No transcript for this section.
సౌందర్య సార సర్వస్వమా, సౌందర్య సార సర్వస్వం. మందస్మిత మనోహరం. వందారు జనమందారం, వందే సాయి మహేశ్వరం. ప్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం, మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం, నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాత్. పరమ మహేశ్వర స్వరూపుడు, సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ, కుశ పవిత్రాక్షత సంతు సంయుతం బగు దక్షిణ హస్తంబు నెత్తి, దర్భలు తీసుకున్నాడు. తీసుకొని కుడిచెయ్యి ఎత్తాడు. ఎత్తి ఆ వచ్చినవాడు నారాయణమూర్తి. మామూలుగా ఓ బలిచక్రవర్తి ఎట్లా ఉన్నావ్ అంటాడా, స్వస్తి చెప్పాడు. ఆ స్వస్తి చెప్పటంలోనే పరమానందంగా పరమేశ్వరుడి యొక్క మనస్సే ఉల్లాసం కలిగింది. బలిని చూడగానే, మనకి చూడండి భగవంతుణ్ణి చూడగానే మనకు ఆనందం ఎలాగూ కలుగుతుంది. కానీ మనల్ని చూసినప్పుడు కూడా భగవంతుడికి ఆనందం కలిగితే అది విశేషం. కలుగుతుంది, ఎప్పుడంటే ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తే కలుగుతుంది లేకపోతే కలగదు. పాండిత్యం చేత, కవిత్వం చేత, పాటల చేత, మాటల చేత ఆయనని పొందలేము. ఎలా పొందగలం అంటే ఒక్క గుణం చేత మాత్రమే ఆయనకు దగ్గర కాగలం. అలా అయినాడు బలి. కనుకనే స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు, హాస మాత్ర విధ్వంస నిలింప భక్తకు, ఉదార పదో వ్యవహర్త కున్ మునీంద్ర స్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్ఝరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవ లోక భర్త కున్. రాక్షసరాజు అయినప్పటికీ కూడా ఇటువంటి వాడివి, అందరి చేత కీర్తింపబడే అటువంటి వాడివి. ఓ బలి, బలిచక్రవర్తి అని దీవించి వేదరాశిలో ఉన్నటువంటి ఒక పూర్ణమైనటువంటి తేజోస్వరూపంగా బలికి వామనుడు దర్శనం ఇచ్చాడు ఆ క్షణంలో. నిజ రూప దర్శనాన్ని ఇచ్చాడు. పైకి వటువుగా అందరికీ కనిపిస్తున్నా, బలి పొందినటువంటి ఆ దర్శనం మాత్రం సుదర్శనం. ఎట్లా సుదర్శనం అంటే నిదర్శన పూర్వకంగా ఇచ్చాడు. ఆ నిదర్శన పూర్వకంగా ఇచ్చిన తర్వాత వాడు తక్కువ వాడు కాదు. ఏం చేశాడంటే కాళ్ళు కడిగాడు. పాదాలు ఒత్తాడు. ఓ లోపల్నుంచి ఒక బట్ట తెచ్చాడు. పాదాలన్నీ కూడా తడి ఆర్చాడు. అయ్యా! వటిని ప-పాద శౌచ వారి శిరంబున పరమ భద్రమనుచు బలి వహించే, ఏ జలము కిరీషుడు ఇందు చూడుడు దేవదేవుడు ఉద్వహించె ధృతి శిరమున. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పాదాలని అంటే వామన పాదాలని చక్కగా చేసి, ఆ నీళ్ళు పైన చల్లుకుంటుంటే ఆయనకి శివ దర్శనం అయిందట. ఎలా శివ దర్శనం అయిందంటే, శివుడి జటాజూటంలో ఉన్నటువంటి ఆ దివిజ గంగ, ఆ అంభువులు, ఆ నీటి బిందువులన్నీ తన చేత రాలిన ఒక స్పర్శ కలిగింది. వామనుడు, మన బలి చక్రవర్తి. చూస్తున్నది ఎవరిని? నారాయణుడిని. కలిగిన అనుభవం ఎవరితో? శివుడితో. ఎందుకని జరిగింది అంటే, కోతనామాత్యుడు శేవుడు. రాయవలసింది విష్ణువును గురించి రాయాలి. అందుకే ఆయన మనకు పై పైన చిన్న పద్యంగా కనిపిస్తుంది. ఫస్ట్ లైన్ చూడండి, చతురారంగ శివుని పూజింపడేని అన్నాడు. బానే ఉంది. నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని. నోరు నొవ్వంగ హరు కీర్తి అనలా ఆయన, హరి కీర్తి అన్నాడు. అంటే శివకేశవులకు అభేదం చెప్పుకుంటూ సాగించాడు ఆయన. కనుకనే ఇక్కడ చూస్తున్నది నారాయణ మూర్తినైనా, ఆయన కలిగినటువంటి ఆ అనుభవం మాత్రం చాలా గొప్పది. అప్పుడు అడిగాడు, అప్పుడు అడగాలి. ఆ శిరస్సు మీద నీళ్ళు చల్లుకొని, వడుగా ఎవ్వరి వాడవు? ఎవ్వడవు? సంవాస స్థలంబయ్యది, ఈ యడకున్ని వరుదంచుటన్ సఫలమయ్యెన్, నా వంశమున్ జన్మమున్, కడు ధన్యాత్ముడనైతి, నీ ఈ మఖము యోగంబయ్యె, నా కోరికల్ కడతేరెన్, సుహుతంబులయ్య శిఖలున్, కళ్యాణమిక్కాలమున్. అంత ఆనందం ఆ positive energy flow అయింది వాళ్ళకి. నువ్వు వచ్చినందువలన నా జన్మ కృతార్థం అయింది. నా శరీరం, నా జన్మ అన్నింటితో పాటు ఈ యజ్ఞం పూర్ణం అయిపోయింది. ఏ పరమాత్మ దర్శనం కోరి నేను ఈ యజ్ఞం చేస్తున్నానో, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చిన భావన నాకు కలుగుతున్నది. కానీ ఎక్కడి వాడివి? ఆ హోమగుండంలో ఉన్నటువంటి అగ్ని శిఖలన్నీ నీ దర్శనం కోసం తహతహలాడుతున్నాయి అన్నాడు. కాబట్టి ఇక్కడ కులం ప్రధానం కాదు, గుణమే ప్రధానం. వాడు రాక్షసరాజు అని కొట్టేయటానికి వీల్లేదు. రాక్షస వంశంలో పుట్టిన వాడి మనస్సు పరమేశ్వరాయత్తమై ఉన్నది. వచ్చాడుగా బ్రాహ్మణుడు అంతా, యజ్ఞశాలంతా వాళ్ళే కూర్చుని ఉన్నారు. కనుక ఈయన అనుకుంటున్నాడు. వరచలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో, హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో, కాంచనము వికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో, భాత్రీ సురేంద్రోత్తమా! నా దగ్గర ఉన్నటువంటి items అన్నీ ఇవి.మా ఊర్లో నా దేశంలో నా రాజ్యంలో ఉన్నవన్నీ ఇది list ఇవి కాక ఇవైతే ఎలాగో ఇస్తా నువ్వేం అడిగితే ఇందులోది ఇస్తా ఇది కాక ఇంకేదన్నా ఉన్నదా? చెప్పవయ్యా అని అడిగాడు. బాగా సంతోషించి ఏమన్నాడో తెలుసా? ఇది నాకు నెలవని ఏరీతి పలుకుదు ఒకచోట నక యెందు ఉండ నేర్తు ఎవని వాడనంచు ఏమని పలుకుదు నా అంత వాడనై నడవ నేర్తు. నీ నడవడి ఇదియని ఎట్లువ కాణింతు పూని ముపోకల పోవ నేర్తు. మూడు పోకలుగా వెళ్తా బ్రహ్మను నేనే విష్ణువును నేనే మహేశ్వరుడిని నేనే ఏం చెప్పను నేను ఫలానా అని మా ఊరు ఏదంటే నా కన్నీ ఊళ్ళు నావే. అది నేర్తు ఇది నేర్తు మని ఏల చెప్పంగా నేరుపులన్నియు నేన నేర్తు. అది నేరుస్తాను ఇది నేరుస్తాను వేదం చదువుతాను ఫలానా చదువుతానని ఏం అక్కర్లేదు అన్నీ నేనే నేర్చుకుంటా అన్నీ నాతోనే ఉన్నాయి. ఒరులు గారు నాకు నాకు ఫలానా వాడితో బంధవ్యం లేదు. వీళ్ళంతా నా వాళ్ళే అని అనుకోవడానికి ఏం లేదు కానీ ఒరులకు నేనొవ్వుదు మిగతా వాళ్ళందరికీ మాత్రం నేను కావాలి బంధం ఉంది నాకు మాత్రం ఎవరితోనూ లేదు. ఒంటివాడ నేను చుట్ట మొకడు లేడు సిరియు తొల్లి కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చి యుందు. సుజనులైన వాళ్ళ హృదయాలలో అప్పుడప్పుడు వెళ్తుంటా ఎప్పుడూ కాదట అప్పుడప్పుడు వెళ్తుంటే వాళ్ళ తపస్సు ఫలించాలి. కాబట్టి ఆ స్వామిని కూడా అడిగారు మనం అనుకుంటామే ఎక్కడ మీరు హాయిగా ఉంటారు కొడైకెనాల్లో వైట్ ఫీల్డ్ లో అదేంటి మరి ఇంకేదో ఆ ఊరా ఈ ఊరా అంటే భక్తుల యొక్క హృదయాలలో నేను హాయిగా ఉంటానన్నారాయన. ఆయనకు హాయినిచ్చే హృదయం మనకు వస్తే ఎంత బాగుండును అని కదా. ఈయన కూడా అదే చెప్తున్నాడు తేడా ఏం లేదు. అది అని మాయలో పడేయటం చూడండి ఇది చెప్పేసి తన తత్వం ఏమో తన మూలం ఏమో చెప్పాడు పట్టుకోగలిగిన వాడికి అని అట్లుండనిమ్ము దాన్ని నా పక్కన కాసేపు ఉంచు. జననాథ నీ మాట సత్యంబు సత్కీర్తితంబు కుల్హారంబు ధర్మయుతంబు కరుణానువర్తులు ఘనతత్వమూర్తులు గాని నీ కులమునందు కలుగరరు. ప్రహ్లాదుడు మీ తాత అంతకంటే భగవ భాగవతత్వముడున్నాడా? అటువంటి చోట ఇంకోడు ఇంకోడు ఎలా పుడతాడయ్యా? బంగారాన్ని వేస్తే బంగారమే వస్తుంది ఇనుము వస్తుందా ఇత్తడి వస్తుందా? అది బంగారం మీ వంశం. రణవీరులు వితరణవీరులు లేరు యుద్ధానికి భయపడే వాడు లేడు దానం చేయటంలో వెనక్కి వెళ్ళేవాడు లేడు అది మీ వంశం. ప్రత్యర్థులర్ధులు ప్రబ్బికొనిన దానశౌండ్యమున తనుపుదురు అధికులై మీ తాతలందరు మేటిమగలు. అటు రణంలో వితరణంలో మీ వాళ్ళు మేరు సమానులైనటువంటి వాళ్ళు. అయితే మీ కులంబునందు నెరయు ప్రహ్లాదుండు మెంతి చంద్రమాట్కి మేలిరుచుల ప్రతిత కీర్తితోడ భవదీయ వంశంబు నిరరాశి భంగి నెగడుతుండు. వంశాన్ని చక్కగా ఆశీర్వదించాడాయన ఎందుకని ఆశీర్వదించాడంటే ఆ వంశంలో ఒక్క ప్రహ్లాదుడు ఉన్నాడు మరి అదే వంశంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడా ఉన్నారుగా వాళ్ళ దోలికి పోలే పరమాత్మకి చెడుతో పని లేదు మంచితోనే పనుంది. అందుకే స్వామి చెప్తారు చూడండి ఎవరు నా ఆవరణంలోకి వస్తారో ఎవరు నన్ను పరమాత్మని భావిస్తారో అనుభవిస్తారో అలా నిలకడ చెంది ఉంటారో వారంతా కూడా ఇరవై ఒక్క తరాలను నేను కాచుకుంటాను అన్నారు స్వామి ఇచ్చిన అభయం ఇది ఇరవై ఒక వేళ మనం ఏదో కాసేపు వెళ్ళాం వచ్చామనుకుంటాం మన ఇరవై ఒక్క తరాలు స్వామి అధీనంలో ఉంటాయి అదే చెప్తున్నాడు ఈయన కూడా. తొలిమి ముత్తా మూడవ తాత అంటే ముత్తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు జేసి గదాయుధుడై భూతలంబున ప్రతివీరులందానక సంచరింప విష్ణుండు అంటే యజ్ఞవరాహ రూపంగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి అప్పుడలా చంపాడు ఎందుకంటే తనతో సమానమైనటువంటి వైరి శత్రువు లేడక్కడ కాబట్టి యజ్ఞవరాహ రూపంలో ఆయన వచ్చాడు. తద్భ్రాతయగు వాడికి ఒక అన్న ఉండేవాడు హిరణ్యకశిపుడు అది విని తన తమ్ముణ్ణి వీడు చంపుతాడు అని హరి పరాక్రమంబునకు ఆశ్చర్యంబు నల్ది తన జయంబును బలంబును పరిహసించి గ్రద్ధననుద్ధవిడి అర్ధమొదనుజమర్దను మందిరమున కుంచనియే. అప్పుడు శూలాయుధ హస్తుడై కాలాకృతి వచ్చుదనుజుంగని విష్ణుడున్ కాలజ్ఞత మాయాగుణశీలత ఇట్లని తలచ చిత్తములో నన్. అలా హిరణ్యకశిపుడికి కథ చెప్తున్నాడు ఎవరికి మన వామనుడికి. వాడికి తెలీదుగా వాడికి చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు ప్రహ్లాదుడు పెద్దవాడైపోయినాడు ఇది ముత్తాతల కథ మన ముత్తాతల కథ మనకి తెలీదు తెలీదుగా మనకెలా తెలీదో వీడికి కూడా తెలీదు ఎవడన్నా ఎక్కడన్నా రాస్తే చెబితే మన తాతో మన అమ్మమ్మో మన పూర్వీకుల గురించి రోజులో పావుగంటైనా చెబితే మనకు తెలుస్తుంది వీడికి అదే పరిస్థితి సరే ఆ వైష్ణవాళ్ళ యొద్ద వచ్చి అని ఆ కథంతా చెప్పాడు మనం చెప్పుకున్నాం. భగవాడు మడియ నోపును తెగడేమియు ఎదురు పడడే దేహధరులకున్ తెగిన యెడ పగరమీదను పణగొన తగదనుచు ఉడియ ప్రాభవ శక్తిన్ అని అంటూ అది అట్లుండనిమ్ము అంటాడు. ఇది స్వామితో కాస్త ప్రత్యక్ష పరిచయం ఉన్నవాళ్ళకి ఈ వామనుడి behaviour correct గా స్వామిలానే ఉంటుంది.మాట స్వామి చెప్తూ చెప్తూ సరే అది అట్లా ఉంచు అంటుంటారు. చెప్తూ ఉంటారు అది అట్లా ఉంచు తర్వాత ఏమి విశేషం అంటూ రెండో దాంట్లోకి. అలాగే వామనుడు కూడా చక్కగా హిరణ్యకశిపుడిని హిరణ్యాక్షుడిని గురించి చెప్తూ చెప్తూ అది అట్లా ఉంచంటూ ఏమన్నాడన్నాడు ఆతుర భూసురగతి పురుహుతాదులు తన్ను వేడనగి కొండెను చన్ మీ తండ్రీచ్చాయువు ఏతన్మాత్రుడవే నీవు ఈ లోకమునన్ ఏలితివి మూడు జగములు అందుకనే మొట్టమొదట అన్నాడు స్వస్తి జగత్రయీకర్తకు మూడు లోకాలకి నువ్వు రాజువి. ఈ లోకంలో మూడు లోకాలు ఇవ్వటం నీకు చాలు నువ్వు నువే రాజువి అడిగితే మూడు ఇస్తావని సూచన చేశాడు. కానీ బలి పట్టుకోలేకపోయినాడు. ఆ ఎప్పుడైతే జయకేతనం ఎగరవేశాడో అప్పుడే వాడికి అర్థమైపోవాలి మన మూడు రాజ్యాలు పోతున్నాయని. ఏలితివి మూడు జగములు తోలితివి ఇంద్రాది సురుల తొల్లిటి వారిం పోలిక దానగుణముల సోలితివి పిశాచ రాక్షసుల రక్షింపన్. మూడు రాజ్యాలు జయించావు కానీ నీకు లోభం గుణం లేదు. ఆ రాజ్యం వలన సంప్రాప్తించిన సంపదనంతా దానంలో ఖర్చు పెడుతున్నావ్. సరే అది అట్లా ఉండని చూడండి ఒక్కొక్కటి చెప్తున్నాడు అది అట్లా ఉండని అంటూ నెమ్మదిగా విషయంలోకి వస్తున్నాడు. రాజ్యంబు కలిగనేని పూజ్యులకును యాచకులకు భూమిసురరకుం భాగ్యముగ బ్రతుకడే నిన్ రాజ్యంబులు వాని జన్మ ధన గృహంబుల్. నీ దగ్గర ఉన్న సంపదని గనక సేవకి వినియోగించకపోయినట్లయితే వేదం చదువుకున్న బ్రాహ్మణుడికి డొక్క నింపేట్టుగా నీవు దానం చేయకపోయినట్లయితే నీ జన్మ, నీ దేహం, నీ ఇల్లు ఈ మూడు వృధా. నీ దగ్గర ఎంత సంపద ఉంటేయే అన్నాడు. అంటే సంపదను ఎలా వితరణం చేయాలో చెప్తున్నాడు. వంటివాడ మళ్ళీ నేను ఒక్కడినే నాకు ఒకటి రెండు అడుగుల మేరయుమ్ము మూడడుగులు అడగలే. ఒకటి రెండు అన్నాడు ఒకటి ప్లస్ రెండు మూడు అన్నమాట అది ఆడవటం. చూడండి లెక్కలు మన పాతకాలంలో గ్రామాల్లో ధాన్యం కొలిచేటప్పుడు ఒకటి రెండు మూడు ఆరు దాకా వచ్చి ఏడు అనడు ఆరున్నొకటి అంటాడు. ఆ ఆరున్నొకటి ఏడు శబ్దం మన వాళ్ళు వాడదు అలాగే ఈయన కూడా దేవుడు కదు వన్ ప్లస్ టు అన్నాడు ఈన ఒకటి రెండు అడుగులు అన్నాడు. ఒకటి రెండు అడుగుల మేరయుమ్ము సొమ్ము మేరవల్లదు అంతా నీ దగ్గర ఉన్నదంతా నాకు అక్కర్లేదయ్యా కోర్కిదీర బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. ఇగో ఈ మూడు అడుగులు ఇచ్చేస్తే వన్ ప్లస్ టు అప్పుడు ఆ ప్రదాత అన్నాడు ఉన్నమాటలెల్ల ఒప్పును విప్రుడా నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి ఎంత మంచి మాటలు చెప్పావయ్యా సత్యగతులు వృద్ధ సమ్మతంబు అడుగదలచి కుంచె మడిగితివో చల్ల దాత పెంపు సొంపు తలపగలదే. అది అహంకారం నశించని అహంకారంతో బలి ఉన్నాడు అన్నాడు ఇదా నువ్వు అడగవలసింది నన్ను ఒకటి రెండు అడుగులా నేనేమో మూడు లోకాలకి ఒక ఇంద్రున్ని పారదోలినటువంటి రాజుని నేను దానం అడగటంలో కూడా ఏదో రూపాయి బిల్లువు పావలా బిల్లువు వచ్చిన అదివు ఇదివు అని అడుగుతారా అడిగితే ఎట్లా అడగాలి అసలు దాతకి కీర్తి వచ్చేట్టుగా నువ్వు అడగాలి అన్నాడు. అంటే లోపల వాడు ఎంత దాత అయినా ప్రవృత్తి మార్గంలో దానం చేశాడు అని అర్థం. ప్రవృత్తి మార్గంలో అంటే ఇది కోరి గనక దానం చేస్తే ప్రవృత్తి ఏదీ కోరక గనక దానం చేస్తే అది నివృత్తి అంతే రెండే మాటలు. ఇక్కడ ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు వీణ్ణి నివృత్తి మార్గంలోకి తేవాలి పరమాత్మ. వసుదాఖండము వేడితో జగములన్ వాంఛించితో ఆసురంద సమూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు. ఎంత మాయో చూడండి. ఇప్పటిదాకా నేను చూస్తే నాకు శివుడన్నాడు నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాడు కానీ అయ్యేప్పటికి నీకు దానం అడగటం మాత్రం ఒక్కటి నీకు చేతకా లేదురా పసిబాలుడివి నువ్వు ఎలా అడగా మూడు లోకాలు అడగాలి అని అంటూ పసిబాలుండవు నేరవీ వడుగ నీ భాగ్యంబు నీ పాటిగాక అసురేంద్రుండు పదత్రయం బడుగ ఈ అల్పంబు ఈ నేర్చునే. ఆహా! ఇక్కడికి దారిలోకి వచ్చావు కదా అని వామనుడి యొక్క ముఖంలో ఒక చిరునవ్వు మొలిచిందట. వాడు మూడు అడుగులు ఇంద్రుడి లాంటి వాడు అడగాలి నీలాంటి వాడా అన్నాడట. ఓహో అంటే ఒకటి ప్లస్ రెండు కాదు నేను ఇప్పుడు మూడు అని అడగాలి అని ఈయనకి క్లూ ఇచ్చాడు వాడు. ఇవ్వగానే ఆ గృహమేధికి అంటే గృహమేధి ఎవరు యజమాని బలి. ఆ గృహమేధికి మేధావి ఇట్లా అన్నాడట అసలు ఆ శబ్దాలు చూడండి. వాడు ఒట్టి గృహమేధి ఆ ఒక్క ఇంటికి వాడు మాస్టర్. అసలు వచ్చినవాడు ఎవడంటే సర్వలోకాలకి మాస్టర్ వచ్చాడు. వాడు అడుగుతున్నాడు వడుగో జన్నిదమో కమండులువో నాకున్ ముంజియో దండమో వడుగే నెక్కడ. నేను అడిగితే ఇవ్వడగాలి వడుగును నేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షులు అశ్వంబులెక్కడ ఏనుగులు ఎందుకు స్త్రీమూర్తులు ఎందుకు లేకపోతే నాకు గుర్రాలు ఎందుకు నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.నా పాలిటీ నాకు ఏమి వద్దు ఆ మూడు అడుగులు ఇచ్చేస్తే ఇగ అవన్నీ ఇచ్చినట్టే అన్నాడు ఆయన. ఆ అడగట్టంలోనే అంతా ఉంది ఆ కొట్టేయటం అంటారే తెలుగులో ఆయన కొట్టేయబోతున్నాడు ఈయన దగ్గర. వ్యాప్తంబొందని వగవగ ప్రాప్తంబగు లేశమైన పది వేలనుచున్ తృప్తిన్ జెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్రంబడునే. మొన్నటి నుంచి అనుకుంటున్నాం వామనుడికి చెప్తున్నాడు కదా తృప్తి లేని ఇంట్లో సంపద ఉండదు అని విచారణ చేశాం మనం ఆనందం ఉండేచోట భగవంతుడు ఉండడు అని తృప్తి ఉన్నట్లయితే ఆ ఇల్లు ఐశ్వర్యమయం. ఐశ్వర్యం ఉంది తృప్తి లేదు ఎప్పుడూ వాడు ఏడుస్తూనే ఉంటాడు వాడి వల్ల ప్రయోజనం లేదు కాబట్టి నాది చాలా చిన్న కోరిక ఈ మూడు అడుగులు ఇవ్వమని అడిగి తృప్తి లేని వాడికి సప్త ద్వీపాలు వాడికి రాసిచ్చినా తృప్తి పడతాడా అని అంటూ ఆశాపాశముతా కడున్ నిడుపు లేదంతంబు రాజేంద్ర. అసలు ఈ ఆశాపాశం అనేది ఆశ అనే తాడుందే ఇది అంతులేదు అది ఎంత పొడుగు అంటే వెళుతున్న కొద్ది పెరుగుతూనే ఉన్నదయ్యా. వారాసి ప్రాహ్వృత మేదిని వలయ సామ్రాజ్యంబు సేకూడియున్ కాశింబుందిరి గాక వైన్య గయ భూక్రాంతాదులు అర్ధకామాశంబు ఆయగ నేర్చిరే మును నిశాశాంతంబులన్ చూచిరే. భరణీ మండలాన్ని అంతా జయించినటువంటి చక్రవర్తులంతా మాకు చాలు అని ఎప్పుడన్నా అనుకున్నారా తృప్తి పొందారా తృప్తి పొందకుండా జీవితాన్ని పోగొట్టుకున్నారే కన్నుమూశారే అయ్యో అది పొందలేదే ఇది పొందలేదే ఇది సంపాదించలేదే ఇట్లా గనక ఉంటే నాకు ఇట్లా వెళ్లేదే హాయిగా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారా ఏమనుకున్నారంటే ఇంకా సంపాదించాలి అని అనుకున్నారు తప్ప ఇది చాలు అని అనుకోలేదు కదయ్యా అని అంటూ సంతృప్తుడు మూడు జగముల పూజ్యుండు. సంతృప్తి పొందిన వాడు మూడు జగాలలో వాడు పూజ్యుడై పూజనీయుడు అవుతాడట. మా గురువు గారికి ఏమి అక్కర్లేదు అంటారు అలా అనిపించుకున్న వాడు హాయి అయిన గురువు. అమ్మో గురువు గారు రైలు దిగుతున్నారంటే అయిపోయినాం అనుకుంటే వాడు శోక గురువు వాడు. వాడికి అక్కడి నుంచి మళ్ళీ బండి ఎక్కించేదాకా వాడిని సాకాలి అది కూడా చూస్తాం లోక శోక గురువులు ఈ లోకంలో ఉంటారు అక్కర్లేని గురువు ఉంటాడు నాకు ఎందుకండీ ఏం చేసుకొని ఇవన్నీ అంటాడు. తప్ప మనకేమో ఆయనకేమో ఇద్దామని ఉంటుంది ఆయనకేమో అక్కర్లేదు. ఆయనకు అక్కర్లేనిది ఇచ్చి ఆయనకి బరువు పెట్టేస్తాం కావలసిన వాడినేమో వాడు వీడు మనల్ని పీడిస్తున్నాడు అని వాడికివ్వం రెండు కాబట్టి చివరికి మన వస్తువు మన దగ్గరే గురువుగారు గురువుగారి ఇంట్లో. సంతోషికెప్పుడు దరుగు సుఖము సంతోషి గాకుండ సంసార హేతువు సంతసంబున ముక్తి సతియు గలదు. సంతోషం గనక ఉంటే ముక్తి కాంత కూడా లభిస్తుందట. సంతోషం లేని అందుకనే ముదము అన్నారు ఆ ముదము ఆనందం. పూట పూట కు జగంబుల యదృచ్ఛాలాభ తృష్టిని తేజంబు తోన పెరగు. ఎవడు తేజోమయుడుగా ఉంటాడంటే సంతృప్తిగా ఉన్నవాడిని చూడండి సంతృప్తి అంటే మహాపురుషులు మహాత్ములు అందరినీ చూడండి వాళ్ళు హాయిగా ఉంటారు తేజో వలయంలో ఉంటారు ఎందుకంటే వాళ్ళని లోతల కామాగ్ని లేదు దావాగ్ని లేదు తృష్ణగ్ని లేదు నిర్వర్ధకమైనటువంటి ప్రాపంచికమైన లోకాగ్ని లేదు ఏమున్నదయ్యా అంటే జ్ఞానాగ్ని ఉన్నది. అందువలన వాడు హాయిగా ఆనంద సానంద సమేతమై ఉంటాడు పరమానంద స్థితిలో ఉంటాడు. యోగ రతో వా భోగ రతో వా సంగ రతో వా విషయ రతో వా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు శంకర భగవత్పాదులు. నువ్వు యోగంలో ఉండు భోగంలో ఉండు ప్రపంచంతో కూడి ఉండు వీడి ఉండు కానీ నీ చిత్తాన్ని గనక బ్రహ్మంతో అనుసంధానం చేస్తే పరమాత్మతో కూర్చి ఉంచితే దానివలన మీకు నందతి ఆనందం కలుగుతుంది నందతి అదే ఆనందం నందత్యేవ అది మాత్రమే ఆనందం అలాగే చెప్తున్నాడు ఈయన. నీవు రాజువగుచు నిఖిలంబు అడుగుట తగవు కాదు నాకు. నువ్వు ఇవ్వగలవు కదా అని ఉన్నదంతా ఇచ్చేయమని నేను అడగకూడదు కదా చూడు ఎంత లౌక్యంగా అంటున్నాడో ఈయన. తగిన కొలది యేను వేడుకొనిన ఈ పదత్రయము చాలగనక యిమ్ము చాలు చాలు. మూడుని రెండు మాత్రం ఇవ్వు నాలుగు ఐదు నాకు వద్దు నేను అడిగిన ఆ మూడు ఇచ్చేసేయ్ కాదు అనకుండా ఇచ్చేసేయ్ చాలు చాలు ఆ చాలు చాలు అంటే తృప్తి. ఆ తృప్తి నిజానికి జీవుడికి ఆ ఉన్నప్పుడు కలుగుతుంది తిన్నప్పుడు కలుగుతుంది మీరు ఎన్ని ఇవ్వండి చాలు అనడు భోజనం దగ్గర మాత్రం ఒక స్థాయికి వచ్చాక చాలు చాలు అంటాడు. ఆ చాలు చాలు రావటానికి స్వామి ఏమన్నాడంటే చాలు వచ్చి అన్నాడ్లే అన్నారు స్వామి అది. తినలేక చాలు వచ్చి చాలు చాలు అన్నాడట మళ్ళీ ఒక గంట దాకా మళ్ళీ మొదలు పెడతాడన్నారు మళ్ళీ ఈయనే అది అది మానవుడి మాయా ప్రవృత్తి కాబట్టి. ఇట్లు పడు పలుకుతున్నటువంటి కరువునకు ఉర్వీదానంబు చేయదలంచి వాడి మనసులో ఒక ఆలోచన వచ్చింది ఎంత ఎన్ని రకాలుగా ఎన్ని ఆశలు పెట్టినా ఈ పిల్లవాడు ఏమిటి మూడు అడుగులే అడుగుతున్నాడు అసలు పోనీ ఆ మూడు అడుగులు ఇచ్చేస్తే వాడు హాయి పిల్లవాడికి ఏమిటి వాడు అడిగింది మనం మన ఇళ్లల్లో కూడా అంతే వాడు కారు బొమ్మ కొను నాన్న అంటాడు లేదురా నీకు ఆ గుర్రం బొమ్మ కొంటాను అంటాడు వాడు అడిగింది ఇచ్చేస్తే వాడు సుఖంగా ఉంటాడుగా తండ్రి గాని తల్లి గాని ముందు వాడిని సుఖపెట్టాలి మనకి మనకేం పని వాడికి ఇవ్వాలి అని ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాడికి అది వద్దు మీరు ఏది పని పెట్టండి బయట పారేస్తాడు. వాడికి కావాల్సింది ఒకటి ఇస్తే వాడు ఆగిపోతాడు వీడు కూడా అనుకున్నాడు ఇచ్చేద్దాం అని అనుకుంటే శుక్రుడు ఉన్నాడు పక్కన చూడండి దానవీరం ఎంత ఉన్నా అధ్యాత్మలో ఒక సూక్తు ఉన్నది. నీ అధ్యాత్మ పురోగమనంలో గనక నీ గురువే నీకు అర్థం అయినట్లయితే ఆ గురువుని పక్కకి తప్పించమంది శాస్త్రం.వాడినే పట్టుకొని వెంబడి వెళ్ళమని ఎక్కడా చెప్పలే ఒక్కోసారి గురువు ఏం చేస్తాడంటే పాపం మంచి దారిలో వెళ్తున్నవాడిని పక్కదారిలోకి తీసుకెళ్తాడు. వాడిని వెళ్ళనివ్వడు ఎదగనివ్వడు ఆ ఎదగనివ్వని గురువు గనుక మనకు దొరికినట్లైతే వాడిని ఎక్కువసేపు entertain చేయకూడదు. తొలగించుకోవాలి మనం ముందుకు వెళ్ళిపోవాలి మనకు కావలసిన గురువుని పరమాత్మ మనకిస్తాడు ఇవ్వకుండా ఉండడు. ధనుజేంద్ర! శుక్రుడు చెప్తున్నాడు "ఈతడు ధరణీసురుడు కాడు" వీడు బ్రాహ్మణుడు కాదు. "దేవ కార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడు అవ్యయుడు అతిధి గర్భంబున కశ్యప సూనుడై కలిగెను అకటా ఎరుగక ఇతని కోరిక నిచ్చెదవంటివి దైత్య సంపత్-సంతతికి ఉపద్రవము గల్గు నీ లక్ష్మీ తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చుతా వాసవునకు మనసి జగములెల్ల ముడుపాదంబుల అఖిలకాయుడగుచు ఆక్రమించు సర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు". శుక్రుడు శుక్రాచార్యుడు గట్టివాడే. వాడు ఏం చేసాడంటే దివ్య దర్శనంతో జరగబోయేది మూడు లోకాలు వీడు ఆక్రమిస్తాడు. చాలా కష్టం వీడితో కాబట్టి అన్నీ పోగొట్టుకుని లాక్-సంపద, తేజము, ఆయుష్షు, కుల గౌరవం, వంశ గౌరవం అన్నీ నాశనం చేసుకొని ఒక బడుగువాడిలా ఒక బీదవాడి లాగా నువ్వు ఎలా బతుకుతావు బలి? అని శుక్రుడు interfere అయినాడు. అని వాడు మూడు పదాలని చిన్న పిల్లవాడు చిన్న పాదాలు కదా అనుకుంటావేమో "ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రిదివంబు చొక్కి ఉన్నత మూర్తిం దిక్కులు దగనము తానై వెక్క సమై యున్న యెందు వెడల యొప్పుమా". భూమి ఆకాశం రెండూ గనక ఆక్రమించేసి గగన-గగనాంతరాలన్నీ కూడా ఆయనే ఆక్రమించేస్తే అసలు మనం ఎక్కడుంటాం ముందది చెప్పు. దానం చేయడానికి కూడా ఒక లెక్క ఉండాలి కదా అంటున్నాడు శుక్రాచార్యుడు. "ఇచ్చెద నేని పల్క ఈ కున్న నరకంబు త్రోవ నీవును సమర్ధుడవు గాన ఏ దానమున నాశమే తంచు అదియు దానము గాదండ్రు తత్వ విదులు". ఒక దానం చేసి మనం గనక నాశనం అయిపోయేట్లయితే అది దానం కాదు. తత్వం తెలిసిన వాళ్ళు అది గమనించాలి. మనం నాశనం అయిపోయినా సరే వాడు బాగుండాలంటే అది అహంకారం మనలో ఉన్న shade. అలా కాకుండా మనకున్నదాంట్లో ఉన్నంతలో చేయగలిగినంతలో తప్పకుండా చేయాలి. "దానంబు యజ్ఞంబు తపంబు కర్మంబు తా విత్తవంతుడై తలపవలయు". తన దగ్గర ఉన్నదాంట్లో కొంత percentage ని దానానికి, తపస్సుకి, యజ్ఞానికి, సేవకి, కార్యకలాపాలకి ఖర్చు పెట్టాలి.
SSSMC · audio
Bhagawata Navaneetham - 40
Bhagawata Navaneetham - 40
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:30
More in this series