No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం [ఘంట] మందస్మిత ఫలం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురీయాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేనహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ దేవతలందరు నన్ను సేవింతురు రాజ్యమదము చెందరు చెరువు బంగావలదు మానడం భంగము కావింపంగ వలయు శాంతి కలిగెడు కొరకై అని మనసులో అనుకొని ఆ గోపవాళ్ళు అంతా పాపం వీళ్ళు వాళ్ళ పై నుంచి పడేటువంటి నీళ్ళు కళ్ళల్లో కారేటువంటి కన్నీళ్లు ఏకమైపోయినాయి అదే కన్నీరు మున్నీరు ఏకం కావటం అంటే మున్నీరు కావటం అంటే అది మున్నీరు అంటే సముద్రం అలాగే కంట నీరు ఆ పైన పడుతున్న వర్షం ఏకధార అయిపోయింటే కలగకుడి వధుజవు-- వధూజనులు మీరేం కలత చెందకండి ఎందుకు కలత చెందుతున్నారు కంపము నొందకుడి వ్రజేశ్వరు మీరంతా పెద్దవాళ్ళు ఎందుకిలా విలపిస్తున్నారు కలగకుడి కుమారకులు తక్కిన వారలు రాల వానచే నలగకుడు పశువ్రజమును అక్కడక్కడ నిలువనీకుడి పశువులు పాపం అక్కడక్కడ ఉన్నాయి వాటినన్నిటినీ రమ్మనండి మీరు ఆ వానలో ఉండొద్దు దగ్గరకు రండి మెలకున మీకు ఈశ్వరుడు మేలొసగున్ కరుణార్ద్ర చిత్తుడై అభయమిచ్చాడు మీరందరూ నా దగ్గరకు వస్తే ఏమవుతుందో చూపిస్తాను ఆ పశువుల్ని రమ్మనండి మీరందరూ రండి వానలో తడవకండి ఉరుములు పడ్డా పిడు--పిడుగులు పడ్డా నేను కాచుకుంటాను అన్నాడు కిరీటధర యత్తినహరి కిరి అంటే వరాహం వరాహావతారం ఆయనకి ఈ ఎత్తటము దింపటము పంపటము తుంచటము పెంచటము ఘటనా ఘటనలో భాగాలు ఇవన్నీ కిరీటధర యత్తినహరి కరిసరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తించకన్ ఒక్క కేళన్ లీలన్ ఒక్కసారిగా కుడిచేతి యొక్క చిటికెన వేలు దాని అడుగున పెట్టినట్లుగా లేపాడట తామర పువ్వు లేపినట్టుగా లేపాడట దేనిని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇదిగో ఇప్పుడు ఇక్కడ వర్షం లేదు మీరందరూ కిందికి రండి అంటాడు రాళ్ళు పడిపోతే బయట పడిపోతాయి మీ మీద పడవు కదా మీరు కిందకు రండి అన్నాడు అని దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియబట్టి ఎగురజిమ్మెడు హరికిన్ కొండపి కలిచి ఎత్తుట కొండొక పనిగాక ఒక కొండా తలపన్ ఇదేమన్నా విచిత్రమా ఆయనకు కొండ ఎత్తితే ఆయన కొండ ఎత్తితే మనకు ఆశ్చర్యం గానీ అసలు రోజూ కొండ ఎత్తేవాడికి ఆయనకి ఆశ్చర్యం ఏముంది అంటున్నాడు నిజమే సర్వ సృష్టిని చేసిన పరమాత్మకి వస్తు సృష్టి ఆశ్చర్యం ఆయనకు కలిగించదు మనకది తెలియక అనుభవం లేక మహితత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోని కారణంగా మనకంతా అద్భుతము ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది బాలుండాడుచు ఆ తపత్రమని సంభావించి పోగుత్తి కెంకేలందల్చిన లీల ఎలా ఎత్తాడట అంటే ఇది గొడుగులా ఉండేట్టుగా పట్టుకున్నాడట ఆ గొడుగు కూడా ఎలా ఉన్నదంటే తామర పువ్వులాగా పట్టుకున్నట్టు ఆయనకు తామర పువ్వు పెట్టినంత తేలిగ్గా ఉందట గోవర్ధన పర్వతం లేనటవుతో కృష్ణుండు తాను అమ్మహా శైలమున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే ఆవీలాభ్రచ్ఛుత దుశీలాచకిత గోపీ గోప గోపపంతికిన్ గోపీ గోప గోపపంతికల అన్నింటికీ కూడా మహదానందం కలిగించేలాగా వాళ్ళ ఒంటిమీద ఒక్క నీటి చుక్క పడకుండా ఒట్టి రాయి రప్పగానే ఆయనకి తాకకుండా వీళ్ళందరినీ దాని కిందకి తీసుకొచ్చాడు ఇట్లు గోత్రంబు ఛత్రంబుగా పట్టి గోత్రము అంటే పర్వతము అని అర్థం కులగోత్రములు అంటే కుల పర్వతములు గోత్ర పర్వతములు అని రెండు ఉన్నాయి మానవ జన్మకి కులం లేని మానవుడు లేడు ప్రతి మానవుడికి ఒక కులం ఉంది అయితే కులము చేత మానవుడు కాడు గుణము చేత మానవుడు అవుతాడు కులము ఈజ్ ఈక్వల్ టు గుణము అన్నమాట రా తల్లి రమ్ము తండ్రీ ప్రేతలు గోపకులు రెండు వినుడి గర్తక్ష్మాతలమున ఉండుడు గోప్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్ మీకు మీకు మీరు ఎలా ఉండదలుచుకున్నారో అలా అందరూ కూడా దీని కిందకు రండి అంటూ బాలుండీ తడు కొండ దొడ్డది చాలా గొప్ప పద్యం పోతనామాత్యుడు ఎంత గొప్ప పద్యం అంటే మనకి అట్లా శ్రీకృష్ణ పరమాత్మ ఏడేళ్ళ పిల్లవాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తెస్త పాదారవిందుడై ఏదో రెండు కాళ్ళు బలంగా ఊని కాదు ఒక వామ పాదాన్ని మాత్రమే నేలమీద పెట్టి కుడి పాదాన్ని దాని మీద వేసుకుని ఎత్తెస్త పాదారవిందుడై త్రిభంగియై కేళ చిన్న పువ్వులు పెట్టినట్లుగా ఆ దృశ్యం దృశ్య సాక్షాత్కార భాజకంగా నయన మనోహరంగా జగన్మోహనంగా రాస్తాడు బాలుండీ తడు కొండ దొడ్డది మహా భారంబు సహింపగా చలడోనిదీని కింద నిలువన్ శంకింపగా బోలదు ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా కేలలాడదు బంధులారా నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ కొండ పెద్దది బాలుడు చిన్నవాడు ఏదో ఎత్తడమంటే ఎత్తాడు గానీ అన్నారు గానీ ఎత్తడం ఎంత కష్టం కొండ ఎత్తడమేంటి అసలు కొండ ఎంత పాతుకుపోతుంది పైకి ఎంత కనిపిస్తుందో భూమిలో అంత ఉంటుంది దాన్ని ఇలా ఎత్తి తేల్పోని ఎత్తాడు ఏదో మహిమ ఉన్నవాడు వీడు ఎంత సేపు పట్టుకోగలడు మన కృష్ణుడు ఇంత చిన్న చిటికెన వేలితో ఏమో మనం అందరం దాని కిందకు వెళితే ఆ కొండ మనందరి మీద పడి అందరం ఒక్కసారే పోతామేమో అని భయపడకండి అంటున్నాడు కృష్ణుడు మీకెందుకు నేనున్నా కదా ఎత్తిన వాడిని నేను దింపబోయేది కూడా నేనే కన్నీరు తెప్పించేది నేనే కన్నీరు తప్పించేది నేనే సత్యసాయి భగవానుడి వాక్కు ఇది రుద్ర వాక్యం ఇది రుద్ర స్మృతి రుద్ర అధ్యాయంలో రుద్ర ప్రశ్నలో ఉన్న మాట అని పలుకుచున్న హరి పలుకులు విని నెమ్మనంబుల నన్ని అది నమ్మకం కావాలి నమ్మకం ఉంటే ఏ పనినైనా చేస్తాం నమ్మకం లేదనుకోండి డెబ్బై రెండు సంవత్సరాలు స్వామి మనకు బోధ చేశారు నేను దేహం కాదు నేను దేహిని అని మళ్ళీ రెండువేల మూడులో పందొమ్మిది వందల తొంభై రెండులో రెండువేల ఎనిమిదిలో ఏడులో ఎప్పుడు అవసరం ఉంటే అవకాశం ఉంటే చెప్తూ వచ్చారు ఈ డెబ్బై రెండేళ్ళు స్వామి చెప్పింది కూడా మనకు అంత లోపలికి తాకలేదు గానీ మూడు రూపాయల పేపర్ వాడు రాస్తే వణికిపోతున్నాం అది ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదు నమ్మాలి faith depends practice practice accelerates faith faith అంటే practice ఒట్టి faith దండగ స్వామి దేవుడే it's only a statement నమ్మి ఆ statement ఇవ్వాలి అలా జీవించగలగాలి అటువంటి పరిస్థితి మనకు వచ్చినా స్వామి కాచుకుంటాడనే నమ్మకంతో ఉండాలి అది అది నేర్పుతున్నాడు ఇవాళ మనకి కొండాడు గుణన్ తమ తమ యిమ్ములన్ పుత్రమిత్ర కళత్రాది సమేతులై గోవులున్ దారున్ గోపజనులు జనార్ధన కరుణా విలోకనామృత వర్షంబున ఆకలి నిలువట్టున చొప్పునరుంగక కృష్ణకథా వినోదంబుల గుండిని ఏం చేశారయ్యా అంటే ఎప్పుడైతే గోవర్ధన పర్వతం కిందకు వెళ్లారో కొండ కనపట్టలేదుగా భయం పోయింది వాన మీద పడలేదుగా తడవటం ఆగిపోయింది ఇక కృష్ణుడి యొక్క కథలు పుతను ఎలా చంపాడు శకటాసురుడిని ఇలా చంపాడు ఆ ఫలానా ఆ రోజున ఇలా చేశాడు ఇవ్వాళ మనం స్వామి కథలు తవ్వి తవ్వి ఎలా ఆనందాన్ని పొందుతున్నామో స్వామి యందున్న విశ్వాసాన్ని మరింతగా ఎంత బలవంతు చేసుకుంటున్నామో అలాగే ఆ నందగోప బాలురందరూ కూడా కృష్ణ కథా ధ్యానంతో మహదానందంలో ఉన్నారట ఉంది హరిదోర్దండము కామగుబ్బ శిఖరంబు ఆలంబి ముక్తావళుల్ పరగంజారుడు తోయగుండువులు గోపా గోపాలాంగనా పాంగహాసరుచు రత్నచయంబుగాగ అప్పడు అప్పుడు చూశారా కృష్ణుడిని ఆయన అప్పటిదాకా తడిసినవాడే ఎత్తేదాకా తడిస్తే ఆయన మీద పడ్డటువంటి వర్షపు బిందువులన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీద జాలువారిన ముత్యాల వలె ఉన్నాయట అది ఆ దివ్య దర్శనం ఆయన మీద ఆయన్ని నీళ్లు మీద పడితే జారిపోవాలి అందులో బాగా గట్టిగా వెన్న తిన్నవాడు అసలు ఉండటానికి వీలే లేదు నున్నగా ఉండాలి శరీరం కదా జారిపోవాలి ఎందుకు జారిపోవటం లేదంటే శ్రీకృష్ణ స్పర్శని వీడలేక అలా అతుక్కుపోయినాయట అది ఆ వాన ముత్యాలు అట్లా అయిపోయినయి గోపాలాంగనా అపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగ అచలక్షత్రంబు శోభిల్లే తద్గిరి దుర్మధుర భంజియై జలధరా క్లిన్న ప్రకారంజియై ఆ సమయంలో గోవర్ధన పర్వతం అంతా కూడా వెల్లగొడుగై ముత్యాల గొడుగుగా మారిపోయిందట ఎవరికీ ఈ శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ పరమాత్మ ప్రజల కోసం తన భక్తుల కోసం ఒక గొడుగు పెట్టాడట మామూలు గొడుగు కాదది గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అప్పటికి అది కేవల పర్వతం మాత్రమే అచలం గిరి మల అనేకమైన పేర్లున్నాయి కొండకి దాన్ని పట్టుకొని రాజీవాక్షుని చే వొక రాజీవము భంగి శైనరాజము మెరిసన్ రాజేంద్ర మీద మధుకర రాజి క్రియన్ మేఘరాజి రాజిల్లే కడుం అక్కడ ఆ పైన ఉన్నటువంటి ఆ కొండ ఒక గొప్ప గొడుగుగా కనిపిస్తుంటే కురుద్దామని వచ్చినటువంటి మేఘాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మ దీని కుం-- దీని కింద ఉన్నాడు అని ఆయన ఎలా ఉంటాడో చూడాలన్న ఆలోచనతో కురవటం మానేసినయట అది మేఘాలకు కూడా ఆయన దర్శనం దొరకదు ఎందుకంటే మధ్యలో కొండ ఉంది మరి అవి ఎట్లా ఉన్నాయట అంటే తుమ్మెద గుంపులంతా కూడా అక్కడ పైన నుంచున్నట్టుగా ఉన్నాయట మేఘాలు నల్లగా ఎందుకనంటే తేనె సుధామృతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అందుకోవటానికి ఆ దివ్య పుష్పంలో నుంచి మకరంద బిందువుని ఆనంద స్వాందనం చేసుకోవటానికి అవి ఎదురు చూస్తుంటే వడిగొని బలరిపు పసుపున ఉడుగక జడి కురిసె నేడు అహోరాత్రములు అయ్యెడ గోపజనులు బతికిరి జడి తడియక కొండ గొడుగు చాటున అధిపా వర్షమైతే కురుస్తూనే ఉంది ఇట్లాగే అది continue అయింది కానీ హాయిగా శ్రీకృష్ణుడి సన్నిధానంలో మీకు ఎట్లా కావాలో అట్లా కూర్చోండి అన్నాడు మీరు ఎట్లా ఉండదలుచుకున్నారో ఈ కొండ కింద అలా ఉండాలన్నాడు నిజమైనటువంటి గురువు నువ్వు ఎలా ఉండాలని అనుకున్నావో అలా ఉండు అంటాడు.ఆ నిజమైన అంటే ఆ స్థాయికి వెళ్ళిన శిష్యుడికి మాములు వాడికి కాదు మనకి గనక స్వామి మీకు ఎట్లా కావాలో అట్లాగే ఉండండి అంటే ఇట్లా మాత్రం ఉండే వాళ్ళం కాదు కదా ఇట్లాగే ఉండాలని చెప్పారు గనుక ఇవి మాత్రమే ఉన్నాం కానీ ఉత్తమోత్తమ కారణ గురువు మాత్రం ఏం చెప్తాడంటే రమణ మహర్షి ఒకసారి భగవాన్ అరుణాచలంలో కూర్చుని ఉంటే ఆయనకి ఆర్థరైటిస్ ఉండేది కాళ్ళు చాపుకు కూర్చున్నారు ఒక foreign lady ఆయన్ని చూడటానికి దర్శనం చేసుకోవటానికి వచ్చింది ఆమెకి మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఇలా కూర్చునే అలవాటు లేదు గనుక ఆమె రెండు కాళ్ళు భగవాన్ వైపు చాపి కూర్చుంది ఆవిడ కూడా భగవానేమో అలాగా ఆయనకేమో ఆర్థరైటిస్ ఈమెకేమో తెలియదు ఇద్దరూ భగవంతుడు భక్తుడు కాళ్ళు చాపుకున్న వేళ అది సరే వాళ్ళిద్దరికీ ఏం సమస్య లేదు గాని పీచు ఎవరికంటే మధ్యలో వాడికి [నవ్వు] వాడొచ్చాన్నంటే ముడువు ముడువు అంటున్నాడు ముడువు అంటే రెండు అర్థాలు ముడుచుకో అని రెండోటి మూసుకో అని రెండోటి తమిళంలో ముడువు ముడువు వాయముడు అంటే నోరు మూసుకోవాలి ఆమెకేం అర్థం రెండు భాషలు రావు అర్థం కావట్లా ఏమిటి ఏం చేశాను నేను ఏం పొరపాటు చేశాను అంటే భగవాన్ ఎదురుగ్గా అలా కాళ్ళు చాపి ఆయన వైపు కూర్చోవచ్చునా తప్పు కదా మిగతా వాళ్ళంతా ఎలా కూర్చున్నారు నువ్వెలా కూర్చున్నావ్ అమ్మాయి మధ్యలో వచ్చిన వాడు గట్టిగా అప్పుడు ఆవిడక ఆవిడ మౌని ఆయనేం పెద్దగా interfere గారు ఇక మరీ విజృంభించాడు అప్పుడు నెమ్మదిగా భగవాన్ he started withdrawing ఆ బార చాపిన కాళ్ళు రెండు నెమ్మదిగా ముడుచుకునే ప్రయత్నం చేశారు ఆయనకి చాలా కష్టం ఆర్థరైటిస్ కారణంగా ఈమె ఎప్పుడైతే కోప్పడిందో కోప్పడ్డాడో నెమ్మదిగా ఆవిడ కూడా ఎలా ముడుచుకు మిగతా వాళ్ళందరినీ చూడమంది ముడుచుకొని కూర్చునే ప్రయత్నం ఈమె చేస్తున్నది సరే వాన వెలిసింది ఇదిగో ఇప్పుడు వాన వెలిసినట్టే గురువు మా స్థిమితంగా ఉన్నాడు ఆ foreign lady స్థిమితంగా ఉంది ఆ మధ్యలో వాణ్ని భగవాన్ ని పిలిచారు పిలిచి ఆమెకు కూడా నాకున్న సమస్య ఉందేమో కనుక్కోకపోయినావా అంటే లేదు భగవాన్ అట్లా అప్పా వాళ్ళు ఇప్పుడే బంధనాలయ్యా ప్రపంచంలో నువ్ ఇట్టా ఉండు అట్టా ఉండు ఇట్లాగే ఉండు ఇట్లా ఉండకపోతే ఏమైపోతావ్ అని చెప్పారే ఇక్కడ కూడా తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర గురువు దగ్గర దైవం దగ్గర తమకు తోచిన రీతిలో జీవుడు తాను ఉండకపోతే ఆనందాన్ని ఎప్పుడు పొందుతాడు వారిని అలా ఉండని కాళ్ళ నొప్పులున్నా లేకపోయినా ఎలా కూర్చున్న ఇబ్బంది ఏం లేదు అన్నారు అందుకని పరమాత్మ ఎప్పుడూ గొప్పవాడే గురువు ఎప్పుడూ గొప్పవాడే మధ్యలో వాళ్ళతోనే పేచీ అది సత్యం తెలుసుగా పుటపర్తి లో మనకు తెలియనిది ఏముంది కూర్చోనివ్వరు నుంచోనివ్వరు ఆయన వచ్చి వీళ్ళు అదలించి వీళ్ళు మనల్ని సర్ది పెట్టేలోగా ఆయన రావటం వెళ్ళటం కూడా అయిపోతుంది అట్ట ఎన్ని పోగొట్టుకున్నామో అలా విసిగి విసిగి ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి చూడండా జెంట్స్ వైపు ఎంత బాగుందో వాళ్ళు ఒకరికొకరు మాట వింటారు ఇక్కడ ఈమె మాత్రం ప్రాణం తీస్తోంది కూర్చోనివ్వట్లేదు కూర్చోగానే ముందు లే అంటుంది సీటు దొరక్క దొరక్క సీటు దొరికింది కూర్చో కూర్చోగానే లే అని ఎక్కడో కూర్చోబెడుతుంది అని అంటే స్వామి అంతా విన్నారు నెమ్మదిగా విని ఒక విషయం చెప్పనా అన్నారు ఏంటి స్వామి అన్నారు ఆమెంటే నాక్కూడా భయమే [నవ్వు] అది చమత్కారం మాక్కూడా భయమే అంటే అలా చెప్పింది అలా ఉండమని చెప్పింది నేనే అని అర్థం అది అలా అనకండి ఎవరినీ నా ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ అన్నీ జరుగుతాయి ఏం జరిగినా నా వల్లనే జరుగుతాయి అనేది సర్వాంతర్యామి ఇట్లు హరి ఏడు అహోరాత్రములు గిరి ధరించిన గిరి భేది విసిగి వేసరి కృష్ణ చరితంబులు విని వెరగుపడి విఫల మనోరథుడై మేఘంబుల మరలించుకొని వెళ్ళిపోయినాడు అప్పుడు నవో మండలమున విద్యుతోత్పాదన ఖజోత మండలంబు గుట విని గోవర్ధన ధరుండు గోపాలకులకు ఇట్లనియె మేఘాలన్నీ తరలించుకుంటూ వెళ్ళిపోయినాడు వాడు ఇంద్రుడు పోయినాడు వెనక్కి తీసుకెళ్లి పోయినాడు ఏడు రోజులు ఈయన ఏం కదిలేట లేడు కొండ ఎత్తాడంటేనే ఆశ్చర్యం ఏడు అడుగుల ఏడు రోజులు అట్లా నిలబెట్టి కుడివే-- కుడి చేతి బొటనవేలు చిటికెన వేలు మీద నిలబెట్టించాడు ఇది మన వల్ల కాదని వాడికి మహత్యం గలగల విసిగి వేశారి వెళ్ళిపోయినాడు ఎందుకని విసిగి వేశారంటే వాడు ఇంద్రుడు గనుక దీని తత్వార్థం చివరిలో మనం sum up చేద్దాం వాడలా వెళ్ళాడో లేడో కుడికెను వానయు గాలియు ఆగిపోయినయ్ గాలి లేదు వాన లేదు చెడినదు లెల్ల పొలిచే వరదలిగిరే కొండడుగున ఉండట వెడలుడు కొరుకులు కోడండ్రు సతులు గోవులు మీరున్ వాన వెలిసింది మీరంతా బయటకు రండి అన్నాడు గోపాల దేవుడు మీరంతా బయటకు రండి కొడుకులతో కోడళ్లతో మీ సపరిమిత్ర బంధుమిత్ర సపరివార సమేతంగా మీ మీ ఇళ్లకు మీరు వెళ్ళవచ్చును అని చెప్పాడు చెప్పగానే వీళ్లంతా వెళ్లిపోతారా నిజస్థానంబున గిరి అలా తీసి మళ్లీ దింపి కూర్చోబెట్టాడట ఎక్కడ నుంచి లేపాడో అక్కడ కూర్చోబెట్టి పల్లవులు ఎల్లన్ కృష్ణున్ కౌగలించుకొని ఏడేళ్ల బాలుడు ఎంత అద్భుతం చేశాడు అని ఆనంద పరవశులై ఒక్కొక్కరు కృష్ణుడిని కౌగిలించుకుంటూ సముచిత ప్రకారంబుల సంభావించి సంభాషించి దీవించిరి పెద్దవాళ్ళంతా శతాయుష్మాన్ భవ అన్నారు సమవయస్కులంతా కృష్ణా మళ్ళీ బలే చేశావే వాళ్ళకి అది ఆట కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తటం వాళ్ళ దృష్టిలో చిన్న ఆట బాగా గోపికలు సేవలు చేశారు దధ్యన్న కవలంబుల సంగుచు ఆశీర్వదించిరి నంద బలభద్ర రోహిణి యశోదలు ఆలింగనము చేసి భద్ర వాక్యము బలికిని భద్ర వాక్యమన్నా ఆశీర్వచనమన్నా ఒకటే వీళ్ళే కాదు సిద్ధ సాక్ష్య గంధర్వ వరులు విరులు కురియించిరి పయించి పూలవాన సురలు శంఖ దుందుభులు మ్రోగించిరి డుంబుర ప్రముఖులు గంధర్వులు పాడినప్పుడు ఆనందం ఆనందం కలిగితే పాడాలి పాడితే ఆనందం కలిగేలా పాడాలి రెండు పాడి తరించడం అంటే ఏం లేదు తరించి పాడటం నేర్చుకోవాలికొన్ని గొంతులు తరించిపోయి అవి పాడుతూ ఉంటాయి అది మహదానందాన్ని కలిగిస్తాయి. పాడుతూ పాడుతూ నెమ్మదిగా ఏదో రోజున తరిస్తారు అవి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇది సాధన పూర్ణమైన కంఠం అది సాధన పూర్ణానికి నోచుకునేటువంటి కంఠం. రెండు సాధనా మార్గంలో ఉన్నటువంటి పరమోత్కృష్ట స్థాయిలే. ఈ గోవర్ధన పర్వతంలో ఏడేండ్ల బాలుడు ఎక్కడ? మనకి ఎప్పుడూ ఆశ్చర్యమే కదా. ఏడేండ్ల బాలుడు ఎక్కడ? క్రీడంబు కరి తమ్మి యెత్తు కియా అంతరమున్ గూడ గిరి యెత్తు డెక్కడ వేడుక ఒక చేత నేడు వెరగవు కాదే. ఇవన్నీ అద్భుతాలు ఈ కొండను ఎత్తడమేమిటి? ఏడేళ్ల బాలుడు ఏమిటి? ఆ కొండ కింద ఏడు రోజులు మనం కూర్చుని ఉండటం ఏమిటి? అని ఓ నంద గోపవల్లభ నీ నందనుడు ఆచరించు నేర్పరితనము మానవులకు శక్యంబులే మానవ మాత్రుడనే కుమారుడు తండ్రీ! నువ్వు కృష్ణుడు కృష్ణుడు అని అనుకుంటున్నావు కానీ, నీ కొడుకు ఏమన్నా మానవ మాత్రుడా అట్లా వచ్చాడంటావా? ఎటువంటి అద్భుతమైనటువంటి మహా శక్తిని ప్రదర్శన చేశారు అంటూ గోప గోపిక వ్రజకాంతలంతా ఆ ఊళ్ళో ఉన్న పెద్దలంతా ఆయనకి ఆశీర్వచనం పలికారు. నీ కుమారుడు సాక్షాత్తు పరమాత్మే అన్నాడు. ఏమిటి ఈ గోవర్ధన పర్వతం? కొండకి పూజ ఏమన్నాడేమి పరమాత్మ? ఇంద్రుడు లేడా? ఇన్నేళ్లుగా వీళ్ళందరికీ తెలిసిన ఇంద్రుడు ఒక్క కృష్ణుడికి లేకుండా పోయినాడా? అంటే మన శరీరం ఒక అచలం మన శరీరం ఒక కొండ. ఆ కొండలో ఆకలి వేస్తోంది అని అన్నం తింటాం, రోగం వచ్చింది అని మందు వేస్తాం, నిద్ర వచ్చింది అని నిద్రపోతాం, కోరిక పుట్టింది అని వస్తువును కొనుక్కుంటాం. ఇది ఆనందం కలగాలి అనుకుంటూ అనుకుంటున్న ఆ ఇంద్రుడు ఎక్కడో లేడు మన యందు ఉన్నాడు అది. వాడిని ఒక్కడికి ఆకలి వేసిందా అన్నం పెట్టేసేయ్, ఒంట్లో బాలేదా మందు ఏసుకో, దుఃఖం వచ్చిందా సంతోషం పొందే ప్రయత్నం చెయ్. ఇదంతా మన లోపల ఉన్న ఇంద్రుడికి మనం చేసే పనులు. శ్రీకృష్ణ పరమాత్మ అవతార మూర్తి గనుక ఆ ఇంద్రుడు ఒక్కడినే గనుక మీరు జయించి వాడి గర్వభంగం చేయగలిగితే అంటే మనస్సు యొక్క మాట మనం వినే కంటే మన మాట మన మనసు వినగలిగిన స్థాయికి మనం వెళ్లగలిగినట్లయితే ఏమవుతుంది? కొండని ఎత్తటం గొప్ప విషయం కాదు. ఈ పర్వతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తాడు. గో అంటే జ్ఞానము అని అర్థం. గోవిందుడు అంటే జ్ఞానము చేత విందు ఇచ్చేవాడు అని. ఆయన దగ్గరికి వెళితే వృస్త్యాన్న భోజనం పెడతాడని గాని జ్ఞానం ఇస్తాడు. జ్ఞానము చేత విందు ఇస్తాడు. గోపాలుడు గో జ్ఞానాన్ని పాలించేవాడు జ్ఞానము చేత పాలించేవాడు. గోపికలు, పికము అంటే పక్షి. పక్షి అంటే మనలో ఉన్న హంస. ఆ హంస పాడేటువంటి రాగమే మనం పాడుకునే హంసానంది. ఆ హంసానంది ఆ పిట్ట పాట జ్ఞానంతో గనక కూడి ఉన్నట్లయితే అది గోపిక. గోపబాలురు వీళ్లంతారు గో శబ్దం అంతా జ్ఞాన శబ్దం. గోవింద, గోపాల, గోవర్ధన, వర్ధను గోవు జ్ఞానము వృద్ధి చెందే లాగా ఇంద్రియానికి లోబడిన ఓ నందకులమా! అన్నాడు కృష్ణుడు. మీరు నందకులం నుంచి ఆనంద కులంలోకి రావాలి. ఆనంద కులం మీకు ఎప్పుడు లభిస్తుంది అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము రససిద్ధమైనప్పుడు మాత్రమే మీకు ఆనందం కలుగుతుంది గనుక ఈ మీ కంటి ముందు ఉన్నటువంటి ఈ పర్వతాన్ని నేను ఎత్తాను. ఎత్తి ఏడు రోజులు ఎందుకు ఉంచాడు అని. ఆ ఏడు రోజులు సప్తజ్ఞాన భూమికలలో నిలకడ చెందించాడు పరమాత్మ. ఆ సప్తజ్ఞాన భూమికలు ఏవి అంటే మనకు తెలుసు. శుభేచ్ఛ, విచారణ, అసంసక్తి, పదార్థ భావని తదాది కాగలిగినటువంటి ఆ ఏడు సప్తజ్ఞాన భూమికలు. అలాగే సప్త చక్రములు మన యందు ఉన్నాయి మన వెన్నుపూసలో ఆరు కదిలేవి ఏడవది కదలనిది. కానీ నిజానికి ఎనిమిదవ సోమచక్రం కూడా ఉన్నది. ఆ సోమచక్రం అది యోగ పరమైన చక్రం దాని సంబంధం లేదు. కానీ ఏడు చక్రాలు మన దేహంలో ఉన్నాయి, ఏడు భావాలు మనలో ఉన్నాయి, సప్తజ్ఞాన భూమికలు మనలో ఉన్నాయి. ఈ ఏడు సప్తజ్ఞాన భూమికలే ఇవాళ ఏడు కొండలుగా వెంకటాచలమైంది. కనుకనే తిరుపతి వెళ్ళటము అంటే సహస్రార దర్శనంలో మనల్ని మనం దర్శించుకునేటువంటి దివ్య భావనా గరిమా అది. మూలాధారం కింద నుంచి ప్రారంభం కావాలి. ప్రారంభమే యాతన కానీ వెళుతున్న కొద్ది ఆనందం కలుగుతుంది. కింద ఎంత వేడో పైకి ఎడుతున్న కొద్ది అంత చల్లదనం. ఏ మానవ జీవితంలో, మానవ దేహంలో, మానవ భావనలో, మానవ సాధనలో, అన్వేషణలో జీవుడు సాధించుకోగలిగినటువంటిది గోవర్ధనం చేయాలి. పరమేశ్వరుడు జ్ఞానం ఇవ్వకుండా ఏ జీవున్ని ఇక్కడికి పంపలేదు. అనేక రూపాలుగా పంపి ఉండవచ్చు, అనేక దేహాలుగా పంపి ఉండవచ్చు, అనేక వృత్తులుగా పంపి ఉండవచ్చునేమో కానీ ప్రతి వాడికి జ్ఞానాన్ని ఇస్తూనే ఇచ్చే పంపాడు. మరి ఎవరు వృద్ధి చేసుకోవాలి? సప్త జ్ఞాన భూమికలు. ఈ సప్త చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఒక యోగ భూమికలో ఆత్మవిద్యా విలాసం చేత దానిని అనుభవ రససిద్ధం చేసుకుంటూ జీవుడు ఆనంద తారక స్థితికి వెళ్ళాలి అని చెప్పాడు. ఆ ఆనంద తారక స్థితిని ఎవరు ఇవ్వగలరు అంటే ఆ ఆనంద తారక స్థితిని ఎవరు పొందారో వాడే ఇవ్వగలడు. ఆ ఇచ్చినటువంటి వాడు ఎవరంటే గోప కిశోరమైనటువంటి గోపాల దేవుడు. గోపాల బాలుడు గోపాల దేవుడైనాడు. వాళ్ళ వాకిట్లో ఉన్న పర్వతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంస్పర్శ చేత అది గోవర్ధన పర్వతం అయింది. అంతకు ముందు దానికి ఏ పేరు లేదు అది ఒట్టి రాళ్ళ గుట్ట.పరమేశ్వరుడు స్పృశించగానే తాకగానే అది మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. మనం గనుక అధ్యాత్మ విద్య మనకి ఒక గొడుగు అయినట్లయితే లోక విద్యలన్నీ కైవసం అయిపోతాయి. Chemistry చదవటం Physics చదవటం Mathematics నేర్చుకోవటం తెలుగు English భాషలు నేర్చుకోవటం ఇది విద్య కాదు. ఇది మాత్రమే విద్య కాదు. అసలు విద్య ఏది అంటే చావు లేని చదువు చదవాలి. చావు లేని చదువు ఏది అంటే దేనికి చావు లేదో దాని గురించినటువంటి విచారణ. దేనికి చావు లేదు ఆత్మకొక్కటే. నీట నానదు, నిప్పున కాలదు, నింగిన కుంగదు, ఏమీ కాదు. కాలాజ్జవచ్ఛిన్నమైనటువంటిది ఆత్మ నిత్యంబు కాలాజ్జవచ్ఛిన్నంబు అపరిణామంబు అది అప్రమేయంబు అది అచ్చ తెలివి అంటారు. విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో. అవతారికలోనే ఆయన ఆత్మవిద్యా పరంగా కల్పవృక్షాన్ని వేశారు. వేదవ్యాసులవారు కూడా గోవర్ధన పర్వతాన్ని పరిపూర్ణమైనటువంటి స్థాయిలో మనకు పరిచయం చేస్తూ పరమాత్మ యందు గనుక బాలుడు వృద్ధుడు అనేటువంటిది వదిలిపెట్టి. కొందరు వస్తారు. వచ్చి స్వామి పెద్దవారైనారు అంటాం. ఆరోజు రాత్రే ఆయనకి చిన్న పిల్లవాడిగా దర్శనం ఇస్తారు. స్వామి చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నారు అసలు యవ్వనం పోలేదు హాయిగా ఉన్నారంటే కడుపు మూడు వందల ఏళ్ళ వృద్ధుడిగా దర్శనం ఇస్తారు. అంటే మనం ఏది భావన చేస్తామో అది పరమాత్మ కాదు. మన భావనకు అందేది పరమాత్మ యొక్క స్వరూపం కాదు. మన భావనకు అందేది మనం చిందించుకోగలిగినది పరమాత్మ యొక్క తత్వమే గాని పరమాత్మ రూపాన్ని మనం ఉపాసన చేయలేం. చేయగలిగినా కొంత వరకు చేయగలం ఆ తర్వాత మన పరిధి దాటిపోతుంది. అందుకనే శ్రీ కృష్ణ పరమాత్మ గోపాల బాలుడు అయినాడు. గోవర్ధన గిరిని ఎత్తాడు. ఆ షడ్చక్ర ప్రయాణం చేయమన్నాడు. మీరు చేసినా దాకా రాగలిగితే రండి దీని కిందకు రండి. 1960 లో స్వామి చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. మీరు పుటపర్తికి రండి. మీ మూటలు, మీ బరువులు, మీ ఆతనలు, మీ కష్టాలు, మీ నిష్టూరాలు, మీకున్న అనేకానేకమైన ఇబ్బందులన్నీ ఆ మూటలన్నీ ఇక్కడ పడేయండి. కొంత ప్రేమను ఇక్కడి నుంచి మీరు తీసుకుని జగత్తులోకి వెళ్ళండి. అష్ట ఐశ్వర్యాలు మీకు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇచ్చారు. ఇవ్వకుండా ఉన్నారా? ఇవాళ మనం అనుభవించే ప్రతి మెతుకు కూడా సర్వేశ్వరుడు అయిన స్వామి ఇచ్చిన అనుగ్రహమే. మనం సంపాదించింది ఏం లేదు. అది అన్నమైనా సరే, జ్ఞానాన్నమైనా సరే. ఏదైనా పరమాత్మ అనుగ్రహించారు. వండి వడ్డించి ప్రేమతో మనందరినీ కూడా సమభాగం చేశారు స్వామి. చేసి నా ప్రేమ అనేటువంటి గోవర్ధన పర్వతం కిందకు రండి. అద్వైత బోధ, అచల బోధ ఏది మీకు బోధించానో వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, సర్వ వాఙ్మయాలు అన్నింటినీ కలబోసి ఒక ప్రేమ భావనతో ఈ దివ్యమైనటువంటి భావనను మీకు అందించానో వాటన్నింటినీ మీ దగ్గర పెట్టుకొని నా దగ్గరకు రండి. మీరు చేయవలసింది ఒక్కటే. నా దగ్గరకు రండి. నాతో ఉండండి. మీ-మీ ప్రదేశాలకు మీరు వెళ్ళినా నన్ను మీ వెంట పెట్టుకొని వెళ్ళండి. మీతో నేనుంటాను. వెంట పెట్టుకొని వచ్చిన ప్రతి వాడి పక్కన స్వామి ఉన్నారు. మనకి స్వామి రాారులే, మనకి దక్కరులే, మనం దూరమైనాంలే అన్న వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఆ సాధనా క్రమంలో పరమేశ్వరుడికి అతి సన్నిహితమైనారు. జీవితాన్ని పండించుకున్నారు. ఆనందాన్ని అనుభవించారు. కనుక గోవర్ధనము అంటే జ్ఞానము వృద్ధి పొందిన వేళ. జ్ఞానం వృద్ధి పొందితే ఏమవుతుంది? ఏది నశిస్తుంది? ఇది వృద్ధి పొందుతుంది. అజ్ఞానము కూడా వృద్ధి పొందుతుంది. అంటే జ్ఞానము పెరుగుతుంది, అజ్ఞానము తరుగుతుంది, నశించిపోతుంది. ఆ వృద్ధ శబ్దాన్ని వృద్ధి చెందటం అనే శబ్దాన్ని రెండు పాయలుగా మనం విచారణ చేయాలి. అది ఎవరు ఇవ్వగలరు అంటే అవతారమూర్తి అయినటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ ఇచ్చాడు. దశమ స్కంధంలో చాలా పరమాద్భుతమైన సన్నివేశం ఇది. కాబట్టి సాధకుడు అయిన వాడు చేయవలసిన ఒకే ఒక్క పని పరమేశ్వర సన్నిధానంలోకి వెళ్ళాలి. ఇందాకే చెప్పాడు, నమ్మి రండి. స్వామి అన్న మాట ఏమిటి? అందరూ చెడి నమ్మిన వారే కానీ, నమ్మి చెండా వాడు ఒక్కడు లేడే. స్వామిని నమ్మి చెడిపోయిన వాడు ఒక్కడు లేడు ఈ ప్రపంచంలో. అందరూ చెడి ఆయన్ని నమ్మారు. నమ్మిన తర్వాత మళ్ళీ చెడలేదు. అది చరని పదార్థం అంటాడు అన్నమాచార్య వారు. ఆ చరని పదార్థం ఏందంటే ఆత్మ గనుక ఆ ఆత్మ స్వరూపులుగా, దివ్యాత్మ స్వరూపులుగా సర్వ ప్రపంచాన్ని సుమారు డెబ్బై రెండు సంవత్సరాల దివ్య మహోపదేశంతో జాతిని, సర్వ జాతిని, సృష్టిని జాగృతం చేసి పరమాత్మ యందు మనీషాయుక్తమైనటువంటి, జ్ఞానాధిక్యమైనటువంటి చిత్తాన్ని అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య లీలా వైభవం ఇది. ఇవాళ గోవర్ధనగిరి పర్వతాన్ని మనం ఆ ఎత్తటం చూసినప్పుడు స్వామి ఇంతకంటే చాలా గొప్ప పనులు చేశాడే అనిపిస్తుంది మనకి. ఎందుకనంటే ఒక కొండను ఎత్తటం గోప బాలుడికి కష్టమేమో కానీ, నూట ఎనభై ఎనిమిది కొండలని, ఆ కొండలలో ఉన్న కోటానుకోట్ల గుండెలని ఎత్తటం ఒక్క సాయికి మాత్రమే సాధ్యమైంది. మన గుండెలన్నీ కొండలు, పషాణాలు. అటువంటి వాటన్నిటినీ అన్నింటినీ కూడా ప్రేమమయం చేసి, ప్రేమ అంటే ఏమిటో మనకు పరిచయం చేసి, ప్రేమ అంటే తుచ్ఛమైన విషయం కాదని, పరమాత్మ యందు భక్తి రసాయనంలో మన జీవితాలు ధన్యం కావాలని తాగగలిగితే ఆ భక్తి అనేటువంటి అమృత బిందువుని ఆస్వాదన చేయమని డెబ్బై రెండేళ్ళు తన జీవితాన్ని, తన అవతారాన్ని అందరి ముందు పరచి తరచి ఉంచినటువంటి సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ సర్వ జగత్తుకి ఒక ఆనంద బిందువుని అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ హంసానందతో స్వామికి సమర్పణం చేద్దాం. సాయిరాం.
SSSMC · audio
Bhagawata Navaneetham - 67
Bhagawata Navaneetham - 67
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 30:02
More in this series