Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాత్ మే పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ దివ్య గాథ భాగవతం అంతా కూడా వేదవ్యాసులవారు శుకదేవుడికి చెప్పారు కొడుకు ఆయన శుక మహర్షి శుకావధూత శుక దేవుడు అయినటువంటి ఒక పూర్ణ జ్ఞాన జీవన్ముక్తుడు అయినటువంటి ఒక అవధూతకి చెప్పాడు చెబితే తండ్రి స్వయంగా చెప్పగా శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు సన్నివేశం కూడా ఎటువంటిది అంటే పరీక్షిత్ మహారాజు శాపవశాత్తు ఏడు రోజులలో తన శరీరాన్ని వదిలిపెడతాడు అని తెలుసుకొని ఏడు రోజుల్లో నేనేం చేయాలి ఆస్తులు పంచుకోవాలా వీలునామాలు రాయాలా అని కాకుండా జనమేజయుడికి పట్టాభిషేకం చేసేసి మృత్యువు సత్యము తధ్యము అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వింటే భాగవతుడు అయినటువంటి పరమాత్మ యొక్క కథ వినాలి అని అనుకున్నప్పుడు మరి అటువంటి వాడికి అటువంటి సంకల్పం కలిగి విరాట్-విరాగిగా ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుకి బోధ చేయటానికి సాక్షాత్తు శుకదేవుడే వచ్చాడు ఇది ఒక అద్భుత సన్నివేశం పరీక్షిత్ మహారాజుకి ఒక చిన్న doubt వచ్చింది శుకదేవుడు ఇంటికి వెళ్ళినా గోవు దగ్గర పాలు పితికే సమయం ఎంత పడుతుందో అంత సమయం మాత్రమే గృహస్తుని ఇంట ఉంటాడే మరి భాగవతం అంతా మూడు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో తొమ్మిది నిమిషాల్లో చెప్పగలడా ఉంటాడా నా దగ్గర అనుకొని వచ్చినటు--వస్తే శుకదేవుడికి కావలసింది కూడా ఒక ఉత్తమ శ్రోత కావాలి ఉత్తమ శ్రోత లేకపోతే అంతా కంఠశోషే కాలక్షేపమే మన time వాళ్ళ time పాడు చేయటమే అలా చేయకూడదు ఎందుకంటే స్వామి కుల్వంత్ హాల్లో ఒకసారి "ఎంతమంది ఉన్నారు హాల్లో" అని అడిగితే "ఎన్నడూ అడగని స్వామిలా అడిగారేంటి వేళ" అని ఒకాయన వరుసలు లెక్కపెట్టి into వేశారు వేసి "ఇంత మంది ఉన్నారు" అని చెప్పుకొచ్చాడు చెప్పగానే స్వామి మిగతా number కూడా పూర్తి చేశారు "ఏదో నలభై ఎనిమిది వేలు ఉన్నారు స్వామి" అంటే "నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ఉన్నారు చూసిరా మళ్ళీ" అన్నారు వెళితే ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ఉన్నారు అది విచిత్రం అప్పుడు స్వామి ఒక మాట అన్నారు "ఎనిమిది-- నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ఎంత సేపటి నుంచి ఉన్నారు" అని అడిగారు "ఒక గంట అయింది స్వామి వచ్చి" అన్నారు అంటే నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు గంటల మానవ శక్తి అక్కడ కూర్చొని ఉన్నది గమనించుకోండి ఆవరణంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనమంతా ఉన్నాం మనం ఒక గంట నుంచి ఉన్నాం ఇన్ని గంటల మానవ శక్తి మన ఆలోచనలు స్వామి చుట్టూ తిరుగుతున్నటువంటివి అన్నీ ఇక్కడ ఉన్నాయి కనుక స్వామి ఆవరణంలో మన మనస్సు స్వామి అధీనంలో ఉంటుంది ఇక్కడ మన ప్రమేయం గానీ మన ప్రజ్ఞ గానీ మన ప్రతిభ గానీ మన పాండిత్యం గానీ ఇక్కడ ఏమీ పనికొచ్చేవి లేవు ఇక్కడ రాణించేది శోభించేది వెలిగేది వెలిగించేది ఏది అంటే పరమాత్మ యొక్క సంకల్పమే ఆయన దివ్యశక్తే కనుక శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకి భాగవతం పూర్ణంగా చెప్పేదాకా అక్కడే ఉన్నాడు ఆయన తన నియమాన్ని సడలించుకున్నాడు మూడు గ-- మూడు నిమిషాలు ఐదు నిమిషాలు తొమ్మిది నిమిషాలు మానేశాడు వినేవాడే దొరకాలి గాని భాగవతం ఎలా చెప్పాలి అన్నాడో అలాగే చెప్పాడు వేదవ్యాసులవారు జయం అనే పేరుతో భాగవతాన్ని రాశారు పైగా ఇదే నిగమకల్పతరోర్గళితం ఫలం అన్నాడు వేదాలు అనేటువంటి కల్పవృక్షంలో దానిమీద పండినటువంటి ఒక పండు జారితే దాని పేరు భాగవతం పండు విపత్త భాగవతం రసమాలయం ఎలా ఉంది పండు అంటే అంతా రసాత్మకంగా ఉంది రసమాలయం అంటే రసో వై సః ఈశ్వరుడు అయినటువంటి పరమాత్మే పండు నిండా నిండి ఉన్నాడు అని భాగవతం నిండా ఏమున్నదయ్యా అంటే ఇద్దరున్నారు ఒక విధానంగా చూస్తే భాగవతుల కథలున్నాయి భక్తుల కథలున్నాయి రెండవ పార్శ్వంలో నుంచి చూస్తే అంత అప్రమేయుడు అయిన భగవంతుడు ప్రమేయ పూర్వకంగా ప్రతిచోటా తానే ప్రవేశించి ఒక ఉత్సాహంతో తన భక్తుల్ని తాను రక్షించుకున్నటువంటి దివ్య చరిత్రలన్నీ ఉన్నాయి కనుక విపత్త భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః అన్నారు కాబట్టి ప్రపంచంలో భగవంతుని యందు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళంతా జీవితం ఒక జన్మ ఎత్తి వచ్చిన తర్వాత వినదగినవి ఏవైనా ఉన్నాయా అంటే మూడే మూడు ఉన్నాయి ఒకటి భాగవతం రెండవది రామాయణం మూడవది భారతం భాగవతాన్ని భగవంతుణ్ణి అందుకునే స్థాయిని పొందటానికి వినాలి అనాలి రామాయణాన్ని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటానికి వినాలి భారతాన్ని ఇతరులను మోసం చేయకుండా ఇతరుల చేత మోసగింపబడకుండా ఎలా జీవించాలో చెప్తుంది భారతం భారతం అంటే అంతా లోకం రామాయణం అంటే అంతా బుద్ధి భాగవతం అంటే అంతా హృదయం కాబట్టి బుద్ధి మనస్సు హృదయం ప్రపంచం ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడే ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి ఇప్పుడే ఉన్నాయి కనుక now and here అనబడేటువంటి ఇప్పుడే ఇక్కడే ఇహమేవా అన్నటువంటి వేద ప్రామాణికమైనటువంటి మాటకి అనుగుణంగా భాగవతాన్ని మనం చక్కగా విచారణ చేద్దాం.శ్రీ కృష్ణ పరమాత్మ నిన్న చెప్పుకున్నాం వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. బ్రహ్మ పదాన్ని ఆశించి యోగీశ్వరులంతా కూడా పరమేశ్వరుడి స్పర్శను కోరుతారో, గోప బాలురందరికీ కూడా పరమాత్మ ఒక్కొక్కరికీ ఒక్కొక్క కౌగిలి వరదానం చేశాడు. భాగవతం ప్రకారం, వేదవ్యాసుల వారి ప్రకారం అఘాసుర సంహారం జరగటం, ఇదంతా కేవలం ఆయన వయస్సు ఐదు సంవత్సరాలు మాత్రమే. మరి ఆయన ఎనభై తొమ్మిది సంవత్సరాలు కృష్ణ శరీరంలో ఉన్నారు. ఎనభై-- ఇంకా ఎనభై నాలుగు ఏళ్ళ చరిత్ర ఉంది ఆయనది. ఐదేళ్ళే, ఐదేళ్ళకే మనం ఆనందపడిపోతున్నాం. ఐదేళ్ళలో మహా మహిమలన్నీ చేయవలసిన లీలా కాండ సాగిస్తూ వన విహారం చేశాడు. వన విహారం చేసే పరమాత్మ ఎలా ఉంటాడో అట చూడండి. స్వామితో సమన్వయం చేసుకోదగిన పద్యం ఇది. అసలు స్వామితో సమన్వయం కాకుండా భాగవతం ఎక్కడుంది? భాగవతమే సాయి భాగవతం. రామాయణే సాయి రామాయణం. కాదా? కాబట్టి ఉపనిషత్తులు గాని, ఆ, భగవద్గీత గాని, అలాగే బ్రహ్మ సూత్రాలు గాని, శంకర భాష్యాలు గాని, ఏవైనా సరే డెబ్బై రెండు సంవత్సరాల సత్య సాయి భగవానుడి యొక్క పూర్ణాద్వైత అచల బోధలో స్వామి బోధ ఏమిటి అంటే పూర్ణాద్వైతము అది అచలం కూడా. అచలము అంటే దేనికి కదలని, దేనికి బెదరని, దేనికి చెదరని, దేనికి లొంగని, కుంగని, పొంగని, వంగని సు-సుస్థిరమైనటువంటి మనస్సు ఎవరికి ఉన్నదో వారికి అది అచల బోధ. అటు ఇటు ఊగి స్వామికి బాగా లేదంటే ఎదుగులు పడిపోయి, బాగా ఉన్నారంటే పొంగిపోయి, స్వామి మనకు నేర్పింది ఇది కాదు. కుంగను వద్దు, పొంగను వద్దు. స్థిమితంగా ఉండాలి. సాక్షిభూతంగా రమణ మహర్షి అంటారు, "జీవితంలో అనేకం జరుగుతూ ఉంటాయయా, జరుగుతున్న వాటిని చూస్తూ ఉండండి." చూస్తూ ఉండటం నేర్చుకోండి. చేస్తూ ఉంటే ఎట్లా ఎప్పుడూ? ఏదోటి చేస్తూ చూస్తూ ఉండండి. చూస్తూ ఉన్నట్లయితే బొమ్మలన్నీ నెమ్మది నెమ్మదిగా మారుతుంటాయి. సన్నివేశాలు మారుతుంటాయి. సుఖాల పరంపర అనుభవంలోకి వస్తుంది. వెంటనే కాచుకొని కష్టాలు ఉంటాయి. కష్టాలు చూస్తూ ఉంటాం, సుఖాలు పంచుకుంటాయి. కాబట్టి రెండూ పడుగు పేకలుగా సాగేటువంటి ఒక సమాంతర జీవన విన్యాసం కాబట్టి విన్యాస భూమికలో పంచ భౌతిక దేహాన్ని తీసుకొచ్చిన పరమాత్మ కూడా ఎలా ఉన్నాడు వన విహారంలో కృష్ణుడంటే, అల్లరి చేశాడు కృష్ణుడు. [కాష్] నిజానికి చాలా చేయవలసినంత అల్లరి చేశాడు. [కాష్] ఎక్కడ చేశాడు? వ్రేపల్లెలో చేశాడు. కానీ ఎప్పుడైతే వ్రజ భూమిని దాటి, అంటే ముముక్షు భూమిని దాటి, కార్యక్షేత్రంలోకి తన శక్తి సామర్థ్యాలని ప-ప్రపంచానికి ప్రకటన చేయవలసి వచ్చిందో అప్పుడే తన స్నేహితుల్ని నిన్నంత ఆయన ఏమని సంబోధించాడు? "బాలకులారా" అన్నాడు. ఐదేళ్ల వాడు తన ఫ్రెండ్స్ ని బాలకులారా ఏమిటి? ఈనేదో వృద్ధుడైనట్టు. కదా? అది-- అంటే తాను వృద్ధుడే. పైకి ఐదేళ్ల వాడిగా కనిపించిన అనంత కాలాతీతమైనటువంటి మహాశక్తి స్వరూపమే శ్రీ కృష్ణ చైతన్యంగా మనం భావన చేయాలి. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార విధులందు, హరిరాజ శయ్యపై పవళించు సుఖభోగి, పల్లవ శయ్యల పవళించు, గురుయోగి మానస గుహల కుమ్మరు మేటి, కుమ్మరు నదీంద్ర గుహలలోన, కనులతోడ తెనంగి కడుగయ్యు, చతురుడు ఆవీర జనులతోడ తనగిడయ్యు, అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడు, అలసి తరుల నీడ ఆశ్రయించు, యాగ భాగ జయములు ఆహరించు మహాత్ముడు, అడవిలోని ఫలములు ఆహరించు. రెండు పారుశ్రాలు ఉన్నాయి. వేదాంత వీధులు కృష్ణుడు ఎక్కడ తిరుగుతాడే అంటే వేద వేదాంతములు నిగమ నిగమాంతాల చివర వీధుల్లో తిరిగేవాడు, అవసరం గనుక వచ్చినట్లయితే విహరించు కాంతార వీధులందు. అడవి-అడవి మార్గాలలో కూడా ఆయన విహరించగలడు. అలాగే ఆదిశేషువు మీద హాయిగా పవళించినటువంటి పరమాత్మ లేత ఆకుల మీద కూడా హాయిగా నేలమీద పవళించగలడు. భోగమే ఆయనకు యోగం, యోగమే ఆయనకు భోగం. భోగమూ యోగమూ రెండూ జీవుడికున్నాయి. పరమాత్మకి భోగంలో యోగం, యోగంలో భోగం. కనుకనే ఆయన అలా ఉండగలడు. అలాగే గురుయోగి మానస గుహల కుమ్మరు మేటి, కుమ్మరు నదీంద్ర గుహలలోన. యోగుల హృదయాలనేటువంటి గుహలలో సంచారం చేసే పరమాత్మ అడవులలో ఉన్నటువంటి అరణ్యాలలో ఉన్న గుహలలోనూ ఉండగలడు. ఆ-ఆయనకు అది గుహే, ఇది గుహే. అట్లాగే అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడు. అఖిల లోకాలకి ఆధారభూతుడు ఎవరంటే పరమాత్మ. అలసి ఆయన కూడా అలసినట్లయితే ఎక్కడ పడుకుంటాడయ్యా? తరుల నీడను ఆశ్రయించు. చెట్ల నీడ కింద నీడలో హాయిగా పడుకొని ఉంటాడట. అలాగే యాగ భాగ జయములు ఆహరించు మహాత్ముడు. యాగాలు చేస్తారు అనేక లోకాలలో. యజ్ఞ భాగాన్ని ఎవరు తీసుకోవాలంటే పూర్ణ పురుషుడైన పరమాత్మ తీస్-- స్వీకరించాలి. ఆయన అది తీసుకునేవాడు కూడా, అదే పరమాత్మ అడవిలో ఉన్న ఒక పండు తిని కూడా ఆయన బతకగలడు, ఉండగలడు. పరమాత్మ ద్వంద్వ చైతన్యాలతో ఉంటాడు. ద్వంద్వ చైతన్యం అంటే ఒక చైతన్యానికి పేరు జడము అని పేరు. రెండవ చైతన్యం చైతన్యంగా ఉన్నా అది జడంగా ఉన్నట్టు లెక్క. ఎలా అంటే మనమంతా నిజానికి జడ స్వరూపులం. మన దేహం చైతన్యం వినహాయిస్తే దీంట్లో ఏం లేదు. ఒట్టి డొల్ల, ఇదొట్టి కట్టె.ఆ చైతన్యం కట్టెతో కూడి ఉన్న కారణంగా కట్టె కూడా చైతన్యం ఉన్నట్లుగా ఉన్నది. నీటి లోపల రా-- నీళ్లు, రాయి లోపల నీళ్లు ఉంటాయి. రాయి మంచి రాయి గనక పగలగొడితే దానిలో నీళ్లు ఉంటాయి, దానిలో కప్ప కూడా జీవిస్తుంది, ఎన్నేళ్లైనా ఉండగలుగుతుంది. ఇది ఆశ్చర్యం. ఏం ఆశ్చర్యం? పీచు, తెంకు అన్నీ ఉన్నటువంటి పెంకు ఉన్న కొబ్బరి కాయ లోపల చక్కని చల్లని సలిలం కొబ్బరినీళ్లు ఉన్నప్పుడు అది ఎంత ఆశ్చర్యం కాదో, ఇది కూడా అంతే ఆశ్చర్యం కాదు. కాబట్టి పరమాత్మ ద్వంద్వ చైతన్యాలతో ఉంటాడు. శ్రీకృష్ణుడు గోపబాలుడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన పరమాత్మే అని ప్రకటన చేస్తూ, కాళీయ మర్దనానికిహ నెమ్మదిగా తన అవతారాన్ని వేడెక్కించుతున్నాడు, వేగపరుస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకరోజు ఉన్నవాడు ఉన్నట్టుగా అన్నాడు, "మనం అటువైపు వెళ్దాం, సరస్సు దగ్గరికి వెళ్దాం" అన్నాడు. పిల్లలందరూ భయపడిపోయారు, "ఏమంటున్నావు నువ్వు? అక్కడ పెద్ద పాము ఉంది. పాము నోట్లో అంతా విషం ఉంది. అది కక్కిన విషమంతా నీళ్ల నిండా కరిగిపోయి గాలి-- నీటి మీద వచ్చే గాలి మనం పీల్చిన పోతాం, చచ్చిపోతాం. కృష్ణా! మనం వెళ్లొద్దు" అన్నారు. "ఆ మనం వెళ్ళవలసి వస్తే అటువంటి దానికి వెళ్ళాలి, వెళ్దాం" అన్నాడు ఈయన. "నువ్వు నీకు భయం లేదు గాని మాకు భయం ఉంది." "అంటే మొన్న నేను వెళ్లి గోవుల్ని వెనక్కి తేలేదా? మీ అందరినీ మాయం చేస్తే నేను తేలేదా? నన్ను నమ్మండి, నా వెంట రండి." పరమాత్మ ఎప్పుడు ఉంటే, "నన్ను నమ్మండి" అంటాడు. "నమ్ముదాం అని ఉంది గాని భయమేస్తుంది స్వామి" అంటాం. "నమ్మినట్టే ఉంది గాని మనస్సు భయం మాత్రం వేస్తోంది" అంటున్నాం. భయం వేయకూడదు. వీళ్ళకి భయం ఉంది ఇప్పుడు. ఆ-ఆ మడుగు దగ్గరకు వెళుతున్నారు. మడుగు దీంట్లో చూడండి! బాలకాండలో, లీలా కాండలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా బాలకృష్ణుడు ఒక్కొక్కడికి ఉదాహరణ ఇచ్చిన సన్నివేశాలివి. ఆయన ఎవరినీ శిక్షించలే, ఎవరినీ చంపలే. వాళ్ళ శాపాలన్నీ కూడా పోగొట్టి మళ్ళీ వాళ్ళకి దివ్య గాంధర్వ శరీరాలని కూడా ఇచ్చాడు. కాళీయ సంహారం కాదది, కాళీయ మర్దనం మాత్రమే. మర్దనానికి వేళ మనం వైద్య పరిభాషలో, మనకు అర్థమయ్యే భాషలో శ్రీకృష్ణుడు ఏం చేశాడయ్యా అంటే ఆక్యుప్రెషర్ అనే వైద్యాన్ని ఇచ్చాడు. ఎవరికి? కాళీయుడికి. ఎలా ఇచ్చాడో చూద్దాం. ఒక మడుగు కాళింది లోకలదు అది ఎప్పుడూ కాళీయాహి విషవన్హి శిఖలచే ఏచుచుండు మీద పరటించినంతన పక్షులైన పడి మగ్గునందు. ఆకాశంలో గనక సరస్సు మీందిగా ఏదన్నా పక్షి వెళుతూ ఉన్నట్లయితే విష జ్వాలల వలన పక్షి అక్కడే మగ్గి నీళ్ళలో పడి నశించిపోయేది. అంత భయంకరమైన విష వాయువులున్నాయి. తద్భంగ శీకర యుక్త పవనంబు సోకిన ప్రాణులు ఎదియైన అప్పుడ చచ్చు. అప్పుడే మరణిస్తాయి. చల్లగాలి వీచినట్టు వీస్తుంది, గాలి శరీరానికి సోకిందో లేదో అప్పటికప్పుడే అవి మరణిస్తాయి. అటియా మడుగులో ఉదకంబు నుంగుచు ఉడుకుచుండు. అక్కడ వేడి వలన, విషాగ్నుల వలన నీరు ఎప్పుడూ కూడా బాయిలు అవుతున్నట్టుగా, ఉడుకుతున్నట్టుగా ఉంటుంది. అంటే వేడిగా ఉంటాయి, విషంతో కూడి ఉన్నాయి. మనుషుల్ని, పక్షుల్ని ఆకాశంలో వెళ్ళేటువంటి పక్షి జాలాన్ని కూడా చంపేంత భయంకరమైన పరిస్థితి. అంతే కాదు, అవతరించిన బలువీరుడాగ్రహించి భుజవిషవన్హి దోషంబు ఒలియజేసి సుజలగా ఉంచి నది చూచు నన్ను చూ. సరే మీరివన్నీ చెప్పారు కదా దానికున్న లక్షణాలు, అయితే నా అవతార కార్యక్రమంలో మాట ఉంది చెప్తా, "అదే మడుగులో నుంచి మీ-మీరందరూ హాయిగా మంచి నీళ్లు తాగేట్టుగా మారుస్తా" అన్నాడు. ఏమిటి? అసంభవం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, "మీకేం నీళ్లు లేవు కదా మీ ఊళ్లో, సరస్సులో ఉన్న నీళ్లన్నీ మంచి నీళ్లు చేస్తాను, రేపటి నుంచి మనం అక్కడి నుంచే మంచి నీళ్లు తెచ్చుకుంటాం" అన్నారు. అసలు నమ్మకం పోయింది వీళ్ళకి. ముందు భయం వేసింది, నమ్మకం కూడా పోయింది. పోగొడతాడు ఆయన. భయం ఇస్తాడు, నమ్మకం ఇచ్చి మళ్ళీ దాన్ని ఒక-ఒక ఉడత ఊపు అంటాం. ఆయన-ఆయన ఊపినా మనం ఊగటానికి వీలు లేదు. అటువంటప్పుడు ఈయన ఏం చేశాడంటే, పక్కనే సరస్సు పక్కన కదంబ వృక్షం ఉంది. చిన్న పిల్లవాడు, ఆయనకెన్ని ఆటలు వచ్చు. ఒకవేళ ఆటలు రాకపోతే ఎగిరి కూర్చుంటాడు, ఏముంది పరమాత్మ కదా! కదంబ వృక్షం ఎక్కి నీళ్ల వైపు చూశాడు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క దృష్టి దాని మీద సోకిందో, దానిలో పరివర్తన ప్రారంభమైంది. పరివర్తన ప్రారంభం కావటానికి ఆయన కూడా కార్యక్షేత్రంలోకి వెళ్ళాలి. ఏదో సంకల్పించి మహిమ చేస్తే నీళ్లుగా మారిపోవు. తాను కష్టపడాలి, పడ్డట్టు నటించాలి, అదెంత కష్టమో తెలియజెప్పాలి. కర్మ యోగం లేని భక్తి యోగం, కర్మ భక్తి యోగాలు లేని జ్ఞాన యోగం లేదు. మూడు నిజానికి ఒకటే. ఏది దేనికంటే గొప్ప అనేది అవివేకమైన ప్రశ్న. జ్ఞాని కూడా కర్మలు పర్ఫెక్ట్ గా చేస్తాడు. జ్ఞాని కూడా పరమాత్మ యందు భక్తితో ఉన్నట్లే ఉంటాడు. కానీ భక్తి జరుగుతున్నటువంటి వేళ కర్మకాండలు జరిగేటువంటి వేళ తాను కర్మకి బద్ధుడు కాకుండా ఉంటాడు, అంతే. కటిచేలంబు విగించి, దూకుతున్నాడనో అంటే చెట్టు మీద నుంచి ఎలా దూకాలి? కటిచేలంబు విగించి పించంబు చక్కన్ కొప్పు బంధించి. మళ్ళీ సౌందర్యం పోకూడదు, పించం రాలిపోకూడదు. పడ్డవాడు కృష్ణుడవునో కాదో డౌట్ లేకుండా పించం ఉండాలి. పించం గట్టిగా దోపుకున్నట్టు లోపలికి.దోస్తట సంస్ పాలనమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీదనుండి ఉరికన్ గోపాల సింహంబు. గోవులను పాలించేటువంటి సింహం ఎప్పుడైనా విన్నామా, గోవులను సింహం తింటుందా పాలిస్తుందా? శ్రీ కృష్ణ పరమాత్మ గోపాల సింహం అది. అంటే గోపాలులలో సింహము వంటి వాడు అని అర్థం అది. దూకాడట, దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో భుభ భుభ ద్వానంబు అనూనంబుగన్. ఒక్కసారి పైనుంచి శ్రీ కృష్ణ పరమాత్మ, అందులో ఆయన పొట్టలో పధ్నాలుగు భువనాలు ఉన్నాయి. మామూలు వాడా, వీళ్ళేదో నలభై కేజీలు ముప్పై కేజీలు అంటారే, వీళ్ళ తూకాలు లెక్క లేదు. అది పధ్నాలుగు భువనాల లెక్క అది. మరి వీళ్ళ దగ్గర తూచే మిషిన్ లేదు. నిజానికి తూక వేయవలసి వస్తే, స్వామి ఎన్ని కిలోలు అంటే మొదటి నుంచి అరవై ఆయన చెప్తున్నారు. ఎనభై ఆరేళ్ళు వచ్చాయి కాస్త కొద్దిగా తగ్గుతుంది. యాభైకి వచ్చి ఉండొచ్చు. వీడు నలభై ఇంకా మన వార్త వీడు వినకపోతే ముప్పై. పోనీవండి ఎవడికి కావాలి లెక్క. మన దృష్టిలో పధ్నాలుగు భువనాలు స్వామి ఉదరంలో ఉన్నాయి. అలాగే శ్రీ కృష్ణ పరమాత్మ గోపాల సింహం అయినప్పటికీ దానిలో దూకగానే మడుగులో భుగభుగలు వచ్చాయట. బుడగలు తేలినాయ్. ఎందుకని, అసలు అక్కడి దాకా మనిషి వెళ్ళిందా అక్కడ, వెళ్ళి బతికి బట్టకట్టిన వాడు ఎక్కడ, ఎవడూ లేడు. చెట్టెక్కి మీరందరూ చూస్తుండనని వాళ్ళను ఒడ్డున నించోబెట్టి చెట్టెక్కి నీళ్ళల్లో గోపాల సింహం శ్రీ కృష్ణ పరమాత్మ దూకితే, అది అయినప్పుడు ఏమైందో తెలుసునా? భూరి మహా ప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాత వేగ వికటీ కృత దుర్విష భీషణోర్మి సంపూరిత వైవడిన్ కలగి పొంగి ధనుశ్శత పాత్ర భాగ విస్తారము వంగినమ్మడుగు భక్త నయక్కన బుద్బుదోగ్రమై. శ్రీ కృష్ణ పరమాత్మ దానిలోకి దూకగానే కొన్ని వేల వందల లక్షల బాణాలు దాంట్లో పడితే ఒక్కసారి ఉబికినట్టు అయిపోయిందట. చిన్న పిల్లవాడు, ఐదేళ్ళ పిల్లవాడు దూకితే ఇంత అవుతుందా? అంటే ఐదేళ్ళ పిల్లవాడు వాడు కాదు అని అర్థం అది. అసలు పరమాత్మ దూకాడు. కాఠీణాకృతి తోయ రాశి నడుమన్ భాసిల్లి, మున్ను ఆజ్యుడై కాఠిన్య క్రియ నీదు నేర్పు తనకున్ కల్మిన్. భుజకేంద్ర హృత్పీఠాగ్రంబున రోషవన్ హులకయన్ భీమంబుగా. నీదే ఉల్లోతోత్తుంగ తరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహులన్. ఎక్కడ పడ్డాడంటే, పడటం పడటమే మడుగులో ఉన్నటువంటి కాళీయుడి హృదయ స్థానం మీద పడ్డాడు పోయి, కృష్ణ పరమాత్మ. అది, అక్కడ హృదయ స్థానం మీదకి, జీవుడి యొక్క హృదయ స్థానం మీదకి పరమాత్మ రావాలి, పడాలి. పడ్డాడు అంటే వాడికి ముక్తి తథ్యం. మరి ఈయన ఎందుకు వెళ్ళాడు అంటే కాళీయుడికి ముక్తిని ఇవ్వాలి. కాళీయుడ్ని సన్మార్గంలో పెట్టాలి. తాను సృష్టించిన మడుగు ప్రపంచానికి వినాశకారి కాకూడదు, ఆశకారి కావాలి. దానివలన జీవుడు బతకాలి. చల్లని, మధురమైనటువంటి జలాలు దానిలో ఏర్పడాలి. పోవాలి అంటే కలుషహరణం జరగాలి. కలుషహరణం ముందేం చేశాడు కదంబ వృక్షం మీద నుంచి చూశాడు. అది చూపు, దర్శనం. దూకాడు, స్పర్శనం ఇచ్చాడు. వెళ్ళి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు ఆయన అంటే దాని గుండె మీద పడుకున్నాడు. పోయి దాని మీద పడ్డాడు. పడగానే ఒక్కసారి కాళీయుడు లేచి పడగలు వాడిని, నూటొక్క పడగలతో ఉన్నాడు కాళి, నూటొక్కటి. నూటొక్కటి ఏమిటో తర్వాత చివరికి తత్వార్థ విచారణలు చేద్దాం. ఎవరు ఎవడు వచ్చినా లోపల పడ్డాడే, అసలు నా మడుగులో నే తిరగవలసిందే తప్ప కొత్తది ఏదో వస్తువు వచ్చి పడింది అని భయభ్రాంతమైంది కాళీయుడి మనస్సు. బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్ఛలత్కర్ణీ కల్లోలంబై కలగంచరించే హితైగ్నేలో ఉంత చూడుండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్ని జ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేడు లోకులకు నా కోపంబు దీపింపగన్. ఓహో ఎవడో వచ్చాడా, సాహసం చేసి నా లోపలే పడ్డాడా, నా మీద పడ్డాడా. నా పడగలన్నీ కూడా భోగభోగేంద్రం అంటారు. ఆదిశేషుడికే భోగం అనే మాట వాడాలి. భోగము అంటే పడగ అని అర్థం. ఆదిశేషుడివి పదివేల పడగలవి, పదివేల భోగాలు. ఇక్కడ కాళీయుడికి కూడా భోగం అనే శబ్దం వాడాడు వేదవ్యాసులవారు మర్యాద చేత. కానీ ఇది నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీలో వీడు ఏమన్నాడంటే, నా లోపల ఉన్న ప్రతాపాగ్ని, విషాగ్ని మళ్ళీ ప్రపంచానికి తెలియజేసేట్టుగా నాలో దూకినటువంటి, నా లోపల ప్రవేశించినటువంటి, నా మడుగులో చేరినటువంటి వాడిని ఇప్పుడే ఒక్కసారి భస్మం చేస్తానన్నాడు. అని తలచి, తలచుకుంటే చెడ్డవాడు విజృంభిస్తాడు అంతే కదా. మంచివాడు తలచి నెమ్మదిగా ఆలోచిస్తాడు. చెడ్డ పని చేసినా, మంచి పని చేసినా, చేయవలసి వచ్చినా మంచివాడు ఆలోచించి చేస్తాడు, చెడ్డవాడు చేసి ఆలోచిస్తాడు. ఆలోచించి చేస్తే నష్టం లేదు, చేసి ఆలోచిస్తే ప్రయోజనం లేదు అది.
SSSMC · audio

Bhagawata Navaneetham - 64

Home

Bhagawata Navaneetham - 64

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 24:01

More in this series

Bhagawata Navaneetham

67 episodes · 30 hr 45 min

  1. 34 min 1

    Bhagawata Navaneetham - 01

  2. 32 min 2

    Bhagawata Navaneetham - 02

  3. 22 min 3

    Bhagawata Navaneetham - 03

  4. 35 min 4

    Bhagawata Navaneetham - 04

  5. 30 min 5

    Bhagawata Navaneetham - 05

  6. 29 min 6

    Bhagawata Navaneetham - 06

  7. 32 min 7

    Bhagawata Navaneetham - 07

  8. 30 min 8

    Bhagawata Navaneetham - 08

  9. 24 min 9

    Bhagawata Navaneetham - 09

  10. 25 min 10

    Bhagawata Navaneetham - 10

  11. 37 min 11

    Bhagawata Navaneetham - 11

  12. 30 min 12

    Bhagawata Navaneetham - 12

  13. 24 min 13

    Bhagawata Navaneetham - 13

  14. 32 min 14

    Bhagawata Navaneetham - 14

  15. 27 min 15

    Bhagawata Navaneetham - 15

  16. 30 min 16

    Bhagawata Navaneetham - 16

  17. 30 min 17

    Bhagawata Navaneetham - 17

  18. 28 min 18

    Bhagawata Navaneetham - 18

  19. 29 min 19

    Bhagawata Navaneetham - 19

  20. 31 min 20

    Bhagawata Navaneetham - 20

  21. 28 min 21

    Bhagawata Navaneetham - 21

  22. 30 min 22

    Bhagawata Navaneetham - 22

  23. 23 min 23

    Bhagawata Navaneetham - 23

  24. 29 min 24

    Bhagawata Navaneetham - 24

  25. 24 min 25

    Bhagawata Navaneetham - 25

  26. 29 min 26

    Bhagawata Navaneetham - 26

  27. 27 min 27

    Bhagawata Navaneetham - 27

  28. 26 min 28

    Bhagawata Navaneetham - 28

  29. 20 min 29

    Bhagawata Navaneetham - 29

  30. 29 min 30

    Bhagawata Navaneetham - 30

  31. 28 min 31

    Bhagawata Navaneetham - 31

  32. 25 min 32

    Bhagawata Navaneetham - 32

  33. 24 min 33

    Bhagawata Navaneetham - 33

  34. 29 min 34

    Bhagawata Navaneetham - 34

  35. 28 min 35

    Bhagawata Navaneetham - 35

  36. 27 min 36

    Bhagawata Navaneetham - 36

  37. 27 min 37

    Bhagawata Navaneetham - 37

  38. 27 min 38

    Bhagawata Navaneetham - 38

  39. 26 min 39

    Bhagawata Navaneetham - 39

  40. 27 min 40

    Bhagawata Navaneetham - 40

  41. 17 min 41

    Bhagawata Navaneetham - 41

  42. 23 min 42

    Bhagawata Navaneetham - 42

  43. 21 min 43

    Bhagawata Navaneetham - 43

  44. 25 min 44

    Bhagawata Navaneetham - 44

  45. 27 min 45

    Bhagawata Navaneetham - 45

  46. 20 min 46

    Bhagawata Navaneetham - 46

  47. 15 min 47

    Bhagawata Navaneetham - 47

  48. 18 min 48

    Bhagawata Navaneetham - 48

  49. 25 min 49

    Bhagawata Navaneetham - 49

  50. 26 min 50

    Bhagawata Navaneetham - 50

  51. 29 min 51

    Bhagawata Navaneetham - 51

  52. 25 min 52

    Bhagawata Navaneetham - 52

  53. 27 min 53

    Bhagawata Navaneetham - 53

  54. 27 min 54

    Bhagawata Navaneetham - 54

  55. 27 min 55

    Bhagawata Navaneetham - 55

  56. 33 min 56

    Bhagawata Navaneetham - 56

  57. 27 min 57

    Bhagawata Navaneetham - 57

  58. 33 min 58

    Bhagawata Navaneetham - 58

  59. 29 min 59

    Bhagawata Navaneetham - 59

  60. 39 min 60

    Bhagawata Navaneetham - 60

  61. 30 min 61

    Bhagawata Navaneetham - 61

  62. 24 min 62

    Bhagawata Navaneetham - 62

  63. 24 min 63

    Bhagawata Navaneetham - 63

  64. 24 min 64

    Bhagawata Navaneetham - 64

    Now playing
  65. 26 min 65

    Bhagawata Navaneetham - 65

  66. 25 min 66

    Bhagawata Navaneetham - 66

  67. 30 min 67

    Bhagawata Navaneetham - 67