Skip to content
Transcript తెలుగు
మహారాజుకి ఆయనకున్న ఏడు రోజుల్లో నాలుగు రోజులు అయిపోయింది. ఐదో రోజు దగ్గర పడిపోయింది. ఉండేది రెండు రోజులే మరి పరీక్షిత్ మహారాజుకి ఇంకా ఏదో కృష్ణుడి గురించి మా యాదవ కులం మా కులాన్ని రక్షించిన, మా వంశాన్ని రక్షించిన, మా రాజ్యాన్ని రక్షించిన, మా తాతలను రక్షించిన కృష్ణ పరమాత్మ గురించి ఏమి చెప్పలేదే చెప్పమని అడిగాడు. ఎవరిని? సూత మహామునిని అడిగాడు. సూత మహాముని శౌనకాది మునుల నుంచి విన్నాడు. శౌనకాది మునులకు ముందు చెప్పిన వారు శుకదేవుడు గనుక శుకదేవుడు ఓహో! ఈతనికి ఇంకా కొద్ది సమయమే ప్రపంచంలో ఉండటానికి వీలుంది గనుక దీనిని చక్కగా శుభగ శయ్యాగతంగా అంటే హాయిగా ఆయన కథలన్నీ లీలలన్నీ పాడుతూ ఆటలన్నీ చెప్పుకుంటూ వినోదాత్మకంగా కానీ విశిష్టాత్మకంగా దశమ స్కంధాన్ని చెప్పాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఎవరు? శుకదేవుడు. కనుక ఎక్కడ ప్రారంభించాలి పరీక్షిత్ మహారాజు అడిగాడు. కృష్ణుడి గురించే చెప్పమని అడిగాడు. కృష్ణుడు తొమ్మిది ఇంట్లలో లేడు. తొమ్మిది ఇంట్లో ఉన్నది ఎవరంటే మహావిష్ణువు ఉన్నాడు తప్ప కృష్ణుడే లేడు. ఇప్పుడు కృష్ణుడు ఇవాళ వస్తున్నాడు. ఇవాళ సూర్య నమస్కారాలు అవన్నీ ఇందాక వారు చెప్పారు కదా అన్నింటికంటే మించి ఇవాళ ఎంత గొప్ప రోజు అంటే ఈరోజు దాని పేరు మహా సప్తమి. Throughout సప్తమి ఉంది ఇవాళ. నా దగ్గర calendar లేదు గాని ఇవాళ మహా సప్తమి. అంతవరకు మనసుకు తెలుస్తున్నది. మహా సప్తమి ఏమిటంటే ఏడు స్కంధాలు దాటిన తర్వాత అలాగే సప్తజ్ఞాన భూమికలని మనకుంటాయి. సప్తజ్ఞాన భూమిక జ్ఞానము ఏడు భూమికలుగా ఉంటాయి. ఏడు మెట్లుగా ఉంటాయి. ఏడు మెట్లు ఎక్కితే తప్ప అసలు జ్ఞానం మనకు అర్థం కాదు. అనుభవంలోకి రాదు. కాబట్టి ఇవాళ మనం చెప్పుకోబోతున్నటువంటి శ్రీకృష్ణ గాథ ఏదైతే ఉన్నదో అది మహా సప్తమి నాడు ప్రారంభం అవుతున్నది. ఆయన ఎట్లాగైతే అష్టమి నాడు అక్కడ పుట్టాడో ఈరోజు రాత్రికి ఆయన పుట్టబోతున్నాడు. చూశారా! రెండు ఎట్లా సమన్వయం అయిపోయినయో మనం అనుకున్నామా? తిథులు లెక్కపెట్టుకొని ఇక్కడికి రావాల dates మాత్రమే మనకు గుర్తున్నాయి. సప్తమి అవ్వగానే అష్టమి కృష్ణుడు బయటికి వస్తాడు. కృష్ణ పరమాత్మ యొక్క దివ్యలీలా వైభవాన్ని ఇవాళ హాయిగా మనం మాట్లాడుకుందాం. రాముడు ఎలా వచ్చాడో చెప్పుకున్నాం కృష్ణుడు ఎందుకు వచ్చాడో తెలియాలి. ఆయన అవసరం ఏముంది అని. శ్రీకృష్ణ పరమాత్మ అవతారమూర్తి అయి రావటానికి గల కారణం ఏమిటంటే కేవలం ఒక కంసవధ కాదు. అదితి కశ్యపుడు అనేటువంటి జంట పరమ పవిత్రమైనటువంటి జంట. వాళ్ళు వాళ్ళే తర్వాత దశరథుడు కౌసల్యగా వచ్చారు. కనుక ఒక పరమాత్మ ఒక చిచ్ఛక్తి మానవ దేహం తీసుకుని రావాలి అంటే అంత పవిత్రమైన గర్భాలయం ఉండాలి. అందునా అదితి కశ్యపుల తపస్సంతా ఒకటే. పరమాత్మ మా కడుపున పుట్టాలి అని ఇంకేం లేదు. ముఖ్యంగా అదితి. సరే! దితి రాక్షసుల తల్లి మనందరికీ తెలుసు. కానీ అదితి సౌమ్యురాలు సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి. సరే! అట్లాగే పుడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా పరమాత్మ జగత్తులోకి రావలసిన అవసరం ఆనాడు ఏర్పడింది. ఇవాళ్టికి భగవద్గీత చెప్పబడి ఐదువేల ఐదువందల డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిపోయాయి. అంటే ఐదువేల ఐదువందల ఎనభై సంవత్సరాల క్రితం భగవద్గీతని కృష్ణుడు చెప్పాడు. కదా. దానికి నిన్న అనుకున్నాం నూట ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు ఆయన జీవించాడు. దీన్ని దానికి కలిపితే ఐదువేల ఎనిమిది వందలు సుమారుగా ఐదువేల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో ఆయన జన్మ ఎత్తాలి. ఎందుకు ఎత్తాలి? ఇది ప్రశ్న. యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత: అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం గాడి తప్పుతున్నది. అధర్మం ప్రజ్వరిల్లి పోతున్నది. మర్యాదస్తుడికి మానప్రాణాలకు భంగం అయ్యే పరిస్థితి వచ్చింది. స్వకీయమైనటువంటి తనదైనటువంటి సంపద పరుల పాలైపోతుందేమో అనే భయం ఒకటి ఏర్పడింది. యజ్ఞయాగాదులు వెనక్కి వెళ్లిపోయినయి. ఇదిగో ఇటువంటి యజ్ఞాలు వ్రతాలు అన్నీ కూడా వెనక్కి వెళ్లిపోయినయి. ఇవి మాకు ఎందుకు అంటున్నారు? అప్పుడు కాలంలోనే. మాకు కావలసిందంతా ఆస్తి భూమి కావాలి. ఆస్తి కోసమేగా ఐదుగుళ్ళ కోసమేగా మహాయుద్ధం జరిగింది. పోనీ ఎవరన్నా పక్కవాడి మీద యుద్ధం చేశారా అంటే జ్ఞాతులు దాయాదులతోనే యుద్ధం. అది మొత్తం కలిపితే మహాభారతం. అంటే కలియుగంలో ఇంకా ఇంట్లో కూడా ఉండదు యుద్ధం. దాయాదులతో కూడా ఉండదు. అన్నగారు తమ్ముడిని తమ్ముడు అన్నగారిని చంపుతుంటాడు. మనం paper లో చూస్తుంటాం కదా. కన్నబిడ్డే తల్లిని సంహరిస్తాడు. దేనికోసం అంటే కేవలం డబ్బు కోసం. కేవలం ఆస్తి కోసం. ముసలమ్మ దగ్గర ఒక ఎకరం పొలం ఉంటుంది. ఆమెకు దురదృష్టవశాత్తు ఇద్దరు కొడుకులు పుడతారు. ఇద్దరు కొడుకులు ఆమెను చంపైనా ఎకరం తీసుకుంటారు. ఇది మరి కలియుగ ప్రభావం అని తప్పించుకోలేం కదా. కలియుగంలో ఇలా జరుగుతుంది అన్నప్పుడు కొడుకులు సక్రమంగా ఉండాలి కదా పోనీ. ఇద్దరూ చెరిసగం పంచుకుంటారా అంటే పంపకాల దగ్గర తేడా వచ్చి అన్నగారు తమ్ముడినో తమ్ముడు అన్నగారినో చంపుతాడు. చివరికి మిగిలేది ఏం ఉండదు. ఏమీ మిగలదు. కథ సున్నా. ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు అందునా ప్రధానంగా వసుదేవుడు దేవకి ఇద్దరూ కూడా కారాగారంలో బంధింపబడి ఉన్నారు. ఎందుకని అంటే కంసుడు మంచివాడే మంచి అన్న నిజానికి.చెల్లెలి వివాహం చేయించి రథంలో తీసుకుని వెళుతున్నప్పుడు ఎక్కడో ఒక అశరీరవాణి "నువ్వు మృత్యువును వెంబడి పెట్టుకు వెళుతున్నావు" అని వాడికి అనిపించిందో వినిపించిందో వెళుతూ వెళుతూనే ఒక గదిలో ఉగ్రసేన మహారాజు అంటే కంసుడి తండ్రిని బంధించాడు. రెండవ దాంట్లో వసుదేవుడిని, దేవకిని బంధించాడు. "మీరు ఇక్కడే ఉండండి లేకపోతే మీరు వినకున్నట్లైతే నా రాజ్యానికి అడ్డము" అని అది రోజుల్లో ప్రారంభమైంది అన్నమాట. సరే ఎనిమిది మంది దేవకి గర్భంలో పుడతారు "వాళ్లలో ఒక్కరి వల్లనో నీకు మరణం తప్పదు" అని ఒక అశరీరవాణి వాడికి చెప్పింది. క్షణం నుంచి చెల్లెలు పట్ల వాడికి అభిమానం పోయింది. చెల్లెలే మృత్యుదేవతగా కనిపిస్తూ ఉన్నది. అట్లా మన కథ ప్రకారంగా ఏడుగురిని చంపేశాడు అతను. చంపిన తర్వాత ఇక అష్టమ గర్భం రావాలి. అష్టమ గర్భంలో ఎవరు రావాలి? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయించుకున్నారు. అదితి కశ్యపులు ఒకనాడు తల్లిదండ్రులు అయినారో వాళ్ళ గర్భంలోనే వాళ్ళ ద్వారానే నేను ప్రపంచంలోకి రావాలి అని అనుకున్నాడు. అనుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఇందాక చెప్పిన ఇవాళ రాత్రికి అనుకోండి అర్ధరాత్రికి అష్టమి వేళ ఆయన ప్రభవించాడు ఆమె ప్రసవించింది. కానీ ఎలా ప్రసవించింది అంటే సర్వాభరణాలతో వచ్చాడు బిడ్డ. అది అత్యంత అసహజమైనటువంటి స్వరూపం పుట్టిన బిడ్డ వాడ-బిడ్డకి మనం నగలు చేసి వేయాలి కానీ ఆయన నగలతో వచ్చాడు. కాళ్ళకి అన్ని కడియాలు తగిలించుకొని చేతికి తగిలించుకొని ఒంటినిండా ఆభరణాలు పెట్టుకొని సన్నటి పొట్టతో నీల వర్ణంతో ఆయన పుట్టాడు. దేవకి తేజస్సుకు మురిసిపోయింది. అంతకు ముందు పుట్టిన ఏడుగురు బిడ్డలకి తేజస్సు లేదు సాధారణంగా పుట్టారు వాడి చేతిలో పోయినారు. కానీ ఇతను ముద్దు కొలిపేట్టుగా ఆనందంగా ఉన్నాడు హాయిగా నవ్వుకుంటున్నాడు స్వేచ్ఛగా ఉన్నాడు. అప్పుడు ఇతడిని కూడా సంహరిస్తాడు కంసుడు మామూలుగా ఉంటేనే చంపేశాడు ఇట్లా అసాధారణంగా కనిపిస్తే ఇంకా నిలవనివ్వడని మొట్టమొదట దేవకి ఒక ప్రార్థన చేసింది. "నాయనా! నా కడుపున మామూలు బిడ్డగా ఉన్నట్టుగానే ఉండు నాకీ దర్శనం అయిపోయింది చాలు నాకు. నువ్ ఇట్లా ఆభరణాలతో గనక ఉంటే నీ మామ కంసుడు నిన్ను బతకనివ్వడు గనుక వీటిని ఉపసంహరించుకో" అన్నది. ఉపసంహరించుకున్నాడు. అప్పుడు వసుదేవుడు దేవకి ఇద్దరూ కలిసి "ఇంత దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న నువ్వు మా ఇంట మా కడుపు పంటగా పుట్టాలి అని ఎందుకు అనుకున్నావు? అసలు నువ్వు ఎవరు?" భగవంతుణ్ణి మనం అడగాలి నువ్వు ఎవరిని అడగాలి ధైర్యంగా అడగాలి. చెప్తారా చెప్పరా వారి ఇష్టం కానీ మనం కూడా అడగాలి మీరు ఎవరు అని. సరే అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా కృష్ణుడు కాదే పసిబాలుడు ఏమన్నాడంటే "ఇప్పుడు దేహం మీకు బాగుందా?" అని అడిగాడు తల్లిని. "ఇట్లా హాయిగా ఉన్నావు నాయనా మాకు అసలు భయం లేదు ఆభరణాలు ఉంటే మా సంగతి వదిలిపెట్టు మీ-నీకో మేనమామ ఉన్నాడు" అని వాడి వాడి దుర్మార్గం అంతా కాస్త ఆవిడ చెప్పుకుంది అన్నగారే. ఇంతకీ నువ్వు ఎవరు అన్నప్పుడు "ఒక జన్మలో అదితి కశ్యపులుగా ఉన్న మీకు వసుదేవా! నీ పేరు సుతాపుడు. మంచి తపస్సు చేసిన వాడు పేరు. దేవకి! నీ పేరు ప్రష్ణి, ప్రష్ణి. కాబట్టి రోజుల్లో నన్ను ఏమని పిలిచేవారు అంటే మీ కడుపునప్పుడు పుట్టా ఒక జన్మలో. నాకేం పేరు పెట్టలేదు ఎవరూ ప్రష్ణి గర్భుడు ప్రష్ణి గర్భుడు అని నన్ను పిలిచారు. అట్లా అవతారం పరిసమాప్తం అయిపోయింది. అది ఎట్లా అయింది ఏమైంది మీకక్కర్లా కానీ అప్పుడు మీరు ఒక ప్రష్ణి గర్భుడికి జన్మ ఇచ్చారు. ఇక రెండవది అదితి కశ్యపులే మళ్ళీ అదితి ఏమడిగింది అంటే 'కొడుకు కావటం కాదు కావలసి రావటం కాదు అసలు నువ్వే నా కొడుకుగా రావాలి' అని అడిగింది. వచ్చినప్పుడు నేను వటువుగా పుట్టాను వామనుడై పుట్టాను అప్పుడు భూమిని రక్షించాను నేను దానవ-దానవేశ్వరుడు అయినటువంటి బలిని దగ్గర నుంచి దానం తీసుకొని భూమిని ఆకాశాన్ని భూమిని కాపాడుకోగలిగాను అప్పటి నుంచి నన్ను కాలంలో ఏమని పిలిచారంటే మాధవా అని పిలిచారు. ప్రష్ణి గర్భుడు అని నోరు తెరక్క వాళ్ళు నారాయణుడు నారాయణుడు నారాయణ తేలిగ్గా ఉంది కదా ఎక్కడా అక్షరం కింద అక్షరం లేదు కాబట్టి వాళ్ళు అలా నారాయణ అని పిలిచారు. ఇదిగో అదితి కశ్యపులకు వామనుడిగా పుట్టినప్పుడు నన్ను మాధవా అని పిలిచారు. మాధవా అని ఎందుకు పిలిచారు? భూమిని రక్షించాను భూమిని భరించాను మా అంటే తల్లి ధవా వామ భూమిని ధరించినటువంటి వాడు భూమికి భర్తగా ఉన్నాను భర్త అంటే యజమానిగా ఉన్నాను అప్పటి వరకు నన్ను మాధవా అని పిలిచారు ఇదిగో మళ్ళీ మీరే అదితి కశ్యపులు ఇవాళ వసుదేవుడు దేవకిగా ఉన్నారు మీకు నేను కుమారుడిగా వచ్చాను కుమారుడిగా వచ్చినటువంటి నాకు నన్ను ఏమని పిలుస్తారో నాకు తెలియదు" అని వదిలేశాడు ఆయన. ఆయన పేరు ఆయన పెట్టుకోలా అంతకుముందు కూడా ఆయనకు ఎవరు పేరు పెట్టలే. ఇలా పిలవబడేవాడిని అని మాత్రం చెప్పుకున్నాడు. వసుదేవుడు ఇది విని ఒక వామనుడు ఒక కృష్ణి గర్భుడు వంటి వాడు మళ్ళీ మా అదృష్టవశాత్తూ మా కడుపున పుడితే ఇతన్ని తెల్లవారే లోగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలి, రక్షించుకోవాలి అది మన బాధ్యత అనుకున్నాడు.సరే కథ అంతా మీకు తెలుసు తట్టలో పెట్టుకొని యమునా నది అయితే పుట్టిన తర్వాత ఉన్నటువంటి వాతావరణాన్ని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా చీకటి చిమ్మ చీకటి యమునా నది పొంగిపోయింది ఇవన్నీ చెప్పుకున్నాం కానీ కృష్ణుడు పుట్టినప్పుడు మంగళ ధ్వనులు వినిపించినాయి ప్రకృతి అంతా కూడా నానా నాద సందోహంగా వినిపించింది ప్రకృతి పులకరించింది యమునా నది ఉప్పొంగింది అది ప్రళయంగా రాలే ఉప్పొంగుతూ ఉన్నది ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క రాకని స్వాగతం పలికినాయి కృష్ణుడి విషయంలో కూడా అవే జరిగినాయి మునులు తర్పణ ఇవ్వలేదు గాని మునులంతా ధ్యానులైనారు ధ్యాన మగ్నమైనటువంటి స్థితిలో ఒక పరమాత్మ ఇక్కడ ఎక్కడో పుట్టాడు ఎవరో వచ్చాడు అటువంటి ఆయనే వచ్చిన సమయంలో మన శక్తిని మన శాస్త్రాన్ని మన తపస్సుని అన్నింటినీ కూడా పరమేశ్వరుడికి సమర్పణ చేసే భావనలో ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు పనిలో ఉన్నారు సరే యమునా నది దారి ఇవ్వటం అదే సమయంలో వ్రజ భూమిలో యశోదా దేవి కూడా ఒక బిడ్డని కన్నది ఆమె ఆడబిడ్డని కన్నది వసుదేవుడు అక్కడికి వెళ్ళి తనకు పుట్టినటువంటి బిడ్డని ఆమె పక్కలో పడుకోబెట్టి అక్కడ పుట్టినటువంటి మళ్ళీ చెరసాలలోకి వచ్చి ఉండిపోయినాడు మరి ఇది అన్యాయం కదా తన బిడ్డను రక్షించుకోవటానికి ఇంకొకళ్ళ ఆడబిడ్డని బలి చేయటం కంసుడు ఎలాగూ చంపుతాడు వీళ్ళకి కానీ వసుదేవుడికి దేవకికి ఒకటి తెలుసు దేవ రహస్యాలు చాలా గట్టిగా తెలిసిన వాళ్ళు వాళ్ళు మామూలు దంపతులు కారు కదా పుట్టినటువంటిది ఎవరు అంటే యోగ మాయ యోగ మాయని దేవకి దగ్గరికి చేర్చాలి ఇక్కడ పుట్టినటువంటి అసలు యోగము లోకమాయగా జగత్తులోకి వెళ్ళాలి ఇది రహస్యం అంతే తప్ప ఆడపిల్ల ఎవరో ఒకళ్ళు చంపేస్తారులే మా పిల్లవాడు బతుకుతాడు అని తీసుకు వెళ్ళలా సరే రాత్రికి వచ్చారు ఆడపిల్ల పుట్టింది కంసుడు రానే వచ్చాడు ఇట్లా మగ పిల్లవాడు పుట్టాడు అనే వార్త వాళ్ళకి తెలియల తెలియకుండానే ఆయన వెళ్ళిపోయినాడు అక్కడికి ఆడపిల్ల పుట్టింది అనగానే ఆడపిల్ల నన్నేం చేస్తుంది అనుకున్నాడు అనుకొని ఎడం చేత్తో బిడ్డని గాలిలోకి ఎగరేశాడు ఎగరవేసి కత్తి ఇలా నిలబెట్టాడు భాగవతం వర్ణన ఇదంతా అంటే బిడ్డ వచ్చి కత్తి మీద పడి ముక్కలై మరణించాలి వాడి కోరిక అది ఎప్పుడైతే గాలిలోకి వదిలాడో పిల్ల గాలిలో నిలబడిపోయింది ఆమె యోగ మాయ యోగ మాయ చెప్పింది చూడు నీ మరణ రూపంలో ఇప్పటికే నీకు మరణ శాసనము మరణము విధించబోయేటువంటి ఒక మహాత్ముడు జన్మ ఎత్తాడు నేను యోగ మాయను నన్ను నువ్వేమీ చేయలేవు క్షణం నుంచి నీకు మరణ యాతన ప్రారంభం అవుతుంది నువ్వు వాణ్ని కనిపెట్టలేవు కానీ వాణ్ని నుంచి నువ్వు తప్పించుకోనూ లేవు కాబట్టి నీ చరిత్ర ముగిసింది అని యోగ మాయ చెప్పింది అంటే ఒక మాయ యోగ మాయగా అదే మాయ లోకమాయగా యోగ మాయము ఇక్కడ అంతర్ధానం అయిపోయింది లోకమాయ మాత్రం కృష్ణుడిగా వచ్చింది ఇంకా కృష్ణుడి పేరు పెట్టలే సరే నందుడు నంద కుమారుడు నంద కుమారుడు అని పెంచుకుంటున్నారు వాళ్ళు చాలా ఆనందంగా పెంచుకుంటున్నారు ఎందుకని యశోదా నందులకు అసలు బిడ్డలు లేరు ఆమె గర్భం దాల్చే అవకాశం కూడా కోల్పోయింది లేదు అవకాశం లేదు కానీ అటువంటి సమయంలో చూడండి యోగ మాయ వెళ్లి ఆమె గర్భంలో నుంచి ఒక ఆడపిల్ల రూపంలో వచ్చింది సరి ఇప్పుడు అక్కడ లేదు పిల్లలు నెమ్మదిగా ఈయన కంటే ముందు బలరాముడు ముందు నిజానికి కృష్ణుడి కంటే ముందు బలరాముడు వచ్చాడు బలరాముడు ఎలా వచ్చాడంటే మామూలుగా వచ్చాడు శంఖర్షణ రూపంలో వచ్చాడు హలాన్ని ధరించి వచ్చాడు నాగలి తీసుకుని వచ్చాడు అతి బలీయమైనటువంటి వాడు కృష్ణుడు నాజూకు అవతారం చాలా డెలికేట్ లలితమైన అవతారం అందుకనే దశమ స్కంధము కృష్ణమూలము అది లలిత స్కంధం అని కూడా అంటారు దాన్ని భాగవతం మొత్తం కూడా లలిత స్కంధం అంటే లేత కొమ్మ అని అర్థం లేతగా ఉంటుంది ఎప్పుడూ రసం ఊరుతూ చైతన్యంతో ఉంటుంది అని అర్థం సరే రాముడై వచ్చాడు రాముడు అంటే చాలా అందంగా ఉన్నాడు బలరాముడు కూడా కాబట్టి బలరాముడు అనేటువంటి పేరు ఎవరు పెట్టారు వాళ్ళలో వాళ్ళే పెట్టుకున్నారు అంటే కొద్ది క్షణాల తేడాలో ఇక్కడ కృష్ణుడు పుడితే అక్కడ బలరాముడు పుట్టాడు ఇంతలోకే గర్గి అనేటువంటి ఒక వాళ్ళ ఇంటి పురోహితులు ఆయన వచ్చారు పిల్లల్ని చూడటానికనే వచ్చారు పిల్లలు పుట్టారు అని చూసినప్పుడు నందుడు అయ్యా వీళ్ళిద్దరికీ మీరు నామకరణం చేయండి అని అంటే మళ్ళీ కృష్ణుడు చెరసాలలో ఏం చెప్పాడో గర్గి మహాముని కూడా అదే చెప్పాడు శంఖర్షణ రూపంలో ఈయన తెల్లగా ఉన్నాడు మంచి మంచి రంగులో ఉన్నాడు వామన రూపంలో వచ్చినప్పుడు చామంతి పసుపు రంగులో బంగారు వర్ణంలో వచ్చాడు కానీ ఇప్పుడు ఇతడు నీల వర్ణంతో వచ్చాడు కాబట్టి శంఖర్షణుడు కాదు కృష్ణ గర్భుడు కాదు మరొక మాధవుడు కాదు కృష్ణ అని పేరు పెడదాం అన్నారు కృష్ణ అంటే నలుపు అని అర్థం మీరు కృష్ణ అన్నది నల్లగా ఉంటుంది కదా యమునా నది అలాగే ఉంటుంది కృష్ణానది ప్రత్యేకంగా నల్లగా ఉంటుంది అందుకనే కృష్ణ పక్షమి కూడా మనకు ఏర్పడింది శుక్ల పక్షమి కృష్ణ పక్షమి చీకటిఆ నీలి రంగులో ఉంటుంది గనుక ఆయనకి కృష్ణ అని పేరు పెట్టాడు వీళ్ళకి బలరామ అని పేరు పెట్టాడు వాళ్ళు ప్రవర్ధమాన అవుతున్నారు ఇక కంసుడి పని ఏమిటి ఏమవుతుందో ఎక్కడ రాజ్యంలో ఎక్కడ పిల్లవాడు గాని పిల్ల గాని పుట్టినా వాళ్ళని అక్కడికక్కడే చంపేసేయమని order ఇచ్చాడు అలా భ్రూణ హత్యలు బాగా జరుగుతున్నటువంటి వేళ వీళ్ళు ప్రవర్ధమాన అవుతున్నటువంటి వేళ కృష్ణుడు బలరాముడు నందన కులంలో యదువంశంలో వాళ్ళు ఆనందానికి హేతువులైనారు. వాళ్ళంతా ఒక లీల అద్భుతమైన లీల చేయటం వాళ్ళకి అలవాటైపోయింది సమయంలోనే ఇంకా లీలలు చేసి ప్రవర్ధమానం కాకముందే పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే మనం పూతన చరిత్ర చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకోనక్కర్లా వినని వాళ్ళ కోసం ఒక నిమిషం చెప్తాం పూతన ఎవరు అంటే బలి చక్రవర్తి కూతురు రత్నావళి అని ఎట్లాగైనా ఒక స్త్రీగా పుట్టి అటువంటి జన్మ ఎత్తిన వాడికి పాలిచ్చి విషంతో కూడిన పాలిచ్చి నేను వాడిని చంపుతానని నిర్ణయం తీసుకుంది అందుకే జన్మ ఎత్తింది ఎత్తింది వచ్చింది కోలాహలంగా ఇల్లంతా కూడా పిల్లలతో ఆటపాటలు సాగుతున్నాయి బంధుమిత్రులంతా వచ్చారు సమయంలో పిల్లవాడికి నే పాలిస్తాను నాకు అవకాశం ఇవ్వమని అడిగింది ఎవరూ పట్టించుకోలే కానీ బహుసుందర రూపంలో వచ్చింది మామూలుగా ఉండే రూపాన్ని కాక ఒక ప్రత్యేక రూపాన్ని తీసుకొని వస్తే పోనీలే కాసేపు ఆడుకుంటాడు ఆమెతో కూడా అని పిల్లవాడిని అప్పజెప్పారు సరే అప్పజెప్తే పాలు తాగటం మొదలు పెట్టాడు. ఒక్క గుక్కలో ఒకే గుక్కలో పూతన శరీరంలో ఉన్నటువంటి విషాన్ని మొత్తం ఆయన తాగాడు ముందు ఆమె శరీరాన్ని శుభ్రపరిచాడు సాధ్యమేనా పసిపిల్లవాడు ఒక గుక్కలో ఒక ఒక స్త్రీలో ఉన్నటువంటి స్తన్యాన్ని మొత్తం తాగగలడా అంటే పరమాత్మ గనుక ఏదైనా చేయగలడు చేశాడు ఎప్పుడైతే అది పోయిందో ఆమెకి కక్ష కార్పణ్యము నెమ్మదిగా తగ్గటం మొదలు పెట్టింది మంచి ఆలోచన కలుగేలోగా కృష్ణుడి పని అది కాదు పూతన సంహారం చేయాలి మళ్ళీ అటువంటి పూతన ఇటువంటి భావాలతో ఎవరు జన్మ ఎత్తకూడదు కాబట్టి పూతన ఇక్కడ సమసిపోవాలి ఆయన మొదటి పని వినాశనమే వినాశాయచ దుష్కృతాం దుష్కర్మలు ఎక్కడుంటే దానిని సంహారం చేయటమే కృష్ణుడి యొక్క విధానం విధానంలో పాలు తాగటం మొదలు పెట్టాడు ఆమె శరీరం బరువు ఎక్కటం మొదలు పెట్టింది స్వేచ్ఛగా ఆడుకుంటున్నాడు ఆమె శరీరం మీద ఆడుకుంటుంటే ఆమె లోపల ఒక స్పందన కలిగింది ఓహో ఆనాడు ఇటువంటి బిడ్డని కని వాడికి తల్లి కావాలి అని అనుకున్నానని కదా మొదట్లో అందుకనే ఒక తల్లి ఒంటిమీద పిల్లవాడు ఎలా ఆడుకుంటున్నాడో నాకు మాతృత్వాన్ని అనుగ్రహించిన కృష్ణ పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అనుకుంది పూతన తర్వాత పూతన మరణించింది మరణించగానే దేహం సౌందర్యం పోయింది లేదు చాలా విశాలమైన అటువంటిది ఏర్పడింది సమయంలో నందుడు లేడక్కడ నందుడు ఎక్కడున్నాడు వసుదేవుడిని చూద్దాం అని వెళ్ళాడు అంతా బాగుంది అని చెప్పడానికి ఇట్లా మాకు పిల్లవాడు పుట్టాడు వాడికి కృష్ణ అని పేరు పెట్టాం అవన్నీ చెప్పడానికని వెళ్ళాడు ఆయన వెళితే వసుదేవుడు ఒక హెచ్చరిక చేశాడు నువ్వు వెళ్లేసరికి నందగోకులంలో నువ్వు ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి అన్నింటికీ నువ్వు సిద్ధంగా ఉండు కానీ పరిణామాలన్నీ కూడా దైవీపరంగా ఏర్పడతాయి అవన్నీ అక్కడే సమసిపోతాయి ఎక్కువగా worry పడవలసిన పని లేదు కానీ జరుగుతాయి అని చెప్పాడు వసుదేవుడు సరే ఏం జరుగుతుందో భయంతో పాపం నందుడు వెనక్కి వచ్చాడు వచ్చేపటికి మొట్టమొదట ఆయనకి కనిపించింది పూతన శరీరం ఒక గ్రామం ఉంటే గ్రామంలో సగం ఆమె దేహం ఉంది దాన్ని ఎట్లా దహనం ఎలా చేయాలి అప్పుడు కరచరణాది అవయవాలన్నీ కూడా కోయించాడు రంపం పెట్టి కోయించాడు కోస్తున్న కొద్ది లోపల నుంచి దివ్య పరిమళాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకు వచ్చినాయి ఒక చెడ్డ భావంతో వచ్చి భావంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వ్యక్తిలో పరిమళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ విషాన్ని లోపలికి తీసుకున్నాడు అమృతత్వ భావాన్ని కాసేపు ఆవిడ పాలిచ్చింది గనుక తల్లి రుణం తీర్చుకోవాలి గనుక అసలు ఆవిడ మనసు మంచిదే గనుక శరీరం నిండా పరిమళాలు నింపాడు కృష్ణ పరమాత్మ అది ఆయన చేసిన మొట్టమొదటి లీల సరే దహనం చేస్తుంటే గ్రామం మాత్రమే గాక చుట్టూ ఉన్నటువంటి అన్ని గ్రామాలకి చందన గంధం గంధపు కట్టెలు గనక కాలిస్తే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన రావటంతో పూతన వధ అయిపోయింది.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 23:14

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

    Now playing
  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22