Skip to content
Transcript తెలుగు
కాబట్టి ఇక్కడ గురువు యొక్క పాదాలకి నమస్కారం చేయండి అది మంచిది. కానీ గురువు కంటే అసలు గురువులు మనకి ఇద్దరున్నారు మనందరికీ తల్లి తండ్రి. తల్లికి నమస్కరించే సంప్రదాయం ఉత్తర భారతదేశంలో ఉంది మనకి లేదు అసలు అది. తర్వాత దేశం గాని ఇంకో దేశంలో mothers day, fathers day ఉన్నాయి మనకి అవి లేవు. ఉన్నది ఏమిటంటే mother is for every day every minute. మనం వంగి ఆమెకి నమస్కరించక్కర్లా ఆమె పట్ల ఉండే గౌరవాలు ప్రేమలు మన యందు లోపల ఉండనే ఉంటాయి. మనం ఎంత ఎదిగినా ఒక రాజుకి రాజ్యానికి రాజైన వాడు ఎప్పటికైనా తల్లికి బిడ్డే కదా. ఇది శాశ్వతమైనటువంటి పదవి. కనుక తల్లి తండ్రి గురువు దైవం. దైవం last చిట్టచివరికి. దైవం అనేది last ఎందుకంటే ముగ్గురినీ ముందు సేవించడం మొదలు పెడితే దైవాన్ని పూజించటం చాలా తేలిక. ఆత్మవిద్య లో ఇది తొలిమెట్టు కనుక ఇది చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఉదరము లోపల ఉన్నటువంటి పొట్ట లోపల ఉన్నటువంటి శక్తి స్థావరాల అన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యుక్తాహారం చేయాలి. వయస్సును పట్టిన తిండి తినాలి దానికి సంబంధించింది. ఎంత తినాలో అంతే తినాలి పెట్టడానికి బోలెడు మంది ఉన్నారు కానీ మనం ఎంతవరకు తినాలో అంతవరకు మాత్రమే తినాలి. ఏది శరీరానికి హాని కలిగించదో అదే తినాలి. చాలా క్లుప్తంగా చాలా సంక్షిప్తంగా తినాలి. మళ్ళీ శరీరం మీద మనం భారం పొట్టమీద భారం వేయకూడదు. తింటే ఆయాసం తినకపోతే అనాయాసం అని అలా దాన్ని తినటానికి వాడుకునే పెట్టె కాదది. దాని లోపల నుంచి మనం చదువుతాం బ్రహ్మార్పణం రోజు భోజనానికో టిఫిన్ కో వెళ్ళినప్పుడు బ్రహ్మార్పణం చెప్పండి దేన్నీ మనం ముట్టం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాయ ఇదం అని మనం చదువుతూ అహం వైశ్వానరో భూత్వా చదువుతాం. చేసి నాలో ఉన్న జఠరాగ్ని స్వరూపుడైన వైశ్వానరుడికి నేను దీన్ని నివేదన చేస్తున్నాం అంటున్నాం. మరి వైశ్వానరుడికి ఆయన ఎంత తింటాడు? అసలు ఆయన ఉన్నాడా లోపల అంటే జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. ఒకసారి బెంగళూరులో ఒక తెలుగు వాళ్ళ ఇంటికి స్వామివారు వచ్చారు స్వామి వచ్చారు. స్వామి ఇక్కడే కూర్చున్నారు పక్కనే అప్పుడు సింహాసనం కుర్చీ లేదు మామూలుగా కుర్చీ ఉండేది ఇట్లా right side వచ్చింది వాళ్ళు వచ్చారు. రోజు పెట్టబోయేటువంటి పదార్థాలన్నీ స్వామికి నైవేద్యం ఇవ్వటానికి తీసుకొని వచ్చారు. స్వామి వాటిని ఇలా చూస్తూ కూర్చుండిపోయారు. ఏమిటి స్వామి వీళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నారు ఏదైనా పొరపాటు చేశామా లేదా చాలా బాగా చేశామా వాళ్ళకేం తెలియటం లేదు. వీళ్ళు బ్రహ్మార్పణం అని చెప్పి ఇలా బ్రహ్మార్పణం నిశ్చలంగా చెప్పారు. రెండు విషయాలు ఇక్కడ చెప్తాను మనం స్వామి భక్తులం కాబట్టి స్వామికి హారతి ఇచ్చినప్పుడు ఇలా అనకండి. హారతిని అలా నిలబెట్టి ఆయన ముందు ఉంచండి వారు స్వీకరిస్తారు మనం హారతి ఇవ్వలేం మనకా శక్తి లేదు. కాబట్టి చిట్టచి హారతి అందుకో అన్నప్పుడు దాన్నలా నిలబడి నిశ్చలంగా ఉండాలి. అలాగే బ్రహ్మార్పణం చెప్పినప్పుడు కూడా పదార్థాలు అక్కడ పెట్టి మంత్రం చదవాలి తప్ప ఆయన వైపు నైవేద్యం ఇలా చేయకూడదు, చేస్తున్నారు అలా చేయకండి. అందుకని విన్యాసం చూసి వాళ్ళు బ్రహ్మార్పణం పైగా స్వామి అక్కడ కూర్చుని ఉన్నారని ఆనందం పట్టలేక అతిశయించిన ఆనందంతో ఇంకా బాగా ఫోటో వైపు చూపిస్తున్నారు. అప్పుడు స్వామి అన్నారు "అవునులే చూపులేమో నాకు మేపులేమో మీకు" అన్నారు. నేను తినేదే లేదు అక్కడ. నాకేం ఉండదు ఉరికే చూపులు అలా చూపిస్తారని. కాబట్టి ప్రతి దానిలో సూక్ష్మంగా ఉండాలి. శరీరం నిలబడాలి అంటే పొట్ట two thirds ఖాళీగా ఉండాలి. ఎప్పుడు any given time. ఉన్నది కదా అని తినకూడదు ఆకలి కదా అని ఆకలి అనేటువంటి ఒక జబ్బుకి లేదు ఒక అవసరానికి ఔషధము అన్నం కావాలి అంతే. ఇది ఆత్మ విద్యని నేర్చుకోవాలనే వాళ్ళు పాటించవలసిన తొలి నియమం. అలాగే ఒక పండు తినాలి ఉన్నాయి కదా అని చాలా తినకూడదు బాగున్నా సరే there should not be second help at the most once more that's it. మూడు నాలుగు ఐదు అలా తినకూడదు. ఇక్కడికి వస్తే ఇక ఆత్మ దేహంలో మనం అనుకున్నాం పొట్ట సంగతి కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాం చేతులు ఏం చేయాలో చెప్పాం. ముక్కు పుటాలు రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసల గురించి చెప్తూ పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయేని శరీరంబు నీదే. ఎంత వినయంగా చెప్తున్నాడో చూడండి పంచభూతములు five elements దివాకరుడు కుడి ముక్కు రంధ్రం సూర్య నాడి. నిశాకరుడు రాత్రి ఉండే చంద్రుడి యొక్క చంద్ర నాడి ఇది. కుడి వైపున ఉన్నది సూర్య నాడి ఎడమ వైపు ఉన్నది చంద్ర నాడి. కుడివైపు నుంచి గాలి తీసుకుంటాం చంద్రనాడి నుంచి బయటకు వదిలి పెడతాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అయిపోయినాయి. కనుక అవి ఐదు రెండు ముక్కుపుటాలు కలిపి రెండు పంచభూతములు దివాకరుండు నిశాకరుడు కలిపి నీ తను సప్తకంబయేని. ఇవి గనక ఏడు శరీరాలైనట్లయితే శరీరంబు నీదే. శరీరం నాది కాదు అది నువ్వు పంచభూతాలు నాకు తెలుసా? నా శరీరం నాది ఎక్కడ? కలిపి నేనైనా అని తెలుసు కానీ ఏది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు కదా. కన్ను విప్పుట కన్ను మూయుట నీవు లేక కలుగుటెట్లు. కన్ను తెరవటం అంటే పుట్టటం కన్ను మూయటం అంటే పోవటం. రావటానికి నువ్వే కారణం పోవటానికి నువ్వే కారణం అయినప్పుడు.మరి నేను అక్కడ నా పరిస్థితి ఏమిటంటే ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమ తనువు వాడు. ఏడు శరీరాలు దాటి నువ్వు ఎవరు ఇప్పటివరకు నేను అంటే మేను నేనుగా చెప్తున్నాను ఎనిమిదవ వాడు ఎక్కడున్నాడు ఆత్మ అంటే ఏడు దాటితే ఎనిమిదోది ఆత్మ అష్టమ తనువు వాడు వాడు is the third person నువ్వు వచ్చావు వీడు వచ్చాడు ఈమె వచ్చింది చెప్తాం వాడు వచ్చాడంటే ఎక్కడి వాడో వచ్చాడు అని వాడు లోపల ఎనిమిదో శరీరం. కెరలి నన్నే మిగిల్చితి నా సామీ విట్టు నేనన్నది అభిజ్ఞ గాక నేను నేను నేను అని ఇంతగా ఘోష పెట్టానే జీవితమంతా నేను ఇది చేశాను నేను అది చేశాను అని అన్నానే పంచభూతములు నావి కావు దివాకరుడు నేను కాదు నిశాచరుడు నేను కాదు అలాగే కన్ను విప్పటానికి కన్ను మూయటానికి నేను కారణం కాదు మరి ఇవన్నీ కలిపి చివరికి నేనేమిటి కెరలి నన్నేమి మిగిల్చితివి అసలు నేను అని చెప్పుకోవటానికి ఏమున్నది అంటే విట్టు నేనన్నది అభిజ్ఞ గాక. దేనికి గుర్తుగా నేను ఇక్కడ ఉన్నాను అంటే భగవంతుడు ఉన్నాడా అని ఎవడన్నా ప్రశ్న వేస్తే భగవంతుడు ఇదిగో నేనై ఉన్నానని చెప్పడానికి నన్ను నిలబెట్టావా తండ్రి అన్నాడు. అంటే వేదాంతం ఎంత గొప్పగా మనకి pedestal అత్యద్భుతమైన స్థానంలో మనందరినీ కూడా భగవంతుని ప్రతినిధులుగా భగవంతుడి గుర్తుగా మనని ఇక్కడ నిలబెట్టినాయి. ఇక మనం ఎలా ఉండాలి స్వామి నాలో ఉన్నారు నాలో ఉన్నారు అంటే స్వామిలా ఉండగలిగితే నీలో ఉన్నట్టు లెక్క. స్వామి వేరు స్వామి వేరు అయితే కుదరదు కదా స్వామి మనలో ఉన్నప్పుడు ఆయన లాగానే ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రసన్నంగా ఉండాలి అందరి పట్ల సమభావంతో ఉండాలి. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ ఉంది అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి ఆత్మ విచారమనగానే భగవాన్ రమణ మహర్షి తప్పకుండా మనం చెప్పాలి. ఒక December చలికాలంలో అరుణాచలం పైన స్కందాశ్రమం కూడా దాటి భగవాన్ ఎక్కడో ఒక చోట నుంచున్నారు. నుంచున్నారు కదా అందరూ అక్కడికి కూడా వెళ్లారు అందరూ వెళ్లారు. చలి అందరూ వణికిపోతున్నారు అందరూ కోట్లు వేసుకొని వచ్చారు శాల్స్ కప్పుకున్నారు భగవాన్ కౌపీనం కట్టుకున్నారు మామూలుగా నుంచుని ఉన్నారు. అందులో ఒకాయనకి భగవాన్ ని చూస్తే చాలా జాలి వేసింది పాపం ఆయనది కూడా మనలాంటి శరీరమే కదా చలికి వణికిపోతున్నారేమో అని నెమ్మదిగా భగవాన్ దగ్గరికి వెళ్లి భగవాన్ ఎందుకైనా మంచిదని నేను రెండు కోట్లు తెచ్చుకున్నాను కోటుని వేసుకున్నాను కిందకి వెళ్లి కోటు మీ కోసం తెచ్చి ఇస్తాను మీ height నా height సమానంగానే ఉంది మీకు సరిపోతుంది తెస్తాను అన్నాడు. అనగానే భగవాన్ అన్నారు ఏమిటయ్యా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారుణ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఏడు ఉన్నాయి. ఏడు శరీరాలు కప్పుకున్నటువంటి సామి లోపల హాయిగా ఉన్నాడు ఆత్మ వాడికి suit ఎందుకు అన్నారు. అది అదే తను సప్తకంబయేని శరీరంబు నీదే తను సప్తకమంతా పరమాత్మదే. మనం అదృష్టవశాత్తు ఏదో ఒక పూర్వజన్మలో ఎక్కడో తపస్సు మహాత్ముల సంస్పర్శో ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎక్కడో గడిపిన వాళ్ళం కాబట్టి ఇక్కడిదాకా రాగలిగాం అందరూ మానవ జన్మ ఎత్తారు మరి ప్రత్యేకంగా ఇటువంటి విషయాలలోకి ఆత్మ విచార మార్గంలోకి రావటానికి గల కారణాలు ఏమిటంటే It is never by default It is never by accident It is never by incident It is by providence. ఏదైతే పరమాత్మ సంకల్పం ఉన్నదో సంకల్పాన్ని బట్టి మాత్రమే ఆత్మ విచార మార్గంలోకి మనం వస్తాం. ఇక్కడొచ్చి జ్ఞానం సంపాదించడానికి ఆత్మ విచారం కాదు మనల్ని మనం తెలుసుకోవటానికి ఆత్మ విచారం కావాలి. తృతీయ స్కంధంలో మొట్టమొదటి మాట కపిలుడు దేవహూతి తన తల్లికి చెప్తాడు అమ్మా నువ్వు నన్ను తెలుసుకోవటానికి నా క్షేమం చూట్టానికి నాకున్నటువంటి విద్యని ప్రపంచానికి ఇవ్వటానికి కాదమ్మా నా దగ్గర ఎంత విజ్ఞానము, ప్రజ్ఞానము, సుజ్ఞానము, అసలు జ్ఞానము ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ముందు నన్ను నేను ఉద్ధరించుకోవటానికి ఉపయోగపడాలి. నేను అకస్మాత్తుగా గురువుని కానక్కర్లేదు అవసరం లేదు. నీవు గురు స్థానానికి వెళుతూ ఉన్నప్పుడు సాధన నిన్ను నడిపించుకొని తీసుకొని వెళుతుంది కనుక నువ్వు దీని యొక్క పరమార్థిక సత్యాన్ని గ్రహించు. నువ్వు జీవితాన్ని సుష్కింపజేసుకోకు శరీరాన్ని ఆయుధంగా పెట్టుకో పెట్టుకొని తపస్సు చేసుకో ధ్యానంలో ఉండు స్వాధ్యాయం చెయ్ మంచి మాటలు విను మంచి మాటలు అను ఇది చేయాలి గాని శరీరాన్ని సుష్కింపజేస్తే నీకు ఆత్మ దర్శనం ఎలా లభిస్తుంది. లోప మనం ఉంటాం భోజనం చేస్తాం బాగుంది కడుపు నిండింది అను చాలా తక్కువ సార్లు చాలా మనం తిన్న అన్నాన్ని మనం వెటకారం చేస్తే ఏమంటంటే ఇప్పటికే ఆత్మారాముడు శాంతించాడు అంటాం కదా అప్పటివరకు ఆత్మారాముడు అంటే ఆకలి అని మనకి అర్థమైంది అంతవరకే. కానీ ఒకటి నిజం లోపల ఒక ఆత్మ రూపంలో లేదా రాముడి రూపంలో ఆత్మ ఒకటి ఉన్నదని అదే మనవని దానికే ఆకలి వేస్తుందని అన్నం పెడితే అది ఆగుతుందని దాహం వేస్తే నీళ్ళు తాగితే దాహం తీరుతుందని అలాగే జ్ఞాన తృష్ణ కలిగినప్పుడు ఆత్మ విచార మార్గంలోకి మనం చక్కగా వెళ్తామని మనకి అన్నీ తెలుసు లీలగా తెలుసు కానీ స్పష్టంగా తెలియదు. స్పష్టంగా తెలియ చెప్పబడేదే వేద విద్య సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైన ఒక మహా విజ్ఞాన సర్వస్వాన్ని మనం కైవసం చేసుకోవాలి. మన బిడ్డలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి మనం ముదిమి నాళ్లకు వచ్చినప్పటికీ కూడా చదవలేని వయసు వచ్చినప్పుడు మంచి మాటలు వినాలి.ఆకళింపు చేసుకోవాలి. దాన్ని మనం చక్కగా నియమం ద్వారా మననం చేయాలి. మననంలో నుంచి ఒక చిన్న అద్భుతమైనటువంటి అనుభవాలు మనకు కలుగుతాయి. అవే నిజమైనటువంటి అనుభవాలు. అంతే తప్ప ఏదో ఎక్కడికో వెళ్ళాం అది జరిగింది, ఇక్కడికి వెళ్ళాం జరిగింది, అది అనుభవం మాత్రమే అది Miracle కాదు. Miracleస్ కావు అసలు. స్వామి అన్నారు "మీరు ఎందుకా Miracleస్ వెంబడి పడుతున్నారు? చెప్పుకొని, చెప్పుకొని మీకు దాహం తీరట లేదా? పెద్ద ఏనుగు మీ దగ్గర ఉంది. దాని మీద వాలిన చిన్న దోమ Miracle. దోమను పట్టుకొని మీరు ప్రయాణం చేస్తున్నారే. ఏనుగు యొక్క అడుగులో-- అడుగుజాడలలో వెళ్ళండి." ఎ-ఎందుకంటే ఏనుగు యొక్క పదమే భద్రపదం. అడవి జంతువులలో అన్ని జంతువులలోకి పెద్దది ఏనుగు. దాని పాదం చాలా పెద్దది. తొలి అడుగు గనక అది బురదలోనో, నేల మీదనో వేస్తే సింహం అయినా సరే ఏనుగు అడుగుజాడల లోపల మాత్రమే ఒదిగి ఉంటాయి. కాబట్టి గురువు కూడా అటువంటి భద్రపదాన్ని ఇస్తాడు. గురువు, గురువే గనక అవతారమూర్తే, అవతారమూర్తే మనకు గురువైనట్లయితే, ఇవాళ స్వామి అడుగుజాడలలో మనం గనక వెళ్లగలిగితే దానిని మించినటువంటి గొప్ప సాధన లేదు. అది అందరికీ సాధ్యమైనదే. అటువంటి సేవాభావంలోకి మనం వెళుతూ వెళుతూ మనం సర్వాత్మ స్వరూపమైనటువంటి ఒక పరమాత్మని గురువుగా భావించి, అనుభవించి, సంభావించి, ఆనందించినటువంటి వాళ్ళం గనక అటువంటి ఉదాత్త వైఖరిలో తృతీయ స్కంధంలో చెప్పబడినటువంటి విషయాల అన్నింటినీ గమనించుకొని, నేను ఎన్నడూ అందరికీ స్త్రీమూర్తులందరికీ ఒక మాట చెప్తాను. ఎవరైనా మీరు ఏం చేస్తున్నారు అని గనక అడిగితే, "I am only a house wife" అనే మాట వాడొద్దన్నారు స్వామి. కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళన్నా ఎవరూ మాట్లాడొద్దన్నారు, ఎక్కడ పుట్టపర్తికి. మరి ఏమనాలి? నేను మా ఇంటికి గృహలక్ష్మిని నేను అని చెప్పుకోమన్నారు. అక్కడ Light and Love and Life స్త్రీమూర్తి. ఇది ఎవరన్నా అవునన్నా, కాదన్నా అదే. మానవుడి యొక్క, పురుషుడి యొక్క అహంకారం చేత వేరే రకంగా అనవచ్చునేమో కానీ గృహలక్ష్ములుగా ఉండండి, house wife గా ఉండకండి. ఆత్మవిచార మార్గాన్ని అది కూడా దాటి సర్వాత్మకుడైన ఆత్మ నా యందున్నది గనుక నేను కూడా ఆత్మ స్వరూపాన్ని, నిజానికి నాకొక తొడుగు, ఒక దేహం. ఎర్ర తోలు, నల్ల తోలు, పెద్ద తోలు, చిన్న తోలు అన్నీ ఇచ్చాడు. అంతవరకు మాత్రమే ఉండాలి. మరి మనం ఎవరమంటే, నిజంగా మనం దివ్యాత్మ స్వరూపులమని, మనం ప్రేమాత్మ స్వరూపులమని సత్యసాయి భగవానుడి యొక్క దివ్య సందేశంలో నుంచి గ్రహించినటువంటి దానిని భాగవతంలో ఉన్నటువంటి తృతీయ స్కంధానికి మనం సమన్వయం చేసుకోగలిగితే, కపీలుడు ఏం చెప్పాడో మనకు అర్థం కాదు. మైత్రాయే-మైత్రేయ మహర్షి ఏం చెప్పాడో ఎందుకు అర్థం కాదు? అర్థం చేసుకోగలిగితే, చేసుకున్న దాన్ని అనుభవించగలిగితే, అనుభవించిన దాన్ని చెప్పగలిగితే, చెప్పిన దాన్ని వినగలిగితే భాగవతంలో దీన్ని మించి ఏమీ లేదు. రకంగా ఉంది? వచనం ఉంది, పద్యాలున్నాయి, వాటికి శ్లోకాలున్నాయి, మాటలున్నాయి. మరి ఉన్న quintessence, సారరసస్వరం ఏమి-- సర్వస్వం ఏదంటే, ఇదిగో ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి తృతీయ స్కంధం అని భావన చేస్తూ, దీనిని మించి మూల ఆఖర గ్రంథంలో కూడా ఎక్కువగా ఏం లేదు. నిజానికి వ్యాస భాగవతం కంటే కూడా ఇంకా విస్తృతంగా చెప్పింది పోతన భాగవతం కాబట్టి పోతన పుట్టినటువంటి తెలుగు జాతిలో మనం కూడా పుట్టినందుకు పోతనమా-- పోతనామాత్యుడికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మనల్ని నెమ్మదిగా అధ్యాత్మ మార్గంలో భాగవత సప్తాహం సమాపనోత్సవం నాటికి మనలో అనేక పెను మార్పులు సంభవించాలని, చేస్తున్న సాధనే ఉత్తమమైనదని, చేస్తున్నది ఇక చాలని, ఇప్పటికే గమ్యం చేరుకున్నామని ఎక్కడా అలసత్వం వద్దు. ఎందుకంటే గమ్యం చేరిన వాడు ఇంకేమీ చెయ్యడు. గమ్యం చేరుకున్న వాడు చేసే పని ఒక్కటే. తాను గమ్యానికి ఎలా చేరుకున్నాడో చెప్పడానికి ఇంకా నిలబడి ఉంటాడు. ఒక ఆత్మానుభవాన్ని పొందిన రమణ మహర్షి యాభై నాలుగు ఏళ్ళు అదే భావనలో లోకంలో ఉండవలసిన పని లేదు ఆయనకి. అయిపోయింది ఆయన వచ్చిన పని. కానీ ఎందుకున్నారంటే మీరు కూడా ఆత్మానుభవాన్ని పొందవచ్చు. ఇదిగో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఆత్మ అంటే ఇది, మరణం అంటే ఇది, మానవ సంసారం అంటే ఇది. వీటి పరిమితులు తెలుసుకోండి. కర్తృత్వం వహించకండి. Doership వదిలిపెట్టండి. Don't have any claims over whatever you do. Just do it and leave it. "కర్తృ రాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం". "కృతి మహోదధౌ పతన కారణం". "ఫలం అశాశ్వతం గతి నిరోధకం". మనం చేస్తున్నాం, ఇది చేసాం, అది చేసాం అనుకుంటే నువ్వు వెళుతున్నటువంటి దారి అంతా కూడా speed breakers ఏర్పడతాయి. నేను చేశాను, మా ఇల్లు వదిలిపెట్టి యాభై కిలోమీటర్లు వచ్చాను కాదు, యాభై కిలోమీటర్లు వెళ్ళిపోయా. నీ ముందున్న గమ్యం ఏమిటి? ఇంకా రెండు వందల మైళ్ళు వెళ్ళాలి. వెళ్ళటానికి అడ్డంకులు రాకుండా, నీవు ఎక్కడా అలసట చెందకుండా, ఇదే చైతన్యంతో ముందుకు సాగేటువంటి ఒక యుక్తిని, శక్తిని, భక్తిని, పరమాత్మ యొక్క భావన యందు అనురక్తిని సర్వదేవతాత స్వరూపులైనటువంటి స్వామి మనకు పరిపూర్ణంగా, పుష్కలంగా అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం. "सौन्दर्य सार सर्वस्वमन्दस्मित महोधरम्" "वन्दारु जन मन्दारं हृदये साई महेश्वरम्" "तुर्यातीत पदस्थितां सकरुणं ज्ञानाग्नि शेष स्थिता" "मज्जन्मांतर पुण्यपाक वश प्राप्तं सद्गुरुं सत्यसारेश्वरम्" "आलम्बेन विहीनं योमाभं परिपूर्णं" "विशब्दं गुरु रूपं तद् ब्रह्म स्फुरत" పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి అనుగ్రహ విశేషంతో నైమిశారణ్య మధ్యంలోభాగవతుల మధ్యలో శ్రీమద్భాగవత ప్రవచన ప్రవాహానికి అనుజ్ఞ ఇచ్చి ఆదేశించి అనుగ్రహించిన స్వామికి శతధ సహస్రధ బహుధ నమస్కరిస్తూ. మూడవదైనటువంటి తృతీయ స్కంధం చాలా గంభీరమైనది పొద్దున చాలా సేపు మాట్లాడుకున్నాం అయితే కొంతమంది అధ్యాత్మ ప్రయాణంలో కొంత దూరం తమ ప్రయాణాన్ని కొనసాగించి అధ్యాత్మ లోతులు తెలుసుకోవాలని మీ ఆధ్యాత్మిక శక్తి మానవుని ఎక్కడి వైపు ఎటువైపు తీసుకు వెళుతుందని కడగా అందరం కూడా జ్ఞానం వైపే ప్రయాణం చేయాలి కదా అని ఒక నిర్ణయానికి వచ్చి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి కొందరు రాలేకపోయారు. వారు కోరిన ప్రకారం మళ్ళీ అంతా చెప్పవలసిన పని లేదు కొన్ని విషయాలని స్థాళీపులాకన్యాయి విశేషంతో పునః మనక్కూడా మంచిదే ఎందుకంటే అది చాలా విస్తృతమైనటువంటి విషయం ఒకసారి వింటే అర్థమయ్యి తెలిసిపోయే విషయం కాదు. దాన్ని అదే కపిలుడు దేవహూతి విదురులు ఉద్ధవుడు విదురుడు మైత్రేయ వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరు ఏం అడిగారని కాదు ఎవరు ఏమి చెప్పారని కాదు విదురుడు అడిగాడు ఉద్ధవుడు చెప్పాడు విదురుడు అడిగాడు మైత్రేయ చెప్పాడు మైత్రేయ దగ్గరికి వెళ్ళేసరికి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులను అన్నింటినీ కూడా దేహంగా విచారణ చేశాం. మనందరం కూడా ఏడు శరీరాలతో పుట్టాం మనకు పైకి ఒక్క శరీరమే కనబడుతున్నది. ఏడు శరీరాలు ఏమిటి అంటే స్థూల శరీరం భౌతికంగా కనిపించేది. సూక్ష్మ శరీరం మనం పగలంతా జాగ్రదవస్థలో పనులు చేసి రాత్రిపూట పడుకున్నప్పుడు దేహం మన వశంలో ఉండదు అది కేవలం జలాత్మకమై ఉంటుంది మంచం మీద పడుకొని ఉంటుంది శరీరం. శరీరం మంచం మీద పడుకున్నది గాని మనసు మాత్రం తారాడుతున్నది, పారాడుతున్నది, దోగాడుతున్నది, తూగుతున్నది, ఊగుతున్నది. ఎటువైపో తీసుకువెళుతున్నది. అనేక స్వాప్నిక అనుభవాలు కలిగిస్తున్నది. ముప్పై నలభై సంవత్సరాల క్రితం జరిగిన అనేకానేక సంఘటనలు నెమరు వేస్తున్నది. బాధాకరమైన విషయాలను గుర్తు చేస్తున్నది. ఆనందకరమైన సన్నివేశాలను మరొక్కసారి గుర్తు చేస్తున్నది. మనలో ఉండి మనతో ఉండి ఒక స్వప్నం అనే పేరు మీద మనసు మనతో దోబూచులాడుతుంటుంది అది సూక్ష్మ శరీరం. స్థూల శరీరము సూక్ష్మ శరీరము తర్వాత తలతలవారుతున్నటువంటి వేళ ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత నడిజాము దాటిన తర్వాత తొలి మలిజాము అంటే రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఐదు గంటల లోగా లేచే వాళ్ళకి సమయం చాలా గొప్పది. సమయంలోనే ధ్యానంలో ఉన్నా యోగంలో ఉన్నా ఏం చేసినా ఏం చేయకపోయినా అది సర్వోత్తమమైన కాలంగా మహర్షులు నిర్ణయం చేశారు. మరి అక్కడ శరీరం ఉంటుంది కలగంటుందా? కలగనే సూక్ష్మ శరీరం ఉందా? కలగన్న దానిని అనుభవించటానికి స్థూల శరీరం ఇంకా మంచం నుంచి లేచిందా అంటే మంచం మీదే పడుకొని ఉంది స్థూల శరీరం నిమిత్త మాత్రంగా ఉంది దాని పనే లేదు. ఇక కలలు కని కలలలో మనకి అనేక అనుభవాలు కల్పించినటువంటి అనల్ప కల్పనా శక్తి కలిగినటువంటి మనస్సు సూక్ష్మ శరీరం అది వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రాపంచికమైనటువంటి విషయాలలోకి జాగ్రదవస్థలోకి సర్వ ఇంద్రియాలు ముడుచుకుని పోయి నిద్రాణమై స్తబ్ధమై నిశ్శబ్దమై నిస్తబ్ధమై ఉన్నటువంటి ఒకానొక సందర్భంలో సంధి కాలానికి సుషుప్తి అవస్థ అని పేరు. సుషుప్తి అవస్థలో మనకి మన శరీరానికి ఒక పేరు ఉంది పేరు కారణ శరీరం. కారణ శరీరాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి లోతులు వెళ్ళి వెళ్ళి అనేక పొరలు చీర్చుకుని లోపలికి వెళుతున్నప్పుడు ఎక్కడో కొన్ని క్షణాలపాటు కొన్ని లిప్తలు లిప్త అంటే కనురెప్ప ఎత్తి కనురెప్ప వాలే సమయానికి ఒక లిప్త అంటాం. అటువంటి కొన్ని లిప్తలు కొన్ని క్షణాలు మాత్రమే ఉండేది సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో మాత్రమే జీవుడు పరమాత్మతో అనుసంధానం చేసుకునే ఒక స్థితి ఏర్పడి ఉంటుంది. ఎందుకని స్థూల శరీరమా పరమాత్మకు సంబంధమే లేదు దానికి. సూక్ష్మ శరీరమా జరిగినా జరగబోతున్న సంఘటనకు సంబంధించిన మన మనస్సే మనతో ఆడుతూ ఉన్నది గనుక మనసు కూడా అక్కడ నిర్వ్యాపారం అయిపోయింది దానికి ఏం పని లేదు. పనిలేని మనసు పని చేయలేని శరీరము మంచం మీద పడుకొని ఉండగా నెమ్మదిగా జాగ్రదవస్థ లోకి వచ్చినప్పుడు ఇంద్రియాలు ఇంకా ముకుళించినటువంటి ఇంద్రియాలు నెమ్మది నెమ్మదిగా విప్పారి బయటకు రావలసిన సమయంలో కారణ శరీరము లోపల మనకి పరమాత్మ యొక్క స్థితిని పరమాత్మతో మనకున్నటువంటి జన్మాంతర సంబంధాలని మనకి ఆయనకి ఎన్ని జన్మలు మనం ఎత్తి వచ్చామో ఎన్ని జన్మలలో పరమాత్మతో మనం కూడి ఉన్నామో అవన్నీ స్పురణకి తెచ్చే అటువంటి లీలా మాత్రమైనటువంటిది సుషుప్తి అవస్థ.కాబట్టి సుషుప్తి శరీరం కారణ శరీరం. అవస్థ సుషుప్తి అయితే అక్కడ మన శరీరానికి పేరు కారణ శరీరం. కాబట్టి స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉన్నాయి. మూడు అయిపోయిన తర్వాత అన్నింటా ఉన్నటువంటిది ఒక మనస్సు ఉంది. మనసు కూడా ఒక శరీరమే. మనసు ఆలోచనల యొక్క ఒక కట్టెల మోపు వంటిది కాదు అది. అది నిజానికి ఒక శరీరం. అశరీరమైన శరీరం. దానికి శరీరం లేదు కానీ మన శరీరం నిండా occupy చేసి ఉంటుంది. ఎట్లా? మనస్సు ఒక ఆలోచన కలిగినప్పుడు, ఆలోచన నెమ్మదిగా రూపు దాల్చినప్పుడు దాని యొక్క చర్య, ప్రతిచర్య రెండూ ఏర్పడవలసిన సందర్భంలో మనస్సు శరీరమై మన యందు ఉంటుంది. దాని వలననే మనకు దుఃఖము, సుఖము, సంతోషము, ఆనందము, ఖేదము, మోదము, హ్లాదము, ప్రహ్లాదము ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా నిజానికి శరీరము యొక్క అవస్థలే. మనస్సు అనబడేటువంటి ఒక శరీరం ఉంటే దానికి ఉండే అవస్థలే దుఃఖం. దుఃఖం పడుతున్నది ఎవరు, పెడుతున్నది ఎవరు అంటే మనస్సు అయినప్పుడు మరి అనుభవిస్తున్నది ఎవరంటే మన దేహమా? ఒక స్వప్నంలో కల వచ్చింది భయపడుతూ అరుస్తూ వాడు నిద్రలో నుంచి లేస్తాడు. లేస్తున్నది ఎవరు, లేపింది ఎవరు అని ప్రశ్న వేస్తే లేపింది నీ మనస్సు అనే ఒక శరీరం. మనస్సే నీ శరీరాన్ని లేపి నిన్ను భయభ్రాంతం చేస్తున్నది. ప్రశాంతంగా నిద్ర పోతున్న వాడిని పీడకల ద్వారా మేల్కొలిపి భవిష్యత్తు, భూతకాలము దానిలో జరిగిన సందర్భాలన్నింటినీ గుర్తు చేసి మనిషిని బలహీన పరిచేటువంటి ఒక మనస్సు మన యందు ఉంటుంది. మనస్సుకి రెండు అంచులున్నాయి, రెండు పార్శ్వాలున్నాయి, రెండు dynamics ఉన్నాయి, రెండు dimensions ఉన్నాయి. ఏమిటి అంటే ఇప్పటిదాకా మనస్సు మనల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పుకున్నాం కదా, అదే మనస్సు ఏమంటుంది అంటే, ఏమిటి? వ్యాపారం ఏమిటి? డబ్బు ఏమిటి? సంసార బంధనాలు ఏమిటి? అనేక జన్మలుగా ఏర్పరచుకున్న ఇంకా వాటిని నువ్వు వదిలి పెట్టడం లేదా? నీవు ఉన్న కాలమంతా సంపద సంపాదించటంతోనేనా, లేదు భోగం అనుభవించటంతోనేనా అనుభవించిన సుఖాలు చాలవా? దీనికి అంతున్నదా? ఎప్పుడైనా ఒక్క క్షణమైనా దీనికి మూలమైన కర్త అయినటువంటి పరమాత్మ వైపు నీ మనస్సుని తిప్పుకోరాదా? అంటుంది అదే మనస్సు. చూడండి మనస్సే మోక్షానికి మనకి ప్రేరణ కలిగించేది మోక్షమే, ఆహ్ మనస్సే. అలాగే మోక్షం అవన్నీ వద్దు నీకున్నది ఒకటే జీవితం హాయిగా సంపాదించు, అన్ని సుఖాలు ఏర్పరచుకో, భౌతికానందంలో నీ జీవితాన్ని ముగించేసేయ్ అని చెప్పేది కూడా మనస్సే. మనం ఆలోచించుకోవాలి. మన శరీరంలో మనతో పుట్టి మనతో పెరుగుతూ మనకు తెలియకుండానే మన మీద ఒక ఆధిపత్యాన్ని, యాజమాన్యాన్ని, అధికారాన్ని తీసుకుంటున్న మనస్సుని ఎటువైపు తిప్పాలి? ఎటువైపు తిప్పితే మనకు నిజంగా ఆనందం కలుగుతుంది. మనస్సు ద్వారా మనం ప్రపంచాన్ని చూడటం మొదలు పెడితే అక్కడ స్పర్ధ ఏర్పడుతుంది. మనస్సుని దాటి మనస్సు యొక్క ఒక పరిపూర్ణమైన స్థితిని గనక గమనించిన ట్లయితే, దానికో హృదయం అని పేరు పెట్టుకున్నట్లయితే తద్వారా ప్రపంచాన్ని మనం చూడటం మొదలు పెడితే ప్రపంచమంతా బృందావనమై, నందనవనమై, ఆనంద రసతుందిలమై ఒక అపూర్వమైనటువంటి అవకాశంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎవరికీ? సంస్కారము, సంస్కృతి, జీవధార, వాసనలు, మూలవాసనలు, తపస్సు, స్వాధ్యాయము, శౌచము, ధ్యానము, యోగము, సత్సంగము, సత్సంగత్యము, సదాచారము, సమ్యక్ సంకీర్తన ఇవన్నీ ఉన్నటువంటి వాడికి ప్రాపంచికమైన భోగాలు అల్పంగా కనిపిస్తాయి. అవి తుచ్ఛంగా transient and impermanent గా కనిపిస్తాయి. కదిలిపోయే మేఘాలివి. ఒక మేఘం ఇక్కడే ఉండదే. గాలి వాటున అది కదిలిపోతూ ఉంటుంది. ఎటు పోతుందో, ఏమవుతుందో తెలియదు. అట్లాగే ప్రాపంచికమైనటువంటి అనుభవాలు కానీ, ప్రాపంచికమైనటువంటి సుఖాలు కానీ, లౌకిక భౌతిక వ్యాపారాలు కానీ, వ్యాపారం అంటే పనులు అని అర్థం business అని కాదు. కాబట్టి ఇవన్నీ మనస్సు మనకి చెప్తూ ఉంటుంది. నువ్వు చేస్తున్నది correct కాదు. నీ మనస్సు నిన్ను పెడదారిని పట్టిస్తున్నది. నీవు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు. సర్వోత్కృష్టమైన మానవ జన్మ ఎత్తావు. ఎన్నేళ్ళయిందో నువ్వు జన్మ ఎత్తి, ఎంత శ్రమ పడ్డావో, మిగతా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది జీవరాశుల వలె నువ్వు ఎక్కడ పుట్టావో, ఎన్ని జన్మలు ఎత్తావో కానీ కడగా సర్వోత్కృష్టమైన మానవ జన్మ నువ్వు ఎత్తి వచ్చావు గనుక దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అని చెప్పే మనస్సుని సుషుప్తి అవస్థలో మనం నిలబెట్టుకోవాలి. అందుకే ప్రపంచంలో సంపద వద్ద అయితే డబ్బు సంపాదించొద్దా? అంటే స్వామి మాట గుర్తొస్తుంది. డబ్బు ఎప్పుడూ పాపిష్టిది కాదు. కానీ పాపిష్టి వాడి చేతిలో మాత్రం డబ్బు ఉండకూడదు. అది మంచి కార్యక్రమాలకు వినియోగిస్తూ వెళితే అది సమృద్ధం అవుతుంటుంది. ఎందుకిస్తాడు భగవంతుడు మంచివాడికి అంటే, వాడి చేతిలో ఉంటే పదుగురికి ఉపయోగపడే పని జరుగుతూ ఉంటుంది. పదుగురు ఎవరు? మళ్ళీ లోకంలో ఉన్నవారే, సమాజంలో ఉన్నవారే. వీటన్నింటినీ స్థాలీపులాకంగా విచారణ చేసినట్లయితే మనస్సు కూడా ఒక శరీరమే. అది కూడా మనస్సు ఉంటుంది, పోతుంది. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వారు సత్యసాయి భగవానుడు మనస్సు Marma అనే ఒక బుక్కు రాశారు. అదంతా యోగవాసిష్టం యొక్క quintessence అది. దాన్ని గనక గమనిస్తే ఏం ఎటువంటి మనసుతో మనం జీవితం గడుపుతున్నాం? మనసుకు ఏం కావాలి అసలు? దానికి ఏం కావాలో దానికి తెలియకుండా, మనకు ఏం కావాలో తెలియచేయకుండా మనల్ని యాతన పెడుతున్నది. అది పడుకోదు, పడుకోనివ్వదు, కూర్చోదు, పరిగెత్తిస్తుంది, ఆటాడుతుంది, ఖేదమోదాల మధ్య ఖేలగా సాగిస్తుంటుంది. ఇటువంటి మనస్సు నాకు వద్దు. నిర్మలమైన, నిశ్చలమైన, నిశ్చితమైన ఒక మనస్సు నా దగ్గర ఉంటే ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను అనేటువంటి మనసు మీద మనం అధికారాన్ని సంపాదించాలి. మనస్సు ఒక శరీరం. నాలుగు శరీరాలు.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 31:03

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

    Now playing
  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22