి తపసానది తీరం దాటి నెమ్మది నెమ్మదిగా అరణ్యాలకు వెళుతుంటే ఎన్నో సరస్సులు ఎన్నో చెరువులు ఎన్నో తటాకాలు నీటి చలములు నీటి మడుగులు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. భరద్వాజుడు అనేటువంటి ఒక శిష్యుడిని వెంబడి పెట్టుకొని ఆయన ప్రయాణం చేస్తున్నారు స్థల నిర్ణయం కోసం వెళ్తూ ఉన్నారు. ఎన్ని చూసినా ఎక్కడా వాల్మీకి మనసు నిలకడ చెందలేదు కానీ ఒక్కచోట మాత్రం ఆగిపోయినాడు. అప్పటికే భరద్వాజ అనబడేటువంటి శిష్యుడు కొంత దూరం ముందుకు వెళ్లిపోయినాడు. వెళ్లిపోతే ఆనంద తరంగితమైనటువంటి ఒక హృదయాన్ని ఆవిష్కరించుకుంటూ లోలోపల జరుగుతున్నటువంటి అంతర్మధనంలో నుంచి పుట్టేన అరణి అనేటువంటి జ్ఞానాగ్ని రగిలి రగిలి పొగిలి పొగిలి సంపూర్ణమై రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగనాడులు కదలిపోగా ఒక చైతన్య ప్రవాహం వాల్మీకి హృదయాన్ని ఆవహించి ఆవేశించి ఆవరించిన సందర్భంలో భరద్వాజ అని పిలిచారు. ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు.అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబుహు సన్మనుష్య మనో యథా రామాయణంలో మూల శ్లోకం నిజానికి ఇది. మామూలుగా అందరూ ప్రవచనకారులు మానీషాద ప్రతిష్ఠాం తు నమమశశ్శ్రజీ సమాః యత్క్రౌంచమిధునాదేకమ్ అవధీః కామమోహితమ్ ఓ శ్లోకంలో నుంచి శ్లోకం పుట్టిందని చమత్కరిస్తూ చెప్తారు. అది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది అకర్దమమిదం తీర్థం భరద్వాజ ఇదిగో ఈ చెరువును చూడు ఆ నీళ్లను చూడు ఎట్లా ఉన్నది అంటే కర్దమము అంటే బురద అకర్దమం ఇక్కడ ఎక్కడ బురద లేదు ఈ నీళ్లల్లో. నిశామయ రమణీయం చాలా రమణీయంగా ఉన్నది. ప్రసన్నాంబుహు ఏ రకమైన అలలు కలలు అలజడులు లేవు నిర్మల ప్రశాంత ప్రసన్నమైన స్థాయిలో అది ఉన్నది. ఇది ఎట్లా ఉన్నదో చెప్పనా? సన్మనుష్య మనో యథా సత్పురుషుడు అయినటువంటి ఒక మనిషి యొక్క హృదయం లాగా ఉన్నది. ఇక్కడ నేను రామాయణం రాస్తాను అన్నాడు. అంటే తాను రాయబోయేటువంటి రామాయణ కథ ఏదైతే ఉన్నదో, ఏ మహా సత్పురుషుడు గురించి రాయాలి అంటే కాలే స్థలే జలే అని మూడు మాటలున్నాయి. కాలము అనకూడాలి మంచి కాలంలో మంచి పని చేయాలి. స్థలే ఆ స్థలం పవిత్రమై ఉండాలి. జలే నీళ్లు ఉండాలి తీర్థం ఉండాలి. ఇవాళ మనకి ఈ ఆశ్వయుజ మాసంలో ఒక ప్రసన్నమైనటువంటి కాలంలో పరమాద్భుతమైన సన్మంగళ కాలం కాలంలో ఒక వేద యజ్ఞానికి శ్రీకారం చుట్టబడినటువంటి మహా సందర్భంలో కాలము పవిత్రమై ప్రవహిస్తున్నది ఇక్కడ. అంతేకాదు స్థలే నైమిశారణ్యాన్ని మించిన స్థలం ఇంకెక్కడున్నది? నైమిశారణ్యము అంటే ఏ గుళ్ళున్నాయి ఏ దేవతలున్నారు ఇది కాదు. నేమి అంటే కాలచక్రం. మనందరికీ జన్మ చక్రాలున్నాయి. ఎన్నెన్ని జన్మలో మనం ఎత్తి ఇక్కడికి వచ్చాం. ఇది కట్టకడపటి జన్మగా చేసుకోవాలి అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి వచ్చి జ్ఞానం అంటే ఏమిటి అని అడుగుతున్నాం. దాన్ని కడగా కడదాకా సాగించాలి గనుక ఇక్కడ కాలము స్థలము నైమిశారణ్యంలో నేమి మనం అంబరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కొత్త వాళ్ళమేం కాదు. బండి చక్రాలు ఉంటాయి బండి చక్రం చెక్కతో చేయబడి ఉంటుంది. కానీ అది నడవాలి అంటే ఒక ఇనప కమ్మితో ఒక నేమి తయారు చేస్తారు. దాన్నే రిమ్ అంటాం రిమ్. దానికి సంస్కృతంలో పేరు నేమి. నైమిశారణ్యం ప్రవేశించినా, నైమిశారణ్యంలో కొన్ని క్షణాలు ఉండగలిగినా, నైమిశారణ్యం వెళ్ళాలి అన్న భావన మనసులో పుట్టినా ఏం జరుగుతుందయ్యా అంటే ఆ కాలము అనేటువంటి ఆ చక్రపు చట్రం ఉన్నదే బయటది బద్దలైపోతుంది. కనుక నైమిశారణ్యం నిజానికి ఇది అరుణాచలం. న ఋణా న చలా అరుణాచలా అంతే కదా! భౌ బంధాలు కానీ ప్రాపంచిక లౌకిక భౌతిక విషయాలు కానీ మన నుంచి విడిపోవాలి ముక్కలైపోవాలి అంటే దానికి అనువైన ప్రదేశం ఏంటంటే భగవాన్ శ్రీ రమణుల నివసించినటువంటి అరుణాచలం ఒకటి. ఆ అరుణాచలం ఇది కూడా. ఎందుకవుతున్నది అంటే నేమి ఇక్కడ ఉన్నది. ఆ నిమి నిమేషమైనటువంటి ఈ కాలచక్రం నిమేషమైనటువంటి మానవుడి యొక్క జన్మ ఒక పారమార్థిక స్థాయికి వెళ్ళాలి అంటే ప్రాపంచికమైన బంధనాలు ఉన్నంతవరకూ ఉండవలసినంత వరకు ఉండాలి దాటి ఉండకూడదు. ఒకవేళ ఉంటే అవి పటాపంచలు చేసేది గనుక ఇది నైమిశారణ్యం అయింది. ఇక రెండవది అచలం అవుతున్నది ఇక్కడ మనసు అన్ని తాళాలు పెట్టి వచ్చేసాం ఎక్కడ ఏమవుతున్నదో మనకు తెలీదు. ఇక్కడ నిన్న ఇక్కడ మనం చేరుకున్న క్షణం నుంచి ఇదిగో ఈ పవిత్ర క్షణం వరకు కూడా మనసంతా కూడా పరమేశ్వర భావన యందు లగ్నమై ఉన్నది గనుక అరుణ అచల అచలమైంది చలచ్ఛలితమైన మనసు. కాబట్టి అరుణాచలం అంటే కేవలం తిరువణ్ణామలై అనే కాదు ఎక్కడ నీ మనసు అరుణమైయిందో అచలమైయిందో కావలసినటువంటి ఆ స్థలము ఆ సమయము ఏర్పడి ఉన్నాయో అది అరుణాచలం అవుతున్నది గనుక నైమిశారణ్యాన్ని మనం అరుణాచలంగా భావన చేయవచ్చు. ఇక మూడవది కాలం మంచి కాలం స్థలం మంచి కాలం తీర్థే కాలే స్థలే జలే జలం పుష్కలమైనటువంటి గోమతీ నది పరవళ్ళు తొక్కుతూ ప్రవాహ వేగంతో వెళ్లిపోతున్నది. ఇవాళ మనందరం కూడా ఆ పవిత్ర జలాల మధ్యలో కూర్చొని స్నానం చేసి ఈ శరీరాన్ని ముందు శుద్ధి పరచుకున్నాం. ఇక అంతఃశుద్ధి కోసం మళ్ళీ రంగప్రవేశం చేశాం. ఇక్కడికి వచ్చి ఈ ఏడు రోజులు శుద్ధమైనటువంటి శరీరాన్ని శుద్ధమైనటువంటి మనసు వైపు తిప్పి శుద్ధమైన బుద్ధి చిత్ అహంకారమును దాటి పరిశుభ్రమైన పరిశుద్ధమైనటువంటి ఆత్మైక స్థితిలోకి వెళ్ళాలి గనుక దానికి భాగవతాన్ని మనం వినాలి. ఇది ఈ నేపథ్యం. అయితే భాగవతం ఎన్నిసార్లండి ఎవరు అంటారు నూట ముప్పై యజ్ఞాలు చేసేసాను లేకపోతే ఇంకో ముప్పై చేశాను లెక్కపెడతాం అవసరం లేదు. ఒక్కటి జీవిత కాలంలో ఒక్కటి చేయగలిగినా అది వేయి మహాయజ్ఞాలతో సమానంగా భావన చేయాలి. ఇవాళ ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీతో పాటు నేను కూడా ఎంత పుణ్యం చేసుకున్నామో, పురాత్కృతమైనటువంటి ఎన్ని జన్మలు ఎత్తి ఎంత తపస్సు చేశామో దాని ఫలితమే సాక్షాత్తు భాగవతం చెప్పబడిన చోట మనం ఇక్కడికి వచ్చి మహామునులు చెప్పుకున్నటువంటిది.ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇది, మామూలు ప్రదేశం కాదు. ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు ఎవరు యజమాని అని ఒక ప్రశ్న వస్తే, రుతువికే యజమాని అవుతున్నాడు. మరి యజ్ఞ ఫలం, యాగ ఫలం చేసిన వారికి, చేయిస్తున్న వారికే చెందుతుందా అంటే వాకిలి తోరణం నుంచి వాకిట కట్టబడిన ఒక తోరణంలో ఉన్న ఒక ఆకు నుంచి పరబ్రహ్మమూర్తి అయిన సత్య సాయి భగవానుడి వరకు ఈ ఫలితం అంతా కూడా చెందుతుంది. మరి స్వామికి ఫలితం చెందటం ఏంటి? ఆయన భగవంతుడు కదా అంటే తోరణం అక్కడ కడతాం, జీవితానికి తారణం ఇచ్చేటువంటి పవిత్రమూర్తి ఇక్కడ ఉన్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి? కాబట్టి కాలము మంచిది, స్థలము మంచిది, జలము అంటే తీర్థం. ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఆ తీర్థమే లేకపోతే భగవద్భక్తులమైన మనందరం కలిసి ఒకచోట కూర్చుంటే దానికి తీర్థము అని పేరు. అయితే చాలాసార్లు భాగవతం విన్నాం కదా, కొత్తగా ఏముంటుంది? అదే కథ, అక్కడే ప్రారంభం అవుతుంది. విని, విని అనేక మాధ్యమాల్లో చూసేశాం, సినిమాల్లో చూశాం, బాలభాగవతం చదివాం, యా-- ఎందరెందరో చెప్పగా విన్నాం. మళ్ళీ కొత్తగా ఏముంటుంది అంటే, మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన కొలిచిన రాముడే తలతును నేనును నా భక్తి రచనలు నావి గాన. వారెవరో విన్నారు, వారెవరో చెప్పారు కాదు. నేను కూడా చేసుకోవాలి కదా. జన్మ ఎత్తనందుకు ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక యోగం కల్పించబడినప్పుడు సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సత్య సాయి భగవానుడి యొక్క దివ్య సన్నిధిలో భాగవతం వినటం ఎంత అపురూప సన్నివేశం ఇది. మళ్ళీ దొరుకుతుందా? కనుక మళ్ళీ ఎందుకు ఈ రామాయణం, మళ్ళి ఎందుకీ భాగవతం అంటే పునః పునః వింటూ ఉండాలి. వింటూ, వింటూ, వింటూ ఉంటే ఎక్కడో మనకి mind లో register అవుతుంది. భాగవతం అంటే ఇదా? కేవలం సృష్టి క్రమం, కుంతీ స్తుతి అట్లా విభా-- విభాగీకరించుకుంటూ స్కందాలన్నీ పూర్తి చేసుకుని దశమ స్కందంతో కళ్యాణం చేసుకుంటే భాగవతం పరిసమాప్త అవుతుందా? కానే కాదు. దీని నేపథ్యం నది పుట్టుక, ఋషి పుట్టుక, మహాత్ముల పుట్టుక మనం తెలుసుకోవాల్సిన పని లేదు. కృష్ణానది మన bracket లో ప్రవహిస్తూ ఉన్నది. మూలం ఎక్కడ అంటే ఎవరో చెప్తారు మహాబలేశ్వరుంలో పుట్టింది అని. మహాబలేశ్వరంలో ఎక్కడ పుట్టింది అది చెప్పలేరు. ఒక బిందువుగా ప్రారంభమై జీవితాన్ని సింధువుగా మార్చుకుని పరమాత్మ అనబడేటువంటి క్షీరసాగరంలోకి కలిసే దాకా జీవుడు ఎత్తు నుంచి పల్లంలోకి జారుతూ వెళుతూ వెళుతూ తాను ఉన్న ప్రదేశాన్ని తాను శుభ్రపరుస్తూ తనను తాను శుభ్రపరచుకుంటూ ఎక్కడో బిందువై, ఒక చినుకై ఆకాశాత్ పతితం తోయం యధా గచ్ఛతి సాగరం అలా సాగర సంగమం చేయటానికి వెళుతున్నట్లుగా మనం కూడా ఎక్కడో పుట్టాం, ఎవరికో చెందాం. దేశం వేరు, ప్రదేశం వేరు కానీ జీవన ప్రవాహంలో మన దారి శుభ్రపరుచుకుంటూ ఖడగా పరమాత్మని చేరేటువంటి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు శుద్ధమై, బుద్ధమై, నిత్యమై, సత్యమై, శాశ్వతమై, నవ్యమై, భవ్యమై, దివ్యమై, అవ్యయమై, అద్భుతమై, అనంతమై, అపురూపమై, అతులమై, ఆనంద సంధాయకం కావాలి. అది అయినప్పుడు మాత్రమే దానికి జీవితము అని పేరు. మామూలుగా పుట్టాం, కొన్నాళ్ళు ఉన్నాం, ఏదో రోజున దేహం వదిలేసాం. ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడు తప్ప మిగిలినవన్నీ అలాగే చేస్తాయి. పుడతాయి, ఉంటాయి, పోతాయి. ఒక్క మానవుడికి మాత్రమే ఒక విచక్షణాధికారము, విస్తృతమైనటువంటి శాస్త్ర పరిచయాన్ని, శాస్త్ర అధికారాన్ని పొంది జీవితంలో ఆచరించటానికి అవకాశమైన ఒక జీవన వేదిక ఇవ్వబడింది కాబట్టి మానవులు దాన్ని తన జీవితం యొక్క పరమార్థాన్ని ఎరిగి తదనుగుణంగా జీవించాలని చెప్పడానికి భారత, భాగవత, రామాయణ, భగవద్గీతలు మహాత్ములంతా మనకి అప్పజెప్పి వెళ్లారు. సరే, వ్యాసులవారు అష్టాదశ పురాణాలు రాశారు. అన్నీ కలిసి ఒక పెద్ద ముద్దగా ఉన్నటువంటి జ్ఞాన వేద రాశి ఏదైతే ఉన్నదో దానిని మూడుగా విభజించి, ఆ మూడు ఏమిటి అంటే ఒకటి సామవేదము, రెండవది ఋగ్వేదము మాట, మూడవది యజుర్వేదము ధర్మకాండ. కాబట్టి ఈ మూడు వేదాల నిండా సామవేదము పాటై, ఋగ్వేదము మాటై, యజుర్వేదము ఆటై అంటే పాట, మాట, ఆట. ఈ మూడు కాగా ఇంకా కొన్ని వేద భాగాలు మిగిలిపోయినప్పుడు అక్కడే ఉన్నటువంటి అథర్వణ మహర్షి వచ్చి "వీటిని ఏం చేద్దాం? ఇవి కూడా లోకానికి కావాలి కదా, అన్నీ పనికొచ్చేవే కదా" అని అన్నప్పుడు వాటిని మీ పేరు మీద ప్రపంచంలోకి తీసుకువెళ్లి మీకు తోచిన రీతి జగత్తుకు పరిచయం చేయండి అని చెప్పారు. కనుక నాల్గవ వేదము అథర్వణ వేదమైంది. నాల్గవ వేదము అథర్వణ వేదమైన వేదార్ధించాల. ఉపనిషత్తులు తెలియటలే, బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పడానికి ఇంకెవరూ రాలే.ఉన్నాయి అని మాత్రమే వేదవ్యాసుల వారు చెప్పారు. ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని అయిపోయినారు ఆయన. ఆయనకి టైం అయిపోయింది. ఇక దాంతో పాటుగా, ఇవన్నీ కూడా ఈ కర్మకాండ హిత, నిహిత, సన్నిహిత కార్యక్రమాలన్నీ జగత్తుకి ఎవరు చెప్పాలి? అని అనుకున్నప్పుడు వేదవ్యాసుల వారు వాఙ్మయ స్ఫూర్తిగా ఆయన ఈ జగత్తులోకి వచ్చి ఈ త్రయీవిద్య, వేదవిద్య అంటే మూడు వేదాలతో కూడినదే త్రయీవిద్య. వాటిని చెప్తూ నాలుగవది అధర్వణ వేదానికి వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఆయన అనుకున్నారు. ఇట్లా కాదు మానవుడి యొక్క అపారమైన మేధాశక్తి తరాలు మారుతూ వెళుతున్నప్పుడు అది పెరగాలి. మేధాశక్తి నెమ్మదిగా తగ్గిపోతున్నది గనుక జన బాహుళ్యానికి అర్థం అయ్యేట్టుగా ఒక ఇతిహాసాన్ని, ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పడమే ఇతిహాసం. ఆ ఇతిహాసాన్ని భారతంగా రచించి ఆయన ఒక ప్రమాణం చేశారు దానిలో. ఏమిటి ఆ ప్రమాణం అంటే, భారతంలో ఏమున్నదో అదే లోకంలోనూ ఉంటుంది. లోకంలో ఏమి ఉన్నదో అది మాత్రమే భ-భారతంలో ఉంటుంది. కనుక భారతము నా దృష్టిలో పంచమవేదము అన్నాడాయన. కాబట్టి భారతం పంచమవేదం అయింది. భారతం రాశారు. తర్వాత అష్టాదశ పురాణాలు రాశారు. ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న వేదాలు విభజన చేశారు. విష్ణు సహస్రనామం చేశారు. ఇవన్నీ చేసి భగవద్గీతని ఒక పక్కన యోగీశ్వరుడు అయిన కృష్ణుడు పక్కన ధనుర్ధారి అయినటువంటి అర్జునుడికి బోధిస్తే, సూక్ష్మ శరీరంలో ఉండి ఏడు వందల శ్లోకాలు ఆయన గ్రంథస్తం చేశాడు. అందుకే ఆర్ధాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం. వ్యాసేన గ్రథిత పురాణ మునినా, పురాణ మునీన. పురాణ అంటే సనాతనమైన ముని, మౌని. ఎవరు ఆయన అంటే వ్యాసుల వారు. గ్రథిత, గ్రంథస్తం చేశాడు. కనుక ఇది అద్వైతామృత వర్షిణి అమ్మ యొక్క స్వరూపము అని ఆ మన భగవద్గీత గురించి చెప్పినప్పుడు భగవద్గీతను ఎవరు రాశారు అంటే కృష్ణుడు రాయలా, అర్జునుడు రాయలా. మరి ఎవరు రాశారు అంటే వ్యాసులవారు రాశారు. విష్ణు సహస్రనామం ఎప్పుడైతే భీష్మాచార్యులవారు అంపశయ్య మీద తన ఎదురుగా కూర్చున్నటువంటి, నుంచున్నటువంటి కృష్ణ పరమాత్మను చూస్తూ కృష్ణ పరమాత్మలో ఉన్న మూలమైన మహావిష్ణువు యొక్క దర్శనాన్ని నాలుగు చేతులతో ఉన్నటువంటి మహావిష్ణువుని దర్శనం చేస్తూ విష్ణు సహస్రనామం చదువుతున్నాడు. చదివినప్పుడు అది ఆయన వెన్నెముకలో నుంచి పుట్టింది అది. అందుకనే దానికి సుషుమ్నా గీతము లేదా ఆత్మ గీతము అని పేరు. ఆ సమయంలో మరి కృష్ణుడు రాశాడా? మరణించబోతున్న భీష్ములవారు రాశారంటే అది రాసినవారు మళ్ళీ వ్యాసులవారే. ఇంత రాసినప్పుడు మనం ఒకటి రెండు పుస్తకాలు రాస్తాం, అనుకుందాం. అబ్బో చాలా గొప్ప రచయిత అండి, అద్భుతంగా రాశాడు అని అంటాం. మనం కూడా పొంగిపోతాం. పొంగేవాడు పొంగుతాడు. కానీ వ్యాసులవారు చింతాక్రాంతుడై కూర్చున్నాడు. ఆయనకి ఎక్కడో ఒక లోటు కనిపించింది. ఆ లోటు ఎంతగా ఉన్నదంటే విచారగ్రస్తం చేసింది. ఏంటి ఇంత రాశాను ఇంకా ఏదో నేను ఈ జగత్తుకి అందించాలి. ఎలా అందించాలి? ఏమి అందించాలి? ఎవరైనా వచ్చినా గనుక మార్గోపదేశనం చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఆ క్షణంలో వచ్చిన వారే నారదులవారు. వచ్చి, "వ్యాస మహాముని మీరు ఎందుకు ఇలా దిగులుగా ఉన్నారు?" అని అడిగినప్పుడు ఆయన అన్నారు, "ఇదిగో ఇవన్నీ రాశా, రాసిందంతా బాగుందంటున్నారు లోకం. కానీ నాకెక్కడా మానసికంగా శాంతి లేదు, ఆనందం కలగటం లేదు. నన్నేం చేయమంటావు?" అని అడిగాడు. "నువ్వు ఇటు భాగవతం నిండా, భారతం నిండా, అటు భగవద్గీత నిండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లౌకిక జ్ఞానాన్ని భారతంలో, పారలౌకిక అనంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవద్గీతలో చెప్పావు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యాన్ని కానీ, లీలా వైభవాన్ని కానీ నువ్వు ఆంతరంగికంగా ఇంకా అనుభవించలేదు, దర్శించలేదు. కనుక భాగవతులందరు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులందరి కథలు కలిపితే అది భాగవతం అవుతుంది. దానికి సూత్రధారి, పాత్రధారి శ్రీ మహావిష్ణువు గనుక అది భాగవతం అనేటువంటి ఒక రచన చెయ్యి" అని చెప్పారు. అంటే భాగవతం అంటే కేవలం విష్ణువు కథ కాదు, కేవలం భక్తుల కథ కాదు. భక్తులతో కూడిన భగవంతుని కథ, భగవంతునితో కూడిన భక్తుల కథ. అందుకే భగవాన్ సత్యసాయిబాబా వారు ఏనాడో ఒక మాట చెప్పారు. "భగవంతుడు భక్తులు లేకా భగవంతుడు లేడు. కానీ అట్లే భగవంతుడు లేకా భక్తులు కూడా లేరు. ఇది అవినాభావ సంబంధము, ఇది నా భావ సంబంధము" అని చెప్పారు స్వామి. అంటే భక్తులు లేకపోతే దేవాలయానికి ఎవరూ వెళ్ళకపోతే ఆ దేవాలయం ఎలా శిథిలమైపోతుందో, భగవంతుని యందు ఆరాధనా స్ఫూర్తి గనక లేక మనం వెళ్ళకపోయినట్లయితే ఆ భగవంతుడు కూడా ఎవరికీ అక్కర రాకుండా ఉండిపోతాడు గనుక ఈ భాగవత భగవంతుల యొక్క సంబంధము ఒక అపూర్వ సంబంధం. అందరి వలన అందరి కొరకై వచ్చినది కాదు, అందుకోగలిగినది కాదు. కాబట్టి అప్పుడు ఆయన అనుకున్నారు వ్యాసులవారు ఏం చేయాలి అనుకున్నారు. అనుకొని సరస్వతీ నదీ తీరానికి వెళ్లారు. ఒక రేగు పళ్ళ తోటలో కూర్చున్నారు. కూర్చొని భాగవత రచన ప్రారంభించారు. ఇక్కడ ఒక చిన్న విషయం. వ్యాసులవారు...ఒక third dynamics అంటాం మనం మూడవ dimension అదేమిటంటే మహా చిచ్ఛక్తి ద్వాపర యుగాన్ని ఆవేశించవలసి వచ్చినప్పుడు కాల కార్య కారణ కర్తవ్య సంబంధం చేత ఒక చైతన్యమే మూడు భాగాలై వచ్చి మూడు రూపాలు తీసుకొని కానీ మూడు ఏక నామంతో వచ్చినాయి. ఆ ఏక నామమే కృష్ణ అనేటువంటి శబ్దం. ఆ ఎప్పుడైతే చిచ్ఛక్తి మూడుగా విభజించబడిందో తొలి భాగానికి మనం చెప్పుకునే యోగీశ్వర కృష్ణుడు ఆయన పేరు కృష్ణ. వ్యాసుల వారి పేరు కూడా కృష్ణ. ఆయన ద్వీపంలో పుట్టాడు గనుక ద్వైపాయనుడు అయినాడు. వ్యాసాలు అన్ని వ్యాసం అంటే విస్తృతంగా చెప్పాడు గనుక పదిహేడవ వ్యాసుల వారు గనుక వేదవ్యాసులవారైనారు. ఇదిగో ఈ భాగవత రచన రేగు పళ్ళ తోటలో చేశాడు గనుక బాదరాయనుడు అయినాడు. ఇన్ని పేర్లు ఉన్నా ఒక కృష్ణుడు కృష్ణుడు అయితే రెండవ కృష్ణ నామంతో వ్యాసులవారు వస్తే మూడవ చిచ్ఛక్తి ఒకటున్నది. మహాభారత సంగ్రామానికి కారణహేతువై, భూతమై, సర్వమై, శక్తివంతమై, అగ్ని పునీతమై, అగ్ని సంజనితమై వచ్చినటువంటి ద్రుపద రాజ కుమార్తె ద్రౌపది. ద్రౌపది ఆమె పేరు కాదు ఆమె పేరు కృష్ణ. కాబట్టి మూడు పాయలుగా వచ్చినటువంటి కృష్ణ శబ్దం ఒక్క ద్వాపర యుగాన్ని ఏలింది. అటువంటి ఈ కృష్ణ పరమాత్మ యొక్క లీలా వైభవాన్ని చెప్పాలి అని అనుకున్నటువంటి వ్యాసుల వారికి మార్గోపదేశం ఎవరు చేశారు అంటే నారదుల వారు చేశారు. శ్రీ మహా విష్ణువు యొక్క అవతారాలలో మూడవ అవతారం నారదుడు. సనక సనందనాదులు వీళ్ళంతా అనేక తర్వాత మనం చెప్పుకుంటాం. ఇవన్నీ వస్తే ఈ అవతారాలలో నారదుడు అంటే కలహ ప్రియుడుగా కలహ భోజనుడుగా మనకు పరిచయం అయినాడు. నారము అంటే జ్ఞానము ద అంటే ఇచ్చేవాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఎలా ఇస్తాడు? నారాయణ నిరంతర నారాయణ నామస్మరణం చేత, నారాయణ సంకీర్తనం చేత, నారాయణ మూర్తి భావన చేత, నారాయణ రూప భావ తత్వ అర్థములను తెలిసి ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి నారద మహాముని ప్రేరకుడు, కారకుడు, ప్రచోదితుడు అయినాడు. ఎవరికి? వ్యాసుల వారికి. చూడండి ఎవరైనా ఒక మంచి పని చేయాలంటే ప్రేరణ కావాలి. ప్రేరణ లేకపోతే chemistry లో కూడా catalyst లేకపోతే ఏం జరగవు. అది ఉండాలి. ఆ రసాయన చర్య కావాలి. అటువంటి ఈ భాగవతాన్ని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. నారదుల వారికి మనందరం కూడా మీరు మనసా నేను ఆ గురువుల పేర్లు చెప్పినప్పుడు మీరు ఏమి జయజయ ధ్వానాలు చేయకుండా నమస్కరించుకోండి మానసికంగా. ప్రథమ నమస్కారము ఎవరికి అంటే నారదుల వారికి. రెండవది శారదా దేవికి నమస్కరించాలి అంటే అమ్మవారు సరస్వతీ దేవి. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయు వీచి, సంధ్యా కపిశంభ లల్లిన జిగుల లోన, తాండవ శ్రీకమనీయ జాన్హవి ధరించిన, దేవుని గేహరూప మాలాకృతి, మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యెడు. అమ్మవారు లేకపోతే చదువే లేదు. అమ్మవారే లేకపోతే ఆత్మవిద్యే అర్థం కాదు. పలుకు బయటకు రాదు. వచనాదారిలో మాధుర్యము, నాగరికత, సంస్కారము, సంస్కృతి, భావ పుష్టి ఏదీ ఉండదు. కనుక మనందరం కూడా మనం మాత్రమే కాదు మనకి తెలిసిన ప్రతివారు ఈ జగత్తంతా కూడా వందనీయమైనటువంటి మాతృమూర్తి ఎవరు అంటే సరస్వతీ దేవి. మన పిల్లలకి నాలుగు రోజులు మాటలు రావటం గనుక late అయితే మనం వెంటనే doctor గారి దగ్గరికి వెళ్ళిపోతాం. మా అబ్బాయికి మాటలు రావటం లేదని. ఏం మాటలు రావాలి? తల్లీ నిన్ను తలంచి పుస్తకము చేతంబు నీతెన్ కదా! జృంభణముగా నుగ్గులు సుశబ్దంబు సోభిల్లన్ పలుకుము నాదు వాక్కున. మంచి మాటలు బయటకు రావాలి. బలంగా, దృఢంగా, గంభీరంగా, ఉదాత్తంగా, విస్తృతంగా కానీ లాలిత్యంతో కూడిన భాషా సౌందర్య వికసనంతో రావాలి. కనుక అమ్మవారికి రెండవ నమస్కారం. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఇటువంటి వాఙ్మయ సృష్టికి కారకులైన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ ఇవాళ పరాప్రకృతి ఏదైతే ఉన్నదో ఒక ఈశ్వర తత్వమేదో ఈశావాస్యోపనిషత్తు అంతా ఈ కనిపిస్తున్నటువంటి ఈ అనాత్మ అంతా, ఈ ప్రకృతి అంతా, ఈ చరచరంతమైనటువంటి ఈ జగత్తు అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి అమ్మవారికి నమస్కరించాలి. ఆ అమ్మవారు ఎవరో కాదు మనలను కన్న మన తల్లికి నమస్కరించాలి. ఆ తల్లి చనుబారంలో నుంచి వచ్చిన సంస్కారధార, దానిలో నుంచి వచ్చిన ఒక రూపం, దానిలో నుంచి వచ్చిన ఒక బలం, దానిలో నుంచి వచ్చిన ఒక ప్రేరణ, దానిలో నుంచి కలిగినటువంటి ఒక ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు అనబడేటువంటి ఈ త్రిపుటి వీటన్నింటికీ కారణం ఎవరంటే మన తల్లి చదువుకొని ఉండకపోవచ్చు గాక, మనకు degrees ఉండి ఉండవచ్చు గాక కానీ మనకు ఈ తనువుకి కారణం ఎవరంటే తల్లి మాత్రమే. కాబట్టి ఆ తల్లికి నమ--