Skip to content
Transcript తెలుగు
నిన్న చెప్పుకున్నాం కంటితో దేనిని చూడాలో దాన్నే చూడాలి చెవితో ఏది వినాలో అదే వినాలి అట్లాగే నోటితో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇంద్రియాలు మనకు అధీనమై ఉంటాయో విధిగా జరుగుతాయి అవన్నీ లేకుండా నన్ను ఇంద్రియాలు ఏం చేయవు అనేటువంటి దేహ బలంతో ప్రవేశించిన గజరాజు ఎవరంటే తెలిసో తెలియకో అహంబలనో అహంకారం వలననో అవిద్య వలననో అస్పష్టత వలననో అనాచారం వలననో మడుగులో వంటి సంసారంలో దిగిన మన బోటి జీవుడు వెళ్ళిన తర్వాత సంసారం పట్టుకోక మానదది లోపలికి వెళ్ళాం నీళ్ళలో ఉన్నాం ఎక్కడ బలమైన శక్తి ఉంటుందో బలహీనమైన శక్తిన అది పట్టుకుంటుంది అది order సృష్టిలో చిన్న జంతువుని పెద్ద జంతువు బలహీనమైన జంతువుని బలవంతమైన జంతువు ఎట్లాగైతే కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయో అదే నిజానికి గజేంద్ర మోక్షడంలో జరిగిన గొప్ప సందర్భం సరే ఇక లోపల ఉన్నటువంటి ఇంద్రియాలతో ఏర్పడినటువంటి రక్తం మొత్తం పోతే తప్ప భగవంతుడు కనపడ్డా జంతు స్థాయిలో అంతే దానిలో annual residual animal instincts అంటాం ఇంకా పశు ప్రవృత్తి మనలో కనుక ఉన్నట్లయితే మనకు కూడా కలుషిత రక్తం పోవాలి కలుషితమైనటువంటి రక్తం పోనంతవరకు మన వాసనలు మన అహంకారాలు మనకు ఉండేటువంటి మమకారాలు లేకపోతే బంధనాలు అది కావాలి ఇది కావాలి అన్నటువంటి ఆశాపాశాలు వ్యామోహాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మడుగుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి చక్కగా తెల్లగా ఉంచుకోండి హాయిగా ఉంచుకోండి అక్కడ అయిన తర్వాత నువ్వు ఏమి ఇవ్వలేకపోయినా మన దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి పరమేశ్వరుడికి హృదయ పుష్పాన్ని గనక ఆయనకి అప్పజెప్పేసినట్టయితే అది చివరలో కాక మొదట్లోనే ఇచ్చినట్లయితే చాలా అద్భుతమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది మన జీవితాన్ని మనం నడపం మనం గడపం భగవంతుడు నడిపిస్తాడు అనేటువంటి భావన రాగానే మనలో ఒక తాత్వికమైన విచారధార ప్రారంభం అవుతుంది మనసు మార్ధవం అవుతుంది ఒక లాలిత్యాన్ని పొందుతుంది ఒక సంతృప్తికరమైన జీవితాన్ని పరితృప్త పరిణామ క్రమానికి నోచుకునేటువంటి జీవితం మనకు కలిగినప్పుడు మనం మడుగులో ఉన్నా మనకి ప్రమాదం లేదు మడుగులో దిగక తప్పదు మీరెవరూ సంసారంలోకి రావద్దు అందరూ ఒడ్డునే ఉండండి అంటే సంసారం నడదు సంసారం అంటే ప్రపంచం సంసారంలో ఒక భాగమైనటువంటి మడుగులో మనం ప్రవేశించినప్పుడు దానిలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి మూడు మునకలు వేసినా మనకు గో-గోమతి నదిలో ఏం కాలేదు కాబట్టి ఇంకా బాగా పుణ్యం వస్తుందని ముప్పై వేస్తే కుదరదు మనకు తెలుసు కదా ఏమవుతుందో కాబట్టి ప్రతి దానికి ఒక పరిమితి ఉన్నది పరిమితిని అర్థం చేసుకొని జీవించడమే స్పష్టమైనటువంటి జీవితం that is what we call in english clarity and conviction రెండూ ఉన్నవాడు జీవితంలో ఎక్కడా నిరాశకు గురికాడు నిజానికి జీవితంలో ఓడిపోడు కూడా ఆశాభంగం కలగదు ఆశాభంగం ఎందుకు కలగదు అంటే ఆశ లేదు గనుక ఆశే ఉంటే భంగం కావచ్చు ఆశే ఉంటే నిరాశ పుట్టొచ్చు అసలు ఆశే లేనప్పుడు ఏమవుతుంది అంటే ఏమీ కాదు హాయిగా ఉంటాడు ఇక భగవంతుణ్ణి మన దగ్గరకు రప్పించుకోవటమా భగవంతుడే మన దగ్గరికి రావటమా అనే మీమాంస ఏర్పడినప్పుడు మన ఆర్తిని బట్టి మన ఆర్ద్రతను బట్టి మన జన్మ సంస్కారాన్ని బట్టి మన యోగ్యతను బట్టి అర్హతను బట్టి ప్రాప్తిని బట్టి మన అవసరాన్ని బట్టి భగవంతుడే ఎప్పుడో మన దగ్గరికి వచ్చాడు మనం భగవంతుని దగ్గరికి ఒక్కసారే వెళ్ళగలం తనువు చాలించిన తర్వాత చేరగలం కానీ ఎప్పుడు వచ్చినా భగవంతుడే ప్రశాంత నిలయంలో చూడండి మిగతా ప్రదేశంలోనైనా సరే వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలి గురువు గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి queue లో వెళ్ళాలి అంతే కదా వెళితే ఆయన ఏదో మంచి మాట చెప్తారు ఆశీర్వచనం ఇస్తారు ఆయన కూడా మంచి పనే చేస్తాడు కానీ ఒక్క పుటపర్తిలో మాత్రమే భగవంతుడే భక్తుడి దగ్గరికి నడిచి వచ్చారు డెబ్బై రెండేళ్ళు నడిచి వచ్చారు ఆయన ఒకరోజు రెండు రోజులు కాదు ఎక్కడ కూర్చుంటే ఇరవై వేల మంది ఉంటే ఇరవై వేల మంది మధ్యలోకి ఆయన వెళ్లారు అంటే భగవంతుణ్ణి మనం చేరుకోలేం మనంతట మనం ఇవన్నీ ఉంటే తప్ప ఇటువంటి యజ్ఞం జరగాలి ఇటువంటి మంచి మాటలు అనుకోవాలి వినాలి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి దానం ధర్మం చేయాలి ప్రశాంతంగా ఉండాలి వినయంగా ఉండాలి మార్ధవంగా ఉండాలి ఇవన్నీ ఉంటే అది పద్ధతి వేరు ఎప్పుడు పద్ధతి అవుతుంది ప్రతి దానిలో భగవత్ కార్యాన్ని మనం చూస్తాం అప్పుడు అటువంటి వారి దగ్గరికి భగవంతుడే నడిచి వస్తాడు నడిచి వచ్చి నడిచి వచ్చాడా లేదా ఇప్పుడు స్వామి సంగతి చెప్తున్నాం మహావిష్ణువు నడిచి కాదు ఇంకో లోకం నుంచి దిగి వచ్చాడు ఎంత అంటే వాయువేగం వాయువును కూడా దాటాడాయన దాటి ఇలా పాహి పాహి అన్నాడో లేదో అక్కడికి వచ్చాడు స్వామి కూడా అలాగే వచ్చిన సందర్భాలు చాలా చాలా చాలా ఉన్నాయి ఉంటాయి మనందరికీ అనుభవం ఏమిటంటే స్వామి మన దగ్గరకు రావటం మాత్రమే తెలుసు స్వామి మన దగ్గరకు వచ్చి ఉత్తరం తీసుకోవటం తెలుసు స్వామి దానికి జవాబు ఇవ్వటము తెలుసు ఉత్తరంలో రాయబడిన దానికి పరిష్కారం దొరకటము తెలుసు మళ్ళీ మనం కృతజ్ఞత చెప్పడము తెలుసు దీని వెనుక ఏమున్నది భావం అంటే భగవంతుడే భక్తుడికై వస్తాడు it is the god who comes to the devotee not the otherwise devotee అక్కడి దాకా దేహంతో వెళ్ళగలడు కొంత మనసుతో వెళ్ళగలడు ఇక తర్వాత మనసునీ దేహాన్నీ హృదయాన్నీ తన అధీనంలోకి తీసుకొని వస్తాడు చూడండి నన్ను చాలామంది ప్రశాంతి నిలయం నేనంటే తెలిసిన చాలామంది ఇప్పటికీ అడిగే ప్రశ్న ఏంటంటే ఇన్ని మాట్లాడుతున్నారు కదా కొన్ని miracles చెప్పండి అంటారు నేను చెప్పను అన్నాఒక్కటి చెప్పండి అంటారు ఒక్కటితో ఆగేది కాదు చెప్పడం మొదలుపెడితే అన్ని Miracles కాబట్టి ఒక్క Miracle అయినా మీరు చెప్పాలి మేము వినాలి అని పట్టుబడితే ఒకే ఒక Miracle Miracle ఏంటంటే నాకు సంబంధించింది కాదు మనందరికీ సంబంధించింది స్వామి వస్తారు Hall లో కొన్ని వేల మంది కూర్చుని ఉంటారు స్వామి వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి సింహాసనం మీద కాసేపు కూర్చుని హారతి తీసుకుని వెళ్ళిపోతారు ఆయన మనమందరము Gate లో నుంచి బయటికి ఒక్కొక్కళ్ళం బయటికి వస్తూ ఉంటాం అటు స్త్రీలు గాని ఇటు పురుషులు గాని వెళుతూ వెళుతూ ఏమంటారంటే అక్కడ పది వేలు ఉండనివ్వండి ఇరవై వేలు ఉండనివ్వండి ప్రతి ఒక్కడి నోటి నుంచి వచ్చే ఒక మాట ఏమిటంటే "ఈ వేళ స్వామి నన్నే చూశారు" అంటారు ఇది నా దృష్టిలో అద్భుతం ఒక మనిషి ఆయన మనిషి అయితే ఒక మనిషి ఇన్ని వేల మందికి Connect ఎలా అవుతారు అని ఎలా అయినారు అని దీనిని మించిన Miracle ఇంకొకటి ఉన్నదా ఏదో నన్ను చూశారు నా వైపు చూశారు అటువైపు చూశారు ముందు చూశారు వెనక చూశారు కాదు వెనక వరండాలో ఉన్నవాడు కూడా అంటాడు స్వామిని ఇప్పుడే చూశాను ఇలా తిరిగారు నాకు కనిపించారు అంటాడు అంటే పరమేశ్వరుడి యొక్క విభూతి తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు Miracles చాలా చిన్న విషయాలు చాలా అల్పమైన విషయాలు. వేళ శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొని గజేంద్రుడి దగ్గరికి రావటం అది ఒక అద్భుతం కాదా? ఆయనకేమైనా విమానం ఉందా? ఎటు నుంచి ఎవరైనా వచ్చారా? లేదే. కాబట్టి గజేంద్ర మోక్షడంలో మనం మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే ఇంద్రియాలను జయించాలి ఒకటి, జయించబడిన ఇంద్రియాలతో జీవించాలి రెండు, ఇక మూడవది ప్రాణం పోయే సమయంలో మాత్రమే అజామీళ్ళు లాగా గజేంద్రుడు కూడా అదే పని చేశాడు. దైవాన్ని ప్రార్థించి వెళ్ళలా మనం ఏం చేయాలి? దైవ ప్రార్థన చేసి బయటకు వెళ్ళాలి. మనం బయటకు వెళ్లి దైవాన్ని పిలవమంటే అది అనాచారం కాబట్టి అన్నింటికంటే ముందు ఏది అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనందరికంటే ముందు మన ముందు నడిచేది ఎవరంటే భగవంతుడే. ముందు నడుస్తున్న వాడి ముందు కూడా ఆయన నడుస్తాడు. మా వెనక భగవంతుడు ఉన్నాడు కాదు మా ముందే భగవంతుడు ఉన్నాడు ఆయన వేసిన అడుగులో మేము కూడా అడుగు వేస్తూ వెళుతున్నాం అలా గనక వేసి ఉంటే ఈవేళ గజేంద్ర మోక్షణం కథ ఉండేది కాదు మొసలి అక్కడే ఉండేది గట్టు మీద దాని చుట్టూ కొంచెం తొండంతో నీళ్ళు తాగి దాహం తీసుకుని ఏనుగులన్నీ వెళ్లిపోయేవి నిజానికి రాజ్యానికి రాజైనటువంటి గజేంద్రుడే లేకుండా పోయినాడు తర్వాత త్రికూటాచలం ఏమైందో కథలో ఎక్కడా లేదు ఎందుకని ఏనుగులు మాత్రమే ఉండిపోయినయి ఏనుగులు మాత్రమే ఉండే ప్రదేశం అది ఒక్కటే త్రికూటాచలం కాబట్టి త్రికూటాచలం యొక్క కథ ఏమిటంటే మనం మొట్టు పెట్టుకునే చోటే త్రికూటాచలం మన మనసులో కలిగేటువంటి సాంసారిక బంధనాలు దాటి ప్రాకృతమైన రుణాలు తీరినట్లయితే మన హృదయమే అరుణాచలం మనమే గనక నేను నేను నేను అన్నటువంటి భావాన్ని గనక పక్కన పెట్టగలిగితే దాని పేరే పుట్టపర్తి. అవునా? పుట్టపర్తి అంటే పుట్టలు ఉండే ప్రదేశం అని కదా అంటే పుట్టపర్తిని కొద్దిగా విడగొడదాం Put Apart I That is పుట్టపర్తి Put Apart దేనిని I నేను అన్న భావాన్ని Just keep it aside Put that I Apart That's called పుట్టపర్తి మనం పుట్టపర్తికి ఎందుకు వెళ్లాలి అంటే నేను అన్న భావన నుంచి బయట పడటానికి నాది అన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకోవటానికి పుట్టపర్తికి వెళ్ళాలి అక్కడికి వెళ్లగానే రెండు అయిపోతాయా అంటే సేవ చేయాలి సేవ అంటే అక్కడ బస్తాలు మోయటం, ఇసుక clean చేయటం ఇదేనా అంటే దానితో పాటుగా అందరితో అంతటితో ప్రేమగా ఉండాలి కుల మత జాతి మత వర్గ వర్ణాలు లేని ఒకానొక అద్భుతమైన స్థితిలో ఎవరి నేపథ్యం ఏమిటో తెలియని స్థితిలో అందరూ స్వామికి చెందిన వారే అనేటువంటి భావనలో ఎప్పుడైతే మనందరికీ ఒక ఏకాత్మ భావన కలుగుతుందో One I అనేటువంటిది మన నుంచి దూరం అయిపోతుంది We will keep it aside ఇప్పుడు అక్కడికి ప్రపంచంలో ఉన్న డాక్టర్లు ఇండియాలో ఉన్న డాక్టర్లు వాళ్ళు ఎంత busy గా ఉన్నా వాళ్ళు ఎన్ని లక్షలు వాళ్ళ practice వల్ల కోల్పోయినా వాళ్ళకి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసునా? లక్షలు సంపాదించిన రోజున మాత్రం లేదు. ఒరికే లక్షలు సంపాదించాం కానీ పుట్టపర్తి ఒక doctor మన వేణుగోpal rao గారు లాంటి doctors అక్కడికి వెళ్ళినప్పుడు సేవ చేసినప్పుడు వాళ్ళకి కలిగే ఆనందానుభూతి లక్షలు కోట్ల ముందు సున్నా. ఆనందానుభూతి ముందు లక్షలు కోట్లు సున్నా. అంటే ఇంతటి ఆనందం ఎలా వచ్చింది అంటే Giving అనే aspect లో ఇవ్వటము, చేయటము, ఉదారంగా చేయటము, డబ్బు ప్రమేయం లేకుండా చేయటం మరి వాళ్ళందరూ వాళ్ళ Appointment కావాలంటేనే దొరకదే మరి doctor లే వై-వైద్యులే రోగుల దగ్గరికి వెళ్ళటం ఎక్కడన్నా చూశామా? వెళితే వైద్యం చేస్తారు అది వేరే వైద్యులే రోగుల దగ్గరికి వెళ్ళటం, పండితులే పామరుల దగ్గరికి వెళ్ళటం, ఒక ధనవంతుడే వెళ్లి మురుక్కాలువలో నీ-నీళ్లలో చెయ్యి పెట్టి సేవ చేసి గ్రామ సేవ చేసి వెనక్కి రావటం. ఇదంతా కూడా మన అహంకారాన్ని తగ్గించటం కోసమే స్వామి మనకి ఇది నేర్పారు అది గమనించాలి. మనందరం అక్కడికి పుణ్యం మాత్రమే కాదు పుణ్యం ఎలాగూ వస్తుంది మంచి పని చేస్తే పుణ్యం రాకేమవుతుంది వచ్చేది అదే బాగా ధనవంతుడు ఉంటాడు వాడికి మిగతా పనులు ఏమీ చేయలేడు మరి కానీ ఏం చేయగలడు అంటే అందరూ మంచి పనులు చేస్తున్నప్పుడు అయ్యా ఇవేమీ నేను చేయలేను నాకు చేతకాదు నాకు practice లేదు నా వంతుగా మీకు ఇదిగో డబ్బు ఇస్తున్నాను దీన్ని మీరు ఏదైనా సద్వినియోగం చేయండి అని ధనవంతుడు అలా చేస్తాడు మీకు ఒక విషయం చెప్పాలి సత్యసాయి భగవానుడు hospital మొదలు పెట్టినప్పుడు hospital ప్రారంభం రోజున ఒక ఉపన్యాసం ఇచ్చారు మీకు దొరుకుతుంది YouTube లో మరి ఏమన్నారంటే.ఈ హాస్పిటల్ అనుకున్న ప్రకారం కంటే ముందే తయారయింది ఒకటి, తయారయింది దీనిలో ధనవంతులు కూడా వచ్చి వైద్యం చేయించుకోవచ్చును కామా ధనవంతులు కూడా వచ్చి చేయించుకోవచ్చును కామా తర్వాత ఏమిటంటే ఉచితంగా free గా అని చెప్పారు స్వామి దిగ్భ్రాంతి చెందింది డబ్బు లేని వాడికి చేయటం సేవ అనుకున్నాం గానీ డబ్బున్న వాడికి కూడా ఉచితం అంటున్నారు ఏమిటి స్వామి అని అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి కారణం ఏంటంటే డబ్బు బాగా ఉన్నవాడు ఒక మంచం మీద ఒక bed మీద ఉన్నాడు వాడి పక్కనే పాపం ఏమి ఒక రూపాయి బిళ్ళ లేని వాడు వాడు ఉన్నాడు ఇద్దరికీ operation అయింది ఇద్దరూ success వీడు బతికాడు వాడు బతికాడు రోగం పోయింది తగ్గింది. డబ్బున్న వాడి మనసులో ఆలోచన ఏముంటుందంటే, ఏమీ లేకుండా ఒక రూపాయి బిళ్ళ తీసుకోకుండా నాకు అంత డబ్బుంది నా ప్రాణమే గనుక దీని వల్ల పోయి ఉంటే డబ్బు విలువ ఏముంది ఇకపై ఇంతవరకు చేయని పని నేను చేయబోతున్నా నా పక్కన పాపం అతనికి పండు కావాలంటే ఇచ్చేవాళ్ళు లేడు లేకపోతే ఇంకేదో కావాలంటే తెచ్చి ఇచ్చే మనుషులే లేరే, నాకున్న డబ్బులో కొంత భాగాన్ని బీద వాళ్ళ కోసం నేను ఇస్తాను స్వామికి ఇచ్చేది ఏం లేదు అక్కడ మనం ఇచ్చిన దాన్ని పుచ్చుకునేది కూడా లేదు. కాబట్టి ధనవంతుడి మనసులో కోరిక కలిగి పదే పదే ప్రశాంత నిలయానికి వచ్చి అతను చేయగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. బీదవాడు ఏమనుకుంటాడో తెలుసా? దేవుణ్ణి నమ్మకుండా మనుషులను నమ్ముతూ అడుక్కుతింటూ బతికాను అటువంటి నాకు నా శరీరానికి ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుని సన్నిధిలోనే నాకు ఇంత సేవ దొరికింది నేను అడుక్కోవటం మానేసి చేయి చాపటం మానేసి నేను కూడా కష్టపడి కాయకష్టం చేసి ప్రపంచానికి నేనేదైనా చేయగలనా అని నేను కూడా సేవలోకి వెళ్తా అన్నాడు. ఇద్దరూ ఏకకాలంలో సేవలోకి వెళ్లారు. విషయాన్ని మన అటల్ బిహారీ వాజ్ పేయి గారు ఢిల్లీలో international center ప్రారంభించినప్పుడు హిందీలో మాట్లాడితే ఏమన్నారంటే "हर अस्पताल में हर आदमी को दवा मिलेगा लेकिन जो सच्चा साही बाबा जी ने बनाया उस अस्पताल में अगर हम गए तो दवा के साथ भगवान का दुआ भी मिलेगा" దవా దువా రెండు దొరుకుతాయి అది అటల్ బిహారీ వాజ్ పేయి. భగవంతుని కృప ఉండాలి mehar ఉండాలి ఆనందం ఉండాలి ఆయన నుంచి మనం ఇది పొందాలి ఇవన్నీ పొందటానికి గజేంద్రుడు చేసిన పొరపాటు మనం చేయకూడదు హిరణ్యకశిపుడు చేసిన పొరపాటు మనం చేయకూడదు. ఏం చేయాలి? ఇవన్నీ కథలు వింటున్నా కథలు బా ఎవరో రాశారు ఎప్పుడో రాశారు. వాళ్ళకి తోచిన రీతిలో రాశారు. దాన్ని మనం ఈనాటి సమాజ వ్యవస్థకి, కుటుంబ వ్యవస్థకి, మనం నడుపుతున్న జీవన విధానానికి సమన్వయం చేసుకోకపోతే అదే గజేంద్రమోక్షం దాన్ని మార్చి ఎవరు చెప్పలేరు కదా. మార్చి కథను ఎవడు మార్చలేడు. జీవుడి వ్యధను ఎవడు తీర్చలేడు. మరి మార్చగలిగిన, తీర్చగలిగిన, కూర్చగలిగిన ఒక్క పరమాత్మ మాయావరణాన్ని దాటినటువంటి పరమాత్మ మాత్రమే చేయగలడు కాబట్టి అటువంటి భావనలోకి మనందరం కూడా భక్తి మార్గంలోకి ప్రవేశించాలి. భక్తి అంటే ప్రదక్షిణలు, కొబ్బరికాయలు కొట్టడము, దండలు, ఎగిరి గంతులేయటం ఇది మాత్రమే కాదు. భక్తి అంటే పరమేశ్వరుని యందు మన మనస్సు అన్నివేళలా నిమగ్నమై ఉండాలి లగ్నమై ఉండాలి అది ఎట్లా చదరని భావంతో ఉండాలి సుస్థిర భావంతో ఉండాలి సంస్థితమైన స్థితి ఉండాలి. ఇవన్నీ గనుక మనకు ఏర్పడినట్లయితే భగవంతుడు దిగి రాడా? వస్తాడు. వస్తాడు అని చెప్పడానికి గజేంద్రమోక్షం అలాగే వస్తాడు అని చెప్పడానికి ప్రహ్లాదుడికి భగవంతుడు అంటే నువ్వు ఊహించినట్లు ఎవరో కవి వర్ణించినట్లు నీ భావాన్ని బట్టి భగవంతుడు ఉండడు భగవంతుని యొక్క భావమే నీ యందు ప్రవేశిస్తుంది. నువ్వేమనుకున్నావ్? హరిణి గురించి ఎలా వర్ణించావ్? ఇలా ఉంటాడు పెద్ద చెవులు ఉంటాయి ఆకర్ణాయతంగా ఉంటాడు విశాల నేత్రాలు ఉంటాయి తామర పూలవంటి తామర రేకుల వంటి కనుగవలు ఉంటాయి విశాలమైన వక్షస్థలం ఉంటుంది బహుసుందరంగా ఉంటాడు నెల్లగా ఉంటాడు తెల్లగా ఉంటాడని కవి రాశాడు తప్ప అసలు భగవంతుడు ఇలా ఉంటాడా అని ఆశ్చర్యపోయిన వాడెవడంటే ప్రహ్లాదుడు. కాబట్టి మనం కూడా భగవంతుడు ఇలాగే ఉంటాడు అనటానికి వీల్లేదు. ఒక దయగా, ఒక చల్లని స్పర్శగా, ఒక వాత్సల్య పూరితమైన ఒక చల్లని మాటగా, అన్నివేళలా డబ్బే కాదు వాత్సల్య పూరితమైన ఒక మాట. ఒక్కొక్క doctor జీవితంలో success ఎందుకు పొందుతాడు అంటే ఆతని మంచితనం వలన, ఆతని లలితమైనటువంటి భావన వలన, అతనిలో ఉండే సత్వగుణం వలన, అన్నింటినీ మించి బయటకు కనపడని కరుణ వలన వారి హస్త వాచి హస్త వాసి మంచిది అంటారు. మిగతా డాక్టర్లు కూడా అవే హస్తాలు కదా అవే scalpel అవే scissors అవే ఉంటాయి కదా మరి వీరు ఇలా ఎందుకు అనిపించుకున్నారు? వారు ఎందుకు అలా అనిపించుకున్నారు అంటే భావమే భగవంతుడై ఇది నేను చేస్తున్నాను అన్న భావన స్వామికి సంబంధించిన doctor కి ఉండగా నేను చూడలేదు. వాళ్ళు ఏమంటారంటే మేము operation theatre కి వెళ్తాం ఒక critical operation లోకి కూడా మేము వెళ్తాం వెళ్ళేటప్పుడు ఇది స్వామి చేయిస్తున్నారు మేము ఊరికే మా plate లో ఎలాగైతే మిగతా instruments ఉన్నాయో అవి మా చేతుల్లో ఎలా ఉన్నాయో మా చేయిలో మాత్రం స్వామి ఉన్నారు. ఇది కొన్ని వేల మంది doctors దగ్గర నేను విన్నా. బహుశా వేణు వేణుగోపాల్ రావు గారి అనుభవం కూడా అది ఉండొచ్చు. అంటే సమన్వయం చేసుకోవాలి ప్రతి దాన్ని మనం సమన్వయం చేసుకుంటే తప్ప స్వామి అర్థం కాదు. కాబట్టి భక్తి అనేటువంటి దాన్ని ఒక వైపరీత్యంలో కాకుండా ప్రసన్నంగా ఉండాలి హాయిగా ఉండాలి దేనికైనా ఒక పరిమితి ఒక controlled measure లో ఉండాలి. భక్తి వల్ల దేశం ఒకప్పుడు పాడైపోయింది. భక్తి వల్ల దేశం పాడైపోయిందా? ఇదేమిటి అంటే...మతం కారణంగా శైవులు వైష్ణవులు విడిపోయినారు మనందరికీ తెలుసు. శివుడు తప్ప దేవుడు లేడన్నటువంటి వాళ్ళు వీరశైవులు అయినారు విష్ణువు తప్ప ఇంకొకడు లేడన్నవాడు వైష్ణవులు కరుడుగట్టిన వైష్ణవులు అయినారు. వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ కంటితో చూడని భగవంతుని కోసం కొట్టుకున్నారు. మతం ద్వారా యుద్ధాలు జరిగినాయి కాబట్టి సర్వమత సమన్వతమైనటువంటి ఒక వసుధైక కుటుంబ నిర్మాణంలో సత్యసాయి భగవానుడు దానిని సమన్వయం చేశారు. మీకో చమత్కారం చెప్తాను. ఇలాగే two batches వచ్చినాయి ఒక batch శ్రీశైలం నుంచి ఒక batch శ్రీరంగం నుంచి వచ్చినాయి. శ్రీరంగం నుంచి వచ్చిన వాళ్ళు మీకు తెలుసు వాళ్ళు వైష్ణవులు నామం నిలువుగా పెట్టుకుంటారు. శ్రీశైలం శ్రీరంగం నుంచి శ్రీశైలం నుంచి వచ్చిన వాళ్ళు అడ్డంగా పెట్టుకుంటారు. సరే వాళ్ళు ఇటు అటు రెండు batches కలిసి స్వామి వైపు వస్తున్నాయి. వస్తుంటే ఒకాయన అన్నారు స్వామి మరి వీళ్ళు కాస్త విరుద్ధ భావాలు వాళ్ళంటే వీళ్ళకు పడదు. వీళ్ళకేమో వైష్ణవులకు శైవులు పడరు శైవులకు వైష్ణవులు పడరు ఏం చేద్దాం అని అంటే. వీళ్ళకి గదులు ఎక్కడ ఇచ్చారు అన్నారు. చాలామంది ఉన్నారు స్వామి గదులు కాదు గదులు ఏమి ఇవ్వలేదు అంటే మన shedలు halls ఉన్నాయి కదా hallsలో వాళ్ళని ఎదురెదురుగా పడుకోబెట్టండి అన్నారు. అంటే ఒక వైష్ణవుడు ఇలా పడుకుంటాడు వాడి ఎదురుగా ఒక శైవుడు పడుకుంటాడు. శైవుడి అడ్డం ఎదురుగా పడుకున్న వాడికి నిలువుగా కనిపిస్తుంది. అడ్డంగా పడుకున్నటువంటి వైష్ణవుడికి ఎదురుగా ఉన్న వాడిది నిలువుగా కనిపిస్తుంది. అంటే నిలువు అడ్డమై అడ్డము నిలువై రెండు ఒకటి అయిపోతాయి అప్పటికన్నా వాళ్ళకి ఏదన్నా సద్బుద్ధి కలుగుతుందేమో అన్నారు స్వామి. అంటే కావలసిన మతమేమి చెడి చేసింది మనిషి యొక్క మతి తప్ప అన్నారు స్వామి. కాబట్టి ఇవన్నీ మనం చక్కగా భాగవత ప్రవచనంలో మనం నేర్చుకోవలసిన విశేషాలు ఇవిగా నేను భావిస్తూ ఇంకొక విషయం మధ్యాహ్నం అంతా కూడా భాగవత పద్యాలే చదువుకుందాం కొన్ని important అన్నీ కాదు కొన్ని. ఇక time ఉందా? అయితే ఇంకో కథ కూడా ఇవాళ చెప్పుకుంటే మూడు కథలకి link ఉంది అందువలన
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 20:44

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

    Now playing
  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22