No transcript for this section.
సౌందర్య సాద సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం సురియాతీత పదస్థితాంశ కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్రాప్తం సద్గురుం సత్య సాయీశ్వరం ఆలంబెన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ భక్తి అంటే కేవలం మనం చేసేటువంటి వ్రతాలు కాదు, భ అంటే ప్రకాశం కతి అంటే కూడి ఉండటం. ప్రకాశంతో కూడి ఉండటం భక్తి. ప్రకాశానికి స్వరూపం లేదు. ప్రకాశం అంటే తేజస్సు. ఆ తేజోమయ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఆంతరంగికంగా వెలుగు గానూ బయట బొమ్మగానూ చూసుకోగలిగినట్లయితే అది జ్ఞానంతో కూడిన భక్తి. కేవలం మా స్వామి ఇంతే ఫోటో ఫోటోలో ఉన్నారు, ఫోటో భక్తి లో ఉన్నారు, పొద్దున వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు అంటే అది పూర్ణమైన భక్తి కాదు. కేవలం భౌతికమైనటువంటి ఒక స్వరూపాన్ని ఆరాధించేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆరాధన తప్ప పూర్ణ భక్తి కాదు. భక్తి అంటే స్వామి యొక్క మూలమైన పెను వెలుగుతో మన జీవుడి యొక్క వెలుగు రెండు సమన్వయమై, సంయోగమై, సంయుక్తమై, సమాగమై అన్నివేళలా కూడి ఎక్కడైతే ఉన్నదో అది భక్తి. ఆ సంఘటన జరిగితే దాని పేరు భక్తి యోగం. అంటే పరమేశ్వరుడి యొక్క నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమైనటువంటి తేజస్సుతో కూడి మనం గనక పూజ చేస్తే అది భక్తి యోగం. దానం చేస్తే అది దాన యోగం. అన్ని యోగాలే. అలాగే కర్మలు కూడా తేజోమయుడైనటువంటి పరమాత్మ భావనతో కూడి చేసినట్లయితే పరమాత్మ నాతో ఉన్నాడు, పరమాత్మ యొక్క శక్తి నన్ను నడిపిస్తున్నది, నాతో అనిపిస్తున్నది, నాకు వినిపిస్తున్నది అని అనుకున్నట్లయితే అది కర్మ యోగం. లేకపోతే మిగతావన్నీ పనులు, చాకిరీలు, ఒట్టి కర్మలు మాత్రమే. ఒట్టి కర్మ యోగించకపోతే కర్మ యోగం కాదు. కర్మ యోగంలో ఏమున్నదయ్యా అంటే కర్మ సన్యాసం ఉన్నది. కర్మలన్నీ కూడా వదిలిపెట్టగలిగిన నేర్పరితనం ఉన్నది. ఆ మనస్సు వైరాగ్య స్థితిలోకి వెళ్ళాలి గనుక భాగవతం నిండా మహా వైరాగ్యం ఉంది. మహా భక్తి ఉన్నది. మహా జ్ఞానం ఉన్నది. పూర్ణ తత్వం ఉన్నది. తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది గనుక ఈ ఐదింటినీ కూడా చక్కగా ఉపాసనా మార్గంలో మనం చక్కగా పోతనామాత్యుడు ఎలా చెప్పాడో ఆ వ్యాస భాగవతానికి పోతన భాగవతానికి పెద్ద తేడా ఏం లేదు. కాస్తే కొన్ని కొన్ని విశేషాలు ఇప్పుడు వాల్మీకిలో శబరి చాలా చిన్న పాత్రగా రాశాడు ఆయన. ఆయన ఆయన దర్శనం చాలా తక్కువ. అదే విశ్వనాథవారు కల్పవృక్షంలో శబరిని గురించి రామ శబరి సంవాదం ఒకటుంది మనం చెప్పుకున్నాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తీరుతెన్నులు ఒక ముసలి అవ్వ, చిన్న అతి పిన్న వారైనటువంటి రామభద్రుడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ లోకోత్తరంగా, రమణీయంగా ఆయన ప్రతిపాదన చేశాడు. అలాగే ఇక్కడ మన పోతనామాత్యుడు కూడా పరమేశ్వరుడితో కూడి ఉన్నాడు. పరమేశ్వరుడితో సంభవించి ఉన్నాడు. ఎప్పుడైతే రామాజ్ఞ అయిందో ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. మిగతా అన్ని కావ్యాలు, ఏ కావ్యమైనా సరే, ప్రపంచంలో కొన్ని exceptions ఉంటాయి. వాటిని మనం గమనించుకోవాలి. ఒకటి, ఏ కావ్యమైనా అవతారికలన్నీ గణపతి సప్-స్తవంతో ప్రారంభం అవుతాయి. ఎందుకనంటే నేను రాసే బుక్కు అయిపోవాలి, ఆగకూడదు, మధ్యలో అడ్డంకులు రాకూడదు అని. అలాగే ఏ తత్వబోధ చేసినా స్వరూప స్వభావ సగుణ సంపన్నుడైనటువంటి పరమాత్మను గురించిన మాటలుంటాయి. రమణ మహర్షి "ఉళ్ళదు నాల్పడు" అని అంటే ఉన్నవి నలభై. అది ఆ సద్విద్య అన్నారు. ఆత్మవిద్య. ఆత్మవిద్యను గురించి ఆ నలభై శ్లోకాలు రాసినప్పుడు దైవాన్ని గురించి మొట్టమొదటి చరణం రాయలా. మొట్టమొదటి చరణం ఆయన స్మరించింది మరణాన్ని. ఆశ్చర్యకరంగా! మరణంతో ప్రారంభమై దేహంతో దేహం దాకా తీసుకొని వస్తారు. అదొక ఉదాత్త వైఖరి. అలాగే మన పోతనామాత్యుడు కూడా మామూలుగా గణపతి ప్రార్థన చేయాలి. ఆదర మొప్ప అంటూ చదవాలి. చదవలా. "శ్రీ కైవల్య పదంబుకై" అన్నాడు ముందు. అసలు నేను ఈ కావ్యం ఎందుకు రాస్తున్నానో ముందు చెప్పి తర్వాత గణపతి దగ్గరికి వెళ్ళాడు ఆయన. కావ్యం ఎవరైనా సరే రెండు కారణాల వలన రాస్తారు. రెండు రకాల వాళ్ళుంటారు. ఒకడు కావ్యం వలన కీర్తి, సంపద లభించాలి అని రాస్తాడు, దోషం లేదు. అది వాడి సంస్కారం. వాడి తపస్సు యొక్క శక్తి అంతే. రెండో వాడు నేను రాసిన కావ్యం వలన ఈ లోకానికి కళ్యాణం జరగాలి అని రాసుకుంటాడు. లోకానికి కళ్యాణం అంటే ఆ కళ్యాణంలో తనకు కూడా ఒక భాగం ఉంది. తన కళ్యాణం ఎక్కడ ముగుస్తుందయ్యా అంటే పరమేశ్వరుడి సాయుజ్యంతో ముగుస్తుంది. కాబట్టి జగద్హితంబుగన్న అన్న జన్మాద్యపాయంబు తప్పించుగన్ అన్న జన్మల వలన ఏర్పడే అపాయాలు తప్పిపోవాలని అన్న, జగత్తుకి సంక్షేమం జరగాలి, కళ్యాణం జరగాలని కాంక్షించినా ఇదంతా కూడా కవి యొక్క సంస్కారాన్ని బట్టి జరుగుతుంది గనుక ఇక్కడ భాగవతము అంటే కేవలం కృష్ణకథ మాత్రమే కాదు. కృష్ణుడు దశమ స్కంధం దాకా వెళ్తేగాని అసలు రాడు. ఈ లోగా చాలా విశేషాలున్నాయి. అయితే మనందరం భక్తి మార్గంలో, భక్తి యోగంలో మిగతా వైరాగ్య సత్వ ముక్తులన్నింటినీ విచారణ చేసినా దానిలో ఉన్నటువంటి ప్రకారమే అశ్వద్ధామ అవమానంతో ప్రారంభమైఅశ్వత్థా అశ్వత్థామకి జరిగిన అవమానం అంటే ఏం లేదు. వాడు ఉపపాండవుల్ని చంపాడు గనుక అర్జునుడు బంధించి తీసుకువచ్చాడు అక్కడి నుంచి కథ మొదలు. మరి కృష్ణుడు ఎక్కడొచ్చాడు? కృష్ణుడు అక్కడున్నాడు కదా అంటే అది వేరే సినిమాలో వేరే flashback అన్నమాట. తర్వాత వస్తాడు పరీక్షిత్తు వచ్చిన తర్వాత గాని భాగవతం రాదు. కానీ పరీక్షిత్తు పుట్టేదాకా భాగవతం కథ ఉంది. ఆ కథని మనం కాస్త సాలీపులాకంగా భీష్మస్తవం ఉంది. అట్లాగే అంటే భీష్ముడు కృష్ణుణ్ణి స్తుతించటం. ఆ భక్తితో అంపశయ్య మీద పడుకొని. అలాగే కుంతి, అలాగే శ్రీకృష్ణుని నిర్వాణం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఎలా సాలించాడో తెలుసుకోవాలి. కృష్ణ భూమికలో ఉన్నటువంటి ద్రౌపది అశ్వత్థామని ఎట్లా క్షమించి క్షమాగుణం చేత వదిలిపెట్టిందో చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఈ రెండు మూడు రోజుల్లో మనకి పరిపూర్ణమై, ఆ ఏడవ రోజు వచ్చేనాటికి భాగవతం అసలు కథ అప్పుడు ప్రారంభం అవుతుంది అని అర్థం. సరే పోతనామాత్యుడి యొక్క కవి హృదయం అంటే మన హృదయమేనన్నమాట. కాస్త విచారణ చెయ్యాలి ఇవాళ. శ్రీరాముడు వచ్చాడు, "ఇదిగో నువ్వు అయిగా భాగవతం రాయ్" అన్నాడు. మళ్ళీ విశ్వనాథ గారి అన్నట్లు "యదన్నం తత్ భావం యద్భావం తద్భాషా" అంటూ ఏం అన్నం తింటామో ఆ అన్నంలో నుంచి భావాలు పుడతాయి. ఆ భావాలు express చేయటానికి కావలసిన ఆ భాషలు పుడతాయి. అంటే ఈ భారతదేశంలో సుమారు రెండు వందల ఎనభై భాషలు ఉంటే వాళ్ళ దాకా ఈ రామాయణం గనక వెళితే రెండు వందల ఎనభై భాషల్లోనూ రాముడి గురించి మాట్లాడుతారు. రాముడు కూడా రెండు వందల ఎనభై భాషలు మాట్లాడుతాడు. అందుకే రామాయణ కల్పవృక్షం అంతా రాసిన తర్వాత ఆయన చివరి ఏమన్నారు ఒక మాట "ఇంతకీ రాముడికి తెలుగు వచ్చునా?" అన్నాడు. అది చమత్కారం. తెలుగు రాముడైతే తెలుగు వచ్చు. తెలుగులో చెప్పుకున్నాం కనుక తెలుగు వచ్చు అనుకోవాలి. లేకపోతే అన్ని తెలుగు పద్యాల్లో అన్ని సంభాషణలు ఎలా చేశాడు? కాబట్టి ఎక్కడ ఏ ప్రదేశంలో మనం అన్నం తింటామో, అందుకే స్వామి ఒక interview ఇచ్చినప్పుడు తర్వాత తర్వాతగానే ఆయన మాటలు అర్థం కావు. వెంటనే అసలు అర్థం కావు. "Think of the salt you have eaten here. Help will come from unexpected quarters" అన్నారాయన. పుటపర్తిలో here అంటే స్వామి దగ్గర. నువ్వు తిన్న ఆ ఉప్పు, ఉప్పు అంటే ఏంటి? ఒట్టుప్పు తినం కదా! షడ్రుచులలో ప్రధానమైనది అది లేకపోతే మిగతా రుచులన్నీ పోయినట్లే. నీకన్నీ ఉన్నా ఆ ఉప్పు ఎవరంటే స్వామి. నేను లేకపోతే అని అర్థం. ఇక్కడ తిన్న salt ని గుర్తు పెట్టుకో. నీకు ప్రపంచంలో ఎప్పుడు ఏ సాయం కావాలో అది నీకు అందుతుంది. అలాగే ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ ప్రదేశంలో మనం అన్నం తిన్నామో, ఏ మనుషులతో మనం సంగమించి ఉన్నామో, ఎవరితో మన భావనలన్నీ కూడా పంచుకుంటున్నామో, ఎవరి వలన మా భావాలు అమృత భావాలుగా రూపాంతరీకరణం జరుగుతున్నాయో, ఎవరి వలన సత్సాంగత్యము, సత్సంగము, సద్గోష్ఠి, సదాచారము ఏర్పడ్డాయో ఒక నిశ్చయగా అటువంటిది గనక గుర్తు పెట్టుకున్నట్లయితే ఇటువంటి భాగవతాలే పుడతాయి అని అర్థం. లేకపోతే మనం అంటాం ఎవరికీ తెలియదు నీ భాగవతం అంటాం. కదా? negative గా. అది ఆ భాగవతం అది లోకం. ఈ భాగవతం పరమాత్మను గురించి. ఇది భాగవతం అయితే అది భాగవతం కదా. స్వామిని కూడా ఓ మాట అడిగారు. "స్వామి! రామాయణం చదివితే ప్రపంచంలో ఎలా మర్యాదగా జీవించాలో అది బోధిస్తుంది మానవుడిగా. భారతం చదివితే ప్రపంచంలో ఎలా మర్యాదగా మెసులుకోవాలో బోధిస్తుంది. మరి భాగవతం చదివితే?" అని అడిగారు. "బాగువుతాం బంగారు" అన్నారు. ఆ భాస్వ్యం ఒత్తుకొట్టేశారు. "బాగువుతాం" అన్నారు. ఇక బాగవ్వటం అంటే ఏంటంటే ఏ చెడుందో ఆ చెడు అంతా పోయి బాగు అయిపోతాం. ఆ బాగు కావడం కోసమే వచ్చాం ఇక్కడికి జన్మెత్తి. అనేక జన్మలు, అనేక చిత్తవృత్తులు, అనేక సంస్కారాలు అలా వచ్చిన వాడే పోతన. పోతన సహజ కవి అయినా సంస్కార ధార తనని ముక్తని ముట్టే సమయం వచ్చేదాకా, పరమేశ్వరానుగ్రహము, ఆదేశము లభించేదాకా భాగవతం రాయగలిగాడా? రాయలా. భోగిని దండకం రాశాడు. ఏవో చిన్న చిన్న పద్యాల సహజ కవి కాబట్టి నాగేటి చాలులో దున్నుకుంటూ గాలిలో ఎన్ని కలిసిపోయినయో పద్యాలు, పాటలు రాసుకున్నాడేమో! కానీ గ్రంథస్తమై ఈ భాగవతం నిగమ కల్పతరువు అయింది. నిగమ కల్పవృక్షం అయింది ఇది. అంటే వేద కల్పవృక్షమే భాగవతం గనుక ఆయన చెప్తున్నాడు. ఆ చంద్రోదయమై ఇటువంటి మార్గశిర పౌర్ణమి నాడు చక్కగా స్నానాదికాలు ముగించుకొని తనకు ఉన్నదాంట్లో ఎవరెవరికీ ఏమివ్వాలో కొన్ని దానాలు ఇచ్చుకున్నాడట. మనం ఏం చేస్తామంటే వ్రతం అయిపోయాక దానాలు ఇస్తాం. కదా. పండు, తాంబూలం వ్రతం అయ్యాక. ముందు ఇవ్వం. ఎందుకు ఇవ్వము అంటే దాని మీద స్వామి ఓ చమత్కారం చేశారు. చివరిదాకా వీళ్ళు ఉండరేమో, పండు తీసుకుపోతారేమోనని. కాబట్టి పోతనామాత్యుడికి కావలసింది ఏమిటండీ అంటే వీళ్ళంతా వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళితే తప్ప ఆయనకి ఏకాంతం దొరకదు. ఆ ఏకాంతం ఉంటే తప్ప పరమేశ్వరుని ఉపాసన చేయలేడు. ఆ పరమేశ్వర ఉపాసనకి కావలసిన ధ్యాన ముద్రాంకితమైన స్థితి ఏర్పడాలి అంటే ఆ ఏకాంతము, ఒంటరితనము, ఆ ప్రసన్నత, ప్రశాంతత ఉన్నటువంటి ఒక చల్లని సాయంకాలం కావాలి. అది కూడా చక్కని ప్రదోషం అంటే దోషరహితమైనటువంటి వేళ. చంద్రోదయం మామూలా మనస్సు స్థిమిత పరచేది. మనస్సుని అస్థిమిత పరచేది కూడా చంద్రోదయమే. ఒకడు చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సు కలత చెందుతాడు. అది కావాలి, ఇది కావాలని భోగం వైపు మనస్సు లాగుతుంది.అదే యోగ నిష్ఠ లో ఉన్నవాడు చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సుని స్థిమిత పరచుకొని చంద్ర కిరణాలు ఏవైతే ఉన్నాయో సుషుమ్నా కిరణాలన్నింటినీ కూడా తాను అనుభవిస్తూ మనస్సుని రసప్లావితం చేసుకుని సంస్థితమై ఒక నిష్ఠలో నియతిగా సంస్థితమై పూర్ణుడై ధవలుడై నిలకడ చెంది దేనిని ఉపాసించవలెనో దానిని ఉపాసిస్తూ ఉంటాడు. అటువంటి స్థితి పోతనామాత్యుడికి ఏర్పడింది. ఆ పోతన, బమ్మెర పోతన మొట్టమొదటి పద్యం చెప్తున్నాడు ఇది అవతారిక. శ్రీ కైవల్యపదంబు చెరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసద్రుగ్జాలసంభూత నానాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్. ఎంత అందంగా! అంటే, తాను ఎందుకు చేస్తున్నాడు? ఎవరి గురించి చెప్పబోతున్నాడు? ఈ పద్యంలో చెప్పేశారు. ఎందుకు చేస్తున్నాడంటే, శ్రీ కైవల్యపదం కోసం చేస్తున్నాడు. శ్రీ కైవల్యపదం అంటే బ్రహ్మపదం, మోక్షం. అందుకోసమని చింతించెదన్, ఒకణ్ణి గురించి ఆలోచిస్తా. వాడెవడయ్యా అంటే, లోకరక్షైక ఆరంభకుడు వాడు. వాడు ఎప్పుడు మొదలు పెట్టినా వాడికి మొదలు తుది లేదట. ఆది మధ్యాంత రహితుడైన పరమాత్మ. వాడికున్నటువంటి పని ఒక్కటే, ఈ లోకాన్ని రక్షించాలి. వాణ్ని, అటువంటి వాణ్ని, అందులో లోకంలోనూ ఇంకో తరగతి ఉన్నది. భక్తపాలనకళాసంరంభకున్, వాడికి ఒక చొట్టుపాటు ఉంటుంది సంరంభం, ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక ఉద్వేగం ఉంటుంది పరమాత్మకి. ఆ పరమాత్మ యొక్క ఉత్సాహం ఏమిటంటే భక్తుణ్ణి రక్షించటం. కాబట్టి ఆ భక్త కళ ఉన్నటువంటి వాణ్ని రక్షించటం. దానవోద్రేకస్తంభకు, భక్తులు ఇలా ఉంటే వాళ్ళతో పాటే భక్తులు కాని వాళ్ళు ఉంటారు దానవులు. మానవులు, దానవులు, దీనులు, దివ్యులు. ఈ నాలుగు జీవుడిలో అంశాలివి. అందులో ఈ దానవాంశంలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళకి కలిగేటువంటి ఉద్రేకాన్ని నిరోధించటానికి, నిర్మూలించటానికి కంకణధారి అయినటువంటి వాణ్ని కేళిలోల విలసద్రుగ్జాలసంభూత నానాకంజాతభవాండకుంభకు. అంటే, బ్రహ్మాండం నానాకంజాతం నానా లోకాలు ఏవైతే సర్వ లోకాలు ఉన్నాయో వీటన్నింటిలోలో ఉన్న వీరందరినీ రక్షించటానికి వచ్చినటువంటి మహానంద అంగనా డింభకున్. మహానందుడు అంటే నందుడు. వేపల్లెలో ఉన్నటువంటి నందుడు. ఆయనకు ఒక అంగన, ఒక భార్య ఉంది. ఆమెకు ఓ ముద్దుల కొడుకు ఉన్నాడు. వాడి పేరు కృష్ణుడు. వాని గురించే ఆలోచిస్తున్నాను అన్నాడు. అది. మహానందాంగనా డింభకున్. డింభకుడు అంటే కొడుకు. వాడి పేరేమిటయ్యా కృష్ణుడు అని చెప్పాడా? చెప్పలే. వాళ్ళ అమ్మ పేరు చెప్పాడా? చెప్పలే. వాళ్ళ అయ్య పేరు చెప్పాడా? అది చెప్పలే. నందుడు అని మనం డ్రా చేసుకోవాలి. నందుడు అంటే, అందుకనే లీలాశుకుడు కృష్ణ కర్ణామృతంలో శ్లోకం చదువుతాడు, బాలకృష్ణుణ్ణి గురించి. జిహానం జిహానం సుజావేరమౌజ్యం దుహానం దుహానం సుధాం వేలునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమేతన్నమస్తా అంటాడు. మహానంద సర్వస్వం అంటే మహా నందుడికి ఆనంద సర్వస్వమైన కృష్ణుడు అని ఒక అర్థం. మహానంద సర్వస్వము రూపం దాల్చినవాడా అని రెండవ అర్థం. కాబట్టి అటువంటి కృష్ణుణ్ణి నేను ఇవాళ ఉపాసన చేస్తున్నాను. వాణ్ని గురించే ఇవాళ చింతిస్తున్నాను. ఎందుకని? ఇప్పుడు ఆయన వచ్చి చెప్పేళ్ళాడుగా. వాడి కథ రాయ్ అని భాగవతం రాయమన్నాడుగా. రాముడి గురించి రాయాలంటే అది ఆలోచించావండీ. ఆయన ఆ మాట చెప్పలేదు, శివుడి గ-- గురించి చెప్పలేదు. విష్ణువుని గురించి, కృష్ణుణ్ణి గురించి చెప్పమన్నాడు గనుక దానినే చింతించెదన్. నిరంతరమూ ఆలోచించి ఆలోచించి దాని మీదనే మనస్సు పెట్టి ఈ పరమ ప్రశాంతమైనటువంటి ఆవరణంలో నుంచి ఈ పూర్ణిమా మాలికలు నా హృదయాన్ని తాకుతున్నటువంటి వేళ దీనికి శ్రీకారం చుడుతున్నాను. ఇది జరిగినందువలన ఏం కలుగుతుంది అంటే శ్రీ కైవల్యం కావాలి అని కోరుకుంటూ చేస్తున్నానన్నాడు. ఇది ఒక దివ్య కామన. మనందరం కూడా ఇది భక్తికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, తత్త్వం కాబట్టి కైవల్యాన్ని కోరుకోవాలి. కైవల్యం, అందునా శ్రీ కైవల్యాన్ని కోరుకోవాలి. శ్రీ కైవల్యం అంటే ఇక తిరుగురాని, తిరిగిరాని, మళ్ళీ పుట్టటానికి వీలులేని చిట్టచివరి జన్మగా ఈ జన్మని మనం మార్చుకోవాలి. ఎందుకని అంటే మళ్ళీ ఈ జన్మే ఎత్తితే మళ్ళీ ఇలాగే పుడతాం, మళ్ళీ పెరుగుతాం, మళ్ళీ స్కూల్ కి వెళ్తాం, మళ్ళీ పరీక్షల్లో పాస్ అవుతాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, ఆ డబ్బు కాపలా కాస్తాం, కదా? ఈ కాపలా కాసేలోగా ఇద్దరు లోపలికి వస్తారు, స్వామి అన్నట్టు. రెండు స్థిరాస్తులేనన్నారు. ఒకటి బీపీ, రెండో షుగర్. ఆ రెండూ స్థిరంగా ఉంటాయట. ఆ? ఇక చరాస్తుని సంపాదిస్తాం, ఎప్పుడో రోజు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి మళ్ళీ చేసిందే ఎందుకు చేయాలి? చేసాం, ఒకసారి చేసాం, అంతే. జన్మ ఎత్తాం, వచ్చాం, ఓ ఇట్లా ఇట్లా ఉంటుంది ఇరవై ఏళ్ళ వరకు చదువుకోవాలి, ఇరవై దా-- నా-- ఇరవై నుంచి ఉద్యోగం రావాలి, అరవైకి రిటైర్ అవ్వాలి, అరవై నుంచి ఇగో ఈ భాగవతమో భారతమో చదువుకొని జీవితం ముగించాలి. ఇదేనా? ఇంతేనా అంటే, ఇదంతా ఎందుకు చేస్తున్నావయ్యా అంటే పోతనామాత్యుడు ఒక్కడే కాదు మనం కూడా శ్రీ కైవల్యపదంబుకై చింతించెదన్. లోకరక్షైకారంభకు, అది. ఆ లోక రక్షకుడైనటువంటి పరమాత్మని. అయితే ఈయన ఏం చేసాడంటే...ఎంత చేసినా పోతనామాత్యుడు పతం తొందరపడి మొదటి పద్యం అట్లా రాసినా లోపల భయమేసింది. ఏదో ఇప్పుడు పౌర్ణమి అంతా బానే ఉంది మొదటి రెండు మూడు పద్యాలు కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాను కానీ నేను శైవుడిని కదా, మా అయ్య శివుడు కదా, ఆ శివుడికి మా తమ్ముడు ఒక కొడుకు ఉన్నాడు వాడి పేరు గణపతి కదా, ఆయనకు ఒక నమస్కారం పెట్టకుండా వెళితే మనం కూడా అంతే చూడండి స్వామే అన్నీ అంటాం ఊరికే కదా! ఊరికే పోనీ అక్కడ వినాయకుడు ఉన్నాడు ఆయనకి దండో పువ్వో వేయటం మర్చిపోయాం అనుకోండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్తాం ఎందుకని? భయమేస్తుంది. ఆ వెళ్ళే పనికి ఏమన్నా అడ్డం తగులుతాది తగలడు. ఈయన తగలక్కర్లా ఉన్నా అడ్డం తొలగించకపోయినా ప్రమాదమే కాబట్టి ఎందుకైనా మంచిదని ఒక పువ్వు ఎలా పెడతామో ఆయన ఇలా ఒక పద్యం పాడాడు. ఏమిటా పద్యం అంటే "ఆదర ముప్ప మొక్కిడుతు అత్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అదేశ జగజ్జననంద వేదికిన్ మోదకోహాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్" ఇవన్నీ ఆయన ఆయన గొప్పతనం ఏ ఆ శివుడి కొడుకు అమ్మ కొడుకు ఇట్లా ఆయన ఆయనకేమిష్టం ఆయన వాహనం ఏమిటి ఇవన్నీ చెప్తూ ఓ గణపతి నీకు నమస్కారం అయ్యా అని ఒక నమస్కారం బాణం వేశాడు. వేసి, చింతించెదన్ అని ఆ ఒక్క శబ్దం వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి. ఇది అయ్యాయి ఏడు నెలలు కూడా. ఇదంతా హృదయంలో నుంచి పుట్టినటువంటి సజ్జోస్పురణ వలన ఏర్పడ్డది. ఏదో కూర్చొని ఆ ఆలోచించి ఎలా రాద్దాం ఎట్లా రాస్తే అందరికీ బాగుంటుంది అన్నది కాదు. తన యొక్క హృదయ సంస్కారమే మహాకావ్యంగా బయటకు వచ్చినటువంటిది గనుక ఇంకో మాట ఏమన్నాడంటే ముగ్గురు కావాలన్నాడు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఏ పని చేయాలన్నా, ఒక పని చేయాలి అంటే చేద్దాం అని ముందు ఇచ్ఛ ఉండాలి. చేసే కర్మకాండ క్రియ ఉండాలి. చేస్తేగా పని అయ్యేది. తెలివితాతల్స చేయాలి one must do it with being an adept. ఆ దాని పేరు జ్ఞానశక్తి అన్నాం. కాబట్టి ఇచ్ఛ, క్రియ, జ్ఞానం మూడు శక్తులు త్రిపుటీకరణం కావాలంటే దాని మూలమైన అధిష్ఠాన దేవతలు మనకు అనుగ్రహం ఇవ్వాలి. ఇచ్ఛాశక్తి ఇచ్చేవాళ్ళు, క్రియాశక్తి ఇచ్చేవాళ్ళు, జ్ఞానశక్తి ఎవరిస్తారు? వాళ్ళని కూడా ఒకసారి తలచుకున్నట్లయితే ఈ మనం చేయబోయేటువంటి భాగవత కావ్య నిర్మాణం ఏదైతే ఉన్నదో దానికి కావలసినటువంటి శక్తులు వస్తాయి గనుక ముందుగా [తడుము] అమ్మవారిని ప్రార్థించాలి. ఎవరు అమ్మవారు? రాయాలి, ఇదంతా రాతకి సంబంధించింది. కోత కాదుగా రాత. ఈ రాత సరస్వతీ దేవి చేతిలో ఉంది. అమ్మవారు మంచి వాక్కు ఇవ్వకపోయినా, అమ్మవారు మంచి వ్యాకరణం ఇవ్వకపోయినా, మంచి భావాలు ఇవ్వకపోయినా కావ్య సృష్టి జరగదు. పరమాత్మని ఈ అక్షర తపస్సుతో, వాచక తపస్సుతో, వాఙ్మయ తపస్సుతో తన సంస్కార ధీయుతమైనటువంటి ఒక ప్రజ్ఞతో ఉపాసన చేయాలి అంటే వాణి ఉండాలి. వాక్కు మంచిదై ఉండాలి. "తల్లీ! నిన్ను తలించెదన్ పుస్తకము చేతన్ భూమితిన్" అని కదా చదివాం. "జృంభణముగా నుత్తుల్ సుశబ్దంబు శోభిల్లను బల్కుమన్నాం" మంచి మాదు వాక్కునన్. నా వాక్కులో మంచి శబ్దాలు, మంచి శబ్దాలు అంటే సుశబ్దాలు మాత్రమే. అందరికీ హితకరమైనవి, ఆనందదాయినవి అయినటువంటి మాటలు మాత్రమే ఇవ్వమని అడిగినట్టుగా ఈయన కూడా అమ్మవారిని అడుగుతున్నాడు. "శోణితలంబు నెన్ను దురుసోకగ మొక్కి నుతున్" శోణితలం అంటే పాలభాగం. ఈ పాలభాగం నేల తాకేట్టుగా నమస్కరిస్తానమ్మా అని శిరసా అని అర్థం. "సైకత శోనికి చంచరీకచయసుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజా తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్" అది చేతిలో అందమైన పుస్తకం అక్షమాల ధరించినటువంటి ఓ సరస్వతీ! నీ యొక్క అనుగ్రహం నా యందుండు గాక! నిన్ను నీకు నమస్కరిస్తున్నాను మొక్కుతున్నాను అన్నాడు. అంతే కాదు ఇంకా ఆనందం కలిగింది. ఎంత ఆనందం కలిగింది అంటే నిన్ను నమస్కరిస్తాను అని శిరస్సు వంచాడో లేదో ఆయనకి అమ్మవారి దర్శనమైంది. ఎక్కడ కూర్చున్నాడు పోతన? చక్కని తెల్ల బట్ట కట్టుకున్నాడు. చల్లటి చల్లటి వెన్నెలలో కూర్చున్నాడు. చల్లటి చల్లటి గోదావరి నదీ ప్రవాహంలో వెన్నెలు ప్రవహిస్తున్నాయి, ప్రజరిస్తున్నాయి. ప్రవాహ వేగంతో నిశ్చంద్ర మంద్రంగా వెళ్తున్నాయి. తాను కూర్చున్నటువంటి ప్రదేశమంతా చల్లగా వెలిగిపోతున్నది. తన హృదయము లోపల దహరాకాశం కూడా చల్లగా ఉన్నది గనుక అక్కడ సరస్వతీ దేవి ఆయనకి దర్శనమిచ్చింది. "శారద నీర దేందుఘన సార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాచ ఫణీచ కుందమందార సుధాపయోధి శిశ తామర సామర వాహినీ శుభాకారత ఒప్పునిన్ను మదిగానగ ఎన్నడు తలంతు భారతీ" దృశ్యం చూశాను అమ్మా మదిగానగ ఎన్నడు తలంతు భారతీ. ఏదో ఆ ఫోటోలో, ఈ ఫోటోలో, ఈ విగ్రహంలో ఈమె సరస్వతీ వీణ పట్టుకుంది, హంస మీద కూర్చుంది అనుకున్నది కాదమ్మా! నా మనసుతో, నా హృదయంతో నిన్ను ఎప్పుడు చూడగలుగుతానో కదా ఇంకా చూడలేదు అంటున్నాడు. ఎప్పుడు? చిన్న దృశ్యం కలిగింది. ఎప్పుడు కలిగింది? తన శిరస్సును నేలకు వాల్చి దానికి తాల్చి నిన్ను చింతిస్తాను, నీకు మొక్కుతున్నాను అనగానే అమ్మవారు ఈ పద్యమంతా ఒక తెలుపుకి శారద నీర దేందుఘనసార పటీర మరాళ అంటే తెలహంస మొత్తం రజతాచలకాశ పళీశ కుందమందార సుధాపయోధి తెలమందారాలు మందారాలు ఎర్రగా ఉంటాయి అనేనా కానీ కాదే తెలమందారాలు ఉన్నాయి కాబట్టి కుందమందార సుధాపయోధి క్షీరసాగరం ఎట్లా ఉందో అట్లా ఉన్నది అట అందుకనే ఆమె సరస్వతీ దేవి యొక్క బొమ్మ ఎక్కడ తెల్లటి బట్టలతో కూర్చొని ఉన్నదో దాన్ని మన ఇంట్లో పెట్టుకోవాలి తెలహంస మీద కూర్చొని ఉండాలి అంతా తెలుపుదనంతో ఉండాలి అది ఒక సూచన అంతే సరే ఈమెని సరస్వతీ దేవి సాక్షాత్కారం అయిపోయింది ఆయనన్నాడు నేనంటే తాటాకుల మీద రాస్తే వాడికి అమ్మనన్నారు గాని తాటాకులు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి కదా తాటాకులు ఎవరన్నా ఊరికే ఇస్తారా? గంటం ఊరికే ఎవరన్నా ఇస్తారా? ఎవరే కాబట్టి ప్రపంచంలో మూడు కావాలి ఒకటి సరస్వతి కావాలి రెండవది దుర్గాదేవి యొక్క శక్తి కావాలి అనారోగ్యం పాలు కాకూడదు శరీరం దృఢంగా ఉండాలి మనస్సు స్థిమితంగా ఉండాలి బాగా డబ్బుంది దానితోపాటు అనారోగ్యం ఉంది ఏం ఉపయోగం? ప్రయోజనం లేదు మంచి ఆరోగ్యం ఉంది డబ్బు లేదు ఏం ప్రయోజనం ఆకలేస్తుంది రెండు ముద్దలు మూడో ముద్ద దొరకదు ఈ రెండూ ఉన్నాయి బుద్ధి లేదు సరస్వతీ దేవి లేదు ఏం చేయాలి కాబట్టి జీవుడికి మూడు కావాలి దుర్గాదేవి కావాలి సరస్వతీదేవి కావాలి లక్ష్మి కూడా కావాలి కాబట్టి ఈయన అనుకుంటున్నాడు ఏమనంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపు ఆరడి కుచడి అమ్మా తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం మునగుండెడి అమ్మా ఈ అమ్మ ఎక్కడుందో చెప్తున్నాడు దుర్గ మాయమ్మ కృపాబ్ధీచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వసంపదల్ కవిత్వం ఇవ్వాలి దుర్గాదేవిని గనక పట్టుకున్నట్లయితే ఈ మూడు వస్తాయి అని ఆయనకప్పుడు అర్థమైంది కాబట్టి మాకేమి వస్తావు మహత్త్వ శక్తినివ్వు డబ్బు ఇవ్వు కవిత్వ సరస్వతీదేవిని వాక్కునివ్వు పటుత్వ దృఢమైనటువంటి శక్తిని ఇవ్వమ్మా నువ్వెవరు? ఈ ముగ్గురు అమ్మలకి మూలపుటమ్మవి నువ్వు మూలపుటమ్మ ఎవరు అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఎవరి పుత్రిక? హిమవత్పర్వతరాజు పుత్రిక అందుకనే అమ్మలగన్న అమ్మ అంటే ఈ ముగ్గురినీ కన్న అమ్మ అని కాదు ఆ మలగన్న యమ్మ ఆ మల హిమాలయం ఆ హిమవత్పర్వతరాజు యొక్క కూతురువైనటువంటి నీవు ఇవాళ దుర్గగా ఇదిగో సరస్వతిగా లక్ష్మిగా కనబడుతున్న ఈ ముగ్గురికీ మూలమైనావు గనుక చాల పెద్దమ్మ పెద్దమ్మ కాదట చాల పెద్దమ్మ ఇక ఆమెను మించి ఇంకో పెద్దమ్మ లేదు ఆమె ఎవరు అంటే మహా త్రిపురసుందరి దేవి ఆ ఆమెను ఉపాసన చేస్తున్నాడు కనుక ఇదైపోయింది దుర్గ మాయమ్మ అన్నాడు అక్కడక్కడ ఉన్న దుర్గ మాయమ్మ మాక్కూడా ఉంది కృపాబ్ధీచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ మూడు ఇచ్చిన తర్వాత నాకు కావలసింది కాస్త మా పొలం బాగా పండితే కాస్త నాలుగు బస్తాలు ఎక్కువ వస్తే ఇంకా మంచి పద్యాలు రాస్తానమ్మా ఇంటికెళ్ళగానే చక్కగా మంచి అన్నం దొరికితే కడుపారా భోంచేసి చక్కగా మంచి నిద్ర పోయి ఇంకా మంచి పద్యాలు రాస్తానమ్మా అనటానికి ఎవరు కావాలి అంటే లక్ష్మీదేవి కావాలి ఆ లక్ష్మీదేవిని కూడా ఉపాసన చేశాడు భాగవతం అవతారిక చాలా గొప్పది మామూలుగా పద్యాలు చదువుకుంటూ వెళ్ళేవి కావు ఇవి చాలా లోతైనటువంటి నవరసాలను పట్టుకోవాలి ఏమన్నాడంటే లక్ష్మీదేవిని ఎలా ప్రార్థించాలి ఆమెను చించి ఇస్తే కుదరదు లక్ష్మీదేవి నాలుగు డబ్బులు ఇవ్వంటే కుదరదు ఆమెకి ఇట్లా పూజ చేయాలి కూర్చోవాలి సంధ్యాదీపం వెలిగించాలి ప్రదోష పూజ చేయాలి ఆమెకు అలంకారం చేయాలి అప్పోసొప్పో చెయ్యయినా సరే వస్తువులు వెలిగించాలి ఇంత గందరగోళం ఇవన్నీ చేస్తే అప్పుడు ఆమె దయ చూపిస్తుంది తలుపు తీసి గనక ఉండకపోతే రాదు వేళ తప్పి నిద్రపోతే రాదు స్నానం చేయకపోతే రాదు ఆ ఈ సరస్వతీదేవి వస్తుంది దుర్గ వస్తుంది కానీ లక్ష్మీదేవి రావటానికి మాత్రం మన మానసిక శుచి దైహిక శుచి ఆంతరంగిక శుచి భావ శుచి హృదయ శుచి ఆత్మ శుచి అన్నీ ఉండవలసింది ఇన్ని ఉంటే నిజంగానే ఉన్నాడా లేడా అని పరీక్ష పెడుతుంది సరస్వతీదేవి పరీక్ష పెట్టదు దుర్గాదేవి పరీక్ష పెట్టదు లక్ష్మీదేవి పరీక్ష పెడుతుంది నేను వెళ్తాను వాడి దగ్గరికి అసలు వీడు నన్ను నిలబెట్టుకోగలడా లేడా నాకు గౌరవం ఇవ్వని వాడు నన్ను నిలబెట్టుకోలేని వాడు నన్ను దుర్వినియోగం చేసేవాడు నన్ను అపాత్ర దానంగా ఎక్కడికి అక్కర్లేదో అక్కడ ఖర్చు పెట్టేవాడు వాడి దగ్గర నేను ఉండను అన్నది చూసారా కాబట్టి లక్ష్మీదేవిని ఈయన స్తుతిస్తున్నాడు నిజంగా మిగతా వాళ్ళని ఏం స్తుతించలా మీరు ఎక్కడెక్కడి వాళ్ళో చెప్పాడు ఇక్కడొక చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు హరికిన్ పటపు దేవి పుణ్యముల ప్రోవు అర్థముల పెన్నిక చెందురుతో ఉట్టువు తామరలన్ భరతీ గిరిసుతల్తో ఆడుకుబోడి ఆవిడ ఆడుకోవాలంటే ఇద్దరు ఉన్నారు కదా ఇంకెవరితో మూడో మనిషితో ఆడదు భారతి గిరిసుతల్ వీళ్లిద్దరితోనే పార్వతీదేవిను సరస్వతీదేవి వాళ్ళకి టైం ఉంటే వాళ్ళతో ఆడుకుంటుంది తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్లి ఆడుకోదట అందుకే డబ్బుతో ఆడుకోకూడదు మనం ఎందుకంటే ఆవిడ కూడా మనతో ఆడుకోదు కదా కాబట్టి ఆట ఎవరు ఇద్దరు ఉంటేనే ఆట హరికిన్ పటపు దేవి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక పెన్నిక అంటే పెద్ద అక్కయ్య అని అర్థం చెందురుతో ఉట్టువు క్షీరసాగర మథనం జరిగినప్పుడు చంద్రుడితో పాటు పుట్టింది గనుక ఆయనకి సోదరి భారతీ గిరిసుతల్తో ఆడుకుబోడి తామరలందుండెడి ముద్రాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు బాపుతల్లి శ్రీచున్ నిత్యకల్యాణముల్ అటువంటి ఆ లక్ష్మి తామరలలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆవిడ ఆవిడ ముద్రాలు ఆవిడ ఎంత లలితమైనటువంటిది కాకపోతే ఒక పువ్వులో కూర్చోగలదు దుర్గాదేవి సింహం మీద కూర్చుంది కదా తర్వాత మన సరస్వతీదేవి వచ్చాము చక్కగా హంస మీద కూర్చుంది ఈమె హంస మీద కూర్చుంది ఆమె సింహం మీద కూర్చుంది హంస స్త్రీలింగ శబ్దం హంసి హంసిని తిప్పి చదవండి సింహం అంతే కాబట్టి అభేదం చెప్పడానికి మనకిక్కడ హంసగా కనిపిస్తున్నది అక్కడ సింహంగా కనిపిస్తున్నది ఈ ముగ్గురూ కాకుండా తామరాల తామర పువ్వులో కూర్చున్నదట అమ్మవారు తామరలందుండెడి ముద్రాలు చంద్రుడితో ఉట్టువు కాబట్టి మాకు నిత్యకల్యాణములు ఇచ్చు గాక అని అంటూ ఇవన్నీ కూడా అనేకమంది దేవీదేవతలని పితృదేవతలని వాళ్లందరినీ కూడా చక్కగా సంస్మరిస్తూ స్మరించుకుంటూ స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం
SSSMC · audio
Bhagawata Navaneetham - 02
Bhagawata Navaneetham - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 32:05
More in this series