Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆరంభేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాత్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ వేదవ్యాస ప్రోక్తమై పోతనామాత్య కృతమైనటువంటి శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలో ప్రవేశించిం వారం త్రివిక్రమావతారం అయిపోయింది బలి సుతల లోకానికి వెళ్ళాడు చాలా సంక్షిప్తమైనటువంటి అవతారం మత్స్యావతారం మత్స్యావతారంలో ఆశ్చర్యాలు పెద్దగా ఏం లేవు ఒకే ఒక ఆశ్చర్యం రాజుగారు మహాముని ఒక రాజర్షి తపస్సు చేసుకుంటూ సముద్ర తీరానికి వెళ్ళి చూస్తూ ఉండగా ఆయన చేతికి చేపపిల్ల వచ్చింది అయ్యో నీళ్ళల్లో ఉండవలసిన చేప పిల్ల నా చేత పడింది అని మళ్ళీ నీళ్ళల్లో వదిలేశాడు వదిలేస్తే చాలా దీనంగా చేప ఈయనకు అర్థమయ్యే భాషలో పెద్ద పెద్ద చేపలన్నీ చిన్న చేపలను తినేస్తున్నాయి నీకు ఇంత దయ లేదా నీ చేతుల్లో పడ్డాను నన్ను కాపాడలేవా అని అడిగింది అసలు చేప మాట్లాడితేనే ఆశ్చర్యపోయినాడు ఆయన సరే మళ్ళీ చేపను తీసుకుంటే అది ఏం అడిగింది అంటే నన్ను మీ నన్ను మా మీ ఇంటికి తీసుకెళ్ళు అంది సరే అలాగే అని తన చేతిలో చక్కగా ఒక కమండలం ఉండే దాంట్లో అది నీళ్ళల్లో వేసుకుని తీసుకుపోయినాడు తెల్లవారేసరికి అది కమండలం అయింది చోటు లేదు నాకు చోటు చాలటం లేదు కాస్త ఇంకేదైనా పెద్ద ప్రదేశం ఇవ్వమంటే తీసుకెళ్ళి వాకిట్లో ఉన్న బావిలో గుమ్మరించాడు ఆయన్ని బావి అంత అయింది బావిలో ఉన్న చేప అడిగింది ఇప్పుడు ప్రదేశం నాకు చాలటం లేదు ఏం చేస్తావు అని ఊరు చివర సరస్సు ఉంది అక్కడ పడేస్తాను అన్నాడు సరస్సులో పడేస్తే సరస్సు అంత అయింది ఇదేమిటి అక్కడ పడేస్తే ఇంత అయిపోతున్నది అని అనుకుంటూ ఇదేదో విష్ణు మాయగా ఉన్నది ఇది ఒట్టి చేప మాత్రం కాదు అని సముద్రంలో విసిరివేసే సన్నివేశంలో అడిగాడు భాగదేయా మహానుభావా ఎవరు నువ్వు అసలు చోటు చాలని నువ్వు ఎవరు విష్ణువు తప్ప మరొకరు కావటానికి వీలు లేదే అని అడిగితే అవును నేను అదే నేను విష్ణువునే అయితే కల్పాంతంలో బ్రహ్మ మూడు రాత్రులు నిద్ర పోతాడు మళ్ళీ ప్రళయం సంభవిస్తుంది ప్రళయం సంభవించే సమయానికి నీ దగ్గర కావలసిన కొన్ని విత్తనాలు అంటే సృష్టి ప్రారంభం కావటానికి అలాగే ప్రపంచం ఆయుష్మంతంగా ఉండటానికి ఔషధులు ఒక నావలో పెట్టుకుని నువ్వు సిద్ధంగా కాచుకుని ఉండు నావలోకి ప్రళయ జలం వచ్చినప్పుడు సప్తఋషులంతా కూడా నీతో పాటు ఎక్కుతారు మహాపురుషులంతా నావ ఎక్కుతారు రెండు కనిపిస్తాయి నీకు ఒకటి నా తోక రెండవది ఒక పుమ్ము రెండింటికీ మధ్య వాసుకి అనేటువంటి పాముని తాడుగా కట్టి నావ నీట మునగకుండా గాలికి అటూ ఇటూ ఊగకుండా దాన్ని నిలబెట్టి ఉంచు నువ్వు చేయవలసిన పని అంతే అన్నాడు అంతవరకే చెప్పాడు కథ సరే పరమాత్మ మాత్రం చెప్పాడు అవును నావ ఏమిటి ఔషధాలు ఏమిటి ప్రళయం రావటం ఏమిటి నేను కాపలా కాయటం ఏమిటి అని అడిగేలోగా ఆయన కాస్త మాయం అయిపోయినాడు పరమాత్మలందరికీ అలవాటు ఉంటుంది వాళ్ళు చెప్పేది చెప్తారు తప్ప మనం చెప్పేది వినరు వినటానికి వాళ్ళకి టైం ఉండదు వాళ్ళు మాయం అయిపోతుంటారు మళ్ళీ పట్టుకునేది ఎట్లా మళ్ళీ ఎప్పుడో యోగం కలిగితే మళ్ళీ మాట్లాడతాను లేకపోతే లేదు సరే కల్పాంతంలో బ్రహ్మ అనుకున్న ప్రకారంగా ఒక మాగన్నుగా ఆయనకి నిద్ర పట్టింది నిద్ర పడుతున్నటువంటి వేళ ఆయన ముఖం నుంచి నాలుగు వేదాలు బయటకు వచ్చినాయి వేదాలు బయటకు వచ్చినప్పుడు హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు వాటిని దొంగతనం చేశాడు ఇద్దరు హయగ్రీవులు ఉన్నారు ఇద్దరు వాసుదేవులు ఉన్నారు ఒక వాసుదేవుడు అసలు వాసుదేవుడు అసలు వాసుదేవుడు ప్రపంచంలో ఎక్కడ ఉంటాడో ఒక నకిలీ వాసుదేవుడు కూడా తయారవుతాడు అలాగే వేషం వేసుకుని ఉంటాడు వాడిది వేషం వరకే వాడి పేరు పౌంగ్రక వాసుదేవుడు అట్లాగే హయగ్రీవుడు నిజానికి ఎవరంటే జ్ఞాన స్వరూపి జ్ఞానమూర్తి కానీ హయగ్రీవుడు ఎవరంటే చోరుడు దక్షిణామూర్తి గారు సతీ సమేతంగా ఒక అధ్యాత్మ కార్యక్రమానికి నమ్-పదిహేను రోజులు వెళ్తున్నారు మహాబలేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహం వారి యందుండి జ్ఞాన సంపన్నులై మళ్ళీ భాగవతానికి అందుకునేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తున్నారు శుభం సరే ప్రళయాంతంలో వీడు ఉన్న నాలుగు వేదాలు పట్టుకుని వాడు వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నాడంటే సముద్రం లోపలికి వెళ్ళి దాక్కున్నాడు సముద్రం లోపలికి ఎవడు వెళ్ళగలడు అంటే పరమాత్మే ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు ఎవరంటే పరమాత్మ ఒక్కడే పరమాత్మ వెళ్ళేటువంటి భావనలో మత్స్యావతారం ఎత్తొచ్చాడు పరమాత్మ సరే వేదాలు వాడిని కిందకి వెళ్ళాడు వాడిని చంపాడు మళ్ళీ నాలుగు వేదాలు ఇచ్చి నిద్ర లేపాడు బ్రహ్మని ఇదిగో నాలుగు వేదాలు దగ్గర పెట్టుకో మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్ ఎందుకంటే ఒక్కొక్క కాలం కూడా ఒక కల్పంతో అంతమవుతుందికల్పంతో అంతమైపోయేటువంటివి అవి కల్పాంతం వరకు ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న విచారణ ఏంటంటే స్వామిని-- భజన ఉంది. భజన చాలా అర్థం లేని ఒక భజన బాగా హాయిగా పాడేస్తూ ఉంటాం. కలియుగకే అవతారుతుం హో అని ఒక పాట ఉంది. కదా భజన? కలియుగ అవతారం కాదు స్వామి. కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపర నాటి ప్రేమ, శాంతి, కలియుగంలో ఉన్న అహింస, ఐదు కలిపితే ఒక్క సత్య సాయి భగవానుడు. అవతార మూర్తులంతా కల్పం ముగియగానే వాళ్ళ కథ ముగుస్తుంది. కల్పంతో ఆగిపోయే వాళ్ళంతా కూడా ఒక పాక్షిక అవతారాలు మాత్రమే. వాటిని కళావతారాలని, అంశావతారాలని, అర్చావతారాలని, అనుప్రవేశ అవతారాలని, ఆవేశ అవతారాలని, ఇదిగో మత్స్యావతారం అటువంటిది అన్నమాట. కాసేపు వేదాలు రక్షింపబడాలి గనుక శ్రీమన్నారాయణుడు అటువంటి జన్మ తీసుకుని వచ్చాడు. కథ పరీక్షిత్ మహారాజుకి శుకుడు ఎందుకు చెప్పాడంటే పరీక్షిత్ మహారాజు అడిగాడు శుకుడ్ని, ఆయన కల్మషరహితుడు కదా, దోషం లేదు కదా, శుద్ధ సత్వ స్వభావం ఉన్నటువంటి పరమాత్మ కదా, అది శుద్ధ చైతన్యం కదా, చాలా అసహ్యకరమైనటువంటి రూపంతో, భరించలేని దుర్వాసనతో ఉండేటువంటి చేప జన్మ ఎందుకు ఎత్తాడు? అని అడిగాడు. రూప, గంధ, రస, స్పర్శ, శబ్ద అనబడేటువంటి ఐదు మానవుడికి వికారాలు తప్ప పరమాత్మకు లేవు. పరమాత్మ శబ్దంలో దాగి ఉన్న నిశ్శబ్ద స్వరూపం. అలాగే నిశ్శబ్దంలో ఇమిడిపోయిన శబ్ద బ్రహ్మ కూడా. అలాగే ఆయనకి రూపం లేదు కానీ అవసరమైతే రూపం తీసుకుని వస్తాడు. అలాగే ఆయనకి స్పర్శ లేదు, అవసరమైతే మనల్ని తాకుతాడు. ఇక రసం, రసో వై సహ, రస స్వరూపుడే ఈశ్వరుడు. ఇక వాసన అంతా కూడా సువాసన, పరిమళభరితంగా ఉంటుంది. మానవుడి శరీరం కూడా human body కూడా aromatic body. మనం గనక రకమైనటువంటి deodorants కి శరీరాన్ని అలవాటు చేయకపోతే, లోపల చక్కని భావాలు గనక మనకు ఉన్నట్లయితే, ధర్మ ప్రవర్తన చేసినట్లయితే, పరమాత్మ యందు ఒక నిష్ఠతో కూడిన భక్తి ఉన్నట్లయితే మన శరీరంలో నుంచి కూడా దివ్యమైన పరిమళాలే బయటికి వస్తాయి. అది ఒక్క పరమాత్మ సొత్తే కాదు మనది కూడా. కానీ మనకు అవన్నీ లేని కారణంగా, శరీరము వాసనామయమైన కారణంగా అసలు వాసన మరుగున పడిపోతున్నది. కావలసిన వాసనకి మనకు ఏం చేయాలో తెలియక deodorant కొనుక్కొని, deodorant కొనుక్కొని, ఇవాళ ఇది, రేపది, పరమాత్మకు అట్లా ఉంటాయా? ఎప్పుడైనా, ఇవాళ అయితే అవకాశం లేదు గాని రోజుల్లో స్వామి వెండి తలుపు తీసుకుని అందరి మధ్యకి దర్శనానికి వచ్చేటువంటి వేళ ఆయన ఎన్నడూ ఒక powder వాడినటువంటి అవతారం కాదు. ఆయనకు అవి, వాటి అవసరమే లేదు. వస్తుంటేనే గాలి అంతా పరిమళభరితం అయిపోయేది. ఎంతో ఆనందంగా ఉండేదో. మళ్ళీ అటువంటి సువాసనలు అవన్నీ ఎప్పటికైనా అనుభవించగలమా అని అనిపిస్తుంది. కానీ స్మృతి ఉన్నది చూశారా? స్మృతే పరిమళం. అవి తలచుకున్నప్పుడల్లా స్వామి మనతోనే ఉన్నట్టు, పరిమళాలన్నీ వెదజల్లుతున్నట్టు మనకి ఆనంద రేఖ పొటమరిస్తూ ఉంటుంది గనుక మత్స్యావతారం pre first అవతారం. ఇంతే కథ, ఏం లేదు దాంట్లో. బ్రహ్మ నిద్రపోతున్నాడు, వేదాలు-- చతుర్ముఖ బ్రహ్మ గనుక నాలుగు వేదాలు బయటకు వచ్చినాయి. ఆయన మాగనుగా ఉన్నాడు గనుక దొంగకు అవకాశం దొరికింది. ఎవడయ్యా దొంగ అంటే హయగ్రీవుడనే రాక్షసుడు తీసుకున్నాడు, సముద్రం కిందకు పోయినాడు. పరమేశ్వరుడు మత్స్యావతారం ఎత్తాడు. ఇగో ఇవన్నీ నెలబెట్టాడు. మళ్ళీ ప్రళయాంతమై సృష్టి, పునఃసృష్టి ప్రారంభం కావటానికి వేదం, ఎందుకంటే అఖిల ధర్మాలకి కూడా మూలం ఏది అంటే వేదమే. వేదంలో నుంచి సర్వ ప్రకృతి, సర్వ సృష్టి మళ్ళీ పునః సృష్టింపబడుతుంది. అలాగే ప్రకృతికి, సృష్టికి కావలసిన సర్వ శక్తులు, సూర్యచంద్రాదులు, దివా రాత్రాలు అంటే కాలము, దేశము, ప్రదేశము, పరిణామము, పరిమాణము, ఉత్పత్తి అన్నీ ఎదుగుదల ఎక్కడి నుంచి ఏర్పడుతాయి అంటే వేదంలో నుంచి ఏర్పడుతుంది గనుక వేదాన్ని ఆశ్రయించి జీవుడు గనక జీవించగలిగితే వాడు ధర్మజ్ఞాన స్వరూపుడు అవుతాడు, అంతే. జ్ఞాన స్వరూపుడు అంటే శాస్త్రాలు పరిచయం అయితే వాడు జ్ఞాని కాదు, వాడు విజ్ఞాని, అంతే. జ్ఞాని ఎవరంటే తనకు, పరమాత్మకు అభేదం చెప్పుకోగలిగిన వాడు. పరమాత్మను ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తనకంటే భిన్నంగా చూడకుండా, అభిన్నంగా చూడగలిగినటువంటి అద్వైత, పూర్ణ అద్వైత మహాపురుషులంతా కూడా జ్ఞానుడిగా, స్వామిగా, స్వామి అంటే జ్ఞాని అని అర్థం, అంతే. కాబట్టి మత్స్యావతారం అయిపోయింది. అయిపోయిన తర్వాత నిజానికి మన బోటి వారందరికీ, సంసారంలో గృహస్తులుగా జీవించే వారందరికీ అంబరీషుడి కథ. చాలా గొప్ప విష్ణు భక్తుడు ఆయన. అంబరీషుడునే పరమ భాగవతోత్తముడు అన్నది భాగవతం. ఎందుకని అంటే అంబరీషుడు హరి తప్ప ఆయనకేం తెలియదు. రామాయణంలో జనకుడు ఎట్లాగో భాగవతంలో అంబరీషుడు అట్లా. ఆయన రాజే కానీ రాజుగా మాత్రం లేడు. రాజుగా మాత్రమే లేడు. మునిగా ఉన్నాడు, బ్రహ్మర్షిగా ఉన్నాడు, మహర్షిగా ఉన్నాడు, హరి నామం తప్ప అన్యం ఎరగని వాడు, హరి రూపం తప్ప మరొక దానిని భావించని వాడు, హరితత్వం తప్ప దేనియందు ఆసక్తి లేనటువంటి వాడు. అటువంటి అంబరీషుడి కథతో మనం ఇవాళ నమస్-- నవమ స్కంధం కూడా పూర్తి చేసుకుంటున్నాం.మిగతా చిన్న చిన్న ఉన్న అవి spiritual significance చాలా తక్కువ. ఇప్పుడు మత్స్యావతారం ఉంది, కథా విమరణంలో ఒక అవతారం ఏర్పడాలి గనుక it is only a small linkage. మత్స్యావతారం కాకపోతే తొమ్మిదో అవతారాలు పదోది ఎక్కడ అని అడగకుండా అది కథ. spirituality దాంట్లో ఏం లేదు. ఏం లేదు అంటే మళ్ళీ వేదాలు రక్షింపబడాలి. అందుకనే సత్య సాయి భగవానుడు మహా పరిపూర్ణ అవతారం గనుక ధర్మోద్ధరణ, వేదోద్ధరణ, దీనజనోద్ధరణ ఎంత అద్భుతమైనటువంటి మాటలు స్వామి వాడారు. మార్గ నిర్దేశనం చేశారు. వేదాన్ని రక్షించండి మనం రక్షించలేం. దానిని పాడు చేయకుండా ఉంటే, దానిని చులకన చేయకుండా ఉంటే, దానిని అవమానించకుండా ఉంటే అదే ద-రక్షింపబడుతుంది. వేదమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. చేయవలసిన ధర్మాన్ని ప్రకృతి చూడండి, హేమంత ఋతువు వెళ్లిపోయింది ఎండాకాలం వచ్చింది. ఎల్లకాలం ఎండాకాలం ఉండబోతున్నదా? ఇది పోతుంది వర్షాకాలం వస్తుంది. కాబట్టి ప్రకృతి తన ధర్మాన్ని ఎట్లా నిర్వర్తించిందో గృహస్తుడైనవాడు, సాధకుడైనవాడు, జీవుడైనవాడు తన కర్తవ్యాన్ని గనుక తాను ధర్మం ప్రకారం నిర్వర్తిస్తే ధర్మమే అతనికి సంపద. అది. ఇక మూడవది ప్రపంచంలో ఉన్నవాడు లేనివాడు ఉండి ఉంటాయి. అవి ఎప్పుడూ ఉంటాయి. అందరూ లేని వాళ్ళు కారు, అందరూ ఉన్నవాళ్ళు కారు. అందరూ ఉన్నవాళ్ళు అయితే సృష్టికి అర్థం లేదు. అందరూ లేని వాళ్ళు అయితే భగవంతుడే దీనవాడు అనమాట. వాడికి సృష్టించడమే చేతకాదు అనమాట. కాబట్టి ఇద్దరినీ సృష్టించటంలో ఆయన ఆంతర్యం ఏమిటంటే, "ఇదిగో నీకు నేను సంపదను ఇస్తా అక్కరకొచ్చిన వాడికి ఇలా అదుకు. ఇదిగో నీకు బుద్ధి బలం ఇస్తా చేయగలిగిన సేవ చేసుకో. ఇదిగో నీకు ప్రేమించగలిగినటువంటి దివ్య హృదయాన్ని నాలో నుంచి నీకిస్తున్నా, నువ్వు కూడా ప్రపంచాన్ని నేను ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించగలిగే స్థాయికి నువ్వు వెళ్ళు." ఇది. మూడు గనక మనం ఆచరించగలిగితే సత్య సాయి భగవానుడికి అవతారాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లే. ఎందుకంటే పదవి వచ్చింది అనుకోండి, పదవిలో పతనం కావటానికి చాలా అవకాశాలుంటాయి. పదవి ఏం లేదనుకోండి హాయిగా, ఎంత హాయి అంటే అందరికీ మనం చెందిపోతాం. పదవి రాగానే కొందరికే చెందిపోతాం. దాని వలన చాలా ప్రమాదం. నలుగురు మిత్రులుంటారు, నలభై మంది శత్రువులుంటారు. పదవి లేని వానికి అందరూ మిత్రులే. హాయిగా ఉంటాడు వాడు. వాడి ఇంట్లో వాడు అన్నం తిని పడుకుంటాడు. అయితే రాజు, రాజ శబ్దం కూడా నిజానికి పనిష్మెంటే. రాజు కూడా అనేక కర్మలు చేస్తాడు. కర్మానుభవాలు వాడు పండించుకోవాలి గనుక, దానిలో గనుక ఋషిత్వం ఉన్నట్లయితే పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్టుగా రాజ్యం చేయగలిగినట్లయితే అది ఒక ఉదాత్త భూమిక. త్రేతాయుగంలో జనకుడు, ఇదిగో ద్వాపర యుగంలో మన అంబరీషుడు, కలియుగంలో శృంగేరి పీఠాధిపతులలో చంద్రశేఖర భారతి స్వామివారు. ఆయనని క్షణాన మనం తలుచుకోవాలి. ఎటువంటి వారంటే, ఆయన పీఠాధిపత్యం వహించినంత కాలం ఆయన administration లో ఒక్క రోజు కూడా ఎంత డబ్బు వచ్చింది, ఎంత పోయింది అన్న ప్రశ్న వేయలే. కానీ ఆయన పట్టించుకోకుండా ఆయన పీఠాధిపతిగా అమ్మవారి యొక్క పూజ అర్చనలో ఉన్నంత కాలం శృంగేరి పీఠం ఇవాళ వెలిగిపోవటానికి ఆయన ధ్యానమే కారణం. ఎప్పుడైనా గనుక మీకు దొరికితే చంద్రశేఖర భారతి స్వామివారు A Mystic and a Saint అని ఒక book ఉంది. చదవండి అది. చదవాలి. మామూలు అది ఊరికే ఒక రెండు నిమిషాల్లో చెప్పేది కాదు. అమ్మవారు ఆయన పక్కనే ఉండేది. అంతేనా, అసలు అమ్మవారే రూపం ఎత్తుకొచ్చింది. గుణ రూపమై వచ్చింది అంటారు. కాబట్టి రాతస్మరణీయులైనటువంటి చంద్రశేఖర భారతి స్వామివారు శృంగేరిలో, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మహాస్వామి కంచిలో, అటు తిరువణ్ణామలైలో రమణ మహర్షి, అటు షిరిడి సాయిబాబా, పాండిచ్చేరిలో అరవిందుల వారు, అప్పుడే నేను సత్య సాయిబాబా రని ప్రకటించినటువంటి భగవాన్ సత్య సాయి పుట్టపర్తిలో, అది ఆధ్యాత్మిక స్వర్ణయుగం. అందులో మన వి.కె. గోకాక్ the first Vice Chancellor స్వామి యూనివర్సిటీ. పొద్దున అరవిందుల వారిని దర్శనం చేసుకున్నారు. ప్రయాణం మధ్యలో రమణ మహర్షిని చూశారు. సాయంకాలం white field కి వచ్చేప్పటికి బృందావనంలో స్వామితో గడిపారు. ఆయన ముగ్గురు మహాపురుషుల్ని ఏకకాలంలో దర్శనం చేసుకున్నారాయన. అందుకనే స్వామి, "స్వామి మన యూనివర్సిటీకి ఇదిగో ఇలా డీమ్డ్ యూనివర్సిటీగా వచ్చింది. ఇక మిగతా కార్యక్రమాలన్నీ చేయాలి అంటే, అంటే Vice Chancellor ని పెట్టాలి." అని మాట వచ్చినప్పుడు ఆయన ఆశించలేదు. నేను Vice Chancellor కావాలని కోరుకోలా. స్వామి పాదాల దగ్గర కాగితం పెట్టి, "స్వామి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని స్వామి దయతో, స్వామి శక్తితో, స్వామి కరుణతో, స్వామి అనుగ్రహంతో పూర్తి చేయగలిగినటువంటి స్థితి నాకు ఏర్పడింది. ఇకపై మీ ఇష్టం." అని పక్కకు వచ్చారు. అయిన తర్వాత ఆయన వెనక్కి వెళ్తుంటే, ఆయన పేరు గోకాక్ కదా. గోకాక్ అంటే he is going, బయటికి వెళ్తున్నాడు అని. అక్కడున్న పది మందితో స్వామి, "Vice Chancellor ని ఇప్పుడే నిర్ణయిస్తా." అన్నారు స్వామి. ఎవరో ఎంతమంది ఉన్నారో ఆయన మనసులో ఎవరికి ఉన్నదో తెలియని సంకల్పం. అనగానే, "ఆగు ఆగు" అన్నారు స్వామి. "నువ్వు ఆగు వెళ్ళిపోతావేంటి గోకాక్" అని చమత్కారంగా అన్నారు. అనేప్పటికి పాపం ఆయన చేతులు కట్టుకుని నిల్చుంటే, "ఈ క్షణం వరకు నువ్వు గోకాక్, ఇకపై నాకు నీవు పీకాక్." అన్నారు స్వామి. అది. అంటే నెమలి. వర్ణవర్ణాంచితమైనటువంటి దేహంగా నీకున్న అనేక ప్రజ్ఞలన్నీ యూనివర్సిటీకి వినియోగించు. అదే appointment. కాబట్టి మహా-మహాపురుషులు వాళ్ళంతా. మామూలు భక్తులు కాదు. ఏదో కాసేపు పదవి కోసం ఉండి అది అయిపోగానే మళ్ళీ రాకుండా ఉంటారు చూడు. పదవిలో ఉన్నంత కాలం వాడు ఇక్కడ అంటిపెట్టుకుని ఉంటాడు. పదవిలో నుంచి పీకేస్తే వాడి address ఉండదు. ఎందుకు? ప్రయోజనం లేదు. అటువంటి భక్తులు స్వామికి అవసరం లేదు వాళ్ళంతా బరువు కూడా. కాబట్టి అంబరీషుడు అటువంటి భక్తుడు కాదు అని చెప్పుకోవటానికి వీళ్ళందరూ కూడా గుర్తొచ్చారు.
SSSMC · audio

Bhagawata Navaneetham - 48

Home

Bhagawata Navaneetham - 48

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 18:31

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

    Now playing
  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67