No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ [గూగుల్ అసిస్టెంట్ ధ్వని] వరుస ప్రాణాపాన వాయు నిరోధంబుగా విన్చి వరుసత్ ప్రాణాయామం చేసింది క్రమ ప్రా-ప్రాణాయామం చేసింది ఆ క్రమ ప్రాణాయామంలో శ్వాసని ఎట్లా ఆపాలి ఎక్కడ పెంచాలి ఎక్కడ చుంచాలి ఎక్కడ గతి నిరోధనం చేయాలి అది తీసుకు వచ్చేటువంటి అనేక వాసనా భూమికలన్నీ ఎలా వదిలిపెట్టాలి తెలిసిన అమ్మవారు గనుక వరుస అంటే ఇన్ ఆర్డర్ ఒక పర్టిక్యులర్ ఆర్డర్ లో యోగ విద్యని ప్రాణాపాన వాయు నిరోధంబుగా విన్చి వానిని ఏకముగ నాభితలమున గూర్చి అంతట ఉదానము దాక ఇప్పుడు నేను చెప్పింది ఉదానం అంటే నెగయించి బుద్ధితో హృదయ పద్మమున నిల్పి సహస్రారం దాకా వెళ్ళి ఆ వెళ్ళేటువంటి మార్గంలో వాని మెల్లన కంఠ మార్గమున మరి భూమధ్యమున వసింపజేసి శివాంగ్రి రాజీవ చింతనముచే నాధుని రక్క అన్యంబు చూడక అమ్మహాత్ముని యంకపీఠంబునందు ఆదరంబున ఉండు దేహంబు దక్షు బలని దోషంబు విడువదలచి తాల్చె తనువున అవిరాగ్ని ధారణములు మూలాధార ఓజ్యాన జాలంధర బంధనాలు దాటి యోగ తారావళిలో శంకర భగవత్పాదులు ఇవన్నీ వర్ణిస్తారు చెప్పుకుందాం ఒక రోజున ఆ మూడింటిని బిగించి దక్షుని వలన జరిగినటువంటి ఒక మాలిన్యాన్ని పోగొట్టుకోవటానికి యోగాగ్ని రగుల్చుకున్నది. ఎందుకనిటంటే శివుడి దగ్గరకు మళ్ళీ ఇదే శరీరంతో నేను వెళ్ళను అన్నది. ఎందుకు వెళ్ళవమ్మా వెళ్ళొచ్చు కదా ఆ దక్షుని సంహారం చేసుంటే నా తండ్రి తన ప్రాణంతో సమానంగా పెంచి ఇదిగో నా బిడ్డను నీకిస్తున్నానని కాళ్ళు గడియ కన్యాదానం చేసి అన్యాపదేశంగా పరోక్షంగా నా తండ్రికి నేను దూరంగా ఉన్నప్పుడు కూడా నన్నేమని పిలిచాడో తెలుసునా పార్వతీ, గౌరీ అని పిలవలే దాక్షాయణి అని పిలిచాడు. ఓ దాక్ష పుత్రిక అంటూ నా తండ్రికి ఉదాత్తమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు నా తండ్రి అటువంటి వాణ్ని అటువంటి పరమశివుణ్ణి నిందించాడు బిడ్డ కాబట్టి దాక్షాయణి నామంతో ఉన్న ఈ దేహంతో మళ్ళీ నేను నా పరమశివుడి దగ్గరకు చేరను అన్నది. ఎంత గొప్ప భావనో చూడండి అంక భాగంలో కూర్చున్నట్లుగా అంక భాగం ఏమిటి సింహాసనం నేలమీద కూర్చున్నది లేచింది అయ్యవారి అంక భాగంలో కూర్చొని యోగాగ్ని రగుల్చుకొని దాక్షాయణి అని నా తండ్రికి దాక్షాయణి పేరు ఎందుకు వచ్చింది తన తండ్రి పేరుతో కలిపి ఇకపై దాక్షాయణే గనక లేకపోతే శివుడు ఇంకెవర్ని పిలుస్తాడు ఇకపై ఎవరినీ పిలవకుండా ఉండుగాక అని యోగాగ్నిలో తన శరీరాన్ని భావకం చేసింది. ఇట్లు ధరియించి గత కల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితంబైన వహ్నిచే తక్షణంబు దద్ధమై, దద్ధమైంది. కూర్చున్నది యోగాగ్ని అమ్మవారికి ఒక సెకను కూడా పట్టదు తలచుకున్నది దాక్షాయణి నామంతో నేను మళ్ళీ నా భర్త దగ్గరకు వెళ్ళకూడదు ఈ పాపమంతా కైలాసం దాకా పట్టుకెళ్ళకూడదు అని అనుకున్నది ఈ శరీరాన్ని ఆ అక్కడికక్కడే దహయతి ఇతి దేహః శరియతి ఇతి శరీరః రెండు శరీరం అని దీనికి ఎందుకు పేరు అంటే మార్పు చెందుతుంది గనుక బాల్యం చూస్తాం కౌమారం చూస్తాం యవ్వనం చూస్తాం మధ్య వయసు దాటుతాం వృద్ధాప్యానికి వస్తాం మనకు తెలియకుండానే మార్పు చెందుతుంది గనుక దీనికి శరీరం అని పేరు. దహ్యతి ఇతి దేహః నువ్వు ఎన్నేళ్ళు వంద ఏళ్ళుండు, రెండు వందల ఏళ్ళుండు ఏదో రోజు ఈ బాడీ వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత దీన్ని తగలబెట్టాలి దీన్ని దహనం చేయాలి కాబట్టి దీనికి దేహము అని పేరు పెట్టింది కాబట్టి ఆ దేహం అన్నా శరీరం అన్నా ఈ రెండు దీనికి సంబంధించినవి అప్పుడు రుద్ర గణాలన్నీ కూడా విధ్వంసం చేసినయి. ఆ విధ్వంసం చేస్తే అక్కడ భృగు మహర్షి వాళ్ళంతా ఎవరైతే శివునింద చేశారో చూడండి భగవంతుని యందు భక్తి ఉందా లేదా నమ్మకం ఉందా లేదా పక్కన పెడదాం భగవంతుడు ఉన్నాడు లేడులో ఉన్నాడో లేడో నువ్వు తెలుసుకో ప్రపంచం అంతా దానితో పేచీ లేదు కానీ గురువు నింద, పరనింద, దైవనింద, ఆత్మనింద చేసుకోకూడదు. ఆత్మనింద అంటే నేను అధముడిని, నేను పాపిని, నేను పనికిరాని వాడిని, నేను ఈ లోకంలో అనవసరంగా ఉన్నాను అది చేయకూడదట. అలా చేస్తే మనల్ని మనం నిందించుకోవటం న్యూనత. గురువు నింద నీకు ఎవరు బోధ చేశారో ఎవరు నీ ఉన్నతికి మార్గం చూపించారో అటువంటి గురువుని పరోక్షంగా కూడా అనకూడదట. ఎందుకంటే ఒక దత్తాత్రేయ సాంప్రదాయంలోగురువుని భగవంతుని గనక నిందించినట్లయితే గురువు వచ్చి భగవంతుడికి సద్ది చెప్తాడట. నా శిష్యుడు అజ్ఞాని క్షమించమని. అసలు గురువునే నిందిస్తే దైవం రాడట. కాబట్టి గురునింద చేయకూడదు, పరనింద చేయకూడదు. మనం కాని వాణ్ని ఎవడైనా పరాయిగా ఉన్నాడంటే వాడు ఉన్నాడు. వాడిలో కూడా పరమాత్మని గనక చూడగలిగిన స్థాయికి వెళితే మనం నిందించం. కానీ ఏం చేస్తామంటే పరాయి వాణ్ని పరాయి వాడిగానే చూస్తాం. కనుక నిందించడానికి అన్ని వేళలా సిద్ధపడతాం. ఆ నింద చేస్తూ చేస్తూ మనం యాతన పడిపోతాం. మనకున్న energy అంతా drain అయిపోతుంది. అది చేయొద్దంటున్నాడు. సరే ఇదంతా అయిపోయింది. ప్రమథగణాలన్నీ కూడా శివుడి దగ్గరికి వెళ్ళినాయి మరి ఆయనకి చెప్పాలి. ఆయనకి తెలియదని కాదు మనం స్వామికి ఉత్తరం రాసినట్టు అంతేగా ఆయనకి తెలియదా అనుకుంటూనే ఉత్తరం రాస్తాం కదా. అలాగే వీళ్ళు కూడా వెళ్లారు. వెళ్ళి భవాని పంచత్వం పంచత్వము అంటే మరణం భవాని పంచత్వం భవుని యొక్క భార్య భవాని. పరమేశ్వరుడి యొక్క భార్య దాక్షాయణి ఆ క్షణంలో ప్రమథ గణాలు రుభు నామక దేవతలచే రుభు నామక దేవతలని ఆ వచ్చినటువంటి రుద్ర గణాలని రుభులుగా చెప్పబడ్డారు. దానినే తరువాత రుభు గీత అని ఒకటుంది అష్టావక్ర గీత మన అవధూత గీత వశిష్ఠ గీత భగవద్గీత ఎట్లాగైతే ఉన్నాయో రుభు గీత అని ఒకటుంది. ఆ రుభుములంతా అది రుద్ర పారాయణంతో సమానం. అయితే రుద్ర పారాయణం చేసిన ఫలితం రుభు గీతను చదివినా అది మనకు ఏర్పడుతుంది గనుక రుభు గీత ఎక్కడైనా ఉంటే చదవండి. చదవలేకపోతే ఒకరోజు ఎప్పుడో చెప్పుకుందాం. ఎప్పుడైతే దాక్షాయణి తన మాట తన మాట విననందుకు ఆయనకి కోపం రాలే ఒక దుర్మార్గుడైన తండ్రి ఆవరణంలో తన భార్య తన సహభాగం నశించిందే అని పరమశివుడికి ఆయన మరి ఆయన రుద్రుడు ఆ రుద్రుడు కాబట్టి ఆ రుద్రత్వాన్ని ఆవాహన చేశాడాయన చేసి ఆర్జుండు ఉగ్రుడు నీలకంఠుడు ఇహ దైత్యారాతి తపో కష్టోష్టుడై మాజధ్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ ఆయనొక వికటాట్టహాసం చేశాడట. విషాదంలో నుంచి కూడా ఒక నవ్వు వస్తుంది. ఆ విషాదంలో వచ్చేటువంటి నవ్వు భయానకంగా ఉంటుంది. ఎందుకనంటే తనలో ఏర్పడినటువంటి ఉద్విగ్నమైనటువంటి మనసుకు ఒక outlet కావాలి. ఆ ఉద్విగ్న మనస్సాన్ని భగ్నం చేయాలి అంటే వికటాట్టహాసం చేశాడట శివుడు. చేసి విద్యుద్వన్హి శిఖా సముచ్ఛరుచిన్ వెల్గందు చించజ్జటన్ ఒక పెద్ద విద్యుత్తు మెరుపుతీగ వలే ఉన్నటువంటి ఒక జడ ఒక్కసారి జట పీకాడట. తన తలలో నుంచి సజ్జక్రోధముతోడ అప్పుడే పుట్టిన క్రోధం సజ్జస్పురణ అంటే అప్పుడే కలిగిన స్పురణ. అలాగే ఇది ఈ క్రోధం ఎప్పటినుంచో ఉన్నది కాదు. పగ దక్షుడి హృదయంలో ఉన్నది గాని పరమేశ్వర హృదయంలో దక్షుడికి పట్ల ఆయనకి పగ లేదు. పగాలేదు, బగాలేదు. ఆ రెండూ లేవు గనుకనే ఆయన పరమేశ్వరుడు అయినాడు. ఇక్కడ అప్పుడే పుట్టిన ఈ సన్నివేశం వలన ఏర్పడినటువంటి క్రోధంతో కుచ్చిపై చంక్ష్మాచక్ర మధ్యంబునన్ కైలాసంలో అట్లా జడని ఇలా వదిలిపెట్టాడట నేలమీదికి. ఆ నేలమీదికి వదిలిపెట్టగానే ఒకడు పుట్టుకొచ్చాడు. ఆ ఒకడు నిజానికి కాపాలికుడు వాడు. ఆ కాపాలిక స్వరూపం ఎట్లా వచ్చింది? శివుడికే కోపం వస్తే ఏమవుతుంది అంటే అభ్రమ్లిహాదభ్రవిభ్రామభ్రమభ్రమత్ కృన్నీలదీర్ఘ శరీరమమర ప్రజ్జజ్వలనదీప్తి జ్వాలికాజ్వాలజ్వల్యమాన కేశములు bereయ చండద్విదేశుండదండాశున్దాంభదుర్భంద సాహవృద్ధుత హేతిస౦ఘమొప్ప వీక్షణత్రయలోకవీక్షణజ్జుతి లోకవీక్షణత్తతి దురీక్షణముఖాః కటకటెన కరాళదంష్ట్రలు వెలుంగ ఘనకపాలాశ్చiv వరమాలికలు తనర అఖిలలోకభయంకరుడగుచు వీరభద్రుడు దయల్చె మారురుద్రుడగుచు రుద్రుడి యొక్క ప్రతిరూప మారురుద్రుడు అన్నట్టుగా వాడు పుట్టాడట. మూడు కళ్ళు కూడా మూడు లోకాలని నిప్పంటించేట్లుగా ఉన్నాయట. మరి ఆయన మూడు కళ్ళవాడు కదు. రెండు కళ్ళు సమానంగా ఉంటాయి ఒకటేమో ఎగుడుదిగుడు అది. ఆ ఎగుడుదిగుడు ఇది మా లోకం ఇది. గోలోకం తెలుసు స్వామి అంటారు మీరేదో గోలోకంలో ఉన్న వాళ్ళంతా హాయిగా వెళతానంటే భూలోకానికి పంపాను భూలోకంలో ఉన్న వాళ్ళంతా మా లోకంలో పడిపోతున్నారేమి అన్నారు. మా లోకం అంటే మాయా లోకం అది. భూలోకం అంటే భరించవలసిన లోకం. గోలోకం అంటే జ్ఞాన లోకం. గో అంటే జ్ఞానం. కాబట్టి అటువంటి ఆ వీరభద్రుడు మారురుద్రుడై పుట్టాడట. పుట్టగానే వాడు అడిగాడు ఏం చేయమంటావయ్యా అన్నాడు. సరసభవృత్తి అట్లరుగు సైన్యపదాహత పాదధూళిధూసరిత కుబేర దిక్తటము సభ్యులు దక్షుడు జూచి ఎట్టిభీకరతమో అంజనంచు తమముగాదుర చెప్పటలంబనుచు నివ్వెరపడి పల్కిరి ఆత్మల వివేకహీనత పొంది వెండియున్. వీడ ఎప్పుడైతే పుట్టాడో ఇదిగో దక్షుడి యొక్క అద్వారాన్ని యాగాన్ని ధ్వంసం చేయమన్నాడు శివుడు. ఎందుకంటే అమ్మవారే అక్కడ నశించింది గనుక అర్ధభాగం శాపం వలన యాగార్ధం ఈయనకి లభించదు. అమ్మవారు కూడా లేదు గనుక ఒకవేళ వాడు ఇచ్చిన ఆయన పుచ్చుకోబోయేది పావే. పుచ్చుకోడట పరమాత్మ. అందుకంటే ఆహుతి వేరు పూర్ణాహుతి వేరు.పూర్ణాహుతి ఎప్పుడు ఉంటుంది అంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నప్పుడే ఇక్కడ అమ్మవారు ఈ క్షణాన లేదు గనుక శివుడు అన్నాడు ఆ యజ్ఞం పనికిరాదు అన్నాడు అసలు శివుడు శివుడికి ఆహ్వానం పంపని యజ్ఞం యజ్ఞమే కాదు అయినా ఇవన్నీ జరగాలి గనుక జరిగిరాయి వెళ్ళాడు. ఈ దక్ష ప్రజాపతిని దగ్గరకు తీసుకున్నాడు అందర్లోనూ పట్టుకున్నాడు ఆయన వీరభద్రుడు వీరభద్రుడు పట్టుకునే పటికి వాడు అనుకున్నాడట ఆకాశంలో నుంచి ఒక పిడుగు మన వాకిట్లో పడి ఆ పిడుగులో నుంచి రజను ఏర్పడి ఇదంతా ఏదో హాహాకారం అవుతున్నది అంటే ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క లక్ష వీరభద్రులు పుట్టారట ఒక లక్ష భావనులుగా పుట్టే ఆ లక్ష భావనులతో పుట్టినటువంటి రుద్రులంతా కూడా ఆ యజ్ఞాన్నంతా పూర్ణం చేసేశారు అంటే నాశనం చేశారు. ఈ ధూళి పుట్టుటకు ఏది హేతువో విలయ సమీరము ఆ పలయదిపుడు ప్రాచీనవర్హిధరాపతి మహితోగ్రశాసనుడిప్పుడు రాజ్యంబు సేయ చోరసంఘములతో రారాదు మరి భోగనాళి రాకకు సమయంబు కాదు కావున ఎప్పుడు కల్పావసానంబు కాపోలు అటు కాకయున్న ఇట్టి ఔత్పాతిక రజము ఎందేని కలదే. ఉత్పాతం జరుగుతుందా ఇదేం కల్పాంతం కాదు అవునేమో కల్పాంతం వలననే ఇవన్నీ జరుగుతున్నాయేమో మనం అనుకుంటాం రోజూ పేపర్ చూడగానే పేపర్ మానేద్దాం అనిపిస్తుంది కానీ మర్నాడు పొద్దున్నే రాకపోతే దిగులు వేస్తుంది చూశారా విచిత్రం ఏముంటుందయ్యా పేపర్లో అంటే ఏం ఉండదు ఇటువంటి ప్రపంచంలోనా మనం కూడా బతుకుతున్నాం మనం కూడా contribute చేస్తున్నామా దాని ఈ మహాపాతంలో మనం కూడా భాగస్వాములం అవుతున్నామా అని ఒక స్పృహ ఒక బాధ కలిగినా మళ్ళీ లోకరీతిలో ఏం జరుగుతుందో ఏం జరుగుతున్నది అనేటువంటి ఒక అజ్ఞాన పూరితమైనటువంటి భావన కాబట్టి ఇవన్నీ ఇట్లా ఎందుకు జరిగాయని అనుచు మనముల భయమున్ విరసటి జనులు సురలు దక్షునంత ప్రసూతి ముక్షులైన భూసుర కాంతలు ఇట్లనిరి. ఓ రోజు దక్ష ప్రజాపతి భార్య పేరేమిటి అని ఓ ప్రశ్న వచ్చింది. అది ఎటువంటి సమయంలో అంటే train లో కుడి కాలు ఉంది నేలమీద platform మీద ఎడం కాలు ఉంది పుటపర్తి నుంచి phone వచ్చింది దక్ష ప్రజాపతి యొక్క భార్య పేరు ఏమిటి? అన్యైనా అని ఒక పేరు ఉంది ధారుణి అని రెండో పేరు ఉంది అసలు వేదవ్యాసుడు ఈయన ఆమె పేరు ప్రసూతి దక్షుడి భార్య పేరు ప్రసూతి అలాగే దశరథ మహారాజు భార్యలు ఎవరంటే టకటక అని చెప్పేస్తాం జనకుడి భార్య ఎవరు అనగానే ఏమో ఆమె పాత్రే ఉండదు ఆమె పేరు సుమేధ ఆ పేర్లు కూడా చూడండి ఈవిడ ఈ ప్రసూతి ఈ ప్రసూతి దక్షుడి భార్య మిగిలి ఉన్నది పాపం ఆవిడ. తన కూతులు చూడగ నిజ తనయను సతి అనపరాధ తగ పరీక్ష్లై గొలరించిన యా దక్షుణి ధనపాప విపాకము ఇది యా తగు అనుచున్. వీడంతా కల్పాంతం అయిపోయింది ఏదో ఆ ప్రళయం వచ్చేసిందని దక్షుడు మిగతా వాళ్ళంతా అనుకుంటే నిజమైన తన కూతురు పట్ల తన తండ్రి చూపించినటువంటి అనాదరమే ప్రళయంగా మారింది అన్నది ప్రసూతి. ఆ పేరు కూడా చూడండి ప్రసూతి అంటే ఏమిటి delivery ఇవాళ English లో కదా delivery కాదు ప్రసూతి సూతుడు అంటే సుతుడు సూతుడు కొడుకు సుత అమ్మవారు ఇక ఆడపిల్ల అందరూ ఇవి ముగ్గురు పిల్లలు ఉన్నారు సతీదేవి తో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈవిడ ప్రసూతి ముగ్గురు మంచి పిల్లలకి జన్మనిచ్చినటువంటి ప్రసూతి అని అర్థం తల్లి మంచిదే గాని తండ్రి చెడ్డవాడు ఏం చేస్తాం దక్షయజ్ఞం ఇలా అయిపోయింది అయిపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మ కంతా కూడా చెప్పారు ఎందుకు బ్రహ్మకి చెప్పారు అంటే అయ్యా ఈ సృష్టి విధ్వంసం లో ఇవాళ జరిగింది ఇది వీరు వీరంతా స్వస్థానాలకు వెళ్లారు అని చెప్తూ బ్రహ్మకి ఇంత నాశనం అయింది అంటే ఆయన అంత సృష్టి చేస్తాడు అని అర్థం ఇది మనం ఒకసారి విచారణ చేశాం నిజంగా అలా జరుగుతుందా అని తత్వార్థ విచారణ గనుక చేసినట్లయితే శృంగేరిలో శృంగేరి భారతీ స్వామి వారు శారదాదేవికి పూజ చేసుకుంటూ ఉన్నారు పూజ చేసుకుంటూ ఉంటే ఆయన కుడివైపున కుంకుమ బస్తా ఉంది ఆ బస్తాలో నుంచి తీస్తున్నారు వేస్తున్నారు ఆయన మంచి ధ్యాన ముద్రలో ఉన్నారు చూస్తున్నటువంటి వారందరికీ దాంట్లో కుంకుమ నిండుకునే పరిస్థితి ఏర్పడింది ఈయన ఆపకపోతే ఎట్లా దానిలో కుంకుమ లేకుండా అయిపోతుంది ఇంకా కొన్ని గ్రాములు మిగిలి ఉంది అనంగా వీళ్ళు చుట్టూ ఉన్న పరిచారకులంతా కూడా గందరగోళ పడిపోతున్నారు వారిని disturb చేయలేరు అయ్యా కుంకుమ నిండుకున్నది అని చెప్పలేరు ఈ పూటకి ఈ పూజ చాలు అనటానికి లేదు ఆయన ధ్యానంలో ఉన్నారు ఆ last చిట్టచివరి ఆ few grams కుంకుమ అక్కడ ఉన్న సమయంలో అదే ధ్యాన ముద్రలో ఆయన చేతిని ఇట్లా అన్నారు ఎంత ఖర్చు అయిపోయిందో అంత నిండింది నిండుకున్నది కాస్త నిండింది నిండయ్యింది ఆయన పూజ ఇంకా కొనసాగించారు అంతా అయిపోయిన తర్వాత ఆ నది దాటి తుంగభద్రా నది దాటి తుంగ దాటి లోపలికి వెళ్తుంటే పరిచారకుడు నెమ్మదిగా అడిగాడు భయపడ్డాం ఇవాళ కుంకుమ బస్తా ఖాళీ అయిపోతుందేమో మళ్ళీ అప్పటికప్పుడు ఎలా తేవాలి ఎక్కడి నుంచి తేవాలి అని అనుకున్నాం.ఇవాళ పరమాద్భుతం చూశాం మీరు చేసిన ఒక మహిమ అన్నారు. ఆయన నెమ్మదిగా ఒక మాటన్నారు. ఇది చూస ఆశ్చర్యపోతున్నారు. మీరంతా జాగ్రదవస్థలో ఒక రోజంతా గడిపి ఆదమరిచి హాయిగా నిద్రపోతున్నటువంటి వేళ ఎంత సృష్టి జరిగిందో మళ్ళీ సూర్యోదయాత్ పూర్వమే అంతా నింపుతున్నటువంటి అమ్మని దయను మీరు గమనించలేదా? ఎంత పోచున్నదో అంత ఇవ్వటం లేదా ఆవిడ? అన్నీ ఇవ్వగలిగిన ఆమెకి మనకు కావలసిన కుంకుమ ఇవ్వలేదా? అని త్రింగారి భారతీ స్వామి వారు. మహాత్ములు వాళ్ళందరూ కూడా జ్ఞానబోధ ఇట్లా ఈ రకంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి భాగవత నవనీతంలో ఇవాళ చిలికిన ఆ చిలుకుడులో మనం పొందిన వెన్న ఏమిటి అంటే మూడు ఉన్నాయి. పరమేశ్వరుడి భార్యే పొరపాటు పడింది కదా అంటే పరమేశ్వరుడి భార్య తన తండ్రి వలన పొందినటువంటి మూడు దోషాలను కూడా శరీరాన్ని దహనం చేసుకున్నది అంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని కాదు. ఆ మూడు దోషాలని కూడా ఆవిడ అగ్నికి ఆహుతం చేసేసింది. ఆమె ఎప్పుడూ శుద్ధాత్మే. మనం మంచి తెల్ల చొక్కా వేసుకుని వచ్చాం పైనుంచి ఎవడో గులాల్ కొడితే మనమేం చేస్తాం? చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, ఈ మళ్ళీ మార్చుకోగలిగింది తీర్చుకోగలిగింది అంటే తీర్చుకోవాలి. లేస్తే మూటగట్టి బట్టలు దాంట్లో పడేయాలి. మనం దాన్ని వాడకూడదు. అమ్మవారు చేసింది అదే పని. ఈ ప్రపంచం అంతా కూడా మూడు దోషాలతో కూడి ఉంటుంది గనుక ప్రధానంగా విక్షేప దోషం, ఆవరణ దోషం, మల దోషం. ఈ మూడు దోషాలే మానవుడికి క్రోధాన్ని, అహంకారాన్ని, అసూయని, మాత్సర్యాన్ని, దాంబికాన్ని, ప్రగల్భాన్ని అన్ని వేళలా ఇస్తుంది. పరమాత్మ యందు ఎంత మనస్సు లగ్నమై ఉన్నా, ఎంత గాఢమైనటువంటి ప్రేమ ఆయన యందు ఉన్నా, ఎప్పుడన్నా మన పని అవటంలో కొద్దిగా తేడా వస్తే పరమాత్మవి కావు అనటానికి సందేహించని మనసు ఉన్నది మన దగ్గర. జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడు ఆయన చూస్తాడు. ఎప్పుడన్నా వీడు నన్ను వీడిపోయేటువంటిది వస్తుందా అని. మనం ఆ పరీక్షలో మాత్రం ఓడిపోవటానికి వీలు లేదు. స్వామి ఎంత మనకు అభయమిచ్చినా, మీరు నన్ను వీడినా నేను మిమ్మల్ని వీడను అన్నారు. అది నిజమే. కానీ ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వీడేదో నాలుగు పనులు అనుకున్నాడు. ఈ పనులు కావటం లేదు గనుక వదిలిపెడతాడా, వదిలిపెట్టడా అని. వదిలిపెట్టని వాడిని తనవాడిగా చేసుకుంటాడు. ఆ బాధ్యతలు తన మీద వేసుకుంటాడు. కాస్త అటూ ఇటూ ఉన్నవాడికి వాడిని కూడా అటూ ఇటూ ఉయ్యాల జంపాల ఊపుతాడు. కేవలము ప్రాపంచికమైన కామ్యంతోనే గనక పరమాత్మను గనక కీర్తించినట్లయితే ఆ కామ్యం ఇస్తూ పోతూ ఉంటాడు. షిరిడి బాబా కూడా అదే అన్నారు. మీరు అడుగుతూ ఉండండి నేను ఇస్తూ ఉంటా. కానీ ఏదో ఒకరోజు మీ జీవితంలో కూడా రాకపోదు. ఇంకా ఏమున్నాయి అడగటానికి అని. ఆ క్షణంలో మీ పని ఆగుతుంది. నా ఆట ప్రారంభమవుతుంది. ఆ ఆట ఏమిటంటే, మీ నుంచి అన్నీ తీసుకుని మీకన్నీ కూర్చి కూర్చి ఇచ్చానే, దానికి పదింతలుగా మీ నుంచి నేను తీసుకోవటం మొదలు పెడతా. దానికి మీరు సిద్ధంగా ఉండండి అని. స్వామి కూడా అంతే. మన స్వామి ఏం భిన్నం ఏం కాదుగా అదేగా. ఆ షిరిడి సాయేగా స్వామి అయింది. ఈయన కూడా అంతే. కోరుతూ ఉండండి తీరుస్తూ ఉంటారు. ఆయనకేమీ ఏం భయం లేదు. ఆయనకేం భయం లేదు. ఎన్ని అడిగితే అన్ని. కానీ ఆయన అడగటం ప్రారంభించినప్పుడు ఆయన అడగవలసినవి అడుగుతారు. లోకోత్తరమైనటువంటి పనులు చేయమంటారు. లోకానికి హితకారమైనటువంటి పనులు చేయమంటారు. దాని వలన చిత్తశుద్ధి, మనో నైర్మల్యం, నిర్మలత్వం, ఒక నిశ్చలత్వం, ఒక యోగత్వం, ఒక ఆధ్యాత్మికత్వం, ఇవన్నీ కూడా మనకు వనగూడాలి గనుక ఈ పూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్ళమని దాక్షాయణి చెబుతుంది. అందుకనే గురువు ఎంత మహాత్ముడైనప్పటికీ కూడా ఎప్పుడైనా నీ జీవితంలో నీ ఆత్మోన్నతికి గనక అడ్డుపడ్డట్టయితే ఆ గురువుని పక్కదారి తప్పించుకొని వెళ్లిపొమ్మన్నారు ముందుకి. నీ దారిన నువ్వు వెళ్ళమన్నారు. ఎందుకంటే గురువు పెడదారి పట్టిస్తాడా అంటే పట్టించడు. కానీ మనకక్కర్లేదు. ఆ భావనలు దాటి ఉత్తమోత్తముడైన ఇంకో గురువు మనకు కాచుకొని ఉంటాడు గనుక ఆ పూర్ణ స్థితిలోకి వెళ్ళాలని, అంతే కాకుండా జీవన ధర్మంలో, కుటుంబ వ్యవస్థలో ఒక ధర్మంలో ప్రధానమైనటువంటిది అన్యోన్యత. అన్యోన్యత ఒక నమ్మకం మీద, పరిపూర్ణమైన విశ్వాసం మీద, కండిషన్స్ లేని ప్రేమ మీద, జీవితాన్ని మలచుకునేటువంటి దివ్యభావనా రీతుల మీద ఉన్నదాంట్లోనే ఆనందాన్ని, పరమేశ్వరుడు అందరికీ ఒకే రకమైన జీవితం ఇవ్వడు. ఇచ్చే అందరికీ ఒకే రకమైన జీవితం అనుకోండి ఘర్షణ ఏముందసలు? పోట్లాటేముంది? లేదు. కాబట్టి ఎవరి జీవితం వారిది. వారి వారి ప్రాకృత కర్మలను బట్టి, ప్రారబ్ధాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఒక డిజైన్డ్ ఒక కాప్సుల్ లాగా జీవితం మనకి ఇవ్వబడుతుంది. ఆ ఇవ్వబడినటువంటి జీవితంలో నుంచి మన కర్మల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన బుద్ధి ద్వారా, మన విచక్షణ ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికి దాన్ని ప్రతిరోజూ కూడా మధనం చేస్తూ ఉండాలి. అందులో ఇద్దరే ఉండాలి. జీవితం వాళ్ళది, కుండ వాళ్ళది, కుండలో ఉన్న పాలు అంటే భాగం కూడా వాళ్ళది. పాలు అంటే రెండు అర్థాలున్నాయి. ఒకటి భాగం, రెండవది వారిది అని. దాన్ని వాళ్ళే చెలుక్కోవాలి, వాళ్ళే వెన్న తీసుకోవాలి, వాళ్ళే ఆరగించాలి. బాగా వెన్న వచ్చింది మీరందరూ రండి వెన్న వ్రతం చేస్తామని ఎవరనరు. హాయిగా దీంట్లో ఏం అపచ్చలు చేద్దామని మొదలు పెడతారు. అట్లాగే పొందినదంతా తమదిగా తామే అనుభవించవలసి ఉన్నది గనుక కుటుంబ వ్యవస్థలో దాక్షాయణి ఒక గొప్ప భావన, ఒక గొప్ప నీతి, ఒక సందేశం ఒక్కటే.భార్యాభర్తలుగా మీరు ఏర్పరచుకున్నటువంటి సంసారాన్ని మీరు జాగ్రత్తగా, అన్యోన్యంగా, ప్రేమపూరితంగా ఒక మధనం ద్వారా ఆ నవనీతాన్ని మీ అంతట మీరు పొందండి. మీరు ఆరగించండి. మీ ఆనందాన్ని పంచిపెట్టండి. అలాగే వెళ్ళవలసిన చోటికే వెళ్ళండి. ఉండవలసిన వారితోనే ఉండండి. కానీ ఆవరణ మల విక్షేప దోషాలతో పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ నిర్మలత్వాన్ని మాలిన్యం వైపు తీసుకుని వెళ్ళకండి. ఎందుకంటే మనం ఉన్నాం, పరమేశ్వరుడిని చూశాం, పరమేశ్వరుడితో మాట్లాడాం, పరమేశ్వరుడిని తాకాం. ఇందాక అనుకున్న మూడు మనకు స్వామి ఇచ్చారు. ఇచ్చిన మనం మళ్ళీ ఆవరణ దోషములోకి వెళ్ళకూడదు. ఆ ఆవరణ భావనావరణం కూడా కావచ్చు. అన్ని హింసల కంటే కూడా భావహింస చాలా గొప్పది. చాలా కఠినమైనది, ఘోరమైనది. అది కాకుండా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో పరమేశ్వరుడి యందు పూర్ణమైనటువంటి ఒక భక్తితో, అనన్య భక్తితో, అనన్యమైన, అన్యోన్యమైనటువంటి ప్రేమతో జీవితం కొనసాగించినట్లయితే అమ్మవారు "ఇలా వెళ్తున్నాను మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు" అని అన్నప్పుడు అయ్యవారు చెప్పవలసినది చెప్పారు. "నాకే నిష్ఠురమాడాడు. నాతో కూడి ఉన్నావు గనుక నీకు గౌరవం వాడు ఇవ్వడు" అని అన్నాడు. అన్నా "కాదు నేను వెళ్ళాలి" అన్నది. మళ్ళీ "మా తండ్రి చేస్తాడా, అందులో వాజపేయ యజ్ఞం మామూలు యజ్ఞం కాదు, అది సత్రయాగం. సోమయాగం వేరు సత్రయాగం వేరు. సోమయాగం ధ్యానం, సత్రయాగం భజన. ఇదిగో సత్సంగం సత్రయాగం. అందరం కలిసి చేసుకుంటాం. ఈ వాకిట కట్టిన తోరణానికి కూడా మనకు పొం-- మనం పొందిన ఫలితం సమానమైన వాటా అది లభిస్తుంది-- పొందుతుంది అది. కాబట్టి సత్రయాగానికి వెళ్ళొద్దు నువ్వు, అక్కడికి వెళితే అగౌరవం పొందుతావు" అన్నాడు. అయినా స్త్రీ సహజమైనటువంటి ఒక భావన చేత, తన వారినందరినీ కలుసుకోవాలన్నటువంటి ఆతృత చేత, తన మనస్సును తాను చంపుకొని "అయ్యో! భర్తకి ఎదురు చెప్పి వెళ్తున్నానే" అని అనుకుంటూ కూడా వెళ్ళి, వెళ్ళి "ఏమైందయ్యా?" అంటే ఇదిగో జరిగింది. అలా జరగకూడదని తత్వార్థ విచారణలో అన్యోన్యమైనటువంటి అర్థనారీశ్వర తత్వంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఏది ఉండనివ్వండి వారిద్దరి మధ్య ఉండాలి. వారిద్దరే సమన్వయం చేసుకోవాలి. సంఘర్షణ లేని రీతిలో జీవితాన్ని చక్కగా తెద్దుకోవాలి. జీవితం అంటే నడిపేది కాదు, గడిపేది కాదు. జీవితం అంటే జీవించేది. ఎలా జీవించేది? భగవంతుని యొక్క ప్రేమతో తడిసి, భగవంతుని యొక్క అనుగ్రహంతో పునీతమై, భగవంతుని యొక్క రక్షణలో సాగేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రస్థానమే అధ్యాత్మ ప్రయాణం. కాబట్టి ఈ వీరభద్ర విజయం, ఎవడు ఆ వీరభద్రుడు అంటే శివాత్మకమైనటువంటి రౌద్రభావనే వీరభద్రుడు. మనలో కూడా ఒక్కొక్కసారి ప్రపంచాన్ని జయించే పని మనది కాదు. ప్రపంచం నుంచి ఓటమి కూడా మనం పొందకూడదు. ప్రపంచం మనల్ని ఓడిస్తే ఎట్లా? మనము గెలవాలి. కానీ ప్రపంచాన్ని మనం గెలవకూడదు. ఇది భారతీయ ఆత్మ. భారతీయ చరిత్రని ఎంత గమనించినా భారతదేశం ఎవరి మీదా యుద్ధం చేయలే. భారతదేశం మీదా యుద్ధాలు జరిగినయ్. ఈ, ఈ స్పష్టమైనటువంటి భావనని ఈ వీరభద్ర విజయంతో ఇవాళ మనం పూర్ణం చేద్దాం. చతుర్థ స్కంధం అంతా, నాలుగవది అంతా కూడా అనేకమైన పౌరాణిక గాథలు. అందులో పృథువు, వేనుడు వీళ్ళ కథలన్నీ ఉన్నాయి. కానీ ఆ కథలన్నీ కూడా ఒక రాచరిక వ్యవస్థకి, ఒక ప్రభుత్వకి, ఒక పాలనకి, ఒక అధికారానికి, ఒక ఆభిజాత్యానికి పరిమితమైనటువంటి కథలు కాబట్టి అవి మనకి అక్కరలేవు గనుక వాటిని పరిహారం చేద్దాం. మనకి ఏం కావాలో, ఏ తత్వ విచారణ చేసుకోవాలో అవే చేసుకోవాలి. రేపు ధ్రువోపాఖ్యానం. ధ్రువుడు మన కడుపున పుట్టినటువంటి బిడ్డ అటువంటి వాడిగా ఉండాలి. ధ్రువుడిగా, మార్కండేయుడిగా, మృత్యు భావనను జయించగలిగిన, లక్ష గమ్యాలు చేధించుకొని చేరగలిగినటువంటి ఉత్తమోత్తముడైనటువంటి బిడ్డ మన గర్భవాసాన పడాలని పరమేశ్వరుడిని అన్నివేళలా కోరుకోవాలి. అంతేగాని పున్నామ నరకను దాటించడానికి కొడుకు, కొడుకు కావాలి అంటే వాడు సన్మార్గుడైతే మనల్ని దాటించగలుగుతాడు. వాడికి అసలు మార్గమే తెలియని వాడు కడుపున గనుక పుట్టినట్లయితే ప్రయోజనం లేదు గనుక వ్యర్థమైన ఆలోచనలన్నీ చక్కగా వదిలిపెట్టి స్వామి అనుగ్రహించినటువంటి ఈ భాగవత నవనీత రసాయన కర్ణపేయమైనటువంటి ఈ శ్రవణ యోగాన్ని పరిపూర్ణంగా అనుభవించేటువంటి ఒక స్థితిని స్వామి అనంతకోటి గురు స్వరూపాలు మనకు దివ్యముగా అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ హంసానంది రాగు.
SSSMC · audio
Bhagawata Navaneetham - 26
Bhagawata Navaneetham - 26
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 29:00
More in this series