⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
సీతాదేవితో మాట్లాడటమే మానేశాడు. అప్పుడు ఆమె ఆలోచించి ఎంత తెలివిగల ఆడపిల్ల అంటే అత్తల దగ్గరికి వెళ్లి "మీ అబ్బాయి నాతో మాట్లాడటం లేదు" అంటే మాట్లాడేట్టుగా నువ్వు చేసుకో అంటారు వాళ్ళు అంతే. అది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది కాబట్టి మా అబ్బాయిని తప్పు పట్టద్దు అంటారు. అది ఆమెకు ముందే తెలుసు గనుక ఈ రాముడు ఎవరి మాట వింటాడు అని ఆలోచించింది ఓ రోజు. రాముడికి వశిష్టులవారు అంటే చాలా గౌరవం. వశిష్టుల వారి భార్య అయిన అరుంధతి అంటే పరమ గౌరవం. ఆమె మాట, ఆమె ఏమన్నా చెప్పిందంటే చేయవలసిందే. అప్పుడు సీతాదేవి వెళ్లి అరుంధతి దగ్గర తన విషయం చెప్పింది. నన్ను పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చారు. ఇక్కడ మా అత్తలు బాగున్నారు, అంతా బాగుంది. కానీ నాకు కావాల్సిన నా రాముడు నాతో ఇంతవరకు మాట్లాడనే లేదు. కాలం గడిచి పోతున్నది. మార్గం చూపించి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగింది. అడిగితే ఆమె శ్రీరామచంద్రుడితో మాట్లాడింది. మాట్లాడి కళ్యాణం అంటే ఏమిటి? ఆ వివాహంలో ఏముంటాయి? వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒకరికొకరు ఎలా ఉండాలి? ఇవి-ఇవన్నీ కూడా వైవాహికమైన, గారహస్యమైన, గృహ సంబంధమైన విషయాలన్నీ రహస్యాలన్నీ రాముడికి బోధించి "అవన్నీ నువ్వు జీవితంలో నెమ్మదిగా నేర్చుకుంటావు. కానీ నీకంటే మరి చిన్నది కదా సీతా, రేపటి నుంచి నువ్వు మాట్లాడటం మొదలు పెట్టు" అని చెప్పింది ఆమె. అందుకనే, ఇవాళ కళ్యాణం అయిపోయిన తర్వాత పట్టపగలు కూడా పురోహితులు బయటకు తీసుకెళ్లి అదిగో అరుంధతి నక్షత్రం అంటారు. అది కనపడదు కదా! కనిపించిందా లేదా అంటారు. నాకు కనిపించింది అంటారు ఇద్దరూ. ఎందుకంటే బయటకు పడాలి గనుక. కాబట్టి అరుంధతి నక్షత్రం ధ్రువుడి వలె ఒక తారక స్థితిలో మండలంలో ఉన్నది గనుక శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో ఆయనకి బలము, శక్తి, ధైర్యము, అనంత మహా శక్తి ఎవరు అంటే సీతాదేవి. అందుకనే శ్రీరామచంద్రుడి యొక్క అవతార కార్యక్రమం సఫలం కావటానికి అమ్మవారు రాముడి కంటే ముందు వచ్చింది భూలోకానికి. రాముడు తర్వాత వచ్చాడు. వికుంఠధాముడై ఉన్నాడు. ఆపై రాముడయినాడు. వచ్చి జనక మహారాజు ఇంట్లో పెరట్లో మామూలుగా వర్షాకాలం వచ్చేటప్పుడు నాగలి దున్నుతారు, నేల దున్నుతారు గనుక ఆ నాగలి దున్నినప్పుడు ఏర్పడేటువంటి చార పేరు, ఆ గీత పేరు సీత. సీత అంటే నాగేటి చాలు యొక్క చాలు. అందువలన ఆమెకి సీత అని పేరు పెట్టారు. మిథిలా నగరంలో ఉన్నది గనుక మైథలి అయింది. జనక మహారాజు పెంచుకున్నాడు గనుక జానకి అయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటే రాముడే గనుక రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాలి అంటే సత్వగుణ ప్రధాన సంపన్నుడైన రాముడు యుద్ధమే చేసేవాడు కాదు. వాడిని ఎలాగైనా మార్చడానికి ప్రయత్నించేవాడు తప్ప యుద్ధం చేసి వాడిని చంపేవాడు కాదు. అది రాముడి లక్షణం. కానీ ఆ రాముడి యొక్క శక్తి, యుద్ధం జరగటానికి ప్రేరణ, కారకులు ఎవరంటే సీతాదేవి అయింది. కనుకనే ఆమె తనను తాను పణం పెట్టుకొని ఒక ఏడాది పాటు లంకలో ఉండటానికైనా నిశ్చయించుకున్నది. రాముడు చేసిన ధర్మ సంస్థాపనలో ప్రధానమైన కారణం ఎవరు అంటే సీతాదేవి. ఆమె అగ్నిలో పడ్డా అగ్నిలో దూకినా బయటకు నిగ్గుతేలి ఎలా వచ్చింది? కారణం ఏంటంటే ఆవిడ వేదమాత. ఆమె వేదవల్లి. ఆమె ఒక అద్భుతమైనటువంటి శక్తి సంపన్నురాలు. శ్రీరామచంద్రుడి వెనక ఉన్నటువంటి ఈ శక్తిని మనం గనుక వర్ణించుకున్నట్లయితే మనం జానకిరామ అని రాయకూడదు. జానకీరాముడు అని రాయాలి. జానకీ దీర్ఘం ఉండాలి. ఎందుకంటే జానకిరాముడు అంటే జానకి రాముడు ఇద్దరు విడివిడిగా. జానకీరాముడు అంటే జానకి యొక్క రాముడు అని అర్థం. మన భాషలో సంస్కృతంలో గాని తెలుగులోను గాని ఈ చిన్న చిన్న పొల్లులతో సహా మార్పులు చాలా ఉంటాయి అర్థంలో. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పావన చరితాన్ని పోతనామాత్యుడు కూడా రాస్తున్నాడు. ఎందుకని? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు. అటువంటి ఈ లోక రక్షకు ఆరంభమైనటువంటి ఈ అవతార మూర్తులను నేను వర్ణించబోతున్నాను. ఎట్లాగైతే వాల్మీకి ఒక రామాయణం రాశాడో అట్లాగే నేను కూడా ఈ భాగవత రచనా క్రామ-కార్యక్రమానికి, ఈ క్రమానికి సంపూర్ణంగా, తొట్టతొలిగా నన్ను ఆవేశించినటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క గాథని కాసేపు మాట్లాడుకుంటాను అంటూ నవమ స్కంధాన్ని ఆయన ముగిస్తాడు. అది చాలా ప్రధానమైనటువంటిది. అంతే కాదు శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు అన్ని మంగళ ధ్వనులు వినిపించినయి అని ఇందాక చెప్పుకున్నాం. మరి రాబోయే కృష్ణ పరమాత్మ, ఈయనేమో పూర్ణచంద్రుడు ఉదయించినట్లు వచ్చాడు రామచంద్రుడు. మంచి వెన్నెల వెలుగు తీసుకొని వచ్చాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా రాబోతున్నాడు అంటే అర్ధరాత్రి, అష్టమ రాత్రి, భయంకరమైన వర్షం, యమునా నది పొంగిపోతున్నది, ఎటు చూసినా చీకటి, చెరసాల, ఒక్క విషయం కూడా మంచి విషయం లేదు కృష్ణుడి విషయంలో. అటువంటి ఆయన కథ చెప్పబోయే ముందు ఈ పరాత్పరుడైనటువంటి ఈశ్వరుడు ఏ రూపం తీసుకుంటాడో మనం ఊహించలేము. మనకి ఏది చెడుగా అనిపిస్తుందో ఆ చెడునే ఆయన ఎన్నుకుంటాడు. మనం చూడండి అష్టమి నాడు ఏ పని చేసినా కష్టాలు వస్తాయి. నవమి నాడు అసలు ఏమీ చేయొద్దు అని అంటారు. అష్టమి నాడేమో కృష్ణుడు పుట్టాడు. నవమి నాడేమో రాముడు పుట్టాడు. మరి వాళ్ళిద్దరినీ దేవతలుగా భావిస్తాం. కానీ ఆ నక్షత్రాలను మనం మాత్రం avoid చేస్తాం. అంటే మనకు అవగాహన లేక. భగవంతుడు చూపిస్తాడు. అటువంటి దుర్లక్షణాలలో, దుర్ముహూర్తాలలో, దుర్లభమైన, దుస్తరమైన, ఆహ్ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పరమాత్మ ఒక జన్మ తీసుకుని రాగలడు. వచ్చి తన కార్యక్రమాన్ని నెరవేర్చగలడు అని చెప్పడం కోసమే ఈ నక్షత్రం గానితిథి గాని ఇవన్నీ కూడా ఆ కృష్ణ పరంగా చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి గనుక అది చెప్పబోయే ముందు ఆహ్లాదకరమైన శ్రీరామచంద్రుడి యొక్క ఆగమనాన్ని వర్ణిస్తూ ఆ పోతన గారు అంబరీషోపాఖ్యానం తర్వాత ఆయన ఈ కథ చెప్తారు దీంతో ఇవ్వాళ మనం నవమ స్కంధాన్ని పూర్తి చేసుకున్నట్లయింది ఈ క్షణానికి ఇక నిజానికి రేపటి నుంచి దశమ స్కంధం కృష్ణమూలము సుఖాలాపాభిరామం మంజులతా శోభితం అటువంటి ఆ కృష్ణుడి కథని అనేకమైన బాల్య చేష్టలు అద్భుతమైనటువంటి Miracles అంటామని స్వామి అనగానే మనకు నాలుగు Miracles చెప్పుకుంటే తప్ప కడుపు నిండదు కాబట్టి ఆ Miracles అన్నీ కృష్ణుడు ఎలా చేశాడు అవి ఎందుకు చేశాడు దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అవన్నీ రేపు ఉదయం మనం ప్రారంభిద్దాం ఈ లోగా మరి ఏం చేయాలి అంటే అసలు ఈ కృష్ణుడు ఎవరు కృష్ణుడి యొక్క అవతారం ఎందుకు వచ్చింది అవి ఇవ్వాళ మాట్లాడుకొని It is a preamble అనుకోండి జరగబో రేపు చెప్పబోయేదానికి ఇది ముందు శ్రీ కృష్ణ పరమాత్మ తన చైతన్యాన్ని మూడు భాగాలు చేసుకున్నాడు ఒక భాగము వ్యాసులవారైతే రెండవ భాగం ద్రౌపదిదే ఈ ముగ్గురి కారణంగా ఒకరేమో జరిపించేవాడు కృష్ణుడు రెండవ ఆమె ఏదైనా జరగటానికి కారణం ద్రౌపది ఈ జరిగిన దానిని జరిగినట్టుగా యథార్థంగా లోకానికి అందించటానికి వచ్చినటువంటి శారదా స్వరూపమే వేదవ్యాసులవారు కాబట్టి జరిగింది చెప్పటానికి ఒక వ్రాయసగాడు కావాలి చరిత్ర బద్ధం చేయాలి దాన్ని అబద్ధం రాయకుండా సత్యం చెప్పాలి అందుకని వ్యాసులవారు ఆయన పేరు కృష్ణ ద్రౌపది పేరు కృష్ణ కృష్ణుడి పేరు కృష్ణ కాబట్టి ఈ కృష్ణ అంటే కర్షతి ఇతి కృష్ణః కృషతి ఇతి కృష్ణః కుషతి ఇతి కృష్ణః కర్షతి ఆకర్షణ అద్భుతమైన ఆకర్షణ నయన మనోహరమైనటువంటి ఆకర్షణ దాన్ని లీలాశుకుడు తన శ్రీ కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం రాస్తాడు జిహానం జిహానం సుజానేన మౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైః లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వ మీతన్ నమస్తా మహానంద సర్వస్వ మీతన్ నమస్త అంటాడు జిహా దుహానం దుహానం సుధాం వేణునాదైః జిహానం జిహానం ఆ జిహానం జిహానం అంటే ఎన్నిసార్లు చూసినా ఆ మౌధ్యం పోదే ముగ్ధత్వం పోదే ఏమిటీ రూపం దీనికి ముసలితనం లేదా వసివాడదా దీనికి అలసట లేదా అది రెండవది దుహానం దుహానం సుధాం వేణునాదైః గోపగోపికా వ్రజ కాంతలందరూ కూడా పొదలలో నుంచి వినిపిస్తున్నటువంటి నిస్తంద్ర మంద్రమైనటువంటి వేణుగానాన్ని ఎప్పుడు విన్నారు ఎన్నిసార్లు విన్నారు అంతే లేదు ఇప్పుడే వింటారు మళ్లీ వినాలి అని అనిపిస్తుంది అది ఎట్లా ఉందంటే వేణుగానం ఒక సుధా అమృతం లాగా ఉన్నది దానిని తాగగా తాగగా ఇంకా వినిపించాలి వినాలి అని అనిపిస్తున్నది లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై ఆకాశము అవని అవని ఆకాశము రెండూ కలిసినట్లుగా సుదీర్ఘమైనటువంటి ఇక్కడ ఈ భూమ్మీద ఉన్నటువంటి ఒక వస్తువు నీలాకాశం వరకు గనుక వెళ్లినట్లయితే ఎట్లా ఉంటుందో మా విరాట్ మూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఇలా ఉన్నాడు సుదీర్ఘైరపాంగై ఎవరు ఈ కృష్ణుడు అంటే మహానంద సర్వస్వ మీతన్ నమస్తాత్ నందుడు ఎవరు కృష్ణుడిని పెంచుకున్నవాడు ఆయనకు నిజంగా మహానందం ఏదన్నా ఉంటే అది కృష్ణుడే మహానంద సర్వస్వం పైగా అని ఒక అర్థం రెండవ అర్థం మహానందము అంటే బ్రహ్మానందం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అని చదువుకున్నాం నిన్న ఆ శ్లోకానికి ఏదన్నా సాకారం ఒక బొమ్మ ఒక రూపం ఓ తత్వం ఏర్పడితే అది మా కృష్ణుడు అంటి అనే లీలాశుకుడు చెప్తాడు జిహానం జిహానం దుహానం దుహానం లిహానం లిహానం మహానంద సర్వస్వ మీతన్ నమస్తాత్ అటువంటి కృష్ణ పరమాత్మ ఎందుకు రావలసి వచ్చింది ఎందుకంటే ఏదో దేవకీ దేవిని హింస పెట్టిన కంసుడిని చంపటానికి ఆయన రాలా ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీత చివరిలో తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను ఇలా ప్రతి యుగంలో నేను ఇలా వస్తుంటాను యుగం అంటే కృతయుగంలో ఒకసారి ద్వాపర యుగంలో ఒకసారి త్రేతాయుగంలో ఒకసారి అని కాదు యుగే యుగే అంటే క్షణే క్షణే నేను ఏ క్షణాన ఏ రూపంలో బయటకు వస్తాను ఎట్లా నేను అవతరిస్తాను అవతరించి ఆ కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకు వెళ్తాను కానీ ధర్మ సంరక్షణ ధర్మ ప్రతిష్ఠ ప్రధానమైనటువంటి అంశంగా నేను వస్తాను అని ప్రమాణం చేశాడు కృష్ణ పరమాత్మ అలాగే మరి ఆ యుగానికో క్షణానికో వచ్చేది కారణం ఉండాలి కదా అంటే యదాయ బాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం నన్ను ఎవరూ పుట్టించగలిగిన వారు లేరు నన్ను నేనే సృష్టించుకుంటా ఎప్పుడు ధర్మాన్ని ధర్మానికి గ్లాని జరిగినప్పుడుధర్మానికి గాని జరిగితే ధర్మం ఎలా అవుతుంది గాని అంటే దుఃఖం అననుకూలం అంటే ధర్మాన్ని ఆచరించవలసిన మానవుడు ఆ ధర్మం నుంచి గనక దూరమై పోయినట్లైతే మళ్ళీ మానవ జాతిని ధర్మమార్గంలో నడిపించటానికి నేను నన్ను నేను సృష్టించుకొని వస్తాను అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క అవతారం ఏంటంటే దాని ప్రధాన మూలమైన అంశం అది ప్రభవ అవతారం అనుప్రవేశ అవతారం ప్రవేశ అవతారం లీలా అవతారం ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాల యొక్క ఒక రూపం ఏంటంటే కృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ కథానాయకుడిగా ఉండబోతున్నది భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ కర్మయోగం సాధించుకున్నది భారతంలో అటువంటి కర్మ భక్తి జ్ఞా యోగాలను దాటి జ్ఞాన యోగంలో కృష్ణుడిని చూడాలి అంటే వెళ్ళవలసింది భగవద్గీత దగ్గరికి కాబట్టి ఒక అవతార పురుషుడు తమ జీవిత కాలంలో పరిపూర్ణంగా కర్మ యోగాన్ని సంపూర్ణంగా భక్తి యోగాన్ని అతిలితమైనటువంటి భావన స్థితిలో జ్ఞాన యోగాన్ని తన జీవితంలో celebrate చేశామంటామే తన జీవితంలో ఆచరించి ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఒక అవతారం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఎనిమిది నెలలు జీవించాడు. one hundred and twenty six years and eight months ఆయన ఆయు ప్రమాణం అది సంపూర్ణంగా జీవించాడు ఆయన జీవించి తాను చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాడు. మధురా నగరంలో పుట్టాడు చెరసాలలో పుట్టాడు అక్కడి నుంచి వ్రజ భూమికి వెళ్ళాడు వ్రజ భూమి నుంచి అక్రూరుడి ద్వారా మధురా నగరానికి వచ్చాడు కంసవధ చేశాడు కంసవధ చేసి అక్కడి నుంచి హస్తినాపురానికి వెళ్ళాడు హస్తినాపురానికి ఎప్పుడు వెళ్ళాడు భారతంలో కృష్ణుడు ఎక్కడ కనపడతాడు అంటే ద్రౌపది స్వయంవరంలో మనకు కనపడతాడు అప్పటి దాకా భారత కథలో కృష్ణుడు కనపడడు అక్కడ ఈ అర్జునుడు ఈ పాండవులు తర్వాత ద్రౌపదిని గెలుచుకున్న తర్వాత కుంతి వీళ్ళందరూ కూడా ఒక చోట సమావేశం అవుతారు నిజానికి అనేకమైనటువంటి బాంధవ్యాలు తవ్వి చూస్తే కుంతి తనకు మేనత్త అవుతుంది సరే దాని దగ్గరికి మనం వెళ్ళదు అది చాలా పెద్ద story అనేకమైన వంశాలు అవన్నీ ఉంటాయి కుంతి ఆయనకి మేనత్త మేనల్లుడు కుంతికి ఎవరంటే కృష్ణుడు సరే అక్కడి నుంచి హస్తినాపురం నుంచి ఆయన మళ్ళీ ఏం చేశాడు మధ్యలో వృందావనానికి వెళ్ళాడు వృందావనం నుంచి మళ్ళీ హస్తినకు వచ్చాడు హస్తినాపురం నుంచి కురుక్షేత్రానికి హర్యానాకు వెళ్ళాడు కురుక్షేత్రం హర్యానా అయిపోయిన తర్వాత గుజరాత్ లో ఉన్నటువంటి ప్రభాస క్షేత్రం అంటే హర్యానా అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ state ఇవాళ గుజరాత్ గా కనపడుతున్న ఆ ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ఆయన దేహ పరిత్యాగం చేశాడు ద్వారక గుజరాత్ లో ఉంది అది ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో ఎన్ని పనులు చేశాడో నూట ఇరవై ఆరవ ఏట కూడా కృష్ణ పరమాత్మ యొక్క చైతన్యం గాని సౌందర్యం గాని ఆయన శక్తి గాని ఎక్కడా వసివాడలేదు ఎట్లా ఉండాలో నిత్యము కూడా నవనవోన్మేషంగా ఉన్నాడు ఆయన అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ మహా పరినిర్వాణం చెందాడు. తరువాత విదురుడు వంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే ఆయన భోజనానికి వెళ్ళాడు ఎవరుగా కనిపించిన ప్రతి వాడి దగ్గరికి ఆయన వెళ్ళలా అట్లా వెళ్ళకూడదు కూడా అందుకనే యుక్తాహార విహారస్య అని చెప్పాడు భగవద్గీతలో ఎక్కడికి వెళితే ఆ అన్నం అమృతం అవుతుందో అక్కడ అన్నం తినాలి ఎక్కడికి వెళితే అమృతం విషం అవుతుందో అక్కడికి వెళ్ళకూడదు అందుకనే దుర్యోధనుడి ఇంటికి ఆయన వెళ్ళలా కాబట్టి ధర్మ సూక్ష్మాలు అన్నీ కూడా కథా కథనంలో పాటించిన అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక మామూలుగా సేవకుడు శంకరుడు అవుతాడని మనం అనుకున్నాం ఇక్కడ అసలు భగవంతుడే సేవకుడు కావడం ఆశ్చర్యం భగవంతుడే రథసారథి కావడం ఆశ్చర్యం యుద్ధం ఆయన ఒక్క సుదర్శన చక్రం తిప్పి వదిలితే మొత్తం కౌరవ సైన్యం నశించి పోయుండేది కానీ ఆ పని చేయడు ఎందుకని అంటే భగవంతుడు అన్ని పనులు చేయడు కొన్ని చేస్తాడు కొన్ని చేయిస్తాడు ఆ చేయించేటువంటిది యజ్ఞం కూడా అంతే ఆ యజ్ఞ పురుషుడుగా ఆయన అధిష్టాతగా ఉంటాడు తప్ప ఆ యజ్ఞంలో ఆయన పాల్గొనడు ఆ ఇష్టం వల్ల కాదు అది చేయవలసిన పని వేరే వాళ్ళు చేయాలి ఆ కర్మ ఫలాలన్నీ జగత్తుకు అందించవలసిన బాధ్యత రాజుదే గాని సంకల్పించిన వాడిదే గాని సంకల్పానికి మూలమైనటువంటి కర్త ఈశ్వరుడిది కాదు అని కృష్ణుడికి తెలుసు గనుక ఆయన జీవిత కాలంలో ఒక్క యజ్ఞం చేయలేదు కానీ అన్ని యజ్ఞాలలో ప్రథమ తాంబూలం అందుకున్న వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ నిజానికి రాజసూయ యాగం జరిగినప్పుడు అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అని పాండవులు ఆలోచన చేస్తున్నారు మరి ఉన్న వాళ్ళల్లో పెద్దవాడు ఒక్కడే ఆయన భీష్ముడు కాబట్టి ఆయనకి ఇద్దామని ఆయన భీష్ముడి దగ్గరికి వెళ్లారు తాతా మీకు అగ్ర తాంబూలం ఇస్తున్నాం మీరు రండి ఆ తాంబూలం తీసుకుని మమ్మల్ని మా కుటుంబాన్ని మా ఆ వంశాన్ని మీరు ఆశీర్వదించండి అని అంటే అది బ్రహ్మచారులైనటువంటి మీకే ఇవ్వాలి మీరు ఆజన్మ బ్రహ్మచారి కదా పెళ్లి చేసుకోలేదు కదా అని అన్నప్పుడు భీష్ముడు ఒక నిర్ణయం చేశాడు నేను పెళ్లి చేసుకోకపోయినా నేను బ్రహ్మచారిగా ఉండిపోయినా నేనేదో మహత్తర త్యాగం చేసినా వయసు ముదిమి మీరిపోయి పెద్దవాడినైనా నేను బ్రహ్మచారిని కాదు నిజమైన అస్కలిత బ్రహ్మచారి ఎవరు అంటే మన శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను పిలవండి అన్నారు పిలవండి అనగానే శిశుపాలు దంతవక్త్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా కృష్ణుని కులం చేత గుణం చేత భావన చేత చూపు చేత చేష్ట చేత అవమానించారు అగ్రతాంబూలం వీడికి ఇవ్వటానికి వీల్లేదన్నారు ఆ ఏకవచనంలో వీడు వీడనే అందరూ కూడా మాట్లాడారు అప్పుడు భీష్ముడు చెప్పాడు చూడండి మీ ప్రలయనం మానండి ఆయన పరమాత్మ ఇవాళ రాజసూయంలో ఆయన మాత్రమే అగ్రతాంబూలానికి అర్హుడు అనేటువంటి అయినప్పుడు కాబట్టి అగ్రతాంబూలాన్ని తాను ఏమీ చేయకుండా అందరి చేత చేయిస్తూ ఆ స్థాయిని పొందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ.