Skip to content
Transcript తెలుగు
యుగయుగాంతాల వరకు కూడా సువర్ణాక్షరాలతో లిఖింపబడు గాక అంటున్నారు సువర్ణము ఉండదు కట్టిన building ఉండదు మన కళ్ళ ముందే building లన్నీ మారిపోతున్నాయి మన పిల్లలకిచ్చిన ఆస్తులన్నీ రూపాంతరీకరణం జరుగుతున్నాయి అవన్నీ అనుపయోగము నిరుపయోగము దుర్వినియోగము అవుతున్నాయి మరి ఏం మిగులుతున్నది నీవు వంశము ద్వారా నువ్వు కీర్తిని సంపాదించు అమరినమైనటువంటి ఒక వెన్నెల వంటి కీర్తిని నీ వంశానికి ఇవ్వు అలాగే నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా ఒక జాతి సంస్కారాన్ని నేర్పు ఇవి నువ్వు చేయవలసింది పరీక్షిత్ మహారాజ అన్నప్పుడు పరీక్షిత్ మహారాజు ఇందాక అన్నట్లుగా జనమేజయుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయలా ఏం చేశాడు తాను చేయవలసిన పని ఎలా చేయాలో ధర్మబద్ధమైనటువంటి విషయాలన్నీ విని, విని, విని తర్వాత వారసుడికి దాన్ని transmit చేశాడు ఇందాక చెప్పినట్లుగా ప్రవాహంగా ప్రసారం చేశాడు తర్వాత యుగమే మారిపోయింది ఇక తర్వాత రాజులు లేరు రాజ్యాలు లేవు సంస్కారం అక్కడితో ఆగిపోయి బళ్ళును తెల్లవారినట్టుగా కలియుగం ఏర్పడింది కలియుగం ఏర్పడటానికి ముందు మన ద్వితీయ స్కంధంలో హరినామ సంకీర్తన ప్రభావాన్ని చెప్తూ భాగవతం యొక్క స్థూల శరీ-- స్వభావాన్ని చెప్పాడు అసలు భాగవతం అంటే ఏమిటి అది పొద్దున్నే నిర్వచనం చెప్పాం మరి వ్యాసుల వారి ప్రమాణం ఏమిటి అంటే ఇది యోగ ధ్యానాలలో ఉన్న సాధకులు మరి ఇప్పుడు అంతే విమానాశ్రయానికి వచ్చాం తర్వాత ఏమిటి విమానం ఎక్కాం తర్వాత ఏమిటి విమానం దిగాం తర్వాత ఏమిటి అన్న ప్రశ్న లౌకిక జీవితంలో ఎప్పుడూ ఉంది ఇప్పుడు కూడా ఆరుంబావు తర్వాత ఏమిటి తర్వాత సరే ఏడున్నర తర్వాత ఏమిటి ఇది లౌకిక విషయాలలో మనం ఎలా వాడుతామో అధ్యాత్మలో కూడా అధాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మమును గురించినటువంటి విచారణ చేయాలి వ్యాసుల వారు శుకదేవుడు పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ బ్రహ్మమును గురించి అలాగే కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్తే సత్యసాయిబాబా వారిని రోజుల్లో వారు చిన్-- వారి వయస్సు అప్పుడు చాలా చిన్నది స్వామి బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మము అంటారే అర్జునుడు అడిగాడుగా అడిగితే కృష్ణుడు చెప్తే రెండు వందల అరవై ఐదు శ్లోకాలయినాయి స్వామిని కూడా అడిగారు మీరు కూడా బ్రహ్మము అనే పదార్థము బ్రహ్మము చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ వాళ్ళభ్యమది బ్రహ్మ జీవులన్నియు బ్రహ్మ జీవరాసులు బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ సర్వములు తెలియు సభయు బ్రహ్మ సత్యములు తెలుపు సాయి బ్రహ్మ అని మిమ్మల్ని కూడా కలుపుకొని చెప్పారే బ్రహ్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి స్వామి మాక్ కాస్త సంక్షిప్తంగా చెప్పండి అంటే ఏక వాక్యంలో చెప్పారు స్వామి దేనిని కనులు చూడలేవో కానీ దేనివలన కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము అన్నారు ఇంతకంటే వ్యాఖ్యానం ఎవరు చేయలేరు ఇంత సంక్షిప్తంగా దేనిని కనులు చూడలేవో కానీ దేనివలన కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము దా-దానిని మించి ఇంకొకటి ఏం లేదు అన్నారు అది పదార్థమా పరమార్థమా యదార్థమా అంటే అన్నీ కలిపి ఉన్నటువంటి ఒక భావనా స్థితి బ్రహ్మము కాబట్టి కనబడుతున్నదంతా బ్రహ్మమే జడము అజడము చలము అచలము ఉన్నది పోతున్నది పోయినది మళ్ళీ వస్తున్నది అంతా బ్రహ్మమేనన్నటువంటి ఒక భావనతో ద్వితీయ స్కంధ నిర్మాణం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గురించినటువంటి లీలా వైభవాన్ని వర్ణిస్తూ ఈయనకి ఒక ఆలోచన పుట్టింది ఎవరికి పరీక్షిత్ మహారాజుకి మా కుటుంబాన్ని మా వంశాన్ని మా కాలాన్ని మా ధర్మాన్ని పరిపూర్ణంగా రక్షించినటువంటి కృష్ణుడి కథ ఎప్పుడు చెప్తావు అని అడిగాడు చూసారా ఆయనకి కృష్ణుడు యందు interest కలిగింది ఈయన తత్వం చెప్తున్నాడు ఆయన కృష్ణుడి యందు ఒక ఆవేశం కలిగింది ఆవేశం అంటే ఉద్రేకం కాదు తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది క్రమ పరిణామ దశలో నేను నెమ్మదిగా చెప్తూ ఉంటాను అవన్నీ చక్కగా అర్థం చేసుకో ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా నీవు మననం చేస్కో వినటం కొంతసేపు చేయాలి శ్రవణం మననం నిధిధ్యాసనం మూడు జరుగుతూ ఉండాలి నువ్వు ఎంతవరకు చెప్పానో దానిని వింటూ దానిని మననం చేసుకుంటూ ఉండు లేకపోతే చెప్పింది చెప్పినట్లుగా వెనక్కి వెళ్ళిపోతుంది it goes over the head అంటాం అంటే వెనక్కి వెళ్ళిపోతుంది ఏం మిగలదు మన దగ్గర మిగలాలి అంటే ఏం చేయాలంటే సాధారణంగా ఇటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు ఇటువంటి గంభీరమైన తాత్విక విషయాలు మనం విన్నప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు మహా నిశ్శబ్దంలో ఉండాలి మహా నిశ్శబ్దంలో ఉండకుండా తర్వాత ఏమిటని పరిగెత్తుకు వెళ్ళటానికి ఏం లేదు తర్వాత ఏం జరగాలో జరుగుతుంది మననం చేసుకొని మనం వెళ్ళిపోతే అది నిలబడిపోతుంది నిలబడిపోయిన దానిని మనం అనేక సార్లు మాట్లాడుకోవచ్చు అద్వైతామృత ధార కురియ అంతరంగ మనిడి పాత్ర తెరచి ఉంచు బోర్లించి ఉండగా బుట్టైన చిక్కదు తెరచి ఉంచిన చాలు తరచనగును వర్షం పడుతోంది భయంకరమైన వర్షం బయట [Throat clearing] మనం మన ఇళ్లల్లో కడవ ఒక కుండ కుండ లేదా ఒక పాత్ర వెళ్లి వర్షపు నీళ్లు పట్టుకోవటం అనేది ఒక ఆచారం ఉండేది pure water అనేటువంటి భావనలో వెళ్లి మనం గనక దాన్ని అద్వైతం అనేటువంటి అమృతధార కురుస్తున్నప్పుడు మనం గనక పాత్ర తెరచి ఉంచినట్లయితే కుండ నిండుతుంది తెరచి ఉంచకపోతేనీళ్లు పట్టుకొని వెనుక ఇస్తాం వాడు బోర్లించి వస్తాడు కుండలోకి నీళ్లు వస్తాయి ఏమో అని బోర్లించి వచ్చాడట వాన వెలిసింది బోర్లించిన కుండలోకి బొట్టు అయినా వెళ్ళదు కదా తరచి ఉంచిన చాలు తరచని అగును విషయం లోపల గనక పెట్టుకోగలిగినట్లయితే తరచి తరచి మరల మరల పునః పునః విచారణ చేస్తూ ఇది ఇట్లా అది ఇట్లా ఇలా జరిగిందా అలా జరిగిందా భాగవతంలో ఇంత ఇన్ని విషయాలు ఉన్నాయా ఏదో కథలు చెప్పుకుంటూ గడిపేసామే మాకు అరవై ఏళ్లు వస్తున్నాయి మాకు యాభై ఏళ్లు వచ్చినాయి కథలు ఇట్లా ఎప్పుడూ వినలేదే అని అనుకున్నప్పుడు దానిని అలా కూడా చూడాలి ఎందుకంటే everything has got two things ఒకటి dynamics రెండవది dimension dynamics అర్థం కాకపోతే dimension తెలియదు dimension తెలియకపోతే dynamics అర్థం కావు రెండూ సమన్వయం చేసుకోవటానికే మనం చేయాలి అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒక మాట అడిగాడు అయ్యా నేను చాలా అదృష్టవంతుడిని నా కోసం మీవంటి మహాత్ములు మీరు సాక్షాత్తు భగవద్ రూపం అవధూత స్వరూపం నాకోసం వచ్చి చెప్పారు చాలా సంతోషం మరి అవకాశము అదృష్టం అందరికీ దొరకదు కదా మరి ఏం చేస్తే ఇవన్నీ లభిస్తాయి దేని వలన మేము ఆనందాన్ని పొందగలుగుతామో చెప్పమని అడిగాడు పాపం మనందరి కోసం శుకదేవుడు చెప్పాడు మొట్ట మొదట కావలసింది సత్ సాంగత్యము కావాలి మంచి వ్యక్తులతో స్నేహం పెట్టుకోవాలి మంచి వ్యక్తుల్లో ఉదాత్త మూర్తులు ఉంటారు ఉదాత్త పురుషులు ఉదాత్త స్త్రీలు ఉంటారు వాళ్ళు మనల్ని కొంత దూరం నడిపించగలిగిన శక్తి గలవారు వాళ్ళతో మనం కొంత కాలం ఉంటే నెమ్మది నెమ్మదిగా మన దారి మనకు స్పష్టం అవుతుంది సత్ సాంగత్యం మనం నేను నైమిశారణ్యం వెళ్తున్నాను కనీసం ఒక రెండు రోజులన్నా ఉండి వస్తాను అంటే రెండు రోజులు ఉండటానికి నైమిశారణ్యం ఎందుకు ఇంట్లో ఉండు అంటాడు ఒకడు కాదండి నేను పది రోజులు ఉందాను నైమిశారణ్యంలో పది రోజులా ఇల్లు ఎవరు చూస్తారు కాబట్టి వెళ్ల వెళ్లమని చెప్పడు వెళ్లమని మాత్రం చెప్పడు హాయిగా వెళ్లిరా అదృష్టం నీ అదృష్టం అనడు అక్కడికి ఎందుకు ఇన్ని రోజులు రెండు రోజులు తక్కువైతే అవసరం లేదు కదా అంటాడు ఎక్కువైతే అవసరమా అంటాడు కాబట్టి సత్ సాంగత్యంలో ఉన్నటువంటి ఒక భర్త గాని ఒక భార్య గాని వాళ్ళు ఏమని కోరుకోవాలంటే సత్పురుషుల యొక్క స-- సత్పురుషులు ఎవరు అంటే పురుషులలో మంచివాడు సత్ స్త్రీలను ఎక్కడా లేదు పురుషుడు అంటే జీవుడు అని అర్థం male female gender కాదక్కడ జీవుడు సత్పురుషుడు ఎవరంటే ఎవరు నిరంతరము సత్ అనేటువంటి దానిని ఒక యదార్థమైన దానిని ఆవిష్కరిస్తూ ఉంటాడో ఎవరు సచ్చానుసంధానం చేస్తాడో ఎవడు నిత్య తత్వానుసంధానంతో జీవితాన్ని గడుపుతాడో ఎవరు సచ్చాన్వేషణ చేస్తారో సత్యాన్ని గ్రహిస్తారో సత్యాన్ని ఆచరిస్తారో అటువంటి వాడు ఆప్తుడై ఇటువంటి సత్ సాంగత్యం ఏర్పడుతుంది సాంగత్యము అంటే bondage అనుకుందాం దానికి bondage అని పేరు కంటే సంఘము సంఘము అనుకుందాం సంఘం అంటే ఇవాళ మనందరం ఇక్కడ ఒక సంఘంగా ఒక congregation గా ఒక group గా ఉన్నాం ఎలా ఉన్నాం సంగమించి ఉన్నాం దేనితో సంగమించి ఉన్నాం ఎవరు ఎవరి నేపథ్యము ఎవరికీ తెలియదు అసలు పేర్లే తెలియవు వాళ్ళ వాళ్ళ నైజాలు తెలియవు వాళ్ళ ఆధ్యాత్మిక శక్తులు తెలియవు అసలు వాళ్ళ aspirations of life తెలియదు దాంతో మనకు సంబంధం లేదు కనుక తెలియనక్కర్లేదు మరి ఏమిటి వీళ్ళందరూ అంటే భగవద్ భక్తులందరూ ఒకచోట కూడి ఒకే విషయాన్ని చిత్తైకాగ్రత స్థితిలో వింటూ అనుభవిస్తూ మరణం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారే అటువంటిది సత్ సాంగత్యం వల్ల కలుగుతుంది ఒకటి ఇక సత్ సాంగత్యం ఒకటేనా అంటే సత్సంగం కావాలి సత్సంగం అంటే కూడిక అంత కావాలి సత్సంగం అంటే ఉపన్యాసం అని అద్భుత ప్రవచనం అని అనుకుంటాం ప్రవచనం అనే మాట మనం ఎత్తేసేయాలి అసలు there is nothing called ప్రవచనం ఏమున్నదయ్యా అంటే పరస్పరం భావయంతి నాయందు ఏది ఉన్నదో అది మీ యందు ప్రసరించు గాక మీ యందు ఏదున్నదో నాయందు ప్రసరించు గాక ఋగ్వేదంలో చెప్పారు ఇది let noble thoughts come onto me in the same breath let noble tho-- uh noble thoughts emanate from me and spread over the world అందరి నుంచి నాయందు ఉదాత్త భావనలు నాకు లభించు గాక అట్లే నా నుంచి ఉదాత్తమైన ఉన్నతమైన ఉత్కృష్టమైన యదార్థమైన సత్యార్థమైన భావనలు సర్వ ప్రపంచానికి చెందు గాక మరి ఏమవుతున్నది అంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లి సంగమ స్థలంగా ఏర్పడింది ఇవాళ మన సంగమ స్థలం ఏదంటే నది సాగరంలో కలిసినప్పుడు సాగర సంగమం అంటాం సాగరంలోనే నది వచ్చి కలుస్తుంది స-సముద్రం ఎప్పుడూ నది వైపు వెళ్ళదు నది ఎప్పుడూ సముద్రం వైపు వెళ్ళకుండా ఉండదు కాబట్టి సంగమ స్థలం ఇవాళ జీవితంలో వయస్సులో కాలంలో ప్రధానమైనటువంటి సన్మాన్ గల వేళ మన సంగమ స్థలి నైమిశారణ్యం కావటం మనం చేసుకున్నటువంటి తపస్సు యొక్క ఫలితం మామూలుగా లభించింది కాదు ఇది ఏదో విమానం వేసుకొని వచ్చాం మళ్ళీ విమానంలో వెళ్ళిపోతాం అమ్మయ్యా I finished one program కాదిది హృదయాన్ని ఆవిష్కరించాలి లోపల నీవు పొందిన తపోధారణి జగత్తుకి హాయిగా ఇచ్చేసేయాలి అవతల వారి యందున్న తపోధార మళ్ళీ జగత్తుకి ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై బహుముఖీనమై అనేక పారిశ్రామాలను తడమాలి తడపాలి అనేక క్షేత్రాలని సుసంపన్నం చేయాలి అందుకై ఇవి సాగాలి అనేటువంటి సంగమ స్థలికి రావాలంటే సత్సంగం ఏర్పడుతుంది సత్సంగం వచ్చిన తర్వాత ఏమవుతుంది నిస్సంగత్వం ఏర్పడుతుంది.భగవత్పాదుల శ్లోకం మీ అందరికీ తెలుసు సత్సంగత్వే నిస్సంగత్వం మరి ఇప్పుడు సంఘం మందంతా ఎట్లా ఉన్నది అంటే భార్య పిల్లలు భర్త వైభవము యోగము భోగము రోగము ప్రపంచము దాని వలన కలిగే సుఖము దాని వలన కలిగే సంతోషము చూడండి విచిత్రం సుఖమంతా దేహానిదే సంతోషమంతా మనస్సుదే మరి ఆనందం ఎక్కడుంది అని తెలీదు మనకి ఆనందాన్ని సుఖం అనుకుంటున్నాం సుఖాన్ని సంతోషం అనుకుంటున్నాం మూడు ఒకటే అనుకుంటున్నాం కానే కాదు మనుష్యానందము మనీషా నందము గంధర్వా నందము దేవ గంధర్వా నందము మానవ గంధర్వా నందము పితృ పితా నందము ప్రజా పితా నందము హిరణ్యగర్భానందం అక్కడికి వెళ్ళాలి హిరణ్యగర్భా నందము పొందాలి అంటే ఏం చేయాలి అంటే సత్సంగంలోకి రావాలి సత్సాంగత్యం లో నుంచి సత్సంగంలోకి వస్తే దానిలో నుంచి అసంగత్వం ఏర్పడుతుంది ఇక దేనియందు మనకు attachment ఉండదు పొద్దున డాక్టర్ గారు అడిగారు detached attachment అంటే ఏమిటో చెప్పమని ఇవ్వాళ మనం అనుభవిస్తున్నది detached attachment దేనితో detach అయినాం అంటే భౌతిక సంపద నుంచి detach అయిపోయినాం భౌతికమైన విషయాలు మన ఊరు ఎట్లా ఉందో తెలియదు ఇల్లు ఎట్లా ఉందో తెలియదు మన బంధువులంతా ఎక్కడున్నారో మనకు తెలియదు అక్కడ detach అయినాము ఇక్కడ భగవంతుని యొక్క భావంలో attach అయిపోయాం ఇది ఆనందాన్ని కలిగిస్తుంది శాంతిని కలిగిస్తుంది ఒక విశాలమైనటువంటి భావన ఏర్పడుతూ ఉన్నది కాబట్టి నిస్సంగత్వే నిర్మోహత్వం మనకి మోహం ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది మోహం యొక్క పుట్టుక ఏమిటి బంధన బంధానికి మూలం ఏమిటి బాంధవ్యం బాంధవ్యం నుంచి బంధన బంధన నుంచి మోహం మోహం నుంచి వ్యామోహం వ్యామోహం నుంచి వ్యసనం ఇవి ఏర్పడతాయి ఏది వదులుచుకోలేం మొదట్లోనే గనుక మనకున్న సంగత్వాన్ని తగ్గించుకుంటూ నెమ్మది నెమ్మదిగా కౌమార యవ్వన దశలోనే వీటిని అర్థం చేసుకుని మనంతట మనం నెమ్మదిగా గనుక రాగలిగినట్లయితే ఇవ్వాళ నిర్మోహత్వం పెద్ద కష్టం కాదు ఇవ్వాళ పళ్ళు ఊడిపోయినాయ్ కన్ను కనపడటం లేదు చెవును వినపడటం లేదు కాళ్ళు కీళ్ళు కదలటం లేదు నేను ఇవ్వాళ ఏం చేయలేకపోతున్నాను ఇక ఏం చేయలేను అన్నవాడు నిస్సహాయ స్థితిలో నుంచి వాడు ఇంద్రియాలను జయించలే ఇంద్రియాలు పని చేసి చేసి చేసి అవి అలసిపోయినాయ్ ఇక చెవి వినటం మానేసింది కన్ను చూడటం మానేసింది నాలుక మడత పడుతున్నది వాక్కు రావటం లేదు పటుత్వం పోయింది దంతాలు రాలిపోయినాయ్ శంకరా అని హాయిగా అనవలసిన మనం పళ్ళు ఊడిపోయినయ్ గనుక గాలి షా అనటల్లా షా అంటున్నది కాబట్టి ఇక్కడ మనం జితేంద్రియుని కావటం కష్టం కాదు కానీ అంటే ఇంద్రియాలను జయించటం ప్రధానం మాత్రమే కాదు ప్రధానమే కానీ జయించబడిన ఇంద్రియాలతో జీవించాలి జయించబడిన ఇంద్రియాలు అంటే రుచి వాసన రూపము భావము చైతన్యము ప్రజ్ఞ మేధ సంపద ఐశ్వర్యము ఇవన్నీ కూడా మనల్ని బంధించి వేస్తాయి ఇవన్నీ మనకు ఆకర్షణావలయాలు వీటన్నింటినీ నెమ్మది నెమ్మదిగా దాటుకుంటూ గడులు దాటుతూ వెళితే నిర్మోహత్వం చాలా సులభంగా మనం పొందగలుగుతాం నిర్మోహత్వం వచ్చినప్పుడు వ్యసనమే లేనప్పుడు ఏమవుతుంది నిశ్చలతత్వం మనసు ఒక నిశ్చలమైన స్థితికి వెళుతుంది మనసు పరిగెత్తుతుంది పరిగెత్తిస్తుంది మనసు మోక్షం వైపు వెళ్ళమని చెప్తుంది ఇప్పుడు నీకు మోక్షం అవసరమేమో అంటుంది తైత్తరీయో ఉపనిషత్తులో పక్షి కొమ్మ మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి ఒక పక్షి అర్ధనుమీలితంగా జగత్తును చూస్తున్నది రెండవది కనులు విప్పారి చూస్తున్నది విప్పారి చూస్తున్న పక్షి అర్ధనుమీలితంగా అంటే సగం మూసుకున్న కళ్ళతో జగత్తును చూస్తున్న తన తోటి పక్షితో ఏమంటున్నది అంటే చూడు నీల నిర్మల ఆకాశం నదీ నదాలు కొండలు కోనలు వాగులు వంకలు గుట్టలు పిట్టలు మిట్టలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ వదిలీ దేనిని చూద్దామని అట్లా చూస్తున్నావు నీకు జీవితం ఒకటే కదా నెమ్మదిగా ఇటువైపు రా అంటోంది కనులు సగం మూసుకుని సగం తెరుచుకున్న పక్షి ఏమంటున్నది అంటే మిత్రమా నువ్వు చూస్తున్నవన్నీ కూడా కదలిపోయేవి కరిగిపోయేవి జారిపోయేవి కూలిపోయేవి మాసిపోయేవి నువ్వు చూస్తున్నావు నిరంతరం మార్పు చెందుతూ నిన్న ఉన్న చెట్టు నిన్న ఉన్నట్టుగా లేదు నిన్న ఉన్న కాలువ ఈవేళ ఉన్నట్టుగా లేదు నిర్మల ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకాశం పిడుగులతో మెరుపులతో అనేక విధాలుగా అది యాతన పడుతూ ఉన్నది ప్రకృతిని నువ్వు చూస్తున్నావో అది అశాశ్వతమైనది శాశ్వతమై నిత్యమై నిఖిలమై సుందరమై చైతన్యమై శివాత్మకమై ఉన్న నీ ఆత్మను నీవు దర్శనం చేసుకోలేకపోతే ఎట్లా అని అంటూ నీవేమో బయటకు చూస్తూ ఉన్నావు నేను లోపలికి వెళ్లే ప్రయత్నంలో సగం దారిలో ఉన్నా దారిని గనుక నేను వె-- పుడిగించగలిగితే నా లోపలికి నేను చూసుకోగలిగిన నాడు నాకు నిఖిల ప్రపంచం అంతా కూడా చిన్న బొమ్మై చిన్న అణువై అణువులో లక్షోగంటుగా బిందు ప్రమాణంగా నాకు కనిపిస్తుంది అదే నాదబిందు కళాయోగము యోగంలోకి వెళ్ళాలి అనేటువంటి పరమ గుహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా పరీక్షిత్ మహారాజుకి ఇలాగే చెప్పాడాయన కాప్తా రో సంస్కృతంలో చెప్పాడు అనంతమైన అమృత భావాలన్నీ నిర్మోహత్వం వైపు మనం నెమ్మదిగా వెళ్ళాలి that is really called detached attachment మరి attached detachment ఏమిటి అని ఇక్కడ కూర్చొని నేను మా ఇంటివైపు చూసినా నా వ్యాపారం ఏమైపోతుందో అయ్యో అక్కడ ఏమైపోయిందో అయ్యో నా స్నేహితులు ఏమైపోయినారో అన్నప్పుడు అది attached detachment కాసేపు నేను కూడా బయట పడ్డాను అనుకోవటానికి తప్ప అది కాదు.కావలసింది detached గా attachment ఉండాలి. మనం ఒకరోజు వెళ్ళి భార్య భర్త దగ్గరకు, భర్త భార్య దగ్గరకు వెళ్ళి, "ఇవాళ నుంచి నీకూ నాకూ attachment లేదు" అన్నాడనుకోండి, సంసారం కుప్పకూలిపోతుంది. అంతే కదా! ఒక మానసిక బాంధవ్యంలో attachment detachment సన్నటి సీమారేఖ. ఒక దారపు పుట్లి. attached గా ఉన్నట్లే ఉండాలి. కృష్ణుడు ఉన్నాడు. ఆయనకేంటి యుద్ధం ఎందుకు చేయాలి? ఇదిగో పరీక్షిత్ మహారాజు, "ఏదో ఏడు రోజులు అయిపోయాక ఎలాగో పోతాం కదా, భాగవతం అంతా నేను ఇప్పుడు విని నేను చేయగలిగింది ఏం లేదు కదా" అంటే, కనీసం పోయేలోగాన్నా వినగలిగానుగా తృప్తితో ఉండాలి. మనం కూడా కార్యక్రమాన్ని మనం తలపెట్టినా, "ఇదంతా ఎందుకు? ఇంత యాతన పడటం ఎందుకు?" అనుకునే కంటే, భగవంతుడు యోగం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బంధువులను ఇచ్చాడు, పరమ మిత్రులను అనుగ్రహించాడు, సత్సంగంలో ఉన్న సత్సంగాల్ని-- ఆ.. సత్సంగ సభ్యులను ఇచ్చాడు. వీళ్లందరినీ ఒక చోట చేర్చాడు. చేర్చడానికి కావలసిన వనరులు ఇచ్చాడు. ప్రకృతి సహకరించింది. ఇంతకు మించి నాకు ఏం కావాలి అనుకున్నప్పుడు that is the detached attachment. అంతే. అంతే తప్ప మరొకటి కాదు. ఇవన్నీ జరగాలి. detached గా ఉండవలసిందే మనకు తెలియదా? మన దగ్గర ఉన్న మన జేబులో ఉన్న వంద రూపాయల నోటు, వంద రూపాయల నోటైనా మన జేబులోకి వచ్చిన తర్వాత కనీసం ఒక పది రోజులన్నా అదే రూపంలో అదే చోట ఉన్నదా? లేదు. ఇంతవరకు లేదు. జేబన్నా మారుతుంది, జేబులన్నా మారుతున్నది. కానీ మారుతూ ఉన్నది, వెళుతూ ఉన్నది. కాలం కూడా ఇది అనంత ప్రవాహం. మలుపులు తిరుగుతూ ఉంటుంది. మానవ జీవితంలో మరణము is a constant factor. అది సత్యం. దాని గురించి ఆలోచించడం కూడా వృధా. వృధా అయిన దాని గురించి పండితుడైన వాడు, చదువుకున్నవాడు, విజ్ఞుడైన వాడు, ప్రజ్ఞుడైన వాడు, తెలివితేటలు గలవాడు, కనీసం సంస్కారం ఉన్నవాడు విచారించ తగని దాని గురించి విచారించడు. దేనిని విచారించాలంటే, "అయ్యో! నలభై ఏళ్ళు వచ్చాయే, యాభై ఏళ్ళు వచ్చినయే, మా నాయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భాగవతం పుస్తకాలు ఇచ్చాడు, భగవద్గీత బుక్కు కొనిచ్చాడు చదువుకోరా నాయనా అని. కానీ ఇంతవరకు తరవనే లేదు. ఏమిటి మళ్ళీ నేను ఎప్పుడు చూడగలను? చదవగలనా? ఒకవేళ చదువుదామన్నా ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కళ్ళు కనపడవు." చదువుదామని ఉంటుంది guilt feeling వల్ల. అప్పుడు మనవడు ఎదిగి వచ్చాడు. కొడుకు ఎలాగూ మాట వినడు time లో. మనవడిని పట్టుకుంటాడు తాతగారు. "ఒరేయ్ భాగవతంలో రెండు పద్యాలు చదవరా" అంటాడు. "తాతా నాకు time లేదు. నేను చేయవలసిన పనులు నాకున్నాయ్" అంటాడు. చదివి వినిపించే వాడు లేడు, చదివి చెప్పేవాడు లేడు. ఒకవేళ చెప్పేవాడి దగ్గరకు వచ్చినా వినటానికి చెవులు లేవు. కృష్ణుడు ఎలా ఉంటాడో చూద్దామంటే బొమ్మ చూస్తానికి కళ్ళు లేవు. మరి ఇవన్నీ మనకివ్వేళ మనం దివ్యాంగులం కాదు, సర్వాంగులం. మనకసలు లోటూ లేదు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే రకమైన లోటులేని జన్మనిచ్చాడే. ఇంకా ఎవరితోనో పల్చుకుంటే మనది చిన్న జీవితం కావచ్చు. కానీ మన జీవితాన్ని మనం తలాస్పర్శగా ఒక outer line లో గనక దాన్ని అర్థం చేసుకున్నట్లయితే పరీక్షిత్ మహారాజుకి లేనిదేమున్నది? సంపద గాని, వంశ కీర్తి గాని, పాండవ వంశ దుగ్ధంలో నుంచి క్షీరసాగరంలో పుట్టినటువంటి, కామధేనువు వంటి, కల్పవృక్షం వంటి, చంద్రుడు వంటి, మహాలక్ష్మి వంటి ఒక మహదైశ్వర్యంతో పుట్టాడే. మరి ఈయనకు వైరాగ్యంలో విన్నాడా అంటే, వైరాగ్యంలో వినలా. తత్త్వం తెలుసుకుందామని విన్నాడు. తత్త్వం తెలుస్తున్న మరుక్షణము ఆయన ముక్తుడయినాడు. ముక్తి అనేది separate state కాదు. ఎప్పుడైతే బంధనాలు తెగిపోతాయో, ప్రాపంచికమైనటువంటి విషయ వాంఛలన్నీ విష్ణు వాంఛలైపోతాయో, ఎప్పుడైతే అరిషడ్వర్గాలు-- స్వచ్ఛసాయి భగవానులు చెప్పారు, "అరిషడ్వర్గాల గురించి ఆలోచించకండి. వాటిని మీరు జయించలేరు. అట్లా అని మీరు నిరాశ పడకండి. 'అ' కొట్టేసేయండి, place లో 'హ' రాసుకోండి" అన్నారు. అరిషడ్వార్గ కామ, క్రోధ, మోహ-- మనందరం గబగబా చదివేస్తాం. వాటిని మీరు జయించలేరు. "మరి ఏం చేయాలి స్వామి? మాకు కూడా జయించాలి ఉంది" అంటే, "దానిని హరిషడ్వర్గాలుగా మార్చుకోండి. భజన, సంకీర్తన, ప్రేమ, సేవ, విచక్షణ, అపారమైనటువంటి మేధ. వీటి ద్వారా విష్ణు చింతన చేయండి. విషయ వాంఛను తగ్గించుకోండి, విష్ణు వాంఛను పెంచుకోండి. దీనిని మించిన మార్గం మరొకటి లేదు" అని చెప్పారు. అరిషడ్వర్గాలను జయించాడంటే ఇందాక చెప్పారు. అరిషడ్వర్గాలను జయించడం కష్టం కాదు, జయించబడిన అరిషడ్వర్గాలతో జీవించడమే చాలా కష్టం. అటువంటి మహోదాత్తమైనటువంటి సందర్భాలన్నింటినీ మనం పునః స్మరించుకుంటూ ద్వితీయ స్కంధాన్ని ఇవాళ మనం పూర్ణం చేసుకున్నాం. ద్వితీయ స్కంధం పూర్తి అయిన తర్వాత, ఇక తర్వాత ఏమిటంటే చతుర్థ, పంచమ, షష్టి వరకు తీవ్రమైన విచారణ ఉంటుంది. చాలా deep. deep ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరికి ఆనందం కలుగుతుంది అంటే ఇప్పటికే ధ్యానంలోనో, ఒక యోగంలోనో, ఒక rational thinking ఉన్నవారికి, యదార్థ స్థితిని అనుభవించడానికి మనస్సును సిద్ధంగా చేసుకున్నవారికి, సిద్ధమైన మనసుతో అంటే equi poise, equilibrium and equanimity. సమస్థితి ఎవరి హృదయంలో ఉన్నదో వాళ్ళకి చతుర్థ, పంచమ, షష్ఠ అంటే మూడు, నాలుగు, ఐదు. దానికంటే ముందు కాస్త పూర్వరంగంలో తృతీయ స్కంధం మనకి కొంత చెబుతుంది. వీటన్నింటినీ కూడా స్థాలీపులాకంగా తత్వ విచారణలో చెప్పాలి. ఇప్పుడు ఇవాళ కథలే చెప్పటం మొదలు పెడితే ప్రథమ స్కంధం కూడా అయ్యేది కాదు. కథ చెప్పటం narration లో చాలా time తీసుకుంటుంది. వాడు వచ్చాడు, వీడు కూర్చున్నాడు, వాడు బాణం వేశాడు, బాణం పోయింది అని, అవన్నీ ఉన్నాయి కదా! మనం తెలుగు వాళ్ళమే! పోతరామాచార్యుల భాగవతం చదువుకోండి. దానిలో కొన్ని అత్యుత్తమమైన పద్యాలుతత్వాన్ని గురించిన పద్యాలు ఎన్నెన్ని ఉన్నాయో కేవలం మనం రుక్మిణీ కల్యాణం లో నాలుగు పద్యాలు ప్రహ్లాద చరిత్ర లో నాలుగు పద్యాలు చదివి భాగవతం నాకు వచ్చు అనుకుంటాం కానే కాదు ఉన్నదంతా ప్రథమ నుంచి షష్టమ స్కంధం దాకా వస్తం ఇక సప్తమానికి వచ్చేప్పటికి ప్రహ్లాదుడు వస్తాడు అష్టమ నవమ అది వేరే మార్గంలో తీసుకు వెళితే దశమ స్కంధంలోకి వచ్చేప్పటికి ఇక మామూలు ప్రవచనంగా కృష్ణుడి కథే చెప్పాలి కానీ మనం అది కూడా చెప్పం కృష్ణ తత్వంలో దాగినటువంటి పరిపూర్ణమైన దివ్యత్వం ఏమిటో అది నమిషారణ్యంలో ఆవిష్కరించుకుందాం ఎప్పుడూ విన్న దశమ స్కంధంలో ఉన్నటువంటివే ఉండవ్ ప్రహ్లాద చరిత్ర గాని వామనావతారం గాని గజేంద్రమోక్షణం గాని ఇవి ఏవీ కూడా ఇప్పటి వరకు చెప్పబడినట్లుగా ఉండవ్ ఇవి పరిణామ క్రమంలో ఒక ఆధ్యాత్మిక సీమలో అనంత మహా స్థితిలో భావ సౌందర్యంతో భాషా వైశృద్యంతో నిరంతరమైనటువంటి స్వాధ్యాయంతో ఆంతరంగికమైనటువంటి ఒక అనుభూతితో వాటిని మనం ఆవిష్కరించుకోవటానికి భగవాన్ సత్యసాయి అలాగే అనేక మంది గురువులు ఒక యోగాన్ని మనకు అనుగ్రహించిన కారణంగా మనమంతా కూడా రేపు మార్నింగ్ తృతీయ స్కంధాన్ని కాస్త లోతుగానే చేద్దాం రేపు తృతీయ చతుర్థ సాధ్యమైనంత వరకు complete చేద్దాం ఎందుకంటే దశమ స్కంధానికి చాలా సమయం కావాలి మనకి మధ్యలో మూడో తారీఖున సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి గనుక ప్రవచనం లేదు అంటే మనకు రెండు గంటలు లేవు రెండు గంటలని మనం ఇక్కడ కాస్త కుదించుకుంటూ కానీ భావంచడకుండా అర్థంపోకుండా చెప్పబడిన విషయం చేయి జారకుండా మనం దాటి పోకుండా దాటవేయకుండా ఇటువంటి ఆవిష్కరణ చేసుకునే దిశగా మన మనస్సులని ఆయత్తం కావాలని ఆయత్తమైనటువంటి చిత్తంతో మన హృదయాన్ని పరిపూర్ణము పరిశుభ్రము పరమాత్మ వైపు వెళ్లగలిగినంత స్థాయిలో దాన్ని నడిపించే దిశగా మనం వెళ్లాలని వెళ్లటానికి కావలసిన యోగాన్ని దానికి కావలసినటువంటి అన్ని సందర్భాలని పరమేశ్వరుడు మనకు నిండుగా అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ క్షణానికి పొద్దున అనుకున్నట్లుగా ప్రవచనం అయిపోగానే ఎవరూ ఎక్కడి నుంచి కదలకండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మీ స్థానంలో మీరు కూర్చొని దీన్ని కుంభకం చేయండి చెప్పబడినవన్నీ మీ దగ్గర నిలబెట్టుకోండి ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండండి అలా urgent గా పరిగెత్తుకుని వెళ్ళటానికి ఏం లేదు దూరం ఏం లేదు గది నుంచి గది బయటకు వెళ్లి మాట్లాడుకునేవి లేవు కాబట్టి మహా నిశ్శబ్దంలో ధ్యానంలో అంటే ఏకాగ్రంగా మీరు ఉన్నట్లయితే ఏడు నిమిషాల తర్వాత మనం ఎలాగూ బయటకు వెళ్తాం సాయిరాం [భక్తి సంగీతం]
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 27:29

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

    Now playing
  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22