Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ జీవుడు చూడండి ప్రాణం వదిలిపెట్టేటప్పుడు ప్రాణాల్ని పోగొట్టుకునేటువంటి వేళ కూడా మనం స్వామి చెప్పిన ఒక కథ చెప్పుకోవాలి ఇప్పుడు. కన్నడ దేశంలో బాగా బతికిన వాడు బాగా సంపాదించిన వాడు నలుగురు కొడుకులు ఉన్నారు వాడికి. ఎంత పెద్ద వాడైనా వయస్సు వస్తుంది పడుకొని ఉన్నాడు. ఏదో జాడ్యం ప్రవేశించింది రోజు డాక్టర్ గారు వస్తున్నారు మందులు ఇస్తున్నారు. కొడుకులు వ్యాపారానికి వెళ్తున్నారు ఇదేం ఇది ఈయన ఎక్కడా పోయేట్టుగా లేడు సాగుతోంది ఇది. సరే చివరికి రోజున డాక్టర్ గారు వచ్చి చెప్పాడు నాయనా మీ తండ్రికి సమయం దగ్గర పడింది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అని. కొడుకులు జాగ్రత్త ఏం పడ్డారంటే నాన్నని జాగ్రత్త చేసుకోమని వాడు చెప్తే వీడు దుర్ముహూర్తంలో పడితే బంగారు అంతా ఆరు నెలలు పడు పెట్టాలేమో అని నాన్నని పశువుల కొట్టంలో కట్టేయమన్నారు పడుకోబెట్టమన్నారు పాపం. జాగ్రత్త. జాగ్రత్తగా మంచం వేసి అదే ఆల మందలు వచ్చినాయి సాయంకాలం వచ్చినాయి చుట్టూ గూడా ఆవులున్నాయి. దూరంగా ఒక చిన్న దూడ ఉంది. సరే వీళ్ళు ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళొచ్చిన వాళ్ళంతా రాగానే తండ్రి అడిగాడు సౌంచం చేస్తున్నాడు మాటలు పోయినాయి. కా కా కా అంటున్నాడట. నలుగురికి నాలుగు రకాల అర్థం తోచింది. నాన్నకి పాపం ఏదో కావాలని అడుగుతున్నాడు అది ఇచ్చేస్తే ఆయన వెళ్తాడు ఆయన దారిన అని వీళ్ళ ఆలోచన. ఆయనే వెళ్ళేట్టుగా లేడు. ఆయనేమిటంటే వీళ్ళు అసలు ఇంకా అంటే నేను పెద్దవాడినైపోయాను వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు నా మాట వినరా అంటూ ఆయన ఆలోచనలో ఇంకా అరుస్తున్నాడు ఒకే అక్షరం నోట్లో ఉంది. ఇంతకీ ఏం కావాలి అని అడిగాడు అప్పుడు ఇక మాటా పోయింది. పోయి చూపులు బారులు కట్టి ఇట్లా చూపుడు వేలుతో మూల చూపించాడు. ఏమున్నదంటే అక్కడ ఒక ఎండిపోయిన జనపకట్టే ఉన్నది. జనపకట్టే పాపం ఆకలి వేసిన దూడ అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంత నాలుక చాచినా జనపకట్టే దగ్గరకు రావటంలే. ఏమన్నా అంటే దూడకు పెట్టమని అరవటంలే జనపకట్టే కాపాడుకోండి అని అడిగాడు. [నవ్వు] అది. అంటే జీవుడి ప్రారబ్ధాలు ఎలా ఉంటాయి అంటే చిట్టచివరిదాకా లంపటంలో ఉంటాడు. వదులుచుకుందామనే ప్రయత్నం మాత్రం చేయడు. చేయక చేయక చిట్టచివరి వరకు మిగిలిందంతా తన కడుపున పుట్టిన వాళ్ళందరికీ అందరికీ వీలునామాలు రాసి అవి రాసి ఇవి రాసి ఏదో కాబోయే రోజుల కోసం బతికి ఉన్న బతుకునంతా వ్యర్థం చేసుకొని పరమాత్మ నుంచి మనస్సుని హృదయాన్ని దూరం చేసుకొని సాక్షాత్తు పరబ్రహ్మ తత్వమైనటువంటి దైవంతో కూడి ఉండి కూడా అనుభవం గనక లేకపోతే ఎట్లా? కనుకనే నేడు భీష్ముని చంపి నిన్ను గాతు విడువుం అర్జునా యంచు మద్విషికం వృష్టి మరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అన్నాడు. అర్జునుడు అంటాడు యుద్ధం నువ్వు చేయొద్దు భీష్ముడిని నేను చంపుతా అంటాడు వీడు. అసలు భీష్ముడు ఏమంటున్నాడంటే సర్వ జగద్రక్షకుడు అయినటువంటి పరమాత్మే వచ్చి చక్రం నా మీద గనక విసిరేస్తే నా ప్రాణమే ఆయన చేతుల్లో పోతే ఇంతకంటే ఏం కావాలని ఈయన. అటేమో స్నేహితుడు భావమరిది అర్జునుడు ఇటేమో స్వామి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఇటు భీష్ముడు. కృష్ణుడికి ఏం చేయాలి అర్జునుడి మాట వినాలా భీష్ముడి మాట వినాలా పరమాత్మకి చిక్కు ఎప్పుడూ ఉంటుంది. ఇద్దరు వ్యాపారం చేసే కాంపిటీటర్స్ బిల్డింగ్ చేసి స్వామి దగ్గరికి వెళ్తారు. ఇద్దరు ఒకే రైలులో దిగుతారు. ఇచ్చి మాకిది వచ్చేట్టుగా చూడండి అంటారు. ఎవరికి ఇవాళ అయినా ఇద్దరు భక్తులే వాళ్ళు పాపం నలభై ఏళ్ళ నుంచి వస్తున్నారు. అప్పుడు స్వామి ఏమి ఏమి చేస్తారు అనటువంటిదే కృష్ణుడు కూడా చేశాడు. కృష్ణుడు ఏమన్నాడంటే ఎప్పుడైతే చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని మనసులో అనుకున్నాడో భక్తికి పరమాత్మ కరిగిపోయినాడు. చక్రం కింద పారేశాడు. దృశ్యం నాకు ఇప్పుడు గుర్తొస్తున్నది అంటున్నాడు. జరిగి చాలా రోజులైంది భీష్ముడికి ఇప్పుడు గుర్తొస్తున్నది. పలుకుల నడవుల నడపుల అలుకల నవలోకనముల నావీర వధూకులముల మనముల తాలిమి పలుకుల వదలిన్చు ఘనుని కొలిచెద మదిలో. గోపగోపికా జనానికి హృదయరంజకమైనటువంటి దర్శనాన్నిచ్చి సారోక్య సామీప్య సాన్నిధ్యాలు ఇచ్చినటువంటి పరమాత్మ నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు. అట్లా కనిపిస్తున్నాడు ఈయన. మునులున్ రూపులు జూడమును ధర్మజుని సభామందిరమున యాగమంటపమున చిత్రమహిమతోడ చెలువొందు జగదాబి దేవుడమరు నాదు దృష్టియందు. అప్పుడెప్పుడో ధర్మరాజు రాజసూయం చేస్తే అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలని అందరూ మీమాంస పడ్డటువంటి వేళ నావైపు అందరూ చూపిస్తే నేను బ్రహ్మచారిని కాదు అస్కలిత బ్రహ్మచారి ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో జీవులందరూ నాయికలే నాయకుడు ఒక్కడే పరమాత్మ పరమాత్మ శ్రీకృష్ణుడే అని అగ్రతాంబూలం తీసుకున్నటువంటి దృశ్యం నాకు గుర్తొస్తున్నది. అక్కడే ధర్మరాజ సభలోనే రాజసూయంలోనే శిశుపాలుణ్ణి వధించిన గోపాలమూర్తి నాకు కనిపిస్తున్నాడు అంటున్నాడు భీష్ముడు. అయి మనకు ఉపదేశం చేస్తున్నాడు మనకేంటే మన తరఫున.ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు. ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తాను తోచు పోలిక దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడై ఒప్పును ఉండు అట్టి హరిని నే ప్రార్థింతు శుద్ధుండనై. ఆత్మ శుద్ధి కలిగింది ఇంకా నాకు ఏమి అక్కరలేదు, చూడవలసిన దృశ్యాలు జీవితంలో దృతరాష్ట్రుణ్ణి చూశాను కౌరవుల్ని చూశాను కానీ ప్రాణ నిర్గమన మహా స--సంయముల వేళ పరమాత్మ అయినటువంటి కృష్ణుణ్ణే దర్శనం చేశానే, ఒకే సూర్యుడు ఇంతమంది ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చూస్తున్నాడు ఈయన. కానీ ఇది ఒక మహానంద లీల. The biggest miracle in పుట్టపర్తి ఏమిటి అని ప్రశ్నించినప్పుడు మనం చెప్పుకున్నాం. యాభై వేల మంది కులువంత హాల్లో స్వామి దర్శనమై బయటికి వచ్చే వేళ అందరూ ఒక మాటంటారు స్వామి వాళ్ళు నన్నే చూశారు అని. ప్రతివాడంట నన్ను చూడలేదు అన్నవాడిని చూపించండి. ప్రతి వాడు ఏమంటారంటే నన్నే స్వామి అలా వచ్చారో లేదో నా వైపే చూసినట్టు అనిపించింది చూశారు అంటాడు. ముందు అనిపించింది అంటాడు తర్వాత చూశారు అంటాడు. ఒక్కొక్క పోలిక ఒకడికి రూపంలో నామంతో భావంతో గుణంతో తత్వంతో తత్వార్థంతో లోతైనటువంటి భావనతో పరమాత్మని మనం లోపల భావిస్తామో పరమాత్మ మనకి అట్లాగే కనిపిస్తాడు అంతే. అట్లాగే ఎలా కనిపిస్తాడంటే అన్ని రూపాలు ఆయనవే మనకు ఒక రూపం ఇష్టం అంతే. రూపం కానిది మరొక రూపం అయినది ఆయన కంటూ లేదు అసలు రూప రహితుడు రూప సహితుడుగా కనిపిస్తున్నాడు. నామ రహితుడు నామ సహితుడుగా అనిపిస్తున్నాడు కాబట్టి అటువంటి సూర్యుడి వలె ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నేను దర్శనం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఏమైంది? మనో వాగ్దర్శనముల పరమాత్ముండగు కృష్ణుని హృదయంబున నిలుపుకొని నిశ్వాసంబు మాని ప్రాణ స్తంభన చేశాడు. ప్రాణ స్తంభన యోగ తారావళిలో శంకర భగవత్పాదులు యోగాన్ని ఒక గొప్ప వర్ణన చేశాడు ఆయన. వివరించాడు scientific గా దానిని కేవల కుంభక యోగం అన్నాడు. కేవల కుంభక యోగం అంటే శరీరానికి ఎన్ని జాడ్యాలు ఎన్నెన్ని అననుకూలాలు ఏర్పడినా అవి నావి కాదు అన్నటువంటి స్థితిలో సంచారం చేయటం. అలా సంచారం చేసిన వాళ్ళల్లో శ్యామాచరణ లాహిరి ఒకడు, సదాశివ బ్రహ్మేంద్రుడు రెండవవారు, మూడవవారు తాడేపల్లి రాజోనారాయణ శాస్త్రి గారు చందోలు శాస్త్రి గారు, నాలుగవవారు రమణ మహర్షి, ఐదవవారు రామకృష్ణ పరమహంస, ఆరవవారు జిల్లెళ్ళమూడి అమ్మ, ఇక ఏడవవారు ఆధునిక కాలంలో జనార్ధనానంద స్వామివారు. పేర్లన్నీ ఏం చేశారు వాళ్ళంటే అందరూ చేసింది ఒకటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధి ఏర్పడింది శరీరానికి. రా-- రమణ మహర్షికి భుజం మీద, రామకృష్ణ పరమహంసకు గొంతులో, జిల్లెళ్ళమూడి అమ్మకి కడుపులో cancer వచ్చింది. జిల్లెళ్ళమూడి అమ్మకైతే లోపలన్నీ cancer గడ్డలన్నీ ఉన్నాయి అని గుంటూరులో అంటే, ఏం చేద్దాం అమ్మా అని అడిగారు ఉండనిరా అంది. అదేమిటూ ఉంటే నువ్వు పోతావు కదమ్మా మాకు దూరం అయిపోతావు కదా అంటే వాళ్ళు నీకన్నా బిడ్డలేరా ఉండని అక్కడ అని. అది కేవల కుంభక యోగం అంటే. అలాగే రమణ మహర్షిని కూడా భగవాన్ మీ చూపు చేత, దర్శనం చేత, తలపు చేత నానా రోగాలు నశించిపోతాయి అని మేం అనుభవంలో ఉంది మాకు మీ ఒంటి మీదే ఏర్పడింది మీరు పోగొట్టుకోవచ్చును గదా అని అంటే ఆయన అన్నారు మీ అందరినీ నేను పిలిచానా రమణమని మీరు వచ్చారు. ఎప్పుడైనా మిమ్మల్ని వెళ్ళమని అన్నానా? అనలేదు. వారు అలాగే వచ్చారు వారిని అలా వారి దారిన ఉండనివ్వండి మనకు వారితో ఏం పని అన్నారు. భుజం మీద వచ్చిన cancer ని ఆయన అలా అన్నారు. అలాగే రామకృష్ణ గురుదేవుల్ని కంఠంతో ఎలుగెత్తి అమ్మవారిని కీర్తించి ఒక ఉన్మత్త స్థాయిలో అమ్మవారి స్థాయికి వెళ్ళినటువంటి మీరు ఇవాళ మాట్లాడలేని స్థితి వచ్చిందే కాస్త పాలు తాగండి ఇది తాగండి అంటే, ఏం మీరందరూ తాగుతుంటే అది నేను తాగినట్టు కాదా? అన్నాడాయన. మీ ముఖాలు నావి కాదా? అన్నాడు. జ్ఞాని సర్వ జగత్తునీ తనదిగా తాను సర్వ జగత్తుగా సంభావన చేస్తాడు. అది పరమోత్కృష్టమైనటువంటి స్థాయి. అట్లా వచ్చినటువంటిది ఇదిగో భీష్ముడు కూడా అంపశయ్య మీద పడుకున్నాడు అంటే కథగా విన్నప్పుడు ఏం అనిపించదు గానీ నిజంగా అటువంటిదే గనక మనకు ఏర్పడితే చిన్న ముల్లు గుచ్చుకుంది, మన ఇంట్లో చిన్న సూది గుచ్చుకుంది అమ్మా అంటామా అనవా? అంటాం. ఈయన అదేం అనటం లేదు అంటే దేహాత్మ భావాన్ని ఆయన వదిలిపెట్టేశాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడయ్యా అంటే మంచి క్షణం కోసం ఒకటి పరమాత్మ దర్శనం కోసం ఒకటి. అసలు పరమాత్మ ఎప్పుడు దర్శనం ఇస్తాడంటే స్వామిని రోజుల్లో హాయిగా మాట్లాడేవారు, మాట్లాడే అవకాశాలు ఉండేవి. స్వామి మీ దగ్గరకు రాగానే కష్టం తీరింది అంటే స్వామి ఒక గొప్ప జవాబు ఇచ్చారు. అవన్నీ రాయాలి మన వాళ్ళు. ఏం లేదు బంగారు నే తీర్చింది ఏం లేదు తీర్చే సమయానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు తీరే సమయానికి అన్నారు. అంటే జ్ఞాని స్వామి అయినవాడు ఇది నేను చేశాను అనడు. నా వల్ల నీకీ రోగం పోయింది నా వల్ల నీకీ లాభం కలిగింది అనడు. వాడు పూర్ణమైనటువంటి మనసు కలిగిన వాడు కాదు.నిజమైనటువంటి గురువు స్వామి వంటి స్థాయి వారు ఏమంటారంటే "నీ time బాగుంది time కి నా దగ్గరికి వచ్చావు నాకు attribute చేస్తున్నావు అంతవరకు మంచిదే గౌరవమే సంతోషం" అంటారు. అందుకనే ఎవరి ఎవరి కర్మ ప్రారబ్ధాలకి వారే కారణం గాని నేను కాదన్నారాయ్యా. తర్వాత నేను తీర్చనని కూడా చెప్పారు ప్రమాణం చేశారు "నేను తీర్చను మీరు తీర్చమని నన్ను మీరు అడగొద్దు శిక్ష ఏదో కాస్త అనుభవించేసేయండి" అన్నారు. అలాగే భీష్ముడు కేవల కుంభక యోగంలో ఉన్నాడు. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు "నదానుసంధానానమోస్తుతుభ్యం త్వాం సాధనం తత్వపదస్య జానే భవత్ప్రసాదాత్ పవనేన సాకం విలీయతే విష్ణుపదే మనో మే" ఇటువంటి పరమాద్భుతమైన నాదానుసంధాన యోగాన్ని అనుగ్రహించావే పరమాత్మ ఇక విష్ణుపదంలోనే కలుస్తాను అన్నాడు. విష్ణుపదం అంటే బ్రహ్మపదం బ్రహ్మపదం అంటే ఆకాశంలో లేదు బ్రహ్మపదం అంటే హృదయ స్థానంలో ఉన్నది. హృదయ స్థానం ఉన్నది ఎక్కడ ఉన్నది అంటే కుడి రొమ్ములో ఉన్నది. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యా మహామితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విస మనసాస్వం చింతతా మధ్తతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం ఆత్మ నిష్ఠుడై ఉన్నాడు ఉపవిష్టుడై ఉన్నాడు నిష్ఠుడై ఉన్నాడు నిశ్చుడై ఉన్నాడు మర్యాద పురుషోత్తముడుగా ఉన్నాడు అంగుష్ట మాత్ర పురుషోత్తముడుగా ఉన్నాడు గనుక అటువంటి ఆత్మ దర్శనం చేసుకుంటున్నాడు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో. మనో వాగ్దర్శనంబుల పరమాత్ముండగు హృదయంబున శ్రీకృష్ణుని నిలుపుకొని నిశ్వాసంబు మాని యోగ స్తంభన చేశాడు. నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందు నిరుపాధి కనబడుతున్న కృష్ణుడు మాయమైపోయాడట. శరీరంతో ఉన్న కృష్ణుడు ఇప్పటిదాకా వర్ణించాడు పత్తని పటము చక్రం పట్టుకోవటం అన్నీ అయిపోయాయి. ఉపాధి లేని తేజో స్వరూపమైనటువంటి కృష్ణ దర్శనంతో తన మనస్సును అనుసంధానం చేసి అందు కలిపిన భీష్మునిండూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబులు ఊరక ఉండు తరంగున ఉండిరి. భీష్ముడి చుట్టూ ఎప్పుడైతే పంచపాండవులు కృష్ణుడు వీళ్ళంతా వచ్చారో ఆయనతో పాటు ఇంకో రణరంగంలో ఉన్నటువంటి వారంతా వచ్చారు. వాళ్ళంతా ఎలా ఉన్నారంటే సూర్యాస్తమయ వేళ పిట్టలన్నీ కూడా నోరు తెరవకుండా ఎట్లా ఉన్నాయో అట్లా నిశ్చేష్టమై ఉన్నాయట. అది భీష్ముడి యొక్క స్థితితో అవి అనుసంధానం అయిపోయినయి. దేవమానవాదితంబులై దుందుభి నాదంబులు మొరసే ఆకాశంలో నుంచి దేవదుందుభులు మోగినయి సాధు కీర్తనంబులు మెరసే కుసుమ వర్షంబు కురిసే మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు చేయించి ముహూర్తమాత్రంబు దుఃఖితుడయ్యే. ఒక్క క్షణం ముహూర్తమాత్రం దుఃఖితుడయ్యాడట. ధర్మరాజు అంతకుముందు గంటలు గంటలు ఏడ్చాడు "ఇటువంటి రాజ్యమా నేను పొందింది నేను తినగాలను నెత్తుటి కూడు మాధవా" అంటాడు చలపిళ్ళ వెంకటశాస్త్రి గారు. నెత్తుటి కూడు నాకు వద్దన్నటువంటి ధర్మజుడు స్వయంగా పరమాత్మ శ్రీకృష్ణుడి సన్నిధానంలో భీష్మ పరినిర్వాణం జరిగినటువంటి వేళ ఒక్క ముహూర్త మాత్రమే దుఃఖించాడట. అంటే మహాత్ములతో కూడితే ఎందుకని గొప్పవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి? వెళితే ఏమవుతుంది అంటే నాస్తికులు ఆస్తికులు అవుతారు ఆస్తికులు భక్తులు అవుతారు భక్తులు ప్రేమమయులు అవుతారు ప్రేమమయులు జ్ఞానులు అవుతారు అందుకనే వాళ్ళ దర్శనానికి వెళ్ళాలి. భీష్మ దర్శనం చేత ధర్మరాజుకి ఇంకా దుఃఖం కలగలా మొత్తం నేర్పాడుగా బోధ అంతా చేశాడు కాలాధీనము మనం చేయగలిగిందేమీ లేదు అని. అప్పుడు కృష్ణుణ్ణి స్తుతించి ఎవరెవరి ఆశ్రమాలకు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే ఉత్తరా గర్భంలో ఒకడు పెరుగుతున్నాడు. పాండవ వంశాంకురం పెరుగుతున్నది లోపల. కురు సంతతికి పరీక్షిన్నరವರು అంకురము చేసి నారాయణుడు ధరణీ రాజ్యమునకు ఈశ్వరుగా ధర్మజు నిలిపి సంతోషించెన్. ఎప్పుడైతే భీష్మ పరినిర్వాణం మహా నిర్వాణం అయిపోయిందో ధర్మరాజు, ఈశ్వరుడు అంటే రాజు జగదీశ్వరుడు అంటే పరమాత్మ ఈశ్వర స్థానంలోకి ధర్మరాజు వెళ్ళాడు అప్పుడు ఆయనకి సంతోషం కలిగిందట కృష్ణుడికి. మనం చెప్పుకున్నాం జిహానం జిహానం సుజానేన మౌఢ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమేతన్ నమస్తా అన్నట్లుగా ఆనందం కృష్ణుడికి ఎప్పుడు కలిగింది అంటే ధర్మరాజు పరిపూర్ణమైనటువంటి రాజైనప్పుడు. అయిన తర్వాత కొంతకాలం ఏలుతున్నాడు ఏలుతూ ఉండగా గురుకులాప్తముండు కుంతీకనూజుండు దాన మానఘనుడు ధర్మజుండు సత్యవాక్యధనుడు సకల మహీరాజ్య విభవభాజి అయిన వేళ యందు. పరమాత్మకు పని అయిపోతే ఏం చేస్తాడు? ఆయన కూడా ఎక్కడికో వెళ్ళాలిగా. ఆయన కూడా మళ్ళీ మరలి తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా దేహంలో ఉన్నాడు గనుక తన స్వస్థానమైనటువంటి స్వస్థలమైనటువంటి ద్వారకా నగరానికి ప్రయాణం కట్టాడు. ఇంకా ఆయనకేమి ఇక్కడ హస్తినాపురంలో పని ఏమీ లేదు రాజు అయిపోయినాడు వాడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ రాజు కాలే, రాజుల్ని చేశాడు. ఉగ్రసేన మహారాజుఅలాగే రాముడు కూడా కిష్కింధ కాండ లో సుగ్రీవుడిని రాజుని చేశాడు. లంకలో విభీషణుడిని చేశాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి నా రాజ్యం నేను ఏలుకుంటానని పద్నాలుగేళ్ళ వనవాసం అనంతరం అయోధ్యకు వచ్చేదాకా మరొక రాజ్యాన్ని ఆయన రాజ్యం చేయలేదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కంసవధ అయిన తర్వాత తన తాత అయినటువంటి ఉగ్రసేన మహారాజుకి పట్టాభిషేకం చేశాడు. మళ్ళీ ఈవేళ ధర్మజ పట్టాభిషేకం అయి మహా సంతోషంతో నెమ్మదిగా ద్వారకా నగరం వైపు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కృష్ణుడు ఇంత గొప్ప పని చేసి అయితే భాగవతానికి ఇదంతా భారత కృష్ణుడి కథ చెప్పుకున్నాం మొట్ట మొదటి రోజు. భారత కృష్ణుడు లౌకిక వాది. ప్రాపంచిక కృష్ణుడు మనతో ఉండి మన వెంట ఉండి మన కార్యకలాపాలన్నింటినీ కూడా నియంత్రించి అక్కరలేని వాటిని నిరోధించి ఎట్లాగైతే ఒక విజయం చేకూరుస్తాడో పరమాత్మ అట్లాగే శ్రీకృష్ణుడు కూడా పంచ పాండవులు కుంతీ ద్రౌపది అనేటువంటి ధర్మమూర్తులు భీష్ముడు విదురుడు అనబడేటువంటి ఇద్దరు తపస్వులు అక్రూరుడు అనబడేటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యక్తితో వీళ్ళతోనే పరమాత్మగా క్రీడించాడాయన. మిగతా వాళ్ళందరితో మామూలుగా ఉన్నటువంటి లౌకిక మర్యాదలు పాటించినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి కృష్ణుడే పని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. వెళుతున్నటువంటి వేళ ఎలా ఉన్నదటంటే కనక సౌధములపై కౌరవ కాంతలు కుసుమ వర్షంబు కోరి కురియ పైనుంచి పూల జల్లులు పూలు వర్షిస్తున్నాయి. మౌక్తిక దామ సంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ ఉద్ధవ సాత్యకులు ఉత్సాహవంతులై రత్నభూషిత చామరములు వీవ గగనాంతరాళంబు కప్పి కాహళ ధ్వేరి పటాఖ శంఖాది శబ్దములు మెరయ సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్ర భాషణములు పలుకుచుండ భువన మోహనుండు పుండరీకాక్షుడు పుణ్య రాశి హస్తినపురము వెడలే హస్తినాపురం అలా వదిలిపెట్టాడట. పద్యం నిజానికి వ్యాఖ్యానం చేయక్కర్లా ఏం లేదు ఉద్ధవుడు సాత్యకి అటూ ఇటూ నిల్చున్నారు. ఛత్రం పట్టారు మరొకరు విజామర వీచారు. పరమానందంగా శ్రీకృష్ణ పరమాత్మని హాయిగా సాగనంపారు. అక్కడ ఉన్నటువంటి వేద పండితులంతా కూడా సగుణ నిర్గమ నిర్గుణ స్వరూపమైనటువంటి పరమాత్మని తేజోమయుడైనటువంటి కృష్ణున్ని సగుణమైనటువంటి లీలా మోహనమైనటువంటి కైవల్య స్థాయిని ఇచ్చేటువంటి మోహన కృష్ణున్ని అధికాధికంగా చక్కగా కీర్తిస్తూ అలా ఉండగా ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఉంటే ఉత్తమ శ్లోకుడు ఎలమి జన్మింపంగ యాదవుల తెల్ల అనఘమయ్యే కృష్ణుడు అలా వెళ్ళిపోతుంటే వీళ్ళ మనసులో కొన్ని భావాలు కలిగాయి. కృష్ణుడు అనేవాడు పుట్టినందువలన కదా యాదవ కులానికి ఇంత గౌరవం వచ్చింది అని. యాదవ కులాన్ని ఎందుకు ఎన్నుకున్నాడయ్యా అంటే ఆయన ఒకనాడు ప్రమాణం చేశారు. ఫలానా చోట పుట్టి నీకు గౌరవాన్ని తెస్తాను అన్నాడు. ఇచ్చిన ఒక్క మాట కోసం కృష్ణుడై వచ్చాడు. ఇందువల్ల కదా అంటూ పుణ్యవర్తనుడు పొద్దు ఉండంగ మధురాపురము దొడ్డ మహిమ కలిగే పురుష శ్రేష్టు వీక్షింప భక్తితో ద్వారకా వాసులు ధన్యులైరి. మహా బలశాలి ఎరిగి సుక్షింపంగ నిష్కంటకంబయ్యే నిఖిల భువనము జగన్మోహన ఆకృతిని ఇచ్ఛగించి పంచ శరభల్ల జాల విభజ్యమాన వివశ మానసమై పల్లవీ సమూహము ఇతనియధరా అమృతము గ్రోలు ఎల్ల పొద్దు. అసలు కృష్ణుడి యొక్క దివ్య నామము దివ్య రూపము ఎంత తలచుకున్నా కూడా అంటే పొద్దు అంటే మూడు అవస్థలు అని అక్కడ అర్థం. అవస్థాత్రయాతీతమైనటువంటి పరమాత్మని మధురాపుర వాసులు ద్వారకాపుర వాసులు ఇదిగో హస్తినాపుర వాసులు ముగ్గురేనా సర్వ జగత్తు సర్వ జగాలు కూడా జగన్మోహన రూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి ఆనందాన్ని ఆహారంగా భుజిస్తూ జీవించుతున్నారు కదా అంటాడు. అయితే సీమా ఉల్లంఘనం జరిగింది నెమ్మదిగా శ్రీకృష్ణుడి రథం ద్వారకా నగరానికి ప్రవేశించింది. సన్నివేశం ఇది అనుకోబోయే ముందు ఎప్పుడూ ఒక విషయం గుర్తొస్తుంది. స్వామి సర్వాంతర్వ్యామి కదా స్వామి లేని చోటంటూ లేదు. ఏదో మనము కన్వీనియన్స్ కోసం పుట్టపర్తి వెళ్ళాం వైట్ ఫీల్డ్ వెళ్ళాం అంటూ ఉంటాం. సర్వ జగన్ నాయకుడు అయినటువంటి పరమాత్మే పరమాత్మే పుట్టపర్తిలో ఉన్నప్పుడు పుట్టపర్తి ఎట్లా ఉంటుంది? రెండు గంటలు మూడు గంటల ప్రయాణం అలా వైట్ ఫీల్డ్ కి వెళ్లి వస్తాను అంటారు. పుట్టపర్తి స్వామి లేని పుట్టపర్తి స్వామి ఉన్న పుట్టపర్తి రెండు మన కళ్ళ ముందు ఉండాలి. ఎందుకంటే దాన్ని ఇక్కడ పోతన వర్ణిస్తాడు కృష్ణుడు లేని ద్వారక ఇంతకాలం కృష్ణుడు వస్తున్నా వచ్చిన అప్పుడే వచ్చిన ద్వారక ఎలా ఉన్నది అంటే మనకు అది అనుభవం మళ్ళీ చెప్పుకో అక్కర్లా. అసలు స్వామి ఇప్పుడు వస్తున్నారు అని మనకు వార్త తెలియగానే అందరం అలర్ట్ అయిపోతాం కదా. ఎక్కడినుంచి తిరిగి వెనక్కి వస్తున్నారు అన్నప్పుడు రేపటి నుంచి వైట్ ఫీల్డ్ వెళ్ళిపోతారట అని ఎవడో ఎక్కడో అంటాడు. అది నిజమో కాదో తెలియదు. అయ్యో అంటాం. ఏమయ్యా ఆయన ఒక్కడేగా ఉండండి ఏమవుతుంది? క్యాంటీన్ ఉంటుంది మన రూమ్ మనకు ఉంటుంది.తిరిగి రావటానికి రోడ్లున్నాయి ఆయన ఒక్కడు ఉండడు ఏమవుతుంది అనిపిస్తుందా మనస్సు అమ్మో స్వామి లేకపోతే పుట్టపర్తిలో ఎందుకు ఏం పని ఉంది మనకి అట్లాగే ఉన్నదట ఎవరికి ద్వారకాపుర ప్రజలకి ఆత్మారాముడు పూర్ణకాముడైన పరమేశ్వరునికి ఉపాయనములిచ్చుతూ ఆయన వస్తుంటే ఎవరికి తోచిన పండు, ఫలం, పుష్పం అవన్నీ కూడా పట్టుకొని ఆయన చేతికి ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారట ఆయన అందుకోవాలని వీళ్ళ కోరిక భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు కాస్త డబ్బున్న వాళ్ళు ఉపాయనాలు ఇస్తున్నారు ఆయనకు ఏదో బహుమతి ఇద్దాం ఇదిగో ఇది చేశాము ఇట్లా నెమలీకలతో నీ కోసం ఇది చేశామనో ఏదో ఒక వస్తువును ఇస్తున్నారు ఉపాయనములిచ్చుతూ నాగరులు వికసిత ముఖులై గద్గద భాషణములతో ఆనందంతో కూడా గద్గదం వస్తుంది మనకి దుఃఖంలో సరే ఎలాగో వస్తుంది సహజంగా ఆనందంలో కూడా వస్తుంది కంఠం పూడుకుపోతుంది గనుక అట్లాగే ఒక్కొక్కళ్ళు మా కృష్ణుడు వచ్చాడు వచ్చాడు అనుకుంటూ దయ్యకుండా ఎక్కడ కూడా అలసట లేకుండా నడపు అయ్యకు నడిపించిన అయ్య పరమాత్మకు నెయ్యంపు చూపుల అడ్డంపు లేని బిడ్డల చందంబున మొక్కి ఇట్లన్నారట. బిడ్డకి అంటే మనకి మన బిడ్డకి అడ్డం ఏదన్నా ఉంటుందా? మనకి ప్రపంచానికి అడ్డాలు ఉంటాయి. అసలు మనకి మనతోనే అడ్డం ఉంటుంది ఒక్కోసారి కదా! కానీ మన బిడ్డతో మాత్రం మనకు అడ్డం ఉండదు ఏమి చేయనీ మనకిష్టమే ఏం చేసినా సంతోషమే అసలు ఎంత తప్పు చేసినా అది ఒప్పే అది కాస్త చిన్న సంతోషం కలిగించే పని చేస్తే అమ్మో మా అమ్మాయి గెలిచేసిందంట ఇది ఆనందం అట్లా ఉన్నారట ద్వారకా ప్రజలు. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా! నీ సేవ సంసార సంతాప ధ్వంసినియౌ కదా! సకల భద్ర శ్రేణులన్ ప్రీతితో ఆపాదించు కదా! ప్రసన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు కదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్. అసలే మనకేమన్నా సొంత ఇంటికి వెళ్ళిపోతుంటే సొంత ఊరుకెళ్తుంటే ఆనందం ఉంటుంది తెలియక తెలియని ఒక ఆనందం ఉంటుంది అలా మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా పంచభౌతిక దేహాన్ని తీసుకొని వచ్చాడు ఆయన లోకరీత్య ఆయనకు కూడా ఒక ఆనందం కలుగుతున్నదట అసలే కృష్ణుడు అందగాడు నిత్య యవ్వనుడు షోడశ కళలు విరాజమానమైనటువంటి జగన్మోహన స్వరూపం అది అటువంటి వాడు స్వస్థానానికి తిరిగి వస్తున్నటువంటి వేళ అసలు కృష్ణుడి ఆనందమే ఆనందంగా ఉన్నదట. ఆయనేం అడగలే మీరంతా నేను లేకుండా ఎలా ఉన్నారు అని అడగలే అడిగారా ఎప్పుడైనా స్వామి? అలాగే ఈయన అడగలే కానీ వీళ్ళే ఆయనకేం చెప్తున్నారట అంటే ఉన్నారము సౌఖ్యముగా మేమెంత బాగున్నాం అంటే బాలేరని ఎవరన్నా అడుగుతారేమోనని విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్ ఉన్నారము ధనికులమై కన్నారము తాప కాంగ్రిక మలములు హరి అయ్యా మేము హాయిగా సుఖంగా ఉన్నాం ఏం ఇబ్బంది లేదు దాదా నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా బాగా డబ్బు సంపాదించుకొని అష్ట ఐశ్వర్యాలతో తులచుకుతున్నాము నీ దయవల్ల అన్నింటికంటే నీ భవ పరాక్రమమైనటువంటి కథలన్నీ విన్నాం నువ్వే మహాభారత సంగ్రామానికి మూలమని సనాతన సారథివని అక్కడ అక్కడ కూడా అన్నీ విని ఇవన్నీ కథలుగా మేము జీర్ణం చేసుకున్నాం కాబట్టి అవన్నీ మనసుతో చేశామయ్యా ఇవాళ నీ దివ్య పాద పద్మాలను ఇదిగో కంటితో స్వయంగా చూస్తున్నాం అన్నారట ద్వారకా నగర ప్రజలు. చూడండి వాళ్ళ మనస్సు శ్రీకృష్ణుడి ఎడబాటుతో తపస్సు చేసుకుంది. తపోబలం చేత పరమాత్ముని చూడగానే ఒక భావోద్వేగం కలిగింది. భావోద్వేగంలో నుంచి మానసిక సంభాషణలు చేస్తున్నారు దాన్ని మనం లౌడ్ థింకింగ్ అంటాం. లౌడ్ థింకింగ్ లో ఆయనేం అడగటంలే వీళ్ళే చెప్తున్నారు మేము బాగున్నాం అంటున్నారు నీ కథలన్నీ మాకు తెలుసు అంటున్నారు ఎందుకని ద్వారక వదిలి చాలా రోజులైంది కదా! చాలా రోజులంటే అదిగో యుద్ధానికి ముందు అర్జునుడు దుర్యోధనుడు వచ్చి ఏమయ్యా మరి నీ సహాయం కావాలంటే ఒకడికి సేన్యాన్ని ఇచ్చాడు ధర్మానికి మాత్రం తనని తానే ఇచ్చుకున్నాడు. తనను తానే ఇచ్చుకున్న వాడి పేరే దత్తుడు అది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కపిలుడై దత్తాత్రేయుడై అని వర్ణన దానిని సమన్వయం అలా చేయాలి. దత్తాత్రేయుడు అంటే కృష్ణుడు పరమాత్మ తనను తాను జగత్తుకి ఇచ్చుకున్నాడు లేకపోతే పాండవుల కష్టాలన్నీ ఆయన ఎందుకు ఒడి పట్టాలి ఆయనకేం పని? కౌరవులేమన్నా ఆయనకు అపకారం చేశారా కృష్ణుడికి చేయలే. తమ శత్రువైన పాండవులతో ఉన్నారు కనుక కృష్ణుడ్ని వాళ్ళు కాస్త శత్రువుగా చూశారు తప్ప పర్సనల్ గా రకమైనటువంటి వైరుధ్య భావం లేదు అయినప్పటికీ అన్నీ ఒడ-ఒడబట్టాడు అంతేకాదు ఎన్ని నిందలో ఆయన భరించాడు కేవలం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఒక ప్రమాణం ఒక నిరూపణ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మసంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ని మాటలు కూడా ఒడి పట్టాడు అని చెప్తూ అంతఃపుర కాంతలందరినీ కూడా వెళ్లి చూశాడు అది మనకు అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన లేకుండా ఉన్నారు గనుక ఎలా ఉన్నారు ఏమిటి మీరు పూలు పెట్టుకోలేదేమి మీరు అలంకారం చేసుకోలేదేమిటి చిలకలు మాట్లాడటం లేదేమిటి మాటలన్నీ మర్చిపోయినయా? అవన్నీ నేను ఊరు వెళ్ళిపోతే ఇవన్నీ మూత పడతాయా నేను ఉన్నట్టు ఉండాలి అని అంటున్నాడు కృష్ణుడు కూడా నేను ఊళ్లో ఉన్నా లేకపోయినా మన ఇల్లు ఎలా ఉండాలంటే నేను ఉన్నట్లుగా ఉండాలి అని చెబుతున్నాడు ద్వారకా నగరం కూడా నేను లేకపోతే ఇలా మూసుకుపోయి దీపాలు లేక అలంకారం లేక మీరంతా స్త్రీమూర్తులై ఉన్నారు పరమేశ్వరుడి యొక్క సగభాగమై ఉన్నారు ఇలాగ ఉండవలసింది అని కోప్పడ్డాడు సరే కోప్పడ్డా కోపమంతా నటనే గనుక అది సాగిపోతున్నది ఇక ఇంతలో ఈయన ఇక్కడికి ద్వార ప్రవేశించాడు ద్వారకా నగరం వచ్చేశాడు.
SSSMC · audio

Bhagawata Navaneetham - 08

Home

Bhagawata Navaneetham - 08

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 30:55

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

    Now playing
  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67