No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబెన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాత్మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ఘోర విషానల ప్రబలు గబ్బున కమ్మగ సర్ప సైన్య విస్తారుడు కాళിയేరబుడు వారి బడిం కరచన్ వయోధరాకారు పయోవిహారు భయకంప విధూరు మహాండ భీరు ఆవీర కుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్ ధీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా మంచి ఆ పచ్చని పట్టు పంచె కట్టుకొని శిఖిలో పించాన్ని పెట్టుకొని జగన్మోహనాకారుడైన పరమాత్మ దాని ఆయనలో పడితే తన అనేకమైనటువంటి పడగలతో ఆయన్ని కాటు వేశాడు ఆయన శరీరాన్ని మొత్తం గాయపరిచాడు పరమాత్మ శరీరం అంతా గాయమైంది కాయము గాయమైంది కరచి తిరుతివక మరియును వెరువక నిజవదన జనిత విషదహన శిఖల్ మెరయతన ఇడుద గొడలిని నెరిహరి బెనగనియే భుజగ నివహపతి పడిన్ సరే భోగభోగ పరివేష్టితుడి చేష్టలు లేని వాడైనట్టు పడిపోయినట్టు మన స్వామి లాగా అనమాట వాడంటాడు కనురెప్ప కదలటం లేదు శ్వాస ఆడటం లేదు వింటున్నాం కదా ఈయన కూడా చేష్టలుడిగినట్టుగా పడుకొని ఉన్నాడు పాపం పిల్లలందరూ స్నేహితులంతా చూస్తున్నారు అయ్యో మన కృష్ణుడిని పాము కరిచింది పాము కరిచింది వద్దంటే విన్నాడు కాదు అదిగో చక్కగా ఆడుతూ పాడుతూ హాయిగా ఉన్నవాడు ఆ నీళ్ళల్లో పడ్డాడు పడ్డ వాడికి ఎక్కడా చలనం లేదు మనం దూకలేం ఏం చేయలేం పైగా కాళీయుడి పడగలు ఇంకా కాటు వేస్తూ ఉన్నాయి చూడండి పరమాత్మకి ఎటువంటి కష్టం వచ్చిందో అయినా ఆయనకేం కాల అది పాయింట్ ఏమిటంటే ఇంత చెప్పుకున్న ఆయన హాయిగా అట్ట పడుకొని ఉన్నాడు అట్ట అక్కడ ఆ పడుకున్నటువంటి సమయంలో ఆ పక్కనున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఆందోళన కలుగుతున్నది అదేమన్నా కృష్ణున్ కరిచే అరే మన కృష్ణుడిని కరిచిందిరా మరి పడ్డవాడు ఎవడు కృష్ణుడే ఇంకెవడు దిగుకినవాడే లేడు అంతట లోకభుజంగం బందు దుర్మదమున వేన చుట్టుకొని మానక ఉన్నది కరిచింది తన ఆ శరీరంతో శ్రీకృష్ణ పరమాత్మను చుట్టుచుట్టు ఇంక పాము కదా అది తోక దగ్గర నుంచి ఆయన పాదాల దగ్గర నుంచి కంఠం వరకు కూడా మొత్తం బిగించింది దాంతో ఆయన ఏం కదలలేక పోతున్నాడు ఇంక ఏమి సేయుదము ఎట చొత్తుము ఏ పురుషులు పుదురు ఈ అహిని అడ్డపెట్ట ఎయ్యది సదుపాయమల్చు పడిరి ఆర్త రవంబుల తూలి గోపకుల్ శ్రీ అసలు అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే విష వాయువులతో పోవాలి కదా పోలే కానీ ఇప్పుడు తూలిపోతున్నారట శ్రీకృష్ణ పరమాత్మ మన కృష్ణుడికి ఇంత కష్టం వచ్చింది మనం ఏం చేయలేమి అనేటువంటి ఆ బాధతో ఆర్తరావాలు చేస్తున్నారు అరుస్తున్నారు గందరగోళ పడిపోతున్నారు గోపకుమార శేఖరు ఏపున సర్పంబు కరచుట ఈక్షించి చూచి వగన్ మేపులకు తొలగి గోవులు వాపోవుచుండె వృషభ వత్సములతో తమ దూరలతో కూడా చెప్తున్నాయి అట మన కృష్ణుడికి కష్టం వచ్చింది ఈ కృష్ణుణ్ణి ఆ పాము కట్టుకున్నది పోయి పోయి నాయన మడుగులో ఈ కథ అంతా చెప్పుకుంటూ ఉన్నాయి మనం చెప్పుకున్నట్లే అలా చెప్పుకుంటే అప్పుడు ఏమైంది రెండు సంఘటనలు జరిగినాయి భూతలము వడకే భూదేవి ఒక్కసారి ఇట్లా ఉడికిందట ఉడికిపోయింది ఉల్ఖాపాతంబులు మింటగా నబడే ఘోషములో వ్రేతలకు గోపసంఘాతములకు అదరే పలుకడన్నా కన్ను నినేశా భూమి కంపించింది మింట నుండి ఉల్కలు పడుతున్నాయి అయినా ఏ రకమైన కదలిక లేదు శ్రీకృష్ణ పరమాత్మలో అది పరిస్థితి ఇక అప్పుడు వీళ్ళందరూ వచ్చారు ఎవరు నందుడు మిగతా వృద్ధులంతా గోపవృద్ధులందరూ పెద్ద వాళ్ళంతా ఊళ్లోకి వచ్చారు ఈ పిల్లలకి చెప్తే వీళ్ళు మాట వినరు వెళ్ళద్దు అంటే ఏదో అసలు కృష్ణుడు మన వాడిదే తప్పు ఓ లీడర్షిప్ తీసుకొని వీళ్ళందరినీ బట్టికెళ్ళాడు పోయి ఏం చేసాడంటే తనే ఇరుక్కున్నాడు ఇది మన వల్ల వాడి వల్ల మనకు అపకీర్తి ఇవన్నీ వాళ్ళు అనవలసినవన్నీ అంటున్నారు అప్పుడు పరమాత్మకి అట రాముడు అంటే చాలా ఇష్టం అంట ఎంతో ఇష్టం రాముడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువై వచ్చినా ఆయనను అందరూ రాముడు అంటారు గాని ఆయన ఆయన్ని రామ అనుకోలేదుగా లోకమంతా రామ అంటుందట మరి నేను ఎవరిని రామ అని పిలవాలి అనుకొని పరశురాముడిని తెచ్చుకున్నాడట వెంబడి అది చమత్కారం కనీసం ఒక్కసారైనా పరశురామ పరశురామ అనాలిగా ఆ వాసన ఆయనకి పోయిందట అలాగే ద్వాపర యుగంలోకి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ రామ శబ్దాన్ని వదిలిపెట్టలేక తన అన్నగారికి బలరామ అని పేరు పెట్టుకున్నాడట అది ఆ రామ శబ్దంలో ఉన్న అందుకనే సాయిరాముడు కూడా సాయి రామ శబ్దం వదిలిపెట్టకుండా ఈయన బట్ట కూర్చున్నారు అది రామ శబ్దంలో ఉన్న మాధుర్యం అది వారి భంగి ఎరుంగని వారై హరి చూడగోవనడిపడిన గుచున్ వారింపడయ్యే రాముడు వారిని హరిలా వరంగు వాడయ్యు దుపా. వీళ్ళందరూ మనం వెళ్దాం ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం కట్టెలు పట్టుకు వద్దాం వీణ్ణి చంపుదాం అంటే బలరాముడు ఒక్కటే చెప్పాడు జరుగుతున్నది చూస్తూ ఉండండి ఏం మాట్లాడకండి ఏమి interfere కాకండి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. చేస్తానని వెళ్ళాడు దూకాడుగా దూకి ఉన్నాడుగా ఉండి ఆ కృష్ణుడికి ఏం కాలేదుగా మీరు ఇక్కడే ఉడ్డునే ఉండండి అన్నాడు బలరాముడు. బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మకి కాస్త అన్నగారు ఎంత అన్నగారు అంటే ఇంత అన్నగారు అది పెద్ద అన్నగారేం కాదు కాబట్టి ఆ బలరామ శబ్దం చేసుకున్నాడు అయిన తర్వాత ఏమయ్యా వాళ్ళ బాధ కలిగింది. ఎదురు వచ్చిన చాలవు ఎదురుగా చనుదెన్తు ఎదురు వచ్చిన నేడు అదేలరావు. మేము ఎదురొస్తే నువ్వు ఎదురొస్తావు ఇవేళ రాదే. చూచిన కృపతోడ చూచుచుందువు నీవు చూచిన కనువిచ్చి చూడవేల. మేము నిన్ను చూస్తున్నాం నువ్వు మమ్మల్ని చూస్తున్నావు ఇవేళ మేము నిన్ను చూడలేము నువ్వు మమ్మల్ని చూడలేవు ఇదేం పరిస్థితి అయ్యా అని అడుగుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ కాళీయవర్ధనం ఈ వేళే రావటం కదా. దాసిననరలేక డాయంగ వత్తువు దాసిన నేటికి డాయవిటట. నీకు ఎంత దగ్గర అవుతామని మేము వస్తామో నువ్వు మాకంటే ముందు మాకు దగ్గరగా వస్తావు. నేను నీకు దగ్గరగా రాలేకపోతున్నాను నువ్వు మా దగ్గరికి రాలేకపోతున్నావు. [లాఫ్టర్] చీరిన అంటే పిలిచిన ఓ యని జలరేగి పలుకుదువు. సాయి అంటే ఓయ్ అని పలుకుతావు అని కదా మాట పలికావు కానీ ఇది ఏమి చీరిన ఎరుగకుంత మేము అరుస్తున్నాం గానీ నువ్వు వింటున్నావో లేదో మాకు తెలియదు. తలపు సేయునంత తలపోయుచుందువు తలపు సేయనేడు తలపదకట అనుచు భక్తి వివశలాడడి కైవడి వ్రేతలల్లాడి వివశలైరి. ఆలోచించి ఆలోచించి గోపబాలురు అందరూ అలసిపోయినారు. ఆ అలసటలో అందరూ ఒడ్డున ఉన్నారు దానికి ఎవరయ్యా leadership తీసుకున్నారు అంటే బలరామ దేవుడు తీసుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు కాళీయుడి పరిష్వంగంలో ఉన్నాడు. సర్ప పరిష్వంగం అంటే సర్పం ఒక వస్తువును చుట్టుకుంటే అది వదలాలనుకుంటే తప్ప దాన్ని వదలచగలిగిన వాడు లేడు. దానినే కాల సర్ప పరిష్వంగం అన్నారు. అంటే పాము కౌగిలి భయంకరమైన కౌగిలి కాలము అంటే కాలము అంటే పాము కాలము అంటే ఆయువు కాలము అంటే మృత్యువు. మృత్యు పాశంలో ఉన్న వాడిని మృత్యుంజయుడే తనంతట తాను విడిపించుకోవాలి తప్ప సామాన్య మానవుడు ఆయనను విడిపించలేడు అని చెప్తున్నది కాళీయవర్ధనంలో. అప్పుడు నంద యశోదా దులు కూడా వచ్చేశారు ఇక్కడ విషాగ్నులన్నీ ముందు ఆగిపోయినాయి మామూలు వాటవిగా ఉన్నది అది. ఆ సమయంలో విషకుచయగు రక్కసి విషకుచ దుగ్ధంబు త్రావి విషవిజయుడవై. నీకు విషమిచ్చి పాలిచ్చి విషం కలిపిన పాలిచ్చి చంపుదాం అని వచ్చిన విషకన్యనే నువ్వు సంహారం చేశావు కదా శ్రీకృష్ణా! నీ కథ మాకు తెలుసయ్యా పూతన సంహారం అలాగే కదా చేశావు. విషరుహ లోచన పద్మములవంటి కనులు కలిగిన ఓ పరమాత్మ! అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కగదా. ఇన్ని చెప్తే ఏమంటున్నారంటే ఈ పాము విషం నీకు ఎక్కింది కదా అంటున్నారు. అంటే ఏమిటి పూతన విషం పాలు ఇచ్చినా నువ్వు జయించావు బయట పడ్డావు అయినా పాపం నీకు ఇవేళ కాలింది విషం ఎక్కింది అంటున్నారు. ఎక్కుతుందా? వివేకం కొల్పోతే ఆయనకు కూడా విషం ఎక్కిందేమో అనిపిస్తుంది విషం ఎక్కలేదు ఎక్కినట్టు కనిపిస్తున్నాడు ఆయన. అప్పుడు పన్నగము మన్ను కర్మము గరవక నిన్నేటికి కరచకుర్రా. మనం కూడా అంటున్నాం స్వామి నీకు వచ్చిన ఇబ్బంది ఏదన్నా నిజంగా అయితే కాస్త మాకిస్తే బాగుండు కదా మేము అనుభవిస్తాం ఏదో పది రోజులో వారం రోజులో మా శక్తికి మించి అయితే చేయలేం గానీ మా శక్తి మేము చేయగలిగినంత మేము అనుభవించడానికి సిద్ధమే తండ్రీ అని మనం అంటున్నట్లే పాపం వాళ్ళంతా అంటూ నిమ్మగలిగి నీవున్నను మమ్ము రక్షింతువు. అసలు నిజం అన్నీ బాగుండి నువ్వంటూ ఉంటే మమ్మల్ని రక్షించటానికి ఉన్నావ్ మేమందరము ఉండి నిన్నేమి రక్షించగలమయ్యా. ఎంత గొప్ప భావన చూడండి స్వామి తత్వానికి కరెక్ట్ గా ద్వాపర యుగంలో వేదవ్యాసులవారు రాసింది ఇవాళ ఈ క్షణాన మనకు అక్కడికి వచ్చింది. మనందరము ఉన్నా స్వామికి ఏం పనికొచ్చే వాళ్ళం కాదు స్వామి ఒక్కడే ఉంటే సర్వ భువనాలకి కూడా ఆయన జగద్రక్షకుడు అయి ఉంటాడు ఆయన. చూడవదేమి గారవపు చూపుల మమ్ము సఖాణితోడ మాట ఆడవదేమి నర్మముగ అందెలు పాదము నందు మోయ నేడు ఆడవు అదేమి నర్తనము. అదేమిటయ్యా నీ కాళ్ళకి మీ అమ్మ కట్టినటువంటి గజ్జెలు ఘలం ఘలం అంటుంటే కృష్ణుడు వస్తున్నాడన్నటువంటి స్పురణ కలిగేదే అవన్నీ ఏమైపోయినాయి. గోపిక వలెన్ కూడవు అదేమి నవ్వులకు గోపకుమార వరేన్య చెప్పుమా. ఎట్లాగయ్యా నువ్వు మాట్లాడకపోతే. నీవు సర్పదష్టుండవయ్యన్న ഇതట మాకు ప్రభువులు ఎవ్వరింక మరగి పాలలేము మాకు నీతోడిద లోకము ఇవులేని లోకంము మాకేల. నువ్వు నావు గనుక మాకు ఈ లోకంలో పని ఉందయ్యా నువ్వే లేకపోతే మాకు ఈ లోకంలో ఏం పని ఉందో చెప్పు. ఏమైనా ఉందా ఇక్కడ మళ్ళీ సంసారం మళ్ళీ కిరాణా కొట్టు మళ్ళీ అది ఇది ఇవేగా.నువ్వు ఉన్నావు గనుక ప్రతిరోజూ నీ గురించి సంకీర్తన చేస్తున్నాం అని పాపం ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఓ పోదాం ఆ మడుగులో పడి ఆయనతో పాటే మనం కూడా పోదాం అనుకున్నారట కృష్ణుతోడన మడుగు చత్తము చత్తము అనుకున్నారట అడుగు దాంట్లో ప్రవేశించి పోతే కృష్ణుడితో సహా పోదాం అనుకొని కృష్ణ విరహ వేదనల భార తప్తులై మడుగు దొడదారుచున్న వాళ్ళ కనుంగరి భదవంతుడైన బలభద్రుడు మీరు మీరెరుంగరు మీకు తెలియదా ఆయన ఎవడో ధైర్యము వెడుచుట కార్యము కాదు సహించి చూడుండు దీనిని భరిస్తూ చూస్తూ ఉండండి అన్నాడు చూట్టమే కష్టం భరించటం మరింత కష్టం చూస్తూ భరించడం మరింత కష్టం కదా అయినా తప్పదంటున్నాడు చేయగలిగిందేమీ లేదు అప్పుడు తలుగూర్చి విధంబున గనిటలు బిడ్డలు దారుగా పోయెడి ఘోశ నివాసులగని కృష్ణుడు మనుజుని క్రియలు ఒక ముహూర్తమాత్రము జరపన్ పాపం వీళ్ళంతా నా గురించి ఇంత యాతన పడిపోతున్నారు అని చాలాకాలం ఉండవలసినటువంటి యాతనని ఒక్క క్షణంలో ఆపేశాడట అంటే ఇక వాళ్ళకా యాతన పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు ఏం చేశాడో తెలుసునా ఏం చేస్తాడు దాన్ని చంపుతాడా కత్తి లేదు నీళ్ళల్లో దూకాడు పోయి పోయి దాని పరిశ్వంగంలో కవుగిల్లో పడ్డాడు పాము చుట్టుకొని ఉంది కృష్ణుండు మేను పెంప కృష్ణుడు తన శరీరాన్ని వామనావతారంలో త్రివిక్రముడు పెంచినట్టుగా పెంచుతూ వెళ్ళాడు భుజంబుడు ఆవృత్తులంబాపి కృష్ణుడు పెరుగుతున్న కొద్ది చుట్టుకున్న చుట్లు అన్నీ సడలిపోవటం లూస్ అయిపోవటం మొదలు పెట్టినాయి ఆవృత్తం అంటే చుట్టు తాసం తాప్త భోగుడై కరచుట చాలించి ఇదేం నా శరీరం పోతుందని వాడు ముందు కరవటం మానేశాడట నిట్టూర్పుతో శ్రాంతుండై తల ఎత్తి దుర్విషము నాసావీధుల్ ఎన్క్రమ్మ దుశ్చింతల్ దికులు చుచుచుండె తలగి నిల్చెన్ ధూమ కాష్ఠాకృతిన్ పైకి చూస్తే అందరూ కనిపించారు ఎంత సాహసం ఈ గోప బాలలు అంతా నా చుట్టూ ఉంటారా అని లోపల నుంచి విషాగ్నులు చల్లుతుంటే విషమంతా కూడా ఆకాశమంతా నిండిపోయిందా అన్నట్లుగా ఒక వాతావరణం ఏర్పడింది విరమరలేని యెట్టి బలువీరుడు కృష్ణ కుమారుడు ఒక్కచే చరచి ఖగేంద్ర చందంబున చక్కన దౌడలు బట్టి కన్నులంచర చర దుర్విషానలము జొబ్బులు చుండుగ యెత్తి నీలతో చిర చిరం త్రిపి వైచే పరిశేషిత దర్పము క్రూర సర్పమున్ దాని శరీరం ఎప్పుడైతే బలహీన పడిందో ఆ తోక పట్టుకున్నట్ట గిర గిర గిర కృష్ణ కుమారుడు అన్నాడు ఆ కృష్ణ కుమారుడు ఎలా ఉన్నాడంటే కాళీయుడు నల్లన కాళీయుడు ఉన్నటువంటి మడుగు నల్లన ఆ మడుగులో ఉన్నటువంటి కృష్ణుడు నల్లల ఎవరు ఎవరిని ఏం చేస్తున్నారో తెలియదంతా చీకటి యుద్ధంలా ఉన్నది అద్భుత దృశ్యం ఇది [దగ్గిన శబ్దం] జగజెట్టియైన నందుని బెట్టి నెట్టించిన సంభ్రమంబున అప్పుడు ఏమైంది ఇటువంటి ఉత్తమోత్తమమైనటువంటి కార్యక్రమాలు దివ్య లీలలు జరుగుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు ఆయన్ని వెంటబెట్టుకొని ఉంటారు వెంట అంటి ఉంటారు స్వామి తన దర్శనాన్ని గురించి వర్ణిస్తూ ఒక మాట చెప్పారు చాలా ఏళ్ల క్రితం నా దర్శనం వచ్చేవేళ మీ మనస్సును నాయందే నిలపండి ఆ క్షణాన మీ కనులకు కడపని ముప్పది ముక్కోటి దేవతలు నా దర్శనం కోసం కాచుకొని ఉంటారు మీరు కనపడే యాభై మంది వంద మంది కాదు ముప్పది ముక్కోటి దేవతలు సూక్ష్మ శరీరంలో ఉంటారు వాళ్లందరి యొక్క అనుగ్రహం మీ మీద పడుతూ ఉంటుంది వారు నా కోసం వస్తారు నా దర్శనం అంటే వాళ్లతో కలిపి నన్ను చూసినట్లు ఈయన కూడా అదే చెప్తున్నాడు ఆ సమయంలో ఏమైంది ఆ కాళీ కాళీయుడిని ఇట్లా తిప్పి తిప్పి వదిలిపెట్టాడు ఘనయమునానది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు గాగ దానిలో ఉన్నటువంటి నీళ్లన్నీ భుగభుగాయితం అయిపోయినాయి ఒక మృదంగం వాయించినట్టుగా ఉందట ఆ మృదంగ శబ్దం వినిపించిందంట మృత్ అంగము మృదంగం అది మట్టితో చేసినటువంటి శరీరంలో నుంచి వచ్చేటువంటి మనలో వచ్చేటువంటి నాదాలన్నీ కూడా మృదంగ స్వనాలే సాధు బృందావన చరన్ చంచరీక గానంబు గాయక సుమ గానంబు గాగ కలహంస సారకమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దంబులు గాగ రాగం తాళం పల్లవి మధ్యర అంతా సంగీత ఘోష అయిపోయింది కాళీయుడి మడుగు అంతా దివి యుండి వీక్షింతు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు గాగ పైన కూర్చున్న వాళ్లంతా సభ ఏం జరుగుతున్నదో చూస్తున్నారట కింద పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత క్రాణియ హరి ఫణామండ కొమున నళిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్యమై పుణ్యమున పేర్చి నృత్యమాడే ఎంత అందమైన పద్యం ఆ గిరగిర తిప్పి వదిలిపెట్టాడు పడగలు లేపినయి నూటొక్క పడగలు ఆ నూటొక్క పడగల మీద శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి ఎగిరి దానిమీద నుంచొని ఏం చేస్తున్నాడంటే ఆయన నిత్య నర్తకుడట మనకు డాన్స్ అంటే నేర్చుకోవాలి నేర్పేవాడు కావాలి ఆయన నిత్య నర్తకుడు శివుడు కూడా నిత్య నర్తకుడే కాకపోతే ఈయన ఇది నిటాళేక్షనుండు గజ్జ గట్టియాడు రంగస్థలంబు అంటాడు జాషువా స్మశ మహాస్మశానంలో మహారుద్రుడి యొక్క సం సం సంచారాన్ని అట్లా వర్ణిస్తాడాయన అలాగేఈయన dance చేస్తున్నాడు పైన మర్దనం చేస్తున్నాడు ఈ పడగ నుంచి ఆ పడగ చాలా పెద్దది పాదాలు చిన్నవి శ్రీకృష్ణ పరమాత్మ ఐదు సంవత్సరాల బాలుడు కుక్షిన్ లోక లోకములున్న గౌరవముతో గోపాకృతినున్న ఆరక్షోహంత బడిన్ మహా బడి భణారన్య ప్రదేశంబుపై అక్షీణోద్ధతినాడు పాడు చలగున్ హాసంబుతోడన్ పద ప్రక్షేపంబులు చేయు కేళికతులన్ ప్రాణైక శేషంబుగన్ ప్రాణమే కాస్త మిగిలి ఉన్నటువంటి స్థితిలో ఈ భోగభోగాయితమైనటువంటి నూటొక్క పడగల మీద కృష్ణుడు అటు ఇటు హాయిగా దాన్నొక రంగస్థలం చేశాడు ఒక dye up చేసుకున్నాడు ఆడుతూ ఉన్నాడు ఆడుతూ ఉంటే ఘనతర సుశిరానంద స్వరములతో సిద్ధ సాధ్య చారణ గంధర్వ నిలింప మునిసతులు చెయ్యెన కురిసిరి విరుల వానలు ఆడెడు హరిపై అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీలంతా కూడా ఆడుతున్న శ్రీహరి మీద శ్రీకృష్ణ పరమాత్మ మీద తాండవ కేళి సలుపుతున్నటువంటి పరమాత్మ మీద పుష్పవృష్టి కురిపించారట ఎందుకంటే అది నయన మనోహర దృశ్యం అది ఎప్పుడూ జరగదు కాళీయుడు అక్కడే తాండవ నృత్యము ఒక్కసారే ఈ తాండవ నృత్యం అక్కడ చేశాడు ఆ సమయంలో [దగ్గిన శబ్దం] వీళ్లంతా ఒక్కొక్క పడగని ఒక్కొక్కన్ని నొక్కుతూ వచ్చాడాయన నొక్కినప్పుడల్లా లోపల ఉన్న విషాగ్నులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఆ సమయంలో కాళీయుడి భార్యలున్నారు వాళ్ళందరూ పాపం వచ్చారు వచ్చి "వీడు మంచివాడే ఏం చేస్తాం దీంట్లో పద్యం ఉంది ఆ పద్యంలో ఏముందంటే అసలు మా జన్మే విష జన్మ విషం ఉంది పాముకి విషం ఉందని నువ్వెందుకయ్యా మా మీద నా మీద గంతులేస్తున్నావ్ అసలు నన్ను పుట్టించింది నువ్వే కదా అప్పుడే అమృతం గనక పంపితే ఈ ప్రమాదం నీకు ఉండేది కాదు మాకు ఉండేది కాదు పుట్టించడమేమో నువ్వు విషం నింపింది నువ్వు పోగొడుతున్నది నువ్వు మధ్యలో నేనేం చేశాను కాబట్టి నేను ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదు మాది మడుగు మేం నీళ్ళల్లోనే ఉండాలి మా దగ్గర ఉన్న విషం వదిలిపెట్టాలి వదిలి పెడుతున్నాం నీళ్ళల్లో కరిగింది అది విష జలాలయినాయి అసలు మడుగులో లేనట్టు ఇక్కడే కాగాలని మీకెందుకు అనిపించింది కాబట్టి క్షమించి వదిలిపెట్టండి మా" అని అంటుండగా కృష్ణుడు అన్నాడు "యోగ యోగీంద్రులు ఎవరూ పొందనటువంటి తాండవ నృత్యం వీడి కోసం చేశాను వాడిలో ఉన్నటువంటి విషాగ్నులన్నీ గనక పోయినట్లయితే వాడు సుఖ జీవనం చేయగలుగుతాడు వీడి పూర్వ వృత్తాంతం నాకు తెలుసు" అన్నాడు రమణకం అనేటువంటి ఒక ఆశ్రమంలో వీడి పూర్వ జన్మలో ఈ కాళీయుడు గరుడుడి మీద దాడి చేశాడు చేసేప్పటికి వాడు గరుడుడు గరుత్మంతుడు పాము వైరి వైరి జీవాలు పారిపోయి కాళింది మడుగులోకి వచ్చి వీడు దాక్కున్నాడు ఈ దాక్కున్న వాడిని బయటకు తెచ్చిన వాడు ఎవడంటే మళ్ళీ లీలా వినోది అయిన కృష్ణుడు పాపం వాడు ఏం అడిగాడంటే భార్యలు అడగ్గానే కృష్ణుడు దయామయుడు "సరే అలాగే ఓ పని చేయండి ఈ క్షణమే నీ భర్త కాళీయుడిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకేం అభ్యంతరం లేదు చంపాలని ఏం లేదు ఎక్కడో అక్కడ బతకండి హాయిగా" అన్నాడు కాళీయుడు అన్నాడు "బానే ఉంది నువ్వు అనుగ్రహించావు నువ్వు పంపుతావ్ నువ్వు వెళ్ళమన్నావ్ బానే ఉంది గరుత్మంతుడిని ఏం చేద్దాం వాడు వాడు పాత పగ పట్టుకున్నాడు అసలే మాది వైరి జాతి ఇట్టా అనే అట పాకుతూ వెళ్లే time లోనే పట్టుకుపోయినాడనుకో అంటే" "పిచ్చివాడా! నీకు వరం అలా ఇచ్చానా? నీ నూటొక్క పడగల మీద నా చిన్ముద్రలు వేశా శ్రీకృష్ణ పాదాలు దానిమీద ఉన్నాయి కృష్ణ పాదం చూసినప్పుడు గరుడుడు నీ జోలికి రాడు హాయిగా బతకమ్మన్నాడు అంటే కాళీయున్ని హింసించినట్టా? రక్షించినట్లా? అనుగ్రహించినట్లా? కరుణ చూపించినట్లా? అంటే కరుణే చూపించాడు పరమాత్మ స్వామి అన్నట్లు అసలు శిక్షించేది అవతారాలు కావన్నారు స్వామి అవతారాలు శిక్షణ ఇవ్వటానికే వస్తాయి ఇక మరీ మాట వినకపోతే శిశుపాలుడి లాగా లేకపోతే ఆయనకేం పని ఆయన కానివ్వండి వందసార్లు తిట్టాడాయన అయినా ఓపికగా భరించాడా లేడా? భరించాడు కానీ అన్నాడు వీడికి అసలు అల్పాయుష్కుడు వీడు అయినా ఏదో అత్తకి మాట ఇచ్చాను గనుక నన్ను ఎలాగో వాడు దర్శనం చేయాలి జీవితంలో నూరుసార్లు వాడు తిడతాడు నేను త్రాచుకుంటాను నూట ఒకటి తర్వాత నా ప్రమేయం లేదన్నాడు అలాగే కాళీయుడి యొక్క పని ప్రణాగ్రం మీద నిత్య నర్తకుడైనటువంటి గోపాల దేవుడు చేసినటువంటి ఆ నాట్యం యొక్క ముద్రలే ఆ రాజ సర్పాల మీద ఉంటాయి కాచు పాముల మీద ఉంటాయి కృష్ణ పాదాలు కృష్ణ పాదము ఉన్నా మన అరచేత గరుడ రేఖ ఉన్నా పాములు మన దగ్గరకు రావు గరుత్మంతుడు అన్నివేళలా కాపాడుతాడు గరుత్మంతుడు అంటే శ్రీ మహా విష్ణువు యొక్క వాహనం అనే కాదు శ్రీ మహా విష్ణువు యొక్క వేగ ఆవేగాలకి అది సంకేతం కాబట్టి ఆ రెండు రెక్కలు ఒకటి ధ్యానము రెండవది యోగము రెండవది ఒకటి కర్మ రెండవది భక్తి లేదా ఒకటి భక్తి అయితే రెండవది జ్ఞానం ఒకటి కర్మ అయితే కర్మ జ్ఞానాలు కర్మ భక్తులు భక్తి జ్ఞానాలు కర్మ జ్ఞానాలు అనేక రకాలుగా రెండు రెండుగా ఉంటాయి గనుక పక్షికి రెండు రెక్కలే ఉంటాయి కానీ అధ్యాత్మ చరిత్రలో ఒక పక్షి ఉన్నది ఆ పక్షికి మూడు రెక్కలున్నాయి అది వేదంలో వర్ణించారు ఆ మూడవ రెక్క ఏమిటి అంటే అసలు రెక్క దానిది ఈ రెండు రెక్కలు భౌతికమైన రెండు రెక్కలు రాలిపోయినా దాని ఆంతరంగికమైనటువంటి ఆ శక్తితో అది గగన గగనాంతరాలు ఎగరగలదు గనుక అటువంటి స్థితిలోకి అటువంటి అనుగ్రహాన్ని కాళీయుడిచ్చాడు మనకి డెబ్బై రెండు వేల నాడులున్నాయి ఈ శరీరంలో అందరికీ ఈ డెబ్బై రెండు వేల నాడులలో నూట ఒక్కటి జ్ఞాన నాడులు ఆ నూట ఒక్క జ్ఞాన నాడులలో సుమారుగాపదకొండు నాడులు చాలా ప్రధానమైనటువంటి నాడులు. ఆ పదకొండులో మూడు చాలా ప్రధానమైనటువంటి నాడులు. ఈ మూడింటి వలనే మన జీవితాలు మన ఆయుష్షు అన్ని మన సంకల్పాలు మన భోగాలు మన అధ్యాత్మ మన సంస్కారాలు అన్నీ కూడా వాటిలో ఇమిడి ఉంటాయి. దాని పేరు ఒకటి ఇడా, రెండవది పింగళ, మూడవది సుషుమ్నా. ఇడా పింగళ రెండు ఈ ముక్కు రంధ్రాలు కుడి ఎడమ. ఆ మధ్య నుంచి మూలాధారం నుంచి కంటికి కనపడకుండా సాగేటువంటిది సుషుమ్నా నాడి గనుక అది ప్రయాగలో త్రివేణి సంగమంలో గంగా యమునా రెండు ఉంటాయి సరస్వతి ఒక చాలువలే కనిపిస్తుంది. నల్ల చార. అది ఒక అంతర్ వాహిని. ఆ అంతర్ వాహిని సరస్వతీ నదే సుషుమ్నా నాడి. జీవుడి యొక్క ప్రయాణం, జీవుడి యొక్క జీవితం, జీవుడి యొక్క అనేక ఉచ్ఛ్వాస నిశ్వాసల గమన వేగం అంతా కూడా త్రివేణి సంగమ స్థలంగా భావన చేయాలి. త్రివేణి సంగమం అక్కడ ఒక replica ఒక ప్రతీకాత్మకంగా ఒక నది లాగా ఉన్నది. మన జీవన ప్రవాహంలో కూడా మానవుడి జీవన ఆయుష్షు అంతా ఒక నది అయినట్లయితే ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి అనేక ప్రదేశాలను సుక్షేత్రాలని సుసంపన్నం చేస్తూ జీవనం చివరలో పరమేశ్వరుడు అనేటువంటి సాగరాన్ని మెల్లగా చల్లగా సంగమించినట్లుగా ఈ నదీనదాలు కూడా అట్లాగే సంగమిస్తాయి. కనుకనే చిట్టచివర ఊపిరి దేనియందు సంగమిస్తున్నది అంటే విశ్వవ్యాపకుడైన, విశ్వంభరుడైన, విశ్వత్మకుడైన, విశ్వత్మకుతో కూడి ఉన్నటువంటి మహత్తత్వంతో కూడినటువంటి పరమాత్మ యందు ఆ ఊపిరి లగ్నం కావాలి. లగ్నమయ్యే దాకా నిమగ్నం కావాలి. నిమగ్నమయ్యే దాకా యుగ్మంగా ఉండాలి. యుగ్మము అంటే రెండు కూడి ఉండటం. నిమగ్నం దానిలో దాని యందే ఒక తపస్సుగా నిలబెట్టుకోవటం. చివరగా లగ్నం కావటం అంటే లీనం కావటం, లయం కావటం, ఇది అది కావటం, ఇది పూర్ణమైనటువంటి ఒక అధ్యాత్మ భావనా స్థితి గనుక సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు ఒక గోపాల బాలకుడుగా వచ్చి కాళింది మడుగులో అది హ్రదము అన్నారు. హ్రదమన్నా, మడుగు అన్నా, సరస్సు అన్నా ఇవన్నీ కూడా అనేక పేర్లు. దానిలో పరమాత్మ అడుగు పెట్టిన తర్వాత సుజలాలు అయినాయి. ఆ ప్రదేశానికి అది ఒక తీర్థం అయింది. అక్కడ ఉన్నటువంటి వారంతా హాయిగా శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు కాళింది వాడు వెళ్లిపోయినాడు కాళీయుడు మీరందరూ వచ్చి హాయిగా ఈత కొట్టండి అన్నాడు. మనమందరం కలిసి ఆడుకుందాం రండి అన్నాడు. వాళ్ళతో మళ్ళీ ఆ లీలా వినోదాన్ని తాను ఏమీ ఎరగనట్టుగా తాను దానికేదో బంధితుడైనట్లుగా పరమాత్మ సాగించినటువంటి ఒక దివ్య లీలా కాండ. సాయిరాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 65
Bhagawata Navaneetham - 65
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 26:58
More in this series