Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వ్యాస విరచితమై బమ్మెర పోతనతో ఆంద్రీకృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో భాగవత నవనీతంలో సప్తాహంలో ఇది ఏడవ రోజు. ప్రథమ స్కందం పూర్తి చేసుకొని ద్వితీయ స్కందం లోకి ప్రవేశించినటువంటి వేళ శుకదేవుడు వచ్చి పరీక్షిత్ మహారాజుకి ఆత్మవిద్యా విలాసాన్ని బోధిస్తున్నటువంటి ఒక మహా సంబంగల వేళ ఇది. అంటే ప్రాపంచికమైనటువంటి లోక విద్యలు ఎన్ని నేర్చినా పరమమూ చరమమూ అయినటువంటి ఆత్మ విద్యను గనక ఎరగకపోయినట్లయితే మానవుడు ఒక జన్మ వృధా చేసుకుంటాడు కనుక ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా తపస్సుల యొక్క తపః సాఫల్యానికి అనుగుణంగా అనేక కారణాల వలన పరమేశ్వరుడు మానవ దేహం ఎత్తి వస్తాడు. అయితే మానవ దేహం ఎత్తి వచ్చి తాను అవతారమూర్తిగా ఉండగానే ఒక గురు స్వరూపాన్ని కూడా మనకు పరిచయం చేస్తాడు. అది విశేషం. గురువు నిత్య బోధకుడై ఉండాలి. ఆత్మను ఎరిగిన వాడై ఉండాలి. బ్రహ్మానందాన్ని తాను అనుభవించి ఉండాలి. పరమేశ్వరుడి దర్శనాలని తాను స్వయంగా పొంది ఉండాలి. అనుభవాలు తనవి కాగా అనుభవాలలో నుంచి ఒక అనుభూతిని పొంది అనుభూతి నుంచి జీవుడిని విభూతి స్థాయికి తీసుకు వెళ్లగలిగిన పరమోత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్లగలిగిన వాడు గురుడు గనుక అటువంటి గురోర్గురువులంతా కూడా భారతావనిని అఖండంగా, అవచ్ఛిన్నంగా, అనూచానంగా, సాంప్రదాయకంగా, సనాతనంగా వేదకాలం నుంచి సన్మార్గంలో నడిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేశకాల పరిస్థితులలో ఆయా జీవులు సాధకులైనటువంటి వారందరూ కూడా అందిపుచ్చుకున్నటువంటి వారు, సాధనలో ఒక పరిణితి సాధించినవారు, సాధనలో ఒక స్థాయికి వెళ్లినటువంటి వారంతా కూడా తమ తమ పరిధిలో సర్వ జగత్తుకి కూడా జ్ఞానబోధ చేస్తూ వచ్చారు. కారణంగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి భారతదేశం అధ్యాత్మ పీఠిక అయింది. అంతే కాదు ఇది సత్య పీఠం కూడా. సత్య పీఠం అంటే సత్యము అంటే ఏది సత్యమో ఏది-- అది జ్ఞానం. ఏది జ్ఞానమో అది అనంతం. ఏది అనంతమో అది బ్రహ్మం. బ్రహ్మంలో ఉన్నాం మనం కాబట్టి దీని యొక్క జ్ఞానం ఒక ఎరుక చేత, ఒక ఆనందం చేత, ఒక తత్వానుసంధానం చేత పూర్ణ ముక్తులం కాగలిగినటువంటి ఒక స్థాయికి ఏదో ఒక రోజున చేరుకోగలగాలి. మానవ జీవితం పరమార్థం ఏమిటి అంటే తనను తాను ఎరగటమే ఇంకేం లేదు. అన్ని శబ్దాలు పుట్టే నిశబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయే నరజన్మ అరయ నారాయణాన్వేషితం. నారాయణుడిని అన్వేషించటం కోసం మనకి జన్మలు ఇవ్వబడ్డాయి. అయితే నారాయణుడిని ఎక్కడ అన్వేషించాలి? ముందు బయట వెతుకుతాం, అన్నిటా వెతుకుతాం, అంతటా వెతుకుతాం అన్నమాచార్య వారి వలె ఒక్క శ్రీ వేంకటేశ్వర విగ్రహాన్ని ఆలంబనం చేసుకున్నాడు ఆయన. ముప్పై మూడు వేల సంకీర్తనలు మనకు లభించినాయి. ఇంకా కాల గర్భంలో, రాతి గర్భంలో ఎన్ని మిగిలిపోయినాయో ఎవరికీ ఎరుక లేదు. పరమోదారమైనటువంటి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి వంటి మహానుభావులు వాటి తాళపత్రాలు, శాసనాలు, రాగి పలకల మీద రాసినవన్నీ క్రోడీకరించి ముప్పై మూడు వేల సంకీర్తనలుగా జాతికి అందించారు. అయితే ముప్పై మూడు వేల సంకీర్తనలు అన్నమాచార్యుల వారు భక్తి, జ్ఞాన, వైరాగ్య, శృంగార, అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సాంప్రదాయానుగుణంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తించాడు. ఇంత అయింది వయ-వయస్సు పరిపాకం చెందింది పెద్దవాడయినాడు. ఇక రాసే శక్తి లేదు, ఆలోచించగలిగిన శక్తి లేదు, దర్శనం కోసం కాచుకున్నాడు. అది ఆయన జీవితంలో ఘట్టం. అప్పుడు శ్రీ వేంకటేశ్వర దర్శనం అయిందా కాదా కాదు గాని ఒకానొక రోజున ఆయనకి ప్రబుద్ధమానమైన స్థితి ఏర్పడింది. అంటే enlightenment వచ్చింది. enlightenment వచ్చినప్పుడు మన చేతికందిన ముప్పై మూడు వేల సంకీర్తనలు ఒక్క ఎత్తు చివరికి ఒక మాటన్నాడు, "చిత్తజగురుడా! నీకు శ్రీమంగళం" అన్నాడు. రాయిలో ఇక్కడ అక్కడ వెతికాను అయ్యా నువ్వు చివరికి ఎక్కడున్నావ్ అంటే చిత్తజగురుడువై ఉన్నావ్, నాలో ఉండి ఉన్నావ్. అందుకనే నిన్న ఆత్మ విచారణ చేసినప్పుడు శబ్దం పాడాం అది చిజ్జడ గ్రంథి అన్నాం. చిత్తు, జడము అనేటువంటి రెండు ద్వంద్వ చైతన్యాలు. కదలనిది కూడా చైతన్యమే, కదిలేది చైతన్యమే. చేతి గడియారం తీసుకుంటే ద్వంద్వ చైతన్యాలు దాంట్లోనే ఉన్నాయి, బయట ఎక్కడో లేవు. కదలని బ్యాటరీ అక్కడే ఉంది, కదిలే ముల్లు అక్కడే ఉన్నాయి. బ్యాటరీ తీసేస్తే ముల్లు కదలవు. ముల్లు తీసేస్తే కదలని బ్యాటరీ వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి భగవంతుడు, భక్తుడు, జీవుడు, దేవుడుఈ జడము చైతన్యము రెండు ఏకకాలంలో సంభవించినప్పుడు మాత్రమే పరాప్రకృతి విద్యావిద్యలు రెండు కూడా ఒక సంపూర్ణత్వాన్ని సాధించు కుంటాయి గనుక చిత్తజగురుడు అంటే చిత్ చిత్ జడ గ్రంథి గ్రంథి అంటే ముడి మనం ఒక ముడివేసినప్పుడు గట్టిగా లాగకుండా మనం ధూముడి అంటామే ధూముడి గనక వేసినట్లయితే సూది వెళ్లేటువంటి ఒక మార్గం దానికి ఉంటుంది సూదిని దాంట్లో గుచ్చవచ్చు అక్కడ ఒక రాగం వినిపిస్తుంది అంటే గాలి గనక రంధ్రంలో నుంచి ఇటు నుంచి అటు వెళ్లినట్లయితే ఒక నిస్తంద్ర మంద్రమైనటువంటి నిస్వనమైనటువంటి వినిపించి వినిపించనటువంటి కాని ఉన్నట్టి ఒకానొక గానం వినపడుతుంది గానానికి సంగీత శాస్త్రంలో వారు పెట్టినటువంటి పేరు ఏమిటంటే హంసానంది రాగం హంస అంటే జీవహంస జీవహంసకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రాపంచికమైనటువంటి శాస్త్ర పరిచయాల వలన ఆనందం కలగదు కాస్త విజ్ఞానం వస్తుంది అలాగే ప్రాపంచిక సుఖాల వలన ఆనందం కలగదు ప్రాపంచిక సుఖాల వలన సంతోషం కలుగుతుంది ఎందుకని అంటే ఒకరోజు సుఖం మరొక రోజుతో పోల్చడానికి వీలు లేదు గనుక సంతోషాలు సుఖాలు పెనవేసుకుని ఉన్నాయి గనుక సుఖాన్ని అనుభవించని జీవుడికి సంతోషం కలుగుతున్నది సంతోషాన్ని అనుభవించటం అలవాటు చేసుకున్న వాడికి సుఖం కావలసి వస్తున్నది రెండింటికీ మూలమైన ఒక వస్తువు మాత్రమే ప్రపంచంలో ఉన్నది కానీ చిజ్జడ గ్రంథి వేదనం గనక జరిగినట్లయితే హంసానంది రాగాన్ని వినగలిగినటువంటి ఒక స్థాయి జీవుడు పొందగలిగినట్లయితే హంస ఆనంద గీతను ఆలపిస్తుంది దానినే హంసగీత అన్నారు హంసానంది హంస ఆనందిస్తూ ఉంటుందట మరి హంసానంది ఆనందిస్తుంటే పరమహంస ఏం చేస్తున్నది లోపల అని అది ఏమి చేయటం లేదు చూస్తూ ఉన్నది ఆనందిస్తున్న జీవుడి యొక్క ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తున్నది జీవుడి యొక్క సుఖాన్ని తన సుఖంగా భావిస్తున్నది అందుకనే స్వామి చాలాసార్లు చెప్పిన మాట మీ ఆనందమే నాకు ఆహారం అన్నారు ఆయనకి పళ్ళు అక్కర్లేదు పలహారాలు అక్కర్లేదు మన నైవేద్యాలు అక్కర్లేదు మనమందరం ఆనందంగా ఉంటే స్వామికి ఆనందం ఇది ఎవరనగలరు అంటే హిరణ్యగర్భానందుడు అయినటువంటి పరమాత్మ మాత్రమే చెప్పగలడు ఒక సాధారణ గురువు మీ ఆనందమే మాకు ఆహారం అంటే అయితే గురువు గారు మీరు ఉపవాసం ఉండండి మేమంతా హాయిగా భోంచేస్తాం అంటాం అది కాదు దాని అర్థం మన ఆహారం మన ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నది అంటే మనసుని దాటి బుద్ధిని దాటి చిత్తాన్ని దాటి అహంకారాన్ని దాటి దేహాత్మ భావనను దాటి నిరుపమానము అతులము అచ్యుతము మహోన్నతము అనంతము అఖండము అయినటువంటి ఆనంద పాదోధిలో గనక మనం ఓలలాడగలిగినట్లయితే అటువంటి ఆనందాన్ని చూసి పరమాత్మకి ఆనందం కలుగుతుంది మరి ఆనందాన్ని మనం పరమాత్మకి ఇస్తున్నామా అంటే it is only a reflection it is only a resound మనం హాయిగా ఉన్నామంటే ఆనందం అంతా కూడా పరమాత్మ తాను అనుభవిస్తున్నట్లుగా అభినయిస్తాడు ఆయనకు ఆనందము లేదు దుఃఖము లేదు ఆయన ద్వంద్వాతీతుడు అవస్థాత్రయతీతుడు గుణాతీతుడు కూడా మూడు గుణాలు ఆయనలోనూ ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే పంచభూతిక దేహాన్ని ధరించి వచ్చాడు గనుక కానీ మన దృష్టిలో ఆయనకు ఉన్నట్లుగా కనిపిస్తాయి ఆయన సహజ స్థితి ఏమిటంటే మూడు అవస్థలకు అతీతం మూడు గుణాలకు కూడా అతీతం గనుక అటువంటి పరమాత్మ యొక్క ఆనందానికి కారణభూతుడు జీవుడు కావాలి ఎలా అవుతాడు దానికి మార్గం ఏమిటి శ్రీవైష్ణవ సాంప్రదాయం పరమ ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయం ఎందుకని పరమోత్కృష్ట సాంప్రదాయం అంటే పరమేశ్వరుడిని జీవుడు తన యొక్క స్థాయికి తెచ్చుకొని పరమేశ్వరుడికి స్నానం వాడించి అలంకారం చేసి పరమాత్మలో ఒక బొమ్మని తాను అనుభవిస్తూ బ్రహ్మాన్ని అనుభవిస్తూ బొమ్మే బ్రహ్మంగా అభేదంగా జీవిస్తాడు గనుక శ్రీవైష్ణవ సాంప్రదాయం సౌశీల్య ప్రధానమైనటువంటిది మానసికమైనటువంటి శుద్ధి ఆంతరంగికమైన శుద్ధి భావశుద్ధి మూడు పెనవేసుకున్నటువంటిది గనుకనే వైష్ణవ సాంప్రదాయంలో విష్ణు కథలు మనకి కర్ణాటంగా ఉంటాయి కర్ణాటకంగా ఉండవు కర్ణ అట కర్ణానికి చెవికి ఆనందాన్ని కలిగిస్తాయి చేర్చాం అంటే అది నాటకం అయింది కాబట్టి కర్ణాటంగా ఉండాలి చెవికి ఇంపుగా ఉండాలి శ్రవణ భౌగంగా ఉండాలి వైభోగానికి కారణం ఏమిటి అంటే భక్తి ప్రామాణికం అవుతూ ఉన్నది భక్తి అంటే వెలుగుతో కూడి ఉన్నదే భక్తి అంటే ప్రకాశం అని క్తి అంటే కూడి ఉన్నదని అర్థం ప్రకాశం అంటే ఏది ప్రకాశం అంటే సగుణంగా కనిపిస్తున్నటువంటి పరమాత్మ యొక్క మూల స్వరూపం ఏమిటి మూల స్థితి ఏమిటి అని విచారణ చేసినట్లయితే పరమాత్మగా ఒక దేహంగా కనిపిస్తున్న అవతార పురుషుడు యొక్క మూలమైన వెలుగే మూలం అందుకే ఒకచోట ఇంకా దశమ స్కంధం రాలేదుగా పుతనామాచుడు అంటాడు ఆవలి గట్టున ఉన్నటువంటి పెను చీకటిలోకి పెను చీకటిని దాటుతూ ఆవలి గట్టున ఉన్నటువంటి పెను-పెను వెలుగును నేను దర్శనం చేస్తాను అంటాడు పెను వెలుగు పరమాత్మ చిరు వెలుగు జీవాత్మ చిన్న వెలుగెళ్లి పెద్ద వెలుగుతో అనుసంధానం కావటమే భక్తి భక్తి కామ్యం లేకుండా ఉండాలి కోరికతోనూ ముడిపడి ఉండకూడదు కారణాలు ఉండకూడదు అకారణంగా ఉండాలి అవ్యాజంగా ఉండాలి అన్ని వేళలా ఉండాలి అన్ని క్షణాలలో ఉండాలి అసలు నిశ్వాసలోఉచ్వాసలో రెండింటా కూడా పరమాత్మ యందు భక్తి పూర్ణంగా ఉండాలి గనుక అటువంటిది భక్తి అవుతున్నది. మరి భక్తి ఎలా పుడుతుంది? ఎక్కడ పుడుతుంది? ఎవడి వలన పుడుతుంది? భయంలో నుంచి వచ్చేటువంటి భక్తి నిలకడ చెందదు. మనక్కూడా భయంలో నుంచి అప్పుడప్పుడు భక్తి కలుగుతుంది. అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ భయంలో నుంచే పుడుతుంది అది. కానీ దాని పుట్టిల్లు భయం కాదు, అభయం. భయం లేని చోట లో నుంచి ఆనందంలో నుంచి పరమాత్మకు దగ్గరవుతున్నాను అన్నటువంటి ఒక భావన మనకు కలుగుతున్నటువంటి వేళ వస్తువు నుంచి, సుఖం నుంచి, సంతోషం నుంచి దాటి ఒక ఆనందకారకమైనటువంటి స్థితిలోకి జీవుడు ప్రస్థానం చేస్తున్న వేళ ఆనందమే పరమావధిగా విడిచేకొని ఆనందాన్ని వ్యక్తీకరిస్తాడు. వ్యక్తీకరణ పేరు భక్తి. ఎలా వ్యక్తీకరించాలి? స్వామి అన్నారు, Love in action ఉండాలి. మనం ఎవరినైనా ప్రేమించాం అది ప్రకటన కావాలి. కాకపోతే మనల్ని ప్రేమిస్తున్నట్లు ఎలా తెలిసేది. కనుకనే స్వామి మనకు ఆనందాన్ని ఇవ్వటం, సుఖాన్ని ఇవ్వటం, సంతోషాన్ని ఇవ్వటం, ఇంకేదో చిన్న కోరిక తీర్చటం, ప్రారమ్మన్నమని పిలవటం ఇవన్నీ కూడా భక్తిలో మనం సాధించుకున్నటువంటి కొన్ని ఉపయోగాలు గనుక పరమేశ్వరుడు జీవుడికి అన్నివేళలా ఒక ఆనందాన్ని ఇవ్వటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. భక్తి, నిరుపమానమైనటువంటి భక్తి ఎలా కలుగుతుందంటే నాలుగు కారణాల వలన కలుగుతుంది. ఒకటి, జన్మాంతర సంస్కారం వలన కలుగుతుంది. అంటే మనందరం కూడా ఎన్నో జన్మలు ఎత్తి ఇక్కడికి స్థాయికి వచ్చాం. లేదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాం కదా, భగవద్భాగవతం వినాలి, రామాయణం వినాలి, స్వామిని వెళ్లి చూడాలి, సాయి తత్వంలోకి ప్రవేశించాలి, సత్యసాయి భగవానుడితో మనకున్న అనుభవాలు పంచుకోవాలి అని ఎలా కలుగుతున్నది అంటే భగవద్గీతలో యోగీశ్వర కృష్ణుడు ప్రామాణికమైన ఒక మాట చెప్పాడు. అది key. ఏమిటంటే, "బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే". అనేక జన్మలు ఎత్తి, ఎత్తి, ఎత్తి ఇది కావాలి, అది కావాలి, అది పొందాలి, ఇది పొందాలి అంటూ ఆరాటపడుతూ పోరాటం చేస్తూ జీవుడు స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటాడట. "బహూనాం జన్మనాం అంతే" అనేకమైన జన్మల చిట్టచివర "జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" ఎవడు జ్ఞాని? జ్ఞానం అంటే అసలు ఏమిటి? అని ప్రశ్న వేసుకోవటంలోనే ఒక విస్ఫోటనం జరిగినట్టుగా భావించాలి. ఎప్పుడైతే జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనగానే జ్ఞానం ఎవరు ఇవ్వగలరో మనస్సు ఆలోచిస్తుంది. లోకం జ్ఞానాన్ని ఇవ్వలేదు, విజ్ఞానాన్ని ఇవ్వగలదు. బాగా IIT coaching కి వెళ్ళాం, EAMCET coaching కి వెళ్తే ఏం చెప్తారు? EAMCET, IIT దాన్ని ఎలా చేరుకోవాలో చెప్పగలుగుతారు. భగవత్ తత్వాన్ని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి భగవత్ తత్వాన్ని ఎవరు ఇవ్వగలరు అంటే జ్ఞాని అయిన వాడు ఇవ్వగలడు. జ్ఞాని ఎవరు అంటే విజ్ఞానాన్ని దాటిన వాడు జ్ఞాని. అసలు విద్యను ఎరిగిన వాడు, ఆత్మవిద్యను ఎరిగిన వాడు మాత్రమే జ్ఞాని. జ్ఞాని సంస్కృత శబ్దం గనుక అయినట్లయితే దానికి మనందరికీ అర్థమయ్యేటువంటి పేరు స్వామి అని అర్థం. స్వామి అంటే జ్ఞాని అని అర్థం. ఈ, రెండు అభేదమైనటువంటి రెండు పదాలు. కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడంటే భక్తి మార్గంలోకి జీవుడిని ప్రవేశపెడతాడు. సుఖబోధ కంటే ముందు ఒక ఐదు నిమిషాలు భగవాన్ సత్యసాయి అవతారాన్ని మనం గనుక చక్కగా విశ్లేషించుకున్నట్లయితే పాత మందిరం రోజులలో భగవాన్ తన అవతారాన్ని ప్రకటన చేసి భక్తులందరినీ తన ఆవరణంలోకి ఆకర్షించుకున్నటువంటి వేళ ఆయన అందరినీ కూడా ముందు మార్గంలో పెట్టారు? సేవా మార్గంలో పెట్టలే, భక్తి మార్గంలో పెట్టారు. భక్తి మార్గానికి మూలం ఏది అంటే భజన సాంప్రదాయం అత్యున్నతమైనటువంటిది. భజన సాంప్రదాయం దేశంలో ఎవరి వలన పుట్టింది అంటే చైతన్య మహాప్రభువు వలన కలకత్తాలో పుట్టింది. చైతన్య మహాప్రభువు ప్రవచించినటువంటి భక్తి మార్గాన్ని వైదిక మార్గం చేసి పరిపూర్ణమైన ఉన్మత్త స్థాయికి వెళ్ళినటువంటి వాడు ఎవరు అంటే అక్కడే ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ గురుదేవులు. అక్కడ నుంచి వచ్చి నెమ్మది నెమ్మదిగా భజన కనుక ఉన్నట్లయితే, సాంప్రదాయం కనుక ఉన్నట్లయితే అనేక రీతుల ఉన్నటువంటి భగవత్ స్వరూపాలన్నింటినీ కూడా వారి వారి శక్తులని, గుణగణాలని, రూపురేఖా విలాసాలని అన్నింటినీ కూడా గుణగానం చేయగలిగినట్లయితే భజన నలుగురం కలిసి గనుక చేసినట్లయితే సమ్యక్ కీర్తన అవుతున్నది. సమ్యక్ కీర్తన పేరే సంకీర్తన. భజన సాంప్రదాయంతో స్వామి శ్రీకారం చుట్టి దానిని సంకీర్తనం చేసి సంకీర్తనాన్ని నగర సంకీర్తనం చేసి భక్తి భావ బంధురమైనటువంటి ఒక అధ్యాత్మ వాతావరణాన్ని స్వామి తొలినాళ్లలో సృష్టించారు. ఆయన వస్తూనే జ్ఞానం గురించి బోధ చేయలే. కొన్నాళ్ళు అయిన తర్వాత మనవోటి వాళ్ళందరం అక్కడికి చేరిన తర్వాత నగర సంకీర్తన, భజన, స్వామి యొక్క లీల, మహిమ, అనుగ్రహము అన్నీ అనుభవిస్తున్నటువంటి వేళ నెమ్మదిగా అధ్యాత్మకి శ్రీకారం చుట్టారు స్వామి. కాబట్టి జ్ఞాని కావాలి అన్నటువంటి వాడు ఎన్నుకోవలసినటువంటి ఒక గొప్ప మార్గం ఏది అంటే భక్తి మార్గం. కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి మూడు యోగత్రయగా భావిస్తాం. మూడు యోగాలలో ఏది ఒకదానికంటే గొప్పది కాదు, తక్కువది కాదు. మూడు మూడు పాయలు, అవి మూడు దారులు. అందులో ప్రధానంగా కర్మయోగంలో ఉండటం అందరికీ సాధ్యం కాదు.అలాగే జ్ఞాన యోగంలో అందరూ చేరుకోలేరు ఎక్కడైనా ఎవరైనా ఉండగలిగినటువంటి స్థాయి ఏది అంటే భక్తి యోగం కాబట్టి సామాన్యమైనటువంటి జనవాహిని అంతా కూడా పరమాత్మని అన్నివేళలా గొంతెత్తి పాడుకో గలిగినటువంటి కీర్తించగలిగినటువంటి ఒక హరినామ సంకీర్తనం ఏదైతే ఉన్నదో దానికే భక్తి అని పేరు పెట్టారు భక్తిలో దే--దైవీ దేవతా గుణాలు ఉంటాయి విశేషణాలు ఉంటాయి తత్వాలు ఉంటాయి ఆయన పూర్వం చేసిన కథలు ఉంటాయి రాక్షసుడ్ని ఎప్పుడు చంపాడో ఉంటుంది అటువంటి రాక్షసుడ్ని చంపిన పరమాత్మ! నిన్ను కీర్తిస్తున్నాను అంటూ ఉండగానే కథలన్నీ కూడా మనకి జీర్ణించుకొని మనలో భగవంతునికి మనకి రకమైనటువంటి భేదం లేని ఒకానొక స్థాయి మనకు ఏర్పడుతుంది అటువంటి భక్తి పారంయం చెందినప్పుడు ఒక ఉత్తీర్ణత ఏర్పడినప్పుడు ఒక ఉదాత్త వైఖరి స్థాయికి చేరినప్పుడు దాని పేరు ప్రేమ అని అనబడుతుంది ప్రేమ విశ్వజనీనమై సార్వకాలికమై సర్వజన సమ్మతమై సర్వజన హితమై సర్వామోదయోగ్యమై ఉంటుంది గనుక ప్రేమ నెమ్మదిగా బలపడుతున్నటువంటి వేళ ఒకానొకసారి ఘనీభవించినట్లయితే దాని పేరు జ్ఞానం గా అది రూపాంతరం చెందుతుంది జ్ఞానము అన్నా ప్రేమ అన్నా భక్తి అన్నా మూడు మూడు పర్యాయపదాలే తప్ప మూడు భిన్నమైనవి కాదు అంటే భక్తిలో ఉన్నటువంటి వాడికి సహజమైనటువంటి ఒక గుణం ఉంటుంది గుణం పేరు ప్రేమ ఎప్పుడైతే ప్రేమ భక్తి బలపడిందో వాడు జ్ఞానిగా భాసిస్తాడు వెలుగొందుతాడు ప్రపంచంలో జ్ఞాని అంటే వెతకవలసిన దానిని వెతుక్కొని పొందవలసిన దానిని పొంది తెలియవలసిన దానిని తెలిసి దానితో సంపర్కం పెట్టుకొని దానితో సంయోగం చెంది దానితో సంగత్యాన్ని పొంది సంగత్వంలో నుంచి ఆనందత్వాన్ని పొందుతాడు గనుక వాడు అటువంటి వాడు మాత్రమే జ్ఞాని అవుతున్నాడు వాడికి కర్మలు అవలీలగా కొనసాగుతుంటాయి సంకల్పాలన్నీ నెరవేరుతూ ఉంటాయి గనుక కర్మలన్నీ కూడా జ్ఞాని యొక్క అధీనమై ఉంటాయి భక్తుడైనటువంటి వాడు జ్ఞాని కావటానికి కేవలం ఒక దారపు పోగే అడ్డం అయితే భక్తి స్వామి మా--ఒక్కమాట చెప్పారు ప్రదర్శనగా భక్తి చేయకండి నిదర్శనగా చేసుకోండి హృదయంగమంగా చేసుకోండి మీరు భక్తి సామ్రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటున్నారో దానికి కావలసిన అన్ని అర్హతలు మీరు సంపాదించుకోండి అన్నింటికంటే ఉత్తమోత్తమ అర్హత ఏమిటంటే మానసిక శుద్ధి కర్మాచరణంలో లోటూ లేనటువంటి ఒక Perfection రెండూ ఎవరి దగ్గర ఉన్నాయో వాడు భక్తుడవుతాడు అలాగే కష్టంలో సుఖంలో ఆనందంలో అలవాటుగా సాంప్రదాయకంగా ఆగకుండా ఒక ఆద్యధారలాగా ఒక నీతిధారలాగా ఎవరైతే నిరంతరము పరమాత్మ యొక్క సంకీర్తనం చేసుకుంటాడో వాడు జీవన్ముక్తుడవుతాడు ఇక్కడ వాడికి కర్మలు లేవు కర్మ బంధనాలు లేవు కర్మానుభవాలు లేవు కర్మ వలన ఏర్పడే పుణ్యమూ లేదు పాపమూ లేదు కర్మ చేస్తే పుణ్యం అన్న వస్తుంది చెడు కర్మ చేస్తే పాపం వస్తుంది భక్తి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాడికి పాపపుణ్యాలు రెండూ లేవు ఎందుకంటే తన మనస్సు తన దగ్గర లేదు గనుక తనది కాకుండా ఉన్నది గనుక తన మనస్సు పరమాత్మకి సమర్పించాడు గనుక ఇటువంటి జీవుడులో ఇటువంటి భక్తుడులో అంటే ఒక త్యాగరాజ స్వామి ఒక శ్యామశాస్త్రి ఒక పురందరదాసు ఇటువంటి వారందరిలో ఎవరున్నారయ్యా అంటే పరమాత్మే ఉంటాడు పరమాత్మే పాడుతాడు పరమాత్మే ఆడుతాడు పరమాత్మే కూడుతాడు కాబట్టి జీవుడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి పుణ్య పురుషుల యందు పరమాత్మ పురుషోత్తముడి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది అది ప్రవాహ వేగంతో ప్రపంచంలో ఉన్న అనేక క్షేత్రాలని అన్నివేళలా తడుపుతుంటుంది భక్తి పారవశ్యంలో జీవుడికి పరమానందమైనటువంటి ఆనంద స్థితిని దానిని ఆనంద లబ్ధి అన్నారు లబ్ధ్వానంది భవతి అంటారు శంకర భగవత్పాదులు దా--అది లభించినందువలన కలిగినటువంటి ఆనందము నాకు లభించు గాక వస్తువు దొరుకుతుంది సంతోషం కలుగుతుంది ఆనందం ఎక్కడ కలుగుతుంది కల-కలగదు కానీ సద్వస్తువు దొరికింది ఆత్మ విచారణలో అప్పుడు పరమాత్మతో మనకి ఒక దైహికమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ఒక బంధన ఎప్పుడైతే ఏర్పడుతుందో బంధనంలో నుంచి మనము ఆనందంగా ఉంటాం మన ఆనందాన్ని పరమాత్మ ఆహారంగా స్వీకరిస్తాడు కాబట్టి పరమాత్మ జీవాత్మల యొక్క రెండింటిని ద్వైతంగా రెండుగా కనిపిస్తున్నా రెండు ఒకానొక స్థాయిలో ఒకటయ్యేటువంటి ఒక స్థాయి ఏర్పడుతుంది దాన్నే మనం అనేకసార్లు చెప్పుకున్నాం నేనే పుష్పము నీవు సౌరభము తండ్రి లోక లోకాంతర ప్రాణముల్ పలు శ్రీ దళములై విరియగా గంగత్సుధా భక్తి నీ నానుడుమ యుగాంతర స్థిర మహానిర్మాణ సూత్రముగా నేనే నీవై వెలిగిపోయెదము తంత్రీనాద రమ్యాకృతిన్ తంత్రీనాద రమ్యాకృతి అంటే అద్వైత స్థితి పరమేశ్వరుడే జీవాత్మగా జీవేశ్వరుడుగా జీవేశ్వరుడిగే పరమాత్మగా ఎక్కడైతే ఒక అభేదమైన అద్వితీయ అద్వైత స్థితి ఏర్పడుతుందో అది పూర్ణమైన స్థితి అని చెప్తున్నాడు శుకదేవుడు ఎవరికీ మన పరీక్షిత్ మహారాజుకి అయితే హరిని ఎలా గుణగానం చేయాలి ఎలా చేయాలి హరి అంటే పరీక్షిత్ మహారాజు దృష్టిలో తానెరిగిన ఒక కృష్ణుడు మాత్రమే మనందరినీ పిలిచి మీరెప్పుడైనా దేవుణ్ణి చూశారా అంటే కొన్నాళ్ళ క్రితం ఏమో చెప్పగలిగే వాళ్ళం కాదు కానీ రాముణ్ణి చూశారా కృష్ణుణ్ణి చూశారా ఎరుక లేదు మనకి కానీ దైవమైన సాయిని చూశారా అంటే మేము చూశాం నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ లోనే స్వామి అమరాపురంలో రెండెడ్ల బండి మీద ఎక్కిప్రభ గట్టిగా ఊరేగిస్తూ ఉంటే ఊర్లో చౌరస్తా లో స్వామి నిల్చొని ఒక మాట పెట్రోమాక్స్ లో అటు ఇటు ఉంటే దాని మధ్యలో ఒక మాట చెప్పారు "ఎవరినైనా సరే మీలో ఎవరినైనా దేవుడిని చూశారా? దేవుడు ఎక్కడ ఉన్నాడు అని గనక అడిగితే యదార్థతి చెప్పండి పుట్టపర్తి లో ఉన్నాడని" అన్నారు స్వామి. అది nineteen forty five ఇంకా మనం పుట్టలే అప్పటికి, కనీసం నేను. కాబట్టి nineteen forty five లో దైవం కానివాడు మాట అనలేడు. దైవం అయిన వాడు మాత్రమే మాట ఎందుకు అనగలడు అంటే కాలంలో పరమాత్మని దగ్గర చేసుకునేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి వారందరూ ఆయన కార్యకలాపాలు నిమగ్నం కావాలి. ఇవాళ సాయంవేళ మనందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే సత్యసాయి భగవానుని యందు ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి విశేషం చేత వారి యందున్నటువంటి ప్రేమ చేత మనం స్వామిని worship చేస్తూ కేవలం పూజ చేస్తూ ఒకచోట ఆగిపోయేటివి అంటే we should also try to love భగవాన్. భగవంతుణ్ణి ప్రేమించగలిగినటువంటి హృదయాన్ని మనం పొందాలి. అంత మనసుతో గనక ఉన్నట్లయితే పరీక్షిత్ మహారాజు లాగానే అనేక ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలకు జవాబులు పొంది పొంది కాలగర్భంలో చెల్లిపోయే కంటే కట్టెదుట ఉన్నటువంటి పరమాత్మని గనక ఒక దివ్యాత్మగా అనుభవించగలిగితే అది ఉత్తమోత్తమ స్థాయి. పరీక్షిత్ మహారాజు కూడా శ్రీకృష్ణుడు ఆయన గురించి తమ తాతలు తమ ఇంట్లో ఉన్నటువంటి వారు శ్రీకృష్ణుడిని చూసిన వాళ్ళు చెప్పినందువలన శ్రీకృష్ణుడు ఒక్కడే దైవం అనే భావనలో ఉన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఎవరు అంటే హరి యొక్క ప్రతిరూపం కాబట్టి వైకుంఠంలో ఉన్నప్పుడు హరి అన్నారు భూలోకానికి అదే హరి ఇక్కడికి దిగివస్తే ఆయన కృష్ణ నామంతో కృష్ణ చైతన్యంతో వెలుగొందాడు గనక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు శ్రీకృష్ణుడి యొక్క రూపాన్నే పెట్టుకో అంటున్నాడు శుకదేవుడు. దాన్నేం మార్చుకోనక్కర్లా కానీ హరినామ సంకీర్తనం గనక చేసినట్లయితే కలియుగంలో ప్రధానంగా ముక్తి లభించటానికి అది దగ్గర దోవ అన్నాడు. భక్తి యోగం చాలా తేలిక. ఇవాళ చూడండి అయ్యప్ప స్వామిని చూడండి, దీక్షలు చేసే వాళ్ళని చూడండి, ఎటువైపు చూసినా వేషం వేసుకుని రకమైన భక్తిలో మునిగిపోయినా కనీసం కొద్ది రోజులైనా భగవంతుని యందు మనసును లగ్నం చేశారు కదా. అంటే రూపం అట్లా ఆకర్షించింది కదా అని మనం ఆనందపడాలి. మన దారిన మనం వెళుతూ వెళుతూ అక్కడే ఆగిపోకూడదు. కర్మ భక్తుల దగ్గర మాత్రమే ఆగిపోయినట్లయితే జీవుడు జీవన్ముక్తుడు కాలేడు. అంటే మనందరం కూడా సంసారంలో ఉన్నాం. సంసారము అనగానే సుఖము ఉన్నది, దుఃఖము ఉన్నది, అనుకూలత ఉంది, అననుకూలత ఉన్నది, చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది రెండింటిని అనుభవించగలిగిన అవసరము ఉన్నది, తప్పనిసరితనం ఉన్నది. నేను నాకు ఒట్టి వెలుగే కావాలంటే కుదరదు. కాస్త చీకటి కూడా ఉంటుంది. చీకటి కాస్త దాటి గనక వెళ్లగలిగినట్లయితే మనోనిబ్బరాన్ని గనక మనం అధ్యాత్మలో సంపాదించుకోగలిగితే వెలుగుని ఆనందంగా అనుభవించడానికి వెలుగు యొక్క విలువను ఎరిగి వర్తించటానికి అవకాశం ఉంటుంది గనుక భాగవత గానం కానీ, భాగవత పఠనం కానీ, భాగవత శ్రవణం కానీ అది పరమాత్మ యొక్క దివ్య లీలా గుణ వైభవ విలాసాన్ని సమ్యక్ సంకీర్తనం చేస్తుంది గనక శుకదేవుడికి శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. అలాగే ఇంకొకరు విదురుడు మైత్రేయి అని ఇద్దరు. వాళ్లిద్దరూ కూడా సంవాదనం చేశారు. అయితే దీనికంటే భిన్నం కాదు గనుక ప్రధానంగా శుకదేవుడు ఏం చెప్పాడు? ఇంకా ఏం చెప్పాడు? ఏం చెప్తాడు? హరి దేవుడు హరి దేవుడు హరి దేవుడు అని చెప్తే సరిపోతుందా అంటే ఎట్లా దేవుడు? ఎందుకు దేవుడు? ఎప్పుడు దేవుడు? ఎవరికి దేవుడు? చెప్పాలి. అవన్నీ చెప్తున్నాడు ఆయన. హరి దేవుడు అనేది only a statement. సత్యసాయి is a భగవాన్ it is only a mere statement. How he is భగవాన్? How do you know that he is భగవాన్? How do you know that he is not భగవాన్? ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నలు. తత్వ విచారణ అన్నింటికంటే కూడా అనుభవమే గురువు గనుక మన అనుభవమే మనల్ని నడిపిస్తుంది గనుక స్వామి దైవము అని నిర్ణయించుకున్నాం. ఆయన ఎలా దైవమైనారో కూడా విచారణ గనక జరిగితే ఆలోచన బలపడుతుంది. దాని వలన మనకు లాభమే గాని నష్టం లేదు.
SSSMC · audio

Bhagawata Navaneetham - 18

Home

Bhagawata Navaneetham - 18

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 28:38

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

    Now playing
  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67