Skip to content
Transcript తెలుగు
సౌందర్య సాద సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన వందానం వందే సాయి మహేశ్వరం సురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్త్రాప్తం సద్గురుం సత్య సాయిశ్వరం ఆలంబెన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ కథ ఇవాళ ప్రారంభం కావటం కేవలం స్వామి యొక్క అనుగ్రహం. కారణం ఏమిటంటే భగవద్గీతలో కృష్ణుడు ఒక మాటన్నాడు సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నా మార్గశిర మాసం నేను అన్నాడాయన. ఇది మార్గశిర మాసం అందునా పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి నాడు కాలాగ్ని శమన దత్తుడు పుట్టినటువంటి రోజు. దత్తాత్రేయుడు పదహారు అవతారాలు ఎత్తితే అందులో కాలాగ్ని శమన దత్త స్వరూపం ప్రా-ప్రాదుర్భవించినటువంటి మహా సంబంగల వేళ ఇది. అయితే భాగవతం ఎలా చెప్పుకోవాలి? ఇవాళే భారతీయ సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా ఇరవై ఒకటి, పన్నెండు, రెండువేల పది అంటే ఇరవై ఒకటి అంటే మూడు, పన్నెండు అంటే మూడు, రెండువేల పది అంటే మూడు. మూడు మూడు తొమ్మిది, తొమ్మిది శుద్ధ సత్వం అది స్వామి నంబర్. మంగళవారం పౌర్ణమి అందునా మార్గశిర పౌర్ణమి. సంఖ్యా శాస్త్రం ప్రకారం మళ్ళీ బ్రహ్మ పదానికి సంకేతమైనటువంటి తొమ్మిదవ శబ్దం. అన్నింటికంటే విశేషం నిజానికి భాగవతం కూడా వేద కల్పవృక్షం. అది రామాయణ కల్పవృక్షం అయితే ఇది వేద కల్పవృక్షం. అందుకనే వేదవ్యాసులవారు పద్దెనిమిది పురాణాలు రాసి ఆనందం పొందలేక, పద్దెనిమిది పురాణాలు రాశారు, వేదాలు విభజించారు. ఎంతో హాయిగా ఉన్న-ఉండాలి ఇన్ని గొప్ప పనులు చేసిన వాడు. కానీ చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎట్లాగంటే పధ్నాలుగు సంవత్సరాలు చిర తపస్సు చేసినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణ మహర్షిని మొట్ట మొదటిసారి కలుసుకున్నప్పుడు, "అయ్యా పధ్నాలుగు ఏళ్ళు తపస్సు చేశాను. శాంతి, చిత్తశాంతి దొరకలేదు. మంత్రాలు చదివాను. బీజాక్షరాల వెనుక ఉన్న అధిష్టాన దైవాన్ని దర్శనం చేశాను. కానీ చిత్తశాంతి దొరక్క పోవటానికి తపస్సు అనేది అర్థం తెలియకుండా చేశానేమో, తపస్సు అంటే ఏమిటి?" అని అడిగాడు. నిజానికి కావ్యకంఠుల కంటే ముందు వ్యాసులవారికి ద్వాపర యుగంలోనే వచ్చిన మీమాంస ఇది. భారతం కూడా రాశాడుగా. నాలుగు వేదాలు పరిష్కరించాడు. పంచమ వేదమైన భారతం రాశాడు. పద్దెనిమిది పురాణాలు రాశాడు. ఇక ఆయన చేయని పని లేదు. వాఙ్మయం అంతా సృష్టించాడు. కానీ ఆనందం మాత్రం కలగలేదు. మనం చాలా పనులు చేస్తాం ప్రపంచంలో. అసలు పని చేయవలసి ఉన్నదో అది చేసేదాకా ఆనందం కలగదు. వ్యాసులవారి పరిస్థితి అదైతే మరి ఆయనకి సమాధానం ఎవరు చెప్పాలి అంటే నారదులవారు కలిశారు. ఎందుకు ఇట్లా చింతాక్రాంతుడవై ఉన్నావ్ అంటే, ఇదిగో పనులన్నీ చేశాను గానీ ఎక్కడో ఒక మూల మనసులో ఆనందం మాత్రం నాకు పూర్ణంగా లభించలేదు అన్నాడు. ఏది నాలుగు వేదాలు చెప్పినవాడు, పద్దెనిమిది పురాణాలు చెప్పిన వాడు, ఇవన్నీ చేసినటువంటి వాడు. ఆయనన్నాడు, "వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నింటి వలన జ్ఞానాన్ని అనుభవించావు. జ్ఞానాన్ని అనుభవిస్తున్నావు అంటే నువ్వు లేకుండా పోినావు, అద్వైత మూర్తిగా ఉన్నావు. ఆనందం అనుభవించాలి అంటే నీకు మనసు కావాలి. మనసు కావాలి అంటే సగుణం కావాలి. సగుణం కావాలి అంటే ఒక బొమ్మ కావాలి. బొమ్మ కావాలి అంటే ఒక కథ కావాలి. ఎవడి కథయ్యా? ఏది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వ స్వరూపంగా నీవు ఉపాసన చేశావో ఆయన్ని మళ్ళీ సగుణంగా ఆరాధించు నీకు ఆనందం కలుగుతుంది" అన్నారు. సగుణోపాసనా మార్గంలోనే ఎవరి కథ చెప్పాలి అన్నాడు. భాగవతం చెప్పుకోవాలి. భాగవతం అంటే దైవం కథ, భక్తుడి కథ అది. భక్తులందరి కథ కలిపితే భాగవతం. కృష్ణుడి కథ లేదు, విష్ణుమూర్తి కథ లేదు. కాబట్టి మన బోటి వారందరి కథలు గనక కలిపితే స్వామి మీద ముప్పై పుస్తకాలు వస్తాయి. స్వామి మీదే రాయవలసి వస్తే ఒక పుస్తకం వస్తుంది. అంతే కదా. ప్రపంచంలో ఇవాళ అమ్ముడవుతున్న అన్ని పుస్తకాల్లో ఏమున్నాయి అంటే మన కథలు, మన వ్యధలు ఉన్నాయి. దాన్ని ఆయన ఎలా తీర్చారో ఉంది. ఆయన కథ అంటూ ఉంటే చాలా చిన్న కథ, ఎనభై ఏడేళ్ళ కథ అంతే. కాబట్టి పరాస్పరుడికి వ్యధ లేదు గనుక కథ లేదు. కథ లేదు గనుక గాథ లేదు. గాథ లేదు గనుక గ్రంథం లేదు. గ్రంథం లేదు గనుక అది పురాణం కాదు. మరి రోజున భాగవతం అనేటువంటిది ఎలా చెప్పుకోవాలి అంటే మనం అనుకున్నాం. హాయిగా కథలందరికీ తెలుసు బాల భాగవతం అలాగే బాల రామాయణం ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ ఏముంటుంది కొత్తగా దీంట్లో అని. ఎన్నేళ్లుగానో చెప్పుకుంటున్నాం, వింటున్నాం, టీవీల్లో చూస్తున్నాం. కావలసింది ఉపాసనా మార్గాలలో అంగవతి ఉపాసనా, అన్యవతి ఉపాసనా, నిదానవతి ఉపాసనా అని మూడు ఉన్నాయి. అంగవతి ఉపాసనా అంటే స్వామి, స్వామి పటం, దానికి అలంకారం చేయటం, దానికి కొబ్బరికాయ కొట్టడం, దానికి హారతి ఇవ్వటం ఇది అంగరాంగీ భావంతో కనిపిస్తున్న పరమాత్మని ఉపాసన చేయటం.అది కాదే అంటే అది మాత్రమే కాదే అన్యవతీ ఉపాసన చేయాలి మన మనసు స్వామిని గురించి ఎట్లా ఊహిస్తున్నదో ఎట్లా భావిస్తున్నదో ఇది ఇంతేనా అని అనిపిస్తున్నదో అసలు ఏమిటో అనేటువంటి విచార ధారలోకి వెళుతున్నదో అది అన్య ఉపాసన అన్యవతి ఉపాసన బొమ్మ లేదు కానీ బొమ్మ ఉన్నట్లు తెలుసు ఎట్లా ఉన్నది అంటే ఏమో కనబడుతున్న దానికంటే ఇంకాస్త ఎక్కువగా ఉందేమో అన్నట్లు ఉండాలి మూడింటికంటే కూడా రెండింటికంటే నిదానవతి ఉపాసన అత్యుత్తమమైన ఉపాసన ఎందుకని అంటే నెయ్యి కావాలి అంటే ఏం చేయాలి పాలు కావాలి కాచాలి మీగడ కట్టాలి తోడు పెట్టాలి చిలకాలి అప్పుడు వెన్న బయటకు వస్తుంది. పాలలో నుంచి వెన్న తీయటం ఇది పరిణామం వెన్న కాస్తే నెయ్యి అవుతుంది నెయ్యి లో నుంచి పాలు తీయటం అనేది అసంభవం irreversible process అంటాం అలాగే భగవ--భగవంతుడి కథ అయినటువంటి భాగవతుల కథ అయినటువంటి భాగవతాన్ని నిదానవతి ఉపాసనగా నెమ్మదిగా శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అనబడేటువంటి అవతార మూర్తులలో పూర్ణ చైతన్య పరిస్థితి అయినటువంటి కృష్ణ స్వరూపంలో ఉన్నటువంటి గోపాల దేవుడి యొక్క కథని మనమంతా కూడా దోగ్ధలమై అంటే దూడలమై ఆనందాన్ని పానం చేయాలి పొదుగు నాలుగు వేదాల యొక్క సమాహారం అక్కడి దాకా వెళ్ళాలి వెళ్ళినట్లయితే సంసిద్ధమైనటువంటి క్షా-- జ్ఞానం అనేటువంటి క్షీరం పాలు మనకు లభిస్తాయి కేవలం పాలు తాగితే కొట్ట నిండుతుంది గాని గుండె నిండదు ఏం చేయాలి అంటే ఇందాక చెప్పిన ప్రణాళిక అంతా చేసి ఏదో ఒక రోజున దానిని నెయ్యిగా మార్చాలి నెయ్యి అంటే నెయ్యము అని అర్థం నెయ్యము అంటే స్నేహము అని అర్థం స్నేహము అంటే ఎవరితో స్నేహము పరమాత్మతో స్నేహం పరమాత్మతో స్నేహం పొందేటువంటి ఒక విచారధార భాగవత విచారధార గనుక దీనికి భాగవత నవనీతం అని మనం పేరు పెట్టుకున్నాం ఏం చేస్తామయ్యా గురుపూర్ణిమ దాకా భాగవతాన్ని అంటే ఉన్నత్ స్కంధాలన్నీ అన్ని పద్యాలు చదువుకుంటూ పాడుకుంటూ చేసే విచారణ కాదిది చాలా భిన్నమైనటువంటి కోణంలో దీన్ని విచారణ చేస్తూ దీనిని వ్యాసుల వారి తరువాత ప్రధానంగా తెలుగునాట తెలుగు జాతి కోసం ఒక భద్ర జాతి కోసం తన మనస్సుని తన హృదయాన్ని తన సహజ కవితా శక్తిని సమ్మేళనం చేసి పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి సహజ కవి పోతన రాసిన భాగవతాన్ని మనం ఆధారం చేసుకోవాలి ఎందుకంటే వాల్మీకి రామాయణంలో లేనివి వాల్మీకి రామాయణంలో వదిలిపెట్టబడినవి విశ్వనాథవారు కల్పవృక్షంలో ఎట్లా పూర్తి చేసారో వ్యాసుల వారు వదిలిపెట్టినవి వ్యాసుల వారు చాలా సూక్తంగా చెప్పిన వాటిని విస్తృతం చేస్తూ వెళ్ళాడు పోతన కాబట్టి ఈవేళ రాబోయే ఏడు నెలలు సుమారుగా గురుపూర్ణిమ దాక ఎవరికి మనం నమస్కరించ బోతున్నాము అంటే సహజ కవి అయినటువంటి పోతనకి పోతన ఆయన ఆయనే చెప్పుకున్నాడు నేను సహజ కవిని అని అంటే ఎవరి దగ్గర ఆయన నేర్చుకోలే వ్యాకరణం ఛందస్సు ఇవేమీ నేర్చుకోలే సహజమైనటువంటి స్థితిలో కొంతమంది జగత్తులోకి వస్తారు సహజమైనటువంటి పరమహంస ఒక్కడే ఆయన పేరు రామకృష్ణ గురుదేవుడు సహజమైనటువంటి మహర్షి ఒక్కరే ఆయన పేరు రమణ మహర్షి సహజమైనటువంటి సకల దేవతా అతీత స్వరూపం ఒక్కటే అది భగవాన్ సత్యసాయి మూడు పాయలోనే సహజమైనటువంటి కవి ఎవరు అంటే పోతన ఎందుకని అంటే తన కావ్యాన్ని తన భావనని తాను ఉపాసించినటువంటి భక్తి మార్గాన్ని తద్వారా తాను అనుభవించినటువంటి ఆనందాన్ని ఎవరికో కాసులకి ఇచ్చి అమ్ముడుపోక అమ్మవారికి మాత్రమే సమర్పణం చేసుకున్నటువంటి నిర్వికారుడు విరాగి పూర్ణ మానసుడు సహజ కవి అయినటువంటి బమ్మెర పోతనామాత్యుడు అమాత్యుడు అంటే మంత్రి అని కాదు అక్కడ పోతనామాత్యుడు అంటే అమాత్య వంశంలో పుట్టాడు అని కరణం గాడు అని అర్థం అర్థ తెలుగులో ఎక్కడయ్యా అంటే బమ్మెర గ్రామం వరంగల్ జిల్లా అక్కడ పుట్టాడాయన అక్కడే రాశాడు ఏకశిలానగరంలో కాబట్టి పరమ భాగవతోత్తముడు అయినటువంటి పోతన వ్యాసులవారు రాసినటువంటి దాన్ని మనకి ఆవిష్కరణ చేశారు అయితే భాగవతం స్థూలంగా మనకు ఏం చెబుతుంది భగవత్ తత్వాన్ని చెబుతుంది భగవంతుడి రూపాలు వర్ణించటం మనకు తేలికే ప్రతి రూపానికి వెయ్యి నామాలు ఉన్నాయి భగవంతుడి యొక్క శక్తిని అనేక గాథల ద్వారా తెలుసుకోవటం మనకు అలవాటే పెద్ద విశేషం కాదు భా అంటే భక్తి జ్ఞ అంటే జ్ఞానం అంటే వైరాగ్యం అంటే సత్వం ము అంటే ముక్తి ఇది భాగవతం అది శ్రీమత్ శ్రీమంతమై ఉన్నది గనుక శ్రీమద్భాగవతం అయింది శ్రీమత్ అంటే చదివినందువలన ప్రాపంచికమైనటువంటి ఇహ సుఖాలు దొరుకుతాయి ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు అంటున్నప్పుడు వింటున్నప్పుడు శ్రీ అనబడేటువంటి సరస్వతీ దేవి యొక్క కటాక్షం మనందరికీ లభిస్తుంది అంటే లక్ష్మి దొరుకుతుంది జ్ఞానము దొరుకుతుంది శ్రీ అంటేవేదాలకి స్త్రీ అని మరొక పేరు. శకార, రకార, ఇకారాలతో కూడి ఉన్నటువంటిది వేదత్రయ కాబట్టి అది ఋగ్వేదంగా, సామవేదంగా, యజుర్వేదంగా మూడు వేదాలు గనుక అది వేదత్రయ-త్రయీభూతమైనటువంటిది గనుక మూడు వేదాలకి అసలు పేరు ఏమిటి అంటే స్త్రీ. అలాగే వ్యాసభాగవతాన్ని ఆయన పద్దెనిమిది వేల శ్లోకాలలో రాశారు. రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రచింపబడెను. పద్దెనిమిది వేల శ్లోకాలలో వేదవ్యాసుడు ఏం పేరు పెట్టినా, తర్వాత తర్వాత పేర్లు మార్చినా, ఆయన చేసినటువంటి వాఙ్మయ సృష్టికి, తాను రచించినటువంటి ప్రతి దానికి ఆయన పెట్టుకున్న పేరు జయం, అంతే. భారతము జయమే, భాగవతం కూడా జయమే. ఎందుకని అంటే, ఎక్కడ ధర్మం ఉంటుందో, "యతో ధర్మస్థతో విజయః" అంతే కదా! ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడుంటుంది. ఎక్కడైనా మనం ఓడిపోయినాము అంటే మనం ధర్మ మార్గంలో లేము అని మన-మనమే అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా గెలిచాము అంటే మనం ధర్మాన్ని పాటించాము అనుకోవాలి. భారతం గాని, భాగవతం గాని, రామాయణం గాని, మూడు కూడా మానవ జీవన విధానాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి యోగ స్థాయిలో నడిపించేవి గనుక మూడు కూడా ప్రాతఃస్మరణీయమైనవి, పారాయణార్హమైనవి. అయితే భాగవతానికి కథానాయకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. భారతానికి ఆయనే. మరి భారత కృష్ణుడు వేరు, భాగవత కృష్ణుడు వేరా అంటే, భారత కృష్ణుడు లౌకిక పరమైనటువంటి కృష్ణుడు. ఆయనలో రాయబారాలు చేయటం, వాళ్ళని వీళ్ళని కలపటం, ఆహ్ కొట్టుకునే వాళ్ళని సమన్వయం చేయటం, కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి వ్యాపారంతో కూడినటువంటి మనస్తత్వాన్ని ప్రకటన చేసినటువంటి వాడు భారత కృష్ణుడు. అందుకనే కృష్ణుడి అనేక పనులు మనకు అధర్మంగా కనిపిస్తాయి పైకి. తర్వాత తర్వాత నెమ్మదిగా అది కూడా తత్వ విచారణ చేస్తే ఆయన చేసిన ప్రతి పని ధర్మబద్ధం అని తర్వాత అనిపిస్తుంది. అయితే భాగవత కృష్ణుడు రసానంద స్వరూపుడు ఆయన. పరిపూర్ణమైనటువంటి రస స్వరూపుడు గనుక ఇందులో ఆయనను తలచుకున్నా, ఆయన గాథలు విన్నా, ఆయన యొక్క శక్తిని మనం ఒక్కసారి ఊహించుకున్నా, ఆయనను గురించినటువంటి స్తుతులన్నీ మనం అర్థం చేసుకున్నా మనకు ఏం కలుగుతుంది అంటే పూర్ణమైన ఆనందం కలుగుతుంది గనుక భాగవతం ఎక్కడ చెప్పబడుతుందో, భాగవతం ఎక్కడ వినబడుతుందో అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు వచ్చి కూర్చుంటాడు. మన కృష్ణుడు ఎవరయ్యా? సాయి కృష్ణుడే. కనుక ద్వాపర యుగం నాటి కృష్ణుడే ఈనాటి సాయి కృష్ణుడు గనుక, సత్య సాయి భగవానుడే కృష్ణ స్వరూపం గనుక కృష్ణ స్వరూపం ఎక్కడ మనం భాగవతాన్ని-- అంటే చూడండి, ఇవాళ భాగవతాన్ని గురించి చెప్పుకోవటము అంటే మూడు వేదాల గురించినటువంటి విచారణ. మూడు వేదాలు, దాన్లో పాట ఉంది సామగానం ఉంది. అలాగే ఋగ్వేదం ఉంది, ఇదిగో అనుకుంటున్న మాటలున్నాయి. యజుర్వేదం ఉంది, కర్మకాండలు కూడా ఉన్నాయి. దానం, త్యాగం, యోగం, భోగం, రాగం, అనురాగం, ప్రేమ, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సర్వాంగీణమైనటువంటి ఒకానొక స్థితిలో పరమేశ్వరుడు ఇక్కడికి మానవ దేహాన్ని ధరించి వచ్చినప్పుడు ద్వాపర యుగంలో ఒక పార్శ్వంలో లోకంతో ఉన్నాడు, మరొక పార్శ్వంలో లోకాతీతమైనటువంటి స్థాయిలో సంచారం చేశాడు. ఇక భాగవతం, అది ఒక రసనాలయం అన్నారు. రసనాలయం అంటే అన్ని రసాలు ఉన్నాయి దాంట్లో, లేనిది లేదు. తొమ్మిది రసాలు దాంట్లో ఉన్నాయి. తొమ్మిది రసాలు మూలమైనటువంటి "రసో వై సః" అన్నటువంటి ఈశ్వర స్వరూపం అన్నది శ్రీకృష్ణ చైతన్యం పరిపూర్ణమైనటువంటి స్థితిలో, అంటే ఇంకా ఎక్కడా ఆవిష్కరింపబడకుండా లేని స్థాయిలో ఉన్నది గనుక శ్రీకృష్ణ పరమాత్మని [దగ్గిన కాసు] పోతనామాత్యుడు ఒక భావన చేశాడు. ఆయన భావన చేస్తున్నటువంటి వేళ ఎవరు పోతనామాత్యుడు? మనం విశ్వనాథ్ వారి గురించి ఎలా చెప్పుకున్నామో కావ్య సృష్టి చేసిన వానిని గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన త్వరి నాళ్ళలో కవిత్వం రాసేటువంటి వేళలో [దగ్గిన కాసు] భోగినీ దండకం అని ఒకటి రాశాడు. భోగినీ దండకం రాస్తే అది కేవలం ప్రాపంచికమైనటువంటి ఒక వస్తువు. ఆయనకు ఆనందం కలగలే. [దగ్గిన కాసు] కాస్త దున్నుకోవటానికి చిన్న మడి చెక్క ఉన్నది, నేల. వ్యవసాయదారుడు శైవ మతాన్ని ఉపాసన చేసినవాడు. శైవోపాసకుడు. మహేశ్వర ఉపాసకుడు. ఎవరైనా దైవతాన్నైనా ఉపాసన చేయవలసి వస్తే వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళ లక్ష్య గమ్యాలు ఏమిటంటే శివుణ్ణి గురించి ఉపాసన చేస్తే శివ దర్శనం కావాలని, రాముణ్ణి గురించి గనుక ఉపాసన చేస్తే రామ దర్శనం కావాలని కోరుకుంటారు ఎవరైనా. అలాగే పోతన కూడా శైవుడు గనుక తన తల్లిదండ్రుల నుంచి అనూచానంగా, సాంప్రదాయకంగా, సనాతనంగా, కులపరంగా వచ్చినటువంటి తీవ్రమైనటువంటి శైవ మతాన్ని ఆయన అనుసరించాడు. శైవారాధనలో జీవితాన్ని పరితృప్తం చేసుకున్నాడు ఆయన. రోజు ఆయనకు అనిపించింది, ఏమిటి భోగినీ దండకం రాయటం లేకపోతే ఇంకేదో కావ్యం రాయటం, దాన్ని ఎవరికో ఎవరికో తీసుకెళ్ళి కా-అమ్ముకొని రావటం, పొలం మీద వచ్చే డబ్బు, కావ్యం మీద వచ్చే డబ్బు కలిపి సంసారం గడపటం, ఎందుకేనా నేను పుట్టింది అని ఒక ప్రశ్న వేసుకున్నాడు.కాదు అని సమాధానం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బయటి నుంచి కాదు లోపల నుంచి వచ్చింది. లోపల నుంచి రాగానే అప్పటికే ఎవరిని ఆరాధించండి, ఆరాధన చేసే అలవాటు ఉంటే దేన్నైనా ఆరాధించవచ్చు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒకరోజున ఒక మంచి కావ్యం రాద్దాం దైవాన్ని గురించి అనుకున్నాడు. దైవం అంటే ఆయన దృష్టిలో శివుడే. శివుణ్ణి గురించి ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు భాగవతం మార్గశిర మాసంలో ఇటువంటి ఈరోజు పౌర్ణమి నాడే చంద్రోదయం అయ్యేటువంటి వేళ correct గా సమయం. అది భాగవతం పుట్టినటువంటి వేళ. అది విశేషం. మార్గశిరం కృష్ణుడు పౌర్ణమి చంద్రోదయ వేళ చల్లని సాయం సంధ్య హాయిగా గోదావరి తీరానికి వెళ్ళాడు, స్నానం చేశాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆయనకు ఏం జరిగిందయ్యా అంటే ధ్యానంలోకి చక్కగా తొందరగా వెళ్ళాడు. వెళ్ళగానే ఒక మెరుపు మేఘం కలిసినట్టుగా ఏదో ఒక దృశ్యం ఏర్పడింది. దృశ్యంలో రాజకుమారుడు పక్కన ఎవరో ఒక స్త్రీమూర్తి ఇద్దరూ కనిపించారు. కనిపిస్తే ఈయన మనస్సు శివుడి మీద లగ్నమై ఉన్నది. శివపార్వతులేమో అనుకున్నాడు. కానీ శివపార్వతుల్ని శైవులంతా అర్ధనారీశ్వరంగానే ఉపాసన చేయాలి. కాబట్టి ఉంటే అర్ధనారీశ్వరంగా ఒక బొమ్మ కనపడాలి. కానీ ఇద్దరూ పురుషుడు పురుషుడుగా స్త్రీ స్త్రీగా కనిపిస్తున్నారు. శివుడేనా అనుకున్నటువంటి వేళ కాదు ఎందుకంటే శివుడి లాగా లేడు అనుకున్నాడు. మనస్సు ఏం అనిపించింది అంటే ఒక రాజ ప్రముఖుడు కనిపించాడు, కిరీటం పెట్టుకొని వచ్చాడు, మెరిసిపోతున్నాడు. ఎప్పుడైతే రాజ ప్రముఖుడు అన్న ఆలోచన ఆయన మనసుకు తాకిందో వచ్చిన వాడు నోరు విప్పాడు. "నేను రాజ ప్రముఖుడిని కాదు, నేను రామభద్రుడిని" అన్నాడు. శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి పోతనామాత్యుడికి దర్శనం ఇచ్చాడు. ఇదేమిటయ్యా శైవోపాసన చేస్తే శివుడు కనపడాలి, సంబంధం లేని రాముడు వచ్చి సీతా సమేతంగా కనిపించాడు అని పోతనామాత్యుడి మనస్సు కాస్త అటూ ఇటూ ఊగుతున్నటువంటి వేళ వచ్చినటువంటి రామచంద్రుడు ఏమన్నాడంటే అటు శివుడి కథ రాయమనలేదు, ఇటు నా కథ రాయమని అనలే, ఏమన్నాడంటే చక్కగా హాయిగా కృష్ణుడి కథ రాయన్నాడు. ఇది మూడో పాత్ర. అంటే ఒక జ్ఞాని ఉత్తమోత్తమ స్థాయికి వెళ్ళినటువంటి వాడు. శివకేశవులకి అభేదం చెప్పుకొని జీవిస్తాడు. శివుడైనా కేశవుడైనా ఒక్కడే. ఇవాళ మనం స్వామి దయవల్ల సర్వ ప్రపంచాన్ని స్థాయిమయంగా చూడగలుగుతున్నాం. సర్వులలో స్వామిని చూడగలుగుతున్నాం. అసలు స్వామిలో సకల దేవతలని చూడగలుగుతున్నాం గనుక మనకి ఇదేం కొత్త విషయం కాదు. పోతనామాత్యుడికి మాత్రం అది కొత్తది. అక్కడ మనం ఆగాలి. అంటే ఆదేశం ఎవరిచ్చారయ్యా అంటే రామచంద్రుడు స్వయంగా ఇచ్చాడు. నువ్వు రాయ్ అని. ఇవాళ స్వామి మీద చాలా పుస్తకాలు వస్తుంటాయి. పుస్తకాల్లో మొదటి page లో ఏముంటుందంటే స్వామి నా కళ్ళలో కనిపించి పుస్తకం రాయమని చెప్పారు అని ఉంటుంది. ఏమో అని చెప్పారో లేదో. ఎందుకనంటే ఆయన చెప్పు అని గనక మనం రాస్తే అది భాగవతంతో సమానంగా ఉండాలి. ఉన్నాయా? అట్లా లేవు. కాబట్టి కనిపించారు అనుకుంటూ రాయటం అదొక ఎత్తు. కానీ పోతనామాత్యుడికి మాత్రం కనిపించాడు. ఎందుకంటే ఆయన వర్ణిస్తాడు తర్వాత. మనం చక్కగా పద్యాలలోకి వెళదాం. పద్దెనిమిది వేల శ్లోకాలు కెయలో ఏమున్నది అంటే మూడు యోగాలు ఉన్నాయి. కర్మయోగం ఉంది, భక్తియోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలలో ఉత్తమోత్తమమైనటువంటిది జ్ఞానయోగంగా వ్యాసులవారు ఉపాసన చేసినా, అనుభవంలోకి తెచ్చుకున్నా, ఆయన భక్తి మార్గంలో ప్రవేశించటానికి భాగవతం ఆయనకు అక్కడికి వచ్చింది. వ్యాసులవారు మూడింటిని ఎక్కడ ప్రారంభించాలి, కథను ఎక్కడ ప్రారంభించాలి అని ఆయనకి ఒక scheme ఒక plan కావాలి, ఏదన్నా రాయాలి అంటే. దాన్ని synopsis అంటాం. రాసేటప్పుడు ఏం తోచలే. ఆయన కూడా భగవంతుని గురించి ఆలోచన చేస్తూ చేస్తూ ఎవరితో సమాలోచన చేశాడంటే ఎవరు భాగవతం రాసుకోవయ్యా అని చెప్పారో నారదుల వారితోనే కూర్చున్నాడు. దానిని వ్యాస నారద సంవాదం అన్నారు. అంటే సంవాదం అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు. కొన్ని confirmation కోసం, కొన్ని consolidation కోసం, కొన్ని clarification కోసం రకరకాలుగా. సరే రామాయణం ఎక్కడ ప్రారంభమైంది అంటే శ్లోకంలో నుంచి శ్లోకంగా ప్రారంభమైంది. మానుషాద ప్రతిష్ఠాన్త్వమగమః శాశ్వతీతమాః యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం అది కదా! అంటే ఒక శ్లోకం. దానిలో నుంచి రామాయణ గాథ స్రవించింది. భాగవతం ఎలా స్రవించింది, ఎలా ప్రారంభమైంది అంటే అశ్వత్థామ యొక్క అవమానంతో ప్రారంభమైంది. భగవద్గీత ఎట్లా ప్రారంభమైంది అంటే అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అంటే జీవితంలో చాలా గొప్ప పనులు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి అంటే ఒక వైఫల్యంలో నుంచి ప్రారంభం అవుతాయి. లేదా మహానందంలో నుంచి ప్రారంభం అవుతాయి. వైఫల్యంలో నుంచి ప్రారంభమైనవన్నీ విజయానికి దారితీస్తాయి. చివరగా ఆనందం కలుగుతుంది. పరమాత్మ దర్శనాలు అవుతాయి. అనేక స్కంధాలలో మనం దర్శనం చేయబోయేటువంటి భాగవత తత్వ నవనీతం కాబట్టి నవనీతాన్ని వెన్నని మనం గ్రహించాలి. వెన్న చిలకగా నేతి మీద తేలుతుంది, నీటి మీద తేలుతుంది.నీట మునగదు నీటి మునిగిన వెన్న మంచి వెన్న కాదు నీటి మీద తేలాలి నీటికి అంటకుండా ఉండాలి రెండోది వెన్న లో నుంచి తెరుగులో నుంచి మీగడ లో నుంచి చిలికి వెన్న తీస్తున్నప్పుడు వెన్న బయటకు రావాలి అంటే నీరు కావాలి నీరు చిలుకుతూ నీరు దానికి కలుపుతూ చక్కగా వెన్న ఎట్లాగైతే బయటకు తీస్తామో ప్రపంచ అనుభవాలు ప్రపంచ భావనలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్వైతాలు చీకటి వెలుగులు జనన మరణాలు ఆశలు అశాభంగాలు జయాపజయాలు వీటన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ నవనీత ధార లోకి మనం వెళ్ళాలి గనుక పోతనామాత్యుడికి మనం చక్కగా శిరసా వందనం చేద్దాం అయితే పోతనామాత్యుడికి ఇంత ఆనందం కలిగించినటువంటి భాగవతాన్ని కూడా నమస్కరించాలి భాగవతం లేకపోతే పోతన లేడు వ్యాస భాగవతం లేకపోతే పోతన ఇంకో భోగిని దండకం నెంబర్ టూ రాసేవాడు ఆయన ఏమన్నాడంటే నన్నయ తిక్కన ఎర్రన అనబడేటువంటి ముగ్గురు కవులు వ్యాసుడు రాసినటువంటి భారతాన్ని ఆంద్రీకరించి భాగవతాన్ని వదిలిపెట్టారు వాళ్ళలో ఒక్కడు దీన్ని ముట్టుకున్నా నాకు అదృష్టం కలిగేది కాదు బహుశా అది నా నాకు వరదానం చేయడం కోసమే కవిత్రయం ముగ్గురు కూడా భారతాన్ని మూడు వందల సంవత్సరాల కాలంలో పూర్ణం చేసి అంటే నన్నయ గారు తర్వాత తిక్కన వందేళ్ళు తర్వాత ఎర్రాప్రగడ కాబట్టి మూడు వందల సంవత్సరాల ఆంద్రీకరణం తర్వాత నాకు కలిగినటువంటి యోగాన్ని నేను సంపూర్ణంగా అవకాశాన్ని చేజిక్కించుకొని చక్కగా భాగవతాన్ని జగద్ధితంగా రాస్తానన్నాడు జగత్తుకి ఆనందం కలిగించేలాగా ఇవాళ సమస్త లోకాః సుఖినో భవంతు అంటే మన చేతలు మన నడతలు మన ఆలోచనలు మన కాయక కర్మలు మన మనోభావాలు మన చిత్తవృత్తులు మన హృదయంలో కలిగేటువంటి అనేకానేక స్పందనలు ఇవన్నీ కూడా దేనికి దారి తీయాలి అంటే సమస్త లోకాలకి ఆనందం కలిగించే స్థాయిలో వెళ్ళాలి గనుక పోతనామాత్యుడు కూడా అందరి వలెనే మహా కవులు ఎట్లాగైతే జగత్ కల్యాణం కోసం కావ్య రచన చేశారో అట్లాగే శ్రీకృష్ణ గాథని శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని భాగవత తత్వాన్ని భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులుగా వీటన్నింటినీ కూడా గుదిగుచ్చి ఒక చక్కని మహామాలగా అనుగ్రహ వరదానం చేశారు కాబట్టి భాగవతాన్ని ఇందాక కల్పవృక్షం అన్నాం మనకదేదో మాట ఇష్టమే కాదు అలవాటై కాదు అక్కడే వ్యాసుల వారి గురించి చెప్తూనే కొన్ని మాటలున్నాయి మాటల్లో ప్రధానంగా నిగమకల్పతరోర్గణితం ఫలం శుకముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం వ్రతమాలయం ముహరభో రసికా భువభాముఖాః ఎంత అందమైనటువంటి శ్లోకం అంటే దాన్ని తెలుగులో చెప్పుకున్నట్లయితే నిగమకల్పతరోర్గత గణితం వేదము అనేటువంటి ఒక కల్పవృక్షం ఉందట వేద కల్పవృక్షంలో చిటారున ఎక్కడో ఒక పండు పండిందట పండు నిండా రసం ఉందట మామూలుగా ఉన్నటువంటి పళ్ళు అన్నింటికీ తెంకలు ఉంటాయి ఇంకోటి ఉంటాయి ఇంకోటి ఉంటాయి దాంట్లో కేవలం రసం ఉన్నదట పండు అందుకోవాలి మనం ఎట్లా అందుకోవాలి చెట్టెక్కలేము కోసుకునే నేర్పు లేదు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేడు ఇదిగోనయ్యా దీని నిండా ఇది ఉంది అని చెప్పేవాళ్ళు లేడు అక్కడ ఉందని మాత్రమే ఎవరో అందరూ చెప్తున్నారు చెట్టు చివర పండు ఉంది అని పైగా వేద వేదాంతాలు అన్నీ కూడా సమర్థవంతంగా అర్థం చేసుకొని వేదాధ్యయనం చేసి వేదనిష్ఠతో రసానుభూతిని పొందినటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి రసవత్ భావన అందించేవాడు లేడు ఎట్లా అని అనుకున్నట్లయితే నిగమకల్పతరోర్గణితం కింద పడ్డదట ఏం పడింది ఫలం పండు పడింది ఎట్లా పడింది ఎందుకు పడింది శుకుడు అనబడేటువంటి ఒక మహాముని యొక్క ముఖం ద్వారా వెలువడింది అని ఒక అర్థం శుకుడు ఎవరు వేదవ్యాసుడి కొడుకు ఆయన జ్ఞానయోగంలోకి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేశాడంటే జనకుడి దగ్గరికి పంపించాడు అదేంటి నీకు తెలియదా అన్నాడు నువ్వు అక్కడ రాజు ఉన్నాడు రాజర్షి దగ్గరికి వెళ్లి జ్ఞానం నేర్చుకోమన్నాడు అటువంటి శుకుడు తాకినటువంటిది గనుక అది ఎట్లా ఉన్నదట అంటే అమృతద్రవసంయుతం అమృతం ద్రవిస్తూ దాంతో అమృతంతో కూడి ఉన్నదా అన్నట్లుగా ఉన్నదట రెండో అర్థం ఏమిటంటే బాగా పండినటువంటి ఒక పండు చెట్టు చివర ఉన్నట్లయితే అది మనం కోరుకున్నట్లయితే రెండే మార్గాలున్నాయి ఒకటి కాల దమనంలో దానంతట అదన్నా రాలి కింద పడి మనం అందుకోగలగాలి లేదా మనకోసం ఒక చిలుక అక్కడిదాకా వెళ్లి పండును ముక్కుతో కొట్టి నేల రాల్చినట్లయితే దాన్ని అందుకోగలగాలి శుకము అంటే శుకదేవుడు అని ఒక అర్థం శుకము అంటే చిలుక అని రెండో అర్థం ఏదైతే శుకదేవుడి ముఖం నుంచి వెలువడిందని అట్లా తీసుకోవచ్చు లేదా పోతన అనేటువంటి ఒక కవి చిలుక అక్కడిదాకా వెళ్లి భాగవత రసాన్ని అనుభవించి పండుని మనకిచక్కగా చేతి కందేట్లుగా చేశాడని అనుకోవచ్చు. పిబత భాగవతం. భాగవతాన్ని నేను హాయిగా తాగుతా. అది ఏమిటి? రసమాలయం. పూర్ణమైనటువంటి రసము ఆలయంగా ఒక source గా ఒక నిండుగా పండుగా పరిపూర్ణంగా ఉన్నటువంటి ఫలాన్ని నేను ఆనందిస్తాను. ముహురహో రసికా. రసము తెలిసినవారు, యోగ్యులైనవారు, ప్రాజ్ఞులైనవారు, తత్వజ్ఞులైనటువంటివారు, ముముక్షువులు, సాధకులు, తపస్సులు, ఋషులు, మహర్షులు వీరందరూ కూడా రసికులే. రసికులు అంటే ఆనందించగలిగినటువంటి హృదయము కలిగినవారు. మనస్సు కలిగినవారు కాదు. మనస్సు ఎప్పుడూ ఆనందించదు. మనస్సు ఏమంటుంది అంటే బాగా లేదంటుంది. చాలా బాగుందంటుంది. హృదయం ఏమంటుంది అంటే అది ఏమీ అనదు. హాయిగా దాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ముహురహో రసికా భువ భావుకాః. ప్రపంచంలో భావుకులు ఉండాలి. ఒక భావుకత్వం ఉండాలి. అన్నింట్లో భాగం భావుకత్వం ఏమిటంటే పరమాత్మ ఉన్నాడని, ఆయనకి సౌందర్యవంతమైన దేహం ఉన్నదని, సర్వశక్తులు ఉన్నాయని, ఘటనా ఘటన సమర్ధుడని, పూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడని, ఇవన్నీ మనకు ఎరుక గనుక ఉన్నట్లయితే వాడు భావుకుడవుతాడు. భావం లేదు. దేవుణ్ణి ఊహించే శక్తి లేదు. దేవుడికి నాలుగు కాళ్లున్నాయి, దత్తాత్రేయుడికి ఆరు చేతులున్నాయి, ఏమో ఇది మేము నమ్మేట్టుగా లేవు అంటే వాడు భావుకుడు కాదు. ఉండే ఉండాలి. ఆరు చేతుల వాడు ఉండి ఉండాలి. బహుశా అవన్నీ కూడా మన ఆరు కర్మలకి గుణ సంకేతమై ఉండాలి. మూడు తలల వాడై ఉండాలి. అవును మన-మన మూడు గుణాలై ఉండాలి. చేతిలో డమరు ఉంది, శబ్ద స్వరూపుడై ఉండాలి. అదిగో ఆయన చుట్టూ నాలుగు కుక్కలు కూర్చొని ఉన్నాయి, నాలుగు వేదాలని విన్నాను అయి ఉండాలి. అని సమన్వయం చేసుకునేటువంటి వాడు భావుకుడు. తన భావుకత్వంతో ఒక రాసిక్యాన్ని ఒక రసజ్ఞతని పొందినవాడు రసికుడు. రసికుడు కావాలంటే బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ చెప్పుకున్నాం. అనేక శాస్త్రాల యొక్క రహస్యాలు తెలియాలి. తెలియకపోతే ఏదో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు వేపలలో పెరిగాడు, అక్కడికెళ్ళాడు, ఇక్కడికెళ్ళాడు, నిర్వాణం అయిపోయింది, తర్వాత భారతం వచ్చింది ఇవన్నీ చెప్పుకోవటానికి వీల్లేదు. కాబట్టి రసికా భావుకాః. బాగా పండినటువంటి, మాగినటువంటి, రసవంతమైన, ఫలవంతమైనటువంటి భాగవతం అనేటువంటి ఒక దివ్య ఫలాన్ని, ఒక మధుర ఫలాన్ని శుకుడు అనబడేటువంటి ఒక చిలుక వేదవేదాంతముల చిట్టచివర ఉన్నటువంటి కల్పవృక్షం చితారున ఉన్నటువంటి కొమ్మ నుంచి జార్చి మనకిచ్చాడు గనుక భాగవతాన్ని పిబత భాగవతం. రసమాలయం. నువ్వు ఎక్కడినుంచి తీసుకో అది ఆనందమే. భక్తుడి కథ, భగవంతుడి కథ, భాగవతుడి కథ అది యథా, దాన్ని నువ్వు ఎట్లా దర్శనం చేసినా అది పూర్ణంగా ఉంటుంది. భగవత్ తత్వాన్ని మనకు చెప్తూ ఉంటుంది. భాగవతాన్ని వింటూ వింటూ చివరికి ఏం కలుగుతుందయ్యా అంటే నిదానవతీ ఉపాసన. వెన్న పాలు చిలకటం, మజ్జిగ చిలకటం, మజ్జిగ తయారు చేయటం అనేది ఎంతో నెమ్మదిగా చేయాలి. మనం తొందరపడితే వెన్న రాదు బయటికి. ప్రయత్నంలో బాగా గనుక చేసేసినట్లయితే ఏం దక్కుతుంది, ఏం దక్కదు. దానికి వేడినీళ్లు కలపాలి, చన్నీళ్లు కలపాలి, చిలకాలి, ఎంత పోయాలో అంత పోయాలి. దానికో పాళ్ళున్నాయి, దానికో ప్రజ్ఞ ఉంది, దానికో నేర్పరితనం ఉంది వెన్న కావాలి అంటే. అక్కర్లేదంటే ఒక గ్లాస్ పాలు తాగి దాంట్లోనే నిన్నే చెప్పారు దాంట్లోనే వెన్న ఉందని అదే నెయ్యు అనుకుందామంటే కుదరదే. అలాగే కర్మ యోగంలో ఉన్న, భక్తి యోగంలో ఉన్న, జ్ఞాన యోగంలోకి మనం వెళ్ళాలి. జ్ఞాన యోగంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్మలన్నీ జ్ఞానంతో కూడి చేస్తాం. అలాగే భక్తి యోగంలో అంటే పూజాదికాలు, దానధర్మాలు, త్యాగాలు, యాగాలు, యోగాలు ఇవన్నీ కూడా జ్ఞానంతో కూడి చేసినట్లయితే అది సంపూర్ణమైన అనన్యమైన భక్తిగా ఉంటుంది.
SSSMC · audio

Bhagawata Navaneetham - 01

Home

Bhagawata Navaneetham - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 34:38

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

    Now playing
  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67