No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన వందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శీల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి స్వరూపం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాంవే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ వేదవ్యాస ప్రోక్తమై బమ్మెర పోతనామాత్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణ జననం తల్లికి పద్నాలుగు భువనాలు మన్ను తిన్నవేళ వెన్న తిన్నాడో లేదో అన్న సందేహం ఉన్నవేళ దివ్య దర్శనాన్ని అనుగ్రహించినటువంటి ఒక సన్నివేశంలో మనం ఆగాం. ఆ తర్వాత అనేకమైనటువంటి మహిమలు అనేకమైనటువంటి మాయా మానుష వేషం ఆయనది. రాముడు మాయా మానుష వేషం శ్రీకృష్ణుడు లీలా మానుష వేషం సత్యసాయి భగవానుడు మాయా లీలా మానుష వేషం అది. మాయ ఉంది లీల ఉంది మాయ రాముడు లీల కృష్ణుడు రెండూ కలిపితే సత్యసాయి భగవానుడు. నిగమ కల్పతరోర్గయితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భాముకాః భాగవతం అనేటువంటి ఈ పండుని ఈ రసమాలయాన్ని శుకదేవుడు ఎలా చక్కగా పానం చేశాడో ఎట్లా ఆనందించాడో అటువంటి స్థాయిలో శుకదేవుడు అంటే మామూలు వాడు కాదు ఆయన అరధూత మహర్షి నిత్య ముక్తుడు ఆయన వేదవ్యాసుల వారి కుమారుడు అటువంటి వాడు ఈ భాగవత ఫలాన్ని సానందంగా అనుభవించాడు గనుక ఈయన పోతనామాత్యుడు అంటున్నాడు. నీ పద్యాలవుళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ మనకివ్వాల కావలసిన పద్యమే ఇది. నీ పేరు మీద జరిగే పనులలో నేనుండాలి. నీ పద్యాలు ఆలకించు చెవులుండాలి. అలాగే నీ గురించి చెప్పే మాటలు కావాలి. నీ పాదంబుల పంట ముక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకుయుం ముకరుణం నీరేజప త్రేక్షణ స్వామి మాకుడే వేళగైవయ్యా పోతనాదేవి అడిగాడు వేళ మేము అది పూని అడుగుతున్నాం కాబట్టి మీ దివ్య ధామంలో మేముండేట్లుగా అన్నివేళలా మేముండేట్లుగా ఉండమని ఆ మనస్సుని ఒక నిర్మల నిశ్చల ప్రశాంత ప్రసన్నమైనటువంటి శాంతిలో ఊలలాడించేట్లుగా నీ అనుగ్రహ వరదానం చేయమని స్వామిని అడుగుతూ ఇక్కడ బాలకృష్ణుడు బలరాముడు ఇద్దరూ కొన్ని ఆటలు ఆడారు. వేదవ్యాసులవారు బాగా రాశారు. వేదవ్యాసులవారు రాసిందే పోతనామాత్యుడు. వాళ్ళు ఏ ఆటలాడుకొని ఉంటారు అని. రాముడు ఏమాడుకున్నాడంటే ఆయనకు ఆడుకోవడానికి ముగ్గురు అన్నదమ్ములున్నారు కదా! మిగతా వాళ్ళతో ఆడుకున్నాడు. తల్లులున్నారు వాళ్ళతో ఆడుకున్నారు. అంతఃపుర స్త్రీలున్నారు వాళ్ళతో ఆడుకున్నారు. ఆయనకి అయోధ్య ప్రజలున్నారు ఆడుకున్నారు. శ్రీకృష్ణుడు అసలు జీవితమంతా ఆటే. అసలు ఆయన దేవుడు అనేటువంటి శబ్దానికి కృష్ణుడు పర్యాయపదం. ఆడాడు ఆడించాడు రెండూ చేశాడు. ఈ బలరాముడు కృష్ణుడు ఎటువంటి ఆటలాడారట అంటే ఆ ఊళ్ళో ఏమున్నాయి? పిల్లకాయలు ఊళ్ళున్నాయి వ్రజభూమిలో. కపులమై జలరాశి కటుదమాయని కట్టుదురు అడ్డంబు కాలువలకు సేతువు బంధిద్దామా? అంటాడట కృష్ణుడు. ఆ కట్టేద్దాం అంటాడట. సేతువు ఏమిటి? కృష్ణుడు ఏమిటి? రాముడి కాలం కదా. ఆ రాముడే కృష్ణుడు అన్నమాట. పాతాళ వాటింక పోలే ఆయనకి ఆనాటి సముద్రం కృష్ణావతారంలో కాలువలాగా ఉన్నది. వాళ్ళ ఊళ్ళో కాలువే అది. దానికి అది చూడగానే ఏమనుకున్నాడాయన? దీనికొక సేతువు కట్టేద్దామని ఆ అవునని కాళ్ళడ్డం పెట్టి చేతులడ్డం పెట్టి దాన్నేదో ఆపినట్టు అంటే బాల్యక్రీడలు ఇవన్నీ ఇంకా స్మృతి రామస్మృతి ఇంకా ఉన్నది అని చెప్తున్నాడు. మునులమై తపములు మొనయుదుమాయని మౌనులై యుందురు మాటలేక గోపగోపికలంతా స్నేహితులంతా ఉన్నారు. అప్పుడు ఆ చెట్టు కింద తపస్సు చేశాడు చూడు అలా తపస్సు చేద్దామా? వాళ్ళ ఆటలు అలా ఉన్నాయి. మన పిల్లలకి ఆడపిల్లలకి ఏం నేర్పామంటే లెక్కపిడతలు, పొయ్యి, కుంపటి, చీపురు ఇవిచ్చి ఇగో దీంతో ఇలా అన్నం ఉండుతావు ఉండు పప్పు ఇలా ఉండుతావు ఆ ఆటలు మనం నేర్పాము. ఓ పిల్ల మంచి వంటగత్తె అయిపోతుందని ఆనందపడిపోయాం అది కదా! కానీ దేవుడు అలా ఆడలే ఇవ్వాడాడు. గంధర్వ వరులమై గాన విద్యలు మీర పాడుదమాయని పాడదొత్తురు అప్సరసలులమై ఆడుదమాయని అరురూపుల దాల్చి ఆడతనుదు హాయిగా ఆడుదామా అని ఆడపిల్ల వేషం వేసుకుని బలరామకృష్ణుడు ఇద్దరూ ఆ ఆడపిల్లలు ఎలా నృత్యం చేశారో అలా నృత్యం చేశారట. అమరదై చవరులమై అబ్ది త్రత్తమాయని సరోవరముల యందు హస్తదండ చయము తిప్పి తరుతురుతమై ఈడు కొమరులు అనుచరింప కొసరు మిగల వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళు పాడుతూ ఉంటేఆయన వాళ్ళతో కూడి ఉన్నటువంటి వారందరూ కూడా ఇదే ఆటలలో వాళ్ళ మనస్సుని లగ్నం చేశారు అంటే మానవుడి యొక్క స్మృతి మానవుడి యొక్క జన్మాంతర సంస్కారాలు ఈ జన్మలో కూడా బయట పడతాయి పాతది లేకుండా కొత్తది రాదు ఇవాళ మనం ఈ జన్మ ఎత్తాము ఇక్కడ ఇలా ఈ మాత్రం ఉన్నాం అంటే పూర్వ జన్మలో ఏదో కొంత మంచి చేసుకొనే ఉన్నాం లేకపోయినట్లయితే ఇవాళ పరమాత్మే అక్కరలేని రోజులివి పరమాత్మ అక్కరలేదు ఆయన గురించిన భాగవతం అక్కర్లేదు మిగతా సంగతులన్నీ బాగుంటే తర్వాత అనుకుంటాం ఇది బాగుపడేది లేదు ఆయన దక్కేది లేదు ఈయనతో బాగా ఉంటే మిగతావన్నీ బాగుంటాయి అది అది తెలియదు ఆ చిన్న కిటుకు తెలియక మా సమస్యలన్నీ తీరాక గుడికి వెళ్తాం అన్నారు మీరు గుడికి అలా వెళ్తూ ఉండండి సమస్యలన్నీ తీరుతాయి మీరు సత్సంగానికి భజనకి వస్తూ ఉండండి అన్నీ తీరుతాయి అలా అనుకోడు ఇవన్నీ తీరాక ఉద్యోగంలో అరవై ఏళ్ళు వచ్చేదాకా ఇది వాడు ఎందుకు చదవడు అంటే అరవై వస్తాయి అని ఒక నమ్మకం అరవై ఖచ్చితంగా ఉంటాం అని ఒక నమ్మకం అప్పుడే తర్వాత చేసే పని ఏం లేదు గనక అప్పుడు బాగా చదువుకోవచ్చు అని ఒక నమ్మకం కానీ ఏమో చాలా మన చేతుల్లో ఉండవు ఏం చేయాలి అని అంటే మన చేతిలో ఉన్నప్పుడే చేయాలి ఆ ఉన్నప్పుడే అంటే నిన్న అయిపోయింది మనకు సంబంధం లేదు రేపు పుడుతుంది ఉంటామో లేదో తెలియదు మరి ఇవాళ అయితే ఉన్నాం ఇది సత్యం కాబట్టి ఈ నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో పరమాత్మను గురించి మనం నిరంతరం విచారణ చేయాలి విచారము చేయకూడదు విచారం అంటే దుఃఖం విచారణ అంటే enquiry enquiry enquiry రెండూ చేయాలి రెండూ తెలుసుకుంటూ తరచి తరచి తెలుసుకుంటూ పరమాత్మ యొక్క తత్వంలోకి వెళ్లినట్లయితే పరమాత్మ దేహ రూపాదులు ఆ నామాలు మనల్ని ఆ అంతగా ఒక ప్రలోభానికి గురి చేయవు గనుక నిరంతరము కూడా అప్రమత్తుడై ఉండాలి సాధకుడు నిజానికి వేళ స్వామి ఉనికి స్వామి యొక్క అస్తిత్వం స్వామి యొక్క దివ్యత్వం ఈ ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉన్నది ఆ ఎదురు చూస్తున్నటువంటి వేళ సంకల్పాలు ఎవరివి అంటే స్వామివే సంకల్పాలు ఆ సంకల్పానికి మనమందరం కూడా చక్కగా కట్టుబడి ఉండవలసినటువంటిది ఇక వాళ్ళు నందుడు రోహిణి యశోద వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇక్కడ ఈ ఊళ్ళో మనం ఉండొద్దు మన పిల్లల్ని రాక్షసులు ఎత్తుకెళ్ళటానికి రోజుకోడు వస్తున్నారు పూతన తృణావర్తుడు శకటాసురుడు ఇటువంటి వాళ్ళంతా వస్తున్నారు ఇక్కడ ఏదో ఈ ఊరికి ఇబ్బంది కలుగుతోంది ఎవరినీ దేవుడిని దగ్గర పెట్టుకోని కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇంకో ఊరు వెళ్లిపోదాం అని అనుకున్నారు అప్పుడు బృందావనానికి చేరారు ఆ బృందావనానికి చేరినప్పుడే అఘాసురుడు అనేటువంటి వాడు ఒకడు కాచుకొని ఉన్నాడు ఆ అఘాసురుడు ఈ పూతన వీళ్ళకి చుట్టం నిజానికి ఒక సోదర సమానుడు వాడు సోదరుడు అంటారు గాని సోదర సమానుడు కంసుడికి చాలా ఇష్టుడైనటువంటి వాడు ఈ కృష్ణుడిని ఎలాగైనా సరే మాయం చేయాలి ఎలాగైనా హింస పెట్టాలి ఆ కృష్ణుడిని వధించాలి అని అనుకొని వచ్చాడు ఆ సమయంలో ఆ బృందావనంలో ఈ అనేకమైన ఆటలతో శ్రీకృష్ణ పరమాత్మ చలుదులతో ఆట మొదలు పెట్టాడు చల్ది అంటే మీకు తెలుసు చల్ది అన్నారు మూటలు మూటలు కట్టుకొని బయటకి వెళ్ళి ఆ ఇవాళ మనం వెళ్ళే పిక్నిక్ అని అంటామే అలాంటి చలుదుల దగ్గరికి వెళ్లారు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒకనొకని చల్ది కావడి ఒకడు అడగించి దాచు ఒకడిది ఇంకో-- పిల్లలు కదా వీడిది తీసుకెళ్ళి వాడు దాచిపెడతాడు వాడిది తీసుకెళ్ళి ఇంకోడు దాచిపెడతాడు ఒకడొకడు అది వేరొకడొకని మరొకని చన ఒకడొకడు అది తెచ్చి ఇచ్చు ఉర్వీనాథ ఇలా మూటలు చల్ది మూటలన్నీ కూడా దాచుకుంటూ ముంతలన్నీ దాచుకుంటూ వీళ్ళు ఆడుకుంటున్నారు ఇట్లా ఆ కళ్ళు మూసుకుని పరిగెత్తుతూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఈ ఆటలో వేదవ్యాసుల వారు ఏం చెప్తారంటే ఆటగా కనిపించేటువంటి ఒక దివ్య క్రీడ ఇది ఆ క్రీడలో శ్రీకృష్ణుడిని కౌగిలించుకున్నవాడు చిన్న పిల్లవాడు అలాగే బలరాముడిని కౌగిలించుకున్నవాడు శ్రీకృష్ణుడే తనంతట తానుగా ఎవరినో ఎన్నుకొని కౌగిలించుకున్న సన్నివేశాలు అవన్నీ చూసి వనజాక్షుడు మున్నరిగిన మునుపడగా అతని నేనే ముట్టెద రంచున్ మును ముట్టని వానిన్ మును ముట్టిన వాడు నవ్వుమనసి నేనే వాడిని తాకుతా కళ్ళు నేను మూసుకునే ఉంటా నా కళ్ళకు గెంతలు కట్టండి నేను పలానా వాడిని నేను ఎక్స్ ని నేను ముట్టుకుంటా అంటే కళ్ళు మూసుకునేవాడు వెళ్లి తాకినప్పుడు వాడు ఆనందపడిపోయేవాడు దానికి కారణం ఏంటంటే దాన్ని వ్యాసులవారు అంటున్నాడు ఎన్నడునైన యోగి విభులు ఎవని పాద పరాగ మింతయున్ కనులగానరు అట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టబట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు పైబడి కూడి ఆడుచున్ మన్ననసేయు వల్లభ కుమారుల భాగ్యములు ఇంత గొప్పుని యోగిvarulu తపస్సులు ముముక్షువులు జ్ఞానులు కేవలం ఆయన పాదాన్ని అంటుకున్నటువంటి నాలుగు రేణువులు దొరికితే చాలని కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకి లభించనటువంటి శ్రీకృష్ణుడి యొక్క కౌగిలి వీళ్ళకి ఎలా లభించింది అంటున్నారు అది వీళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారో ఏం పుణ్యం అంటే వాళ్ళంతా యోగులే రామావతారంలో రాముడిని సేవించిన వాళ్ళే మళ్ళీ కృష్ణావతారంలో ఇట్లా వచ్చారు గనుక వాళ్ళకి ఆ పరమాత్మ ఆ పరిష్వంగాన్ని ఆ కౌగిలిని దగ్గరతనాన్ని ఆ proximityని ఆ సామీప్యాన్ని సాన్నిధ్యాన్ని అన్నింటికంటే స్పర్శానుభూతిని పరమాత్మ అనుగ్రహించాడు అందుకే మహాత్ముల దర్శనం ఒక ఎత్తుస్పర్శనం రెండవ ఎత్తు, సంభాషణ ముడవ ఎత్తు. ఈ మూడింటినీ అన్నివేళలా తలచుకుంటూ జీవించేటువంటి జీవితం మరొక ఎత్తు. అది రోజూ దొరికేది కాదు, ప్రతిరోజూ మనకు లభించాలని ఆశించకూడదు. లభించినవి నిలబెట్టుకుంటే చాలు. ఎప్పుడో గానీ వందేళ్లు మానవుడు బతికితే కొన్ని క్షణాలు మాత్రమే పరమాత్మకు అతి సన్నిహితంగా వెళ్లగలిగిన సన్నివేశాలు మనకు ఏర్పడతాయి. అలాగే, ఆ సమయంలో కన్యన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ పద్మకోకనదాస్వాద వినోద మోదమద భృంగద్వంద్వ ధ్వంఖారమును ఘనకల్లోల లతావితాన విహరత్కాదంబ కోలాహల స్వన విస్ఫారము మందు వాయుజకణాసారంబు కసారమున్. ఒక సరస్సును చూశాడాయన. ఈ పద్యం అర్థం అది. కృష్ణుడికంటూ ఒక సరస్సు పడింది. ఆ సరస్సు నుంచి వచ్చేటువంటి చల్లని గాలులు పరమాత్మకు ఆనందాన్ని కలిగించినయి. రామచంద్రుడికి రామప్రియ రాగం కలిగించినట్టుగా ఇక్కడ శ్రీకృష్ణుడికి కృష్ణానందమయమైనటువంటి ఒక దివ్య భావన కలిగింది. దానిని తదేకంగా తమకంతో చూస్తూ ఉండిపోయినాడు శ్రీకృష్ణుడు. అప్పుడు, పరమాత్మ కదా! దయాలుడు. తన శరీరాన్ని తాను కష్టపెట్టుకుంటాడు ఇంకొకడిని బోధించటానికి. గురువుల స్థితి ఎప్పుడూ అంతే. మనం అనుకుంటాం చాలా కష్టపడిపోతున్నాడని ఆయనకు ఆ కష్టం తెలియదు. భక్తుడ్ని రక్షించడం కోసం పరమాత్మ దిగి వస్తాడు. ఆ దిగి రావటానికి మళ్లీ మా-మానుష వేషంలోనే ఆయన రావాలి. అప్పుడు ఈ పిల్లలంతా ఆట ఆడారు కదా ఎండలో, శ్రీకృష్ణ పరమాత్మకు వాళ్ళను చూడగానే ఒక సన్నని జాలి కలిగింది. జాలి కలిగి వాళ్ళతో, నిజానికి ఈయన కంటే పెద్దవాళ్ళు ఆటగాళ్ళు ఉన్నారు, స్నేహితులున్నారు. ఎండన్ మగ్గితిరి ఆకటం పడితిరి ఇంకేలా విలంబింపగ. ఎండలో పడిపోయారు, నలబడిపోయారు, అలసిపోయారు. ఆకలి కొట్టుకుపోతోంది మీకు. ఇంకా ఆలస్యం, విలంబనం ఎందుకు? ఆలస్యం ఎందుకు? రెండో బాలకులార చల్ది కురువండ్రమ్య స్థలంబు ఇక్కడ ఇదండన్ లేగలు నీరు ద్రావి ఇరవందన్ పచ్చికల్ మేయుచుండు అండంబై విహరించుచుండగ అమంద ప్రీతి భక్షింతమే. పశువులన్నింటినీ హాయిగా వదిలిపెట్టండి. మంచి పచ్చికలున్నాయి. వాటి పనిలో అవి మేస్తుంటాయి. ఇదిగో మనం మేయటానికి నీడ ఉన్నది. మనం తెచ్చుకున్న చల్దులన్నీ ఆడగిద్దాం. మనందరం నీడలో కూర్చుందాం. అవి ఎండలో హాయిగా తిరుగుతూ ఆ గడ్డి మేస్తూ ఉంటాయి. తర్వాత చూద్దాం. మనం ఇక్కడ అవి అక్కడ. వాటికీ ఆకలి మనకూ ఆకలి అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్మ కాబట్టి పశువుకి మనిషికి ఏం తేడా చెప్పుకోలే. దాని ఆకలికి మన ఆకలి రెండూ అని అనుకోలే. మనం తిన్న తర్వాత వాటిని వదిలిపెడదాం అనలే. వాటిని హాయిగా తిననియ్యి పచ్చికలున్నాయి. అలాగే ఈ సరస్సు, చల్లని గాలి, చక్కని చెట్లు, వాటి కింద నీడ, రెండో బాలకులార అన్నాడు. ఈయనేదో చాలా పెద్దవాడైనట్టు. కదా. తన స్నేహితులే రెండో బాలకులార. ఆ సంబోధన చూడండి. పరమాత్మ తొంభై ఏళ్లవాడు కూడా స్వామికి నమస్కారం చేయడానికి కారణం ఏంటంటే, వయస్సులో చిన్నగా ఉన్నప్పటికీ ఆయన పరమాత్మ. ఆయన జ్ఞానవృద్ధుడు గనుక జ్ఞానానికి నమస్కారం చేస్తారు, దేహానికి కాదు. రమణ మహర్షిని కూడా అడిగారు. పాద నమస్కారం వద్దంటూనే ఎవరు పెట్టినా ఏం కాదనటం లేదేమంటే, మీకు తెలుసో తెలియదో వారు మాకు నమస్కరించడానికి ముందే మేము వారికి నమస్కరించాం. అవి వారి ప్రతిచర్యలు అన్నారు. అది. ముందే నేను నమస్కారం పెట్టేశానన్నారు. అది. అలాగే రెండో బాలకులారా అన్నాడు, అందరూ వచ్చేశారు. నిర్మలంబగు జలంబులు త్రాగనుంచి పచ్చికల మొల్లంబులు గల పల్లవంబులు నిలిపి చొక్కంబులగు చల్దుల చిక్కంబులు సక్కడించి మూటలు విప్పి చిట్కాలో పెట్టుకొని వెళ్లారు. ఉత్తి లాంటివి చిట్కం. అంటే పశువుకి ఎక్కువ మెయ్యకుండా దానికి చిట్కం కడతారు. దానికి పాపం అదడ్డం. దానికేమో కావాలి. వీడు చిట్కం కడతాడు. వీడికి భయం ఏంటంటే గడ్డి అంతా తినేస్తున్నా ఒకటే పూట అని. అదీ తినదు. చూసేవాడికి భయం. కాబట్టి వీళ్ళు ఇలా మూటలు విప్పి చక్కగా మాట్లాడుకుంటూ అక్కడ కరస్తా, కృష్ణజూడు మనుచు కికురించి పరుద్రోల మేలి భక్షరాసి మెసగు నొకడు. మనతో అన్నం తింటున్నాడు కృష్ణుణ్ణి చూడండి. ఎంత బాగా తింటున్నాడో. అంటూ తింటూ అంటున్నట్టు వాడు ఒకడు. కృష్ణుడు తినటం వీళ్ళకి ఆనందం కలిగించింది. ఎలా తింటున్నాడో చూడు అంటూ తింటున్నారట. నవ్వు నొకడు సఖుల నవ్వించు నొక్కడు ముచ్చటాడు నొకడు మురియు నొకడు. ముచ్చటాడుతున్నాడు, ముచ్చటపడిపోతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా భుజించేశాడు, చల్దులు ఎలా ఆరగించాడు అంటే దృశ్యం చూడండి. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశ నాళంబు జొనిపి విమల శృంగంబును నేత్ర దండంబును జారిరాని కడువా సంకలిరికి మీగడ పెరుగుతో మేళవిల్చిన చల్ది ముద్దడు ఆపలిచేత మొనయను నిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ సందుల యందు వెలయనిరికి సంగడి లేనడుమ చక్కడ కూర్చుండి. సంగడి అంటే స్నేహితులు. ఆ స్నేహితులందరి మధ్యన చక్కగా స్థిమితంగా బాలకృష్ణుడు కూర్చొనినర్మ భాషణమున నగబు మెరసి అధ్యాత్మ బోధ చేస్తున్నాడట అది నర్మభాష పైకి మామూలుగా మాటలుగానే అనిపిస్తున్నాయి ఆటలకు సంబంధించినవిగా కానీ దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క క్రీడా వినోదాన్ని అనుగ్రహించి యాగభోక్త ఆ చ-చల్ది మూటలన్నీ ఎవరెవరో ఎక్కడెక్కడో మహాపురుషులంతా యాగం చేస్తే అవన్నీ ఆయన దగ్గరికి మూటలుగా చేరితే ఆ యాగాన్ని భోక్తగా భుజిస్తూ ఉన్నాడు అని స్వీకరిస్తున్నాడు అని రెండవ అర్థం కృష్ణుడు అమరులు వెరగంద శేష బంబు మెరసి చల్ది కుడిచే ఆకాశంలో ఉన్న దేవతలంతా అదృశ్య రూపులై ముప్పది ముక్కోటి దేవతలు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి వెళ్లి చల్ది ఎట్లా తింటున్నాడో చూద్దాం వైకుంఠంలో మనకు అవకాశం లేదు రా నిద్రగా లోపలికి వైకుంఠంలో ఆయన ఏం తిన్నాడో ఎవరికీ తెలియదు ఎప్పుడు పడుకున్నాడో తెలియదు ఇప్పుడు అందరూ ఏం-- ఎప్పుడు పడుకున్నారో ఏం తిన్నారో అని రాసేస్తున్నారు వీళ్లంతా వెళ్లి వచ్చినట్టు కదా లోపలన్నీ మూటలున్నాయట వజ్రాలు బంగారాలు ఎవడిచ్చాడండి ఆయనకి ఆ మూటలన్నీ ఆయన మంచం కింద పెట్టుకున్నాడట పరమాత్మ ఆ ఇది కూడా అటువంటిదే శ్రీకృష్ణుడు ఎట్లాగో స్వామి కూడా అట్లాగే వజ్రాలు కాదు వజ్రాలతో సమానమైన కొన్ని వేల కొండలు ఆయన సృష్టించగలరు మన బోటి వాడు ఇచ్చే వజ్రాలు ఆయనకి అవసరం లేదు మన హృదయ వజ్రాన్ని ఆయన బహుశా మూటలన్నీ మన హృదయాలే అక్కడ మూటగట్టి కింద ఉంచుకొని ఉంటారు సద్భక్తుల మూటలు తప్ప ఆయనకి భౌతిక సంపద అవసరం లేదు అప్పుడు ఘోరంబగు అరణ్యంబు నడుగ తోరంబగు దూరంబు చనిన ఈ ఆవులు గోవులన్నీ కూడా చాలా పశువులు చాలా దూరం వెళ్లిపోయినాయి వదిలిపెట్టేయ్ అన్నాడు అది లీలా విశేషం కృష్ణ పరమాత్మ వాటికి ఎక్కడా పరుపుతాళ్లు లేవు గుర్తులు లేవు వదిలిపెట్టేసాడు మైదానంలోకి అవి తింటూ తింటూ తింటూ అట్లా వెళ్లిపోయినాయి ఎంత దూరం వెళ్లిపోయినాయి అంటే కంటికి కనపడనంత దూరం వెళ్లిపోయినాయి వెళ్లినాయా నిజంగానే అంటే వామిన్ కానక వెరచుచున్న అయ్యో మన ఆవులేమైపోయాయి ఇంట్లో వాళ్లేమంటారు మనల్ని కాయమని పంపించారే మనం ఈ కృష్ణుడి మాయలో పడిపోయి చల్దులు తినటం వాడి మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయినాం ఆవులెక్కడ ఆవులెక్కడ అంటే ఎక్కడా తోక కూడా కనపడటం లేదు భయపడిపోయినారు ఇంట్లో వాళ్ళు దెబ్బలాడతారు కొడతారని గోపడింభకులకు అంభోజనయనుండు గోపడింభకులు గోప-గోప కులంలో ఉన్న పిల్లలందరితో ఉన్నాడట వినుడో బాలకులార ఈ సంబోధన మాత్రం చాలా అందమైన సంబోధన తన తోటి వారిని బాలకులారా అంటుంటాడు ఈయన అది వినుడో బాలకులార క్రేపులు అటవీధిన్ మహా దూరముంచనియన్ కోమల ఘసకాధన రతోత్సాహంబుతో చల్లని మెత్తని లేచి గుడ్లు తింటూ ఆనందంలో అలా దారి తప్పిపోయినాయి జీవుడు కూడా భోగం వెంట పడితే తన నుంచి తాను దూరమైపోతాడు భోగం పచ్చిక బయలు మెత్తగా ఉంటుంది ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా పొందాలనిపిస్తుంది ఇంకా మూటలు ముల్లలు సర్దాలని అనిపిస్తుంది ఆ ఆశాపాశం వాణ్ణి పరిగెత్తిస్తుంది కానరానంత దూరం లోకి జీవుడు వెళ్లిపోతాడు అని ఈ పద్యం-పద్యంలో ఉన్నటువంటి ఒక అర్థం అందుకని ఈయన చెబుతున్నాడు అవి ఎక్కడికి వెళ్లినయో దేన్ని వెతుక్కుంటూ వెళ్లినయో నాకు తెలుసు ఎందుబోయెనో ఏమయ్యెనో క్రూర జంతువులచే ఏ ఆపదం పొందెనో కని తెత్తున్ ఈ మూడు రకాలుగా వాటికి ఏదైనా ఇబ్బంది అయిందో చూసి కని తెత్తున్ కని చూత్తున్ కాదు చూసి వస్తానంటాం కదా చూసి తెస్తానంటున్నాడు చూసి వచ్చేవాడు మధ్యముడు చూసి తెచ్చేవాడు ఉత్తముడు కదా ఏదైనా చూసి తేవాలి వెళ్ళిన పని పూర్తి చేసుకొని రావాలి పరమేశ్వరుడు అభయమిస్తాడు అంటూ కుడువుండు చల్ది కొరతల్ కాకుండ మీరందరుం ఏ రకమైన ఇబ్బంది లేకుండా నా మూట వాడి మూట వీడి మూట మీరే హాయిగా తింటూ ఉండండి నేను మీ పని మీద నేను వెళ్లి వస్తా అంటే స్వామి అంటారే నా పనిలో మీరుండండి మీ పనిలో నేనుంటా ఇది అభయం అన్నీ గుర్తు పెట్టుకోవాలి స్వామి ఎన్ని మంచి మాటలు చెప్పారు ఆయనకేమిటి పని అంటే ఆయనకేం పని లేదు ఆయన కోసం మనం చేసేది ఏం లేదు నిజానికి కలియుగంలో సత్య సాయి భగవానుడే ఎక్కువ మానవ సేవ చేశారు మానవుడు స్వామికి చేసిన సేవంటూ ఏం లేదు చాలా వరకు అడిగాం తెచ్చుకున్నాం ఇది కావాలి అది కావాలి ఇది నువ్వు చేయలేదని ఆయనతో దెబ్బలాడాం కదా నువ్వు చేయకపోతే ఎట్లా అడిగాం అసలు మన పని మానేసి మన పని కూడా ఆయన్నే మోయమన్నాం మూటలు ఎక్కువైపోతున్నాయి బరువు నువ్వు మోయగలనన్నావు కదా అందుకని నీకే ఇచ్చామన్నాం టీవీగా నడిచే ప్రయత్నం చేశాం చేస్తున్నాం అలా కాకుండా పరమాత్మ అభయ వర్దానం చేసినప్పుడు ఆ చిన్న వయసులో ఇప్పుడు తర్వాత చెప్తాడు అఘాసుర సంహారం జరిగినప్పుడు బాలకృష్ణుడి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు ఐదేళ్ల పిల్లవాడు స్పెసిఫై చేస్తాడు దీంట్లో తర్వాత ఒక పద్యంలో ఐదేళ్ల పిల్లవాడు తన తోటి వాళ్లని బాలకులారా అంటున్నాడు ఆయన యోగి కాక యోగేశ్వరుడు కాక ఏమవుతాడు అని యోగీశ్వరుడు వేరు యోగేశ్వరుడు వేరు విచారణ చేశాం ఆ యోగేశ్వర స్థాయిలో ఉన్నటువంటి పరమాత్మ బ్రహ్మకి ఈయన ఈ మాయ ఎందుకు కల్పించాడు అంటే బ్రహ్మ ఓ మాట అనుకున్నాడట ఏమనుకున్నాడంటే కృష్ణుణ్ణి ఒకసారి ఆట పట్టిద్దాము అని అనుకున్నాడట ఆట ఎలా పట్టించగలడు ఆయన మీద ఎవరు ఆధారపడి ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే ఆయన గెలిచినట్టే అని ఇప్పుడు మనం-మన మీదే యుద్ధం అందరూ కదా మనల్ని రక్షించుకోవాల్సిన పని ఎవరిది అంటే ఆయనదే మళ్ళీ ఆ పనిలో ఆయన అలాగే ఉంటారు దానికేమి ఢోకా లేదు ఆ పనిలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు
SSSMC · audio
Bhagawata Navaneetham - 62
Bhagawata Navaneetham - 62
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 24:18
More in this series