Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతామి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ శ్రీమద్భాగవత నవనీతంలో మరొక ఘట్టం కాలగమనంలో కాల మహా ప్రవాహంలో కాల రేఖలో జీవుడు ఒక్కొక్క క్షణాన్ని దాటుతూ దాటినప్పుడల్లా జీవిస్తున్నాననుకొని దాటలేని అప్పుడల్లా ఆగిపోయినానని దాటటమే ఆగినప్పుడు మరణించాడని ఒక విషాద భూమికలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు నిజానికి శ్రీమద్భాగవతం అశ్వత్థావమానంతో ప్రారంభమైందని ద్వాపర యుగం అంతంలో జరిగినటువంటి అనేకా నేకమైనటువంటి విశేషాలు అనేకా నేకమైనటువంటి విడ్డూరాలు అన్నింటినీ కూడా గమనించుకున్నట్లయితే గమనంలో మనకి మనం గడుపుతున్న జీవితానికి ఆనాటి జీవితానికి పెద్ద తేడా ఏం మనకు కనిపించదు దానికి కారణం ఏంటంటే కాలం మారింది యుగం మారింది జీవుడు మారాడు అవతార పురుషులు రూపురేఖలు మార్చుకొని వచ్చారు కానీ జీవన విధానంలో మాత్రం మార్పు లేదు ఎందుకంటే పడుగు పేకలుగా చీకటి వెలుగులుగా ఎత్తు పల్లాలుగా జయాపజయాలుగా అశాభంగాలుగా జనన మరణాలుగా ద్వంద్వంగా సాగేటువంటి ప్రవృత్తి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క సృష్టి వీలా విలాసమే విలాసంలో మనం భాగస్వామ్యులు అయ్యేకంటే విలాసాన్ని సాపేక్షంగా సాక్షిభూతంగా చూడగలిగినటువంటి ఒకానొక స్థితికి వెళ్ళమని చెప్ చెప్పడమే ఇటు భారతం గానీ అటు భాగవతం గానీ అటు రామాయణం గానీ మనకు బోధించేటువంటి ఒక విషయం సరే నిన్న పరీక్షిత్తు పుట్టాడని ఆయన విష్ణురాతుడు అనేటువంటి పేరుతో వచ్చాడని ఉత్తరా గర్భంలోనే పరమేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని క్షణకాలం పొందాడని ఆయనకి తదనంతర కాలంలో పరీక్షిత్తు అనేటువంటి పేరు ఇవ్వబడిందని కారణం ఏంటంటే దివ్యమైనటువంటి దర్శనాన్ని తన గల్ తల్లి గర్భంలో తాను దర్శించాడో జన్మ ఎత్తి తల్లి గర్భం నుంచి విడివడిన తర్వాత కూడా అటువంటి దైవం మళ్ళీ కనపడతాడేమోనని ఎదురు చూశాడు ఎదురు చూడటం ఎలా చూశాడు అంటే పరిశీలనగా చూశాడు తల్లి గర్భంలో ఏర్పడినటువంటి దృశ్యం మళ్ళీ కనబడుతుందా అని మళ్ళీ కనపడే అవకాశం లేదు గదాధారి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనం మళ్ళీ దొరుకుతుందా అని జీవుడి యొక్క స్మృతి ఇంకా పోలేదన్నమాట కాబట్టి బాలుడిగా పసివాడిగా ఉన్నప్పుడే సమూహాన్ని పరీక్షిస్తూ ఉండేవాడాయన మళ్ళీ అటువంటి వాడు కనపడతాడా అని అందుకని రెండవ పేరు ఆయనకి పరీక్ష పరీక్షిత్తు అని పేరు పెట్టు వచ్చింది పరీక్షిత్తు అది భాగ్య సంబంధమైనటువంటి అర్థం అంతరార్థం ఏమిటంటే తనను తాను పరీక్షించుకుంటున్నాడు మాయావరణంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నిజానికి దర్శించడానికి ఏముంది జీవుడికి మళ్ళీ ఒక ప్రశ్న ఉన్నది ఆయన మనసులో నేను ఎందుకు వచ్చాను అని ఎందుకు వచ్చాను అనేటువంటి ప్రశ్నకి ఒక సంవాదంగా ఒక వేదనగా జీవన వేదనగా ఒక నివేదనగా ఏర్పడినటువంటిదే భాగవతం భాగవతాన్ని మనకు అందించినటువంటి వ్యాస దేవులకి ఆంద్రీకరించినటువంటి సహజ కవి పోతనామాత్యుడికి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఇంతటి మహా యోగాన్ని మార్గశిర మాసంలో అనుగ్రహించినటువంటి సాక్షాత్ పరబ్రహ్మ దైవతమైనటువంటి భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకి మరొక్కసారి నమస్కరిస్తూ కథాంశంలోకి వెళదాం విదురుడు అని ఒక పాత్ర ఉంది విదురుడు ఏమవుతుంది ఇదేదో ఇటు అటవుతుంది విదురుడు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినటువంటి వేళ దుర్యోధనుడికి ఒక చిన్న ఉపదేశం ఇచ్చాడు చిన్న సలహా ఇచ్చాడు వచ్చింది పరమాత్మ మీ ఇరు కుటుంబాలు బయట వాళ్ళు కాదు కొట్టుకుంటున్నది మీ అన్నదమ్ములు కలిసి కాలక్షేపం చేసి జీవితాన్ని చక్కగా గడుపుకోండి కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది ఐదు ఊళ్ళు అవి ఇవ్వండనే చెప్పడానికి వచ్చాడు ఆరో ఊరి భవనం అడగటానికి రాలేదు ఆయన అని అంటే దుర్యోధనుడు అంటే ప్రపంచంలో ఒక గుడ్డి తండ్రి అహంభావి అయిన కొడుకు ఉంటే ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం కాలం మార్పు పేర్లు మార్పు అంతే కాబట్టి వారసత్వంగా వాడికి ఏం వచ్చిందంటే అహంకారం వచ్చింది దుర్యోధనుడు విదురుడిని చాలా భయంకరంగా అవమానించాడు కానీ విదురుడు ఎవరంటే యముడి అంశంలో వచ్చినటువంటి వాడు విదురుడు యమధర్మరాజు యొక్క అంశమే విదుర మహాదేవుడు అంటారు ఆయన్నిమహాదేవుడు ఎందుకైనాడంటే దాసీపుత్రుడు అయినప్పటికీ కూడా ధర్మవేత్త. ధర్మం అంటే మానవీయ ధర్మం. మానవుడు చాలా చక్కగా జీవించటానికి ఏం చేస్తే బాగుంటుందో, ధర్మ శాస్త్రాలు అన్నింటినీ ఎలా విచారణ చేయవలసి ఉన్నదో సుబోధకంగా చేసి, అవసరమైనటువంటి వేళ చక్కని సలహా ఇవ్వగలిగినటువంటి విదుర మహాదేవుడ్ని కూడా దుర్యోధనుడు తీవ్రంగా అవమానపరిచాడు. గాయపడ్డది. జ్ఞానిని-- జ్ఞాని చాలా తొందరగా గాయపడతాడు. నిజమేనా అని. గాయపడితే వాడు జ్ఞాని ఎందుకు అవుతాడు అని రెండో ప్రశ్న. అయితే జ్ఞాని-- మనసు లేనివాడు జ్ఞాని అయినప్పటికీ, ప్రపంచంలో తన ఉనికి వలన ప్రయోజనం ఏమీ లేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, మనసు గాయపడినట్లుగా నటిస్తూ పక్కకు తప్పుకుంటాడు. అక్కడ మనసు లేదు. సన్నివేశంలో తన అవసరం లేదనుకున్నప్పుడు తాను ఎలా వైదొలుగుతాడో, విదురుడు కూడా ఏం చేశాడంటే అనేక తీర్థక్షేత్రాలన్నీ దర్శనం చేశాడు. అనేక పుణ్యక్షేత్రాలు, మహామునులందరినీ దర్శనం చేశాడు, తపస్సులందరినీ దర్శనం చేశాడు. నిజానికి ద్వారక కూడా వెళ్ళాడు. అయితే విదురుడు, అంతా యుద్ధం అయిపోయింది, గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరూ ఎలా ఉన్నారో, పాపం అందరూ బిడ్డల్ని పోగొట్టుకొని ఉన్నారు. ఇంతకాలం వాళ్ళతో ఉన్నాం గనుక ఒకసారి వెళ్లి ఎలా ఉన్నారో పరామర్శ చేద్దాం అనుకొని వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్రుడితో కూర్చొని కాసేపు సంభాషించాడు, పరమోల్లాసంగా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ఏమిటంటే కౌరవ సంహారం అయిపోయిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరికీ కూడా ప్రతి ఉదయం ధర్మరాజు సభకు వెళ్లే ముందు చక్కగా స్నానం ఆచరించి తన తల్లిదండ్రులకి ఎట్లా సేవ చేయాలో, ఎలా గౌరవించాలో, ఎటువంటి పూజలు సలుపాలో అటువంటివన్నీ చేస్తూ వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు పరిస్థితి అది. ధృతరాష్ట్రుడు గాంధారి లోపల ఉన్నారు. వీళ్ళని దర్శనం చేసుకోవటానికి విదురుడు వచ్చాడు. ఇది కథ. అయితే కథలో తత్వం ఏమున్నది అంటే, ఇదంతా భారతం అంతమై ద్వాపర అంతం అయ్యేటువంటి వేళ జరుగుతున్నది గనుక అనేక లోక మర్యాదలు ఉన్నాయి. మధుర భక్తి కంటే ఇక్కడ లోకంలో ఎలా జీవించాలో అవన్నీ ఉన్నాయి గనుక లోక మర్యాదను ఎలా ధర్మరాజు పాటించాడు, ఎలా విదురుడు పాటించాడు, మిగిలిన వారంతా వాటిని ఎట్లా సమన్వయం చేసుకున్నారు, ఇవన్నీ కూడా విచారానికి వచ్చినాయి. కనుక ఇవాళ విదుర మహాదేవుడు పునరాగమించాడు. ఎక్కడికి? హస్తినాపురానికి. ఎప్పుడైతే విదురుడు వచ్చాడు అని తెలిసిందో, రాజ ఈశ్వరుడు అయినటువంటి ధర్మరాజు, కేవలం రాజుగా మాత్రమే కాదన్నాడు, ఈశ్వరుడు అన్నాడు. ఈశ్వరుడికి కావలసినటువంటి సర్వ సదుపాయాలు చేసి, ఆహ్వానం చేసి, ఆయన్ని అడిగాడు. మామూలుగా మనం బయటి నుంచి వస్తే ఎట్లా అడుగుతామో ధర్మరాజు కూడా ఆయన్ని అదే అడిగాడు. "ఏ వక్తంబున ఇంతకాలము మీరు సంచరించితిరయ్య జగతిలోన" చాలా రోజులు అయిపోయింది, ఇంతకాలం ఎక్కడున్నారు ప్రపంచంలో, ఎక్కడెక్కడ తిరిగొచ్చారు. "ఏ తీర్థములు గంటిరి ఎక్కడ మంటిరి, భాసింప మీవంటి భాగవతులు తీర్థ సంఘంబులధికరింతురు గదా, మీ యందు విష్ణుండు మొరయు కతనా" మీరు జ్ఞానులు కదా! మీకిప్పటికి అర్థమయ్యే పోయింది మీలోనే విష్ణువు ఉన్నాడు అని, కనుక మీరు తీర్థయాత్రలవి చేయరే, పుణ్యక్షేత్రాలకు వెళ్ళరే, ఆత్మానుసంధానం అయింది కదా! మీకు వీటి పట్ల అపేక్షే లేదు. కానీ జగత్తులో ఎక్కడికెళ్లారు? పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలే అక్కర్లేని మీకు తుట్టపక్కాలు అసలక్కర్లేదు, కదా. కాబట్టి ఎక్కడికెళ్లారు? ఇటు ఇహలోకంలో ఉన్న బంధువర్గం దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఉన్న మేమంతా ఇక్కడే ఉన్నాం. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు మీకు అక్కర్లేదు. కానీ ఎక్కడికెళ్లారు? "విష్ణుండు మీ యందు మెరయు కతన మీరు తీర్థంకరులు" అసలు మీరే ఒక పుణ్యతీర్థం. చూడండి, ధర్మరాజు సంభావన. "మీ కంట మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడ, వేరు తీర్థంబుల వనిపై వెదకనేల, మిమ్ము పొడగని భాషించు మేల మాకు, వార్తలేమండ్రు లోకులు వసుధలోన మీకు, సర్వంబు ఎరిగెడి మెరగలదు" మీకేమీ అక్కర్లేదు గానీ, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ చెప్పుకోవటానికి అందరూ మీ దగ్గరికి వస్తారుగా. అందువల్ల మీకు విషయాలు తెలుస్తాయిగా, మీరు విషయం కోసం వెళ్ళరు. కానీ ఎప్పుడైతే ప్రపంచమంతా వచ్చి, అయ్యా మా ఊర్లో ఇలా జరిగింది, మాకిలా జరిగింది, కౌరవులు ఇలా పోయినారు, ధర్మరాజు ఇలా అయినాడు, రాజ్యంలో ఇలా ఉందని చెప్తూ ఉంటారే, ఇంకేమిటి విశేషాలు అని అడిగాడు. ధర్మరాజుకు అప్పటికే విశేషాలు gather చేసేటువంటి అలవాటు నేర్పేసింది intelligence. రాజైనాడుగా మరి. అంతకుముందు పాపం ఆయనకివన్నీ అక్కర్లా. ఏదో కృష్ణుడు, తన తమ్ముళ్ళు, తన తల్లి, తన భార్య అంతవరకు ఉంటే చాలు అనుకున్న వాడికి కొత్త లంపటం వచ్చి పడ్డది అది రాజ్యం. ఆయనకి రాజ్యం చేయాలని లేదు కానీ భారం మోయవలసి వచ్చింది. అది ధర్మరాజు పరిస్థితి. ఇక విదురుడు ఏమన్నాడంటే, అంటే ఇంకా రెండు మూడు కుశల ప్రశ్నలున్నాయి మనకు అప్రస్తుతం.సమస్త లోక వర్తనము క్రమంబు తోడ విశదముగ చెప్పి ప్రపంచంలో ఇంతవరకు ఏం జరిగిందో అన్ని చెప్తూ, యదు క్షయంబు చెప్పిన అతడు ఉగ్ర శోకమున పెగ్గిని కుందెడినంచు ఏమియున్ వినుమని చెప్పడయ్యే యదువీరుల నాశము భర్గవోత్తమా! ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు చెప్పాడట విదురుడు ఏం జరిగినయో పూసగుచ్చినట్లు. ఒక్క యదువంశ క్షయం అయినట్లు చెప్పలా. కృష్ణ పరినిర్వాణం అయినట్లు గాని, కృష్ణుడు లేడని గాని, ఇదంతా అయిపోయింది అని గాని, ద్వారకా అంతా మునిగిపోయింది అని గాని, దేని-- అది మినహాయించి అన్ని విషయాలు చెప్పాడు. ఎందుకని అంటే మనం ప్రపంచంలో ఎవరిని అమితంగా ప్రేమిస్తామో వ్యక్తిని గురించి మరొకడు చెడుగా చెప్పినా, వాడికి చెడు కలిగినా, వాడికి దుఃఖం కలిగినా ముందు మనం తట్టుకోలేం. కనుక ధర్మరాజుకి అత్యంత ఇష్టమైనటువంటి వంశం ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఎత్తినటువంటి యదువంశం. కానీ యదువంశం లేదు. వార్త, విషయమంతా కూడా information అంతా విదురుడి దగ్గర ఉంది. కానీ విషయం మినహాయించి అన్నీ చెప్పాడు. చెప్పాడు విదురుడు అంతా ఉన్నాడు. ధర్మరాజు అయిపోయిన తర్వాత విదురుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అసలు చెప్పాలి. ఎందుకంటే సుఖంలో, సంతోషంలో మనకొచ్చే wedding card invitations అన్నీ attend అయినా కాకపోయినా పర్వాలేదు. మనకి ఎవరికైనా కష్టం కలిగినప్పుడు కష్టాన్ని share చేసుకోవటానికి మనం వెళ్ళాలి. ఇది భారతీయ సాంప్రదాయం అండి. పెళ్ళికి రాలేదనుకోండి, "గుండ్రా డాచిన పెళ్లి ఏమిటికి చిక్కున్ కష్టముష్టింపజ" అంటాడు మన చరిత్రలో. గుండ్రాయి దాచి పెట్టాం అనుకోండి కొబ్బరికాయ కొట్టటానికి, ఏమవుతుంది? ఇంకో రాయి తెచ్చి కొడతారు. గుండ్రాయే కొట్టాలనుంది. కానీ పురోహితుడు లిస్టులో గుండ్రాయి రాశాడు గనుక కొబ్బరికాయ గుండ్రాయి మీదే కొట్టాలేమో, అది దొరకలేదు కొబ్బరికాయ కొట్టొచ్చా కొట్టకూడదా అని అడుగుతారు. కొబ్బరికాయ కొట్టడం ముఖ్యం. అలాగే ఇక్కడ కష్టం వచ్చినటువంటి గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరినీ దర్శించటానికి వెళ్ళాడు. భాగవతంలో పోతన చెప్పలేదు గాని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి ఒక విషయం reveal చేశారు ప్రపంచానికి. విదురుడి కంటే ముందు మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత పంచ పాండవుల్ని, కుంతిని, ద్రౌపదిని వెంబడి పెట్టుకొని కృష్ణుడు అంతఃపురం లోకి వెళ్ళాడు. సరే, భీష్ముడు భీముణ్ణి కౌగలించుకునే ప్రయత్నం చేసి చంపే ప్రయత్నం చేశాడు పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు. తట్టుకోలేని పుత్రశోక వశాత్తు. సరే, గాంధారి ఏం చూడలేదు, ప్రపంచమే చూడలేదు. ఆమె ఏమన్నదంటే, "కృష్ణా! నువ్వొచ్చావా?" అని అన్నది. "నేను ఇక్కడే ఉన్నానత్త" అన్నాడు. ఏం దేవుడివయ్యా నువ్వు? వందమంది బిడ్డల్ని నేను నీ కడుపున కన్నాను నేను. ఐదుగురు పాండవులు క్షేమంగా తెచ్చావు. ద్రౌపదిని భద్రంగా నిలబెట్టావు. పాండవులను కన్న కుంతిని కూడా వెంబడి పెట్టుకొని మా దగ్గరకు వచ్చావే, నువ్వు దేవుడివేనా నిజంగా? ఇంత గర్భశోకం నాకు కలిగితే ఒక్కడినైనా మిగల్చకుండా అంతా ఖాళీ చేశావే అని నిందాలాపన ప్రారంభించింది. పరమేశ్వరుడు కృష్ణావతారమంతా నిజానికి ఒక మధుర విషాద గాథ. ఆయనని దైవం అన్నవారు, దైవంగా ఎరిగినవారు తక్కువ. దైవం కాదన్నవారు ఎక్కువ. దైవమే అన్నవారు పంచపాండవులు, కుంతి, ద్రౌపది, విదురుడు, అక్రూరుడు, భీష్ముడు. వీళ్లే ప్రధానమైనటువంటి వాళ్ళు. మిగతా వారంతా అవునో కాదో అనే డోలాయమానంలో పడ్డవాళ్లే మనలాగా. మనక్కూడా స్వామి అంతే కదా, ఆయన ఎప్పుడూ దేవుడు ఎప్పుడైనా కాడా, అప్పుడప్పుడు కాలేదు కూడా. హాయిగా నిజాయితీగా చెప్పుకుందాం కదా. మన కష్టం తీరినప్పుడు అన్నాం, ఆయన దేవుడే అన్నాం, ఖచ్చితంగా పదిమంది చెప్పాం. ఎప్పుడన్నా కాస్త ఆయన లేటు చేస్తే మాత్రం ఏమో ఆయన శక్తి పోయిందని కూడా చెప్పాం. అది. ప్రపంచ రీతి ఇలా ఉంటుంది అని. మనం అన్నామని కాదు, ఇలా రీతి అలా ఉంటుంది. అలాగే గాంధారి అన్నవన్నీ ఆయన విని ఒక మాటన్నాడు, "గాంధారి! నిజమే. నూరుగురు బిడ్డల్ని నువ్వు కన్నావు. కానీ కంటితో ఒక్కడినైనా నిన్ను కన్నావా? నువ్వు చూశావా? వాళ్ళు ఎలా పెరుగుతున్నారో లోకకంటకులుగా, అనేకమైనటువంటి దుష్కర్మలలో నిమగ్నమైనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఎలా పెరిగారు, మర్యాదస్తులుగా ఉన్నారా లేదా అని తల్లి ప్రేమని, తల్లి చూపుని నోచుకోనటువంటి వాడికి దైవ ప్రేమ, దైవ వీక్షణ దూరం లే గాంధారి కానీ" అన్నాడాయన. అంటే అదంతే, నేను చేసింది correct అని చెప్పాడు. నూరుగురిని కన్నప్పుడు ఒక్కడన్నా సక్రమంగా ఉండాలిగా. ఒక్కడు సక్రమంగా ఉన్నా కురు రాజ్యం నిలబడి ఉండేది. మహాభారత సంగ్రామం జరిగి ఉండేది కాదు. ఇది వ్యాసభాగవతంలో లేదు. పోతన ఆంద్రీకరించలేదు. కానీ సాక్షాత్తు స్వామి చెప్పారు గనుక అది సత్యం. సరే, అట్లా వచ్చిన పరంపరలోనే ఆయన కూడా పరామర్శకు వెళ్ళాడు. వాడ విదురుడు కూడా వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు అని. ఏం చెప్పాడంటే, ఇంకా ఇంత జరిగినా ఎవరో అన్నం పెడతారని, ఎవరో వచ్చి చూస్తారని, వృద్ధాప్యం ఇంకా అంతఃపురం లోనే గడవాలని, ఇంతకాలం అలవాటు పడ్డటువంటి మర్యాదలకు లోటు ఉండకూడదని, పోతే వాళ్ళు వంద మంది పోయినారులేమా, తమ్ముడి కొడుకే రాజైనాడు, రాజమర్యాదలకు లోటు లేదని మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా, ఇంకా ఎందుకున్నారు ఇక్కడ? ఇప్పటికైనా మీకు అధ్యాత్మలోకి మనస్సు ప్రవేశించటం లేదా? జీవితం మీకు ఏమీ ఇవ్వదని, ఇదంతా విషాద భూయిష్టమని.ఇది మాయామే జగత్ అని ఇక్కడ నిజానికి పొందవలసింది తక్కువ పోగొట్టుకునేది ఎక్కువ అని అర్థం కావట్లేదా? ఇంత జరిగిన రాజ్యం పోయింది. పిల్లలు నశించారు. మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరూ లేరు. మీరు పరాధీనులైపోయినారు. ధర్మరాజేదో రాజు గనుక మంచివాడు గనుక మీ ఆళనా పాలనా పొద్దున్న సాయంత్రం వచ్చి చూస్తున్నాడు స్వయంగా. కానీ ఎంతకాలం మర్యాదలు పాటిస్తూ లోకంలోనే ఇంకా బంధాలన్నీ పెంచుకుంటూ జరిగిన వాటికన్నింటినీ తలుచుకుంటూ వేదన పడుతూ ఇలాగేనా? పుణ్యతీర్థం, పుణ్యక్షేత్రం, మహాత్ముడి దర్శనం ఏమీ అక్కర్లేదా? అని చెప్పాడు విదురుడు. అది విదురబోధ. అది విదుర నీతి. అంటే మనది కాని ఇంట మనం ఎక్కువ సేపు ఉండకూడదు. మనకు ఎవ్వరూ లేరనుకోండి, స్వామి చెప్పారు "అంతరంగముకన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే". ఎవ్వరూ లేకపోయినా పరమాత్మ మనకి స్నేహితుడు. ఆయన లోపల ఉండి అంతర్వాణిగా మనకు అనేక బోధనలు చేస్తాడు. అనేకమైనటువంటి విషయాలు చెప్తాడు. అనేకము హెచ్చరికలు చేస్తాడు. గమనించుకుంటూ ఉండగలిగినట్లయితే అది ఉదాత్తం కాదా? పరమాత్మని ఇంకా ఎప్పుడు ఎరుగుతారు? అని విదురుడు చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడు విదురుడు చిన్నవాడైనా మాట అడిగాడు. ఎక్కడికి వెళ్ళమంటావు? ప్రతి వృద్ధుడు వేసే ప్రశ్న ఇది కదా. ఇవాళ వృద్ధుడు ప్రశ్నించే లోగానే ఆశ్రమాలు ఉన్నాయి నాన్నగారు మీరు తట్టాబుట్టా సర్దుకొని మా పనులకు అడ్డం రాకుండా మీ దారిన మీరు వెళ్ళొచ్చు అని చెప్పే రోజులు వచ్చాయి. అది కాదు. విదురుడు దిశానిర్దేశం చేశాడు ఒక గురు స్వరూపంగా. వయసు గురు స్వరూపానికి వయసుతో సంబంధం లేదు. అతి చిన్న వయస్సులో ఎనిమిదేళ్ళకి సన్యసించిన శంకర భగవత్పాదులు, పద్నాలుగు ఏళ్ళకే నేను సాయిబాబా అని ప్రకటించిన స్వామి. నిజంగా విచారణ చేస్తే ఇవాళ, ఇవాళ ఉన్నటువంటి పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళు ఆరేళ్ళకో, ఎనిమిదేళ్ళకో స్వామి ఆవరణంలోకి రాగలుగుతున్నారు. మరి కస్తూరి గారి లాంటి వాళ్ళు ఆయనకి యాభై రెండు ఏళ్ళు వస్తే తప్ప స్వామి దగ్గరికి చేరుకోలేకపోయినాడు ఆయన. At his fifty first year he first saw భగవాన్. అది. కాబట్టి రకంగా గనక లెక్క వేస్తే మన పిల్లలు చాలా అదృష్టవంతులు. అనేక విధాల పరమాత్మ ఆవరణంలోకి రాగలిగారు. ధృతరాష్ట్రుడు దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి రాయబార సన్నివేశంలో విశ్వరూప దర్శనం ఇచ్చిన పుత్ర వ్యామోహాన్ని వదులుకోలేని కారణంగా ఏమన్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు దైవానివే కానీ నిన్ను చూసిన కనులతో లోకాన్ని చూడలేను. కళ్ళు మళ్ళీ నాకు గుడ్డితనం ఇవ్వమని అడిగాడు. పైకి చాలా గొప్పగా అడిగినట్టు అనిపించినా, కృష్ణుడి వెంబడే వెళ్ళిపోతే నా పిల్లలు ఏమైపోతారో? నేనుండి వాళ్ళని కాపాడుకుంటాను ఉండాలి అనేటువంటి ఆశ వలన ఒక పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని వృధా చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు చెప్పాడు మీరు ఉత్తరాభిముఖులై వెళ్ళండి. వెళ్ళినట్లయితే అక్కడ హిమాచల శానువులున్నాయి. హిమాచల శానువులలోకి వెళ్లి మహాత్ముల యొక్క దర్శనం చేయండి. మీరిద్దరూ చక్కగా స్నానం చేసి శుచిగా బాహ్య శుచి, అంతఃశుచి అలవాటు చేసుకొని మహాత్ములను సేవిస్తూ వానప్రస్థ ఆశ్రమాన్ని మీరు స్వీకరించండి. అక్కడ నుంచి మీ దేహాలను మీరు వదిలిపెట్టండి. వృద్ధునికైనా ఇంట్లో ఉన్నటువంటి చిన్నవారు ఇవ్వవలసినటువంటి ఒక ధైర్యం ఏమిటి అంటే మీ సమయమంతా పరమాత్మ భావనలో గడపండి. ఏదో మీరు గడిపారు, జీవితం అయిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి మళ్ళీ మొదలు పెట్టేది ఏం లేదు. మరి మీరు ఏం చేయాలి అంటే ఉన్న సమయమంతా పరమాత్మ భావనలో ఉండండి. పరమాత్మ యొక్క కథలు వినండి, గాథలు వినండి, పాటలు వినండి, మంచి మాటలు వినండి. కాళ్ళు కళ్ళు సహకరిస్తే హాయిగా ఇటువంటి భాగవతాలు చదువుకోండి. మంచి విషయాలు అనుకుంటూ ఉండండి. మా బోటి వారికి అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. తద్వారా మీ శేష జీవితాన్ని ఉత్తమోత్తమమైనటువంటి జీవితాన్ని వానప్రస్థంగా మాతోనే ఉండి గడపండి అని చెప్పాలి. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళండి అని మాత్రం చెప్పకూడదు. మనల్ని వదిలిపెట్టి వారు వెళ్లిపోయినట్లయితే ఇదిగో ధృతరాష్ట్రుడు గాంధారి వలె ఎవరో అన్నం పెడితే తినాలి, బాగున్నావా అని ఎవరో వచ్చి అడగాలి. ఇవన్నీ మానవ జీవితంలో చేయ తగని పనులు అవన్నీ కూడా. అయితే ఇవాళ కొన్ని విచారణలు చేయబోతున్నాం. ఎలాగో 2010 ఎలా మారిపోయి 2011 కాబోతున్నదో సంధి యుగంలోనే ద్వాపర పూర్ణమై కలియుగ ప్రవేశం చేసేటప్పుడు ద్వాపరలో కలియుగ ప్రభావాలు ఎలా ఉన్నాయో పోతన రాశాడు. వాటన్నింటినీ కూడా విచారణ చేద్దాం. ఒకే విషయమంతా అది. ఒక పద్యం ఆయన ఎలా చెప్పాడంటే, "పుట్టంధువు" అసలు నువ్వు by birth you are blind అది. జనుశాంధుడు అంటాడు. "పుట్టంధుడవు పెద్దవాడవు మహా భోగంబులా లేవు నీ పట్టంలంచెడిపోయే దుస్సహ జరా భారంబు పైగప్పే నీ చుట్టాలల్లను పోయి రాలు మగడున్ శోకంబునన్ మగ్నులై కటాదయల పంచవుందదగనే కౌరవ్య వంశాగ్రణి". ఎవరింట్లో అన్నా ఉండవచ్చునేమో గానీ జ్ఞాతి ఇంట ఉండకూడదు. అది. ఎక్కడన్నా ఉండొచ్చట. ఆఖరికి మన ఇంట్లో పనిచేసే పనిమనిషి దగ్గరన్నా ఉండవచ్చునేమో గానీ అన్నదమ్ముల బిడ్డల ఇంట ఉండరాదు. అది జ్ఞాతి వైరం, భయంకరమైనటువంటి వైరం.ఎందుకంటే ఒకే తల్లి గర్భంలో నుంచి సోదరులు వచ్చినా వివాహం అయిపోగానే అన్నదమ్ములు జ్ఞాతులు అవుతారు. ఇది లోకరీతి. మహాభారతంలో ఉన్నటువంటి ఒక మహా ధర్మాన్ని హిదురుడు బోధిస్తున్నాడు. ధర్మరాజుని కొడుకు అనుకుంటున్నావ్ కొడుకు లాంటివాడే కదా. కొడుకు లాంటి వాడు కొడుకు ఎలా అవుతాడు కాడుగా. నీ కొడుకులే నీకు బతికుండంగా చేయలేదు ధర్మరాజు ఎందుకు చేస్తాడు అక్కడ ఉండవచ్చునా వెళ్ళమన్నాడు. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు వండి కనిపోండు ఇడపై బడ్డాడని భీముండర గొడ్డములాడంగ గూడు కుడిచెద వధిపా. ఎంత దురదృష్టం నీది బతికుండగానే నీ వందమంది బిడ్డలకి పిండం వండి పెట్టవలసిన పరిస్థితిని నీవు కన్నారా కన్నావు. ఇంతకంటే ఉన్నదా? నువ్వొక పనివేయి ధర్మరాజు నీ పట్ల మర్యాదగా ఉన్నప్పటికీ కూడా వెనక భీముడు అక్కడ ఉన్నాడు వాడు నిన్ను మన్నించడు. ఎందుకంటే నీవు నీ బిడ్డలకు ఏనాడు బుద్ధి చెప్పలేదు, మంచి చెప్పలేదు, ఇలా ఉండమని చెప్పలేదు. కాబట్టి ధర్మరాజు మర్యాదకి నీ దగ్గరకు వస్తున్నాడు కానీ భీముడు మాత్రం నిన్ను శపిస్తూనే ఉన్నాడు జాగ్రత్త అన్నాడు. రెండు మాటలు చాలు వాడికి కాస్త ఆవేదన ఒక ఆవేశము కలిగినయి-కలిగి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లి ఒకానొక ప్రదేశాన్ని చేరుకొని అక్కడ నెమ్మదిగా తమ శరీరాలు గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరూ కూడా వదిలిపెట్టారు. మనం మరీ detailed గా ఎందుకంటే అది మహాదుఃఖం. దుఃఖాన్ని మనం పంచుకో అవస దుఃఖానికి ఏముంది ఆనందం పంచుకోవచ్చు గానీ దుఃఖం చెప్పుకోనక్కర్లా పునః పునః. ఆనందాన్ని పునః పునః చెప్పుకోవాలి. సరే ధర్మరాజు ఏం చేసాడంటే ఏంటో మార్పుగా ఉంది అని నెమ్మదిగా అలవాటు ప్రకారం ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. వచ్చేప్పటికి ఒక్క సంజయుడు మాత్రమే కూర్చొని ఉన్నాడు. పెద్ద తండ్రి లేడు, పెద్ద తల్లి లేడు, నిన్నే వచ్చిన విదురుడు లేడు. సంజయుడు ఒక్కడు పాపం ఏడుస్తూ కూర్చున్నాడు వాడు. ఎందుకంటే కాసేపు మాట్లాడుదామని వచ్చాను ధృతరాష్ట్రుడు గాంధారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు అని విచారం పొందుతూ ఉంటే ధర్మరాజు అన్నాడు ఏమి కాలమేం మారుతున్నట్లున్నదే. ఏదో కంటెదురుగ్గా మా పెద్ద తండ్రి పెద్దతల్లి ఉంటే వాళ్లే తల్లిదండ్రులని సేవ చేసుకుందామని అనుకున్నాను. అతి చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకున్నాను. తల్లి మా-మాతో ఉన్న కష్టాలలో ఉన్నదే తప్ప నేను రాజు అయిన తర్వాత ఇదిగో మా తల్లిని కూడా సేవించుకునే అవకాశం నాకు లేకపోయింది అని ఏదో బాధపడుతున్నాడు లోకరీతిలో. అప్పటికే కలి ప్రభావం నెమ్మదిగా ప్రవేశించిందని మనం చెప్పుకున్నాం. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే కలి అక్కడ పొంచి ఉన్నాడు. భగవద్గీత అయిపోయింది, యుద్ధం ఆరంభమైంది, కాహళి మోగింది కలి ప్రవేశించాడు. ఎక్కడ? యుద్ధరంగంలో. అందుకనే కలి ప్రవేశం వలననే మహాభారతంలో ధర్మయుద్ధం జరగలే. ప్రతి యుద్ధనీతి కూడా violate అయ్యింది, అతిక్రమించారు. దాన్ని కృష్ణుడు ఏమన్నాడంటే అసలు అధర్మం మీద జరిగే యుద్ధం-యుద్ధంలో ధర్మం ఉండవలసిన పనిలేదన్నాడు. కాబట్టి జరిగింది ధర్మమా అధర్మమా అంటే పైకి ధర్మం అధర్మం కానీ లోపల కృష్ణుడి పరంగా అది పూర్ణ ధర్మం. కాబట్టి ధర్మరాజు జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా గమనిస్తున్నాడు. ఒక కాలంబున యెందు ఔషధి జయము వేరొక కాలమున పండకుండు రంద్రు క్రోధంబు లోభంబు క్రూరత బెంకును దీపింప నరులు వర్తించు రంద్రు వ్యవహారములు మహా వ్యాజయుక్తము లెందు సఖ్యంబు వంచనా సహితమంద్రు మగలతో ఇల్లాంద్రు మచ్చరిత యంద్రు సుతులు తండ్రుల తెగ చుతురంద్రు గురుల శిష్యులు దూషించి కూడ రంద్రు శాస్త్ర మార్గము లెన్ వియు చాగవంద్రు న్యాయ పద్ధతి బుధులైన నడువ రంద్రు కాలగతి వింతవై వచ్చె కంటె నేడు. ఏం మార్పు వచ్చేసింది కాలంలో? ధర్మం పాటించబడదు, న్యాయం పాటించబడదు, అలాగే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళను చూడటం అనేది ఉండదు కలియుగ ప్రభావం ఇదంతా. అలాగే క్రోధము, లోభము, క్రూరత పెరుగుతుంది. ఆశ పెరుగుతుంది. ఏదో బతుక్కు కావలసింది చాలు అని మాత్రం అనుకోవట్టా. రాబోయే తరాలు అన్నింటికీ కూడా కూడబెడదాం అని ఉంటుంది. లోభం ఉంటుంది ఎంత సంపద ఉన్నా పరిత్యాగం చేయడు మంచి పని కోసం ఒక్క రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టడు వాడు. అలాగే సాధ్యమైనంతవరకు అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు చేయలేకపోయిన పరిస్థితి ఉన్నా లేకపోయినా నెపం వెతుక్కొని పని మానేస్తాడు అది. మనం చూస్తూ ఉంటాం. ఏండి సత్సంగనికి ఎందుకు రాలేదు అన్నాం అనుకోండి యాభై నెపాలు ఉంటాయి. రావడానికి నిర్ణయం మనం తీసుకోలే అంతే అట్లా అన్నమాట.
SSSMC · audio

Bhagawata Navaneetham - 12

Home

Bhagawata Navaneetham - 12

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 30:03

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

    Now playing
  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67