No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీ వేదవ్యాస ప్రోక్తమై పూత నామాచ్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో వామన చరిత్రను విచారణ చేస్తూ ఉన్నాం. వామన చరిత్ర అంతా మానవుడికి ఒక దివ్య బోధ. దానవీరము, దయావీరము కలబోసుకున్నటువంటి ఒక అందమైన కలనే తా అది. దయావీరం పరమాత్మది, దానవీరం బలిది. దానవీరం ఎప్పుడు సంపాదించాడు? ఇంద్రుడి రాజ్యాన్ని జయించిన తర్వాత తాను పొందినటువంటి సంపాదన అంతా కూడా దాన ధర్మాలలో, యజ్ఞ కాండలలో, అశ్వమేధాది యాగాలలో అడిగిన వాడికి లేదనకుండా తన సంపాదన యావత్తు దానం చేశాడు బలి. అంటే తొలినాళ్లలో రాజ్యాధికారం కోసం చేశాడు దండయాత్ర. రాజ్యం పొందిన తర్వాత దానం చేశాడు. అయితే బలి మనసు నిండా నేను మాత్రమే దానం చేయగలను అన్న అహంకారం, ఈ దానం వలన నాకీ లాభం కలగాలి అనేటువంటి ఒక కోరిక. ఈ రెండూ ఉన్న కారణంగా దానమంతా కూడా ప్రవృత్తి కర్మగా మారిపోయింది. రెండు మాటలున్నాయి. ఒకటి ప్రవృత్తి, రెండవది నివృత్తి. ప్రవృత్తి అంటే ఫలితం ఆశించి చేసే ఏ కర్మ అయినా అది ప్రవృత్తి కర్మ. కర్మ చేయాలి గనుక భగవత్ ఆదేశానుసారం నాకీ యోగం ఇవ్వబడింది గనుక నా మనస్సంతా ఈ కర్మకాండ లో ప్రవేశ పెట్టాలని తన శరీరాన్ని, తన మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, ప్రజ్ఞని, ప్రతిభని, విత్పత్తిని, అనుభవాన్ని అన్నింటినీ కూడా ఏ రకమైన అపేక్ష లేకుండా గనక చేసుకోగలిగినట్లయితే అది నివృత్తి మార్గం. మరి ప్రవృత్తి మార్గంలో పరమానంద స్థాయికి వెళ్ళిపోతున్నాడు బలి. వాణ్ని నివృత్తి మార్గంలోకి తిప్పాలి. ఆ బాధ్యత ఎవరిది? పరమేశ్వరుడిదే. జీవుడు గనక perfect ఏ అయినట్లయితే ఆయనకి ఇన్ని అవతారాలు ఎందుకు? ఇన్ని అలజడులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఉన్నా? అని ప్రశ్న వేసినప్పుడు ఆయన ఉన్నాడు గనుక ఇంకా ఎన్ని ఘోరాలు జరగాలో అవన్నీ ఆగినాయి అనుకోవాలి. ఆయనే లేకపోతే ఏమిటి అని. అలాగే ఇంద్ర రాజ్యాన్ని పొందినటువంటి త్రిజ--త్రిజగన శాసన కర్త ఆయన. మూడు లోకాలు ఆయన అధీనమై ఉన్నాయి, ఉన్నాయి బలి చేత. వామనుడు వచ్చాడు, నిన్న ఈ వేళకి. యజ్ఞశాల ప్రవేశించాడు. ప్రవేశించి ఒకటి, రెండు అడుగులు ఇవ్వమని అడిగాడు. మూడు అనకుండా. అదే మూడు ఇస్తాను అన్నాడు బలి. ఆ మూడు అడుగుతున్నటువంటి వేళ శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు. వాడు ఏమన్నాడంటే, "మీరు వచ్చిన వాడు విష్ణువు. మన కులం, మన మానం, మన మర్యాద, మన వంశం అన్నీ పోతాయి. నువ్వేదో ఉన్నదంతా వాడికిచ్చి పంపించేస్తే మనమేమైపోతాము?" అని అడిగాడు. "ఆలోచన చెయ్యి. ఆదేశిస్తున్నాను" అన్నాడు బలి చక్రవర్తిని. "నిజంగానే వచ్చిన వాడే గనక విష్ణువు అయినట్లయితే, ఈ వేళ నా దాన విశేషానికి ఓ గొప్ప పరిమళం అబ్బింది. ఎటువంటి వాడు? ఆదినం శ్రీసతి కొప్పుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, నూతన మర్యాదన్ చెందు కరంబు కిందై, మీద నాదుంట మేల్ గాదే, రాజ్యమున్ గిజ్జమున్ సతతమే, కయంబు నాపాయమే" అన్నాడు. "ఏమిటీ శరీరం వచ్చింది, ఇక కొం-కొన్నాళ్ళు నడుస్తుంది ఈ బొమ్మ, ఏదో రోజు పోయేదే. జీవితం జీవించినంత కాలం జీవించటం కాదు గురుదేవా! మనం పోయినా ఇక్కడ జీవించాలి, దానికి దానమే గొప్పదిగా నేను భావిస్తున్నాను" అన్నాడు. జీవన్మృతులు కొందరు ఉంటారు, కొందరు మృతజీవులుగానే ఉండిపోతారు. ఏదో పుడతారు, మెడతారు, గెడతారు వాళ్లకేం చరిత్ర ఉండదు. సమాజం మీద వాళ్ళ ప్రభావం ఏం ఉండదు, సమాజానికి వాళ్ళ contribution కూడా ఏం ఉండదు. ఆ బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేశాడు హాయిగా సుఖంగా, సుఖ సంపదలతో కూడిన ఒక జీవితాన్ని పొందాడు, అంతే. అది ఎవరికి లాభం? వాడు ఒక్కడికే లాభం, ప్రయోజనం లేదు. ఎందుకనంటే మూడు విశేషణాలున్నాయి మానవ జీవితానికి. ఒకటి successful life, రెండవది meaningful life, మూడవది purposeful life. Successful అంటే అది వాడి వరకే. సమాజహితం చేయగలిగినట్లయితే అది meaningful అవుతుంది. సమాజహితం నేనేవండీ చేయటానికి పరమాత్మే చేయిస్తున్నాడు అనుకుంటే purposeful అవుతుంది. ఆ మూడు దానిలోనే ఇమిడి ఉన్నాయి గనుక ఒక స్థాయి నుంచి అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి జీవుడు ప్రయాణం చేయాలి. దాని పేరే ప్రస్థానం. ఆ ప్రస్థానంలో తన నడక సాగుతూ ఉంటుంది. అది భౌతిక ప్రయాణం గనక ఆగిపోతే ఓచోట ఆగిపోతుంది. అది ఆధ్యాత్మిక ప్రయాణం గనక అయినట్లయితే అది ప్రస్థానం అవుతుంది. ఆధ్యాత్మికతలో పరమాత్మని గనక తన యందు, తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తాను దర్శనం గనక చేసుకోగలిగితే అది పూర్ణ ప్రస్థానం అవుతుంది గనుక ఈ ప్రస్థానం దిశగా మానవుడు తన జీవితాన్ని చక్కగా గడుపుకోవాలి. ఆ గడుపుకోవటానికి భాగవతం అంతా ఒక్కొక్క కథ. ఈవేళ ఎంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఈవేళ.భీష్మ ఏకాదశి, భీష్మ ఏకాదశి అనంగానే ఏదో భీష్ముడు పోయినాడు ఉన్నాడు అది కాదు కథ. ఇక్కడ ఉత్తమ శ్రోత ఎవరు అని, అసలు అన్నవాడు ఎవడు అని, అన్నవాడు పరమాత్మే, విన్న వాడు కూడా పరమాత్మే. పాండవులతో కూడి భీష్ముడు బోధించినటువంటి విష్ణు సహస్రనామాన్ని చక్కగా హాయిగా శ్రవణానందంగా ఆలకించాడు ఈ వేల్టి రోజున. అంపశయ్యాగతుడై ఉన్నాడు భీష్ముడు. ఆయన జీవితంలో నిజానికి ఆయనకి సంసారం లేదు గానీ సమస్త సంసార దుఃఖాన్ని జీవితంలో అనుభవించాడు. తన కళ్ళ ముందే అయిన వాళ్ళందరూ రాలిపోతుంటే, కాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినాడు. పెళ్లంటూ ఒకటి చేసుకోలేదు గానీ ఒక సంసారి పడరాని యాతనలన్నీ పడ్డాడు. పైగా శెటువైనటువంటి నూరుగురు కౌరవుల అన్నం తిన్నాడు ఆయన. ఆ అటువంటి అన్నం తిన్నందువలన యుక్తాహారం లేదు, యుక్త విహారం లేదు. ఆయన రక్తమంతా కలుషితం అయిపోయింది. మమత చేత, వంశం పట్ల అభిమానం చేత, ఆభిజాత్యం చేత అనేకమైనటువంటి ప్రాపంచిక కారణాల వలన కలుషితమైన రక్తమంతా పోతే తప్ప పరమాత్మ యందు మనస్సు లగ్నం కాదు. అంపశయ్య మీద పడుకున్నప్పుడు ఆయన శరీరం నుంచి ఈరోజు సంధ్యా సమయం వరకు సూర్యాస్తమయానికి ముందు నిజానికి ఆయన శరీరం నుంచి పాత రక్తం అంతా పోయింది. ఎక్కడా కౌరవ భావన లేదు, ఎక్కడా పాత స్మృతులు లేవు. కృపాచార్యుడు ఏమైనాడు, భీష్మాచార్యు-- ద్రోణాచార్యుడు ఏమైనాడు, మా దుర్యోధనులంతా ఏమైపోయినాడు, మా ధృతరాష్ట్రుడు ఎక్కడ ఈ ప్రశ్నలే లేవు. ఏమున్నదయ్యా అంటే మనస్సు విష్ణు పద చిత్తం మీద నిలబడిపోయింది. "మనోమయే విష్ణు పదాంతరాళే" అంటారు శంకర భగవత్పాదులు. ఆ విష్ణు పదం మీద మనస్సు ఎప్పుడు వెళ్ళింది అంటే నిజానికి సుదీర్ఘమైనటువంటి ఒక జీవన యాత్ర ప్రస్థానం సాగించిన భీష్ముడికి ఇది నిజానికి శాంతి పర్వం. ఆయన జీవితంలో శాంతి ఎప్పుడు అనుభవించాడు అంటే ఇదిగో ఈ విష్ణు సహస్రనామ బోధన చేసినప్పుడు మాత్రమే. అందుకే అది భారతంలో శాంతి పర్వంలో వస్తుంది. పంచ పాండవులతో పాటు వినమ్రంగా చేతులు కట్టుకొని శ్రీ కృష్ణ పరమాత్మ విన్నాడు అది. ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? ఆయన గురించే. ఎవరి గురించో చెప్తున్నట్టుగా తన గురించి తాను విన్నటువంటి వేళ ఉత్తమ శ్రోతే పరమాత్మ అయినటువంటి వేళ ఇది భీష్మ ఏకాదశి. ఉత్తరాయణ పుణ్యకాలంలో మహోత్కృష్టమైనటువంటి రోజు ఇది. భీష్ముడు అగ్రరాజ్యాన్ని, అగ్రపీఠాన్ని, అగ్రపూజని అందుకోవలసినటువంటి సమయంలో బ్రహ్మచారి ఎవరు అని ఒక ప్రశ్న విచారణ రాజసూయంలో వచ్చినప్పుడు సర్వ ప్రపంచము భీష్ముడిని చూపించింది. కానీ భీష్ముడు వినయం చేత, స్వస్వరూపానుసంధానం చేత, విజ్ఞత చేత, వివేకం చేత నేను అసలు బ్రహ్మచారిణి కాదు. నిజమైనటువంటి బ్రహ్మచారి ఎవరు అంటే అష్టవిధ నాయకులైనటువంటి ఎనిమిది మంది రాణులతో కూడి ఉన్నా కూడనివాడు. పదహారు వేల మంది గోపికలతో కూడి ఉన్నట్లుగా ఉన్నా కూడని వాడు. అస్కలిత బ్రహ్మచారి పరమాత్మ ఒక్కడే. మనందరం కూడా నాయికలం, ఆయన ఒక్కడే నాయకుడు. అగ్రపూజకి ఆయనే అర్హుడు అని ఒక విచారణ చేసినటువంటి భీష్ముడు ఆయన. అలాగే అర్జునుడిని రక్షిస్తాను, నిన్ను చంపుతాను అని ఆయుధం పట్టుకోను, యుద్ధం చెయ్యను అన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి యొక్క ప్రతాపానికి తట్టుకోలేక కింద పడి ఉన్నటువంటి ఒక బండి చక్రాన్ని సుదర్శన చక్రం చేసి భీష్ముల వారి వైపు లంఘించి వెళ్తున్నటువంటి వేళ, ఏ అర్జునుడిని కాపాడాలని నువ్వు ఈ చక్రం ఎత్తుకున్నావో, వాడికి ఎట్లా నువ్వు దిగ్గో ఇప్పుడు నువ్వే నాకు దిగ్గు. కానీ నీ చేతుల్లో పోవటం కంటే ఏం కావాలి అన్నాడు. ఆ పోవటం అంటే శరీరాన్ని పోగొట్టుకోవటం కాదు. అసలు మృత్యువును జయించటము వాడు మృత్యుంజయుడు అంటాం. మృత్యుంజయుడు అంటే మృత్యు భావన నుంచి ఎవరైతే బయట పడతాడో వాడు మృత్యుంజయుడు. అసలు నాకు మరణమే లేదు, నేను నిత్య సత్య శాశ్వతమైనటువంటి పరమాత్మను, ఆత్మను నేనే. ఈ దేహమా ఇది దహింపబడేది గనుక దేహమని, మార్పు చెందుతుంది గనుక శరీరమని, "శర్యతి ఇతి శరీరః" అలాగే నడుస్తూ ఉన్నది గనుక ఇది రథమని, పంచభూతాలతో కూడి ఉన్నప్పటికీ దానికి అతీతంగా ఉన్నది గనుక కవచమని, ఇందులోనే పరమాత్మ ఉన్నాడు గనుక దీనికి మందిరమని అనేక పేర్లు ఉన్నాయి. కాబట్టి కూలినా, రాలినా, శిథిలమైన ఈ శరీరానికి అవస్థ తప్ప నాలో ఉన్నటువంటి చైతన్యానికి ఏ రకమైన మార్పు లేదని ఒక నిశ్చితమైన మనీషలో ఉన్నాడు గనుక ఆ మనీషాయుక్త చిత్త ప్రజ్ఞతో ఉన్నటువంటి భీష్ముల వారు ఇచ్ఛామరణంతో శ్రీకృష్ణ పరమాత్మ కట్టెదుట ఉండగానే మహాభారత సంగ్రామంలో ఆ రణరంగం మధ్యలో సూర్యుడు అస్తమించేటువంటి వేళ ఆయన విష్ణు సహస్ర నామాన్ని జగత్తుకు బోధ చేశాడు. బోధ చేశాడు అంటే అంతా గబగబా చదివాడు అని కాదు. ఒకానొక సూక్ష్మ శరీర స్థాయిలో కొన్ని సెకన్లు ట్రాన్స్మిట్ చేశాడు. భగవద్గీత కూడా అంతే, శ్రీకృష్ణుడు అర్జునుడికి ట్రాన్స్మిట్ చేశాడు. ఆ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు అది ఎవరు రాశాడు అంటే "వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం" ఇదంతా వాంగ్మయం చేసిన వాడు వేదవ్యాసుడు. అలాగే విష్ణు సహస్ర నామాలు ఈవేళ మనం హాయిగా చదువుకుంటున్నాం అంటే వేదవ్యాసుల వారికి వేవేల వందనాలు అర్పించాలి. ఆయనే గనక రాసి ఉండకపోతే అది భీష్ముడు, కృష్ణుడు, భీష్ముడు, పంచ పాండవుల మధ్య జరిగిన ఒక ఘట్టంగా ముగిసిపోయి ఉండేది. వేదవ్యాసులవారు, పద్దెనిమిదవ వేద వ్యాసుడు, కృష్ణ ద్వైపాయనుడు మనకోసం ఈ వాంగ్మయాన్నంతా కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇంకో చిన్న విశేషం ఉంది. [గొంతు సవరించుకుంటున్నారు] లలితా సహస్ర నామాలలోఅమ్మవారి పేర్లన్నీ కూడా గుణవిశేషణాలు అది మంత్రాత్మకం అది తంత్రాత్మకం అది యంత్రాత్మకం సౌందర్యలహరి లాగానే విచిత్రం ఏమంటే విష్ణు సహస్రనామంలో ఒక పేరుకి రెండో పేరుకి ఒక పేరుకి ఒక చిన్న గొలుసు ఉంటుంది లంకె ఒక శబ్దానికి అర్థం చెప్పుకొని ఇది ఇంతే అనుకోవడానికి వీల్లేదు ఆ అర్థంలో నుంచి రెండో శబ్దం రెండో అర్థాన్ని ఇస్తుంది విశ్వంతో ప్రారంభమవుతుంది విష్ణువుతో అంతమవుతుంది అది లోకమును వీడి రసము లేదు మనమంతా కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోదాం అని అనుకోనవసరం లేదు అది లేదు ఎందుకు లేదంటే ఇక్కడే ఉందది ఎక్కడ ఉన్నది అంటే నీ మనసులో ఉన్నది నీవు సత్కర్మలు చేశావా ఆనందం ద్వారా సంగీ-- స్వర్గధామంలో నీ అంతట నీవే ఉంటావు రమణ మహర్షిని అడిగారు భగవాన్ ఏమిటి ఈ ప్రపంచం ఇలా ఇంత దుర్మార్గంగా అయిపోతోంది దీనికేం విముక్తి లేదా అంటే [గొంతు సవరించిన శబ్దం] ప్రపంచం మంచిది కాదు అది చెడ్డది కాదు అది అంతే సృష్టిలో లోపం ఎక్కడున్నది నీ దృష్టిలో తప్ప అన్నారు స్వామి ఇటు రమణ మహర్షి గాని స్వామి గాని శంకర భగవత్పాదులు గాని చెప్పింది ఒక్కటే వస్తువు ఒక్కటే చూపులు అనేకం. ఒక్కొక్కడికి ఒక్కో భావనలో కలుగుతుంది గనుక విష్ణు సహస్ర నామాన్ని కూడా మనం చదువుతూ ఉంటాం చదివే వాళ్ళని వింటూ ఉంటాం గబ గబ గబ urgent గా అది అయిపోవాలి మనకా ఎంత ఆతృత అంటేది ముగించేసి అక్కడ పడేసి పోదాం అన్నట్లు ఉంటుంది అలా చదవకూడదు దానికి ఉదాత్త అనుదాత్త స్థాయిలున్నాయి దానిలో బీజాక్షరాలున్నాయి అది మంత్రమయమైన అటువంటిది ఒక్కొక్క దాన్ని అంటు ఉన్నప్పుడు దాని దర్శనం చేయాలి మంత్రం వెనుక ఏం దర్శనం చేస్తామంటే మంత్రానికి కారణమైన అధిష్టాన దేవతని దర్శనం చేస్తాం అంటే భీష్ముల వారు సహస్రనామాలలో ఏమి దర్శనం చేశాడయ్యా అంటే అందరు అధిదేవతలని ఆయన దర్శనం చేశాడు ఎక్కడుండి ఈ దేహంలో ఉండి అంపశయ్య మీద ఉండి ఎలా కలిగింది ఈ యోగం శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క సాలోక్య సామీప్య సాన్నిధ్యాల ద్వారా సాయుజ్యాన్ని కూడా ఏకకాలంలో పొందిన వాడు భీష్మాచార్యులవారు కనుక అటువంటి మహాపురాణ పురుషోత్తముడికి మనందరం కూడా ఒక్కసారి నమస్కరిస్తూ జీవితం అంటే ఎలా గడపాలి జీవితాన్ని ఎన్ని వ్యధలు ఎన్ని క్లేశాలు ఎన్నెన్ని అననుకూలాలు ఎన్నెన్ని ఆనందాలు విజయాలు జయకేతనాలు మన జీవితాన్ని చుట్టుముట్టినా నిశ్చలమైన నిర్మలమైనటువంటి ఒక జ్ఞాన జ్యోతి వలే అఖండ జ్యోతి వలే జీవుడు వెలుగొందాలి వెలుగొందకపోతే ఇది పవన చరణ రోధాత్ ఆత్మ నిష్టో భవత్వం అన్నారు రమణ మహర్షి పవన చరణం అంటే గాలి తాకిడికి అల్లల్లాడేటువంటి దీప కణికలా కాక నిశ్చలమైనటువంటి వినిర్మలమైనటువంటి జ్ఞాన జ్యోతిగా నీలో నీవు దానిని దర్శనం చేసుకో అదే శ్రీమయం అదే చరాచరమయం అదే వాంగ్మయం అదే సర్వానందమయం కాబట్టి ఈ ఆనంద భూమిక ఎక్కడ ఉన్నది అని విచారణ చేసినట్లయితే అది మన అందరిలో ఉన్నది ఆ ఆనందానుభూతిని బలికివ్వటానికి వచ్చాడు వామనుడు అది అందువలన ఆయనకు అన్ని సంపదలున్నాయి సంపదలున్నా దానం చేయాలనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక సంస్కారం ఉంది ఆ రాక్షస రాజులో దానికి ఒక ప్రచోదనం చేయాలి దానిని వెలిగించాలి వెలిగిన దానిని నిలబెట్టాలి నిలబెట్టిన దానిని సర్వవ్యాపకం చేయాలి గనుక కశ్యపుడు అదితి గర్భంలో ఆయన ప్రభవించి వామనుడు ఆ మారి వామనావతారం అనిపించుకొని వటువుగా యజ్ఞ వాటికలో ప్రవేశించి అడగవలసినవన్నీ అడిగి నిన్నంతా ఆయన వేసినటువంటి ఆ చిందులు ఆనందం ఆయన అనుభవించినటువంటి స్థితులు అన్నీ కూడా మనం చక్కగా విచారణ చేశాం ఇక ఇవాళ అసలు దాన కార్యక్రమం జరగబోతున్నది ఆ దాన కార్యక్రమం జరగబోతున్నప్పుడు గురువు శుక్రాచార్యుడు అనేక హెచ్చరికలు చేశాడు ఇవ్వద్దు కులం పోతుంది వంశం పోతుంది మళ్ళీ రాక్షసులకి రాజ్యం ఇప్పట్లో రాదు మళ్ళీ ఇంద్రుడు రాజవుతాడు అన్ని మూడు లోకాలు వాడు కొలిచేస్తాడు మూడు పాదాలు పెట్టుకొని మూడే కాదు పధ్నాలుగు లోకాలు ఆక్రమిస్తాడు మనం ఎక్కడికి పోతాం మనం ఒక్కళ్ళం నీ ఒక్కడితో కాదు మరి మేమందరం ఉన్నాం మా పరిస్థితి ఏమిటి అని శుక్రాచార్యుడు అడిగినా ఒకటే అన్నాడు కాదే రాజులు రాజ్యములు కలుగవే రాజులు లేరా వాళ్ళకి రాజ్యాలు లేవా ఎవడైనా ఇక్కడి నుంచి ఒక్క అణువు అన్నా వాడు వెంబడి పెట్టుకెళ్లాడా అంటూ వైరాగ్య బోధన గురువునే ప్రశ్నిస్తున్నట్టుగా ఆశ్చర్యపోతున్నట్టుగా తన ఆత్మాన్మతికి ఆ గురువే అడ్డం అవుతున్నటువంటి వేళ గురువుని కాసేపు పక్కన పెట్టేశాడు అది ఉత్తమ సాధకుడి యొక్క లక్షణం గురువు మనల్ని నడిపించాలి గురువు మనకి ఆంతరంగిక శక్తిగా ఉండాలి గురువు మనకు భరువు కాకూడదు గురువును మనం మోయకూడదు గురువు మనల్ని మోస్తూనే ఉంటాడు అయ్యో మోస్తున్నాడే అని అనుకోనక్కర్లేదు ఆయనకు ఎప్పుడు మోయాలో ఎప్పుడు దింపుకోవాలో ఆయనకి ఎరుక ఆయన కూడా పంచభౌతిక దేహాన్ని ధరించి వచ్చాడు గనుక రమణ మహర్షిని అడిగారు భగవాన్ మీబోటి జ్ఞానికి కూడా ప్రారబ్ధాలు ఉంటాయా ఆ ఎందుకుండవు జ్ఞానికి ప్రారబ్ధాలు ఉంటాయి అందులో తొలి ప్రారబ్ధం ఏమిటంటే తనకి ఏమీ అక్కరలేకపోయినా ఈ దేహం ధరించి రావటమే తొలి ప్రారబ్ధం అన్నారాయన ఆయనకేమున్నది ఇక్కడ ఏం కావాలి ఏం పొందాలి ఏం పోగొట్టుకోవాలి ఏం అక్కర్లా కానీ పంచభౌతిక దేహం ధరించి వచ్చాడు గనుక ఇదే ప్రపంచంలో ఉన్నాడు గనుక ఆయన ఆ ప్రారబ్ధాలన్నీ కూడా చక్కగా అనుభవిస్తాడు అనుభవిస్తున్నానన్న స్పృహ లేకుండా అనుభవిస్తాడు మనం అనుభవిస్తున్నామన్న వ్యధతో అనుభవిస్తాం అంతే తేడా ఆయనను చూసి మనకు బాధ కానీ ఆయన్ని ఆయన చూసుకోడు లోకాన్ని గాని లోకంతో కూడిన తనువును గాని చూడడు పరమాత్మతో అనుసంధానమైనటువంటి ఆత్మ విచారణలో మనసు నిమగ్నం చేసుకుంటాడుతత్వానుసంధానంలో ఉంటాడు అది నిత్య తత్వానుసంధానంగా ఉంటుంది అటువంటి ఆ దశలో ఆ దిశలో యజ్ఞ వాటికలో సాక్షాత్తు నారాయణమూర్తి అయినటువంటి వామనుడు ఆ బలి మధ్యలో శుక్రాచార్యుడు వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలో ఎందుకు ఈ వవరసి వచ్చిందో చెప్తున్నాడు. చివరకు అంటే అంత రాక్షసుడిలో కూడా నిన్న విచారణ చేశాం మనలో కూడా నాలుగు భాగాలున్నం మనం. దీనత్వం ఉన్నది, దానవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది, దివ్యత్వం ఉన్నది. దీనత్వాన్ని అధిగమించాలి. దానవత్వాన్ని సంపూర్ణంగా మరణించి నాశనం చేయాలి. మానవత్వాన్ని పరిమళింప చేయాలి, వికాసమానం చేయాలి. మ్మ్ మానవత్వం గనక పరిమళించినట్లయితే దాని పేరే మాధవత్వం. మాధవత్వం ప్రత్యేకంగా లేదు. ఈ మూడు దశలు దాటినటువంటి వేళ కలిగేటువంటి ఆ శీతలమైనటువంటి చల్లనైనటువంటి ఆ భావన ఏదైతే ఉన్నదో అది ఆత్మానుభవంగా మనం భావన చేయాలి. ఆ మానవీయమైనటువంటి కోణంలో బలి చెప్తున్నాడు చూడండి ఎంత అందంగా అడుగుతున్న-- చెప్తున్నాడు గురువు గారికి. "ఎన్నడున్ పరువేడబోగట" నాకిదివ్వవని ఇంకొకడి దగ్గరికి వెళ్లనే వెళ్ళడట. "ఏకలుండట కన్నవారు అన్నదమ్ములైనలేరట అని విజ్జలములగోష్ఠిన్నెరింగిన ప్రొడగుజ్జట చేతులగ్గి వసింతనీ చిన్ని పాపని తోసిపుచ్చగ చిత్తముల్ లదు సతమా". ఈ చిన్న వాడు వచ్చి మాటలు వచ్చి రానట్టుగా "నాకు ఎవ్వరూ లేరు నేను ఒంటరివాడిని అన్నదమ్ములు లేరు సర్వ శాస్త్రాలు నాకు అవగతమై ఉన్నాయి. అయినా నాకీ మూడు అడుగులు కావాలి" అని అడుగుతున్నాడు "ఇస్తాను" "నీకు ఇవ్వను" అని చెప్పి పంపటానికి నా మనస్సు ఒప్పటం లేదయ్యా అన్నాడు బలి. అంటే పదభ్రష్టుడివైపోతావు అన్నాడు శపించాడు గురువు. గురువులకి అహంకారం ఉంటుంది. అందుకే స్వామి చెప్తారు. ఇంత గురుస్థానంలో ఉన్నాను అనుకున్నవాడికి అహంకారం ఉంటుంది. ఉన్న-- అసలు ఉన్నవాడికి అహంకారం ఉండదు. అహంకారముండెనా గురువు చిక్కడు. స్వామి ఎంత అందంగా చెప్పారో చూడండి. అహంకారముండెనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారముండదు. అది. గురువు చిక్కాడు నా-- వీడు పలానా నా గురువు అన్న తర్వాత అహంకారం ఉండకూడదు. అహంకారం ఉన్నంత సేపు ఆ గురువు మాత్రం దక్కడు చిక్కడు. అలాగే ఈ గురువు శుక్రాచార్యుడు "పదభ్రష్టుడివైపోతావు. నీకు లభించిన ఈ సంపదంతా నశించిపోతుంది" అని ఒక శాపం ఇచ్చాడు. గురు శాప తప్తుడు అయినప్పటికీ గురువే శపించిన తర్వాత, దైవం గనక ఎప్పుడన్నా మన మీద కోప్పడితే గురువు గారి దగ్గరికి వెళ్లి పలానా దేవతకో పలానా గ్రహానికో నా మీద కోపం వచ్చింది, జాతక చక్రంలో శని ఇబ్బంది పెడుతున్నాడు ఏం చేయాలి అంటే "వాడి నోట్లో నాలుగు సెనగలు పోయి వాడే వాడి దారిన పోతాడు" అని మనకు చెప్తాడు సాధారణ గురువు. మన సెనగలకు లొంగేవాడైతే గ్రహం ఎందుకు పోతాడు? పట్టుకుంటాడు దాన్ని మనం అనుభవించాలి. కావలసిన remedy ఏమిటంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే చాలు. కానీ ఇక్కడ శాప తప్తుడైనప్పటికీ కూడా ఎక్కడా కూడా అమృత మార్గం మాట ఇచ్చాడు గనుక మాట తప్పకూడదు అన్న ఒక్క మాటకి నిలబడి మనస్సుని అదే మార్గంలో ప్రసారం చేస్తున్నాడు. ఎక్కడా deviation లేదు బలికి. అప్పుడు రెండు మాటలు మాత్రం గురువు గారికి చెప్పాడు. "బ్రతుకవచ్చు గాక బహు బంధనములైన, వచ్చు గాక లేమి వచ్చు గాక, జీవధనములైన చెడు గాక పడు గాక, మాట తిరుగలేరు మానధనులు". మానవుడు అంటే ఏమిటి? ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం. మాట ఇవ్వటం, అసలు ఇవ్వాలని అనిపించడమే గొప్ప విషయం. ఇచ్చిన తర్వాత అది నిలబెట్టుకోవటం. నిలబెట్టుకున్న తర్వాత నేను మాట ఇచ్చాను నెరవేర్చాను అని అనుకోకపోవటం. ఆ మూడు. అలా జరిగిపోయింది అంతే. "దనుజలోకనాథుదైత వింద్యావళి" బలి భార్య పేరు వింద్యావళి. ఎప్పుడైతే ఈ భక్త దానం ఇవ్వాలి అని మనసులో నిర్ణయం చేసుకున్నాడో, భార్య సహధర్మచారిణి గనుక ధర్మంలో సహంగా ఆయనతో సంచారం చేస్తున్నది గనుక ఎప్పుడు సంజ్ఞ ఇస్తే అప్పుడు ఆ దానం ఇవ్వటానికి ఆ ఇల్లాలు సిద్ధపడింది. అది విశేషం. బలిగారిది ఏమున్నది ఇచ్చేద్దాం అన్నాడు. ఆ అమ్మవారు ఇవ్వటానికి లేదు నా సంగతి ఏమిటి అని అడగలే. ఆయన ఇచ్చాక ఆయనే చూసుకుంటాడన్నది. కనుక అప్పుడు "రాజవదన మదమరాళదమన వటుని కాళ్లుగడుగ వరహేన ఘటమున జలము తెచ్చె భక్తసన్న ఎరిగి" కనుల చివర నుంచి ఒక సంజ్ఞ చేశాడు సన్నగా. చక్కగా మంచి ఒక బంగారు పాత్రలో పవిత్ర జలాలు తీసుకురా వటువి యొక్క పాదాలు కడగాలి వేళ అన్నాడు. తీసుకొచ్చి ఇచ్చింది. అది హేమఘటంలో తీసుకొచ్చింది.
SSSMC · audio
Bhagawata Navaneetham - 42
Bhagawata Navaneetham - 42
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 23:34
More in this series