No transcript for this section.
గోవులకును బ్రాహ్మణులుకు దేవతలకు ఎల్లప్పుడు తెంపున పీడలు కావిన్చు పాప మానసము ఏవిధమున పుట్టకుండ నివారింతున్. పోయి పోయి ఒక బ్రాహ్మణుడిని హింస పెట్టానే అసలు హింస అనే చోట వేటకెళ్లానే ఫలానా చేశానే పరీక్షిత్ మహారాజు ఆలోచించుకుంటున్నాడు దీన్నుంచి నేను ఎట్లా బయటపడాలి దీనికి మార్గం ఏమిటి అని అంటే దామోదర పద భక్తిన్ కామాదుల గెలిచినవాడు కావున కరుణన్ భూమీసుడు అలుగుడయ్యే సామర్ధ్యము కలిగి దోష సంగిన్ శృంగిన్. అప్పుడు ఈ వృత్తాంతం అంతా వాడు చెప్తే కాసేపున్నాడు ఏం చేయబోతున్నావు అని వెంటనే పరీక్షిత్ మహారాజు యొక్క సంస్కారం అన్నింటికంటే కూడా చాలా భిన్నమైనది ఉదాత్తమైనది. ఆ రాచరిక చిహ్నాలన్నీ పక్కన పెట్టేశాడు వెంటనే. తులసీ సంయుత దైత్య చిత్ పద రజ స్తోత్రంబు కంఠన్ మహోజ్వలమై దిక్ కృతి సంఘ సంయుత జగత్ సౌభాగ్య సంధాయಿಯై కలిదోషావలి నెల్లబాపు దివి శబ్దంగా ప్రవాహంబు లోపలికింబోయి మరిష్యమానుడగుచు ప్రాయోపవేశంబు నన్. ప్రాయోపవేశం చేస్తానన్నాడు. ఈ ఏడు రోజులు అంటే నిజానికి సప్తజ్ఞాన భూమికలు అందుకోవాలి జీవుడు అందుకే ఆయనకు ఏడు రోజులు చెప్పారు. శుభేచ్ఛ, విచారణ, సంసక్తి, పదార్థ భావని ఇట్లా ఈ ఏడు సప్త స్థానాలు సప్త చక్రాలు జ్ఞాన భూమికలు దాటి జీవుడు మహోత్కృష్టమైనటువంటి బ్రహ్మపదానికి వెళ్ళాలి గనుక ఆ ఏడు రోజులు ఆ బ్రాహ్మణులందరినీ పిలిచాడు రాజులను పిలిచాడు అందరినీ కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకుని ఏడు రోజుల ప్రాయోపవేశానికి దీక్షకు ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే ప్రాయోపవేశం చేసినప్పుడు లోపల ఉన్నటువంటి అనేక అహంకారాలు అణిగిపోతాయి పోగొట్టుకుందాం అనుకునే వాడికి పెంచుకునే వాడికి ఏడు రోజుల్లో ఏ డెబ్బై రెట్లు పెరుగుతాయి అంతే. రెండోది శరీరమే తానుగా భావించిన స్థితి నుంచి తాను శరీరము మాత్రమే కాదనే భావనలోకి వస్తాడు ఇది రెండవది. ఇక మూడవది ఇందాక చెప్పుకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వరుని ముఖం అవుతాయి మూడవది. నాలుగవది హింసా ప్రవృత్తి ఒక సంస్కారం గనుక లోపల ఉన్నట్లయితే అది అహింసా ప్రవృత్తిగా మారుతుంది. అరిషడ్వర్గాలన్నీ కూడా హరిషడ్వర్గాలు అయిపోతాయి పరమేశ్వరాయత్తం అవుతాయి అలాగే వి విషయ వాంఛలన్నీ కూడా విష్ణు వాంఛలుగా మారతాయి. ఈ లోకం ఈ భూలోకం స్వామి అంటారుది అసలు మీరంతా కూడా గోలోకానికి చెందిన వాళ్లే గోలోకానికి చెందిన వాళ్ళు మరి ఏం కావాలని కోరుకున్నారో గాని భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చినా ప్రమాదం లేదు మాలోకంలోకి వెళ్తున్నారే అన్నారు స్వామి అది మా అంటే అజ్ఞానం గో అంటే జ్ఞానం మధ్యలో ఏందంటే భూ ఉన్నది భరించేది ఉన్నది గనుక ఇక్కడ ఆగాం అట మనం మన దారి గోలోకమా మాలోకమా అంటే మనది గోలోకం మాలోకం నుంచి దాటాలి ఆ మాయావరణం నుంచి దాటాలి గనుక ఆ ప్రాయోపవేశం వలన కలిగేటువంటి లాభాలు అన్నింటినీ తాను పొందుతూ నిశ్చితమైనటువంటి మరణాన్ని తాను ఏడు రోజుల్లో అనుభవించబోతున్నాడు గనుక ఏ రకమైన దుఃఖం లేకుండా విచారణ లేకుండా ప్రపంచం పట్ల అపేక్ష లేకుండా లాలస లేకుండా మోహ వ్యామోహ వ్యసనాలు లేకుండా పరీక్షిత్ మహారాజు సంస్థితుడు అయినాడు. ఆ సంస్థిత స్థితి చాలా ఉదాత్తమైనది. భీకరతర సంసార వ్యాకులతన్ విసిగి దేహ వర్జన గతి నాలోకించు నాకు తక్షక కాకోదర విషము ముక్తి కారణమయ్యెన్. మంచి మాటలు వింటూ వింటూ ఉన్నాడు ఎవరైనా సరే ఏమంటాం అంటే ఫలానా వాడేదో చేశాడు అందువల్ల నాకిదైంది అంటాం ఎవడు ఎవడికీ ఏం చేయడు జరగాల్సినవి జరిగిపోతూ ఉంటాయి. కానీ ముక్తికి మాత్రం ఎవడో కారణం ఉండాలి శరీరం పోవటానికి కూడా ఒక కారణం ఉండాలి మింద లేకుండా పొందిపోదు. ఏదో కారణం ఎలా పోయినాడు లోకం కాసేపు మళ్ళీ మాట్లాడుకోవటానికి అలా పోయినాడట పాపం అలా ఎందుకు పోయినాడు పోయినవాడు అయిగా పోయాడు ఉన్నవాళ్లంతా వాణ్ని గురించి ఏడుస్తున్నారు అది అదే చెప్తూ ఆ మాట అంటున్నాడు ఆయన. ఆ తక్షకుడు అనేటువంటి వాడి విషం నా ముక్తికి కారణమైంది కదా అంటున్నాడు ఆయన ఆ తక్షకుణ్ణి చంపండమో చేయమనో వీయ్యమనో అనటం లేదు. చుడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీద పాటలు. పోతన కూడా ఎంత హాయిగా రాస్తాడో చూడండి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి పరీక్షిత్ మహారాజు గారు పోతున్నారు పోతుర్-- అది అనకండి పోతా దాన్ని వదిలేయండి మీరు చేయవలసిన మూడు పనులున్నాయి. చుడుడు నా కళ్యాణము కళ్యాణం అంటే ముక్తి. పాడుడు గోవిందు మీద పాటలు దయతో పాడుడు హరిభక్తుల కథలు. ఎవరన్నా ఇక్కడ గనక డాన్స్ నేర్చిన వాళ్ళు ఉంటే పరమేశ్వరుని గురించి హరికథా గానం చేయమన్నాడు. అహములలోన ముక్తికే గగయిటటన్ ముక్తిధామానికి వెళ్ళే మార్గాలు మూడు ఉన్నాయి గనుక గోవింద నామస్మరణ చేయండి గోవిందుడి కథని ఆడండి పాడండి పరమేశ్వరుడి యొక్క భావంతో కూడండి ప్రాపంచిక ధావణులు వీడండి ఇదే చెప్పాడాయన. అమ్మా నిను జూచిన నరుబమ్మాయని ముక్తి కడకు పుచ్చువట కృపన్ లమ్మా నీ రూపముతో బ్రహ్మ నాకెదురి గంగ రమ్య తరంగ-ఆ దివిజ గంగని ఆకాశ గంగని ప్రార్థిస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి అమ్మా నీ దాకా నేను వెళ్లలేనేమో ఉన్న సమయం చాలా తక్కువున్నది ఏడు రోజులే ఉంది నువ్వే నా యందు ఉన్నటువంటి దయచేత నా వైపు నువ్వు ప్రవాహ వేగంతో రా అంటే ఇక్కడ గంగ అంటే దివిజ గంగ అంటే ఆకాశ గంగ అని మాత్రమే అర్థం కాదు గం అంటే మూలాధారం గ అంటే జ్ఞానం అది గంగ. గంగ గ సున్నా గ మళ్ళీ దాన్ని కాసేపు తిప్పి చదువుదా ఏమవుతుందో గంగ అంటే మూలాధారంలో ఉన్నవాడు గ జ్ఞానం దాకా వెళ్ళాలి జ్ఞాన యోగంలోకి వెళ్ళాలి. నేను జ్ఞాన యోగంలోకి వెళ్ళాను మా ఇంట్లో నేను ఉండను ఎక్కడికో వెళ్ళిపో అనకూడదట ఇక్కడ ఉండాలి. ఎందుకని ఎవరెస్ట్ ఎక్కాం భారతీయ జెండా పాతాం అక్కడి దాకా న్యూస్ వచ్చింది అక్కడే ఉంటున్నామా? పాతిన వాళ్ళంతా అక్కడ ఉన్నారా దిగి రావాలిగా. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా లోకరీతిలో నువ్వు ఇక్కడ జీవించాలి. ఇక్కడ కర్మకా--క-కలాపాలన్నీ నువ్వు కొనసాగించాలి. నీకు పరమేశ్వరుడు ఈ జీవితం ఇచ్చాడు గనుక దీనిని దీనిని ఆ కర్మానుబంధే మనుష్య లోకే ఆశయా బద్ధతయ లోకే కర్మణా బహు చింతయా అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనా ధారతో పరమేశ్వరుడు మనకిచ్చిన కర్మలు మనం చేయాలి. పరమేశ్వరుడితో కూడి ఉండి చేస్తే దానికి కర్మయోగం అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి పరీక్షిత్ మహారాజు కోరుతున్నది, ఇవాళ అడుగుతున్నది కూడా గంగాదేవిని అదే. నీ దాకా రాలేనేమోనమ్మా, నీవు నా వైపు రా అని అడుగుతున్నాడు. ఆ సమయంలో ఋషులంతా కూడా ఈ మాట అన్నారు వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి చెప్పాలి కదా ఆయనకి. క్షితినాథోత్తమ! నీ చరిత్రము మహా విచిత్రంబు. మీ తాతలు ఉగ్ర తపోధన్యులు. విష్ణు పార్శ్వ పదవిన్ కామించి రాజన్య శోభిత కోటీర మణి ప్రభాంవిత మహా పీఠంబు వర్జించురు ఉన్నతులై నీవు మహోన్నతుడువు కదా! నారాయణాధ్యాయివై. ఎంత అందమైనటువంటి ఆ ఋషుల వాక్కు చూడండి ఎట్లా ఉన్నదో వాళ్ళ భాష ఎట్లా ఉన్నదో. నువ్వు ఎవరివో తెలిసినా నీ తాతలు ముత్తాతలంతా ఇదే యాగంలో ఉన్నారయా. ఇదే భాగవతంలో ఉన్నారు భాగవతులై జీవించారు. భగవన్నామం తప్ప, భగవత్ శక్తి తప్ప, భగవత్ భావన తప్ప అన్యవరిగని వారి ఇంట పుట్టినటువంటి నీవు విష్ణుపా--విష్ణు పాదము యొక్క ఒక పార్శ్వాన్ని గ్రహించిన కారణంగా రాజన్య శోభిత కోటీర మణి ప్రభాంవిత మహా పీఠంబు అది బ్రహ్మపదం. ఆ బ్రహ్మ పదాన్ని కూడా ఇవాళ నీ కోసం సిద్ధం చేసి ఉంచారయా. నువ్వేం భయపడకు. నీవు మహోన్నతుడివి కదా! ఎందుకని అంటే నారాయణాధ్యాయివై. దేని అధ్యయనం చేశావ్ అంటే పరమేశ్వరుని గురించి నువ్వు అధ్యయనం చేశావ్. కనుక నువ్వు ముక్తుడివే ఇప్పటికే. మళ్ళీ నువ్వు బ్రహ్మపదం కొత్తది కనిపెట్టవలసింది లేదు. నువ్వు పొందేది లేదు. నీకంటే ముందు నీ తాత ముత్తాతలే ఇక్కడి నుంచి వెళ్లారు. కాబట్టి ఆ కోటీర మణి ప్రభా రాజితమైనటువంటి బ్రహ్మ పదంలో నీవు నిలకడ చెందువు గాక అన్నారు. వసుధాధీశ్వర! నీవు మత్స్య తనువున్ వర్జించి అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి నిశ్శోకమై, వ్యసనచ్ఛేదకమై, రజోరహితమై వర్తించు లోకంబు సర్వసమత్వంబున చేరునంతకు భవద్వాక్యంబులన్ విన్చు ఏ దశకుంభో వక చూచుచుండెదము నీ దివ్య ప్రభావంబునన్. ఏం చేస్తావంటే నువ్వు ఈ శరీరం వదిలిపెడతావు చూడు. వదిలిపెట్టిన తర్వాత నువ్వు తేజోమయమైనటువంటి శరీరంతో ఒకవైపు వెళ్తుంటావు చూడు. నీవు ఎట్లా వెళ్తున్నావో ఆ మార్గాన్ని మేము అందరమూ కాచుకొని చూస్తూ ఉంటాం. ఎందుకని అంటే నిశ్శోకమై ఉన్నది. తేజస్సుకు శోకం లేదు. దానికి బాధ లేదు, భయం లేదు, వ్యామోహం లేదు, వ్యసనం లేదు. వ్యసనచ్ఛేదకమై, ఏదన్నా ఎక్కడైనా గనక ఒక్క అణువు ఉన్నా దానిని విచ్ఛేదనం చేసేటువంటి రజోరహితమై దానికి రజస్సు లేదు. అంటుకున్నటువంటి ఏ రకమైన ధూళి లేదు. అందుకనే అవధూతల గురించిన విచారణ వచ్చినప్పుడు అమదానందము విమల ధామమై, వర్తమాన వర్తిత వ్యధాకారకమై, ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చారణమై, తమోరహిత తపోతత్వ తారకమై నిలుచు నీ జగతి నిర్మల నిశ్చల సచ్చరిత. ఆ అవధూత అట్ట నిలబడతాడట. వాడికి తమస్సు లేదు తపస్సు తప్ప. ధూళి లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. ఉన్నదంతా పూర్వం--పూర్ణమైనటువంటి సత్వగుణం మాత్రమే ఉంటుంది గనుక ఆ బ్రహ్మలోకం నువ్వు చేరే వరకు కూడా భవద్వాక్యములన్ వింటూ ఏ దశకంభో వక మేం ఎక్కడికి పోకుండా ఒకే ఒక మార్గం నువ్వు వెళుతున్నావో ఆ మార్గం మీద మా మనసును నిలబెట్టుకొని నీ దివ్య ప్రభావంతో మేం ఉంటాలనంటే పక్షపాత శూన్యంబులు, మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య ధిర్యంబులునైన భాషణంబులాడించుచూ మూడు లోకంబులకు అవ్వరిదైన సత్య లోకంబును మూర్తిమంతంబులై నగలుచున్న నిగమంబులు వేదాలు. తేరెల్లుతున్న ఋషులను చూచి భూవరుండు అంటే పరీక్షిత్ మహారాజు నారాయణ కథా శ్రవణ కుతూహలుండనైనాను అన్నాడు. నన్ను నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసు. ఇక మనం చేయవలసింది ఏంటంటే నారాయణ కథ, ఆ ప్రవచనాన్ని మనం వినాలి. శ్రవణ తేయంగా వినాలి. లోపల ఉన్నటువంటి అనేకానేకమైన వాసనలు నశించేట్లుగా ఉండాలి. మోహ విచ్ఛేదనం కావాలి. వ్యసనం పరిత్యజించాలి. దివ్యమైనటువంటి తేజఃపుంజమైనటువంటి కాంతితో అటువంటి దేహంతో నాదైనటువంటి నా స్వస్థానానికి నా వికుంఠ ధామానికి నేను వెళ్ళాలి. దాని పేరు బ్రహ్మపదం. ఇక నారాయణ కథ విందామా? అన్నాడు. ఇప్పటికి భాగవతం ఇప్పుడు పుట్టింది. అది.క్రైస్త పుట్టిన క్రిస్తన పుట్టిన మనం కృష్ణ అంటాం కదా foreigners క్రిస్తన అంటారు. ఆ క్రిస్తన అయ్యే వాడు క్రీస్తు అయినాడు అన్నమాట. కాబట్టి భాగవతం కూడా ఒక మహోత్కృష్టమైనటువంటి రోజున ఇవాళ ఇది ఏర్పడింది. ఏడు దినంబుల ముక్తి కూడగ ఏ రీతి వచ్చు గురు సంసార క్రీడనము ఏ క్రియ యెడల చూడుమా తండ్రులార శృతి వచనములాన్ మీరేం చెప్పినా శృతి వాక్యంగా ఉంటుంది గనుక సర్వ ప్రామాణికంగా ఉంటుంది గనుక సర్వజన మనోల్లాసంగా ఉంటుంది గనుక సర్వజనహితంగా ఉంటుంది గనుక అటువంటి ఆ నారాయణ కథా శ్రవణం నేను చేస్తూ ఉంటాను అన్నాడు. ప్రాప్తానందులు ఆ చెప్తున్న వాళ్ళు ఎవరట అంటే ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపరీణులు ఆత్మప్రభా లుప్తాజ్ఞానులు మీరలు ఆర్యులు దయాళుత్వాభారాములు మనోగుప్తంబుల్ సకలార్థజాలనులు మీకున్ కానవచ్చుందట సప్తాహంబుల ముక్తికే గడుగతించెర్చించి భాషింపరే మీరేం మామూలు వాళ్ళా ఇక్కడ కూర్చున్న వారంతా ఎటువంటి వారు మీరు ఇప్పటికే ఆనందాన్ని పొందినవారు ఆ బ్రహ్మానందం. మనుష్య మనీష గాంధర్వ మానవ గాంధర్వ దేవ గాంధర్వ పితృపితానంద ప్రజాపితానంద హిరణ్యగర్భానందం దాకా వెళ్ళిన వారే ఇక్కడ ఉన్నారు మీరు ఆ ఋషులతో అంటున్నాడు. కాబట్టి మీకు ఆనందం అంటే ఏమిటో తెలుసు ఈ ఏడు రోజుల్లో ఈ భాగవత శ్రవణం ఎలా చేయవచ్చునో తదనుగుణంగా మీరు భాషించండి. అలాగే బ్రహ్మబోధన కళాపరీణులు బ్రహ్మవిద్యను చెప్పడం మీకు ఊరికే ఆ నల్లేరు మీద బండి నడక. ఎందుకంటే మీరు ఆ అనుభవం పొందు ఉన్నారు. అందుకనే స్వామి అంటారు There is no expression without experience. experience లేకుండా express ఏం చేస్తాడు ఈ ప్రజలకు అర్థం చేపి వెళ్ళిపోతాడు అంతేగా. అనుభవం గనక ఉన్నట్లయితే బ్రహ్మానంద పదాన్ని వాడు అనుభవించి ఉన్నట్లయితే ఆయన అన్నట్లుగా సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం శివత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభౌ భావుకాః మామూలుగా అన్నాడు ఆయన. ఆ ఆశీర్వచనమే ఎంత గొప్పదో చూడండి. రసికులై భావకులై భాగవత తత్వం యందు మనస్సు లగ్నమై పూర్ణమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి ఈ భాగవత శ్రవణం శ్రేయోదాయకమని చెప్తూ మీరలు ఆర్యులు ఆర్యులు అంటే పూజింపదగిన వారు మూలపురుషులు అన్నిటికీ మూలమైనటువంటి వారు అన్ని విషయాలకి. దయాళుత్వాభిరాముల్ దయాళులు మీరు మీకు ఏం పని ఉంది ఇక్కడికి వచ్చి చెప్పటానికి. ఇవాళ నేను ఏడు రోజుల్లో పోతానని మీకు తెలుసు ఏమిస్తాను మీకు ఏడు రోజుల్లో రత్నము మాణిక్యం దానిని ఆశించి వచ్చిన వారు కారే. మనోగుప్తంబుల్ సకలార్థజాలములు మీకున్ కానవచ్చుందట. మేమంతా ఈ తోలు కళ్ళతో చూస్తాం మీ మనోనేత్రంతో చూస్తారు ఆజ్ఞాచక్రంలో ఉన్న తరుడు అయి నుంచి చూస్తారు. కనుక మేము ఈ లోకాన్ని చూసేటటువంటి దారి వేరు మీరు చూసేటటువంటి చూపు వేరు మావన్నీ చూపులు మీవన్నీ దర్శనాలు అంతే కదా. ఊళ్ళోకి ఇద్దరు వచ్చారు ఓ friend Bombay నుంచి వచ్చాడు గురువుగారేమో Madras నుంచి వచ్చారు. కారు బయటే తీసాం ఎక్కడికి వెళ్తున్నారంటే మా friend ని చూసి స్వామి వారి దర్శనం చేసుకొని వస్తా అదేంటి ఈయనని చూడటం ఏమిటి ఆయన దర్శనం చేయటం ఏమిటి తేడా ఉందా అంటే నా friend ని చూడటం చూపే మహాత్ముల్ని చూడటం మాత్రం దర్శనం. అవన్నీ మీకు తెలుసు అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. సప్తాహంబుల ముక్తికే గడుగతించెర్చించి భాషింపరే ఏడు రోజులలో ముక్తిధామం చేరేటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో దానిని హాయిగా మీరు చర్చించి విషయమంతా సాకల్యంగా విచారణ చేసి దాని యొక్క విషయాలన్నీ కూడా నాకు చెప్పండి అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. వచ్చాడు ఆయన. ఇక్కడ ఇవాళ అనేక పాత్రలు ఆ అనేక పాత్రలలో ప్రధానంగా భూదేవి పరమేశ్వరుడి యొక్క సంస్పర్శకు దూరమైనాను గనుక నా పరిస్థితి ఏమిటి అని భూదేవి. ఏదో మిగిలిన ఒంటి కాలు మీద ఉన్నాను కదా అంటే కలిపురుషుడి చేత దెబ్బలు. మానవులంతా కూడా అధర్మ ప్రవర్తన వైపు వెళ్తున్నారు అధ్యాత్మ అక్కర్లేదు ఆత్మజ్ఞానం అక్కర్లేదు. పరమేశ్వరుని ఇవాళ మనం కలియుగం ప్రభావం చూడండి దేవాలయాలు కిటకిటలాడిపోతున్నాయి మీరు ఏది ఊరికో చిన్న బొమ్మ పెట్టి తమలపాకురో చిన్న పశువు బొమ్మ పెట్టి దానికి ఏదో పేరు పెట్టి మీరు వెనక షామియానా వేస్తే పట్టరు జనం వస్తున్నారు కదా. పరీక్షల సమయంలో అయితే అసలు యువకులు సినిమా హాల్లు మానేసి దేవాలయాల చుట్టూ హనుమంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఆయనేదో పరీక్ష రాస్తాడన్నట్టుగా. ఏం రాయడు ఆయన. అంటే పరమేశ్వరుణ్ణి మనం భక్తితో కాక భయంతో చేరుతున్నాం. భయం ఎప్పుడైతే ఉన్నదో జీవ రక్షణ నశించలేదు అని అర్థం. భక్తి ఎప్పుడైతే ఉన్నదో ఏది రాని ఏది పోని మా స్వామి చూసుకుంటారని మనం కా-కాస్త కులాసాగా ఉంటాం చూడండి. ఆ మా స్వామి కాచుకుంటారు మాకేం భయం అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు అనుభవించావు గనుక. నీకు ఆ అనుభవాలు ఉన్నాయి గనుక మా స్వామి చూసుకుంటాడంటాం. అనుభవం లేనివాడు ఏమో మీ స్వామి అంటున్నాం మేము ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర ఉంటాం అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం ఇంకా ఈయనతో మాకు పరిచయం కాలేదంటాం జీవితం చెల్లిపోతుంది. అలా కాకుండా ఏది సర్వాధీనమై ఉన్నదో ఏది ఈ సర్వ జగత్తుకి కూడా ఒక రక్షణ వలయాన్ని ఇచ్చిందో అది గురు స్వరూపంగా ఉన్నదో సద్గురు స్వరూపంగా ఉన్నదో ఏది మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వ యువానంగా ఉన్నదో ఏది పరమ చరమమైనటువంటి అవతార భూమికలో ఉన్నదో ఏది కదలకుండా సకల భూమాలని కదిలిస్తూ ఉన్నదో.ఏది ఎవరితోనూ ప్రమేయం పెట్టకుండా అందరికీ తనతో ప్రమేయాన్ని కల్పించిందో అటువంటి సత్య సాయి భగవానుడు పూర్ణమైనటువంటి మహాపురుషుడై ఇక్కడ ఉన్నటువంటి వేళ మహాపురుషుడు అన్న పరమాత్మ అన్న ఒక్కటే. పురుషుడు అంటే మహా మానవుడు, మహాత్ముడు అని కాదు. మహాపురుషుడు ఎవరు అంటే ఒక్క పరమాత్మే. ఆయన పట్లనే వాడాలి అది. ఉన్నటువంటి వేళ ఏడు రోజులు గనక భాగవతం వింటే, ఏడు రోజులు ఎందుకు భాగవతం వినొచ్చు ఏడు గంటల్లో కూడా చెప్పుకోవచ్చు కానీ ధర్మ విచారణ కావాలి. ఆ జరిగినటువంటి ద్వాపర యుగంలో జరిగిన కలియుగంలో తొలినాళ్లలో జరిగినటువంటి ధర్మ, ఆ భంశం ఏదైతే ఉన్నదో, తొలగిపోయిందో, అది ఎట్లా తొలగిందో గనక మనం తెలుసుకున్నట్లయితే ఈనాటి ఈ దుస్థితికి కారణాలు ఎవరు అనేటువంటిది మనకి సమాధానం దొరుకుతుంది గనక పరమేశ్వరాయత్వం చేయాలి, పరమేశ్వరుడితో కూడి ఉండాలి, పరమేశ్వరుడి యొక్క శక్తి మనల్ని నడిపించాలి. ఇది నిజమైనటువంటి ఒక భక్తి పారమ్యం. ఈ భక్తి పారమ్యంలో ఉండవలసినవి మూడే. శిరిడి మహాస్వామి చెప్పినట్లుగా సమర్పణ చేయండి, శరణాగతి పొందండి, వినయంగా ఉండండి. మూడే. ఈ మూడు గనక ఉంటే He is the greatest devotee. సేవ చెయ్, ఇంకోటి చెయ్, ఇంకోటి చెయ్, నువ్వు ఎన్ని చెయ్, ఎన్ని చేసినా నిరహంకారంతో చెయ్, నిర్మోహంతో చెయ్, ఆనందంగా చెయ్, సహజంగా చెయ్, సజ్జస్ఫూర్ణతో చెయ్. అందుకనే ఒక స్పందన ఎక్కడ నుంచి రావాలంటే ఆలోచించి తర్వాత వచ్చేది నిర్ణయం. ఆలోచించకుండా చేసేది స్పందన. ఆ స్పందన మన హృదయం లోతుల్లో నుంచి రావాలి. ఆ రావటానికి తర్ఫీదు కావాలి, ట్రైనింగ్ కావాలి, యోగం కావాలి. దానికి మహాత్ముల యొక్క సమాశ్రయం కావాలి, ఇటువంటి సద్గోష్టి కావాలి. అందుకనే పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, ఏడు రోజులలో ముక్తి ధామానికి ఎలా చేరాలో మీరంతా చర్చించి నాకు విషయం చెప్పండి అన్నాడు. ఆ చర్చించి అంటే ఋషులైనటువంటి వాళ్ళు, స్వాత్మానందాన్ని పొందినటువంటి వాళ్ళు, బ్రహ్మపదం ఎక్కడో ఎరిగినవారు, తెలిసినవారు, దర్శించినవారు, మనసుతో ఈ ప్రపంచాన్ని చూసేటువంటి వారు అంటే శుద్ధ మనసుతోని. శుద్ధ మనసు అంటే మళ్ళీ హృదయమే. మనసుతో ప్రపంచాన్ని చూస్తే స్పర్ధ, గందరగోళం. హృదయంతో చూస్తే సర్వము కూడా పరమ ప్రశాంతం, అది ప్రసన్నం. ఆ అటువంటి స్థాయికి తీసుకు వెళ్ళమన్నాడు. పరీక్షిత్ మహారాజు యొక్క ప్రమాణం ఏమిటంటే నాలుగు పాదాల మీద మళ్ళీ ధర్మాన్ని నడిపిస్తాను అని. ఇవాళ మనందరం ఓ మాట అంటూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. సత్య యుగం రాబోతున్నది అని. అది ఎలా వస్తుంది? మనందరం సత్యవ్రతులం అయితే, చెప్పబడిన ధర్మాన్ని గనక మనం పాటిస్తే, తదనుగుణంగా మన జీవితాలను కొనసాగిస్తే, దానికి వైదిక ధర్మానికి సంబంధించినటువంటి వేద ధర్మానికి, ఆర్ష ధర్మానికి ఒక సంస్కృతికి లోబడిన జీవన విధానాన్ని మన పిల్లలకి గనక అప్పజెప్తే సత్య యుగం వస్తుంది. ఆ సత్య యుగం రావటానికే స్వామి బాల వికాస్ పెట్టారు. పద్యాలు, పాటలు కంఠస్తం చేయటం బాల వికాస్ పని కాదు. వాడికి పరమాత్మ యందు ఆ పిల్లవాడికి మనస్సుని లగ్నం చేయగలగాలి. పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తిని దృఢంగా వాడి గుండెల్లో నాటాలి. అలాగే పాపభీతి గురించి చెప్పాలి. ఈ ప్రపంచానికి లోక కంటకులైనటువంటి రాజులంతా ఒక్క పరమేశ్వరుడి చేతిలో ఎట్లా నశించారో, వాళ్ళ వలన ఎన్ని బాధలు కలిగినయో, అటువంటి స్థితికి నువ్వు రాకూడదని మనం చెప్పగలగాలి. అది. దానికోసమే స్వామి సత్య యుగం సృష్టించలేదు స్వామి. ఏర్పరచటానికి మనకు యోగాన్ని ఇస్తారు, అవకాశాన్ని ఇస్తారు. మనం మాత్రం ఎంతవరకు చేయగలం అంటే సంస్కరింప నేర సంఘమంతటి నీవు, సజ్జనుండవగుము స్వార్థముడిగి, ఒక్క నీచుడప్పుడు విలువ తగ్గును. అందుకనే స్వామి ముక్తి evolution అనే మాట పక్కనబెట్టి ముందు transform కండి అన్నారు. పరిణామం చెందాలి. పరిణామం నిన్నటికంటే ఇవాళ నేను better గా నాకు అనిపించాలి. లోకానికి ఏమనిపిస్తున్నదో నాకు సంబంధం లేదు. నా వరకు నాకు అంతఃసాక్షిగా నిన్నటికంటే బాగా బతికానా లేదా ఇది ఏ ప్రతి వ్యక్తి తనకు తాను వేసుకోవాలి. నిజమే! నిన్నటికంటే ఇవాళ చాలా హాయిగా ఉన్నాను. అంటే సుఖంగా అని కాదు, ఆనందంగా ఉన్నాను. ఆనందం ఎప్పుడే పడుతుంది? కోరికలు లేకపోతే ఆనందం కలుగుతుంది. కోరికలు లేకుండా మానవుడు జీవించగలడా అంటే తగు కోరికలతో జీవించాలి, తగని కోరికలతో జీవించరాదు. ఇంతే. తగనివి అంటే మనం మొయ్యలేనివి, మనకు అక్కరలేనివి, మనకు పనికిమాలినవి, మనకు ఆనందాన్ని కలిగించనివి, మనం మొయ్యలేనివి, మన స్థితికి అందనివి కోరుకున్నామనుకోండి దుఃఖం అక్కడే మొదలు. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మనకు పరమాత్మ ఏలు లోటు చేశాడు అనుకుని తృప్తిలో నుంచి ఒక ఆనందాన్ని, ఆనందంలో నుంచి ఒక పరమానందాన్ని, దానిలో నుంచి బ్రహ్మానందాన్ని ఎవరైతే పొందుతారో వారు ఇటువంటి నారాయణ కథా శ్రవణం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళతారు. ఆ నారాయణ కథా శ్రవణం అంటే ఏదో కేవలం కృష్ణుడి మహిమ కాసేపు విని వెళ్ళేది కాదు. దాని వెనుక నవనీతం ఉన్నది, తత్వార్థం ఉన్నది, తత్వదీపిక ఉన్నది. దానిని ఆ చిన్న వెలుగుని ఆధారం చేసుకుని మన రాబోయేటువంటి మిగిలిన ఈ జీవితకాలం అంతా కూడా పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మ పదాన్ని, ఆయన చూడండి పరీక్షిత్ మహారాజు ఏడు రోజుల్లో నువ్వు ఇంకా ఉండవు అనగానే ఆయన నారాయణుడి కథలు చెప్పమని అడిగాడు. ఈ రాజ్యం ఏమైపోతుందో, ఆ తక్షకుడు ఎక్కడున్నాడో, వాణ్ని ఏ మంత్రం చేత, యజ్ఞం చేత ఏం చేయాలో ఇవన్నీ ఆయన అనుకోలే. చేయవలసినటువంటిది మిగతా మంత్రాంగం చేసింది. పరీక్షిత్ మహారాజు ఆ ప్రయత్నంలో లేడు. సినిమాల్లో చూపించినట్లుగా. ఎందుకంటే వాటిని చదవకుండా తీస్తారు. పరీక్షిత్ మహారాజు అప్పటికే మనస్సుని, దేహం నుంచి దేహాత్మ భావం నుంచి ఆయన విడిపోయినాడు.ఆ తక్షకాయ స్వాహా అనే సర్పయాగం అంతా మిగతా వాళ్ళు చేశారు. అది చేశారు కానీ, ఇక్కడ చిన్న విష-- విశేషం చెప్పాలి. వరాహమిహిరుడు బృహత్ సంహిత అనేటువంటి ఒక కావ్యం, ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం అన్ని శాస్త్రాలు ఉన్నాయి. అందులో Astrology, Astonomy అన్ని కూడా ఉన్నాయి. ఈ Astrology లో ఇది నమ్మవచ్చునా, నమ్మకూడదా? అప్పటికీ ఇప్పటికీ చర్చే. ఆ రోజుల్లో కూడా ఈ చర్చ వచ్చినప్పుడు వరాహమిహిరుడు, ఓ చోట ఉన్నాడు ఆయన. ఆయన జ్ఞాని. ఆ దేశపు రాజుకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే నిన్న ధర్మరాజు ఎట్లాగైతే మా పరీక్షిత్తు, మా విష్ణురాతుడి యొక్క జాతకం చెప్పమని అడిగాడో ఆ రాజు కూడా ఈ జాతకాలు చూసే వాళ్ళందర్నీ పిలిచి చెప్పమన్నాడు. అందరూ ఏమి నిర్ణయించారంటే, రాజు మెప్పు కోసం దీర్ఘాయువుగా ఉంటాడు అని చెప్పారు. చెప్పగానే ఒ-- ఒళ్ళో ఉన్నవి, ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చి వాళ్ళకి కానుకలు ఇచ్చి వాడు పంపాడు. ఎందుకంటే మా అబ్బాయి బాగుంటాడు అని చెప్పాడుగా, ఆ సంతోషం. కానీ ఎక్కడో వాడికి ఒక సందేహం ఉంది. ఆ సందేహం ఏమిటంటే అందులోనూ ఒకడు ఒక పీల స్వరంతో వినబడి వినపడనట్లుగా "ఈ రాజు మెప్పు కోసం అసత్యం ఎందుకు చెప్తున్నారు? వాడు బతకడే" అన్నాడు. ఆ మాట కూడా విడు విన్నాడు. కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి జాతకం చెప్పే వాళ్ళంతా జ్యోతిష్యులంతా ఖాళీ అయిపోయినారు, ఎవ్వరూ లేరు. మరి ఇంకా పరిష్కారం ఎవరు చేయగలరు అంటే ఎవరో చెప్పారు వరాహమిహిరుడు అని ఉన్నాడు ఆయన్ని పిలవండి అన్నారు. వరాహమిహిరుడిని పిలిచాడు. పిలిచి, స్పష్టంగా, నిష్కర్షగా ఎంత కఠినమైన సత్యం చెప్పమన్నాడు. "నీ కొడుకు మరణం తధ్యం" అని చెప్పాడు. సరే. వీడికి అహంకారం వచ్చింది, రాజుకి. ఇలా అన్నావు కదా, నా కొడుకుకు మరణం లేదు అని నిరూపించి ఈ శాస్త్రం Wrong అని నేను Prove చేస్తానన్నాడు. వరాహమిహిరుడు అన్నాడు "నువ్వేం చేయలేవు. ఇది నిర్ణయం అయిపోయింది. It is all predestined. You are going to lose your son" అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా రాజుగారు తలచుకుంటే ఏముంది, ఆ పిల్లవాడు పడుకునేటువంటి ఉయ్యాల, ఆ గది అంతా Sound proof చేశాడు. లోపలికి ఒక చీమ, పాకి రావటానికి కూడా వీలు లేకుండా Temper proof చేశాడు. ఎవ్వడూ వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు. అసలు ತನ್ನ తల్లి కూడా లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. నేను స్వయంగా వెంబడి ఉండి వాడికి కావలసినటువంటి పోషణ చేసి బయటికి వస్తా. కావలసిన ఉయ్యాల నేను ఊపుతానన్నాడు. ఇవన్నీ చేశాడు. అలా Time, Time ఉన్నంత వరకు ఇవన్నీ సాగినాయి. సరే, రాజుకి ఏమనిపించింది అంటే జ్యోతిష్యం Wrong. ఈ చెప్పిన వాళ్ళంతా తప్పు చెప్పారు. వాడెవడో పాపం తెలియక గట్టిగా చెప్పలేక సన్నటి స్వరంతో చెప్పాడు. వాడు కాదు, వరాహమిహిరుడేమో గొప్పవాడు అనుకుంటున్నాడు. వీడు కాదు. I can protect my son. వాడికి మరణం లేదు అనుకున్నాడు. అని ఓ ఉయ్యాల అలా ఊపాడు. బాగుందనుకున్నాడు. ఆరోజు పని పూర్తి చేసి తలుపు తాళం పెట్టి వెళ్ళిపోయినాడు. ఆ రోజుల్లో మన ఇళ్ళల్లో కూడా మన పాతకాలం ఇళ్ళల్లో దుప్పటి కొమ్ములన్నీ కూడా గోడలకి అలంకారం చేసేవాళ్ళు. అదో అలంకారం. దుప్పటి తల, రెండు కొమ్ములు అది. ఈ ఉయ్యాల ఇట్లా ఊగుతున్నటువంటి ఒకానొక సమయంలో ఆ పైన గోడకు ఉన్నటువంటి దుప్పటి కొమ్ము Loose అయిపోయింది. ఆ మేకు నుంచి వచ్చి ఉయ్యాలలో పడి ఆ పిల్లవాడిని చంపేసింది. సరే కాసేపు అయిన తర్వాత రాజుగారు వచ్చారు. వచ్చి చూస్తే ఏముంది అంతా అయిపోయింది. అప్పుడు వరాహమిహిరుడిని అడిగాడు. పిలిపించాడు. "ఎలా చెప్పగలిగావు?" చెప్పమన్నాడు. సరే ఆయనేదో శాస్త్రం చెప్పాడు. అలాగే విధి అనుల్లంఘనీయం. జీవిం-- జీవితం జీవించటానికి వచ్చి ఒక జన్మ ఎత్తిన వాడు శరీరం ధరించిన వాడు పరమాత్మ అయినా సరే శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. కాకపోతే జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి పౌర్ణమి నాడు పాము తన ఒంటిమీద ఉన్న కుబుసాన్ని పొదలలో ఎట్లా స్వచ్ఛందంగా వదిలి పెడుతుందో ఆ పౌర్ణమి రాగానే వదిలిపెడుతుంది. మళ్ళీ తన శరీరం మీద కొత్త చర్మాన్ని ఎట్లా ఆహ్వానిస్తుందో జ్ఞాని అలా శరీరాన్ని వదిలి పెడతాడు. జ్ఞాని కాని వాడు అయ్యో కియో అంటాడు. నేను చేయవలసినవన్నీ Ten percent కూడా చేయలేదు అంటాడు. దుఃఖితుడు అవుతాడు. దుఃఖంతో మరణిస్తాడు. దుఃఖంతో మరణించటమే అజ్ఞానం. దుఃఖించిన వారి కోసం విలపించటం అంతకంటే కూడా అజ్ఞానం కాబట్టి అజ్ఞాన భూమికలో నుంచి ఒక విషాద యోగ భూమికలో నుంచి ఒక మరణ భావనలో నుంచి ఏడు రోజుల సమయంలో పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. నారాయణ కథా శ్రవణం ద్వారా నాకు బ్రహ్మపదం చేరుకునేటువంటి ఆ మార్గాన్ని ఉపదేశనం చెయ్యి అని. దానిని స్వామి యొక్క అనుగ్రహం చేత సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సత్య సాయి సుడి యొక్క దివ్యమైనటువంటి ఆదేశంతో దివ్యానుగ్రహంతో మనం రేపటి నుంచి నారాయణ కథా శ్రవణంలోకి వెళ్దాం. కలి, కలియుగం అయిపోయింది. 2010 అయిపోయినట్టుగా. నిజానికి అయ్యే పోయింది ఇంకేముంది. కలియుగం అయిపోయిన తర్వాత అవ్వబోయే ముందు ఈ నారాయణ కథని వాళ్ళంతా ఎలా చదివారో, ఎలా విన్నారో వాటన్నింటినీ కూడా చాలా తీవ్రమైనటువంటి విచారధారగా కొనసాగించేట్లుగా సత్యసాయి భగవానుడు మనకి ఆ పూర్ణ అనుగ్రహాన్ని వరదానం చేయాలని, దీనికంతకీ మూలమైనటువంటి ఇటువంటి గ్రంథాన్ని లోకోత్తరంగా పద్దెనిమిది వేల శ్లోకాలలో పరమ భాగవతోత్తముడు అయినటువంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వ్యాసులవారు మనకు అనుగ్రహించినందుకు వారికి, మన బోటి వారికి మన తెలుగున మన ఆంధ్రంలో చక్కగా సహజ కవి బమ్మెర పోతనామాత్యుడు అలతి అలతి లలిత పదాలతో కలిత కలితమైనటువంటి సుందరమైనటువంటి వచో విన్నాణంతో ఒక సమృద్ధమైనటువంటి భాషా సామగ్రితో, భావ గుంఫనంతో, పరిపూర్ణమైనటువంటి తత్వ విచారంతో మనకు అందించినందుకు బమ్మెర పోతనామాత్యుడికి అందరికీ మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 17
Bhagawata Navaneetham - 17
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 30:52
More in this series