No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ముమ్మూర్తుల ముదుక వేల్పు తియని మెయంపు పలుకు చెరుకు రసం పు సోనలు వీణుల తరవులంగొచ్చి చెరుకు రసం చెవిలో పోసినట్టుగా ఉందట బలికి ఆ ఇగ అన్నీ చూస్తాననే వాడు ఉంటే యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణుడు అప్పటిదాకా అర్జునుడు కృష్ణుడు ఏం చెప్పినా వాడు వినలే అడుగుతూనే ఉన్నాడు ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉన్నాడు చూశాడు ఆయన వీడు దారికి ఎలా రావాలి అని అర్జునా! యోగక్షేమం వహామ్యహం నీ యోగాన్ని నీ క్షేమాన్ని నేను చూసుకుంటా అన్నా కరిష్యే వచనం తవా అన్నాడు అయితే అది చూస్తా అన్నావు కదా ఈ చెప్పు ఇప్పుడు వింటా అన్నాడు అప్పటిదాకా ముందే కరిష్యే వచనం తవా అని మొదట్లోనే అనొచ్చుగా అనలే ఎందుకని అంటే మనకెంత security కావాలి secured life ఉండాలి చివరిదాకా కన్నుమూసే దాకా దాంట్లో దోషం లేదనే ఆశ అది ఉండాలి పోయేదాకా భద్రంగా ఉండాలి తర్వాత ప్రహ్లాదుడు బలి బలికో కొడుకు వాడికో కొడుకు పుట్టే దాకా వాళ్ళంతా అసలేమైపోతారు అన్నాడనుకోండి వీడు హతమైపోతాడు జీవుడి తాపత్రయమే అది కానీ ఆనందం కలుగుతున్నది బయళ్ళు నుండి రెప్పల కప్ప తప్పుంగోచుకొని కనుగవ కొలంకుల అలుగులు వెడలిన చందంబున సంతసంబున కన్నీరుము నీరై పరవ ఇక ఆనందం అవధులు దాటిపోయింది బలికి ఎవరికీ దక్కని అనుగ్రహం దొరికింది కదా అని ఆనంద భాష్పాలు అశ్రువులట్లా రాలుతూనే ఉన్నాయి ప్రవహిస్తూ ఉన్నాయి ఉరప్పలకంబున పులకంబులు కులకంబులు తిలకంబులత్త ఒంటిమీద ఉన్నటువంటి సర్వ శరీరంలో ఉన్నటువంటి రోమరోమము నిక్కబొడుచుకున్నదట నిక్కబొడుచుకొని కేళుమగొచ్చి నెక్కొన్న వేడుకంతో కుడుబడుచు చిక్కని చిత్తంబున చక్కని మాటల రక్కసుల రేడు ఇట్లనియే అంత ఆనంద పాదోధి ఆనంద మహాసముద్రాన్ని అనుభవిస్తున్నాడు బలి అప్పుడన్నాడట ఒక మాట ఎన్నడు లోకపాలకుల నీ కృప చూడని నీవు నేడు నన్ను ఉన్నతు చేసి నువ్వు ఎంతమంది రాజులను చూసుంటావు ఎంతమందిని అనుగ్రహించి ఉంటావు నీ చరిత్రలో కానీ ఇంతవరకు ఇట్లా మాత్రం ఎప్పుడూ జరగలేదు నా బ్రతుకు ఓజయు ఆమతిచ్చి కాచితీవు మన్ననలు ఈ దయారసము మాటల తదరికంబు చాలవే పన్నగకల్ప నిన్నెరిగి పట్టిన ఆపద కల్గ నేర్చుని అందుకే స్వామి అంటారు అర్థం ఎరిగి చేయకపోతే ప్రపంచంలో ఏ పని అయినా వ్యర్థమే పరమాత్మని కూడా ఎరిగి ఉపాసన చేయాలి ఆ ఎరగటం అంటే తత్వం ఎరగాలి ఆయన జీవిత కథ ఆయన bio data పారాయణం చేస్తే ఏం ముక్తి రాదు ఆయన తత్వం గనక తెలుసుకోగలిగినట్లయితే దానిని జీవితంలో translate చేసుకోగలిగినట్లయితే అది ఒక పూర్ణ ముక్తి వైపు దారి తీస్తుంది గనక ఎటువంటి రాజునకి కలగనటువంటి ఒక దివ్యానుగ్రహం నాకు ఇచ్చావయ్యా నీది దయారసం అన్నాడు చూడండి రుణాలున్నాయి కొన్ని తల్లి రుణం సేవ చేసి తీర్చుకోవచ్చు తండ్రి రుణం అధికాధికమైన కీర్తి సంపాదించి ఆ తండ్రి రుణం తీర్చచ్చు వీరి తండ్రి ఫలానా వారట అనగానే తండ్రి ఋణం తీరిపోయినట్టే మూడవది గురు ఋణం తీర్చుకోవచ్చు ఆయనకి సేవ చేసి భగవంతుడితో ఋణం తీరేది కాదు అది జన్మ జన్మాంతరమైనది అది పోవాలని అనుకోకూడదు ఇటువంటి స్వాధ్యాయం చేసినందువలన విచారణ చేసినందువలన ఋషి ఋణం కూడా తీర్చవచ్చు మరి ఇంకా తీర్చలేని ఋణం ఏదన్నా ఉన్నదా అంటే దయారణం తీర్చుకోలేదు మన యందు ఎవరికో ఒక దయ కలుగుతుంది విశ్వనాథ లారంటారు కల్పవృక్షంలో నీ యందు నా దయ పుట్టుగాక అన్నాడాయన అచ్చ తెలుగులో ఆ దయ పుట్టింది అనుకోండి ఆ దయకి ఎట్లా ఋణం ఎలా తీర్చుకోవాలి అని దయ abstract గా ఉంటుంది hypothetical గా ఉంటుంది కానీ ఒక రసార్ద్ర భూమిక గనక ఆ దయారణం తీర్చుకునేది కాదు అది కూడా భగవంతుడి ఋణంతోనే సమానంగా చెప్తూ అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం ప్రణామంబు చేసి ఇందు ధరునకు వందనంబాచరించి బంధముక్తుడై ఎందుకని అంటే వాణ్ని వారుణ పాశంతో బంధించాడు విష్ణువు ఈ పద్యానికి ముందు ఆ వారుణ పాశంతో బంధిస్తే ఏదన్నా తెంచుకునే ప్రయత్నం చేస్తాడా అంటే రాక్షస వీరులందరినీ వద్దన్నాడు ఇది మన సమయం కాదన్నాడు దయంతా దేవతల మీద ఉన్నది వాళ్ళని అనుభవించని మన time వచ్చేదాకా మనం కాచుకుందాం అన్నాడు బలి సుతనంబున కుం భయనించే హరి ఆజ్ఞ ప్రకారంగ సుతల లోకానికి వెళ్తూ ఉన్నాడు అప్పుడు మరి ఇంకా ప్రహ్లాదుడు కూడా అక్కడే నుంచుని ఉన్నాడు ఆయనకేం పాత్ర లేదు కదా వెళ్లిపోవచ్చు కదా అంటే హరి మాయమయ్యే దాకా ఆయన అక్కడ ఉంటాడు అంత ఇష్టం ఆయనకి హరి అంటే ఉన్న కాసేపు చూడకుండా రేపు కనపడతాడులే అనుకుంటే ఎట్లారేపు కనపడతాడో కనపడడో ఉన్నప్పుడే చూడాలి పరమాత్మని అందుకని ఆయన అక్కడి ఉండిపోయినాడు. పాలడగడు మేలడగడు తేలడు వేలడు భిక్షించి అన్నకిచ్చె త్రిజగమున్ వేంపుల తల్లి కడపటి చులున్ బోలగ కలరే పొలయని తమ్ముల్ కడుపు బదరగాగ కొడుకుల కనుకంటే తల్లి కొక్కడే చాలు బల్లిదుందు త్రిదశ గణమున్న అదితి కానుపు తీర చిన్ని మేటు వడుగు కన్న ఎట్లు. నూరుగురు గంపలు గంపలు కనే కంటే ఒక్క చిన్ని వటువు లాంటి వాడిని ఒక్కడిని కంటే చాలదా? పాండవ జ్యోగుల జయాల్లో కూడా అభిమన్యుడిని యుద్ధానికి పంపేటప్పుడు ధర్మరాజు విమర్శకు గురవుతాడు అర్జునుడున్నాడు భీముడున్నాడు నకుల సహదేవులున్నారు వీళ్లందరినీ కాకుండా వాడి నూనూగు మీసాల వాడు అప్పుడే పెళ్లి చేసుకున్నాడు వాడు అభిమన్యుడిని పంపిస్తున్నారేం పద్మవ్యూహం ఛేదించటానికంటే చాలదే వేటకై ఒక్క జాగిలంబు అన్నాడు. నూరుగురు కొడుకులు ఉండి వాడు ఆ ద్రుతరాష్ట్రుడు ఏమి సాధించబోతున్నాడు ఈ ఒక్క వేట కుక్క ఒకటుంటే చాలు జాగిలం ఉన్నట్లయితే వేట పూర్తవుతుంది అని అంటాడు. అలాగే ఇక్కడ కూడా ఇటువంటి కొడుకు మన వామనా మూర్తి వంటి కొడుకు ఉంటే చాలని అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడైతుది ఉద్భాసిత లీలబందు ఉత్తమ గతులన్. ఈ వామనుడి యొక్క కథని కథగా కాక దానవీరంతో దయావీరంతో ముడివేట్టి గనుక ఎవరైతే స్మరించుకుంటూ ఉంటారో సుతల లోకంలోకి వాళ్ళు వెళతారు సుతల లోకం ఏదో పాతాళానికి తొక్కేశాడు ఇవన్నీ వ్యర్థమైనటువంటి మాటలు ఆ లోకానికి ఆయన పంపించాడు అక్కడ ఉండమన్నాడు ఇంద్ర పదవి వచ్చేదాకా ఉండమన్నాడు సశరీరంగా ఉండమన్నాడు ఆదివ్యాధులు లేకుండా ఉండమన్నాడు నా ఆరక్షణలో ఉంటావన్నాడు అంతకంటే గొప్ప జీవితం ఏం కావాలి అటువంటి జీవితం సాధకుడికి కూడా ఇస్తాడని వేదవ్యాసుల వారి ప్రమాణం. ఆ ప్రమాణాన్నే ఖచ్చితంగా పోతనామాత్యుల వారు తెలుగులో ఆంధ్రులందరికీ కూడా మనకి తెలుగు వారికి అందించాడు. తగిలి మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబులు ఎక్కడెక్కడ కీర్తింతురవరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భువరేంద్రా. ఏ సమయంలోనైనా సరే ఎక్కడైనా సరే ఈ పరమాత్మను గురించి త్రివిక్రమ అవతారాన్ని గురించి అంటే త్రివిక్రముడి యొక్క అవతారాన్ని మనం విశేషంగా చెప్పుకోవటం అంటే సర్వ భువనాల యొక్క విచారణగా మనం భావన చేయాలి. విరాట్ మూర్తి యొక్క సమ-సంయక్ దృ-దర్శనాన్ని సంయక్ జ్ఞానాన్ని మనం అనుభవించగలిగినటువంటి ఒక దివ్యతరమైనటువంటి స్థాయి గనుక ఆ స్థాయికి ఈ వామనుడి యొక్క ఆవిర్భావం వామనుడు త్రివిక్రముడు కావటం ఆ త్రివిక్రముడు మళ్ళీ వామనుడు కావటం బలికి వరదానం చేయటం అలాగే ప్రహ్లాదుడికి కూడా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే నువ్వు కూడా నీ మనవడి దగ్గరికే వెళ్ళమన్నాడు వెళ్లి వాడి దగ్గరే ఉండు అన్నాడు. ఎందుకుండమన్నాడు? అంటే తాత మనవుడు కలిస్తే హరి సంకీర్తనం ఇంకా ఉదాత్తంగా సాగుతుంది. అది ఎవరో వాళ్ళిద్దరి కోసమే కాదు సర్వలోకాలకి కూడా ఒక బలీయమైనటువంటి సంఘటితమైనటువంటి ఒక కోహెషన్ ఏర్పడాలి. ఏర్పడకపోయినట్లయితే ఏకాంతంలో రామా రామా అనుకోండి ఏమీ efficacy లేదు effect లేదు. అందరం కలిసి సంకీర్తన చేయండి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. కనుక ప్రహ్లాదుడిని కూడా నా నామ సంకీర్తనం చేయమని వీడికి చెప్పాను గనుక నీవు కూడా సుతల లోకానికి వెళ్లి అక్కడే సుస్థిరంగా ఉండమన్నాడు. ప్రహ్లాదుడు అంటే హ్లాదము అంటే ఆనందం ప్రహ్లాదము అంటే బ్రహ్మానందం బ్రహ్మానందం గనుక personalize అయినట్లయితే మూర్తిమంతమైనట్లయితే అది ఒక సాకార స్వరూపం అయినట్లయితే దాని పేరు ప్రహ్లాదుడు అని అర్థం. అది ఆనందానికి ప్రతీక. ఇక బలి తనను తాను బలి ఇచ్చుకున్నాడు తన తనువుని భావాన్ని మనస్సుని సంస్కారాన్ని వంశాన్ని సంపదని ఆయువుని అన్నింటినీ కూడా తన కీర్తిని తన శౌర్యాన్ని ధీరత్వాన్ని గంభీరత్వాన్ని విస్తృతత్వాన్ని మూడు లోకాలపై ఉన్న ఆధిపత్యాన్ని మూడడుగులుగా తృణప్రాయంగా ఆ వచ్చినటువంటి వాడు విష్ణువే గనుక ఆయనకే ఇస్తానన్నాడు. అయితే ఇది బలి కథతో ఈ కథ అయిపోయినా ఈ మూడు అడుగులు ఎందుకడిగాడు అనే దాని మీద అనేకమైనటువంటి ఆ చర్చలు సాగినయి. కొన్నేళ్లుగా ఇందాకన్నట్లే తెలియకే అడిగాడా తెలిసి అడిగాడా అసలు ఆ మూడో పాదం ఏమిటి ఎక్కడున్నది అది. దేనిని ఉద్దేశించి నాకు మూడు పా- అడుగులు కావాలి అని కోరుకున్నాడు ఆయన అంటే సాధకుడికి ఇవి మూడు స్థాయిలు మొదటి స్థాయి ఏమిటంటే నేను చేస్తున్నాను ఇదంతా నా వలన జరుగుతున్నది అనే భావన వదిలిపెట్టాలి అది మొదటి పదం అది మొదటి పాదం. లోకంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఇదంతా నా వల్లనే జరుగుతున్నదని మాత్రమే అనుకుంటారు. పైకి ఎంత నా వల్ల కాదని అంటున్నా నేను కాబట్టి ఇది ఇట్లా అయింది అని మాత్రం అనుకుంటాడు. అది వదిలి పెట్టకపోతే మాత్రం విష్ణు అనుగ్రహాన్ని మనం పొందలేము. చేయాలి కర్మలన్నీ చేయాలి ఇది మొదటి మెట్టు కానీ ఎలా చేయాలంటే చేయాలి కనుక చేయాలి ఈ పదం దాటిన తర్వాత రెండవది అహంకారము మమకారంతో కర్మలు చేయకూడదు రెండు ఇది రెండవ పదం. ఈ రెండవ పదంలో మమకారం లేని జీవుడు లేడు అసలు వాడి మమకారమంతా ముందు వాడి దేహంతో ప్రారంభమవుతుంది.అక్కడి నుంచి తన దేహంలో నుంచి పుట్టుకొచ్చిన పిల్లల యందు ఉంటుంది. అలాగే తాను సంపాదించుకున్నటువంటి వస్తువుల యందు ఉంటుంది. ఆ వస్తువులు తెచ్చిన కీర్తి యందు ఉంటుంది. ఆ కీర్తి వలన ఏర్పడిన అతిశయంలో ఒక ఆనందం ఉంటుంది గనుక ఈ మమకారం కట్టుతెంచుకోకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఇది రెండవ పదం. రెండవది, నేను కనుకనే ఈ దానం చేయగలిగాను ఇంకోడి వల్ల కాలేదు. ఎప్పుడన్నా విష్ణువు వెళ్లి నాకిది కావాలని అడిగాడా? విష్ణువు చరిత్రలోనే లేదు. ఒక్క నా దగ్గరికే వచ్చాడు అనేది అది రెండవ పాదం. అహంకార మమకారాలు వదిలిపెట్టాలి రెండోది, కర్త్రుత్వం వదిలిపెట్టాలి మొదటి పాదం. ఇక మూడవ పాదం ఏమిటి అంటే, నువ్వు తప్ప అన్యం లేదు అనేటువంటి భావనలోకి జీవుడు వెళ్ళాలి. కనుకనే అన్నింటికంటే గౌరవనీయమైనటువంటి శిరస్థానీయమైనటువంటి సహస్రార సమేతమైనటువంటి బ్రహ్మ రంధ్రం ఎక్కడ ఉన్నదో దానిని కూడా సమర్పించేసాడు. ఇక అది కూడా ఇచ్చేస్తే ముక్తి నా ఆయన చేతిలో ఉంది, ఇస్తాడో ఇవ్వడో తెలియదు గానీ నా దగ్గర ఉన్న చిట్టచివరిది ఇది అన్నట్లుగా ఆ మూడవ పాదం చాలా అద్భుతమైనటువంటి పాదం. మనందరం కూడా సాధక జీవులుగా ఈ జగత్తులోకి వచ్చాం. వచ్చి అనేక కార్యకలాపాలు మన మనస్సు లగ్నమైంది. యాభై ఏళ్ళు, అరవై ఏళ్ళు ఇక్కడ జీవితం గడిపాం. ఈ గడిపిన దాంట్లో చాలా తెలియక పొరపాట్లు చేశాం. కొన్ని తెలిసీ చేశాం. కొన్ని అహంకారంతో చేశాం. కొన్ని మమకారంతో చేశాం. కొంత కీర్తి కోసం చేశాం. కొంత సొమ్ము కోసం చేశాం. చేయని వాళ్ళమేం కాదు. మరి ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి అంటే బలి చేయాలి. బలి చేయాలి అంటే వదిలిపెట్టాలి. ఆ బలిపీఠం మీద మనం నుంచోవాలి. నుంచోవాలి అంటే హృదయాన్ని సత్యపీఠం చేయాలి. సత్యపీఠం చేయాలి అంటే విశ్వపీఠమైనటువంటి ఈ జగత్తుతో అనుసంధానం కావాలి. ఎక్కడికక్కడ బేరీజు వేసుకుంటూ, నేను చేసిన ఈ కార్యకలాపాల వలన నాకు గానీ, ఇతరులకు గానీ ఏదైనా దుఃఖం కలిగిందా? అపకారం జరిగిందా? ఎవరి యందైనా నాకు విపరీతమైనటువంటి వ్యామోహం ఏర్పడిందా? ఎవరి యందైనా నాకు లోభ అపేక్షలు ఏర్పడినాయా? వీడికి ఇవ్వాలి, వీడికి ఇవ్వకూడదు అన్న రెండు భావాలు నాకు ఏర్పడినాయా? వీడు గొప్పవాడు, వీడు తక్కువ వాడు అన్నటువంటి ఆ ద్వైధీభావం ఏర్పడిందా? ఇది నేను సాధించుకున్న విజయం నేను పోగొట్టుకున్నటువంటి అపజయం అని ఎప్పుడైనా అనిపించిందా? చూడండి మనస్తత్వం ఎక్కడైతే ఉన్నదో, ఈ అరిషడ్వర్గాల లోపల ఆరుగురు శత్రువులుగా మన లోపలే ఉన్నప్పుడు, శివానందలహరిలో శంకర భగవత్పాదులు చెప్పినట్లు ఓ ఆది కిరాతక! ఎందుకయ్యా కిరాతకుడి వేషం వేసుకుంటావు? గుప్పెడు బాణాలు తీసుకుంటావు? అరణ్యమంతా చిన్న చిన్న కుందేళ్ళు, లేళ్ళు హాయిగా వేవ తిరుగుతుంటే వాటి వెనకబడి వాటిని చంపుతావేమయ్యా? ఆ బాణాన్ని నా హృదయం వైపు నా లోపలికి ఎక్కుపెట్టరాదా? ఆరు బాణాలతో నాలో ఉన్నటువంటి ఆరు గుణాలని కూడా షడూర్మములు, షడ్వర్గములు, షడ్వికారములతో పంచభౌతిక దేహం ఏర్పడుతుంది. ఈ వికారాలు, దీనిలో ఉన్న అరిషడ్వర్గాలు వీటిని నీవు నశింపజేయరాదా? అంటారు శంకర భగవత్పాదులు. అంటున్నవాడు ఎవడు? అసలు అవి లేని వాడు అంటున్నాడు. ఉన్న మనమేమంటున్నాం అంటే, అవేం అనటంలే అసలు ఉన్నాయనే ఒప్పుకోవటంలే. మీరంటున్నారు నాకెప్పుడూ కోపమే రాలేదండి అని. ఓ ఐదు నిమిషాలు కోపం తెప్పించడానికి పెద్ద ఎక్కువ time ఏం పట్టదు, వస్తుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలను మనమే జయించుకోవాలి. ఇంకోడు జయిస్తే మనం ఒప్పుకోం. మన తప్పు మరొకడు ఎత్తి చూపిస్తే వాడిని మనం శత్రువుగా చూస్తాం. మన తప్పుని మనం గ్రహించుకోగలిగిన స్థాయికి మనం రాగలిగితే అది అధ్యాత్మలో ఒక అంగుళం ముందుకు వేసినట్లే. ఉత్తీర్ణత సాధించే దిశగా వెళుతున్నట్లే. రెండవది, సాధనలో అసూయ మాత్రం ఉండటానికి వీలు లేదు. ఎవరు ఎవరిని ఎందుకు ఎప్పుడు ఎట్లా దగ్గర చేసుకోవాలో పరమాత్మకు ఎరుక. తన అవతార కార్యక్రమంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమయంలో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యకలాపం ఇవ్వబడుతుంది. కార్యకలాపం ఇవ్వబడుతూ దాని యందు తన శక్తిని నిక్షిప్తం చేస్తాడు పరమాత్మ. కాబట్టి స్వామి యొక్క శక్తితోనే మనం నడుస్తున్నాం అన్న భావనలో ఉండాలి. మనం అనుకున్నాం ఒకసారి, వివేకానంద స్వామి ఒక్కడుగా వెళ్ళినప్పుడు సర్వ ప్రపంచాన్ని ఆయన జయించినప్పుడు పాశ్చాత్య జర్నలిస్టులంతా కూడా ఆయన చుట్టూ చేరి, ఒక్క monk గా వచ్చావు నువ్వు, ఒక్కడివి. నీవు వెనక లేరు, ముందు లేరు, ఇక్కడ ఎవడు నీకు తెలిసిన వాడు లేడు. ఎలా వచ్చావు నువ్వు? ఇక్కడికి జయిస్తానని నువ్వు ఎలా అనగలిగావు, రాగలిగావు, అనుకోగలిగావు అంటే, నక్షత్రాలను నలిపివేయగల, ఖగోళాలను పిండి చేయగలిగిన మా రామకృష్ణ గురుదేవుల శక్తితో వచ్చాను. నాకింకో మనిషితో ఏం పని? అన్నాడాయన. ఎంత ధీశక్తి చూడండి! అది ధీషణ. అంటే గురు శక్తి, గురు సత్తా మనలో గనక ఉన్నట్లయితే, పరమేశ్వరుడి యొక్క ప్రజ్ఞ జీవ ప్రజ్ఞతో అనుసంధానమైనట్లయితే కార్యకలాపాలు సునాయాసంగా నడిచిపోతాయి. కనుక ఇందులో ద్వేషించటానికి మనుషులు ఎవరూ అక్కరలేదు మనకి. ఎవరినైనా ప్రేమించగలిగినటువంటి స్థాయికి మన మనస్సును నిర్మాణం చేసుకోవాలి. ద్వేషంలో నుంచి ద్వేషమే పుడుతుంది. ప్రేమలో నుంచి ప్రేమే పుడుతుంది. ఈ ప్రేమ ప్రాపంచికమైన రాగంతో కూడింది కాదు, అనురాగంతో కూడింది కాదు. దివ్యమైనటువంటి పరమాత్మ యందు ఎటువంటి భావాన్ని మనం ప్రదర్శిస్తామో, పరమాత్మని తల్లి, తండ్రి, గురువు, దైవమని ముక్కాలాలలో అంటున్నాం, పక్కవాడిని నమ్లేకపోతున్నాం. నువ్వు నా తల్లి వంటి దానివి, నీవు నా తండ్రి వంటి వాడివి అని అనటానికి అహం అడ్డు వస్తున్నది. జీవ లక్షణాలు ఆగిపోతున్నాయి. కాబట్టి ఈ ఆగకుండా పరిపూర్ణమైనటువంటి ఆ స్థాయికి వెళ్ళమని చెప్తున్నాడు వామనుడు. ఎవరికి? బలి చక్రవర్తికి. ఇక మూడవ పాదం మూడవ స్థాయికి వచ్చేసరికి ఏమవుతున్నది అంటే, నేను చేస్తున్నాననే భావన కూడా వదిలిపెట్టేసేయ్ మన్నాడు. అసలు నేను ఈ దానం ఇస్తున్నాను అంతకు ముందు ఏమన్నాడు? ఇంతకుముందు రాజులున్నారు వాళ్ళంతా వాళ్ళని కట్టుకొని పోయినారు అంతవరకు బానే అన్నాడు. కానీ నేను కాబట్టి ఇది చేస్తున్నానన్న భావన వదిలిపెట్టమన్నాడు. ఇది మూడు గుణాల యొక్క ఘనీభవించినటువంటి ఒక భావం. మూడు గుణాలు వదిలిపెట్టడానికి వీలు లేదు. మూడు గుణాలతో జీవుడు ఇక్కడ ఉండవలసిందే. మూడు గుణాలలో రెండు గుణాలు వదిలిపెట్టాలి, సత్వాన్ని పెంచుకోవాలి. బలి చక్రవర్తిని విష్ణువు ఎందుకు బాధించాడు? వాడేం దుర్మార్గుడు కాదు, యజ్ఞం చేసుకుంటున్నాడు. ఎవరి ఆధ్వర్యంలో? శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో. అయినా ఎందుకని వాడిని పాశబద్ధుణ్ణి చేశాడంటే చిట్టచివరి వరకు పరీక్ష పెట్టాడు. ఎక్కడైనా ఇంకా వికారాలు, అహంకారాలు మిగిలినయా? రాక్షస జాతిని తన మీదకు ఏదన్నా దాడి చేయమని చెప్తాడా? ఏం చెప్పలే బలి. మన సమయం కాదు. హరి అనుగ్రహం వాళ్ళ మీద ఉన్నది ఇప్పుడు. వాళ్ళని ఉండనివ్వండి. మన సమయం ఎప్పుడుందో ఆయనకు తెలుసు, ఆయన మనకు ఆ సమయం ఇస్తాడన్నాడు. ఇది ఎంత పూర్ణ ప్రజ్ఞ చూడండి! ఈ సమయంలో ఈ మూడు పాదాలు, ఆ మూడు అడుగులు, నేల మూడడుగుల నేల అనలే, మూడడుగులు ఇవ్వమన్నాడు. ఒకటి రెండడుగులు అన్నాడు. ఒకటి రెండడుగుల నేల అని ఎక్కడా లేదు. కానీ మన వాళ్ళు కథ చెప్పడంలో మూడడుగుల నేల అడిగాడు, నేల అడిగాడు. నేలే అడిగితే ఆకాశం వైపు ఎందుకు పోతాడాయన? మూడో పాదం ఎక్కడ చూపించమని భూమిని ఎందుకు అడుగుతాడాయనకు తెలుసు. మూడు అడుగులు, తన అడుగు పట్టగలిగినంత ప్రదేశం, ఆ space అడిగాడు. space ఆయన లేని space లేదు. అంతా ఆయన ఆక్రమించి ఉన్నాడు. కాబట్టి ఆ దివ్య భావనలో మనం కూడా ఈ మూడు అడుగులు దృష్టిలో పెట్టుకున్నట్లయితే వామనుడుగా ఉన్నటువంటి జీవుడు త్రివిక్రముడైన దేవుడవుతాడు.
SSSMC · audio
Bhagawata Navaneetham - 46
Bhagawata Navaneetham - 46
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 20:10
More in this series