No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కంసుడులో రెండు పారిశ్రాములున్నాయి. ఒకటి పశ్చాత్తాపమున్నది రెండవది ప్రాణభయమున్నది పశ్చాత్తాపం ఒక్క పాలు ప్రాణభయం తొంబై తొమ్మిది పాళ్ళు పశ్చాత్తాపం కలిగినప్పుడల్లా దేవకి వసుదేవులతో మామూలుగా మాట్లాడతాడు అది తొలగగానే ఆ ప్రాణభయానికి లోబడి అన్ని రకాల వృత్తులు కూడా మనోవృత్తులు కూడా విజృంభిస్తాయి. వాడంటున్నాడు చూడండి పాపుడ బాలఘాతకుడ బంధువిరక్తుడ దుష్టచిత్తుడన్ కోపనుడన్ జరస్మృతుడ క్రూరుడ బ్రాహ్మణఘంత భంగి మీ పాపల చంపితిన్ బయలి బల్కులనన్మితి ఆకాశంలో మాట విని నీ కడుపున పుట్టిన పిల్లలందరినీ చంపె అంటున్నాడు దేవకితో వసుదేవుడితో సాధునారనా పాపములు గడింపగ కృపాపరులై కనరే క్షమింపరే నన్ను క్షమించండి శాంతంగా ఉండండి నేను ఈ పొరపాట్లు చేశానంటున్నాడు చెల్లెలితో అయితే వాసుదేవుడు అన్నీ విని కంసుడితో ఏమన్నాడంటే బావా నీ వచనంబు నికనుసుని ప్రాణుల్ గత జ్ఞానులై నీనేనంచు లోభమోహమదభీ నిర్మిత్రతామోద శోకావేశంబుల గొందరులం పడుతురు. నువ్వు నేను నువ్వు నేను అది ఇది వాడు వీడు అంటూ ద్వైత భావంలో జీవిస్తూ ఉంటారు అని వసుదేవుడు సాత్విక గుణ ప్రధానమైనటువంటి వాడు. కనుకనే సత్వ వచనాలు చెప్తున్నాడు ఎవరితో తామసం లో కూడా ఉన్న ఒక సాత్విక రేఖతో మాట్లాడుతున్నాడు పశ్చాత్తాపం ప్రకటించాడు కనుక ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు రేఖాకారుడై సర్వరూపా విష్ణుండగు ఈశ్వరున్ తెలియలేరు సర్వులలో ఉన్నటువంటి ఈశ్వరున్ని మాత్రం తెలియకుండా వాడు వీడు వాడు గొప్ప వాడు వీడు చిన్నవాడు పెద్దవాడు అనే భేదభావంతో ఉంటారు అన్యోన్య విభ్రాంతులై నువ్వెలా అనుకుంటున్నావో నీ ఎదురుగా ఉన్నవాడు కూడా వాడు వీడు అంటూనే ఉన్నాడు ఈ ప్రపంచం అంటే నేను గా ఉన్నటువంటి ఆత్మను ఎరుగలేక శరీరంగా తోపిస్తున్న వెలుగుతున్న కనబడుతున్న ప్రకటయించుతున్న అభివ్యక్తమవుతున్న అర్థమవుతున్నటువంటి ఒక స్వరూపాన్ని చూసి నిజమనుకుంటున్నారు. స్వరూపం నిజం కాదు అరూపమే నిజం కానీ స్వరూపంలో నుంచి అరూపంలోకి వెళ్ళాలి తలుపు తీస్తేనే లోపలికి రాగలం ఆ తలుపు తీసుకోవటమే స్వరూపాన్ని దాటటం ఆ సగుణోపాసన దాటాలి అటువంటి దాంట్లోకి వెళ్ళవయ్యా అని చెప్తున్నాడు మన వసుదేవుడు సరే కంసుడు ఇంటికెళ్ళాడు వాడు చేయవలసిన పని వాడు చేసుకోవాలిగా ఎవడో చెప్తాడు నీ ఫలానా రోజు మృత్యువు ఉందని జ్యోతిష్కుడు యాభై రూపాయలు తీసుకుని వీడికి చెప్తాడు. వీడికి యాభై వేలు ఖర్చవుతుంది మృత్యుంజయ హోమాలు వాడి చుట్టూ వీడి చుట్టూ తిరిగి తిరిగి చిరకిపోతాడు ఆ రోజున అది వేరే సంగతి యాభై పోతాయి యాభై వేలు పోతాయి కానీ వీడు ఏం చేశాడంటే వసుదేవుడు ఇలాగే చెప్తాడు బానే వాడికేంది వాడికేం శాపాలు లేవు వాడి పిల్లలు పుట్టారు వాళ్ళను చంపింది నేను నన్ను చంపడానికి ఎవడో పుట్టాడు అని చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ అడగటానికి కనపడదు నేనేం చేయాలి అనుకుని వాడికి ఎవరున్నారయ్యా అంటే ఇద్దరు ముగ్గురు అడ్వైజర్స్ ఉంటారు. ఆ ఇద్దరు ముగ్గురు అడ్వైజర్స్ని వాడు పిలిచాడు పిలిచి వాడి ఆ భావాలు చూడండి మనోభావాలు ఇట్టైన తడయనీటికి వాళ్ళకి చెప్పాడు ఇదిగో ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరుగుతున్నాడని ఆ శరీ-శరీరవాణి చెప్పిందయ్యా మరి ఏం చేద్దాం అంటే ఇంకా మీరు ఆశ్చ-- అడిగేదేముంది ఆలోచించేదేముంది ఏ దేశం పట్టణముల మండలందు పల్లెలయల్లన్ పుట్టెడి పెరిగెడి శిశువులబట్టి వధించడము మమ్ము పంపుము అధీశ మండలలో పల్లెలలో పట్టణాలలో నగరాలలో మహానగరాలలో మన వాళ్ళందరినీ పెడతాం ఎవరు ఎవరి ఇంటయే పసిబాలుడు అప్పుడే పుట్టినా ఆ శిశువుని అక్కడే మేము చంపేస్తాం ఇక పుట్టినవాడు ఉండడు కాబట్టి నీకు మరణం ఉండదు అన్నారు. అవివేకి అయినటువంటి కంసుడికి ఆనందం కలిగింది చూశారా ఆరుగురు పోయినా ఆ ఎనిమిదవ అష్టమ గర్భం వచ్చి ఉన్న సత్యం చెప్పేదే వెళ్ళింది మొదటి-- మొదటి నాడు ఏం చెప్పిందో ఎనిమిదవ నాడు కూడా అదే చెప్పింది. దాన్ని వదిలేశాడు ప్రాణం నిలబడుతుందనేటువంటి ఆశ పొద్ది పాపం ఈ నలుగురు మంత్రులు వాళ్ళు పోయేవాళ్ళే వాళ్ళు చెప్పిన మాట వీడు విన్నాడు. విని ఇది బాగుంది చాలా బ్రహ్మాండమైన ఆలోచన ఎలాగుంది బతికుంటే కదా మీ అందరికీ ఉద్యోగాలు కాబట్టి ఇదే మీకు ఉద్యోగం పొమ్మన్నాడు సరే వాళ్ళు బయల్దేరారు. బయల్దేరి భవదీయోజ్వల బాహుచాప విలసత్ దానవళి భగ్నులై దివిజాధీశ్వరులు ఏ క్రియన్ జనిరో ఏ దేశంబులన్ దాగిరో శివునిన్ చొచ్చిరో బ్రహ్మ చెందిరో హరిన్ సేవించిరో మౌనివృత్తి వనాంతముల నిల్చిరో మనకు శోధింపన్ తగున్ వల్లభ ఏ ఏ ప్రదేశాలలో అటువంటి వాళ్ళు సర్వ శక్తిమంతులైనటువంటి శిశువులు పుడతారో వాటన్నింటినీ కూడా ఒకవేళ బ్రహ్మ నిత్య తపస్సులో ఉంటాడు.కాబట్టి తపస్సులో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాం కాబట్టి బ్రహ్మ నీ జోలికి రాడు ఇక విష్ణువు అంటావా సర్వవ్యాపకుడై ఉన్నాడు వాళ్ళందరినీ చంపేస్తాం శివుడు వనాంతరాలు లో ఉంటాడు గనుక అక్కడున్న వాళ్ళని చంపుతాం అంటే పసి పిల్లల అందరినీ కూడా మేము చంపడానికి నిర్ణయించుకున్నాం అని ఒక ప్రతిజ్ఞ చేశారు అని ఒక హెచ్చరిక చేశారు మేము అందరం వెళ్ళిపోతాం నువ్వు ఒక్కడివే ఉంటావ్ వాళ్ళని ఎలా భయపెట్టారో చూడండి మేము అడ్వైజ్ ఇవ్వడానికి కూడా ఉండం ఆ పని మీద వెళ్తున్నాం కానీ నువ్వు జాగ్రత్తలో ఉండాలి ఏమిటంటే నొచ్చిరి శాత్రవులనుచును ఆహా శత్రువులందరినీ మా వాళ్ళు వెళ్లి చంపేస్తున్నారు కదా అని విచ్చలవిడి తిరుగవలదు జాగ్రత్త అంటే నువ్వు అంతఃపురం దాటి బయట వాడికి వసుదేవుడికి అక్కడే జైలు కంసుడికి ఇల్లే జైలు అది హౌస్ అరెస్ట్ అనమాట వాడు హెచ్చరిక చేస్తున్నాడు విచ్చలవిడి తిరుగవలదు ఎందుకనంటే వివిధాకృతునం మృత్యులి వత్తురు వాడలు నిన్ను చంపే వాళ్ళు ఒక మాయావేషంలో విచ్చలవిడిగా నువ్వు తిరిగావంటే ఎటునుంచో వచ్చేస్తారు ఏ రక్యంలో వస్తారు ఏ రూపంలో అంటే వివిధాకృతుల్లో విచ్చలవిడి ఎన్ని ఆకారాల్లో వెతుక్కోవాలి చూడండి మరణము మరణభయం గనక వాడు వదిలిపెట్టి ఉన్నట్లయితే కంసుడికి ఆ తను ఉండేది కాదు ఎప్పుడైతే ఒక అశరీరవాణి అష్టమ గర్భం ఒకడు వచ్చి నిన్ను చంపుతాడు అని అన్నాడో దానిని పట్టించుకోకుండా మన పరిక్షిత్ మహారాజు లాగా పరమేశ్వరాయత్తమైనటువంటి చిత్తంతో ఉండి ఉన్నట్లయితే పరమేశ్వరుడే కంసుడికి ఉద్ధారణ ఇచ్చేవాడు కానీ వాడు ప్రాణభయం తామసానికి గుర్తు వాడు చచ్చిన యందాక మరవచ నదు అధిపునకున్ నువ్వు మరణించేదాకా ఈ మూడు గుర్తు పెట్టుకో బయటకు రావద్దు నీకు ఇష్టం వచ్చిన చోటికెల్లా వెళ్ళవద్దు ఎటు నుంచి ఎటు వచ్చి చంపుతారో తెలియదు గనుక మేము ఈ దేశాంతరాలు వెళ్ళిపోతున్నాం అన్నారు సరే ఇహ ఆ నందుడు అదే సమయంలో వాళ్ళు వెళ్ళిపోయినారు నందుడు కప్పం కట్టడానికి ఆ రెవెన్యూ అంతా తెచ్చి ఆ కంసుడికి అప్పజెప్పాడు వసుదేవుడిని పలకరించడానికి వచ్చాడు వసుదేవుడు చుట్టం గనక కష్టంలో ఉన్నాడు కంసాధీనంలో ఉన్నాడు అయినా అప్పటికే కొంత పశ్చాత్తాపం పడ్డాడు వాళ్ళ పట్ల ఇదివరకు ఉన్నటువంటి ద్వేష భావం లేదు కంసుడికి అది కూడా తెలుసుకుని వెళ్ళాడు వెళ్లి ఏం చేశాడంటే వేదవిదులన్ పిలిపించి ఎవరు నందరుడు జలకంబులాడి శుచియై శృంగారించుకొని స్వస్తి పున్యాహ వాచనంబులు చదివించి జాతకర్మలు సేయించి పితృదేవత నర్చించి కేకులతోడ గూడ కైసేసిన పాడి మొదవుల రెండు లక్షలను కనక కలశమణి వసన విశాలంబులైన తిలసైనంబు లేడింటిని భూదేవతలకు ఇచ్చిన తిలాలతో చేసిన ఏడు కొండలు తయారు చేసాడుట నందుడు అక్కడ చేసి దానిమీద గోవులు బంగారం అవన్నీ పెట్టి దానాలు ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ వంటి వాడు తన ఇంట్లో ఈ విచిత్రమైన బాలుడు పుట్టాడు ఆనందమే బాలుడిగా వచ్చినటువంటి వాడు అనేది నందుడి యొక్క ఆనందం కంసుడి యొక్క విషాదము కంసుడి యొక్క భయమంతా మరణం వసుదేవుడిదంతా కూడా సాక్షీభూతమైన స్థితి ఆ కంసుడు పోతాడు ఆయనకు తెలుసు కృష్ణుడు వస్తాడు ఆయనకు తెలుసు మనం విముక్తి కలిగింది ఆయనకు తెలుసు అన్నీ తెలిసిన వాడు స్థిమితంగా ఉన్నాడు అన్నీ తెలుసుకున్నాను అనుకున్నటువంటి నందుడు ప్రాపంచిక ఆనందంలో ఉన్నాడు దానధర్మాలు యజ్ఞాలు యాగాలు దాంట్లో పడిపోయినాడు ఆయన ఎప్పుడు పోతానో తెలియని కంసుడికి మాత్రం నో జీవితం నో మరణం విచిత్రం అంటారు శంకర భగవత్పాదు అది జీవించే జీవితము కాదు మరణించటానికి లేదు మరణిద్దామా ఇష్టం లేదు జీవిద్దామా అవకాశం లేదు చూశారా ఇది వెంటిలేటర్ మీద ఉండే వాడి పరిస్థితి అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీద ఉన్నాడంటే వీళ్ళు చీటీ రాసేస్తున్నారు అదే అట్లా అలవాటు చేశారు డాక్టర్లు అది [గొంతు సవరించిన శబ్దం] ఆ అభీర కుమారుడు శ్రీయుతుడై వీరవైరి చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించిరపుడు బ్రాహ్మణ జనముల్ బ్రహ్మజ్ఞానం నేరిగినటువంటి వారంతా నందగోపుడి యొక్క ఇంటి దగ్గరకు వచ్చి ఈ పున్యాహవచనం చేసి చేయించిన తర్వాత దానధర్మాలన్నీ స్వీకరించి ఏడు తిలశైలాలన్నాడు తిలతర్పణం చేశాడు తిలతర్పణం ఎందుకు చేశాడు అని తిలతర్పణం చేయకూడదు కదా తిలతర్పణం పోయినప్పుడు చేయాలి మృత్యు భయం లేకుండా నా పిల్లవాడికి ఉండాలని చేశాడు విచిత్రం ఏమిటంటే ఆ దానం చేసిన ఫలితంగా తర్వాత ఆయన రాక్షసులందరితో మృత్యువునే ఎదుర్కొన్నాడు కృష్ణుడు జయించాడు అది వేరే సంగతి వచ్చిన వాళ్ళంతా మృత్యు రూపంలోనే వచ్చారు ఆ లీలాకాండ అంతా కూడా అప్పుడు కుందుపువ్వు మడేసి గాయక సంతోహము పాడే నూత సముదాయముతో నందిజనులు కీర్తించిరి క్రందుక వితంచ భద్రకాహళ రవముల్ అంతా సుశోభితమైనటువంటి శబ్దం అంతా కూడా వేపల్లె అంతా కూడా నిండుకొని ఉన్నది అటువంటి సమయంలో కంచుకన్నుల తలచుట్లను కాంచన భూషాంబరములు కడుమరయగ ఏతెంచరి గోపికలందరూ గోపగోపిక జనమంతా ఆ తలచుట్టూ శిరస్త్రాణం ధరించి చక్కగా సాలంకృతంగా ఓ పెళ్ళికి వెళ్ళినట్టుగా వచ్చారట వాళ్ళంతా మంచి పదార్థములు కనుచు మాధవు చూడన్ అక్కడ ఏమున్నాయి మంచి పదార్థాలు నవనీతం ఉంది జ్ఞాన వైరాగ్యాలున్నాయి అనన్య భక్తి ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని మించిన వైభోగం లేదనుకున్నారు అది అంతరార్థంవాళ్ళు కూడా ఎప్పుడైతే పరమాత్మను చూడాలని అనుకున్నారో వినూత్నమైనటువంటి ఆభరణాలు ధరించారు కొత్త వస్త్రాలు ధరించారు పరమాత్మను చూసేటప్పుడు ఆ కొత్త వస్త్రాలు ఎందుకని ధరించాలి? మళ్ళీ దానికి ఒక చిన్న విశేషం ఉన్నది స్త్రీ చేసిందే వేసుకెళ్ళొచ్చు కదా అంటే అవి ఎన్ని సార్లు పాడైపోయినాయో బాగు చేసుకునేది మనం అసలు ఇంకా పాడవని దాంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి పాడవని దాంతో ఆయన దగ్గరికి వెళ్తే ఏది పాడుకాదు. ఆ వస్త్రము అంటే దేహము అని అర్థం అటువంటి దేహంతో వెళ్ళమని కొత్త బట్టలు అంటే అది నూతన భావంతో వెళ్ళమని. ఏతెంచి చూచి చలగుచు నేతుల పెరుగుల పాల నీళ్ళను వెన్నం ప్రీతి వసంతము లాడిరి యేతరులై సరస భాషల సగన్ గల్లల్ వసంతోత్సవం చేసుకున్నారట ఆ వసంతోత్సవం దేనితో పాలతో పెరుగుతో వెన్నతో అక్కడ ఉన్నదంతా సమృద్ధమైన ముముక్షు భూమి అది అంటే ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు పేర్లు మనం చెప్పుకున్న అంగవతి అన్యవతి సత్యవతి నిదానవతి ఉపాసనా మార్గాలలో శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి ఆ మహాపురుష దర్శనానికి వీళ్ళంతా వెళ్లారు అని అర్థం చేతుల్లో ఉపాసనా ఫలాలు అన్నీ దగ్గర ఉన్నాయి కొందరి చేతిలో పాలు ఉన్నాయి వాడు అంగవతి ఉపాసనలో ఉన్నాడు కాస్త పెరుగు కుండలు ఉన్నాయి అన్యవతి ఉపాసనలో ఉన్నాడు వెన్న తీసుకొని వెళ్ళాడు నిదానవతి ఉపాసనలో ఒక ఉత్తమ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా వెళ్లి ఆ దర్శనం చేసి ఏమీ లోను ఫలము ఇంత పొతక వార్త వింటిమి అబలలార వీనులలర మన యశోద చిన్న మగవాని కననిజే చూచి వద్దమమ్మ సుదతులార వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ వెళుతున్నారట ఈ వాళ్ళల్లో వాళ్ళు అనుకోవటం పరమాత్ముని గురించి అనుకుంటే దాని పేరే సత్సంగం వాళ్ళల్లో వాళ్ళు ఒకరితో ఒకరు ప్రబోధంగా పరస్పరం అనుకుంటూ ఆనందాన్ని పొందటమే సత్సంగం దాని పేరు. వాళ్ళు ఒకటి ఒకటి అనుకుంటూ వెళుతున్నారు శంకర భగవత్పాదుల జీవితంలో కూడా ఈ రమణీయ సన్నివేశం ఉంది. వృక్షే వృక్షే వీక్షితా పక్షి సంఘ సంఘే సంఘే మంజులా లాప గోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్ర శ్రీ రామ కథామృతంలో చెప్తాడు శంకర భగవత్పాదులు. అలాగే మార్గే మార్గే శాఖీనాం రత్న వేది వేద్యాం వేద్యాం కిన్నరీ బృంద గీతం గీతే గీతే మంజుల మోద వాక్యం వాక్యే వాక్యే మంజులా లాప గోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్ర పరమేశ్వరుని గురించి సంకీర్తనం చేయటం ఇవాళ కొత్తేం కాదు ఈ దేశంలో త్రేతలో ద్వాపరలో ఇవాళ కలియుగంలో కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయంలో ఇటువంటి వాళ్ళని చూడటానికి వాళ్ళంతా వెళ్లారు వెళ్ళి పాపనికి ను మెతల యింటి పసుపు పూసి బోరు కాడించి బోరు కాడటం అంటే స్నానం చేయటం బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలము లొక కొన్ని చుట్టి రాజల్లి తొట్లను నించి దివించి పాడిడి అయ్యు విడలెల్ల వచ్చిన వాళ్ళంతా ఆ ఉయ్యాల ఒక్కసారి మన స్వామికి చేస్తామే అక్కడ ఎక్కడో కూర్చున్న వాడికి ఆ తాడు కోసి వచ్చేప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది వాడు ఇక్కడికి రానివ్వరు వాడికి ఇక్కడికి వచ్చి ఒక్కసారి స్వయంగా ఊపుదాం అని తాడుతో ఊపు అంటాడు వీళ్ళంతా వెళ్లారు ఊపుతున్నారు ఆ ఊపుతో ఓ పాట పాడారు ఏం పాట పాడారు అంటే జో జో కమలేక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లకరవద జో జో పూర్ణేంద్ర వదన జో జో అనుచున్ అలా జో అంటే ఒకటి ఉయ్యాల జో అంటే ఒకటి జంపాల ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి మనిషి జీవితం కూడా అంతే ఎప్పుడూ ముందుకే వెళ్ళడు ఒక్కోసారి వెనకబడతాడు వెనకబడ్డాడు అంటే అక్కడే ఉంటాడు మళ్ళీ ముందుకు వెళ్ళటానికే వెనకబడ్డాడు అని పోగొట్టుకున్నావు అంటే రాబెట్టుకోవటానికి అని చెప్పాలి ఓ రాబడుతున్నావు ఏంటి పోగొట్టుకోవటానికి అని చెప్పాలి అది అంతే తేడా. పలుతోయంబుల జగములన్ పలుతోయంబులందు ముంచి బాసిల్లెడియా పలుతోయగాడు వల్లవలయనాకర తోయముల చలంబుచు తడియన్ చిన్నవాడు పిల్లవాడు చిన్నవాడు వచ్చిన జనం ఎక్కువ తలా ఒక చుక్క ఆయన మీద చిలికినా సరే ఆ ఆ ఉయ్యాల ఎలా ఉందట అంటే క్షీరసాగరం అయిపోయింది అన్నట్టు ఉందట మరి వాళ్ళు ఏం చల్లారంటే పాలేగా చిలికారు చిలికి చిలికి తలా ఒక చుక్క వేసిన క్షీరసాగరం మధ్యలో పరమాత్మ శిశువుగా మళ్ళీ పడుకున్నాడా అన్నట్టుగా ఉన్నాడట అండ్ అది ఒక అద్భుతమైన దృశ్యం ఆ దృశ్యంలో కృష్ణుని గురించి చెప్తున్నాడు. ఏ బాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి యింట పాము గలిగే అసలు ఆయనకి బాము అంటే జన్మ అసలు జన్మలే లేనటువంటి వాడికి పశుల కాపరి ఇంట్లో జన్మ వచ్చింది నిందాస్తుతి చేస్తున్నాడు చక్కగా పరమాత్మ యొక్క ఆ శక్తిని ఏ కర్మములు లేక ఎనయు నెక్కటికి జాతకర్మమ్బులు సంభవించె ఆయన్ని కూడా తొక్కెయ్యటం ఉయ్యాల ఊపటం జనం రావటం ఆయనకి కూడా పాపం తప్పలే ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల పాల చరవ నెరిగే ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందజొచ్చె అసలు ఆయన వృద్ధునదేషడూర్మములు, షడ్వికారములు, షడ్వర్తములు మానవ దేహానికి అసలు ఆ షడ్వికారములు లేని వానికి పుట్టటం, పెరగటం, మార్పు చెందటం, మరణించటం లేనివాడు అటువంటి వాడికి ఈ పుట్టటం, ఈ పెరగటం, మళ్ళీ ఉయ్యాల ఎక్కటం ఇదంతా ఏర్పడిందే? అంటూ ఏ తపములనైన ఎలమి పండమి పంట పల్లవి జనముల వాడ తండే. ఎంత ఎన్ని తపస్సులు చెయ్, ఎన్ని యాగాలు చెయ్, ఎన్ని యజ్ఞాలు చెయ్ అదేం పండేది కాదు, ఆయన కనపడేవాడు కాదు. కానీ ఈ పల్లవి జనం ఉన్నారే, ఈ గొల్ల, గొల్ల జనం అందరి దగ్గర పరమాత్మ ఇలా వచ్చేసాడేమి? పోతనామాత్యుడు ఆశ్చర్యపోతున్నాడు వ్యాసుల వారి వలె. ఏ చదువులనైన ఇట్టిట్టి దనరాని అర్థము అవయముల అందమందే. సర్వాంగీణమైనటువంటి దేహమంతా కూడా ఒక సౌందర్య భాసురంగా ప్రకాశమానం చెందుతూ ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ ఆ తొట్టిలో పడుకొని ఉన్నట్లయితే, క్షీరసాగరంలో ఉన్న బాలుడులాగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అనేకమైన భావాలు ఒక రసస్పందనతో కలిగిన భావాలు. ఎలా ఉన్నాడు ఆ ఉయ్యాలలో? ఆ చివర ఒక పదం ఉన్నది. అన్ని అంగముల యందు అందము అందగించే అన్నాడు. అంటే ఆ సర్వాంగీణమైనటువంటి మంగళ జగన్మోహన స్వరూపం అది. ఆ జగన్మోహన స్వరూపంలో మనం స్వామిని సర్వదేవతాతీత స్వరూప అని అంటాం. ఏదో ఎవరో అనుకున్నారులే అనుకోవడానికి లేదు, ఆయన అదే. ఎందుకనంటే, ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ గోపగోపికలంతా ఒక్కొక్క అంగంలోనూ ఎవరిని చూశారు అని. శ్రీకృష్ణ పరమాత్మ పడుకొని ఉన్నటువంటి వేళ, ఇది మనం జాగ్రత్తగా, ఇది నవనీతం, ఈ పూట. ఇప్పటిదాకా కథ. కథలో వెనక అంతరార్థాలు కొన్ని గ్రహించాం. పుట్టిన చోట ఉండడని, తల్లిదండ్రులతో ఉండడని, కొత్త చోట పెరుగుతాడని, యమునా అంటే కాలవని, కాలవ అంటే కాలుడని, కాలుడు అంటే చీకటని, చీకటి వేళే వెలుగు పుడుతుందని, చీకటి పోగొట్టటానికే వెలుగు పుడుతుందని, తమస్సు ఉన్న కంసుడి చోట మధురమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండడని, కనుకనే ముముక్షు భూమికి వెళ్ళాడని, మంత్రం అంటే యశోదా దేవకులని, గురువులు అంటే నంద వసుదేవులని విచారణ. అది ఒక నవరత్నం, అది ఒక వెన్న ముద్ద అయితే, ఈ జో జో కమలేక్షణ అని పాడారు కదా, మన తల్లులు మనకు అలా పాడారు. ఇవాళ తల్లులకు ఆ పాటలు లేవు. క్యాసెట్టు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్యాసెట్టు ఆగేలోగా వాడికి ఆ క్యాసెట్టులో కూడా సౌత్ ఆఫ్రికన్ మ్యూజిక్, అంటే ఏనుగులు, సింహాలు, పులులు, గాండ్రింపులు, కోతులు అవన్నీ వినేప్పటికి వాడు కూడా ఆ సహజ స్వభావాన్ని పోగొట్టుకొని అసహజంగా జీవిస్తున్నాడు. చూడండి ఒక్కసారి సరే ఆ కృష్ణ పరమాత్మ యొక్క దేహంలో ఎక్కడెక్కడ ఎవరున్నారు అని. పరమాత్మని గాని, గురువుని గాని ఆపాదమస్తకం చూడాలి. పాదంతో ప్రారంభించాలి, మస్తకంతో పూర్ణం చేయాలి. ఆ పాదంతో మొదలు పెట్టటం అది అధ్యాత్మ సాధన. అక్కడ నుంచి ఆ సర్వాంగీణమైనటువంటి దృశ్యం అయిపోయిన తర్వాత ఒక ఆనంద స్థాయికి మనం వెళ్ళాలి. ఆ ఆనంద స్థాయి ఎక్కడ ప్రకటితం అవుతుంది అంటే త్రివిక్రమోపేతమైనటువంటి ముఖమండలంలో మాత్రమే. అది త్రివిక్రమ స్వరూపం. త్రివిక్రమం అంటే చాలా పెద్దదైంది, మూడు లోకాలు ఆక్రమించిందని కాదు. చూసే కనులు, శ్వాసించే ముక్కులు రెండు, అనే నోరు, వినే చెవులు ఎక్కడున్నాయి? శిరస్సు మీద ఉన్నాయి. అందుకని మనందరికీ కూడా త్రివిక్రమ భూమిక ఏది అంటే మన శిరస్సు. ఈ మిగతాదంతా అనేకమైనటువంటి లోకాలు. పాదాలని దర్శనం చేశారు ఆ గోపగోపికలు మనం అనుకుందాం. స్వామి పాదాలు గుర్తు చేసుకోండి, అలవాటైన పాదాలు గనుక. అక్కడ ఏమున్నాయి అంటే అజుడు ఉన్నాడు. అజుడు అంటే జన్మలేని పరబ్రహ్మము అని. బ్రహ్మ అని ఒక అర్థం, పరబ్రహ్మము అని రెండవ అర్థం. అందుకనే స్వామి యొక్క పాద నమస్కారాన్ని మనం పొందాలి. ఆయన ఇవ్వటం లేదులే, ఎలాగూ ఎవరికీ ఇవ్వటం లేదు మనకీ, మనక్కూడా ఇవ్వరని అనుకోకూడదు. కోరుకుంటూ ఉండాలి. అలా ప్రతి వాడు కోరుకుంటూ ఉంటే ఆయన ఏదో రోజు మళ్ళీ ఇస్తాడు. అది. ఇవ్వటం మానేశారని మనం మానేశాం అనుకోండి, వాళ్ళకే అక్కర్లేనప్పుడు నేను కాళ్ళు బారదాపి ఎందుకు కూర్చోవాలని ఆయన అనుకుంటారు. అంతేనా. మనం అనుకున్నామా లేదా ఇప్పుడు ఇవ్వటం లేదండి కనుక పాద నమస్కారం దొరకదు అనుకోకూడదు. స్వామి దూరమైపోయింది మాకు, మాకు అనుగ్రహించమని అడగాలి. అడిగితే ఆయన పిలుస్తాడు. పిలిచి ఇస్తారు తప్పకుండా. అక్కడ అజుడు ఉన్నాడు. అక్కడి నుంచి మోకాళ్ళు ఉన్నాయి. ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ పేరు అంతర్యామి. ఆ అంతర్యామికి భగవానుడు అని కూడా పేరు. మోకాళ్ళ యందు మోకాళ్ళనంటు బాహువులు ఎందుకున్నాయిరా? రాముడికి కృష్ణుడు వాళ్ళు అజానుబాహువులు వాళ్ళిద్దరే ఎందుకు అయినారు? మిగతా వారు ఎందుకు కాలేదు అంటే, అలా ఎందుకు రాలేదు అంటే అక్కడ కూడా భగవానుడి స్వరూపంగా ఉన్నారు అని. ఇక తొడలున్నాయి. ధ్రువుణ్ణి కూర్చోబెట్టుకున్నటువంటి ఆ తొడలు ఎట్లాగో, ఈ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ చిన్ని తొడల యందు యజ్ఞ స్వరూపుడున్నాడు. ఎందుకని ఈ మోకాళ్ళలో భగవానుడు ఉన్నాడు అంటే మజ్జ ఉన్నది. మనకి ప్రాణం ఉంది, కర్మేంద్రియాలున్నాయి, జ్ఞానేంద్రియాలున్నాయి, మనస్సు ఉన్నది. కానీ మనకు కావలసినటువంటి వైట్ బ్లడ్ కార్ప్సెస్ అంటామే, డబ్ల్యుబిసి, తెల్ల రక్తకణాలు, తెల్ల కణాలు అవి మజ్జలో నుంచి ఏర్పడతాయి. ఆ మజ్జ ఎక్కడ అంటే మోకాళ్ళలో ఉన్నది, అది యజ్ఞపురుషుడు. మనం గనక బాగా పని చేస్తే, అంటే బాగా కర్మలు చేస్తే, అది యజ్ఞ సమానమైన కర్మలు ఎటువంటివి గనక చేసుకుంటే అక్కడ యజ్ఞ స్వరూపుడిగా మనకి దర్శనం ఇస్తాడు. ఇక తర్వాత కటి భాగంలోకి వచ్చినప్పుడు ఆయన అచ్యుత నామంతో ఉన్నాడు. కటి.తర్వాత జఠరం ఉన్నది. అక్కడ ఎవరున్నారంటే జఠరాగ్ని స్వరూపుడు అంటాం. "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః" అదే కదా! అక్కడ జఠరాగ్ని స్వరూపంగా ఉన్నటువంటి వాడు జఠరంలో ఆ రసం పుట్టించే వాడి పేరు హయగ్రీవుడు. ఏ రసం పుట్టిస్తాడో తెలుసా? ఆకలి పుట్టించే ప్యాంక్రియాజ్ కాదది. జఠరాగ్ని అంటే జ్ఞానము అనేటువంటి ఆ పాయసాన్ని అందించేటువంటి పరమాత్మ హయగ్రీవుడు ఉంటాడు. ఇక పొట్ట భాగమంతా ఎవరుంటాడంటే ఈశ్వరుడుంటాడు. ఈశ్వరుడు వేరు, రుద్రుడు వేరు, మహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు. ఈ నలుగురు నాలుగు భాగాలు. అది నేను ఇచ్చిన శివరాత్రిలో ఉంటుందది. తర్వాత హృదయ స్థానానికి వచ్చినప్పుడు అది అనా, అనాహత చక్రం. అక్కడ ఎవరున్నాడంటే కేశవుడున్నాడు. హృదయ స్థానంలో కేశవుడున్నాడు, హృదయ స్థానం దాకా కేశవుడున్నాడని తెలియకపోతే కేశవుడు అక్కడ శవం ఇక్కడ అంతే. పరమాత్మతో కూడి ఉంటే కేశవుడున్నట్టు లెక్క. ఆ 'కె' కొట్టేశామనుకోండి అది. తర్వాత అక్కడి నుంచి వచ్చాక విశుద్ధ చక్రం కంఠ స్థానం ఉన్నది. సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి అమ్మవారి యొక్క వైఖరి విన్యాసం అది. పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి ఇది స్థాయి. ఆ వైఖరి స్థాయిలో అమ్మవారుంటుంది కానీ దానికొక తేజస్సు కావాలి, ఓజస్సు కావాలి, మహస్సు కావాలి, రజస్సు కావాలి. దీనినన్నింటినీ ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యదేవుడున్నాడు. ఆదిత్యుడు కంఠంలో ఉన్నాడు. కనుకనే అనేకమైనటువంటి భావాలన్నీ కూడా వాగ్ రూపంగా బయటికి వస్తాయి. సూర్యోపాసన కంఠం అన్నమాట. తర్వాత భుజాలున్నాయి. అక్కడ ఉన్నటువంటి దేవత విష్ణువు. విష్ణువు అంటే శ్రీమహావిష్ణువు కాదు. విష్ణోర్ నామకమైనటువంటి కొన్ని అనంత విష్ణువులున్నారు. అట్లాగే అనంత రుద్రులు శతకోటి రుద్రులున్నారు. అందులో ఏకాదశ రుద్రులు ప్రధానం. ఏకాదశ రుద్రులు అంటే ఐదు పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, అధిష్ఠానమైన మనస్సు కలిపితే ఏకాదశ రుద్రులు. విచారణ చేశాం. అలాగే అక్కడ విష్ణువున్నాడు. ఇక ముఖం త్రివిక్రమావతారం. ఇందాకే చెప్పాను కన్ను, ముక్కు, చెవి. ఈ కన్ను, ముక్కు, చెవి మూడు లోకాలకు సంబంధించింది మూడు శక్తులు. కన్ను లేకపోతే కనలేం. చెవి లేకపోతే వినలేం. నోరు లేకపోతే అనలేం. ఈ మూడు అనాలి అంటే ప్రాణ లోకాలు రెండు, గంధర్వ లోకాలు ఉచ్వాస నిశ్వాసాలుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ప్రాణాయామం సహజంగా జరగాలి. జరక్కపోతే లోపల ఆ వాయువు షట్చక్ర ప్రయాణం దాటి, సహస్రారం దాటి, చంద్రకళా స్థానానికి వెళ్లే అవకాశం లేదు గనుక. ఇక శిరోభాగానికి వచ్చినప్పుడు ఆయన పేరు శంభుడు లేదా శివుడు అనొచ్చు. ఆ శివుడికి స్వామి చాలా అందమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. శివ రాసినప్పుడు రాసి కొమ్ము తిప్పుతాం కదా! అణగి ఉన్నాడు గనుక శివుడు. దానికి పొల్లు పెట్టామనుకోండి, శివం రాస్తాం. దానికో చిన్న పొల్లు ఇలా పెట్టేశాం శవం అయిపోయింది. ఆ పొల్లు అహంకారం, మమకారాల గుర్తు. అది కొట్టేస్తే మీరు శివం అన్నారు. simple. అది ఒక ఉపనిషత్తు యొక్క సారం అది. స్వామి చెప్పిన ఆ ఒక్క మాట ఒక ఉపనిషత్తు యొక్క భావన. ఇక తర్వాత మనకు ముందు భాగం ఉన్నది. ముందు కనపడే భాగం అంతా కూడా. దానికి అధికారి ఎవరో తెలుసునా? చక్రధారి. మనం ఎప్పుడూ మన వెనక ఏం జరుగుతున్నది ఆలోచించం. మన ముందు ఏం జరుగుతున్నదో ఉంటాం. రక్షణ చక్రధారిగా ఉంటాడు. వెనక భాగం గదాధారియై ఉంటాడు. అలాగే ఇరుపక్కల ధనుస్సు ధరించినటువంటి మధుసూదనుడుంటాడు. మధువు అనేటువంటి రాక్షసుణ్ణి చంపిన సూదనుడు అంటే మధుసూదన అనకూడదు. జనార్ధన అనకూడదు. జనార్ధన, మధుసూదన. సూదనుడు అంటే సంహారం చేశాడు. ఎవరిని? మధువు అనే రాక్షసుణ్ణి. వాళ్ళిద్దరూ ఆ మధుసూదనుడు ఎక్కడున్నాడంటే అటూ ఇటూ ఉన్నారు. ఇక ఇంద్రియాలకి ఒక దేవతగా ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడిలో ఇవన్నీ దర్శనం చేస్తున్నారు. వాళ్ళేదో కృష్ణుణ్ణి చూసి వెళ్ళిపోలే. ఇంద్రియాలలో హృషీకేశుడున్నాడు. అసలు హృషీకము అంటేనే ఇంద్రియం. ఆ తర్వాత ప్రాణాలున్నాయి. ఆ ప్రాణాలకి పేరు నారాయణుడు. అలాగే మనస్సు యోగీశ్వరుడు అయినటువంటి మా స్థాయి. తర్వాత ఆడుకునే వాడికి రక్షణ వోడు కావాలి. వాడి పేరు గోవిందుడు. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో జ్ఞానబోధ చేసినప్పుడు "పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం" అన్నాడు. "భగవతా గోవిందేన స్వయం" అనలే. అనొచ్చుగా అంటే ఏం కాదు. ఛందస్సు సరిపోతుంది. అక్కడ ఆయన గోవిందుడు కాదు. ఆయన ఆడుకోవటానికి వచ్చినవాడు కాదు. అందరినీ ఆడించటానికి వచ్చినవాడు. యుద్ధాన్ని ఆడించటానికి వచ్చాడు. ఆయన ఆట అంతా ఎక్కడైపోయిందంటే వ్రేపల్లెలో అయిపోయింది. అందుకనే అక్కడ ఆయన గోవిందుడై, గోపాలుడై, గోపగోపిక మనోవల్లభుడై అక్కడ గోశబ్దంతో జ్ఞానంతో నడిపించాడు గనుక అది. ఇక పడుకొని ఉంటాం మనం రాత్రి పదయ్యాక. అప్పుడు ఎవడో మనల్ని రక్షించాలి. వాడి పేరు మాధవుడు. మాధవుడు అంటే మా అంటే భూమి. దానికి భర్త అయినటువంటి విష్ణు స్వరూపం. మనం కింద పడిపోకుండా కాపాడేవాడు. పడుకోవటం అంటే తామసం, నిద్రావస్థలో నుంచి పడిపోకుండా అక్కడే నిలబెట్టి కార్య కారణ కర్తవ్యం కోసం వచ్చినటువంటి జీవుడు ఉత్కృష్ట స్థాయికి వెళ్ళేట్లుగా నిలబడతాడు. ఇక నడిచేవాడుంటాడు. ఆ నడిచే వాడికి రక్షణ వైకుంఠుడు అని. ఆ తర్వాత కూర్చున్నవాడు. వీడికో రక్షణ కావాలి. వాడి పేరు శ్రియఃపతి. శ్రీయఃపతి కాదు శ్రియఃపతి. శ్రియః అంటే శ్రేయమును కలిగించే శ్రేయస్సుకు మూలమైనటువంటి వాడు శ్రియఃపతి. ఇక భోజనం చేస్తున్నప్పుడు వాడి పేరు యజ్ఞభోక్త. అందుకే భోజనం చేసేటప్పుడు ప్రసన్నంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి.కానీ దురదృష్టవశాత్తు dining table has become a conference table. ఎక్కడలేని ఆలోచనలు ఆ పది నిమిషాల్లో వస్తాయి. వాదోపవాదాల్లో దిగుతాడు. తిన్న అన్నం జీర్ణం కాదు. తెల్లవారేప్పటికి జబ్బులు, acidity లు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఏ పని ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో అది చేయనందువలన వస్తాయి. కాబట్టి, ఇవాళ భాగవత నవనీతంలో కేవలం ఆ ఉయ్యాలలో పడుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సర్వాంగీణమైనటువంటి జగన్మోహనాకారాన్ని గోపగోపికలంతా కూడా పరమానందంగా అనుభవించారు. వాళ్ళందరికీ దర్శనం ఇచ్చాడు ఇట్లా. ఇన్ని రూపాలు, ఇన్ని నామాలతో. నేను మామూలుగా కనిపించే గోపబాలకుణ్ణి అనుకోకండి. మీ ముందు, మీ వెనుక, మీ పైన, మీ పక్కన, మీ యందు, మీతో, మీలో ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి ఒక జ్ఞానబోధ ఎక్కడ చేశాడు ఆయన అంటే ఉయ్యాలలో చేశాడు. అందుకనే ఆ ఉయ్యాలా ఒక జగత్తు అయితే నాలుగు వేదాలు దాన్ని కట్టిన తాళ్లుగా వర్ణన చేస్తారు. నిజానికి ఆ నాలుగు వేదాల అనుభవంతోనే ఉయ్యాలా నడుస్తుంది. జీవుడి జీవితం కూడా ఇటూ అటూగా సాగుతుంది గనుక పరమాత్మ యొక్క దివ్య భావ నాగరిమిలోకి వెళ్ళాలి. ఇవాళ నిజానికి దేవకీ వసుదేవుల హంసానంది. అలాగే యశోదా నందుల హంసానంది. గోపగోపికల హంసానంది. ఇదంతా కూడా చి జడ గ్రంథి భేదనం జరగాలి. ఆ జడ గ్రంథి భేదనం గనక జరక్కపోతే దేవకి, "నాయనా! ఇంత శక్తితో పుట్టావు. మనం ముగ్గురం కలిసి ఎటైనా వెళ్లిపోదాం." అనేది. అనలే. మమ్మల్ని కాపాడమని అడగలే. "నిన్ను కాపాడుకో నాయనా" అని అడిగింది. నిన్ను కాపాడుకో అని అన్నది అనన్య భక్తి. నన్ను కాపాడుతాడులే అన్నది జ్ఞానం యొక్క స్థితి. మనమంతా అనన్య భక్తి స్థాయి నుంచి జ్ఞాన శిఖర స్థాయికి వెళ్ళాలి. సాక్షాత్తు ఇవాళ ఏ పరమాత్మతో మనం కూడి ఉన్నామో ఆయన శ్రీకృష్ణుడు తప్ప అన్యం కాదు. అది సత్యం. ఆ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే స్వామిని కేవలం పైకి మనం విన్నవి, మనం కన్నవి కాదు. ఆంతరంగికమైనటువంటి దర్శనం చేయాలి. ఆ నవనీతాన్ని మనం అందుకోవాలి. ఒక ఉయ్యాలలో పడుకున్నటువంటి ఆ శిశువు బాలకృష్ణుడిలో ఎన్నెన్ని రూపాలు. అన్నీ విష్ణు పరమైనవే ఉన్నాయా. శివకేశవాత్మకమైనటువంటి అభేద, అద్వితీయ, అద్వయమైనటువంటి మనోజ్ఞ స్థితి గనుక ఆ మనోజ్ఞ స్థితిలోకి మనందరం చక్కగా సంచారం చేయాలి. ఇవాళ మరి హృదయా ఆనందం కలుగుతున్నటువంటి వేళ గొంతులోదేముంది కావలసింది గుండె. గొంతు ఎట్లా ఉంటాయే. అది కూడా, ఆ వ్యామోహం కూడా వదిలిపెట్టాలి. ఎందుకంటే పరమాత్మ దగ్గర పాడేటువంటి ప్రతి పాట ఆయనకు ఆనందమే. మన మనవడికి మాట, మనము రామాయణ కల్పవృక్షంలో కౌసల్య అడగలే రాముణ్ణి, "ఏరా! మీ నాన్నగారి పేరు ఒకసారి చెప్పమంటే దశరథ మహారాజు అనలేక దాశామహారాజు" అన్నాడు వాడు. అంటే ఆవిడ ఉప్పొంగిపోయింది. తప్పన్నాడని ఆయన కొట్టిండా? ఏం కాదు. మనకు ఏమొచ్చో ఆయనకివ్వాలి. దేనినైనా ఆయన స్వీకరిస్తారు. ఇక హంసానంది రాజంలో స్వామి యొక్క సంకీర్తన. సాయిరాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 56
Bhagawata Navaneetham - 56
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 33:34
More in this series