No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ పరమాత్మ కూడా ఒక్క క్షణం కూడా జాగు చేయకుండా అనఘాత్మ మరి నీవు యజ్ఞ రూపుండన దగు నన్ను సంపూర్ణ దక్షిణంబులగు మఖంబుల చేత అర్చించి సత్యంబులగు ఇహ సౌఖ్యములు అనుభవించి అంత్య కాలమున నన్ను ఆత్మదలచుచు మరి సర్వలోక నమస్కృతమును మహి పునరావృత్తి రహితంబు సప్తర్షి మండలోన్నతమగు మామకీన పదము తగ పొందగలవని పరమ పురుషుడు అతని అభిలషార్థంబులు అర్ధినిచ్చి అతడు కనుగొనుచుండగ ఆత్మపురికి గరుడ గమనుడు వేంచేసే కౌతుకమున పరమాద్భుతమైనటువంటి పద్యం ఎందుకనంటే ఏం చేశాడు ధ్రువుడి మనసులో ఏమున్నది మామూలుగా తపస్సు చేస్తే ముక్తి కావాలి ఈయన మనసులో ఆ క్షణాన ముక్తి లేదు మా అమ్మకి జరిగిన అవమానం పోవాలి నారదుడితో చెప్పాడు గగనాంతరాలలో ఉన్నటువంటి ఆ అత్యున్నతమైన పదం మళ్ళీ నా తర్వాత ఆ పదం పొందటానికి ఇంకొకడికి అవకాశం ఉండకూడదు అది నేనే పొందాలి కాబట్టి ఇది నాకే అనే మమకారం ఉన్నది నాకు మాత్రమే కావాలన్నటువంటి ఒక వ్యామోహం ఉన్నది గనుక అది పొందరానిది మామూలుగా అయితే ఇవ్వను నీ వయస్సుకి నీవు చేసిన తపస్సుకి నీకిస్తున్నాను నువ్వు తప్పకుండా అక్కడికి వెళ్ళు కానీ చివర ముప్పై ఆరు వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు ధ్రువుడు ముప్పై ఆరు వేల సంవత్సరాలు ముప్పై ఆరు వేల సంవత్సరాల తర్వాత నీ మరణ సమయంలో కూడా హరి నామమే నీ నాలుకపై ఆడి బ్రహ్మ పదం లోకి అక్కడికి వచ్చి నువ్వు నన్ను చేరుకుంటావు అన్నాడు ధ్రువుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఆనంద పడాలి కదా ఎందుకు ఉలిక్కిపడ్డాడు అంటే ఆయనకి నమస్కారం చేశాడు చేసి నెమ్మదిగా బయలుదేరాడు ఎక్కడికి ఇంటికి కానీ సంతోషంగా లేడు ధ్రువుడు తపస్సు చేశాడు శ్రీహరిని ప్రత్యక్షం చేసుకున్నాడు కానీ సాక్షాత్తు పరమాత్మే వైకుంఠం వదిలిపెట్టి నా దగ్గరికి వస్తే నేనేం కోరవలసింది చిన్న మా సవతి తల్లి చేసిన అవమానం నా తండ్రి అంకపీఠం మీద కూర్చునే చిన్న వ్యామోహం ఒక వ్యసనం లేదా ఒక చిన్న కోరిక ఇంతేనా నేను కోరవలసింది నువ్వు కావాలి అని అడగలేకపోయినానే ఆ ప్రారబ్ధం వలన కదా ముప్పై ఆరు వేల సంవత్సరాలు నేను రాజ్యం చేయవలసి వచ్చింది అది ధ్రువుడు చూసారా స్వామి అవకాశం ఇస్తారు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే రాలేదనేమి అనుకోక్కర్లే ఇచ్చిన వాళ్ళు పొందిన వాళ్ళు అని పెద్ద తెలివితేటలతో బయటికి రాలే ఆ interview room లోకి వెళ్ళగానే ఏం కావాలి అంటారు ఆ ఏం కావాలి అనటమే మాయ వల విచిరినట్టు విసురుతారది చాలా గప్-- చాలా గొప్పగా ఉంటుంది ఆ మాయలో పడకుండా తప్పించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది నాకేమీ అక్కర్లేదు నువ్వు కావాలన్న వాళ్ళు బహు కొద్దిమంది ఏం కావాలి అంటే ఎన్నో కావాలి మనకి ఏందో ఎన్నో చెప్పగలమా తీర్చగలిగినన్ని మనకి అది జన్మంతా కావాలి ఆయన కూడా అన్నీ ఇస్తా నీకేం నేను చూసుకుంటా పో నన్నీ నేనున్నా అంటారు తీరుస్తూ తీరుస్తూ ఉంటారు జీవితం తెల్లవారిపోతుంది నువ్వు కావాలి స్వామి నువ్వు ఒక్కడివి ఉంటే మాకివన్నీ ఉండవుగా రామ చింతన ఉంటే అన్య చింతనేముంది సాయి చింతన మనకు గనక దొరికింది అనుకోండి అన్య చింతన అది కావాలి ఇది కావాలి అని ఉంటుందా ఉండదు ఉండటానికి వీల్లేదు కాబట్టి ఈ ధ్రువుడు ఇంత బ్రహ్మ పదాన్ని పొంది సాక్షాత్తు పరమేశ్వరుని నుంచి పొంది కూడా ఆయనకు ఆనందం కలగలా నేను కోరవలసింది ఇది కాదేమో అని మాత్రం వెన్నాడింది అప్పుడు జితేంద్రియులు సుమహితాత్ములు నైన సనందనాదులు ఎందు అనయము ఐకజన్మ సముపార్జిత యోగ సమాధి చేసి సనక సనందనాది మునులంతా కూడా కేవలం ఆరు నెలలలో బ్రహ్మ పదాన్ని పొందారట అది వాళ్ళ జీవితం అంతేనట ఆ ఇవ్వబడిన జీవితంలో వాళ్ళు పొందినట్టుగా బ్రహ్మ పదాన్ని నేను పోగొట్టుకున్నానే అంటున్నాడు ధ్రువుడు చూడండి పొందాడు మనం మన దృష్టిలో నుంచి చూస్తే చాలా పొందాడు ఆయన ఆయన కూడా అన్నాడు అందరికీ ఇచ్చేది కాదు అయినా ఇస్తున్నాను అన్నాడు అయినా ఇస్తున్నాను అన్నాడు గాని భోగంలోకి నెట్టాడు రాజ్యం ఏలమన్నాడు యవ్వని చరణారవిందములారని భక్తి ఎరుంబుచుందురు ఆఘను పరమేశు ఈశు అవికారు అమేయు అజయ్యు ఆజ్యునిన్ ఇంతటివాడు నా ముందు వచ్చి నిల్చున్నాడే ఇన్ని విశేషణాలు ఉన్నాయి ఆయనకి జన్మ లేనివాడు జన్మ ఎత్తినట్టు వచ్చాడు అసలు అందరికంటే ముందు ఆద్యుడు ఆయన అసలు ఆది మధ్య అంతము లేనటువంటి వాడు నేనున్నానని మధ్యలో వచ్చాడు ఆయన కాబట్టి తనకు లేని గుణవిశేషణాలన్నీ తాను ఆపాదించుకొని ఈ చిన్న ధ్రువుడు అనేటటువంటి నా యందు ఉన్నటువంటి ఆ ప్రేమ చేత కరుణ చేత వచ్చినా నేను అడగవలసింది అడగలేకపోయినానే అనుకున్నాడు అనుకుంటే ఆ కానీ తప్పదుగా అయిపోయింది ఆయన వచ్చాడు ఆయన ఎలా వెళ్ళాడంటే ఎంత వేడుకతో గరుడ గమనుడై వచ్చాడోఅంత కౌతుకంతో వెనక్కి వెళ్ళిపోయాడు సార్. కౌతుకం అంటే కుతూహలం. ఇకపై ధ్రువుడు ఏం చేస్తాడో చూద్దాం అని. అది తపస్సు చేశాడు గనుక రాజ్యం ఇచ్చాడు. రాజ్యం ఇచ్చాక ఏం చేస్తాడో ధ్రువుడు చూద్దాం అని ఆయనకు కౌతుకం, ఆ ఉత్సాహం. మనకు కూడా అంతే, పరమాత్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చాడు మనందరికీ, మామూలు జన్మ కాదు ఇది. ఎన్ని తపస్సులు, ఎన్ని యాగాలు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని పుణ్యాలు, ఎన్ని చేస్తేనో ఇక్కడిదాకా. ఇదిగో ఈ భగవత్ పాద పద్మాధీన చేతస్తమైన ఒక జన్మ మనకు ఇవ్వబడింది. సాయంకాలం అవగానే పరమాత్మ గురించి మాట్లాడుకుందాం అనే ఒక చిన్న స్పృహ కలిగిందే ఉత్తమోత్తమ జన్మ. ఆయన మనకిది ఉత్సాహమే, మనం సాధించినట్టే అనిపిస్తుంది. ఆయనేం, "ఇంత ఇచ్చా కదా, వీళ్ళు రేపటి నుంచి ఏం చేస్తారో చూస్తా" అని ఆయన చూస్తుంటాడట. అది, ఆ కౌతుకం ఆయనకుంటుంది, ఉత్సాహము ఆయనకుంటుంది. చూడవలసినప్పుడు, చూడటానికి వచ్చినప్పుడు, అనుగ్రహించినప్పుడు, దర్శనం ఇచ్చినప్పుడు వేడుక ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఇచ్చి వెళ్ళిన తర్వాత వీడు ఏం చేస్తాడో చూద్దాం అనేటువంటి కుతూహలం ఉంటుంది. ఆ రెండూ పరమాత్మ యొక్క aspects అవి. సరే ఆయన మామూలుగా వచ్చాడు. రాగానే ఉత్తానపాదుడు, అలాగే సురుచి, సునీతి, వీళ్ళందరూ కూడా వాడికి ఎదురు వెళ్లారు. ఎదురెళ్లి వారిని పుష్పమాలలన్నీ వేసి, పూలవర్షం కురిపించి, వాడిని ఒక బంగారు రథం మీద కూర్చోబెట్టి, ఉత్తానపాదుడి తండ్రి తన పక్కన కూర్చోబెట్టుకొని ధ్రువుడిగా రూపాంతరం చెంది ఒక ధ్రువమైనటువంటి, నిశ్చలమైనటువంటి, మనీషా యత్త చిత్తంతో వచ్చినటువంటి తన కుమారుణ్ణి ఆ సగౌరవంగా అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళాడు కానీ ధ్రువుడి మనస్సు మాత్రం, "మళ్ళీ ఆ పరమాత్మను ఎప్పుడు చూస్తాను? మళ్ళీ అలా కనపడతాడా?" మనం కూడా పరమాత్మ భావనలో ఈ జన్మ ఎత్తొచ్చాం. ఈ జన్మలో మనం చూసింది స్వామిని. పరమాత్మ అంటే స్వామి. ఆయన్ని చూశాం. పునః పునః చూడటంలో దోషం ఏం లేదు. అది ఆనందం ఎప్పుడూ ఇస్తుంది. నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి, ఎన్నిసార్లు, ఎన్ని వేల సార్లు చూసినా అది పుంసా మోహన రూపాయ, పుణ్య శ్లోకాయ. కాబట్టి ఆనందం కలిగిస్తుంది. కానీ సాధకుడు అయినటువంటి వాడు తాను అందుకున్నటువంటి ఆ చిన్న అనుభవంలో నుంచి ఉదాత్తమైన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలు రోజూ కలగవు. రోజూ కలిగేవి అలవాట్లే. అనుభవాలు ఒక్కసారే కలుగుతాయి. ఒడిసి పట్టుకున్నామా అది అనుభూతి వైపు దారి తీస్తుంది. అనుభూతిలో నిలకడ చెందామా విభూతి స్థాయికి వెళ్తాం. లేదు నాకు ఫలానా ఏరో జనవరి పందొమ్మిదో తారీఖు nineteen forty లో ఇచ్చారు దర్శనం, మళ్ళీ ఇవాళ ఇచ్చారు, ప్రతి ఏడాది అలాగే ఇస్తున్నారు, ఈ ఏడాది ఇవ్వలేదు అనుకోకూడదు. ఆయనను హృదయ పీఠం మీద పెట్టుకోమన్నాడు. తెచ్చి లోపల పెట్టుకోండి, బయట కాదు. ఆ లోపల పెట్టుకున్నట్లయితే పరమాత్మ నాయందున్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేనై ఉన్నా-- ఉన్నాడు అనేటువంటి భావన కలగగానే ఒక పూర్ణద్వైత స్థితి ఏర్పడుతుంది. పరమేశ్వరుడి కంటే అభిన్నమైనటువంటి స్థాయిలో మానవుడు సంచారం చేస్తాడు. ధనహీనుండు రూపాలు చేరి మిగులన్ దాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజ లోచనుడే చాల ప్రసన్నుడైన అతనిం సాంసారికంబు అధిగోరిన నావంటి విమూఢ మానసులు భాత్రిం కల్గిరే ఎవ్వరున్. పరమాత్మ అంతటి వాడు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడి, "ఏం కావాలి? నీ మనసులో ఉన్నదేదో నాకు తెలుసులే" అని నా లోక లోకాంతర ప్రాణాలన్నీ స్పృశించి, తాకి, తడిమి, చూసి, అర్థం చేసుకొని నాకు కావలసినటువంటి బ్రహ్మ పదాన్ని ఇచ్చాడే. ధ్రువ తారగా నిలిపేటువంటి ఆ తారకా స్థితిని ఇచ్చాడే. నాకు కావలసింది ధ్రువ తారకా స్థితి కాదు, ఆనంద తారక స్థితి. ఆ ఆనంద తారక స్థితిని అందుకోవటానికి మళ్ళీ ఎన్ని వేల ఏళ్ళు ఈ ప్రపంచంలో నేను ఉండాలో. వచ్చిన అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో. మనం కూడా అలాగే ఉండాలి. పరమేశ్వరుడు-- we should never take భగవాన్ for granted. "రాకేం చేస్తారులే, ఇవాళ-ఇవాళ సాయంకాలం రాలేదంటే రేపు పొద్దున వస్తారు" అంటాడు వీడు. ఆయనేదో వీడికి చెప్పినట్టు. ఎందుకు రాలేదు అంటే వీడే కారణం చెప్పుకుంటాడు. అన్నీ వీడే మామా అనుకుంటూ ఉంటాడు వాడు. నేను-నేను అనుకున్నాను, నేను అనుకున్నా, ఆయన అనుకునేది వేరు. ఆయన రావటానికి, రాకపోవటానికి, అలాగే పరమాత్మ ధ్రువుడి దాకా రావటానికి, మళ్ళీ రాకపోవటానికి ముప్పై ఆరు వేల యో-- సంవత్సరాల రాజ్యం చేయటానికి కాదు, యోగ సాధన చేయటానికి పరీక్షిత్ మహారాజుకు అదే చెప్పాడు. "నువ్వెంత అదృష్టవంతుడివి! ఏడు రోజుల్లో నీకు ముక్తిని ఇస్తున్నాడయ్యా పరమాత్మ. ఇదిగో ఈ ధ్రువుణ్ణి చూడు. దేవుణ్ణి చూశాడు, నువ్ ఇంకా చూడలే. హరిని నువ్వు దర్శనం చేయలే. కృష్ణుడు ఇట్లా అట్లా అని విన్నావే తప్ప కృష్ణుణ్ణే నువ్వు చూడలే. కనుక పరమాత్మను చూసిన వాడికే ప్రారబ్ధం తప్పలేదయా ముప్పై ఆరు వేల ఏళ్ళు రాజ్యం చేయవలసి వచ్చింది. పరీక్షిత్ మహారాజా! నువ్వెంత అదృష్టవంతుడివి, ఏడు రోజుల్లో తక్షకాయ స్వాహా. పోతే పోతావ్, ఉంటే ఉంటావ్. ఇదిగో ముక్తి మార్గం ఇది. ముక్తి లక్షణం ఇది. జీవ లక్షణాలు గనక పోకపోయినట్లయితే ఎన్ని వేల ఏండ్ల తపస్సు చేసినా ప్రయోజనం లేదు." ముక్త సాధన కోరినటువంటి వాడు ఇందాక చెప్పినట్లుగా ఈ శరీరం ఇవ్వబడింది, పంచభౌతిక శరీరం. ఈ-ఈ శరీరం ఒట్టి పంచదార చిలకే, బొమ్మ. ఊరే మన జాతర్లల్లో అమ్ముతారు కదా రంగు-- పంచదార చిలకలు. తెచ్చినే ఇళ్ళ గ్లాసులో ఏండండి, ఏమవుతుందో చూద్దాం. ఏ కళ్ళ ముందే కరిగిపోతుంది. ఈ బొమ్మలు కూడా అంతే. ఈ బొమ్మలు ఉండేవి కాదు. కానీ ఉన్నంత కాలం పరమేశ్వరాయత్తమైనటువంటి చిత్తంతో ఉండాలి. రెండవదివిశ్వ సంసారాన్ని ఏ రకమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా తాను సృష్టించిన ఈ సృష్టిలో అందరూ హాయిగా ఉండాలి అని పరమాత్మ ఎట్లాగైతే నడిపిస్తున్నాడో అటువంటి పరమేశ్వరుడికి భక్తులమైనటువంటి మనకి మన సంసారం నడపటం ఆయనకు కష్టమా? కానే కాదు. అయితే సంసారం నడపటం ఆయనకు కష్టం కాదు గానీ మాకు కష్టంగా ఉంది స్వామి అంటున్నాం. అంటే పరమేశ్వరుడు వేరు మనం వేరు అనుకుంటున్నాం. ఈ సంసారాన్ని కూడా ఆయనకి ఇవ్వండి చూద్దాం ఏమవుతుందో కాసేపు ఆయనకిచ్చి చూద్దాం. ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది ఎక్కడికి పోయేదేమి లేదు పోమన్నా పోదు. స్వామి అన్నారే వాడెవడో నైళ్లలో కొట్టుకుపోతున్నాడట భయమేసింది వాడికి గడ్డిపోచ దొరికితే చాలు అని ఇంతలోకే తనంత వస్తువు దొరికింది అమ్మయ్యా అనుకున్నాడు గట్టిగా పట్టుబట్టుకున్నాడు ఆ అవతల దొరికింది కూడా అమ్మయ్యా అనుకొని పట్టుకుంది తీరా ఒడ్డుకు వచ్చి చూస్తే అది బల్లుకం నిలుక బండు. అది వీడిని వదలదు వీడు దాన్ని వదలడు. ఎన్-ఎన్ని భాగవత సప్తాహాలు ఎన్ని జ్ఞాన యజ్ఞాలు చేసినా గురువు గారు కూడా ఉపన్యాసం ఇచ్చినటువంటి వాడు అంటే మామూలు సాధారణ గురువు సంగతి. వాడంటాడు కోపం మీద ఉపన్యాసం ఇస్తాడు అవతల వాడి మీద కోపిస్తాడు. నాకేం అక్కర్లేదంటాడు అన్నీ కావాలంటాడు. కాబట్టి ఉత్తమోత్తమమైనటువంటి గురువు సన్నిధానంలో ఉన్నటువంటి సాధక జీవులు సాక్షాత్తు మన బోటి వారికి పరమాత్మే గురువు మనకి మధ్యలో గురువు ఎవ్వడు లేడు పరమాత్మే డైరెక్ట్ గురువు స్వామి. కాబట్టి ఆయన బోధలో ఉన్నటువంటి మనం ఆయన చూపించిన మార్గంలో ఉండే మనం ఈ సంసారాన్ని కాసేపు ఆయనకు అప్పజెప్పేసి కాసేపు నువ్వు నడిపించు స్వామి నీకే తెలుస్తుంది మా యాతనలేమిటో అని వదిలిపెడితే అప్పుడు ఆయన విలా విలాసంగా ఆరోజు దాన్ని ఎట్లా నడుపుతారో చూస్తాం. ఎప్పుడన్నా వదిలి పెట్టామా అని. దానికి రామకృష్ణ పరమహంస గొప్ప కథ చెప్పారు. ఒక పశువుల కాపరి ఓ మేక పిల్లను తీసుకుని వెళ్ళాడు. దాని-దానికేంటి గడ్డి మేయించడానికి మేపటానికి తీసుకెళ్ళాడు. గడ్డి ఎక్కడ ఉంది? ఎండలో ఉంది. ఎండను దాటి వెళితే తప్ప మేకకు గడ్డి దొరకదు. గడ్డి కావాలి గనుక ఎండను లక్ష్యం చేయదు మేక. తను మేసేదేం లేదు సాయంకాలం దాకా అట్లా తాడు పట్టుకు కూర్చోటమే. వీడికి నీడ కావాలి ఎండ తట్టుకోలేడు కనుక భగవంతుడు అక్కడ ఒక చెట్టు కూడా పెట్టాడు. ఆ చెట్టు చెట్టు కింద నీడ నీడలో ఈ కాపరి. వాడు నిద్రపోతున్నాడు పని ఏం లేదుగా పని లేనప్పుడు నిద్ర వస్తుంది పని ఉన్నప్పుడు నిద్రపోతుంది. ఆ పని వల్ల ఏం చేసాడంటే ఆ తాడు ముందేసి కట్టుకుని ఇలా పడుకుని నిద్రపోతున్నాడు. మేక అనుకుంటుంది ఈ పూటకి వీడు ఎంత అజాగ్రత్తపరుడు వీడు రోజూ మెడకు కట్టి లాక్కొచ్చి మేత మేపించేవాడు ఇవాళ అసలు నా చుట్టుపక్కలే లేడు వీడు నాకు దొరకటం లేదు ఎక్కడో వదిలేశాడు హాయిగా అనుకుంది. అది ఎరగనిది ఏమిటంటే కొస వాడి దగ్గరే ఉంది. వాడు ఎరగనిది ఏమిటంటే వదిలిపెట్టాను మేక తింటుంది అని అనుకుంటున్నాడు గాని మేక కూడా తన చేతుల్లోనే వదులుకోవటానికి లేడు. ఏదో గడ్డి మేసి మళ్ళీ నా దగ్గరికి వస్తుందిలే అంత నమ్మకం వాడికి ఆ మేక మీద లేదు. కాబట్టి పరస్పరాశ్రితమైనటువంటి మానవుడు ఎప్పుడూ కూడా పరమాత్మ యందు ఏకీకృతమైనటువంటి భావంతో ఏకాగ్ర చిత్తంతో చిత్తాన్ని జ్ఞానాధిక్యమైన స్థాయిలో సంచారం చేయిస్తూ పరమేశ్వరుడికి దాన్ని కాసేపు వదిలిపెట్టాలి. ఒక్కోసారి అంటాం. వదిలిపెట్టటం ఏం చేస్తాం? అన్నీ నీకే వదిలిపెట్టేసాను నువ్వు చూసుకో అంటాం. అంటాం గాని మళ్ళీ మనస్సు ఏమంటుంది అంటే ఆయన చేస్తాడు నమ్మకం ఉంది గాని ఇలా చేస్తే బాగుండదు అంటాం. మళ్ళీ ఆయన ఎలా చేయాలో చేయాలని నిర్ణయిస్తాం మనం. చూశారా మనస్సు పరమాత్మనికి కూడా ఒక definition ఇస్తుంది ఒక direction ఇస్తుంది ఆ పని చేయకూడదు. సమర్పణ శరణాగతి అనే రెండు భావాలలో ఆయనకు వదలటమే ఉత్తమం. ధ్రువుడు చేసిన పని అదే. కానీ లిబిడో అని ఉంది ఇవాళ ఆధునిక మానసిక శాస్త్రజ్ఞులు మన brain లో ఎక్కడో లోపల దాన్ని లోకలోకాంతర ప్రాణం అన్నారు. ఆ లిబిడోలో మనకు తెలియని అనేకమైనటువంటి విషయాలు అక్కడ గుప్తంగా ఉంటాయి. అవి ఎప్పుడు తెలుసుకుంటాయో ఎప్పుడు మనల్ని బాధిస్తాయో ఎప్పుడు మనల్ని మళ్ళీ విషయాసక్తం చేస్తాయో మనకు తెలియవు. ఆ లిబిడో open కాకుండా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి. కానీ పరమాత్మ లిబిడోలో కూడా దొరకగలడు ఎందుకంటే ఆయన అక్కడ కూడా ఉన్నాడు. కనుక ధ్రువుడి యొక్క లిబిడోలో లోకలోకాంతర ప్రాణంలో దాగి ఉన్నటువంటి ఒక ఆభిజాత్యాన్ని ఒక ఆధిక్యాన్ని నా సవతి తమ్ముడైనటువంటి ఉత్తముడు ఎట్లా దానిని సాధించాడో after all వాడు అనుకున్నాడు అహంకారంతో. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడయ్యా నా తండ్రి తొడ మీద కూర్చున్నాడు మరి నేను? గగన గగనాంతరాలలో ధ్రువ తారగా ఉండబోతున్నాను అంతేకాదు నారద మహామునికి చెప్పా నేను. ఏమని చెప్పానంటే ఇక నాపై ఉండటానికి మరొక తార ఉండటానికి వీలు లేదు మరొకడు వచ్చి ఆ బ్రహ్మపదం యొక్క అంచెల్లో నేనుండాలి. ఆయన చెప్పింది అలాగే ఉండు అన్నాడు. కానీ అలాగే ఉండు గాని ఇలాగు-ఇలా ఉంటే అలా ఉంటావురా అన్నాడు ఆయన. ఏమిటా ఇట్లా ఉండటం అంటే ముప్పై ఆరు వేల ఏళ్ళు ఇక్కడ పాలించు అన్నాడు. ఎలా పాలించాడట అంటే శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాలు ఎట్లా ధర్మబద్ధంగా పాలించాడో దానికి పది రెట్లు ఎక్కువగా ధ్రువుడు పాలించాడు. తన సామ్రాజ్యం అంతా హరిమయం చేశాడు విష్ణుమయం చేశాడు. ప్రతి ఇంటిని విష్ణు ఆలయంగా తీర్చిదిద్దాడు. ఆ మకర తోరణాలు కట్టించాడు. ఆ లోకానికి వెళ్ళేటువంటి చోట జయవిజయుల లాంటి ప్రతిమలు బొమ్మలు పెట్టించాడు. అంటే హృదయ మందిరం ఒకటైతే తామున్నటువంటి ఆరామాలన్నీ కూడా తామున్నటువంటి ఇళ్లన్నీ కూడా విష్ణు ఆలయాలుగా మార్చేశాడు. విష్ణుతత్వం తప్ప మరొకటి లేదంటూ తాను స్థిమితంగా ఉన్నాడు తన ప్రజలను కూడా స్థిమితంగా ఉంచాడు. అస్థిమితమైనటువంటి మనసున్న పాలకుడు ఉన్నట్లయితే రాజ్యం భ్రష్టు పడుతుంది.వాడికి స్థిమితత్వం లేదు వాడికి ఏం కావాలో తెలియదు ఆ ఏం కావాలో తెలియని కారణంగా ప్రజలకు కూడా ఏం కావాలో తెలియదు. ఈ రెండింటి యొక్క ఈ వైరుధ్యాన్ని ధ్రువుడు తన జీవిత కాలంలో తర్వాత ముప్పై ఆరు వేల సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. వెళ్లే-- వెళ్ళి ఇవ్వాల వీలైతే చూడండి ఆ ధ్రువ నక్షత్రం అన్ని నక్షత్రాలలో it outshines కొన్ని కోట్ల నక్షత్రాలలో అది ధ్రువత్వంగా ఉంటుంది నిలకడగా ఉంటుంది. నిజానికి కొన్ని, కొన్ని ప్రదేశాలలో ప్రపంచంలో ఎక్కడైతే భూమికి ఆకాశం horizons కాస్త తాకినట్టుగా అనిపిస్తాయో ఒక, ఒక particular angle లో ఒక gradation లో ధ్రువతార వలన ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు కూడా ప్రకాశమానం చెందుతాయి. ఇది అశ్వారోహీలో ఖగోళ శాస్త్రంలో ఒక భాగం కాబట్టి పరిపూర్ణమైనటువంటి భక్తి సదమల భక్తి తపస్సు చేయటం మాత్రమే కాదు పరమాత్మ సాకారంగా మన దగ్గరకు వచ్చినా సరే ఆయనని ఏమి అడగాలో అది అడగాలి అని చెప్తున్నది goal oriented గా ఉండి తీరాలి కానీ అది స్వార్థపూరితంగా ఉండకూడదు. నేను మాత్రమే ఉండాలి నాకే చెందాలని కాక అందరూ అక్కడికి వెళ్ళే మార్గం ఏమిటో చెప్పమని గనక హరిని అడిగి ఉన్నట్లయితే అందరికీ ఇచ్చినట్లే ముక్తి తొందరగా ఇచ్చేవాడు. పరమాత్మ ఇది ఇచ్చాడు అది కూడా ఇచ్చాడు. భోగ యోగాల రెండింటిని కూడా తాను పొంది తన కన్నతల్లిదండ్రులకి తాను పొందవలసిన స్థానానికి తన రాజ్యానికి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా సుఖవంతమైనటువంటి పాలన ఇచ్చాడు గనుక ప్రపంచంలో మనం కాచుకోవలసింది ఒకటి మన వలన ప్రపంచం హింసకు గురి కాకూడదు. అలాగే ప్రపంచం నుంచి మనం హింసకు గురి కాకూడదు. ఈ రెండు balance చేయి-- చేసుకోవాలి అటువంటి స్థితిలోకి వెళ్ళమని ఈ భాగవత కల్పతరువు ఈ ఫలాన్ని మనకు అందిస్తున్నది గనుక రేపు మరొక కొత్త విచారణలో పరమేశ్వరానుగ్రహంతో సత్య సాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కరుణతో ఈ భాగవత నవనీతంలో మరొక వెన్నముద్దను మనం రేపు అందుకుందాం. అందుకునేదాకా హంసానంది కావాలిగా.
SSSMC · audio
Bhagawata Navaneetham - 29
Bhagawata Navaneetham - 29
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 20:25
More in this series