No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాంమే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వ్యాస విరచితమై సహజ కవి బమ్మెర పోతనామాత్యుడు చే అంధ్రీకరింపబడినటువంటి శ్రీ మహాభాగవతాన్ని శ్రీమద్భాగవతం అవనీతంగా చేసుకునేటువంటి విచారధారలో మరొక రోజు ప్రవేశించాం. వేద కల్పవృక్షం లో నుంచి జారిపడినటువంటి పండు శుకదేవుడి ముఖద్రవ సంయు-- అమృతద్రవ సంయుతమై అంటే కూడి ఉండి విమత భాగవతం రసమాలయం అని అనిపించుకొని ముహురహో రసికా భువి భావుకాః ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్ భక్తులంతా వారు నిజమైన రసికులు అంటే భగవంతుని యందు మనకు ఏర్పడే రాసిక్యమే రాసిక్యం. ప్రాపంచికమైన రాసిక్యం వలన దుఃఖం మిగులుతుంది. పరమాత్మతో కూడి ఉన్నటువంటి పరమాత్మ ఎడల మనకు ఏర్పడేటువంటి రాసిక్యం వలన బ్రహ్మానందం లభిస్తుంది అని శృతి వాక్కు. శాస్త్రాలు కూడా వాటినే ప్రమాణంగా తీసుకున్నాయి గనుక భువి భావుకాః ఈ భూలోకంలో ఉన్నటువంటి వారంతా భావుకులై అంటే పరమేశ్వరుని అన్నివేళలా స్మరిస్తూ అని భావన చేస్తూ ఈ భాగవత రసమాలయాన్ని ఆ పండుని వేద పండుని చక్కగా గ్రహించవలసిందిగా వ్యాసుల వారి యొక్క మాట ఇది. దాన్నే ఈయన ఏమన్నారంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదని. ఒకటే లక్ష్యం. శ్రీ కైవల్య పదం కావాలి జీవుడికి. శ్రీ కైవల్య పదం చేరుకోవాలి అంటే ఏం చేస్తే పొందగలం? అసలు ఆ శ్రీ కైవల్యం అంటే ఏమిటి? విచారణ చేసి పరీక్షిత్ మహారాజు కథలోకి వెళ్దాం. శ్రీ కైవల్య పదం అంటే ఇక అందుకోవటానికి వీలులేని ఒక పదము ఏదైతే ఉన్నదో అది శ్రీ కైవల్య పదం. మోక్షం. మోక్షం అంటే మరణానంతరం ఏర్పడే స్వర్గ నరకాలు లేకపోతే విష్ణుపదం వైకుంఠం కైలాసం ఇదా అంటే స్వామి పరిష్కారం చేశారు. మోహక్షయమే మోక్షం. మోహం ఎప్పుడు ఉంటుంది? శరీరం ఉన్నంత కాలం మోహం ఉంటుంది. [కాష్] శరీరానికి ఉన్నటువంటి ఒక జీవ లక్షణం మోహం కాబట్టి శరీరంలో ఉన్నది అసలు వస్తువు ఆత్మ కాబట్టి ఆత్మకి ఆ మోహం లేదు గనుక నిర్మోహమైనటువంటి స్థితిలోకి జీవుడు వెళ్ళాలి అది అధ్యాత్మ అని చెప్పబడింది. కాబట్టి ఆ శ్రీ కైవల్య పదాన్ని ఎవరు ఇస్తారు? మళ్ళీ ప్రశ్న. భగవంతుడు ఇవ్వడు. అలాగే గురువు ఇవ్వడు. మరి గురువు ఇవ్వక భగవంతుడు ఇవ్వక ఎట్లా కైవల్య పదాన్ని చేరేదంటే ప్రయత్నం చేత, సాధన చేత, సత్సాంగత్యం చేత, సంకీర్తన చేత, సత్సంగ యోగం చేత, సజ్జనుల యొక్క ప్రభావం చేత, సద్దోష్టి చేత నీ అంతట నీవే ఆ పదానికి చేరుకోవాలి. గురువు కానీ భగవంతుడు కానీ మార్గం చూపిస్తారు. భగవంతుడు ఎలా మార్గం చూపిస్తాడు ఆయన కనపడ్డు కదా అంటే భగవంతుడి యొక్క కథలు చదువుతూ చదువుతూ ఉంటే మనకు మార్గం ఏర్పడుతుంది. గురువు ఏం చేస్తాడు అని అది ఎలా చేయాలో ఎలా చదవాలో చెప్తాడు. అది. ఏం చేస్తే ఆ మార్గం వస్తుందో చెప్పేవాడు గురువు అయితే ఆ సాధనలో మనం ఉన్నప్పుడు శ్రీ కైవల్య పదం దాకా మనల్ని నడిపించేటువంటి వాడు పరదైవమై ఉన్నాడు గనుక ఆ గురువు ఆ దైవం ఎక్కడ ఉన్నారు అని మళ్ళీ విచారణ చేసినట్లయితే నీ లోపలే నీతోనే అన్నివేళలా దానినే స్వామివేళ మనకు అర్థం అయ్యేట్లుగా నీ వెంట జంట మనకి ఎప్పట్నుంచో ఈ చిలక పలుకులు చాలా అర్థమైపోయాయి అనుకున్నాం. కానీ కాదవి. నీ వెంట జంట అంటే మన సంసార వృత్తిలో లేరు ఆయన. జీవన్ముక్త స్థాయిలో జ్ఞానాధిక్యం నిన్న చెప్పారుగా. చిత్తాన్ని ఏం చేయాలంటే మనీషాయత్తం చేస్తే పరమాత్మ నీ వెంట ఉంటాడు. లేకపోతే మనం చేసే పనులకు ఆయనకేం సంబంధం లేదు. అక్కర్లేదు ఆయనకి. ఏ పరమాత్మను గురించినటువంటి భావనతో మనం ఉంటామో ఎప్పుడు మన మనస్సు ఎప్పుడు కూడా మనీషాయత్తం అవుతుందో అప్పుడు పరమేశ్వరుడు మన వెంట జంట మన కంట మన వంట ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ అన్నిటా అంతటా తానై ఉంటాడు గనుక మార్గోపదేశం చేస్తాడు అనేది ప్రామాణికమై ఉన్నది. అయితే నిన్నటి వరకు కలి ప్రవేశించాడని మహాభారత సంగ్రామ వేళే ఆయన వచ్చాడని అంతా అతలాకుతలం కాబోతున్నదని ధర్మరాజుకు కొన్ని శకునాలు ఏర్పడ్డాయి. ఈ శకునాలన్నీ కూడా ఆయన మనసుకు ఏర్పడ్డాయా? కంటితో చూశాడా అంటే ఇంకా కంటితో చూడలే. శకునం అనేది మనసుకు తోచేదే శకునం. కంటితో చూస్తుండగా శకునం పోతుంది. అప్పటికి ఆ ప్రభావం ఏర్పడిపోతుంది. మనస్సు శంకా సంకులమైనట్లయితే, సంశయంగా ఉన్నట్లయితే అది పెద్ద శకునంగా మనం భావించాలి. సరే శ్రీకృష్ణ పరినిర్వాణం అయిపోయిందని అర్జునుడు ద్వారక నుంచి వచ్చి చెప్పాడు. ధర్మరాజు...పరీక్షిన్మహారాజుకి పట్టాభిషేకం చేసి నాయనా ఇక్ష్వాకురాజులు రామచంద్రాది ఆ రఘురాజులంతా ఎట్లా పాలించారో నువ్వు కూడా అలాగే పాలించు ధర్మబద్ధంగా ఉండు ఇదిగో మన గోపాలదేవుడు ఈ జీవితమంతా కూడా మనతో ఉన్నాడు. చతుర నటవరుడు అయినటువంటి గోపాల చక్రవర్తి మనల్ని ఇంతకాలం రక్షగా ఒక పెద్ద గొడుగుగా మనందరినీ కాపాడారు. ఎక్కడెక్కడన్నా మన మనస్సు జారిపోతుంటే దానిని మళ్ళీ సన్మార్గంలో పెట్టాడు. ఒక స్నేహితుడుగా అనేక కష్టాలలో మనకు తోడుగా ఉన్నాడు. దుఃఖ నివారణ చేశాడు. భారత సంగ్రామ వేళ సందేహ నివారణ చేశాడు. కాబట్టి ఇవాళ మనకి చెప్పటానికి పెద్ద దిక్కైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా లేడు గనుక నీవే ఇంతవరకు ఎరిగినటువంటి ఇంతవరకు జరిగినటువంటి ఇంతవరకు పాలించినటువంటి రాజుల యొక్క జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని నువ్వు చక్కగా రాజ్యం వేలమన్నాడు ధర్మరాజు. ఆ తర్వాత జరిగింది మహాప్రస్థానం. శ్రీకృష్ణ పరినిర్వాణ వార్త విన్న మరుక్షణమే కుంతి మరణించిందని ధర్మరాజాదులు అంతా కూడా తమ శరీరం మీద ఒంటిమీద ఉన్నటువంటి రాజ చిహ్నాలైనటువంటి ఆభరణాలు, కిరీటాలు, ఆయుధాలు, పట్టు పీతాంబరాలు, కాలి చెప్పులు, కాలి అందీయలు అన్నీ కూడా అక్కడ పరీక్షిన్మహారాజుకు అప్పజెప్పి విరాగులై నిర్మోహకులై ఉత్తరాభిముఖంగా హిమవత్పర్వత ప్రాంతం వైపు నడిచి వెళ్లారు అని మనం కథ విన్నాం. అంటే ఈ ఇకపై జరగబోయే కథలో కృష్ణుడు లేడు. పాండవులు లేరు. కుంతి లేదు. ఇక ఉన్నదంతా ఎవరంటే పరీక్షిన్మహారాజు ఒక్కడే. ఆయన బలం ఏమిటి అంటే తన ముందు పాలించినటువంటి రాజుల యొక్క కథే స్ఫూర్తి ఆయనకి. అదే ఆధారం. కానీ అప్పటికే కలి ప్రవేశం జరిగిపోయింది గనుక ధర్మాన్ని పాలించవలసినటువంటి పరీక్షిన్మహారాజు ఎక్కడో అంతఃపురం లో కూర్చొని వేగుల వారి ద్వారా తెలిసిన వారి ద్వారా మంత్రాంగం చేయలేదు. ప్రతిరోజూ తన రాజ్యంలో ఏం జరుగుతున్నదో స్వయంగా చూసేవాడు. ఆ స్వయంగా చూసినందువలన క్షేత్రస్థాయిలో ఏయే అననుకూలాలున్నాయి, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ధర్మం ఎక్కడ అతిక్రమింపబడుతున్నది, ధర్మాచరణకు ఎవరన్నా దూరం అవుతున్నారా, అయినట్లయితే దానికి కారణాలేమిటి, ఇవన్నీ కూడా పరీక్షిన్మహారాజు ఏ రోజుకారోజు చాలా జాగ్రత్తగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకరోజున ఆయనకి ఒక దృశ్యం కంటబడింది. ఒక జాతి వాడు రాజు వేషంలో ఉన్నాడు. కేవలం ఒక్క కాలు మీద ఉన్నటువంటి ఒక ఎద్దు. ఆ ఎద్దుని ఈ రాజవేషంలో ఉన్నటువంటి వాడు కొడుతున్నాడు. పాపం దానికి చతుష్పాద్ అది అసలు ఉండవలసినవే నాలుగు. నాలుగులో అసలు మూడు కనపడటంలే ఉన్నది ఒక్కటే. ఆ ఒక్క దాని మీద నిలబడలేదు పాకలేదు నడవలేదు కుంటిగా ఉన్నది అక్కడే ఉన్నది అంగవిహీనమై ఉన్నది. మనకి రెండు కాళ్లలో ఒకటి లేకపోతే ఎంత అననుకూలమో దానికి కూడా నాలుగులో మూడు లేవు కాబట్టి ఏకపాదం మీద నుంచున్నది. ఈ రాజవేషంలో రాజు కాదు వాడు. రాజవేషంలో ఉన్నవాడు కొడుతున్నాడు. కొడుతూ ఉంటే అది రోదిస్తున్నది. నిరోధించలేకపోతున్నది. పరిగెత్తలేదు. పారిపోలేదు. అది పరీక్షిన్మహారాజు కంటబడింది. పడగానే ఆయన ఆగాడు. ఆగి, "నువ్వు రాజు వేషంలో ఉన్నావ్. నువ్వు ఎవరివి? రాజు వేషంలో కూడా ఇంతగా ఉన్నావంటే నీకు మూలమేదో ఉండి ఉండాలి. నువ్వు ఎవరు?" అని అడిగాడు. జవాబు చెప్పలేదు వాడు. ఇంకా హింసిస్తున్నాడు. మూగగా ఆ ఎద్దు రూపంలో ఉన్నటువంటిది అది ఏడుస్తూ ఉన్నది. పరీక్షిన్మహారాజు గుండె కరిగిపోయింది. ఎందుకంటే, ఆయన ధర్మమూర్తి గనుక. ఆ ఏడుస్తున్నటువంటి ఎద్దును చూసి "నువ్వు ఎవరు?" అని అడిగాడు. ఇంత నిబ్బరంగా వాడు ఎంత హింసలు పెడుతున్నా ఆ ఒక్క కాలు మీద నిలబడి ఉన్నావ్ నువ్వు ఎవరు? నీ స్వరూపం ఏమిటి? అని అడిగాడు. ఆ అడిగితే ఆమె ఏమన్నదంటే, "నేను ధర్మదేవతని" అన్నది. కలి ప్రవేశించినటువంటి వేళ ధర్మదేవత యొక్క దుస్థితి అట్లా ఉన్నది. ఎప్పుడో వెంటనే పరీక్షిన్మహారాజుకి స్పురణకు వచ్చింది. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు ఉందని, త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు వచ్చినప్పుడు మూడు పాదాలు ఉన్నదని, మొన్న మొన్నటిదాకా శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యంత కూడా రెండు కాళ్లమీద ధర్మం కనీసం నడిచిందని, ఇదేమిటి నేను రాజ్యం చేయటానికి వచ్చే సమయానికి ధర్మానికి ఈ గతి పట్టింది అని ఒక్కసారి దుఃఖమగ్నుడయినాడు. మనం కూడా ఆపద వచ్చినప్పుడు దుఃఖిస్తే ఆపద తొలగదు. ఆపదని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవటానికి కావలసిన మానసిక శక్తి లౌకిక విద్యలు మనకివ్వవు. మనకి శాస్త్రాలు బాగా వచ్చు అనుకోండి, జీవితంలో చిన్న కష్టం వచ్చింది శాస్త్రాలేం అక్కరకు రావు. కానీ అవి ఏం చేస్తాయంటే ఆ సన్నివేశాన్ని ఎదుర్కోవటానికి వీలైన ఆంతరంగిక శక్తినిస్తాయి, మనోబలాన్నిస్తాయి. ఒక దృఢమైనటువంటి ఆలోచన చేయటానికి, ప్రసన్నమైన ప్రశాంతమైన విచారణ చేసుకోవటానికి, దీన్ని ఎట్లా అధిగమించాలి, దీన్ని దాటి మర్యాదగా మనం ఎలా జీవించగలగాలి, దానివలన ఎట్లా ఆనందంగా మళ్ళీ ఉండగలమని శాస్త్ర రసం మనకు బోధిస్తుంది తప్ప శాస్త్రాల వలన మన కష్టాలు తీరవు. అది. ఈ నిరూపణ అవుతూ ఉన్నది. ఆ అవుతున్నప్పుడే ఈ ధర్మ విచారణలో ఒక్క క్షణం స్వామి వైపు వెళ్ళాలి మనం. ఎందుకంటే స్వామి స్పృశించని వస్తువు లేదు అసలు. ఏ వస్తువు మీరు అనుకోండి దానిమీద స్వామి వ్యాఖ్యానం ఉంది. అది విచిత్రం. స్వామి కలికాలంలో కలియుగంలో ధర్మం అప్పుడెప్పుడో ఉంటిది ఇప్పుడు కుంటిది అట గదా అని అంటే...స్వామి positive గా ఎలా ఆలోచించారో చెప్పండి. ఏం చెప్తారో చూడండి. ఎట్లా అంటే పసిపిల్లవాడు, పారాడే పిల్లవాడు, వాడికి నాలుగు కాళ్లు ఉన్నాయి. అంటే రెండు చేతులు, రెండు కాళ్లు. ఆ నాలుగు పాదాల మీద వాడు చతుష్పాత్తయ్యే ఉంటాడు పాకేదాకా, పారాడే దాకా. అప్పుడు తల్లి ఆనందంగా ఉంటుంది. పారాడే వాడు పడిపోడు. పారాడుతూ ఉంటాడు కాస్త నెమ్మదిగానో, పరిగెత్తుతూనో. వాడి వేగాన్ని బట్టి, వాడి శక్తిని బట్టి, వాడికున్నటువంటి temperament ని బట్టి గబగబ బాకేవాడు, నెమ్మదిగా బాకేవాడు ఉంటాడు. ధర్మం స్థిమితంగా ఉంటుంది. కొద్ది రోజులు అయిపోతాయి. అయిపోయిన తర్వాత వాడికి వయస్సు వస్తున్నటువంటి వేళ తల్లి వాడికి రెండు కాళ్ల మీద నిలబడేటటువంటి ఒక అభ్యాసనం చేయిస్తుంది, practice. దాంతో వాడు ఏం చేస్తాడు? రెండు చేతులు ముందుకు చాపుతుంటాడు. అంటే balance చేసుకుంటుంటాడు. రెండు కాళ్ల మీద తడబడుతూ అడుగులు వేస్తాడు. అప్పుడే కింద పడతాడు, లేస్తాడు, ఏదో జరుగుతూ ఉంటాయి. అంటే రెండు కాళ్లు నేలమీద ఉంటాయి, రెండు కాళ్లు గాలిలో ఉంటాయి. ఈ గాలిలో ఉన్న రెండు, నేలమీద ఉన్న రెండు కాళ్లకి కూడా బలాన్నిస్తాయి. ఇస్తున్నప్పుడు రెండు కాళ్ళతో వాడు గెంతులు వేయడే. నడిచే ప్రయత్నంలో ఒక అడుగు ముందుకేస్తాడు, ఒక అడుగు వెనక్కు ఉంటుంది. అంటే అప్పటికే వాడు మూడు కాళ్ల మీద నడుస్తున్నాడు అని అర్థం. ఆ పాద సంచారంలో. సరే మళ్ళీ కాస్త వయస్సు వచ్చేప్పటికీ వాడి చేతులు వాడి అధీనంలోకి వస్తాయి. రెండు కాళ్ల మీద నడుస్తూ ఉంటాడు. మొట్టమొదట పాకేవేళ తల్లి యొక్క దృష్టంతా పాకుతున్న పిల్లవాడి మీద ఉంటుంది. ఆ తల్లి పరమాత్మ అనుకుందాం. మూడు కాళ్లు అంటే రెండు కాళ్లు ఒక చెయ్యి ఇట్లా నడుస్తున్నటువంటి వేళ రెండో స్థాయిలో వీడు ఎలా అక్కడికి చేరుతాడు, గడప ఎలా దాటుతాడు తల్లి చూస్తూ ఉంటుంది. అప్పటి-- అప్పుడు కూడా కొంత స్పృహ ఉంటుంది. వాడి కాళ్ల మీద వాడు నిలబడి నడవటం మొదలుపెట్టిన తర్వాత తల్లి అంతగా పట్టించుకోదు. ఏదో వాడంతట వాడే ఎదురుపోతున్నాడు, వస్తున్నాడు అంటుంది. ఇక కాళ్లు బలమై నడవటమేంటి పరిగెత్తటమే మొదలు పెట్టిన తర్వాత తల్లి ఎలాగూ పరిగెత్తలేదు, పట్టుకోలేదు గనుక వాడి దారిన వాడు వెళుతున్నాడు అనుకుంటుంది. ధర్మం కూడా ఇంతేనన్నారు. కలియుగంలో మనం పరమాత్మ అనే తల్లి మీద ఆధారపడ్డ వాళ్ళం కాదు. వదిలేసాం. నెమ్మది నెమ్మదిగా అహంకారంతో చేసిన దానాలు, ఏదో కామ్యం కోరి చేసిన త్యాగాలు, ఇంకేదో మరణాంత-- మరణానంతర సుఖం కలుగుతుందని చేసిన యజ్ఞాలు. వీటి వలన పరమాత్మను మనం ఎప్పుడో దూరంగా వాడెవడో పరాయివాడిగా ఎప్పటికో పెట్టేసాం మనం. కాబట్టి ఆయనకీ మనకీ అంతరం మనమే పెంచుకున్నాం. ఆయనదగ్గ-- ఆయన ఎంత దగ్గరగా ఉండాలని ప్రయత్నించినా మనం ఆయన్ని అంత దూరం చేసుకున్నాం. ద్వాపర యుగం వచ్చేప్పటికీ నేను పెద్దవాడినయ్యాను అని చెప్తున్నాం. అంటే పద్దెనిమిదేళ్లు వచ్చిన పిల్లవాడు ఇవాళ ఇంట్లో నాయనా నువ్వు ఎందుకు తొమ్మిది దాటి ఇంటికి వచ్చావు అని గనుక తల్లిదండ్రులు అడిగితే "I am already eighteen" అంటున్నాడు వాడు. అంటే Don't ask me అని మర్యాదగా చెప్పటం. "I am already eighteen" కి అర్థం ఏముంది? ఏం లేదు, అర్థం లేదు. కానీ వాడికి అర్థం చాలా తెలిసింది. నేను మా నాన్నలాగా అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నేనేం ఎవరికీ చెప్పక్కర్లేదు అని. అది. నాలుగో స్థాయికి వచ్చేప్పటికి వాడు పరిగెత్తుతున్నాడు. ఎటు వెళుతున్నాడో తెలీదు, ఎందుకు వెళుతున్నాడో తెలీదు. కాసేపు ఐదు నిమిషాలు నిల్చో నాయనా, ఈ పాలు తాగు, ఇది తిను, అన్నం తినేయ్ అంటే ఇప్పుడు time లేదు అంటున్నాడు వాడు. ఇంకా ఉద్యోగమే లేదు. ఈ time లేదంటూ పరిగెత్తుతున్నాడు, అది కలిధర్మం. కాబట్టి స్వామి కలిధర్మంలో ఎవడికి వాడే. అంటే స్వామిని ఇక్కడే ఒక ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న అంటే స్వామి అంతా బానే ఉంది, మరి పరిగెత్తుతున్న కలియుగ మానవుడికి రక్ష ఎవడు? వాణ్ని-- వాడికి ఎవరు చెప్తారు బోధ? అంటే మీకు తెలుసో తెలియదో పరిగెత్తుతున్న ప్రతి ఒక్క వ్యక్తి వెనుక పరమాత్మ పరిగెత్తుతూనే కాపాడుతున్నాడు అన్నారు. అది. అది స్వామి. వదిలిపెట్టరు. ఏదో వాడు పరిగెత్తాడులే, వాడు పోతాడులే అని మనం వదిలిపెడతాం గానీ పరమాత్మ కాచుకొని ఉంటాడు వెంబడి. అది వెంటా జెంటా అంటే. మనం పొర-- ఎక్కడ పొరపాటు చేస్తామో, ఎక్కడ జారిపోతామో, ఎక్కడ ఈ అధ్యాత్మ భూమికలో నుంచి దిగజారి పడిపోతామో, అయ్యో ఇన్నేళ్ళకి, ఇన్ని యుగాలకి ఇక్కడికి పరమాత్మ అవరణంలోకి కదా వచ్చాడు. ఈ కాస్త యోగ్యత ఉన్నవాడు కూడా చెడిపోతాడేమోనని పరమాత్మకి ఆ concern ఉంటుంది గనుక ఆయన మన వెంట ఉంటాడు. అదే ఆ ధర్మదేవతతో పరీక్షిత్ మహారాజు మాట్లాడినటువంటి చాలా గొప్ప మాటలివి. అది వేదవ్యాసుల వారికి మనం ఎప్పుడూ కూడా ఋణపడి ఉన్నాం. ఒక వేదవ్యాసుడు ఏమిటి, ఒక వాల్మీకి ఏమిటి, ప్రాచీనమైనటువంటి మహాపురుషులంతా వాళ్ళు ఋషులై ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు ఆహ్ గ్రంథస్తం చేసి మనకప్పజెప్పారు. [గొంతు సవరించిన శబ్దం] భూదేవి, ఈ ధర్మదేవత. ఈ-ఈ ఎద్దు రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత కంటే ముందు ఒక చిన్న సంవాదం ఉంది. చిన్న సంవాదం రెండు, మూడు పద్యాలే చెప్పుకుందాం. ఎవరికో తెలుసునా? భూదేవికి, ఈ ధర్మదేవతకి. ధర్మదేవత ఏడుస్తూ ఉన్నది, రోదిస్తున్నది. భూదేవి కూడా చింతాక్రాంతమై ఉన్నదట. ఎందుకని అని అడిగింది. నీకేమిటి నువ్వు భూమివి, నీకేమున్నది అని అడిగితే ఆమె చెప్తున్నది. ఇందుకనా, ఎందుకనా అని lead questions. కోర్టులో వాదోపవాదాల్లో రెండో వాడికి lawyer అందిస్తూ ఉంటాడు. ఇలాగునా ఇలాగునా అంటే అవును అవును అంటుంటాడు వీడు. అంతేగా? అట్లా అడుగుతున్నది. ఇందువలన నువ్వేమన్నా బాధపడుతున్నావా అని. మఖములు లేమియ మర్త్యుల కిట మీద మఖభాగములు లేక మానుమన్నియే. మఖం అంటే యజ్ఞం. అంటే ఇంకా యజ్ఞాలేమీ జరగరని, ఈ భూమ్మీద యజ్ఞ ఫలాలు నీకు అందరని ఏమన్నా రోదిస్తున్నావా?రమణులు రమణుల రక్షింప రనియే పుత్రుల తల్లిదండ్రులు ప్రోవరనియే చూడండి ఇవాళ జరుగుతున్నవన్నీ ఎప్పుడు ఎప్పటి వ్యాస భాగవతం ఇది స్త్రీలు స్త్రీలను రక్షించాలని బాధపడుతున్నావా భూదేవి కదా ఆవిడ కూడా స్త్రీ కదా అందుకనే కాలగమనంలో స్త్రీకి ఎవరు శత్రువులు అని ఒక analysis చేస్తే స్త్రీకి స్త్రీయే శత్రువు అది దానినే ఆయన రమణులు రమణుల రక్షింప రనియే పుత్రుల తల్లిదండ్రుల ప్రోవరనియే భారతి కుజనుల కోపించుననియే అర్హత లేని వాడి దగ్గరికి సరస్వతీదేవి వెళ్తుందా మూఢుడి దగ్గరికి కూడా ఈ సరస్వతీదేవి అందగా అందుతుందా ద్విపులు నృపుల సేవింతురనియే కృత త్రేతా ద్వాపరలో వేదం చదివినటువంటి వాళ్ళు పురోహితులు పురోహితులు రాజహితులు అయినారు రాజగురువులంతా కూడా వేదం చదువుకున్న వాళ్ళు అంటే ధర్మం బోధించే వాళ్ళు తర్వాత మంత్రులు ప్రధాన మంత్రులు ఉంటారు కానీ రాజగురువు కులగురువు ఎవరయ్యా అంటే విప్రుడు వాడు పోయి రాజులకి సేవ చేస్తాడా డబ్బుకు అమ్ముడుపోతాడా అని బాధపడుతున్నావా అంటున్నది. కులిశహస్తుడు వాన కురియింపకుండగ ప్రజలు దుఃఖంబుల పడుదురనియో ఇంద్రుడు వరుణ దేవుడితో చెప్పడా వర్షమా నీవు కురవమని కురవద్దు అని చెప్తాడని నువ్వు బాధపడుతున్నావా హిమవంశ జాతులు ఏయ ధరణీయ రాజ్యములు పాడి కలిగి సరగవనియో మనుజులన్న పానమై ధునశయనాస ఆసనాది కర్మశక్తులనియా ఏమ్మా ఎంతసేపు భోంచేయటం పడుకోవటం ఇంకేం పని చేయరు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అని బాధపడుతున్నావా అని జననీ నీ భరమెల్ల డించుటకునై నీ భారమంతా కూడా దింపటానికి చక్రాయుధుండు ఇన్ని హాయనముల్ తాను నరాకృతిన్ మెలగి పరమేశ్వరుడు చూడమ్మా నీకీ భూభారం ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది కాదు ఈ భారం నీకు మొదటి నుంచి ఉంది దుష్టజనులు మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెడ్డవాళ్ళు కూడా ఇక్కడ అంతే మంది ఉన్నారు అందుకనే రమణ మహర్షి ఒక మాటంటారు The world is neither good nor bad, it is as it is. Accept in its totality అంటాడాయన సమగ్ర స్వరూపం ఏమిటంటే a blend of both good and bad. Be with good you will become good. If you are--if you associate with bad, you become bad. అది అదే చెప్తున్నది ఇక్కడ అందుకనే ఆయన నరాకృతి దాల్చి వచ్చాడు ఇన్ని అవతారాలు ఎత్తు వచ్చాడు చక్రాయుధుండు హాయనముల్ తాను నరాకృతిన్ మెలగి నిత్యానందముం జేసి పోయిన యేనింక అనాధనైతి కుజనుండు ఎవ్వాడు శాసించునో పెనుదుఃఖంబుల పెందనుంటి కనియో భీతిల్లి చింతించుటల్ ఇంతవరకు వచ్చిన అవతార మూర్తులంతా ఈ భూమ్మీద నడిచినవారు వీరు ఇకపై ఒక ఏ అవతారం రాదు అనూ ఉన్నటువంటి వారంతా కూడా దుర్జనులుగా ఉంటారనో నేను దుర్మార్గుల చేత పాలించబడబోతున్నానని అనుకుంటున్నావా అని అడుగుతున్న ధర్మదేవత అప్పుడు భూదేవి ఒక మాట అన్నది. ఈ లోకంబున పూర్వము నల్గు పాదములు నీవు నడచువు నేడు ఆ శ్రీలనేసుడు లేమిని కాలముచే నీకు ఒంటికాలయ్యెకదే ఇదివరకు పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పావు కదా గుర్తొస్తున్నది ఆయన ఉన్నందువల్ల కదా ధర్మదేవతా నువ్వు నాలుగు పాదాల మీద నడిచావు భద్రంగా నడిచావు ఆ పరమేశ్వరుడు లేనందువల్లనే కదా శ్రీలనేసుడు అన్నాడు అందువలన నీవు కూడా ఈ ఒంటికాలి దానివి అయిపోయినావు కదా అన్నది భూదేవి ధర్మదేవతతో. బ్రహ్మాదులెవ్వని భద్ర కటాక్ష వీక్షణము వంచింతురు సత్తపముల కమలాలయము మాని కమలయవ్వని పాదకమలంబు సేవించు కౌతుకమున పరమయోగీంద్రులు భవ్య చిత్తమునందు నిలుపుదురు ఎవ్వని నియతితోడ వేదంబులెవ్వని విమల చరిత్రము వినుతింపగ లేక నగడు పడియే అట్టి వాసుదేవు అబ్జ వజ్రాంకుశ చక్రమీన శంఖుచాప ఖేత్ చిహ్నితంబులైన శ్రీచరణంబునింక శోకగనుచు వగపు శోకెనమ్మా నిజమేనమ్మా బ్రహ్మాదులంతా కూడా బ్రహ్మపదం కోసం ఏ పరమాత్మ గురించి తపస్సు చేస్తారో తను ఉండేటువంటి పద్మాన్ని వదిలిపెట్టి ఎవరి దివ్య పాదముల దగ్గర లక్ష్మీదేవి అన్నివేళలా కూర్చొని ఉంటుందో పరమయోగీంద్రులంతా తమ హృదయాలయాలలో ఏ పరమాత్మని సంశ్చ--సంస్థితం చేసి ఉన్నారో వేదములు ఎవరి విమల చరిత్రాలైనయో ఎవరి histories అయినయో అటువంటి వాసుదేవుడు ఆయన పాదాల అడుగున నాలుగు రేఖలున్నాయి ఒకటి పద్మరేఖ రెండవది వజ్రరేఖ మూడవది అంకుశ రేఖ నాల్గవది మీనరేఖ అందుకనే మనం ఒకసారి చెప్పుకున్నాం కల్పవృక్షంలో శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాంఅగస్త్య రేఖాద విరంచితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం అందుకే గురువుకి నమస్కరించేటప్పుడు గురుపాదముల పైన నమస్కరిస్తే ఏం లాభం లేదు. గురువు యొక్క పాదాలు అంటే రెండు బొటనవేళ్ళ కింద చేతులు పెట్టి నమస్కరించుకున్నట్లయితే పరమేశ్వరుడి యందు ఈ వజ్ర, పద్మ, మీన, చక్ర అనే నాలుగు రేఖలుంటాయి. గురువు పాదాలకి అగస్త్య రేఖలుంటాయి. ఆ అగస్త్య రేఖలు అంటే మన అరచేతి ఉన్నటువంటివన్నీ కర్మ రేఖలు. ఈ కర్మ రేఖలు గురువు యొక్క బొటనవేళ్ళ కిందకి వెళ్ళి ఇట్లా పెట్టి నమస్కరించుకున్నట్లయితే ఈ కర్మ రేఖలు ఆ క్షణం వరకు చేసిన కర్మలన్నీ కూడా స్పర్శ చేత ధ్వంసమై మళ్ళీ ఉత్తేజితమైనటువంటి జీవితము పుణ్య జీవితం కలుగుతుంది గనుక గురు పాదములకు నమస్కరించవలసినటువంటి విధానం అది. గురువుకి పాద రేఖలు మనకి హస్తరేఖలు ఎట్లా ఉన్నాయో ఆయనకి దివ్య పాద రేఖలు ఉంటాయి. భూదేవి అడుగుతున్నది. ప్రతిరోజూ నేను వాటిని అనుభవించాను. ఇవ్వేళ కుల్వంతహాలు, కుర్చీ, కారు కాసేపు పక్కన పెడితే ఆ రోజుల్లో పరమ పురుషుడు స్వామి నడిచి వస్తుంటే ఇసుక మీద, ఆ ఇసుక ఇంత పట్టుకుంటే అది కొన్ని వందల సంవత్సరాలకి సరిపడా మహావిభూతి అది. చాలా అలౌకికగా ఎక్కడా స్వామి ముద్రలు గంభీరంగా పడవు. ఖచ్చితంగా ఇదే ఆయన పాదముద్ర అనటానికి వీల్లేదు. కానీ ఆ దానిపైన తేలియాడినట్టు నడిచివచ్చే ఆ దృశ్యం కనిపిస్తున్నది. బహుశా ఆ కుల్వంతహాలు అడుగున ఉన్న ఇసుక కూడా భూదేవి లాగానే విలపిస్తూ ఉండి ఉండాలి, "నాకున్నూ ఆయన పాదానికి మధ్య ఈ సిమెంట్ వచ్చి పడిందే" అని. అది చాలా గొప్ప సన్నివేశం అది. ఆ రోజుల్లోనే స్వామి చెప్పారు, "నేను దర్శనం ఇవ్వటానికి మీకై వచ్చేటువంటి వేళ మీ మనసంతా స్థిమితం చేసుకోండి. ఎందుకంటే ముక్కోటి దేవతలకి, వేదాలన్నీ పుక్కిటబెట్టిన వారికి, తపస్సులకి, ముముక్షువులకి, అదృశ్య రూపులైనటువంటి ముప్పది ముక్కోటి దేవతలకి దుర్లభమైన ఈ దర్శనం మీకు నా అంతట నేను ఇస్తున్నాను. ఆ క్షణంలో నా శరీరం నుంచి వెలువడేటువంటి అత్యద్భుతమైన తరంగాలు మీ హృదయ స్థానానికి చేరి మీకు ఆత్మ ఉతనిష్ట చేసేటువంటి శక్తి ఉన్నది. దానిని జాగ్రత్త పెట్టుకోండి" అని చెప్పారు. హెచ్చరిక కాదు direct గా చెప్పారు. ఇవ్వేళ మనం పొందగలుగుతున్నామా అది? లేదు. వచ్చేవారు దగ్గరికి. కాబట్టి ఆ పొందిన వాళ్ళకి అక్కడికి ఆ యోగం ఉంది, ఇప్పుడు ఈ యోగం ఉంది. భూదేవి యొక్క విలాపం కూడా ఇవ్వేళ అట్లాగే ఉన్నది. మళ్ళీ ఎటువంటి కృష్ణుడు, మళ్ళీ ఎటువంటి అవతార పురుషుడు ఎప్పుడొస్తాడో, వస్తాడా? అందువల్ల ఆయన వల్ల కదమ్మా నువ్వు నాలుగు పాదాల మీద నడిచావు, ఆయన లేనందువల్ల కదా నీవు ఒంటి పాదమున్న దానివైనావు. నా పరిస్థితి కూడా అంతే.
SSSMC · audio
Bhagawata Navaneetham - 15
Bhagawata Navaneetham - 15
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:12
More in this series