No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శీల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబెన విహీనం యో మాహం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం సద్బ్రహ్మ స్వరూపాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఇట్లు ధరియించి గత కల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజ యోగ సమాధి జనితంబైన వన్హించే తక్షణంబు దగ్ధమయ్యే, దగ్ధమయ్యింది కూర్చున్నది యోగాగ్ని అమ్మవారికి ఒక సెకను కూడా పట్టదు తలచుకున్నది దాక్షాయణి నామంతో నేను మళ్ళి నా భర్త దగ్గరికి వెళ్ళకూడదు ఈ పాపమంతా కైలాసం దాకా పట్టుకెళ్లకూడదు అని అనుకున్నదే ఈ శరీరాన్ని ఆ అక్కడికక్కడే దహయతి ఇతి దేహః శరియతి ఇతి శరీరః రెండు శరీరం అని దీనికి ఎందుకు పేరు అంటే మార్పు చెందుతుంది గనుక బాల్యం చూస్తాం కౌమారం చూస్తాం యవ్వనం చూస్తాం మధ్య వయస్సు దాటుతాం వృద్ధాప్యానికి వస్తాం మనకు తెలియకుండానే మార్పు చెందుతుంది గనుక దీనికి శరీరం అని పేరు దహ్యతి ఇతి దేహః నువ్వు ఎన్నేళ్ళు వంద ఏళ్ళు ఉండు రెండు వందల ఏళ్ళు ఉండు ఏదో రోజు ఈ బాడీని వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత దీన్ని తగలబెట్టాలి దీన్ని దహనం చేయాలి కాబట్టి దీనికి దేహము అని పేరు పెట్టింది కాబట్టి ఆ దేహం అన్నా శరీరం అన్నా ఈ రెండు దీనికి సంబంధించినవి అప్పుడు రుద్ర గణాలన్నీ కూడా విధ్వంసం చేసినయి. ఆ విధ్వంసం చేస్తే అక్కడ భృగు మహర్షి వాళ్ళంతా ఎవరైతే శివుని నింద చేశారో చూడండి భగవంతుని యందు భక్తి ఉందా లేదా నమ్మకం ఉందా లేదా పక్కన పెడదాం భగవంతుడు ఉన్నాడో లేడోనో ఉన్నాడో లేడో నువ్వు తెలుసుకో ప్రపంచం అంతా దాంతో పేచీ లేదు కానీ గురువు నింద పరనింద దైవ నింద ఆత్మ నింద చేసుకోకూడదు ఆత్మ నింద అంటే నేను అధముడిని నేను పాపిని నేను పనికిరాని వాడిని నేను ఈ లోకంలో అనవసరంగా ఉన్నాను అది చేయకూడదట అలా చేస్తే మనల్ని మనం నిందించుకోవటం నీచత గురువు నింద నీకు ఎవరు బోధ చేశారో ఎవరు నీ ఉన్నతికి మార్గం చూపించారో అటువంటి గురువుని పరోక్షంగా కూడా అనకూడదట ఎందుకంటే ఒక దత్తాత్రేయ సాంప్రదాయంలో గురువుని భగవంతుని గనక నిందించినట్లయితే గురువు వచ్చి భగవంతునికి శబ్ది చెప్తాడట నా శిష్యుడు అజ్ఞాని క్షమించమని అసలు గురువుని నిందిస్తే దైవం రాడట కాబట్టి గురునింద చేయకూడదు పరనింద చేయకూడదు మనం కాని వాడిని ఎవడైనా పరాయిగా ఉన్నాడంటే వాడు ఉన్నాడు వాడిలో కూడా పరమాత్మని గనక చూడగలిగిన స్థాయికి ఎలితే మనం నిందించం కానీ ఏం చేస్తామంటే పరాయి వాడిని పరాయి వాడిగానే చూస్తాం కనుక నిందించడానికి అన్ని వెర్రిలా సిద్ధపడతాం ఆ నింద చేస్తూ చేస్తూ మనం యాతన పడిపోతాం మనకున్న ఎనర్జీ అంతా డ్రెయిన్ అయిపోతుంది అది చేయొద్దు అంటున్నాడు సరే ఇదంతా అయిపోయింది ప్రమథ గణాలు అన్నీ కూడా శివుడి దగ్గరికి వెళ్ళినయి మరి ఆయనకి చెప్పాలి ఆయనకి తెలియదని కాదు మనం స్వామికి ఉత్తరం రాసినట్టు అంతేగా ఆయనకి తెలియదా అనుకుంటూనే ఉత్తరం రాస్తాం కదా అలాగే వీళ్ళు కూడా వెళ్లారు వెళ్లి భవానీ పంచత్వం పంచత్వము అంటే మరణం భవానీ పంచత్వం భవుని యొక్క భార్య భవానీ పరమేశ్వరుడి యొక్క భార్య దాక్షాయణి ఆ క్షణంలో ప్రమథ గణాలు రుభు నామక దేవతలచే రుభు నామక దేవతలని ఆ వచ్చినటువంటి రుద్ర గణాలని రుభులుగా చెప్పబడ్డారు దానిని తర్వాత రుభు గీత అని ఒకటి ఉంది అష్టావక్ర గీత మన అవధూత గీత వశిష్ఠ గీత భగవద్గీత ఎట్లాగైతే ఉన్నాయో రుభు గీత అని ఒకటి ఉంది ఆ రుభువులంతా అది రుద్ర పారాయణంతో సమానం అయితే రుద్ర పారాయణం చేసిన ఫలితం రుభు గీతను చదివినా అది మనకు ఏర్పడుతుంది గనుక రుభు గీత ఎక్కడైనా ఉంటే చదవండి చదవాలి అంటే ఈ రోజు ఎప్పుడో చెప్పుకున్నాం ఎప్పుడైతే దాక్షాయణి తన మాట తన మాట విననందుకు ఆయనకు కోపం రాలే ఒక దుర్మార్గుడైన తండ్రి ఆవరణంలో తన భార్య తన సహభాగం నశించిందే అని పరమశివుడికి ఆయన మరి ఆయన రుద్రుడు ఆ రుద్రుడు కాబట్టి ఆ రుద్రత్వాన్ని ఆవాహన చేశాడు ఆయన చేసి ఆర్జుందు ఉగ్రుడు వీలకంఠుడు ఇహ దైత్యారాతి తపో తస్తోస్తుడై మాజ్యభోరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ ఆయనొక వికటాట్టహాసం చేశాడట విషాదంలో నుంచి కూడా ఒక నవ్వు వస్తుంది ఆ విషాదంలో వచ్చేటువంటి నవ్వు భయానకంగా ఉంటుంది ఎందుకనంటే తనలో ఏర్పడినటువంటి ఉద్విగ్నమైనటువంటి మనసుకు ఒక అవుట్ లెట్ కావాలి ఆ ఉద్విగ్న మనసాన్ని భగ్నం చేయాలి అంటే వికటాట్టహాసం చేశాడట శివుడు చేసి విద్యుద్వహ్ని శిఖా సముచ్చరుచున్ వెల్బందు చించజ్జటన్ ఒక పెద్ద విద్యుత్తు మెరుపుతీగ వలే ఉన్నటువంటి ఒక జడ ఒక్కసారి జట పీకాడట తన తలలో నుంచి సజ్జక్రోధముతోడ అప్పుడే పుట్టిన క్రోధం సజ్జస్పురణ అంటే అప్పుడే కలిగిన స్పురణ అలాగే ఇది ఈ క్రోధం ఎప్పటినుంచో ఉన్నది కాదు పగ దక్షుడి హృదయంలో ఉన్నది గాని పరమేశ్వర హృదయంలో దక్షుడి పట్ల ఆయనకి పగ లేదు పగ లేదు వగ లేదు ఆ రెండూ లేవు గనుకనే ఆయన పరమేశ్వరుడు అయినాడు ఇక్కడ అప్పుడే పుట్టిన ఈ సన్నివేశం వలన ఏర్పడినటువంటి క్రోధంతోపుచ్చి పై చం శ్మాశక్ర మధ్యంబు నన్ కైలాసంలో అట్లా జడని ఇలా వదిలిపెట్టాడట నేలమీదికి. ఆ నేలమీదికి వదిలిపెట్టగానే ఒకడు పుట్టుకొచ్చాడు. ఆ ఒకడు నిజానికి కాపాలికుడు వాడు. ఆ కాపాలిక స్వరూపం ఎట్లా వచ్చింది? శివుడికే కోపం వస్తే ఏమవుతుంది అంటే, అభ్రమ్ నిహాదభ్ర విబ్రామభ్రమభ్రమత్ కృన్నీవ దీర్ఘ శరీరమమర రజ్జజ్వలన దీప్తి జ్వాలికా జ్వాలజజ్వల్యమాన కేశములు వెలయ చండద్విదేశుండ దండాసుండాండ దుర్భండ సాహవ్రదృత హేతి సంగమోత్త వీక్షణత్తయ లోకవీక్షణజ్జుతి లోకవీక్షణత్తతి దురీక్షణము గాథ క్రకచటన కరాళదంష్ట్రలు వెలుంగ జనకపాలాశ్చివ వనమాలికలు తనర అఖిలలోక భయంచరుడగుచు వీరభద్రుడు దయించె మారురుద్రుడగుచు. రుద్రుడి యొక్క ప్రతిరూపమా మారురుద్రుడు అన్నట్టుగా వాడు పుట్టాడట. మూడు కళ్ళు కూడా మూడు లోకాలని నిప్పంటించేట్లుగా ఉన్నాయట. మరి ఆయన మూడు కళ్ళ వాడు కదు. రెండు కళ్ళు సమానంగా ఉంటే ఒకటేమో ఎగుడుదిగుడు అది. ఆ ఎగుడుదిగుడు ఇది మా లోకం ఇది. గోలోకం తెలుసు స్వామి అంటారు మీరేదో గోలోకంలో ఉన్నవాళ్లంతా హాయిగా వెళతానంటే భూలోకానికి పంపాను, భూలోకంలో ఉన్నవాళ్లంతా మా లోకంలో పడిపోతున్నారేమి అన్నారు. మా లోకం అంటే మాయా లోకం అది. భూలోకం అంటే భరించవలసిన లోకం. గోలోకం అంటే జ్ఞాన లోకం. గో అంటే జ్ఞానం. కాబట్టి అటువంటి ఆ వీరభద్రుడు మారురుద్రుడై పుట్టాడట. పుట్టగానే వాడు అడిగాడు ఏం చేయమంటావయ్యా అన్నాడు. సరసభ వృత్తి అట్లరుగు సైన్య పదాహత పాద ధూళి ధూసరిత కుబేర దిక్తటము సభ్యులు దక్షుడు జూచి ఎట్టి భీకరతను అంచనాంచు తమము గాదుర చెప్ప తలంబనుచు నివ్వెరపడి పల్లకిరి ఆత్మల వివేక హీనత పొంది వెండియున్. వీడ ఎప్పుడైతే పుట్టాడో ఇదిగో దక్షుడి యొక్క అద్వరాన్ని యాగాన్ని ధ్వంసం చేయమన్నాడు శివుడు. ఎందుకంటే అమ్మవారే అక్కడ నశించింది గనుక అర్ధభాగం శాపం వలన యాగార్ధం వీళ్ళకి లభించదు. అమ్మవారు కూడా లేదు గనుక ఒకవేళ వాడు ఇచ్చిన ఆయన పుచ్చుకోబోయేది పావే. పుచ్చుకోడట పరమాత్మ. ఎందుకంటే ఆహుతి వేరు పూర్ణాహుతి వేరు. పూర్ణాహుతి ఎప్పుడు ఉంటుందంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నప్పుడే. ఇక్కడ అమ్మవారు ఈ క్షణాన లేదు గనుక శివుడన్నాడు ఆ యజ్ఞం పనికిరాదన్నాడు. అసలు శివుడు శివుడికి ఆహ్వానం పంపని యజ్ఞం యజ్ఞమే కాదు. అయినా ఇవన్నీ జరగాలి గనుక జరిగాయి. వెళ్ళాడు. ఈ దక్ష ప్రజాపతిని దగ్గరకు తీసుకున్నాడు. అందరిలోనూ పట్టుకున్నాడు ఆయన వీరభద్రుడు. వీరభద్రుడు పట్టుకునే పటికి వాడు అనుకున్నాడట ఆకాశంలో నుంచి ఒక పిడుగు మన వాకిట్లో పడి ఆ పిడుగులో నుంచి రజను ఏర్పడి ఇదంతా ఏదో హాహాకారం అవుతున్నదంటే ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క లక్ష వీరభద్రులు పుట్టారట. ఒక లక్ష భావరులుగా పుట్టినయ్. ఆ లక్ష భావరులతో పుట్టినటువంటి రుద్రులంతా కూడా ఆ యజ్ఞాన్నంతా పూర్ణం చేసేశారు. పూర్ణం అంటే నాశనం చేశారు. ఈ ధూళి పుట్టుటకు ఏ ఏది హేతువో విలయ సమీరము ఆ పొల యదిప్పుడు ప్రాచీన వర్విహిధరాపతి మహితోగ్ర శాసనుడిప్పుడు రాజ్యంబు సేయ చోర సంఘములకు రారాదు మరి దోగనాళి రాకకు సమయంబు కాదు కావున ఇప్పుడు కల్పావసానంబు కాపోలు అటు కాక యున్న ఇట్టి అవుత్పాతిక రజము ఎందేని కలదే. ఉత్పాతం జరుగుతుందా? ఇదేం కల్పాంతం కాదు. అవునేమో కల్పాంతం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయేమో మనం అనుకుంటాం. రోజూ పేపర్ చూడగానే పేపర్ మానేద్దాం అనిపిస్తుంది. కానీ మర్నాడు పొద్దున్నే రాకపోతే దిగులు వేస్తుంది. చూశారా విచిత్రం. ఏముంటుంది ఆ పేపర్లో అంటే ఏం ఉండదు. ఇటువంటి ప్రపంచంలోనా మనం కూడా బతుకుతున్నాం? మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నామా? దాని ఈ మహా పాపంలో మనం కూడా భాగస్వాములం అవుతున్నామా? అని ఒక స్పృహ ఒక బాధ కలిగినా మళ్ళీ లోకరీతిలో ఏం జరుగుతుందో ఏం జరుగుతున్నదో అనేటువంటి ఒక అజ్ఞాన పూరితమైనటువంటి భావన. కాబట్టి ఇవన్నీ ఇట్లా ఎందుకు జరిగాయని అనుచు మనముల భయము విరచటి జనులు సురలు దక్షునంత ప్రసూతి ముఖ్యులైన భూసుర కాంతలు ఇట్లనిరి. ఓ రోజు దక్ష ప్రజాపతి భార్య పేరేమిటి అని ఓ ప్రశ్న వచ్చింది. అది ఎటువంటి సమయంలో అంటే ట్రైన్లో కుడి కాలుంది నేల మీద ప్లాట్ఫారం మీద ఎడం కాలుంది. పుటపర్తి నుంచి ఫోన్ వచ్చింది. దక్ష ప్రజాపతి యొక్క భార్య పేరు ఏమిటి? అన్యైనా అని ఒక పేరుంది. ధారుణి అని రెండో పేరుంది. అసలు వేదవ్యాసుడు ఈయన ఆమె పేరు ప్రసూతి. దక్షుడి భార్య పేరు ప్రసూతి. అలాగే దశరథ మహారాజు భార్యలు ఎవరంటే టకటక చెప్పేస్తాం. జనకుడి భార్య ఎవరు అనగానే ఏమో ఆమె పాత్రే ఉండదు. ఆమె పేరు సుమేధ. ఆ పేర్లు కూడా చూడండి. ఈవిడ ఈ ప్రసూతి ఈ ప్రసూతి దక్షుడి భార్య మిగులున్నది పాపం ఆవిడ. తన కూతులు చూడగ నిజతనయను సతి అనపరాధ తడ పరీక్షై గొడవించిన యా దక్షుని ఘనపాప విపాకము ఇది యాతగు అనుచున్. వీడంతా కల్పాంతం అయిపోయింది ఏదోఆ ప్రళయం వచ్చేసిందని దక్షుడు మిగతా వాళ్ళంతా అనుకుంటే నిజమైన తన కూతురు పట్ల తన తండ్రి చూపించినటువంటి అనాదరవే ప్రళయంగా మారింది అన్నది ప్రసూతి. ఆ పేరు కూడా చూడండి ప్రసూతి అంటే ఏమిటి delivery ఇవాళ English లో కదా delivery కాదు ప్ర-సూతి సూతుడు అంటే సుతుడు సూతుడు కొడుకు సుతా అమ్మవారు ఇక ఆడపిల్ల అందరూ ఇక ముగ్గురు పిల్లలున్నారు సతీదేవితో పాటు ఇంకా ఇద్దరున్నారు కాబట్టి ఇవిడ ప్రసూతి ముగ్గురు మంచి పిల్లలకి జన్మనిచ్చినటువంటి ప్రసూతి అని అర్థం. తల్లి మంచిదే గాని తండ్రి చెడ్డవాడు ఏం చేస్తాం దక్షయజ్ఞం ఇలా అయిపోయింది. అయిపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మకంతా కూడా చెప్పారు ఎందుకు బ్రహ్మకి చెప్పారు అంటే అయ్యా ఈ సృష్టి విధ్వంసం లో ఇవాళ జరిగింది ఇది మీరు వీరంతా స్వస్థానాలకు వెళ్లారు అని చెప్తూ బ్రహ్మకి ఇంత నాశనం అయింది అంటే ఆయన అంత సృష్టి చేస్తాడు అని అర్థం. ఇది మనం ఒకసారి విచారణ చేశాం నిజంగా అలా జరుగుతుందా అని తత్వార్థ విచారణ గనక చేసినట్లయితే శృంగేరిలో శృంగేరి భారతీ స్వామి వారు శారదాదేవికి పూజ చేసుకుంటూ ఉన్నారు. పూజ చేసుకుంటూ ఉంటే ఆయన కుడివైపున కుంకుమ బస్తా ఉంది ఆ బస్తాలో నుంచి తీస్తున్నారు వేస్తున్నారు ఆయన మంచి ధ్యాన ముద్రలో ఉన్నారు చూస్తున్నటువంటి వారందరికీ దాంట్లో కుంకుమ నిండుకునే పరిస్థితి ఏర్పడింది. ఈయన ఆపకపోతే ఎట్లా దానిలో కుంకుమ లేకుండా అయిపోతుంది ఇంకా కొన్ని గ్రాములు మిగిలి ఉంది అనంగా వీళ్ళు చుట్టూ ఉన్న పరిచారకులంతా కూడా గందరగోళ పడిపోతున్నారు వారిని disturb చేయలేరు అయ్యా కుంకుమ నిండుకున్నది అని చెప్పలేరు ఈ ఈ పూటకి పూజ చాలు అనటానికి లేదు ఆయన ధ్యానంలో ఉన్నారు. ఆ last చిట్టచివరి ఆ few grams కుంకుమ అక్కడ ఉన్న సమయంలో అదే ధ్యాన ముద్రలో ఆయన చేతిని ఇట్లా అన్నారు. ఎంత ఖర్చు అయిపోయిందో అంత నిం నిండింది నిండుకున్నది కాస్త నిండింది. నిండయింది ఆయన పూజ ఇంకా కొనసాగించారు అంతా అయిపోయిన తర్వాత ఆ నది దాటి తుంగభద్రా నది దాటి తుంగ దాటి లోపలికి వెళ్తుంటే పరిచారకుడు నెమ్మదిగా అడిగాడు భయపడ్డాం ఇవాళ కుంకుమ బస్తా ఖాళీ అయిపోతుందేమో మళ్ళీ అప్పటికప్పుడు ఎలా తేవాలి ఎక్కడి నుంచి తేవాలి అని అనుకున్నాం ఇవాళ పరమాద్భుతం చూశాం మీరు చేసిన ఒక మహిమ అన్నారు. ఆయన నెమ్మదిగా ఒక మాటన్నారు ఇది చూశా ఆశ్చర్యపోతున్నారు మీరంతా జాగ్రద అవస్థలో ఒక రోజంతా గడిపి ఆదమరిచి హాయిగా నిద్ర పోతున్నటువంటి వేళ ఎంత సృష్టి జరిగిందో మళ్ళీ సూర్యోదయ పూర్వమే అంతా నింపుతున్నటువంటి అమ్మని దయను మీరు గమనించలేదా? ఎంత పోతున్నదో అంత ఇవ్వటం లేదా ఆవిడ అన్నీ ఇవ్వగలిగిన ఆమెకి మనకు కావలసిన కుంకుమ ఇవ్వలేదా? అని శృంగేరి భారతీ స్వామి వారు మహాత్ములు వాళ్ళందరూ కూడా జ్ఞానబోధ ఇట్లా ఈ రకంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి భాగవత నవనీతంలో ఇవాళ చిలికిన ఆ చిలుకుడులో మనం పొందిన వెన్న ఏమిటి అంటే మూడు ఉన్నాయి పరమేశ్వరుడి భార్యే పొరపాటు పడింది కదా అంటే పరమేశ్వరుడి భార్య తన తండ్రి వలన పొందినటువంటి మూడు దోషాలను కూడా శరీరాన్ని దహనం చేసుకున్నది అంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని కాదు. ఆ మూడు దోషాలని కూడా ఆవిడ అగ్నికి ఆహుతిని చేసేసింది ఆమె ఎప్పుడూ శుద్ధాత్మే. మనం మంచి తెల్ల చొక్కా వేసుకుని వచ్చాం పైనుంచి ఎవడో గులాల్ కొడితే మనమేం చేస్తాం? చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మార్చుకోగలిగింది తీర్చుకోగలిగింది అంటే తీర్చుకోవాలి లేకపోతే మూటగట్టి బట్టలు దాంట్లో పడేయాలి మనం దాన్ని వాడకూడదు. అమ్మవారు చేసింది అదే పని. ఈ ప్రపంచం అంతా కూడా మూడు దోషాలతో కూడి ఉంటుంది గనుక ప్రధానంగా విక్షేప దోషం, ఆవరణ దోషం, మల దోషం. ఈ మూడు దోషాలే మానవుడికి క్రోధాన్ని, అహంకారాన్ని, అసూయని, మాత్సర్యాన్ని, దాంబికాన్ని, ప్రగల్భాన్ని అన్ని వీడలా ఇస్తుంది. పరమాత్మ యందు ఎంత మనస్సు లగ్నమైయున్నా, ఎంత గాఢమైనటువంటి ప్రేమ ఆయన యందున్నా ఎప్పుడన్నా మన పని అవటంలో కొద్దిగా తేడాలు వస్తే పరమాత్మకి కావు అనటానికి సందేహించని మనసున్నది మన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడు ఆయన చూస్తాడు ఎప్పుడన్నా వీడు నన్ను వీడిపోయేటువంటిది వస్తుందా అని మనం ఆ పరీక్షలో మాత్రం ఓడిపోవటానికి వీలు లేదు. స్వామి ఎంత మనకు అభయమిచ్చినా మీరు నన్ను వీడినా నేను మిమ్మల్ని వీడను అన్నారు అది నిజమే కాని ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారు ఎప్పుడన్నా వీడు ఏదో నాలుగు పనులు అనుకున్నాడు ఈ పనులు కావటం లేదు గనుక వదిలిపెడతాడా వదిలిపెట్టడా అని. వదిలిపెట్టని వాడిని తన వాడిగా చేసుకుంటాడు ఆ బాధ్యతలు తన మీద వేసుకుంటాడు కాస్త అటూ ఇటూ ఉన్నవాడికి వాడిని కూడా అటూ ఇటూ ఉయ్యాల జంపాలా ఊపుతాడు. కేవలము ప్రాపంచికమైన కామ్యంతోనే గనక పరమాత్మను గనక కీర్తించినట్లయితే ఆ కామ్యం ఇస్తూ పోతూ ఉంటాడు. షిరిడి బాబా కూడా అదే అన్నారు మీరు అడుగుతూ ఉండండి నేను ఇస్తూ ఉంటా కానీ ఏదో ఒకరోజు మీ జీవితంలో కూడా రాకపోదు ఇంకా ఏమున్నాయి అడగటానికి అని ఆ క్షణంలో మీ పని ఆగుతుంది నా ఆట ప్రారంభమవుతుంది. ఆ ఆట ఏమిటంటే మీ నుంచి అన్నీ తీసుకుని మీకన్నీ కూర్చి కూర్చి ఇచ్చానే దానికి పదింతలుగా మీ నుంచి నేను తీసుకోవటం మొదలు పెడతా దానికి మీరు సిద్ధంగా ఉండండి అని. స్వామి కూడా అంతే మన స్వామి ఏం భిన్నం ఏం కాదుగా అదేగా ఆ షిరిడి సాయేగా స్వామి అయింది. ఈయన కూడా అంతే కోరుతూ ఉండండి తీరుస్తూ ఉంటారు ఆయనకేమీ ఏం భయం లేదు ఆయనకేం భయం లేదు ఎన్ని అడిగితే అన్నికానీ ఆయన అడగటం ప్రారంభించినప్పుడు ఆయన అడగవలసినవి అడుగుతారు. లోకోత్తరమైనటువంటి పనులు చేయమంటారు. లోకానికి హితకారమైనటువంటి పనులు చేయమంటారు. దానివలన చిత్తశుద్ధి, మనో నైర్మల్యం, నిర్మలత్వం, ఒక నిశ్చలత్వం, ఒక యోగత్వం, ఒక ఆధ్యాత్మికత్వం, ఇవన్నీ కూడా మనకు వనగూడాలి గనుక ఈ పూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్ళమని దాక్షాయణి చెప్తుంది. అందుకనే గురువు ఎంత మహాత్ముడు అయినప్పటికీ కూడా ఎప్పుడైనా నీ జీవితంలో నీ ఆత్మోన్నతి గనుక అడ్డుపడ్డట్లైతే ఆ గురువుని పక్కదారి తప్పించుకొని వెళ్ళిపొమ్మన్నారు ముందుకు. నీ దారి నువ్వు వెళ్ళమన్నారు. ఎందుకంటే గురువు పెడదారి పట్టిస్తాడా అంటే పట్టించడు. కానీ మనకు అక్కరలేదు. ఆ భావనను దాటి ఉత్తమోత్తముడైన ఇంకో గురువు మనల్ని కాచుకొని ఉంటాడు గనుక ఆ పూర్ణ స్థితిలోకి వెళ్ళాలని, అంతేకాకుండా జీవన ధర్మంలో, కుటుంబ వ్యవస్థలో, ఒక ధర్మంలో ప్రధానమైనటువంటిది అన్యోన్యత. అన్యోన్యత ఒక నమ్మకం మీద, పరిపూర్ణమైన విశ్వాసం మీద, conditions లేని ప్రేమ మీద, జీవితాన్ని మలచుకునేటువంటి దివ్య భావనా రీతుల మీద, ఉన్నదాంట్లోనే ఆనందాన్ని, పరమేశ్వరుడు అందరికీ ఒకే రకమైన జీవితం ఇవ్వడు. ఇస్తే అందరికీ ఒకే రకమైన జీవితం అనుకోండి ఘర్షణ ఏముంది అసలు? పోట్లాటేముంది? లేదు. కాబట్టి ఎవరి జీవితం వారిది. వారి వారి ప్రాకృత కర్మలను బట్టి, ప్రారబ్ధాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఒక designed, ఒక capsule లాగా జీవితం మనకివ్వబడుతుంది. ఆ ఇవ్వబడినటువంటి జీవితంలో నుంచి మన కర్మల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన బుద్ధి ద్వారా, మన విచక్షణ ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికి దాన్ని ప్రతిరోజూ కూడా మధనం చేస్తూ ఉండాలి. అందులో ఇద్దరే ఉండాలి. జీవితం వాళ్ళది, కుండ వాళ్ళది, కుండలో ఉన్న పాలు అంటే భాగం కూడా వాళ్ళది. పాలు అంటే రెండు అర్థాలున్నాయి. ఒకటి భాగం, రెండవది వారిది అని. దాన్ని వాళ్ళే చెలుక్కోవాలి, వాళ్ళే వెన్న తీసుకోవాలి, వాళ్ళే ఆరగించాలి. బాగా వెన్న వచ్చింది, మీరందరూ రండి వెన్న వ్రతం చేస్తామని ఎవరనరు. హాయిగా దీంట్లో ఏ అప్పచ్చులు చేద్దామని మొదలు పెడతారు. అట్లాగే పొందినదంతా తమదిగా తామే అనుభవించవలసి ఉన్నది గనుక కుటుంబ వ్యవస్థలో దాక్షాయణి ఒక గొప్ప భావన, ఒక గొప్ప నీతి, ఒక సందేశం ఒక్కటే. భార్యాభర్తలుగా మీరు ఏర్పరచుకున్నటువంటి సంసారాన్ని మీరు జాగ్రత్తగా, అన్యోన్యంగా, ప్రేమపూరితంగా, ఒక మధనం ద్వారా ఆ నవనీతాన్ని మీ అంతట మీరు పొందండి. మీరు ఆరగించండి. మీ ఆనందాన్ని పంచిపెట్టండి. అలాగే వెళ్ళవలసిన చోటికే వెళ్ళండి. ఉండవలసిన వారితోనే ఉండండి. కానీ ఆవరణ మల విక్షేప దోషాలతో పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ నిర్మలత్వాన్ని మాలిన్యం వైపు తీసుకుని వెళ్ళకండి. ఎందుకంటే మనం ఉన్నాం. పరమేశ్వరుడిని చూశాం. పరమేశ్వరుడితో మాట్లాడాం. పరమేశ్వరుడిని తాకాం. ఇందాక అనుకున్న మూడు మనకు స్వామి ఇచ్చారు. ఇచ్చిన మనం మళ్ళీ ఆవరణ దోషములోకి వెళ్ళకూడదు. ఆ ఆవరణ భావనావరణం కూడా కావచ్చు. అన్ని హింసల కంటే కూడా భావహింస చాలా గొప్పది. చాలా కఠినమైనది, ఘోరమైనది. అది కాకుండా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో పరమేశ్వరుడి యందు పూర్ణమైనటువంటి ఒక భక్తితో, అనన్య భక్తితో, అనన్యమైన, అన్యోన్యమైనటువంటి ప్రేమతో జీవితం కొనసాగించినట్లయితే, అమ్మవారు ఇలా వెళ్తున్నాను, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు అని అన్నప్పుడు అయ్యవారు చెప్పవలసినవి చెప్పారు. నాకే నిష్ఠురమాడాడు. నాతో కూడి ఉన్నావు గనుక నీకు గౌరవం వాడు ఇవ్వడు అని అన్నాడు. అన్నా కాదు నేను వెళ్ళాలన్నది. మళ్ళీ మా తండ్రి చేస్తాడా? అందులో వాజపేయ యజ్ఞం మామూలు యజ్ఞం కాదు. అది సత్రయాగం. సోమయాగం వేరు, సత్రయాగం వేరు. సోమయాగం ధ్యానం, సత్రయాగం భజన. ఇదిగో సత్సంగం సత్రయాగం. అందరం కలిసి చేసుకుంటాం. ఈ వాకిట కట్టిన తోరణానికి కూడా మనకు పొందిన, మనం పొందిన ఫలితం సమానమైన వాటా అది లభిస్తుంది, పొందుతుంది అది. కాబట్టి సత్రయాగానికి వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళితే అగౌరవం పొందుతావన్నాడు. అయినా స్త్రీ సహజమైనటువంటి ఒక భావన చేత, తన వారినందరినీ కలుసుకోవాలన్నటువంటి ఆతృత చేత, తన మనస్సును తాను చంపుకొని, అయ్యో భర్తకి ఎదురు చెప్పి వెళ్తున్నానే అని అనుకుంటూ కూడా వెళ్ళి, వెళ్ళి ఏమైందయ్యా అంటే, ఇదిగో జరిగింది. అలా జరగకూడదని తత్వార్థ విచారణలో అన్యోన్యమైనటువంటి అర్థనారీశ్వర తత్వంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఏది ఉండనివ్వండి వారిద్దరి మధ్య ఉండాలి. వారిద్దరే సమన్వయం చేసుకోవాలి. సంఘర్షణ లేని రీతిలో జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలి. జీవితం అంటే నడిపేది కాదు, గడిపేది కాదు. జీవితం అంటే జీవించేది. ఎలా జీవించేది? భగవంతుని యొక్క ప్రేమతో తడిసి, భగవంతుని యొక్క అనుగ్రహంతో పునీతమై, భగవంతుని యొక్క రక్షణలో సాగేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రస్థానమే అధ్యాత్మ ప్రయాణం కాబట్టి ఈ వీరభద్ర విజయం, ఎవడు ఆ వీరభద్రుడు అంటే శివాత్మకమైనటువంటి రౌద్రభావనే వీరభద్రుడు. మనలో కూడా ఒక్కొక్కసారి ప్రపంచాన్ని జయించే పని మనది కాదు. ప్రపంచం నుంచి ఓటమి కూడా మనం పొందకూడదు. ప్రపంచం మనల్ని ఓడిస్తే ఎట్లా? మనము గెలవాలి. కానీ ప్రపంచాన్ని మనం గెలవకూడదు. ఇది భారతీయ ఆత్మ. భారతీయ చరిత్రని ఎంత గమనించినా భారతదేశం ఎవరి మీదా యుద్ధం చేయలే. భారతదేశం మీదే యుద్ధాలు జరిగినాయి. ఈ, ఈ స్పష్టమైనటువంటి భావనని ఈ వీరభద్ర విజయంతో ఇవాళ మనం పూర్ణం చేద్దాం. చతుర్థ స్కంధం అంతా, నాలుగు గదులంతా కూడా అనేకమైన పౌరాణిక గాథలు. అందులో పృధువు, వేనుడు వీళ్ళ కథలన్నీ ఉన్నాయి. కానీ ఆ కథలన్నీ కూడా ఒక రాచరిక వ్యవస్థకి, ఒక ప్రభుత్వకి, ఒక పాలనకి, ఒక అధికారానికి, ఒక ఆభిజాత్యానికి పరిమితమైనటువంటి కథలు కాబట్టి అవి మనకి అక్కరలేవు గనుక వాటిని పరిహారం చేద్దాం. మనకేం కావాలో, ఏ తత్వ విచారణ చేసుకోవాలో అవే చేసుకోవాలి. రేపు ధ్రువోపాఖ్యానం. ధ్రువుడు మన కడుపున పుట్టినటువంటి బిడ్డ అటువంటి వాడిగా ఉండాలి. ధ్రువుడిగా, మార్కండేయుడిగా, మృత్యు భావనను జయించగలిగిన, లక్ష గమ్యాలు చేధించుకొని చేరగలిగినటువంటి ఉత్తమోత్తముడైనటువంటి బిడ్డ మన గర్భవాసాన పడాలని పరమేశ్వరుడిని అన్నివేళలా కోరుకోవాలి. అంతేగాని పున్నామ నరకం దాటించడానికి కొడుకు, కొడుకు కావాలి అంటే వాడు సన్మార్గుడైతే మనల్ని దాటించగలుగుతాడు. వాడికి అసలు మార్గమే కైనవాడు కడుపున గనుక పుట్టినట్లయితే ప్రయోజనం లేదు గనుక వ్యర్థమైన ఆలోచనలన్నీ చక్కగా వదిలిపెట్టి స్వామి అనుగ్రహించినటువంటి ఈ భాగవత నవనీత రసాయన కర్ణపేరమైనటువంటి ఈ శ్రవణ యోగాన్ని పరిపూర్ణంగా అనుభవించేటువంటి ఒక స్థితిని స్వామి అనంతకోటి గురు స్వరూపాలు మనకు దివ్యముగా అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ హంసానంది రాగు.
SSSMC · audio
Bhagawata Navaneetham - 32
Bhagawata Navaneetham - 32
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 25:41
More in this series