Skip to content
Transcript తెలుగు
మూడు లేకపోతే తెలుగులో వాక్యం కూడా రాదు. English లో ఉంటుంది "He killed" అనేది చెప్తాడు. అని ఆపుతాడు comma పెడతాడు మళ్ళీ వాక్యం ప్రారంభం అవుతుంది. ఇక్కడ అట్లా కాదు. శ్రీరాముడు లంకకు వెళ్లి రాముని జయించెను. కా-కర్త, కర్మ, క్రియ. వాక్యం పూర్తయింది. ఇక్కడ కూడా మనం బ్రహ్మ సత్యాన్ని వాక్యం పూర్తి చేసినంత పరిమాణంలో మనం చేయాలి. చేయకపోయినట్లయితే మనం ఏదో ఎక్కడో ఒకచోట ఆగిపోతాం. ఏదో నామ జపం, మంత్ర జపం అది నాకు వచ్చేసింది, ఎవరో గురువుగారు ఇచ్చారు అవి చేసుకుంటున్నాం అంటారు. వాటి ఫలితాలు చాలా స్వల్పంగా ఉంటాయి. చాలా తక్కువగా ఉంటాయి. మరి సత్యమైనటువంటి, eternal గా ఉన్నటువంటి, actualize అయినటువంటి, realistic గా ఉన్నటువంటి, సత్యాన్ని సతతము ఉండేదాన్ని సత్యాన్ని ఎలా పట్టుకోవాలి అంటే, ఇదిగో మనం నిన్న అనుకున్నాం. సత్సంగము, సత్సాంగత్యము, సదాచారము, సమ్యక్ దర్శనము, సమ్యక్ సంకీర్తన, సద్భావన అలాగే అనేకమైనది జగత్తులోని స్వామి చెప్పిన ఒక మాట మనం ఎప్పుడూ చెప్పుకోవాలి. స్వామి లింగోద్భవం చేస్తారు. అందరికీ తెలుసు శివరాత్రి నాడు కదా! మనం అది చూస్తే మనకు మోక్షం వస్తుందని మనం నమ్ముతాం. అది నిజం అనుకుందాం. అసలు లింగం అంటే ఏమిటి? తెలియాలి కదా. లింగం అంటే ఏమిటి? లోట్లో నుంచి వచ్చింది కాదు కదా. వస్తువు కాదు కదా. లిమయతే గమయతే ఇతి లింగః. ఏది నడిపిస్తూ, నడిపిస్తూ, నడిపిస్తూ తనలో లీనం చేసుకుంటుందో దాని పేరు లింగము అని పేరు. లిమయతే, లోపలికి తీసుకునేది. ఎట్లా తీసుకుంటుంది? గమయతే, నడుస్తూ. దాని పేరు లింగము అన్నారు. లింగము ఎలా ఉంటుంది అంటే అంగము, జంగము, సంగము చివరగా లింగము అన్నారు స్వామి. అంగము, దేహం ఉండాలి. అంగము నెమ్మది నెమ్మదిగా ఒకటే కాదు అది సంగముతో కూడి ఉండాలి. ఇంకో వస్తువుతో కూడి ఉండాలి. అది ప్రపంచం. అంగము, సంగము అయింది. మరి దే-మూడో స్థాయి ఏమిటంటే జంగము అవుతున్నది. జంగము అంటే జడము అని. అంటే చైతన్యంగా ఉన్నటువంటి మన ఆత్మ జడాత్మకమైన దేహంలో ఉన్నది. చూశారా? విచారణలో శరీరం ఒకటి జడం, కట్టె. కట్టె లోపల జ్వజ్వల్యమానంగా చైతన్యంగా వెలుగుతున్న ఆత్మ ఉన్నది. మరి ఎట్లా? ఒక మన దగ్గర ఒక diamond necklace ఉంది. diamond necklace ని diamond పెట్టెలో పెట్టం కదా. చెక్క పెట్టెలోనో, తోలు పెట్టెలోనో ఎక్కడో పెట్టుకుంటాం అది పాడైపోకుండా. కాబట్టి container important కాదు content important. పెట్టె పోతే పోయింది నా నగ దక్కింది అంటాం. నగ ఆత్మ. దేహం పోతే పోయింది నా ఆత్మ నాకు అనుభవంలోకి వచ్చింది. లోపల ఉన్నటువంటి ఆత్మను మనం వదిలిపెట్టేసాం. అది ఏదో ఎవరో పండితులు కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారు అనుకుంటున్నాం. మాట్లాడుతున్నది ఆత్మే. మాట్లాడుతున్నది ఇక్కడ కూర్చున్న వ్యక్తి కాదు. వ్యక్తి మాట్లాడలేడు. ఆత్మే మాట్లాడుతుంది. ఆత్మ యొక్క reverberations, emanations లో నుంచి అనేకమైన అమృత భావాలు పరమేశ్వరుడు మన ఉపాధి ద్వారా, దేహం ద్వారా జడాత్మకమైన దేహం ఇది. ఏమున్నది అంతా జడమే కానీ దానిలో చైతన్యం ఉంది. అది ఆడుతుంది, పాడుతుంది, పద్యం చెబుతుంది, విశ్లేషణ చేస్తుంది. అన్నింటినీ మించి అంతా వింటుంది. విన్న దాన్ని register చేసుకుంటుంది. శ్రవణ, మనన, నిధిధ్యాసలలో విషయాన్ని పట్టుకుంటుంది. ఇదంతా కలిపితే దాని పేరు శ్రద్ధ. అటువంటి శ్రద్ధాదేవి అని ఒకటి ఉంది మనకి. దా-శ్రద్ధను కూడా దేవతగా భావించింది మన వేదం. అట్లాగే నిద్రాదేవిని కూడా "నిద్రాం సఖే కేవల కుంభకాం" అంటారు భగవత్పాదులు. నిద్రాం సఖే, నా చెలికత్తె. నా స్నేహితురాలు ఎవరంటే భార్య కాదు, ఇంకెవరో కాదు, ఎవరంటే నిద్రాం. మనం అంటాం బయటకు రాగానే రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడుగుతాం. రాత్రి బాగా అన్నం తిన్నారా అని ఎవడు అడుగుడుగా. నిద్ర పట్టిందా, సుఖంగా పట్టిందా అంటారు. ఎందుకంటే క్షణంలో సఖి ఎవరు? మనతో ఉండేది ఎవరు? మనల్ని లాలించేది ఎవరు? మన ఇంద్రియాలను చక్కగా నిగ్రహింపజేసేది ఎవరు? కలలు రాకుండా కాపాడేది ఎవరు? శరీరాన్ని శక్తిమంతం చేసేది ఎవరు? అంటే నిద్ర మాత్రమే. అందుకే వారు "నిద్రాం సఖే కేవల కుంభకాం". అది ఒక యోగం. కేవల కుంభక యోగం. కాబట్టి ఈ, బ్రహ్మము సత్యము, జగత్తు సత్యం అని గనక సత్-స-ఆ ఏది అసత్యంగా అనిపించుకున్న, మిధ్యగా అనిపించుకున్న జగత్తుని నీవు బ్రహ్మముగా, సత్యముగా భావించినట్లయితే వాక్యం పూర్తవుతుంది. అది వేరు, ఇది వేరు కాదు. జగత్తు మిధ్య, బ్రహ్మ సత్యము రెండు మాటలు కాదు. ఏది అసత్తుగా ఉన్నదో, ఏది అనాత్మగా ఉన్నదో, ఏది శాశ్వతం కాదని అనిపిస్తున్నదో, ఏది ఎక్కువ కాలం ఉండబోదని తెలుస్తూ ఉన్నదో దానిని ఆధారం చేసుకొని నువ్వు వెళ్ళాలి. సముద్రం దాటాలి అంటే మనిషి చేసిన ఓడ కావాలి. గాలిలో అక్కడి నుంచి ఇక్కడికి దిగాలి అంటే మనుషులు తయారుచేసిన విమానం కావాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఎవడో నడిపే బండి కావాలి. ఇవన్నీ లేవా, ఇదంతా మిధ్య అంటే బండి ఎక్కినంత సేపు ఉన్నంత సేపు మనది. దిగిన మరుక్షణం అదెవరో మనమెవరో. అంతేనా? బండి నెంబర్ గుర్తుందా మనకి? లేదు. బండిని నడిపిన వాడి పేరు గుర్తుందా? లేదు. ఇట్లా ఎన్ని బండ్లు ఎక్కాము? ఎన్ని దిగాము? ఎన్ని స్థానాలకు చేరుకున్నాము? ఇంకా ఎన్ని చేరవలసి ఉన్నదో. కాబట్టి ఇది బ్రహ్మమై, సత్యమై, real realistic pragmatism తో కూడి ఉన్నటువంటి అతి వాస్తవిక దృక్పథంతో ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే బ్రహ్మము మరొక చోట లేదు. బ్రహ్మము ఉన్నదంతా బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మమే అనే దాంట్లో ప్రతి ఒక్క వస్తువు అది జడము, అజడము, పశువు, పక్షి, క్రిమి, కీటకము ఇవన్నీ కూడాకేవలం బ్రహ్మ స్వరూపాలుగా మనం భావన చేయాలి. వృద్ధంలో నమక చమకాలు దాటిన తర్వాత రుద్ర భాగంలో చెప్పేదంతా కూడా ఇదే. చండీ యాగంలో వాళ్ళు చెప్పే మంత్రాల యొక్క సారమంతా ఇదే. వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు వాళ్ళు క్రతువు చేస్తారు అది కర్మకాండ, ఇది జ్ఞాన కాండ. జ్ఞాన కాండలో కర్మకాండ అవసరం లేదు. ఏం కావాలంటే కర్మకాండ అంతా అయిపోయిన తర్వాత కావలసినదే జ్ఞాన కాండ. కానీ కర్మకాండ ద్వారా మాత్రమే జ్ఞాన కాండ వైపు వెళ్ళగలం. ఇది link. అక్కడి దాకా వెళ్ళాక అది అవసరం లేదు. అంతే కదా! విమానం దిగాక విమానంతో మనకు పని లేదు. ప్రదేశం వదిలాక మనకు ప్రదేశంతో పని లేదు. అలాగే జీవుడు కూడా జగత్తును వదిలి పెట్టవలసిన రోజు వచ్చినప్పుడు జగత్తుతో పనే లేదు వాడికి. జగత్తుకి కూడా నీతో పని లేదు. ఎంత ఇదేమైనా గొప్ప సంబంధం అంటారా? మనకు అది అక్కర్లేదు, దానికి మనం అక్కర్లేదు. కానీ ఇదే నిజం, ఇదే మంచి, ఇదే నాది, ఇది నా ఇల్లు, నా పొలం, నా buildingలు మనం ఎంత వ్యామోహంలో ఇందువలన అవిద్యవలన ఏర్పడేదే జగత్తు. మాయ వలన జే-ఏర్పడేదే జగత్తు. ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇవాళ లలితా సహస్ర నామంలో ఐదవ కోడు గురించిన ప్రస్తావన కూడా ధారలో వచ్చింది గనుక ఒకటి చెప్తాను నేను. అది quantum physics ద్వారా తెలుసుకున్నటువంటి విషయం అది. quantum physics అంటే ఏమిటి? అదేమిటో వదిలిపెట్టండి. అది మా పని. లలితా సహస్ర నామంలో మొదటి ఐదు శ్లోకాలు ఐదు నామాలు పక్కన పెడితే అవి అమ్మవారి యొక్క స్థితిని చెప్తాయి. ఆరవ నామం నుంచి డెబ్బై ఒకటవ శ్లోకం వరకు అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తాయి, ఆవరణలు చెప్తాయి, పరివారాన్ని చెప్తాయి, ఆమెకు ఉన్నటువంటి రాసరిక వ్యవస్థను గురించి చెప్తాయి. మరి ఇంతకీ లలితా సహస్ర నామం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అంటే డెబ్బై ఒకటవ శ్లోకం దగ్గర ప్రారంభం అవుతుంది. అక్కడ అమ్మవారి పేరు భోరేశ్వరీ దేవి అది. భోరేశ్వరీ దేవి జగజ్జనానంద కరీం జయాఖ్యాం. ఆమె జగత్తుకి జనానికి ఆనందం కలిగిస్తుంది. ఆమె పేరు అక్కడ లలిత కాదు, భువనేశ్వరీ కాదు జయాఖ్యాం. జయ అనే పేరుతో ఉంటుంది. జితా మితా మిత్ర కృత ప్రపంచాంం. జయించబడిన స్నేహితులతో కూడి ఉంటుంది అమ్మవారు. ఆమెకు శత్రువులు ఉండరు అక్కడ. డెబ్బై ఒకటవ శ్లోకం దాకా అమ్మవారు శత్రువులను చంపడంతోనే మనం కంచవుతాం. అంతే కదా! తర్వాత ఇంకా ఆవిడకి శత్రువులు లేరు. శత్రువులు లేకపోగా జయించబడిన మిత్రులున్నారు. కాబట్టి అటువంటి భువనేశ్వరీ దేవికి నేను నమస్కరిస్తున్నాను అని అంటూ డెబ్బై ఒకటవ శ్లోకం, నామాలు మీకు గుర్తు చేస్తాను. మీకు వస్తే మీరు కూడా అనండి. రాజరాజార్చిత రాణ్యీ రమ్యా రాజీవ లోచనా రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా. అసలు అగస్త్యుల వారు బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుల వారు వీళ్ళంతా ఎలా ఇవన్నీ నిర్మాణం చేశారు మనకి? మనం ఎంత ఋణపడి ఉన్నాం వాళ్ళకి అని అనిపిస్తుంది. రాజరాజార్చిత రాజరాజు ఎవరు? శివుడు రాజరాజు. శివుడు ఎవరిని పూజిస్తాడు అంటే లలితా దేవిని పూజిస్తాడు. రాజరాజార్చిత రాణ్యీ రాణి, రాణి అంటే మహారాణి. శివుడికే ఆమె భార్య. చూశారా! ఆయన రాజు రాజరాజు అయితే ఈమె రాణి అయింది. రాజరాజార్చిత రాణ్యీ రమణి. ఆమెను తలుచుకోగానే ఒక ఆనందం కలుగుతుంది. సౌందర్యాన్ని చూసినప్పుడు, అలంకారం చేసినప్పుడు అది photo లో ఉండొచ్చు, frame లో ఉండొచ్చు కానీ లలితా దేవి బొమ్మను చూస్తుంగనే-- చూస్తుండగానే రమణి, సౌందర్యం అక్కడ కూర్చున్నట్లుంది. రస్యా. రంజనీ రమణి రస్యా. రంజింపజేస్తుంది మనస్సుని. చివరి పదం చాలా గొప్పది. అదేమిటంటే రణత్కింకిణి మేఖలా. మేఖలా అంటే వడ్డాణం. రణత్ అంటే యుద్ధంలో కింకిణి మూవ మోగినట్టుగా ఉంటుంది. ఆమెకు మూవ ఏమిటి? అది మోగటం ఏమిటి? యుద్ధం ఏమిటంటే మానవుడి జీవితమే పెద్ద రణరంగం. రణరంగంలో ఎవరైతే అధ్యాత్మను పట్టుకొని క్రీడలో, ఆటలో మహదానందాన్ని పొంది తాను కూడా తనువును తెల్లవార్చుకున్నప్పుడు మూవ, లోపల ఉన్నటువంటి శబ్ద బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది కింద నేల మీద పడి తరాపతనం అనే పదం వాడాను ఇందాక. నేల మీద పడిపోతూ ఉన్న సమయంలో అమ్మవారు మూవను తీసుకుంటుందట. యోగ్యుడైన, యోగ్యత కలిగినటువంటి సాధకుడు మూవ రూపంలో ఉంటే మూవను తీసుకొని తన వడ్డాణంలో పెట్టుకుంటుంది. అమ్మవారి వడ్డాణం చేరటమే ఓడ్ଯ్యాన జాలంధర మూల బంధాన్. అంటే అక్కడికా ఓడ్ଯ్యానం దాకా వెళ్ళాలి. అంటే ఓడ్ଯ్యానం తర్వాత ఉన్నదంతా ఊర్ధ్వలోకం. వడ్డాణానికి కింద ఉన్నదంతా పృథ్వీ లోకం. అందుకనే బంగారం కూడా బొడ్డు దాటి కింద ధరించకూడదు. బొడ్డు పైన ఉన్న ఊర్ధ్వ లోకంలోనే సువర్ణాన్ని ధరించాలి. మనకి డబ్బుంది కదా అని బంగారపు కాలి మెట్టలు చేయించుకోకూడదు, ధరించకూడదు. ఎందుకంటే కాలి మెట్టలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలవి. వాటిని అలాగే ఆరాధన చేయాలి. కాబట్టి దేవీ శక్తిని, దేవీ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక్క శ్లోకం గనుక మీ అందరికీ వచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా అంటే పౌరా-- ముఖ్యంగా పౌర్ణమి నాడు రాత్రిపూట, ఇవాళ ప్రతి ఇంటికో terrace ఉందిగా.ఆ Terrace లో కూర్చొని చంద్రుడు పూర్ణ బింబం వచ్చిన తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకుని పాలు గనక అక్కడ పెట్టి మూత పెట్టకుండా కాచకూడదు పచ్చి పాలు పెట్టుకుని ఒక్క డెబ్బై ఒకటవ శ్లోకాన్ని రాజరాజార్చితా రాజ్ఞి రమ్యా రాజీవ లోచనా రంజని రమణి రష్యా రణత్ కింకిణి మేఖలా రెండు వందల యాభై ఆరు సార్లు గనక చదివినట్లయితే మొత్తము లలితా సహస్ర నామాన్ని తొమ్మిది వందల కోట్లు చేసినటువంటి శక్తి మనకు కలుగు తొమ్మిది వందల కోట్లు మానవుడు చేయలేడు. అందుకని ఇందుక మరి దీన్ని ఎందుకు ఎన్నుకున్నారు? దీనిని Quantum Physics లో Work Out చేస్తే సంఖ్యా శాస్త్రం ప్రకారం భారతీయ సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక్కొక్క బీజాక్షరానికి Potency ఉంది Potency ఎంత Calculate చేస్తే తొమ్మిది వందల కోట్ల నామ జపం చేసిన ఫలితం మనకి కలుగుతుంది అని. అట్లా చేయటం వలన చాలా సమయం కలిసి వస్తుంది మిగతాదంతా లలితా సహస్ర నామంలో వర్ణన ఎక్కువ అలాగే చివరి చివరిగా అమ్మ వైభవాన్ని చెప్తాం వీటన్నింటికీ మూలమైనటువంటి భువనేశ్వరీ మంత్రానికి భువనేశ్వరీ మంత్రం చదువుకొని రాజరాజాచితా గనక చదువుకున్నట్లయితే అది పౌర్ణమి నాడే కాదు మామూలు రోజుల్లో కూడా కాసేపు చదువుకోవచ్చు. నేను దాన్ని Calculate చేశా మొదట్లో Twenty Two Minutes పడుతుంది నోటికి బాగా వచ్చి వేగం రెండు వందల యాభై సార్లు చదవగలిగిన స్థితి ఏర్పడినప్పుడు కేవలం పదహారు నిమిషాల్లో ముగిసిపోతుంది. పదహారు నిమిషాల్లో స్త్రీమూర్తులు మీరంతా చదువుకోండి మీ ఇంటికి మీ ఒంటికి మీ బిడ్డలకి మీ ఆరోగ్యానికి అక్కడ జగద్రక్షణి అయినటువంటి అమ్మ దేవి మీకు రక్షగా ఉంటుంది ఇది సత్యం. సత్యానికి మీకు రెండు ఉదాహరణలు చెప్తాను నేను ఒకటి మొట్టమొదటిసారి ఇలాగే ఏదో ప్రసంగ వశాత్తు శ్లోకం స్పురణకు వచ్చి దాన్ని Explain చేస్తే శ్రీకాకుళం జిల్లాలో చెప్పాను ఇది. నేను రోజున మాట్లాడుతున్నాను అని శ్రీకాకుళం జిల్లాలో సత్య సాయి Organization ఎవరైతే కంది నారో ఎవరో ఉన్నారు ఆయన, ఆయన ఏం చేశారంటే శ్రీకాకుళం జిల్లా మొత్తం Cell Phones లో దీన్ని Connect చేసి అదే Time లో దీన్నంతా మీరు వినండి విని మీరు ఆచరించండి అని వాళ్ళు అనుకున్నారు. అప్పటివరకు శ్రీకాకుళం జిల్లా చాలా వెనకబడిన ప్రాంతమై అక్కడ పంటలు ఉండేవి కాదు వానలు లేవు వరదలు ఎక్కువ నాగావళి ముంచెత్తేసేది అటువంటి పరిస్థితుల్లో దిక్కు తోచని పరిస్థితుల్లో ఇది జరిగి ఒక ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది నామాన్ని వాళ్ళు నమ్మారు ఎందుకు నమ్మారంటే వాళ్ళకి కష్టాల పరంపర ఆదుకునే వాళ్ళు లేరు రోజులు గడవటం కష్టమైపోయింది శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఏళ్ల క్రితం సంగతి. ఎప్పుడైతే దీన్ని చేశారో ఏడాది తిరక్కుండా ప్రకృతి అంతా కూడా సమస్థితికి వచ్చేసింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా అనే మాట మర్చిపోయాం అందరం అది చాలా ముందుకు వెళ్ళిపోయింది. అలాగే ప్రస్తావన తెలుసుకొని నేను గుంటూరులో కూడా విషయాన్ని చెప్పినప్పుడు ఐదు సంవత్సరాలు చేశారు మీ బోటి వాళ్ళందరూ కూర్చొని ఇది ఒక్క శ్లోకమే. ఐదేళ్లలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినయి అద్భుతాలు అంటే కార్పణ్యాలు కక్షలు అనేకమైన ఇబ్బందులు ఉండేవి అవన్నీ సమసిపోయినాయి. మళ్ళీ ఐదేళ్లు అయిపోయింది అంతా బాగుంది అనుకునే లోగా మళ్ళీ గుంటూరు జిల్లా వాళ్ళు కూడా మళ్ళీ చదవవలసిన పరిస్థితి వచ్చింది అది వేరే సంగతి. అంటే అంతా సమస్థితికి రావాలి మీరు చదవండి Two Fifty Six Times చిన్నపిల్లలు గనక చదివితే వాళ్ళకి ధారణా శక్తి పెరుగుతుంది ఇంకాస్త కొద్దిగా పెళ్లి కావాల్సిన వయసు ఉన్న వాళ్ళు గనక వస్తే జీవితం మంచి భద్ర జీవితం కలుగుతుంది మధ్య వయస్కులకి జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది వృద్ధాప్య వృద్ధాప్యంలోకి వెళ్ళినటువంటి వృద్ధ జీవులకి ఇక మరణాన్ని గురించిన భయం ఉండనే ఉండదు మళ్ళీ తల్లి ఒడికి చేరుతాం అనేటువంటి భావన కలుగుతుంది నిజానికి ఇది మొత్తము కలిపితే దేవీతత్వంగా మనం భావించాలి. కాబట్టి రాజరాజార్చితా మీరు ఎలాగూ తొమ్మిదవ తారీఖు ఎక్కడ ఉంటారో ఉండరో తొమ్మిది పౌర్ణమి పౌర్ణమి దాటిపోయినా లేదా ఇళ్ళకి చేరుకుంటే రోజునే దీన్ని ప్రారంభించండి. దీనికేం నియమం లేదు నిష్టలు లేవు మీ ఇంట్లో మీరు కూర్చోండి పౌర్ణమి ఎప్పుడో నెలకోసారి వస్తుంది మరి అందరూ ఖాళీగా ఉన్న సమయంలో ఇంట్లో కూర్చొని రెండు వందల యాభై ఆరు సార్లు ముందు లెక్క తర్వాత రెండు వందల యాభై మూడు అయితే ఏమవుతుంది అని అడక్కండి రెండు వందల యాభై ఏడు చదివితే ఏమవుతుంది అని ఏమీ కాదు రెండు వందలే చదవండి. కానీ రెండు వందల యాభై ఆరు అది ఒక లెక్క అది మేము Conclusion కి వచ్చాం కాబట్టి ఇవాళ జగత్తు మిథ్య అనుకుంటూనే బ్రహ్మ సత్యము అనుకుంటూనే మిథ్యగా ఉన్నటువంటి జగత్తు ద్వారానే అవిద్య ద్వారానే విద్యకి అజ్ఞానం నుంచి జ్ఞానానికి చీకటి నుంచి వెలుగులో నుంచి మరణం వెలుగులోకి మరణంలో నుంచి మళ్ళీ జననంలోకి జీవుడు ప్రస్థానం చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉంటాడు అలా వచ్చిన వాళ్ళమే మనందరం కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా ఇది పంచమ అధ్యాయంలో పంచమ స్కంధంలో ప్రధానంగా భాగవతంలో వ్యాసులవారు Discuss ఇంత ఇంత విస్తృతంగా చేయలేదు అది కూడా చాలా చిన్నది చిన్నదే గాని Potency ఎక్కువ. అనేక విషయాలు ఉన్నాయి వాటన్నింటిని మనం ఇవాళ చాలా వరకు మాట్లాడుకోగలిగాం వాటన్నింటిని మీరు అర్థం చేసుకోండి భాగవత కథలు చెప్పటం మానేయండి చదివే వాళ్ళని తరం వచ్చినప్పుడు లేండి చదువుకొనివ్వండి ఇది కథ చదివే వయస్సు కాదు కథలో సారాన్ని గ్రహించి ఉన్న డెభై ఏళ్ళ వ్యక్తికి వచ్చింది అనుకుంటాం అతనికి One Hundred Years ఆయుష్షు అనుకుంటాం Seventy Percent అయిపోయింది కదా ఇక మిగిలింది ముప్పై Percent ముప్పై Percent లో చివర చివర ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు Thirty Percent నన్నా డెభై ఏళ్ళ వాడు కాపాడుకోవాలి.అట్లాగే ఒక ఇరవై ఏళ్ల వ్యక్తి పురుషుడు గాని స్త్రీ గాని ఇరవై ఏళ్ల అప్పుడే గనుక ఇది మొదలు పెడితే ఎనభై ఏళ్లు సాధన చేయటానికి జీవితాన్ని నందనవనము బృందావనము చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరమేశ్వరుని మించి పరమేశ్వరుడు లేకుండా జగత్తు లేదు. అసలు జగత్తే పరమేశ్వరుడు. జగత్తులో జగదీశ్వరుడు మన యందు ఉంటాడు జీవుడు జగత్తు జగదీశ్వరుడు కలిపితే మూడు కలిపితే దాని పేరు త్రిపుటి. త్రిపుటి మనం గనక అర్థం చేసుకోగలిగినట్లయితే జగత్తును నిరసించకండి జగత్తు ఉంటుంది ఇది ఇలాగే ఉంటుంది. ప్రపంచం మంచిదా చెడ్డదా అని భగవాన్ రమణ మహర్షిని ఒకాయన అడిగారు. నీ మనస్సు నీ ఆలోచనను బట్టి ప్రపంచం మంచిదిగా కనిపిస్తుంది మళ్లీ నీ ఆలోచనను బట్టి అదే ప్రపంచమే చెడ్డదిగా కనిపిస్తుంది. దుర్యోధనుడిని ధర్మరాజుని పిలిచి భీష్ముల వారే పిలిచి నాయనా మీరు రాజులు కావలసిన వాళ్ళు మీరు ప్రపంచంలోకి వెళ్లి ప్రపంచం ఎలా ఉందో చూసి నాకు చెప్పండి అన్నారు. ప్రపంచం అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం వెళ్లారు. దుర్యోధనుడు ధర్మరాజు గారి కంటే ముందు అంగలు వేసుకుంటూ వచ్చాడు తాతా ప్రపంచంలో నాకు ఒక్క మంచి వాడు కనపడలేదు అన్నాడు. ఐదు నిమిషాల్లో ధర్మరాజు వచ్చాడు నాయనా నీకేమనిపించింది అని నాకు ఒక్క చెడ్డవాడు కనపడలేదు ఎందుకంటే అందరూ మంచిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు దైవాన్ని కొలుస్తున్నారు తలుస్తున్నారు తాతా అంతా నాకు మంచే కనిపించింది అంటే మరి వాడికి చెడు కనిపించింది అంటే నేను చూడలేకపోయినా నా కంటికి కనపడలేదు అన్నాడు. యద్భావం తద్భవతి మనం ఎలా భావిస్తే ప్రపంచం మనకు అలా కనిపిస్తుంది. ఒక వ్యక్తి అయినా సరే మనం రాయిని అక్కడ వెళితే రాయిని మనం దైవంగా భావించే జాతి కదా. రాయి లేదు అరణ్యంలోకి వెళుతున్నాం ఇలాగే పౌర్ణమి పూజ వచ్చింది అక్కడ రాళ్లు కనపడటం లేదు అయ్యో మనం తెచ్చుకోవాల్సిన లింగం తెచ్చుకోలేదు గణేషుడి బొమ్మ లేదంటే పసుపుతో ఉన్నా చేస్తే సరిపోతుంది కదా అంటాం పసుపు మర్చిపోయినాం మరి ఏం చేయాలి ఏది ఉన్నా లేకపోయినా తిండి కోసం కొంత బెల్లం ముక్క ఉంటుంది కదా తమలపాకు లో బెల్లం ముక్క పెట్టి దాన్నే గణేషుడు అనుకోమని చెప్పింది. మనకి ఎన్ని liberal అవకాశాలు అది ఇచ్చింది వేదం సనాతన సంప్రదాయం సనాతనమైనటువంటి ఒక ధర్మం వీటన్నింటిని మనం చక్కగా అర్థం చేసుకుని జీవితాన్ని సౌభాగ్యవంతము ప్రసన్నమయము ఆనంద సంధాయకము ఆనంద రసతుందిరము భగవద్భక్తి భావమయము సత్సంకల్పమయము సత్సాంగత్యమయము నిరతిశయంతో చేసుకునే దిశగా సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మనందరినీ భద్రంగా నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 21:09

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

    Now playing
  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22