Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ విమలంబై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్వత్ ప్రబోధ మతిన్ నిల్పి తదీయ మూర్తి విభవ ధ్యానంబు గావించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకున్ తార్కొల్పి ప్రత్యంగమున్ సుమహా ధ్యానము చేయగా వలయుబో శుద్ధాంతరంగంబు నన్ ఇది చేస్తే చాలట ఏం చేయాలంటే మనస్సుని శుద్ధమైన అంతరంగం చేసుకోవాలి శుద్ధత్వంలోకి వెళ్ళాలి శుద్ధత్వంలోకి వెళ్ళాలి అంటే ధ్యానంగా ఉండాలి ధ్యానిగా ఉండాలి ధ్యానిగా ఉండాలి అంటే ఇతరేతరమైన ఆలోచనలు వదిలిపెట్టి తనదైనటువంటి జీవైకమైనటువంటి ఒక భావనతో నిలకడ చెందాలి బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానంద దాయిని ధ్యాన శబ్దం ఏదైతే ఉన్నదో ఎవరి మీద ఆధారపడని స్థితి ఒకటి ఆత్మ వృత్తులతో మాత్రమే ఉండగలిగేటువంటి రెండవ స్థితి అహం బ్రహ్మాస్మి అని అనుకోగలిగినటువంటి ఒక సాధారణ స్థితిలోకి గనుక వెళ్ళినట్లయితే మనసుకు ఒక శుద్ధత్వం ఏర్పడుతుంది శుద్ధత్వంలో కూడా మళ్ళీ ధ్యానిగా ఉండాలి అందుకనే రాముడు ధ్యానంలో ఉన్నాడు కృష్ణుడు ధ్యానం చేశాడు కృష్ణ ధ్యానం అంతా కూడా జ్ఞానమయమైనటువంటి మార్గం శ్రీరామచంద్ర ధ్యానం అంతా నారాయణ పద పద్మాధీన చేతస్కమైనటువంటివి కనుక మనీషాయత్తము ఇందాక చెప్పిన జ్ఞానాధిక్యము ఏదైతే ఉన్నదో అంటే జ్ఞానానికి అతీతమైన స్థాయి ఏదైతే ఉన్నదో పురుషోత్తముడి యొక్క దివ్య నామ రూప భావ తత్వముల యందు మనస్సును లగ్నం చేయమంటున్నాడు ఆయన ఎలా చేయాలి విమల భావంతో చేయాలట ఏదో ధ్యానం చేస్తాను నాకు ఆరోగ్యం రావాలి ధ్యానం చేస్తాను అప్పులు తీరాలి ధ్యానం చేస్తాను ఆయుష్షు పెరగాలి ఏమి జరగవు దానికి దీనికి సంబంధం లేదు ధ్యానము వలన మనస్సు ఏకాగ్రత వైపు అడుగు వేస్తుంది ఒకటి రెండవది ధ్యానము వలన మనసులో కలిగేటువంటి విపరీత భావాలు ఆలోచనలు నశించి పరిపూర్ణమైన సహజమైన సత్వమైన ఆలోచనలన్నీ కూడా మనకు ఏర్పడతాయి ఆలోచనలు ఏర్పడటానికి ధ్యానము యందు మనస్సు నిలకడ చెందటానికి చక్కగా సాత్వికమైన శాకాహారం గనుక తీసుకున్నట్లయితే ఆలోచనలు తదనుగుణంగా సాగుతాయి మంచి ఆలోచనలు మంచి ఆలోచనలు కూడా మలగిపోయే స్థాయి వస్తుంది గనుక అమ్మా శుద్ధాంతరంగమైన స్థితిలో అంతరంగం శుద్ధిగా ఉండాలి బయట ఎంత బాగుంటే ఏం లాభం లోపల స్వామి అన్నట్లు external calmness internal commotion ఇవాళ భక్తుడి స్థితి అది అన్నారు internal గా వాడి commotion అది అద్--అత్యద్భుతమైనటువంటి భావన సముద్రం మధ్యలో ఏమున్నది అంటే సుడిగుండం సుడిగుండం మధ్యలో ఏమున్నది అంటే ఏం లేదు అక్కడ అటువంటి స్థాయిలో మనస్సును తీసుకుని వెళ్ళాలి అందుకనే మనస్సును తీసుకుని హృదయ స్థానంలో చేర్చుకోగలగటమే మోక్షం అన్నారు రమణ మహర్షి మాములుగా రమణ మహర్షిని వినహాయిస్తే మిగతా వారంతా ఏం చెప్పారంటే మనస్సుని ఆలోచనని తీసుకెళ్లి త్రికూటనాం నిస్థితే అంతరంగే అంటారు శంకర భగవత్పాదులు ఆజ్ఞాచక్రం దగ్గర గనుక లయం చేసినట్లయితే శూన్యంలో కలిపినట్లయితే సహస్రారం వలన ఏర్పడేటువంటి మలయ పవనాల యొక్క అనుభూతి నీకు కలుగుతుంది అంటారు అది యోగశాస్త్రం ఇక్కడ భగవాన్ రమణులు ఒక్కటే చెప్పారు మీ మనస్సును తీసుకెళ్లి దాని పుట్టినిలైనటువంటి హృదయ స్థానంలో పెట్టండి అది మోక్ష స్థితి అది ఆనందకారక స్థితి మనస్సు అడగి మనస్సు నెమ్మదిగా ఉంటుంది హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఒక స్త్రీ తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందాన్ని ఎంత స్వేచ్ఛని ఎంత భారాన్ని వదులుచుకున్నట్లుగా ఉండగలుగుతుందో మనస్సు కూడా హృదయ స్థానానికి చేరినప్పుడు అంతే సంతోషంగా ఉంటుంది అని చెప్తారు ఒక స్త్రీని అడిగితే నీకు భద్రమైన స్థానం ఏది అంటే మీరు ఎంత చేయండి ఎన్ని పెట్టండి మా పుట్టింట్లే బెస్ట్ అండి అని కూరిపాక అయినా సరే చూరు కింద పడుకుంటా నాకక్కడ హాయిగా నిద్ర పడుతుంది అంటుంది ఇటువంటి ప్రశ్న స్వామి ఎదుర్కొన్నారు స్వామి స్వామి మీకు భద్రమైన స్థానం ఏది మీరు మీకు ఆనందంగా మీ అంతట మీ ఒక్కరే ఉండాలి అనుకుంటే ఎక్కడ ఉంటారు అని అడిగితే భక్తుల హృదయమే నాకు ఆనందం కలిగించే స్థాయి అని చెప్పారు స్వామి అంటే పరమాత్మకి భక్తుల హృదయంలో ఉండాలని ఉంటుంది ఆయనను పిలుచుకోగలిగిన స్థాయికి మనం రావాలి దానికి శుద్ధాంతరం గవంటే అది ఆయన రావటానికి సిద్ధమే మనం సిద్ధంగా కూడా ఉండాలి పురుషుడు నిద్రవో కలల పొందు అనర్థకముల్ ప్రబోధమందు అరయగ మిజ్జలై పురుషు నందు ఘటింపని కైవడిన్ పరేశ్వరునకు ఆత్మనాధునకు సర్వ శరీరికి కర్మ సాక్షికిన్ పరువడి పొంద వెన్నటికి ప్రకృతి దోషములు అంజనా మణి నిద్రపోతాం నిద్రలో కల వస్తుందికలలో ఒక అనుభవాన్ని పొందుతూ ఉంటాం ఎట్లాగైతే కల మెలకువగా మారగానే బయటకు వచ్చి అందు ఏర్పడిన అనుభవం గాని దాని యందు ప్రవేశించిన పాత్రలతో గాని జీవుడికి మెలకువతో ఎట్లా సంబంధం లేదో అట్లాగే ఎవరి యందు మనస్సు లగ్నం చేసి ఉన్నామో పరమాత్మ యందు మాత్రమే గనుక ఇహలోకంలో కూడా ఉండగలిగినట్లయితే అది ఉత్తమోత్తమమైనటువంటి స్థితి అని చెప్తున్నాడు. చెప్పి అన్నింటికంటే గర్భస్థ శిశువు యొక్క వేదన అలా పక్కన పెడితే వృద్ధుడు కూడా పసిబాలుడే it is called retreat. పెద్దవారు అవుతున్న కొద్ది వాళ్లలో పసితనం బయటకు వస్తూ ఉంటుంది మనకు అర్థం కాదు ఈయన చాలా పెద్దవారు కదా మనల కంటే కూడా ఇలా అడుగుతున్నాడు ఏంటి డెభై ఏళ్లు వచ్చిన వాడు అంటాడు sudden గా భాగవత సప్తాహంకు వెళ్దాం అంటే చందమామ బుక్కు పట్టురా బయటికి వెళితే అంటాడు ఇదేంటి అది నేను కదా చదవవలసింది అని. వాడిలో ఉన్నటువంటి child మేల్కొంటాడు తాను పొందనివి పొందాలని అనుకున్నవి పొందలేకపోయినవి పోగొట్టుకున్నవి ఇక దొరకవేమో అన్నటువంటి ఒక భావన వీటన్నింటి కారణంగా వృద్ధుడు తన కాలాన్నంతా కూడా గడుపుతుంటాడు. వృద్ధుడు కాలం అలా గడపకూడదు ఎలా గడపాలి ఇలా గడపాలి అలా గడుపుతున్న వాడి యొక్క పరిస్థితి ఏమిటో కపిలుడు తల్లికి చెప్తున్నాడు అమ్మా! నీవు కూడా వృద్ధాప్యానికి వెళతావు నిన్ను కూడా ముసలితనం ఆవహిస్తుంది ఎలా ఉంటుందో నేను చిన్న బొమ్మ గీసి చూపిస్తున్నా అన్నాడు చెప్పరా నాయనా అంది. కపిలుడికి తల్లికి ఎంత వయస్సులో ఎంత తేడా ఉన్నా గురు స్థానంలో కూర్చుని బోధిస్తున్నాడు ఆయన ఆమె వినటానికి సిద్ధంగా ఉన్నది ఎందుకని సిద్ధంగా ఉన్నది అంటే శుద్ధాంతరంగం ఏర్పడింది గనుక సిద్ధంగా ఉన్నది. బలిమిశాలక మందభాగ్యుడై కుమతియై పోనియప్పుడు క్రియాహీనుడగుచు ఏదో పనులు చేద్దాం అని ఉంటుంది ఏం చేయలేం తవిలి వృధా ప్రయత్నంబులు చేయుచు మూఢుడై కార్పణ్యమున చలించు అట్టి అకించనుడగువాని చూచి తద్దారసుతాదులు ఆత్మలను వీడు ఉడుగడు అశక్తుడు ప్రోవగా జలడితడని సిగ్గింతురు అర్థి. కృషీవలుండు బడుగు ముసలద్దు రోసిన పగిది అంతాతడు వెంటలను సుఖంబు అందలేక తాను పోషించు జనులు తంతనర బ్రోవ బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపడుచు. వీడు అనుకుంటాడట అంటే చిన్నవాడు ఈయనకి ఎందుకండీ ఇవన్నీ అయి ఏమ ఏడట్ల అయితే ఈయనకెందుకు కృష్ణా రామా అనుకోకుండా అంటాడట చిన్నవాడు వాడేంటట కృష్ణా రామా అనుకునే శక్తే లేదురా నాకు అనుకుందామంటే వయస్సు పోయింది నా పరిస్థితి ఇట్లా ఉన్నది కాస్త నాకు కృష్ణా రామా వినిపించండి అనిపించండి అంటుంటే నా దగ్గర time లేదు అంటాడు. నా నీ దగ్గర కూర్చునే time లేదు మిగతా అంతా time నా దగ్గర ఉంది అంటున్నాడట వాడు ఇది ఎప్పటి మాట వ్యాసుల వారి సమయంలో ఇవాళ వృద్ధుడి యొక్క పరిస్థితి కూడా అంతే పాపం ఏదో స్వయంగా చేసుకోవాలి అని అనుకుంటాడు చేసుకోలేడు. చేసుకోలేడు అంటే ఎవడి మీదో ఆధారపడాలి ఆధారపడ్డ వాడికి మూడు ఉండాలి అది మూడు ఉండాలి మూడు ఉండాలి మూడు ఏంటంటే time ఉండాలి డబ్బు ఉండాలి ముందు చేయాలనే సంకల్పం ఉండాలి మూడు ఉండవు గనుక ప్రపంచం నుంచి మూడు ఉండదు మూడు ఉండవు రెండు ఉండవు కాబట్టి ఎవరు నష్ట జాతకుడు సమయంలో అంటే వృద్ధాప్యానికి వచ్చిన వాడే నష్ట జాతకుడు. అయ్యో ఇవన్నీ నేను ముందే చేసుకొని ఉన్నట్లయితే ఎంత బాగుండును చాలామంది చూడండి అది అజ్ఞాన భూమికే నెమ్మదిగా కాశీ వెళదాము అని అనిపిస్తుంది. ముప్పై ఏళ్ల వయసులో అనిపిస్తే ఏం నష్టం ఏం లేదు వాడు వెళ్తాడు వస్తాడు ముంచెరు అన్న ప్రయాణం చేస్తాడు డెభై ఏళ్లు వచ్చాక ఒకసారి కాశీ అనేది విన్నాం అందరూ వెళ్లి వచ్చారు మనం కూడా వెళదాం అని అనుకుంటే అది ప్రమాదకరం అంటున్నాడు ఈయన. ఎందుకు ప్రమాదకరం అంటే అక్కడ నువ్వు వెళితే ప్రయాస ఆయాసమే తప్ప ముక్తి ఆనందం నీకు రెండూ లభించవు కారణం శరీరం నీకు సహకరించదు గనుక శరీరము ద్వారానే నువ్వు ఆనందాన్ని కూడా తెచ్చుకోవాలి శరీరాన్ని అట్లా వాడుకోవాలి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అదే కర్మ సాధనానికి కూడా మూలం కాబట్టి సరే ఇంకా అనేక కష్టాలన్నీ కూడా చెప్పాడు కష్టాలు ఇప్పుడు చెబితే పెద్ద వాళ్లందరికీ బాధ కలుగుతుంది ఇదేమిటో మన గురించే రాశారు పద్యం అని ఏదో కృష్ణా రామా అని గొంతెత్తి పాడదామంటే కఫం అడ్డపడుతుంది అన్నాడు ఇక్కడ ఉందా పద్యం [నవ్వు] రెండు కాబట్టి ఏమనుకోవాలంటే స్వామి వారిని ముప్పై ఏళ్ల నాడే లోపలికి లాక్కున్నారు అదే ఆనందం అనుకోవాలి. ఇవాళ పాడుదామన్న పాట పాడుదామన్న గొంతు రావాలి కదా శరీరం సహకరించాలి మనస్సు ఉండాలి దానికి శరీరానికి ఉత్సాహం ఉండాలి లోపల metabolic activity ఉండాలి ఇవేం ఉండవు కాబట్టి జఠరాగ్ని అల్లా మందాగ్నిగా మారిపోతుంది. ఇలా తిని ఏమండీ వయసులో అంటాడు అది అయిపోయింది అండి ఇప్పటి సంగతి ఏమిటంటే మందాగ్ని తినలేడు తిన్నా అరగదు మనకు కావాల్సింది వాడు పెట్టడు వాడు ఏం పెట్టాడో అది తినాలి మనకు కావాల్సింది వాడు పెట్టడు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటేనే డాక్టర్ గారు చెప్పారు నువ్ ఇది తినొద్దు అని అంటాడు పోతే పోయి తింటూ పోతానురా అంటాడు వీడు [నవ్వు] తింటూ పోకూడదు తినకుండా పోవాలి నువ్వు అంటాడు వీడు [నవ్వు] కాబట్టి వాడు వృద్ధుడి యొక్క లక్షణం ఇది కంఠనాళమున ఘరఘరమని శబ్దంబు దొరయ ఎప్పుడూ కళ్ళు కళ్ళను తగుతూ ఉంటాడట ఎందుకంటే esophagus అంతా block అయిపోతుంది లోపల కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలు నశించిపోతాయి. కాబట్టిఆ వృషీకాలు ఇంద్రియాలు, వృషీకేశుడు అంటే ఇంద్రియాలకు ఈషుడు అని. వృషీకం అంటే ఇంద్రియం. ఇంద్రియాలన్నీ మన యందు మంచి పటుంగా ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే మన మాట అవి విననప్పుడు వాటి చేత మన మాట వినేట్టుగా చేసుకోవాలి. అదే అధ్యాత్మ సాధన. తర్వాత ఏదో ఎనభై ఏళ్ళు వచ్చాయి. ఇంద్రియాలు అంటే వాటంతట అవే నెమ్మదిగా మూసుకుపోతాయి. దాని చేయగలిగే సహజంగా పోతాయి అవి. దాన్లో మన ప్రయత్నం ఏం లేదు. ఇక్కడ గర్భస్థ శిశువు అంటే ఈవేళ తల్లులు అయినవారు తల్లులు కావలసినవారు బిడ్డలను కనబోయేటువంటి వారు. తల్లి గర్భంలో శిశువు వాడి జీవుడి వేదన విన్నట్లయితే, రోజులలో లాలి పాటలలో జోల పాటలలో లేదా సీమంతం పాటలలో పరమాత్మను గురించి మాత్రమే వాళ్ళు పాటలు పాడేవారు. అటువంటి శివుడు నిన్ను రక్షించు గాక! అటువంటి కృష్ణుడు నిన్ను కాపాడు గాక! అటువంటి రాముడే నీ కడుపున పుట్టు గాక! ఎంత అందమైన భావాలవి. ఇవన్నీ విని విని ఒక జాతి ఉత్తమోత్తమమైన జాతి పుట్టింది. లేకపోతే జరిగి ఉండేది కాదు. ఇక్కడ గర్భస్థుడైనటువంటి వాడు "జనయిత్రి గర్భమందున ఘన క్రిమి విణ్మూత్ర రక్త గర్భతములో నన్ మునుగుచు జఘరాగ్నిని దిన దినమును తంతప్యమాన దేహుండగుచున్" తంతప్యమాన దేహుడవుతున్నాడట. వాడికి నెమ్మదిగా దేహం ఆ-ఆకారం ఏర్పడుతుంది. ఆకారం ఏర్పడి "ఏమిటి నాకు అక్కర్లేని తొడుగులు అన్నీ వస్తున్నాయి, కాళ్లు పుడుతున్నాయి, చేతులు పుడుతున్నాయి, కన్ను మొలుస్తున్నది" అన్నీ గుంటలున్నాయట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కళ్ళ place రెండు చుక్కలున్నాయి, చెవుల place రెండు చుక్కలున్నాయి, ముక్కు దగ్గర రెండు, నోటి దగ్గర ఒక చుక్క. ఇవన్నీ ఏమిటంటే ఖాళీ ప్రదేశాలు. ఖాళీ ప్రదేశాలు నెమ్మది నెమ్మది నెమ్మదిగా పది నెలల కాలంలో, తొమ్మిది నెలల కాలంలో నిజానికి పూర్ణమవుతున్నాయి. అవుతున్నప్పుడు సంతోషించాలి జీవుడు. "నాకీ అక్కరలేనిదే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి" అంటున్నాడు. "ఇవన్నీ నేను అనుభవించేశా కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు పుడుతున్నాయి, ఎందుకు మొలుస్తున్నాయి" అంటున్నాడు. "దీనవదనుడగుచు దేహి దేహంబు వలన నిర్గమింపదలచి" వాడు కోరుతాడట. అసలు గర్భం నుంచి నన్ను బయటకు పంపద్దు అంటాడట వాడు. మనమేమో ఎప్పుడు శిశువు దయం అవుతుందా, ఎప్పుడు పిల్లవాడు పుడతాడా, ఎప్పుడు మన ఇల్లంతా పండగవుతుందని బయట ఉన్న వాళ్ళం అనుకుంటున్నాం. తల్లి నేను ఎప్పుడు తల్లిని అవుతానని ఆమె కోరుకుంటున్నది. జీవుడు ఏమంటున్నాడంటే నేను బయటికి వెళ్ళను అంటున్నాడట. అది. "నెలలను ఎన్నికొనుచు నెలకొని గర్భంబు వలన వెడలద్రోయువారు గలరే నెలకొని బహు దుఃఖములకు ఆలయమైన గర్భ నరకము నేను వెడలజాల బహిః ప్రదేశమునకు వచ్చిన అనుపమ దేశ మాయా విమోహితత్ముడనై ఘోరమైనట్టి సంసార చక్రమందు పరిభ్రమణ శీలినై యుండ వలయు కాను తాను అదిగాక గర్భము నందుండు శోకంబు అపశయించి ఆత్మకు అనయంబు సారథి అయినట్టి రుచిర విజ్ఞానమున తమో రూపమైన భూరి సంసార సాగరోత్తారణంబు చేసి ఆత్మను అరసి రక్షించుకొందు" ఆత్మ విచారణ చేసి నేను ఆత్మని ఎరుగుతాను తప్ప మళ్ళీ ఒక దేహాన్ని పొంది ప్రపంచంలోకి వెళ్లి మళ్ళీ మాయామేయ జగత్తులో నన్ను నేను పోగొట్టుకోను అంటున్నాడట. అక్కడ ఉండగానే వాడికి ఆత్మ జ్ఞానం గురించి ఆత్మ తత్వాన్ని గురించి ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. అందుకనే రుచిర విజ్ఞానం అది. చాలా అందమైన, వెలుగుతో కూడిన, ప్రకాశమానమైన అటువంటి ఒక జ్ఞాన భూమిక. అధ్యాత్మ భూమికను వదులుకొని నేను మళ్ళీ ఎందుకు ఇక్కడికి రావటం అనుకుంటున్నాడట. "భ్రమగుచున్న దుర్యశన భాజనమై ఘన దుఃఖ మూలమై అరయగ తెక్కు తూట్లు గలదై" నవరంధ్రముల కాయమన్నారు. తొమ్మిది తూట్లుంది శరీరానికి. "తెక్కు తూట్లు గలదై క్రిమి సంభవమైన యెట్టి దుస్తర బహు గర్భవాసముల" వాడికి స్ఫురణ ఉందట. ఎన్ని గర్భాలు ఆశ్రయించానో, ఎన్నెన్ని సార్లు ప్రపంచంలోకి నేను వచ్చానో, వచ్చినప్పుడల్లా నాకు ఇదే జరుగుతున్నది. ఇంతకంటే ఉత్తమమైన స్థితి మాత్రం కలగటలేదు అని అనుకుంటూ "సంగతి మాన్పుటకై భజించెదన్" తల్లి గర్భంలో ఉండగా నేను దీనిని గురించి భజించెదన్ అంటే సేవించెదన్ అని ఒక అర్థం, విచారణ చేయటం అని రెండో అర్థం. భజించటం అంటే భజన చేయటం కాదు. ఎవరిని అంటే "సరసిజనాభ భూరి భవసాగర తారక పాదపద్మముల్" పరమేశ్వరాయత్తమైనటువంటి పరమేశ్వరుని గురించి ఆయన యొక్క దివ్య పాదములను స్మరిస్తూ గురు చరణాంభుజముల దగ్గర ఉండి మళ్ళీ నేను ఆత్మ విభూతిని పొందుతాను తప్ప నాకీ జన్మ వద్దంటున్నాడట జీవుడు ప్రతి జీవుడు. అంటే మరి ప్రపంచం నడిచేది ఎట్లా? ప్రతి వాడు ఆత్మ వైపు వెళ్ళిపోయి నేను ప్రపంచంలోకి రానూ అంటే మరి ఆయన సృష్టించుకున్న బొమ్మరీళ్ళు ఏమైపోవాలి. ఏడాదికి ఒక కొత్త బొమ్మ కొనాలి మనం. పాత పైనవి తీసేయాలి. తీస్తున్నామా లేదా? బొమ్మల కొలువు మనకు నేర్పేది అదేగా. బొమ్మల కొలువు అంటే మనకున్న బొమ్మలన్నీ exhibition కాదు. విరిగిన, కరిగిన, తరిగిన, ఒరిగిన బొమ్మలు బయటపడేయి. పైగా ఎవడో వచ్చి చెప్తాడు విరిగిన బొమ్మ ఇంట్లో ఉండకూడదు అంత మంచిది కాదు అంటాడు. ఎవరికి? దానికా మనకా? దానికి. కాబట్టి దానికి ఉద్వాసన చెప్పు. ఒకటి తగ్గింది గనుక దాన్ని replace చేయాలి. దేంతో? మరొక దానితో. జీవుడు కూడా ఒక బొమ్మ.ఇది ఎంత పంచదార బొమ్మ అంటే నీళ్ళల్లో పడేసి ఐదు నిమిషాలు వదిలేస్తే నీరు అదిగా మారిపోతుంది దాంట్లో కలిసిపోతుంది ఇంకేం ఉండదు. కాబట్టి దేవహుతి కి మరల మరల చెప్పాడట పునః పునః చెప్పాడట ఆత్మవిద్య నే పునః పునః చెప్పుకోవాలి ఎందుకని అంటే వైరాగ్యం భయాన్ని కలిగించదు స్పష్టతనిస్తుంది వైరాగ్యం భ్రాంతిని కలిగించదు భ్రాంతిని తొలగిస్తుంది బ్రహ్మాన్ని చూపిస్తుంది పరమోదారమైనటువంటి ఆత్మతత్వ విచారణలోకి వెళ్ళటానికి కపిలుడు దేవహుతికి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి అధ్యాత్మ భావనా వీచిక ఈరోజు దీంతో తృతీయ స్కంధం పూర్ణమైపోయింది. తృతీయ స్కంధంలో ప్రధానంగా జీవుడి యొక్క వేదన జీవుడి యొక్క నివేదన ఇవన్నీ కూడా నేను ఆత్మగానే ఉంటాను అన్నటువంటి మనం దీనికి జాషువా గారు ఒక పద్యం చెప్పారు. వీడు అసలు ఎక్కడివాడో దేశం వాడో నాకు తెలియదు నిన్న మొన్న చట మొలచినాడు నిన్న మొన్న ఇక్కడ పుట్టాడు వీడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడికి ఆకలి లేదు దప్పిక లేదు ఇది కావాలి అది కావాలని కామన లేదు అలా తల్లి గర్భం లో నుంచి బయట పడ్డాడో లేదో నాకు ఇది కావాలి అది కావాలి అంటాడే అని దాని మీద ఇంకొద్దిగా విచారణ ఉన్నది పోతనామాత్యులు గొప్పగా రాశారు ఆయన విచారణ ఏమిటంటే పిల్లవాడు పుట్టగానే ఏడుస్తాడు మనం సంతోషిస్తాం అది అలవాటుగా మారిపోయింది. కొంత సమయం అయిన తర్వాత ఇంకాస్త ఏడుస్తాడు ఎక్కువగా వాడికి ఆకలి అవుతుందేమో అని మనం నిర్ణయిస్తాం వాడి ఏడుపు అది కాదట. ఇంకా స్మృతులు కొద్దిగా మిగిలి ఉన్నాయట లేశమాత్రంగా స్మృతులు ఏడుపులో కొట్టుకుని పోవాలి అప్పుడు ఎవడో వీడిని ఎత్తుకుంటాడు ఎత్తుకోవటం అంటే స్పర్శ కలిగింది దేనితో స్పర్శ కలిగింది అంటే దివ్యమైనటువంటి తల్లి గర్భాలయంలో నుంచి బయటకు వచ్చిన జీవుడు ప్రాకృతమైనటువంటి ఒక పురుషుడో ఒక స్త్రీ యొక్క తనువుతో ఒక స్పర్శ ఏర్పరుచుకున్నాడు గనుక తనువులో నుంచి ఆకలి కోరిక నిద్ర మూడు పుట్టినాయి. ఆకలి వలన కోరిక కోరిక వలన నిద్ర నిద్ర వలన పెరుగుదల పెరుగుదల వలన ఒరుగుదల ఒరుగుదల వలన మరణము ఇవన్నీ కూడా ఒక ఏకకాలంలో ఏర్పడినాయి అందుకనే బిడ్డ పుట్టగానే ఉత్తమమైనటువంటి స్త్రీ మూర్తిని ఎత్తుకోమని అంటారు ఎవరు ఉత్తమమైన స్త్రీ మూర్తి అంటే ఎవరు చక్కగా అన్నివేళలా భగవంతుని యందు మనస్సును లగ్నం చేసుకొని భగవన్నామాన్ని స్మరిస్తూ భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతో జీవిస్తూ ఉన్నదో అటువంటి స్త్రీ మూర్తికి బిడ్డని ముందు తాకమని అంటారు అంతేగాని మన అమ్మమ్మే అయినా ఆమె భక్తురాలు కాదనుకోండి ప్రయోజనం ఏం లేదు కాబట్టి భగవద్భక్తి వాడికి స్పర్శ ద్వారా గ్రహిస్తాడు గనుక స్పర్శకి మరొక పేరు అదొక శరీరం స్పర్శ అనేది ఒక శరీరం శరీరం పేరు కింపురుష శరీరము అని పేరు. కింపురుష శరీరంలో నుంచే స్పర్శలో నుంచే ఎమోషనల్ సపోర్ట్ మనకు కలుగుతుంది మనకో దుఃఖం కలిగింది స్కూల్లో ఏదో జరిగింది పిల్లకో పిల్లవాడికో వాడు వచ్చి వాడు ఏం చేయడు వెళ్ళేడు ముందు అన్నం లేదా ఏం లేదా పుస్తకాలు ఎక్కడ బారేసి తల్లి ఒళ్ళోకి వెళ్లి దూరి ఉండిపోతాడు ఉండిపోయి ఇంకాస్త ఎక్కువ ఏడుస్తాడు అప్పుడు తల్లి అడుగుతుంది ఇదంతా కథ నడుస్తుంది నడిచాక ఇంతేనా అంటుంది తల్లి ఓహో అంత జరిగితే ఇంతేనా మాట అనుకొని ఇది మర్చిపోతుంది జరిగిందంతా ఇది ప్రతిరోజూ జరిగేదే అలాగే నిత్య జీవితం కూడా అధ్యాత్మ జీవితం కంటే నిజానికి భిన్నమైంది కాదు కపిలుడు వంటి వాడు ఒక తల్లికి బోధ చేయటం ఒక భారతదేశంలో ఇక్కడ మాత్రమే సంభవించింది ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఇవి ఇట్లాగే భాగవతం చెప్పబడుతూనే ఉంటుంది వినబడుతూనే ఉంటుంది అనేకమైన కోణాలలో అనేకమైన రీతులలో ఎందుకనంటే ఎవరైనా కానీ మన సంస్కారాన్ని బట్టి మన ప్రాప్తిని బట్టి మన శక్తిని బట్టి మన అనుభవాన్ని బట్టి మన అనుభూతిని బట్టి మనకు వస్తువు యొక్క స్థితి మనకు అర్థమవుతుంది వస్తువులో మార్పు లేదు దానిని మనం అనుభవించిన తీరుతెన్నులలోనే మార్పు గనుక దివ్యమైనటువంటి తృతీయ స్కంధంలో కపిలుడు చేసినటువంటి చాలా గాఢమైనది చాలా గట్టి తర్వాత తర్వాత విచిత్రం ఏమిటంటే రామాయణం చాలా నెమ్మదిగా హాయిగా కథలా ప్రారంభమై జ్ఞాన భూమిక లో అంతమవుతుంది భాగవతం జ్ఞాన భూమిక తో ప్రారంభమై శ్రీకృష్ణ కథా గానంతో ఆయన కథలు ఆయన లీలలు అవి నవ్వులే నవ్వులు సంతోషమే సంతోషం ఎందుకంటే ఆయన మహానంద స్వరూపం కాబట్టి పూర్ణ చైతన్య విలసితమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి యోగ భూమికి చెందిన వాడు గనుక భావనే వేరు భాగవత గాథే వేరు గనుక దివ్య సీమలోకి సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మనందరినీ కూడా చల్లగా హాయిగా ఉత్తరాయణ పుణ్యకాల విశేషంలో ఏడు రోజులు చూడండి ఎంత అనుగ్రహం లేకపోతే స్వామి మనందరినీ ఒక చోట కూర్చి నా కథ వినండి అన్నారు అది ఆయన కథే భిన్నం ఏం కాదు ఎదగగలిగితే ఎరగగలిగితే లేకపోతే ఆయన వేరు ఈయన వేరు కాదుగా మన వరకు అయితే కాదు కాబట్టి సర్వేశ్వరుడు అయిన స్వామి మన మన యందు పరిపూర్ణమైనటువంటి కరుణని ప్రవాహ వేగంతో కురిపించాలని మనల్ని నడిపించాలని స్వామిని ప్రార్థిస్తూ రేపు చక్కగా చతుర్థ స్కంధంలోకి వెళ్దాం వెళ్లేలోగా ఒక చిన్న విశేషం ఉన్నది విశేషం ఏమిటంటే రామాయణ కల్పవృక్షం మనం చెప్పుకున్నటువంటి రోజుల్లో రాముడి ప్రయాణంలోనే ఒక రాగం పుట్టింది ప్రయాణంలో పుట్టేమో రాగం అది అది రామప్రియ రాగం మనకు తెలుసు బాగా అలవాటైపోయింది ఇది రాముడికి కూడా ఇష్టం ఉంటుందా?అంత గొప్ప రాగం అది రాముడికే ఇష్టం కలిగించి ఒక నిమిషం ఆగాడాయన. అమ్మవారే ఆశ్చర్యపోయి అడిగింది "దేనికి ఆగడే అయినా ఇక్కడ ఎందుకు ఆగాడు?" ఏమో నానానా నాదంలో నుంచి ఒక సుమధురమైన నాదం వినిపిస్తోంది అని అందుకని దానికి రామ ప్రియ రాగం అనే పేరు పెట్టారు. అలాగే భాగవత నవనీతంలో ప్రధానంగా ఒక భావన ఏర్పడింది ఏమిటంటే భాగవతం అంతా కూడా హంసానంది. అసలు భాగవతమే హంసానంది. అనేక రాగాలలో హంసానంది రాగం ఆధ్యాత్మిక రాగం అది, ఉత్తమోత్తమమైన రాగం. అది జీవుడు దేవుడు అనబడేటువంటి ఒక గ్రంథి ఉన్నది మనలో, గ్రంథి అంటే ముడి చిన్న ముడి. ముడిలో ఒక చిన్న సందు ఉన్నది. ఎంత ప్రదేశం అంటే అది సన్నటి సూది మాత్రమే వెళ్లగలిగినంత. గ్రంథి భేదనం గనుక జరిగినట్లయితే జీవుడు దేవుడు రెండూ ఒకటే. కలిపి కట్టబడే ఉన్నాయి కానీ ముడిపడి ఉన్నాయి ఇవి. ముడి విడిపడిపోవాలి. లోపల ఉన్నటువంటి సూదిమొన దూరేటువంటి సందు ఏదైతే ఉన్నదో దాని పేరు చిత్తు జడము. చిత్ అంటే పరమాత్మ, జడము అంటే జీవాత్మ. రెండు గ్రంథిగా ఉన్నది గనుక దాని పేరు చిజ్జడ గ్రంథి. చిజ్జడ గ్రంథి లోపల ఇటు నుంచి అటు గాలి వెళితే రాగం పుడుతుంది. రాగం అంటే ఏమున్నది? స్వరం అంటే ఏమున్నది? notation అంటే ఏమున్నది? ఏం లేదు ఉన్నదంతా గాలి. గాలి అంటే కనపడనటువంటి పరమాత్మ కది సంకేతం. అలాగే అది శబ్దమయం శబ్ద వాహిక కూడా. శబ్దాన్ని మోసుకు వెళ్ళేది అదే అసలు శబ్దం యొక్క అదృశ్య స్వరూపమే గాలి గనుక ఇది రాగం పేరు హంసానంది రాగం. హంసానంది అంటే హంస అంటే జీవుడు వాడి అధిష్టానం ఎవడు అంటే పరమాత్మ. ఆయన ఎవరంటే పరమహంస ఆయన. హంస ఆనంది రాగంలో హంసానంది రాగంలో చిజ్జడ గ్రంథిలో సందులో నుంచి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక రాగాన్ని ఆలాపిస్తాడు. రాగంలో పరమాత్మ పరమహంస ఎవరు అంటే శ్రీ కృష్ణ పరమాత్మ. ద్వారంలో నుంచి వెళ్ళిన వారు ఎవరంటే ఎనిమిది మంది అష్ట భార్యలు కారు పదహారు వేల మంది గోప గోపికా కాంతలంతా కూడా ద్వారంలో నుంచి చిజ్జడ గ్రంథిలో నుంచి ఇవతల నుంచి అవతలకు వెళ్లారు. ఇవతల నుంచి అవతల కంటే ప్రదేశం అనే గట్టును దాటి సువిశాలమైనటువంటి సుందరమైనటువంటి అధ్యాత్మ భూమిక లోకి శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుని వెళ్ళాడు. అందుకనే కృష్ణ పరమాత్మ యుద్ధం చేయటానికి వచ్చిన వాడు కాదు చేయించటానికి వచ్చిన వాడు. మురళి వాయిం-- అందరూ వాయిస్తే చూట్టానికి వచ్చిన వాడు కాదు. తాను వాయిస్తూ ఉన్నప్పుడు అందరూ వినేట్టుగా చేయటానికి వచ్చాడు గనుక <|diarize|>"జిహానం జిహానం సుజాలేన మౌఖ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైర పాంగై మహానంద సర్వస్వమే తన్ నమస్తా" అంటాడు లీలాశుకుడు. కాబట్టి ఇవాళ మళ్ళీ కాచిగూడ సమితి ఏమో స్వామి దయ దాని యందు నిండుగా ఉంది. ఉండి రామావతారానికి రామప్రియ రాగంలో పాట కట్టి నాకిచ్చారే, అలాగే భాగవత నవనీతం సమయంలోనే తొలినాళ్లలోనే అధ్యాత్మ లో నుంచి కానంద గీతకే కదా పాడటానికి వీలుగా హంసానంది రాగంలో కృష్ణ పరమాత్మ పరంగా ఒక గీతకని సృష్టించమన్నట్లుగా అడ-- ఒక ఆలోచన కలగటం, ఆలోచన అనబడటం, అనబడిన ఆలోచన వినబడటం, వినబడినటువంటిది జరిగిపోవడం జరిగింది గనుక ఇవాళ హంసానంది రాగంలో శ్రీకృష్ణ పరమాత్మ పరంగా స్వామి పరంగా చెప్పబడినటువంటి గీతాన్ని చక్కగా ఆలపించి ఆలకించి పరమాత్మకి సమర్పించుకుందాం. ఒక ఐదు నిమిషాలు.
SSSMC · audio

Bhagawata Navaneetham - 35

Home

Bhagawata Navaneetham - 35

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 28:26

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

    Now playing
  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67