No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం సురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబెన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ, అలాగే రెండవది తృణావర్తుడు. ఆవర్తం అంటే సుడి, సుడిగాలి. తృణము అంటే గడ్డిపరక. గడ్డిపరక చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భూమిని విడిచి గనక ఉన్నట్లయితే సుడిగాలి దాన్ని చుట్టుముట్టినట్లయితే సుడిగాలి ఎంత ఎత్తుకు వెళుతుందో అంతవరకు అది కూడా ఎగురుతుంది. ఎందుకని మూలాన్ని వదిలిపెట్టింది గనక. అదే గడ్డిపరక భూమికి దన్నుగా లోపలికి రాగనక ఉన్నట్లయితే మర్రిచెట్టు కింద పడిపోవచ్చునేమో గానీ మళ్ళీ వాన వెలిసిన తర్వాత ఆ గడ్డిపరక అలా నిలబడి ఉంటుంది. ఎందుకని అంటే దేనిని ఆశ్రయించి ఉండాలో దాన్ని అది ఆశ్రయించి ఉన్నది. బయట నుంచి ఏర్పడినటువంటి జంఝామారుతాలు గాని ప్రభంజనాలు గాని ఇవేవీ కూడా దానిని తాకవు. అలాగే మనం కూడా deep rooted గా విచారణ చేయాలి. పై పైన peripheral గా ఏదో శ్లోకం, ఓ పద్యం, దాని అర్థం కృష్ణుడు ఇలా అలా కాసేపు మాట్లాడుకునేట్లయితే ప్రయోజనం లేదు. నిజానికి it is the loss of time, it is the waste of time. ఆ రెండు చేయకూడదు మనం. ఏం చేయాలంటే ఇందాక అన్నట్లు ప్రతి క్షణాన్ని జీవించాలి మనం. ఎలా? ఎరుకతో, స్పృహతో, నేను దేహము మాత్రమే కాదన్న భావనతో అక్కడి నుంచి ప్రారంభించినట్లయితే ఈ తృణావర్తుడి కథ కూడా నిజానికి అంతే. ఈ నాలుగు అయిన తర్వాత ఇవన్నీ ఈయన పుడుతూ పుడుతూనే రాక్షస సంహార కాండకి శ్రీకారం చుట్టాడు ఈయన. సుడిగాలిలోకి వెళ్లిపోతే యశోదకి వ్రేపల్లె ఏమైపోయిందో తను ఎక్కడున్నాడో-- ఉన్నదో కనపడలేదట. ఆమె అంత ఆత్రుత లోనూ తన ఇల్లు, తన పాలు, పెరుగు ఆ కుండలు ఏవీ కనపడలేదట. మా కిష్టప్ప ఎక్కడున్నాడు అనుకుందట. అది స్వామి భాష అది. మా కిష్టప్ప ఎక్కడ అంటే స్వామి అంటారు, మీరందరూ కన్నయ్య, కృష్ణయ్య అనని మేము కిష్టప్ప అంటాము అంటారు స్వామి. ఆ అప్ప, అప్ప అంటే తండ్రి అని అర్థం. ఆ కృష్ణుడు ఎక్కడున్నాడు అని చూస్తే కృష్ణుణ్ణి కూడా వాడు ఎగరవేసుకొని ఆకాశంలోకి వెళ్ళాడు. కానీ ఎలా దిగి వచ్చాడంటే భూమ్మీదికి పరమేశ్వరుడు స్వయంగా మళ్ళీ మరొక్కసారి అవతరించినట్టుగా దిగి ఏ రకమైనటువంటి గాయాలు లేకుండా వినిర్మలమైన, విశుద్ధమైనటువంటి కాయంతో ఆయన దిగివచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసింది యశోద. యశోదతో పాటు రుక్మిణి కూడా-- మన రోహిణి కూడా. అయితే వీళ్లిద్దరూ ఎందుకని ఆ కృష్ణుణ్ణి అక్కడ వదిలిపెట్టారంటే ఆ రోజున కృష్ణుడు మామూలు సహజ స్థితి కంటే బరువు ఎక్కుతున్నాడట. ఉళ్ళో పడుకోబెట్టుకొని జో కొడుతుంది ఆవిడ పని ఆవిడ చేస్తున్నది. నెమ్మదిగా ఉళ్ళో ఉన్నవాడు బరువు పెరుగుతున్నాడు. బరువు ఎప్పుడైతే మోయలేని స్థాయికి వచ్చిందో, వీనిది మోయగలిగింది భూదేవి అని పక్కన పెట్టింది గాలి ఎత్తుకుపోయింది. అది. అందుకని తల్లి తల్లు-తల్లులు ముఖ్యంగా రామాయణ కల్పవృక్షంలో కూడా బాలకాండలో ఒక విషయం విశ్వనాథవారు అందంగా రాశారు. పక్షులు పారాడే వేళ బిడ్డను బయటకు తేవద్దు. ఎందుకంటే ఆ పక్షుల నీడ గాని మీ-- ఆ పిల్లవాడి మీదో, ఆ బిడ్డ మీద పడినట్లయితే అనేకమైనటువంటి దోషాలు ఏర్పడతాయి గనుక. ఆ పరమాత్మకి మనకి మధ్య ఏ రకమైనటువంటి పరదా ఉండకూడదు, తెర ఉండకూడదు అని. నీడ పడకూడదు అని. మన నీడ మన నుంచే దూరంగా ఉంటుంది. మన నీడ మన మీద పడదు. మన నీడ వెళ్ళి ఇంకోడి మీద పడుతుంది. ఇంకోడి నీడ వచ్చి మన మీద పడుతుంది. ఇట్లా పరస్పరం వెలిగించుకుంటూ ఉన్నది. ఇటువంటి ఈ తత్వజ్ఞానాన్ని, ఈ నిధిని మనం అందుకోవాలి. అలాగే వెన్నకి రెండు లక్షణాలున్నాయి. మనం నవనీతం అన్నామంటే కారణం ఏమిటంటే నీటి మీద తేలేది ఒకటి బరువే. నీటి కంటే బరువు అంటే నిదానికి తూకం వేస్తే బరువే. కానీ నీటిలో మాత్రం మునగనిది మంచి వెన్న. రెండవది భగవంతునితో వియోగం అనేటువంటి చిన్న వేడి గనక తగిలినట్లయితే అది కరిగిపోతుంది. అతి సహజంగా అంత తేలికగా కరిగిపోయేది వెన్న తప్ప మరొకటి లేదు. మనం అంటాం పిల్లవాడి చేతికి నిన్న కేక్ కట్ చేశారు చూడండి. ఆ చిన్నపిల్లలు చేయవలసిన పని అది. ఆ కేక్ కటింగ్. వాళ్ళకి అది ఆనందం కలిగిస్తుంది. ఏం-- ఎందుకనంటే నేను కూడా కొయ్యగలిగాను కదా అని. సరే కేకే వాళ్ళకి ఆనందం కలిగిస్తే వెన్న ముద్ద పెడదాం ఏమవుతుందో. వీళ్ళు కోసే ప్రయత్నమేం లేదు. అలా ఆ చాకు పెట్టగానే అది కిందకి దిగి వస్తుంది. అది. ఆ లోతులకు వెళ్ళటం కోసమే స్వామి దాన్ని ఏమన్నారంటే కేక్ కటింగ్ కాదు బంగ-బంగారు అది ఏక్ కటింగ్ అన్నారు. ఏక్ అంటే బాధ. A C H E, ache. హెడేక్ అంటాం కదా అది. అట్లా ఆ హెడేకు ఇవన్నీ ఉన్నాయి మనకి. అనేక aches ఉన్నాయి. ఆ కేక్ కటింగ్ అంతా ache కటింగ్ ఏ అని దాన్ని close చేశారు. మనం కూడా దాన్ని అలాగే తీసుకోవాలి. అవన్నీ చిన్నపిల్లల చేత చక్కగా చేయించాలి. మనందరికీ స్వామి మరి సోమభర్తుడి అయిన బాలకృష్ణుడు గనుక ఆ పేరు మీదే చేస్తాం. తప్పు. మానేయమని కాదు. కదా. నెమ్మదిగా చేయమని. కంగారు పడకుండా చేయమని. మరి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమాడుకుంటారు? అది పల్లెటూరు. మట్టి ఉంటుంది. ఉన్నవన్నీ ఆవులు, గోసంపద. కాబట్టి అంతా గోమయంగా ఉంటుంది. గోమయం అనంగానే అక్కడంతా గోమూత్రం, ఆవుపేడ ఇవుంటాయని. గోమయం అంటే గో అంటే జ్ఞానం. గోమయం అంటే జ్ఞానమయం అని అర్థం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మని వ్రజభూమి, ముముక్షు ప్రదేశం దాటి వచ్చేదాకా ఆయనని గోవిందుడు అన్నారు.జ్ఞానము చేత విందు కలిగించేవాడు. అలాగే గోపాలుడు అన్నాడు జ్ఞానము చేత పాలించేవాడు అని. గోపికలు ఆయన చుట్టూ ఉన్నాయి పికము అంటే పక్షి. ఆ పికలన్నీ కూడా పికాలన్నీ కూడా జ్ఞానం కోసం ఎదురు చూసినయి. వేణు గానాన్ని అదేదో ఉన్నత స్థాయిని అందుకోవటానికి కాదు పరమాత్మ యొక్క దివ్య నాదంతో తమ నాదాన్ని అనుసంధానం చేసినయి. అందుకనే యోగ తారావళి లో శంకర భగవత్పాదులు పరమాద్భుతంగా ఓ మాట చెప్తారు. సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధినేకం అన్యామహే మాన్యతనం లయానాం. లక్షా ఇరవై వేల యోగాలు ఉంటే లయ యోగాలు ఉంటే అందులో నాదానుసంధాన యోగమే అత్యుత్తమమైనది అంటారాయన. ఇది పునః పునః అనుకోవలసిన మాట. ఏ నాదము అని మన లోపల జీవుడి లోపల ఏర్పడేటువంటి నాదము పరమాత్మ యొక్క విశ్వ జ్ఞానంతో అనుసంధానం కావాలి. అది ఆ ఆ నాదమయం ఆ పూర్ణత్వం. అయితే ఇవాళ జీవుడికి నాదం ఎప్పుడో మర్చిపోయినాడు జీవితమంతా నినాదమే. అంతా అరుపులు, కేకలు, భీభత్సం కదా! ఏం చెప్పాలన్నా పెద్దగా అరుస్తూ అలా చే-- నాదం ఆ నాదం నిస్తంద్ర మంద్రంగా వినపడి వినపడనట్లు గా అని అననట్లు గా అసలు హృదయాన్ని తాకి తాకనట్లుగా ఉండే దాని పేరు నాదం. ఆ నాదం ప్రస్తారం అవుతున్నప్పుడు మహా గాయకుడి యొక్క గానం కూడా శృతి మధ్యమంలో చాలా పక్వానికి చేరి ఒక పరమానంద స్థితిని ఇస్తుంది గనుక చూడండి ఎంత మహా గాయకుడు పాడినా వెనకాల ఓ తంబూరా పట్టుకొని ఒక ఆమె ఏమీ నిరామయంగా కూర్చుంటుంది. ఏమిటి ఆమె చేసే పని అంటే నాదానుసంధానం చేస్తుంది. ఆ నాదానుసంధానాన్ని ఆధారం చేసుకొని మహా గాయకుడు తన లోపలికి తాను ప్రయాణం చేస్తాడు. శ్రీ కృష్ణ పరమాత్మ ఈ నాదానుసంధాన ప్రక్రియలోకి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. తీసుకు వెళుతూ ఆ ఆడుకునేటటువంటి వేళ వీళ్లిద్దరూ ఈ తల్లులిద్దరూ బలరామకృష్ణుల్ని ఇద్దర్నీ చూస్తూ ఉన్నారట. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన వెనిబూతి పూతగాగ. పోతనామాత్యుడు శైవుడు కదా! అసలు కేశవుడి వర్ణన చేసినా గాని ఆయనకి శివుడే కనిపిస్తాడు. అది ఆయన అదృష్టం. ఎందుకంటే అందరూ పొందవలసినటువంటి సౌభాగ్యం కూడా అదే. శివుడు వేరు విష్ణువు వేరు అనుకోకూడదు. శ్రీ కృష్ణ పరమాత్మ ఆడుకుంటూ ఆ మట్టిలో దొర్లి ఆ బాలకృష్ణుడు వస్తుంటే మైబూడి పూసుకున్నటువంటి శివుడే బాల శివుడుగా వస్తున్నట్టుగా ఉన్నాడట. అది అందమైన ఊహ అందమైన భావన. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సెంగడిగా నితునుకగాగ. కౌస్తుభమణి లాంటిదేదో హారం వాళ్ళ అమ్మ వేసింది. వాడి బర్త్డే నాడు కృష్ణుడికి. దాంతో మెరుస్తూ వస్తుంటే ఆ చంద్రుడి ముక్క మెళ్ళో వేసుకొని వస్తున్నాడా? అన్నట్లు ఉందట. ఆ చంద్రుడి ముక్క శివుడి యొక్క వక్ష స్థలం మీద ఉన్నదే. తర్వాత జటాజూటంలోకి తీసుకెళ్లి ఆయన బిగించేశాడు. సిగపువ్వుగా వాడుకున్నాడు. అందుకని అలా హలభావంబుపై పరగు కావిరి బొట్టు కానుమి గెల్చిన కన్నుగాగ. ఇక్కడ ఒక నల్ల చాదు పెట్టారు. మర్చిపోయింది జాతి ఎక్కడికి పోయిందో కదా! నల్ల చాదు అనేది ఈ తెలుగు ఆంధ్రా అనకూడదు ఇప్పుడు తెలుగుదేశంలో అంటే మనందరికీ ప్రాణాలు సుఖం. కాబట్టి ఈ తెలుగుదేశంలో ఈ సంస్కారంలో ఆ చాదు బొట్టు పిల్లలకి నుదుట బుగ్గన పెట్టేవాడు. ఇది ఆ-ఆజ్ఞాచక్రానికి సంకేతంగా బుగ్గన ఉన్నటువంటిది దిష్టి చుక్కగా. ఆ రెండు పిల్లవాడి గమనంలో వాడికి ఒక ఆశీర్వచకగా ఉండేవి. అలా పెట్టుకొని ఉన్నాడట. ఉంటే అది ఎట్లా ఉన్నదంటే, కానుమి గెల్చిన కన్నుగాగ. మన్మథుడిని సంహారం చేశాడుగా శివుడు కాబట్టి దాని గుర్తుగా ఇక్కడ పెట్టుకున్నట్టుగా ఉన్నాడట. గంధమాకంట మాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగ హారవల్లులు ఉరగ హారవల్లులు గాగ. ఆయన మెళ్ళో ముత్యాల సరాలు వేలాడుతూ ఉన్నాయి. ఎందుకని? నవమౌక్తికంతో చేసి కొత్త ముత్యాల దండ వేసేదట వాళ్ళ అమ్మ. తర్వాత అది ఆ నాసాగ్రే నవమౌక్తికం అయింది అది వేరే సంగతి. బాలకృష్ణుడికి ముత్యాల మాల వేస్తే అదంతా ఆయనకి లేలిహారం అంటే పాము. పామును మెళ్ళో వేసుకున్నటువంటి నాగాభరణుడు అయినటువంటి శివుడిలా కనిపించాడట. ఆ కృష్ణుడు బాలకృష్ణుడు. హారవల్లులు ఉరగ హారవల్లులు గాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునికి తనకును వేరు లేమి తల్ప వెలసినట్లు. శివకేశవులకు అభేదం చెప్పటానికే నేను ఈ రూపంలో వచ్చాను. అందుకని ఈ చాదు పెట్టుకున్నాను ఈ హారం వేసుకున్నాను. ఇవే ఈ చందమామని మ-మెళ్ళో వేసుకుని తిరుగుతున్నాను అన్నట్టుగా చెప్తున్నాడట. చెప్తుంటే, ఆ పాపల విహరణమును తీపులు పుట్టింప. ఆ పిల్లలు తిరిగే విధానమే తీపులు పుట్టించునట. దానిని మించినటువంటి వెన్న లేదు దానిని మించిన స్వీటు లేదు. ఆ పిల్లవాడు తిరగటమే ఒక మాధుర్యం. ఆ మాధురి ఆ దీప్తిని వాళ్ళు అనుభవిస్తున్నారు. అలిగి, టేకు వలేక గోపాల శతులు మక్కువ ఏ పనులను మరచి ఉండిరి. ఈ క్షణ పరలై. ఈ క్షణ పరులు కాదు ఈ క్షణ పరలై. పరలు అంటేస్త్రీమూర్తులంతా కూడా తమ తమ చేయవలసిన పనులు మానేసి అలా చూస్తూ ఉండటం. ఒకసారి ఇలా జరిగింది పుట్టపర్తిలో. స్వామి nineteen eighty three January fifth ఒక interview కి పిలిచిన తర్వాత కొండమరాజు auditorium లో పెళ్లి అవుతుంది మీరు కూడా రండి అన్నారు స్వామి. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా వెనకే స్వామి ఒక రెండు నిమిషాల్లో వచ్చారు. స్వామి వచ్చేదాకా పురోహితుడు బ్రహ్మాండంగా ప్రపంచానికి వినపడేటట్టుగా మంత్రం చదువుతున్నాడు. ఆ స్వామి ఇలా అడుగు పెట్టారో లేదో ఎవరో మంత్రం వేసినట్టు మౌనం వహించేశాడంతే. స్వామి ఏమో అక్కడెక్కడో దూరంగా ఉన్నారు, ఈయనేమో వేదిక మీద కూర్చున్నాడు. స్వామి వస్తూ వస్తూనే ఆయన ఏం-ఏం చెప్పారంటే చూడండి instruction, "నీ పని నువ్వు చేయాలప్పా, నా పని నేను చేయాలి" అన్నారు. అది. అని ఉ... అన్నారు. అనగానే మంత్రం మొదలైంది. అలా పరవశుడైపోయి చూస్తూ ఉన్నారు. వాడు పరవశమై ఉన్నటువంటి వేళ స్వామి విభూతిని, అక్షతలని, కుంకుమని, పసుపుని అరచేతి నుంచి సృష్టించారు. ఇప్పటికే కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఏం లేదు ఆ చేతిలో ఒట్టి అరచేతి. ఇట్లా ఇట్లా అంటుంటే జల్లులు జల్లులుగా అక్షతలన్నీ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ మీద కూడా పడ్డాయి. వాళ్ళ జేబుల్లో పడ్డాయి. అందరినీ తవితీరా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్నిచ్చి అందరూ చూస్తుండగా ఇట్లా ఒక వేలు ఇట్టా దిప్పారి ఇట్లా తీస్తే అది మంగళసూత్రం. ఆ మంగళసూత్రం ఆ పురోహితుడికి ఇచ్చి అందరికీ చూపించి అప్పుడు ఆ వరుడికి ఇవ్వమని స్వామి చెప్పారు. అంటే పరమేశ్వరుడి యొక్క దివ్య లీలావిభూతి ఏమిటంటే అది ప్రదర్శన కాదు, నిదర్శన కావాలి మనకు. ఈయనకి ఇన్ని శక్తులున్నాయని మనకెలా తెలుసు? ఊహిస్తే ఎట్లా? ఈయన దేవుడే అంటే statement. అది ఎవడైనా ఇవ్వొచ్చు, నే కూడా అంటా. కానీ ఎట్లా దేవుడు? ఎందుకు దేవుడు? ఎప్పుడు దేవుడు అని. ఎందుకు దేవుడు అంటే మామూలు కాస్త నమ్మకం అటూ ఇటూ ఉన్నవాడంటాడు, "ఆయన మహిమలు చేసి, చేసి దేవుడైపోయాడండి" అంటారు. మనమేమనాలంటే దేవుడు కాబట్టి ఆయన మహిమలు చేస్తూనే ఉన్నారు అనాలి. అది. మహిమ చేస్తే దేవుడవుతాడా? దేవుడు కాబట్టి మహిమ చేస్తాడు. ఆ మహిమ ఎవరికోసం అంటే మనకొక నిశ్చితమైనటువంటి ఒక బలమైనటువంటి ఆ నమ్మకం కలగటం కోసం. అది చాలా అవసరం. అందుకనే ఆ లీలాకాండ సాగిస్తున్నాడు కృష్ణుడు కూడా మన స్వామివలె. నెమ్మది నెమ్మదిగా మాటలు వస్తున్నాయట బాలకృష్ణుడికి. మాటలు రావాలిగా, తర్వాత చెప్పాలంటే మాటలు రావాలిగా. కాబట్టి ఆయనకు కూడా ఈ విశ్వనాథవారు ఇరవై నాలుగు వేల మూడు వందల పద్యాలను రాసేసి నారామాడులో ఓ మాట చివరికి అన్నాడు. "యదన్నంతద్భాషా" అని చెప్తూ "ఇన్ని ఇంత చెప్పుకున్నాం గానీ రాముడికి తెలువొచ్చా?" అన్నాడు. అది, అది చమత్కారం. రాముడికి తెలుగు రావటం కాదు, దేవుడికి అన్ని భాషలు వస్తాయి. ఏం మన స్వామి French వాడితో, ఇంకోడితో, ఇంకోడితో ఏం మాట్లాడుతున్నారు? వాడు ఆనందంగా వస్తున్నాడు. వాడు జర్మనీలో మాట్లాడుతున్నారు, స్వామి సమాధానం ఇస్తున్నారు. కాబట్టి పరమాత్మకి భాష barrier కాదు. ఇది నిరూపణ చేసుకోవాలి. లేకపోయినట్లయితే స్వామి కేవలం ఆంధ్రదేశం వరకే పరిమితమైపోయి ఉండేవారు. అనేక దేశాలు, పోనీ English అంటే ఏదో నేర్చుకున్నారేమో. మనందరికీ దర్శనం ఇచ్చాక ఏ-ఏ for apple ఆయన కూడా అనుకోవచ్చు. కానీ French, Germany, Italian ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సర్వ విదేశీ భాషల్లో స్వామి ఎలా మాట్లా- interact అవుతున్నారు? పోనీ వాళ్ళెవరన్నా చిన్నవాళ్ళా? ఎన్నడూ చాలా తక్కువ వాళ్ళా? ఏం చదువులేని వాళ్ళా అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు number one అనిపించుకున్నవారు ఆయన దగ్గరికి వచ్చి పరమానందంగా ఎలా రాగలిగారు అంటే అలాగే. దాని కారణంగా ఈయన కూడా పిల్లలందరినీ కూర్చోబెట్టాడట. ఎవరు? కృష్ణుడు. leader కదు మరి. ఆ leadership తీసుకుంటాడు భగవంతుడు. తీసుకొని చెట్ల కింద కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టి, "గోవల్లభుడ నేను, గోవులు మీరు" చూశారా? అది-అధికారం, అభిజాత్యం పరమాత్మకు ఒక్కడికే చెల్లు. "గోవల్లభుడ నేను, గోవులు మీరని వడి రంకె వై చుచు వంగి చూడు". మీరు గనక గోవులైనట్లయితే నేను గోవృషభాన్ని అని చమత్కారంగా ఒక ఎద్దు రంకె వేసినట్టుగా రంకె వేసి వాళ్ళ వైపు ఉండి చూశాడట. అమ్మో అనుకున్నారట వాళ్ళు. వాళ్ళు అమ్మో అనుకోవాలి. ఆ అనుకోవటం కోసమే చేస్తున్నాడాయన. "రాజు నేను, భటులు మీరు, రెండు రెండని ప్రభావంబున పెక్కు పనుల ననుచు" నేను రాజుని, మీరు భటులు. ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఆ చెట్టు ఎక్కండి, ఆ కాయ Bo చేయండి, ఆవును పట్టుకురండి, ఆవును కట్టేయండి చెప్తున్నాడు అప్పటికే. ఇక మూడవది, "నే తస్కరుండ" నేను దొంగని. "మీరు ఇంటివారు" ఇది మీ ఇల్లనుకోండి చెట్టు. మీ ఇల్లనుకోండి. మీరంతా కళ్ళు మూసుకోండి, నేను దొంగతనం చేస్తా. అంటే చిత్త చోరా. మీ చిత్తాలు దొంగిలించటానికి నేను వచ్చిన పెద్ద దొంగని అన్నాడాయన. మీరంతా ఇంటి వాళ్ళుగా పడుకోండి. ఇంటి వాళ్ళంతా హాయిగా తలుపేసుకుని పడుకుంటారు. పడుకున్నప్పుడేగా దొంగతనాలు జరిగేవి. మేల్కొని ఉంటే ఎవడు దొంగతనం చేస్తాడు? ఎవడు చేయలేడు. ఆ పడుకోవటం అనేదే ప్రమత్తత. అప్రమత్తంగా గనక ఉన్నట్లయితే దొంగతనం జరగదు. ప్రమత్తంగా ఉన్నట్లయితే ఆయన ఇంటి దొంగగా ఉంటాడు. ఆ ఇంటి దొంగ అంటే తర్వాత చెప్తాడు. పరమాత్మ ఎంత అద్భుతమైనదంటే శ్రీకృష్ణుడు వ్రజభూమిలో ఇంటి దొంగ, బంటి దొంగ అంటాడు. గోపగోపిక హృదయాలలోకి ప్రవేశించి వాళ్ళ చిత్తాలన్నీ బయటకు కొల్లగొట్టేశాడాయన. కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ మనస్సు, వాళ్ళ చిత్తం అంటూ ఏం లేదు అని. అంతే కాదు, "నే సూత్రధారి మీరెందరూ బహురూపులని చలంగుచు ఆటలాడబెట్టు మూలలురుకును" ఓ మూలకెళ్ళి కూర్చుంటాడట.దాగిలి మూతలాడు ఉయ్యలలూగు చేవంతులొనరవైచు జారచోర్ల జాడల చాలనిగుడు శౌరి బాలురతో ఆడు సమయమందు ఈ ఆటలే ఆడుతూ ఉండేవాడు. ప్రకటన చేశాడు, నేను మీ అందరికీ యజమానిని ఆధిక్యం నాది రాసిఖ్యం మీది ఆధిక్యం నేనున్నగా మీకు ఆనందాన్ని కలిగించటానికి వచ్చి అందుకొందన్నాడు. ఆ అందుకునేటువంటి ఆనందాన్ని అందించడానికి వచ్చాడాయన మనం చేయాల్సిందేం లేదు ఆ చేయి చాపి అందుకోగలిగిన ఒక స్థాయికి వెళ్ళటమే. అందుకే భగవాన్ రమణులు కూడా అనుగ్రహం ఒకరిచ్చేది కాదు అనుగ్రహం ఏమీ ఒక తీయ పదార్థం కాదు, నా దగ్గర ఏదో ఉంటే తీసి మీకివ్వటానికి. మీ అర్హత ఉంటే అనుగ్రహం మీదేనన్నారు. అప్పుడు ఇట్లా చేస్తూ చేస్తూ దుడుకు చేతలు కూడా వచ్చినయి. ఇప్పటికి మాటలు వచ్చాయి కదా! మాటలొచ్చి దుడుకు చేతలు కూడా రావాలి. ఆ దుడుకు చేతలలో ఇల్లు దూరాడు, ఒళ్ళు దూరాడు, గాలి దూరాడు, ఇంటింటి మూలమూలాలు దూరాడు అంటే దూరాడు అంటే అంతటా అన్నిటా నేనే ఉన్నాను అని ప్రకటన చేశాడు పరమాత్మ. శ్రీ మహావిష్ణువు గనక నారాయణ స్వరూపం గనక పైగా వాసుదేవుడు గనక సర్వ జగత్తుని ఆవరించి ఉన్నటువంటి విష్ణుత్వాన్ని గోపగోపికలకు ముందు ప్రకటన చేశాడు. అయితే జ్ఞాన భూమికలో చేయలే, గంభీరమైన మాటలతో చేయలే. "ఇదిగో నేను ఇక్కడ దాక్కున్నా పట్టుకోండి" అన్నాడు. మన పని కూడా వెదుకులాటే. స్వామి ఏమన్నారు "దేవుణ్ణి దేవులాడుతూ ఇంత దూరం వచ్చారే, నేను దేవులాడుతున్నాను" అన్నారు. ఎవరికోసం? "ఒక్క మానవుడి కోసం, ఒక్క నిజ మానవుడి కోసం, కంటికి ఒక్కరు కానరారే" అన్నారు స్వామి. Sixth Birthday Speech. మీరంతా దేవుణ్ణి వెతుకుతుంటే నేను నిజ మానవుడి కోసం వెతుకుతున్నా. మీది నాది దేవులాటే అన్నారు వెదుకులాట అది. ఇక వచ్చేస్తున్నారు మరి ఇప్పుడు పక్కింటి పిల్లవాడు మనతో వచ్చి ఒక గంట ఆడితే ముద్దులో ఆడగలం గాని మన Laptop విరగ్గొట్టి మన Phone బయట పారేసి ఆ మన గాలి తీసేసి మనల్ని వెళ్ళనివ్వకుండా కట్టేస్తే, ఇక మనం వెళ్లి చెప్తాం "పక్క మీ పిల్లవాణ్ణి జాగ్రత్త పెట్టుకోండి కాస్త Hyper గా ఉన్నాడు" అని. ఆ Hyper అయిన కృష్ణుడి గురించి చెప్పటానికి ఇక నెమ్మదిగా బారులు కట్టారు. ఎవరో ఒక ఆమె పాపం ధైర్యం చేసి ఆ మొదటగా యశోద అందుట్లో ఊరికి పెద్ద నందుడు రాజు లాంటి వాడు ఊరి పెద్ద ఊరి పెద్ద భార్యకి చెప్పాలి. పోనీ ఈ పిల్లవాడు ఏమన్నా సామాన్య బాలకుడా? పూతను చంపేశాడు, చకటాసురుణ్ణి చంపేశాడు, ఈ ఆలమందలు అన్నింటినీ తీసుకెళ్తున్నాడు రోజు. ఆ మైదానంలో కూర్చుంటున్నాడు అందరికీ రాజునని చెప్తున్నాడు. ఇలాంటి వాణ్ణి ఎట్లా ఏమని చెప్పాలి అని. పోనీ ఏం పోగొట్టుకున్నామయ్యా అంటే, ఏదో ఉన్నది చేస్తే ఇప్పుడు కుండలు కూడా రోజు తయారు కావు. తీలిగిన్నారంటే పోవు వాడు బాలువాడు కాటు లేడు. ఆ రోజుల్లోనూ కుండలు. ఎన్ని కుండలు వాళ్ళు వేగలరు? అంటే ఘటా ఘటనా ఘటన సమర్ధుడు అయిన పరమాత్మ దేహం అనేటువంటి ఘటాన్ని బద్దలు కొడుతున్నాడు. ఆ ఘటం బద్దలు చేసి లోపల ఉన్న శూన్యాన్ని పూర్ణం చేస్తున్నాడు. అది అంతరార్థం. అంతే తప్ప ఆయనకు ముంత అక్కరలేదు. ముంతలో ఉన్న వెన్న పాలు అసలు అక్కరలేదు. ఎందుకంటే "బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః" ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం స్వామి పరంగా. అదేమిటంటే ఒకటి బ్రహ్మార్పణం చెప్తాం కదా, ఆ బ్రహ్మార్పణం చెప్పినప్పుడు స్వామి దగ్గర ఉంచినటువంటి పదార్థాలని ఆయన వైపు చూపకండి. బ్రహ్మార్పణానికి మనం తయారు చేసిన పదార్థానికి వేరొకటి అయిన సంబంధం లేదు. అది వేరు ఇది వేరు. బ్రహ్మార్పణం అంటే అర్పణము బ్రహ్మ. "బ్రహ్మ హవిః" హవిః బ్రహ్మ, హవిస్సులు బ్రహ్మ. కాబట్టి సమాధి కర్మలు కూడా బ్రహ్మమే అని చెప్తున్నాం అంతే. అంతే తప్ప నువ్ ఇవన్నీ తిను అన్నట్టుగా చూపించి చేయకూడదు ఒకటి. రెండవది స్వామికి హారతి ఇస్తున్నప్పుడు స్వామికి హారతి ఇట్లా చేయకూడదు. ఎందుకనంటే చేయకూడదు అంటే ఆ కర్పూరం అనేది మన కర్మల యొక్క సంకేతం. దాన్ని వెలిగిస్తున్నాం. ఈరోజు చేసిన అనేకమైనటువంటి కర్మలన్నీ దగ్ధం చేసి నా హృదయ నైవేద్యంగా నీరాజనంగా నీకు సమర్పిస్తున్నా. అటువంటి దుర్బుద్ధులు దుర్వ్యాపారాలు లేకుండా నన్ను రక్షించవయ్యా. ఇదిగో ఈ చిన్న జ్యోతిని ఆధారం చేసుకొని పరంజ్యోతి వైపు అయిన నీ వైపు వెళుతున్నాను అని చెప్పడమే తప్ప పరమేశ్వరుడికి నీరాజనం ఇవ్వటమనేది లేదు. అలా ఇవ్వకూడదు. అలా ఇవ్వాలి పట్టుకోవాలి అంతే. తిప్పచ్చు. అంతేగాని ఆ ఇచ్చేటప్పుడు మంగళహారతి అందుకో అన్నప్పుడు మాత్రం అది మనకి మన పెళ్లిళ్లలో మన ఒడుగుల్లో మనల్ని ఆ-ఆ మంగళం మనకే తప్ప పరమాత్మకి చేయకూడదు. సరే. ఇంకా వచ్చారు. ఆ Complaints ఎలా ఉన్నాయో చూడండి. పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మా ఇల సొచ్చి తాను ఉట్టి యెందక మా ఇంటికి వచ్చాడమ్మా. పుట్టి కనపడుతుంది మీ వాడికి అందలేదు. ఏం చేశాడో తెలుసా? రోళ్ళు బీటలు నొక్కి రోలు ఎక్కాడు. ప్రోవిడి ఎక్కి చేనట గాలక చేత్తో పట్టుకోలేక కుండ కిందొక పెద్ద తూపు తూటనరించి వాడు ఎంత Intelligent అంటే చేతికి అందలేదు కాబట్టి కింద ఒక అన్నం పెట్టాడట. హాయిగా కావలసిన వెన్నంతా పాలన్నీ కిందకి దిగుతూ ఉన్నాయి. మీ పట్టి మీ పిల్లవాడు మీ గడపలు చేరల పట్టి తావే తలోదరి ఇలా చేశాడమ్మా. కుండలన్నీ పోతున్నాయి, మాయమైపోతున్నాయి, ఎవరింట్లోకి ఎప్పుడు పోతాడో తెలియదు. నిజమే పరమాత్మ అనుగ్రహం కూడా ఎప్పుడు ఎవరి మీద ఉంటుందో మనకేం తెలుసు. మనం అనుకుంటాం వాణ్ణి ఇవాళ ఎందుకు పిలిచారు అని. అనుగ్రహం. వాణ్ణెందుకు పిలవలేదు అనుకుంటాం. Time రాలేదు.వాడ్నే ఎందుకు పిలుస్తున్నారు వడియోగం కదా ఇవన్నీ ఆయనకెరుక అది ఆయన సంబంధం మన సంబంధం లేదు అలాగే పడతిని విడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలు ఆడపడుచులకు పోసి చిక్కిన కడవల పోనడచే ఆజ్ఞ కలదో లేదో కడవల్లో ఉన్న పాలన్నీ ఆడపిల్లలకందరికీ పోస్తున్నాడు వాళ్ళు కృష్ణా బాలకృష్ణా అంటూ వస్తున్నారు వీడేం చేస్తున్నాడంటే బాగా కాగిన పాలన్నీ అందరికీ దోసిళ్ళలో పోసి ఆ కడవల మీదిగా ఎక్కి వెళ్ళిపోతున్నాడమ్మా అని చెప్తున్నారు చెప్తే అట్లా ఒక పది పదిహేను complaints ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు [నవ్వు] అన్నీ విన్నది ఓ సుమారుగా ఒక ఇరవై ఉన్నాయి ఆ ఇరవై రకరకాల విన్యాసాలవన్నీ వాళ్ళ అమ్మ కదా complaints అన్నీ శ్రద్ధగా విని బాలకృష్ణుండు చేయు వినోదంబులు తన యందు చేయు మహాప్రసాదంబులని ఎరుంగక దూరుచున్న గోపికలకు యశోద ఇట్లనియే యశోద ఏమన్నది అని మన పిల్లవాడి మీద పక్కవాడెవడో వచ్చి complaint ఇచ్చాడు ఏం చేస్తాం అంటే మా పిల్లవాడు మంచివాడండి మరి మీ ఇంట్లోనే ఎందుకు చేస్తున్నాడో తెలియదు అంటాం అనగానే పాపం వాడికి మనమేం పొరపాటు చేశామో అని బాధ కలుగుతుంది తర్వాత తర్వాత రెండోసారి ఏమంటారంటే మా పిల్లవాడు ఇంతే మీకిష్టమైతే తలుపు తీయండి లేకపోతే లేదు అది అంటే మేము మార్చమని చెబుతాం యశోద కూడా ఏం చెప్తుంది అంటే నన్ను విడిచి నన్ను విడువడు వెన్నడు పొరుగింల త్రోవలెరుగడు వాడు అసలు ఎప్పుడూ నన్నే అంటిపెట్టుకొని ఉన్నాడే నన్ను నా చీర కొంగు కూడా వదలని నా బిడ్డ ఏ ఇంటికి దారేటో కూడా వాడికి తెలియదే మీ ఇళ్లందరికీ వచ్చానని చెప్తున్నారు ఒక ఇరవై ముప్పై మంది ఎప్పుడొచ్చాడు వాడికి అవసరమే లేదు చిన్న పిల్లవాడు నా దగ్గరే ఆ పాలు పితికే వేళ వాడే వెన్న తీసే వేళ వాడే ఆరగింపుల వేళ వాడే అన్ని పనులలో నాతోనే ఉంటాడే కన్ను తెరవని మాయీ చిన్న కుమారుని రవ్వసే ఎంతగునే ఇంకా మా పిల్లవాడికి కళ్ళే పూర్తిగా విచ్చుకోలే ఈ ప్రపంచం ఒకటుందని [నవ్వు] ఇళ్లున్నాయని ఆ ఇళ్లల్లో కుండలున్నాయని కుండలలో పాలు మీగడ నెయ్యి వెన్న ఇవన్నీ ఉంటాయని తెలియదు ఆ తెలియని వాని గురించి ఇలా మీరు రవ్వ సేయకండి రచ్చ చేయకండి వాని గురించి చెడ్డగా నాకున్నది ఒకడే కొడుకు వాని గురించి చెడ్డగా చెప్పకండి అన్య మెరుగడు తనయంత వాడు చుండు మంచివాడితడు ఎగులు మానరమ్మ రామలార మీరెంత మంచివాళ్లంటే మా వాడి మీద నిందలు మాత్రం మోపకండి మీరు చాలా మంచివాళ్ళు యశోద చాలా తెలివిగా చెప్పింది రామలార త్రిలోకాభిరామ లార తల్లులార గుణవతీ వల్లులార మీరంతా మంచివాళ్లే మా పిల్లవాడు కూడా మంచివాడే మరి ఏం జరుగుతున్నదో చూడండి అన్నటువంటి వేళ నిజానికి మామూలు గాథలలో శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారి విశ్వరూప దర్శనం మన్ను తిన్నప్పుడే అని చెప్తారు మన్ను తినటానికి ముందు ఒకసారి చేశాడాయన ఎలా చేశాడంటే పాలు అది లీలాశుకుడు రాస్తాడు వేదవ్యాసులవారు కూడా రాశారు original లో పోతనామాత్యుడు దానికి పెద్ద importance ఇవ్వలే అక్కర్లేదు కూడా నిజానికి ఓ రోజు పాలు తాగాడట పాలు తాగుతుంటే వాడికి పాలంటే ఇష్టం కదా వాడు అమ్మనే అడిగాడు ఎవరో పరాయి వాళ్ళనడగలా అమ్మా నాకు పాలు కావాలి అని అడిగాడు ఏమన్నదంటే నాయనా సాయంత్రం అయిన తర్వాత గోవులు మనకి fresh పాలిస్తాయి అప్పుడు నీకిస్తానురా కాస్త చీకటి పడని అన్నది అంటే ఎంత చిలిపి వాడంటే అంటే చీకటి పడితే పాలిస్తామ్మా అన్నాడు పడనిరా ఇస్తానని ఇంకా వీడికి చాలా time ఉందని ఇలా కళ్ళు మూసుకుని అంత చీకటిగా ఉందమ్మా పాలిచ్చేయ్ అన్నాడు [నవ్వు] అది కళ్ళు మూసుకున్నది ఎవరంటే బాలకృష్ణుడు చీకటిని సృష్టించుకున్నది ఎవరంటే బాలకృష్ణుడు కానీ ఆ చమత్కారం ఆ లావణ్యం శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో ఉన్నటువంటి వైభోగమే అది అట్లా అప్పుడు ఒకసారి ఇంకా ఆ తట్టుకోలేక తప్పుకోలేక ఓ బుక్కెడు పాలు ఇచ్చింది పాలిస్తే గబగబా తాగాలా తాగలేనివాడా అంటే ఆ రోజు ఎలా చేయదలుచుకున్నాడు బాగా పుక్కిట పట్టాడట పాలు నెమ్మదిగా గుటక వేస్తున్నాడు ఆవిడ వీపు రాస్తున్నది ఆ వెన్ను రాస్తుంటే నెమ్మదిగా దిగుతుందని వెన్ను రాస్తుంటే ముందు పట్టలోకి దిగుతుందని ఆమె నెమ్మదిగా తల్లిగా చూస్తూ ఉన్నది కానీ ఇంకా నోట్లో పాలున్నాయి ఏది నాయనా నోరు తెరువు పాలు గాని ఇంకేన్నా పట్టుకు కూర్చున్నావా అంది అప్పుడు నోరు తెరిచాడు తెరిస్తే తాను ఇచ్చినటువంటి పాత్ర వంటి నోరుగా మారిందది ఆ పాత్రలో సకల భువనాలు కనిపించినయి గోళాలు కనిపించినయి సూర్యచంద్రులు అట్లా కదులుతున్నట్టు నక్షత్రాలు మెరుస్తున్నట్టు సర్వ జగత్తు పద్నాలుగు భువనాలు మొట్టమొదటిసారి దర్శనం చేయించింది ఆ క్షణంలో అందుకే ఆ లీలాశుకుడు అంటాడు అప్పుడు అంటాడు శ్రీకృష్ణుడు ఈవిడ చూస్తుంది చూసి చూసి అదేమిటి పాలల్లో ఇవన్నీ ఎక్కడినుంచి వచ్చాయని ఆకాశంలో కాన చూస్తుంది చీకటి కావాలని ఈయన కళ్ళెలా మూశాడో పట్టపగలే చుక్కలెలా కనిపిస్తున్నాయని ఆమె ఆకాశం వైపు చూసిందట అంటే పట్టపగలు చుక్కలు చూపించాడు అటువంటి పిల్లవాడు వాడు అది కానీ రెండవసారి ఆ మట్టి తిన్నటువంటి వేళ కాంతలు తల్లి తోతన వికారము లల్ల గణింప భీతుడై శాంతుని పొంపునన్ పరమ సాధుని పెంపున గోల మాడ్కి విభ్రాంతుని కై వడిన్ జడుని భంగి కుమారకుడు ఉరకుండేఏ వింతయు లేక తల్లి కుచ వేదికపై తలనోపి ఆడుచున్ అంతనొకనాడు బలభద్ర ప్రముఖులైన గోపకుమారులు. ఏ-- ఓ రోజు మన మన్ను తిన్న పాము అంటారు చూడండి అట్లా తల్లి హృదయం మీద ఆరిగా పడుకొని ఉన్నాడట. ఇంత గోల చేసే కృష్ణుడు అసలు ఏమీ గోల ఎరగని వాడులా, అసలు గోల అంటే ఏమిటో తెలియని వాడుగా పడుకున్నాడు. స్తబ్ధంగా ఉన్నాడు. ఇదేమిటి ఇలా ఉన్నాడు పోనీ అలసిపోయాడేమో కాసేపు నిద్రపోతున్నాడు అని ఆవిడ జోకు కొడుతోంది. ఇంతలోకే అసలు వాళ్ళు వచ్చారు. బలభద్రుడు వాళ్ళతో గోప-- ఆయన friends వీళ్ళందరికీ చెప్పాడుగా మీరు నా బంట్లోనే మీకు యజమాని అని వాళ్ళంతా వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, వీడు మన్ను తిన్నాడు అందుకే పడుకున్నాడు అన్నారు. అనగానే [నవ్వు] కేలు చేయి పట్టుకుంది. పట్టుకొని, [పాట] "మన్నేటికి భక్షించెదు మన్నియము లేల నీవు మన్నింపవు మీ అన్నయు సఖులు చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే" బయట వాళ్ళు చెబితే నేనేం అనుకోలేదు గానీ మీ అన్న కూడా చెప్తున్నాడు రా మన్నే తినాల్సి వచ్చిందా మన్ను తప్ప ఇంకేం వేరే పదార్థమే లేదా అని. ఎందుకు తిన్నావ్ నాయనా అని అడిగి-- అడిగితే కొడుకుతో, "అమ్మా! [పాట] మన్ను తినంగనే శిశువునో" అసలు ఆ మాటలు చూడండి పరమాత్మే మాట్లాడే మాట అది. నువ్వేమనుకుంటున్నావ్? నీ కొడుకు అనుకుంటున్నావా? నీ గుండెల మీద పడుకున్నాను కాబట్టి నేను నీ బిడ్డనని అనుకుంటున్నావా? ఎదగని వాడినని అనుకుంటున్నావా? [పాట] "అమ్మా! మన్ను తినంగనే శిశువునో" "ఆకుంటినో" నాకు ఆకలి ఉందా? "వెర్రినో" ఒకవేళ ఆకలేసిన పోయి మన్ను తింటానా? "నమ్మంజూడకు వీరి మాటలు" వాళ్ళ మీద వినేటాడు. వీళ్ళ మాటలు కాదు నా మాట పట్టుకో. వాళ్ళు లోకులు నేను లోకేశ్వరుడిని. లోకేశ్వరుడి మాట పట్టుకున్నావా నీకు ఉద్ధారణే. లోకులు ఇలాగే చెప్తుంటారు, నా గురించి కూడా ఇలా చెప్తారు. కాబట్టి, [పాట] "నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నివు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు" అమ్మా! నేను పుట్టాక ఇంతవరకు నన్ను కొట్టలేదు కదా, అందుకని అన్నయ్యకి ఎలాగైనా కృష్ణుణ్ణి కొట్టించాలి అమ్మ చేత అని అనిపించి ఇవన్నీ కల్పించి చెప్తున్నాడన్నాడు. అని బల్లారాముడి వైపు చూపించాడు. అంటే ఇంకా ఒక్క చేష్ట మిగిలిందన్నమాట. యశోద దండించాలి. దండం చేయలేదు యశోద, దారం చేసింది. ప్రేమించింది, వాత్సల్య భక్తితో సాకింది. పరమాత్మ అన్న భావనలో ఉంది కానీ పరమాత్మ అంటే దూరమైపోతాడేమోనని బిడ్డగా మాత్రమే నిలుపుకున్నది. కాబట్టి అమ్మా ఇలా చెప్తున్నారని, [పాట] "కాదేనిన్ మదీరాస్య గంధంబు ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పున దండింపవే" ఈ పద్యం పిల్లలకి నేర్పాలి. ఎంత అందమైన పద్యం అంటే ఆ కృష్ణుడు అలా నూరు తెరిచేసి, అమ్మా! నీ దగ్గరే పడుకున్నా కదా, వాళ్ళంతా మన్ను తిన్నానని చెప్తున్నారు కదా, నీకు నిరూపణ కావాలంటే నేను నోరు తెరుస్తా. నేను నోరు తెరిచినప్పుడు నోరు వాసన చూడు. మన్ను వాసన వచ్చిందో, వెన్న వాసన వచ్చిందో అన్నాడు. ఆవిడకి కావలసింది అది. అప్పుడు, [పాట] "నేయంబున అయ్యవ్వనియ కలిపి క్రీడామనుజ బాలకుడైన ఈశ్వరుండు తన ముఖము తెరచి చూపించిన ఆ లలితాంగి కనుగొని" యశోద చూసింది. దేన్నీ చూసింది? [పాట] "బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి కరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండమున్" దాన్ని చూసింది. అందులో శశి, సూర్యుడు, చంద్రుడు మళ్ళీ మళ్ళీ ఆ పాలనాడు ఏమి చూసిందో మళ్ళీ పునః చూపించాడు తల్లికి. చూపిస్తే, చూసి, [పాట] "కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాన యశోదా దేవి కానో" అసలు నేనెవరు? ఈ చూస్తున్న నేను యశోదనేనా? చూస్తున్న ఈ బాలకృష్ణుడు నేనా? [పాట] "పరస్థలమో" ఇది మా ఊరు కానీ ఇంకేదన్నా వ్రజభూమ్యా? [పాట] "బాలకుడంట ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమై యుండుటకు ఏమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్" చూచి పులకించి ఆ వరసలో ఆశ్చర్యం కలిగించాడు తల్లికి. తల్లికి ఆశ్చర్యం ఎప్పుడు కలిగిస్తాడంటే, తన బిడ్డ తాను అనుకున్నంత మాత్రమే కాదు ఇంకా గొప్పవాడు అన్నప్పుడు ఆనందం కలుగుతుంది. నేను మా వాడు ఇంతే అనుకున్నా, డెభై మార్కుల వాడు కానీ తొంభై ఎనిమిది వచ్చాయి అన్నప్పుడు అది ఆశ్చర్యం. ఆనందం డెభైకే, ఆనందం అయిపోయింది అక్కడికి. తొంభై ఎనిమిది చూపించాడు చూడండి అప్పుడు ఆశ్చర్యం కలిగి, ఏంటి వీడే? ఏం చదివినట్టే లేడు వీడు. మొన్న అక్కడే, మొన్న ఇక్కడే వినిపించాడు. ఎప్పుడు రాసావురా అంటే, నేనే నమ్మా రాసింది పరీక్ష వాడు ఏ go పాపం రాసాడు. కానీ తల్లి నమ్మదు. యశోద పరిస్థితి కూడా అదే. నేను అసలు యశోదనే కానేమో అనుకున్నది. ఆమెన్. [పాట] "బాలమాత్రుడగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల యెట్లు వెలసియుండు" వీడు పిల్లవాడే గనక అయినట్లయితే పద్నాలుగు గుణాలు ఎలా ఉంటాయి? [పాట] "బాలు బంగీ తడు బాసిల్లు గాని సర్వాత్మకుడు ఆదివిష్ణువౌట నిజమూ"బాలుడిగా కనిపిస్తున్నాడు గానీ ఈయన ఆదివిష్ణువు అంటే విష్ణువులు అనేకమంది ఉన్నారు కొన్ని లక్షల విష్ణువులున్నారు కొన్ని లక్షల రుద్రులున్నారు అందులో మొట్టమొదటి వాడు సదాశివుడు రుద్ర పరంగా విష్ణు పరంగా ఒక్కడే విష్ణువు వాడి పేరు శ్రీ మహావిష్ణువు ఒట్టి మహావిష్ణువు కాదు శ్రీతో కూడి ఉన్న విష్ణువే శ్రీ మహావిష్ణువు ఈ విష్ణు స్వరూపాల అందరికీ కూడా ఈయన ప్రముఖమైనటువంటి వాడు ఒక ఉదాత్త శైలిలో ఉండేటువంటి వాడు. ఏ మహాత్ముని వలన నీ విశ్వరూపంబు కానబడిన బుద్ధి కంపమయ్యె ఆ మహాత్ము విష్ణు అఖిల లోకాధారు ఆర్తుల్లవాయ ఆశ్రయింతు యశోద హృదయము ఒక్కసారి పరిప్లావితమైంది పర్లమించింది మార్దవం అయిపోయింది సరళం అయింది కోమలం అయింది లలితం అయింది ఆ పూర్ణమైనటువంటి ఆనంద రేఖలో ఆనంద అతిశయంలో ఒకటే మాట అన్నది ఇటువంటి ఈ బాలకుణ్ణి చూసి ఈ సర్వ జగత్తు ఆశ్రయం పొందు గాక అది తల్లి ఆశీర్వచనం తల్లి తల్లి ఆశీర్వచనం చాలా ప్రధానం అందుకనే స్వామి అంటారు తల్లి ప్రేమకు నోచుకోని వాడికి దైవ ప్రేమ దూరమే బంగారు అన్నారు ముందు తల్లి ప్రేమ పొందాలి తల్లి ప్రేమ తల్లి ప్రేమ అంటే భగవంతుడి ప్రేమే తల్లి ప్రేమ ఆ రెంటికీ ఏం తేడా లేదు భగవంతుడే తల్లిగా వస్తుంది ఆ తల్లి ఏమి ఆశించదు ఆ కొడుకు నుంచి కూతురు నుంచి ఏమి నాకిది కావాలి అని అడగదు వాడు బాగుంటే చాలు వాడు సుఖంగా ఉంటే చాలు ఇంతే. పరమేశ్వరుడు అని తలచి ఆనందంలో ఉండిపోయింది ఆవిడ నిశ్చేష్టు అయిపోయింది ఆ time లో యశోదకి నా మగడు నేను గోవులు ఈ మందయు గోపజనులు ఇబ్బాలు నిన్న మోమున ఉన్న విధముగని ఏమరితిమి గాని ఈశుడితడు మాకున్ గోపరు ఊళ్లో ఉన్న వాళ్ళు మా వారు అంటే నందుడు నేను అందరం కలిసి పిల్లవాడు అనుకున్నాం గాని వీడు ఈశ్వరుడే. ఈశ్వరుడే అనే భావం చూడండి ఎప్పుడైనా జగరాజ స్వామి వారు తొమ్మిది వందల కోట్ల రామనామ జపం చేసుకున్నాడు ఆయన. ఆయనకి శ్రీరామచంద్ర దర్శనం కనురెప్ప ఎత్తి మూసి అది పడే ఒక నిమిషమాత్రం దర్శనం ఇచ్చాడు ఆయన ఒక్క నిమిషం లిప్త కాలం అంటాం క-కనురెప్ప ఎత్తి మూసేలోగా మాయమైపోయినాడు పరమాత్మ వచ్చి అలా ఉండిపోడు పరమాత్మ ఒక దర్శనం ఇచ్చి అనుభూతిని కలిగించి ignite చేసి ప్రేరణ కలిగించి మళ్ళీ తన దారిన తాను వెళ్తాడు అంటే వెళతాడు అంటే అక్కడ ఉన్నట్టు కనిపిస్తాడు అభివ్యక్తం అవుతాడు అలాగే యశోద కూడా ఎక్కువ సమయం ఉండటానికి వీల్లేదు మళ్ళీ ఆమె మళ్ళీ మగడు సంసారము ఆ దాంట్లో పడాలి అంతే కదా అది మరి మరొక్క మళ్ళీ ఎవరు తెప్పించాలి అంటే పరమాత్మే తెప్పించాలి.
SSSMC · audio
Bhagawata Navaneetham - 60
Bhagawata Navaneetham - 60
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 39:36
More in this series