Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం మందారు జనమందారం వందే సాయి మహేశ్వరం సురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ద్వారకా నగరానికి వచ్చిన సమయంలో అక్కడ ఉత్తర ఇక బిడ్డని కనే సమయం ఆసన్నమైంది. ఎందుకని? మాయావరణం చేత చక్రాయుధాన్ని అంటే సుదర్శన మాయని సుదర్శన ప్రయోగం చేయకుండా కేవలం సంకల్ప మాత్రంతో ఉత్తరా గర్భస్థమైనటువంటి బిడ్డను రక్షించాడు ఆయన. కాబట్టి ఎవరి వలయంలో ఉన్నాడు? చక్ర వలయంలో ఉన్నాడు. అందునా సుదర్శన చక్ర వలయంలో ఉన్నటువంటి ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి జీవుడు ఇంకా శిశువుగా అప్పుడే చెవులు ముక్కు పుడుతున్నటువంటి వాడికి కూడా కొన్ని కొన్ని ఆత్మ చలనాలు కలిగినాయి. ఆత్మ చలనాలన్నీ కూడా దాని వలన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇంద్రియాలు కేనోపనిషత్తు ఒక మాట చెప్తుంది. ఇంద్రియాలను జయించమని అందరూ చెప్తారే, జయించటం మాత్రమే కాదు జయించబడిన ఇంద్రియాలతో జీవించండి అని చెప్పింది. అలాగే ఇంద్రియాలన్నీ కూడా లోపల ఉన్న ఆత్మ యొక్క impulses అన్నది అది. అది చిన్న ప్రకంపన. అందువలన మనకి sudden గా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు స్వామిని చూద్దాం అనిపిస్తుంది. మనకి ఆయనతో ఏం పని లేదు. ఆయనేం మనం వెళితే మాట్లాడడు. పైగా మనకేం లోక వ్యవహారం ఆయనతో లేదు. కానీ చూడాలి అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆత్మ ప్రకంపన వలన సర్వేంద్రియాలు కూడా ఒక్కసారి పరమాత్మ దర్శనం కోసం తహతహలాడుతాయి. ఇంద్రియాలకు వాటంతట అవి చూడాలని ఎప్పుడూ అనిపించదు. ఆత్మ సంకల్పించినప్పుడు సర్వేంద్రియాలు కూడా ఒక శక్తిని సంతరించుకొని దానిని పరమేశ్వరుడి యొక్క పిలుపుగా మనం భావిస్తాం. అట్లా మనం పుట్ట పత్తికి వెళ్తాం. వెళ్ళి సర్వేశ్వరుడిని చూస్తాం. చూసేదాకా మనస్సాగదు. చూసిన తర్వాత సిమితపడుతుంది. మళ్ళీ ఏమనుకుంటాం అంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో అనుకుంటాం. అప్పుడే చూస్తాం మనం. అది దివ్యత్వంలో ఉన్నటువంటి లక్షణమే అది. పునః పునః పొద్దున్న చూస్తాం, మధ్యాహ్నం చూస్తాం, రాత్రి చూస్తాం, కొన్ని ఏళ్ళు చూస్తాం కానీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందుకనే పరమేశ్వరుడి యొక్క ఉపాధి పరమేశ్వరుడి యొక్క శరీరం కూడా నవనవోన్మేషము అది నిత్య నూతనం. ఇట్లా ఉండి అట్లా ఉండకుండా కాదు. ఎట్లా ఉండనే అది మనకు ఆనందమే. పరీక్షిస్తూ లోపల గర్భస్థ శిశువు మాట్లాడటం అనేది ఉంటుంది. తల్లి వినగలదు. శబ్దాలు వింటుంది. అట్లాగే రాడా చూడా సమస్త భూతములలో రాజిల్లువాడు ఇతడన్ లేడా పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతిందోచి నాకిడా నేడు అభయప్రదానము అతడు హింపన్ నతత్రాతమున్ కాడా ఎందర కావడి ఎడల మత్కర్మమ్ము తానెటిదో అనేకమంది జీవులకు ఉదాహరణ ఇచ్చాడని అనేకమంది జీవులు జగత్తులోకి రావటానికి కారణభూతమైన వాడని ఉచ్ఛ్వాస నిశ్వాసలు చలనాలు ప్రకంపనాలు సంచలనాలు సంచారాలు అన్నింటికీ మూలమైనటువంటి ఒక వేదవేద్యుడు ఒకడున్నాడని విన్నానే. పరమాత్మ అందరినీ కన్నాడని అందరినీ కాచాడని అనుకున్నానే. నేను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చే సమయం ఏర్పడిందే. ఇప్పుడు నన్ను కాచుతాడా, బ్రోచుతాడా లేదా అని ఉత్తరా గర్భంలో ఉన్నవాడు అడుగుతున్నాడు. ఇంకా దానికి కారణం ఏమిటి అంటే ఆవరణ ప్రభావం. ఆవరణం ఎలా ఏర్పడింది అంటే సుదర్శన చక్ర పరివృతమై ఉన్నది గనుక విష్ణు మాయా వృతమైనటువంటి భావనలో లోపల ఉన్న జీవుడికి అప్పుడే భక్తి పుట్టింది. భక్తి ఎవరి యందు? నేను లోకంలో ఎలా ఉంటానో, ఎలా బతుకుతానో, ఇంట పుడతానో అనుకోవటంలా. వాడు ఎక్కడ పుట్టేది వాడికి తెలియదు. ఎక్కన్నా పుట్టటం తప్పదు. కానీ పుట్టుక తప్పదే. తప్పని పుట్టుకని పరమాత్మ కాపాడుతాడా లేడా అని ఒక ఆలోచన అప్పుడే దానికి మనసు ఇంకా పుట్టక ముందే ప్రారంభమైందట. అని గతాగత ప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున అప్పుడు ఏమైందట అంటే ఎప్పుడైతే చూడండి, భీష్ముడు ప్రాణం వదిలిపెట్టేవేళ పరమాత్మను చూశాడు. ప్రాణం ఉసురు పోసుకొని ఉత్తరా గర్భంలో నుంచి బయటకు వచ్చే శిశువు పరమాత్మను దర్శనం చేస్తున్నాడు. ఊహిస్తున్నాడు. క్షణంలో ఎలా కలిగిందిట అంటే ఒక చిన్న నిదర్శనం. మేఘంబుమీద కొమ్మెరుగు కైవడిమేనుపై నున్న పచ్చని పటము వాడు పోతన కాళ్ళంటూ దొరికితే నమస్కరించాలి. దైవదర్శనం చేయిస్తాడు పద్యంలో. లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువు విష్ణు దర్శనం చేసుకుంటున్నాడు. మేఘంబుమీద కొమ్మెరుగు కైవడిమేని పైనున్న పచ్చని పటము వాడు గండభాగంబుల కాంచనమణిమయ మకరకుండల కాంతిమలయువాడు శరవంహి నడగించు సంరంభమున చేసి కన్నులను నుకింపు కలుగువాడు బాలార్క మండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబు వాడు కంకణాంగద వనమాలికా విరాగమానుడు అసమానుడు అంగుష్ఠ దేహమాత్రుడు ఒక్క గద చేత దాల్చి నేత్రోత్సవముగ విష్ణుడా విర్ధ-అవ్వేల యందు ఎటువంటి పరమాత్మ నన్ను కాపాడుతాడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం వర్ణించి ఉత్తరా గర్భంలో అంగుష్ట మాత్ర అంట అంగుష్ట మాత్రం అంటే మన కుడి బొటనవేలు ఎంత ఉన్నదో అంత ఉన్నటువంటి పరమాత్మ గద పట్టుకొని గర్భస్థ శిశువు చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచాడట రక్షణ అందుకనే ఒక తరం కనీసం ఒక వంద ఏళ్ల క్రితం అనుకుందాం ఒక యాభై ఏళ్ల క్రితం గర్భవతులైనటువంటి తల్లులు కాబోతున్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా మంచి పాటలు వినిపించేవాళ్ళు విష్ణుకథలు వినిపించేవాళ్ళు మంచి లాలిపాటలు నేర్పించేవాళ్ళు తల్లి ఏది శ్వాసిస్తున్నదో ఏది ఆహారంగా తీసుకుంటున్నదో ఏది తలస్తున్నదో కలపులే బిడ్డకు వస్తాయి అని ఉత్తర పరమాత్మ అనే కృష్ణుడి యందు పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞతాభావంతో ఆమె నిలబడిపోయింది కనుకనే ఫలితంగా లోపల ఉన్నటువంటిది కూడా నన్నెవరు కాపాడుతారు అని అడుగుతున్నది ఉత్తరని కాపాడుతూ ఉత్తర గర్భంలో ఉన్నదాన్ని రక్షించాడు దానిలో ఉన్నటువంటి ఈయన పరమేశ్వరుడు ఆవిర్భవించాడట అప్పుడు మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశదిశలంతన చేత అఖండిత మహోత్తాల జ్వాలా సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ చిరచిరం దిప్పి విప్రుని శిక్షరము వేడిమి పోడిమి చరచి డిమ్భకుని అంటే లోపల ఉన్న బిడ్డని పరితాపవిద్రుంభణంబు విచారించి పరితాపం చెందవద్దన్నాడు అసలు ఇక్కడ గర్భంలో ఉండగానే ఎవరు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు అనే ఆలోచన వదిలిపెట్టు నేనున్నా అంటూ గర్భంబు కందకుండ అర్భకునికి ఆనందంబు కల్పించి ఎవరు రక్షిస్తారో కనపడ్డ తర్వాత జీవుడికి కూడా ఒక ఆనందం కలిగిందట ఆనందం కలిగినప్పుడు గద చేబట్టి పరిభ్రమింతుచు గదాఘాతంబులన్ క్రూరశుప్రదమై వచ్చు శరాగ్ని తుత్తురువుగా భంజించి రక్షించెనీ సదయుడు ఎవడో కోయటంచు మదిలో చర్చించుచున్ శాపకుండు ఎదురై చూడ అదృష్టుడయ్యె హరి సర్వేషుండు విప్రోత్తమా నిన్న అట్లాగేనే వతనామాచ్చుడికి రాముడు అలా కనిపించి అలా వెళ్లిపోయినట్టుగా లోపల ఉన్నటువంటి శిశువు కూడా శ్రీ మహావిష్ణు దర్శనం క్షణకాలమై మళ్ళీ ఎలా ఉన్నాడో చూద్దామని అనిపించిందట లేదాయన మాయమైపోయినాడు రక్షణ చేశాడు వెళ్లిపోయినాడు అప్పుడు పాండవ వంశోద్ధారకుడైన కుమారుడు జన్మించిన ధర్మానందనుడికి ఆనందం కలిగింది ఇక అందరికీ రాజుగారికి ఆనందం కలిగితే ఏమవుతుందో మనకు తెలుసు అందరినీ పిలిచాడు భోజనాలు పెట్టాడు ఇవ్వవలసినవన్నీ ఇచ్చాడు వంశాంకురం వచ్చింది కాబట్టి వాడికి జ్యోతిష్యులందరినీ పిలిపించాడు జాతక చక్రం వెయ్యమన్నాడు వీడి పరిస్థితి ఏంటో ముందు చెప్పమన్నాడు రాజు పని చేస్తాడు వెంటనే ఘడియలు విఘడియల లోపల లోలోతులకు కూడా వెళ్ళి అసలు వీడు ఎందుకు జాతకం చూస్తాడంటే నా కొడుకు రాజవుతాడా కాదా అని కాదట నా కొడుకు ధర్మాన్నిగా రాజ్యాన్ని పాలిస్తాడా లేదా ఏవన్నా అవకరాలు ఉన్నాయా వీడి వలన ప్రజాకంటకం ఏర్పడుతుందా ఇన్ని ప్రశ్నలు ఉంటాయిట ఉత్తముడైనటువంటి రాజుకు ప్రకటిత దైవయోగమున పౌరవి సంతతి అంతరింపగా వికలత నుందనీక ప్రభవిష్ణుడు విష్ణుడనుగ్రహించి శాపకు ప్రతికించె కావున రూపాలక శాపకుడు అంటే బిడ్డ ఇంక శత్ర శత్రవాంతకుడగు శత్రువులను మాత్రం సంహారం చేస్తాడు విష్ణురాసుడన ధాత్రి ప్రసిద్ధినెక్క పూజ్యుడై వాడి పేరు విష్ణురాసుడు అంటే విష్ణువుని యందు రతి గలవాడు విష్ణురాసుడు అని ఎందుకని తల్లి గర్భంలోనే దర్శనం చేసుకున్నాడు వాడికి తెలిసిన రూపం ఒకటే అది విష్ణు స్వరూపం కాబట్టి వీడికి ఏం పేరు పెట్టాలి అంటే విష్ణురాసుడు అనే పేరు పెట్టండి అని నిర్ణయం అయిపోయింది అప్పుడు నరదేవోత్తముడు అన్నాడు పుణ్యాత్మకులార నా పలుకు మీరు ఊహింపుడు మృక్క జన్మ పెద్దల్ శ్రుతకీర్తులై సదల్లై మన్నారు రాజర్షులై పిన్నాడతడు వారి పోలడిగదా ఎల్లప్పుడూ మాధవ శ్రీ పాదాంభజ భక్తి యుక్తుడగుచున్ జీవించునే చూడరే ధర్మరాజు రెండోది అడిగాడు మా తాత ముత్తాతలంతా పరమేశ్వరాధీనమైనటువంటి మనసుతో జీవించారు ఋషులుగా మహర్షులుగా రాజర్షులుగా జీవించారు మాకు పుట్టినటువంటి మనవడు ఎవడైతే ఉన్నాడో అట్లాగే ఉంటాడా విష్ణుపాద పద్మముల యందు నిర్మలమైన భక్తి కలిగి ఉంటాడా చూడరే అన్నాడు మళ్ళీ ఓసారి చూడండి ఏదో శాస్త్రాలు చంపుతాడు రాజ్యం ఏలుతాడు మాకు అది కాదు అసలు విష్ణు భక్తి ఉన్నదా లేదా చూడమన్నాడు ఆయన అని అనగానే భవదీయ పౌత్రుండు వాళ్ళు చెప్పారు చాలా అందమైన మాటలివి నీ మనవడు మనుపుత్రుండైన ఇక్ష్వాకుని చందంబున ప్రజలను రక్షించు శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండగు భానుబిలాగున ప్రతాపవంతుడగు వాసుదేవు వడుపున సర్వభూత హితుడగు తల్లిదండ్రుల మాట్కి సహిష్ణుండగు వీడి తల్లిదండ్రులు ఎవరు ఉత్తర సుభద్రఉత్తర అభిమన్యుడు అట్లాగే వాళ్ళ ఇద్దరి యొక్క మనస్సు విష్ణువు యందు ఎట్లా ఉన్నదో వీడి మనసు కూడా అట్లాగే ఉంటుంది అని ఆశీర్వచనం చేశారు ఆశీర్వచనం అయ్యాక వీడికి విష్ణురాసుడు అని కదా పేరు పెట్టారు మరి పరీక్షిత్ జననం అని రాశాడు ఈయన పోతన గాని వ్యాసులవారు గాని పరీక్షిత్ అనే పేరు ఎందుకు వచ్చింది అని వాడి పేరు విష్ణురాసుడు అనొచ్చుగా విష్ణు భక్తుడు అంటే కుదరదు అసలు వాడు పరీక్ష చేయటానికి పుట్టాడు ఎవరిని పరీక్ష చేయటానికి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్న వేస్తూ వెతుకుతూ వెతుకుతూ ఆయన వల్లనే మనకి భాగవతం వచ్చింది లేకపోతే వచ్చే పుట్టేదే కాదు సంవాదంలో నుంచి పరీక్షిత్ మహారాజు వల్ల మనం కూడా హాయిగా భాగవతం చదువుకునే ఒక యోగం ఇచ్చాడు గనుక పరమాత్మను పరీక్షించటం అంటే not examining ఎన్ని విధాల ఆయనను చూడవచ్చును అన్ని విధాలు చూశాడట పరీక్షిత్తు అందువలన దానికి basic గా విష్ణు భక్తి ఉండాలి స్వామి అంటారు బియ్యం అంటూ ఉంటే బిర్యానీ చేయొచ్చు బంగారం చిత్రాన్నం చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ బియ్యమే ఉండాలిగా అసలు basic మన దగ్గర substance లేకపోతే ఇంకేం కర్మయోగం భక్తియోగం ఉపన్యాసం ప్రయోజనం లేదు ఉండవలసింది పరమాత్మ యందు అనన్య భక్తి ఉండాలి అనన్య భక్తి ఎప్పుడైతే మన యందు ఉంటుందో మనకు ఉంటుందో మనం దానిని పరిపూర్ణంగా అనుభవించగలిగినటువంటి ఒకానొక స్థాయికి మనం వెళ్తాం కాబట్టి ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు విశ్వరాసుడే పరీక్షిత్తు ఉత్తర అభిమన్యుల బిడ్డ సుభద్ర అర్జునులకి మనవడు తత్ కారణంగా ధర్మరాజుకి మనవడు ధర్మరాజు రాజైనాడు గనుక ఈశ్వరుడుగా నిలిపాడన్నారు పోతనామాత్యుడు గొప్ప పదం వాడాడు ధర్మరాజుకి ఈశ్వర శబ్దం అంటే నాశనం లేనిది చితి లేనిది ఇక్కడ చిన్న మీమాంస ఉన్నది ఏమిటా అంటే మనం నవనీతం తీసుకొని వెళ్ళాలిగా వెన్నా కథ అయిపోయింది నవనీతం ఏమిటంటే ఐదుగురు ఉన్నారు కదా పంచ పాండవులు వాళ్ళలో ఒక్కరు ధర్మానికి దూరమైన వాళ్ళు కారు కానీ ఐదుగురిలో ఒక అర్జునుడిని మాత్రమే తాను ఎన్నుకున్నాడు భగవద్గీత చెప్పటానికి పెద్దవాడు ధర్మరాజుకి చెప్పొచ్చు లేకపోతే చిన్నవాడు సహదేవుడికి చెప్పొచ్చు ఆయన చెప్పలే ఎందుకు చెప్పలేదంటే మహాభారత యుద్ధం జరగటం తధ్యం అందులో పాండవులు గెలవటం తధ్యం పాండవులు గెలిచిన తర్వాత ధర్మరాజు తప్ప మరొకరు రాజు అయ్యే అవకాశం లేదు కాబట్టి రాజైన వాడికి యోగం బోధించక్కర్లే శాస్త్రం బోధించాలి కాబట్టి భగవద్గీత వినటానికి ధర్మరాజు సరైన వాడు కాదు ఎందుకు కాదంటే ఆయనకో కర్తవ్యం ఉంది రాజ్యాన్ని ఇంత జయించి ఇన్ని ఇబ్బందులు పడి ఇక్కట్ల పాలై గెలుచుకున్న రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడిపించాలి గనుక ధర్మరాజుకి బోధించలే ఇక భీముడు తన భుజ బలాన్ని దేహ బలాన్ని నమ్మిన వాడు పైగా వాయు తత్వంతో కూడిన వాడు వాయు తత్వంతో కూడిన వాడు వింటాడు వదిలిపెడతాడు నిలబెట్టుకోలేడు కుంభకం చేయలేడు కాబట్టి ప్రాణాయామ మహావిద్య లో పూరకము చేయాలి కుంభకము చేయాలి అక్కరలేనిది రేచకము చేయాలి నిలబెట్టుకోవటం పొందటం పెద్ద యోగం కాదు అక్కరలేనిది వదిలి పెట్టగలగటమే యోగం నిజమైన యోగం మనకు ఏదన్నా అక్కరలేనిది అంటూ ఉంటుందా అని పాతది అయిపోయింది ఇరవై ఏళ్ళు అయింది బయట పడేయ్ ఉండి ఎప్పుడో పనికొస్తుంది పనికి రాదని మనకు తెలుసు కదా కాబట్టి కొత్తవి పాతవి అన్నింటితో మనం జీవిస్తూ ఉంటాం అలాగే మనం కూడా అక్కరలేని ఆలోచనలతో అక్కడికి వచ్చే ఆలోచనలతో జీవిస్తాం గనుకనే మనస్సు రెండుగా చీలిపోయి ఉంటుంది అక్కరలేని వాటి వలన యాతన కావలసిన వాటి వలన ఆనందం రెండింటి మధ్య ఘర్షణ వలన జీవుడు పూర్ణానందాన్ని అనుభవించలేడు అటువంటి స్థాయిలో ఉన్న భీముడికి కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం బోధించటం ఏం ప్రయోజనం లేదు అవన్నీ నువ్వు చెప్తున్నావు బానే ఉంది కానీ ఎవరిని చంపు అంటావో చెప్పు అంటాడు ఆయన దేహ బలాన్ని నమ్ముకున్నాడు ఇక నకుల సహదేవుల వాళ్ళ మనస్సు పశువుల యందు జ్యోతిష్య శాస్త్రం యందు లగ్నమైపోయింది శాస్త్రము యందు నిమగ్నమైనటువంటి మనసుకు యోగం అవ్వదు వీలు లేదు శాస్త్రమే పట్టుకుంటాడు వాడు అంటే కొంతమంది officers ఉంటారు చాలా honest officers అని పేరు వాళ్ళకి ఎందుకంటే they go by rule అని కదా go by rule అయితే ప్రపంచం నడవదు ఎందుకంటే rule కింద ఒక చిన్న clause ఉంటుంది కాస్త విసులుబాటు ఉంటుంది దాన్ని పట్టుకొని నడపాలి పరిపాలన కాబట్టి నకుల సహదేవులిద్దరూ కూడా ఒక జ్యోతిష్య శాస్త్రాన్ని ఆలమందలని గోసంపదని రక్షించటానికి నకులుడు సహదేవుడు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకున్నాడు గనుక జ్యోతిష్య శాస్త్రం యోగంలో ఒక భాగమే కానీ యోగం కాదు అందువలన ఎవరు దీనికి అర్హమైనవారు అంటే నిజానికి అర్జునుడు రాజు కావాలి అంటే అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ధర్మరాజు ఉండనే ఉన్నాడు ఒకవేళ ధర్మరాజే గనుక లేకపోతే తర్వాత అర్జునుడు కాదు కావలసిన వాడు భీముడు పక్కనున్నాడు వీళ్ళిద్దరూ అయ్యే దాకా అర్జునుడు ఉంటాడా ఉండడా చూద్దాం ఆయనకు తెలుసు కాలాధీనమైనటువంటి చేతస్కమైనటువంటి వాడు గనుక మధ్యముడైనటువంటి అర్జునుడిని ఎన్నుకున్నాడు ఆయన పైగా తనతో సఖుడుగా చెలికాడుగా ఒక చక్కని బాంధవ్యం ఉన్నవాడిగా మనసు ఎరిగిన వాడుగా తన శక్తిని ఎరిగిన వాడుగా ఉన్నటువంటి అర్జునుడిని నర నారాయణునిగా వచ్చాడు నరనారాయణం నిన్న చెప్పుకున్న నర నారాయణుడు కాదు వాళ్ళిద్దరూ మునులు వీళ్ళిద్దరూ కూడా నరుడు అర్జునుడు నారాయణుడు కృష్ణుడు ఒక బోధకుడు ఒక సాధకుడు కూడితే దాని పేరు యోగం.ఒక బోధకుడు అనేక సాధకులు కూడితే అది సత్-సద్యోగం, సత్యోగం. ఆత్మల యొక్క కలయిక. ఇప్పుడు మనం ఉన్నాం ఉపన్యాసం వింటున్నామా, పురాణ కాలక్షేపం చేశామంటే సత్సంగంలో ఉన్నాం. ఎలా కూడి ఉన్నామంటే మన సత్తులన్నీ ఇక్కడ కూడి ఉన్నాయి. దేహాలతో మనకు పని లేదు. అవే ఎర్ర ఉన్నాయి, నల్ల ఉన్నాయి, చల్ల ఉన్నాయి మన వాటితో ఏం పని? చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అవి దాటినటువంటి స్థాయిలో యోగైక స్థాయిలో గనక నిలకడ చెందినట్లయితే అంతటా అన్నిటా పరచుకొని ఆవరించి, ఆవహించి ఉన్నటువంటిది ఒక్కటే దాని పేరు ఆత్మ. ఆత్మ నిత్యమ్ము, కలాజ్యవచ్ఛిన్నమ్ము, అపరిణామం అది, అప్రమేయం అది, అస్స తెలివి. అది అపరిణామ ప్రాప్తి కలగాలి. పరిణామం కాదు. మనకు కావలసింది ముక్తి కాదు ఇవ్వాళ, కావలసింది పరిణామం. That is evolution. evolution అనే మాట స్వామి పెద్దగా వాడకుండా transformation. ముందు transformation అయితే evolution దాంతో పాటే parallel గా వెళుతుంది. information ఇంత ఉన్నందువలన నీకు ముక్తి రాదు. దానిని నువ్వు implement చేయాలి. Through implementation you will transform. Through transformation you will liberate. Through liberation you evolve. అక్కడికి వెళ్ళాలి. కేవలం రెండు మాటలే I to V, V to I ఇంత గందరగోళం. అట్లా కాకుండా I నుంచి V కి వెళ్లటమనేది కాదు V నుంచి I కి కూడా రావాలి. అంటే ప్రపంచం నుంచి తను దృశ్యమాన ప్రపంచం నుంచి లోపల కనపడనటువంటి నిజాంతర్గతం అన్నారే, నిజాంతర్గతమైనటువంటి స్థాయికి జీవుడు వెళ్ళాలి గనుక ఇక్కడ అపరిణామ ప్రాప్తి. అత్త తెలివి. అత్త తెలివి అంటే మిగతా తెలివులన్నీ శాస్త్రం తెలివి, chemistry తెలివి, mathematics తెలివి, ప్రపంచంలో ఉన్న లోకరీతులకు సంబంధించిన తెలివి. అత్త తెలివి అంటే ఆత్మవిద్య. చదువులన్నీ చదివి చావంగానేటికి చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు which is eternal, which is infinite. అది ఆత్మవిద్యా విలాసంలోకి వెళ్ళాలి గనుకనే అన్యవసీ ఉపాసన, అంగవతీ ఉపాసన రెండూ దాటి పరమేశ్వరుడైనటువంటి స్వామి మనకి సంవత్సరం, యోగంలో దీనిని నిదానవతి ఉపాసనగా మనకు అనుగ్రహించారు. నిదానవతి ఉపాసనలో నెమ్మదిగా ఉండాలి. మనస్సులు వికారానికి లోను కాకూడదు. నిబ్బరం ఉండాలి, నిశ్చలం ఉండాలి, నిర్మమంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, నికేతనంగా ఉండాలి, నిరంజనంగా ఉండాలి, పూర్ణంగా ఉండాలి, శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, సంస్థితంగా ఉండాలి. ఉన్నట్లయితే వెన్న చేతికి వస్తుంది. రావటానికే ఒక భీష్ముడు, ఒక కుంతి, ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి ఒక పరీక్షిత్తు, వీళ్లంతా కూడా వీళ్లతో పాటుగా అటు హస్తినాపుర వాసులు, ఇటు స్వాగతం పలికినటువంటి ద్వారకాపుర వాసులు, అందరూ కూడా పరమాత్మ యొక్క ఉపాధిని, ఉపాధి లేనితనాన్ని కూడా ఎలా అనుభవించారో మనకి సాకల్యంగా, పరిపూర్ణంగా వేదవ్యాసుడు పద్దెనిమిది వేల శ్లోకాలలో నిక్షిప్తం చేసినటువంటి జయ అనబడేటువంటి జయం నిజానికి. జయం అనబడేటువంటి ఒక మహా కావ్యానికి ఆంధ్రదేశంలో ఒక గొప్ప తెలుగువాడిగా బమ్మెర పోతనామాత్యుడు తన హృదయ సంస్కారాన్ని రంగరించి తన సహజ కవితాధారని దానికి అబ్బి పరిమళమైనటువంటి ఒక భావం, అద్భుతమైనటువంటి భాష రెండింటితో ఒక యోగనిష్ఠ, యోగనిష్ఠతో పరమాత్మ దర్శనాన్ని మనకి నవనీతంగా అనుగ్రహించాడు గనుక అటువంటి పోతరాజు ఎవరు అంటే విశ్వనాథవారు అంటారు. తెలుగుల పుణ్యపేటి అన్నాడాయన. పుణ్యం అంతా మన దగ్గర ఉంటే దాచుకోవడానికో ఇనపపెట్టె కావాలి కదా! బాగా సంపాయిస్తాం డబ్బుంది అనుకోండి, ఏం చేస్తాం? అక్కడ ఇక్కడ పడేస్తామా? లేదా ముందు వచ్చిన డబ్బులోనే ముందు ఇనపపెట్టె కొంటాం గా. పెట్టి దాంట్లో కాపలా పెడతాం గా. తెలుగుల యొక్క పుణ్యపేటి ఎవడు అంటే వాడు సహజకవి బమ్మెర పోతన. సహజకవి బమ్మెర పోతన. సహజ పరమహంస శ్రీరామకృష్ణ పరమహంస. అలాగే సహజమైనటువంటి ఒక ఉత్తమోత్తమ స్థాయిలో ఒక మహర్షిగా జీవించిన సహజ మహర్షి ఎవరు అంటే భగవాన్ రమణ మహర్షి. ఇట్లా వీరందరూ కూడా ఉదాత్త ప్రాతఃస్మరణీయమైనటువంటి మహా వ్యక్తిత్వాలు. ఇవన్నీ సుదర్శన మహాచక్రంలో అవతార మూర్తులంతా ఒక్కొక్క పన్ను. ఒక్క పన్ను లేకపోయినా ప్రపంచం నడవదు. కాబట్టి స్వామి ఒకే మాట చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురి పట్ల అభేదాన్ని పాటించండి. బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అనుకోకండి. అట్లాగే గురు స్వరూపాల మధ్య కూడా భేదాన్ని పాటించకండి. అయితే All gurus are one అని చెప్పారు స్వామి. రాసుకునే లోగా comma పెట్టమన్నారు. తర్వాతది అసలు important. All are not gurus అని చెప్పారు. అది All gurus are one అంటే గురు స్థాయికి వెళ్లిన వాళ్ళందరూ మాత్రం ఒక్కటే. ఇప్పుడు చెప్పుకున్న పేర్లన్నీ. కానీ గురు వేషం వేసుకున్నవాడు మాత్రం గురువు కాదు. ఎందుకు కాదు అంటే వాడు కూడా మనతో ప్రాపంచికమైన యాత్రను పడుతుంటాడు. వాడికి అది కావాలి, ఇది కావాలి, ఏదీ లేకపోయినా వాడు జీవించలేడు. ఏది తనకు అక్కరలేదో, దేనివలన వాడు చలితుడు కాడో, దేనివలన ప్రభావాన్ని కోల్పోడో, స్వభావాన్ని కోల్పోడో, దేనివలన ప్రభావానికి లొంగడో, తాను తానుగా నిత్య నైమిత్తికంగా ఉన్నటువంటి దేహంలో పూర్ణమైనటువంటి ఒక దత్తదీపంగా వెలుగుతూ ఉంటాడో, అఖండ చిద్గణ రసమైనటువంటి ఆత్మ స్వరూపుడిగా తనను తాను ఎరుకగా అనుభవంలోకి తెచ్చుకుంటాడో అటువంటి వాడు మాత్రమే పూర్ణయోగానికి అర్హుడవుతాడు గనుక అటువంటి యోగాన్ని అనుగ్రహించినటువంటి స్వామి... ఎన్నో జన్మలు, ఎన్ని తపస్సులు, తపస్సు చేశామో మనకి ఎప్పటికీ అర్థం కాదది. అయితే తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఏం పొందామో మనకు తెలుసు గనుక దానిని అనుగ్రహించినటువంటి పరమాత్మ సాయి యొక్క దివ్య శ్రీచరణారవిందాలకి మరొక్కసారి ప్రణమిల్లుతూ సహజ కవి అయినటువంటి బమ్మెర పోతనామాత్యుడి యొక్క పాదాలకు కూడా నమస్కరిస్తూ సాయిరాం.
SSSMC · audio

Bhagawata Navaneetham - 09

Home

Bhagawata Navaneetham - 09

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 24:25

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

    Now playing
  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67