No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం, సౌందర్య సార సర్వస్వం. మందస్మిత మనోహరం. వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. ప్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం, మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాత్. పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ, ఎప్పుడైతే మనం నిశ్చలంగా ఉంటామో పరమాత్మ మాట్లాడతాడు. మనం ఎప్పుడైతే రోదిస్తుంటామో ఆయన పట్టించుకోడు. కనుక మనం ఏం చేయాలంటే ఏడవకూడదు అని అర్థం. ఏది రాని ఏది పోని ఇదిొక మహా కల్లోలం ఇది. అనేక కెరటాలు పుడుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, అలలు ఏర్పడుతాయి. ఏర్పడిన కెరటం ఉంచున్నదా, కెరటం పుట్టకుండా ఉన్నదా? ఇదేదో దుఃఖం వచ్చింది సుఖం రాదేమో అని అనుకోకూడదు. సుఖాలే వస్తున్నాయి దుఃఖాలు మనకు లేవనుకోకూడదు. ఏ రూపంలో ఏ సుఖం ఉంటుందో, ఏ దుఃఖం ఉంటుందో, ఏ అననుకూలత ఉంటుందో, ఈ జీవన పరావారంలో కలిగేటువంటి అనేకానేక మార్పులు అన్నింటినీ కూడా ఒబ్బేరసి చక్కగా ఎరుకతో అనుభవించాలి. దానవేంద్రుడు అయినటువంటి బలి వాడు రాక్షస జన్మ ఎత్తినా, గుణం చేత దానవీరుడు అయినాడు గనుక నిశ్చలంగా ఉన్నాడు. వటు త్రివిక్రముడై అయి ఉన్నాడు. అప్పుడన్నాడు, "దానవ త్రిపద భూతుల మితునంటివి". దానవా! మూడు అడుగులు ఇస్తానని కదా అన్నావు, చూడండా పరీక్ష ఎలా పెడుతున్నాడో. తరణి చంద్రార్కులెందాక నుందురు అంత భూమియు ఒక్క అడుగయ్యే నాకు. సూర్య చంద్రాదులు భూమి ఇదంతా కలిపితే నాకు అడుగు అయిపోయింది. స్వర్లోకము ఒక్క చరణమయ్యే, నీసంము సకలంబు నేడు రెండడుగులు కడమ పాదమునకు కలదే భూమి. ఇచ్చెదను అనర్థమీ నిదురాత్ముండు నిరయంబు పొందుట నిజము గాదే. ఎక్కడ మోపమంటావయ్యా మూడో పాదం. చూస్తున్నా నా పాదం ఏమైపోయింది అని ఇదిగో ఇట్లా అక్కడ అక్కడ ఆక్రమించేసాం. రెండడుగులైపోయింది మూడోది ఎక్కడ మోపని భూమి ఉన్నదా అని అడిగాడు. అనగానే వామనుడు పలుకక, సమాధానం లేదు పాపం. లేక సత్యభంగ సందేహం జరిగిందట ఆయనకి. నేను అన్నమాట నెరవేర్చుకోలేకపోతాన ఈ వేళ, ఎందుకిలా జరిగింది అని అనుకుంటూ, కానీ విషణ్నుడు గాక ఆయనకు విషాదం కలగలేదట. వైరోచని ప్రసన్నవదంతో చిన్ని క్రోడైనటువంటి వడుగుతో అంటే వటువుతో ఇలా అన్నాడట. సుమృతంబు గాని సుడియదు నా జిహ్వ, వంకజాల నాకు బుంకు లేదు. నీ తృతీయ పదము నిజము నా శిరమున నిలవు చేసి పెట్టవో నిమ్మలాత్మ. ఏమన్నది, నా శిరస్సు మూడో పాదంగా తెచ్చి అక్కడ పెట్టవయ్యా అని అడిగాడు. నిరయమున ప్రాప్త నిగ్రహంబున పదవిహీనతకు, బంధమున కర్ణభంగమునకు, అఖిల దుఃఖమునకు వెరవ దేవ! వంక వెరచినట్లు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెలికాండ్రు, గురువును శిక్షింప కొరత వడువే. పేపిదప మేలగు గాక, మృదుమదాంధులకు దానవులకు మాకు కరియరింగి విభ్రంశ చక్షువు వలయని చుట చేసి, గురువులలో ఆదిగురువ నీవు. నీవు బంధించిన నిగ్రహమో, లజ్జయో, వస్త్రియో, బాధయో తలంప, నిన్ను ఎదిరించి పోరాడి నెజ్జలురు ఆరులు ఆదియోగీంద్రులందడు నట్టిటెంకి, అందరే తొల్లి పక్కండ్రు హల్షమూర్తి, ఈశ మీ యెడ దుర్లభమేమి కలదు. తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని, గురువులు గాని, స్నేహితులు గాని ఎప్పుడైనా ఒక అపాయం చేసినట్టుగా కనిపించినా, దాని వెనుక ఏముంటుంది? మనం పిల్లలని ఎందుకు కొడతాం? వాడు బాగుపడాలి అని. బహుశా మేము సంపాదించుకున్నటువంటి రాజ్యం వలన మాకు ఒక మదం ఏర్పడింది, మా జాతికి. దానిని మేము సంహారం చేయటానికి నువ్వు ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి. మళ్ళీ ఎప్పుడో నాకు మంచి రోజులు నువ్వే ఇస్తావు, ఘటనా ఘటన సమర్ధుడివి నీవు అన్నాడు. అని ఇంకో మాటన్నాడు, శిరస్సు మీద పెట్టవయ్యా అంటూనే, నీకు తెలియదేమో వటువా! చెలియే మృత్యువు. మీకు తెలుసా? నాకో స్నేహితురాలు ఉంది, లేదా స్నేహితుడున్నాడు. దాని పేరు మృత్యువు. చుట్టమే యముడు, సంసేవార్ధులే కింకరుల్, శిలలంజేసెన బ్రహ్మతన్ను ధృడమే జీవంబు ఓ చల్లదే. ఏ రాతి శరీరాలు తీసుకొని వచ్చామా మేమిక్కడ? ఇవి పోయవే. వాడు బొమ్మలు-బొమ్మలు గీసాడు గానీ, ఎప్పుడూ మనం అనుకునే పంచదార చిలకలు చేసి పంపాడు మనల్ని. మనం కూడా అంతే, పంచదార చిలక తీసుకెళ్లి అలా నీళ్లలో పెట్టి తలవారి చూడండి, ఏ ఎక్కడ రూపం ఉండదు. రంగు మిగులుతుంది నీళ్లలో గలిసిపోతుంది. ఇది కూడా అంతే. ధనములు అస్థిరంబులు, తనువు అతి చంచలము, కార్యార్ధులు అన్యులు, గడచు కాలము ఆయువు సత్వరా. ఆయువు త్వరత్వరగా నడిపిస్తుంది. ఆ ఏ-ఏ వైపుకు నడవాలి అట్లా అదే నడిపిస్తుందయా. ఎవరో చెప్పినట్లుగా...ఐశ్వర్యము అతి శీఘ్రమని కాదే తమ తండ్రిన తకరించి మా తాత సాధు సమ్మతుండు ప్రహ్లాదుండు నీ పాదకమలంబు ని యతి జేచి మాకసలు ఇది కొత్తే కాదు ఎందుకంటే మా తాత పాదులైనటువంటి ప్రహ్లాదుడు మా ముత్తాత అయినటువంటి హిరణ్యకశిపుడి కొడుకు అన్ని సంపదలు ఉండి ఒక్కనాడు భోగం అనుభవించలే హరి పాదముల కంటే గొప్పదైన ఆస్తి లేదని నమ్మిన ప్రహ్లాదుడు నా తాత ఇవ్వాళ ఈ ఆస్తి ఉంటే ఎంత పోతే ఎంత అన్నాడు ఇవ్వాళ మనం అలా అనుకోగలుగుతున్నామా ఇంట్లో సగం విరిగిపోయిన చీపురు కట్ట పోతే పోకపోతే ఇంకా నాలుగు రోజులు గడిచేది అనుకుంటాం కదా పోవలసింది పోతున్నా మనకి యాకనే మన స్థితి అది ప్రవచన్ మోఢుడు సచ్చదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై అని పోతన తన ఆత్మానుభవ లోకానుభవాన్ని పోతనని కూడా ఆయన దగ్గర డబ్బు లేదని వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు శ్రీనాథుడి ఇంటికి వెళ్ళేవాళ్ళు వాడు ఆ రాజుల దగ్గర తెచ్చినవన్నీ వీళ్ళందరికీ distribute చేస్తుండేవాడు పల్లకిలో తిరిగేవాడు భోగి ఈన యోగి యోగి దగ్గర డబ్బు ఉండదు భోగి దగ్గర యోగం ఉండదు ఇది ప్రపంచం అంతే ఇది అంటే ఎద్దుంటే బుద్ధుండదు బుద్ధుంటే ఎద్దుండదని సామెత ఇక్కడ తెలంగాణాలో కాబట్టి ఎద్దు బుద్ధి ఒకచోట ఉంటే అబ్బో అది పరమాత్మే అది కష్టం కాబట్టి దేనికి అదే దాన్ని అలాగే ఎంజాయ్ చేయాలి ఈయన అప్పుడు ఈయనకు కోపం వచ్చి ఒక పద్యం రాశాడు ఎవడో వచ్చి ఉంటాడు ఆ టైం ఇంట్లో బియ్యం ఉండవు చుట్టాలు దొంగలు [నవ్వు] ఏం మనం ఆయన అన్నాడు మనం ఇంకోడి ఇంటికి వెళితే మనం చుట్టం కాదు కాబట్టి మనము దొంగలమే సుతులు ఋణస్థులు కాంతలు సంసార కారణంబులు ధనము రస్థిరములు తనువతి చంచలంబు కార్యార్ద్రన్యులు భద్రుడ తనికి మృతి లేని బ్రతుకుగలిగే వైరులై కానీ తొల్లి మావారు గాన అర్ధివై వచ్చి నీవు నన్ను అడుగటల్ల మా పుణ్య ఫలము కాదే ఏమయ్యా ఒక చిన్న విచారణ చేద్దాం అసలు నువ్వు నన్ను ఏం అడిగావు ఏం పుచ్చుకున్నావు నీది నువ్వే పుచ్చుకొని వెళ్తున్నావు నేను అసలు దానం ఏమిచ్చాను నీకు అసలు ఈ రాజ్యం అంతా ఎవరిది అమరులది ఇంద్రాదులది అది మేము యుద్ధం చేసి కొల్లగొట్టుకొని తీసుకొచ్చాం మా దగ్గర ఉన్నది దొంగ సుత్తు నీకొక దానం ఇచ్చేశా అది నువ్వు పట్టుకుపోతున్నావు కాబట్టి నాకు దానం వలన కలిగే ఏ లాభం నాకు అక్కర్లేదు అన్నాడు అంటే ఆ విచారణ కూడా చాలా గొప్పది ఎందుకంటే జేబులో అవతల వాడి జేబులో ఉన్న వంద రూపాయలు వాడివి అది మన జేబులోకి వచ్చింది అనుకోండి అది మనది వాడు నాది పొరపాటుని నాకు వచ్చింది ఇది నాదే అని అంటాం వీడు అట్లా అనటంలే నీది నువ్వే పుచ్చుకొని పోతున్నావ్ అన్నాడు ఆ దైత్యేంద్రుడు పీనవక్షు నవపద్మాక్షుం పిసంగాంబరాచ్ఛాదున్ నిర్మల సాధువాదు ఘనసంసారాది విచ్ఛేదు సంశ్రీదున్ భక్తిలతాతిరోహిత హరి శ్రీపాదు నిక్షేదు ప్రహ్లాదున్ బోధకలావినోదుగని యన్ హర్షంబుతో ముందటన్ ఎప్పుడైతే ప్రహ్లాదుణ్ణి బలి తలుచుకున్నాడో ప్రహ్లాదుడు వచ్చాడట ప్రహ్లాదుడు ఎందుకు వచ్చాడో తెలుసా బలిని చూట్టానికి కాదు మళ్లీ మరొక్కసారి విష్ణుమూర్తిని చూడొచ్చు కదా అని వచ్చాడట అది ఆయనకెప్పుడు విష్ణువుని రోజు మనలాగానే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మళ్లీ రేపు వస్తారో ఎవరారో అయ్యో రెండు రోజులు రాలేదు గనుక మూడు సార్లు కనపడితే ఆయన ఆయన account settle చేయాలని మనం కోరుకుంటాం అలాగే ప్రహ్లాదుడు వచ్చాడు అక్కడ నించొని ఒక్క మాట అన్నాడు ఎంత ఆనందించాడటంటే మళ్లీ నా మనమడి కారణంగా నీ దర్శనం అయింది అన్నాడు వీడు వీడు చేసిన ఈ దానవీరం వలన హరి నీ దర్శనం అయిందయ్యా అందుకని వచ్చానన్నాడు నారాయణ దేవునకు నమస్కరించి ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో తతమత్తద్విపయానయై కుచనిరుందోచ్ఛోళసంయానయై ధృతభస్పాంబునితా నయై కరయుగాధీనాలి కస్థానయై పతిభిక్షామ్ మమ దేహి పతిభిక్షామ్ మమ దేహి కోమలయతే పద్మాపతయంచు తత్పతి వి౦జావళి సేరవచ్చె త్రిజగద్రక్షాననున్ వామనున్ ఆమె వచ్చి ఆయనేమో దానమిచ్చాడు దానం పుచ్చుకున్న వాణి ఈమె ఏం అడుగుతున్నది అంటే నా పతి భిక్ష పెట్టమని అడుగుతున్నది అది మళ్లీ ఆయన నాకు నా దానం ఇచ్చేసేయ్ తలమీద పెట్టమన్నాడు కదా అంటే హరి తొక్కేస్తే పతి దూరం అవుతాడేమోనని నా పతిని నాకు ఇచ్చేసేయ్ ఆయన ఉంటే నాకన్నీ ఉన్నట్లేనంది ఇది భారతీయ సంస్కృతిలో ఒక పరమాద్భుతమైనటువంటి విచారధార విశ్వనాథవారు కూడా వెయ్యి పడగలు రాసినప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేజీల్లో ఆ నవల రాశాడు ఆయన ఆయన అంటాడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది పడగలు నశించని ఎన్నెన్ని దండయాత్రలు జరగని సంక్షోభాలు రాని విలువలు మారని సంస్కృతులు జారని దాంపత్య ధర్మం అనబడేటువంటి ఈ రెండు పడగలు ఈ భోగాలు ఈ భారతదేశం నుంచి వెళ్ళవు బయటికి చివర కాలం వరకు భార్య భర్తకి భర్త భార్యకి స్నేహితుడిగా ఒక మిత్రుడిగా ఒక మంత్రాంగిగా పరి-పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణ అర్థనారీశ్వర తత్వంలో ఉండేటువంటి వైవాహిక బంధమే సత్యము నిత్యము శాశ్వతమని చెప్పినట్లు ఆమె వచ్చి అడిగింది అడగ్గానే నీకున్ క్రీడార్థంబులగు లోకములన్ చూచి పలులు లోకులు కుమతున్లోకాధీశుల మందురు లోకములకు రాజవీవ లోకస్తుత్యా ఓ చిన్న రాజ్యం ఉన్నవాడ్ని రాజుని చక్రవర్తి అని విర్రవీగుతాడు సర్వలోకాలకి నీవు అధీశుడవైనటువంటి పరమాత్మ నీవు నిన్ను ఎరగటానికి నువ్వు అన్నింటికి నీవు రాజువయ్యా అని అంటూ కాదనడు పొమ్మనలేదు రాదనడు జగత్త్రైక రాజ్యమునిచ్చెన్నాదైత కటనేటికి శ్రీదైత చిత్తచోర శ్రితమందార ఇచ్చాడు కదా చిత్తాన్నే హరించేశావు సంపద ఎలాగో హరించావు ఇవాళ నా భర్త యొక్క చిత్తాన్ని కూడా హరించేశావు నా భర్తని పతిభక్ష ప్రసాదించమని అడిగితే హిరణ్యగర్భుడు ప్రహ్లాదుడు వింద్యావళి ఇద్దరూ ప్ర-ప్రహ్లాదుడు వింద్యావళి అంటే మానవరాలు ఇద్దరూ కలిసి శ్రీహరిని ప్రార్థిస్తుంటే హిరణ్యగర్భుడు ఏమన్నాడో వినండి అసలు ఎంత అందంగా అంటాడో చూడండి అంటే తన నిజతత్వాన్ని ప్రకటన ఈ జగత్తుకి చేయాలి ఏ అవతారంలో వచ్చినా సరే భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంచ తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చె దండయోగ్యుడు కాడు దానవరుడు కరుణింపార్హుండు కమల లోచన నీకు విడిపింపుమీతని వెరపుదీర్చి తోయపూరము సల్లి దూరాంకురముల చేరి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగ వచ్చి వేడవేడ ఎరిగి తన రాజ్యమిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనమ్ము ప్రహ్లాదుడన్నాడు ఎరిగి ఎరిగి నీకు దానమిచ్చాడే దృఢపాశం చేయకయా వీణ్ణి ఏదో వదిలిపెట్టమని అడిగితే భగవంతుడన్నాడు [పేజీ మార్చే శబ్దం] ఇది భాగవతం చదువుకోండి కష్టాలన్నీ పోతాయని ఎవడో చెప్తే మాత్రం నమ్మకండి భగవంతుడు ఆ మాట ఏం చెప్పల మీరు భాగవతం చదివేసేయండి కష్టాలన్నీ విడిపో ఐశ్వర్యాలంతా ఇల్లంతా స్వర్ణమణిమాణాలైపోతాయి అంటే మాత్రం అది మనం మభ్యపెట్టటం మోస చేయటం ఎందుకంటే పరమాత్ముని వాక్యం వేదవ్యాసుల వ్యాఖ్యానికి తెలుగు అనువాదం చేశాడు ఇది స్పురహోదనక పెట్టుకోగలిగినట్లయితే పరమాత్మ ఏం చేస్తాడో ఒక భక్తుడి పట్ల అని మనమంతా మనం నలభై యాభై ఏళ్ళ నుంచి బాబా గారి దగ్గరికి వెళ్ళాం కష్టాలు కష్టాలే ఆయన ఆయనే ఎందుకండీ అనుకుంటాం కదా నిజమే ఆయన ఆయనే మన-మనము మన కష్టం మనదే ఎవ్వని కరుణింప ఇచ్చుంచితిని వాని అఖిల విత్తంబు నేను అపహరింతు చూశారా నేను ఎవరిని కరుణించాలి అని ఇంతమందిలో అనుకుంటానో నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాడి దగ్గరున్న డబ్బంతా నేను లాగేస్తా వాడి దగ్గర డబ్బు లేకుండా చేసేస్తా ఏ భాగవతం తెలియవుడు అక్కడ ఉంటాడా? ఇదా ఫలశ్రుతి చివరికి కానీ భగవత్ తత్వాన్ని బోధిస్తున్నాడు ఎవ్వని కరుణింప ఇచ్చుంచితిని వాని అఖిల విత్తంబు నేను అపహరింతు సంసార గురు మదస్తబ్ధుడయ్యెవ్వడు తగడి లోకము నన్ను ధిక్కరించు అతడు ఎల్లకాలంబు అఖిల యేనుల యందు పుట్టుచుండు అసలు నేను ఉన్నాను అన్న భావన లేకుండా కేవలం సంసారము భార్య పిల్లలు ఆ ఆస్తులు దీనితోనే ముడిగిపోయినట్లయితే వీడు ఎన్ని ఏణులు పుట్టారో ఎన్ని జన్మలెత్తారో నేను చెప్పలేను జన్మ రాహిత్యం నేను ఇవ్వను ముందు డబ్బు తీసేసుకుంటాను వాణ్ని ఖాళీ చేస్తా రెండోది అట్లా ఉన్నట్లయితే జన్మలు మాత్రం నీ డబ్బంతా దానమంతా ఇచ్చేశాను నా దగ్గర నాకేం లేదు కదా అంటే నిన్ను కరుణించాలనుకున్నాను గనుక మూడు అడుగులతో ఈ లోకమంతా లాక్కున్నాను మళ్ళీ అలాగనుక ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే అనేక జన్మలు నువ్వు ఎత్తాల్సి ఉంటుంది అని చెప్తూ దుర్గతి పొందు విధప విత్తవయోరూప విద్యాబల ఐశ్వర్య కర్మ జన్మంబున గర్వమడిగి అది గర్వం ఎలా వస్తుందట మనిషికి గర్వం అంటే విత్త కావలసిన దానికంటే బాగా ఎక్కువ డబ్బు ఉందనుకోండి గర్వం వస్తుంది బోయ్ మాంచి ఎడాలసెంట్ ఆరోగన్స్ అని చెబుతుంటాం కదా ఎడాలసెంట్ గా ఉన్నటువంటి వయసులో వాళ్లకు ఆరోగన్స్ ఉంటుంది ఆ ఆరోగన్స్ ఏంటంటే పెద్దవాళ్లంతా పనికిరాని వాళ్ళు సమవయస్కులంతా దీటు అయినవారు కాదు ఐ యామ్ ఎవ్రీథింగ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అది ఆ ఆరోగన్స్ ఆ సహజం అది రెండోది రూప రూపం రూపానికి నిర్వచనం లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ మనం అనుకుంటాం మన అందం మనకు ముద్దు లోకానికి ముద్దు అంతే కదా మనకు మనమంటే చాలా ఇష్టం అందులో సందేహం లేదు కాబట్టి దీనికి కావలసిన అలంకారమంతా ఒక గంటా గంటన్నర అద్దం దగ్గర కూర్చొని ఆయుష్యంతా అద్దం ముందు పారబోసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటాం విద్యా అనేక శాస్త్రాలు తెలిసినయి అహంకారం వస్తుంది సాత్వికాహంకారం ఉంటుంది ఐశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధమున విమలుడయ్యవ్వండు వాడు నాకూర్చి రక్షింపవలయు వాడు స్తంభలోభాభిమాన సంసార విభవ మత్తుడై చడనువల్లడు మత్తరుండు స్వామి ఈ పద్యాన్ని చాలా అందంగా రెండు లైన్లలో చెప్పారు స్వామివి వాంగ్మయం బాగా చదవాలి చదివితే ఆయన ఏం చెప్పారో తెలుస్తుంది మనకెంత సేపు ఆయన ఉంగరం ఇచ్చారా బొంగరం ఇచ్చారా గొలుసు ఇచ్చారా గొలుసు ఇవ్వలేదా ఇదే యాతన ఇచ్చారు పుచ్చుకున్నాం అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి ఆయనేదో ఉంగరం ఇచ్చారు కదా అని ఎక్కడైనా నాలుగు రోజులు కూర్చున్నామా ఇచ్చిన మరుక్షణం హైదరాబాద్ రావాలి అందరికీ చూపించాలిగా అదికాబట్టి పుచ్చుకున్న దాని వలన ఆనందం ఏంటంటే అహంకారం పెరుగుతున్నది గనుక ఈయన ఒక్కటే మాట చెప్పాడు. ఏమనంటే విమలుడై ఏకాత్మ భావంతో ఎవడు ఉంటాడో వాణ్ణి నేను కాచుకుంటాను. అందుకే స్వామి అన్న మాట ఏంటంటే సాయుని అందరూ చెడి నమ్మిన వారే కానీ నమ్మి చెడినవాడు ఒక్కడు కంటికి కానరాడే అన్నాడు. చెడి అక్కడికి వెళ్తాం. చెడిన పదార్థం అన్నారు నమచార్యుల వారు. చెడితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. ఎందుకు? బాగుపడటానికి వెళ్తాం. చెడితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? బాగుపడటానికి వెళ్తాం. గురువు దగ్గరికి చెడితే వెళ్తాం. బాగుపడాలి అని వెళ్తాం. కాబట్టి నమ్మి చెడిన వాడు అంటూ ఉండడు చెడి నమ్మిన వాళ్ళు మాత్రం అందరూ ఉంటారు. అదే భాగవతంలో కూడా ఆయన అన్నాడు. బద్ధుండై గురు శాపగ్రస్తుడై తా బంధు వ్రజచ్ఛిత్తుడై సిద్ధైశ్వర్యము కోల్పోయి విభవక్షీణుండునై పేదై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సుహృద్వేమియున్ తప్పడు ఉద్భుందుండై యదయాఖ్యనాయ గలిచెన్ పుణ్యం బితండు అల్పుడే. అందరినీ పోగొట్టుకున్న ఈ బలి మామూలు వాడా ప్రహ్లాదా? ఎటువంటి వాడయ్యా? మామూలు వాడని నువ్వెలా అనుకుంటున్నావ్? అసలు వాడిని రక్షించడమేమిటి? నేను వీణ్ణి రక్షించాలి అన్న నాడే వీడి ఐశ్వర్యం హరించేశా. ఇవన్నీ గుర్తు అన్నాడాయన. దానవ దైత్యుల సంగతి పూనిన ఈ అసుర భావమును తోతో మధ్యాహ్నమున తలగి పోవును మానుగ సుతలమున ఉండు మా మా ఆజ్ఞన్ అని. ఎప్పుడైతే భార్య వచ్చి పతిభిక్షని అర్థించిందో తత్వం చెప్పాడు. నవనీతం చేతిలో పెట్టాడాయన. ఆ నవనీతం ఏమిటంటే మళ్ళీ స్వామి చెప్పిన ఈ వేళ స్వామి ఎందుకు మనకి reference అంటే ఆయన సకలోపనిషన్ మూర్తి. దాన్లో ఉన్నవన్నీ మామూలు మాటల్లో చెప్పారు. చేయగలిగిందే చెప్పప్ప చెప్పినది చెయ్యప్ప అది అంతే. ఈ language ధర్మవరం వాళ్ళకి బాగా ఆనందం కలిగిస్తుంది. అది. చేయగలిగిందే చెప్పాలి చెప్పగలిగిందే చేయాలి. అన్నాము అంటే చేయాలి ప్రాణం పోయినా సరే. ఎక్కడికి పోతుంది ప్రాణం? అన్నది చేశాము అంటే ప్రాణం పెరుగుతుంది ఆయుష్షు పెరుగుతుంది. ఎందుకని? ఈ పుణ్యానుభవాన్ని ఇక్కడ పొందాలి జీవుడు. కర్మానుభవాన్ని ఆనందించాలి ఇక్కడ. ఆ పొందటం కోసం పరమాత్మ ఆయుష్షునిస్తాడు ఆనందాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా మన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఖర్చైపోయింది లేదు అనుకుంటే లేదు అనుకోవద్దు. లేదు కాదు అది ఉన్నది కాదు. ఉన్నది వాడలేదు. ఏం చేయాలి దాన్ని? ఏం చేస్తున్నాను దాన్ని? ఉంది. ఉందా అంటే ఉంది. ఉన్నదేమో మనిషికి పుష్టి తిన్నదేమో పశువుకు పుష్టి. పశువుకి గడ్డి మామిడికి ఒక-పది అడుగుల దూరంలో కట్టేసి ఈ గడ్డి అంతా నీదే అంటే దానికి ఏమానందం? కదా. ఆరుగురు పలకలు వేస్తే పాపం మనం వేసినదే తిని నెమరు వేస్తూ మళ్ళీ ఎవరో కొత్త గడ్డి వేసినట్టుగా ఆ మాయలో పడి ఆనందిస్తూ ఉంటుంది. కాబట్టి దానికంత తిన్నది పుష్టి. మనిషికి ఏమిటి అంటే హాయిగా ఎప్పుడు నిద్ర పడుతుందంటే మన బ్యాంకులో FD లన్నీ అలా క్షుణ్ణంగా చక్కగా సద్ధంగా ఉండి అవన్నీ రోజుకి మళ్ళీ ఏడాదికి పిల్లలు పుడుతూ ఉంటే మనకదొక ఆనందం. కాబట్టి ఉన్నది పుష్టి. వీటన్నింటికంటే పరమాత్మ యందు మన మనస్సు లగ్నం చేసుకొని ఉన్నట్లయితే ఇది మన ప్రమేయంతో రాలే. మన ప్రమేయంతో పోబోవటంలే. ప్రమేయుడైనటువంటి ఒక అప్రమేయుడు ఉన్నాడు. నాకేం సంబంధం లేదంటాడు గాని అన్నీ నడిపిస్తుంటాడాయన. ఆయన పేరు కర్త అన్నారు రమణ మహర్షి. ఆ కర్త ఆజ్ఞ ప్రకారమే అన్నీ జరుగుతాయి కాబట్టి కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్మ కిం పరం కర్మ తజ్జడం అన్నారు. నువ్వెన్ని కర్మలు చేసినా ఒట్టి జడాలవి. వాటికేమన్నా రూపం ఉందా? ఆయుష్షు ఉందా? ఏమన్నా జవజీవాలున్నాయా? నువ్వు చేస్తున్నావు గనుక కర్మలున్నాయి. నువ్వు చైతన్యం ఆనే కర్మలే లేవక్కడ. ఆ లేని కర్మ ఏదో ఉన్నదని అదేదో పుణ్యకర్మని ఇలా చేస్తే అలా అవుతుందని అంతా నీ ఊహ తప్ప. కర్మ సాక్షి అయినటువంటి పరమాత్మ నీ కర్మలను చూస్తూ దానికి తగిన ఫలితాన్ని తగిన సమయాల్లో ఇస్తాడు. మనం చేసిన మరుక్షణమే ఇవ్వడు. మనమెలా చేస్తామంటే సత్యనారాయణ వ్రతమై ఐదో కథ అయిపోగానే పోస్ట్ నాన్ వైపు చూస్తుంటాం. ఇయర్ ఇయర్స్ ఇంటికొచ్చాయా లేదా? వస్తాయి నెమ్మదిగా వస్తాయి. [నవ్వు] మనవన్నీ ప్రాపంచికమే అన్నీ ప్రవృత్తి కర్మలే కాస్త దాటాలి. ఎందుకంటే మనము మానవ జన్మ మామూలు జన్మ ఏమి ఎత్తి రాలే. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి ఒక అవతారమూర్తియై వచ్చినటువంటి వేళ ఆయన నడిచినటువంటి ఒక నేలమీద మనం నడుస్తూ ఆయన బోధనలన్నీ మనం స్వయంగా వింటూ ఆయనను చూచి ఆయనను తాకి ఆయనతో మాట్లాడి జన్మని ఒక తేజోమయం చేసుకున్న వాళ్ళం. కాబట్టి ఇందులో ఇవాళ మనకు కావలసినవంటూ ఏం లేవు. ఆయన ఏమిస్తే అది మనది. ఆయన ఏమీ మనకివ్వకపోయినా అది మనది. మనకేం కావాలో అది ఆయనే ఇస్తాడు. అందుకే మురుగనార్ అనేటువంటి ఒక తమిళ మహాకవి తిరువణ్ణామలైలో భగవాన్ గురించి చాలా గొప్ప గొప్ప poetry రాసేవాడు. తమిళ వాంగ్మయం మీదొక గొప్ప అధికారి ఆయన. ఆయన్ని అడిగారు, "రోజూ నువ్వు భగవాన్ తో గంటసేపు కూర్చొని ఏదోటి మాట్లాడుతుంటావ్. ఏదో పుస్తకాన్ని తీసుకెళ్తావ్ ఇది తిద్దామంటావ్ proof reading అంటావ్ ఇది కుట్టివ్వమంటావ్. ఇంత చనువుంది కదా ఏదైనా నీకు కావాల్సింది అడగకూడదా? అదే మేమందరం అడిగే ముక్తి లాంటిదేదో అడగకూడదా?" అంటే ఆయనన్నాడు, "నాకేది మంచిదో నాకేది చెడుపో నాకంటే బాగుగా నా స్వామికి ఎరుక. అతని చేరిన వారికి అతడాయే తల్లిదండ్రి. అతని బిడ్డను నేను ఇతరము నాకేలా?" అన్నాడు. వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చి బిడ్డలైనారు అసలు ఆయన బిడ్డను నేను నాకేం కావాలో ఏంటి తెలియదా అన్నాడు. మనం కూడా ఆ సంపూర్ణ శరణాగతితో వినయంతో సమర్పణ భావంతో ఉండగలిగితే బలి దానవీరం పరమేశ్వరుడి దయావీరం ఆ రెండూ కలబోసుకోవాలి. ఇవాళ చూడండి ప్రహ్లాదుడికి హంసానంది కలిగింది. దానం తీసుకున్న త్రివిక్రముడికి హంసానంది కలిగింది. దానం ఇచ్చినటువంటి బలి చక్రవర్తికి కలిగింది. [కాష్] బలి చక్రవర్తి సహధర్మచారిణికి జరిగింది. నిఖిల దేవతలకు జరిగింది గాంధర్వులకు జరిగింది. అసలు జరిగినదంతా హంసానంది గనుక ఈ శ్రవణ ప్రియమైనటువంటి భాగవత రసవద్ఘట్టంలో ఇవాళ మన హృదయాలు కూడా హృదయంలో ఆ హంసానందికి లోనైంది గనుక హంసానందితో స్వామికి కైంకర్యం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 44
Bhagawata Navaneetham - 44
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 25:08
More in this series