Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన వందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శీల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం అలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ శ్రీకృష్ణ పరమాత్మని ఇబ్బంది పెట్టాలనుకున్న బ్రహ్మ ఏం చేసాడంటే గోవులను అంతర్ధానం చేశాడు కనపడకుండా చేశాడు అక్కడ ఉన్నాయి అవి కానీ ఎవరి మీద మాయ ప్రయోగించాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మనే యోగ మాయ మీద మాయ పనిచేస్తుందా ఇది భౌతిక మాయ కాబట్టి కనపడకపోవడం నిజం కానీ కృష్ణ పరమాత్మకి అవి కనపడుతూనే ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏం ఎంత అందమైనటువంటి సన్నివేశం అంటే భాగవతంలో చాలా కృష్ణుడు గనుక ఇప్పుడు మన వాకిట్లో ఇక్కడ ఉంటే వాడిని ముద్దు పెట్టుకుంటాం అందరం అంత అందమైనటువంటి లీల ఇది లీలలో కృష్ణుడు వెళ్ళాడట ఎలా వెళ్ళాడు అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు కృష్ణ పరమాత్మ వేషం ఎలా ఉన్నది అట అంటే కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణాభాసిత నేత్రదండకముతో సపించదామంబుతో పూర్నోత్సాహముతో ధృతాన్నకవలోత్పుల్లాజ్య హస్తంబుతో పూర్ణత్వంబున ఏగలేగలకునై దూరాటవీ విధికిన్ ఒక చేత చల్ది పట్టుకున్నాడట దాన్ని ఆయనేమి వదిలిపెట్టలా వీళ్ళ దగ్గర ఏముందో అదే పట్టుకున్నాడు అలాగే పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళుతూ అనుకున్నాడు ఇక్కడే పచ్చిక మేసినై ఇక్కడే నీళ్ళు యాగినై ఇక్కడే ఆడుకున్నై ఇక్కడే పడుకున్నై ఇక్కడే పాపం నడవలేకపోయినై ఇక్కడే పరిగెత్తినై కృష్ణ పరమాత్మకి జీవుడి యొక్క దివ్య విలాసం అంతా జీవుడిది కూడా దివ్య విలాసమే మనది మనది కూడా దివ్య విలాసమే కాకపోతే జన్మ మనకి పరమాత్మ ఇచ్చేవాడు కాదు కానీ మనకు దివ్య విలాసం అని తెలియక విలాసంలో ఉంటాం దాన్ని దివ్యత్వంతో గనుక అద్దుకోగలిగినట్లయితే మన జీవితం కూడా మన శ్వాస కూడా మన నిత్య సత్యానుసంధానమైనటువంటి ఒక దివ్య విధానమే జీవన హేలగా సాగుతుంది గనుక శ్రీకృష్ణ పరమాత్మ వెళుతున్-- వెళుతూ ఉంటే బాలుండయ్యు అఘాసురుడు పైనుంచి చూశాడు వీడా కృష్ణుడా మా వాళ్ళని చంపాడు అనుకున్నాడు బాలుండయ్యు ఇతండు అఘాసురుడు త్రుంపన్ బాలురన్ క్రేపులన్ ఏలీలన్ బతికించనొక్కో భువి మూహింపన్ కడున్ సోజ్జముంచాలో అంభుజ సంభవుండు సని మాయా బాలు శుంభద్బలంబు ఆలోకింపదలంచి దాచె ఒకచో లేగలం బాలురన్ లేగలను దాచించటంతో పాటు గోపు-- గోప బాలకులను కూడా మాయం చేసేశాడు వాడు అఘాసురుడు అంటే ఏమైంది మైదానంలో ఎవరున్నారు కృష్ణుడు ఒక్కడున్నాడు తనతో వచ్చిన పశువులు లేవు తన స్నేహితులు లేవు మొత్తం శూన్యం అయిపోయింది శూన్యం అయినటువంటి స్థితిలో పాపం వీళ్ళంతా ఒక చోటికి వచ్చి ఏమైపోయినారు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అని ఇలా చూశాడట ఏం తెలియనట్టు ఓహో ఇది ఎవడు మామూలు వాడు చేసిన మాయ కాదు బ్రహ్మ చేసే మాయ అని మరి బ్రహ్మ జ్ఞాని కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు స్థాయిలలో ఒక పార్శ్వమే బ్రహ్మది కదా అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మ కృష్ణుడిని పరీక్షించాడా అని వస్తే బ్రహ్మమీద మాయకమ్మినా బ్రహ్మ కూడా అంటాడు అది మాయావేషం శ్రీకృష్ణుడు నటవరుడు గనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వం ప్రపంచానికి తెలియాలి అంటే ఇటువంటి సంఘటనలు జరగాలి జరక్కపోతే రొటీన్ కదా తర్వాత వెళ్దాం పుట్టపర్తి వెళ్లారా సుమారు ఏడేళ్లు అయిందండి వెళ్దాం అనుకుంటూ ఏడేళ్లు గడిచిపోయింది అదే ఇంకోడు అంటాడు మేలో వెళ్దాం అనుకున్నానండి మేలో బాగా ఎండలు ఉంటాయి అక్కడ నీళ్లు ఉండవు ఇల్లు ఉండవు కాంటీన్ ఉండదు అందువల్ల మేలో వెళ్ళడు జూన్ పోనీ జూన్ వెళ్ళవయ్యా జూన్ లో పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అవుతాయండి అందువల్ల వెళ్ళం జూలై గురుపూర్ణిమ మా ఊర్లోనే భజన చేయాలి అందుకని వెళ్ళను ఆగస్టులో ఆగస్టు పండగలకు నేను వెళ్ళాలి కనుక వెళ్ళను అంటే ప్రతి నెలా అక్కడికి వెళ్లకపోవటానికి మనకు కారణాలు ఉన్నాయి ఇవి ప్రపంచానికి ఇంటికి సంబంధించినవి వెరసి ఇట్లా ఏళ్ళు పుళ్ళు గడిచిపోతాయి కనుక పరమాత్మయై ఉండేటువంటి ప్రదేశానికి బ్రజభూమికి వెళ్ళటానికి కూడా బ్రహ్మకైనా సరే ఆయన సంకల్పం ఉంటే తప్ప వాడు అడుగు పెట్టలేడు అటువంటి మాయలో పడేశాడు చూశాడు చూసి ఏమైపోయి ఉంటారు వీళ్ళంతా అని ఒక నిమిషం ఆయన నటించాడు నటించి విశ్వవిదుడు కాబట్టి వేదవ్యాసులవారు శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వవిదుడు అంటారు విశ్వము సృష్టి ఇదంతా తెలిసిన వాడు అని అసలు విషయం తెలిసిన వాడికి విశ్వము విష్ణువు ఒకటే రెండు భేదం కాదు విష్ణువు యొక్క సంకల్పమే విశ్వం విశ్వం యొక్క సూక్ష్మ సూక్ష్మీతర తత్వమే విష్ణువు ప్రపంచంలో ఏమున్నదయ్యా అంటే సర్వం వాసుదేవమయం ఇక్కడ వాసుదేవుడు తప్ప ఏం లేదు రెండో పదార్థమే లేదు మరి మనమో మనము వాసుదేవుళ్ళమే కానీ మనకు ఎరుక లేదు మనకు మన పేరు మన శరీరం మన కీర్తి మన డిగ్రీలు మన ఉద్యోగాలు మన డబ్బులు అవి మనం అనుకుంటున్నాం మనము కూడా వాసుదేవ తత్వంతోనే ఇక్కడికి వచ్చాము వసువుగా వచ్చాము.శిశువుగా పుట్టాం నిశువుగా పెరుగుతాం రోజున ఉరుకుతాం ఇది మానవ జీవితం మానవ జీవితంలో పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అందుకనే ఆయన అప్పుడు అన్నాడు వంచింపన్ పని లేదు బ్రహ్మకి చటన్ బ్రహ్మకి ఇక్కడ మాయ చేయవలసిన పని ఏమి వీడికి లేదు అనుకున్నాడు బ్రహ్మ లోకంలో ఉన్న బ్రహ్మ పని చేశాడు అన్నాడు ఇది వత్సమ్బులన్ బాలురన్ వంచించన్ కనుబ్రామి తన్ను మరలన్ వంచించుట ఆశ్చర్యమే వంచింపన్ మనకేల తెచ్చుకుతునై అల్లదంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింప నేర్చు హరిలీలన్ మందహాసాశ్యుడై నాతో వచ్చిన పిల్లల్ని నాతో వచ్చిన గోవుల్ని సమస్త ప్రపంచాన్ని మోసం చేయవలసిన అవసరం బ్రహ్మకి లేకపోయినా ఇక్కడ చేశాడు కదా సరే అది బ్రహ్మ మాయ మరి విష్ణు మాయ ఏంటో వీడికి నేను చూపిస్తా అనుకున్నాడు కృష్ణుడు విష్ణు మాయ ఏమై ఉంటుంది అంటే దీనికి స్వామి ఆనంద పడిపోవాలి ఎందుకంటే ఆయనన్నూ ఈయనన్నూ రెండు తేడా ఏం కాదు మనకి సత్య సాయి భగవానుడు సాక్షాత్తు శ్రీమ అందుకే ఆయన అన్నది మహావిష్ణువే మహీవిష్ణువే తన గుంపుతో ఆడుకొనగా వచ్చే He has come to play with us. Let us play He is playing a divine play which is most difficult for a common man to conquer but He will give us the strength to conquer and we are going to be the winners స్వామి మనకు ఆనందాన్ని మనకిస్తారు కాబట్టి గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేల ఏమో మేము ఆడుకోవటానికి వెళ్ళాం వాళ్ళంతా ఏమైపోయారో నాకు తెలియదు అని నేనెందుకు చెప్పాలి చూశారా ఏమో ఏమైపోయింది అంటే ఏమైపోయింది నాయనా అని అడుగుతారు అసలు మాట ఎందుకు చెప్పాలి గోపాలకులం గోపికలు వలర బాలుర క్రేపుల రూపముల నేచరించెదన్ పశువును నేనవుతా పసరాన్ని నేనవుతా శిశువును నేనవుతా గోప బాలకున్ని నేనవుతా ఏది ఇక్కడ నుంచి బ్రహ్మ మాయం చేశాడో అదంతా నేనవుతాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే కొన్ని వేల వందల ఆవులు గోపబాలుర యొక్క వేషాన్ని తనలో తాను ఒక్కొక్క స్పర్శని అంశని బయటకు తెచ్చి మొత్తం ఏది మాయమైందో దాన్ని పునః సృష్టి చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ కరముల్ పాదముల్ శిరంబులు అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదలున్ దందకావర స్వగ్రేణి నిషాన భూషణ వయో భాషా గుణాఖ్యానత తత్పర విద్వడ కుందదాల్చె విభుడో వత్సద్భకాకారముల్ గోపగోపికల యొక్క సర్వ శరీరాలు ఎట్లా ఉన్నాయో వెయ్యి మంది ఉన్నారు అనుకుందాం వెయ్యి మందికి వెయ్యి నామాలున్నాయి వెయ్యి రూపాలున్నాయి ఒక్కొక్కడు వాడి భుజము వాడి లోపల పళ్ళు ఎన్ని ఉన్నాయో వాడికి ముప్పై ఉన్నాయో వాడికి ఇరవై ఆరు ఉన్నాయో ఇరవై ఆరు పళ్ళతోనే మళ్ళి శరీరం తీసుకున్నాడు అంటే మాయమైపోయిన వాళ్ళందరూ మళ్ళీ కృష్ణుడిలో నుంచి పునః వచ్చేశారు వీళ్ళందరూ ఎవరు అంటే అంతా కలిపితే ఒక కృష్ణుడు ఏకము అనేకమైనటువంటి వేళ అనేకమంతా ఏకమైనటువంటి వేళ కూడా ఇదే అటువంటి ఆకారాన్ని తీసుకుని రూపంబులల్లనగు బహురూపకుడు ఇటు బాలవత్స రూపంబులతో పారుట ఏమి తోజ్యము కులవంత హాల్లో పాతిక వేల మంది కూర్చున్నారని లెక్క పెడతాం జ్ఞాని పాతిక వేల మంది మధ్యలో కూర్చొని సత్య సాయి భగవానుడు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాలతో ఎలా కూర్చున్నాడయ్యా ఎంత ఆనందపడుతున్నాడు మనమందరం అదే కదా ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా అన్నట్లుగా గోప గోపికల స్వరూపాలు నామాలు రూపాలు అన్నీ తీసుకుని ఆయన వచ్చాడు ఇది పెద్ద ఆశ్చర్యం ఏమి అంటూ వారి వారి దొడ్లనయ్య వత్సంబుల ముందరి కందువల నిలిపి తత్తద్బాల రూపంబుల అందరి గృహంబులన్ ప్రవేశించి వేణునాదంబులు చేసిన శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు అంటే స్వామి వస్తున్నారు అంటే వేదం వినపడుతుంది స్వామి వస్తున్నారు అంటే దాన్ని మన వాళ్ళు పిచ్చి మాట సిగ్నల్ మ్యూజిక్ అని పేరు పెట్టుకున్నారు స్వామి వస్తే సిగ్నల్ మ్యూజికా నిస్తంద్ర మంద్రంతో వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి నాద స్వరూపం నాదమే రూపు దాల్చి స్వామి వచ్చిన వేళ స్వామి వస్తున్నారు సిగ్నల్ మ్యూజిక్ స్టార్ట్ అయింది అదేదో ఏఐఆర్ మ్యూజిక్ లాగా దారుణంగా దానికి స్వామిని ఎంత దిగజార్చుకుంటూ వచ్చాడంటే సాధకుడు అందుకోలేక అమాయకత్వం చేత తెలియక అలాగే ఇవాళ స్వామి వస్తున్నారంటే వేదం వచ్చినట్లు తర్వాత తర్వాత అసలు వేదం వచ్చిందో లేదో కారు వస్తే స్వామి వచ్చినట్లు అయిపోయింది కదా కారు స్వామి కారు కంటే స్వామి కంటే కారు ప్రధానమైంది స్వామిని చూసిన వాడెవడు కారు వచ్చిందా లేదా చూడమన్నాడు కాబట్టి ఇదంతా ఒక ఆకాశంబుల నుండి శంభుని శిరంబందుండి సుశ్లోకంబైన హిమాద్రు నుండి భూమి భూలోకంబందుండి అస్తోకాంబోధి పయోధి నుండి భూమి భూలోకము పోయి ఎక్కడికి పోయిందయ్యా అంటే పాతాళానికి పోయి పడిపోయింది అలా దిగజార్చుకుంటూ రాకూడదు ఎగబాకుతూ వెళ్ళాలి సాధకుడు ఊర్ధ్వ ప్రయాణం చేయాలి అనేకమైన క్లిష్ట సమయాలు ఏర్పడినప్పుడు మనక్కూడా మనక్కూడా జీవితంలో ఏర్పడతాయి అనారోజ్యం కావచ్చు అనేకమైన సమస్యలు కావచ్చు మనం చేయనివి మన మీదకి రావచ్చు రకరకాలు రావచ్చు క్రైసిస్ మేనేజరే బెస్ట్ మేనేజర్ మామూలు మేనేజ్మెంట్ ఏముంది డబ్బు లేకుండా ఇల్లు నడపాలి డబ్బు లేకుండా వ్యాపారం చేయగలగాలి కదా అవి ఇక్కడ డబ్బు లేకుండా అంటే మొదటి నుంచి చివరి దాకా కాదు క్రైసిస్ మేనేజ్మెంట్ అక్కడ వాడి సమర్ధత బయటికి వస్తుందిశ్రీకృష్ణుడు crisis ని ఎలా manage చేసాడు పరమాత్మ గనుక మాయమైపోయిన వాళ్ళందరూ వేషాలు వేసుకుని దొడ్లల్లో ప్రవేశించి వాళ్ళు వచ్చారు అంటే గుర్తు ఏమిటంటే కృష్ణుడితో సహా వస్తారని వాళ్ళ నమ్మకం వేణుగానం కూడా ఇళ్లల్లో వినిపించాడట చూడండి కొన్ని వేల ఇళ్లల్లో వేణుగానంతో సహా ఆయన ప్రవేశించాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే సినిమాల్లో చూపిస్తారు కదా సినిమాలు మనం చిన్నప్పుడు చూశాం గా ఇప్పుడు మానేశాం గాని సినిమాలో ఒకే actor రెండు వేషాలు వేస్తాడు చివర్లో గుడ్డి తల్లిని పెడతాడు ఇందులో పెట్టి ఇందులో నీ కొడుకు ఎవడో చూడు అంటే చెంపో కాలോ పట్టుకుని వీడు నా కొడుకు అంటుంది. ఈవిడే కనిపెట్టగలిగినప్పుడు మిగతా వాళ్ళు కనిపెట్టలేరా మరి వీళ్ళంతా మరి మనకు తెలుస్తుంది కథలో వచ్చిన వాళ్ళంతా కృష్ణులు అని కదా మరి కృష్ణుడు మా పిల్లవాడు కాదు కృష్ణుడు అని అనుకోవాలి కదా మాయ కూడా ఇచ్చాడట. ఎటువంటి మాయ అంటే "ఏ తల్లులకు బాలకులో తరగున తిరిగి ప్రీతిని సగించురు మున్ను తల్లులకు బాలకులు తరగున ప్రీతి చేసిరి అవనీనాథా" పిల్లవాడు వాడు సురేష్ అని పేరు అనుకోండి సురేష్ వాళ్ళ అమ్మ ఉంది సురేష్ అనేవాడు ఇంటికి వచ్చాడు రాగానే నాయనా వచ్చావ్ చిన్న పిల్లవాడు బయటికి వెళ్ళాడు హాయిగా వచ్చాడు కావలించుకుంది వాడు నా పిల్లవాడే సురేషే అనుకుంది స్పర్శ ద్వారా అటువంటి స్పర్శానుభూతిని కూడా తల్లులకి ఆయన ఏమార్చలేదు ఎక్కడా కూడా doubt రాకుండా వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళే వెనక్కి తిరిగి వచ్చారన్నటువంటి దివ్య భావన కూడా తల్లులకు ఇచ్చాడట పరమాత్మ. ఎంతమంది తల్లులు ఎంతమంది పిల్లలు "అయ్యలగంటి మల్చుపుల కాంకురముల్ వెలయంగా" తల్లులకు ఏమిటంటే బిడ్డల్ని చూశాము అని ఆనందం కలిగిపోయిందట ఒళ్లంతా కూడా రోమాలు నిక్కబొడుచుకున్నాయట తల్లులకి "కుర్రలంచయనడాసి యత్తుకొని సంతసమందుచు కౌగలించి తారయద ఔదలల్ మనములారగ మోర్కొని ముద్దు చేయుచున్ తయమరంగు గోపకులు తదయుబిరి నిపరంబుగన్" హాయిగా ఉన్నారట వాళ్ళు మా పిల్లలు మా ఇంటికి వచ్చేశారు అని అటువంటి వాళ్ళని వేదవ్యాసులవారు గోప బాలకులు మాయమైపోయినారు కృష్ణ బాలకులు ఇంటికి వచ్చారు అది అందమైన మాట ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే కృష్ణుడు అనుభవం ఇవ్వదలుచుకున్నాడు వాళ్ళకి కృష్ణుడు ఒక్కొక్క ఇంట ఒక్కొక్క తల్లికి బిడ్డ అయినాడు కాబట్టి కృష్ణ శరీరాన్ని కౌగలించుకున్నప్పుడు మామూలు బిడ్డల్ని కౌగలించుకున్నప్పుడు వాళ్ళకి రోమాలు నిక్కబొడుచుకోలే కానీ దేహాలు ఎవరివి శ్రీకృష్ణ పరమాత్మవి అలా తాకి తాకగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఎన్నడూ లేనిది తన పిల్లలనందరూ కూడా చెట్టుట చేర్చుకొని ముద్ర పెట్టుకున్నారట తల్లులు ఎందుకంటే నల్లమయ్య యొక్క దివ్యమైనటువంటి అనుభూతి పరిమళాన్ని వాళ్ళు అనుభవించారు అన్నమాట "మందం కల్గిన వత్స బాలకులు మాయా గుహా సుప్తులై యెందున్ పోవరు లేవరిప్పుడును వేరొక చేయ నాకు అన్యులు వొందు యెందున్ లేరు విధాతలున్ పరులు" అసలు నా మాయ కంటే మాయ బ్రహ్మమాయ ఏమ్మాయ అసలు అసలు విధాతే నాకు దూరమైన వాడు వాడెంత నాకెంత అన్నాడు కృష్ణుడు. స్వామి అంటాడే మీరంతా వెళ్లిపోయి శివలింగాలకి వాటికి పూజలు చేస్తూ ఉన్నారే అది ఎవరు శక్తి ఇచ్చింది నేనే కానీ వాళ్ళు మాయకత్వంలో పడిపోయి మృత్యుంజయ మంత్రాలు చదివేసిరి కదా ఆయన సాయి గాయత్రిని ఆయనకే చదివేసి నువ్వు లేవయ్యా అంటే ఇది ఇంతకంటే అవిద్య అజ్ఞానం ఇంకోటి చేయొద్దని కాదు కానీ అర్థం ఎరిగి చేయాలి. ఆయన మృత్యుంజయ అసలు మృత్యుంజయుడు స్వామి కొన్ని కోట్ల మందికి మృత్యువు నుంచి అపమృత్యువు నుంచి తప్పించి జీవితాన్ని ఇచ్చిన వారు. ఆయన ఒక నిశ్వాస ఆయన లోనుంచి వచ్చిన గాలి సంజీవని మహావిద్య ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒక్కొక్కటి ప్రణవాక్షరం అయి ఉన్నది అటువంటి వాళ్ళ స్వామిని మామూలు మనిషిని చేసేసి ఆయన లేచి తిరగటం కోసం మనం ప్రార్థనలు చేసి మీరందరూ అది చేయండి ఇది చేయండి ఆయన కోసం పని చేయండి పని చేయండి సరే ప్రార్థన వరకు చేద్దాం మిగతావన్నీ నా దృష్టిలో ఆయనకేం పెద్ద చేయందేవి కాదు చించేవి కాదు ఎందుకంటే అంతా ఆయనే స్వామి చెప్పినట్టు "చుక్కలనయు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ తల్లి యన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వాల్లభ్యమది బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గురుని బ్రహ్మ కర్మలనయు బ్రహ్మ కాలంబు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు సభయు బ్రహ్మ సత్యమును తెలుపు సాయి బ్రహ్మ" అన్నారు స్వామి. తనని భిన్నంగా పెట్టుకోలే మనము అంటారు స్వామి మీ ఇబ్బంది అనరు మన ఇబ్బంది అంటారు ఆయనకి ఇబ్బంది ఏముంది మన ఇబ్బంది ఏమన్నా గాని నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు ఆయన తీసుకున్నట్టే లెక్క one percent మనం అనుభవించాలి అది కూడా నేను మొయ్యను నేను చేయను అని మనం చిందేస్తులు మనం పాతవన్నీ పోగొట్టుకోవడానికి వచ్చాం కానీ కొత్తవి పెంచుకుంటున్నాం అంతే "బ్రహ్మ పంపున గాని పుట్టెడు ప్రాణ సంతతి ఎప్పుడున్ బ్రహ్మ ఒక్కడ గాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా బ్రహ్మ నేను సృజింప నుండొక బాల వత్సకదంబు బ్రహ్మమందు జనించె ఒక్కట బ్రహ్మ మౌవది చూడగా" అసలు బ్రహ్మను పుట్టించింది ఎవరో నన్ను మర్చిపోయి బ్రహ్మ మాయ చేశాడు మాయ చేశాడని అసలు ఎందుకు అనుకుంటున్నారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చేసిన జగన్మోహనమైనటువంటి లీలా వినోదమిది చూడండి ఒక ఒక బాలకృష్ణుడు కొన్ని వేల రూపాలు తీసుకోగలగటం వేల గోవులుగా మారటం ఆయా తల్లులకి ఇప్పుడు ఒక దూడ ఇంకో తల్లి దగ్గర ఇంకో ఆవు దగ్గరికి వెళితే అది పాలివ్వదు తన తల్లి దగ్గరికి వెళితేనే ఇస్తుంది అలాగే దూడ ఆవుకి చెందారోఆ చెందినప్పుడు ప్రతి ఆవు ఇది నాదూడే అనుకున్నది. అలాగే ప్రతి తల్లి నా బిడ్డే నా దగ్గరికి చేరుకున్నాడు అన్నాడు. ఇది మహా మాయ. ఇటువంటి మహా మాయ తర్వాత ఇంకా రెండు మూడు ఘట్టాలున్నాయి మనం రేపటి నుంచి చక్కగా విచారణ చేద్దాం. మనసులో ముందే చెప్పినట్టుగా రకమైన శంక పెట్టుకోకండి. స్వామి యొక్క దివ్య లీలా వైభవంలో ఇదొక మరొక పతాక స్థాయి. ఇరవై నాలుగు రోజులు స్వామి తన శరీరాన్ని అక్కడ పడుకోబెట్టి సూపర్ స్పెషాలిటీ లో ఉన్న డాక్టర్లకు కూడా ఏం నిర్ణయం చేశారంటే, మీకందరికీ పద్మశ్రీలు పద్మవిభూషణ్లు ఎవడో పనికిమాలిన వాడు ఇచ్చాడు మీకేం రాదు అని తెలిచారు. అంతేనా? అది. అలాగే భక్తుడు మాత్రం భగవంతుణ్ణి ఎప్పుడూ ఓడించకూడదు. భాగవతం నిండా ఏముంది? దేవకీ దేవికి చతుర్భుజాలతో కనిపించాడు. నాయనా! నిన్ను కంసుడు చంపుతాడేమోరా! మామూలు పిల్లవాడిగా ఉండు అని అడిగింది. ఫెయిల్ చేసిందా, లేదా? అటువంటి చతుర్భుజాలతో ఉన్నవాణ్ణి చూడగానే వాడి గుండె ఆగిపోయి ఉండేది. కానీ అవకాశం ఇవ్వలేదు. మామూలు మనిషిగా మామూలు పిల్లవాడిగా ఉండు అన్నది. పైగా ఈయన కూడా కనిపెట్టి ఏమన్నాడంటే, ఇట్లాగే అంటుంటారని, నువ్వు ఇక్కడే ఉండు కనపడకుండా ఉండు అంటాడు. నన్ను ముందు ఇక్కడి నుంచి దాటించండి. నా పని నేను చేసుకుంటాను అన్నాడు. అంటే వసుదేవుడు పట్టుకెళ్ళాడు. అది తర్వాత కథ. రెండవసారి, యశోదకు రెండు సార్లు. ఒకసారి వెన్న తిన్నావు, ఎక్కువ తిన్నావు అని తెలిసింది. వెన్న చూపించు నోట్లో అంటే భోనాలు చూపించాడు. బలరామదేవుడు వచ్చి వెన్న-వెన్న కాడెమ్మా వెన్న జాలక మన్ను కూడా తింటున్నాడు మా తమ్ముడు. నువ్వు ఏదో దండించాలి అన్నప్పుడు వెన్న తిన్నావా, మన్ను తిన్నావా అన్నప్పుడు అసలు వెన్నా, మన్ను రెండూ నా దృష్టిలో ఒకటే అని చూపించాడు. అప్పుడు మనం చెప్పుకున్నాం కలయో, వైష్ణవ మాయయో, ఇతర సంకల్ప అర్థమో, సత్యమో అసలు నీవు యశోదాదేవిని కానూ అని అంత భ్రాంతికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏమన్నది? ఏమో! అవన్నీ నాకు వద్దు గానీ మా మామూలు బాలకృష్ణుడిగా ఉండిపో అన్నది. పద్నాలుగు భోనాలు చిన్ని నోట చూసిన తల్లి నేను ఇంత పరమాత్మకు తల్లిని కదా, ఇటువంటి వాణ్ణి కదా నా దగ్గర పెట్టుకున్నాను అని అనుకున్నదా, మళ్ళీ మామూలు చేయుమన్నది. రాయవాడానికెళ్ళి దృతరాష్ట్రుడికిస్తే వాడేమన్నాడు? పుత్ర వ్యామోహం చంపుకోలేక దుర్యోధనుడు ఎప్పటికైనా రాజుగానే ఉంటాడు, రాజుగానే పోతాడు అని అనుకున్నాడు. నిన్ను చూసిన కళ్ళతో లోకాన్ని చూడలేను. మళ్ళీ నా గుడ్డితనాన్ని నాకు ఇవ్వమన్నాడు. పరమాత్మ వచ్చి దివ్య దర్శనం ఇచ్చాను ఆనందించమంటే, నాకు గుడ్డితనాన్ని ఇవ్వమని అడిగాడు వాడు. వాడు ఫెయిల్ చేశాడు. సరే భగవద్గీత అంతా ఏడు వందల ఒక్క శ్లోకాలలో అద్భుతంగా చెప్పాడు. కర్మ భక్తి జ్ఞాన యోగాలు మూడు అర్జునుడికి. అర్జునుడిని ఎన్నుకున్నాడు. చివరగా అభిమన్యుడు పోయినాడన్నప్పుడు ఎవరూ లేకుండా చూసి అర్జునుడు కృష్ణుడిని అడిగింది ఏంటంటే, ఒక్కసారి అభిమన్యుడిని చూడాలని ఉంది. నువ్వు లోకంలోకైనా వెళ్ళగలవు కదా! చూపిస్తావా మా అబ్బాయిని అన్నాడు. అదేముందిరా చూపిస్తా అన్నాడు. వాడు ఒప్పుకుంటే అనుకున్నాడు లోపల. అక్కడికి వెళ్ళగానే వాడేమన్నాడంటే తనువుతో ఏర్పడ్డ బాంధవ్యాలు తనువుతో తెల్లవారినాయి. అప్పుడు నువ్వు అర్జునుడివి, నేను అభిమన్యుడిని. నేను దివ్య శరీరంతో ఉన్నాను. నువ్వెవడివో, నేనెవడినో నువ్వు పక్కకు నుంచోమ్మన్నాడు. అది. అజ్ఞానం, మాయ అంటే అదే. చివరికి చిట్టచివరికి ఉద్ధవుడు స్నేహితుడు. స్నేహితుడు అడిగాడు. ఏమడిగాడంటే, ఈయనే ఇదంతా పూర్తి చేసి మళ్ళీ ద్వారకకు వెళ్ళే సమయంలో సాందీపుడితో-సాందీపుడి దగ్గర చదువుకున్న తన స్నేహితుడి దగ్గరికెళ్ళి నేను వచ్చానువే మిత్రమా అంటే, అవును చాలా కాలానికి వచ్చావ్. ఏం చేసావ్? అని ఇద్దరు స్నేహితులు ముచ్చట్లాడుకున్నారు. కృష్ణుడు దైవం మాయా వలవైతంలో ఆయన గొప్పవాడు గనుక, నీకేం కావాలి అని అడిగాడు. నాకేం కావాలి? నువ్వు సాందీపుడి నుంచి మన ఇద్దరం విడిపోయిన తర్వాత గురుకులావాసం అయిన తర్వాత నువ్వు హస్తినాపురం అన్నీ మధురా తిరిగావని నాకు తెలుసు. నేను ఇక్కడే స్వాధ్యాయంలో ఉన్నాను. నాకేం కావాలన్నాడు. లేదులే! నీకేం కావాలో ఏదో ఒకటి అడుగు అన్నాడు. నేను స్నేహితుడిని. నువ్వు నన్ను అడగొచ్చు, నేను ఇవ్వచ్చు అన్నాడు. పాపా ఆయన ఏమి మరీ మొహమాట పెడుతున్నాడని ఎప్పుడన్నా నేను ఎడారిలో ప్రయాణం చేస్తే నాకు దాహం అయితే కాస్త మంచి నీళ్ళ చుక్కలు వచ్చేట్టుగా చూడు అని అడిగాడు. అట్లాగే అని అన్నాడు. ఉద్ధవుడు ఒకసారి ఎడారిలో వెలవలసి వచ్చింది. ఎడారి అనగానే దాహం వేసింది ఎండ. పైన ఎండ, కింద ఇసుక, ఎక్కడా నీటి చలమ లేదు. ఎండమావుల్లో నీళ్ళు ఉన్నట్టున్నాయి, కనపట్టలేదు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది కృష్ణుడు వరం ఇచ్చాడు కదా! ఒక ప్రార్థన చేద్దామని. ధ్యానించాడు. ధ్యానించగానే కృష్ణుడు రాలేదు గానీ ఒకడు వచ్చాడు. వచ్చి తన ఒక పెద్ద నీటి తిత్తితో నీళ్ళు తీసుకొని వచ్చాడు. ఇదిగోనయ్యా! నేను వచ్చాను దోసిలి పట్టు అన్నాడు. అదేమిటి నేను స్వాధ్యాయం చేసుకున్నాను. నేను ధర్మనిష్ఠలో ఉన్నాను. నావంటి వాడికి నువ్వొచ్చావా? ముందు తప్పుకో, తప్పుకో. నా దాహంతో ప్రాణాలన్నా తీసుకుంటా తప్ప నీ నోటి-నీ చేతి నుంచి నీళ్ళు తాగను అన్నాడు. అంటే ఆయనన్నాడు, నువ్వు అయిగా తాగు. ముందు దాహం తీర్చుకో. బతికుంటే బలిసాకు తిన్నట్టు అంటే, నువ్వు ముందు వైదొలగు అన్నాడు. వాడు సరేనని మాయమైనాడు. సమయంలో మళ్ళీ కోపం మీద కృష్ణుణ్ణి ధ్యానించాడు. వచ్చాడు. ఏమి కృష్ణా! నువ్వు నా మిత్రమా, చిలికాడువని నమ్మాను. చివరికి నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా? దాహం తీర్చు అంటే పోయి పోయి కిరాతకుణ్ణి, చండాలుణ్ణి, వేటగాణ్ణి, నిమ్న జాతి వాణ్ణి అటువంటి వాణ్ణి పంపిస్తావా? పంపిస్తే పైగా వాడేమన్నాడో తెలుసునా? ఏమయ్యా! నేను నిజమే తోలు తిత్తిలో నీళ్ళు తెచ్చాను. నీ లోపలేమన్నా బంగారు తిత్తి ఉందా అని అవమానపరిచాడు వాడు. నీలోనూ తోలు తిత్తే కదా! అన్నాడు గానీ నువ్వు అలాంటి వాణ్ణి పంపావా అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు. ఇప్పుడు మనం అనుకున్న వీళ్ళందరూ నన్ను ఫెయిల్ చేశారు. చివరికి మిత్రమా! చిన్ననాటి స్నేహితుడివి నువ్వు చేశావా? వేషంలో వచ్చినటువంటి వాడు ఇంద్రుడు. నువ్వు ఇటువంటి ఎడారులే దాటుతూ వెళుతూ ఉంటావు. ఇంద్రుడు నీకోసం అమృతం తీసుకొని వచ్చాడు. రెండు చుక్కలు అమృతం గనక తాగుంటే జన్మలో దాహమే లేని స్థితి నీకు ఏర్పడేది. ఏం చేస్తాం మాయ బలవత్తరమైంది అన్నాడు. కాబట్టి ఇది మాయా మానుష వేషం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ అనేక గోవులుగా, గోవత్సాలుగా చేరాడు. దివ్యమైనటువంటి అనుభూతి. జై రామ్.
SSSMC · audio

Bhagawata Navaneetham - 63

Home

Bhagawata Navaneetham - 63

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 24:00

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

    Now playing
  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67