No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్ జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయీశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వేద వ్యాస ప్రోక్తమై బమ్మెర పోతనామాత్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో వామన అవతార ఘట్టం నిన్న పూర్ణం చేసుకున్నాం. నిజానికి భారతం భాగవతం రామాయణం ఈ మూడు కూడా ఆంధ్రదేశాన నాటబడ్డటువంటి మూడు కల్పవృక్షాలవి అంటే ఒకే కల్పవృక్షం మూడు రూపాలలో వచ్చింది అని అర్థం. ఏం కావాలి మనిషికి అని కాస్త అధ్యాత్మంలో ఉన్నవాడిని అడిగితే నాకు ముక్తి కావాలి అని అడుగుతాడు. ముక్తి ఎవరు ఇవ్వాలి అని అది ఇచ్చేది కాదే ఇవ్వటానికి ప్రత్యేక పదార్థం కాదే ముక్తిని మనం పొందాలి ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలి మూడు యోగాలు కర్మ యోగం భక్తి యోగం జ్ఞాన యోగం యోగం వీటన్నింటిలో మధురాతి మధురమైనది అత్యంత సులభమైనది అందరూ ఆచరించదగినది అందరూ అనుష్టించవలసినది కలిగినది భక్తి యోగం కాబట్టి పండిత పామర భేదం లేకుండా ప్రతి వాడు భగవంతుని వైపు ఒక అడుగు వేయటానికి భక్తి అనేటువంటి ఒక ఊతం తీసుకుని గనక వెళ్లగలిగినట్లయితే ఎక్కడా తడబాటు లేని అడుగుతో వాడి సాధన క్రమాంతం పూర్తవుతుంది గనుక భాగవతం అంతా భక్తుల గాథలు ఏ కథకి ఆ కథే అది రామాయణంగా కాదు భారతంలా కాదు ఏ పాత్రకి ఆ పాత్ర ఏ భక్తుడికి ఆ భక్తుడు. వాడికి వచ్చిన కష్టం వేరు దాన్ని ఆయన తీర్చిన విధానం వేరు అన్ని కష్టాలు ఒక్కలాగానే లేవు అన్ని కష్టాలు ఆయన తీర్చిన తీరుతెన్నులు ఒకటిగా లేవు కాబట్టి దేనికి అదే కాబట్టి ఆ కల్పవృక్షం మీద అనేకమైనటువంటి పండినటువంటి పళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ పళ్ళల్లో ప్రధానంగా శుకదేవుడు తాకినటువంటి అనుభవించినటువంటి అనుభూతి చెందినటువంటి ఈ భాగవత రసఫలం ఏదైతే ఉన్నదో దానిని మానవ జీవన ప్రవృత్తితో సాధకుడి యొక్క మనో ప్రవృత్తితో చిత్త యోగంతో అనేకమైనటువంటి స్థాయిలలో విచారణ చేసుకోవలసి ఉన్నది. కేవలం పౌరాణికంగా ఒక కథగా మనం గనక భాగవతం చెప్పుకున్న ట్లయితే అది కొంత ఆనందాన్ని ఇస్తుంది తప్ప పూర్ణానందాన్ని అది ఇవ్వలేదు. ఇవ్వాలి అంటే ఒక సాధనా మార్గంలోకి మన మనస్సును ప్రవేశపెట్టాలి. అహంకార మమకార రాహిత్యాలు లేని ఒక స్థితిలో మనస్సుని ఒకచోట నిలకడ చెందించాలి. ఏది రాని ఏది పోని ఏ దుఃఖం మన హృదయాన్ని తాకని మనస్సును ఉప్పొంగనియని కుంగదీయని ఒక నిశ్చలమైనటువంటి దీపకళిక వలె సాధకుడు అన్నివేళలా ఆత్మ నిష్ఠ లో ఉండాలి అని పరమ చరమమైనటువంటి పూర్ణాద్వైత బోధన చేసేదే భాగవతం. కాబట్టి భాగవతం అంటే నలుగురు భక్తుల కథలు భక్తుడి నాలుగు మహిమలు కాదు అది కాలం చెల్లగొట్టుకునేటువంటి వ్యవహారం అలా కాకుండా అంతరార్థంలోకి వెళ్ళాలి అంతరార్థం లేకుండా విశ్వనాథవారు అన్నట్టు లోకాన్ని వీడి రసం లేదు ఉన్నదంతా ఇక్కడే ఉంది అనుభవించగలిగితే అందుకోగలిగితే. ఈ అనుభవించటానికి అందుకోవటానికి మాత్రమే మానవ జన్మ మనకివ్వబడింది గనుక పరమోత్కృష్టమైన మహోన్నతమైనటువంటి ఈ మానవ జన్మని సాఫల్యం చేసుకుంటూ సత్యసాయి భగవానుడి దివ్య అనుగ్రహ విశేషం చేత ఈ భాగవతం చదువుకుంటున్నాం అనుకుంటున్నాం మాఘమాసంలో అనుకుంటున్నాం. ఓ రోజు ఊరికే చటాలన మనసులో మీరంతా బ్రహ్మాండంగా భజన చేస్తుంటే రోజు ఆనందం కలుగుతుంది. ఈ ప్రకాశ్ రావు గారు ఎప్పుడన్నా ఈ ఆగస్టులో గా మన దగ్గరికి ఒకసారి వస్తే బాగుండు అనుకున్నా ఊరికే. ఎప్పుడు రావాలి ఆయన వస్తే తొమ్మిదో తారీఖు రావాలి లేకపోతే పదిహేడు రావాలి ఇక్కడేం పని లేదు అప్పుడు. ఇవ్వాళ చాలా సంతోషం ఏమిటంటే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య సన్నిధానంలో స్వామి యొక్క సంతోషానికి స్వామి యొక్క ఆనందానికి కరుణా స్ఫురితమైనటువంటి ఒక దివ్య భావనకి ఒక భక్తుడు ఎట్లా ఉంటాడు అంటే కథలన్నీ పక్కన పెడితే ప్రకాశ్ రావు గారు ఒక సద్భక్తుడు. ఎందుకని చెప్తున్నాను అంటే ఒక నాటకం వేసిన తర్వాత స్వామి దగ్గరికి ఆయన్నే పిలిచి ఇది ఎవరు రాశారు అని అడిగారు. అంతకంటే విచిత్రం ఉంటుందా ఈయన ఏం చెప్పాలి అంటే నేను రాశాను స్వామి అది కూడా తెలియదా మీకని అనాలి. స్వామి మీరు రాశారు అన్నారు. నువ్వు ఎప్పుడూ అదే ఆ భావనే మనసులో పెట్టుకొని రాస్తావ్ అందుకే అన్నీ అంత బాగుంటాయి స్వామికి ఎంతో ఇష్టం అన్నారు. చాలు [ద M hands clapping] చాలు ప్రకాశ్ రావు గారికి జ్ఞానపీఠ అవార్డులు అక్కర్లేదు భారతరత్న అక్కర్లేదు. పరమాత్మకి ఆనందం కలిగించే జీవితం మనం జీవించాలి. ఆ అవకాశం ఆ యోగం ఎలా కలుగుతుంది అంటే ఇదిగో ఇది. భాగవతం చెప్పుకుంటే భగవంతుడు దిగి రాడా అంటే మరి భగవంతుడే దిగి వచ్చినట్టే. వస్తూ ప్రకాశ్ రావు వెళ్ళు అక్కడ కాసేపు రెండు భజనలు పాడరా అన్నట్టుగా వచ్చారు ఇవ్వాళ. ఆయన ఊళ్లో ఉన్నట్టే నాకు తెలియదు. చాలా సంతోషం.పరమ భాగవతోత్తములైనటువంటి అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులే ఎవరి ప్రజ్ఞ వారిది ఎవరి యోగం వారిది ఎవరు సంకల్పించవలసింది సమర్పించవలసింది ఎవరి చేతిలో ఉన్నదంతా ప్రజ్ఞనంతా పరమేశ్వరాయత్తం చేయాలి మనం పదే పదే కొన్ని మాటలు అనుకుంటూ ఉంటే అవి హృదయంలో నిలబడి పోతాయి గనుక భాగవతాన్ని మనీషాయత్తం చేసి అనాలి మనీషాయత్తంతో వినాలి మనీషా అంటే స్థిరమైన స్థిమితమైన సంస్థితమైనటువంటి ఒక ప్రజ్ఞాన భూమిక ఆ ప్రజ్ఞాన భూమికలో పరమేశ్వరుడిని గనక మనం ఉపాసనా మార్గంలో అంటే ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి మార్గంలో ఉండి ఆయన నామ రూప గుణ వైభవ సమ్యక్ సంకీర్తనం గనక చేసుకోగలిగినట్లయితే అది సమ్యక్ దర్శనానికి చిట్టచివరకి ఆత్మను ఎరుగు ఎరుకలోకి తీసుకు వెళుతుంది గనుక ఆ దివ్యానుభవంలోకి మనం ప్రవేశిద్దాం. దిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం ప్రసమాలయం ముహురహో రసికా భువి భావుకా ఈ లోకంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భావనలతో భావుకత్వం ఉండాలి ఆ భావుకత చాలా subtle గా ఉంటుంది మనలో ఆ artistic element అంటాం అది లేకపోయినట్లయితే జీవితం అంతా కూడా ఒకటి ఎడారి బండరాయి దానిని అనేకమైనటువంటి లలితకళా విన్యాసంగా దానిని తీర్చిదిద్దుకోవాలి. ఒక్కొక్క కథని సాంగోపాంగంగా ఒక సౌందర్యలహరిలా పరమేశ్వరానుగ్రహం చేత ఒక శివారందలహరిలాగా ఆ భాగవతాన్ని కూడా అంతర్భూతమైనటువంటి విచార ధారలోకి మనం వెళ్ళాలి. సత్యవతి ఉపాసన అంగవతి ఉపాసన అన్యవతి ఉపాసన నిదానవతి ఉపాసన అనేటువంటి నాలుగు ఉపాసనా మార్గాలలో సత్యవతి ఉపాసన అంటే ఉన్నదంతా సత్యమే ఇక్కడ మాయ లేదు మిధ్య లేదు ఈ ప్రపంచం ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క దివ్య లీలా విలాసం గా భావించగలిగితే అది సత్యవతి ఉపాసన లోకంలో ఉంటూనే లోకంతో ఉంటూనే లోకోత్తరమైనటువంటి పరమాత్మ యొక్క భావనను మనం అందుకోగలిగితే అది సత్యవతి ఉపాసన అంగవతి ఉపాసన అంగాంగ భావంతో ఉన్నటువంటి ఒక బొమ్మగా ఒక ప్రతిమగా ఒక రూపంగా ఒక సగుణంగా ఒక స్వభావంగా గనక పరమాత్మను విచారణ చేసుకోగలిగితే అది అంగవతి ఉపాసన. నీ కళ్ళు బాగున్నాయి నీ కాళ్ళు బాగున్నాయి నీ చేతులు అందంగా ఉన్నాయి పరమేశ్వరా అంటే అది ఒక ఎత్తు అన్యవతి ఉపాసన ఎప్పుడూ ఆయన అట్లాగే లేడు ఎంత సాకార స్వరూపమో అది నిజానికంత నిరాకార నిగుడ పరబ్రహ్మ తత్వం కాబట్టి అన్యవతి ఉపాసన కూడా మనం చేసుకోవాలి. ఈ బొమ్మ అక్కరలేని స్థాయికి మనం ఎదగాలి బొమ్మని పట్టుకుంటూ ఉన్నట్లయితే ఒక్క బొమ్మే మన మనసులో నిలబడిపోతుంది పరమాత్మకి ఇదే బొమ్మ ఇదే ఈశ్వరుడి బొమ్మ ఒక్కటేనా ముప్పది ముక్కోటి దేవతల సర్వ సృష్టిలో ఉన్న ప్రతి అణువు కూడా ఆయన యొక్క స్వరూపమే ఆయన యొక్క తత్వమే కాబట్టి అన్యవతి ఉపాసన కూడా దాటి నిదానవతి ఉపాసనలోకి మనం ప్రవేశించాలి. ఆ నిదానవతి ఉపాసనే మనం చేసుకున్నటువంటి ఈ భాగవత నవనీతమైనటువంటి ఉపాసన మనస్సును మధించాలి హృదయాన్ని దానికి జోడించాలి పరమేశ్వరుడిని రప్పించుకోవాలి దగ్గర పెట్టుకోవాలి పరమేశ్వరుడితో కూడి ఉండాలి జీవ ప్రజ్ఞని దైవ ప్రజ్ఞతో అనుసంధానం చేయాలి ఈ లోకాన్ని లోకలోకాంతర ప్రాణాలలోకి ప్రవేశిస్తూ పరమేశ్వర సన్నిధానంలో నిలకడ చెంది బలివంటి ఒక రాక్షస రాజు తాను విశ్వజిత్ యాగం చేసి తాను సంపాదించుకున్నటువంటి సంపదనంతా కూడా మలినాళ్లలో ఎన్ని దాన కార్యక్రమాలలో దయాగుణం చేత దానవీరం చేత ఎంత సుప్రసిద్ధుడయినాడో ఎంత పుణ్యశ్లోకుడయినాడో పరమాత్మ అనుగ్రహానికి ఎంతగా పాత్రుడయినాడో మనకు విశదీకరించేదే వామన చరిత్ర. వామన చరిత్రలో నిన్న వామనుడు పుట్టాడు పుట్టాడా పుట్టడమే కాదు ఆయన ఉపనయనం కూడా అయిపోయింది. ఆ ఉపనయనం అయిపోయిన మరుక్షణం భిక్ష ఎవరు వేశారు కుబేరుడు వేశాడు భవాని అమ్మవారు వచ్చి వేసింది ప్రథమ భిక్ష అంటే ఆమె జగజ్జనని గనుక లోకమాత గనుక సర్వలోకమాత గనుక ప్రథమ భిక్ష ఆమె వచ్చి స్వయంగా ఆయన జోలెలో వేసింది. ఎప్పుడైతే ద్విజత్వం వచ్చిందో ఉపనయనం జరిగిందో ఉపనయనం అంటే ఒడుగని మాత్రమే కాదు మెళ్ళో జంజం వేసుకోవటం మాత్రమే కాదు కంటికి కనిపిస్తున్న ఈ రెండు నయనాలకు దగ్గరగా ఉన్నది ఉపనయనము అంటే మూడవ కన్ను third eye అది ఒక రుద్రుడికే లేదు జీవుడికి కూడా ఉంది. అయితే రుద్రుడు రుద్రుడు గనక మూడవ కన్ను తెరిస్తే అంటే ఆయన సగం తెరిచే ఉంటాడు సగం మూసే ఉంటాడు ఎందుకని అంటే ఆ సగం తెరచి ఉన్నవేళ సృష్టిని ఆలోకిస్తూ ఉంటాడు ఆ సగం మూసి ఉన్నవేళ ఇవాళ ఇక్కడ నుంచి ఎంతమంది జీవులు తనకు చేరాలో వాళ్ళందరినీ చేర్చుకుంటాడు ఎంతమంది చేరారో అంతమందిని మళ్ళీ రాత్రికి రాత్రి మనకు తెలియకుండానే balance చేస్తాడు కనుక అర్ధనిమీలిత నేత్రమైనటువంటి ఆ రుద్రుడు యొక్క మూడవ కన్ను ఉపనయనంగా మనం భావించినట్లయితే ఆ ఉపనయనం అందుకే ఇక్కడ తిలక ధారణ చేస్తాం ఆ తిలక ధారణ అంటే ఆజ్ఞాచక్రం ఒకటి మన కనుబొమ్మల మధ్య ఉన్నదని మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల దగ్గరకు వచ్చినప్పుడు అనేక దర్శనాలు కలుగుతాయని దూరదర్శనము దూర శ్రవణము ఒక అల్పమైనటువంటి సిద్ధులు మాత్రమేనని రేపు జరగబోయేది ఈరోజే స్పురణకు వస్తుందని అనేకమైనటువంటి ఈ సిద్ధులన్నీ కూడా జీవుడు తన అధ్యాత్మ యోగంలో తనను తాను నివృత్తి చేసుకోవటానికి.తనను తాను స్వభావంలో నడిపించుకోవటానికి, తనను తాను మాధవత్వంలో సంయోగం చెందటానికి అనువైనటువంటి సన్నివేశం ఇక వామనుడు వచ్చాడు. ఇదిగో ఉపచారం అయిపోయింది అంతా కూర్చుని ఉన్నారు. అవగానే పరమేశ్వరుడికి మనలాగా వందేళ్ళు వెయ్యేళ్ళు ఉండాలని ఏం ఉండదు ఇక్కడ. కాల, కార్య, కారణ, కర్తవ్య ఈ నాలుగింటికి లోబడే ఆయన వస్తాడు. ఏ కారణం వల్ల వచ్చాడో, ఆ అది ఎప్పుడు చేయాలో ఆ కాలం ఆయన అధీనమై ఉంటుంది గనుక ఒడుగైనటువంటి రోజు యజ్ఞ వేదిలో ఒక హవిస్సుని సమర్పించి యజ్ఞ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి వామనుడు అంటే ఈ వటుడు అక్కడ ఉన్నటువంటి అనేక దేశాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులను ఉద్దేశించి ఓ మాట అడిగాడు. అనేక దేశాలు అంటే అనేక ప్రదేశాలని అర్థం, అనేక ప్రాంతాలు. ఎందుకని వచ్చారు? ఈయన ఎవరో వటువు కదా! ఒక చిన్న పిల్లవాడు. వీడికి ఒడుగు జరిగింది. అన్ని దేశాల నుంచి ఎందుకు వచ్చారంటే, వచ్చిన వాడు సామాన్యుడా? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళు! కశ్యపుడు, అదితి. కశ్యప మహాముని దర్శనం ఈ విధంగా కూడా అవుతుంది కదా. మన ఇంట్లో అమ్మాయి పెళ్ళికి వచ్చారంటే అమ్మాయి ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ రకంగా మనందరం కలుసుకోవచ్చు కదా అని మనం కలిసినట్లుగా అలాగే ఇక్కడ కూడా ఆయన వీళ్ళందరినీ కూడా అడిగాడు. ఏం అడిగాడంటే, అడగవలసిందే అడిగాడు చూడండి. ఆయన ఎందుకు వచ్చాడు? కథ తెలుసు గనుక దాంట్లో సస్పెన్స్ లేదు. మూడు అడుగుల నేల అదే, అది మనసులో ఉన్నది. కానీ దాన్ని ఎంత అన్యాపదేశంగా అడిగాడో చూడండి. ఆ విచారణ శిల్పం అంటాం దాన్ని సాహిత్య పరిభాషలో. ఉత్తరే విప్రులు వేడగ ఇత్తురే దాతలు వేక ఇష్టార్థములన్. వస్తారా? ఎవరైనా వచ్చి ఇష్టార్థం అడిగింది ఇచ్చేటువంటి దాతలు ఈ ప్రపంచంలో ఉన్నారా అని. ఇది చాలా ప్రధానమైనది. మనం అడిగింది ఇంకొకడు ఇస్తే అది మనకు ఉపయోగం. వాడికి అక్కరలేనిది మనకిస్తే మనకు భారం. అది దానం అంటే అడిగినది ఏం అడిగితే అది ఇవ్వాలి. అది ఇట్లా అసలు అడగటమే చూడండి. చతుర మీరును సంపద ఇతరగుణ దానవీరులెవరో చెపుడో. ఇక్కడ దానవీరులు ఎవరు అని అడిగాడు. అడుగుతున్న వాడు ఎవడో తెలుసునా? దయావీరుడు అడుగుతున్నాడు. దయావీరుడు అయినటువంటి పరమాత్మ వామనుడు దానవీరుడు ఎవడు అని అడుగుతున్నాడు. నిజానికి అదితి కశ్యపుడు అయ్యవారిని ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థన ఏమిటి? నీవంటి కొడుకు మాకు కావాలి అని అడిగాడు. దానికి నారాయణమూర్తి సమాధానం ఏమిటి? నావంటి వాడు మరొకడు లేడు గనుక నేనే మీ కడుపున పుడతా, అది. నావంటి వాడంటూ ఒకడు ఉంటే ఆయన ఉనికేముంది? లేడు ఇంకొకడు. అందుకనే అది అద్వైతంగా ఉంది, అద్వయంగా ఉంది. అక్కడే పోతనామాత్యుడు చెప్పాడు, పరమాత్మ ఎప్పుడూ అన్నివేళలా అన్ని అవస్థలలో ఒంటరివాడు అని. ఆ ఒంటరితనం అంటే ఒక్కడు అని కాదు, అంతా తానైన వాడు అని అర్థం. అప్పుడు ఆ ఒడుక్కు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా, మరి ఆయన అడిగాడు గనుక చిన్న పిల్లవాడు అడిగినా సమాధానం చెప్పాలి. కలరున్ దాతలు ఇత్తురున్ ధనముల్న్ కామ్యార్థముల్ కొంచు విప్రులు ఏతెంతురు గాని. ఉంటుంది డబ్బున్న వాడున్నాడు, దానాలు చేసేవాళ్ళున్నారు లేకుండా ఎక్కడున్నారయా? ఉన్నారు. కానీ, ఈవిని దానం చేయటంలో బలింబుొలన్ వదాన్యుండు లేడు అలభుండై వనరించే అద్వరశతంబు ఆ భర్గవానుజ్ఞచే బలివేడన్ బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామన. ఇప్పటికే వాడు వంద యజ్ఞాలు చేసాడయ్యా! దానం చేయటంలో బలిని మించిన వాడు లేడు. నీకేం కావాలంటే ఆయన్ని గనుక అడిగితే ఆయనే అన్నీ సమకూరుస్తారు అని బలివైపు దారి చూపించారు విప్రోత్తములు. అంటే వాళ్ళు పురోహితులు. పురోహితులు అంటే పెళ్ళళ్ళు జరిపించేవాళ్ళు, మిగతా వాళ్ళు కాదు. తమ ఉనికి చేత, తమ నిష్ఠ చేత, తమ జీవన విధానం చేత సమాజానికి మార్గ నిర్దేశనం చేసేవాడి పేరు పురోహితుడు. కానీ వాళ్ళ పురోహితుల స్థాయి అట్లా లేదు, మారిపోయింది. పురోహితం కోరేవాడు పురోహితుడు. అప్పుడు నెమ్మదిగా ఆయనకు ఆనందం కలిగించింది ఎవడో చెప్పాలి. లోకంబులకు ప్రీతిపుట్టింప దానం ఎందుకు అడగబోతున్నాడు అంటే తనకు మూడు అడుగులు కూడా అక్కర్లే. ఎందుకంటే తనది కానీ మూడు అడుగులు ఏదన్నా ఉంటే ఎవడినన్నా అడిగి తెచ్చుకోవచ్చు. ఆ మూడు అడుగులు కూడా ఆయనవేగా! స్వామి అంటారే, త్యాగం చేశాను త్యాగం చేశానని చెప్పుకుంటారు ఎందుకు బంగారు? ప్రవహించే నదీల జలాలలో మీరు నుంచున్నారు. నుంచని వంగారు. మోకాళ్ళ వరకు, శీలమండలం వరకు తడిసిందో అయింది. ఆ ప్రవహిస్తున్నటువంటి ప్రవాహంలో నుంచి నీళ్ళు తీసుకున్నారు. సూర్యుడికి చూపించారు, మళ్ళీ నీళ్ళల్లో వదిలిపెట్టారు. నీదేమిచ్చావప్పా అని అడిగాడు, అది. మనదేదో ఇవ్వాలి, అది దానం. మన దగ్గర ఉన్నది ఇవ్వటం కాదు, అవతల వాడికి కావలసిన, అవతల వాడి దుఃఖాన్ని, అవతల వాడి అననుకూలతని, అవతల వాడి యాతనని గమనించి గనుక ఇవ్వగలిగితే అది పరమోత్కృష్టమైనటువంటి దానంగా చెప్తూ, లాభవచనంబులు గైకొనుచు తల్లిదండ్రులను వీడ్కొనుచు శుభ ముహూర్తంబున వెళ్ళాడు. నెమ్మదిగా ఈ మూడు చూశాడు. దీని వెనుక ఉన్నటువంటిది ఏమిటంటే లోకానికి సుఖం కలగాలి. తాను అడగబోయేటువంటి ఆ మూడడుగుల నేల వల్ల. ప్రక్షీణది విజవల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాంక్షుండు ఆ క్షణమున బలిఇంటికి భిక్షాగమనంబు చేసి పెద్దరికముతో హరి హరి! ఆశ్చర్యం వేస్తుంది. ఆయన లక్ష్మీసనాథుడు కదా! ఎటువంటి వాడికి ఎటువంటి లోక దృష్టితో చూస్తే యాతన కదా! లక్ష్మితో కూడి ఉన్న నారాయణుడు వామనావతారమెత్తి మూడు అడుగుల కోసం బయలుదేరాడా అని ఒక చమత్కారం.ఆయనే తలుచుకుంటే బలిని అక్కడి నుంచే సంహారం చేసి అన్ని లోకాలు జయించి ముందే చెప్పాడు. బలి వంటి రాజులను జయించటానికి యుద్ధం కాదు యుక్తి ప్రధానం అన్నాడు ఆయన. ఈ అవతారంలో యుక్తి అనేటువంటి ఒక శక్తితో బలిని కలుషం చేసుకున్నాడు. లేకపోయినట్లయితే సంకల్ప మాత్రంతో ఆయన కూడా చేయగలడు. సిరివురము నగల హరి హరి హయు కొరకు దనుజుం అడుగంచనియన్ పరహిత రతిమతి యుతులగు దొరలకు అడుగుటయు ఒడలి తొడవగు పుడమిన్ లోక కళ్యాణం కోసం గనుక ఎవరైనా ఎవరినైనా ఏదైనా అడిగారు అంటే ఆ పుడమి పులకరిస్తుంది. ఆ పుడమి ఎప్పుడూ ఆనందిస్తుంది అని అంటూ సర్వ దేవతలు కూడా ఆ వామనుడి యొక్క గమనాన్ని చక్కగా చూసుకున్నారు. ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే నర్మదా నది తీరంలో ఉన్నాడు. బలి రాజు గాని, ఋషి గాని, ఒక కవి గాని, అర్చా మూర్తులు గాని, అవతార మూర్తులు గాని వీళ్లంతా కూడా ఒక నదిని ఆశ్రయించి ఉంటారు. నది పక్కన ఉంటారు. కాశీలో గంగ పక్కన విశ్వనాథుడు, సరయు నది పక్కన శ్రీరామచంద్రుడు, యమునా నది పక్కన శ్రీకృష్ణ పరమాత్మ, గోదావరి పక్కన శ్రీనివాస సాయిబాబా, పెన్నా నది పక్కన శ్రీరంగనాథుడు, కావేరి పక్కన సదాశివ బ్రహ్మేంద్రుడు, చిత్రావతి పక్కన సత్య సాయి భగవాన్. లెక్క దేలిపోయిందిగా! వాళ్ళకి నది ఉండాలి ఎందుకంటే నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సంస్కృతి ఉంటుంది. అక్కడ నాదరకత ఉంటుంది. అక్కడ పంటలు ఉంటాయి. అక్కడ అందరూ కడుపు నిండిన వాళ్ళు, నిండవలసిన వాళ్ళు చేరితారు కాబట్టి అటువంటి చోట ఉంటారు. అలాగే ఈయన నర్మదా నది తీరంలో ఉన్నాడు. ఉంటే దానవేంద్రుడి యొక్క యజ్ఞ వాటిక లోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. ఆయనకు తెలుసు ఎలా వెళ్ళాలో ఆ map route map ప్రకారం వెళ్ళాడు. వస్తుంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఆ వామనుడు "సంభుందో హరియో పయోజభవుడో చండాంశుడో వంహియో దంభాకారత వచ్ఛకాక ధరణిం ధాత్రీసురుండు ఎవ్వడి శుంభజ్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించెడి బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబు నన్" బొమ్మ కట్టినట్టుగా రాసాడు పోతన. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారట. ఈ భూలోకంలో ఇంత అందమైన ఒక బ్రాహ్మణ బాలకుడు ఎవడు వీడు? వీడు శివుడా? వీడేమైనా విష్ణువా? లేకపోతే ఫలానా వాడా? ఫలానా వాడా? ఇంత తేజస్సుతో అగ్ని స్వరూపంగా వస్తున్నాడు ఏమిటి? వస్తున్నాడు అసలు ఆయన నారాయణ మూర్తి అప్పుడే ఉడుగు చేసుకున్నాడు. కాళ్ళ పాడం ఉంది, ముగ్గున చుక్క ఉంది. ఆయనకు ఉండవలసిన లక్షణాలన్నీ సర్వ సల్లక్షణంగా ఆయన వస్తున్నాడు. వాళ్ళకి ఆనందం కలిగింది. "గుజగుజలు ఓవువారు గజిబిజి పడువారు" చెవుల దగ్గర కూర్చుని గుసగుస, గుజగుజ అంటే గుసగుస. గుసగుసలాడే వాళ్ళు కొంతమంది. గజిబిజి పడేవాళ్ళు ఎవరు? ఎవడు? ఈ time లో ఇలా ఎవడు? వీడు ఎవరు? మనం పిలవలేదు ఎలా వచ్చాడు అని. "చాల కలకల పడుచున్ గజిబిజి అయిరి సభాస్థలి ప్రజలెల్లను పొట్టి వడుగు బాపని రాగన్" పొట్టిగా ఉన్నాడాయన. బ్రాహ్మణ బాలకుడు, వామనుడు చిన్నవాడు ఎవడు అని అంటే సభా మండపానికి దగ్గరకు వచ్చాడు. రాగానే ఆయన ఎంత అందంగా ఉన్నాడో చూడండి. ఆయనేదో వచ్చాడు direct గా బలి దగ్గరికి వెళ్లి నాకు మూడు అడుగులు నేల ఇస్తే తీసుకుపోతాను అనలే. acclimatize అవుతున్నాడు. ఆ ఉన్న వాళ్ళందరితో పరిచయం పెంచుకుంటున్నాడు. ఎందుకంటే అసలు ఆయన వచ్చింది బలి కోసం కాదు, మూడు అడుగులు నేల కోసం కాదు. యజ్ఞ కార్యక్రమాలలో ఉన్నటువంటి యాజ్ఞీకులందరికీ ఆయన దర్శనం ఇవ్వదలుచుకున్నాడు. దర్శనం ఇవ్వాలి, మాట్లాడాలి, వాళ్ళందరినీ తాకాలి, వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వాలి అందువల్ల ఆయన వచ్చాడు. దర్శన, స్పర్శన, సంభాషణలు ఏకకాలంలో వీళ్ళు పొందటానికి అర్హత ఉంది గనుక "చెవులుగా చెవులకు సమగానంబులు చదువుగా తలచదువు వినుచు మంత్రతంత్రార్ధ సంబంధ భావములు పేర్కొడి హోటలతోడ కూడికొనుచు హోమగుండంబులందున్న తేతాగ్గుల వెలిగించు యాజకవితతి గనుచు దక్షులై బహువిధా అధ్వరా విధానంబు చెప్పెడి సభ్యుల చేరదనుచు పెట్టుగోరడి వేడుక పట్టుపరచు అదితి పుట్టువు లచ్చికీ ఆటపట్టు" వీడేదో అదితి కొడుకు అని అనుకోకండి. అసలు వీడు లచ్చికే ఆటపట్టు అన్నాడు ఆయన. లచ్చి అంటే లక్ష్మీదేవికి. "కోరి చరియించె సభలోన కొంత తడవు పుట్టువెన్నడు ఎరుగని పొట్టి వడుగు" అసలు పుట్టవే లేని ఆ పొట్టి వడుగు అందరితో వేదం చదివేవాళ్ళు, యజ్ఞం చేసేవాళ్ళు, సమస్యలు విడల్చేవాళ్ళు, తత్వార్థ విచారణ చేసేవాళ్ళు, వేదార్థ రహస్యాలు ఒకళ్ళొకళ్ళు పంచుకొని సంభావించి, సంభాషించి, సంవాదన చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ దగ్గరకు వెళ్ళి కోరి చరియించాడు. ఇదిగో రా అన్నీదు వెళ్ళాడు. వెళ్తే "విరచుచు వంగుచు వాలుచు అరిముడి కుబురులకు చనుచు హరి హరి యనుచున్ మరగుచు ఉలుకుచు తిరతిర కురుమట్ట పొట్టి వడుగు కొంత నటించెన్" పరమేశ్వరుడు నటవరుడు. ఆయన వీళ్ళకు అందుతాడా? ఈయన ఎవరో ఫలానా అని తెలుసుకునేలోగా అనేక రీతులలో తన శరీర విన్యాసాన్ని చూపిస్తూ ఆ యజ్ఞశాలంతా కూడా ఆవరించి ఉన్నాడు. వెడ వెడ అన్నాడు, ఎక్కళ్ళున్నాడు ఆ చూచు ఒకచోట గబగబా నడుస్తున్నాడట.వెడ వెడ అడుగు ఇడగా అడరి ఇలా దిగబడగా బుడి బుడి ఒడుగులు ఒడువుచు చిడి బుడి తడతడ వడుగు పేరిన్ సేరిన్ రాజున్ అలా నడుస్తూ నడుస్తూ పరిగెత్తుతూ ఆగుతూ మందగమనంతో మంద్ర గమనంతో గంభీరమైన గమనంతో శరీరాన్ని వంచుతూ శరీరాన్ని నిభృత శరీరం చేస్తూ నిభృత శరీరం అంటే perpendicular గా నేలకి తొంబై డిగ్రీలు correct గా కూర్చోవాలి అది యోగ విద్యలో ప్రధానమే నిభృత శరీరేహి అంటారు శంకర భగవత్పాదులు అలా ఉన్నప్పుడు ఆ చక్రాలన్నీ కూడా activate అవుతాయి అలా వంగిపోయి కుంగిపోయి ఆ నడుం ఊడిపోయి అట్లా కూర్చో నిభృత శరీరులై కూర్చోవాలి అది అది practice వల్ల వస్తుంది అప్పుడు రక్షోవల్లభుణ్ణి చూసి అంటే రాక్షస వల్లభుణ్ణి బలిని చూసి ఇతడే దానవ చక్రవర్తి సురలోక కేంద్రాగ్ని కాలాదిది కృతి గర్వాపనయ ప్రవర్తి గత లోభ స్ఫూర్తి నానాసుఖ వ్రత దాన శ్రవణానువర్తి సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రార్పక కీర్తి సత్య కరుణా ధర్మోల్లసన్మూర్తి అంతా ఆ బలి చక్రవర్తిని గురించి బలిని చూడగానే వామనుడికి కలిగిన దివ్య భావాలు చూడండి వాడు ఏ వంశంలో పుడితే ఏ రాక్షసుడిగా పది మంది వాడి చుట్టూ ఉంటే వాడు వాడిగానే ఉన్నాడు వా-అందుకనే ఫలానా వాడు గొప్పవాడు మంచివాడు అంటే వాడి గుణమే అవన్నీ తెచ్చిస్తుంది గుణం లేని వాడికి ఎంత సంపద ఉన్నా వ్యర్థమే గుణం లేని వాడికి ఎంత చదువు ఉన్నా వ్యర్థమే గుణం లేని వాడికి ఎంత కీర్తి ఉన్నా వ్యర్థమే కాబట్టి కావాల్సింది ఏమిటంటే గుణం కావాలి ఏ గుణం కావాలంటే రజో తమో గుణాలు దూరమైన సత్వగుణం ప్రధానంగా ఉండాలి అది పొందాలి అంటే మార్గం ఏమిటంటే భక్తి యోగమే ఉత్తమ మార్గం అది
SSSMC · audio
Bhagawata Navaneetham - 39
Bhagawata Navaneetham - 39
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 26:26
More in this series