Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపులు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ లవనకు పుట్టిన కొమరుని వలనన్ తెగదంచు గగర వాడి పలికెన్ ఆంచు అలిగెద వేణి మృగాక్షికి కల కొడుకుల చంప నిత్తు క్రమము నీకున్ ప్రపంచంలో బతకడానికి రెండు ఉండాలి శక్తి అన్నా ఉండాలి యుక్తి అన్నా ఉండాలి ఇక్కడ వాసుదేవుడు వసుదేవుడు వాడి శక్తి పనిచేయదు ఎందుకంటే negative energy అయిన కంసుడు ఉన్నాడు వాడు వాడితో తలపడేటువంటిది కాదు అప్పుడే పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు వాడు వాడు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు యుద్ధం చేయటానికి సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నవాడు కంసుడు వీడిని యుక్తితో జయించాలి గనుక వసుదేవుడు ఏమన్నాడంటే నీ భయమంతా అష్టమ గర్భంలో వచ్చేటువంటి దాని వలననే కదా అంటే ఏడుగురు ముందు పుడతారు కదా పని చేస్తా పుట్టిన వాడిని పుట్టినట్టుగా నీకు అప్పజెప్తా ఒక వరుసలోనే ఇస్తా one two three four పుడుతూ ఉంటారు నీకు ఇస్తూ ఉంటారు నువ్వు హాయిగా చంపేస్తుండు నాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే నీకు మరణం ఎనిమిదో దాని వలన గనుక లేదా ఎనిమిదో వాడి వలన గర్భం వలన గనుక ఏడు వరకు నీ చెల్లెలు ముందు బతకని ఆమె బతికుంటేగా గర్భం దాల్చేది అన్నాడు వసుదేవుడు కంసుడికి logic బాగుందన్నారు అసలు చెల్లెలే లేకపోతే అష్టమ గర్భం ఎక్కడుంది కాబట్టి చెల్లెల్ని బతకనిస్తే చెల్లెల్ని చంపాం అన్న పాపం ఉండదు ఎలాగూ పాపం వసుదేవుడు పిచ్చివాడు ఇప్పటికే భయపడిపోయి పుట్టిన వాళ్ళందరినీ ఏడుగురిని ఇచ్చేస్తాను అంటున్నాడు ఎనిమిదో వాడిని ఇస్తానని అనలా ఎందుకంటే వచ్చే ఎనిమిదో వాడు ఎవడో ఆయనకు తెలుసు కంసుడికి ఒక్కడికే తెలియదు అది రహస్యం అనగానే వాడు ఏమన్నాడో తెలుసా కంపితావతంసుడై సంతసించి అప్పుడు వాడికి ఆనందం కలిగింది కరిష్యే వచనం త్వా అని అర్జునుడికి యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ అనే దాకా భగవంతుడిని నానా ఇబ్బందులు పెట్టాడు అర్జునుడు భగవద్గీతలో వేయ రాణి వేయ కూడని అనేక ప్రశ్నలు వేశాడు ఆయన విసిగిపోయి ముందుకు పోనివ్వడు వీడని యోగక్షేమం వహామ్యహం అన్నాడు నీ యోగ క్షేమాలు రెండూ నేను చూసుకుంటాను రా అన్నాడు అనగానే ఇంకేం మరి చూస్తాను మోస్తాను అనేవాడు ఉంటే దింపడం తేలికదు అయితే కరిష్యే వచనం త్వా నువ్వేం చెప్తే అది చేస్తా అన్నాడు అలాగే సంతసించి గుణ గ్రాహిత్వంబు గైకొని కొండల మందు చెలియలి మండల విడిచి చలిగి ఇక్కడ వదిలేశాడు వసుదేవుండును బ్రతుకు మండల గెంటి మనుచు సుందరియున్ తానుచు మందిరమునకు పోయి దండంబున ఆనందము నొంది యుండె ఇది అసలు కథ అక్కడికి అక్కడే ఏం జరగలా నిజానికి కంసుడు ఒకటే వాడికి ఇంకా కోపం చల్లారలా ఇవాళ కడితే రేపు ఎనిమిదో గర్భంలో పుట్టేది నాకు స్నేహితులు బంధువులు ఎలా అవుతారని మనల్ని ఒక్కోసారి మన మీద కోపం వచ్చిందంటే కారు దిగండి మీరు నడిచి రండి అని వాడు వెళ్ళిపోతే అలా దింపాడు వీడు వాడికి ఆనందం ఏంటంటే వాడు ఇంకో నాలుగు మైళ్ళు నడిచి వస్తాడు అని వీడు ఏంటంటే నడిచి రమ్మన్నాడు ప్రాణం తీయలేదు వాడి కారు పోతే పోయింది ముందు వాడి సంగత్యం వదిలిపెట్టిందని వీడు నాలుగు మైళ్ళు నడుస్తాడు వసుదేవుడి పరిస్థితి అది జ్ఞాన ఖలునిలోని శారదయు బోలె ఘటములోని దీప కలిక వోలె భార్త ఇంట నాకబడి యుండె దేవకీ కాంత విశ్వ గర్భస్థ గర్భ యగుచు తన అన్నగారింటనే ఉన్నది ఎందుకంటే వాడు దేవకిని ఎక్కడికి పంపలే నా దగ్గరే ఉండమన్నాడు లోకం దృష్టిలో చెల్లెల్ని సాచినట్టు ఉంది ఎప్పుడు ఎవరు గర్భంలో నుంచి పుడితే వాళ్ళని అక్కడికక్కడే చంపడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ వీళ్ళు ఎటైనా వెళ్ళిపోతారని ఇంట్లోనే ఉంచుకున్నాడు విశ్వ గర్భుడుని ధరించే దాకా అక్కడే ఉన్నది ఒకరోజున కంసుడికి చూడండి రకమైనటువంటి న్యూస్ రావటంలా ఆమె గర్భవతి అయినట్టుగాని అసలు ఎక్కడా ఆనవాళ్లు లేకుండా ఉన్నది వాడి మనసుకు వాడికి అనిపించింది కన్నులకు చూడ బరువై యున్నది ఎల నాగ మా చెల్లెలు కాస్త ఒళ్ళు చేసిందే బరువు ఎక్కిందే గర్భముల్లము కలుగన్ శోభగున్ జూచి మున్నెన్నడు ఇట్లుండదు ఇదివరకు ఉన్నట్లుగా మాత్రం ఇప్పుడు లేదు ఏదో తేజస్సుతో వెలిగిపోతున్నది నిన్నడు సరబోలు గర్భ వివరము లోనన్ ఏమి తలంచు వాడా వాడికి ఒక స్వగతం ఏర్పడింది ఏమిటి ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాను వాడు మంచివాడే అదే విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం అంతా మనకు ఒక గొప్ప విషయం బోధించాడు ఆయన పరిస్థితులే చెడ్డవి మనుషులు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కారు అన్నాడు ఎంత గొప్ప మాట అది స్పృహలో మనం ఉంటే మనకు ఒక్క శత్రువు ఉండడు మనం ఏమంటాం అంటే వాడు చెడ్డవాడు అందువల్ల పరిస్థితులు వచ్చాయంటాం వాడి పరిస్థితులు అలా ఉన్నాయి గనుక ఇట్లా అయింది అనుకోవాలి మనం అనుకుంటే పరిస్థితుల మీదకి వెళ్ళిపోతుంది ఏమి తలంచు వాడా ఇక ఏయ్యెడి కార్యము నాడు నాటికిన్ కామ నిచులు పంపెసగ గర్భిణి చెల్లె నాడు పేద నేనేమని చంపు వాడా తగనేలని చంపితి యోని శ్రీయుదా మయ శంభు ఆయువును ధర్మమున్ చెడిపోవ కుండునేకంసుడ్ని ఇలా మనకు ఎవరు present చేయరు భాగవతంలో ఉన్న సత్యనిష్ఠ ఏంటంటే అసలు పాపము ఎరగని నా చెల్లెల్ని నేను చంపడంలో ధర్మం ఉన్నదా? నేను పోతే పోతానేమో అసలు పిల్లలందరినీ ఎందుకు చంపటం అనుకున్నాడు కాకపోతే అనుకున్నాడు గా అనేది మనసు లేదు మనకే అనిపిస్తుంది పని చేయకూడదు రేపు పొద్దున అని రేపు పొద్దున అదే పని చేస్తాం ఏం చేస్తాం అంటే ప్రారబ్ధం అంటాం ప్రారబ్ధం ఏం కాదు అది మన నిర్ణయం మనం చేసేసాం అంతే అది accept చేసేటువంటి ఒక హృదయం ఉండాలి సరే వైరానుబంధంతో ఉన్నాడట ముందు ఎట్లా ఉన్నాడు ప్రేమబంధంతో ఉన్నాడు బాంధవ్యంతో ఉన్నాడు చెల్లెలన్న భావనతో ఉన్నాడు ఆమె గర్భిణిగా ప్రకాశమానమై ప్రవర్ధమానమవుతున్నటువంటి సమయంలో వాడికి వైరానుబంధం ఏర్పడింది వైరము చేత మాత్రమే చెల్లెల్ని చూడటం మొదలుపెట్టాడు దృష్టితో తిరుగుచు కుడుచుచు తాగుచు అరుగుచు కూర్చుండి లేచుచు అలవరతము హరి తలచి తలచి జగము హరిమయమని చూచే కంసుడు ఆరని అలుకన్ ఆరని కోపమునది ఏమిటి? ఇదంతా జరుగుతున్నదని ఏం జరుగుతున్నా సరే దగ్గర పడింది శ్రవణ రంధ్రమున శబ్దంబు వినబడు అది హరిరవమని ఆలకించు అక్షి మార్గమున యెయ్యెడి చూడబడు అది హరిమూర్తి యా లోపునంచు చూచు తిరుగుచో దేహంబు త్రుణమైన సోకిన హరి కరాఘాతము అనుచు ఒక గడ్డిపరక వాడి శరీరాన్ని తాకితే నన్ను చంపడానికి వచ్చిన వాడేమో అన్నట్లు గ్రంథంబులేమైన గ్రంథంబు సోకిన హరి మాలికా గాంధముగుచు పలుకులెవ్వి అయిన పలుకుచో హరి పేరు పలుకబడియననుచు భ్రమసి పలుకు తలపులెట్టివైన తలచి తలపులు హరి తలంపులనుచు అలుగదలచు అప్పుడు దేవతలు నారదాది మునులు వీళ్లంతా కూడా ముక్కంటి శివుడితో సహా అక్కడికి వచ్చి దేవకీ దేవి గర్భమున అర్భకుడై ఉన్న పురుషోత్తముడు గర్భంలో అర్భకుడు అంటే ఇంకా శిశువుగా రావాలి ఇంకా time ఉన్నది. వీళ్లు మహాత్ములంతా కూడా స్త్రీ మంతులు గర్భంలో ఉండగా దేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. మనమంతా అని పిల్లవాడిని పుట్టిన తర్వాత వాడిని తిరుపతి తీసుకెళ్దాం అయిన తర్వాత మహాత్ముడిని ఇంటికి పిలుద్దాం అప్పుడు ఇదిగో మా మనవడు మనవరాలు పుట్టింది నీకు మనవరాలు గాని మహాత్ముడికి కాదుగా కానీ ఇక నీ స్త్రీ గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుకి మహాత్ముడికి సంబంధం ఉంది. సమయంలో కనుక అటువంటి వారిని తీసుకువచ్చి ఆశీర్వచనం చేయించుకున్నట్లయితే లోపల జీవుడికి ఉన్నటువంటి అనేక పాప కర్మలన్నీ నశించిపోతాయి. ఉత్తరా గర్భంలో చూసాం మనం దాని వల్లనే పరీక్షిత్ మహారాజు వచ్చాడు. పరీక్షిత్ మహారాజు పరమ భాగవతోత్తముడుగా వచ్చాడు. వాళ్లు అంటున్నారు మనం స్వామిని అన్నట్లే ఇవాళ మనమంతా ఎలా స్వామిని గురించి అనుకుంటూ ఉన్నామో ఆనాడు దేవతలంతా కూడా గర్భస్థ శిశువుని చాలా అందంగా ఉంటుంది స్వామితో సమన్వయం ఏం తేడా ఉండదు. ఇవాళ స్వామిని గురించి మనం ఏమంటాం పుట్టుకే లేని పుట్టపర్తి స్వామికి పుట్టు పండుగ ఉన్నదా? స్వామి నోటి మీంచి వచ్చింది. నాకసలు పుట్టుకే లేదు దాని పుట్టిన చోటును పుట్టపర్తి అన్నారు బానే ఉంది మళ్లీ నా పుట్టు పండగ ఏమిటి అంటున్నారు మూడు కానీ పుట్టు మాత్రం వదల్లే వదల్లేదు గనుకనే ఆయన మనకు కనపడ్డారు అది. పుట్టపర్తి అంటే పుట్టు apart ఇస్ పుట్టపర్తి కదా ని పక్కన పెట్టాలి పుట్ that apa apart ఇది పుట్టపర్తి అది. పుట్టులేని నీకు అభవం పుట్టుట క్రీడయా కాక అసలు పుట్టటం అనేది నీకు ఆట కదా పుట్టుటే యట్టనుడుం భవాది దశలల్ల జీవులయందు అవిద్యత చుట్టుచు నుండు గాని నిను చుట్టినదింబలే సొంతనుండియున్ చుట్టగలేని తత్క్రియల చొక్కని ఒక్కటి నవ్వుదు ఈశ్వరా అని అంటూ మనకోసం దేవకీ గర్భంలో ఉన్నటువంటి పరమాత్మకి ఆయన పూర్వాన్ని జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి స్మృతికి తీసుకువస్తున్నారు. స్మృతి ఏమిటంటే గురుపాఠీ నమవై మత్స్యావతారం గురుపాఠీ నమవై జలగ్రహమై కూర్మమై మత్స్యమై కోలంబవై వరాహమై శ్రీ శ్రీ నృకేసరివై నరసింహ స్వరూపమై భిక్షకుడవై వామనావతారం ఎత్తి హయా ననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు ముక్కెదను ఇలా భారంబు వారింపవే. అయ్యా నువ్వు ఎలాగో వస్తున్నావ్ నీకీ ప్రదేశం కొత్త కాదు ప్రపంచం కొత్త కాదు శ్రీ మత్స్య కూర్మ వరాహ వటు నరసింహావతారాలు ఎత్తు వచ్చావ్ వచ్చినప్పుడల్లా భూభారాన్ని నువ్వు తగ్గిస్తూ వచ్చావ్ కాపాడుతూ వచ్చావ్ ఇప్పుడు కూడా నువ్వు అట్లాగే రావయ్యా అని అడుగుతున్నారు. ముచ్చిని యున్నది లోకము లోకం బాగా చెడిపోయినది ఇచ్చలు కంసాది ఖలులు మిడ్డయులు మచ్చిక కావల గవలయు విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా.టైం వచ్చిందయ్యా తల్లి గర్భం విడిచి బయటకు రమ్మనమని అన్నారు అని దేవకీ దేవికి చెప్తున్నారు దేవ రహస్యాలన్నీ కూడా ఈశ్వరమ్మని ఆవిడ భావి దగ్గర కథ మీ అందరికీ తెలుసు అది చెప్పక్కర్లే స్వామి ఎలా వచ్చారు ఆవిడ గర్భంలోకి ఎలా ప్రవేశించారు నీలి రంగు బాలు ఎలా వచ్చి ప్రవేశించిందంతా మనకు కంటోపాఖ్యానం ఆమెను అడిగారు సమయంలో నీకేమనిపించింది అని నాకేం తెలియదయ్యా అని ఆమెకి తెలిసేట్లు ఉంచుతారా ఆమెకేం తెలియదు గానీ ఆయన పుట్టిన తర్వాత ప్రపంచమంతా ఆయన్ని దేవుడు దేవుడు అంటున్నప్పుడు నా పిల్లవాడు దేవుడా అని అమాయకంగా అనుకున్నది ఆవిడ అమాయకత్వంతోనే ఆయన్ని అడిగింది నిన్ను అందరూ దేవుడు దేవుడు అంటున్నారు నాకు కూడా నమ్మకం కలిగింది నేను పోయే వేళ మాత్రం నా దగ్గర ఉండు నువ్వు అన్నది అన్నీ నెరవేర్చారు స్వామి అందుకనే దేవతలంతా తల్లి గర్భం దేవకీ దేవిని అడుగుతున్నారు చెప్తున్నారు తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడు ఉన్నవాడు ప్రధాన పురుషుడున్నాడు మూలమైన శ్రీ మహావిష్ణువే ఉన్నాడక్కడ ఎల్లి పుట్టెడి రేపు పుట్టబోతున్నాడు టైం కూడా చెప్పారు కంసుచే భయమింత లేదు ఏం భయపడకు ఆయన పుడతాడు కానీ కంసుడి వల్ల భయం లేదు నిజంబు సత్యం మాకు ఎల్లవారికి భద్రమయ్యెడు దేవతలు చెప్తున్నారు నీ గర్భం నుంచి విడివిడి శిశువు గనుక బయటకు వచ్చినట్లయితే మా వంటి వారికందరికీ కూడా అభయప్రదానమది ఇంక నీ కడుపు ఎప్పుడున్ చల్లగావలే యాదవావళి సంతసంబున పొసంగగన్ అమ్మ కడుపు చల్లగా అంటారు అదే ఆశీర్వచనం చేశాడు దేవతలు ఏం నీ కడుపు చల్లగా ఉంటుంది ఎందుకంటే పరమాత్మే వస్తున్నాడు ప్రధాన పురుషుడు గర్భంలో ఉన్నాడు అని ఈశాన బ్రహ్మల మున్నిడుకొని వాళ్ళు వెళ్లిపోయినారు ఆశీర్వచనం ఇచ్చి వెళ్లిపోయినారు వెళ్లిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు పుట్టాలి శ్రీకృష్ణుడు పుట్టాడు అంటే పుట్టాడు పుట్టినప్పుడు ఏమైందో గనుక చెప్పుకుంటే ఇవాళ కృష్ణుడు వచ్చినట్టు లెక్క కృష్ణుడు వస్తాడు రమ్మనన్నారు తల్లికి చెప్పారు ఆయన పరిస్థితి ఏమిటో లోపల ఉన్నవాడు ఎటువంటి వాడో చెప్పారు అంతా బాగుంది స్వచ్ఛంబులై పొంగ జలరాసులేడును ఏడు సముద్రాలు ఒక్కసారి ఉప్పొంగినాయట కలఘోషణముల మేఘంబులురినే గ్రహతారకలతోడ గమగమనంబు రాజిల్లే దిక్కులు మెక్కీలి తెలివి దాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోనానలంబు చెందన్ దివెలిగే కొరకులు కమలాళి గులములై సిరి నొప్పె ప్రవిమల తోయలై పారెనదును నరపుర గ్రామ ఘోషయై వసుధ యొప్పె విహగ రవ పుష్ప ఫలములు వెలసె వనము అలరు సోనలు కురిసిరి అయ్యమరవరులు దేవదేవుని దేవకీ దేవి కనగా దేవకీ దేవి గర్భంలో నుంచి తల్లి తన కడుపున పుట్టినటువంటి బిడ్డను చూసినటువంటి వేళ సప్త సముద్రాలు పొంగినాయట మేఘాలు మంగళ వాద్యాలు వాయించినాయట ఆకాశంలో నుంచి ఎక్కడి నుంచో ఒక చల్లని మలయ మారుతాలను కూడా వీచినాయట ఇవన్నీ కూడా శుభ లక్షణాలు పరమాత్మ అదే దుర్యోధనుడు పూస్-- పుడితే నక్కలు కూసినయ్ సముద్రాలు వెనక్కి వెళ్లిపోయినయ్ అది కూడా ఉంది భారతంలో కానీ పరమాత్మ పుట్టినప్పుడు మొగ్గలన్నీ ఒక్కసారి విచ్చుకున్నాయట విచ్చుకున్న మొగ్గలన్నీ భరింపరాని తేనలన్నీ తేనె వాకలై ప్రవహించినాయట అంటే ప్రపంచంలో మనందరికీ ఆనందం కలుగుతుందో అంత ఆనందము కృష్ణాగమనంతో జరిగింది పాడిరి గంధర్వోత్తములు అందరూ గంధర్వులు పాడలే గంధర్వోత్తములు పాడారు అక్కడ రాడిరి రంభాది కాంతలు అంతకు ముందు రంభాది కాంతలంతా ఇంద్రియాలకు లోబడి నాట్యం చేశారు ఇవాళ శ్రీకృష్ణుడు అందుకనే జీవితమంతా కూడా నిజానికి కృష్ణ సంగీతమే మానవ జీవితం ఉదాత్త అనుదాత్త స్థాయిలు రెండు ఉంటాయి ఉదాత్తం ఏర్పడింది అనుదాత్తం తప్పదు సంగీతంలో రెండు ప్రధానం ఒకే ఉదాత్త స్థాయిలో సంగీతం పాడినే అది సొక్కదు అనుదాత్తంలో పాడితే ఎక్కదు అది కాబట్టి అది ఉదాత్త ఉండాలి అనుదాత్త ఉండాలి ఎక్కాలి దిగాలి గెలవాలి ఓడాలి పుట్టాలి పోవాలి ఎంత హాయి కదా పుట్టాలి అంటే ఆనందం పోవాలి అంటే భయం ఏమిటి అసలు పుట్టిననాడు ఎంత ఆనందం ఉన్నదో శరీరం వదిలిపెట్టిన నాడు కూడా అంత ఆనందంగా ఉండాలి జీవుడు అది స్థితప్రజ్ఞ అది జ్ఞానాధిక్యమైన స్థాయి కులుడిరి సిద్ధులు భయముల వీడిరి చారణలు మొరసె వేల్పుల భేరుల్ వేల్పులు దేవతలంతా కూడా అద్భుతంగా భేరి వాయించారట అప్పుడు ఒక చల్లని దృశ్యం చూడండి సుతుకనే దేవకి సుతుకనే దేవకి కొడుకును చూసింది ఆమె నడువే అతి శుభగతి తారలు గృహంబులుండన్ కృష్ణుడు పుట్టినటువంటి వేళ తారకా గ్రహాలన్నీ కూడా ఎవరి ప్లేస్ లో అవి అక్కడున్నాయట ఏం మార్పు లేకుండా ఎట్లా ఉన్నాయి అంటే శ్రీకృష్ణ అవతారంలో తమ పాత్ర ఏమిటో వినటానికి నిల్చునున్నాయి అవి.మాం ఏం చేయాలి ఎవరి మీదకి వెళ్ళాలి ఎవరి మీదకి వెళ్ళకూడదు ఆయన ఆజ్ఞాపించాలి అలా కనురెప్ప తెరిచి గనుక వాళ్ళని చూస్తే గ్రహాలన్నీ కూడా కృష్ణావతారం అంతా సాగించాలి. దితిసుత నిరాకరిష్ణున్ శ్రీతపద నాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్ ఆయన ఎలా ఉన్నాడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా తర్వాత తర్వాత ఆయన ఏం రాలే ఏదీ ఆభరణాలు వేసుకొని. దేవకీ దేవిని దేవకీ దేవి తన గర్భం నుంచి విడివడిన అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసినప్పుడు పరమాత్మ యొక్క దేహం శిశువుగా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నది జనధరదేహు అజానుచతుర్భాహు అజానువులున్నాయ్ మోకాళ్ళ వరకు అంటే అటువంటి బాహువులున్నాయట నీలవర్ణంలో ఉన్నాడట ఆయన. సరసీరుహాక్షు విశాలవక్షు చారు కదగదా శంఖచక్ర పద్మవిలాసు కంట కౌస్తుభమణికంతి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంచనాంచిత విహారు శ్రీకృష్ణుడి యొక్క శ్రీవత్సమే ఇవాళ స్వామి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ గమనించండి దేహాన్ని అది నీలవర్ణమే అప్పుడప్పుడు మనకోసం గౌరవర్ణంలో కనిపిస్తుంది స్వామి ఇవాళ కాదు గాని చూడగలిగినట్లయితే రోజుల్లో నడిచి వచ్చేటువంటి వేళ తలుపు తీసుకొని మన దాకా వచ్చేప్పటికి ఎన్ని రంగులున్నాయో అన్ని రంగుల్లో దేహం కనబడేది ఒక్కోళ్ళకి ఒక్క దేహం ఒక్కో రంగుగా ఇది అతి విచిత్రమైనటువంటి సన్నివేశం ఉంటే ఒక రంగు ఉండాలి either this or that అంటామే అట్లా కాదు it can be either it can be both it can be many it can be anything and everything కాబట్టి దర్శనంతో ఉన్నాడు ఈయన కూడా. శ్రీవత్స లాంచనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయిత కుంతల వాటు వైడూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేంద్రు రుచిజాలు చక్కని పూర్ణమైనటువంటి పౌర్ణమి నాటి చందమామ తన పక్కన పడుకున్నాడా తన పక్కలో ఉన్నాడా అన్నట్టున్నాడట. భక్తలోక పాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి చూడటం వేరు తిలకించటం వేరు చూడటం అంటే ఊరికే దాన్ని వస్తువును చూడటం తిలకించి మనసుతో హృదయంతో చూడటం దాని పేరు తిలకించటం స్వామిని చూసి వచ్చామా తిలకించామా అంటే కొన్నేళ్ళు చూసి వచ్చాం అంతే తిలకించిన వాడు ఎవరూ లేడు తిలకించిన తర్వాత ఏం చేశా చేయాలంటే దర్శించాలి దర్శించి చూచి తిలకించి దర్శించి మూడు స్థాయి అయిన తర్వాత అంతరంగ దర్శనం చేసుకోవాలి అంతరంగ దర్శనానికే ఇవాళ స్వామి అందరినీ సిద్ధం చేస్తున్నారు ఆయనేదో రావటం లేదు కాలికి హారతి ఇవన్నీ ఇచ్చి వ్యర్థమైన మాటలు కాదు ఆయనే ఆయనే చెప్పారుగా చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి అన్నను బ్రహ్మ వాళ్ళభ్యమది బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలంబు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు సభయు బ్రహ్మ సత్యమును తెలుపు సాయి బ్రహ్మ అన్నారు అది అంతా నేనే బ్రహ్మమే అనేక రూపాలుగా ఉన్నది గనుక ఇక్కడ కూడా ఆయన తిలకించి తిలకించిన తర్వాత ఆమెకి పులకించి పులక గలిగింది రోమాంచితం అయింది. తల్లికైనా బిడ్డను కన్నప్పుడు సహజంగానే ఆనందం కలుగుతుంది ఇంత అందమైన బిడ్డని గంటే ఆనందానికి ఒక అవధి ఎక్కడున్నది లేదు కదా శోజ్యమంది నేను ఇటువంటి వాడిని కన్నానా అని మళ్ళీ మాయలో ఆశ్చర్యపోయి ఉబ్బి ఇటువంటి వాడిని కన్నాను కదా అని అమితంగా ఉబ్బిపోయి నేను కదా ఇటువంటి వాడికి తల్లిని అయినాను అని ఎన్ని భావలో చూడండి. చలరేగి ఈడ కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడు అని ఆనందం కలిగి వసుదేవుడు చహించే ఇటువంటి బిడ్డని కన్నాడు అన్నటువంటి దేవకి యొక్క చూపులను చూసి వసుదేవుడికి కూడా ఒక ఆనందం కలిగింది. ఇక్కడ ఆపుదాం ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇవాళ పుట్టాలి పుట్టాడు ఆయన చక్కగా ఎవరికోసం పుట్టాడు అంటే కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై పుట్టాడు శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకు వైభవాన్ని వర్ణిస్తున్నాడు నువ్వే కాదయ్యా ఉత్తరా గర్భంలో కృష్ణుడు నన్ను రక్షించాడని మీ తాత ముత్తాతలంతా కథలు చెప్పారే అసలు శ్రీకృష్ణుడు దేవకి గర్భంలోనే ఇలా ఉన్నాడు దేవతలంతా వచ్చి ఆయన ముందు నుంచొని కైవారం చేశారు స్తుతించారు ఎట్లాగైతే విష్ణు లోకంలో పురుషసూక్తం చదివారో ఇక్కడ దేవకి గర్భంలో ఉన్నప్పుడు కూడా దేవతలంతా వచ్చి పురుషసూక్తం చదివారు పురుషసూక్తమే కాదు శ్రీసూక్తం కూడా చదివారు ఎందుకని అంటే కృష్ణుడు వచ్చి శ్రీ ని ఇవ్వాలి సంపదను ఇవ్వాలి శ్రీసూక్తం చదవండి కష్టాలు పోయి అప్పులు పోతాయి అది కాదు శ్రీసూక్తం చదివితే జ్ఞానం వస్తుంది అని అర్థం అప్పులకీనూ శ్లోకాలే సంబంధం లేదు అప్పులు అప్పులే తప్పులు తప్పులే ఒప్పులు ఒప్పులే మనకున్నటువంటి రాశి అనుభవాల కుప్పలు కుప్పలే అది కాబట్టి వీటన్నింటినీ కూడా మనం వదులుచుకునేటువంటి ఒక అధ్యాత్మ స్థాయిలోకి వెళ్ళటానికి శ్రీకృష్ణ పరమాత్మ దివ్యా ఆగమనాన్ని శుకదేవుడు వైభవోపేతంగా దేవకీ దేవి చూసింది అన్నప్పుడు అటువంటి బాలకుడిని మనం కూడా చూడగలిగాం రాసింది ఎవరంటే మరి వేదవ్యాసులవారు సత్యాన్ని ఆయన అక్షర బద్ధం చేశాడు అటువంటి పూర్ణమైనటువంటి స్థితిలో ఇవాళకంసుడికి ఏడుగురు సరే పోయినారు. ఎనిమిదోది అష్టన గర్భము. ఈయన శ్రీకృష్ణుడు దాని ముందు కథ అంతా అది flashback లో చెప్తాడు. భాగవతం కూడా చాలా గమ్మత్తుగా screenplay నడుపుతాడు. ఊరికే అట్లా కథ చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ దేవకీ వసుదేవులకు హంసానంది. ఎందుకు హంసానంది అంటే వాళ్ళు పరమాత్మకి తల్లిదండ్రులు అయినారు. సుతాప తృష్ణి కాలంలో ఒకసారి, కశ్యప అదితుల కాలంలో ఒకసారి, మళ్ళీ ఇదిగో దేవకీ వసుదేవుల కాలంలో ఒకసారి. ఇది మూడవ సారి. ఇక్కడ శ్రీకృష్ణుడు నిజరూప దర్శనం ఇచ్చాడు ముందు ఈమెకి. నిజరూప దర్శనం ఎలా ఇచ్చాడు అంటే ఇప్పుడు వర్ణించినటువంటి కౌస్తుభ మణిహారంతో సహా దర్శనం ఇచ్చాడు. ఏమిటి ఇటువంటి వాడు పుట్టాడు, ఇట్లా కూడా పుడతాడు అని మన-- సామాన్య స్త్రీ కదా! కానీ దేవతలు వచ్చి చెప్పారు లోపల ఉన్నటువంటి వాడు పరమాత్మ అని. కనుక దేవకికి హంసానంది కలిగింది. దేవకినీ, బిడ్డనీ చూసిన వంశుడికి హంసానంది. వసుదేవుడికి. అంతే కాదు, ఇటువంటి పరమాత్మ అవని మీదికి వచ్చినందుకు త-- భూదేవి, గోవులు, బ్రాహ్మణులు, సదాచార సంపన్నులు అయినటువంటి వారందరికీ హంసానంది. ఇక సర్వ జగత్తుకి హంసానంది. ఒక్క కంసుడికి మినహా. కానీ కంసుడికి కూడా ఇంకా తెలీదు. వాడు కూడా ఒక ఆనందంలో ఉన్నాడు. ఎందుకు ఆనందంలో ఉన్నాడు అంటే, అది రేపు చెప్పుకోవాలి. వాడి ఆనందం అంతా ఏంటంటే కొడుకు పుట్టలేదుగా! యోగమాయగా కనిపించింది. అప్పుడు దేవకీ దేవి ఏం మాట్లాడిందో మనం విచారణ గనక చేసినట్లయితే, ఎందుకు చంపలేదు, ఎందుకు వాడు కూడా ఆనందం పొందాడు అనటానికి విచారణ మనం రేపు పూర్ణం చేసుకుందాం. ఇవాళ హంసానంది రాగంతో సత్య సాయి భగవానుడికి కూడా మనం హంసానంది. ఆయన అనుగ్రహించినటువంటి హంసానందిలో మన చిజ్జడ గ్రంథులన్నీ మేల్కొనాలి. గ్రంథి భేదనం జరగాలి. ఆనంద సానందమైనటువంటి ఆనంద తారక స్థితిలోకి సర్వ జీవులను నడిపించేటువంటి పరమాత్మ మనకు పూర్ణమైనటువంటి ఆనందాన్ని, పూర్ణ ఆయుష్షుని, పూర్ణ ఆరోగ్యాన్ని, ఎందుకని? ఇందాక చెప్పాడు. దేవతలంతా మీరు పుట్టాలి అంటే హరి పూజ కోసం పుట్టండి అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అదే కాలం. ఇవాళ మన-- తర్వాత మన పిల్లలు ఎందుకు పుట్టాలి అని అంటే సాయి సేవ కోసం పుట్టాలి. సాయి పూజకు పుట్టాలి. అక్కడ సాయి అంటే సర్వదేవతా అతీత స్వరూపమైన ఒక చైతన్యాన్ని ఉద్దేశించినటువంటి భావన. అంటే భగవంతుని యందు భావం ఉండాలి. కాబట్టి పూర్ణమైనటువంటి ఆనందాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ హంసానందితో స్వామికి కైంకర్యం చేద్దాం. సాయిరాం.
SSSMC · audio

Bhagawata Navaneetham - 53

Home

Bhagawata Navaneetham - 53

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 27:11

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

    Now playing
  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67