Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం ми పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వేదవ్యాస ప్రోక్తమై భమర పోతనామాచకృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో ఇవాళ దశమ స్కంధం ప్రవేశిస్తున్నాం. దశమ స్కంధం నిజానికి ఇది కృష్ణలీలా తరంగిణి. భగవత్ తత్వాన్ని, కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ గాథని, కృష్ణ మహత్తుని, కృష్ణ మహస్సుని, కృష్ణ రోచిస్సుని పరిపూర్ణంగా ఆవిష్కరించినటువంటి ఒక దివ్య భూమిక ఇది. ఇక్కడ వేదవ్యాసులవారు భాగవతం రాసినప్పుడే నిజానికి రాయాలని అనుకొన్నదానికి ముందే వ్యాకులతతో కూడిన మనసుతో ఉన్నప్పుడు నారదుడు వచ్చి చెప్పాడు. అధ్యాత్మ చెప్పావు, జ్ఞానయోగం చెప్పావు, కర్మయోగం చెప్పావు కానీ పరమేశ్వరుడి యొక్క లీలలు ఎప్పుడూ చెప్పుకోలేదే. ఆయన తత్వం చెప్పావు కానీ ఆయన ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఒక్కొక్క భక్తుడిని ఎలా కాపాడాడు, తనను తాను ఎలా ప్రపంచంలో ఆవిష్కరించుకున్నాడు, ఇన్ని విషయాలు నువ్వు చెప్పలేదు గనుక భగవంతుని యొక్క లీలని ఉపాసనా మార్గంలో చేయమన్నాడు. ఉపాసనా మార్గంలో ప్రధానంగా సగుణోపాసనకి మూలమైనటువంటి అంగవతి ఉపాసన, నిర్గుణోపాసనకి మూలమైనటువంటి అన్యవతి ఉపాసన, సత్యశోధన, తత్వశోధనకు మూలమైనటువంటి సత్యవతి ఉపాసన, మూడు కాక నిదానవతి ఉపాసనతో భగవంతుని సేవ చేయాలి. నిదానవతి ఉపాసన ప్రాపంచిక కర్మ కలాపాలలో వెన్న చిలకటమనేది ని-నిదానవతి ఉపాసనా మార్గం. నెమ్మదిగా వెన్న తీయాలి, జాగ్రత్తగా తీయాలి. మనం ఎంత జాగ్రత్తగా భాగవతాన్ని తొమ్మిది స్కంధాలు పూర్తి చేసుకున్నామో, ఇవాళ దశమ స్కంధ ప్రవేశం చేయబోతున్నామో, పరీక్షిత్ మహారాజుకు కూడా సమయం అట్టే లేదు గనుక ఆయనకున్నది ఏడు రోజులు. వచ్చి వచ్చి శుకదేవుడు, శుక మహర్షి, శుకావధూత ఆవరణంలోకి వచ్చాడు. ఆయనకున్న సమయం కూడా ఎంత విలువైనదో పరీక్షిత్ మహారాజుకు తెలుసు. ఎందుకంటే అవధూత అయినటువంటి వాడు, నిజమైనటువంటి సద్గురువు అయినటువంటి వాడు, అంటే ఆత్మబోధ చేసేటువంటి గురువు సంసారి యింట ఒక ఆవు దగ్గర పాలు పితికే సమయం దాటి ఉండటానికి వీలు లేదు, అదొక నియమం. నియమం ప్రకారం శుకదేవుడు భాగవతం అంతా చెప్పాలి. పరీక్షిత్ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఇదిగో నిన్నటి వరకు అనేకమైనటువంటి అధ్యాత్మ విశేషాలన్నీ మనం చెప్పుకున్నాం. చెప్పుకోగా తొమ్మిది స్కంధాలు పూర్ణమైపోయాయి. పరీక్షిత్ మహారాజుకి ఒక స్పురణ కలిగింది. కలిగి ఏమడిగాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ పాండవ వంశాన్ని కాపాడాడని, ఆయన లీలలు లోకోత్తరమైనవని, ఏదీ ఒకదానితో మరొకటి పోటీ పెట్టడానికి వీలు లేనివని, పోలినవి కావని, అనేకమైనవి ఉన్నాయి కదా. కృష్ణుడి గురించి నేను వినటమే తప్ప గాథలు నాకు పూర్ణంగా అర్థం కాలేదు. అసలు కృష్ణుడు ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. ఇవాళ మనం అడిగినట్లే. కృష్ణుడు ఎవరు అంటే, కృష్ణుడి కథతో ప్రారంభం కాదే భాగవతం, అశ్వత్థామ అవమానంతో ప్రారంభమైంది. ఏదైనా సరే, అధ్యాత్మ అయినా సరే, ఒక అడుగైనా సరే, సుదీర్ఘమైనటువంటి ఒక తాపత్రయంలో నుంచో, ఒక అపజయంలో నుంచో, ఒక ఆశాభంగంలో నుంచో పుడుతుంది. శ్రీమద్రామాయణం పుట్టడానికి, రాముడి కథ జగత్తుకు అందటానికి భోయవాడు కారణమైనాడు. మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ సమాః యత్ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం. ఒక్క స్పురణ, కంటి ముందు దృశ్యం కదలగానే వాల్మీకిలో ఉన్నటువంటి, వాల్మీకి అంటే నారదుడే. వాల్మీకి అంటే ఒక దేవతా స్వరూపమే. అటువంటి వాడు వస్తే తప్ప రాముడి కథ జగత్తుకు అందడానికి వీల్లేదు. కనుక పరమ భాగవతోత్తముడైనటువంటి వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు పూర్తి చేసి, వేద విభజన చేసి, విష్ణు సహస్ర నామానికి అక్షర రూపం ఇచ్చి, భగవద్గీతని మొత్తం కూడా జాతికి అందించిన తర్వాత, ఇన్ని అయిన తర్వాత, నాకు ఆనందం కలగటం లేదంటున్నాడు. మనం పుస్తకం, రెండు పుస్తకాలు రాస్తే ఆనందపడిపోతున్నాం. కానీ ఆయనకు ఆనందం కలగలేదన్నాడు. పైగా ఆనందం కలగకపోతే కలగకపోయింది, మనసేమిటో కలతగా ఉన్నది అన్నాడు. కలత తీరాలి అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలలని పదే పదే అనుకుంటూ ఉండాలి. ఒక బాలుడు, పసిబాలుడు...ఆ దివ్యలీలలని జగత్ కల్యాణం కోసం ఆవిష్కరించినప్పుడు తీర్పు తెన్నులన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఆనందానుభూతే ఒక పతాక స్థాయికి వెళ్ళినప్పుడు మనలో ఒక భగవంతుని యందు ప్రేమ, భక్తి, గౌరవం అన్నింటికంటే విశ్వాసం పాదుకుంటాయి గనుక దశమ స్కంధం ఇక్కడ పరమ వైభవంగా ఉంటుంది భాగవతం. ఇహ కృష్ణుడు కనపడాలి మనకు రోజుకొక్కసారన్నా ఇక్కడికి ఇంటికి వచ్చి వెళ్ళాలి ఆయన. ఎందుకంటే ఆయన గురించేగా మనం చెప్పుకుంటున్నది. నా గురించి ఎలా ఏమనుకుంటున్నారో ఆయనకి కాస్త enquiry కావాలి వస్తే రావచ్చు ఆయన. రానివ్వండి we will welcome him. ఎప్పటిలాగానే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కానీ, భాగవత నవనీతం గానీ చాలా విచిత్రంగా స్వామి కొన్ని days ఆయన fix చేస్తారు అని అనిపిస్తుంది. అనుకున్న calendar ప్రకారం march 7న మొదలై ఇవ్వాల్టికి అయిపోవాలి ఇది. కాదు ఇవ్వాళ మొదలు పెట్టమన్నారు. ఇవాళ సరే ఎప్పుడు మనకు వీలు ఎప్పుడంటే calendar చూసి పదిహేను నుంచి అన్నాం. తీరా అదృష్టమనండి, స్వామి అనుగ్రహమనండి, స్వామి నిర్ణయించినటువంటి ఈవేళ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఒకటి, మంగళవారం పునర్వసు నక్షత్రం, ఇవ్వాళ నేను పుట్టినరోజు అది. [చప్పట్లు] శరీరం ప్రపంచంలోకి ఇవ్వాల్టి రోజున వచ్చింది. మరి కృష్ణుడు కూడా ఇప్పుడే పుట్టబోతున్నాడు కాసేపట్లో. ఎంత ఆనందం చూడండి. ఆయన already వచ్చారు sir. వచ్చారు. రాకుండా ఎలా ఉంటారు? రావాలి. ఆయనకీ ఇక్కడే పనుంది పుణె పర్తిలో ఏం పనుంది? ఎవరూ ఆయన కోసం తపిస్తారో పరమాత్మ కూడా వారి కోసం వస్తూనే ఉంటారు. ఆయనకి ఒక second కూడా పట్టదు. కాబట్టి, ఇవాళ మనం ఒక భాగవత మహా సత్రయాగంలో మనందరం కూడా తపస్సుని, ధ్యానాన్ని, మహా యోగాన్ని అనుభవించేటువంటి వేళ స్వామి సంకల్ప మాత్రం చేత ఇవాళ శ్రీకృష్ణుడి యొక్క జననంతో ప్రారంభమవుతుంది. ఇది పరమోత్కృష్టమైనది, ఆనందదాయకమైనది. ఎవరికైనా శరీరం వచ్చిన రోజు దానికి importance ఉందా లేదా కాదు, ఇటువంటి భాగవతంలో ఉండటం అనేది అదృష్టం అది. అది రేపు ఇరవై రెండవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు వచ్చింది ఏం చేస్తాం? మన ఇంట్లో మనం కూర్చుంటాం. సాయంత్రం ఇలా స్వామి భావనలో, కృష్ణ భావనలో ఒక చైతన్యంలో మన తపోభూమిక నిరంతరం కొనసాగేటువంటి ఒక సన్నివేశం కాబట్టి స్వామికి మరొక్కసారి మనందరం కూడా చక్కగా నమస్కరిస్తూ పరీక్షిత్ మహారాజులో అన్నమాట మనం. శుకదేవుడు వస్తాడు, వచ్చి ఆయన బోధించాలి. శుకదేవుడే చెప్పాలి, పరీక్షిత్ మహారాజే వినాలి. వ్యాసులవారే రాయాలి, కృష్ణుడే రాయించాలి. ఇది భాగవతంలో నాలుగు మూలాలు ఇవి. ఇందులో ఎవరి కంటే ఎవరు అధికం అంటే కృష్ణుడు లేని వ్యాసుడు లేడు, కృష్ణుడు లేని శుకుడు లేడు, కృష్ణుడు లేని భాగవతోత్తములు లేరు, అసలు భాగవతమే లేదు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్య వాహికలో పరమాత్మ వచ్చినటువంటి సన్మంగళ వేళ ఎటువంటిది అంటే, అసలు పరమేశ్వరుడు ఎందుకు వస్తాడు అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. ఆయనకి ఇక్కడ ఏం పని ఉంది అన్నాడు. ఆయన ఎక్కడో ఉంటాట్టే కదా, ఇంతకుముందు ఉన్న పురాణాలన్నీ నేను విన్నాను. భాగవతోత్తములు చెప్పగా చెప్పగా వింటూనే ఉన్నాను. ఆయనకి ఇక్కడ ఏం పని ఉన్నది అన్నాడు. ఆయనన్నాడు శుకదేవుడు, అసలు ఆయనకి అక్కడేం పనిలేదు ఉన్న పని అంతా ఇక్కడే అన్నాడు. ఏమిటయ్యా పని అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి నేనే వస్తా అన్నాడు. నేనే వచ్చేవాడిని ప్రసవం కాదు, ఎవరో తెస్తే ప్రసవం. నేనే రావటమే ప్రభవం. శ్రీరామచంద్రుడు, శ్రీవిష్ణు మహస్సంతా కూడా ఎలా పాయస ప్రవేశం జరిగిందో, కృష్ణ చైతన్యంలోకి వచ్చేప్పటికీ ఇది లీలా స్వరూపం కాబట్టి, మహిమా స్వరూపం కాబట్టి, అఖండమైనటువంటి జ్ఞాన స్వరూపం కాబట్టి, యోగేశ్వర స్వరూపం కాబట్టి యోగీశ్వరుడు వేరు, యోగేశ్వరుడు వేరు. కృష్ణుడు కేవల యోగీశ్వరుడు కాడు, యోగేశ్వరుడు. అంటే యోగుల, మహాయోగులందరికీ కూడా ఈశ్వరుడు. యోగీశ్వరుడు అంటే యోగులలో శ్రేష్టుడు అని అర్థం. ఆయన యోగులలో శ్రేష్టుడు కాదు, శ్రేష్ఠమైన యోగులందరికీ మూలమైన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుకనే ఆయన యోగేశ్వర కృష్ణ, not యోగీశ్వర కృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమా. దాంతోనే భగవద్గీత పూర్ణమైపోతుంది. సరే, శుకదేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ధర్మం స్థాపించబడాలి అంటే ఎవడో ఒకడు రావాలి. ఎవడో మనబోటి వాడు వస్తే ధర్మం ఎలా నిలబడుతుంది? మనమంతా ధర్మం ఆచరించటం లేదు గనుక ఆయన లోకానికి వచ్చి ధర్మాచరణ చేయవలసిన అవసరం ఏర్పడింది గనుక ఆయన వచ్చాడు. అందుకనే కృష్ణ భగవానుడు తర్వాత తర్వాత, యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు మళ్ళీ. అంటే ఎప్పుడెప్పుడు చేయవలసిన ధర్మం వెనకబడి పోతుందోదానికి ఒక హాని, గ్లాని జరుగుతుందో మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి జన జాగృతి చేసి జన కళ్యాణం చేసి స్వధర్మం వైపు అంటే ఆత్మ నిష్ఠ వైపు నడిపించటానికి నన్ను నేనే సృష్టించుకుంటాను. నా అంతట నేనే వస్తాను సంభవామి. సృజామ్యహం నన్ను నేనే సృష్టించుకుంటాను మరి నీ నీ అంతట నువ్వు వస్తావంటే నిన్ను ఎవడయ్యా సృష్టించేది అంటే వాడు ఎవడు లేడు నేనే వస్తాను అన్నాడాయన. నన్ను నేనే సృష్టించుకోవాలి అన్నాడు. కాబట్టి యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత కాబట్టి భారతదేశంలో ఇవాళ ఒక కృష్ణుడు అవసరం ఏర్పడింది. శతాబ్దం కింద వంద ఏళ్ల క్రితం ఎవరో కొంతమంది తపస్సు చేశారు. దేవుడు యవనీ సంచారం చేస్తే బాగుండును అని వాళ్లకు అనిపించింది. దేవుడికి కూడా అనిపించింది నేను వెళ్ళకపోతే ఇదేదో సక్రమంగా ఉండదేమో అని ఆయనకు అనిపించింది. ఆయనే నవంబర్ ఇరవై మూడు, పంతొమ్మిది వందల ఇరవై ఆరున మహా కృష్ణ చైతన్యంగా సత్య సాయి భగవానుడుగా శ్రీ మహా విష్ణువు యొక్క చతుర్భుజాలు నాలుగు భుజాలు ఆయనకు ఉంటే ఈయన కూడా చతురబాహుః చతుర్భుజః అని చతురమైనటువంటి రెండు బాహువులతో వచ్చారాయన. దివ్యమైనటువంటి గురు పాదుకలతో వచ్చారు. సంపూర్ణమైనటువంటి కలియుగానికి దత్తమైనటువంటి అధీనమైనటువంటి దత్త శక్తిగా వచ్చారు. సర్వ గురు సమ్మేళనంగా వచ్చారు. సర్వ దేవతల యొక్క aspects అన్నీ ఒక చోట రాసి పోస్తే ఒక మూలమైన స్థూలమైన సగుణ స్వరూపంగా వచ్చారు. కనుక స్వామిని ధర్మపరంగా విచారణ చేసినప్పుడు అంటే స్వామి మై లైఫ్ ఈస్ మై మెసేజ్ అన్నప్పుడు అది ధర్మాచరణ ఎనభై ఆరు సంవత్సరాల్లో ఎక్కడా రకమైనటువంటి తేడా లేకుండా ఎట్లా ఉత్తమ జీవితాన్ని గడపాలో తన జీవన విధానం ద్వారా చూపించినప్పుడు అది రామావతారంలో ఉన్నటువంటి ధార్మిక శబ్దానికి స్వామి ఒక సంకేతం. అందుకనే సాయి కృష్ణ లేదు మనం అనుకోవటమే ఉన్నది సాయి రామ. రామ శబ్దం విష్ణువుకే చాలా ఇష్టంట. అందుకనే ఆయన ఏం చేశాడంటే శ్రీరామచంద్రుడు వచ్చాడు కదా శ్రీరామచంద్రుడు మనం మంత్రాలు అంటామే మమ అనుకోని అంటుంటారు. అట్లాగే ఆయనకు రామ శబ్దం మహా ఇష్టం గనుక విష్ణుమూర్తికి అనిపించిందట నేను ఎవరిని పేరుతో పిలవాలి అని. పరశురామ, భార్గవ రామ అని పేరు పెట్టుకొని ఉండి తెచ్చుకున్నాడు ఒక అంశ. ఆయన పిలవాలి అనుకున్నప్పుడు పరశురామ, భార్గవ రామ పైకి తలుచుకున్నా లోపల అనుకున్నా రామ శబ్దం ఆయనకి ఏర్పడింది. అలాగే శ్రీ కృష్ణ పరమాత్మ జగత్తులోకి వచ్చినప్పుడు రామ శబ్దం ఆయన్ని వదిలిపెట్టలే. కనుకనే బలరాముడు తన సహోదరుడుగా తెచ్చుకున్నాడాయన. బలరాముడు సంకర్షణ స్వరూపం కాబట్టి బలమైనవాడు, ధృడమైనటువంటి వాడు ఎవడు వాడు అంటే ఆదిశేషువే. వెంబడి తెచ్చుకుంటాడాయన. గోకులంలో ఉన్నటువంటి బృందావన ఆత్మలన్నిటికి కూడా ఒక రమయతీతి రామః రమింపజేసేటువంటి వాడు గనుక ఆయనకు రామ శబ్దాన్ని కూడా కలిపారు. కాపలా వేస్తాడు గనుక ఎవరికీ నష్టం రాకుండా కృష్ణుడు ఉన్న ప్రదేశం వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినా అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాడు బలరాముడు గనుక ఆయనకి బలరాముడు అని పేరు పెట్టారు. కాబట్టి బలరాముడు ఎవరు అంటే విష్ణువు యొక్క అంశయే. అయితే రామావతారంలో విష్ణువు యొక్క శక్తి అంతా కూడా పాయస ప్రవేశం చేసింది విష్ణు తేజం అంతా కూడా. అందుకని అది మాయా మానుష విగ్రహ స్వరూపం రాముడు. మాయకు లోబడ్డట్టుగా ఉంటాడు, మాయను దాటి వెళ్ళే ప్రయత్నము చేయడు, విధి ఎట్లా నడిపిస్తే ఆయన తన జీవితాన్ని అట్లా నడుపుతాడు. మనవలె ఒక కష్టాన్ని ఎదుర్కొంటాడు, విలపిస్తాడు, విలపించినట్లు ఉంటాడు, సదా ఆనంద చిత్తుడై ఉంటాడు. మనీషాయత్త చిత్తమైనటువంటి ఒక స్థితిలో, జ్ఞానాధిక్యమైన స్థితిలో ఉంటాడు. కానీ మానవుడు వలె సంచారం చేస్తాడు, చేస్తున్నా మహిమలు చేస్తాడు. ఎవరన్నా వచ్చి మీరు మంచి మహిమ చేశారంటే నాకేం తెలియదంటాండేమో మానవుడినంటాడు. అది రామతత్వం. కనుక పరమేశ్వరుడి యొక్క శక్తి పాయస ప్రవేశం చేయటానికి మూల కారణం ఏమిటి అంటే వస్తువు నందు దాగి ఉన్నటువంటి మహిత శక్తి రామచంద్ర ప్రభు. ఇక శ్రీకృష్ణుడా ఇది లీలా తాండవం ఇది. లీల లేకుండా కృష్ణుడి యొక్క చైతన్యం ఆవిష్కరణ జరగలే. అసలు చెరసాలలో పుడుతూనే ప్రభవిస్తూనే తల్లిదండ్రులకు నిజ రూప దర్శనం ఇచ్చాడాయన. అటువంటి మహాత్ముడు ఆయన. తల్లిదండ్రులు విగ్నాంతికి లోనైనారు. కనుకనే తాను తనకంటే ఒక అన్న ఉండాలి కనుక ముందు పుట్టాలి కనుక యోగ మాయలో ఉన్నటువంటి ఒక భాగాన్ని రోహిణి గర్భ ప్రవేశం చేయించాడు పరమాత్మ. అంటే తనకంటే ముందు ఉంటే తప్ప వాడు అన్నగారు కాలేడు. కనుక బలరాముడిని ముందు పంపాడు. ముందే నిర్ణయం చేశాడు నేను దేవకీ గర్భంలో పుడతానన్నాడు. దేవకీ వసుదేవులు ఇద్దరూ ఎవరంటే ఒక జన్మలో సుతాపుడు, పృష్ని అనబడేటువంటి ఉత్తమ దంపతులు వాళ్ళు. వాళ్ళే తర్వాత కాలంలో వామనావతార ఘట్టంలో అదితి కశ్యపుడే మళ్ళీ వాళ్ళిద్దరూ. ఇద్దరే వసుదేవుడు దేవకి. అలాగే రామాయణ కాలంలో కూడా కౌసల్య, దశరథుడు ఎవరంటే మళ్ళీ అదితి కశ్యపుడే.ఆ అంశాలు ఎట్లాగైతే తల్లిదండ్రుల యొక్క lineage ఎట్లా వస్తున్నది అంటే పరమాత్మ తన తల్లిదండ్రులని కూడా మూలాలు మార్చుకోకుండానే ఉన్నాడు. అందుకనే స్వామి అవతారంలో కూడా భరద్వాజ గోత్రంలోనే నేను మూడు అవతారాలు వస్తాయి అని ప్రకటన చేశారు. గోత్రం మారలే, కుదురు, కుదురు మారలే. కాబట్టి మూడు అలాగే రావలసిందే రేపు ప్రేమసాయి వచ్చినా, భరద్వాజస గోత్రంలో రావలసిందే. మరి గోత్రమే ఎందుకున్నా, ఎందుకు ఎన్నుకున్నారయ్యా అంటే భరద్వాజ మహర్షి యొక్క చిత్తమంతా కూడా పరమాత్మ యందే లగ్నమై ఉన్నది. అందరూ తపస్సు చేశారు కామ్యం కోసం, ఇది కావాలి అది కావాలని. ఒక్క భరద్వాజుడు మాత్రం పరమాత్మ తత్వాన్ని ఎరగాలని చేశాడు గనుక భరద్వాజస గోత్రంలో సాయిత్ర మూడు అవతారాలు వస్తాయి, నాలుగో అవతారం లేదు. షిరిడీ సాయి, సత్య సాయి, ప్రేమ సాయి. కనుక అది సాయిత్రై. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అనేకమంది వెళ్లి ముందు బ్రహ్మదేవుడిని అడిగారు, రుద్రాదుల్ని అడిగారు. భూభారం వహించాలి, అనేకమైనటువంటి అరాచకాలు, అనాచారాలు జరుగుతున్నాయి. ఎవరు వస్తారు అన్నప్పుడు రాదగిన వాడు, రావలసిన వాడు నారాయణమూర్తి గనుక క్షీరసాగరంలో కూర్చుని ఉన్నాడు ఆయన హాయిగా. ఏం తెలియనట్లు కానీ ఎవరన్నా వచ్చి అడిగితే బయలుదేరుదాం అన్నట్లు. అంటే యోగం సంభవించాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉదాత్తమైనటువంటి స్థితులు కలగవు. యోగం సంభవించినప్పుడు వీళ్లంతా వెళ్లారు. దాన్ని శుకదేవుడిక వర్ణించి, వర్ణించి శ్రీకృష్ణ కథని శుకదేవుడికి ఎవరు చెప్పారంటే తండ్రి, గురువు అయినటువంటి వేదవ్యాసుల వారు చెప్పారు. వేదవ్యాసుల వారు ఎక్కడా deviation లేకుండా అక్షర సత్యంగా భాగవతాన్ని బోధించాడు శుకదేవుడికి. శుకదేవుడు కూడా కల్పనలు గాని ఒక చాతుర్యం గాని లేకుండా యదార్థమైనటువంటి ఒక ఆధ్యాత్మిక బోధని తొమ్మిది స్కంధాలలో నడిపి దశమ స్కంధంలోకి వచ్చేప్పటికీ కృష్ణలీలా వైభవాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించాడు. ఆవిష్కరించినటువంటి సన్నివేశంలోకి మనం ఈవేళ వెళ్ళాలి. కనుక శ్రీరామచంద్రుడు మాయా మానుష విగ్రహ స్వరూపం అది. శ్రీకృష్ణుడు మాయా మానుష విగ్రహ స్వరూపానికి ముందు లీలా మాయా మానుష విగ్రహ స్వరూపం. లీలలు చెప్పి చేశాడు ఈయన. చేసిందల్లా నేనేనన్నాడు, కర్తృత్వం వహించాడు ఈయన, కర్తృత్వం నాది కాదన్నాడు ఆయన, అంతే. ఒక్కొక్క aspect ఒక్కో అవతారానికి ఉంటుంది. రాముడి లాగానే కృష్ణుడు ఉండటానికి వీలు లేదు. అలాగే ఉండేట్టయితే రాముడు రానక్కర్లేదు మళ్లీ వచ్చిన వాడు వెళ్లక్కర్లేదు. రాముడు వెళ్లాడు కృష్ణుడు వచ్చాడంటే కృష్ణుడు కృష్ణుడుగానే రావాలి. అందుకనే అధ్యాత్మలో ఒక గురువును మరొక గురువుతో మనం పోల్చకూడదు, అది తప్పు. ఎందుకంటే we are not supposed to pronounce on the other. మహాసుదర్శన చక్రంలో పన్నుకి పన్నే బలవత్తరమైనది. ఏది మనకు అవసరం అనేది చక్రం తిరిగినప్పుడు అవి మన దగ్గరికి వస్తాయి. గురువు కాసేపు వెలుగు ఏదో పారిస్తాడు, కాసేపు ఉంచుతాడు. ఉంచి చక్రం దుడుంలా తిరగ్గానే highest level next stage కి తీసుకెళ్లడానికి రెండో గురువు అక్కడ కాచుకొని ఉంటాడు. ఇది గురువులను మనం మార్చటం కాదు, గురువులే మారుతూ ఉంటారు. మారుతున్నటువంటి గురువులు సాధకుడి యొక్క అధ్యాత్మ స్థితిని బట్టి వెళుతూ ఉంటారు. అసలు వెళ్తా వెళ్తానే పరమాత్మ దగ్గ-దగ్గరకెళ్లి అనుభవం పొందిన వాళ్ళ సంగతి ఏమిటంటే, వాళ్లకు కూడా ఉందిగా మిగతావన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వద్దామని. కాబట్టి గురువుల యొక్క సంపర్కాలన్నీ కూడా కలుగుతాయి. కానీ జ్ఞాని అయినటువంటి వాడు, అధ్యాత్మలో నిలకడ చెందినటువంటి వాడు, నిత్య తత్వానుసంధాని అయినటువంటి వాడు, ఆత్మానుసంధాన స్ఫూర్తితో జీవితాన్ని పండించుకునేటువంటి వాడు, పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానాధిక్యమైన స్థితిలో మనీషాయత్త చిత్తాన్ని నిర్మాణం చేసుకొని, మనీషా అంటే ప్రజ్ఞ, ఉదాత్తమైన ప్రజ్ఞ అనుకున్నాం. దానికి జ్ఞానానికి అతీతమైనటువంటి స్థాయిలో దాన్ని నెలబెట్టుకోవాలి. జ్ఞానానికి అతీతమైనటువంటి స్థాయి ఎవరి దగ్గర ఉన్నదంటే ఒక్క పరమాత్మ దగ్గరే ఉన్నది గనుకనే, అందుకనే ఆయన్ని మనం ఏమన్నాం అంటే తుర్యాతీత పదస్థిత. తుర్యానికి అతీతం అది. తురియం దాకా అందరూ వెళ్లగలరు సాధన చేస్తే. అతీత స్థాయికి మనం వెళ్లలేం, ఆయన లాగాలి. సకరుణం, అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కరుణాస్ఫురకంగా ఉంటాడు. ఏం చెప్పడు. ఎందుకని? అడిగి పొందేవన్నీ వరాలే. ఇది కావాలి అది కావాలి పటం ముందు నుంచొని దానికి ఒక ఉత్తరం రాసి, దాని మీద ఆయనకు ఒక పరీక్ష పెట్టి, దాని మీద పువ్వు పడితే ఉన్నట్టు పువ్వు పడకపోతే లేనట్టు ఇవన్నీ మనం కల్పించుకున్నవి. అవన్నీ దాటాలి, అది సకరుణం. ఎక్కడ ఉన్నది? జ్ఞానాగ్ని శైలస్థితం. జ్ఞానం అనేటువంటి నిప్పుల కొండమీద చిట్టచివర ఆయన కూర్చొని ఉన్నాడు. మనల్నేమంటున్నాడంటే దారిన నడిచి రమ్మంటున్నాడు. ఎందుకు నడిచి రావాలి? ఆయనకి దయ ఉండాలి కదా, మనయందు మనం పిల్లలం కదా. ఇంత నిప్పుల మీద నడిపించాలా అంటే కర్మలు మరి ఎవరు దగ్ధం చేయాలి? నీవు నివ్వే దగ్ధం చేయాలి కాబట్టి అధ్యాత్మ ప్రయాణంలో, ప్రస్థానంలో నీ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. కర్మలంటే పాపకర్మలా? పుణ్యము కర్మే కదా అది కూడా దగ్ధం కావాలన్నాడు. పుణ్యకర్మ గనక దగ్ధం కాకపోతే మళ్ళీ జన్మ ఎత్తాలన్నారు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు. ఐహికానందం దగ్గర ఆగిన వాడు ఆముష్మికం అందుకోవాలి, ఆముష్మికం అందుకున్నవాడు కైవల్యానందానికి వెళ్ళాలి. కైవల్య ఆనంద తారక స్థితిలోకి నడిపించటానికి పరమేశ్వరుడు అక్కడ జ్ఞానాగ్ని శైలస్థిత. నిజమే! ఇవన్నీ మీకెలా తెలుసు? ఎక్కడున్నాయి? శాస్త్ర ప్రమాణం ఏమిటి? ఉందా? ఏదన్నా వేదంలో, ఉపనిషత్తులో రెండు శ్లోకాలు చెప్పి...దీనికి అర్థం చెప్పండి అనంటే "మజ్ జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం" ఎన్ని జన్మలు ఎత్తి- ఎత్తాడో జీవుడు, ఎన్-ఎందరు మహాత్ముల్ని దర్శనం చేసాడో, ఎన్నెన్ని అవతారాలతో కూడి ఉన్నాడో ఎరుక లేదు జీవికి. కాబట్టి జన్మాంతర పుణ్య పాక అది, పుణ్యం పరిపాకం చెందింది అది పండింది కనుక, నువ్వు నాకు సద్గురువు అయినావయ్యా సత్య సాయి ఈశ్వరా అన్నా, అది. స్వామి మామూలు భౌతిక స్థాయిలో చూస్తే ఈశ్వరమ్మ కొడుకు పుట్టపర్తి లో పుట్టారు, ఏదో పధ్నాలుగు వేల పూలు జల్లారు అదంతా మామూలు కథ. మానసిక స్థాయిలో విచారణ చేసినప్పుడు సర్వ శాస్త్ర సమ్మతమైన, వేద సమ్మతమైనటువంటి మాటలన్నీ ఆయన నోటి నుంచి వచ్చే ఉన్నాయి అక్కడ. కాకపోతే presentation వేరు, ఆయన చెప్పింది వేరు. చిన్న ఉదాహరణ చెప్తా, రుద్ర ప్రశ్న చదువుతాం అంటే ఏంటి నమకం, నమకం అంటే ఏం లేదు నమస్కరిస్తున్నాను అనటం. చమకం అంటే మళ్ళీ అదంతా పెద్దగా ఏం కాదు నీతో కూడి ఉన్నాను అని అర్థం. నీతో నమస్కరిస్తున్నాను, నీతో కూడి ఉన్నాను అదే నమకం చమకం. దానిలో రుద్ర ప్రశ్నలో చాలా ప్రధానమైనటువంటి ఒకటి ఉన్నది. దుఃఖం తెప్పించేవాడా, దుఃఖం తప్పించేవాడా నీకు నమస్కారం అన్నాడు వాడు, రుద్రం. రుద్రం మామూలుగా మన standard ప్రకారం చూసిన స్వామి కంటే చాలా కొన్ని వేల లక్షల సంవత్సరాల పుట్టిన ముందు పుట్టినటువంటి ఆ-మాట అది. కానీ స్వామి దుఃఖం అనే మాట అనకుండా, కన్నీరు తెప్పించేది నేనే, కన్నీరు తప్పించేది నేనేనే అన్నారు. అది సమన్వయం చేయాలి. ఊరికే రుద్రం లొడ లొడ అని చదివినట్లయితే దాని వల్ల ఏం ముక్తి ఏం రాదు, అర్థం ఎరగాలి. రుద్ర ప్రశ్నలో పూర్ణమైనటువంటి విషయాలున్నాయి. వాటిని చదువుతూ ఉన్నప్పుడు స్వామి మనకు ఏం చెప్పారు? యెహోవా ఆరోజు మాట ఇట్లా అన్నారు కదా. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? బ్రహ్మ పదార్థం అంటే ఏమిటంటే వంద పేజీలు రాయాలి. స్వామి ఒక్క line లో చెప్పారు, దేనిని కనులు చూడలేవో, దేనివలన కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మ పదార్థం అన్నారు. అంటే కంటి వెనక ఉన్నటువంటి స్థూలమైనటువంటి పరమాత్మ యొక్క, దాన్ని మనం చిచ్ఛక్తి అని వాడతాం చిత్త శక్తి. చిచ్ఛక్తి యొక్క స్వరూపమే పరమాత్మ. పరమాత్మ ఎన్ని రకాలుగా తనను తాను ఆవిష్కరించుకున్నాడో కథా కథనంలోకి మనం చక్కగా ప్రవేశం చేయాలి. దశమ స్కంధంలో చూడండి, ingredients అన్నీ మంచివి దొరికాయి అనుకోండి. వంటగాడు, గజ వంటగాణ్ణి పిలిచాం మన ఇంట్లోకి పిలిచి. వాడికి ఒక ఐదు వందల మందికి నువ్వు భోజనం తయారు బ్రహ్మాండంగా చేయాలా, ఇంతవరకు చేయనటువంటివి చేయాలి. అనగానే వాడు ఏమంటాడంటే, నేను చేస్తాను చెయ్యను చెప్పడు. గజ వంటగాడు అంటాడు మీరు నాకు పదార్థాలు ఇస్తున్నారా, నేను తెచ్చుకోవాలా చెప్పండి అంటాడు. మేము తెచ్చేసాం, నువ్వు తెస్తే మోసం చేస్తావని భయమేసి మేమే తెచ్చాం అది కదా. నమ్మం మనం ఎవడ్నీ అది అని అంటాం. అనగానే వాడు వస్తువులు చూస్తాడు. మీరు తెచ్చిన వస్తువుల ప్రకారం వంట చేస్తాను అంటాడు, అది కిటుకు. మనం లోభించామా, వంటలో లోపం ఏర్పడుతుంది. పోతరామాత్యుడికి అసలే భక్తి ఎక్కువ. మహా భక్తుడు, భాగవతుడు. ఆయనకిప్పటికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది? కృష్ణుడి గురించి చెప్పాలి. ఇక చెలరేగాడాయన. కవితా సామగ్రి అంతా కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఎన్ని రకాలుగా వర్ణించవచ్చును, ఎన్ని నడకలు సాగించవచ్చును, ఎంత శుభగశయ్యతో, శైలితో పరమాత్మని ఆవిష్కరించుకోవచ్చును, దర్శనం చేయవచ్చును, దర్శనం చేయవలసి ఉన్నదో, కృష్ణుడి యొక్క లావణ్యం ఏమిటో, కృష్ణుడి యొక్క శక్తి ఏమిటో ఇక, భగవత్ పోతరామాత్యుడికి మహదానందం కలిగింది. ఎలా కలిగింది? కృష్ణుణ్ణి ఆయన చూడలేదే. శివోపాసకుడు కదా. కృష్ణుడి గురించి పెద్దగా విషయాలేమీ ఆయనకి తెలియవు కదా దగ్గర. అంటే సాక్షాత్తు రామచంద్ర ప్రభువే వచ్చి భాగవతం రాయి అన్న తర్వాత పోతన రాస్తాడా? రాసేది సాక్షాత్తు రామచంద్ర ప్రభువే. ఇక రాముడే తన కథ రాస్తున్నప్పుడు ప్రపంచంలో రెండు వందల ఎనభై ఎనిమిది రామాయణాలు అన్ని భాషల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క శైలి విన్యాసం. దేన్నీ ఇంకోదానికి తక్కువ చేయటానికి వీల్లేదు. కానీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి రాసినటువంటి రామకథా రస వాహిని వీటన్నింటినీ కూడా శిఖర స్థాయిలో నిలబడుతుంది. ఎందుకనంటే పరమాత్మే స్వయంగా రాసినందువలన. పరమాత్మ స్వయంగా రాసినప్పుడు ఎక్కువ సత్యం ఆవిష్కరిస్తాడు, కవితా కల్పనలు ఉండవ్- తక్కువుంటాయి.
SSSMC · audio

Bhagawata Navaneetham - 51

Home

Bhagawata Navaneetham - 51

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:08

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

    Now playing
  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67